Yanamala Rama Krishnudu
-
యనమల రామకృష్ణుడికి కృష్ణుడి కౌంటర్
సాక్షి, కాకినాడ: టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ నేత యనమల కృష్ణుడు. టీడీపీకి బలం లేకపోయినా అధికార జులుంతో తుని మున్సిపల్ వైఎస్ చైర్మన్ పదవి గెలవాలని భావించారు. యనమల చెత్త రాజకీయంలో భాగంగానే ఇదంతా జరిగింది అని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ నాయకుడు యనమల కృష్ణుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పది మంది కౌన్సిలర్లతో తుని మున్సిపల్ వైఎస్ చైర్మన్ పదవి గెలవాలని యనమల రామకృష్ణుడు భావించారు. టీడీపీ బలం లేకపోయినా.. అధికారం జులుంతో గెలవాలని అనుకున్నారు. దీనిని బట్టి యనమలకు ప్రజాస్వామ్యం ఎంత వరకు తెలుసు అనేది తుని ప్రజలకు అర్ధమైంది. యనమల స్పీకర్‌గా ఉన్నప్పుడు ఇలాంటి లెక్కలే చూపించి ఎన్టీఆర్‌ను పదవిలో నుంచి దించేశారు. ఆయన కన్నీరు పెట్టుకునేలా చేశారా? అని ప్రశ్నించారు.ఇదే సమయంలో తుని మున్సిపల్ వైఎస్ చైర్మన్ ఎన్నికను నాలుగు సార్లు వాయిదా వేయించినా.. ఇప్పటికీ వైఎస్సార్సీపీ బలం 17 మంది కౌన్సిలర్లు, ఒక మున్సిపల్ చైర్మన్ పదవి ఉంది. పోలీసుల సహకారంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయాలనుకున్నారు. జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా, మున్సిపల్ చైర్మన్ సుధారాణిపై అక్రమ కేసులు పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూశారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
దమ్ముంటే అరెస్ట్ చేయండి.. యనమలకు కృష్ణుడి సవాల్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేత యనమల రామకృష్ణుడుకు ఆయన తమ్ముడు, వైఎస్సార్సీపీ నేత కృష్ణుడు సవాల్ కూడా విసిరారు. రామకృష్ణుడికి దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలన్నారు. తనను అరెస్ట్ చేస్తే రామకృష్ణకు మంచిపేరు వస్తుందన్నారు.వైఎస్సార్సీపీ నేత యనమల కృష్ణుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కూటమి నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని సోషల్ మీడియా కార్యకర్తలను హింసిస్తున్నారు. నా దగ్గర పనిచేసే కుర్రాళ్లను, డ్రైవర్లను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి కేసులు పెడుతున్నారు. నిజంగా యనమల రామకృష్ణకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయాలి. నన్ను అరెస్ట్ చేస్తే యనమలకు మంచి పేరు వస్తుంది.అక్రమ కేసులు, అరెస్ట్‌లకు ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరు. 40 ఏళ్ళు రాజకీయాలు చేశాను.. ఇలాంటి చౌకబారు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నానని చులకనగా చూడొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు. -
మా అన్నకు పదవులే ముఖ్యం
-
Yanamala Family: కుమార్తె కోసం యనమల రామకృష్ణుడి కుట్ర
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు ఒక్కటవుతార’నే సామెత టీడీపీలో చంద్రబాబు, యనమల రామకృష్ణుడి విషయంలో నిజమైనట్టే కనిపిస్తోంది. నమ్ముకున్న నాయకులను చంద్రబాబు నట్టేట ముంచేసిన సందర్భాలు కోకొల్లలు. అనుకున్న పని అయిపోయిందంటే చాలు.. ఇక వారిని దూరం పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇందులో ఆయన మాస్టర్స్ డిగ్రీ చేశారనే విమర్శ ఉంది. చంద్రబాబుతో సావాసమో ఏమో కానీ తునికి చెందిన ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు మాత్రం ప్రస్తుతం అధినేత పంథానే అనుసరిస్తున్నారు. టీడీపీలో నంబర్–2గా, శాసన మండలి ప్రతిపక్ష నేతగా రామకృష్ణుడు వ్యవహరిస్తున్నారు. ఆ స్థాయిలో ఉన్న ఆయన చంద్రబాబు మాదిరిగానే.. వరుసకు సోదరుడయ్యే కృష్ణుడిని టీడీపీ నుంచి వెళ్లగొట్టేందుకు ‘దివ్య’ంగా పొగ పెట్టేస్తున్నారు. నేరుగా పొమ్మనకుండానే ఈ కుటిల రాజకీయం నడిపించేస్తున్నారు. పార్టీకి దూరం చేస్తున్నారిలా.. టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ దాదాపు మూడు దశాబ్దాల పాటు తునిలో యనమల సోదరుల అరాచక పాలన సాగించారనే విమర్శలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఫలితంగా తునిలో ఆ పార్టీ వరుసగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంటూ వచ్చింది. చివరకు టీడీపీ గ్రాఫ్ మరింత దిగజారిపోయిందనే విషయాన్ని ఆ పార్టీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో తన కుమార్తె దివ్యను తుని నుంచి టీడీపీ తరఫున రామకృష్ణుడు బరిలోకి దింపారు. ఆమెకు అడ్డంకిగా ఉన్నారనే అక్కసుతో సోదరుడైన కృçష్ణుడిని పారీ్టకి దాదాపు దూరం చేసే ఎత్తులు వేస్తున్నారు. ► నియోజకవర్గంలో ఇంత కాలం కృష్ణుడి వెన్నంటి నడిచిన మండల స్థాయి నాయకులు ఒక్కొక్కరినీ ఆయనకు దూరం చేస్తూ, ఏకాకిని చేశారు. ► రాష్ట్ర పార్టీ అంతర్గత వ్యవహారాల్లో రామకృష్ణుడిదే పెత్తనమైనా.. తుని టీడీపీలో మాత్రం కృష్ణుడి హవాయే నడిచేది. కుమార్తె దివ్యకు టిక్కెట్టు ఇప్పించుకున్న రామకృష్ణుడు.. టీడీపీ తెరపై కృష్ణుడు కనిపించకూడదనే నిశ్చయానికి వచ్చారు. దివ్యను తుని టీడీపీ అభ్యరి్థగా ప్రకటించిన మరుక్షణం నుంచే కృష్ణుడిని పారీ్టకి దూరం చేసే ప్రయత్నాలను తెర వెనుక ముమ్మరంగా సాగిస్తున్నారు. ► కృష్ణుడికి అత్యంత సన్నిహితుడైన మాజీ ఎంపీపీ పోల్నాటి శేషగిరిరావును దూరం పెట్టాలని కృష్ణుడికి చెప్పకనే చెప్పారు. ఆ తరువాత కృష్ణుడు ప్రచారంలో తన వెంట ఉండటానికి వీలు లేదని దివ్య కరాఖండీగా చెప్పారని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. కృష్ణుడు ఉంటే ప్రచారానికి వెళ్లబోనని ఆమె ఇటీవల తండ్రి రామకృష్ణుడికి తెగేసి చెప్పారనే చర్చ పార్టీ నేతల మధ్య జరుగుతోంది. ఆయన తన వెంట ప్రచారంలో తిరిగితే పడే నాలుగు ఓట్లు కూడా పడవనే లెక్కలతోనే దివ్య ఆ విధంగా వ్యవహరించారనే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు కొన్ని రోజులుగా కృష్ణుడు పార్టీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. కృష్ణుడి ఏలుబడిలో అరాచకాలు, దోపిడీలు, కేసులు పార్టీపై ప్రభావితం చూపుతాయనే ఉద్దేశంతోనే ఆయన దూరంగా ఉండాలని రామకృష్ణుడు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ► అనేక అవినీతి ఆరోపణలతో వైఎస్సార్ సీపీ బయటకు గెంటేసిన వెంకటేషకు టీడీపీలో పెత్తనం అప్పగించడం ద్వారా కృష్ణుడిని దూరం పెట్టడానికి రామకృష్ణుడు వ్యూహాత్మకంగానే వ్యవహరించినట్టు కనిపిస్తోంది. కృష్ణుడి వల్లనే పార్టీ నష్టపోయిందనే సాకుతో ఆయనను ఎన్నికల బరి నుంచి తప్పించడంలో రామకృష్ణుడి వ్యూహం ఫలించిందని అంటున్నారు. ► 30 ఏళ్లుగా పార్టీ కోసం అహర్నిశలూ శ్రమించినందుకు తగిన శాస్తే జరిగిందని సహచరుల వద్ద కృష్ణుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేరుకుంపటికి యత్నాలు తాము ఏం చేసినా అన్న రామకృష్ణుడి కోసమేనని ఆయనకు తెలియనిది కాదని, అయినప్పటికీ తనపట్ల కత్తి కట్టినట్టు వ్యవహరిస్తున్నారని కృష్ణుడు మండిపడుతున్నారు. సీటు కాదన్నా పార్టీ కోసం ఓపికగా భరించామని, ఇప్పుడు ప్రచారంలో కూడా వద్దని చెబుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ఆయన వర్గం ప్రశి్నస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు ఇంతలా అవమానించిన రామకృష్ణుడి వెంట తిరగాల్సిన అవసరం లేదని చెబుతూ.. వేరుకుంపటి పెట్టేందుకు కృష్ణుడి వర్గం సన్నద్ధమవుతోంది. వాస్తవానికి దివ్యను పార్టీ అభ్యరి్థగా ఎంపిక చేయడాన్ని మొదట్లోనే కృష్ణుడి వర్గం వ్యతిరేకించింది. ఇప్పుడు పారీ్టకి దూరం చేయాలనే రామకృష్ణుడు ఎత్తులను ఎదుర్కొనే దిశగా భవిష్యత్ నిర్ణయం కోసం మంతనాలు జరుపుతున్నారు. కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు తునిలో సోమవారం అనుచరులతో భేటీ కావాలని కృష్ణుడు భావించారు. ఈ మేరకు అందరికీ పిలుపులు కూడా వెళ్లాయి. కారణాంతరాలతో చివరి నిమిషంలో సమావేశాన్ని మరో రెండు రోజులు వాయిదా వేశారు. ఏం జరుగుతుందో కొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట... టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు
-
యనమల సాక్షిగా.. తెలుగు తమ్ముళ్ల తన్నులాట!
తుని రూరల్: నూతన సంవత్సర వేడుకలను అట్టహాసంగా జరుపుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన వేదికపై తెలుగు తమ్ముళ్లు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకుని బాహాబాహీకి దిగిన ఘటన సోమవారం కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం శివారు గెడ్లబీడు వద్ద చోటు చేసుకుంది. తుని నియోజకవర్గ స్థాయిలో 2024 నూతన సంవత్సర వేడుకలను టీడీపీ నాయకులు సాయి వేదికలో ఏర్పాటు చేశారు. వేదికపై యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు, యనమల దివ్య (రామకృష్ణుడి కుమార్తె) ఉండడంతో నాయకులు, కార్యకర్తలు వరుస క్రమంలో వెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొంత సమయం తర్వాత దివ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. తొండంగి మండలం నుంచి అనుచరులతో తరలివచ్చిన యనమల రాజేష్.. రామకృష్ణుడిని కలుసుకుని శుభాకాంక్షలు చెప్పేందుకు క్యూలైన్ తప్పించుకుని వేదిక పైకి వెళుతుండగా.. వరుసగా రావాలంటూ కృష్ణుడి వర్గీయులు అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహం చెందిన రాజేష్ వర్గీయులు ఒక్కసారిగా చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాజేష్, కృష్ణుడి వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాల వారు పరస్పరం ఘర్షణ పడుతూ కొట్టుకున్నారు. పరిస్థితి విషమిస్తుండటంతో యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు ఇరు వర్గీయులను మందలించి, శాంతింపజేశారు. ఇదీ చదవండి: పేట్రేగిన టీడీపీ–జనసేన మూకలు..మంత్రి రజిని కార్యాలయంపై రాళ్ల దాడి -
యనమలపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు
-
ఏపీ అప్పులు.. గంటా శ్రీనివాసరావు, యనమలపై మంత్రి బుగ్గన సెటైర్లు..!
-
యనమల ఓ రాజకీయ శకుని: దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ: టీడీపీ నేత యనమల రామకృష్ణుడిపై మంత్రి దాడిశెట్టి రాజా సీరియస్ అయ్యారు. యనమల ఓ రాజకీయ శకుని అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్రమ కేసులు పెట్టించడం యనమల సోదరులకు పైశాచిక ఆనందం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, దాడిశెట్టి రాజా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎవరిపై కేసులు పెడదామా అని యనమల ఆలోచిస్తాడు. ఎన్నికొలొస్తున్నాయనే తునిలో యనమల మోకాళ్ల యాత్ర చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లోనూ యనమలకు ఓటమి ఖాయం. 1989లో తునిలో వంగవీటి విగ్రహం పెడితే యనమల సోదరులు పొడిపించేశారు. గత 40 ఏళ్ళుగా యనమలకు తుని ప్రజలు గుర్తుకు రాలేదు. బెంగళూరులో ఉండే యనమల కుమార్తె తుని వచ్చి రాజకీయం చేస్తానంటే కుదరదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: విశాఖలో నోట్ల మార్పిడి కలకలం.. జనసేన నాయకుడి అనుచరుడి అరెస్ట్ -
ఆ దమ్ము చంద్రబాబుకు ఉందా: మంత్రి దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ: యనమల రామకృష్ణుడి మాటలను తుని ప్రజలు విశ్వసించడం లేదని, చివరికి ఆయనకు ఇళ్లు కూడా అద్దెకు ఇవ్వడం లేదని మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. ‘‘ఆదివారం ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి ప్రాథమిక వైద్యశాలలో వైద్యులు లేరంటున్నారు.. తుని పీహెచ్సీలో వైద్యులు లేరని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా’’ అని మంత్రి సవాల్ విసిరారు. ‘‘సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలతోనే మళ్లీ ఎన్నికలకు వెళ్తాం. 2014-2019 వరకు వరకు తన పరిపాలన చూసి ఓటేయండి అనే ధైర్యం చంద్రబాబుకు ఉందా’’ అంటూ మంత్రి ప్రశ్నించారు. -
యనమల వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు.. మంత్రి దాడిశెట్టి రాజా కౌంటర్
సాక్షి, తుని (కాకినాడ జిల్లా): యనమల రామకృష్ణుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఏపీ రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘ఏపీ విద్యా విధానాలను కేంద్ర బడ్జెట్లోనూ ప్రస్తావించారు. అనేక విషయాల్లో రాష్ట్రానికి గుర్తింపు లభించింది. నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చాం. విద్య, వైద్య రంగాలకు అత్యధికంగా ఖర్చు చేస్తున్నాం’’ అని మంత్రి అన్నారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో టాయిలెట్లు కూడా సరిగాలేవు. నాడు-నేడు కింద రూపురేఖలు మార్చిన స్కూళ్లు గురించి తెలుసుకో. యనమల స్వగ్రామంలోనూ నాడు-నేడు పనులు జరుగుతున్నాయి. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది’’ అని దాడిశెట్టి రాజా హితవు పలికారు. ‘‘యనమల వస్తే నియోజకవర్గంలో స్కూళ్లకు తీసుకెళ్తా. ఆయన అసందర్భ ప్రేలాపనలు పేలుతున్నారు. హైస్కూల్ వస్తే మన పొలాల్లో పనిచేసేందుకు ఎవరూ ఉండరన్నావు. యనమల విద్యా వ్యవస్థ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది’’ అని మంత్రి రాజా అన్నారు. చదవండి: నారా లోకేష్ ఫ్లాప్ షో.. యువగళం ‘గండాలు’ -
యనమలకు పెద్ద చిక్కొచ్చిపడిందే.. ఇప్పుడెలా? యనమలా?
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో యనమల సోదరుల మధ్య మొదలైన రాజకీయ వైరం హట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే రెండు సార్లు తుని నుండి ఓటమి చెందిన యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు.. వచ్చే ఎన్నికల్లో తనకే మళ్ళీ సీటు ఇప్పించాలని పట్టుబడుతున్నారు. ఐతే వచ్చే ఎన్నికల్లో 30 శాతం సీట్లు యువతరానికే ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో యనమల తన కుమార్తె దివ్యకు సీటు కన్ఫాం చేసుకున్నారు. అన్న వ్యవహారం రుచించని యనమల కృష్ణుడు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇటీవల తుని నియోజకవర్గంలో కార్యకర్తలు, నేతలతో యనమల రామకృష్ణుడు ఒక సమావేశం నిర్వహించారు. దీనికి ముందు రోజే కృష్ణుడు తన అనుచర గణానికి కాల్ చేసి...వచ్చే ఎన్నికల్లో కూడా సీటు మళ్ళీ తనకే ఇవ్వాలంటూ తన అన్న ముందు చెప్పాలని ప్రిపేర్ చేశారు. ఐతే ఆ ఫోన్ కాల్ సంభాషణ లీక్ కావడంతో రాజకీయంగా పెద్ద దుమారమే లేచింది. నీ సంగతి బాబుకు చెబుతా ఆ మర్నాడు జరిగిన సమావేశంలో అన్న యనమల రామకృష్ణుడికి తమ గళాన్ని యాజ్ టీజ్‌గా వినిపించారు తమ్ముడు కృష్ణుడి అనుచరులు. దీంతో కాస్తంత అసహనానికి గురయిన యనమల.. విషయాన్ని అధిష్టానం వద్దకు తీసుకువెళ్ళారు. కాని ఇదంతా యనమల ఆడిస్తున్న మైండ్ గేమ్ అనే వాదనలు టీడీపీ వర్గాల్లో వినిపించాయి. ఎందుకంటే.. ఈసారి తుని సీటు యనమల కుటుంబానికి కాకుండా బయట వ్యక్తులకు ఇవ్వాలని లోకేష్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగింది. అదే సమయంలో తుని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రాజా ఆశోక్‌బాబు కూడా చంద్రబాబును కలిసి వచ్చారు. ఈ ఫోటోలు బయటకు రావడంతో యనమల ఒక్కసారిగా అవాక్కయ్యారట. ఇప్పటి వరకు టీడీపీలో నెంబర్ టూ స్ధానంలో ఉన్న యనమలకు తన నియోజకవర్గంలో జరిగిన ఈ పరిణామం తెలియకపోవడంతో కంగు తిన్నారని తెలుగు తమ్ముళ్ల ప్రచారం. చదవండి: సీఎం జగన్ స్పష్టమైన సంకేతం.. ఇక తగ్గేదేలే! దీంతో యనమల తుని సీటు బయట వ్యక్తులకు పోకుండా ఇలా అన్నదమ్ముల మధ్య వైరం వచ్చినట్లు డ్రామా నడిడించి రక్తి కట్టించారని రాజకీయ మేధావులు అభిప్రాయ పడ్డారు. ఇదిలా ఉంటే అసలు రాజా అశోక్ బాబును చంద్రబాబుతో కలిపించిందే కృష్ణుడు అని మరో ప్రచారం ఉంది. అన్నకు వ్యతిరేకంగా కృష్ణుడు ఈ పని చేశాడని నియోజకవర్గంలో కొందరు కోడై కూస్తున్నారు. టికెట్ ఇవ్వకపోతే అంతే సంగతులు ఈ పరిణామాలన్నీ తుని తెలుగుదేశం పార్టీలో కలకలం రేపగా.. తాజాగా యనమల సోదరుల మధ్య మరో అంశం తెరపైకి వచ్చింది. ఈ సారి సీటు తనకు ఇవ్వకపోతే తన కుమారుడు శివరామకృష్ణకు ఇవ్వాలని కృష్ణుడు గట్టిగా పట్టుపడుతున్నారట. ప్రస్తుతం శివరామకృష్ణ నియోజకవర్గంలో తెలుగుదేశం యువజన విభాగం అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అధిష్టానం తుని సీటు యువతకే ఇవ్వాలనుకుంటే తన కుమారుడు పేరే పెట్టాలని అన్న యనమలకు ఖరాఖండీగా చెప్పేశారట కృష్ణుడు. దీంతో అన్న యనమలకు ఏం చేయాలో అర్ధం కాని పరిస్ధితి ఎదురయిందని అంటున్నారు వారి అనుచరులు. మొత్తం మీద టీడీపీలో తొలితరం నాయకుడైన యనమల రామకృష్ణుడికి తమ్ముడు రూపంలో చిక్కులు ఎదురుకావడంతో తన కుమార్తె రాజకీయ భవిష్యత్‌పై పెట్టుకున్న ఆశలు ఏమవుతాయా అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
యనమల ఓ సైకో : మంత్రి దాడిశెట్టి రాజా
-
యనమలకు ఆ విషయం తెలియకపోవడం బాధాకరం
ఏయూక్యాంపస్: రాష్ట్రాలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్‌ను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందని, దీనిలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉండదని, ఈ విషయం మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడికి తెలియకపోవడం బాధాకరమని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి అన్నారు. దీనిపై క్లారిటీ కావాలనుకుంటే యనమల కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రధాని సభ ఏర్పాట్లను పరిశీలించడానికి శనివారం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పుల దిశగా ఏపీ వెళుతోందన్న యనమల మాటలను ఖండించారు. యనమల వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో అప్పులు, ఇప్పటి అప్పులు పోల్చి చూసుకోవాలని అన్నారు. అనవసరమైన రాజకీయ విమర్శలు చేయడం కన్నా వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు. ఇదిలాఉండగా...న్యాయస్థానంలో అడ్డంకులు తొలగిన నేపథ్యంలో భోగాపురం ఎయిర్‌పోర్టుకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రధానమంత్రి కార్యాలయానికి ప్రతిపాదన పంపినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. పీఎంవో కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఏడు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన కూడా జరుగుతుందని చెప్పారు. -
అప్పులు, ప్రగతిపై అడ్డగోలుగా అబద్ధాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులు, పారిశ్రామిక ప్రగతితో పాటు వ్యవసాయం, విద్య, వైద్య రంగాలపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఖజానాను పూర్తిగా ఖాళీ చేయడమే కాకుండా భారీ అప్పులతో ఏకంగా రూ.40 వేల కోట్లు బకాయిలు పెట్టి దిగిపోయిన యనమల రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లుతూ బుకాయించటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. బుధవారం సచివాలయంలో బుగ్గన మాట్లాడారు. ► నీతి ఆయోగ్ 10 అంశాలతో నివేదిక ఇస్తే తనకు అనుకూలమైన ఒక అంశానికి చెందిన అంకెలను తీసుకుని యనమల తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. సున్నా వడ్డీని రైతులకు చెల్లించకుండా టీడీపీ సర్కారు రూ.784.71 కోట్ల బకాయిలు పెడితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ మొత్తాన్ని 39.06 లక్షల మంది రైతులకు చెల్లించింది. ఇన్పుట్ సబ్సిడీ కింద ఇప్పటికే రూ.1795.45 కోట్లు చెల్లించాం. 8.76 లక్షల మంది కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా రూ.5,915 కోట్ల పంట రుణాలు ఇప్పించాం. ► విద్య, వైద్య రంగాల్లో నాడు – నేడు కింద చేపట్టిన పనులను యనమల తుని నియోజకవర్గానికి వెళ్లి పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయి. నాడు–నేడుతోపాటు అమ్మఒడి, గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, సంపూర్ణ పోషణ తదితరాలకు మూడేళ్లలో రూ.53,337 కోట్లు వ్యయం చేశాం. జాతీయ ఆరోగ్య సూచికలో 2017–18లో ఏపీ నాలుగో స్థానంలో ఉండగా ఇవాళ 10వ స్థానంలో ఉందని యనమల పచ్చి అబద్ధాలాడుతున్నారు. 2019–20లో ఏపీ 4వ స్థానంలో ఉంది. వైద్య రంగంలో 2017–18లో 65.13 స్కోర్‌తో నాలుగో స్థానంలో ఉంటే 2019–20లో 69.95 స్కోర్‌తో మార్కులు పెరిగాయి. మా ప్రభుత్వం 104, 108 వాహనాలు 1,108 కొనుగోలు చేసింది. ► సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 2018–19లో 68 మార్కులుంటే 2020–21లో 77 మార్కులకు పెరిగాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి విషయంలో యనమల తనకు అనుకూలమైన లెక్కలు తీసుకుని వక్రీకరిస్తున్నారు. 2018–19లో తొలి అడ్వాన్స్ అంచనాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.6,80,332 కోట్లుగా అంచనా వేయగా కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల శాఖ ప్రకటించిన మూడో రివైజ్ట్ అంచనాల మేరకు రూ.6,26,614 కోట్లకు తగ్గింది. అంటే 11 శాతం నుంచి వృద్ధి 5.66 శాతానికి తగ్గింది. మరి ఇది ఎవరి నిర్వాకం? ఎవరిని తప్పుబట్టాలి? ► టీడీపీ హయాంలో అప్పులు భారీగా పెరిగాయి. టీడీపీ పాలనలోవార్షిక సగటు అప్పుల వృద్ధి 19.44 శాతం కాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అప్పుల్లో సగటు వార్షిక వృద్ధి 15.46 శాతం మాత్రమే. కోవిడ్ వల్ల రెండేళ్ల పాటు ఇబ్బందులు ఎదురైనా ఆర్థికంగా మెరుగ్గానే ఉన్నాం. ► నీటిపారుదల, వ్యవసాయం గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదు. టీడీపీ హయాంలో పది లక్షల ఎకరాలకు అదనంగా నీరు ఇచ్చినట్లు అవాస్తవాలు చెబుతున్నారు. పోలవరాన్ని పక్కనపెట్టి కమీషన్ల కోసం పట్టిసీమ చేపట్టారు. పోలవరం జాప్యానికి టీటీపీ సర్కారు నిర్వాకమే కారణం. టీడీపీ హయాంలో రహదారుల నిర్మాణానికి ఏడాదికి రూ.2,110 కోట్లు వ్యయం చేస్తే ఇప్పుడు రూ.2,800 కోట్లు వెచ్చిస్తున్నాం. ► టీడీపీ హయాంలో సగటున ఏడాదికి రూ.11,994 కోట్ల పెట్టుబడులు వస్తే ఇప్పుడు రూ.13,201 కోట్లు వస్తున్నాయి. పెద్ద, మెగా పరిశ్రమలు 107 రాగా ఎంఎస్ఎంఈలు 1,06,249 యూనిట్లు వచ్చాయి. వాటి పెట్టుబడి రూ.14,656 కోట్లు. మరో 57 ప్రాజెక్టులు రూ.91,243 కోట్ల పెట్టుబడితో పురోగతిలో ఉన్నాయి. నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలు రూ.1,06,800 కోట్లతో నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 63,509 ప్రాజెక్టుల పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. -
యనమలపై మంత్రి బుగ్గన మండిపాటు.. రాళ్లేయడమే లక్ష్యమా?
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై రాళ్లు విసరడమే లక్ష్యంగా విపక్షం వ్యవహరిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. రైతులు, ప్రజల అవసరాలను తీరుస్తుంటే టీడీపీ నేత యనమల తదితరులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. నిన్నటి దాకా శ్రీలంక అంటూ దుష్ప్రచారం చేసి ఇప్పుడు నెజీరియా, జింబాబ్వే అంటూ యాగీ చేస్తున్నారని దుయ్యబట్టారు. పిల్లి శాపాలకు ఉట్లు తెగవని యనమలకు సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై టీడీపీ ఆరోపణలను ఖండిస్తూ బుగ్గన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇబ్బందులున్నా వెనుకంజ వేయలేదు.. సానుకూల దృక్పథం చంద్రబాబు బృందం డిక్షనరీలోనే లేదు. కోవిడ్‌తో ప్రపంచమంతా అల్లాడిన 2020–21 ఆర్థిక పరిస్థితి గురించే యనమల పదేపదే మాట్లాడుతుంటారు. కోవిడ్‌తో జనజీవితం అతలాకుతలం అయింది. ఆదాయ వనరులకు గండి పడింది. కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం సుమారు రూ.8 వేల కోట్లు తగ్గింది. మహమ్మారి కట్టడి, వైద్య సదుపాయాలు, టెస్టింగ్, కోవిడ్ కేర్ సెంటర్ల నిర్వహణ, ఉచిత బియ్యం సరఫరాకు ప్రభుత్వం అదనంగా రూ.7,130 కోట్లు వ్యయం చేసింది. ఇలాంటి పరిస్థితిలోనూ నవరత్నాల అమలులో ఎక్కడా వెనకడుగు వేయలేదు. నాడు అసాధారణ అప్పులు.. ఐదేళ్ల టీడీపీ హయాంలో అప్పులు 19.6% పెరిగితే వైఎస్సార్సీపీ పాలనలో మూడేళ్లలో పబ్లిక్ సెక్టార్ యూనిట్లు తీసుకున్న అప్పులతో కలిపి (రెండేళ్లు కోవిడ్ కష్టాలున్నప్పటికీ) 15.5% మాత్రమే పెరిగాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేకున్నా 19.6% వృద్ధితో అప్పులు చేశారు. గత సర్కారుతో పోలిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఆర్ధిక నిర్వహణ ఎంతో మెరుగ్గా ఉంది. డీబీటీతో రూ.57,512 కోట్లు రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు కరోనా వేళ ఉపాధి కోల్పోయి ఇళ్ల నుంచి కదలలేకపోయారు. వారి ప్రాణాలను కాపాడుకుంటూనే డీబీటీ ద్వారా నేరుగా రూ.57,512 కోట్లు పారదర్శకంగా జమ చేసి ఆదుకున్నాం. ప్రభుత్వం ఇంత మొత్తాన్ని ప్రజలకు అందించడం కోవిడ్ సమయంలో ఎక్కడా లేదు. అయినా ఆర్థిక పరిస్థితి దిగజారిందంటూ యనమల పదేపదే బురద చల్లుతున్నారు. కరోనా చెలరేగిన 2020–21 గురించి కాకుండా 2021–22 గురించి టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడరు? ఆ నిర్వాకాలతోనే ఆంక్షలు గత సర్కారు ఆర్థిక ఉల్లంఘనలు, అవకతవకలు కాగ్ నివేదికలో స్పష్టంగా ఉన్నాయి. టీడీపీ పాలనలో ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు విరుద్ధంగా సుమారు రూ.17,000 కోట్లు అదనంగా అప్పు చేయటాన్ని కేంద్ర ఆర్థిక శాఖ గుర్తించి తీవ్రంగా తప్పుబట్టింది. గత సర్కారు నిర్వాకాలను కారణంగా చూపిస్తూ ఇప్పుడు రుణ పరిమితిపై ఆంక్షలు విధిస్తోంది. యనమలవి పచ్చి అబద్ధాలు రాష్ట్ర అప్పులు రూ.8,00,000 కోట్లు అనే లెక్కలు యనమలకు ఎక్కడ నుంచి వచ్చాయో మాకు తెలియదు. అది పచ్చి అబద్ధం. గణాంకాలతో వాటిని రుజువు చేయగలరా? పబ్లిక్ సెక్టార్ యూనిట్లు తీసుకున్న వాటితో కలిపి రాష్ట్ర అప్పు రూ.1,71,176 కోట్లు మాత్రమే. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి అసెంబ్లీలో వెల్లడించారు. 2019లో టీడీపీ సర్కారు దిగిపోతూ పెండింగ్‌లో పెట్టిన రూ.40,000 కోట్ల బిల్లులు పెనుభారంగా మారాయి. విద్యుత్తు కొనుగోలు, పంపిణీ సంస్థలకు సంబంధించిన అప్పు రూ.46,200 కోట్ల మేర అదనంగా పెంచేసి విద్యుత్తు రంగాన్ని కోలుకోలేని రీతిలో దెబ్బతీశారు. దురదృష్టకరమైన రాష్ట్ర విభజన, టీడీపీ అస్తవ్యస్త పాలన, కోవిడ్ వల్ల దెబ్బతిన్న రాష్ట్ర అర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నాం. మెరుగ్గా మూలధన వ్యయం 2014–19లో మూలధన వ్యయం రూ.15,227 కోట్లు కాగా వైఎస్సార్సీపీ పాలనలో సగటున రూ.18,362 కోట్లు ఉంది. మూలధన వ్యయాన్ని ప్రధానంగా విద్య, ఆరోగ్యంపై వెచ్చిస్తున్నాం. అప్పులపై వడ్డీలు – వడ్డీ రేట్లు టీడీపీ హయాంలో సగటున 8.49% వడ్డీలతో అప్పులు తెస్తే మా ప్రభుత్వం 6.96 శాతానికే అప్పు తెచ్చింది. టీడీపీ సర్కారు ఎడాపెడా చేసిన అప్పులకు ఇప్పుడు వడ్డీలు కడుతున్నాం. గత సర్కారు రకరకాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అప్పుల రూపంలో ప్రజాధనాన్ని పక్క దోవ పట్టించలేదా? రైతు సాధికార సంస్థ, ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, పవర్ సెక్టార్, డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ల పేరుతో టీడీపీ సర్కారు అప్పులను దారి మళ్లించడం నిజం కాదా? వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయికీ లెక్క ఉంది. నేరుగా రూ.1,70,000 కోట్లను ప్రజలకు పారదర్శకంగా అందచేసింది. నిబంధనల ప్రకారమే.. ఆయా ప్రభుత్వాల ఆర్థిక అవసరాలను బట్టి ఎన్నిసార్లైనా వేస్ అండ్ మీన్స్కు వెళ్లవచ్చు. ఆది ఆర్బీఐ కల్పించిన సదుపాయం. మేం నిబంధనలకు విరుద్ధంగా వెళ్తే ఎందుకు అనుమతిస్తుంది? ఓవర్ డ్రాఫ్ట్ అదనపు అప్పు కాదు. 2018 –19లో ఒకసారికి రూ.1,510 కోట్లు ప్రకారం 144 రోజులకు ఓడీకి అనుమతిస్తే రూ.19,654 కోట్లు తీసుకున్నారు. అంటే 107 రోజులు (74.30%) ఓడీ పొందారు. 2019 20లో ఒకసారికి రూ.1,510 కోట్లు ప్రకారం 144 రోజులు ఓడీకి అనుమతిస్తే రూ.17,631 కోట్లు తీసుకున్నాం. అంటే 57 రోజులు (39.58%) ఓడీ పొందాం 2020 –21లో ఒకసారికి రూ.2,416 కోట్లు ప్రకారం 200 రోజులు ఓడీకి అనుమతిస్తే రూ.31,812 కోట్లు తీసుకున్నాం. అంటే 103 రోజులు (51.50%) ఓడీ పొందాం. మరి యనమల చెబుతున్న కాకి లెక్కలు (330 రోజులు) ఎక్కడ నుంచి వచ్చాయి?. -
టిడిపి సీనియర్ నేత యనమల లేఖపై జిల్లా ప్రజల ఆగ్రహం
-
రూల్ ప్రకారమే రుణాలు
సాక్షి, అమరావతి: రాజ్యాంగానికి, నిబంధనలకు లోబడే రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుంటోందని, ఎక్కడా వాటిని ఉల్లంఘించలేదని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ స్పష్టం చేశారు. వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్‌కు ఆర్బీఐ నిబంధనల మేరకే ప్రభుత్వం వెళ్లిందన్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలపై ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే వ్యవహరించామని, ఇందులో ఎక్కడా తప్పు లు జరగలేదన్నారు. వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లడం, కార్పొరేషన్ల ద్వారా పూచీకత్తు ఇచ్చి రుణాలు తీసుకోవడాన్ని నేరంగా టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చిత్రీకరించడం దారుణమని, సీబీఐ విచారణ కోరడం విడ్డూరమన్నారు. యనమల ఆర్థిక మంత్రిగా ఉండగా వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో భారీగా రుణాలు తీసుకున్నారని, వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్‌కు కూడా వెళ్లారని గుర్తు చేశారు. ఆయన హయాంలో తీసుకుంటే ఒప్పు.. ఇప్పుడు తీసుకుంటే నేరమా? అని ప్రశ్నించారు. వీటి గురించి గత సర్కారు హయాంలో నోరెత్తని కొన్ని మీడియా సంస్థలు ఇప్పుడు పుంఖానుపుంఖాలుగా కథనాలు ఎందుకు ప్రచురిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలు, ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని చెప్పారు. ఈమేరకు బుధవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలివీ.. ► రాష్ట్ర ప్రభుత్వం ఏటా వివిధ సంస్థల నుంచి రూ.లక్ష కోట్లకు పైగా బడ్జెట్ బయట రుణాలు తీసుకుంటున్నట్లు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రుణాలకు పూచీకత్తు ఇస్తుంది. ఇదేమీ కొత్త కాదు. రాజ్యాంగ విరుద్ధమూ కాదు. ప్రభుత్వ గ్యారెంటీ ఇవ్వడానికి కేంద్రం అనుమతి అవసరం లేదు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పత్రాల్లో చూస్తే ప్రభుత్వ గ్యారెంటీతో వివిధ సంస్థల ద్వారా రూ. 1,35,292.51 కోట్లు రుణం తీసుకున్నట్లుంది. ► విభజన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీతో వివిధ సంస్థల ద్వారా చేసిన అప్పు రూ.14,028.22 కోట్లు కాగా 2014–19లో టీడీపీ సర్కారు ఏకంగా రూ.63,664.64 కోట్లకు పెంచేసింది. యనమల ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో బడ్జెట్ బయట అప్పులు 450 శాతం పెరిగాయి. పౌర సరఫరాల సంస్థ ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో ఏకంగా రూ.20,000 కోట్లు అప్పు చేశారు. ► టీడీపీ హయాంలో ప్రభుత్వ రంగ సంస్ధల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.63,664.64 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.1,17,503.08 కోట్లకు చేరాయి. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా చేసే అప్పులను ఎక్కడా దాచడం లేదు. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ పత్రాల్లో వివరాలు స్పష్టంగా ఉన్నాయి. ► ఓ పత్రిక అప్పులపై అవాస్తవాలను ప్రచురించింది. రాష్ట్రం మొత్తం అప్పులు రూ. 6,26,836 కోట్లుగా పేర్కొనడం అవాస్తవం. రాష్ట్ర అప్పులు రూ.4,13,000 కోట్లు కాగా అధికారికంగా విడుదల చేసిన అంచనాల మేరకు అది రూ.3,90,670 కోట్లే. ప్రభుత్వ గ్యారెంటీ అప్పులు రూ.1,38,603.58 కోట్లుగా పేర్కొనడంలో కూడా నిజం లేదు. ► గత సర్కారు హయాంలో అప్పులు ఏకంగా 20.39 శాతం మేర పెరగ్గా ఇప్పుడు కేవలం 15.46 శాతమే పెరిగాయి. కోవిడ్ కారణంగా ఒకపక్క ఆదాయం క్షీణించగా మరో పక్క వ్యయం పెరిగింది. ఎన్ని ఇబ్బందులున్నా పారదర్శకంగా నగదు బదిలీతో పేదలను ప్రభుత్వం ఆదుకుంది. సామాజిక, ఆర్థిక ప్రగతి, మానవ వనరుల వృద్ధి వ్యయాన్ని కూడా అభివృద్ధిగానే పరిగణించాలి. ► వేస్ అండ్ మీన్స్కు 2018–19లో ఆర్బీఐ 144 రోజులు అనుమతిస్తే గత సర్కారు 107 రోజులు వినియోగించుకుంది. 2020–21లో కోవిడ్ సమయంలో ఆర్బీఐ 200 రోజులు అనుమతిస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 103 రోజులే వినియోగించుకుంది. వేస్ అండ్ మీన్స్ను ఆర్బీఐ నిబంధనలకు లోబడి తక్కువ వడ్డీకి వినియోగించుకోవడంలో తప్పులేదు. ► దేశ స్థూల ఉత్పత్తిలో రాష్ట్రం వాటా చంద్రబాబు హయాంలో సగటున 4.45 శాతం ఉండగా ఇప్పుడు కోవిడ్ సమయంలోనూ ఏపీ వాటా 5.01 శాతంగా ఉంది. ► కాగ్ ప్రస్తావించిన రూ.48,384 కోట్లు సర్దుబాటు మాత్రమే.. అది వ్యయం కాదు. ఇందులో కేవలం రూ.224.73 కోట్ల మేర మాత్రమే నగదు లావాదేవీలు జరిగాయి. మిగతా మొత్తం అంతా సర్దుబాటు మాత్రమే. దీనిపై కాగ్‌కు వివరణ ఇచ్చాం. గత సర్కారు అసంపూర్తిగా వదిలేసిన సీఎఫ్ఎంఎస్ వ్యవస్థే దీనికి కారణం. ► 2015–16లో టీడీపీ హయాంలో ఏకంగా 14,721 కొత్త వ్యక్తిగత డిపాజిట్ ఖాతాలను తెరిచారని, దీనిపై రికార్డులు లేవని కాగ్ ఆడిట్లో తప్పుబట్టింది. 42,999 వ్యక్తిగత డిపాజిట్ల నుంచి రూ.41,001.13 కోట్ల మేర చెల్లింపులు జరిగాయని, ఈ ఖాతాలు, ఖర్చులకు సంబంధించి ప్రామాణికతను పరిశీలించేందుకు సరైన యంత్రాంగం లేదని కాగ్ ఆడిట్ నివేదికలో స్పష్టంగా పేర్కొనడం టీడీపీ నేతలకు, వారి అనుకూల మీడియాకు కనపడదా? -
అసెంబ్లీకి వెళ్తాం..చంద్రబాబు మాత్రం హాజరుకారు
సాక్షి, అమరావతి: వచ్చే శాసన సభ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతామని టీడీపీ నేతలు కింజరాపు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు తెలిపారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం సభకు రారని, మిగిలిన సభ్యులంతా హాజరుకావాలని నిర్ణయించినట్లు చెప్పారు. హైదరాబాద్ నుంచి చంద్రబాబు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో గురువారం జరిగిన జూమ్ కాన్ఫరెన్స్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శనివారం వారు మీడియాతో మాట్లాడారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే సీఎంగానే సభలో అడుగుపెడతానని చంద్రబాబు చెప్పిన మాటకు ఆయన కట్టుబడే ఉన్నారని, ఆయన సభకు రారని తెలిపారు. అమరావతి, పోలవరం, హోదా తదితర సమస్యలను లేవనెత్తుతామన్నారు. రాజధానిపై టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదని హైకోర్టు స్పష్టంగా తీర్పిచ్చినా వైఎస్సార్సీపీ సభ్యులు కొత్తగా చట్టం తీసుకొస్తామంటున్నారని విమర్శించారు. సమస్యలను చర్చించేందుకు వస్తున్నామని యనమల స్పష్టం చేనశారు. చివరి వరకూ బాబు సాగదీత అసెంబ్లీకి హాజరయ్యే విషయంపై చంద్రబాబు ఎప్పటిలానే నాన్చుడు ధోరణి అవలంబించారు. వాస్తవానికి 10 రోజుల క్రితమే తన ఎమ్మెల్యేలను సభకు పంపాలని నిర్ణయించారు. కానీ, ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా చర్చలు జరుపుతున్నట్లు లీకులిచ్చారు. ఒక దశలో గైర్హాజరవుతున్నట్లు లీకులిచ్చారు. చివరికి హాజరవుతున్నట్లు ప్రకటించారు. -
‘తప్పుడు లెక్కలతో ప్రజలను బురిడీ కొట్టించలేరు’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వృద్ధిరేట్లపై టీడీపీవి తప్పుడు లెక్కలని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కరోనాకు ముందు ఏడాది 2019-2020లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 7.23 శాతంగా ఉన్నట్ల తెలిపారు. వ్యవసాయరంగంలో 7.91 శాతం, పారిశ్రామిక రంగంలో 10.24 శాతం వృద్ధి ఉన్నట్లు చెప్పారు. 20202-2021 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఇండెక్స్‌లో ఏపీకి 3వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. నీతిఆయోగ్ నివేదిక ప్రకారం పేదరిక నిర్మూలన, అసమానతల తగ్గింపులో ఏపీకి 5,6 స్థానాలు వచ్చాయని పేర్కొన్నారు. చదవండి: AP: ఏఎన్‌యూకి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకు తప్పుడు లెక్కలతో టీడీపీ నేతలు ప్రజలను బురిడీ కొట్టించలేరని ఆయన మండిపడ్డారు. ప్రతి పక్షంలో ఉండి ఏ మాత్రం బాధ్యత లేకుండా యనమల రామకృష్ణుడు రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తూ, గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు దాచిపెట్టి టీడీపీకి అనుకూలమైన లెక్కల చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. -
అబద్ధాల్లో అపూర్వ సోదరులు
సాక్షి, అమరావతి: బీసీల సంక్షేమానికి 14 ఏళ్లు అధికారంలో ఉన్న టీడీపీ వ్యయం చేసిన నిధుల కంటే 26 నెలల పాలనలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికంగా ఖర్చు చేసిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. బీసీల సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు సవాల్ విసిరారు. అబద్ధానికి చంద్రబాబు అన్న అయితే యనమల తమ్ముడి లాంటివారన్నారు. ఈ ఇద్దరూ అపూర్వ సహోదరుల్లా తప్పుడు అంకెలు చెబుతూ అసత్యాలను వల్లిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలో ఉండగా పది వేల మంది బీసీల్లో ఒకరికి ఆదరణ పథకం కింద పనిముట్లు ఇచ్చి బానిసల్లా చూసిందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట మేరకు బీసీలకు సంతృప్త స్థాయిలో సంక్షేమ ఫలాలను అందిస్తున్నారన్నారు. 25 సంక్షేమ పథకాల ద్వారా రూ.1,04,241 కోట్లను వివిధ వర్గాల ప్రజల ఖాతాల్లో నేరుగా జమ చేయగా బీసీలకు రూ.50,315 కోట్లను అందజేశారని వివరించారు. నగదేతర పథకాల ద్వారా వివిధ వర్గాలకు రూ.1,40,438 కోట్ల ప్రయోజనం చేకూరగా బీసీ వర్గాలకు రూ.69,662 కోట్ల మేర మేలు జరిగిందని చెప్పారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ ఒక్క బీసీ నేతనూ రాజ్యసభకు పంపలేదన్నారు. వైఎస్సార్సీపీ ఇద్దరు బీసీలను రాజ్యసభకు పంపి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిందని తెలిపారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలకు కేటాయించేలా ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఇటీవల పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారని వివరించారు. బీసీ వర్గాలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచన చంద్రబాబు, యనమల ఎప్పుడైనా చేశారా? అని మంత్రి చెల్లుబోయిన ప్రశ్నించారు. -
'దివీస్'పై దిగజారుడు రాజకీయం
సాక్షి, అమరావతి /సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడి దృష్టిలో అది వేల మందికి ఉపాధి కల్పించే సంస్థ. అధికారం లేకుంటే మాత్రం కాలుష్యం వెదజల్లే పరిశ్రమ!!. ఇదీ తెలుగుదేశం పార్టీ ద్వంద్వ నీతి. ఫార్మా దిగ్గజం దివీస్ ల్యాబరేటరీస్‌కు చెందిన యూనిట్ విషయంలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే... తమ నిర్వాకాలన్నీ రాష్ట్ర ప్రజలు మరిచిపోయారని ఆ పార్టీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఫార్మా యూనిట్ ఏర్పాటుకు దివీస్ సన్నాహాలు మొదలుపెట్టడాన్ని సాకుగా తీసుకుని.. వాస్తవాలను కప్పిపుచ్చి, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చేసిన ప్రకటన మరీ చిత్రం. ఎందుకంటే దివీస్‌కు అనుమతులిచ్చిందీ, కాకినాడ సెజ్ నుంచి భూములు వెనక్కి తీసుకుని మరీ కేటాయింపులు చేసిందీ సాక్షాత్తూ చంద్రబాబు ప్రభుత్వమే. పైపెచ్చు దివీస్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాన్ని అణచివేసేందుకు అప్పట్లో తూర్పుగోదావరి జిల్లా కోన ప్రాంతంలో 82 రోజుల పాటు పోలీసు రాజ్యం.. అరెస్టుల పర్వం కొనసాగించింది కూడా టీడీపీ సర్కారే. దివీస్ ప్రతిపాదనకు బాబు కేబినెట్ ఆమోదం తెలపడం, అందుకనుగుణంగా తొలుత ప్రభుత్వం, ఆ తర్వాత ఏపీఐఐసీ జీవోలు ఇవ్వడం, తక్కువ ధరకే భూములు కట్టబెట్టడం.. ఈ మొత్తం వ్యవహారాన్ని వెనక నుంచి నడిపించిన నాటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు... ఇపుడు ప్లేటు ఫిరాయించడాన్ని స్థానికులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. 2015లో కేసెజ్ నుంచి దివీస్‌కు భూమి కేటాయిస్తూ టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో, భూ కేటాయింపు ప్రక్రియను పూర్తిచేస్తూ ఏపీఐఐసీ ఇచ్చిన ఉత్తర్వులు బాబు హయాంలో జరిగింది ఇదీ.. ► వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీఎంఆర్ కాకినాడ సెజ్ (కేసెజ్) కోసం (పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటు కోసం) ప్రభుత్వం కాకినాడ సమీపంలో 10,400 ఎకరాల భూమి సేకరించి ఇచ్చింది. ► 2014 సెప్టెంబర్ 27న దివీస్ ల్యాబొరేటరీస్ కాకినాడ సమీపంలోనే సముద్ర తీర కోన ప్రాంతం, తొండంగి మండలం ఒంటిమామిడి వద్ద సుమారు రూ.790 కోట్ల పెట్టుబడితో ఫార్మా యూనిట్ (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్స్ తయారీ) ఏర్పాటు చేసుకోవడానికి దరఖాస్తు చేసింది. ► ఈ ప్రతిపాదన రాగానే ఫైల్ వాయువేగంతో కదిలింది. కాకపోతే దివీస్ ప్రతిపాదించిన ప్రాంతంలో భూమి అప్పటికే కే–సెజ్‌కు కేటాయించి ఉంది. ► దీంతో అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. కేసెజ్పై ఒత్తిడి తీసుకువచ్చి దానికి కేటాయించిన భూమిలో.. 2,094.74 ఎకరాలతో కూడిన ఒక భాగంలో 505 ఎకరాలను దివీస్‌కు ఇప్పించేలా ఒప్పించారు. ► ఇందుకు బదులుగా మరోచోట కేసెజ్‌కు 279.38 ఎకరాల భూమి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. దీన్ని నాటి కేబినెట్ ఓకే చేసింది. ► యనమల సభ్యుడిగా ఉన్న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీబీ) సిఫారసుల మేరకు.. దివీస్‌కు ప్రత్యేక రాయితీలిస్తూ 2015 జూలై 15న ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ► మంత్రివర్గ ఆమోదానికి అనుగుణంగా కేసెజ్ నుంచి 505 ఎకరాలు వెనక్కి తీసుకొని దివీస్‌కు కేటాయిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ 2015 సెప్టెంబర్ 14న ఉత్తర్వులు జారీ చేసింది. ► ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ఏపీఐఐసీ కూడా 2015 అక్టోబర్ 17న ఉత్తర్వులు జారీ చేసి భూ కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసింది. కారు చౌకగా ఎకరం రూ.6 లక్షలకు కట్టబెట్టింది. ► అయితే దివీస్‌కు ఇచ్చిన 505 ఎకరాలు కే సెజ్ మధ్యలో ఉండటంతో దానిలోకి వెళ్లడానికి కనీసం రోడ్డు కూడా లేక ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. ► తాజాగా అప్రోచ్ రోడ్డు నిర్మించుకునేందుకు దివీస్ చర్చలు జరుపుతోంది. ► తమ యూనిట్‌తో ఎలాంటి కాలుష్యం ఉండదని చెబుతూ.. హైదరాబాద్‌తో పాటు విశాఖ, నెల్లూరు జిల్లాల్లో ఉన్న యూనిట్లలో తాము తీసుకుంటున్న జాగ్రత్త చర్యలను స్థానికులకు తెలియజేస్తోంది. ► పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలను శుద్ధి చేసి, సముద్రపు నీటిలో ఉండే ఉప్పు శాతం కంటే తక్కువ స్థాయికి తెచ్చి పైప్‌లైన్ ద్వారా సముద్రంలో 1.5 కి.మీ దూరంలో కలిపేలా తీసుకుంటున్న చర్యలను సంస్థ ప్రతినిధులు వివరిస్తున్నారు. ► దీనివల్ల మత్స్య సంపదకు, భూగర్భ నీటికి ఎటువంటి హాని కలగదంటూ అవగాహన కల్పిస్తున్నారు. ► ఈ వాస్తవాలన్నిటినీ పక్కనబెట్టి ఇదేదో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్లుగా... కోన ప్రాంతం దెబ్బతింటుందంటూ యనమల యాగీ చేయటమే విచిత్రం. ‘కోన’పై ఉక్కుపాదం దివీస్ పరిశ్రమపై 2016 జూన్ 22న పంపాదిపేటలో కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 14 గ్రామాల నుంచి వందలాది మంది 2016 ఆగస్టు నుంచి ఉద్యమం నడిపారు. ఆ ఏడాది చివరి వరకూ సాగిన ఈ ఉద్యమంపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. బడుగు, బలహీనవర్గాలు, దళిత రైతులు, మత్స్యకారులపై కక్ష కట్టి, కోన ప్రాంతంలో 82 రోజుల పాటు పోలీసు రాజ్యం నడిపించింది. బయటి ప్రాంతాల నుంచి బంధువులను కూడా కోన గ్రామాలకు రానివ్వకుండా పొలిమేరల్లోనే పోలీసులు అడ్డుకున్నారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లనివ్వకుండా నెలల తరబడి 144 సెక్షన్ కొనసాగించి భయానక వాతావరణం సృష్టించారు. మహిళలని కూడా చూడకుండా కర్కశంగా వ్యవహరించారు. సుమారు 400 మందిని అరెస్టు చేశారు. బాబు హయాంలో పంపాదిపేట గ్రామంలో మహిళలను ఈడ్చుకెళ్తున్న పోలీసులు దివీస్‌ను తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమే కోన ప్రాంతంలో దివీస్ పరిశ్రమ చిచ్చు పెట్టింది టీడీడీ ప్రభుత్వమే. దివీస్ పరిశ్రమకు 500 ఎకరాలు కేటాయించినట్టు అసెంబ్లీ సాక్షిగా అప్పటి ఆర్థిక మంత్రి యనమల ప్రకటించారు. పరిశ్రమ వద్దంటూ పోరాటం చేస్తున్న మమ్మల్ని హింసించారు. తప్పుడు కేసులు బనాయించారు. అప్పుడలా చేసి ఇప్పుడు స్థానికంగా ఎదురయ్యే ఇబ్బందుల గురించి మాట్లాడటం వింతగా ఉంది. – అంగుళూరి అరుణ్‌కుమార్, దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యుడు, కొత్తపాకలు గ్రామం, తొండంగి మండలం కోన ప్రజలపై దాష్టీకం ప్రదర్శించారు టీడీపీ ప్రభుత్వం అనుమతించిన దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఉద్యమించిన మాపై పోలీసులు అన్యాయంగా, అక్రమంగా దౌర్జన్యకాండ జరిపారు. అరెస్టులు చేశారు. మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా విచక్షణారహితంగా లాఠీలతో జులుం ప్రదర్శించారు. దివీస్‌కు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడుతున్నాం. – చొక్కా కాశీ ఈశ్వరరావు, మత్స్యకార నాయకుడు, నర్శిపేట గ్రామం, తొండంగి మండలం -
యనమలకి చిన్న మెదడు చితికినట్లుంది
సాక్షి, అమరావతి: రెండు పారిశ్రామిక సంస్థల మధ్య జరిగిన వాటాల విక్రయ లావాదేవీలను ముఖ్యమంత్రికి ముడిపెట్టిన టీడీపీ నేత యనమల రామకృష్ణుడికి చిన్న మెదడు చితికినట్లుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. కాకినాడ సెజ్‌లో జీఎంఆర్, అరబిందో కంపెనీల మధ్య షేర్ల విక్రయాన్ని రాజకీయం చేస్తూ యనమల చేసిన ప్రకటనపై కన్నబాబు మండిపడ్డారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ‘అరబిందో కంపెనీ రైతుల నుంచి భూములను లాక్కోలేదు. జీఎంఆర్ నుంచి కొనుగోలు చేసింది. జీఎంఆర్ రైతుల నుంచి భూములను తీసుకున్నప్పుడు టీడీపీనే అధికారంలో ఉంది. మరి అప్పుడు మీరేం చేశారు? మీ హయాంలోనే ఇదంతా జరిగింది’ అని పేర్కొన్నారు. కాకినాడలో సెజ్‌కు శ్రీకారం చుట్టి ఇవాళ నీతులు వల్లించడం యనమలకు సిగ్గుగా లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాకినాడ సెజ్ ను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. (లక్షన్నర మందికి 3 లక్షల ఎకరాలు) ►కంపెనీలు తమ వాటాలను విక్రయించడం అతి సహజం. ఒకవేళ అదే తప్పయితే హెరిటేజ్ కంపెనీ షేర్లను ఫ్యూచర్ గ్రూపునకు ఎందుకు అమ్మారు? ►కాకినాడ సెజ్ వ్యవహారంలో జీఎంఆర్‌కే లాభం చేకూర్చాలనుకుంటే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఇచ్చిన ఎంతో విలువైన కమర్షియల్ భూముల్లో వేల కోట్ల విలువ చేసే 500 ఎకరాలను ఎందుకు వెనక్కుతీసుకుంటారు? మీకు ఆమాత్రం తెలియదా? ►మ్యాట్రిక్స్ ప్రసాద్ మీ పార్టీ వారితో కలిసి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తే మంచి పారిశ్రామికవేత్తా? అదే ప్రసాద్ సాక్షిలోనో, మీకు నచ్చని మరోచోటో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తే చెడ్డ పారిశ్రామికవేత్తగా చిత్రీకరిస్తారా? ►సీఎం జగన్ పాదయాత్ర సమయంలో కాకినాడ వచ్చినప్పుడు సెజ్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు కమిటీని నియమించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఆ దిశగా మేం కృషి చేస్తుంటే మేమేదో కాలుష్య కారక పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నట్లు విమర్శలా? ►మీ హయాంలో 600 ఎకరాల్లో దివీస్ హేచరీస్ ఏర్పాటు యత్నాలపై ప్రజలు తిరగబడ్డ విషయాన్ని మరిచారా? ►చంద్రబాబు హయాంలో దేశవ్యాప్తంగా 82 ప్రభుత్వ ఆస్తులను అమ్మితేఅందులో 52 ఆంధ్రప్రదేశ్‌కు చెందినవని మరచిపోవొద్దు. కాకినాడ నడిబొడ్డున ఉన్న గోదావరి ఫెర్టిలైజర్స్‌ను విక్రయించిన ఘనత మీదే. -
బాగా బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్లి..
సాక్షి, అమరావతి: పెద్దల సభ అంటే సూచనలు ఇవ్వాలి గాని, సంఘర్షణలకు వేదికగా ఉండకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అభిప్రాయపడ్డారు. ఆమె సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు డ్రైవర్ అయితే యనమల రామకృష్ణుడు స్టీరింగ్ అని ఎద్దేవా చేశారు. పెద్దల సభను దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పునరుద్దరిస్తే...శాసనమండలిలో ఇవాళ చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూడు రాజధానుల బిల్లుపై వారి తీరు చూస్తుంటే... చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారుతారని అన్నారు. పెద్దల సభ అంటే అందరూ గౌరవించేలా ఉండాలే కానీ, శాసనమండలిని టీడీపీ నేతలు రాజకీయ వేదికగా వాడుకుంటున్నారని, మండలిలో ప్రజాతీర్పును అపహాస్యం చేశారని మండిపడ్డారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని వ్యతిరేకిస్తున్న మండలి అవసరం లేదని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. శాసనమండలిని రద్దు చేయమని తాము ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను గట్టిగా కోరుతామని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. శాసనసభ ఆమోదించిన బిల్లును అగౌరపరిచారని, అమరావతిలో బినామీల భూముల కోసమే చంద్రబాబు పోరాటం చేస్తున్నారన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు ఆరాటం, పోరాటమని విమర్శించారు. ‘బాగా బలిసిన కోడి.. చికెన్ షాప్ కు వెళ్తే.. ఏమవుతుందో.. నారా లోకేష్ గ్రహించాలి. యనమల మహా మేధావిగా ఫీల్ అవుతున్నారు..రెండుసార్లు ఓడిపోయారు. పెద్దల కోసం ఏర్పాటు చేసిన సభకు తన ఇంట్లో ఉన్న దద్దమ్మను, దద్దోజనాన్ని పంపించారు. చంద్రబాబు ఓటమిపాలైనా ఇంకా అహంకారం మాత్రం తగ్గలేదు. ప్రజా క్షేత్రంలో ఓడిపోయిన యనమల మహా మేధావిలా ఫీలవుతున్నారు. ఇండియా టుడే సర్వేల బెస్ట్ సీఎం సర్వేలో 4వ స్థానంలో జగన్‌గారు ఉన్నారు. ఆయన పనితీరును ప్రజలంతా మెచ్చుకుంటున్నారు. టీడీపీ మాత్రం తమ పార్టీ ఎమ్మెల్సీలతో బేరసారాలు చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అలాంటి అవసరమే లేదు. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు’ అని చురకలు అంటించారు. -
ర్యాంకింగ్స్ ఇస్తే ఆయనకు ఆఖరి స్థానం కూడా కష్టమే
సాక్షి, అమరావతి: ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'రాష్ట్రాల ప్రతిపక్ష నాయకులకు ఎవరైనా ర్యాంకింగ్స్ ఇస్తే చంద్రబాబుకు ఆఖరు స్థానం కూడా దొరకదంటూ ఎద్దేవా చేశారు. 8 నెలల్లో ఒక జెండా లేదు. ప్రజా సమస్యల మీద గళమెత్తిన సందర్భం లేదు. ఇసుక మాఫియాను కాపాడేందుకు కొరత అంటూ రంకెలు వేశాడు. కడాన రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవతారమెత్తి జోలెతో ఊరేగాడంటూ' చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. మరో ట్వీట్లో.. 'అప్పట్లో కౌన్సిల్‌ను పునరుద్ధరించాలని వైఎస్సార్ ప్రతిపాదించినప్పుడు ఇదే చంద్రబాబు డబ్బులు దండగ అన్నాడు. ప్రస్తుతం సీఎం జగన్ కౌన్సిల్ వల్ల ఖర్చు తప్ప ప్రయోజనం లేదనగానే, మీరు రద్దు చేస్తే నేనొచ్చాక మళ్లీ తెస్తా అని బట్టలు చించుకుంటున్నాడు. విజనరీది మాట మీద నిలకడ లేని బతుకు' అంటూ విమర్శలు గుప్పించారు. యనమల కుట్రలు పైనున్న ఎన్టీఆర్‌కు తెలుసు.. కాగా మరో ట్వీట్లో..టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడిపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 'రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌కు వెన్ను పొడిచి ఆయన అకాల మరణానికి కారకుడైన వారిలో చంద్రబాబు తర్వాత రెండో దోషి యనమల. పెద్దాయన ఉసురు తగిలి తుని ప్రజలు తరిమికొట్టడంతో దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యాడు. ఆయనిప్పుడు నీతి చంద్రికలు చదువుతూ పత్తి గింజలా ప్రగల్భాలు పలుకుతున్నాడు' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. బాబుకు షాకిచ్చిన ఎమ్మెల్సీలు.. కీలక భేటీకి డుమ్మా! -
యనమలకు మంత్రి బొత్స సవాల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు రెండో రోజు వాడివేడిగా సాగుతున్నాయి. మంగళవారం శాసనమండలిలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యలు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చేసిన అసత్య ఆరోపణలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుకు మద్దతివ్వాలని టీడీపీ ఎమ్మెల్సీలకు బొత్స ఫోన్ చేసి ప్రలోభాలకు గురిచేశారని యనమల ఆరోపించారు. అయితే యనమల తీరుపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా దమ్ముంటే ఏ ఎమ్మెల్సీకి ఫోన్ చేశామో నిరూపించాలని మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా బిల్లుకు సమయం కావాలని యనమల ఆడగడంపై మంత్రి బొత్స అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఏం చేశారో గుర్తు తెచ్చుకోవాలని, బిల్లు పెట్టి గంటలో చర్చ చేపట్టిన సందర్భాలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా టీడీపీకి ఇష్టం వచ్చినట్లు సభా నడపాలా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలలో రాజధాని అంశంపై బొత్స మాట్లాడినట్లుగా వచ్చిన వార్తలను యనమల చదివి వినిపించారు. అయితే టీడీపీ పార్టీ పాంప్లెట్‌గా పనిచేసే పత్రికలను సభలో ఎలా చదువుతారని మంత్రి బొత్స తప్పుపట్టారు. చదవండి: ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి? సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం సంక్షేమ పథకాలు వదిలేద్దామా! ప్రతిపక్ష నేతవా.. సంఘ విద్రోహ శక్తివా? వికేంద్రీకరణకు కేబినెట్ ఆమోదం -
టీడీపీ మేనిఫెస్టో ఆలస్యం.. అందుకేనా?
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళిక(మేనిఫెస్టో)ను విడుదల చేసే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు దోబూచులాడుతున్నారు. ముసాయిదా మేనిఫెస్టో ఇప్పటికే సిద్ధమైనా విడుదల చేయకుండా నాలుగు రోజుల నుంచి వాయిదా వేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తే దాన్ని చూసుకుని మార్పులు చేసి తమ మేనిఫెస్టోను విడుదల చేయాలని చూస్తున్నట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. అంటే వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలను కాపీ కొట్టే ఉద్దేశంతోనే చంద్రబాబు తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. యనమల రామకృష్ణుడు అధ్యక్షతన నెల రోజులక్రితం చంద్రబాబు టీడీపీ మేనిఫెస్టో కమిటీని నియమించారు. మేనిఫెస్టోలో ఏ ఏ అంశాలు పెట్టాలో యనమల నిర్ణయించి.. దానిని మళ్లీ చంద్రబాబు సూచనల ప్రకారం మార్పులు చేసి 74 పేజీలతో ముసాయిదాను సిద్ధం చేశారు. 4 రోజుల క్రితమే దాన్ని బాబు విడుదల చేస్తారని టీడీపీ ప్రకటించింది. కానీ చివరి నిమిషంలో విడుదలను వాయిదా వేశారు. అప్పట్నుంచీ రోజూ వాయిదాల పర్వం కొనసాగిస్తున్నారు. చివరికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మేనిఫెస్టోను విడుదల చేసేవరకూ తమ మేనిఫెస్టో విడుదల చేయకూడదని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో ప్రజలను ఆకర్షించే హామీలు, అంశాలుంటే నష్టపోతామని, కాబట్టి అది వచ్చాక దాన్నిబట్టి తమ మేనిఫెస్టోలో మార్పులు చేశాకే విడుదల చేయాలని నిర్ణయించారు. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు ఇప్పటికే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టడం తెలిసిందే. వృద్ధాప్య ఫించన్‌ను రూ. 2 వేలు చేస్తామని జగన్ ప్రకటిస్తే దాన్ని ఎన్నికలకు 3 నెలలు ముందుగా హడావుడిగా అమలులోకి తెచ్చారు. రైతు భరోసా, ప్రతి కులానికి కార్పొరేషన్, డ్వాక్రా రుణాల మాఫీ వంటి వాటిని కాపీ కొట్టారు. తాజాగా ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని అధికారంలోకి రాగానే కేంద్రానికి లేఖ రాస్తామని వైఎస్ జగన్ ఇచ్చిన హామీని కాపీ కొట్టి టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినట్లు లీకులివ్వడం గమనార్హం. కాగా పార్టీ వైఖరి ప్రకారం రూపొందించిన మేనిఫెస్టోను విడుదల చేయకుండా ప్రత్యర్థి మేనిఫెస్టో కోసం ఎదురు చూడడమేంటని టీడీపీలోని సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
యనమల సోదరులది రాజకీయ వ్యాపారం
తుని: యనమల సోదరులు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి కోట్లు సంపాదించారని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. ప్రజల సోమ్మును అడ్డదారిలో దోచుకుని, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను కబ్జా చేశారని ఆరోపించారు. తుని పట్టణం రెండో వార్డులో శనివారం ఎస్సీ, బీసీ, మైనార్టీలకు చెందిన పలువురు వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ యనమల సోదరులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. నిజాయితీకి నిలువు టద్దమని యనమల రామకృష్ణుడు చెప్పుకుంటున్నారని, వందల కోట్లు ఆస్తులను ఎలా కూడబెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టణ నడిబొడ్డులో ఉన్న బాతుల కోనేరు స్థలాన్ని దొడ్డుదారిలో బినామీలతో ఆక్రమించారని, ప్రస్తుతం ఆ స్థలాన్ని గజానికి రూ.లక్షకు బేరం పెట్టారన్నారు. రైల్వే ట్రాక్ ఆవతల ఉన్న పది వార్డులకు చెందిన నీరు పోవడానికి ఏర్పాటు చేసిన కాలువను కలిపేసుకున్నారని విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతి పనికి ముడుపులు తీసుకుని పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకున్నారన్నారు. పేదలకు ఉచితంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అవినీతికి కేరాఫ్ అడ్రాస్‌గా మార్చారన్నారు. పురుడు పోసుకోవడానికి పేదలు వెళితే రూ. 6 వేలు వసూలు చేస్తున్నారని, ఇందుకు తమకు అనుకూలమైన ఏజెంట్లను పెట్టుకున్నారన్నారు. మున్సిపల్ కార్యాలయాన్ని టీడీపీ కార్యాలయంగా మార్చారని, వైఎస్సార్ సీపీకి మద్దతు ఇచ్చే వారిని పిలిపించి బెదరింపులకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను సొమ్ములకు అమ్ముకుంటున్నారని విమర్శించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు ఏ విధంగా మేలు చేశారో జననేత జగన్మోహన్రెడ్డి అదే రీతిలో పాలన చేస్తారన్నారు. సువర్ణ పాలన కోసం వైఎస్సార్ సీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు పెదపాటి అమ్మాజీ, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వేంకటేష్, సీనియర్ నాయకుడు అనిశెట్టి నాగిరెడ్డి, పట్టణశాఖ అధ్యక్షుడు రేలంగి రమణాగౌడ్ పాల్గొన్నారు. -
మహిళా డాక్టర్‌పై యనమల కక్ష సాధింపు
-
ప్రభుత్వ వైద్యురాలిపై ఆర్థికమంత్రి కక్షసాధింపు
-
‘కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకొని వేధిస్తున్నారు’
సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వంపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ వ్యతిరేక పార్టీలను వేధింపులకు గురుచేస్తుందని ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోలేక కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకొని వేధిస్తున్నారని విమర్శించారు. ఇందుకు హీరో శివాజీ వ్యాఖ్యలే నిదర్శనం అన్నారు. సీబీఐ, ఈడీ, ఐటి సంస్థల నుంచి రేపోమాపో నోటీసులు రానున్నాయని బీజేపీ నేతలే చెబుతున్నారని మండిపడ్డారు. ఏపీపై ఆపరేషన్ గరుడ చేస్తున్నారని శివాజీ ఎప్పటి నుంచో చెబుతున్నారని గుర్తు చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అవినీతిపరుల అండతో ప్రజాదరణ ఉన్నవారిని కాలరాయాలని ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్రానికి ఇచ్చే నిధులను ఆపేసింది, అది చాలక కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. వేధింపు చర్యలకు వ్యతిరేకంగా ప్రజాస్వామవాదులంతా ఏకం కావాలన్నారు. జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని యనమల కోరారు. -
పొత్తులపై పూర్తి నిర్ణయం ఆయనదే!
సాక్షి, అమరావతి: టీడీపీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టకోబోతోందన్న ఊహాగానాలు తారాస్థాయికి చేరాయి. అయితే కాంగ్రెస్‌తో పొత్తు ఒక్క తెలంగాణలోనేనా లేక ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొనసాగించాలా అని ఆ పార్టీ తర్జనభర్జన పడుతోందని తెలుస్తోంది. పొత్తులపై ఇప్పటికే మంత్రులు, పార్టీ సీనియర్ నాయకుల సలహాలు సీఎం చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నారు. తారాస్థాయిలో జరగుతున్న పొత్తుల అంశంపై ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ మీడియా చిట్‌చాట్‌లో స్పందించారు. పొత్తుల అంశంపై గురువారం రాత్రి 11 గంటల వరకు మంత్రుల సమావేశం జరిగిందని.. నేతలందరికీ సీఎం ఒక డైరెక్షన్ ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో పూర్తి నిర్ణయాధికారం అధ్యక్షుడికే వదిలేశామని పితాని స్పష్టం చేశారు. వ్యతిరేకత పెరుగుతుండటంతోనే ‘ముందస్తు’కు: యనమల టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండటంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్లినట్లు అనిపిస్తోందని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగితే ముస్లిం ఓట్లు కాంగ్రెస్‌కు పడతాయనే ఆందోళన కూడా ఒక కారణం కావచ్చన్నారు. కేంద్రం తెలంగాణపై సానకూలంగా ఉంటుందని.. కానీ ఏపీపై కపట ప్రేమ ప్రదర్శించిందని విమర్శించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి విధాన నిర్ణయాలు తీసుకోవడం కుదరదని, మధ్యంతర భృతి ప్రకటన చేసినా.. అమలు చేసే పరిస్థితి ఎంత వరకు ఉంటుందో అని అనుమానం వ్యక్తం చేశారు. -
పంటినొప్పి..!
-
యనమల రూటే వేరయా!
-
పంటి వైద్యం ఇంటలేదా?!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పంటి చికిత్సకు దిక్కులేదా? అసలు రాష్ట్రంలో పంటి వైద్య నిపుణులే లేరా? మరి ఐదు లక్షల మంది ఉద్యోగులు, మూడు లక్షల మంది పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు.. మరో 30 లక్షల మంది వైద్యం ఎక్కడ చేయించుకుంటున్నారు? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మారాయి. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు దంత వైద్యం(రూట్‌కెనాల్) కోసం సింగపూర్ వెళ్లి రూ.2.88 లక్షల ప్రభుత్వ సొమ్ము వెచ్చించిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మంత్రులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు తదితరులకు వైద్యపరంగా ఎంత ఖర్చయితే అంత ప్రభుత్వమే చెల్లించాలన్న నిబంధనలున్నా.. రూట్‌కెనాల్ ట్రీట్మెంట్కు రూ.2.88 లక్షలా! అంటూ సామాన్యులు నోరెళ్లబెడుతున్నారు. బుధవారం యనమల దంతవైద్యానికి సంబంధించిన సొమ్ము విడుదల చేస్తూ సర్కార్ ఇచ్చిన ఉత్తర్వులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినా ఉద్యోగులకు గానీ, పెన్షనర్లకుగానీ, వారి కుటుంబ సభ్యులకుగానీ, 4 కోట్ల మంది ఆరోగ్యశ్రీ పేద రోగులకుగానీ.. హైదరాబాద్‌లో వైద్యం చేయించుకుంటే డబ్బు చెల్లించేది లేదంటూ ఏకంగా సర్కారే నిబంధనలు విధించింది. పెద్ద పెద్ద జబ్బులకు రాష్ట్రంలో మౌలిక వసతులు లేకపోవడం, సరైన డాక్టర్లు లేకపోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో సొంత డబ్బులు పెట్టుకుని ఇతర నగరాల్లో వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి. ఉద్యోగులకు, పెన్షనర్లకు రూట్‌కెనాల్ ట్రీట్మెంట్కు ఒక్కో సిట్టింగ్‌కు రూ.3,500కు మించి లేదు. మొత్తం రమారమి రూ.10 వేల వరకూ ఖర్చవుతోంది. అలాంటిది ఒక్కసారి సింగపూర్‌లో రూట్‌కెనాల్ చేయించుకున్న యనమలకు రూ.2.88 లక్షలు చెల్లించడంపై సామాన్యులు, ఉద్యోగులు, పెన్షనర్లూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మనం ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకుంటే పన్ను వారికి వెళుతోంది కాబట్టి ఇక్కడే వైద్యం చేయించుకోవాలని చెప్పిన సర్కారు.. మరి మన పన్ను సింగపూర్‌కు వెళ్లదా.. అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులకోన్యాయం.. ఉద్యోగులకోన్యాయమా.. అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ దంత వైద్యకళాశాలకు చెందిన ఓ వైద్యుడు మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో ఆస్పత్రిని బట్టి, డాక్టర్‌ను బట్టి ఒక్కో సిట్టింగ్‌కు రూ.2,500 నుంచి రూ.3000 అవుతుందని.. మూడు సిట్టింగ్‌లలో ఈ వైద్యం పూర్తవుతుందని చెప్పారు. -
వివాదస్పదంగా మారిన జెండా వందనం
-
మంత్రి యనమలకు ఘోర అవమానం!
సాక్షి, అమరావతి : ఏపీ ప్రభుత్వంలో సీనియర్ మంత్రి అయిన యనమల రామకృష్ణుడికి ఘోర అవమానం జరిగింది. దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించే మంత్రుల విషయంలో యనమలకు సీఎం చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం యనమల కృష్ణా జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నారు. అయితే, కృష్ణా జిల్లాలో పంద్రాగస్టు నాడు జెండా ఎగరేసే అవకాశం మంత్రి పరిటాల సునీతకు ముఖ్యమంత్రి ఇచ్చారు. సీనియర్ మంత్రి, బీసీ నేతను కాదని జూనియర్ మంత్రి అయిన సునీతకు సీఎం అవకాశం ఇవ్వడం గమనార్హం. ఫిరాయింపు మంత్రి అమర్నాథ్రెడ్డికి సైతం జెండా ఎగురవేసే అవకాశం దక్కింది. కానీ యనమలకు అవకాశం ఇవ్వలేదు. గత ఏడాది సీనియర్ మంత్రి అయిన కేఈ కృష్ణమూర్తికి కూడా ఇదేవిధంగా అవకాశం ఇవ్వలేదు. ఈ ఏడాది జెండా ఆవిష్కరణ విషయంలో తనకు అవమానం జరగడంతో మంత్రి యనమల మనస్తాపంతో ఉన్నట్టు తెలుస్తోంది. సొంత జిల్లా తూర్పు గోదావరిలో యనమలకు అవకాశమున్నా.. చంద్రబాబు ఇవ్వకపోవడంతో యనమల కినుకు వహించినట్టు తెలుస్తోంది. అవకాశం దక్కని మంత్రులు! మంత్రి యనమల రామకృష్ణుడితోపాటు తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జి మంత్రి కళా వెంకట్రావు, చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి కే అచ్చెన్నాయుడులకు అవకాశం దక్కలేదు. కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులుకు మంత్రి కళా వెంకట్రావు స్థానంలో తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం ఇచ్చారు. ఇక ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రి కాకపోయినప్పటికీ.. ఆయనకు జిల్లాలోనే జాతీయ పతాకం ఆవిష్కరించే అవకాశం ఇచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాల వారీగా జెండా ఎగురవేయనున్న మంత్రుల జాబితా ఇదే విజయనగరం- గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం - నిమ్మకాయల చినరాజప్ప తూర్పుగోదావరి - కాల్వ శ్రీనివాసులు పశ్చిమగోదావరి - ప్రత్తిపాటి పుల్లారావు కృష్ణా - పరిటాల సునీత గుంటూరు- సీహెచ్ అయ్యన్నపాత్రుడు ప్రకాశం - పీ. నారాయణ నెల్లూరు - ఎన్. అమర్నాథ్రెడ్డి కడప - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కర్నూలు - కేఈ కృష్ణమూర్తి అనంతపురం- డీ ఉమామహేశ్వరరావు చిత్తూరు - ఎన్ ఆనందబాబు -
పీడీ ఖాతాలపై నోరు విప్పని యనమల
-
టీడీపీపై కాపుల అగ్రహం
-
కాపులకు టోపీ పెట్టారు
-
దారిలో యాక్సిడెంట్ అవుతుంది.. అంతమాత్రాన!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు బీజేపీతో తమ పార్టీ పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో ప్రయాణం ఒక యాక్సిడెంట్ లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. ‘రాజమండ్రి వెళ్లాలని కారులో వెళతాం. దారిలో యాక్సిడెంట్ అవుతుంది. అంతమాత్రాన ప్రయాణం తప్పు అసలేం కదా. బీజేపీతో పొత్తు కూడా అలాంటిదే’ అని ఆయన సమర్థించుకున్నారు. టీడీపీ-బీజేపీ నాలుగేళ్లు ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారం పంచుకున్న సంగతి తెలిసిందే. బీజేపీతో నాలుగేళ్లు కాపురం చేసిన టీడీపీ.. ఆ తర్వాత ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కమలానికి కటీఫ్ చెప్పేసింది. మొదట కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఓకే అంటూ ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు.. నాలుగేళ్ల పాలనలో వైఫల్యాలు.. ప్రజల్లో వ్యతిరేకత నేపథ్యంతో బీజేపీతో తెగదెంపులు చేసుకొని.. హోదా నినాదాన్ని ఎత్తుకున్న సంగతి తెలిసిందే. -
కాపు రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోనిది
సాక్షి, అమరావతి: కాపు రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలోనిదని, దీనిపై స్పష్టత ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్ల అంశంపై ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు చెప్పినమాట వాస్తవమేనని, అంతకుమించి రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఒక కులాన్ని బీసీ జాబితాలో చేర్చే విషయం ఉమ్మడి జాబితాలోని అంశమన్నారు. కాపులను బీసీల్లో చేర్చే విషయమై తమ పరిధిలో చేయాల్సిందంతా పక్కాగా చేశామని చెప్పారు. ‘‘ఈ విషయంలో రాష్ట్రం చేయాల్సింది చేశాం. చట్టం చేసి కేంద్రానికి పంపాం. మా పరిధిలో ఉండేది అది. తరువాత రాజ్యాంగం ప్రకారం ఏం చేయాలనేది కేంద్రం పరిధిలోని అంశం’’ అని ఆయన అన్నారు. రాజ్యాంగ సవరణ రాష్ట్రం పరిధిలోని అంశం కాదని, అది కేంద్రం మాత్రమే చేయాల్సి ఉంటుందన్నారు. ‘‘రాజ్యాంగంలో క్లియర్‌గా ఉంది. ఈ అంశాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాల్సి ఉంది. ఈ పని పార్లమెంటు మాత్రమే చేయాలి. అందుకోసం కేంద్రం ప్రతిపాదించాల్సి ఉంటుంది’’ అని అన్నారు. ‘‘ప్రస్తుతం మరాఠాలు, పటేళ్లు రిజర్వేషన్లుకోసం పట్టుపడుతున్నారు. అలాగే యూపీలోనూ, హర్యానాలోనూ, ఇంకా పలు రాష్ట్రాలలో ఇదే తరహా డిమాండ్లు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపులు జరిపి చేయాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ‘‘సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటరాదనేది వాస్తవమే. కానీ ఈ లిమిటేషన్లు తీసేసే అధికారం కేంద్రానికుంది. రాజ్యాంగాన్ని సవరించే అధికారం కేంద్రానికుంది. కేంద్రం అనుకుంటే చేయవచ్చు. అన్ని రాష్ట్రాలను సంప్రదించి చేయాల్సి ఉంటుంది. కానీ బీజేపీ ఎందుకు చేయడం లేదు? కనీసం అవునా, కాదా అనేది కూడా ఎందుకు చెప్పడం లేదు?’’ అని యనమల ప్రశ్నించారు. కేంద్రం అన్యాయం చేస్తున్నా వారు ప్రశ్నించరు.. కాపు రిజర్వేషన్లపై జగన్ ఎందుకు మాట మార్చారో సమాధానం చెప్పాలని యనమల ధ్వజమెత్తారు. కాపు రిజర్వేషన్లపై గతంలో జగన్ అనుకూలంగా.. ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ఏమాత్రం న్యాయం చేయని కేంద్రాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ఎందుకు ప్రశ్నించడం లేదో అర్థం కావట్లేదని యనమల విమర్శించారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారన్నారు. పదో షెడ్యూల్లోని ఆస్తుల పంపిణీని పట్టించుకోవట్లేదు విభజన హామీల అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలోని నేతలు సుప్రీంకోర్టును, పార్లమెంటును తప్పుదోవ పట్టిస్తున్నారని యనమల ఈ సందర్భంగా విమర్శించారు. ప్రత్యేక హోదాకు సమానంగా ఇస్తామన్న ప్యాకేజీ ప్రకారం కూడా కేంద్రం నిధులు ఇవ్వలేదని తప్పుపట్టారు. ఉన్నత విద్యాసంస్థల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును సైతం ఖాతరు చేయలేదన్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఏడాదిలోపు తమ తమ సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని, ఏడాది దాటితే కేంద్రం కలుగజేసుకుని పరిష్కరించాల్సి ఉందని, కానీ కేంద్రం ఇంతవరకు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. 9వ షెడ్యూల్లోని అంశాలను కేంద్రం పట్టించుకోవట్లేదన్నారు. పదవ షెడ్యూల్లోని 142 సంస్థల ఆస్తులు, అప్పుల విలువ లెక్కించి జనాభా ప్రాతిపదికన ఏపీకి 58%, తెలంగాణకు 42% ప్రకారం పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ కేంద్రం స్పందించట్లేదన్నారు. పంపిణీ చేయాల్సిన అవసరం లేదంటూ అఫిడవిట్లో పేర్కొనడం దారుణమన్నారు. -
రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాల్సింది కేంద్రమే
-
జీఎస్టీ శ్లాబులు తగ్గించే యోచన
విశాఖసిటీ: దేశంలో పేద కుటుంబాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒకే పన్ను.. ఒకే శ్లాబు విధానం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయలేమని రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో సెంట్రల్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జీఎస్టీ మొదటి వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా యనమల మాట్లాడుతూ గతంలో వ్యాట్ వచ్చినప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఒకే పన్ను, ఒకే దేశం, ఒకే మార్కెట్ అన్న నినాదంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీని 29 రాష్ట్రాలూ వ్యతిరేకించకపోవడం హర్షణీయమన్నారు. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం వల్ల దేశ ఆర్థిక అభివృద్ధికి దోహద పడుతుందన్నారు. బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ వస్తువులకు ట్యాక్స్‌లలో తేడా ఉంటుందన్నారు. ఒకే పన్ను విధానంలో ఒకే శ్లాబ్ పద్ధతి చాలా కష్టతరంతో కూడుకున్నదనీ, దీనికి బ్యాలెన్స్ చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. మన దేశంలో జీరోతో మొదలై ఐదు శ్లాబులుగా విభజించారన్నారు. ఈ విధానం వల్ల కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడిన విషయం వాస్తవమన్నారు. శ్లాబుల సంఖ్య తగ్గించే యోచనలో జీఎస్టీ కౌన్సిల్ ఆలోచిస్తోందనీ, ఈ నెల 21న జరిగే కౌన్సిల్ సమావేశంలో ఈ విషయం చర్చకు రానుందని తెలిపారు. వాణిజ్య, వర్తకుల్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జెమ్టెడ్ గూడ్స్‌ను జీఎస్టీ నుంచి తప్పించాలన్నారు. ప్రస్తుతం చక్కెర పరి శ్రమ ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో దానిపై సెస్ వెయ్యొద్దంటూ జీఎస్టీ కౌన్సిల్లో ప్రతిపాదించా మని వెల్లడించారు. ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనీ, వాటన్నింటినీ శతశాతం పరిష్కరిస్తే జీఎస్టీ 100 శాతం ఉత్తమ ఫలితాలు రాబడుతుందన్నారు. కొన్ని వస్తువులపై పన్ను రేటు తగ్గింపు? ఎంపీ హరిబాబు మాట్లాడుతూ గతంలో అమల్లో ఉండే విధానాలతో వినియోగదారుల నుంచి వసూలు చేసిన పన్నుల్ని ప్రభుత్వాలకు చేరకుండా కొంతమంది వ్యాపారులు వ్యవహరించేవారనీ, జీఎస్టీ వచ్చిన తర్వాత వారి దారులు మూసుకుపోవడం వల్లే వ్యతిరేకతను వ్యక్తం చేశారన్నారు. 17 రకాల పన్నులు, 23 రకాల సెస్సులను ఏకతాటిపైకి తీసుకురావడం అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని వస్తువులపై పన్ను రేటును తగ్గించే యోచనలో ఉన్నట్లు హరిబాబు వెల్లడించారు. అదే విధంగా రిటర్న్స్ సరళీకృతం చేసేందుకు త్వరలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం వెలువడనుందని తెలిపారు. -
మంత్రుల గోబెల్స్ ప్రచారం..
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి విమర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంత్రులు కాల్వ శ్రీనివాసులు, యనమల రామకృష్ణుడు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో బీసీలకు అన్యాయం జరిగిందనే గోబెల్స్ ప్రచారాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనని.. బీసీలకు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. కులవృత్తి చేసుకునే వారిని నిర్వీర్యం చేసింది చంద్రబాబే అని అన్నారు. బీసీలకు సమాజంలో గౌరవప్రదమైన జీవనం లేకుండా చేసింది చంద్రబాబేనని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్‌దేనని కృష్ణమూర్తి గుర్తుచేశారు. బీసీ డిక్లరేషన్ ఏమైందంటూ ప్రశ్నించిన ఆయన దీనిపై యనమల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ బడ్జెట్ నిధులు, సబ్ ప్లాన్‌కి చట్టబద్ధత, బీసీలకు ఇస్తామన్న నామినేటెడ్ పోస్టులు ఎక్కడంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు ఏం చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ప్రభుత్వంలోని నామినేటెడ్ పదవులు ఒకే సామాజిక వర్గానికి ఇస్తుంటే ఎందుకు నోరు మోదపడం లేదంటూ కాల్వ, యనమల తీరుపై విరుచుకుపడ్డారు. టీటీడీ చైర్మన్ పదవి యనమల వియ్యంకుడుకి ఇస్తే మొత్తం బీసీలకు న్యాయం చేసినట్లా అని ప్రశ్నించారు. టీడీపీ హయంలో బీసీలకు ఏం చేశారో చెప్పలేని మీరు.. బీసీలు టీడీపీ వెంటే ఉంటారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
యూపీలో బీజేపీకి మూడో గర్వభంగం..
సాక్షి, అమరావతి : ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి పెద్ద చెంప పెట్టని ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. నాలుగు సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు కారణంగానే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని ఆయన గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఉప ఎన్నికల ఫలితాలతోనైనా బీజేపీ నేతలు కళ్లు తెరవాలని సూచించారు. ప్రజలకు అవసరమైన పథకాల రూపకల్పన, అమలులో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందువల్లనే నాలుగు లోక్‌సభ రెండు, 11 అసెంబ్లీ స్ధానాల్లో పదింటిలో బీజేపీ అభ్యర్ధులు ఓడిపోయారని , ఇది ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీకి మూడో గర్వభంగం అన్నారు. వరుసగా బీజేపీ అభ్యర్ధులు ఓడిపోతున్నా, ఆ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవడం లేదన్నారు. ఒక్క పాల్ఘర్ మినహా బీజేపీకి ఎక్కడా పరిస్థితులు సానుకూలంగా లేవని తెలిపారు. భారతీయ జనాతాపార్టీ పట్ల ఏర్పడిన వ్యతిరేకతే ప్రతిపక్షాల ఐక్యతకు పూనాది అయిందన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ప్రారంభమైన బీజేపీ పతనం రానున్న ఎన్నికల వరకు కొనసాగుతుందని జోస్యం చెప్పారు. ఇక మోదీ శకం ముగిసినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. -
మోదీ, అమిత్ షాపై యనమల తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: టీడీపీ మహానాడు వేదికగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకష్ణుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన మహానాడులో ప్రసంగించిన ఆయన...అమిత్ షా, మోదీలు నియంతలు అంటూ ధ్వజమెత్తారు. వారిద్దరిని ముస్సోలిని, హిట్లర్లతో పోల్చారు. ‘గత ఎన్నికల్లో బీజేపీతో జతకడితేనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని కొందరు మాట్లాడుతున్నారు. బీజేపీ ఉన్నా.. లేకపోయినా టీడీపీ అధికారంలోకి రావాలని 2014లో ప్రజలు కోరుకున్నార’ని ఆయన అన్నారు. కర్ణాటకలో బీజేపీని ఓడించాలని చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం వల్లే ఆ పార్టీకి అధికారం దూరమైందని యనమల పేర్కొన్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజక వర్గాల్లో బీజేపీ ఓడిపోయిందని తెలిపారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరు కావడం దేశంలో రాజకీయ పునరేకీకరణకు తార్కాణమని యనమల అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు మార్చుకుంటామని ఆయన అన్నారు. గడిచిన కాలంలో కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. దేశ రాజకీయాల్లో టీడీపీ చురుకైన పాత్ర పోషించాలని మహానాడులో రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు. -
మోత్కుపల్లి.. అప్పుడెందుకు నోరు మెదపలేదు?
సాక్షి, అమరావతి : ‘మోత్కుపల్లికి గవర్నరో, రాజ్యసభ సభ్యుడు లాంటి పదవులు లేకపోయేసరికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. నీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీ గురించి ఇలాంటి విమర్శలు చేయడం సరికాద’ని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ పేర్కొన్నారు. మహానాడులో విలేకరులతో మాట్లాడుతూ.. ఇన్నాళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రియ శిష్యుడినని ప్రకటించుకుని ఇప్పుడిలా పార్టీని విమర్శించటం సరికాదన్నారు. రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన పార్టీని విమర్శిస్తూ.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. దళితుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. జీవో నంబరు 25ను అమలు చేసి దళితులను పారిశ్రామికవేత్తలుగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ విషయాలేవి మోత్కుపల్లికి కనిపించడం లేదని విమర్శించారు. తెలంగాణ మంత్రివర్గంలో మహిళలకు, మాదిగలకు తగిన గుర్తింపు ఇవ్వని విషయం మోత్కుపల్లికి కనిపించడం లేదని విమర్శించారు. ఏడ్చే మగాడిని నమ్మకూడదు అనే సామెత మోత్కుపల్లి లాంటి వారిని చూసే పుట్టిందని మంత్రి ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తల్లిలాంటి టీడీపీ పార్టీ పట్ల కృతజ్ఞతగా ఉండకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని మోత్కుపల్లిని హెచ్చరించారు. -
పెట్రో ధరల బాధ్యత కేంద్రానిదే -యనమల
సాక్షి, అమరావతి: అడ్డూ అదుపులేకుండా పెరిగిపోతున్న చమురు ధరలపై ఆంధ్రప్రదేశ్ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు. అంతర్జాతీయంగా చమురు ధరల హెచ్చు తగ్గుల సందర్భంగా కేంద్రం తీరుపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. పెరిగినపుడు పెంచడమే తప్ప, ధరలు తగ్గినపుడు దేశీయంగా ఎందుకు తగ్గించడం లేదని మండిపడ్డారు. పెరుగుతున్న ధరల ప్రభావం మధ్య తరగతి ప్రజలపై తీవ్రంగా పడుతోందన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడల్లా దేశంలో కేంద్రప్రభుత్వం కూడా ధరలు పెంచటం వల్ల ప్రజలపై తీవ్రమైన భారం పడుతుందని యనమల వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల మీద ఎక్కువ భారం పడుతోందన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ధర తగ్గినప్పుడు కేంద ప్రభుత్వం తగ్గించడంలేదనీ, పెరిగినపుడు మాత్రం సదరు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచాలని ఆదేశాలు జారీ చేస్తుందన్నారు. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ రాష్ట్రాలను కేంద్రం ఆదేశించడం సరైనది పద్దతి కాదని యనమల పేర్కొన్నారు. మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర పెరిగినపుడు ప్రజలు మీద భారం పడకుండా చేసే భాద్యత కేంద్ర ప్రభుత్వమే వహించాలన్నారు. తద్వారా ప్రజల మీద భారం తగ్గించాలని ఆయన కోరారు. -
ఓటుకు కోట్లు ఆడియోపై విచారణకు సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లలో సాధ్యం కాని అభివృద్ధి ఒక్క ఏడాదిలో ఎలా సాధ్యమవుతుందని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోలుపై ఆడియో టేపులపై విచారణ చేపట్టాలని మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఓటుకు కోట్లు కేసులో బాబు ఆడియో టేప్‌లు 90 శాతం మ్యాచ్ అవుతున్నాయి. బాబు ఆడియో టేపుపై కూడా యనమల డిమాండ్ చేసి ఉంటే బాగుండేదని’ పార్థసారధి అన్నారు. గాలి జనార్దన్‌రెడ్డి కంపెనీకి మొట్టమొదట లీజుకు ఇచ్చింది చంద్రబాబేనని పార్థసారధి గుర్తుచేశారు. జనార్దన్‌రెడ్డిని చంద్రబాబు సింగపూర్‌లో కలిసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జనార్దన్‌రెడ్డినే కాదు.. చంద్రబాబుపై కూడా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎవరినీ పట్టించుకోవడం లేదు చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని పార్థసారధి విమర్శించారు. రైతులకు మద్ధతు ధర లేక అల్లాడుతుంటే సోమిరెడ్డి పట్టించుకోవడం లేదని.. అలాగే మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే హోంమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర సమస్యలను వదిలిపెట్టి కర్ణాటక గురించి మాట్లాడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ధర్మపోరాటం పేరుతో బాబు దగా.. పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు.. నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. ధర్మపోరాటం పేరుతో చంద్రబాబు దగా చేస్తున్నారన్నారు. బీజేపీ, టీడీపీ ఇద్దరు కలిసి చేసిన అన్యాయంపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రాజధానిలో ఇప్పటివరకూ ఒక్క శాశ్వత నిర్మాణం చేపట్టలేదని, మాయ మాటలు చెప్పి రైతుల భూములు బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు. అభివృద్ధి చేయడం చేతకాక ప్రభుత్వం ప్రతిపక్షంపై నిందలు వేస్తున్నారని పార్థసారధి అన్నారు. -
బీజేపీకి అవకాశం.. మండిపడ్డ యనమల!
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ : కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా ఆరెస్సెస్ భావజాలంతో పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. బీజేపీ పట్ల గవర్నర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, కేవలం ఒక్క కలం పోటుతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశారని యనమల అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో తాజా రాజకీయ పరిణామాలపై ఢిల్లీలో ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. భారత రాజ్యాంగాన్ని పట్టపగలే హత్యచేశారు. ప్రజాస్వామ్యవాదులు వజుభాయ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. గవర్నర్ తన విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేశారని, విచక్షణాధికారం అంటే పక్షపాతంతో వ్యవహరించడం కాదని హితవు పలికారు. యనమల తన ప్రకటనలో పేర్కొన్న అంశాలివే.. ‘కర్ణాటకలో బీజేపీకి సంఖ్యాబలం లేదు. బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే హక్కు లేదు. కానీ గవర్నర్ బీజేపీకి ఎందుకు అవకాశం ఇచ్చారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే రాష్ట్రానికో రకంగా వ్యవహరించరాదు. దేశం మొత్తం ఒకే విధానం అనుసరించాలి. అలాగైతే గోవా, మేఘాలయ, మణిపూర్లలో గవర్నర్లు వేరే విధంగా వ్యవహరించారు. అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌ను మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలి. 10 నెలల క్రితం బిహార్‌లో అత్యధిక సీట్లు సాధించిన ఆర్జేడీని, గోవాలో కాంగ్రెస్ పార్టీలను ప్రభుత్వ ఏర్పాటుకు ఎందుకు ఆహ్వానించలేదు. గవర్నర్ వజుభాయ్ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశారు. భారత రాజ్యాంగానికి ద్రోహం చేశారు, నేతల కొనుగోళ్లకు అవకాశం కల్పించారు. యడ్యూరప్ప శనివారం మెజార్టీ నిరూపించుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం. గవర్నర్ చేసిన తప్పును కొంతమేర సుప్రీంకోర్టు చక్కదిద్దిందని అభిప్రాయపడ్డారు. -
రాష్ట్రపతిని కలిసిన ఆర్థిక మంత్రులు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఐదు రాష్ట్రాల ఆర్ధికమంత్రులు కలిశారు. ఏపీ ఆర్థిక మంత్రి యనమల నేతృత్వంలో కేరళ, పంజాబ్, ఢిల్లీ, బెంగాల్ రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 15 వ ఆర్ధిక సంఘం విధివిధానాలను మార్చాలని మంత్రులు కోరారు. అలాగే కేంద్రం విధివిధానాల విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతికి వినతి పత్రం అందజేశారు. 2011 జనాభా నిష్పత్తి ప్రకారం నిధుల పంపకాల విధానంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతిలో చేసిన తీర్మానం నివేదికను రాష్ట్రపతికి మంత్రులు అందజేశారు. కేంద్రం రాష్ట్రాలను అణిచి వేస్తోంది రాష్ట్రపతిని కలిసిన అనంతరం యనమల మీడియాతో మాట్లాడుతూ.. ‘రాజ్యాంగపరంగా ఆర్టికల్ 280 ప్రకారం ఆర్థిక సంఘం స్వతంత్ర వ్యవస్థ. 14వ ఆర్థిక సంఘం సమయంలో కూడా 1971 జనాభా ప్రతిపాదనే పరిగణనలోకి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఇప్పుడు కూడా 15వ ఆర్థిక సంఘంలో 1971 జనాభానే తీసుకోవాలని ఇపుడు కూడా డిమాండ్ చేస్తోంది. రాష్ట్రాల ఆర్థిక హక్కులకు కేంద్రం భంగం కలిగించరాదు. ఏపీ సర్కారు రాష్ట్రాల హక్కుల కోసం కేంద్రంపై పోరాటం చేస్తూనే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో రాష్ట్రాలకు హక్కులున్నాయి, విధానాలున్నాయి. కేంద్రం బలవంతంగా ఆర్థిక విధానాలను రాష్ట్రాలపై రుద్దరాదు. కేంద్ర ప్రభుత్వ దయదాక్షిణ్యాలపై రాష్ట్రాలు ఆధారపడేలా కేంద్రం వ్యవహరిస్తోంది. రాష్ట్రాలకు భిక్షం వేసేలా 15వ ఆర్థిక సంఘం వ్యవహరిస్తే అంగీకరించం. రాష్ట్రాలు రాజ్యాంగపరంగా హక్కులను కాపాడుకుంటాయి. రాష్ట్రాలకు ఇన్సెంటివ్స్తో ఉపయోగం ఉండదు. కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాయరాదు.15 వ ఆర్థిక సంఘం సిఫార్సులపై జూన్‌లో జాతీయ స్థాయిలో సదస్సు ఏర్పాటు చేస్తాము. వెనుకబడిన రాష్ట్రాల పేరుతో కేంద్రం అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాలను నాశనం చేయాలనుకుంటే చూస్తూ కూర్చోము. కేంద్రం కావాలనుకుంటే వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేయాలి. కేంద్రం రాష్ట్రాలను అణచి వేసేందుకు చూస్తోందనేందుకు కర్ణాటక ఉదాహరణ.’ అన్నారు -
‘బీజేపీది సాంకేతిక విజయం మాత్రమే’
సాక్షి, అమరావతి: కర్ణాటక ఎన్నికల విజయం గురించి ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో ఓట్లు తక్కువగా వచ్చినా.. సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని, అదే కర్ణాటకలో జరిగిందని అన్నారు. అక్కడ బీజేపీది సాంకేతిక విజయం మాత్రమేనని గుర్తుంచుకోవాలని, 2019 ఎన్నికల్లో ఇదే రిపీట్ అవుతుందని బీజేపీ అనుకుంటే పొరపాటే అని తేల్చి చెప్పారు. బీజేపీకి వచ్చింది కేవలం 36 శాతం ఓట్లు మాత్రమేనని, ప్రజా వ్వతిరేఖ నిర్ణయాల వల్లే ఆ పార్టీకి ఓట్ల శాతం పెరగలేదని పేర్కొన్నారు. కన్నడ ప్రజలు మోదీ నియంతృత్వ విధానాల పట్ల విసిగిపోయారని తెలిపారు. కానీ బీజేపీపై ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలుచుకోవడంలో బీజేపీయేతర పార్టీలు విఫలమయ్యాయని అన్నారు. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం తెలుగు వాళ్లు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిసింది. ఎన్నికల ఫలితాలను మరింత విశ్లేషించాల్సిన అవసరం ఉంది’ అని ఆయన తెలిపారు. కర్ణాటకలో బీజేపీ సంఖ్యా పరంగా గెలిచినా.. ఓట్ల పరంగా ఓటమిపాలైందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనుమల రామకృష్ణుడు అన్నారు. 60 శాతానికి పైగా కన్నడ ప్రజలు బీజేపీని వ్యతిరేఖించారని తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఎక్కడా ప్రచారం చేయలేదని యనమల పేర్కొన్నారు. -
నేడు అమరావతిలో 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల భేటీ
సాక్షి, అమరావతి/కాకినాడ రూరల్: 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనలతో రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుందన్న నేపథ్యంలో 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సోమవారం అమరావతిలో సమావేశమవుతున్నారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనల్లో ప్రధానంగా 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్రాలకు నిధుల కేటాయింపులను సిఫార్సు చేయాలని ఉంది. దీని వల్ల ఆంధ్ర ప్రదేశ్‌కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గిపోతాయని, ఏటా 8000 కోట్ల రూపాయలు నష్టం వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఇదే తరహాలో తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, ఒడిశా, పంజాబ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, మేఘాలయ, మిజోరామ్ రాష్ట్రాలు నష్టపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాలన్నీ 2011 జనాభాకు బదులు 1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం ఈ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శులు, ఆర్థిక రంగ నిపుణులు సమావేశమై 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనల కారణంగా ఏ విధంగా రాష్ట్రాలను అన్యాయం జరుగుతుంతో కూలంకుషంగా చర్చించనున్నారు. అనంతరం ఈ నిబంధనలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించాలని నిర్ణయించారు. ఆ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించాలని నిర్ణయించారు. 1971 జనాభా ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకుంటే దేశంలో రాష్ట్ర జనాభా 5.05 శాతంగా ఉంటుంది. అదే 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే దేశంలో రాష్ట్ర జనాభా 4.09 శాతమే ఉంటుంది. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను మార్చాలి: యనమల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా రూపొందించిన 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను మార్చాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాల కారణంగా దేశంలోని 11 రాష్ట్రాల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బ తింటాయన్నారు. విభజన అనంతరం ఏపీకి రూ.16 వేల కోట్ల లోటు ఉన్నట్టు ఆర్బీఐ సహా అన్ని సంస్థలూ నివేదించాయని యనమల తెలిపారు. కేంద్రం ఇప్పటివరకూ రూ.4 వేల కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఇచ్చిందన్నారు. ప్రస్తుతం కేంద్ర పథకాలు 60:40 నిష్పత్తిలో అమలు చేస్తున్నారని దీని వల్ల రాష్ట్రాలపై 30 శాతం అదనపు భారం పడుతోందని అన్నారు. -
మాకు ఈ ఖర్మేంటి?!
సాక్షి, అమరావతి: బదిలీల కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్న వాణిజ్య శాఖ ఉద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు జల్లింది. గతేడాది జీఎస్టీ అమలుకు ఇబ్బందులొస్తాయని భావించిన ప్రభుత్వం వీరి బదిలీలను నిలిపివేసింది. ఈ ఏడాదైనా బదిలీలు చేస్తారు కదా అని ఎదురుచూస్తున్న వారు.. సాధారణ బదిలీలకు అవకాశం ఇవ్వకుండా పరిమితులు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పరస్పర అంగీకారం, రిక్వెస్ట్ బదీలకు మాత్రమే అనుమతిస్తూ జీవో ఇవ్వడంపై మండిపడుతున్నారు. ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఎత్తుగడ! వాణిజ్య శాఖలో 557 గెజిటెడ్ ఆఫీసర్లు, 102 సర్కిల్స్‌లోని సిబ్బందిలో 80 శాతం మందికిపైగా ఉద్యోగులు అయిదేళ్లు దాటినా ఒకే చోట పనిచేస్తున్నారు. ఇలా ఒకే వ్యక్తి ఒకేచోట ఎక్కువ కాలం పనిచేస్తే డీలర్లతో పరిచయాలు పెరిగి అది వసూళ్లపై కూడా ప్రభావం చూపుతుందంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఖర్చులు టీఏ, డీఏ ఖర్చులు తగ్గించుకోవడానికే ఈ ఎత్తుగడ వేసిందని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అటు పిల్లల చదువుల పరంగా, ఇటు ఆర్థికంగా నష్టపోతున్నారని వాణిజ్య శాఖ ఉద్యోగ సంఘం చెబుతోంది. కొంతమంది గ్రామీణ ప్రాంతానికి బదిలీ అయి, పిల్లల చదువుల కోసం చాలామంది కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. కానీ గడిచిన నాలుగేళ్లుగా 20 శాతానికి మించి ఉద్యోగులకు బదిలీలు చేయకపోవడం, గతేడాది అసలు పూర్తిగా లేకపోవడంతో వీరు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్సు ఎక్కువని, అలాగే అమరావతి పరిధిలో పనిచేసే వారికి సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్(సీసీఏ) అదనంగా లభిస్తుందని.. అయితే గ్రామీణ ప్రాంతంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రం ఆర్థికంగా నష్టపోతున్నారని చెబుతున్నారు. ఆర్థిక మంత్రిని కలుస్తాం.. వాణిజ్య శాఖలో సాధారణ బదిలీలకు అనుమతించాలని త్వరలోనే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు, ఆ శాఖ ప్రధాన కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు ఆల్ ఇండియా వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్ సూర్యనారాయణ చెప్పారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సాధారణ బదిలీలకు అనుమతించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. -
డిగ్రీ చదివిన వారికే నిరుద్యోగ భృతి
సాక్షి, అమరావతి: డిగ్రీ పూర్తి చేసిన వారినే నిరుద్యోగ భృతికి అర్హులుగా పరిగణించాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. నిరుద్యోగ భృతి విధివిధానాల ఖరారు కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన సమావేశమైంది. డిగ్రీ తరువాత ఉన్నత విద్య అభ్యసించే వారిని అనర్హులుగా పరిగణించాలని, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన వారికి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. కుటుంబంలో కేవలం ఒక్కరికే భృతి అందించేలా విధివిధానాలు రూపొందించాలని తీర్మానించింది. అలాగే ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పోస్టులతోపాటు ప్రైవేట్ పరిశ్రమల్లో పనిచేసేవారు నిరుద్యోగ భృతికి అనర్హులు. అర్హులైన నిరుద్యోగుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు మంత్రులు సూచించారు. జిల్లా కేంద్రంగా ఒక అధికారిని నియమించి, దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టేలా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. అదనంగా దరఖాస్తులు వస్తే, వారికి వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేసి, ఉపాధి అవకాశాలు కల్పించాలని సమావేశంలో నిర్ణయానికొచ్చారు. ఉపాధి దొరకగానే భృతి కట్ 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు వివరించారు. ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయిలో విధివిధానాలను రూపొందించాలని అధికారులను మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. నిరుద్యోగ భృతి అందుకునే యువతకు పలు రంగాల్లో శిక్షణ ఇచ్చి, పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తున్నారు. అలా ఉపాధి కల్పించిన వెంటనే వారిని నిరుద్యోగ భృతి పథకం నుంచి తొలగించి, కొత్తవారికి అవకాశం కల్పించాలని మంత్రులు నిర్ణయించారు. న్యాయపరంగా ఇబ్బందులు తలెత్తకుండా విధివిధానాలు పక్కాగా రూపొందించాలని మంత్రులు సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. నిరుద్యోగుల్లో అసంతృప్తి అర్హతల పేరిట నిరుద్యోగుల సంఖ్యలో భారీగా కోత విధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. సర్కారు తాజా నిర్ణయాలపై నిరుద్యోగులు తీవ్ర అంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ తర్వాత పెద్ద చదువులు చదువుకున్న చాలామంది ఇప్పటికీ ఉపాధి అవకాశాలు దొరక్క నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. వీరికి భృతి ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. -
కేంద్రం ఏం చేద్దామనుకుంటోంది : యనమల
సాక్షి, అమరావతి : ఆంధధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంక్ అధికారుల సమావేశం జరిగింది. ఇందులో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు పలు బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యనమల బ్యాంకుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తీవ్ర నగదు కొరత ఏర్పడిందని, ఏటీఎంలు మూతపడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఏటీఎంల్లో నగదు అందుబాటులో ఉండటంలేదని.. కనీసం వెయ్యి రూపాయలు కూడా దొరకడం లేదన్నారు. ఏటీఎంలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా నగదు దొరకని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. నగదు కొరతతో రియల్ఎస్టేట్ రంగం పడిపోయిందని, ఎకనామిక్ యాక్టివిటి జరగడంలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో వృద్ధిరేటు శాతం తగ్గిపోయిందని, భవిష్యత్తులో మనీ సర్క్యూలేషన్ లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందుల వస్తాయని యనమల అన్నారు. రాష్ట్రంలో చాలా వరకు ఏటీఎంలు మూతపడ్డాయని, ప్రజలు బ్యాంకుల చుట్టూ, ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నా నగదు దొరకని పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని యనమల అభిప్రాయపడ్డారు. నగదు కొరతపై చంద్రబాబు ఇప్పటికే పలుసార్లు కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు. నల్లధనాన్ని అరికడతామని నాడు కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిందని, కానీ అది పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా నోట్ల రద్దు వల్ల ఇతరత్రా సమస్యలు అనేకం తలెత్తాయిని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2వేల నోట్లు కనిపించకుండా పోయాయని, కనీసం వందనోట్లు కూడా ఎక్కడ దొరకడం లేదంటూ యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు డబ్బు సర్క్యులేషన్లో ఉంటేనే ఆర్ధిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఆర్థిక కార్యకలాపాలు స్థంభిస్తే అభివృద్ధి ఎలా సాధ్యం అంటూ ప్రశ్నించారు. నోట్ల రద్దు ప్రభావం ప్రభుత్వాలపై పడుతోందని, బ్యాంకుల్లో నగదు లేమిని నివారించాలని బ్యాంకు అధికారులను కోరారు. ఈ వ్యవహారంపై కేంద్రం ఏం చేద్దామనుకుంటుందో అర్థం కావడంలేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే మంత్రి యనమల వ్యాఖ్యలతో బ్యాంకు అధికారులు విభేదించారు. ఆర్బీఐ నుంచి వేల కోట్లు విలువ చేసే కొత్త నోట్లు అందించామని తెలియచేశారు. -
గొడ్డు చాకిరీ.. గొర్రె తోక జీతం
కాకినాడ రూరల్ : చాలీచాలని వేతనాలతో ఆశ వర్కర్లు నానా అవస్థలు పడుతున్నారు. పనిని బట్టి పారితోషికం అంటూ నియామకాలు చేసుకున్న ప్రభుత్వం, వారికి కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదు. వేతనాలు పెంచే అవకాశం లేదని ఇటీవల ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పడంతో వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాతాశిశు మరణాలు తగ్గించడం మొదలు, గర్భిణులకు, శిశువులకు టీకాలు, పల్స్ పోలియో చుక్కలు, ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవాలు అయ్యేలా చూడడం తదితర పనుల్లో ప్రభుత్వం వీరి సేవలను ఉపయోగించుకుంటోంది. రూరల్ నియోజకవర్గంలో 172 మంది ఆశ వర్కర్లు పని చేస్తున్నారు. అన్ని పనులు వీరితోనే.. గ్రామాల్లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్, తదితర విష జ్వరాలు ప్రబలితే తొలుత వైద్యసేవలు అందించేది ఆశ వర్కర్లే. ఇంటింటికీ వెళ్లి జ్వరపీడితులు ఎంతమంది ఉన్నారనే సమాచారం సేకరిస్తారు. ప్రసవం కేసులు కాకినాడ జీజీహెచ్‌కి రిఫర్ చేసి వారి వెనువెంటనే ఉంటూ ప్రసవం పూర్తి అయ్యే వరకు సేవలందిస్తున్నారు. వేతనం తక్కువ.. వీరికి నెలకు రూ.800 నుంచి రూ.1200కి మించి ఇవ్వడంలేదు. పల్స్ పోలియో కార్యక్రమంలో (రోజంతా పనిచేస్తే) రూ.75, గర్భిణిని ఆసుపత్రిలో పరీక్షకు తీసుకువస్తే రూ.60, ప్రభుత్వాసుపత్రిలో పరీక్షకు పంపితే రూ.300, కుటుంబ సంక్షేమ ఆపరేషన్ చేయిస్తే రూ.150, బాలింతను పర్యవేక్షిస్తే రూ.20, టీబీ రోగికి ఐదు నెలల పాటు మందులు అందజేస్తే రూ.300, ఇంటింటికి తిరిగి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందిస్తే ప్యాకెట్‌కి రూపాయి చొప్పున అందజేస్తున్నారు. ఏటా ఆశ కార్యకర్తలకు యూనిఫారం ఇవ్వాల్సి ఉండగా రెండేళ్లుగా ఇవ్వడం లేదు. ఇటీవలే 36 గంటలపాటు ఆందోళన నిర్వహించిన కార్యకర్తలు కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలోని మంత్రి యనమల రామకృష్ణుడు క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు కూడా. డిమాండ్లు ఇవీ.. ∙కనీస వేతనం అమలు చేయాలి. ∙కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారితోషికాలు పెంచాలి. ∙రూ.ఐదు లక్షల ప్రమాద బీమా అర్హత కల్పించాలి. ∙104 సేవల బకాయిలు చెల్లించాలి. ∙రెండేళ్లుగా ఇవ్వని యూనిఫాంతో పాటు అలవెన్స్ చెల్లించాలి. ∙అర్హులైన ఆశలకు ఏఎన్ఎం శిక్షణ ఇవ్వాలి. .ఇప్పటికే శిక్షణ పొందిన వారిని సెకండ్ ఏఎన్ఎంగా తీసుకోవాలి. -
బడ్జెట్లో కంటే ఎక్కువే ఖర్చు చేశాం
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు అదనంగా మరో 36 కొత్త పథకాలను ప్రవేశపెట్టామని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. బీసీలకు చంద్రన్న పెళ్లి కానుక, ఆదరణ పథకం, నిరుద్యోగ భృతి, లైవ్ స్టాక్ ఇన్సూరెన్స్ వంటి కొత్త పథకాలకు బడ్జెట్లో కేటాయింపులు జరిగాయని ఆయన అన్నారు. 2018-19 బడ్జెట్ గురించి మంగళవారం యనమల శాసనమండలిలో మాట్లాడుతూ..‘చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గత మూడేళ్లు ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయడం జరిగింది. బడ్జెట్ పెద్దదైనా ఖర్చుచేయడం లేదని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. విమర్శలు చేసేముందు బడ్జెట్లో కేటాయింపులు, జరిగిన ఖర్చులు గమనించాలన్నారు. ప్రవేశ పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువే ఖర్చు చేశాం. ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లుందని కాగ్ చెప్పింది. రాష్ట్రానికి రెవెన్యూ లోటు రూ.4వేలకోట్లు మాత్రమే ఇవ్వడం దారుణం. రైతులకు, మహిళలకు రుణమాఫీ చేస్తే కేంద్రం ఎందుకు అభ్యంతరం చెబుతోంది. రాష్ట్ర విభజన తర్వాత జనాభా ప్రాతిపదికన అప్పులు పంచడంతో మన రాష్ట్రానికి అప్పులు ఎక్కువచ్చాయి. విభజనకు ముందు చేసిన అప్పుకు రూ.10వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నాం. భారతదేశంలోని రాష్ట్రాలన్నీ 9శాతం వడ్డీకి అప్పు తెస్తే మన రాష్ట్రం 7.9కే అప్పు తెస్తోంది. 2018-19 లో రైతులకు, మహిళలకు చెల్లించాల్సిన అప్పును మొత్తం తీరుస్తాం..నదుల అనుసంధానం వల్ల రాష్ట్ర వృద్ధి రేటు పెరిగింది’ అని తెలిపారు. -
