భూమా వ్యాఖ్యలకు నిరసనగా రాస్తారోకో | dalits dharna due to bhuma nagi reddy comments | Sakshi
Sakshi News home page

భూమా వ్యాఖ్యలకు నిరసనగా రాస్తారోకో

Published Fri, Apr 15 2016 12:15 PM | Last Updated on Sun, Sep 3 2017 10:00 PM

dalits dharna due to bhuma nagi reddy comments

పాములపాడు: కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా కులవివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో పాములపాడులో కర్నూలు-గుంటూరు రహదారిపై రాస్తారోకోకు దిగారు. నంద్యాలలో గురువారం కొంతమంది దళితులు తమకు అంబేద్కర్ భవన్‌ను కట్టించవలసిందిగా భూమానాగిరెడ్డిని కోరారు. ఆ సందర్భంలో ఆయన‘ మీకు తినడానికి తిండి లేదు కానీ అంబేద్కర్ భవన్ అంత అవసరమా’ అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ వ్యాఖ్యలకు నిరసనగా కులవివక్ష పోరాట సమితి నాయకులు శుక్రవారం ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement