Chit chat
-
మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదు
సాక్షి, న్యూఢిల్లీ: మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదని సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ(Cabinet Expansion)పై ఏఐసీసీ పెద్దలతో చర్చించినా, ప్రస్తుత ఎన్నికలు, ఇతర అంశాల దృష్ట్యా ప్రస్తుతం విస్తరణ చేయడం లేదన్నారు. ‘‘మంత్రివర్గ విస్తరణపై చర్చ లు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికైతే విస్తరణ ఉండదు. ఓ వైపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీనిపై అధిష్టానం ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు విస్తరణ ఉంటుంది. ఈ విషయంలో నా ప్రమేయం ఏమీ లేదు. నేను మంత్రి పదవుల కోసం ఎవరి పేరును సిఫార్సు చేయడం లేదు.మంత్రి పదవులకు అర్హులైన వారిని ఏఐసీసీనే ఎంపిక చేస్తుంది. వారు ఎవరి పేరు సూచిస్తే వారితో ప్రమాణస్వీకారం చేయిస్తా..’’అని చెప్పా రు. శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శితో కేసీ వేణుగోపాల్‌లతో భేటీ అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ చిట్‌చాట్ చేశారు. అత్యంత శాస్త్రీయంగా కులగణన నిర్వహించామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా ఒక్కరోజులో పూర్తి చేయలేదని చెప్పారు.1.12 కోట్ల కుటుంబాల సమగ్ర వివరాలు సేకరించాకే లెక్కలు బయటపెట్టామన్నారు. ఈ సర్వేలో ఎక్కడా బీసీల శాతం తగ్గలేదని, బీసీలు ఐదున్నర శాతం పెరిగారని.. ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా బీజేపీ సభ్యులు సైతం అంగీకరించారని పేర్కొన్నారు. ఈ కులగణన లెక్కల ఆధారంగానే సంక్షేమ విధానాలకు రూపకల్పన చేస్తామన్నారు. ప్రస్తుత సర్వేతో ముస్లిం రిజ ర్వేషన్లకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. కేటీఆర్ అరెస్ట్‌పై తొందరపడం.. ఫార్ములా–ఈ రేసు కేసులో చట్టప్రకారమే నడుచుకుంటున్నామని, ఇప్పటికే నగదు బదిలీ జరిగిన కంపెనీకి నోటీసులు ఇచ్చామని సీఎం రేవంత్ తెలిపారు. నోటీసులపై స్పందించేందుకు సదరు కంపెనీ గడువు కోరిందన్నారు. ఈ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలన్న తొందరేమీ తమకు లేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలపై కేసుల విషయంలో ఎక్కడా రాజకీయ జోక్యం లేదని, చట్టప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జస్టిçస్ లోకూర్ కమిషన్ నివేదిక అందిందని, దానిని అడ్వొకేట్ జనరల్ పరిశీలనకు పంపామని వెల్లడించారు. రాహుల్‌గాం«దీతో దూరమేమీ లేదు.. రాష్ట్రంలో పీసీసీ కమిటీ కూర్పు కొలిక్కి వచ్చిందని, ఒకట్రెండు రోజుల్లోనే దీనిపై ప్రకటన ఉంటుందని రేవంత్ చెప్పారు. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటారని, అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఇక పార్టీ అగ్రనేత రాహుల్‌గాం«దీతో తనకు ఎలాంటి గ్యాప్ లేదని రేవంత్ చెప్పారు. ఈ పర్యటనలో తాను రాహుల్ అపాయింట్మెంట్ కూడా కోరలేదన్నారు. రాహుల్ గాంధీతో ఎప్పటికప్పుడు ఫోన్లో టచ్‌లో ఉన్నామంటూ.. రాహుల్ గాంధీ పెట్టిన మెసేజీలను చూపించారు. -
సీఎం రేవంత్ రెడ్డి కావాలనే కేసు పెట్టించారు: KTR
-
ధరణి ముసుగులో వేలాది ఎకరాలు అన్యాక్రాంతం
సాక్షి, హైదరాబాద్: ధరణి ముసుగులో విలువైన ప్రభుత్వ, ఇనాం, పడావు, ఎవాక్యుయీ భూములు వేలాది ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని ప్రభుత్వం గుర్తించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. అన్యాక్రాంతమైన ఈ భూములను ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దాదాపు పదిహేను వేల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని, చేతులు మారాయని తేలిందని.. కనిష్టంగా ఒక ఎకరా రూ.10 కోట్లు అని అనుకున్నా వీటి విలువ దాదాపు రూ.1.5 లక్షల కోట్లు ఉంటుందని చెప్పారు. బుధవారం శాసనసభలోని తన కార్యాలయంలో భట్టి మీడియాతో ముచ్చటించారు. 10 వేల ఎకరాలు ధారాదత్తం చేశారు ‘అన్యాక్రాంతమైన భూములే కాకుండా అస్సైన్డ్ భూములను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే.. మళ్లీ ప్రభుత్వ అవసరాల కోసమే వినియోగించాలి. కానీ ఇబ్రహీంపట్నం మండలంలో పది వేల ఎకరాలను ధారాదత్తం చేశారు. గతంలో భూముల రిజి్రస్టేషన్ అనంతరం రెవెన్యూ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ భూముల మ్యుటేషన్ జరిగి పట్టాదార్ పాస్ పుస్తకాలు వచ్చేవి. కానీ ధరణి వచి్చన తర్వాత రిజి్రస్టేషన్ కాగానే వెంటనే మ్యుటేషన్ అవడం, ధరణి పోర్టల్‌లో వేలిముద్రలు, ఫోటో రాగానే.. అక్కడికక్కడే ఇతరులకు విక్రయించడం వల్ల అసలు ఆ భూముల చరిత్ర తెలియకుండానే క్రయ విక్రయాలు, మ్యుటేషన్లు జరిగిపోయాయి.ఇనాం, పడావు, ఎవాక్యుయీ ప్రాపర్టీ, ప్రభుత్వ భూములను ధరణిలో ఎంట్రీ చేసే సమయంలోనే పేర్లు మారిపోయాయి. ఒకసారి ధరిణిలో ఎంటర్ అయ్యాక వాటిని మార్చే అవకాశం లేకుండా పోయింది. కొన్నింటిని కావాలనే పార్ట్ ‘బీ’లో చేర్చారు. దీనిని అడ్డు పెట్టుకుని పెద్ద ఎత్తున భూములు చేతులు మారాయి. ధరణిలో ఒక్క భూ యజమాని పేరు మినహా కాస్తుదారులు/ అనుభవదారుల కాలమ్ లేకపోవడంతో ఇష్టానుసారం భూములు చేతులు మారాయి..’అని డిప్యూటీ సీఎం చెప్పారు. పార్ట్ ‘బీ’భూముల్లోనే పెద్దయెత్తున దందా ‘ధరణికి ముందున్న రికార్డులను, ధరణిలోకి వచ్చిన తరువాత మారిన భూముల వివరాలను పరిశీలిస్తాం. పూర్తిస్థాయిలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. భూములు మూడు, నాలుగు చేతులు మారినా..అవి ఫ్రభుత్వానికి చెందిన భూములు అని తేలితే స్వాధీనం చేసుకుంటాం. ప్రధానంగా పార్ట్ ‘బీ’కింద పెట్టిన భూముల్లోనే ఈ దందా పెద్ద ఎత్తున సాగింది..’అని భట్టి అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన ప్రతి పైసా తెస్తాంమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన నిధులు ప్రతి పైసా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. కేంద్రం రాష్ట్రాల వారీగా నిధులు కేటాయించదని, పథకాల వారీగా చేయాల్సిన ఖర్చునకు అనుగుణంగా కేటాయింపులు జరుపుతుందని అన్నారు. బుధవారం శా సనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు కవిత, దయానంద్ తదితరులు లేవనెత్తిన ప్రశ్నలకు భట్టి సమాధానం చెప్పారు.గత పదేళ్ల నుంచి కేంద్ర ప్ర భుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, ఏడా ది కాలంగా వచి్చన నిధులకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం సభముందు ఉంచామని తెలిపారు. కేవలం ఏడాదిలో పదేళ్లలో సాధించిన దానికంటే మించి పురోగతి సాధించామని భట్టి పేర్కొన్నా రు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రత్యేకంగా పథకాలు రూపొందించాల్సిందిగా సంబంధిత కార్పొరేషన్‌ను ఆదేశించామన్నారు. 2026 డిసెంబర్ నాటికి ‘పాలమూరు’ పూర్తి: మంత్రి ఉత్తమ్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని, ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయిస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాజెక్టు నత్తనడకన సాగిందని, దీనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. కొడంగల్–నారాయణపేట ప్రాజెక్టు కొత్తదేమీ కాదని, ఉమ్మడి రాష్ట్రంలోనే జీవోలు వచ్చాయని వెల్లడించారు.అర్చకుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. ధూపదీప నైవేద్యం కోసం నెల కు రూ.4 వేలు, గౌరవ వేతనం కింద రూ.6 వేలు చొప్పున మొత్తం రూ.10 వే లు ఇస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ పరిషత్‌ను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసు కొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామ న్నారు. యాదగిరిగుట్టలో టీటీడీ స్థాయి లో పాలకమండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. పలు బిల్లులకు ఆమోదం మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) పేరు పెడుతూ మండలిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బిల్లు ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు. ది యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ బిల్లుతో పాటు తెలంగాణ యూనివర్సిటీల సవరణ బిల్లు, తెలంగాణ గూడ్స్ అండ్ సరీ్వస్ ట్యాక్స్ సవరణ బిల్లులను సంబంధిత మంత్రులు ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. -
ఎవరిని ఎలా పిలవాలి?
టేబుల్‌కు ఎదురుగా ఉన్న వ్యక్తులు ఇద్దరూ సమానమే అన్న అంచనాతో (భ్రమతో?) ఇంటర్వ్యూ మొదలవుతుంది. అప్పుడు మాత్రమే, ఇంటర్వ్యూ చేసేవాళ్లకు శోధించేందుకు, అవసరమైతే వ్యతిరేకించేందుకు ఇరువురి సమానత్వం ఒక హక్కును కల్పిస్తుంది. అవతలి వ్యక్తి నీ కంటే పెద్ద స్థాయివాడు కాదని అనుకున్నప్పుడే, అవసరమైనప్పుడు వారి మాటలను అడ్డుకునేందుకు సందేహించాల్సిన అవసరం ఉండదు. అందుకే ఎంపీలు, మంత్రులు, అధికారులను... మిస్టర్, మిసెస్, మిస్ అనో... ప్రభుత్వంలో ఉంటే మినిస్టర్ అనో సంబోధించడం ఉచితంగా ఉంటుంది. అదే సెలబ్రిటీలను చేసే ఛాట్ షో ఇంటర్వ్యూల విషయానికి వస్తే ఇవన్నీ మారిపోతాయి. వాళ్లను ‘మిస్టర్’ అంటే దూరం జరిగినట్టు అవుతుంది. అప్పుడు పేరు పెట్టి పిలవడం ఉత్తమం.ఆ మధ్య నాకు ఒక లేఖ అందింది.అందులో చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఒకటుంది. సమాధానం ఇలా బహిరంగంగానే ఇస్తే మేలు అనిపించింది. ‘‘ఇంటర్వ్యూ చేసే వారిని మీరు రకరకాలుగా సంబోధించడాన్ని గమనించాను’’ అంటూ మొదలైంది ఈ లేఖ. ‘‘కొంతమందిని మిస్టర్ ఎక్స్ అంటారు.. ఇంకొంతమందిని ‘మినిస్టర్’ అంటూ వారి పదవితో సంబోధించారు. మరికొన్ని సందర్భాల్లో వాళ్ల పేరుతో పిలిచారు. కానీ ఎప్పుడూ ‘సర్’ అని పిలవడం మాత్రం చూడలేదు. ఎందుకలా? అసలు ఎవరిని ఎలా పిలవాలో మీరు ఎలా నిర్ణయిస్తారు?’’సర్ అంటే వేరే!ఈ ప్రశ్నలు చూసిన వెంటనే నా ఆలోచనలు రెండు దశాబ్దాల వెనక్కు వెళ్లాయి. ఆ రోజు జీవితంలో మొట్టమొదటిసారి ఓ ప్రము ఖుడిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. తర్వాత బ్రిటన్ హోమ్ శాఖ మంత్రి అయిన డేవిడ్ వాడింగ్టన్ ఇంటర్వ్యూ అది. 1983లో మార్గరెట్ థాచర్ మంత్రివర్గంలో ఇమ్మిగ్రేషన్ శాఖల మంత్రిగా ఆయన పని చేశారు. ప్రస్తుత ‘బీబీసీ’ ఛైర్మన్ సమీర్ షా అప్పట్లో నా బాస్. బీబీసీ కార్యక్రమం ‘ఐ విట్నెస్’ ప్రొడ్యూసర్ ఆయన.ఇంటర్వ్యూ కోసం స్టూడియోలోకి వెళుతూండగా సమీర్ మాట్లా డుతూ, ‘‘ఒక్క విషయం గుర్తుంచుకో కరణ్’’ అన్నారు. ‘‘ఆయన్ని మిస్టర్ వాడింగ్టన్ అనైనా పిలువు. లేదా మినిస్టర్ అను. సర్ అని మాత్రం పిలవొద్దు’’ అని సలహా ఇచ్చారు. బ్రిటిష్ ఇంగ్లీషులో ‘సర్’కు ఉన్న అర్థం వేరు కావడమే దీనికి కారణం. దానివల్ల ఇంటర్వ్యూలో వాడింగ్టన్ హోదాను ఇంటర్వ్యూ చేసేవాడికన్నా ఎక్కువ అనుకునేలా చేస్తుంది. ఇంటర్వ్యూ చేసేవాడు, ఇచ్చే మనిషి ఇద్దరూ సమానమే అన్న అంచనాతో(లేదా భ్రమ?) ఈ ఏర్పాటు అన్నమాట. ఇంటర్వ్యూ చేసేవాళ్లకు శోధించేందుకు, అవసరమైతే వ్యతిరేకించేందుకు ఇరువురి సమానత్వం ఒక హక్కును కల్పిస్తుంది. అలాగే అవతలి వ్యక్తి నీ కంటే పెద్ద స్థాయివాడు కాదని తెలిస్తే అవసరమైనప్పుడు వారి మాటలను అడ్డుకునేందుకూ సందేహించాల్సిన అవసరం ఉండదు.వాస్తవానికి ఆ ఇంటర్వ్యూ బ్రిటిష్ ఇమ్మిగ్రేషన్ నిబంధనల అంశంపై సాగింది. ఆనాటి నిబంధలు ఆసియా ప్రాంత వాసులకు ఇబ్బందికరంగా ఉండేవి. హాట్ టాపిక్ కాబట్టి ఇంటర్వ్యూ కూడా అదే స్థాయిలో ఉండటం సహజం. వాడింగ్టన్ సమాధానాలు నాకు సంతృప్తి కలిగించే అవకాశమే లేదు. అందుకే సమీర్ నన్ను పరోక్షంగా హెచ్చ రిస్తూ ఆ మాటలు అన్నారు. ఆయన్ని నేను సంబోధించే విధానం నా స్థితిని బలహీనం చేయకూడదన్నది సమీర్ ఉద్దేశం. కాబట్టి... సర్ అన్న సంబోధన లేకుండా పోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ నాకు సమీర్ మాటలే పరమ ధర్మంలా మిగిలాయి. అధికారంలో ఉన్న వ్యక్తి ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నా... ఎంపీలు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు, అధికారులు, ప్రముఖులు ఎవరైనా సరే... మిస్టర్, మిసెస్, మిస్ అని కానీ... ప్రభుత్వంలో ఉంటే మినిస్టర్ అని కానీ సంబోధించడాన్ని ఒక నియమంగా పెట్టుకున్నాను. ఇలా ఎందుకో చెబుతాను.‘‘సర్... మీరు చెబుతున్నది కరెక్ట్ కాదు’’ అని ప్రతిసారీ చెప్ప లేం. ‘సర్’ అని సంబోధిస్తూంటే... ఇలా చెప్పే అవకాశం గట్టిగా చెప్పలేకపోవచ్చు. అదే ‘మినిస్టర్’ అని సంబోధిస్తున్నాం అనుకోండి... ఎప్పుడు కావాలంటే అప్పుడు ‘‘సారీ, మీరు తప్పు చెబుతున్నారు’’ అనేయవచ్చు. ‘సర్’ అంటే ఒకపక్క ఉన్నత స్థానం కల్పిస్తూ... ఇంకో పక్క తప్పు అంటున్నాం. పరస్పర విరుద్ధం ఇవి. ‘మినిస్టర్’అంటున్నప్పుడు మీరు చెబుతున్నది తప్పు అనేందుకు పెద్దగా ఇబ్బంది పడనక్కరలేదు. సన్నిహిత సంభాషణల్లో... పేరుతో!అయితే... ఛాట్ షో ఇంటర్వ్యూల విషయానికి వస్తే ఇవన్నీ మారి పోతాయి. అవతలి వ్యక్తి గ్లామర్, సెలిబ్రిటీ స్థాయిని బట్టి కదా ఇంటర్వ్యూకు ఎంచుకున్నాను. అది వర్తమాన అంశాలకు సంబంధించిన ఇంటర్వ్యూ కాదు. విధాన నిర్ణయాల గురించి గుచ్చిగుచ్చి అడిగేది కాదు. వారి జీవిత ఘట్టాలు, జ్ఞాపకాలకు సంబంధించినది కాబట్టి, వారి వ్యక్తిత్వాన్ని పరిచయం చేసే షో కాబట్టి... ‘మిస్టర్’, ‘మిస్’ అంటే వారికి దూరం జరిగినట్టు అవుతుంది. ఇది చర్చను ముందుకు పోనీయదు. అలాంటి సందర్భాల్లో వారిని పేరుతో పిలుస్తూంటాను. అందుకే జావేద్(అఖ్తర్), షారుఖ్(ఖాన్ ), మాధురీ (దీక్షిత్), షర్మిలా (ఠాగూర్), విక్రమ్(సేథ్), సచిన్ (టెండూల్కర్) అన్న పేర్లతో సంబోధన ఉంటుంది.ఒక్కోసారి పరిస్థితి వికటించే అవకాశం కూడా ఉంది. నేను ఇంటర్వ్యూ చేసేవాళ్లలో కొంతమంది నాకు బాగా పరిచయమైన రాజకీయ నేతలు కూడా ఉంటూంటారు. ఉదాహరణగా చెబు తున్నా... అలాంటి వారిని ‘మిస్టర్ థరూర్’ అని సంబోధించాల్సి వస్తుంది. నాకు వ్యక్తిగతంగా ఆయన శశిగానే తెలిసినప్పుడు ‘మిస్టర్ థరూర్’ అని పిలవడం ఎబ్బెట్టుగా ఉంటుంది. వీలైనంత వరకూ పేరు పెట్టి పిలవకుండా, ఇంటిపేరుతో కలిపి పిలవడం ద్వారా బ్యాలెన్ ్స చేస్తూంటాను. ఇది ఫార్మల్‌గానూ ఉంటుంది, అలాగే వ్యక్తిగత సాన్ని హిత్యాన్ని సూచించేందుకూ ఇబ్బందిగా ఉండదు.నేను చేయని పనల్లా ఒక్కటే! మంత్రిని పేరు పెట్టి పిలవను. వాళ్లు నాకు తెలిసినప్పటికీ పీయూశ్, కపిల్ అంటూ పేర్లతో పిలవను. ఫార్మల్ ఇంటర్వ్యూలో ఇలా పిలవడం అంత మంచిది కాదు. వీక్షకులు వెంటనే సాన్నిహిత్యాన్ని పసిగట్టేస్తారు. నాకు వచ్చిన ప్రశ్నకు సమాధానం దక్కిందనే అనుకుంటున్నాను. ఇదెంత అర్థవంతంగా ఉందో నిర్ణయించుకోవాల్సింది మాత్రం మీరే!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, రాజకీయాంశాల వ్యాఖ్యాత -
మహేష్ బాబుతో నటించాలన్నదే నా చిరకాల కోరిక..
సీతమ్మధార(విశాఖ): అటు అందం.. ఇటు అభినయం కలగలిపిన విశాఖ సోయగం హేమలతారెడ్డి.. గ్లామర్ ఫీల్డ్‌లో పాదరసంలా దూసుకుపోతున్నారు. బుల్లితెర, వెండితెర, ఫ్యాషన్ రంగాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పలు టీవీ చానళ్లలో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె దినదిన ప్రవర్థమానంగా ఎదుగుతూ వచ్చారు. అటు సీరియళ్లు, సినిమాలు.. ఇటు ఫ్యాషన్ రంగంలో విజయాలతో తన కలలను సాకారం చేసుకుంటున్నారు. వెండితెరపై నా పేరుండాలి.. నా నటన అందరూ గుర్తు పెట్టుకోవాలి.. అని అంటున్న ఆమె హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇటీవల ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. విశాఖలోనే ఓనమాలు విశాఖ నటనలో నాకు ఓనమాలు నేర్పింది. ఇక్కడ ఎన్నో విషయాలు నేర్చుకున్నా.. ఇప్పుడీస్థాయిలో ఉండడానికి కారణం నా తల్లిదండ్రులే. డాబాగార్డెన్స్‌లో ఉంటున్నాం. నాన్న సూర్య దేవర వెంకటరావు నేవీలో పనిచేసి రిటైరయ్యారు. ఇక్కడే సెటిల్ అయ్యారు. చదువుంతా సెయింట్ జోసెఫ్ విద్యాసంస్థలో సాగింది. తాను ఇంటర్ వరకు అక్కడే చదివా. తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ క్లాసికల్ చేశా. తల్లి ధనలక్ష్మి ఫైనాన్స్ వ్యాపారం.న్యూస్‌రీడర్ నుంచి హీరోయిన్ వరకు.. నాన్న నన్ను న్యూస్ రీడర్‌గా చూడాలనుకున్నారు. ముందుగా టీవీ 9, తర్వాత ఎన్టీవీలో ఎంటర్టైన్మెంట్ షోలు చేశా. ఎందరో హీరోయిన్లను ఇంటర్వ్యూ చేశా. జెమిని టీవీలో సినిమా న్యూస్‌రీడర్‌గా చేశా. మంచు విష్ణు నిర్మించిన హ్యాపీడేస్ సీరియల్లో కల్యాణి పాత్రలో నటించా. ఆ సీరియల్‌కు, అందులో నా పాత్రకు మంచి ఆదరణ లభించింది. అంతఃపురం, క్రైమ్ తదితర సీరియల్స్ చేశాను. జెమిని, మా టీవిలో నేను నటించిన సీరియల్స్ ప్రసారమయ్యాయి. నేను ఇప్పటివరకు సుమారుగా 20 వరకు సీరియల్స్‌లో నటించాను. గతంలో విశాఖ బిగ్ ఎఫ్ఎంలో జాబ్ కోసం ట్రై చేశా. ఇప్పుడు అదే ఎఫ్ఎంలో నన్ను ఇంటర్వ్యూ అడగడం చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబుతో నటించాలన్నదే నా చిరకాల కోరిక. సౌందర్య, సమంత తన అభిమాన హీరోయిన్లు. తెలుగు హీరోయిన్లు అంజలి, వైష్ణవి సినిమాల్లో రాణిస్తున్నారు. వారి లాగే నన్ను ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. వీరభద్ర క్రియేషన్స్ పేరిట సొంత బ్యానర్ 2017లో ప్రారంభించాను.గ్లామర్ ఆన్ మిసెస్ ఇండియా అవార్డుతో విశాఖలో జని్మంచిన పోతురెడ్డి హేమలతా రెడ్డి మలేసియాలో జరిగిన గ్లామ్ ఆన్ మిసెస్ ఇండియాగా నిలిచారు. మొదట లోకల్ టీవీ, జెమినీ టీవీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత పలు షోలో పాల్గొన్నారు. హ్యాపీడేస్ సీరియల్లో లీడ్ రోల్ చేసి బుల్లితెర ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. అనంతరం హీరో జగపతిబాబుతో ప్రవరాఖ్యుడు సినిమాలో నటించారు. అందులో హేమలతా రెడ్డి హీరోయిన్ ప్రియమణి స్నేహితురాలిగా నటించారు. నిన్నే చూసి సినిమాలో హీరోయిన్గా నటించి నిర్మాతగా వ్వవహరించారు. అక్కడ నుంచి మిసెస్ ఇండియా పోటీలో విశాఖ నుంచి ప్రాతినిథ్యం వహించి ప్రపంచ వ్యాప్తంగా 300 మందిలో విజేతగా నిలిచారు. -
ముందు ఎంజీబీఎస్,మెట్రో పిల్లర్లు కూల్చండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేసే ముందు మహాత్మాగాం«ధీ బస్టాండ్ (ఎంజీబీఎస్)ను, మెట్రో పిల్లర్లను కూల్చాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. వాటిని తొలగించకుండా మూసీ ప్రక్షాళన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రణాళికలను రీషెడ్యూల్ చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ‘ఈ ప్రాజెక్ట్ కోసం రూ.1.5 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఎలాంటి డీపీఆర్, కార్యాచరణ ప్రణాళిక లేకుండా, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దకుండా సుందరీకరణ ఎలా చేస్తారు? ప్రభుత్వమే రోడ్లువేసి, విద్యుత్ కనెక్షన్లు, ఇంటినంబర్, ఆధార్‌కార్డ్‌లు ఇచ్చి.. ఇప్పుడు పేదలు, దిగువ మధ్యతరగతి వారి ఇళ్లు కూలుస్తామంటే ఎలా? ముందు ఇళ్లు కూల్చుతాము, ఆ తర్వాత ప్రణాళిక వేస్తామంటే.. భవిష్యత్‌లో ఈ ప్రాజెక్ట్ నిలిచిపోతే బాధిత ప్రజలు ఎక్కడికి వెళ్లాలి? ఇళ్ల కూలి్చవేతపై మూసీ ప్రభావిత ప్రాంతంలో సీఎం రేవంత్‌రెడ్డి దర్బార్ పెట్టి ప్రజలను ఒప్పించాలి.సీఎం వస్తే నేను కూడా అక్కడకు వచ్చి ప్రజల తరఫున మాట్లాడేందుకు సిద్ధం’అని కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చే ముందు ఇమ్లీబన్లోని ఎంజీబీఎస్‌ను, అక్కడి మెట్రో పిల్లర్లు, స్టేషన్‌ను కూల్చాలి. మూసీ పరీవాహక ప్రాంతంలో 30, 40 ఏళ్ల కిందటే పేదలు తమ కష్టార్జితంతో ఇళ్లు కట్టుకుని నివసిస్తుంటే, ప్రభుత్వం పెద్ద పెద్ద ఫామ్‌హౌస్‌లను వదిలిపెట్టి పేదలపై పడతామంటే మేము విడిచిపెట్టే ప్రసక్తే లేదు’అని హెచ్చరించారు. కాగా, తమతో బీఆర్ఎస్ నేతలెవరూ టచ్‌లో లేరని స్పష్టం చేశారు. తెలంగాణను లూటీ చేసిన ఆ పార్టీతో ఎలాంటి రాజీ లేదని, ఆ పార్టీ అవినీతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుతో పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఎలాంటి ప్రాజెక్ట్ పెట్టదని, అక్కడ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. హైడ్రా, మూసీపై నేను చెప్పేదే పార్టీ పాలసీ.. ‘హైడ్రా ద్వారా దుందుడుకు చర్యలు తీసుకోవడం సరికాదు. హైడ్రా అనేది రేవంత్‌రెడ్డి పెట్టుకున్న పేరు. అక్రమ నిర్మాణాల కూలి్చవేతలకు జీహెచ్ఎంసీలో ఓ వ్యవస్థ ఉంది. హైడ్రా వెనుక సీఎం రేవంత్‌రెడ్డికి వేరే ఉద్దేశాలు ఉన్నాయి’అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీలో హైడ్రాపై భిన్నస్వరాలు వినిపించడంపై ఏమంటారని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘పేదల ఇళ్లు కూల్చమని మా ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరైనా చెప్పారా’అని కిషన్‌రెడ్డి తిరిగి ప్రశ్నించారు. హైడ్రా, మూసీపై తాను చెప్పేదే పార్టీ పాలసీ అని స్పష్టంచేశారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించం జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఉపేక్షించమని కిషన్‌రెడ్డి చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా శాంతిభద్రతలు క్షీణిస్తే కేంద్రం జోక్యానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ‘కశ్మీర్లో బీజేపీ వంద శాతం లక్ష్యం చేరుకుంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఏకాకి చేయగలిగాం. భారత్‌కు వ్యతిరేకం కాబట్టి ఆ దేశానికి చైనా అన్నిరకాలుగా సహాయపడుతోంది’అని తెలిపారు. ఆరి్టకల్ 370 పునరుద్ధరణ అసాధ్యమని, అది ముగిసిన అధ్యాయమని అన్నారు. జమ్మూకశీ్మర్‌కు రాష్ట్ర హోదా కల్పనపై తగిన సమయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. -
‘రాజకీయాల నుంచి తప్పుకుంటే.. గోవా వెళ్తా.. ఎంజాయ్ చేస్తా’
సాక్షి, హైదరాబాద్: తనకు గోవాలో హోటల్ ఉందని.. రాజకీయాల నుంచి తప్పుకుంటే గోవా వెళ్లి ఎంజాయ్ చేస్తానంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి మల్లారెడ్డి. శుక్రవారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, మనిషి జీవితం ఒకేసారి వస్తుందని..ఎంజాయ్ చేయాలన్నారు తన కుమారుడికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వమని అడుగుతున్నా.. కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే రేవంత్‌ను పట్నం మహేందర్ కలిశారు. ఎంపీ రంజిత్‌రెడ్డి చేరికకు ముందే మహేందర్ కర్చీఫ్ వేశారు. జగ్గారెడ్డి ఫోకస్ కావడం కోసమే నా పేరు వాడుకుంటున్నారు. ఎంపీ టికెట్ కోసమే జగ్గారెడ్డి.. రేవంత్‌ను పొగుడుతున్నాడు. మల్లారెడ్డి పేరు చెప్పకపోతే జగ్గారెడ్డిని ఎవరూ పట్టించుకోరు. గతంలో రేవంత్‌రెడ్డిపై ఆయన చేసిన విమర్శలు అందరికీ గుర్తున్నాయి’’ అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. సబితారెడ్డితో కేటీఆర్ భేటీ అసెంబ్లీలో సబితారెడ్డితో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. మహేందర్ రెడ్డి, సునీతారెడ్డి పార్టీ వీడితే ఎదురయ్యే పరిణామాలపై చర్చించారు. ఇప్పటికే ప్రకాష్ గౌడ్, తీగల కృష్ణారెడ్డిలు.. సీఎంను కలవడంపై చర్చాంశనీయంగా మారింది. జిల్లాలో పార్టీ పరిస్థితి పై చర్చించినట్లు సమాచారం ఇదీ చదవండి: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం -
నా జీవితంలో అది ఎప్పటికీ ప్రత్యేకమే: నిహారిక
మెగాడాటర్, నాగబాబు కూతురు నిహారిక కొణిదెల టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. మెగా కుటుంబం నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు పోస్టులు చేస్తూ టచ్‌లో ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా నెటిజన్స్‌తో సరదాగా చిట్ చాట్ నిర్వహించారు. ఈ ఇంటరాక్షన్‌లో నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. అసలు ఆమెను ఎలాంటి ప్రశ్నలు అడిగారో ఓ లుక్కేద్దాం పదండి. (ఇది చదవండి: ‘భోళా శంకర్’కు తొలి రోజు ఊహించని కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే.. ) నిహారిక తన ఫ్యాన్స్‌తో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆమె ఇష్టమైన విషయాల గురించి మాట్లాడారు. మీకిష్టమైన ప్రదేశం, వెబ్ సిరీస్‌లు ఏవని అడగ్గా.. ఇండోనేషియాలోని బాలి తన బెస్ట్ వెకేషన్ ప్లేస్ అని వెల్లడించింది. ఇక వెబ్ సిరీస్‌లు విషయానికొస్తే దిస్ ఇజ్ అజ్, డెక్ట్సర్ అని తెలిపింది. మరో నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేయగా.. నిహారిక బదులిచ్చింది. వరుణ్‌తేజ్‌తో దిగిన ఏ ఫోటో మీకు ఇష్టమని ప్రశ్నించగా.. ఎంగేజ్మెంట్లో అన్నయ్యతో దిగిన ఫోటోనే నా జీవితంలో అత్యంత ప్రత్యేక సందర్భమని తెలిపింది. అంతే కాకుండా నాకు బోర్డ్ గేమ్స్ అంటే చాలా ఇష్టమని.. రొమాన్స్, మర్డర్ మిస్టరీ జోనర్ సినిమాలంటే తనకు ఆసక్తి అని వెల్లడించింది. కాగా.. ఇటీవలే తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'జైలర్' థియేటర్లో అత్తగారి ముందే ఆ హీరోయిన్‌తో ధనుష్ రచ్చ) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
సరైన టైంలో నిర్ణయం.. అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 50 శాతం స్థానాల్లో పోటీపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. తాజ్‌మహల్ కంటే అందమైన సెక్రటేరియట్ కేసీఆర్ కట్టారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామం అని అసదుద్దీన్ పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో మంచి పరిపాలన చేస్తున్నారు.. దేశమంతా వస్తే మంచిదే. మమ్మల్ని బీజేపీ బీ టీం అని కాంగ్రెస్ వాళ్లు ప్రచారం చేస్తున్నారు. బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో జేపీసీ కోసం అడిగితే మోదీ ఒప్పుకోవడం లేదు. సెక్రటేరియట్ ఓపినింగ్ అధికారిక కార్యక్రమం.. అక్కడికి వెళ్తాము. పరేడ్ గ్రౌండ్ మీటింగ్ బీఆర్ఎస్ రాజకీయ సమావేశం.. మాకు సంబంధం లేదు.. ఇతర పార్టీలని పిలిస్తే వాళ్ల ఇష్టం అని అసదుద్దీన్ అన్నారు. చదవండి: సీఎం కేసీఆర్‌తో జగ్గారెడ్డి భేటీ.. కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? -
డ్రోన్ అంటే కెమెరా ఒక్కటే కాదు!
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘‘పిల్లలూ డ్రోన్ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా? డ్రోన్ అంటే కెమెరా ఒక్కటే కాదు.. దానితో పొలాల్లో పురుగుమందు స్ప్రే చేయవచ్చు.. అమ్మాయిల భద్రత విషయంలో చర్యలు తీసుకోవచ్చు. గుట్టలు, చెరువులు, కుంటల సరిహద్దులను నిర్ధారించవచ్చు. సరిహద్దుల్లో ఎవరు చొరబడకుండా చూడవచ్చు. భవిష్యత్‌లో మనుషులను తీసుకెళ్లే వాహనం కూడా అవుతుంది’’అంటూ గురుకుల విద్యార్థులతో మంత్రి కేటీఆర్ చిట్‌చాట్ చేశారు. మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్, గూడూరు శివారులో మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ బాలుర, బాలికల గురుకుల పాఠశాల భవనాలను కేటీఆర్ ప్రారంభించారు. తర్వాత విద్యార్థులతో కలిసి ముచ్చటిస్తూ భోజనం చేశారు. ఈ సందర్భంగా కవరేజ్‌లో భాగంగా ఆ వైపు వచ్చిన డ్రోన్‌ను చూసిన కేటీఆర్ దానివల్ల ఏమేం చేయొచ్చో విద్యార్థులకు వివరించారు. చదువుకుని ఏమవుతారని, ఉద్యోగం చేస్తారా? అని ప్రశ్నించారు. ఉద్యోగం చేయడమే కాకుండా పది మందికి ఉద్యోగం కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. ఇక్కడ పదో తరగతి, ఇంటర్మీడియెట్ చదివే పిల్లలను హైదరాబాద్‌లోని టీ–హబ్‌కు తీసుకువెళ్లి చూపించాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. తాను నాన్‌వెజ్ బంద్ చేశానని.. అందుకే పప్పు, చారు, పెరుగుతో ముగిస్తున్నానని విద్యార్థులకు చెప్పారు. భారీగా అభివృద్ధి పనుల ప్రారంభం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు, కమలాపూర్ గ్రామాల్లో రూ.49 కోట్ల అంచనాలతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అంతకుముందు మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తదితరులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కమలాపూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద శిలాఫలకాలను ఆవిష్కరించారు. తర్వాత కుల సంఘాల భవన సముదాయాన్ని ప్రారంభించారు. కాగా.. మంత్రి కేటీఆర్ పర్యటన సమయంలో ఎన్ఎస్యూఐ కార్యకర్తలు కాన్వాయ్‌లోకి చొరబడి నల్లచొక్కాలతో నిరసన తెలిపారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. -
మహేష్ బాబు ఒకప్పటిలా లేడు: సుధీర్ బాబు
-
వాల్తేరు వీరయ్య తో సాక్షి చిట్ చాట్
-
బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ కీర్తి భట్ తో " చిట్ చాట్ "
-
బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ శ్రీ సత్యతో " చిట్ చాట్ "
-
జాన్ సే డైరెక్టర్ తో " చిట్ చాట్ "
-
మట్టి కుస్తీ మూవీ టీంతో " స్పెషల్ చిట్ చాట్ "
-
జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తో " చిట్ చాట్ "
-
యాంకర్ ఓంకార్, కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ తో " స్పెషల్ చిట్ చాట్ "
-
బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ బాలాదిత్య తో " స్పెషల్ చిట్ చాట్ "
-
యశోద మూవీ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తో " స్పెషల్ చిట్ చాట్ "
-
" లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్ " మూవీ టీంతో చిట్ చాట్
-
లైగర్ ఫ్లాప్‌పై తొలిసారి స్పందించిన పూరీ
-
లైగర్ ఫ్లాప్‌పై తొలిసారి స్పందించిన పూరీ, ఏమన్నాడంటే
విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్చించిన చిత్రం లైగర్. పాన్ ఇండియా మూవీగా రూపొందిన లైగర్ భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బొల్తా పడింది. దీంతో ఈ మూవీ నిర్మాతలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు లైగర్ నష్టాలను మిగిల్చింది. ఇదిలా ఉంటే విడుదలకు ముందు బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసిన పూరీ విడుదల అనంతరం సినిమా గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. చదవండి: ‘బాహుబలి’ ఆఫర్ వదులుకున్నందుకు గర్వపడుతున్నా: మంచు లక్ష్మి మూవీ పరాజయంపై ఇంతవరకు ఆయన నేరుగా స్పందించింది లేదు. ఈ నేపథ్యంలో చిరుతో ఇన్స్టాగ్రామ్ వేదికగా లైవ్‌లో పాల్గొన్న పూరీ ఈ సందర్భంగా లైగర్ ఫ్లాప్‌పై స్పందించాడు. కాగా గాడ్ ఫాదర్ బ్లాక్‌బస్టర్ హిట్ నేపథ్యంలో పూరీ జగన్నాథ్-చిరంజీవి ఇన్‌స్ట్రాగ్రామ్ లైవ్ ద్వారా ముచ్చటించారు. ఈ నేపథ్యంలో చిరు, పూరీని ఇలా ప్రశ్నించాడు. పూరీ మీరు అనుకున్న రిజల్ట్ రాకపోతో ఎలా తీసుకుంటారు? అని అడగ్గా.. ‘దెబ్బ తగినప్పుడు హీలింగ్ టైమ్ ఉంటుంది చూశారా.. అది తక్కువగా పెట్టుకోవాలి. ఆస్తులు పోవచ్చు లేదా యుద్ధాలు జరగోచ్చు ఏం జరిగినా హీలింగ్ టైమ్ నెలకు మించి ఉండకూడదు. ఒక నెలలో వేరే పనిలో పడిపోవాలి అంతే. కొన్నిసార్లు నమ్మిన వాళ్లు కూడా ఫ్లిప్ అవ్వచ్చు, ఏమైనా జరగచ్చు’ అన్నాడు. చదవండి: వెండితెర ఎంట్రీ ఇస్తున్న కార్తీక దీపం ఫేం ‘వంటలక్క’, ఫస్ట్‌లుక్ రిలీజ్ అనంతరం ‘నేను లైగర్ సినిమా తీశాను. మూడేళ్లు సినిమాకి పనిచేస్తూ ఎంతో ఎంజాయ్ చేశాను. మంచి సెట్స్ వేశాం. కాస్ట్ అండ్ క్రూ, మైక్ టైసన్ ఇలా అంతా ఎంతో ఆనందంగా చేశాం. కానీ, సినిమా ఫ్లాప్ అయ్యింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా రిజల్ట్ కోసం ఆదివారం వరకు వేచి చూశా. ఆ తర్వాత మూవీ ప్లాప్ అని అర్థమైంది. ఆ మరుసటి రోజు సోమవారం జిమ్‌కు వెళ్లి 100 స్క్వాడ్స్ చేశా. ఒత్తిడి మొత్తం పోయింది. నా జీవితం నేను బాధగా ఉన్న రోజుల కంటే నవ్వుతూ ఉన్న రోజులే ఎక్కువ’ అంటూ పూరీ సమాధానం ఇచ్చాడు. ఇక ప్రస్తుతం తాను ముంబైలో కొత్త కథలు రాసే పనిలో ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు. కాగా గాడ్ ఫాదర్లో పూరీ జర్నలిస్ట్‌గా కీ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. -
జిన్నా మూవీ టీం తో స్పెషల్ చిట్ చాట్
-
గాడ్ ఫాదర్ గ్రాండ్ సక్సెస్.. మూవీ టీమ్ స్పెషల్ చిట్ చాట్
-
మంచు లక్ష్మితో స్పెషల్ చిట్ చాట్
-