అమరావతికి అరకొర
ప్రపంచ స్థాయి రాజధాని పేరుతో నిత్యం హడావుడి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం దానికి మున్సిపాల్టీ స్థాయి నిధులు కూడా కేటాయించలేదు. రూ.వేల కోట్ల నిధులతో రాజధాని ప్రాజెక్టులు చేపట్టినట్లు, వాటికి ప్రణాళికలు రూపొందించినట్లు చేస్తున్న ప్రకటనలకు, బడ్జెట్లో చేసిన కేటాయింపులకు పొంతనే లేదు. మంత్రి యనమల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాజధాని ప్రాజెక్టులకు రూ.678 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. అందులో భూసమీకరణ కోసం రూ.166 కోట్లు చూపగా, ప్రాజెక్టులకు రూ.457 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో రాజధాని నిర్మాణాన్ని ఎప్పటికి పూర్తి చేస్తారో అంతుబట్టడంలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. –సాక్షి, అమరావతి ఆశ్చర్యపోతున్న సీఆర్డీఏ వర్గాలు రాజధానిలో ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టుల విలువే రూ.30 వేల కోట్లు ఉన్నట్లు సీఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి. రోడ్డు గ్రిడ్‌లో భాగంగా నిర్మిస్తున్న ఆర్టీరియల్, మేజర్, సబ్ ఆర్టీరియల్ రోడ్ల పనులకు రూ.6 వేల కోట్లకుపైగా కావాలని చెబుతున్నారు. అలాగే ప్రభుత్వ పరిపాలనా నగరంలో ముఖ్య కట్టడాలకు సుమారు రూ.10 వేల కోట్లు కావాలని ప్రణాళిక రూపొందించారు. ఇందులో నిర్మించే అసెంబ్లీ, హైకోర్టు, ముఖ్యమంత్రి, గవర్నర్ నివాస భవనాలను ఈ ఏడాది ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. డిజైన్ల ప్రక్రియను త్వరలో పూర్తి చేసి ఈ భవనాలకు టెండర్లు పిలుస్తామని చెబుతోంది. అలాగే కృష్ణానదిపై రూ.1400 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచారు. బడ్జెట్ కేటాయింపులు చూసి రాజధాని ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయో అంతుబట్టడం లేదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. గతేడాది బడ్జెట్లో రాజధానికి రూ.1,429 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది అందులో సగం కూడా కేటాయించకపోవడం పట్ల సీఆర్డీఏ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఈ బడ్జెట్లో కేటాయించిన రూ.678 కోట్లు సిబ్బంది జీతాలు, కన్సల్టెన్సీల ఫీజులకు కూడా చాలవని అంటున్నాయి. దీంతో ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం పేరుతో చేసేదంతా హడావుడేనని ఆచరణ హీనంగా ఉందని స్పష్టమవుతోంది. జిల్లాకో స్మార్ట్ సిటీకి దిక్కు లేదు మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థలకు కేటాయించిన నిధులపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ శాఖకు మొత్తం రూ.7741 కోట్లు కేటాయించారు. స్మార్ట్ సిటీస్, అమృత్ పథకాలకు కేటాయించిన నిధులకు, అక్కడ జరుగుతున్న పనులకు పొంతన ఉండటం లేదు. జిల్లాకో స్మార్ట్ సిటీ నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన కార్యరూపం దాల్చలేదు. ఈ బడ్జెట్లో వాటి ప్రస్తావనే లేదు. రాబోయే రోజుల్లో అమరావతిని స్మార్ట్ సిటీ నగరాల్లో మొదటి గ్రీన్‌ఫీల్డ్ సిటీగా ఉంచుతామని, మిగిలిన నగరాలకు ఒక సూచికగా ఉంటుందని చెబుతున్న సీఎం అందుకు అనుగుణంగా నిధులు కేటాయించలేదు. స్మార్ట్ నగరాలుగా ప్రకటించిన విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలకు గత ఏడాది కంటే నిధులు అధికంగా కేటాయించారు. అయితే గతేడాది వీటికి కేటాయించిన రూ.250 కోట్లలో రూ.50 కోట్లలోపే ఖర్చు చేసిన ప్రభుత్వం ఈ ఏడాది వీటి కోసం రూ.800 కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టులకు కేంద్రం తన వాటా నిధులను విడుదల చేసినా, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదల్లో జాప్యం కారణంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. అమృత్ పథకానికి గతేడాది రూ.300 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ.490 కోట్లు కేటాయించారు. కొత్తగా ఏర్పాటైన పట్టణాభివృద్ధి సంస్థలకు ఆర్థిక జవసత్వాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఆ మేరకు నిధులు కేటాయించలేదు. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి రూ.5 కోట్లనే విడుదల చేసింది. మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచడానికి గతేడాది రూ.100 కోట్లను కేటాయిస్తే ఈ బడ్జెట్లో రూ.300 కోట్లను కేటాయించారు. అన్న క్యాంటీన్లకు ఈ బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రాథమిక మౌలిక సౌకర్యాల కోసం రూ.75 కోట్లు, నగర పంచాయతీలు, గ్రేడ్–3 పురపాలక సంఘాల్లో మౌలిక సదుపాయాలకు రూ.119 కోట్లు ప్రతిపాదించారు. -
కాకిలెక్కలు.. సర్కస్ ఫీట్లు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు పెట్టిన 2018–19 రాష్ట్ర బడ్జెట్లో అంకెలు ఘనంగా కనిపిస్తున్నా అన్నీ కాకిలెక్కలేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రచారం కోసం ఉద్దేశించిందే తప్ప.. ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధిని పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. ఎన్నికల ఏడాది కనుక ఈ బడ్జెట్లోనైనా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని ఆశించిన వారికి నిరాశే ఎదురయ్యింది. ఊహాజనిత లెక్కలతోనే ఆర్థిక మంత్రి యనమల బడ్జెట్ కేటాయింపులు సరిపుచ్చారు. ఒక్క హామీకి కూడా న్యాయం చేసే విధంగా కేటాయింపులు చేయలేదు. కేంద్ర గ్రాంట్లపై ఆశలు.. భారీ రెవెన్యూ వ్యయంతో రూపొందించిన బడ్జెట్‌కు ఆర్థిక వనరులు ఎక్కువగా కేంద్ర గ్రాంట్లు, అప్పులపైన ఆధారపడినట్లు స్పష్టమైంది. అంతే కాకుండా ఏకంగా రాష్ట్ర సొంత పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని భారీగా చూపెట్టారు. అంటే అదనంగా పన్నులైనా వేయాలి లేదా గొప్పల కోసం రాని ఆదాయాన్ని వస్తుందని అంచనా వేసైనా ఉండాలి అని నిపుణులంటున్నారు. అలాగే కేంద్రం నుంచి గ్రాంటు రూపంలో రూ.50,696 కోట్లు వస్తాయని బడ్జెట్లో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర నుంచి గ్రాంటు రూపంలో రూ.37,548 కోట్లు వస్తాయని అంచనా వేయగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే 2018–19లో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఏకంగా రూ.50,695 కోట్లు వస్తాయని అంచనా వేశారు. ఈ లెక్కలన్నీ ఊహాజనితమే తప్ప వాస్తవ రూపం దాల్చవనేది ఆర్థిక శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అలాగే గత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర సొంత పన్నుల ద్వారా రూ.53,715 కోట్లు వస్తాయని అంచనా వేయగా సవరించిన అంచనాల్లో రూ.52,715 కోట్లే వస్తాయని పేర్కొన్నారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ.65,535 కోట్లు్లగా అంచనా వేశారు. అంటే ఏకంగా రూ.12,820 కోట్లు పన్నుల రూపంలో అదనంగా ఆదాయం వస్తుందని స్పష్టం చేశారు. ఓపెన్ మార్కెట్ ద్వారా రూ.29,605 కోట్ల అప్పులు చేయాలని నిర్ణయించారు. రెవెన్యూలోటు పెరిగినా మిగులేనా.. విచిత్రంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017–18) బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో రూ.415 కోట్ల రెవెన్యూ లోటును చూపెట్టగా.. ఇప్పుడు సవరించిన అంచనాల్లో రెవెన్యూ లోటు రూ.4,018 కోట్లకు పెరిగిపోయింది. అయినా సరే 2018–19కి మాత్రం రెవెన్యూ మిగులు బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఏకంగా రూ.5,235 కోట్ల రెవెన్యూ మిగులతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ద్రవ్య జవాబు దారీ బడ్జెట్ నిర్వహణ చట్టం నిబంధనలను సడలించుకుని అప్పులు ఎక్కువగా తీసుకోవడానికి వెసులు బాటు కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆర్థిక వర్గాలే పేర్కొన్నాయి. బడ్జెట్ కేటాయింపులకు, వాస్తవ వ్యయానికి పొంతన లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులనే తిరిగి సవరించిన అంచనాలుగా పేర్కొన్నారంటే వాస్తవంగా వ్యయం ఎంత చేసిందీ చెప్పకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది. మద్యం నుంచి ఆదాయాన్ని భారీగా ఆశిస్తున్నట్లు అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మద్యం నుంచి రూ.5,886 కోట్లు వస్తాయని పేర్కొనగా 2018–19లో రూ.7,357 కోట్ల ఆదాయం వస్తుందని ప్రతిపాదించారు. రవాణా, స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్స్ ద్వారా భారీగా ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. ♦ సామాజిక ఆర్థిక సర్వే 2017-18 తెలియకుండా పన్ను పీకుతున్నారు రాష్ట్ర సొంత పన్ను ఆదాయంలో 20 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2016–17లో రూ.44,181 కోట్లుగా ఉన్న సొంత పన్నుల ఆదాయం.. ఈ ఏడాది రూ.52,717 కోట్లకు చేరింది. ఇదే సమయంలో సొంత పన్నేతర ఆదాయంలో 34 శాతం వృద్ధి నమోదైంది. 2016–17లోరూ.3,989 కోట్లుగా ఉన్న ఆదాయం.. ఈసారి రూ.5,347 కోట్లకు పెరిగింది. ఈ రెండూ కలిపితే రాష్ట్ర సొంత ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.48,170 కోట్ల నుంచి రూ.58,064 కోట్లకు చేరింది. -
నిరుద్యోగులకు మళ్లీ మొండిచేయి..
సాక్షి, అమరావతి: ఇంటికో ఉద్యోగం – ఉపాధి కల్పిస్తామని, ఇవ్వలేకపోతే నెలకు రూ.2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు నాలుగేళ్ళుగా వంచిస్తూనే ఉన్నారు. రెండేళ్లపాటు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. గత సంవత్సరం రూ. 500 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. ఇంతవరకు ఒక్కరికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఈ ఏడాది బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించినట్లు ఆర్భాటంగా ప్రకటించారు. రాష్ట్రంలో సుమారు కోటిన్నర కుటుంబాలు ఉన్నాయి. ఈ లెక్కన నెలకు రూ. 3వేల కోట్లు ప్రభుత్వం నిరుద్యోగులకు బకాయి ఉంది. సంవత్సరానికి రూ. 36వేల కోట్లు.. నాలుగేళ్ళలో రూ. 1.44 లక్షల కోట్లు ప్రభుత్వం నిరుద్యోగులకు బకాయిపడింది. ఈ ఆర్థిక సంవత్సరం కూడా కలుపుకుంటే రూ. 1.80 లక్షల కోట్లు. మరి రూ. 1,000 కోట్లు ఏమూలకు? 2016లో ప్రభుత్వం నిర్వహించిన పల్స్ సర్వేలో 35 సంవత్సరాల లోపు నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించారు. అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఇతరుల వివరాలు ప్రభుత్వం నమోదు చేసింది. పదో తరగతి నుంచి పీజీ వరకు ఏ తరగతిలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో ఒక లెక్క తయారు చేసింది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగులు 24 లక్షల మంది ఉన్నట్లు చెబుతున్నది. పదో తరగతి చదివిన వారు 6.25 లక్షల మంది, పాలిటెక్నిక్, ఐటీఐ వంటి సాంకేతిక అర్హతలు కలిగిన వారు 2.89 లక్షల మంది ఉన్నారని ప్రభుత్వం చెబుతున్నది. పోస్టు గ్రాడ్యుయేషన్, ఇతర అర్హతలు కలిగిన వారు 2.07 లక్షల మంది ఉన్నట్లు ఆరు నెలల క్రితం ప్రభుత్వం అధికారిక లెక్కలు తయారు చేసింది. ప్రభుత్వం చెబుతున్న ప్రకారమే చూసినా అన్ని తరగతులకు సంబంధించి 33,70,315 మంది నిరుద్యోగులు ఉన్నారు. ఎస్సీ నిరుద్యోగులు 6,11,309, ఎస్టీ నిరుద్యోగులు 1,38,328, బీసీ నిరుద్యోగులు 16,20,823, దివ్యాంగ నిరుద్యోగులు 11,683, ఇతరులు 9,88,172 మంది ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలు తయారు చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా ఈ 33,70,315 మందికి నెలకు రూ.2వేల చొప్పున ఎంత ఇవ్వాలి? ఇపుడు కేటాయించిన రూ.1,000 కోట్లు ఏ మూలకు..? -
సంక్షేమ రంగానికి పెద్దపీట వేశాం
సాక్షి, అమరావతి: సమసమాజ లక్ష్య సాధన కోసం సంక్షేమ రంగానికి పెద్దపీట వేశామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. స్థూల ప్రణాళికలు, సూక్ష్మ అమలు.. అనే విధానంతో తాను ప్రవేశపెట్టే వివిధ పథకాలు తమ ప్రభుత్వ ఉద్దేశాలను ద్విగుణీకృతం చేస్తాయని తనకు గట్టి నమ్మకం ఉందన్నారు. సాధ్యమైన ఆదాయ వనరులను మదింపు చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రావాల్సిన అన్ని బకాయిలు అందుతాయనే ఆకాంక్షతో రెవెన్యూ మిగులు బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న వనరుల అంచనాలను ప్రాధాన్యాలతో సర్దుబాటు చేయడం కష్టమైన చర్యని పేర్కొన్నారు. అన్ని వర్గాల జీవనాన్ని మెరుగుపర్చడమే ప్రభుత్వ పథకాల ముఖ్యోద్దేశమని ఉద్ఘాటించారు. అనేక సవాళ్ల మధ్య కూడా పట్టుదల, దృఢ చిత్తంతో మనం సాధిస్తున్నపురోగతి ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తోందన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1,91,063.61 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2017 –18 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే బడ్జెట్ 21.70 శాతం పెరిగిందని వివరించారు. మొత్తం 52 పేజీల బడ్జెట్ ప్రసంగాన్ని సరిగ్గా మధ్యాహ్నం 11.29 గంటలకు ప్రారంభించి, 12.55కు పూర్తిచేశారు. రూ.19 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్ వ్యవసాయం, అనుబంధ రంగాలకు వచ్చే ఆర్ధిక సంవత్సరానికి రూ.19,070 కోట్లతో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గురువారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.18602.98 కోట్లు కాగా 467.38 కోట్లు పెట్టుబడి వ్యయం. రైతు సంక్షేమం, పంటల ఉత్పాదక పెంపే లక్ష్యంగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. రుణమాఫీకి రూ.4,100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. -
బడాయి అంకెలు!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దాదాపు రెండు లక్షల కోట్లకు చేరువగా.. భారీ బడ్జెట్... కేంద్రం నుంచి రూ.50,696 కోట్ల గ్రాంట్లు.. సొంత ఆదాయం రూ.65,535 కోట్లు.. కేంద్ర పన్నుల్లో వాటా రూ.33,930 కోట్లు.. మిగులు రూ.5,235 కోట్లు.. ఏ రంగం చూసినా వేల కోట్ల కేటాయింపులు.. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్ర అసెంబ్లీకి సమర్పించిన 2018–19 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఇలాంటి బడాయి అంకెలెన్నో కనిపిస్తాయి. ఆశ్చర్యం కలిగిస్తాయి.. ఎన్నికల ఏడాది.. అందులోనూ చివరి బడ్జెట్ కనుకే అంకెల్లో అంత బడాయి.. అసలు సంగతి షరామామూలే... భారీగా కేటాయింపులు చేయడం, వాటికి సర్దుబాటు చేయలేక చతికిల పడటం రివాజుగా మారింది. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అయ్యే ఖర్చుకు.. బడ్జెట్లో కేటాయింపులకు పొంతనే లేదు. రుణమాఫీ పేరుతో రైతులను దారుణంగా వంచించారు. ఈ బడ్జెట్లోనూ వారికి ఒరిగింది శూన్యం. రూ.87,612 కోట్ల రుణాలున్నా చంద్రబాబు రూ.24వేల కోట్లేనని కుదించారు. వాటికి కూడా దశలవారీగా ఇచ్చింది అరకొరే.. వడ్డీలలో పావు వంతుకు కూడా మాఫీ సొమ్ము సరిపోలేదు. బాబును నమ్మి డిఫాల్టర్లుగా మారిన రైతులు వడ్డీలేని రుణాలకే కాదు కొత్త రుణాలకూ దూరమయ్యారు. అచ్చం అలానే నిరుద్యోగులకూ ముఖ్యమంత్రి చంద్రబాబు కుచ్చుటోపీ పెట్టారు.. ఇంటికో ఉద్యోగం– ఉపాధి అన్నారు... ఇవ్వలేకపోతే నెలకు రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు... జాబు కావాలంటే బాబు రావాలన్నారు... ఇంకేముంది తలరాత మారిపోతుందని నిరుద్యోగులు తబ్బిబ్బయ్యారు.. ఎన్నికలు ముగిశాయి... చూస్తుండగానే నాలుగేళ్లు నడిచివెళ్లిపోయాయి.. కొత్తగా ఒక్క ఉద్యోగం లేదు సరికదా ఉన్న ఉద్యోగాలనే ఊడబీకుతున్నారు.. పరిశ్రమలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి ఉపాధి అవకాశాలను పెంచి ఆర్థిక రంగ పరిపుష్టికి దోహదపడే సంజీవని వంటి ప్రత్యేకహోదాను గాలికొదిలేశారు. ఎన్నికల ఏడాది కనుక ఈ 2018–19 బడ్జెట్లోనైనా తమకు న్యాయం చేస్తారని నిరుద్యోగులు ఎదురుచూశారు. వారికి ముఖ్యమంత్రి ‘చిల్లర’తో సరిపెట్టారు. నిరసనలు చూసి గతేడాది నిరుద్యోగులకు ఆర్థికసాయం అంటూ రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ ఒక్క పైసా కూడా విదల్చలేదు. అవి ఎటుపోయాయో తెలియదు. ఈ బడ్జెట్లో నిరుద్యోగులకు రూ.1,000 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో కోటిన్నర కుటుంబాలున్నాయి. ఒక్కో కుటుంబానికి రెండువేల చొప్పున నెలకు మూడువేల కోట్లు బకాయి. ఏడాదికి రూ.36వేల కోట్లు.. నాలుగేళ్లకు రూ.1.44 లక్షల కోట్లు బకాయి. ఈ ఏడాది మరలా రూ.36 వేల కోట్లు బకాయి. అంటే మొత్తం రూ.1.76 లక్షల కోట్లు నిరుద్యో గులకు చంద్రబాబు ప్రభుత్వం బకాయి ఉన్నదన్నమాట. మరి ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన రూ.1,000 కోట్లు ఏమూలకు? అవి కూడా వారికి ఖర్చుచేస్తారో లేదో దేవుడికే ఎరుక... ఇవే కాదు.. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు వాటిని నెరవేర్చడానికి నాలుగు బడ్జెట్లలో కేటాయించింది శూన్యం.. ఐదో బడ్జెట్లోనూ అదే ఒరవడిని కొనసాగించారు. హామీలన్ని టినీ అటకెక్కించారు. కమీషన్లకు వీలున్న సాగునీటిపారుదల శాఖకు మాత్రం భారీ కేటాయింపులు జరిపినా పనులు జరుగుతున్న దాఖలాలే లేవు. వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టుకు సరేసరి.. డ్వాక్రా మహిళలకూ టోకరా ఇచ్చారు. రుణమాఫీకి సరిపడా కేటాయింపులే లేవు. ప్రజారోగ్యానికి కీలకమైన ఆరోగ్యశ్రీకి కోతలు విధించి..108 అంబులెన్సులు, 104 పథకా లకు ఎప్పటిలాగే అరకొర కేటాయించారు. సంక్షేమానికి నిధులు పెంచినట్లు కనిపిస్తున్నా గతేడాది ఖర్చు చేయని నిధులు వెక్కిరిస్తున్నాయి.. -
ఏపీ బడ్జెట్ 2018-19 హైలైట్స్
-
యనమల బడ్జెట్ ఇలా..
సాక్షి, అమరావతి : 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ లక్షా 91వేల 63 కోట్లతో ఏపీ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ 1,50,270 కోట్లుగా, మూలధన వ్యయాన్ని రూ 28,678 కోట్లుగా అంచనా వేశారు. ఆర్థిక లోటును రూ 24,205 కోట్లుగా బడ్జెట్లో పేర్కొన్నారు. గతంతో పోలిస్తే బడ్జెట్ 21.70 శాతం పెరిగింది. కేంద్రం నుంచి సరైన సాయం అందడం లేదని, కేంద్రం సహకరిస్తే మరింత పురోగతి సాధించే అవకాశం ఉండేదని యనమల పేర్కొన్నారు. నిరాశ, నిస్తేజంల మధ్యే ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇతర రాష్ర్టాలతో సమానంగా ఎదిగేందుకు పట్టుదలతో పోరాడతామన్నారు. సంక్షోభాలను అవకాశంగా మలుచుకుని ముందుకు సాగుతున్నామన్నారు. బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేశామని యనమల చెప్పారు. -
ఐటీకి ఆసరా ఏదీ..?
సాక్షి, అమరావతి : ఐటీలో రాబోయే సంవత్సరాల్లో లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఏపీని ఐటీ హబ్‌గా మారుస్తామని గొప్పలు చెబుతున్న ఏపీ సర్కార్ బడ్జెట్లో మాత్రం నామమాత్రపు నిధులతో సరిపెట్టింది. మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్న క్రమంలో ఐటీకి భారీగా కేటాయింపులు చేపట్టాల్సిన క్రమంలో కేవలం రూ 1007 కోట్లను కేటాయించింది. గత ఏడాది అత్యల్పంగా రూ 364 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో మూడురెట్లు పెంచినట్టు ఆర్భాటంగా ప్రకటించింది. ఐటీ రంగానికి ఊతమిచ్చే స్టార్టప్‌లకు రూ 100 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. అమరావతి వెలుపల విశాఖ, అనంతపురం సహా పలు ప్రాంతాల్లో ఐటీని అభివృద్ధి చేయాల్సిన క్రమంలో బడ్జెట్లో ఈ రంగానికి జరిపిన కేటాయింపులు నిరుత్సాహంగా ఉన్నాయనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. -
ఏపీ బడ్జెట్: ఇరిగేషన్‌కు అరకొరే..
సాక్షి, అమరావతి : ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్ కీలక రంగాలకు మొక్కుబడి కేటాయింపులు జరిపింది. అత్యంత ప్రాధాన్యం కలిగిన నీటిపారుదల రంగానికి కేవలం రూ 16,978 కోట్లే కేటాయించింది. వీటిలో పోలవరానికి రూ 9,000 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టుకు గత నాలుగేళ్లలో కేవలం రూ 8000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఒక్క ఏడాదిలో రూ 9000 కోట్లు ఎలా ఖర్చుచేస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు పెరిగిన అంచనా వ్యయాల నేపథ్యంలో నిర్మాణ దశలో ఉన్న పలు ప్రాజెక్టులకు ఈ నిధులు ఎంతమాత్రం సరిపోవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగానికి రూ 12,355 కోట్లు కేటాయించింది. కరవు, గిట్టుబాటు ధరలు లేక సతమతమవుతున్న అన్నదాతను ఆదుకునే క్రమంలో ఇవి అరకొర నిధులే. -
ఏపీ బడ్జెట్ 2018-19 హైలైట్స్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2018-19కిగాను రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఆయన గురువారం ఉదయం ఏపీ శాసనసభలో ఉదయం11.30గంటలకు బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని మొదలుపెట్టారు. 2019లో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వానికి అతిముఖ్యమైనది కాగా ప్రత్యేక హోదా విషయం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్లో ముఖ్యాంశాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2018-19 హైలైట్స్.. మొత్తం బడ్జెట్ రూ.లక్షా 91 వేల 63 కోట్లు రెవిన్యూ వ్యయం రూ.లక్షా 50 వేల 270కోట్లు మూలధన వ్యయం రూ.28వేల 671 కోట్లు ఆర్థిక లోటు అంచనా రూ.24,205 కోట్లు వృద్ధిరేటు : 10.96శాతం సంక్షేమ రంగం సాంఘిక సంక్షేమానికి రూ.13,722కోట్లు వెనుకబడిన వైశ్యులకు రూ. 35కోట్లు కాపులకు రూ.వెయ్యి కోట్లు కాపు సామాజిక విద్యార్థులకు రూ.750కోట్లు దూదేకులవారికి కేటాయింపులు.. రూ.40కోట్లు నాయీ బ్రాహ్మణులకు రూ.30కోట్లు వెనుకబడిన తరగతుల సంస్థకు రూ.100కోట్లు వాల్మీకీ బోయిలకు రూ. 50కోట్లు క్రిస్టియన్ మైనారిటీలకు రూ.75కోట్లు మహిళా శిశు సంక్షేమానికి రూ.2839 గిరిజన సంక్షేమం రూ.250 కోట్లు బీసీ సంక్షేమం రూ.4477కోట్లు కార్మిక ఉపాధి కల్పలనకు రూ.902కోట్లు సామాజిక భద్రతకు రూ.3వేల 29కోట్లు చేనేతల సంక్షేమానికి రూ.250కోట్లు డ్వాక్రా మహిళలకు రూ.1000 కోట్లు చంద్రన్న పెళ్లి కానుకల కింద బీసీలకు, ఎస్సీలకు చెరో రూ.100కోట్లు నీరు చెట్టు పథకానికి రూ.500 కోట్లు విద్యుత్, వ్యవసాయం, సాగునీటి రంగం సాగునీటి రంగానికి రూ.16,978కోట్లు ఇరిగేషన్ విభాగం కింద పోలవరానికి రూ.9వేల కోట్లు వ్యవసాయానికి రూ.12వేల 355కోట్లు విద్యుత్ రంగానికి రూ.5వేల 52కోట్లు రుణమాఫీకి రూ.4100కోట్లు పరిశ్రమలు, రవాణా పరిశ్రమలకు రూ.3వేల 78కోట్లు రవాణా రంగానికి రూ.4వేల 653కోట్లు పర్యావరణ రంగానికి రూ.4వేల 899కోట్లు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు రూ.300కోట్లు రవాణా మరియు రోడ్డు భవనాల శాఖకు రూ.4,653కోట్లు రోడ్ల అభివృద్ధికి రూ.1413 కోట్లు గ్రామీణ, గృహ, పట్టణ రంగాలు గ్రామీణాభివృద్ధికి రూ.20,815కోట్లు పట్టణాభివృద్ధికి రూ.7,740కోట్లు గృహనిర్మాణానికి రూ.3,679కోట్లు గృహ నిర్మాణానికి స్థలం సేకరింపునకు రూ.575కోట్లు మున్సిపల్ శాఖకు రూ.7,761కోట్లు మంచినీరు, పారిశుద్ధ్యానికి రూ.2,623కోట్లు విశాఖ చెన్నై కారిడార్ రూ.1168కోట్లు స్మార్ట్ సిటీలకు రూ.800కోట్లు స్వచ్ఛభారత్‌కు రూ,1450కోట్లు ఆర్టీసీకి రూ.200కోట్లు అమరావతి నిర్మాణానికి రూ.7,741కోట్లు అమృత్ పథకానికి రూ.490 కోట్లు విద్యా, వైద్యం, సాంకేతిక రంగం సాధారణ విద్యారంగానికి రూ.24,180కోట్లు సాంకేతిక విద్యకు రూ.818కోట్లు స్కిల్ డెవలప్మెంట్కు రూ.300 కోట్లు మోడల్ స్కూల్స్ రూ.377కోట్లు రెసిడెన్షియల్ స్కూల్స్‌కు రూ.670కోట్లు నిరుద్యోగ భృతికి రూ.1000 కోట్లు క్రీడలు, యువజన సర్వీసులకు రూ.1,635 కోట్లు వైద్యరంగానికి రూ.8,463కోట్లు సమాచార శాఖకు రూ.224కోట్లు వివిధ విశ్వవిద్యాలయాలకు మౌలిక సదుపాయాలు రూ.20కోట్లు సాంస్కృతిక రంగం రూ.94.98కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవలు రూ.1000 కోట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయం రూ.357కోట్లు మున్సిపల్ శాఖకు రూ.7,761కోట్లు ఎంఎస్ఎంఈ రంగానికి రూ.200 కోట్లు పారిశ్రామిక వాణిజ్య విభాగానికి రూ.3,075కో్ట్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద రూ.1000కోట్లు వ్యవసాయ బడ్జెట్ రూ.19,070కోట్లు -
నేడు ఏపీ బడ్జెట్
సాక్షి, అమరావతి: భారీ రెవెన్యూ వ్యయంతో కూడిన బడ్జెట్‌ను ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. మొత్తం రూ.1,96,800 కోట్ల వ్యయంతో 2018–19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రెవెన్యూ వ్యయం రూ.1,63,660 కోట్లు, కేపిటల్ వ్యయం కింద రూ.33,160 కోట్లను ప్రతిపాదించనున్నారు. 14వ ఆర్థిక సంఘం అంచనా మేరకు ఏపీ రాష్ట్ర స్థూల ఉత్పత్తిని రూ.8,70,330 కోట్లు గా పేర్కొన్నారు. రూ.30,000 కోట్ల మేర అప్పులు చేయనున్నారు. ఏపీ సొంత పన్నులు ద్వారా రూ.70 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రతిపాదించారు. -
టీడీపీలో పోటీ పడుతున్న ‘ఆ ముగ్గురు’
సాక్షి, అమరావతి : రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడంతో రాష్ట్రంలో వాటిపై ఆశలు పెట్టుకున్న నేతల్లో ఉత్కంఠ మొదలైంది. రాష్ట్రానికి చెందిన మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండడంతో వాటికి మార్చి 23వ తేదీన ఎన్నిక జరగనుంది. రాష్ట్రం నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న చిరంజీవి, రేణుకా చౌదరి టీడీపీ తరఫున దేవేందర్‌గౌడ్ ప్రాతినిధ్యం వహించిన స్థానాలు ఖాళీ అవుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన కేటాయింపులో తెలంగాణకు చెందిన దేవేందర్‌గౌడ్‌కి ఏపీ, ఏపీకి చెందిన సీఎం రమేష్‌కు తెలంగాణ ప్రాతినిథ్యం లభించింది. ప్రస్తుతం ఏపీలో ఖాళీ అవనున్న మూడు స్థానాల్లో రెండు తెలుగుదేశం పార్టీకి దక్కనుండగా ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిగా నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ప్రకటించింది. టీడీపీ తనకు వచ్చే రెండు స్థానాలను ఎవరికి కేటాయించాలనేది ఇంకా నిర్ణయించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై అంతర్గతంగా కసరత్తు చేస్తున్నారు. పోటీలో ఆ ముగ్గురూ... టీడీపీ తరఫున రాజ్యసభ అభ్యర్థిత్వం కోసం రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ పడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్న యనమల తనను రాజ్యసభకు పంపాలని చాలాకాలం నుంచి చంద్రబాబును కోరుతున్నారు. అయితే అసెంబ్లీ, ఆర్థిక వ్యవహారాల్లో కీలకంగా ఉండే ఆయనను రాజ్యసభకు పంపితే తనకు ఇబ్బంది అవుతుందేమోననే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేస్తున్నాను కాబట్టి తనకు ఇవ్వాలని కంభంపాటి కోరుతుండగా, గతంలో ఇచ్చిన హామీ ప్రకారం తనకు ఇవ్వాలని ఆదాల ప్రభాకర్ రెడ్డి అడుగుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం తెలంగాణ నుంచి టీడీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రమేష్ మళ్లీ తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నప్పటికీ చంద్రబాబు సుముఖంగా లేనట్లు సమాచారం. ఎస్సీ మాదిగ వర్గంలో ఒకరికి ఈసారి అవకాశం ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే వర్ల రామయ్య, సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత, మాజీ ఎమ్మెల్యే మసాల పద్మజ పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీయేతర వ్యక్తులకూ అవకాశం? భవిష్యత్తు అవసరాలు, కార్పొరేట్ లాబీయింగ్ కోసం పార్టీయేతర వ్యక్తులకు కూడా రాజ్యసభ అవకాశం ఇవ్వాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తతో చర్చలు కూడా జరిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో పార్టీకి చెందిన ప్రముఖుడికి కూడా రాజ్యసభ సీటు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. -
ప్యాకేజీకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది: యనమల
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామని కేంద్రం తెలిపిందని, విదేశీ ఆర్థిక సాయం ప్రాజెక్టులకు నిధులు, కేంద్ర పథకాల కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా 90:10 శాతంగా ఇస్తామని కేంద్రం చెప్పడంతో ప్యాకేజీకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. -
మార్చి 8న ఏపీ బడ్జెట్!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని అధికార వర్గాలు తెలిపాయి. సప్తమి పర్వదినం సందర్భంగా మార్చి 8వ తేదీన (గురువారం) ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో బడ్జెట్ సమర్పిస్తారు. -
మనసులో మాట బయటపెట్టిన యనమల
సాక్షి, అమరావతి : ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు మనసులో మాట బయటపెట్టారు. అవకాశం లభిస్తే రాజ్యసభ ద్వారా పార్లమెంట్‌కు వెళ్లేందుకు సిద్దమని అన్నారు. తాను ఎక్కడ ఉండాలన్నది తన ఒక్కడి నిర్ణయం కాదని, పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. అది కావాలి... ఇది కావాలి అని తానెప్పుడూ పార్టీ అధిష్టానాన్ని అడగలేదని అన్నారు. 35 ఏళ్లు రాష్ట్రంలో పలు హోదాల్లో పనిచేసిన తనది సుదీర్ఘ అనుభవమని చెప్పారు. నా అవసరం ఎక్కడ ఉంటుందన్నది అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. మంగళవారం మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. -
మీ ఇళ్లల్లో పెళ్లి జరిగితే సెలవులిచ్చేస్తారా?
సాక్షి, అమరావతి : ‘‘మా దళితుల ఇళ్లల్లో వివాహానికి ఎవరినీ రానివ్వరు. అదే మీ వాళ్ల ఇళ్లల్లో పెళ్లి జరుగుతుంటే మాత్రం ఏకంగా శాసనసభ, శాసనమండలి సమావేశాలనే నిలిపేస్తారా? ఏకంగా సెలవులు ఇచ్చేస్తారా?’’ అని మంత్రి యనమల రామకృష్ణుడిపై శాసన మండలి సభ్యురాలు శమంతకమణి విరుచుకుపడ్డారు. బుధవారం శాసనసభ, శాసనమండలి సమావేశాలు ముగిసిన తరువాత లాబీల్లో యనమల, శమంతకమణి పరస్పరం ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా యనమలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. ‘‘ఏమయ్యా.. మా దళితులకు ఎలాగూ పదవులు ఇవ్వరు. గౌరవం ఎటూ లేదు. కనీసం మా ఇంట్లో వివాహం జరుగుతుంటే ఎవరినీ రానివ్వకుండా చేశారు. అదేపనిగా అందరినీ పోలవరం ప్రాజెక్టు వద్దకు అంటూ తీసుకెళ్లారు. మా మనవరాలి (శింగనమల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యామినిబాల కుమార్తె) పెళ్లి ఈ నెల 16న అనంతపురంలో జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ ఆహ్వానించినా వారిని రానివ్వకుండా పోలవరానికి తీసుకుపోయారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ సోదరుడు శ్రీనివాస్ కుమార్తె పెళ్లి 23వ తేదీన అనంతపురంలో జరుగుతుందని ఏకంగా రెండు సభలకు వరుసగా మూడు రోజులు సెలవులు ఇచ్చేస్తారా? ఏం.. మా ఇళ్లల్లో శుభకార్యాలకు ఎవరూ రాకూడదా? ఇదేం న్యాయమయ్యా మీకు?’’ అని నిలదీశారు. దీనికి సమాధానం చెప్పలేక యనమల మౌనంగా ఉండిపోయారు. పయ్యావుల కేశవ్ సోదరుడి కుమార్తె వివాహం కర్నూలు రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ కుమారుడితో గురువారం అనంతపురంలో జరగనుంది. -
నువ్వా.. జగన్‌ను విమర్శించేది!
సీతానగరం (రాజానగరం): ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు సహకరించిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు.. తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించడమేమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మండిపడ్డారు. మండలంలో శనివారం జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె విలేకర్లతో మాట్లాడారు. అసెంబ్లీలో ఎన్టీఆర్‌ను మాట్లాడకుండా చేసి, ఆయన చావుకు కారణం వారిద్దరే అయ్యారని అన్నారు. కాంగ్రెస్‌లో ఓడిపోయినా పిలిచి పదవి ఇస్తే, ఎన్టీఆర్ పార్టీని, జెండా గుర్తును లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అని.. అలాగే స్పీకర్ పదవి ఇస్తే అసెంబ్లీలో ఎన్టీఆర్‌ను మాట్లాడనీయకుండా అవమానించిన వ్యక్తి యనమల అని అన్నారు. వారిని అసెంబ్లీలో చూడలేకే ఎన్టీఆర్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారని గుర్తు చేశారు. తమ పార్టీ టిక్కెట్టుపై గెలిచిన 20 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనడమే కాకుండా.. వారిలో నలుగురిని మంత్రులుగా చేసి అసెంబ్లీలో కూర్చోబెట్టి, వారిచేతే సమాధానాలు ఇప్పించే పరిస్థితి సృష్టించి, ప్రజాస్వామ్యంతో పరిహాసమాడుతున్న చంద్రబాబు వైఖరిని నిరసిస్తూనే జగన్మోహన్రెడ్డి అసెంబ్లీకి రాకూడదని నిర్ణయించారన్నారు. జగన్మోహన్రెడ్డి విలువలతో కూడిన రాజకీయనేత అని, చంద్రబాబు విలువలను భ్రష్టు పట్టించే వ్యక్తి అని అన్నారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చని అబద్ధాలకోరు చంద్రబాబు అని విమర్శించారు. జగన్ పాదయాత్రతో టీడీపీలో గుబులు ఏర్పడిందన్నారు. జగన్‌ను ఎంతమంది విమర్శించినా పాదయాత్ర కొనసాగుతుందని విజయలక్ష్మి స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబు, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి చల్లమళ్ళ సుజీరాజు తదితరులు పాల్గొన్నారు. -
యనమల నోటిని దానితో శుభ్రం చేసుకోవాలి!
సాక్షి, విజయవాడ: దివంగత నేత ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడించింది టీడీపీ నేతలేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేశ్ మండిపడ్డారు. చంద్రబాబు వెనుకనుంచి వెన్నుపోటు పొడిస్తే.. యనమల రామకృష్ణుడు ముందునుంచి ఎన్టీఆర్‌ను పొడిచారని దుయ్యబట్టారు. యనమల నోటిని ఫినాయిల్‌తో శుభ్రం చేసుకోవాలని సూచించారు. గతంలో స్పీకర్ కుర్చీకే ఆయన తీరని మచ్చ తెచ్చారని విమర్శించారు. విజయవాడలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలతో ఆనాడు ఎన్టీఆర్ అసెంబ్లీకి దూరంగా ఉన్నారని, అందుకే ఎన్టీఆర్ చూపిన బాటలోనే అనైతిక రాజకీయాలకు వ్యతిరేకంగా తామూ నడుస్తామని చెప్పామని జోగి రమేశ్ అన్నారు. -
ఏపీ టీడీపీపై రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
-
ఏపీ టీడీపీపై రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
ఏపీ టీడీపీపై రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : దీపావళికి ఒకరోజు ముందే తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి థౌజండ్ వాలా పేల్చారు. ఏపీ టీడీపీ నేతలే టార్గెంట్‌గా మాటల రాకెట్లు పేల్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇక్కడి టీడీపీ నేతలను జైల్లళ్లో పెడుతుంటే.. ఏపీ టీడీపీ నేతలు మాత్రం ఆయనకు వంగివంగి దండాలు పెట్టడం ఎంతవరకు సమయంజసమని ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును టీ నేతలు పట్టించుకున్నారా? : ‘‘కేసీఆర్ ఏపీ మంత్రి పరిటాల ఇంట్లో పెళ్లికి వెళ్లినప్పుడు ఆయనకు ఏపీ టీడీపీ నేతలు వంగివంగి దండాలు పెట్టారు. అదే, చంద్రబాబు.. సీతక్క ఇంట్లో పెళ్లికి వచ్చినప్పుడు టీఆర్ఎస్ మంత్రులుగానీ, నాయకులుగానీ ఏపీ సీఎంను పట్టించుకున్నారా? ఇది టీడీపీ నేతల అత్యుత్సహప్రదర్శనకాదా! ఏపీలో పయ్యావుల కేశవ్‌ను ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. ఆయన గురించి నేను మాట్లాడేది ఏముంటుంది?’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. యనమలకు కేసీఆర్ రూ.2వేల కోట్లు : ఏపీ టీడీపీ సీనియర్ నేత, మంత్రి యనమల రామకృష్ణుడుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మధ్య ఆర్థిక సంబంధాలున్నాయని రేవంత్ వ్యాఖ్యానించారు. ‘‘యనమలకు కేసీఆర్ రూ.2000 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు. అందుకే కేసీఆర్‌పై ఈగవాలనీయకుండా యనమల చూసుకుంటారు. ఏపీ టీడీపీ నేతలు.. అన్నం పెట్టేవాడికి సున్నం పెట్టేవారిలా తయారయ్యారు.’’ అని రేవంత్ అన్నారు. తెలంగాణలో పార్టీలు లేవు : ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పార్టీలంటూ లేవని, సీఎం కేసీఆర్, ఆయనపై వ్యతిరేకులు మాత్రమే ఉన్నారని రేవంత్ అన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణకు తాను నాయకత్వం వహిసస్తానని చెప్పుకొచ్చారు. పలు ఉద్యమాల నుంచి మొన్నటి సింగరేణి ఎన్నికల దాకా కాంగ్రెస్ పార్టీతో కలిసి తాము పనిచేశామని గుర్తుచేశారు. చంద్రబాబు మాకు స్వేచ్ఛ ఇవ్వాలి : ‘‘స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు పెట్టుకునే స్వేచ్ఛను చంద్రబాబు మాకు ఇవ్వాలి. ఒకవేళే పొత్తు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు కాంగ్రస్‌తో కలిస్తే తప్పేంటి? విదేశీ పర్యటన నుంచి చంద్రబాబు తిరిగొచ్చిన వెంటనే ఆయనను కలుస్తా. టీఆర్ఎస్లో టీటీడీపీ విలీనం లేదా పొత్తు వ్యవహారంపై బాబు చెప్పే మాటను బట్టి నేను నిర్ణయం తీసుకుంటా’’ అని రేవంత్ వెల్లడించారు. అందుకే దత్తాత్రేయ మంత్రి పదవి తొలిగించారు : తెలంగాణలో బీజేపీ లేదు కనుకనే బండారు దత్తాత్రేయను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలిగించారని రేవంత్‌రెడ్డి అన్నారు. ఏపీలో కూడా పొత్తు ఉండబోదని బీజేపీ తేల్చిచెప్పింది. మరలాంటప్పుడు తెలంగాణలో పార్టీని ఎలా కాపాడుకోవాలనేదానిపై టీడీపీకి స్పష్టత ఉండాలికదా అని వ్యాఖ్యానించారు.