runamafi
-
అప్పు చేసి రుణమాఫీ చేశాం: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
సాక్షి,జగిత్యాల జిల్లా: అప్పు చేసి మరీ రెండు లక్షల రుణమాఫీ చేశామని,రైతుభరోసా కూడా రెండు పంటలకు రూ.12వేలు ఇస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చెప్పారు. సోమవారం(జనవరి 6) జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రైతు భరోసా రెండు పంటలకు రూ. 12 వేలు ఇస్తాం. రైతు కూలీలకు ఏటా రూ.12000 ఆర్థిక భరోసా ఇస్తాం. ప్రతిపక్షాలు విమర్శించడం మానుకుని మంచి చేస్తే హర్షించాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తాం. ఏక మొత్తంగా రుణ మాఫీ చేయడం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమైంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనీసం రైతులకు రుణ మాఫీ చేయాలనే ఆలోచన కూడా లేదు. బీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేక చేతులెత్తేసింది. కేసీఆర్ రుణమాఫీ చేయలేక ఎన్నికల ప్రణాళికలో కూడా రుణమాఫీ అంశాన్ని చేర్చలేదు. సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే చేయలేదంటారు. చేస్తేనేమో విమర్శిస్తారు.పథకాలు అమలు చేయాలని కోరుకుంటున్నారా..వద్దనుకుంటున్నారా..?పంజాబ్ లో 33 నెలల్లో 50 వేల ఉద్యోగాలను గొప్పగా చెప్తున్నారు. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో 12 నెలల్లో 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం’అని జీవన్‌రెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: మీరెన్ని కేసులు పెట్టినా భయపడం -
సీఎం రేవంత్ బండారం బయటపడింది:కేటీఆర్
సాక్షి,హైదరాబాద్:20 లక్షల మందికి రుణమాఫీ కానే కాలేదన్న వ్యవసాయ మంత్రి ప్రకటనతో సీఎం బండారం మరోసారి బట్టబయలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.ఈ మేరకు కేటీఆర్ శుక్రవారం(అక్టోబర్4)ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు.‘వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని విర్రవీగిన ముఖ్యమంత్రివన్నీ డొల్లమాటలేనని ఇంకోసారి తేలిపోయింది.ఓవైపు డిసెంబర్ 9న ఏకకాలంలో చేస్తామని దగా చేశారు.మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి మోసం చేశారు.రూ.2 లక్షల రుణమాఫీ పూర్తయిపోయిందన్న సన్నాసి మాటలు నయవంచన కాక మరేంటి ?అధికారిక లెక్కల ప్రకారమే.. 20 లక్షల మంది అన్నదాతలకు అన్యాయం జరిగితే అనధికారికంగా రుణమాఫీ కాని రైతులందరో ?? రేవంత్ చేతకానితనం.. అన్నదాతలకు కోలుకోని శాపంగా మారింది’అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. ఇదీ చదవండి: టీజీపీఎస్సీ ఆఫీసు ముందు పోస్టర్ల కలకలం -
TG: ప్రభుత్వానికి హరీశ్‌రావు డెడ్‌లైన్
సాక్షి,సిద్ధిపేటజిల్లా:రుణమాఫీ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్‌రావు డెడ్‌లైన్ విధించారు.దసరాలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని అల్టిమేటం ఇచ్చారు. శుక్రవారం(సెప్టెంబర్27) సిద్దిపేట జిల్లా నంగునూరు వేదికగా రైతు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. దసరా లోపు రుణమాఫీ చేయకుంటే రైతులతో కలిసి హైదరాబాద్‌లోని సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఇదీచదవండి: నిజాం కన్నా దుర్గార్గుడు సీఎం రేవంత్: ఈటల -
తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
ముంబై: ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీపై మరోసారి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్స్, తుక్డే తుక్డే గ్యాంగ్ నడిపిస్తోందన్నారు. ఇప్పుడున్నది ఒకప్పటి కాంగ్రెస్ కాదని, ఆ పార్టీలో దేశభక్తి లేదన్నారు. మహారాష్ట్రలోని వార్దాలో శుక్రవారం(సెప్టెంబర్20) జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్ అంటేనే అబద్ధం, మోసం, నిజాయితీ లేకపోవడం అని దుయ్యబట్టారు. తెలంగాణలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతుల నుంచి తప్పించుకొని తిరుగుతోందని విమర్శించారు. కర్ణాటకలోనూ కాంగ్రెస్ రైతులను మోసగించిందన్నారు. నేటి కాంగ్రెస్ గణపతి పూజను కూడా అసహ్యించుకుంటోందని మండిపడ్డారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ దేశ ఐక్యతను పెంచడానికి గణపతి ఉత్సవాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇందులో అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలు కలిసి పాల్గొంటారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వినాయకుడి విగ్రహాన్ని పోలీసు జీపులో ఎక్కించి, అవమానించిన ఘటన అందరికీ తెలుసన్నారు. అందరం ఏకమై కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.ఇదీ చదవండి.. ఖర్గే మోదీ కంటే సీనియర్.. ఆయనను అవమానిస్తారా: ప్రియాంకగాంధీ -
రైతులందరికీ రుణమాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్య కారణంగా ఇంకా ఎంత మంది రైతు లు ఆత్మహత్యలు చేసు కోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మె ల్యే కేటీఆర్ ప్రశ్నించారు. రుణమాఫీ కాదన్న వేదనతో సురేందర్‌రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా బాధించిందని, వారి కుటుంబానికి శుక్రవారం ఒక ప్రకటనలో ప్రగాఢ సానుభూతి తెలిపారు.రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తమ తప్పును ఒప్పుకొని వెంటనే రైతులందరికీ రుణమాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులు ఇలాంటి బాధలు పడొద్దనే తెలంగాణ సాధించుకున్నామని, వచ్చిన తెలంగాణలోనూ రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం తీవ్రంగా బాధిస్తోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశార -
రుణమాఫీ కాని వారికి తప్పకుండా చేస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి,పెద్దపెల్లిజిల్లా: రైతులకు రూ.2లక్షల రుణమాఫీ మూడు దఫాలుగా చేశామని, సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారికి తప్పకుండా చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణంలో బుధవారం(ఆగస్టు21) జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ‘మహిళలకు వడ్డీ లేని రుణాలు మొదట ప్రవేశపెట్టింది కాంగ్రెస్. మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సంకల్పించి పనిచేస్తోంది. మహిళలను హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలి.మంథని, కాటారంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మంథని మున్సిపల్ కార్యాలయం నిర్మిస్తాం. మంథనిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించి, అభివృద్ది చేస్తాం’అని శ్రీధర్‌బాబు తెలిపారు. -
వరదలో చిక్కుకున్న ట్రాక్టర్
-
రుణమాఫీపై చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్
సాక్షి,హైదరాబాద్: ‘తెలంగాణలో ఏ ఊరికైనా వెళ్లి రుణమాఫీ జరిగిందా లేదా అనే చర్చ పెడదాం. సంపూర్ణ రుణమాఫీ అయిందని తేలితే నేను దేనికైనా సిద్ధం. నా సవాల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమేనా’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు సవాల్ విసిరారు. తెలంగాణభవన్‌లో శనివారం(ఆగస్టు17) జరిగిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ‘రూ.31 వేల కోట్లని చెప్పి రూ.17 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారు. 25 లక్షల మందికి రుణమాఫీ చేయకుండా ఎగనామం పెట్టారు. రూ.14 వేల కోట్లు కోత పెట్టారు. రైతులను నిట్టనిలువునా ముంచారు. పంచపాండవుల కథలా కాంగ్రెస్ రుణమాఫీ ఉంది’అని హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. హరీశ్‌రావు ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు.. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్దాం.. కుల్లం కుల్లా రైతులను అడుగుదాంసిద్దిపేట మండలం తడకపల్లిలో రుణమాఫీకి అర్హులు 720 మంది రైతులు కాగా.. రుణమాఫీ అయ్యిందికేవలం 350 మంది రైతులకేరుణమాఫీ పై తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కు లక్షా 16 వేల 460 మంది రైతులు ఫిర్యాదు చేశారుమాట తప్పింది రేవంత్రెడ్డినాడు కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారురేవంత్ నాడు మాట నిలబెట్టుకున్నారా ? రైతుల నెత్తిన టోపీ పెడుతున్నారు రేవంత్ రెడ్డిఅధికారం దక్కించుకోవడానికి మోసం.. వచ్చిన అధికారం కాపాడుకోవడానికి రేవంత్ మోసం చేస్తున్నారు ఆగష్టు 20వ తేది వచ్చింది ఇప్పటి వరకు రైతు భరోసా పై నిర్ణయం తీసుకోలేదు రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టి రుణ మాఫీ సగం చేశారు రుణ మాఫీ పై శ్వేత పత్రం విడుదల చేయాలినీటి పారుదల, అప్పుల మీద శ్వేత పత్రాలు పెట్టిన రేవంత్‌రెడ్డి.. రుణ మాఫీ పై ఎందుకు శ్వేత పత్రం విడుదల చేయడం లేదుసాక్షి పత్రికలో వచ్చిన రుణం తీరలే అన్న వార్త కథనాన్ని చూపిన హరీష్ రావురేవంత్ రెడ్డి పరిపాలన లో ప్లాప్ తొండి చేయడంలో తోపుబూతులు తిట్టడంలో టాప్ రంకెలు వేస్తే అంకెలు మారిపోవు పాలకుడిగా రేవంత్ రెడ్డి పాపాలు మూట కట్టుకున్నారు దేవుళ్ళ మీద ఒట్ట్లు పెట్టారు.. తెలంగాణ ప్రజలకు శాపం కావొద్దని కోరుకుంటున్న అన్ని దేవాలయాల దగ్గరకు వెళ్ళి తెలంగాణ ప్రజలకు పాపం తగలవద్దని కోరుకుంటున్న దేవుళ్ళను పాపాల రేవంత్ రెడ్డిని క్షమించమని కోరుకుంటా ముఖ్యమంత్రి నన్ను తాటిచెట్టులా పెరిగావని నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నారు రుణ మాఫీ పై రేవంత్ ది ప్లాప్ షో భౌతిక దాడులకు పురి గొల్పుతున్నారు రేవంత్ గాడ్ ఫాదర్లకే భయపడలేదు చావాలని కోరుకుంటున్న వారు.. రేపు మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తారేమో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు రైతుల పక్షాన పోరాటం చేస్తాం రుణ మాఫీ పై బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం త్వరలో ప్రకటన చేస్తాం -
రుణమాఫీ పేరుతో దారుణమైన మోసం
-
ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ: సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని, వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రాహుల్‌గాంధీ చెప్పిన ప్రకారం రాష్ట్రంలో రైతులకు ఒకేసారి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం(జూన్21) కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘గత ప్రభుత్వం రెండో టర్ములో డిసెంబర్ 11,2018 వరకు కటాఫ్ పెట్టి రుణమాఫీ చేసింది. మేం ఆమరుసటి రోజు డిసెంబర్ 12,2018 నుంచి డిసెంబర్ 9,2023వరకు 5 సంవత్సరాల్లో రైతులు తీసుకున్న రూ.2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని నిర్ణయించాం. ఈ రుణమాఫీ చేయడానికి రూ.31 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నాయి.వ్యవసాయం దండగ కాదు..వ్యవసాయం పండుగ అని నిరూపించాలనే కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి వాయిదా పద్ధతుల్లో చేసి రైతు ఆత్మహత్యలకు కారణమయింది. గత ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. రైతు భరోసాపై పారదర్శకంగా అందరి సూచనల మేరకే అమలు చేస్తాం.ప్రభుత్వ సంక్షేమం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే రైతుభరోసాపై మంత్రివర్గ ఉపసంఘం వేయాలని నిర్ణయించాం. ఉపసంఘంలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్రావు, శ్రీధర్‌బాబు, పొంగులేటిలు కమిటీలో సభ్యులుగా ఉంటారు. జులై 15 నాటికి మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశాలు ఇక నుంచి మీడియాకు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాత్రమే చెప్తారు. వీరిద్దరిచ్చే సమాచారమే అధికారిక సమాచారం. వీరిని మంత్రివర్గ అధికార ప్రతినిధులుగా నియమిస్తున్నాం. రుణమాఫీ అర్హుల ఎంపిక విధివిధాలపై త్వరలోనే జీవో విడుదలవుతుంది’అని రేవంత్‌రెడ్డి తెలిపారు. -
తెలంగాణలో రుణమాఫీపై నీలినీడలు.. అయోమయంలో రైతులు!
సాక్షి, మెదక్‌జోన్: రుణమాఫీపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు మెదక్ జిల్లాలో రూ. 25 వేల లోపు రుణాలు తీసుకున్న వారికి మాత్రమే మాఫీ కాగా.. ఇటీవల బడ్జెట్లో రుణమాఫీ విషయమై పూర్తిస్థాయిలో నిధులు కేటాయించలేదు. అప్పులకు వడ్డీ పెరగడంతో పాటు కొత్త రుణాలు అందడం లేదని వాపోతున్నారు. జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉండగా 1.40 లక్షల మంది రైతులు ఉన్నారు. - జిల్లావ్యాప్తంగా వివిధ బ్యాంకుల ద్వారా రూ.236 కోట్ల పంట రుణాలు తీసుకున్నారు. వీరిలో మొదటి విడతగా 2020లో రూ. 25 వేల లోపు రుణాలు తీసుకున్న 20,873 మంది రైతులకు రూ. 82.38 కోట్లు మాఫీ అయింది. - ఇంకా 1,19,148 మంది రైతులు రూ. 50 వేల నుంచి లక్ష వరకు తీసుకున్న అప్పు రూ. 154 కోట్లు ఉంది. - ఈ లెక్కన ఇంకా రూ. 11,655 కోట్ల మేర అప్పులు అలాగే ఉన్నాయి. ఈ బడ్జెట్ లెక్కల ప్రకారం రైతుల రుణమాఫీ పూర్తిగా వర్తించని విధంగా ఉంది. - తీసుకున్న రుణాల్లో కేవలం 30శాతం మేరకే నిధులు కేటాయించడంతో జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. - 2018 ఎన్నికల సమయంలో రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పడంతో తాము బ్యాంకులో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేదని.. ఇప్పుడు మాఫీ కాకుంటే మా పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు. - జిల్లాలో మెజార్టీ రైతులకు రూ.లక్ష ఆ పైనే రుణాలు ఉన్నాయి. బ్యాంకర్లు ఎకరాకు రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు పంట రుణం ఇస్తుండడంతో రెండెకరాలు ఉన్న రైతులు రూ.లక్ష, ఆపై రుణం తీసుకున్నారు. - ప్రస్తుతం జిల్లాలో ఇంకా 1,19,148 మంది రైతులకు రూ. 154 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. బ్యాంకర్ల నోటీసులు - 2018లో రైతులు రూ. లక్ష లోపు తీసుకున్న రుణాలు చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొనడంతో 60 శాతం మంది రైతులు రెన్యూవల్ కూడా చేయలేదు. - సకాలంలో రుణాలు చెల్లించని రైతులకు బ్యాంకర్లు నోటీసులు ఇచ్చారు. - ఏడాదిలోపు రెన్యూవల్ చేసుకుంటే కేవలం 7శాతం వడ్డీ మాత్రమే బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. - ఇలా చెల్లించిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించిన వడ్డీలో సగం సబ్సిడీ రూపంలో రైతులకు తిరిగి చెల్లిస్తోంది. - పంట రుణాలు పొందిన రైతులు ఏడాది లోగా రెన్యూవల్ చేయించకుంటే వడ్డీ ఏకంగా 14 శాతం పెరుగుతుంది. అంటే రెండింతలు అవుతుంది. - లక్ష పంటరుణం తీసుకుంటే ప్రతి సంవత్సరం సక్రమంగా చెల్లించే రైతుకు 5 ఏళ్లకు చెల్లించే వడ్డీ రూ. 20 వేలు మాత్రమే నిర్ణీత గడువులోగా చెల్లించని రైతుకు వడ్డీ ఐదే సంవత్సరాలకు రూ. 70 వేల పైచిలుకు చెల్లించాల్సి ఉంటుందని ఓ బ్యాంకు అధికారి పేర్కొన్నారు. - సక్రమంగా చెల్లించే రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ వడ్డీలో సగం తిరిగి సదరు రైతు ఖాతాలో జమ కట్టడంతో పాటు బ్యాంకులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణంలో 10 శాతం పెంచి ఇస్తుంది. - కాగా ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పడంతో జిల్లాలో 40 శాతం మంది రైతులు రెన్యూవల్ కూడా చేయలేదు. ముమ్మాటికి మోసమే నాకు నాలుగెకరాల భూమి ఉంది. 2018 డిసెంబర్లో రూ. లక్ష పంట రుణం తీసుకున్నా. ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పడంతో తీసుకున్న అప్పు కట్టలేదు. ఇప్పటివరకు అసలు రూ. లక్ష, వడ్డీ రూ. 80 వేలు కలిపి మొత్తం రూ. లక్షా 80 వేలు అయింది. ప్రస్తుతం ప్రభుత్వం రూ. 90 వేల లోపు రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని చెప్పడం సరికాదు. ఇచ్చిన మాట ప్రకారం రూ. లక్ష వరకు రుణాలు మాఫీ చేయాలి – సాయిరెడ్డి, రైతు, మర్పల్లి రేగోడ్ మండలం సకాలంలో రెన్యూవల్ చేసుకోవాలి తీసుకున్న పంట రుణాలు సకాలంలో రెన్యూవల్ చేయకుంటే వ డ్డీ భారం పెరుగుతుంది. ఐదేళ్లలో తీసుకున్న రుణం రెండింతలు అవుతుంది. మా బ్యాంకులో 2,300 మంది రైతులు పంటరుణం తీసుకున్నారు. రుణాలు చెల్లించని 900 మంది రైతులకు నోటీసులు అందజేశాం. – శ్రీకాంత్, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్, చిన్న శంకరంపేట -
అధికారమిస్తే రుణమాఫీ, సున్నావడ్డీకే రుణాలు: వైఎస్ షర్మిల
సాక్షి, నిజాంసాగర్: తమకు అధికారమిస్తే పంట రుణాలు మాఫీ చేస్తా మని, సున్నావడ్డీకి రుణాలు ఇస్తామని వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షు రాలు వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్, పిట్లం మండలాల మీదుగా సాగింది. పిట్లంలో ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ సర్కార్ రూ.వేల కోట్ల అవినీతి, అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బు లతో సీఎం కేసీఆర్ హెలికాప్టర్ కొనుగోలు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అభివృద్ధిని విస్మరించి దేశాన్ని దోచుకునేందుకు కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ అందించిన సువర్ణ పాలన కోసం తమ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైరల్: బాలీవుడ్ హీరోకు రూ. 4కోట్ల 70లక్షల రుణమాఫీ
ముంబై: విలాస్‌రావ్ దేశ్‌ముఖ్.. మహారాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. విలాస్‌రావ్ సీఎంగా ఉన్న కాలంలోనే ఆయన కుమారుడు రితేశ్ దేశ్‌ముఖ్ ను బాలీవుడ్ హీరోగా పరిచయం చేశారు. అయితే ఇదంతా గతం. తాజాగా.. బాలీవుడ్ హీరో, మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్ కొడుకు రితేశ దేశ్ ముఖ్ రైతు రుణమాఫీ పొందారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైతు రుణమాఫీ కింద రితేశ్.. ఆయన సోదరుడు అమిత్ దేశ్‌ముఖ్ రూ. 4కోట్ల 70లక్షలు లోన్ తీసుకున్నట్లు, కొన్ని డాక్యుమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై స్పందించిన రితేశ్ దేశ్‌ముఖ్.. మేము ఎలాంటి లోన్ తీసుకోలేదని అటువంటపుడు రుణమాపీ ఎలా జరుగుతుందన్నారు. చదవండి: కుక్కకు పులి వేషం వేసి వాటిని తరిమేశాడు..! సోషల్‌మీడియాలో వైరల్ అవుతోన్న డాక్యుమెంట్స్ ఏవీ కూడా నిజం కాదన్నారు. ఆ డాక్యుమెంట్స్‌ను పోస్ట్ చేసిన మధుపూర్ణిమ కిశ్వర్ అనే మహిళ.. రితేశ్ స్పందన తర్వాత తన పోస్ట్‌ను తొలగిస్తూ క్షమాపణలు కోరింది. తన ఫ్రెండ్ ఒక లింక్‌ను తనకు షేర్ చేస్తే అదే నిజమని నమ్మి తాను పోస్ట్ చేసినట్లు చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగవని ఆ మహిళ తప్పును గుర్తించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. మరో ట్వీట్ చేసింది. I am also deeply impressed by the gracious manner in which @Riteishd pointed out my mistake. Thank you Riteish, that one tweet of yours carried many valuable lessons. https://t.co/EBdyqmm63g — MadhuPurnima Kishwar (@madhukishwar) December 3, 2019 Dear @madhukishwar Ji, The said paper in circulation is with malafide motive. Neither me nor my brother @AmitV_Deshmukh have availed any loan as mentioned in the paper posted by you. Hence, there is no question of any loan waiver whatsoever. Please don’t be misled. Thank you. https://t.co/yCfxNt2ZRm — Riteish Deshmukh (@Riteishd) December 3, 2019 -
అవసరమైనప్పుడు ఎక్కడున్నారు సార్?
సాక్షి, ఎలక్షన్ డెస్క్: ‘‘ఏమిటి సుందరయ్య గారూ.. టీవీలో ఏదో చూస్తూ మీలో మీరే నవ్వుకుంటున్నారు?’’ అడిగాడు పొరుగింటి పరంధామయ్య. ‘‘ఏమీ లేదు లెండి. ఏదో కథ గుర్తొచ్చి...’’ ‘‘ఏమిటా కథ?’’ ‘‘అప్పట్లో సోముడు అనేవాడు రాముడి దగ్గర వెయ్యి వరహాలు అప్పు తీసుకున్నాట్ట. బాకీ ఎప్పుడు తీరుస్తావని అడిగితే, సంతకెళ్లి సరుకులమ్మాక ఇస్తానన్నాట్ట. తీరా ఇద్దరూ సంతకెళ్లి వస్తువులు అమ్మాక.. అంత సొమ్ము అప్పనంగా అవతలి వాడి చేతిలో పెట్టడం ఎందుకు అనిపించిందట సోముడికి. ‘సరుకులమ్మగానే బాకీ తీరుస్తానన్నావు కదా’ అని రాముడు అడిగితే ‘ఇప్పుడే కదా అమ్మాను. ఇంట్లోకి సరుకులు ఇవీఅవీ తీసుకోవాలి కదా. ఇంటికెళ్లాక ఇస్తాన్లే’ అన్నాట్ట. సరేనన్నాడు రాముడు. ఇంతలో ఇంటికెళ్లే సమయంలో అడవి దాటుతున్నప్పుడు దొంగలు ఎదురుపడ్డారట. వెంటనే సోముడు.. ‘ఇందాక అప్పు తీర్చమని అడిగావు కదా. ఇంద తీసుకో’ అంటూ బాకీ సొమ్ము రాముడి చేతిలో పెట్టాడట. ఈ కథ గుర్తొచ్చి నవ్వాను’’ అన్నాడు సుందరయ్య. ‘‘ఇంతకీ ఈ కథ ఎందుకు గుర్తొచ్చింది?’’ ‘‘ఏమీ లేదు.. ఇందాక మన బాబుగారి ఎన్నికల యాడ్ టీవీలో వచ్చింది. ‘నేను మీ ఇంటి పెద్ద కొడుకును. మీ అవసరాలన్నీ తీరుస్తా. మీకు వైద్యానికయ్యే ఖర్చులన్నీ ఇస్తా’ అంటూ ఏదో చెబుతుంటే ఈ కథ గుర్తొచ్చింది’’ ‘‘బాబుగారి ఎన్నికల యాడ్‌కీ, మీరు చెప్పిన కథకూ సంబంధం ఏమిటి?’’ ‘‘అప్పట్లో మొత్తం రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. ఆ తర్వాత వన్‌టైమ్ సెటిల్మెంట్లో కొంత మొత్తం మాత్రమే అన్నాడు. ఈ రెండు క్లిప్పింగుల ఫుటేజ్‌లూ సోషల్ మీడియాలో తెగ తిరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ఇంటి పెద్దకొడుకునూ.. ఇంటిల్లిపాదికీ వైద్యం ఖర్చులిస్తానంటుంటే.. ఆ కథ గుర్తొచ్చింది. కథలో సోముడూ అంతే. అవసరమైనప్పుడు డబ్బులివ్వడు. దొంగలు దోచుకునే టైమ్‌కు బాకీ తీర్చేస్తానంటాడు. సోముడు అంటూ చంద్రుడి పేరు పెట్టుకున్నందుకు అచ్చం మన బాబుగారిలాగే వ్యవహరించాడు కదా కథలోని వాడు అని నవ్వాను’’ అన్నాడు సుందరయ్యా. ‘‘ఏమో ఈసారి ఇచ్చేస్తాడేమో లెండి’’ అన్నాడు పరంధామయ్య. ‘‘మీరుత్తి అమాయకులండీ. అప్పట్లో ఆరోగ్యశ్రీ స్కీము బాగానే నడుస్తోంది. హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అన్నారు. కాబట్టి అప్పట్లో అక్కడి ఏ హాస్పిటల్‌కు వెళ్లినా అది వర్తించింది. కానీ మనవాడు ఓటుకు నోటు కేసులో పట్టుబడి, కరకట్టకు పరుగు పరుగున వచ్చేశాడు చూడండీ.. సరిగ్గా అప్పట్నుంచే హైదరాబాద్ హాస్పిటల్ వాళ్లూ ఆంధ్రప్రదేశ్ పేషెంట్లను తీసుకోవడం మానేశారు. అదేమిటంటే.. ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ డబ్బులివ్వటం లేదు. అక్కడిది ఇక్కడ నడవదు’ అనడం మొదలుపెట్టారు. ఈయన డబ్బు ఇస్తే వాళ్లెందుకు వైద్యం చేయరండీ. మరి ఆయనకు అంత చిత్తశుద్ధి అప్పుడే ఉంటే.. ఇప్పటికి ఎంత మందిని కాపాడి ఉండేవాడూ.. ఎన్ని ప్రాణాలు నిలిచేవి. చక్కగా అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీని నిలబెట్టలేనివాడు, మళ్లీ ఇప్పుడొచ్చి మళ్లీ పెద్దకొడుకునూ, పెద్దదిక్కునూ అప్పటి స్కీమును మళ్లీ ఇప్పుడు కొత్తగా అమలు చేస్తానంటుంటే ఎలా నమ్మగలమా అనిపిస్తోంది. వైఎస్ గారు ఆ స్కీమునెలా నడిపించారో మనకు తెలియనిదా అండీ’’ ‘‘అవున్లెండి. కొంతమంది పెద్దకొడుకులంతే. అసలు టైమ్‌లో అవసరానికి దొరక్కుండా పోతారు. సరిగ్గా ఆస్తి పంపకాలప్పుడు పెద్దవాణ్ణీ, పెద్ద వాటా కావాలంటూ పేచీలు పెడతారు. అచ్చం.. మన బాబుగారిలాగే’’ నిట్టూర్చారిద్దరూ. - యాసిన్ -
దా‘రుణం’..!
నల్లగొండ అగ్రికల్చర్ : లక్ష్యం కొండంత..ఇచ్చింది గోరంత.. ఇదీ రబీ పంట రుణాల తీరు. శాసనసభ ఎన్నికల ముందు అధికార, ప్రతిపక్ష పార్టీల హామీల పుణ్యమా అని అన్నదాతలకు పంటరుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తి చూపలేదు. అసలు బ్యాంకుల చెంతకు అన్నదాతలను చేరనివ్వని పరిస్థితి. పంటరుణం కోసం బ్యాంకుల వద్దకు వెళ్తే ఖరీఫ్‌లో తీసుకున్న రుణం వడ్డీతో సహా చెల్లించి కొత్త రుణం అడగాలని అధికారులు తిరకాసు పెట్టారు. దీంతో ఇదేమి గోల అనుకుని రైతులు వాటివైపు కన్నెత్తిచూడలేదు. జిల్లాలో గత ఖరీఫ్‌లో పంట రుణలక్ష్యం రూ.1,253.93 కోట్లు కాగా, బ్యాంకులు రైతులకు పంట రుణం ఇచ్చింది కేవలం రూ.698.22 కోట్లు. అంటే 55.68 శాతం మాత్రమే రైతులు పంటరుణాలను అందుకున్నారు. అదే విధంగా ఈ రబీలో రుణలక్ష్యం రూ.835.95 కోట్లుగా నిర్దేశించగా, రైతులకు సీజన్ ముగిసినప్పటికీ ఇచ్చింది కేవలం రూ.138.32 కోట్లు. అంటే 16.55 శాతం మాత్రమే పంటరుణాలను ఇచ్చారంటే బ్యాంకులకు రైతులపై ఏమాత్రం చిత్తుశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల హామీ ఎఫెక్టేనా? శాసనసభ ఎన్నికల ముందు అధికార టీఆర్ఎస్ పార్టీ లక్ష వరకు రైతుల రుణాలను మాఫీ చేస్తామని, మరోవైపు ప్రతిపక్ష కూటమి రూ.2లక్షల వరకు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీల ఎఫెక్ట్ రబీ పంట రుణాలపై స్పష్టంగా కనిపించింది. రుణమాఫీని ఎప్పటినుంచి పరిగణనలోకి తీసుకుంటారో స్పష్టం చేయకపోవడంతో బ్యాంకులు రబీ రుణాలను ఇవ్వాలంటే ఆలోచనలో పడ్డాయి. ఇచ్చినవాటిని ఎప్పుడు ప్రభుత్వం చెల్లిస్తుందోనని, మళ్లీ రుణాలిచ్చి ఎందుకు ఇబ్బందులు పడాలన్న ముందుజాగ్రత్తగా బ్యాంకర్లు రబీ రుణాలను ఇవ్వకుండా బ్రేక్ వేసినట్లు సమాచారం. ఎవరైనా రైతులు బ్యాంకులకు రుణం కోసం వెళ్తే ఖరీఫ్ రుణాలను చెల్లించాలని ఒత్తిడి తేవడంతో వారు అటువైపు వెళ్లలేదు. పెట్టుబడుల కోసం తిప్పలు రైతులు రబీ పెట్టుబడుల కోసం నానా తిప్పలు పడాల్సి వచ్చింది. బ్యాంకుల వారు దరిచేరనియకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సి వచ్చింది. అప్పులు పుట్టని రైతులైతే బంగారు ఆభరణాలను కుదవపెట్టి నగదు తెచ్చుకుని రబీ పంటలను సాగు చేసుకున్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితులు ఎన్నడూ రాలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రబీ పంటల సాగు ఇలా రబీ సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం 76,531 హెక్లార్లు కాగా, ఇప్పటివరకు 47,674 హెక్టార్లలో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. వరి 45,603 హెక్టార్లు, జొన్న 10, మొక్కజొన్న 19, పెసర 60, మినుము 35, ఉలువలు 53, శనగలు 141, వేరుశనగ 1753 హెక్టార్లు సాగు చేశారు. -
యాసంగి లక్ష్యంలో 6 శాతమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బ్యాంకులు రైతులకు యాసంగి రుణాలిచ్చేందుకు గజగజలాడుతున్నాయి! అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రకటించిన రైతు రుణమాఫీ హామీలు దడ పుట్టిస్తుండటంతో రైతులకు కొత్త రుణాలివ్వకుండా వారికి చుక్కలు చూపిస్తున్నాయి. నిబంధనల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఏడాది (2018–19)కి ఇవ్వాల్సిన రైతు రుణాల లక్షం రూ. 17 వేల కోట్లలో ఇప్పటివరకు కేవలం రూ. వెయ్యి కోట్లే (సుమారు 6 శాతం) ఇచ్చాయి. దీంతో లక్షలాది మంది అన్నదాతలు ఇప్పుడు అప్పు కోసం నానా పాట్లు పడుతున్నారు. రాజకీయ పార్టీల రుణమాఫీ హామీల కారణంగా తాము నిబంధనలు పాటించాల్సి వస్తుందని బ్యాంకర్లు చెబుతుంటే నిబంధనల పేరు చెప్పి బ్యాంకులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. రుణం తీసుకుంటే ఎలాగూ మాఫీ అవుతుందన్న ధీమాతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 19 శాతం కొత్త ఖాతాదారులు నమోదయ్యారని, రబీలో కూడా రుణాలు ఇస్తే ఆ సంఖ్య 40 శాతం దాటుతుందని ఓ బ్యాంకు అధికారి వెల్లడించారు. లక్ష్యం రూ. 17 వేల కోట్లు... ఇచ్చింది రూ. 1,000 కోట్లే... రబీలో తెలంగాణ రైతాంగానికి రూ. 17 వేల కోట్ల మేర రుణాలు ఇవ్వాలని ఈ ఏడాది మొదట్లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా బ్యాంకులు అక్టోబర్‌లోనే రుణాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. అయితే రుణాల మంజూరులో బ్యాంకులు ఒక్కసారిగా అన్ని నిబంధనలను తెరమీదకు తెచ్చాయి. రుణాల రీ షెడ్యూల్‌కు అంగీకరించడం లేదు. ఎవరైనా రైతు ఎక్కువ రుణం కావాలని వెళ్తే నిబంధనల ప్రకారం మీకు వచ్చేది అందులో 25 శాతమేనని చెబుతున్నాయి. రైతు అడిగిన మొత్తంలో అతని లావాదేవీలనుబట్టి 80 శాతం నుంచి 90 శాతం ఇవ్వడమన్నది సాధారణం. కానీ ఈసారి బ్యాంకులు అందుకు అంగీకరించడం లేదు. ఈ కారణంగా నవంబర్ 2వ తేదీ నాటికి తెలంగాణలో రైతాంగానికి ఇచ్చిన అప్పుల మొత్తం రూ. 1,000 కోట్ల లోపే. నెలాఖరు దాకా రుణాలు ఇచ్చినా ఆ మొత్తం రూ. 2,000 కోట్లు దాటకపోవచ్చని బ్యాంకర్లే అంటున్నారు. గతేడాది (2017–18) రబీలో రూ. 15,901 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటే బ్యాంకులు 10,384 కోట్లు ఇచ్చాయి. అంతకు ముందు ఏడాది అంటే 2016–17లో రూ.15 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకుని రూ.13456 కోట్లు మంజూరు చేశాయి. ఈ ఏడాది మాత్రం లక్ష్యంగా 25 శాతం కూడా ఇచ్చే అవకాశం కనిపించట్లేదు. క్యూ కడుతున్న కొత్త రైతులు... గత ఖరీఫ్ సీజన్లో మునుపెన్నడూ లేనివిధంగా 19 శాతం కొత్తవారు రైతు రుణాలు పొందారని బ్యాంకర్లు విశ్లేషిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రుణమాఫీ అవుతుందన్న ఉద్దేశంతో భూమి ఉన్న ప్రతి ఒక్కరూ రుణాల కోసం క్యూ కడుతున్నారని, ఈ పరిణామం నిజంగా వ్యవసాయం చేసుకునే రైతులకు ఇబ్బందిగా మారింద ని కూడా బ్యాంకర్లే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎవరైనా పంట రుణం కోసం వెళ్తే బ్యాంకర్లు వారిని ఏం పని చేస్తుంటారని అడుగుతున్నారు. ఒకవేళ ఫలానా ఉద్యోగం అని చెబితే మరి వ్యవసాయ రుణం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అప్పు కావాలని ఎవరైనా కొత్త రైతు గట్టిగా అడిగితే బ్యాంక్ ఇన్స్పెక్టర్ వస్తారు.. పంటల సాగు కోసం ఏం చేస్తున్నారో పరిశీలిస్తారని చెబుతున్నారు. అప్పు ఖాతాకు రైతు బంధు సొమ్ము బదిలీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పంట రుణం మాఫీ అవుతుందని భావించి రైతులు ఖరీఫ్ రుణాలు చెల్లించలేదు. ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ. 4 వేలు ఇస్తున్న మొత్తం రైతు బ్యాంకు ఖాతాలో పడగానే బ్యాంకర్లు దాన్ని వెంటనే ఆ రైతు అప్పు ఖాతాకు బదిలీ చేసేస్తున్నారు. దీనిపై రైతులు గగ్గోలు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చేవారు రుణమాఫీ చేస్తామంటుంటే బ్యాంకులు సతాయిస్తున్నాయని మండిపడుతున్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం యాపలగూడెంకు చెందిన సంజీవరెడ్డి రబీలో వరి సాగుకు రూ. లక్ష రుణం కావాలని ఎస్బీఐని ఆశ్రయించాడు. ఖరీఫ్ సీజన్లో రుణం ఎందుకు తీసుకోలేదు? మాఫీ ఆశించి రుణం కోసం ఇప్పుడు వచ్చావా? నువ్వు ప్రభుత్వ ఉద్యోగివి కదా వ్యవసాయం ఎలా చేస్తావు? అంటూ యక్ష ప్రశ్నలు వేసిన బ్యాంకు అధికారులు రుణం ఇవ్వబోమన తేల్చిచెప్పారు. కరీంగనర్ జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన గోపగాని సమ్మయ్య పంటల సాగు కోసం ఖరీఫ్‌లో కొంత రుణం తీసుకున్నాడు. తీసుకున్న మొత్తానికి వడ్డీ చెల్లించి రుణాన్ని రీ షెడ్యూల్ చేయించుకోవడంతోపాటు కొత్తగా మరికొంత రుణం కోసం బ్యాంకును ఆశ్రయించాడు. అయితే పూర్తి మొత్తం చెల్లిస్తేనే కొత్త రుణం ఇస్తామన్న బ్యాంకు మెలికతో కంగుతిన్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా బూత్పూర్ మండలం కరివేన గ్రామానికి చెందిన గంగుల వేణుగోపాల్‌రెడ్డి ఖరీఫ్‌లో తీసుకున్న రుణం పూర్తిగా చెల్లించడంతోపాటు రబీలో ఎక్కువ అవసరం ఉందని బ్యాంకును ఆశ్రయించాడు. గతంలో అడిగినంత రుణం ఇచ్చిన బ్యాంకు ఈసారి మాత్రం ఆయన అడిగిన దానిలో 25 శాతమే ఇస్తామని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగాడు. రుణమాఫీ హామీలే కారణమా? ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఏకకాలంలో రూ. 2 లక్షల చొప్పున రైతు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్, రూ. లక్ష చొప్పున మాఫీ చేస్తామని టీఆర్ఎస్ ఇప్పటికే హామీలు ఇచ్చాయి. గత ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ పూర్తి రుణమాఫీ హామీ ఇచ్చినా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేయడంతో రైతులతోపాటు బ్యాంకులు సంక్షోభాన్ని చవిచూశాయి. తెలంగాణలో రూ. లక్షలోపు రైతు రుణాలు చెల్లించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల సమయం తీసుకుంది. ‘రైతు రుణమాఫీ హామీల కారణంగా బ్యాంకింగ్ రంగం ఇబ్బందుల పాలవుతోంది. ఇతర రంగాలకు సరైన సేవలు అందించలేకపోతున్నాము. ఏడాది ముందు నుంచే రాజకీయ పార్టీలు రుణమాఫీ అంటుండటంతో వసూళ్లలో మందగమనం ఏర్పడింది. ఖరీఫ్‌లో అది మరింతగా పెరిగింది’అని లీడ్ బ్యాంక్ (ఎస్బీఐ) సీనియర్ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. నిబంధనల మేరకు రుణాలు ఇవ్వాలని లీడ్ బ్యాంక్ తెలంగాణలోని అన్ని బ్యాంకు శాఖలను ఆదేశించింది. ట్రాక్ రికార్డు బాగున్న రైతులకు ఏ ఇబ్బందీ లేకుండా రుణాలు మంజూరు చేస్తున్నామని ఆ అధికారి అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోతున్నది బ్యాంకులు, రైతులేనని, దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించామని హైదరాబాద్ రిజర్వు బ్యాంక్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. -
రుణమాఫీ, నిరుద్యోగభృతి సాధ్యం కావు: పల్లా
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్న రూ.2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతి హామీలు ఆచరణ సాధ్యం కావని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గట్టెక్కడానికి కాంగ్రెస్ నేతలు ప్రయోగిస్తున్న ఆపదమొక్కులను ప్రజలు నమ్మరన్నారు. ఐదు దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌నేతలు ఆస్తులు, ఆకారాలు, అహంకారాన్ని తప్ప బుర్రను పెంచుకోలేదని విమర్శించారు. సంక్షేమపథకాలతో సీఎం కేసీఆర్ ప్రతిష్ట పెరిగితే వారు జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రారంభమైన కాంగ్రెస్ పతనం 2019 నాటికి పూర్తిగా కనుమరుగవుతుందని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ వందసీట్లు గెలిచి చరిత్ర సృష్టిస్తుందని జోస్యం చెప్పారు. -
'రుణమాఫీలో ప్రభుత్వం విఫలం'
హైదరాబాద్: రుణమాఫీలో ప్రభుత్వం విఫలం అయిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ విమర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ విడతల రుణ మాఫీ వల్ల రైతులకు ఎలాంటి లాభం జరగలేదన్నారు. రైతులకు బేడీలు వేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రధాని పసల్ బీమా పథకం అమలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. రైతుల ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేస్తుందని మండిపడ్డారు. పసల్ బీమా పథకాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల 14 లక్షల మంది రైతులు నష్టపోయారని వివరించారు. నకిలీ విత్తన కంపెనీలు రాజ్యం ఏలుతుంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యవహారిస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం దళారులకు, దోపిడీదారులకు అడ్డాగా మారిందని దెప్పిపొడిచారు. వెంటనే నకిలీ విత్తనాలను పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
రైతులు భీమా కోల్పోయారు : జీవన్‌రెడ్డి
జగిత్యాల: రుణమాఫీ ఒకే విడతలో చేసి ఉంటే రైతులకు లాభం చేకూరేది. అలా కాకుండా.. దఫాల వారిగా చేయడంతో రైతులు పంటల భీమా కోల్పోవాల్సి వచ్చింది. దీంతో పాటు వడ్డీ భారం పెరిగిపోయింది. ఇప్పటికైన ప్రభుత్వం వెంటనే రూ. 2 వేల కోట్లు విడుదల చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
‘మా పాలనలో రైతు ఆత్మహత్యలు తగ్గాయి’
కామారెడ్డి: టీఆర్ఎస్ హయాంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాబోయే ఐదేళ్లలో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. రైతు రుణాలను 75 శాతం వరకూ చెల్లించామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ హయాంలో 10 వేల మంది రైతులు, కాంగ్రెస్ హయాంలో 12 వేల 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఆంధ్రాలో కనీసం 45 శాతం రుణాలను కూడా చెల్లించని టీడీపీకి మాట్లాడే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. నకిలీ విత్తనాల సరఫరాపై నేరుగా మేనేజింగ్ డైరెక్టర్ల పైనే కేసులు నమోదు చేశామన్నారు. -