అడగరాని ప్రశ్న అడిగిన నెటిజన్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ
బిగ్‌బాస్ రియాల్టీ షో ద్వారా పాపులర్ అయిన నటి పునర్నవి భూపాలం. అంతకు ముందు కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ.. అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొని, తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఏ విషయంలోనైనా ఓపెన్‌గా మాట్లాడుతూ..బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చకుంది. బిగ్‌బాస్ షో తర్వాత చాలా సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ.. నో చెప్పి పై చదువుల కోసం లండన్ వెళ్లింది. ప్రస్తుతం ఆమె లండన్‌లో సైకాలజీ హయ్యర్ స్లడీస్ చేస్తోంది. సినిమాల ద్వారా కాకపోయినా.. సోషల్ మీడియా ద్వారా అయినా అభిమానులతో టచ్‌లో ఉంటుంది ఈ బోల్డ్ బ్యూటీ. ఇటీవల ఇన్ స్టా లైవ్‌లోకి వచ్చిన పునర్నవి తన డేటింగ్ విషయంపై స్పందించింది. మీరు ఎవరితోనైనా డేటింగ్లో ఉన్నారా? అని ఓనెటిజన్ ప్రశ్నించగా.. ఎస్ అని అన్సర్ ఇచ్చింది. అలాగే మీరు వర్జిన్ నా? అని మరో నెటిజన్ ప్రశ్నించగా.. పునర్నవి మొహమాటం లేకుండా నేను ఇలాంటి ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నానని సమాధానం చెప్పారు. పునర్నవి చేసిన ఈ చిట్ చాల్ నెట్టింట వైరల్ అవుతోంది. -
నల్లగొండ: పార్టీ మార్పుపై కోమటిరెడ్డి రాజగోపాల్ చిట్‌చాట్
-
సితార సోఫాలో నుంచి కిందపడిపోయింది: మహేశ్ బాబు
Mahesh Babu About Sitara In Chit Chat With Youtubers: 'ఆ సీన్ చూసి సితార ఇచ్చిన రియాక్షన్ ఇప్పటివరకు నేను ఎప్పుడూ చూడలేదు' అని సూపర్ స్టార్ మహేశ్ బాబు పేర్కొన్నాడు. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు మహేశ్ బాబు. ఇందులో భాగంగా శనివారం (మే 21) పలువురు యూట్యూబర్లతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేశ్ బాబు, కీర్తి సురేశ్, డైరెక్టర్ పరశురామ్ పాల్గొన్నారు. యూట్యూబర్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా, ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను వారితో పంచుకోవాలని మహేశ్ బాబు తెలిపాడు. ''ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో కీర్తి నన్ను తిట్టాలి. 3 టేకులు తీసుకున్నప్పటికీ కీర్తి చేయలేకపోయింది. దీంతో డైరెక్టర్ ఆమె దగ్గరికి వెళ్లి 'మేడమ్.. మీరు సార్‌ను తిట్టాలి. గుర్తుపెట్టుకోండి ఆయన్ను మీరు తిట్టాలి.' అని చాలాసార్లు చెప్పారు. కీర్తి ఇబ్బందిపడుతోందని నాకు అర్థమైంది. అప్పుడు నేను 'పర్వాలేదు కీర్తి.. నన్ను నువ్వు తిట్టు' అని చెప్పాను. దానికి ఆమె 'సార్.. నేను మిమ్మల్ని తిట్టలేను. ఒకవేళ నేను మిమ్మల్ని తిడితే మీ ఫ్యాన్స్ నన్ను ఏదో ఒకటి అంటారు.' అని చెప్పింది. 'నా ఫ్యాన్స్ ఏం అనరమ్మ. నువ్వు తిట్టు.' అని నచ్చజెప్పి ఆ సీన్ పూర్తయ్యేలా చేశాం. కానీ మొన్న నా ఫ్యామిలీతో కలిసి ఆ సీన్ చూసినప్పుడు సితార ఇచ్చిన రియాక్షన్ ఇప్పటివరకూ నేను ఎప్పుడూ చూడలేదు. తను సోఫాలో నుంచి కిందపడిపోయి మరి నవ్వింది.'' అని చెప్పుకొచ్చాడు మహేశ్‌బాబు. చదవండి: అలా ఎందుకు జరిగిందో తెలియదు: మహేశ్ బాబు ఆ సినిమా చూసి ఏడ్చేశాను : మహేశ్ బాబు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_721246091.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ రెండింటికి దూరంగా ఉండాలనుకుంటున్నా : సమంత
స్టార్ హీరోయిన్ సమంత తాజాగా నటించిన సినిమా కాతువాక్కుల రెండు కాదల్. ఈ సినిమాని తెలుగులో ‘కణ్మణి ర్యాంబో ఖతీజా’ పేరుతో విడుదల చేశారు. విజయ్ సేతుపతి, నయనతారతో పాటు సమంత నటించిన ఈ సినిమా ఏప్రిల్28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన సమంత వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.చదవండి: ఎప్పటికీ కృతజ్ఞురాలినే,మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా : సమంత ప్రేక్షకులను నవ్వించడం కోసమే ఖతీజా పాత్రలో నటించానని చెప్పిన సమంత ప్రతి ఒక్కరు వారి జీవితంలో కాస్త విరామం ఇచ్చి ఈ సినిమా చూసి హాయిగా నవ్వుకోమని కోరింది. ఇక ఈ సినిమాలో తనకు ‘డిప్పం డిప్పం’ పాట అంటే ఎంతో ఇష్టమని సమంత ఈ సందర్భంగా పేర్కొంది. నయనతార గురించి చెబుతూ..తాను కలిసిన వాళ్లలో మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్ నయనతార అని ఆమెలాంటి వ్యక్తి మరొకరు ఉండరు అని పేర్కొంది. ఇక ఓ నెటిజన్ ఒకే సమయంలో ప్రేక్షకుల నుంచి ప్రేమ, విపరీతమైన ద్వేషం రావడం ఎలా అనిపిస్తుంది అని అడగ్గా.. ఆ రెండింటికి దూరంగా ఉంటానని, అయితే అభిమానులు తనపై చూపించే ప్రేమకు కృతఙ్ఞతతో ఉంటానని సామ్ చెప్పుకొచ్చింది. దీంతో ప్రేమపై కూడా తనకు నమ్మకం లేదని ఈ సమాధానం ద్వారా సమంత చెప్పకనే చెప్పింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: సమంతపై ప్రాంక్.. విజయ్ సర్ప్రైజ్ మామూలుగా లేదుగా I try not to buy into the love or the hate .. stay a safe distance away from it all ♥️#AskSam https://t.co/RyLXiPjxca — Samantha (@Samanthaprabhu2) April 29, 2022 #Nayanthara is #Nayanthara💕there is no one like her . She is real,fiercely loyal and one of the most hard working people I have met #Kanmani #KaathuvakulaRenduKaadhal #AskSam https://t.co/8Crkmn8BLE — Samantha (@Samanthaprabhu2) April 29, 2022 -
KGF Chapter 2 మూవీ టీం తో స్పెషల్ ఇంటర్వ్యూ
-
'ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను.. మాటల్లో చెప్పలేని ఫీలింగ్'
సెకండ్ లాక్డౌన్ (గత ఏడాది)లో వెడ్ లాక్ (2021 మే 30)లోకి ఎంటరయ్యారు ప్రణీత. వ్యాపారవేత్త నితిన్ రాజుతో ఆమె వివాహం జరిగింది. సోమవారం (ఏప్రిల్ 11) సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఓ తీపి కబురు పంచుకున్నారు ప్రణీత. తల్లి కాబోతున్న విషయాన్ని తెలియజేసి, స్కానింగ్ కాపీని చూపిస్తూ భర్తతో కలిసి ఉన్న ఫొటో షేర్ చేశారామె. ఈ సందర్భంగా ప్రణీతతో ‘సాక్షి’ స్పెషల్ చిట్ చాట్. ►పెళ్లి సింపుల్‌గా చేసుకుని, ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తల్లి కాబోతున్న విషయాన్నీ సోషల్ మీడియా ద్వారానే ప్రకటించారు..(నవ్వేస్తూ).. నాకు సింపుల్ వెడ్డింగ్ అంటే ఇష్టం. అందుకు తగ్గట్టుగా అప్పుడు లాక్డౌన్ కూడా. అందుకే మాకు నచ్చినట్లు దగ్గర బంధువులు, అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకుని, సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాం. హడావిడి లేకుండా మా పెళ్లి ప్రశాంతంగా జరిగింది. ►ఇప్పుడు తల్చుకున్నా చాలా స్వీట్‌గా ఉంటుంది. ఇక నా లైఫ్‌లో జరిగే ప్రతి మంచి విషయాన్ని నా ఫ్యాన్స్‌కి తెలియజేయాలనుకుంటాను. అందుకే అప్పుడు పెళ్లి, ఇప్పుడు తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాను. 2021లో పెళ్లితో లైఫ్‌లో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు ఇంకో కొత్త చాప్టర్. ఈ కొత్త ఫీలింగ్ గురించి... ►నిజంగా మాటల్లో చెప్పలేని ఫీలింగ్ ఇది. ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను. నితిన్‌కి చెప్పాను. మా అమ్మవాళ్లకి, అత్తమామలకు చెప్పేటప్పుడు మాత్రం బిడియంగా అనిపించింది. నాకు నేను కొత్తగా అనిపించాను. అలానే వేరే ఫ్రెండ్స్‌తో కూడా సిగ్గుపడుతూ మాట్లాడాను. ►మీ అమ్మగారు గైనకాలజిస్ట్ కాబట్టి గైడెన్స్ విషయంలో మీకు ఇబ్బంది ఉండదు... అవును. అమ్మ సలహాలు తీసుకుంటాను. ఏం తినాలి? ఏం తినకూడదు? అని చాలామంది చెప్పారు. నాకు వామిటింగ్, వేరే ఏ ఇబ్బందులు లేవు. అందుకని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేంతవరకూ నేను ప్రెగ్నెంట్ అని కన్ఫార్మ్గా తెలుసుకోలేకపోయాను. మామూలుగా ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు బొప్పాయి, పైనాపిల్ తినకూడదంటారు. కానీ టెస్ట్ చేసుకోకముందు కొన్ని రోజులు ఈ రెండూ బాగానే తిన్నాను. థ్యాంక్ గాడ్... ఏమీ కాలేదు. ►ఇప్పుడు ఎన్నో నెల? అది మాత్రం సస్పెన్స్. డెలివరీ ఈ సంవత్సరమే. ►ప్రెగ్నెన్సీ టైమ్‌లో చేసే యోగా, ఎక్సర్సైజ్లవీ ప్లాన్ చేసుకున్నారా? ఇంకా లేదు. కొన్ని రోజులు మెల్లిగా నడవాలనుకుంటున్నాను. ఆ తర్వాత యోగా వంటివి ప్లాన్ చేస్తాను. ఈ మధ్య కాజల్ అగర్వాల్ (ప్రస్తుతం కాజల్ గర్భవతి) యోగా చేస్తూ పెట్టిన వీడియోలు చూశాను. కొన్ని రోజుల తర్వాత నేనూ అవి చేయాలనుకుంటున్నాను. ►ఇప్పుడు ఏమేం తినాలనిపిస్తోంది? ప్రస్తుతానికి నాకు చాక్లెట్లు, ఐస్‌క్రీములు తినాలనిపిస్తోంది. ఇంతకుముందూ తినేదాన్ని కానీ ఇప్పుడు ఈ రెండింటి మీద మనసు బాగా లాగుతోంది. అయితే నా ఆరోగ్యం, బేబీ ఆరోగ్యం కోసం కొంచెం కంట్రోల్ చేసుకుంటాను. ఇంకా డైట్ ప్లాన్ చేయలేదు... చేయాలి. ►పాప కావాలా? బాబు పుట్టాలనుకుంటున్నారా? మా ఇద్దరికీ (భర్త నితిన్ రాజు) ఎవరైనా ఓకే.. ప్రస్తుతం ఓ కన్నడ సినిమా చేస్తున్నట్లున్నారు.. లక్కీగా ఆ సినిమా షూటింగ్ పూర్తయింది. ►సినిమాలు కంటిన్యూ చేస్తారా? తప్పకుండా. ఇప్పుడు కూడా ఏమైనా యాడ్స్‌కి అవకాశం వస్తే చేస్తాను. సినిమాలు వదిలే ప్రసక్తే లేదు. ►ఫైనల్లీ.. కంగ్రాట్స్ ప్రణీత... టేక్ కేర్.. థ్యాంక్యూ సో మచ్. ఓ కొత్త ఫీలింగ్‌తో నా ఫీలింగ్స్‌ని షేర్ చేసుకున్నాను. ‘ఐయామ్ వెరీ హ్యాపీ’. -
నిహారిక అకౌంట్‌ను నేనే డియాక్టివేట్ చేశాను : నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ విషయంపై అయినా తనదైన స్టైల్లో సమాధానమిస్తుంటాయరన. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అయితే ఓ యూజర్ నిహారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను ఎందుకు డిలీట్ చేసింది?ఆ రూమర్స్‌పై రెస్పాండ్ అవ్వండి అని అడిగారు. దీనికి రిప్లై ఇచ్చిన నాగబాబు.. 'నిజానికి నేనే కోడింగ్ నేర్చుకొని అకౌంట్ హ్యక్ చేసి అకౌంట్ డియాక్టివేట్ చేశాను. మళ్లీ డీకోడింగ్ నేర్చుకొని అకౌంట్ రీ యాక్టివ్ చేస్తాను' అంటూ ఫన్నీగా బదులిచ్చారు. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిహారిక కొన్ని రోజుల క్రితం తన ఇన్‌స్టా అకౌంట్‌ని డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పలు ఊహాగానాలు తెరమీదకి వచ్చాయి. కానీ నిహారిక భర్త చైతన్య తన ఇన్‌స్టా నుంచి ఇద్దరి ఫోటోలు షేర్ చేస్తూ ఆ రూమర్స్‌కి చెక్ పెట్టారు. -
రోజుకో సినిమా చూసి గానీ పడుకునే వాన్ని కాదు: నిర్మాత
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, ఆర్య, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'పడి నెట్టం పడి'. శంకర్ రామకృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో ఘన విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రాన్ని 'గ్యాంగ్స్ ఆఫ్ 18' పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. ఈ నెల 26న తెలుగులో గ్రాండ్‌గా విడుదల కానుంది ఈ సినిమా. ఈ సందర్భంగా ఈ మూవీ విశేషాలను పంచుకున్నారు నిర్మాత గుదిబండ వెంకట సాంబి రెడ్డి. సినిమాపై ఆసక్తితో.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలు విద్యాసంస్థలు స్థాపించాను. సినిమా రంగంలోకి రావాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. అందులో భాగంగానే తొలి సినిమాగా 'పండుగాడి ఫొటోస్టూడియో' చిత్రం నిర్మించాను. దాని తర్వాత ‘గ్యాంగ్స్ ఆఫ్ 18’ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 26న సినిమాను గ్రాండ్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నాం. సందేశాత్మకంగా ఉంటుంది.. మీరు గమనించినట్లయితే ‘'గ్యాంగ్స్ ఆఫ్ 18' సినిమాకు 'నా స్కూల్ డేస్' అనే ట్యాగ్‌లైన్‌తోనే సినిమా స్టోరి ఏంటో చెప్పాం. స్టూడెంట్ దశ గురించి ఈ చిత్రంలో దర్శకుడు చాలా చక్కగా చూపించారు. విద్యార్థులకు సరైన గురువు దొరికితే వాళ్ల జీవితం ఎలా మారుతుంది. జీవితంలో వాళ్లు ఎంత ఎత్తుకు ఎదగగలరు అనే చక్కటి సందేశం ఈ సినిమాలో ఉంటుంది. అలాగే ప్రభుత్వ కళాశాలకు చెందిన స్టూడెంట్స్‌ను కార్పొరేట్ విద్యాసంస్థలకు చెందిన స్టూడెంట్స్ చిన్న చూపు చూడటం. ఇలాంటి క్రమంలో ఒక ప్రభుత్వ కళాశాల విద్యార్థులు మంత్రితో పందెం కట్టడం ఆ విద్యార్థులు ఆ పందెంలో ఎలానెగ్గారు. చివరికి ఆ మంత్రి ఏం చేశాడు. అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రతి సన్నివేశం ఎంతో కొత్తగా, ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు మలిచిన తీరు అత్యద్భుతం అని చెప్పడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఇక ఆచార్యుని పాత్రలో మమ్ముట్టి గారు అద్భుతమైన నటన కనబరిచారు. అతను స్టూడెంట్స్‌ని ఇన్స్పైర్ చేసే విధానం గానీ, వారి అభివృద్దికి తోడ్పడే అంశాలుగానీ నిజ జీవితంలో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటాయి. కాబట్టి ప్రతి స్టూడెంట్‌తో పాటు ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు కచ్చితంగా చూసి తీరాల్సిన అవసరం ఉంది. ఆ అంశాలు అదనపు ఆకర్షణ వర్షంలో వచ్చే బస్సు ఫైట్, సైకిల్ మీద ఫైట్ అలాగే ఏఆర్ రహమాన్ మేనల్లుడు ఏహెచ్ కాశీఫ్ అద్భుతమైన ఐదు పాటలు కంపోజ్ చేశారు. ప్రతి పాట ఎంతో వినసొంపుగా ఉంటుంది. ఇప్పటికే ఒక పాట రిలీజ్ చేశాం. యూట్యూబ్‌లో ఆ సాంగ్ చాలా బాగా ట్రెండ్ అవుతోంది. సంగీతంతో పాటు సినిమాటోగ్రఫీ, దర్శకుడి టేకింగ్, మమ్ముట్టి, ప్రియమణి, ఆర్య, పృథ్వీరాజ్ నటన సినిమాకు హైలెట్‌గా నిలిచే అంశాలు. అలాగే బాహుబలి చిత్రానికి పని చేసిన కెచ్చ ఈ చిత్రానికి అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేశారు. ఈ ఫైట్స్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. తెలుగు సినిమాలానే.. చైతన్య ప్రసాద్, శ్రేష్ణ, కృష్ణ మాదినేని ఇందులో పాటలు రాశారు. అలాగే మైథిలి కిరణ్, దీపిక రావ్ సంభాషణలు సమకూర్చారు. అందరూ కలిసి డబ్బింగ్ సినిమాలా కాకుండా తెలుగు స్ట్రయిట్ సినిమాలా ఎంతో క్వాలిటీ వర్క్ ఇచ్చారు. మా బ్యానర్లో మరిన్ని.. ప్రస్తుతం తెలుగులో ఒక స్ట్రయిట్ ఫిలిం ప్లాన్ చేశాను. ప్రస్తుతం దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అలాగే వెబ్ సిరీస్ కూడా తీయాలన్న ఆలోచన ఉంది. ఇలా కంటిన్యూయస్‌గా మా బ్యానర్లో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రోజుకో సినిమా చూసి.. పడుకునే ముందు రోజుకో సినిమా చూసి కానీ పడుకోను. ఇటీవల ఓటీటీ ఫిలింస్, వెబ్ సిరీస్‌లు చాలా చూస్తున్నా. యంగ్ జనరేషన్ అంతా మంచి కథాంశంతో వస్తున్నారు. కచ్చితంగా న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తాను. మంచి ఆడియో ఉండేలా.. ఏ జానర్ తీసుకున్నా కూడా కథ, కథనాలు ఆసక్తికరంగా, బోర్ కొట్టించకుండా, తర్వాత ఎలా ఉంటుంది? అనేలా ఉండాలి. అప్పుడే నాకు ఆ సినిమా నచ్చుతుంది. నాకు మాత్రమే కాదు ప్రేక్షకులు అంతా కూడా ఇలా ఉంటేనే ఇష్టపడారు. కాబట్టి మంచి స్క్రిప్ట్, చక్కటి సన్నివేశాలు, ఆకట్టుకునే పాటలు ఉంటే సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇటీవల కాలంలో చూస్తున్నాం. ఒక్క పాట హిట్ అయినా ఆ సినిమా ఎక్కడికో వెళ్తుంది. మా తదుపరి సినిమాల్లో మంచి ఆడియో ఉండేలా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాం. చివరిగా ‘గ్యాంగ్స్ ఆఫ్ 18’ ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. తమ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని వెంకట సాంబిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. -
అతన్ని తొలిసారి అప్పుడే కలిశాను: శ్రుతీహాసన్
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు హీరోయిన్ శ్రుతీహాసన్. వీలు కుదిరినప్పుడల్లా తన అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటారు. తాజాగా ఫ్యాన్స్‌కి ఆ అవకాశం ఇచ్చారు. అయితే తన ఫేవరెట్ విషయాలను మాత్రమే అడగాలని కండీషన్ పెట్టారు శ్రుతి. కానీ నెటిజన్స్ ఊరుకుంటారా? ఎవరికి నచ్చినవి వాళ్లు అడిగారు. అవేంటో చూద్దాం. వారంలో ఏ రోజు అంటే మీకు ఇష్టం? ప్రత్యేకంగా కారణం చెప్పలేను కానీ శనివారం అంటే ఇష్టం. ఆ తర్వాత గురువారం. వర్కౌట్స్ గురించి ఏం చెబుతారు? మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకోవడాన్ని చాలా ఎంజాయ్ చేస్తాను. ఇంకా స్విమ్మింగ్, డ్యాన్సింగ్ అంటే ఇష్టం. అయితే ఎక్కువ సమయం కేటాయిం చాల్సిన యోగా అంటే నాకు అంత ఇష్టం లేదు. ఎలాంటి పువ్వులను ఇష్టపడతారు? రోజా పువ్వులంటే చాలా ఇష్టం. ఆ తర్వాత లిల్లీ పువ్వులు ఇష్టం. మీరు ఏ ఫలాన్ని ఇష్టంగా తింటారు? సీతాఫలాలు. వీటితో పాటు చెర్రీస్ కూడా. మీకు ఇష్టమైన ఫుడ్? దోసె, సాంబార్, రసం వడ. శంతను (శ్రుతి బాయ్‌ఫ్రెండ్)ని మీరు ఎప్పుడు కలిశారు? తొలిసారి 2018లో శంతనుని కలిశాను. 2020 నుంచి మేం రిలేషన్షిప్లో ఉన్నాం. గిటార్ లేదా పియానోలలో ఏది ఇష్టం? నాకు గిటార్ సౌండింగ్ ఇష్టం. కానీ గిటార్‌ను ప్లే చేయలేను. అందుకే పియానో నా ఫేవరెట్. మీ ఫేవరెట్ బుక్? ద ఓల్డ్‌మ్యాన్ అండ్ ది సీ స్ట్రయిట్ లేదా కర్లీ హెయిర్.. ఏది ఇష్టం? నాకు స్ట్రయిట్ హెయిర్ అంటేనే ఇష్టం. ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? ఎప్పటికీ ఏఆర్ రెహమాన్‌గారే. మీ శరీరంలో మీకు ఇష్టమైనవి? నా బ్రెయిన్,నా హార్ట్. -
'అనసూయ.. మిమ్మల్ని అక్కా అని పిలవాలా? లేక ఆంటీనా'?
యాంకర్ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై గ్లామరస్ యాంకర్‌గా రాణిస్తూనే అవకావం వచ్చినప్పుడల్లా వెండితెరపై కూడా సత్తా చాటుతుంది. ఇటీవలె పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో నటించి మరింత పాపులర్ అయిన అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో చిట్‌చాట్ నిర్వహించిన ఆమె ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అయితే ఓ నెటిజన్ అడిగిన కొంటె ప్రశ్నకు ఘాటుగా బదులచ్చింది. మిమ్మల్ని అక్కా అని పిలవాలా లేదా ఆంటీ అని పిలవాలా అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. 'ఏదీ వద్దు. అలా పిలిచే అంత స్నేహం మన మధ్య లేదు. ఇలా పిలుస్తామని అనడం మీ పెంపకాన్ని ( అప్ బ్రింగింగ్) ప్రశ్నిస్తుంది. ఇది ఏజ్ షేమింగ్ చేసినట్లే. గౌరవం ఇవ్వండి' అంటూ అనసూయ పేర్కొంది. అయితే దీనికి కౌంటర్‌గా.. 'ఎవరినైనా అక్కా అని పిలిచినంత మాత్రానా ఏజ్ షేమింగ్ అవ్వదు. అలాంటప్పుడు ప్రశంసలు కూడా తీసుకోవద్దు' అంటూ సదరు నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి అనసూయ బదులిస్తే.. 'అయ్యుండొచ్చు. కానీ ఏ ఉద్దేశంతో పిలుస్తున్నారన్నది ముఖ్యం ఇక్కడ. అయినా కాంప్లిమెంట్స్(ప్రశంసలు) తీసుకోవాలా వద్దా అన్నది వాళ్ల ఇష్టం కదా' అంటూ ట్రోలర్ నోరు మూయించింది. -
సంక్రాంతి సాక్షిగా హుషారు
-
సర్పంచ్ నాగలక్ష్మీ, బంగార్రాజుతో ‘గరం’ సత్తి ముచ్చట్లు
-
హీరో విజయ్ అంథోని హీరోయిన్ ఆత్మికలతో స్పెషల్ చిట్ చాట్
-
కబడ్డీ..కబడ్డీ...విత్ గోపిచంద్
-
శంకర ప్రియ తమన
-
హర్భజన్ సింగ్ ఇంటర్వ్యూ
-
రామాచార్య
-
ఇచ్చట వాహనములు నిలుపరాదు టీం తో సరదా ముచ్చట్లు
-
ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీ టీం తో ముచ్చట్లు
-
శ్రీదేవి సోడా సెంటర్ మూవీ టీం తో చిట్ చాట్
-
ఇండియన్ ఐడల్ 12 విన్నర్స్ తో స్పెషల్ చిట్ చాట్
-
గరం గరం ముచ్చట్లు 28 August 2021
-
బిగ్‌బాస్ దివితో రక్షాబంధన్ స్పెషల్ చిట్ చాట్
-
బర్నింగ్ స్టార్ ట్యాగ్‌పై సంపూ ఫీలింగ్ ఇది
-
జనారణ్య మూర్తి
-
సాక్షి స్పెషల్ చిట్ చాట్ విత్ అడవి శేషు
-
పాటకు ప్రాణం పోస్తున్న ఫ్యాషనేట్ సింగర్స్
-
తిమ్మరుసు మూవీ టీమ్‌తో స్పెషల్ చిట్ చాట్
-
చోటీ చోటీ బాతే... సితార, ఆద్య స్పెషల్ ఇంటర్వ్యూ
-
తన బాడీలో ఆ పార్ట్‌కే ఎక్కువ ఖర్చు పెట్టినట్లు రిప్లై ఇచ్చిన నటి
విలక్షణ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి చాలా సమయమే పట్టింది. నటిగా, సింగర్‌గా, మంచి డ్యాన్సర్‌గా ఎదుగుతూ.. కెరీర్ పరంగా దూసుకెళ్తున్న సమయంలో తన వ్యక్తిగత కారణాల వల్ల కొన్నాళ్లు సినిమాలకు దూరమై.. మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. సినిమాల పరిస్థితి ఎలా ఉన్నా ఈ అమ్మడు తన అభిమానులతో అప్పుడప్పుడు చిట్ చాట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ అభిమాని అడిగిన వింత ప్రశ్నకు షాకింగ్ సమాధానమిచ్చింది. ఎక్కువ ఆ పార్ట్‌కు ఖర్చు చేశాను.. సినీ పరిశ్రమలో కొంచెం గ్యాప్ తరువాత రీఎంట్రీలో సక్సెస్ సాధించడం అంత సులువు కాదన్న విషయం తెలిసిందే, కానీ ఇది శ్రుతి హాసన్ వీటిని మార్చిందనే చెప్పాలి. తెలుగులో వకీల్‌సాబ్, క్రాక్ సినిమాలతో హిట్లు అందుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’లో నటిస్తోంది. ఈ రకంగా శ్రుతి స్పీడ్ చూస్తుంటే కాస్త విరామం వచ్చినప్పటికీ తిరిగి తన కెరీర్లో దూసుకెళ్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో ఈ ముద్దు గుమ్మ ఓ అభిమానితో ముచ్చటిస్తుండగా ఆ వ్యక్తి .. ‘మీ శరీరంలో మీకు ఏ భాగం అంటే ఇష్టం.. మీ ముక్కు అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా.. అది నిజమేనా’ అని ప్రశ్నించాడు.అందుకు ఈ అమ్మడు సమాధానంగా.. ‘అవును నాకు ముక్కు అంటే ఇష్టమే.. దాని కోసమేగా చాలా డబ్బులు ఖర్చు పెట్టానంటూ’ ఏ మాత్రం తడుముకోకుండా బదులిచ్చింది. దెబ్బతో క్రాక్ నటి ఇచ్చిన రిప్లైకి షాక్‌లోకి వెళ్లాడు ఆ నెటిజన్. కాగా ప్రస్తుతం ఈ రిప్లై నెట్టింట వైరల్‌గా మారి హల్చల్ చేస్తోంది. -
హీరోయిన్ను ఆ విషయం గురించి డైరెక్ట్‌గా అడిగేసిన నెటిజన్
కరోనా ప్రభావం సినీ ఇండస్ర్గీపై గట్టిగానే పడింది. సినిమా షూటింగులు కూడా ఇప్పుడిప్పుడే తిరిగి ప్రారంభిస్తున్నారు. సో కొంచెం ఖాళీ సమయం దొరకగానే అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ఇటీవలి కాలంలో చాలామంది నటీనటులు యూజర్లతో చిట్‌చాట్ సెషన్లు నిర్వహిస్తున్నారు. వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానమిస్తున్నారు. తాజాగా ఓ మలయాళ బ్యూటీ మంజిమ మోహన్ అభిమానులతో ఆస్క్ మీ ఏనీథింగ్ సెషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్..మీరు మీ రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటి అని డైరెక్ట్‌గా అడిగేశాడు. దీనిపై స్పందించిన మంజిమ..అందరూ లవ్‌లో పడుతుంటే..నేను మాత్రం తిండిపై దృష్టి పెడుతున్నాను అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. అంటే పరోక్షంగా తన రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్ అని చెప్పుకొచ్చింది. అయితే మంజిమ షేర్ చేసిన ఫన్నీ మీమ్ నెటిజన్లను మరింత ఆకట్టుకుంది. మీ లైఫ్‌లో చాలా ముఖ్యమైనవి ఏంటి అని మరో నెటిజన్ ప్రశ్నించగా..'ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్, ఫ్యామిలీ, కంపాషన్'అంటూ బదులిచ్చింది. ఇక మొదటి సినిమాతోనే మళయాలంలో హిట్ కొట్టిన మంజిమ ఆ తర్వాత వరుస అవకాశాలతో గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో నాగచైతన్యతో కలిసి 'సాహసం శ్వాసగా సాగిపో' అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. చదవండి : మోనాల్‌ని అఖిల్ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా? ఆర్ఆర్ఆర్ పోస్టర్‌పై ట్రాఫిక్ పోలీసుల సెటైర్.. టీమ్ ఫన్నీ రిప్లై -
క్యా కమల్ హై !
-
గుణ చిత్ర శిల్పి
-
క్యాబ్ స్టోరీస్
-
ఏక్ మిని...సినీ సాహసం !
-
ఆ మాట వాస్తవమే: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఈటల ఎపిసోడ్‌పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మీడియాతో ఆయన మంగళవారం చిట్‌చాట్ నిర్వహించారు. ఇప్పటి వరకు తానను ఈటల రాజేందర్ కలవలేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. తానను కలిసేందుకు సంప్రదించిన మాట వాస్తవమేనన్నారు. ఈటల, తాను 15 ఏళ్లు కలిసి పనిచేశామని.. కలిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. కలిసినంత మాత్రాన పార్టీలో చేరేందుకు అనుకోలేమన్నారు. ఎప్పుడు కలుస్తామన్నది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. అందరినీ కలుస్తున్నా, మిమ్మల్నీ కలుస్తా అని నాతో అన్నారని కిషన్‌రెడ్డి వివరించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వస్తే పోటీ అంశంపై చర్చించలేదని.. పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కిషన్‌రెడ్డి తెలిపారు. చదవండి: ఈటలకు బీజేపీ ఆహ్వానం! Corona Vaccine: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం -
భరత్ రెడ్డి నటుడే కాదు, ప్రముఖ కార్డియాలజిస్ట్
-
సినిమా బండి టీమ్‌తో చిట్ చాట్
-
బాలీవుడ్లో జెండా పాతిన మన తిరుపతి వాసులు
-
వ్యాక్సిన్ లభ్యతే అతిపెద్ద సవాల్: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేవలం 45 రోజుల్లోనే రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చే మౌలిక వసతులు అందుబాటులో ఉన్నా వ్యాక్సిన్ లభ్యత అతి పెద్ద సవాలుగా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. చిన్నారులకు వ్యాక్సినేషన్ జరగనందున ఆన్లైన్ విధానంలో విద్యా బోధన మరికొంత కాలం కొనసాగే అవకాశముందని తెలిపారు. సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్లో ‘ఆస్క్ కేటీఆర్’పేరిట గురువారం నిర్వహించిన కార్యక్రమంలో.. కోవిడ్ నియంత్రణ తదితర అంశాలపై నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలిచ్చారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ ప్రశ్నలు–జవాబుల కార్యక్రమం ట్విట్టర్ ట్రెండింగ్‌లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. వివిధ ప్రశ్నలకు కేటీఆర్ ఇచ్చిన సమాధానాలు ఆయన మాటల్లోనే.. ఆ పిల్లలకు హెల్ప్‌డెస్క్ కోవిడ్ మూలంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌ని ఏర్పాటు చేసింది. కరోనా మొదటి దశ సంక్షోభంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆక్సిజన్ పడకల సంఖ్యను పెంచాం. గత ఏడాది సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలో 9,213 ఆక్సిజన్ బెడ్లు ఉండగా, ప్రస్తుతం 20,739కు పెంచాం. రెండో డోసు ఇచ్చేందుకే ప్రాధాన్యం వ్యాక్సినేషన్లో జాతీయ సగటుకన్నా తెలంగాణ ముందు వరుసలో ఉంది. రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారు 92 లక్షలు కాగా, ఇందులో 45 లక్షల మందికి మొదటి డోసు వ్యాక్సిన్ అందింది. మరో 10 లక్షల మందికి రెండో డోసు కూడా పూర్తయింది. మొదటి డోసు తీసుకున్న వారికి రెండో డోసు ఇచ్చేందుకే ప్రాధాన్యత ఇస్తున్నాం. రోజుకు 9 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చే సామర్ధ్యం రాష్ట్రానికి ఉంది. వ్యాక్సిన్ తయారీదారులైన భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌లతో మాట్లాడుతున్నాం. కోవాగ్జిన్ ఫార్ములాను భారత్ బయోటెక్ ఇతర కంపెనీలతో పంచుకొని వ్యాక్సిన్ అందరికీ అందేలా చూడటంలో కేంద్రమే ఒక నిర్ణయం తీసుకోవాలి. కేంద్రం ఆధీనంలో ఆక్సిజన్ ఆక్సిజన్ సరఫరా పూర్తిగా కేంద్రం ఆధీనంలో ఉంది. ఈ విషయంలో యావత్ దేశం సవాలును ఎదుర్కొంటోంది. రెమిడెసివిర్ మందుల వినియోగాన్ని ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్న వారిని అరెస్టు చేస్తున్నాం. కోవిడ్ చికిత్సకు వసూలు చేయాల్సిన బిల్లుల విషయంలో జాతీయ స్థాయిలో ఏకీకృత విధానంపై దృష్టి సారిస్తాం. కరోనా నియంత్రణకు ఇంటింటి సర్వేలో భాగంగా 28 వేల బృందాలు 60 లక్షల ఇళ్లను సందర్శించిన ఫలితాలు త్వరలో వస్తాయి. కరోనాను అధిగమించాలంటే 70 శాతం జనాభాకు వ్యాక్సిన్లు వేయాలి. 3.8 కోట్ల డోసుల వ్యాక్సిన్లు అవసరం. సంపూర్ణ లాక్డౌన్ డిమాండ్ ఉన్నా ప్రజల నిత్యావసరాల కోసం ఉదయం పూట వెసులుబాటు కల్పించాం. రాష్ట్రానికి ఆక్సిజన్ కోటా పెంచాలి..: ఏపీ, కర్ణాటక, చత్తీస్‌గఢ్ నుంచి వస్తున్న రోగులకు కూడా ఇక్కడ చికిత్స అందిస్తున్నందున రాష్ట్రానికి ఆక్సిజన్, ఇతర మందుల కోటా పెంచాలి. కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కొందరు బదనాం చేస్తున్నారు. ప్రస్తుత కోవిడ్ సంక్షోభంలో మన రాష్ట్రంలో ఉన్న ఫార్మా పరిశ్రమ ప్రాధాన్యతను జాతీయ స్థాయిలో తెలుసుకున్నారు. వైద్యుల సూచనలతో అధిగమించా.. నాకు కరోనా సోకినప్పుడు వరుసగా ఏడురోజుల పాటు తక్కువ నుంచి అతి ఎక్కువ డిగ్రీల జ్వరం కొనసాగింది. ఊపిరితిత్తుల్లో కొంత ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. మధుమేహ వ్యాధి ఉండటంతో బ్లడ్ షుగర్, రక్తపోటు నియంత్రణ కొంత సవాలుగా మారింది. అయితే డాక్టర్ల సలహాలు పాటించడం ద్వారా సమస్యలు అధిగమించా. ప్రస్తుతం కొంత బలహీనంగా అనిపిస్తున్నా.. సాధారణ స్థితికి చేరుకున్నా. కోవిడ్ సోకిన వారు ఎవరైనా సొంత వైద్యంతో కాకుండా వైద్యులు సూచించిన మందులు వాడుతూ, మానసిక ధైర్యంతో వైరస్‌ను జయించాలి. -
అనిల్ రావిపూడి తో స్పెషల్ చిట్ చాట్
-
బాహుబలి లండన్ లో చూసాను : అనుపమ్ ఖేర్
-
నయా రహమానియా
-
బస్తి బాలరాజ్ & టీమ్
-
గంగవ్వతో గరం సత్తి ముచ్చట్లు
-
ఓడిపోతానని కష్టపడేదాన్ని
నటిగా సమంత భయాలేంటి? ఏ జానర్ సినిమాలు ఇష్టపడతారు? ఆమె పాటించే జీవిత సూత్రాలేంటి? అని ఫ్యాన్స్‌కు తెలుసుకోవాలని ఉంటుంది. బుధవారం సాయంత్రం ట్విట్టర్లో ‘ఏ ప్రశ్న అయినా అడగండి.. సమాధానం చెబుతాను’ అని ఫ్యాన్స్‌తో అన్నారు సమంత. అంతే.. ఫ్యాన్స్‌కి ఉన్న ప్రశ్నలన్నీ సమంత మీద కురిపించారు. అందులో కొన్నింటికి ఆమె సమాధానం చెప్పారు. అందులో కొన్నింటిని మీ కోసం తీసుకొచ్చాం. ► చాలా జానర్లలో సినిమాలు చేశారు. మీ ఫేవరెట్ జానర్ ఏది? సమంత: ఫేవరెట్ అంటూ ఏదీ లేదు. కానీ గత సినిమాలో ఏది చేశానో దాన్ని రిపీట్ చేయాలనుకోను. అదే చేస్తే ఆడియన్స్‌కు, నాకు బోర్ కొడుతుంది. ► ఈ కరోనా కష్టకాలంలో మీ అభిమానులకు ఏం సందేశమిస్తారు? ప్రస్తుతం అందరం కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. కొందరైతే చాలా కష్టాల్లో ఉన్నారు. ఈ కష్టకాలం త్వరగా గడచిపోవాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ► లాక్డౌన్లో మీరు చేసిన మంచి పని ఏంటి? ఈ లాక్డౌన్లో ఓ స్పెషల్ ప్రాజెక్ట్ మీద పని చేశా. అదేంటో మీ అందరికీ త్వరలోనే చెబుతాను. అలాగే కుటుంబంతో ఎక్కువగా గడిపే అవకాశం దొరికింది. అదొక మంచి విషయం. ► కష్టపడి పని చేయడానికి మిమ్మల్ని మీరు ఎలా ప్రేరేపించుకుంటారు? ఇంతకు ముందు ఓడిపోతాం అనే భయంతో కష్టపడేదాన్ని. కానీ కరోనా వల్ల నా ఆలోచనా ధోరణి మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే నాకు సంతోషాన్ని ఇస్తాయి అనే విషయాలకు మాత్రమే కష్టపడాలనుకుని నిర్ణయించుకున్నాను. సంతోషంగా ఉండాలనే ఆలోచన నన్ను మోటివేట్ చేసేస్తుంది. కష్టపడేలా చేస్తుంది. ► జీవితం మెరుగు పడాలంటే ఏం చేయాలి? కచ్చితమైన డైట్ పాటించాలి. యోగా లేదా ధ్యానం లాంటివి చేయాలి. ప్రణాళికతో కూడిన దినచర్యను అలవాటు చేసుకోవాలి. ► ఎలాంటి పాత్రలు చేయడం కష్టంగా అనిపిస్తుంది? దర్శకుడు గౌతమ్ మీనన్‌ను కలిసే వరకూ రొమాన్స్ కష్టం అనుకున్నాను. నందినీ రెడ్డిని కలిసే వరకూ కామెడీ కష్టమనుకున్నా. కానీ ఇప్పుడు ఎలాంటి పాత్ర అయినా భయపడను. నటిగా నాకెలాంటి భయాల్లేవు. -
క్రేజీ డైరెక్టర్
-
చిన్ని చిన్ని సరదా
కరోనా వల్ల లభించిన ఖాళీ సమయంలో శ్రుతీహాసన్ వంటలు చేస్తున్నారు. ఆన్లైన్లో అభిమానులతో చిట్ చాట్ చేశారు. తనకు ఇష్టమైన సంగీతాన్ని బాగా సాధన చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా ఏదైనా చేయాలనుకున్నారట. అది కూడా ఏదైనా ప్రయోగం అయితే బాగుంటుందని భావించానంటున్నారు శ్రుతీహాసన్. సొంతంగా ఓ మాస్క్‌ను తయారు చేసుకున్నారు. ఆ మాస్క్‌ను «ధరించి, ఫొటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు శ్రుతి. ‘‘ఈ కరోనా కాలంలో మాస్క్‌లను తప్పనిసరిగా ధరించండి. వీలైతే సొంత మాస్క్‌లను తయారు చేసుకోండి. నేను అలానే చేశాను. సొంత మాస్క్‌ను తయారు చేసుకోవడం చిన్న పనే కావొచ్చు. కానీ ఈ పని నాకు చాలా సరదాగా అనిపించింది. ఈ చిన్ని ప్రయోగం చాలా సంతోషాన్నిచ్చింది. అందుకే ఇలాంటి మరో ఎగై్జటింగ్ ఎక్స్పరీమెంట్ ఏదైనా చేయాలనుకుంటున్నాను. మీరు (అభిమానులు) కూడా సొంతంగా మాస్క్‌లు తయారు చేసుకోవడాన్ని ఓసారి ప్రయత్నించండి’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. -
అతడు నా అభిమాన హీరో
మహేశ్‌లో నమ్రతకు నచ్చిన విషయం ఏంటి? మహేశ్ చేసే సినిమాల కథల్లో నమ్రత ఇన్వాల్వ్ అవుతారా? నమ్రత లైఫ్‌లో బెస్ట్ మూమెంట్స్ ఏంటి? వంటి పలు ప్రశ్నలను నెటిజన్లు నమ్రతను అడిగారు మంగళవారం నమ్రత తన ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్‌తో చిట్ చాట్ చేశారు. ఆ విశేషాలు ఈ విధంగా... ► లాక్డౌన్లో ఏం నేర్చుకున్నారు? సహనంగా ఉండటం నేర్చుకున్నాను. ప్రతి చోటా ప్రేమ ఉంటుందని తెలుసుకున్నాను. ► షాపింగ్ అంటే ఇష్టమేనా? ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ► మరాఠీ ప్రజలను మిస్ అవుతున్నారా? మహారాష్ట్రియన్‌గా గర్వపడుతున్నాను... నా మరాఠీ ఫ్యామిలీని మిస్ అవుతున్నాను. ► మీరు మిస్ఇండియా కావడానికి స్ఫూర్తి? మా అమ్మగారు ► మీ జీవితంలో బెస్ట్ ఫేజ్? మదర్‌హుడ్ ► మీ హాబీ? హోమ్ ఇంటీరియర్స్‌ను డిజైన్ చేయడాన్ని బాగా ఇష్టపడతాను. ► మీరు తెలుగు బాగా మాట్లాడగలరా? మాట్లాడతాను కానీ ఇంకాస్త మెరుగుపడాల్సి ఉంది. ► ఫిట్నెస్ సీక్రెట్? వ్యాయామం చేయడం, తినడం, బాగా నిద్రపోవడం. ► మీ లైఫ్‌లో బెస్ట్ మూమెంట్? నా పెళ్లి రోజు. నేను ఇద్దరు పిల్లలకు తల్లినైన రోజు. ► మీ ఫేవరెట్ టాలీవుడ్ హీరో? ఇంకెవరు? మహేశ్‌బాబు. ► మీ ఫేవరెట్ ప్లేస్? ప్రస్తుతం ఇంటిని మించిన ఫేవరెట్ ప్లేస్ లేదు. ► మహేశ్గారిలో మీకు నచ్చిన విషయం? రియల్‌గా ఉండే మహేశ్ వ్యక్తిత్వం ► మీ కూతురు సితార సినిమాల్లో నటిస్తుందా? ఈ విషయం గురించి ఇప్పుడే చెప్పలేను. ప్రస్తుతం తను తన యూట్యూబ్ చానెల్ (ఆద్యా సితార) కోసం వీడియోలు చేయడంలో చాలా బిజీగా ఉంది. ► మహేశ్‌బాబు హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో మరో సినిమా ఉంటుందా? ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పగలదు. ►మహేశ్ నటించిన చిత్రాల్లో మీకు ఇష్టమైనవి? ఒక్కడు, పోకిరి, మహర్షి, దూకుడు, సరిలేరు నీకెవ్వరు, భరత్ అనే నేను ► మహేశ్‌బాబుతో మీరు ఎప్పుడైనా ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యారా? మా ఇద్దరికీ ఒకరికొకరిపై పూర్తి నమ్మకం ఉంది. సో.. ఇన్సెక్యూరిటీకి తావు లేదు. ► మహేశ్‌బాబు వంట చేస్తానంటే మీరు ఏం వండమని చెబుతారు? మహేశ్ సులభంగా ఏం వండుతాడా? అని నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను. ► సితార, గౌతమ్.. ఎవరి అల్లరి ఎక్కువ? ఎవరి అల్లరి వాళ్లది ► భవిష్యత్‌లో మహేశ్‌గారు, మీరు ఒకే సినిమాలో నటిస్తారా? ఈ జీవితకాలంలో అది మళ్లీ సాధ్యం కాకపోవచ్చని నాకనిపిస్తోంది. ► మీ అత్తగారు ఇందిరమ్మ గురించి కొన్ని మాటలు చెప్పండి? ప్రేమకు నిర్వచనం. ► మహేశ్ నిక్‌నేమ్? నాని ► మహేశ్ స్క్రిప్ట్ సెలక్షన్లో మీ పాత్ర ఉంటుందా? నేను ఇన్వాల్వ్ కాను. ► మీరు సాయిబాబా భక్తురాలిగా ఎలా మారారు? సాయిబాబాకు మా అమ్మగారు పెద్ద భక్తురాలు. నా అనుభవాలు నన్ను బాబా భక్తురాలిగా మార్చాయి. సాయిబాబా.. మై ఓన్లీ గురు. భర్త, పిల్లల పేర్లతో టాటూ -
త్రీఎఫ్ ఉంటే చాలు!
‘త్రీఎఫ్’ ఉంటే చాలు. నేను చాలా హ్యాపీగా ఉంటాను’’ అంటున్నారు త్రిష. ‘త్రీఎఫ్’ అంటే ఏంటి? అని ఆలోచిస్తున్నారు కదూ! ‘ఫుడ్, ఫ్రెండ్స్, ఫిల్మ్స్’ అన్నమాట. తమ అభిమానులతో టచ్‌లో ఉండేందుకు అప్పుడప్పడూ సినీతారలు సోషల్ మీడియాలో చిట్ చాట్ చేస్తుంటారు. ఇటీవల త్రిష చిట్ చాట్ చేశారు. ‘మిమ్మల్ని హ్యాపీగా ఉంచే మూడు అంశాల గురించి చెప్పండి’ అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ‘ఫుడ్, ఫ్రెండ్స్, ఫిల్మ్స్’ అని చెప్పారు త్రిష. ‘మీ గురించి మూడు మాటల్లో ఏం చెబుతారు?’ అనే ప్రశ్నకు ‘ధైర్యం, నమ్మకం, నిజాయితీ’ అని బదులు చెప్పారు. ‘ఎవరికీ తెలియని మీలో ఉన్న ఓ ప్రతిభ గురించి’ అనే ప్రశ్నకు ‘ఇంటిని సూపర్‌గా శుభ్రం చేస్తాను. నేను శుభ్రం చేశాక ఇంట్లో ఎక్కడా మురికిని కనిపెట్టలేం’ అని చెప్పారు. -
కింది మెట్టు
కింది మెట్టు లేకుంటే.. పై మెట్టు ఎక్కలేం. కింద.. మెట్టు లేకుంటే పై నుంచి దిగలేం. ఎగువ ఎక్కువ కాదు. దిగువ తక్కువ కాదు. ‘భార్య ఒక మెట్టు కింద ఉండాలి’ అనే మాటపై ఇప్పుడు నెట్లో మెట్లను కూలగొట్టేస్తున్నారు! ‘యానీస్ కిచెన్’లో ఎప్పటి మాటో అది. ఇప్పుడెవరో పైకి తీసి మంటను రాజేశారు. రెండేళ్ల క్రితం ఒక శనివారం. సాయంత్రం 7 గంటలు. అమృత టీవీలో ‘యానీస్ కిచెన్’ కార్యక్రమం మొదలైంది. అప్పటికి మూడేళ్లుగా ప్రసారం అవుతున్న ఆ కిచెన్‌ని హోస్ట్ చేస్తున్నది ప్రముఖ మలయాళీ నటి చిత్రా షాజీ కైలాస్. ఆ రోజు గెస్ట్‌గా వచ్చినవారు మరో నటి సరయు మోహన్. ఇద్దరి మధ్య సంభాషణ మొదలైంది. మధ్య మధ్య ఫలానా వంటను ఎలా చేయాలో ‘యానీ’ చెబుతున్నారు. చిత్ర అసలు పేరు అదే. యానీ! పెళ్లయ్యాక చిత్ర అని మార్చేశాడు భర్త. ‘‘ఈ భర్తలు ఎందుకు ఇలా చేస్తారు?’’.. యానీ. ‘‘ఎలా?’’.. సరయు. ‘‘వంట చెయ్యలేరు. చేసిన వంటకు పేర్లు పెడతారు’’. నవ్వారు సరయు. ‘‘ఏం మాట్లాడకుండా తినడం కన్నా, తింటూ ఏదో ఒక మాట అనడం నయం కదా’’ అన్నారు. ‘‘అసలు వీళ్లెందుకు భార్యాభర్త ఇద్దరూ సమానం అనుకోరు. హెల్ప్ చెయ్యరు. కష్టాన్ని గుర్తించరు’’. ‘‘గుర్తింపు అవసరం లేదు. వాళ్లను అలా వదిలేయడమే బెటర్. భార్య భర్త కన్నా ఒక మెట్ట కింద ఉంటే గొడవలే ఉండవు’’ అన్నారు సరయు. ‘‘ఎస్, కరెక్ట్’’ అన్నారు యానీ. ఇదిగో ఈ ముక్కే ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ‘‘ఒక మెట్టు కిందేమిటి! సరయు అంటే అనొచ్చు. హోస్ట్గారు సమర్థించడం ఏమిటి?’’. ట్రోలింగ్ మొదలైంది. యానీ మీద, యానీస్ కిచెన్ మీదా. ఈ లాక్డౌన్లో రెండు నెలలుగా ఆ ప్రోగ్రామ్ రావడం లేదు. లాక్డౌన్ తర్వాత కూడా రావడానికి లేదని డిమాండ్లు ట్వీట్ అవుతున్నాయి. మరి ఆరోజే ఎందుకు ఎవరూ ఏమీ అనలేదు.. రెండేళ్ల క్రితం! ఎవరూ సీరియస్‌గా తీసుకుని ఉండకపోవచ్చు. ఇప్పుడెవరో దానిని బయటికి తీసి రాజేశారు. గత వారం రోజులుగా తమపై వస్తున్న విమర్శలకు సరయు మాత్రం స్పందించారు. అప్పటికీ ఇప్పటికీ తన ఆలోచనా తీరు మారింది అన్నారు. భార్యాభర్త సమానం అన్నారు. యానీ మాత్రం ఈ విమర్శలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు లేరు. ‘యానీస్ కిచెన్’కి గృహిణుల్లో మంచి ఆదరణ ఉంది. ఆ ఆదరణే తన సమాధానం అనుకున్నట్లున్నారు యానీ. యానీ కేరళ అమ్మాయి. క్రైస్తవ కుటుంబం. తల్లి మరియమ్మ. తండ్రి జాబీ. ముగ్గురు అక్కలు.. లిస్సీ, మేరీ, టెస్సీ. యానీ ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు తల్లి చనిపోయింది. యానీ తిరువనంతపురంలోని ఆల్ సెయింట్స్ కాలేజీలో చదువుకుంది. కాలేజీలో ఉండగానే సినిమా ఆఫర్ వచ్చింది. ఆమె తొలి చిత్రం ‘అమ్మాయనే సత్యం’ (అమ్మ మీద ఒట్టు) పెద్ద హిట్ అయింది. అందులో డబుల్ రోల్ యానీది. స్త్రీగా, పురుషుడిగా. రెండు మనస్తత్వాల మధ్య గీతను కాకుండా.. దంపతులను మధ్య కలతల్ని మాత్రం ఆమె చెరపదలచుకున్నట్లున్నారు. ‘యానీస్ కిచెన్’లో ఆమె ప్రబోధించే సర్దుబాటుకు అదొక్కటే కారణంగా కనిపిస్తోంది. నేను మారాను అవి రెండేళ్ల క్రితం నాటి అభిప్రాయాలు. ఇప్పుడు నా ఆలోచనలు మారాయి. కొత్తకొత్త స్నేహితులు, కొత్త ప్రదేశాలకు ప్రయాణాలు అందుకు కారణం కావచ్చు. భార్య భర్తకంటే ఒక మెట్టు కిందే ఉండాలి అనే మాటను వెనక్కు తీసుకుంటున్నాను. స్త్రీ అయినా, పురుషుడైనా ఆత్మగౌరవాన్ని కోల్పోకూడదు. – సరయు మోహన్ -
అప్పుడు నేను... ఇప్పుడు అడిడాస్
న్యూఢిల్లీ: భారత మహిళా అథ్లెట్ హిమ దాస్ ‘అడిడాస్’ పేరుపై ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. భారత సీనియర్ క్రికెటర్ రైనాతో ఆమె ఇన్ స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసింది. ఈ సంభాషణలో ఆ సంగతి చెబుతూ ‘పందెం కోసం నా పరుగు ఉట్టి పాదాలతోనే మొదలైంది. ఎలాంటి బూట్లు, పాదరక్షల్లేవ్. అయితే నేను పాల్గొనే తొలి జాతీయ పోటీల కోసం నా తండ్రి తన స్తోమతకు తగిన సాదాసీదా స్పైక్ బూట్లను తెచ్చాడు. అయితే వాటిపై నేను చేతితో అడిడాస్ అనే బ్రాండ్ పేరు రాసి పోటీల్లో పాల్గొన్నాను. ఇప్పుడు అదే అడిడాస్ నాకు స్పాన్సర్ చేసిన కిట్‌పై నా పేరు రాసివ్వడం గొప్ప అనుభూతినిచ్చింది. షూస్‌పై హిమ దాస్ అని ఉండటం చూసిన నాకు అప్పటి అనుభవం గుర్తొచ్చింది’ అని చెప్పింది. 20 ఏళ్ల హిమ 2018లో ఫిన్లాండ్లో జరిగిన ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల రేసులో పసిడి పతకం గెలిచింది. దీంతో ప్రముఖ షూ కంపెనీ అడిడాస్ ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఆమె కోసం ప్రత్యేకంగా తయారు చేసిన షూస్‌లపై హిమ పేరు రాసింది. -
ఆ క్షణం ఇంకా రాలేదు
ముంబై: స్మృతి మంధాన... క్రీజ్‌లో ఉన్నప్పుడు దూకుడుగా బ్యాటింగ్ చేయడమే కాదు, మైదానం బయట కూడా అంతే చురుగ్గా కనిపించే ఈతరం అమ్మాయి. భారత ఓపెనర్‌గా ఎన్నో చూడచక్కటి ఇన్నింగ్స్‌లు ఆడిన స్మృతి క్రికెట్ ముగిశాక తన సొంత ప్రపంచంలో చేసే అల్లరికి అంతే ఉండదు. సహచరురాలు జెమీమా రోడ్రిగ్స్ కూడా జత కలిసిందంటే అంతు లేని ఆటపాటలతో ఇక ఫుల్ బిజీ. భారత డ్రెస్సింగ్ రూమ్‌లో వీరిద్దరూ అందించే వినోదం ప్రత్యేకం. ఇప్పుడు లాక్డౌన్ కారణంగా ఆటగాళ్లంతా తమ ఇళ్లలోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో సరదాగా మాట్లాడుకుందామని అభి మానులకు స్మృతి పిలుపునిచ్చింది. ట్విట్టర్ వేదికగా ఆస్క్ స్మృతి అంటూ సాగిన సంభాషణలో మహారాష్ట్రకు చెందిన 23 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తన మనసు విప్పి పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. విశేషాలు స్మృతి మంధాన మాటల్లోనే.... ► మైదానంలో దిగాక అతిగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తా. బ్యాటింగ్ సమయంలో కూడా ఒకేసారి ప్రణాళిక రూపొందించుకోకుండా ఒక్కో బంతికి అనుగుణంగా నా ఆటతీరును మార్చుకుంటా. ► అంతర్జాతీయ క్రికెట్లో నేను ఎంతో మంది బౌలర్లను ఎదుర్కొన్నా... వారిలో మరిజాన్ కాప్ (దక్షిణాఫ్రికా పేసర్) బౌలింగ్‌లో పరుగులు తీయడానికి చాలా కష్టపడ్డాను. ► కెరీర్‌కు సంబంధించి భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన రోజు నా కెరీర్లో మరచిపోలేనిది. అయితే చిరస్మరణీయ క్షణం మాత్రం ఇంకా రాలేదు. బహుశా భవిష్యత్తులో మేం ప్రపంచ కప్ సాధించిన రోజు అది కావచ్చు. ► సరదాగా చెప్పాలంటే నా మొహం ఇన్ని రోజులు చూస్తూ మా ఇంట్లో వాళ్లే అలసిపోయారు. ఎప్పుడెప్పుడు తర్వాతి టోర్నీ ఉంటుందా అంటున్నారు. అయితే ఈ సమయాన్ని చాలా బాగా గడుపుతున్నామనేది మాత్రం వాస్తవం. ► చిన్నప్పుడు నాకిష్టమైన కార్టూన్ల జాబితాలో నాడీ, బాబ్ ద బిల్డర్, నింజా హటోరి ఉన్నాయి. ఇప్పుడు కూడా సమయం దొరికితే వాటిని చూస్తుంటా. ► అరిజిత్ సింగ్ కాకుండా నాకు ప్రస్తుతం ఇష్టమైన బాలీవుడ్ గాయకుడు ప్రతీక్ బచ్చన్ (సరిలేరు నీకెవ్వరులో సూర్యుడివో, చంద్రుడివో పాట పాడాడు) నా హోటల్ (ఎస్ఎం 18 పేరుతో సాంగ్లీలో ఉంది)లో ఏం బాగుంటాయని అడిగారు. మా మెనూలో అన్ని ఐటమ్స్ మీకు నచ్చుతాయి. ఒకసారి తెరిచాక వచ్చి రుచి చూడవచ్చు. ► అందంగా ఉంటావు కాబట్టి సినిమాల్లో చేయవచ్చు కదా అని ఒక అభిమాని అడిగాడు. అయితే నన్ను చూడటానికి ఎవరైనా థియేటర్‌కు వస్తారని నేను అనుకోవడం లేదు. కాబట్టి మీరు కూడా అలాంటివి అస్సలు ఆశించవద్దు. ► ప్రస్తుతం నేను ఒంటరిగా ఉన్నానా అని అడుగుతున్నారు.... ఏమో చెప్పలేను. నాకైతే తెలీదు. ► నా జీవిత భాగస్వామి కావాలనుకునే వ్యక్తి నన్ను ప్రేమించేవాడై ఉండాలనేది మొదటి షరతు. ఈ మొదటి షరతుకు కావాల్సిన నిబంధనలను పాటించాలనేది నా రెండో షరతు. ► ప్రేమ పెళ్లా, పెద్దలు కుదిర్చిన పెళ్లా (లవ్ ఆర్ అరేంజ్డ్) అని అడిగితే లవ్–రేంజ్డ్ అని చెబుతా. నాకు దగ్గరలో జెమీమా లేకపోవడం వల్ల లోటేమీ తెలియడం లేదు. ఇంకా కాస్త ప్రశాంతంగా ఉంటున్నా (దీనిపై స్పందించిన జెమీమా... నువ్వు మోసగత్తెవంటూ ట్విట్టర్లోనే సరదాగా బదులిచ్చింది). గతంలో కళ్లద్దాలు పెట్టుకొని నేను బ్యాటింగ్ చేసేదాన్ని. అయితే మూడేళ్ల క్రితం అది మారింది. 2017లో గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కాంటాక్ట్ లెన్స్‌లను వాడటం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు నేను చాలా సౌకర్యవంతంగా ఉన్నా. తల్లిదండ్రులతో... -
'ఆ జీవోను పెంచి పోషించింది టీడీపీ, కాంగ్రెస్సే'
సాక్షి, తెలంగాణ: రేవంత్‌రెడ్డి డ్రోన్ కేసుపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. రేవంత్ భూవివాదంపై చట్టప్రకారమే చర్యలు తీసుకన్నామని, వ్యక్తిగతంగా ఏమీ లేదని స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీ హాల్లో నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మాణం చేయలేదని, ఎవరో కట్టుకున్న దానిని లీజుకు తీసుకుని ఉంటున్నారని వివరించారు. 111 జీవో తీసివేయాలనే డిమాండ్ ఉందని తెలిపారు. అయితే 111జీవోను పెంచి పోషించింది టీడీపీ- కాంగ్రెస్ పార్టీలే అని ఆయన విమర్శించారు. ఇక పద్మారావుకు పార్టీలో ప్రాధాన్యత తగ్గలేదన్నారు. ఆయన గతంలో కంటే చురుగ్గా పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటున్నాడని మంత్రి తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో జనాభాను బట్టి వార్డుల పెరిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా మంత్రి తలసాని పేర్కొన్నారు. చదవండి: ‘ఆయన స్పూర్తితోనే ‘అన్నపూర్ణ’ పథకం’ -
ఆంగ్ల దినపత్రికలతో సీఎం వైఎస్ జగన్ చిట్‌చాట్
-
అన్న మీరు సినిమాల్లో నటిస్తారా?
హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యలపై స్పందించిన కేటీఆర్.. బాధితులకు అండగా నిలిచారు. తాజాగా కేటీఆర్ ఆదివారం సాయంత్రం ట్విటర్లో.. ఆస్క్ కేటీఆర్ నిర్వహించారు. నెటిజన్ల ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులిచ్చారు. పలువురు నెజటిన్లు తమ సమస్యలను ప్రస్తావించగా.. వాటిపై దృష్టిసారిస్తామని కేటీఆర్ తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. అన్న మీరు సినిమాల్లో నటిస్తారా అని ప్రశ్నించాడు. ‘మీరు ఒకవేళ సినిమాలో నటిస్తే.. మేము మీ సినిమా ద్వారా ఒక మంచి మేసేజ్ ఆశిస్తున్నామ’ని పేర్కొన్నాడు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ‘థ్యాంక్స్.. కానీ నాకు ఫుల్ టైమ్ జాబ్ ఉంది’ అని తెలిపాడు. ఓ నెటిజన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన ఎలా ఉందని ప్రశ్నించగా.. వైఎస్ జగన్ ఆరు నెలల పాలన బాగుందని కేటీఆర్ జవాబిచ్చారు. అలాగే కేటీఆర్ ఇచ్చిన కొన్ని రిప్లైలు.. ప్రశ్న: టీ హబ్ ఫేజ్ 2 ఎప్పుడు ప్రారంభిస్తారు? జవాబు : 2020 ఫస్టాపు లోపు ప్ర : ప్రస్తుత రాజకీయాల్లో మీకు ఎవరు స్పూర్తి? జ : రెండో ఆలోచన లేకుండా కేసీఆర్ గారు. ప్ర : కొంపల్లిలో కొత్త ఐటీ పార్క్ ఎప్పుడూ ప్రారంభిస్తారు? జ : ప్రస్తుతం భూసేకరణ జరుగుతుంది. ప్ర : సార్ మన సిరిసిల్ల జిల్లాకు రైలు సౌకర్యం ఎప్పుడు? జ : అందుకు సంబంధించిన పని జరుగుతోంది. ప్ర : సైబర్ గేట్ వే బస్టాప్ వద్ద చాలా మంది రోడ్డు దాటడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జీబ్రా క్రాసింగ్ వద్ద కూడా వాహనాలు నెమ్మదిగా వెళ్లడం లేదు. కావున ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను. జ : ఇటీవలే 50కిపైగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు మంజూరు అయ్యాయి. ప్ర : మీరు రాజకీయాల్లోకి రావడానికి ప్రభావితం చేసిన అంశం జ : తెలంగాణ ఉద్యమం ప్ర : కాళేశ్వరం జలాలు ఎప్పటిలోగా ఎగువ మానేరుకు వస్తాయి? జ : జూన్ 2020 నాటికి -
విజయంతో ముగిస్తా!
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు గత ఆగస్టులో ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఆమె గెలుపు గ్రాఫ్ అనూహ్యంగా పడిపోయింది. చైనా–1000, కొరియా, డెన్మార్క్, ఫ్రెంచ్, చైనా–750, హాంకాంగ్... ఇలా వరుసగా ఆరు టోర్నీల్లో ఆమె విఫలమైంది. కనీసం ఒక్కదాంట్లోనూ సింధు సెమీస్ కూడా చేరలేకపోయింది. అయితే ఈ పరాజయాల పరంపరకు అడ్డుకట్ట వేస్తూ 2019ని ఘనంగా ముగించాలని ఆమె పట్టుదలగా ఉంది. ప్రతిష్టాత్మకమైన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో విజయం సాధించేందుకు సింధు శ్రమిస్తోంది. సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టూర్ ఫైనల్స్‌లో సింధు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. గత ఏడాది చైనాలోని గ్వాంగ్జౌలో జరిగిన టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది. అదే వేదికపై ఈ సారి డిసెంబర్ 11 నుంచి ఈ టోర్నీ జరుగనుంది. వరుస వైఫల్యాలతో పాయింట్లపరంగా వెనుకబడినా... ప్రపంచ చాంపియన్ హోదాలో సింధు నేరుగా ఈ ఈవెంట్‌కు అర్హత సాధించింది. ఇటీవలి పరాజయాలతో తన ఆత్మ స్థయిర్యం దెబ్బ తినలేదని, మళ్లీ పట్టుదలగా ఆడి పెద్ద విజయం సాధిస్తానని సింధు చెబుతోంది. ‘సాక్షి’కి సింధు ఇచ్చిన ఇంటర్వూ్య విశేషాలు ఆమె మాటల్లోనే... వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు సన్నాహాలు బాగా సాగుతున్నాయి. గత టోర్నీ తర్వాత రెండు వారాలకు పైగా సమయం లభించింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నా. నా ఆటలో కనిపించిన కొన్ని లోపాలు, తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నా. మహిళా సింగిల్స్ కోచ్ కిమ్ జి హ్యూన్ వెళ్లిపోయిన తర్వాత మరో కొరియా కోచ్ పార్క్ కూడా నా శిక్షణలో ప్రత్యేక సహకారం అందిస్తున్నారు. ఫైనల్స్ టోర్నీలో ఎప్పుడైనా గట్టి పోటీ ఉంటుంది. అగ్రశ్రేణి షట్లర్లు మాత్రమే ఉంటారు కాబట్టి ప్రతీ మ్యాచ్ కీలకమే. ప్రపంచ చాంపియన్‌ను అనే ఆత్మవిశ్వాసం మంచిదే కానీ అది అతి విశ్వాసంగా మారిపోవద్దు. ప్రతీసారి ఆట మారిపోతుంది కాబట్టి కొత్త వ్యూహాలతో బరిలోకి దిగాల్సిందే. మన బలహీనతలను లక్ష్యంగా చేసుకొని ప్రత్యర్థులు సిద్ధమై వస్తారు కాబట్టి నేను కూడా అదే స్థాయిలో సన్నద్ధం కావాల్సిందే. ఉదాహరణకు నా బలం స్మాష్. ఆ షాట్‌ను నేను సమర్థంగా వాడాలి. అది సరిగా పని చేయకపోతే కష్టం. వరల్డ్ చాంపియన్‌షిప్ తర్వాత నా ప్రదర్శన బాగా లేదనేది వాస్తవం. అందులో ఎక్కువ భాగం ప్రత్యర్థి బలంకంటే నా స్వయంకృతమే ఉంది. సునాయాసంగా పాయింట్లు రావాల్సిన చోట కూడా నేను కోల్పోయాను. ఇక్కడ నేను అనుకున్న స్ట్రోక్‌లు విఫలం కావడంతో ప్రత్యర్థులు మానసికంగా పైచేయి సాధించారు. ఆ సమయంలో కొంత ఆత్మ రక్షణలో పడిపోతాం. అదే వరుసలో పరాజయాలు వచ్చాయి. ఆటలో గెలుపోటములు సహజమే కానీ వరల్డ్ చాంపియన్ కావడంతో కొంత ఉదాసీనత కారణంగా ఓడానంటే మాత్రం అంగీకరించను. ఇటీవలి పరాజయాలతో నేను నిరాశ చెందిన మాట వాస్తవమే కానీ వాటితో నా ఆత్మ విశ్వాసం దెబ్బ తినదు. ఎందుకంటే నేను ఎప్పుడో అలాంటి దశను దాటి వచ్చేశాను. ఇలాంటి ఓటములతో కుంగిపోతే కష్టం. నేను మరింత నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది. ఎన్ని గెలిచినా మన ఆటను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఫైనల్స్‌లో టైటిల్ నిలబెట్టుకోగలననే నమ్మకం ఉంది. వరల్డ్ చాంపియన్‌షిప్ నుంచి ఇప్పటి వరకు నా ఆటకు సంబంధించి వీడియోలు చూసి కోచ్‌లతో ఎన్నో విషయాలు చర్చించాను. వాటిని సరిగ్గా విశ్లేషిస్తూ వరల్డ్ టూర్ ఫైనల్స్‌పై దృష్టి పెట్టాను. ఇక కొంత మంది అనామక ప్లేయర్ల చేతిలో ఓడిపోవడం చాలా మంది అదోలా చూస్తున్నారు. కానీ నేను కూడా కెరీర్ ఆరంభంలో అలాంటి సంచలన విజయాలు సాధించినదాన్నే కదా. ఆ అమ్మాయిలు కూడా ఎంతో కష్టపడుతున్నారు. కాబట్టి వారికి అనుకూలంగా ఫలితం దక్కింది. సింధులాంటి అత్యుత్తమ స్థాయి ప్లేయర్లు మళ్లీ కోలుకొని చెలరేగడం పెద్ద సమస్య కాదు. టోర్నీల షెడ్యూలింగ్ కఠినంగా ఉండటం కూడా ఆమె ఓటమికి కారణాల్లో ఒకటిగా భావిస్తున్నా. ఓడినా కూడా కొన్ని మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. గత రెండు నెలలు సింధుకు కలిసి రాలేదు కానీ ఇప్పుడు ఆమె చేస్తున్న కఠోర సాధనను బట్టి చూస్తే మళ్లీ తన స్థాయి విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. – పుల్లెల గోపీచంద్, భారత చీఫ్ కోచ్ -
తెలంగాణ ఆర్టీసీ ప్రభావం ఏపీపై ఉండదు: పేర్ని నాని
సాక్షి, అమరావతి : తెలంగాణ ఆర్టీసీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. గురువారం మీడియాతో చిట్‌చాట్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఏపీలో ఆర్టీసీ విలీనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ఏపీలో కార్మికుల విలీనానికి ఆర్టీసీ బోర్డు అంగీకరించిందని, బోర్డులో ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కూడా విలీనానికి అంగీకరించారని తెలిపారు. ఆర్టీసీ విభజన జరగలేదని తెలంగాణ హైకోర్టులో కేంద్రం చెప్పిన విషయం ప్రస్తావించగా.. విభజన జరగకపోతే ఏపీ, తెలంగాణలలో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు కేంద్రం విడివిడిగా ఎలా నిధులు కేటాయించిందని ప్రశ్నించారు. విభజన అనేది సాంకేతిక అంశమన్న మంత్రి.. త్వరలో ఆ ఇబ్బందులను అధిగమిస్తామని తెలియజేశారు. మరోవైపు మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అంశాన్ని లేవనెత్తగా ‘రాజకీయంగా చివరి దశలో ఉన్న జేసీతో మాకేం పని? ఆయనను వైఎస్సార్సీపీలోకి ఎవరు ఆహ్వానించారు. బస్సుల సీజ్ విషయంలో జేసీ అబద్ధాలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చట్టప్రకారమే వ్యవహరిస్తుంద’ని వ్యాఖ్యానించారు. -
చివరి రోజు పంచె కట్టుకుని వస్తా: మంత్రి నిరంజన్‌రెడ్డి
శుక్రవారం రాత్రి శాసనసభ వాయిదా పడిన అనంతరం తనకు ఎదురైన మీడియాతో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతున్న క్రమంలో.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అటుగా వెళ్తూ కనిపించారు. ‘కాబోయే రైతు సమన్వయ సమితి చైర్మన్ గోవర్ధన్ అట కదా’అని ప్రశ్నించిన విలేకరులు.. పంచెకట్టుతో అసెంబ్లీకి వచ్చే ఆయన ఆహార్యం కూడా ఆ పదవికి సరిపోతుందని కామెంట్ చేశారు.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు పంచె కట్టుతో వస్తానని నిరంజన్‌రెడ్డి అన్నా రు. పంచె కట్టుతో వచ్చే ఎమ్మెల్యేలు ఎవరనే అంశంపైకి చర్చ మళ్లగా బాజిరెడ్డి గోవర్ధన్‌తోపాటు, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి.గతంలో మాజీ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య పంచె కట్టులో కనిపించిన విషయం ప్రస్తావనకు రాగా.. ఆయనకు పంచె కట్టు అచ్చి రాలేదు అని వ్యాఖ్యానించడంతో నవ్వులు విరిశాయి. -
లోకేశ్ సీఎం కాకూడదని..
సాక్షి, అమరావతి: చంద్రబాబు, టీడీపీ తమను పెట్టిన ఇబ్బందులను మరిచిపోలేమని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీల్లో గురువారం ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పదవుల మీద వ్యామోహం లేదని, తమ నాయకుడు వైఎస్ జగన్ కోసమే పని చేస్తున్నామన్నారు. గతంలో పోరాట వీరులం, ఇప్పుడు పరిపాలన దక్షులమంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు కానీ, లోకేశ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో సీఎం కాకూడదని ఓ 60 మంది ఎమ్మెల్యేలం దళంగా ఏర్పడ్డామని వెల్లడించారు. ‘మా తల తీసి పక్కన పెడితే చంద్రబాబు సీఎం కాడని చెబితే పక్కన పెట్టేస్తామ’ని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. చంద్రబాబుకు కోటంరెడ్డి సవాల్ గత సభలో తమకు చంద్రబాబు నేర్పిన విద్యనే ఇప్పుడు ప్రదర్శిస్తున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీల్లో పిచ్చాపాటిగా మాట్లాడుతూ... ‘గతంలో వైఎస్ జగన్‌ను అప్పటి మంత్రులు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అప్పటి మంత్రుల కామెంట్లకు నాటి సభలో చంద్రబాబు చప్పట్లు కొట్టారు. నాటి వ్యాఖ్యలకు చంద్రబాబు విచారం వ్యక్తం చేస్తే.. నేనూ నా కామెంట్లపై క్షమాపణ చెబుతా. నావి కానీ ఆడియో టేపులను నావే అని టీడీపీ పదే పదే విమర్శిస్తోంది. చంద్రబాబు ఆడియో టేపులు, నావి అని చెబుతున్న ఆడియో టేపులను ఫొరెన్సిక్ ల్యాబ్ పంపించడానికి టీడీపీ సిద్దమా? ఎవరిది తప్పని తేలితే వారు శిక్ష అనుభవించాలి. నేను శిక్ష అనుభవించడానికి సిద్ధం, చంద్రబాబు సిద్ధమా?’ అని సవాల్ విసిరారు. -
‘టీఆర్ఎస్లోకి రమ్మని ఎవరూ పిలువలేదు’
సాక్షి, హైదరాబాద్: తనను టీఆర్ఎస్లోకి రమ్మని ఎవరూ పిలువలేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. తాను కూడా టీఆర్ఎస్లోకి వెళ్లాలని ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. భవిష్యత్ నిర్ణయం.. సంగారెడ్డి నియోజవర్గ ప్రజలకు మేలు చేసేలా ఉండాలనేదే తన ఆలోచన అని జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో జరిపిన చిట్ చాట్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. సంగారెడ్డి అభివృద్ధి కోసమే గతంలో టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వెల్లడించారు. కాంగ్రెస్‌లో చేరగానే సంగారెడ్డికి ఐఐటీ తీసుకురాగలిగానని గుర్తుచేశారు. ఐఐటీతో స్థానికులకు ఉద్యోగాలే కాకుండా.. ఎంతో అభివృద్ధి సాధించగలిగానని వెల్లడించారు. తన రాజకీయ అడుగులన్నీ ప్రజల కోసమేనని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కుటుంబ అవసరాల కోసమో, డబ్బు కోసమో తన రాజకీయ నిర్ణయం ఉండదని తెలిపారు. ప్రజల ఎజెండానే తన రాజకీయ ఎజెండా అని స్పష్టం చేశారు. తను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేస్తానని వ్యాఖ్యానించారు. తన రాజకీయ పుట్టక బీజేపీలో జరిగితే.. టీఆర్ఎస్తో చట్టసభల్లోకి ప్రవేశించానని.. రాజకీయంగా పేరు తెచ్చింది కాంగ్రెస్ అని చెప్పారు. -
సామాజిక కోణాలు చెల్లవు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సామాజిక కోణాలు చెల్లవని కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక తేలిపోయిందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ రెండోసారి సీఎం కావాలని ప్రజలు కోరుకున్నారని ఆయన అన్నారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, కేసీఆర్ నిర్వహిస్తున్న చండీయాగానికి తనకు ఆహ్వానం లేదని, అయినా తనకు అంత ప్రోటోకాల్ లేదని అన్నారు. కేసీఆర్ భట్టికి ఇచ్చే ప్రాధాన్యత ఉత్తమ్‌కు ఇవ్వకపోవచ్చని అన్నారు. సీఎల్పీ నేత ఎంపిక విషయంలో రాహుల్ నిర్ణయమే శిరోధార్యమని, సీఎల్పీ నేత ఎంపికలో లాబీయింగ్‌తో పాటు ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా పనిచేసిందని అన్నారు. సీఎల్పీ నేతగా నియమించి భట్టికి కాంగ్రెస్ అధిష్టానం మంచి అవకాశం ఇచ్చిందని, ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం ద్వారా భట్టి తన పనితనాన్ని నిరూపించుకోవాలని అభిప్రాయపడ్డారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ టీఆర్ఎస్లోకి వెళ్లరని జగ్గారెడ్డి చెప్పారు. ఓడిపోయిన నేతలకు పార్టీ తరఫున భరోసా ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఉత్తమ్ కారణం కానే కాదని, ఆయన సమర్ధవంతంగా పనిచేశారని, కానీ పరిస్థితులు అనుకూలించలేదని అన్నారు. ఎన్నికలకు ముందు ఉత్తమ్ గొప్పవాడు అన్న సర్వే సత్యనారాయణ ఇప్పుడు ఉత్తమ్ పనికిరాడని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. అప్పుడు ఉత్తమ్ మంచోడు.. ఇప్పుడు చెడ్డోడా అని ప్రశ్నించిన జగ్గారెడ్డి, ఉత్తమ్ బలహీనుడు కాదని, బలవంతుడని అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ను మరో ఐదేళ్లు కొనసాగించినా తప్పేమీ లేదని అన్నారు. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి విజయశాంతి పోటీచేయకపోతే తన భార్య నిర్మలకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరతానని జగ్గారెడ్డి చెప్పారు. -
‘అందుకే 2014లో ఒంటరిగా పోటీ చేశాం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడ్డాక కాంగ్రెస్ పార్టీ అవమానించడం వల్లే 2014లో తాము ఒంటరిగా బరిలోకి దిగామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. బుధవారం మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో కేసీఆర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఏర్పడ్డాక కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి వివరించాను. రాష్ట్రంలో నాయకత్వ లోపం ఉండటంతో.. ప్రజలు కాంగ్రెస్‌ను విశ్వసించే పరిస్థితి లేదని తెలిపాను. ఆమె దిగ్విజయ్ సింగ్‌తో మాట్లాడమని చెప్పారు. కానీ దిగ్విజయ్ సింగ్ అవమానించారు. అయినా రెండు రోజులు ఓపిక పట్టాను. కానీ ఈ లోపే మా పార్టీకి చెందిన విజయశాంతితో పాటు మరికొందరు నాయకులను కాంగ్రెస్ వారి పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. దీంతో ఇక ఒంటరిగానే పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్నాను. 2014లో మేము ఉత్తర తెలంగాణను నమ్ముకున్నాం. ఆ ఎన్నికల్లో 44 సీట్లు మాకు అక్కడే వచ్చాయ’ని తెలిపారు. అసెంబ్లీ రద్దయిన తర్వాత అధికారులతో మాట్లాడలేదు అమ్మ తోడు అసెంబ్లీ రద్దయిన తరువాత తను ఏ జిల్లా ఎస్సీతోగానీ, కలెక్టర్తోగానీ మాట్లాడలేదని కేసీఆర్ వెల్లడించారు. సీఎంఓ అధికారులతో కూడా తను మాట్లాడలేదని స్పష్టం చేశారు. కేవలం మిషన్ భగీరథ పనుల గరించి మాత్రమే తను వారితో మాట్లాడినట్టు తెలిపారు. -
75 నుంచి 80 సీట్లు గెలుస్తాం
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి 75 నుంచి 80 స్థానాల్లో విజయం సాధిస్తుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. కూటమిగా అవగాహనతో పోటీచేస్తామని, కలిసి పనిచేసి ఆ నలుగురి నుంచి తెలంగాణను విముక్తి చేస్తామని చెప్పారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రజాకూటమిగా ఏర్పడ్డామని తెలిపారు. ప్రజాకూటమి దెబ్బకు కేటీఆర్ మైండ్ బ్లాక్ అయిందని వ్యాఖ్యానించారు. అధికారం, సంపద, వనరులను నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు పంచడమే కూటమి ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను ఆ నలుగురి నుంచి విముక్తి చేయడం, సంపద పంచడం ఖాయమన్నారు. నాలుగు గోడల మధ్య ఫాంహౌస్‌లో కూర్చుని వ్యవహారాలు నడిపే వాళ్లం కాదన్నారు. భవిష్యత్‌లో న్యాయం.. కూటమి ఏర్పాటు ద్వారా పోటీ చేసే అవకాశం రాని నేతలు నిరాశపడవద్దని, వారి త్యాగాలను పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని భట్టి అన్నారు. టికెట్లు రాని వారికి భవిష్యత్తులో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం చేయాలనే ఆలోచనతోనే పార్టీ హైకమాండ్ ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త ప్రజాకూటమిని గెలిపించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అభ్యర్థుల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రచారాన్ని వేగవంతం చేస్తామని భట్టి చెప్పారు. మొత్తం 10 సభలు ఉంటాయని, అందులో ఒక సభకు సోనియా, మిగిలిన వాటికి రాహుల్ హాజరవుతారని తెలిపారు. -
ప్రేమించా..కానీ! : హీరోయిన్
ప్రేమించాను కానీ..! అంటోంది నటి జననీఅయ్యర్. 2009లోనే రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ నటిగా దశాబ్దానికి చేరువవుతోంది. అయితే బాలా దర్శకత్వంలో ఆర్యకు జంటగా నటించిన అవన్ ఇవన్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జననీఅయ్యర్ ఆ తరువాత పలు చిత్రాలు చేసినా ఇంకా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఇటీవల బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో–2లో కూడా పాల్గొని పాపులర్ అయిన ఈ అమ్మడితో చిన్న భేటీ. నటిగా దశాబ్దానికి చేరువవుతున్నారు. సినిమాలో మీరు నేర్చుకున్నది. సినిమాలో ఒక్కొక్కరికి ఒక్కో టైమ్ వస్తుంది. అప్పుడు వారి శ్రమ, నిరంత కృషి తెలుస్తుంది. అప్పటి వరకూ ఓర్పుగా వేచి ఉండాలి. ఇదే నేను నేర్చుకుంది. ఎలాంటి కథా పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నారు? నాకు నప్పే కథా పాత్ర అయి ఉండాలి. గ్లామర్ పాత్రలకు నేను నప్పుతానో లేదో తెలియదు గానీ ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయేలా మంచి బలమైన కథా పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నాను. చారిత్రక కథా చిత్రాల్లోనూ నటించాలనే ఆశ ఉంది. భూత కాలంలోకి ఎలాగూ వెళ్లలేం, అలాంటి కథా చిత్రాల్లో నటించి ఆ అనుభవాన్ని పొందాలనుంది. జోదా అక్బర్ లాంటి రాణీ పాత్రల్లో నటించే అవకాశం వస్తే నటించాలని ఆశగా ఉంది. సినిమాను వదిలి పోవాలని ఎప్పుడైనా అనిపించిందా? అలాంటి ఆలోచనే రాలేదు. అయితే ఇంజినీరింగ్ చదివి నటివయ్యావెందుకని ఇంట్లో అనేవారు. అయితే నాకు నటన అంటే ఆసక్తి. వయసు మళ్లిన తరువాత కూడా ఈ రంగంలోనే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ప్రస్తుతం మీటూ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. దీని గురించి మీ స్పందన? జ: లైంగిక వేధింపులు అన్ని రంగాల్లోనూ జరుగుతున్నాయి. అయితే వాటి గురించి ఇప్పుడు చాలా మంది ధైర్యంగా మాట్లాడుతున్నారు. నాకూ సంతోషంగా ఉంది. ఇదే సరైన సమయం. ఇప్పుడు మాట్లాడకపోతే చాలా విషయాలు వెలుగు చూడవు. మీకు నచ్చిన విషయం? ఇళయరాజా సంగీతాన్ని వింటూ ఒంటరిగా కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లటం ఇష్టం మీకు నచ్చిన హీరో? నాకు అజిత్ అంటే చాలా ఇష్టం. ఇష్టమైన దర్శకుడు? బాలా, మణిరత్నం మీ స్లిమ్ శరీర రహస్యం? పెద్దగా శిక్షణ అంటూ ఏమీ తీసుకోను. ఇంకా చెప్పాలంటే కొవ్వు పదార్థాలను కూడా తినేస్తాను. అయినా బరువు పెరగను. అది నాకు దైవం ఇచ్చిన వరం. మీకు అజిత్, విజయ్‌లతో నటించే అవకాశం ఒకేసారి వస్తే? విజయ్ అభిమానులు క్షమించాలి. నేను అజిత్ చిత్రంలోనే నటిస్తాను. ప్రేమలో పడ్డారా? నేనూ ప్రేమించాను.అయితే ఇప్పుడెవరూ లేరు రాజకీయాల్లోకి వస్తారా? రాజకీయాలకు నేను చాలా దూరం. -
నేనెందుకు స్పందించాలి : లోకేశ్
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు జరిగే ప్రసక్తే లేదని ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనే తమకు లేదన్నారు. గురువారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన లోకేశ్... కొత్త రాష్ట్రం(ఆంధ్రప్రదేశ్) ఏర్పడిన తర్వాత పూర్తికాలం అధికారంలో కొనసాగాలనేది తెలుగుదేశం పార్టీ సెంటిమెంట్ అని వ్యాఖ్యానించారు. కానీ తెలంగాణలో ఇలా జరగకపోవడం విచారకరమని లోకేశ్ సానుభూతి వ్యక్తం చేశారు. కాగా ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు జరగనున్నాయంటూ రిపబ్లిక్ టీవీలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అవన్నీ కేవలం ఊహాగానాలేని.. వాటిపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు. -
ఆయనతో విభేదాలు నిజమే: డీకే అరుణ
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నాయకుడు ఎస్. జైపాల్‌రెడ్డితో విభేదాలున్నాయని కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ అంగీకరించారు. వయసు అంతరం కారణంగానే ఆయనతో రాజకీయ విభేధాలున్నాయని చెప్పుకొచ్చారు. గాంధీభవన్‌లో విలేకరులతో గురువారం ఆమె ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. జైపాల్‌రెడ్డికి మహబూబ్‌నగర్ లోక్‌సభ టికెట్ ఇవ్వకూడదని, బీసీల నుంచి బలమైన నేత ఎవరికి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. రేవంత్ రెడ్డితో విభేదాలు లేవని చెప్పారు. రేవంత్ వర్గంపై దాడులను పీసీసీ కాచుకోవాలని అభిప్రాయపడ్డారు. పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నానని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఏఐసీసీ పదవులు తనకు వద్దని, తన సేవలు అవసరం ఉన్నచోట పనిచేసేందుకు సిద్ధమన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఇతర చోట్ల పనిచేయాల్సిన సమయం ఇది కాదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో టీఆర్ఎస్కు వ్యతిరేకత ఉందని, దీన్ని క్యాష్ చేసుకోవడానికి పీసీసీ స్పీడ్ పెంచాలని సూచించారు. అభ్యర్థుల ప్రకటనతో ఒకరిద్దరు ఇబ్బంది పడొచ్చని, వారిని సముదాయించి ముందుకు పోవాలని సూచించారు. తన కుమార్తెకు టికెట్ ఇమ్మని ఇప్పటివరకు అడగలేదన్నారు. రాహుల్ గాంధీ పర్యటన తర్వాత పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందని, ఇతర పార్టీల నుంచి కొంత మంది సీనియర్ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని డీకే అరుణ వెల్లడించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని చెప్పారు. -
నా పెళ్లి.. అయిపోయిందోచ్!
సాక్షి, హైదరాబాద్: రాహుల్ గాంధీ పెళ్లి అయిపోయిందట..! అమ్మాయి ఎవరు అని మాత్రం అడగకండి.. ఆయన పెళ్లి జరిగింది అమ్మాయితో కాదు.. కాంగ్రెస్ పార్టీతో!! ఈ విషయాన్ని మంగళవారం హరిత ప్లాజాలో ‘హైదరాబాద్ ప్రెస్‌క్లబ్’ నిర్వహించిన ఎడిటర్స్ మీట్లో రాహులే స్వయంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏ హడావుడి, హంగామా లేకుండా అతి సాధారణంగా టేబుల్ టేబుల్ తిరుగుతూ, కూర్చుంటూ, లేస్తూ, నడుస్తూ రాహుల్ ప్రసంగించారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలు, రాజకీయాలతోపాటు వ్యక్తిగత అంశాలను పంచుకున్నారు. జర్నలిస్టులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఇదే సందర్భంలో మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు.. బ్రహ్మచారిగానే ఉండిపోతారా అని ఓ పాత్రికేయుడు అడగ్గానే రాహుల్ బిగ్గరగా నవ్వేస్తూ.. ‘కాంగ్రెస్ పార్టీ నే పెళ్లి చేసుకున్నా..’అంటూ బదులిచ్చారు. తొలుత మహిళా జర్నలిస్టులు కూర్చున్న టేబుల్ నుంచి తన చిట్‌చాట్‌ను ప్రారంభించారు. ‘అత్యంత శక్తివంతమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మీకు నానమ్మ ఇందిర, అమ్మ సోనియా, సోదరి ప్రియాంకాల్లో ఎవరు స్ఫూర్తి..’ అని ఒకరు ప్రశ్నించగా.. ‘ముగ్గురూ స్ఫూర్తే.. వాళ్లే బలం..’అని చెప్పారు. మహిళా జర్నలిస్టులున్న ఈ టేబుల్‌కు మరో రెండు నిమిషాల సమయాన్ని అధికంగా కేటాయిస్తానని చెప్పి.. వారితో అదనంగా మరో ప్రశ్న వేయించుకుని సమాధానం చెప్పారు. సెల్లో రికార్డింగ్‌పై చిరు కోపం సుమారు గంటా పది నిమిషాల పాటు జరిగిన ఈ మీట్లో ఓ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు తీరుపై రాహుల్ నొచ్చుకున్నారు. ‘ఈ మీట్ కేవలం ఆఫ్ ది రికార్డ్ కోసం ఉద్దేశించిందే.. నేను ఎంత ఫేర్‌గా ఉన్నానో.. మీరు అలాగే ఉండాలి’ అంటూ తన మాటల్ని సెల్ఫోన్లో రికార్డు చేసిన ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుపై చిరుకోపాన్ని ప్రదర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలనపై విమర్శలు చేస్తున్న మీరు.. మీ కుటుంబ పాలనపై ఏమంటారు అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ‘మేం 30 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నాం. నా తండ్రి ప్రధాని అయ్యాక మా కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఎవరూ ప్రధాని పదవి తీసుకోలేదు’ అని బదులిచ్చారు. ఈ భేటీలో ఆయన సాధారణ వ్యక్తిలా కలిసిపోయి పూర్తి వివరాలు, విశేషాలతో కూడిన సమాధానలివ్వటంతో సమావేశం అనంతరం ఆయన్ను పలువురు ఎడిటర్లు, జర్నలిస్టులు చప్పట్లతో అభినందించారు. సమావేశం చివరలో ‘సాక్షి’ దినపత్రిక కార్టూనిస్ట్ శంకర్ రాహుల్‌పై గీసిన క్యారికేచర్‌ను ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు అందజేయగా.. ‘దీన్ని నా సోదరికి గిఫ్ట్‌గా ఇస్తా’ అంటూ తీసుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మీట్‌కు ఎస్పీజీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయటంతో ముఖ్య కాంగ్రెస్ నాయకులు సైతం ఇబ్బంది పడ్డారు. చివరకు ఏఐసీసీ నాయకులు కొప్పుల రాజు చొరవతో సీఎల్పీ నాయకులు జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క లోపలికి రాగలిగారు. సుమారు 80 మందికిపైగా మీడియా ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. జర్నలిస్ట్‌తో చాలెంజ్ దేశంలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో తప్పక ఓటమి పాలవుతుందని రాహుల్ అనడంతో.. ఓ టీవీ చానల్ ఎడిటర్ మధ్యలో కల్పించుకుని వచ్చే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో మీరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? 100 లేదా 200 అని అడిగారు. స్పందించిన రాహుల్ ‘మేం గెలువబోతున్నాం.. మీకు సందేహం అవసరం లేదు’ అన్నారు. సీట్ల సంఖ్య చెప్పండి అంటూ చానల్ ఎడిటర్ మళ్లీ అడగడంతో.. రాహుల్ ఆయన సీటు వద్దకు వచ్చి.. ‘బెట్ ఏమిటో చెప్పండి’ అని అడిగారు. ‘నూరు శాతం విజయం నాదే. మేం గెలిస్తే ఏం కావాలో బెట్ చేయండి’ అనగా.. ప్రధాని హోదాలో ఫస్ట్ ఇంటర్వ్యూ తనకే ఇవ్వాలని చానల్ ఎడిటర్ బదులిచ్చారు. ఈ బెట్‌కు రాహుల్ ఓకే చెప్పేయటంతో హాలంతా నవ్వుల్లో మునిగిపోయింది. రాఫెల్ విమానాల కొనుగోళ్లపై ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. మోదీ ప్రభుత్వం ఈ వ్యవహారంలో భారీ కుంభకోణానికి పాల్పడిందని, దీనిపై తాను పార్లమెంటులో ప్రశ్నిస్తే తన కళ్లలో సూటిగా చూసి సమాధానం చెప్పలేక ప్రధాని దిక్కులు చూస్తూ దాటేసిపోయారన్నారు. -
ఈ నగరానికి ఏమైంది ? మూవీ టీంతో చిట్ చాట్
-
ఎమ్మేల్యేలు అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు
-
ఎన్నో దెబ్బలు తిన్నా.. ఇది ఓ లెక్కా..
సాక్షి, అమరావతి : మార్చి 29న ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని హిందూపూర్ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. నేటి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనడానికి అమరావతి వచ్చిన ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ రామకృష్ణ సినీ స్టూడియోలో తొలిషెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. నందమూరి తారక రామారావు వాస్తవ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఇదని, ఎన్నికల సందర్భంగా తీసే సినిమా కాదన్నారు. సినిమా షూటింగ్‌ను వేగవంతంగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో చాలా మంది చాలా పేర్లు సూచించారని, కానీ ఎన్టీఆర్‌ను మించిన పేరు లేదని భావించి ఆపేరునే ఖరారు చేశామని చెప్పారు. పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్‌కు అభిమానులున్నారని, ప్రతిఒక్కరు అభినందించిన వారేనని అన్నారు. ఇటీవలే శష్త్ర చికిత్స చేసుకున్న బాలకృష్ణ, కట్టుతోనే అసెంబ్లీకి వచ్చారు. ఈసందర్భంగా ఆయన్ను పలువురు ఎమ్మెల్యేలు పరామర్శించారు. జీవితంలో తగిలిన ఎన్నో దెబ్బలతో పోలిస్తే ఇది పెద్ద దెబ్బేమీ కాదని బాలయ్య వారికి సమాధానం ఇచ్చారు. మార్చి31 నుంచి ఏప్రిల్ 1 వరకూ లేపాక్షి ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. హంద్రీనీవా సుజల స్రవంతికి జలహారతి నిర్వహించి ఉత్సవాలను ప్రారంభిస్తామని తెలిపారు. -
రోబో చిట్ చాట్
-
మీడియాకు చెప్పాకే చేపడతా
సాక్షి, అమరావతి: రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన తనకులేదని, పదవీ విరమణ తరువాత 3 నెలలు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నానని డీజీపీ నండూరి సాంబశివరావు చెప్పారు. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌లో నిర్మించిన ఇండోర్ జిమ్, ఫిజియోథెరపీ హెల్త్ సెంటర్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు, సింథటిక్ టెన్నిస్ కోర్టులను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన మీడియాతో కొద్దిసేపు చిట్‌చాట్ చేశారు. రాజకీయాల్లోకి వస్తారా? అని మీడియా ప్రశ్నించడంతో తనకు ఆ ఆలోచన లేదన్నారు. మీడియాకు చెప్పాకే తన భవిష్యత్ కార్యాచరణ చేపడతానని వెల్లడించారు. రాష్ట్రంలో మావోయిస్టు తీవ్రవాదానికి అడ్డుకట్ట వేయడంలోగానీ, కులపరమైన ఆందోళలను అదుపు చేయగలగడంలోగానీ గట్టి ప్రయత్నమే చేశానని వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, పోలీస్ శాఖలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తనవంతు ప్రయత్నం చేశానని చెప్పారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, సహచర పోలీస్ అధికారులు, సిబ్బంది పూర్తిగా సహకరించారని చెప్పారు. -
మనసులో మాట బయటపెట్టిన యనమల
సాక్షి, అమరావతి : ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు మనసులో మాట బయటపెట్టారు. అవకాశం లభిస్తే రాజ్యసభ ద్వారా పార్లమెంట్‌కు వెళ్లేందుకు సిద్దమని అన్నారు. తాను ఎక్కడ ఉండాలన్నది తన ఒక్కడి నిర్ణయం కాదని, పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. అది కావాలి... ఇది కావాలి అని తానెప్పుడూ పార్టీ అధిష్టానాన్ని అడగలేదని అన్నారు. 35 ఏళ్లు రాష్ట్రంలో పలు హోదాల్లో పనిచేసిన తనది సుదీర్ఘ అనుభవమని చెప్పారు. నా అవసరం ఎక్కడ ఉంటుందన్నది అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. మంగళవారం మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. -
ఖైదీ మలుపు తిప్పింది
తాడేపల్లిగూడెం : ఆయన కనురెప్పలు కదిపితే నృత్యం. ఆయన అభినయం ఆనందమయం. ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో ఆకట్టుకునే స్టెప్పులేయించారు. ఆనాటి నుంచి నిన్నటి బాహుబలి వరకూ 1,400 సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. 45ఏళ్ల సినీపయనంలో ఎన్నో అనుభూతులు.. వాటిని ‘సాక్షి’తో పంచుకున్నారు ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్. పట్టణంలో శ్రీ డ్యాన్స్ అకాడమీ దశమ వార్షికోత్సవం, బాలల దినోత్సవం కార్యక్రమాలలో పాల్గొనడానికి వచ్చిన ఆయన మంగళవారం నాట్యరత్న బిరుదుతో సత్కారం అందుకోనున్నారు.ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం ‘సాక్షి’తో చిట్‌చాట్ చేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పుట్టింది మద్రాసులో. నటరాజ్ శంకుంతల వద్ద న్యాట ఆరంగేట్రం. సినీ నృత్యానికి సలీం మాస్టర్ గురువు. కురివికుడు అనే తమిళ సినిమాతో సినీ నృత్యదర్శకత్వానికి శ్రీకారం. తెలుగులో ఖైదీతో ఆరంగేట్రం. ఇది నా తొలి సినీ అడుగులు. ఖైదీలో రగులుతుంది మొగలి పొద పాటకు దర్శకత్వం వహించే అవకాశం అనుకోకుండా దక్కింది. అది నా సినీ నృత్య జీవితాన్ని మలుపు తిప్పింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి నేటితరం నాగశౌర్య వరకూ అందరికీ నృత్య దర్శకత్వం చేసే అవకాశం దక్కింది. పలు భాషల్లో 1,400 సినిమాలు చేశా. అరుంధతి సినిమాలో కంపోజ్ చేసిన డ్రమ్ డ్యాన్సుకు డాక్టరేట్ వచ్చింది మగధీరలో ధీర..ధీర.. పాటకు జాతీయ అవార్డు వచ్చింది. నటునిగా కూడా గుర్తింపు తెచ్చుకోవాలి నటునిగా కూడా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కోరిక. తుది శ్వాసనూ నృత్యం చేస్తుండగానే వదలాలి అనేది ఆకాంక్ష. తమిళ సినిమాలలో క్యారెక్టర్స్ చేస్తున్నా. సూర్య, రమ్యకృష్ణ, బ్రహ్మానందంతో కలిపి ఫుల్‌లెంగ్త్ క్యారెక్టర్ చేస్తున్నా. కన్నడలో కురుక్షేత్రం సినిమాలో పాత్రపోషిస్తున్నాను. 15 సినిమాలు చేతిలో ఉన్నాయి. తెలుగులో ఎక్కువ సినిమాలు చేయాలి. సెమీ క్లాసికల్ నృత్యానికి ప్రస్తుతం పెద్దపీట వేస్తున్నారు. -
సినిమాను 150సార్లు చూశా : మహేశ్
‘‘సిన్మాలో చాలా ఎగ్జయిటింగ్ అంశాలున్నాయి. హైలైట్స్ ఉన్నాయి. అవన్నీ ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని దాచిపెట్టాం!’’ అన్నారు మహేశ్‌బాబు. ఆయన హీరోగా ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘స్పైడర్’. ఏఆర్ మురుగదాస్ దర్శకుడు. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్. రేపు రిలీజవుతున్న ఈ సిన్మా గురించి మహేశ్ చెప్పిన ముచ్చట్లు... ► సిన్మాలో ఇంటిలిజెన్స్ బ్యూరోలో పనిచేసే ఆఫీసర్‌గా నటించా. టీజర్లో చూపించిన ‘స్పైడర్’ సిన్మాలో ఉండదు. హీరో క్యారెక్టర్ని పరిచయం చేయడం కోసం కాన్సెప్ట్ బేస్డ్గా టీజర్‌ను షూట్ చేశాం. ∙ ► ‘స్పైడర్’ తెలుగు, తమిళ్ వెర్షన్స్ వేర్వేరుగా ఉంటాయి. తెలుగుకి, తమిళ్‌కి కొందరు నటీనటులు మారతారు. అలాగే రెండు భాషలకు సంబంధించిన సీన్స్‌ని వెంట వెంటనే షూట్ చేయడంతో తెలుగు, తమిళ్ డైలాగ్స్ మాట్లాడేవాణ్ణి. అదో కొత్త ఎక్స్పీరియన్స్! అందుకే.. కొరటాల శివగారితో ప్రస్తుతం చేస్తున్న ‘భరత్ అనే నేను’ చాలా ఈజీగా ఉంది. జస్ట్ తెలుగులో డైలాగులు చెబితే చాలు.. సీన్ కంప్లీట్ అయిపోతోంది. ఇంతేనా అనిపిస్తోంది. ‘స్పైడర్’ అనేది హీరో–విలన్ కథ. సిన్మాకు విలన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మురుగదాస్‌గారు కథ చెప్పిన రెండు నెలల తర్వాత ‘మన సినిమాలో ఎస్.జె. సూర్య విలన్’ అన్నారు. ఫస్ట్... నాకేం అర్థం కాలేదు. దర్శకుడిగా అతను నాకు బాగా తెలుసు. రెండు రోజులు ఆలోచించాక అతనే విలన్‌గా పర్ఫెక్ట్ అనుకున్నా. ఎస్.జె. సూర్య నటించిన తమిళ సినిమాలు చూశా. బ్రిలియంట్ యాక్టర్! మురుగదాస్‌గారిపై గౌరవంతో తమిళ నటుడు భరత్ ఇంపార్టెంట్ రోల్ చేశారు. ► ‘స్పైడర్’లో డ్యూయల్ రోల్ చేశారట? అనడిగితే... అదే నిజమైతే ప్రోమో లో వేసేవాళ్లమన్నారు. మీరు, నమ్రతగారు ఈ సిన్మా చూశారా? అనడిగితే... ‘‘నమ్రత చూడలేదు. నేనిప్పటివరకూ 150సార్లు చూశా’’ అని మహేశ్ చమత్కరించారు. -
సరికొత్త వైశాఖం
-
బ్లాక్ బలి!
-
బుర్రా సాయిమాధవ్‌తో సరదాగా కాసేపు
-
పూరి...ఇజం
-
కేసీఆర్ నిర్ణయాలు కూడా మారాయి: కేటీఆర్
హైదరాబాద్: పాలన ప్రజలకు మరింత చేరువయ్యేందుకే జిల్లాలు పెరుగుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటుపై విమర్శలు అర్థరహితమన్నారు. బుధవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సీఎం కేసీఆర్ దార్శనిక నాయకుడుని, పాతఛత్రం నుంచి బయటపడనివారే ఆయనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వం అనేకసార్లు నిర్ణయాలు మార్చుకుందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు కూడా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయని తెలిపారు. లక్ష అనుమానాల మధ్య పుట్టిన తెలంగాణ రాష్ట్రం రెండేళ్లలో ప్రగతివైపు వెళ్తోందని చెప్పారు. ఒకే ఒక్క రెవెన్యూ డివిజన్ డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి, వంశీచంద్ రెడ్డిలకు సిగ్గుండాలని ఘాటుగా విమర్శించారు. అనేక ఏళ్లు అధికారంలో ఉండి తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోలేనివాళ్లు తమను విమర్శించడం శోచనీయమన్నారు. సీఎంగా కేసీఆర్ ప్రతిరోజు ప్రజలను కలవాల్సిన పనిలేదని, ప్రజాదర్బార్ నిర్వహించడానికి మనం రాచరికంలో లేమని పేర్కొన్నారు. జీహెచ్ ఎంసీ పనితీరులో సమూల మార్పులు తీసుకొస్తామని చెప్పారు. అధికారుల బదిలీలు, కాంట్రాక్టర్ల గుత్తాధిపత్యాన్ని మారుస్తామన్నారు. నాలాలపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మజ్లిస్ మతతత్వ పార్టీ కాదనీ, ప్రజలకు సేవ చేస్తుంది కాబట్టే ఎంఐఎం మళ్లీమళ్లీ గెలుస్తోందని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లోగా నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశముందన్నారు. ఈ నెల 12న వారం రోజుల పర్యటనకు అమెరికా వెళ్తున్నానని వెల్లడించారు. సిలికాన్ వ్యాలీలో టి.బ్రిడ్జ్ ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్ లో ఫార్మాసిటీ కోసం అమెరికా కంపెనీలతో సంప్రదింపులు జరపనున్నట్టు కేటీఆర్ తెలిపారు. -
ప్రకాష్ రాజ్ రామాయణం
-
బి.గోపాల్‌తో సరదాగా కాసేపు
-
సిద్ధార్థ సినిమా టీంతో చిట్ చాట్
-
అవిఘ్నమస్తు !
