rastaroko
-
డీఎస్సీ ఎప్పుడిస్తారు?
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ అభ్యర్థులతో ఆటలాడుతోంది. తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీతో 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు.. సీఎం కాగానే 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తామంటూ తొలి సంతకం చేశారు. ఇప్పటికి 8 నెలలు పూర్తయినా డీఎస్సీపై ఎలాంటి ప్రకటనా చేయకపోవడంపై ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం నిలువునా మోసంచేసిందంటూ మంగళవారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థులు రోడ్డెక్కారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేసి, మెగా డీఎస్సీ పేరుతో తమ జీవితాలతో ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సీఎం చంద్రబాబు 16,347 పోస్టులకు తొలి సంతకం చేసి, గత డిసెంబర్‌కే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. కానీ 8 నెలలు అవుతున్నా నోటిఫికేషన్ ఇవ్వకపోగా పలు సాకులతో వాయిదా వేస్తున్నారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నెల క్రితమే జిల్లాల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలను తెప్పించుకుంది. ఆ వివరాలను కూడా వెల్లడించలేదు. నోటిఫికేషన్‌పై నిరుద్యోగులను ఇన్ని నెలలుగా మభ్యపెట్టి, వాస్తవ పరిస్థితులను వెల్లడించకపోవడంతో అభ్యర్థులు రోడ్డెక్కుతున్నారు. నోటిఫికేషన్‌పై నోరు విప్పని ప్రభుత్వం ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేస్తోంది. టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తోంది. పాఠశాలల్లో 25 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడంలేదు. మేం అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే. 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తాం’.. అంటూ ఎన్నికల్లో నారా చంద్రబాబుతో పాటు కూటమి ముఖ్య నాయకులంతా తెగ ప్రచారం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మాట మార్చేశారు. ఉన్నవి 25 వేల ఖాళీలు కాదు.. 16,347 పోస్టులే అని ప్రకటించారు. అంతేగాకుండా, గత ప్రభుత్వం 6,100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను సరిగ్గా పరీక్షల ముందు రద్దు చేశారు. తర్వాత కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి కూడా మెగా డీఎస్సీలో అవకాశం కల్పిస్తామంటూ జూలై 2న నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో పరీక్షలంటూ ప్రచారం చేసింది. అనంతరం టెట్‌కు, డీఎస్సీకి 90 రోజుల గడువు ఉండాలంటూ టెట్ షెడ్యూల్‌ను తొలుత సెప్టెంబర్ కు, తర్వాత అక్టోబర్‌కు మార్చారు. టెట్ ఫలితాలు వచ్చి మూడు నెలలైనా డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రం ప్రకటించలేదు. దాదాపు 10 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులు ఆర్థికంగా నలిగిపోతూ డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నా, కనీసం విద్యాశాఖ మంత్రి కూడా ఫలనా రోజు డీఎస్సీ షెడ్యూల్ ఇస్తామని చెప్పే ప్రయత్నం చేయడంలేదు. ఏడాది కాలంగా శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు డీఎస్సీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అసలు చదవాలో లేదో కూడా తెలియని గందరగోళంలో ఉన్నారు. ప్రభుత్వం గతంలో ప్రకటించిన 16,347 పోస్టుల సంఖ్యపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా ఇన్ని పోస్టులు లేకపోవడం వల్లే నోటిఫికేషన్ ఇవ్వడంలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీఎం మొదటి సంతకం ఏమైంది? అధికారంలోకి వస్తే మొదట మెగా డీఎస్సీ ఇచ్చి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు కూటమి నేతలు యువతకు హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు 16 వేల పోస్టులతో డీఎస్సీ ఇస్తామంటూ తొలి సంతకం చేశారు. అయినా భర్తీ ప్రక్రియ చేపట్టకుండా కాలయాపన చేయడం అన్యాయం. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఇక ఓపిక పట్టే పరిస్థితి యువతకు లేదు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన 16 వేల ఉపాధ్యాయ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలి. లేకపోతే పోరాటాలతోనే ప్రభుత్వానికి సమాధానం చెబుతాం. – జి.రామన్న, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అభ్యర్ధుల జీవితాలతో చెలగాటం డీఎస్సీ కోసం ఇప్పటికి రెండుసార్లు కోచింగ్ తీసుకున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామంటే అందరం నమ్మాం. డిసెంబర్ అన్నారు.. జనవరి వెళ్లిపోతోంది. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో మాత్రం ఎవరూ చెప్పరు. డీఎస్సీ అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. – లలిత్, డీఎస్సీ అభ్యర్థి, తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా రెండేళ్ల నుంచి శిక్షణ తీసుకుంటున్నాం.. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. 16 వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. రకరకాల సాకులతో వాయిదా వేస్తున్నారు. రెండేళ్ళ నుంచి శిక్షణ తీసుకుంటున్నాం. – మండల శ్రీను, శ్రీకాకుళం, శ్రీకాకుళం జిల్లా -
రోడ్డెక్కిన పాడి రైతులు
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పాడి రైతులు మంగళవారం రోడ్డెక్కా రు. పాడి రైతులకు లీటరు పాలకు అదనంగా రూ.4 చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ రాస్తారోకో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌కు చేరుకుని సిరిసిల్ల–వేములవాడ ప్రధాన రహదారిపై బైఠాయించారు. 2019 జనవరి నుంచి 56 నెలలుగా పాడి రైతులకు లీటరుకు రూ.4 చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు రోడ్డుపై బైఠాయించడంతో 4 కి.మీ. మేర రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. సిరిసిల్ల టౌన్ సీఐ ఉపేందర్, ఎస్సై మల్లేశ్‌గౌడ్, ట్రాఫిక్ ఎస్సై రాజు ఎంత సముదాయించినా వినకుండా రాస్తారోకో చేశారు. పాడి రైతుల ఆందోళనకు బీజేపీ నాయకులు లగిశెట్టి శ్రీనివాస్, రెడ్డబోయిన గోపి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత సంఘీభావం తెలుపుతూ రోడ్డుపై బైఠాయించారు. కాగా, రాస్తారోకోతో కరీంనగర్‌కు పరీక్షలు రాసేందుకు వెళ్లే విద్యార్థులు, ఆస్పత్రికి వెళ్లే రోగులు ఇబ్బందులు పడ్డారు. పరీక్షలకు సమయం దాటిపోతోందని విద్యార్థులు వాపోయారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి స్కూల్ బస్‌లో పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు తరలించారు. 4 ఏళ్లుగా పాడి రైతులకు మోసం: జీవన్ రెడ్డి నాలుగేళ్లుగా తెలంగాణ పాడి రైతులను సీఎం కేసీఆర్ మోసగిస్తున్నారని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో ఫోన్ లో మాట్లాడారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని పాడిరైతులు సిరిసిల్లలో ఆందోళనకు దిగి ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వ్యవసాయ బిల్లులపై నిరసనలు
చండీగఢ్/న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై రైతన్నలు భగ్గుమన్నారు. తమకు నష్టదాయకమైన ఈ బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ప్రధానంగా పంజాబ్, హరియాణా రాష్ట్రాలు శుక్రవారం అన్నదాతల ఆందోళనలతో అట్టుడికిపోయాయి. దేశవ్యాప్త బంద్‌లో భాగంగా రైతులు ఎక్కడికక్కడ వీధుల్లోకి వచ్చారు. రహదారులను దిగ్బంధించారు. వ్యవసాయ బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకూ తాము పోరాటం ఆపే ప్రసక్తే లేదని నినదించారు. రైతుల నిరసనలతో పంజాబ్, హరియాణాలో జనం రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆర్టీసీ బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. గురువారం ప్రారంభమైన రైలు రోకో రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. రైతులు రైలు పట్టాలపై బైఠాయించారు. వ్యవసాయ బిల్లులపై రైతుల ఉద్యమానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. పంజాబ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ బంద్‌కు మద్దతునిచ్చాయి. ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్ రాష్ట్రంలో పలుచోట్ల రోడ్ల దిగ్బంధం చేపట్టింది. వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ బిల్లులతో రైతులను బానిసలుగా మారుస్తారా? అని నిలదీసింది. కనీస మద్దతు ధరను రైతుల నుంచి దూరం చేయడం ఏమిటని ప్రశ్నించింది. వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించింది. -
బీజేపీ ఆందోళన ఉద్రిక్తం
కరీంనగర్‌సిటీ: ధర్మాగ్రహ యాత్ర పేరుతో హైద్రాబాద్ నుంచి యాదాద్రి వరకు నిర్వహించాలనుకున్న పరిపూర్ణానంద స్వామిని రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు గృహ నిర్భంధంతోపాటు నగర బహిష్కరణ విధించడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్ అన్నారు. స్వామిపై రాష్ట్ర ప్రభుత్వం నగర బహిష్కరణ నిర్ణయం తీసుకున్నందుకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని పోలీస్హెడ్క్వార్టర్స్ ఎదుట ప్రధాన రహదారిపై బుధవారం భారీ రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాటతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాదాపు గంటసేపు రాస్తారోకో నిర్వహించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించి బండి సంజయ్‌తో సహా కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ పరిపూర్ణనందను నగర బహిష్కరణతో రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న హిందూ వ్యతిరేక విధానం బహిర్గతమైందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హిందువుల ఆరాద్యదైవమైన శ్రీరాముని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన కత్తి మహేశ్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసి రిమాండ్ చేయకుండా కేవలం నగర బహిష్కరణ వేటుతో చేతులు దులుపుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇతర మతస్తుల పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా చట్టానికి లోబడి నిరసన వ్యక్తం చేస్తున్న పరిపూర్ణానందపై కూడా నగర బహిష్కరణ వేటు వేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. బీజేపీ నగర అధ్యక్షుడు బేతి మహేందర్‌రెడ్డి, జోనల్ ఇన్చార్జి తాళ్లపెల్లి శ్రీనివాస్‌గౌడ్, కొత్తపెల్లి రతన్‌కుమార్, కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షుడు దాసరి రమణారెడ్డి, బీజేపీ, బీజేవైఎం నాయకులు గాజె రమేశ్, ఎన్నం ప్రకాశ్, మామిడి రమేశ్, కందుకూరి ఆంజనేయులు, శశి, పొన్నం మొండయ్య, కాశెట్టి శేఖర్, బండ అనిత, జెల్లోజు చిట్టిబాబు, ఉప్పరపెల్లి శ్రీనివాస్, పర్వతం మల్లేశం, ముప్పిడి సునీల్, కందుకూరి వెంకట్, అక్షయ్, తిరుపతి, సాయి, మహేశ్, హరీశ్, ఓదెలు, రామురాయ్, అభిలాష్, ప్రణయ్, నిఖిల్, సుమన్, సుధాకర్, రంజిత్ తదితరు పాల్గొన్నారు. -
నీటి సమస్య పరిష్కరించాలని రాస్తారోకో
వర్ని(బాన్సువాడ) : రుద్రూర్ మండలంలోని అంగడిబజార్ ఎస్సీ కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు ఆదివారం రాస్తారోకో చేశారు. గతనెల రోజులుగా కుళాయిలు సరిగా రాక తీవ్ర అవస్థ పడుతున్నామని వారు వాపోయారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ వారు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సమస్య పరిష్కరించే వరకు కదలబోమని మొండికేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని వారిని సముదాయించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో సమస్యను సోమవారం అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పోలీసులు చెప్పడంతో స్థానికులు రాస్తారోకో విరమించారు. -
వీరికి సరదా.. వారికి ప్రాణసంకటం
దేవనహళ్లి: కొందరి సరదా మరికొందరికి ప్రాణసంకటమవుతోంది. అయినా సరదారాయుళ్లలో మార్పు రావడంలేదు. ఈ కోవలోనే ఓ యువకుడి వీలింగ్(బైక్ విన్యాసాల) పిచ్చికి బాలిక బలైంది. హైదరాబాద్-బెంగళూరు రహదారిలోని దేవనహళ్లి తాలూకా బుళ్ళహళ్లి గేట్ వద్ద ఈ విషాద ఘటన ఆదివారం ఉదయం జరిగింది. అంజలి అనే బాలిక తన తండ్రితో కలిసి మంచినీరు తెచ్చుకునేందుకు రోడ్డు దాటుతోంది. ఈ క్రమంలో ఓ యువకుడు ఖరీదైన బైక్‌తో వీలింగ్ చేస్తూ ఆమెను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అంజలి అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు యువకుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. వీలింగ్ చేస్తూ అతడి వెనుకే వచ్చిన మరికొందరు యువకులను సైతం పట్టుకుని కొట్టి వారి ఖరీదైన బైక్‌లను ధ్వంసం చేశారు. వీకెండ్స్‌లో బెంగళూరు నుంచి వచ్చే యువకులు నందికొండ వరకూ వీలింగ్ చేస్తూ స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నారు. వీలింగ్ను అరికట్టాలని ఎంతోకాలంగా పోలీసులకు విన్నవించుకున్నా వారు చర్యలు తీసుకోలేదని, ఈ ఘటనకు పోలీసులే కారణమని ఆరోపిస్తూ స్థానికులు గంటపైగా రాస్తారోకో చేపట్టారు. విజయపుర పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్తగూడెంలో టీడీపీ, కాంగ్రెస్ రాస్తారోకో
టేకులపల్లి: మిర్చి రైతులను ప్రభుత్వం వేధిస్తున్నందుకు నిరసనగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, మిర్చి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి వారిని హంతకులుగా చిత్రీకరించడాన్ని నిరసిస్తూ టీడీపీ, కాంగ్రెస్‌ల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బోడు రోడ్డు సెంటర్లో బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పాలనను నాయకులు ఎండగట్టారు. అలాగే రైతుల అరెస్టులను నిరసిస్తూ హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో చేశారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. -
బాలికపై అత్యాచారంకేసులో న్యాయం కోరుతూ రాస్తారోకో
సత్తెనపల్లి: మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను శిక్షించాలని కోరుతూ సత్తెనపల్లి పట్టణంలోని గుంటూరు–మాచర్ల ప్రధాన రహదారిపై ఆదివారం వడ్డెర సంఘ నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా వడ్డెర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రగిరి ఏడుకొండలు మాట్లాడుతూ క్రోసూరు మండలం ఉయ్యందన గ్రామానికి చెందిన మైనర్ బాలిక ఈనెల 15న మిరపకాయల కూలి పనులకు వెళ్లగా గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆమెను బలవంతంగా అమరావతి మండలం దిడుగు గ్రామానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు తప్పుదోవ పట్టించారు.. బాధితురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఏపూరి రామకృష్ణ, ఆది నరేంద్ర, పొత్తూరి వెంకటేశ్వర్లు, మలిశెట్టి రాములు తమ కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లి కాళ్లు, చేతులు కట్టి సామూహిక అత్యాచారం చేశారని తెలిపారు. సెల్‌ఫోన్‌ల్లో వీడియోలు తీసి ఇంటి వద్ద చెబితే వాట్సాప్ ద్వారా దేశం మొత్తానికి చూపుతామని బెదిరింపులకు గురి చేశారన్నారు. ఈనెల 16వ తేదీ రాత్రి ఏడు గంటల వరకు దిడుగులోని రేకుల షెడ్లోనే తమ కుమార్తెను బంధించారని, ఈ విషయాన్ని ఏవరికైనా చెబితే ఆమెతోపాటు కుటుంబ సభ్యులను కూడా చంపుతామని బెదిరించారన్నారు. చివరికి 88 తాళ్ళూరు గ్రామానికి చెందిన ఇరువురి ద్విచక్ర వాహనంపై తమ బిడ్డను పంపించారని, తమ బంధువు దేవండ్ల హనుమయ్య, వెంకట్రాజు ఎదురై బండి ఆపి తమ కుమార్తెను రక్షించి వారి ఇరువురిని క్రోసూరు పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారన్నారు. పోలీసులు తమ బిడ్డ భయంతో నీరసంగా ఉండటాన్ని గమనించి మరుసటి రోజు రమ్మని పంపారన్నారు. ఈ నెల 17న క్రోసూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం వివరించి చెప్పి నిందితులను చట్టపరంగా శిక్షించాలని కోరామన్నారు. ఆదేరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారని, అందులో తమ బిడ్డ చెప్పిన మాటలేమీ లేవని పోలీసులు సొంతంగా కట్టుకథ రాసి కేసులు నమోదు చేశారన్నారు. నిందితులపై నిర్భయ చట్టం ప్రయోగించాలని, ఇలాంటి సంఘటన మరొకటి జరగకుండా శిక్షించాలని వారు కోరారు. రాస్తారోకోతో నిలిచిన వాహనాలు.. బాధితులు ఆందోళన చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. సంఘటన స్థలానికి అర్బన్ సి.ఐ. ఎస్. సాంబశివరావు చేరుకుని ఆందోళన కారులను డీఎస్పీ కార్యాలయానికి రావాల్సిందిగా కోరారు. తాలుకా సెంటర్ నుంచి బాధిత బంధువులు, వడ్డెర సంఘ నాయకులు బయలుదేరి మహిళలపై అత్యాచారాలు జరగకుండా నియంత్రించాలంటూ పెద్ద ఎత్తున నినదిస్తూ డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. డీఎస్పీ ఎం. మధుసూధనరావు ఆందోళన కారులతో మాట్లాడి నిష్ఫక్షపాతంగా దర్యాప్తు జరుపుతామని, మైనర్ బాలిక అభిప్రాయం మేరకు కేసు నమోదు చేస్తామన్నారు. ఆందోళన కార్యక్రమంలో వడ్డెర సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి కుంచాల వెంకట్రావు, జిల్లా అధ్యక్షుడు తన్నీరు ఆంజినేయులు, సంఘ నాయకులు, ఉయ్యందన గ్రామ ప్రజలు పాల్గొన్నారు. -
మెదక్-నర్సాపూర్ రహదారిపై ట్రాఫిక్ జాం
కౌడిపల్లి: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం గేటు వద్ద రాస్తారోకో జరిగింది. సలబాత్తపూర్ పంచాయతీని కొత్తగా ఏర్పాటు చేస్తున్న చిలిప్చేడ్ మండలంలో కాకుండా కౌడిపల్లి మండలలోనే కొనసాగించాలని ఆ పంచాయతీ ప్రజలు డిమాండ్ చేశారు. సుమారు 30 నిమిషాల పాటు రాస్తారోకో జరగడంతో మెదక్-నర్సాపూర్ రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. -
వరంగల్-హైదరాబాద్ రహదారిపై భారీ ట్రాఫిక్‌జాం
యాదాద్రి: నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై మోటకొండూరు గ్రామస్థులు రాస్తోరోకో నిర్వహిస్తుండటంతో.. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. గురువారం ఉదయం అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధించడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిరసనకారులను తరలించేందుకు యత్నిస్తుండగా.. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. యాదగిరిగుట్ట మండలంలో గల చిన్న కందుకూరు, చొల్లేరు, మహబూబ్పేటలతో పాటు భువనగిరి మండలంలోని ముస్తాలపల్లి, చిమాలకొండూర్ గ్రామాలను నూతనంగా ఏర్పడుతున్న మోటకొండూర్ మండలంలో కలపాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. -
ఎంపీపీ దీక్ష భగ్నం
గద్వాల : గద్వాలను జిల్లా కేంద్రంగా చేయాలంటూ మూడు రోజులుగా స్థానిక కృష్ణవేణిచౌరస్తాలో కొనసాగిస్తున్న ఎంపీపీ సుభాన్ ఆమరణ నిరాహార దీక్షను ఎట్టకేలకు పోలీసులు భగ్నం చేశారు. సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు సుమారు 20మంది పోలీసులు శిబిరానికి చేరుకుని దీక్ష విరమించాలని ఎంపీపీని కోరారు. అందుకు ఆయన ససేమిరా అనడంతో దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు యత్నించారు. వారిని జేఏసీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, జేఏసీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరికొకరు తోసుకోగా, పోలీసులు బలవంతంగా ఎంపీపీని ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం ఎంపీపీని పోలీసు వాహనంలో ఎక్కించి బలవంతంగా ఏరియా ఆస్పత్రికి తరలించి సెలైన్ బాటిల్ ఎక్కించి చికిత్సలు అందించారు. వీరి చర్యను నిరసిస్తూ జేఏసీ, టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. దీక్షను భగ్నం చేసినంత మాత్రాన గద్వాల జిల్లా ఉద్యమం ఆగదని జేఏసీ నాయకులు అన్నారు. -
దారూర్ లో అఖిలపక్షం రాస్తారోకో
దారూర్: కొత్త జిల్లాల ఏర్పాటుపై రగులుతున్న చిచ్చు చల్లారటం లేదు. రంగారెడ్డి జిల్లా నుంచి వేరు చేయతలపెట్టిన 3 మండలాలను యథాస్థానంలో ఉంచాలని మంగళవారం అఖిలపక్షాలు ఆంతోళన చేపట్టాయి. వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక తాండూరు- హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. మొయినాబాద్, శంకర్ పల్లి, షాబాద్ మండలాలను రంగారెడ్డి జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రతిపాదిత శంషాబాద్ జిల్లాలో కలపవద్దని కోరారు. ప్రజల ఆందోళన కారణంగా రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. -
రిటైర్డ్ కార్మికుల రాస్తారోకో
50 శాతం పింఛన్ పెంచాలని డిమాండ్ బెల్లంపల్లి : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమకు 50 శాతం పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తూ శనివారం బెల్లంపల్లిలో సింగరేణి రిటైర్డ్ కార్మికులు రాస్తారోకో చేశారు. భారతీయ జనతా మజ్దూర్ మోర్చా, తెలంగాణ సింగరేణి రిటైర్డ్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాంటాచౌరస్తాలోని తెలంగాణ దీక్షా శిబిరం వద్ద నుంచి ఎస్‌బీహెచ్‌కు వెళ్లే మార్గంలో ఉన్న కల్వర్టు వద్ద వరకు ప్రదర్శన చేపట్టారు. అనంతరం బజార్‌ఏరియా ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసి రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. 18 ఏళ్ల నుంచి రిటైర్డ్ కార్మికులకు పింఛన్ పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి ఎగబాకుతుండగా పింఛన్ మాత్రం ఒక్క శాతం కూడా పెంచడం లేదన్నారు. చాలీచాలని పింఛన్‌తో కుటుంబాలను పోషించుకోవడం దుర్భరంగా మారిందన్నారు. అర్థాకలితో పస్తులుండాల్సిన పరిస్థితులు దాపురించాయన్నారు. ఆత్మహత్యలు, ఆకలి చావులకు గురవుతున్నా సింగరేణి యాజమాన్యం, జాతీయ కార్మిక సంఘాల పట్టించుకోవడం లేదని విమర్శించారు. పదో వేజ్‌బోర్డులో రిటైర్డ్ కార్మికులకు 50 శాతం పింఛన్ పెంచి, రూ.10 లక్షల గ్రాట్యూటీ సీలింగ్‌ను ఎత్తివేయాలని, బొగ్గు గనులలో ప్రైవేట్ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని, వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించి డిపెండెంట్లకు ఉద్యోగవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పింఛన్ పెంపుదలకు జాతీయ కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి రిటైర్డ్మెంట్ కార్మిక సంఘం బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు జి.వెంకటయ్య, భారతీయ జనతా మజ్దూర్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్.లింగయ్య, నాయకులు ఎల్.రాజమల్లు, డి.రాజలింగు, ఎస్.భూమయ్య, ఎన్.రాజకొమురయ్య, అంజయ్య, బి.కిష్టయ్య, ఎ.డానయ్య, జ్యోతిప్రకాశ్ పాల్గొన్నారు. -
‘పుష్కర’ నీటి కోసం రైతుల రాస్తారోకో
బూరుగుపూడి (మధురపూడి) : సాగునీటి కోసం అన్నదాతలు గొంతెత్తారు. శని వారం కోరుకొండ మండలం బూరుగుపూడి గేటు వద్ద రెండు గంటల సేపు రాస్తారోకో చేశారు. పుష్కర నీరు విడుదల చేయాలంటూ వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగింది. రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ వ్యాపార దృక్పథంతో ఉన్న ప్రభుత్వానికి రైతుల గోడు పట్టడం లేదని విమర్శించారు. ఆదివారం రాత్రిలోగా నీరు విడుదల చేయకపోతే, పుష్కర ఎత్తిపోతల పథకం అధికారుల కార్యాలయాలకు తాళాలు వేస్తామని హెచ్చరించా రు. పథకం ఈఈ పి.వాసుదేవరావు, ఇతర అధికారులతో జక్కంపూడి చర్చిం చారు. రైతులకు అనుకూలంగా అధికారులు నడచుకోవాలని హితవుపలికారు. నదుల అనుసంధానం పేరుతో గోదావరి నీటిని మళ్లించడాన్ని ఆమె తప్పుపట్టారు. ఆగస్టులో సాగునీరు విడుదల చేయాల్సి ఉండగా, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. నీటి విడుదలకు ఈఈ హామీ ఇచ్చారు. గుమ్ములూరు, బూరుగుపూడి, మధురపూడి, బుచ్చింపేటల్లోని కెనాల్‌ను ఈఈ పరిశీలించారు. పార్టీ మండల కన్వీనర్ ఉల్లి బుజ్జిబాబు, సీతానగరం కన్వీనర్ డాక్టర్ బాబు, రాజానగరం కన్వీనర్ మందారపు వీర్రాజు, డీసీసీబీ మాజీ ఉపాధ్యక్షుడు బొల్లిన సుధాకర్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సర్పంచ్ కర్రి సూర్యకుమారి, పార్టీ నాయకులు అడబాల సీతారామకృష్ణ, నక్కా రాంబాబు, తోరాట శ్రీను, అడపా శ్రీనివాస్ పాల్గొన్నారు. -
బీసీహాస్టల్ మూసివేత: విద్యార్థుల రాస్తారోకో
యాడికి: అనంతపురం జిల్లా యాడికిలో బీసీ హాస్టల్ మూసివేతను నిరసిస్తూ సీపీఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకోకు దిగారు. టీడీపీ ప్రభుత్వం ఇటీవల 100లోపు విద్యార్థులున్న బీసీ హాస్టళ్లను మూసివేయాలని జారీ చేసింది. యాడికి బీసీ హాస్టల్లో 71 మంది మాత్రమే ఉండటంతో అధికారులు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి నిరసనగా విద్యార్థులు రాస్తారోకోకు దిగడంతో కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. -
తాగునీటి కోసం రాస్తారోకో
చివ్వెంల: నల్గొండ జిల్లా చివ్వెంల గ్రామస్తులు తాగునీటి సమస్యను తీర్చాలని దాదాపు 200 మంది ఖాళీ బిందెలతో మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు. సూర్యాపేట - దంతుపల్లి రహదారిలో రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. గుక్కెడు నీళ్లులేక గ్రామస్తులు అల్లాడుతున్నారు. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. దాంతో గ్రామస్తులు మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. అధికారులు వచ్చి నీటి వసతి కల్పించేవరకూ ఆందోళన విరమించేది లేదని వారు పేర్కొన్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ రాస్తారోకో
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అధికార టీఆర్ఎస్ పార్టీ విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ బుధవారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. కరువుపై సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టింది. ఇందులో భాగంగా మండల కేంద్రాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు రాస్తారోకోలు, ధర్నాలు, సీఎం దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి, మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట, వరంగల్ జిల్లా హసన్‌పర్తి, నల్లగొండ జిల్లా గరిడేపల్లిలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాదాద్రిలో ప్రధాన రహదారిపై నాయకులు రాస్తారోకోకు దిగారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు తాండవిస్తుండగా అట్టహాసంగా టీఆర్ఎస్ పార్టీ సభలు జరుపుకోవటాన్ని తీవ్రంగా ఖండించారు. నిరసన కారణంగా రహదారిపై వచ్చే భక్తుల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పైన ఎండ వేడిమి, ఆగి పోయిన రాకపోకల కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ధర్నాలు, సీఎం దిష్టిబొమ్మల దహనాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
దండేపల్లిలో మహిళల రాస్తారోకో
దండేపల్లి(ఆదిలాబాద్): ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ మహిళలు ఆందోళనకు దిగారు. ఇందిరాక్రాంతి పథం(ఐకేపీ) గ్రూపు మహిళలు సుమారు 100 మంది శుక్రవారం ఉదయం ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలోని బస్టాండ్ వద్ద రాస్తారోకోకు పూనుకున్నారు. వెంటనే ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కారణంగా రోడ్డుకు రెండు వైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. -
భూమా వ్యాఖ్యలకు నిరసనగా రాస్తారోకో
పాములపాడు: కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా కులవివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో పాములపాడులో కర్నూలు-గుంటూరు రహదారిపై రాస్తారోకోకు దిగారు. నంద్యాలలో గురువారం కొంతమంది దళితులు తమకు అంబేద్కర్ భవన్‌ను కట్టించవలసిందిగా భూమానాగిరెడ్డిని కోరారు. ఆ సందర్భంలో ఆయన‘ మీకు తినడానికి తిండి లేదు కానీ అంబేద్కర్ భవన్ అంత అవసరమా’ అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ వ్యాఖ్యలకు నిరసనగా కులవివక్ష పోరాట సమితి నాయకులు శుక్రవారం ఆందోళనకు దిగారు. -
పూలే విగ్రహం ధ్వంసం: నిరసనలు
హాల్య: నల్లగొండ జిల్లాలో సూర్యాపేట పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అందుకు నిరసనగా హాల్య పట్టణంలోని ప్రధాన సెంటర్ వద్ద బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ సంఘాలు శనివారం రాస్తారోకో నిర్వహించారు. ఘటనకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
హాల్‌టికెట్ల కోసం డీఈడీ విద్యార్థుల రాస్తారోకో
-
హాల్‌టికెట్ల కోసం డీఈడీ విద్యార్థుల రాస్తారోకో
ఒంగోలు: పరీక్ష కొద్దిసేపట్లో రాయాల్సి ఉన్నా హాల్‌టికెట్లు ఇవ్వనందుకు నిరసనగా సోమవారం ఉదయం డీఈడీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఒంగోలు లోని పేర్నమిట్ట వెంకటసాయి డీఈడీ కాలేజీ, ఎన్.ఆగ్రహారంలోని లిటిల్ స్టార్ డీఈడీ కాలేజీలకు చెందిన సుమారు 40 మంది పరీక్ష కేంద్రమైన కర్నూలు రోడ్డులో ఉన్న జేవియర్ కళాశాల వద్ద రాస్తారోకో చేశారు. వెంటనే హాల్ టికెట్లు ఇవ్వాలని కోరారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించుకుంటున్నారు. గుంటూరు: గుంటూరు జిల్లాలో కూడా విద్యార్థులు ఆందోళనకు దిగారు. జిల్లాలోని వినుకొండలోని జీఎస్ఆర్ డీఈడీ కళాశాల వద్ద విద్యార్థులు ధర్నా చేప్టటారు. కొద్దిసేపట్లో పరీక్షలు రాయాల్సి ఉన్నా ఇప్పటికీ హాల్‌టికెట్లు ఇవ్వలేదని ప్రిన్సిపల్ చాంబర్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే హాల్‌టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
తాండూరులో కాంగ్రెస్ రాస్తారోకో
తాండూరు: రంగారెడ్డి జిల్లా తాండూరులో కాంగ్రెస్ నాయకులు సోమవారం రాస్తారోకోకు దిగారు. రైతుల ఆత్మహత్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా స్పందించటంలేదని ఆందోళనకు దిగారు. రైతులకు దశలవారీగా కాకుండా పూర్తిస్థాయిలో ఒకేసారి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎదుట బైఠాయించి సీఎం కేసీఆర్ కు, మంత్రి మహేందర్ రెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
విద్యుత్ కోసం రైతుల రాస్తారోకో
సారంగాపూర్: నెల్లూరు జిల్లా సారంగాపూర్ మండలంలోని జామ్ సబ్‌స్టేషన్ పరిధిలో గత వారం రోజులుగా గ్రామానికి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయకపోవడంపై ఆగ్రహించిన రైతులు మంగళవారం స్థానిక సబ్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత వారంరోజులుగా తమకు విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పొట్ట దశలో ఉన్న వరిపంట, పత్తి, పసుపు పంటలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇక్కడ విధులు నిర్వర్తించే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే విద్యుత్ సరఫరాలో వారంరోజలుగా అంతరాయం ఏర్పడిందని ఆరోపించారు. లైన్లో సమస్యలున్నా వాటిని గుర్తించక వారం రోజుల పాటు తాత్సారం చేశారని దాని ఫలితంగా పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే ట్రాన్స్‌కో ఏఈ దేవరావు సబ్‌స్టేషన్‌కు చేరుకుని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అంతకు ముందు రైతులు ట్రాన్స్‌కో ఏడీకి సమస్యను ఫోన్‌ద్వారా వివరించారు. అయితే ఆయన స్పందించి వెంటనే సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
విద్యార్థుల రాస్తారోకో..10 మంది అరెస్ట్
బొబ్బిలి: కళాశాలల్లో ఫీజులు తగ్గించాలంటూ విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మంగళవారం ఉదయం రాస్తారోకో చేయడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. అయితే, ఆందోళన నిర్వహణకు సంబంధించి ముందుగా అనుమతి తీసుకోలేదంటూ పోలీసులు పది మంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు. -
అచ్చంపేటలో రాస్తారోకో
అచ్చంపేట : గురుకుల కళాశాలలో చదువుతున్న విద్యార్థి మృతికి నిరసనగా.. విద్యార్థి సంఘాలు, అఖిలపక్ష నాయకులు ధర్నాకు దిగారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్‌జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట గురువారం జరిగింది. విద్యార్థి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని.. మృతుని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరుతూ.. రాస్తారోకో నిర్వహించారు. దీంతో రెండు గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లింగాల గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రాము(16) అనే విద్యార్థి బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై అతని తల్లిదండ్రులు తమ కొడుకుది ఆత్మహత్య కాదని ఆరోపిస్తున్నారు. -
నెల్లూరులో అగ్రిగోల్డ్ బాధితుల రాస్తారోకో
నెల్లూరు: అగ్రిగోల్డ్ బాధితులు సోమవారం భారీ ఎత్తున నిరసన తెలిపారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ బాధితులు నెల్లూరు జిల్లా బుజబుజనెల్లూరు వద్ద జాతీయరహదారిపై రాస్తారోకోకు దిగారు. దీంతో 5 కి.మీల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ రాస్తారోకోకు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీతో పాటు సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు మద్ధతు తెలిపాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి బాధితులతో కలిసి రాస్తారోకో చేశారు. ప్రభుత్వం వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
బస్సుల కోసం రాస్తారోకో
బచ్చన్నపేట : కాలేజీలకు వెళ్లేందుకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు రాస్తారోకో కు దిగారు. వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలంలోని వివిధ గ్రామాల నుంచి సుమారు 600 మంది విద్యార్థులు జనగామలోని కళాశాలలకు వెళుతుంటారు. కానీ వీరికి ఒకే ఒక్క ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంది. దాంతో వేరే వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం సుమారు 450 మంది విద్యార్థులు మండల కేంద్రంలోని చౌరస్తాలో రాస్తారోకో చేశారు. మరో రెండు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు జనగామ ఆర్టీసీ డిపో మేనేజర్‌తో మాట్లాడగా... చర్చించేందుకు రావాలని విద్యార్థులను ఆహ్వానించారు. .......................... -
నల్గొండలో టీడీపీ రాస్తారోకో
నల్గొండ జిల్లా: నల్లగొండ జిల్లాలోని చర్లపల్లి వద్ద సోమవారం ఉదయం టీడీపీ నాయకులు ఆందోళన చేశారు. రేవంత్ రెడ్డి అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. నల్గొండ టీడీపీ అసెంబ్లీ ఇంచార్జి కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలంటూ ధర్నాకు దిగారు. -
చెరకు బకాయిల కోసం రైతుల రాస్తారోకో
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో శుక్రవారం మధ్యాహ్నం చెరకు రైతులు రాస్తారోకోకు దిగారు. రైతుల ఆందోళనతో వట్టివాగు వంతెన జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. తమకు వెంటనే బకాయి బిల్లులు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీ రూ.30 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. కాగా, పోలీసు బలగాలతో అక్కడికి చేరుకున్న డీఎస్పీ రాజేంద్రప్రసాద్.. రైతు సంఘం నాయకుడు మామిడి నారాయణరెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారు. (కోరుట్ల రూరల్) -
జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో
కొత్తపేట: తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం ఆలమూరులోని హోల్‌సేల్ కూరగాయాల మార్కెట్లో రైతులు, ఆటో సంఘాల మధ్య బుధవారం ఉదయం వివాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి నుంచి మార్కెట్ వరకు కూరగాయల తరలింపునకు తమ ఆటోలనే వినియోగించుకోవాలని ఆటో సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో రైతులు ఆటో సంఘాలపై ఎదురు తిరిగారు. ఆటో డ్రైవర్ల వైఖరికి వ్యతిరేకిస్తూ రైతులు నిరసనకు దిగారు. 16వ నంబరు జాతీయ రహదారిపై కూరగాయలు పారబోసి రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు పరిస్థితిని సమీక్షించి రైతులను శాంతింపజేశారు. -
పత్తి మద్ధతు ధర కోసం రాస్తారోకో
ఆదిలాబాద్: పత్తికి మద్దతు ధరను పెంచాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. జిల్లాలోని చెన్నూరు మండలంలోని కిష్టంపేట వద్ద జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. పత్తి క్వింటాల్ కు రూ.4050 నుంచి రూ. 3950 లకు తగ్గించడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మద్దతు ధరను పెంచాలని రైతులు డిమాండ్ చేశారు. రాస్తారోకో వల్ల రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మండలంలోని చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి గ్రామాలకు చెందిన 100 మంది రైతులు ఈ రాస్తారోకోలో పాల్గొన్నారు. (చెన్నూరు)