సాక్షి,హైదరాబాద్:20 లక్షల మందికి రుణమాఫీ కానే కాలేదన్న వ్యవసాయ మంత్రి ప్రకటనతో సీఎం బండారం మరోసారి బట్టబయలైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.ఈ మేరకు కేటీఆర్ శుక్రవారం(అక్టోబర్4)ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు.
‘వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని విర్రవీగిన ముఖ్యమంత్రివన్నీ డొల్లమాటలేనని ఇంకోసారి తేలిపోయింది.ఓవైపు డిసెంబర్ 9న ఏకకాలంలో చేస్తామని దగా చేశారు.మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి మోసం చేశారు.రూ.2 లక్షల రుణమాఫీ పూర్తయిపోయిందన్న సన్నాసి మాటలు నయవంచన కాక మరేంటి ?
అధికారిక లెక్కల ప్రకారమే.. 20 లక్షల మంది అన్నదాతలకు అన్యాయం జరిగితే అనధికారికంగా రుణమాఫీ కాని రైతులందరో ?? రేవంత్ చేతకానితనం.. అన్నదాతలకు కోలుకోని శాపంగా మారింది’అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: టీజీపీఎస్సీ ఆఫీసు ముందు పోస్టర్ల కలకలం
Comments
Please login to add a commentAdd a comment