
ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి
మంత్రి పదవుల కోసం నేను ఎవరి పేరూ సిఫార్సు చేయడం లేదు
శాస్త్రీయంగా కులగణన చేశాం.. బీసీలు ఐదున్నర శాతం పెరిగారు
ఈ లెక్కల ఆధారంగానే సంక్షేమ పథకాల అమలు
సాక్షి, న్యూఢిల్లీ: మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదని సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ(Cabinet Expansion)పై ఏఐసీసీ పెద్దలతో చర్చించినా, ప్రస్తుత ఎన్నికలు, ఇతర అంశాల దృష్ట్యా ప్రస్తుతం విస్తరణ చేయడం లేదన్నారు. ‘‘మంత్రివర్గ విస్తరణపై చర్చ లు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికైతే విస్తరణ ఉండదు. ఓ వైపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీనిపై అధిష్టానం ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు విస్తరణ ఉంటుంది. ఈ విషయంలో నా ప్రమేయం ఏమీ లేదు. నేను మంత్రి పదవుల కోసం ఎవరి పేరును సిఫార్సు చేయడం లేదు.
మంత్రి పదవులకు అర్హులైన వారిని ఏఐసీసీనే ఎంపిక చేస్తుంది. వారు ఎవరి పేరు సూచిస్తే వారితో ప్రమాణస్వీకారం చేయిస్తా..’’అని చెప్పా రు. శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శితో కేసీ వేణుగోపాల్‌లతో భేటీ అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ చిట్‌చాట్ చేశారు. అత్యంత శాస్త్రీయంగా కులగణన నిర్వహించామని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా ఒక్కరోజులో పూర్తి చేయలేదని చెప్పారు.
1.12 కోట్ల కుటుంబాల సమగ్ర వివరాలు సేకరించాకే లెక్కలు బయటపెట్టామన్నారు. ఈ సర్వేలో ఎక్కడా బీసీల శాతం తగ్గలేదని, బీసీలు ఐదున్నర శాతం పెరిగారని.. ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా బీజేపీ సభ్యులు సైతం అంగీకరించారని పేర్కొన్నారు. ఈ కులగణన లెక్కల ఆధారంగానే సంక్షేమ విధానాలకు రూపకల్పన చేస్తామన్నారు. ప్రస్తుత సర్వేతో ముస్లిం రిజ ర్వేషన్లకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు.
కేటీఆర్ అరెస్ట్‌పై తొందరపడం..
ఫార్ములా–ఈ రేసు కేసులో చట్టప్రకారమే నడుచుకుంటున్నామని, ఇప్పటికే నగదు బదిలీ జరిగిన కంపెనీకి నోటీసులు ఇచ్చామని సీఎం రేవంత్ తెలిపారు. నోటీసులపై స్పందించేందుకు సదరు కంపెనీ గడువు కోరిందన్నారు. ఈ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలన్న తొందరేమీ తమకు లేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలపై కేసుల విషయంలో ఎక్కడా రాజకీయ జోక్యం లేదని, చట్టప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జస్టిçస్ లోకూర్ కమిషన్ నివేదిక అందిందని, దానిని అడ్వొకేట్ జనరల్ పరిశీలనకు పంపామని వెల్లడించారు.
రాహుల్‌గాం«దీతో దూరమేమీ లేదు..
రాష్ట్రంలో పీసీసీ కమిటీ కూర్పు కొలిక్కి వచ్చిందని, ఒకట్రెండు రోజుల్లోనే దీనిపై ప్రకటన ఉంటుందని రేవంత్ చెప్పారు. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటారని, అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఇక పార్టీ అగ్రనేత రాహుల్‌గాం«దీతో తనకు ఎలాంటి గ్యాప్ లేదని రేవంత్ చెప్పారు. ఈ పర్యటనలో తాను రాహుల్ అపాయింట్‌మెంట్ కూడా కోరలేదన్నారు. రాహుల్ గాంధీతో ఎప్పటికప్పుడు ఫోన్‌లో టచ్‌లో ఉన్నామంటూ.. రాహుల్ గాంధీ పెట్టిన మెసేజీలను చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment