
సాక్షి, అమరావతి : ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు మనసులో మాట బయటపెట్టారు. అవకాశం లభిస్తే రాజ్యసభ ద్వారా పార్లమెంట్‌కు వెళ్లేందుకు సిద్దమని అన్నారు. తాను ఎక్కడ ఉండాలన్నది తన ఒక్కడి నిర్ణయం కాదని, పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు.
అది కావాలి... ఇది కావాలి అని తానెప్పుడూ పార్టీ అధిష్టానాన్ని అడగలేదని అన్నారు. 35 ఏళ్లు రాష్ట్రంలో పలు హోదాల్లో పనిచేసిన తనది సుదీర్ఘ అనుభవమని చెప్పారు. నా అవసరం ఎక్కడ ఉంటుందన్నది అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. మంగళవారం మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు.