రైతు రుణమాఫీ కాస్త జాప్యం అయినా అందరికీ లబ్ధి చేకూరుస్తామని ఆర్ధికశాఖామంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రైతు రుణమాఫీపై అధ్యయనం కోసం నియమించిన కోటయ్య కమిటీ ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమైంది. కోటయ్య కమిటీతో భేటి అనంతరం యనమల మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీపై వివరాల సేకరణకు కొంత సమయం పడుతుందని కమిటీ కోరింది అని అన్నారు.