ప్రజల సమస్యలే ఎజెండా: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: రైతులు, విద్యార్థులు, యువకులు, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయని టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే కాంగ్రెస్ ఎజెండా అని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేయలేదని, పంట నష్టాన్ని అంచనా వేయలేదని, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని, కేంద్రం ఇచ్చిన నిధులను కూడా రైతులకు ఇవ్వలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ కుటుంబం తప్ప ప్రజలెవరూ సంతోషంగా లేరని మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అన్నారు. -
'నయీం కేసును సీరియల్లా సాగదీయకండి'
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసు విచారణ డైలీ సీరియల్ సాగదీయకుండా.. త్వరగా విచారణ పూర్తిచేసి దోషులను శిక్షించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరిపించాలని అనేక సార్లు కోరినా.. ప్రభుత్వ పట్టించుకోవడంలేదని వెంకట్ రెడ్డి తెలిపారు. నయీంతో సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని ఆయన పునరుద్ఘాటించారు. మరోవైపు సీఎం కేసీఆర్ మిడ్ మానేరు నిర్వాసితులను క్షమాపణ కోరిన విధంగానే రుణమాఫీపై మాటమార్చినందుకు రైతులను కూడా క్షమాపణ కోరాలని రుణమాఫీ ఏక కాలంలో పూర్తిచేయకపోవడం వల్లే రైతులు అప్పులపాలవుతున్నారు. సీఎం వద్ద ఉన్న ప్రత్యేక అభివృద్ధి నిధి రూ.4750 కోట్లను రుణమాఫీ కోసం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
రుణమాఫీని ఒకేసారి విడుదల చేయాలి
చౌటుప్పల్ : మూడు, నాలుగో విడత రుణ మాఫీని ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న కలెక్టరేట్‌ను ముట్టడించనున్నట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి తెలిపారు. చౌటుప్పల్‌లో శనివారం జరిగిన సీపీఎం సమావేశంలో మాట్లాడారు. రైతులను ఆదుకోవడంలో.. కౌలుదారులకు గుర్తింపుకార్డులు, రుణాలు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. భూ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలన్నారు. కలెక్టరేట్ ముట్టడికి రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండ శ్రీశైలం, డివిజన్ కార్యదర్శి చింతల భూపాల్‌రెడ్డి, దోనూరి నర్సిరెడ్డి, రొడ్డ అంజయ్య, పాషా, కీసరి నర్సిరెడ్డి, మండల నాయకులు ఆకుల ధర్మయ్య, ఆనగంటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
రుణమాఫీ ఒకేసారి చేయాలి
దోమలపల్లి (నల్లగొండ రూరల్) ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ మండలంలోని దోమలపల్లిలో సంఘ బంధం భవనాన్ని ప్రారంభించారు. అనంతరం దోమలపల్లి – అప్పాజీపేట గ్రామాల మధ్య రోడ్డు పనులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రుణం లభించక రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని ఫలితంగా వారిపై ఆర్థిక భారం పడుతుందన్నారు. ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీని చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఏడాదిలోగా బి.వెల్లెంల ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి సాగు నీరు అందించడమే తన లక్ష్యమన్నారు. ఈ ప్రాంత రైతుల బీడు భూములకు సాగు నీరు అందించి వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతానన్నారు. అన్ని గ్రామాల లింకు రోడ్డులను క్రమంగా బీటీ రోడ్డులుగా మారుస్తామన్నారు. గ్రామ జ్యోతికి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్ల అభివృద్ధి జరగడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వంగూరి లక్ష్మయ్య, గుమ్మల మోహన్‌రెడ్డి, గాదె లక్ష్మి, వెంకట్‌రెడ్డి, యాదయ్య, రవీందర్, సతీష్, ఉమాదేవి, ఎంపీడీఓ సత్తెమ్మ, సీసీ యాదమ్మ, ఏఈ రాములు తదితరులు పాల్గొన్నారు. -
మూడో విడత రుణమాఫీ
నేరడిగొండ : మూడో విడత రుణమాఫీ డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకావడంతో ఆయా గ్రామపంచాయతీల వారీగా వారికిచ్చేందుకు తేదీలు ఖరారు చేసినట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ ఆశన్న తెలిపారు. బుగ్గారాం గ్రామపంచాయతీ రైతులు ఈ నెల 3వ తేదీ వరకు తీసుకోవచ్చన్నారు. ఒక్కో జీపీకి 3 రోజులపాటు అవకాశం ఇచ్చామన్నారు.4న బోరిగాం, 8న బొందిడి, 11న కొరిటికల్, 17న కుమారి, 20న నేరడిగొండ, 24న రాజురా, 30న రోల్మామడ, సెప్టెంబర్ 2న తేజాపూర్, 7న తర్నం, 13న వెంకటాపూర్, 16న వాగ్ధారి, 20న వాంకిడి, 26న వడూర్ గ్రామపంచాయతీల వారీగా తీసుకెళ్లాలన్నారు. రైతులు ఏటీఎం కార్డుతోపాటూ పాస్‌బుక్ తీసుకువస్తే ఏటీఎం సీక్రెట్ నంబర్లు తెలియజేస్తామన్నారు. ఈ విషయాన్ని గమనించి ఆయా తేదీల్లో రైతులు బ్యాంకుకు రావాలని సూచించారు.