రంగారెడ్డి జిల్లా తాండూరులో కాంగ్రెస్ నాయకులు సోమవారం రాస్తారోకోకు దిగారు.
తాండూరు: రంగారెడ్డి జిల్లా తాండూరులో కాంగ్రెస్ నాయకులు సోమవారం రాస్తారోకోకు దిగారు. రైతుల ఆత్మహత్యలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం సరిగ్గా స్పందించటంలేదని ఆందోళనకు దిగారు. రైతులకు దశలవారీగా కాకుండా పూర్తిస్థాయిలో ఒకేసారి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎదుట బైఠాయించి సీఎం కేసీఆర్ కు, మంత్రి మహేందర్ రెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.