-
బావతో కథ చర్చిస్తున్నా!
బావ ధనుష్‌తో కథా చర్చలు జరుపుతున్నట్లు దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ వెల్లడించారు.సూపర్‌స్టార్ రజనీకాంత్ వారసురాలుగా చిత్ర రంగప్రవేశం చేసిన ఈమె తొలి ప్రయత్నంలోనే తన తండ్రి కథానాయకుడిగా కోచ్చడైయాన్ చిత్రానికి దర్శకత్వం వహించి భారతీయ సినీ చరిత్రలోనే మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో చిత్రం చేసిన దర్శకురాలిగా పేరుగాంచారు. ఆ చిత్రం తరువాత తండ్రి రజనీకాంత్ సలహా మేరకు సంసార జీవితంపై దృష్టి సారించారు. ఒక బిడ్డకు తల్లి అయిన సౌందర్య రజనీకాంత్ అశ్విన్ సుమారు రెండేళ్ల గ్యాప్ తరువాత మళ్లీ మెగాఫోన్ పట్టడానికి రెడీ అయ్యారు. అయితే అది ఏ తరహా చిత్రం,చిత్ర నిర్మాణం ఏ స్టేజ్‌లో ఉంది, హీరో ఎవరన్న వివరాల గురించి సౌందర్య రజనీకాంత్ అశ్విన్‌తో చిట్ చాట్.. ప్రశ్న: రజనీకాంత్ తన చిత్రాల ద్వారా జీవితాన్ని ఎలా గడపాలన్న విషయంలో అభిమానులకు పలు విధాలుగా హిత బోధనలు చేస్తుంటారు. మరి ఒక తండ్రిగా మీకు ఏమైనా హిత వాఖ్యలు చేస్తుంటారా? జవాబు: నాన్న చాలా సాధారణ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తి. అయినా తన ప్రారంభ కాల జీవితాన్ని మరచిపోరు. నాన్న నాకు చేసే హితబోధనల్లో ముఖ్యమైన విషయం యదార్థంగా, నిజాయితీ ఉండడం అన్నది. ఈ విషయాన్ని నేనెప్పుడూ పాఠిస్తాను. ప్రశ్న: ఎప్పుడైనా?ఏ విషయంలోనైనా మీ నాన్నగారు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేశారా? జవాబు: వత్తిడి కాదు కానీ ఇంతకు ముందు నేను పుస్తకాలు ఎక్కువగా చదివేదాన్ని కాదు. రెండేళ్లుగా వివిధ రకాల పుస్తకాలను ఎక్కువగా చదువుతున్నాను.అందుకు కారణం నాన్నే. మంచి మంచి పుస్తకాలు చదవమని ప్రోత్సహించేవారు. ఆయన కన్నడ రచయిత ఎస్ఎల్.బైరప్పకు పెద్ద అభిమాని.ఆయన రాసిన పుస్తకాలను చదవమని చెబుతుంటారు. ప్రశ్న: కోచ్చడైయాన్ చిత్రం తరువాత మళ్లీ చిత్రం చేయలేదే? జవాబు: నా తదుపరి చిత్ర ఆరంభ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇది యానిమేషన్ చిత్రం కాదు.వినోదం మేళవించిన విభిన్న ప్రేమ కథా చిత్రంగా ఉంటుంది. ఈ కథా చర్చలను మా బావ ధనుష్‌తో కలిసి చర్చలు జరుపుతున్నాను. నా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి చెందిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాను. -
ఆయన అంటే చాలా ఇష్టం
నటుడు సూర్య అంటే చాలా ఇష్టం అంటున్నారు నటి శ్రీదివ్య. ఈమెను విజయాలకు చిరునామాగా పేర్కొనవచ్చు. వరుత్తపడాద వాలిభర్ సంఘం చిత్రం నుంచి ఈ మధ్య విడుదలైన ఈటీ వరకూ వరుసగా సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్న శ్రీదివ్య అచ్చ తెలుగు అమ్మాయి అన్న విషయం తెలిసిందే.ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఈ బ్యూటీ తెలుగు, తమిళ భాషల్లోనూ గెలుపు గుర్రం అనే చెప్పవచ్చు. అయితే తమిళంలో కాస్త ఎక్కువ అని చెప్పక తప్పదు. శ్రీదివ్య, జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా నటించిన పెన్సిల్ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో శుక్రవారం తెరపైకి వచ్చింది. మరో వారంలోనే అంటే ఈ నెల 20న విశాల్‌తో రొమాన్స్ చేసిన మరుదు చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. కార్తీతో జత కలిసి నటిస్తున్న కాష్మోరా చిత్రం నిర్మాణంలో ఉంది. ఇటీవల మరుదు చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీదివ్యతో చిన్న చిట్ చాట్.. ప్ర: తమిళంలో వరుస విజయాలను సాధించడం గురించి? జ: చాలా సంతోషంగా ఉంది. మంచి అవకాశాలు వస్తున్నాయి. నా పాత్రలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్ర: మరుదు చిత్రంలో విశాల్‌తో తొలిసారిగా నటించిన అనుభవం గురించి? జ: విశాల్ చాలా స్వీట్ పర్సన్. కో ఆర్టిస్ట్‌గా నాకు చాలా సహకారం అందించారు.ఆయన చాలా హార్డ్ వర్కర్. అవన్ ఇవన్ చిత్రంలో ఒక సన్నివేశంలో విశాల్ నవరసాలు పండించారు. ఆ చిత్రానికి ఆయనకు జాతీయ అవార్డు వస్తుందని ఆశించాను. అలా జరగక పోవడం చాలా బాధ అనిపించింది. ఇక మరుదు చిత్రంలో చాలా ఎంజాయ్ చేస్తూ నటించాను. ప్ర: మరుదు చిత్రంలో మీ పాత్ర గురించి? జ: ఈ చిత్రంలో గ్రామీణ యువతిగా నటించాను. విశాల్‌కు ప్రేయసిగా,ఆ తరువాత అర్ధాంగిగా రెండు కోణాల్లో నా పాత్ర సాగుతుంది. భాగ్యలక్ష్మి అనే ఆ పాత్ర చాలా బోల్డ్‌గా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇప్పటి వరకూ సాఫ్ట్ పాత్రలు చేసిన నేను ఇందులో తొలిసారిగా అదరగొట్టే పాత్రను పోషించాను. మరుదు చిత్రం తన కెరీర్లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుంది. ఈ చిత్రంలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాలనుకున్నాను. కానీ మదురై స్లాంగ్ చాలా కష్టం అనిపించడంతో చెప్పలేకపోయాను. అయితే ఇదే చిత్రం తెలుగు రీమేక్‌లో నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. ప్ర: కాష్మోరా చిత్రం గురించి? జ: కాష్మోరా చిత్రంలో నా పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుతానికి ఆ చిత్రం గురించి ఇంత కంటే ఎక్కువ చెప్పలేను. అయితే కార్తీతో నటించడం మంచి అనుభవం. ప్ర: కాష్మోరా చిత్రంలో నయనతారతో కలిసి నటించారా? జ: ఇప్పటి వరకూ అలాంటి సన్నివేశం రాలేదు.చిత్ర షూటింగ్ ఇంకా జరుగుతోంది. నయనతారతో కలిసి నటించే సన్నివేశాలు ఉంటాయో ఉండవో తెలియదు. ప్ర:మీకు ఇష్టం అయిన హీరో? జ: ఇష్టం అయిన హీరో సూర్య. ఆయన నటించి చిల్లన్ను ఒక కాదల్ చూసినప్పుడే ఆయనంటే ఇష్టం ఏర్పడింది. ప్ర: ఇటీవల తమిళనాడులో వరద బాధితులకు సాయం అందించారు. మరుదు చిత్రం షూటింగ్ సమయంలో రాజపాలెయం ప్రాంత ప్రజలకు టాయిలెట్స్ కట్టించడానికి సాయం చేశారు. కోట్ల పారితోషికాలు తీసుకుంటున్న హీరోయిన్లకు కూడా లేని మానవతాగుణం మీలో ఉండడానికి స్ఫూర్తి? జ: స్ఫూర్తి కాదు గానీ, రాజపాలెయంలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ గ్రామ ప్రజలు ఎంతగానో సహకరించారు. అయితే అక్కడ మారుమూల ప్రాంతాల్లో టాయిలెట్లు లేక పోవడంతో వాటిని ఏర్పాటు చేయడానికి సాయం చేయాలనిపించింది. అయితే నీ నిర్ణయానికి అమ్మ వెన్నుదన్నుగా నిలిచారు. ప్ర:మీ గ్లామర్ రహస్యం? జ: రహస్యం అంటూ ఏమీ లేదు. బాగా తింటాను. అలాగే వర్కౌట్ చేస్తాను.నేను శాఖాకారిని. -
అతడితో డాన్స్ అంటే భయం: సమంత
అందాలతార సమంత ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో తనతో మాట్లాడొచ్చని ముందే ట్వీట్ చేసిన సమంతా.. అభిమానులు అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. సమంతగా ఉన్నందుకు మీరు పొందిన అతి పెద్ద అడ్వాంటేజ్ ఏదంటూ అడిగిన ప్రశ్నకు.. ఆర్మీలాంటి అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అని సమాధానమిచ్చి ఆకట్టుకున్నారు. మరి కొన్ని ప్రశ్నలు మీకోసం.. -తమిళనాడు ఎన్నికలపై మీ అభిప్రాయం ? ఓటు హక్కును వినియోగించుకోండి. ఇతరుల నిర్ణయానికి కట్టుబడకండి. -మళయాళం సినిమాకి ఓకే చెబితే.. అక్కడ ఎవరితో జతకట్టేందుకు ఇష్టపడతారు ? దుల్కర్ సల్మాన్ -జీవితంలో సాధించాలనుకుంటున్న లక్ష్యాలు ? సినిమాల తర్వాత జీవితంలో కూడా విజయం సాధించాలనుకుంటున్నాను. -ప్రయాణాల్లో మర్చిపోవడానికి భయపడే మూడు వస్తువులు ? చర్మ సంరక్షణకు సంబంధించినవి, మందులు, మంచి లోదుస్తులు -మీ అభిమాన నటుడు ? ప్రస్తుతానికి యెడ్డీ రెడ్మేన్ -జీవితంలో ఏది లేకపోతే అస్సలు బతకలేనని మీ ఫీలింగ్ ? చాలెంజ్ -మహేష్ కూతురు సితారతో మీరేం మాట్లాడారో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది.. తన నెయిల్ పాలిష్ గురించి.. -మీ జీవితంలో అత్యంత సంతోషకర క్షణాలు ? ప్రస్తుతం నేను జీవిస్తున్నవే.. -మిమ్మల్ని ఎక్కువగా అడిగి చిరాకు పెట్టే ప్రశ్న ? షూటింగ్ స్పాట్లో జరిగిన ఓ సంఘటనను చెప్పండి అని... ఆ ప్రశ్నకు అంత ఇరిటేషన్ ఎందుకు వస్తుందో నాక్కూడా తెలీదు. -ప్రపంచంలో మీ ఫేవరెట్ ప్లేస్ ? ఇంటికి మించిన ఫేవరేట్ ప్లేస్ లేదు -మీ ఫేవరేట్ ఫుడ్ ? జపనీస్ -చిన్మయి కాకుండా ఎవరి వాయిస్ మీకు సరిపోతుందని భావిస్తున్నారు ? నా సొంత గొంతే.. -ఎవరితో డ్యాన్స్ చేయాలంటే భయపడతారు ? జూనియర్ ఎన్టీఆర్ -మీ ఊతపదం ? పాపా.. -కష్ట సమయాలను ఎలా ఎదుర్కొంటారు ? ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాను -నటనకు దూరంగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు ? వంట చేయడం నేర్చుకుంటాను -మీ విజయ రహస్యం ? రహస్యాలేమీ లేవు.. కష్టపడటమే. -ఇండస్ట్రీలో ఎవరిని మీరు కాంపిటీషన్ గా భావిస్తున్నారు ? కాంపిటీషన్ ఉండటం ఇష్టమే, చాలా స్ఫూర్తినిస్తుంది.. అయితే కాంపిటీటర్స్ మారిపోతుంటారు. -మీకు చాలా భయమనిపించేది ఏది ? ఎక్కడ మొదలయ్యానో మళ్లీ తిరిగి అక్కడికి.. వెనక్కి వెళ్లడమంటే చాలా భయం -మీకు సంబంధించి మూడు బ్యూటీ టిప్స్ ? నైట్ క్రీమ్, విటమిన్స్, సన్ స్క్రీన్ -
ఆ టైమ్‌లో నాన్నగారు నవ్వడం మానేశారు!
‘‘ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసిన రికార్డ్ నాన్నగారిది. అలాంటి ఆయన టెన్షన్ పడటం చూసి నాకు విచిత్రంగా అనిపించింది. ఒక కొడుకు డెరైక్టర్.. మరో కొడుకు హీరో.. ఈ ఇద్దరూ కలసి చేసిన సినిమా ఏమవుతుందోనని ఆయన టెన్షన్. ఇప్పుడు చాలా కూల్‌గా ఉన్నారు’’ అని ఆది పినిశెట్టి అన్నారు. ఇప్పటికే తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న ఆది ‘గుండెల్లో గోదారి’తో ఇక్కడ కూడా భేష్ అనిపించుకున్నారు. ఇప్పుడు తన అన్నయ్య సత్యప్రభాస్ దర్శకత్వంలో తండ్రి, ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి నిర్మించిన ‘మలుపు’ ద్వారా మరోసారి తెరపైకొచ్చారు. ఈ సందర్భంగా ఆదితో చిట్ చాట్.. ‘మలుపు’ విషయంలో మీ నాన్నగారు టెన్షన్ పడినప్పుడు మీకేమనిపించింది? బేసిక్‌గా మాది హ్యాపీ ఫ్యామిలీ. కానీ, ‘మలుపు’ మొదలుపెట్టిన తర్వాత నాన్నగారు దాదాపు నవ్వడం మానేశారు. ఎప్పుడూ టెన్షన్ పడేవారు. ‘మీరు చేయని సినిమాలా నాన్నా.. అంతా బాగానే ఉంటుంది’ అని సర్దిచెప్పేవాణ్ణి. కానీ, ఆయన టెన్షన్ పడేవారు. సినిమా విడుదలై, హిట్ టాక్ వచ్చాక కూల్ అయిపోయారు. రొటీన్ కమర్షియల్ మూవీస్ కాకుండా డిఫరెంట్ రూట్లో వెళుతున్నారు.. మరి... మెయిన్ స్ట్రీమ్ హీరో అయ్యేదెప్పుడు? స్టార్ అనిపించుకునే ముందు మంచి నటుడు అనిపించుకోవడం మంచిదని నా అభిప్రాయం. ఆ తర్వాత స్టార్డమ్ దానంతట అది వచ్చేస్తుంది. తమిళంలో మొదటి సినిమా ‘మృగం’ తర్వాత నాకలాంటి కథలే వస్తే, ‘ఇలాంటి పాత్రలకే పనికొస్తాడు’ అని స్టాంప్ వేస్తారని చేయనన్నాను. తెలుగుకి వస్తే, ‘గుండెల్లో గోదారి’లో చేపలు పట్టేవాడిగా యాక్ట్ చేశాను. ‘మలుపు’లో నా వయసున్న కుర్రాళ్లు ఎలా ఉంటారో అలాంటి పాత్ర చేశాను. కిక్ కోసమే ఇలా డిఫరెంట్ పాత్రలు చేసుకుంటూ వెళుతున్నా. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలపై కూడా దృష్టి సారిస్తాను. అవి చేయననడంలేదు. ‘సరైనోడు’లో విలన్‌గా నటించడంవల్ల, తర్వాత అలాంటి పాత్రలకే మిమ్మల్ని పరిమితం చేసే అవకాశం ఉంటుందేమో? ఉండొచ్చు. కానీ, నేను చేయాలి కదా. ‘సరైనోడు’ కథ చాలా బాగుంటుంది. నటుడిగా నాకు మంచి స్కోప్ దక్కుతుంది. అందుకే ఒప్పుకున్నా. తమిళంలో ‘తని ఒరువన్’ని తీసుకుందాం. విలన్‌గా చేసిన అరవింద్ స్వామికి హీరోకన్నా ఎక్కువ పేరొచ్చింది. కొన్ని విలన్ పాత్రలు అలా సెట్ అవుతాయి. ‘సరైనోడు’లో హీరో అల్లు అర్జున్ పాత్రకు దీటుగా ఉండే విలన్ పాత్ర నాది. మీ నాన్నగారు దర్శకత్వం వహించినవాటిలో ఏ చిత్రం రీమేక్‌లో నటించాలని ఉంటుంది? కార్తీక్, రాజేంద్రప్రసాద్‌గారి కాంబినేషన్లో నాన్నగారు చేసిన ‘పుణ్యస్త్రీ’ నాకు చాలా ఇష్టం. ‘యముడికి మొగుడు’కి మించిన మంచి మాస్ సినిమా ఉంటుందా? ‘యమపాశం’ సినిమా కూడా నాకిష్టం. అవకాశం వస్తే ఈ మూడు చిత్రాల రీమేక్స్‌లో నటించాలని ఉంది. తెలుగు అబ్బాయి అయ్యుండి తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు.. మరి తెలుగులో కంటిన్యూస్‌గా చేయాలని లేదా? మాతృభాషలో చేయాలని ఎందుకుండదు? ఈ మధ్య నాలుగైదు కథలు విన్నాను. డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో ‘మలుపు’ ఉందనీ, చాలా మంచి సినిమా అని ప్రేక్షకులు తీర్పు ఇచ్చారు. సో.. నా నెక్ట్స్ సినిమా కూడా వాళ్లతో మెప్పు పొందాలి. అందుకే ఆలోచించి ఫైనలైజ్ చేస్తా. ప్రొఫెషనల్‌గా హ్యాపీ.. పర్సనల్ లైఫ్‌లో సెటిల్ అయ్యేదెప్పుడు? పెళ్లే కదా. నాకెలాంటి అమ్మాయి అయితే బాగుంటుందో అమ్మానాన్నకు తెలుసు. అందుకే, అమ్మాయిని చూసే బాధ్యతని వాళ్లకే వదిలేశా. కానీ, నాక్కూడా నచ్చితేనే పెళ్లి చేసుకుంటా. -
మల్టీ స్టారర్ చిత్రాలకు నేను రెడీ
తెలుగు చిత్రాల్లో నటించడానికి నేనెప్పుడూ సిద్ధమే, అయితే అవి మంచి కథలై ఉండాలి అంటున్నారు యువ నటుడు శ్రీరామ్. ఆరణాల అచ్చ తెలుగు అబ్బాయి అయిన ఈయన శ్రీరామ్‌గా తెలుగు సినీ ప్రేక్షకుల మనస్సుల్లో మంచి స్థానం సంపాదించుకున్న నటుడే. ఒకరికి ఒకరు చిత్రంతో తెలుగులో హీరోగా పరిచయమై మంచి లవర్ బాయ్‌గా పేరు సంపాదించుకున్నారు. అయితే ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడిని తిరగరాసిన ఈ యువ హీరో తమిళంలో తన కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. రోజాకూట్టంతో హీరోగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి పలు విజయ వంతమైన చిత్రాల్లో నటించారు. అదే విధంగా మాతృ భాషలోనూ మరింత ఎదగాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తున్న శ్రీరామ్ తాజాగా తమిళంలో నటించిన షావుకారు పేట్టై చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.ఈ చిత్రం తెలుగులోనూ శివగంగ పేరుతో తరపైకి రానుంది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన నటి రాయ్‌లక్ష్మి హీరోయిన్గా నటించారు.ఈ సందర్భంగా శ్రీరామ్‌తో చిన్న చిట్ చాట్.. ప్ర: షావుకారు పేట్టై చిత్రం గురించి చెప్పండి? జ: షావుకారుపేట్టై ఒక హారర్ కథా చిత్రం. ఈ తరహా హారర్ కథా చిత్రంలో తొలి అనుభవం.దర్శకుడు వడివుడైయాన్ కథ చెప్పగానే కాన్సెప్ట్ నచ్చడంతో వెంటనే అంగీకరించాను. అన్ని వర్గాల వారు చూసి ఎంజాయ్ చేసే చిత్రం ఇది. ప్ర: చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారట? జ: అవును.ఇదీ కొత్త అనుభవమే.మరో విషయం ఏమిటంటే చిత్రంలో దెయ్యంగా నటించడం. డబ్బింగ్ చెప్పడానికి ఇంకా కష్టపడాల్సి వచ్చింది. ప్ర: హీరోయిన్ రాయ్‌లక్ష్మి గురించి? జ: రాయ్‌లక్ష్మి గురించి చెప్పే తీరాలి.ఆమె నటనకు మంచి గుర్తింపు లభిస్తుంది. మేకప్ వంటి విషయాలలో నాకు చాలా హెల్ప్ చేశారు. చాలా రిస్కీ సన్నివేశాల్లో ధైర్యం చేసి నటించారు. ప్ర: మీరు నిర్మాతగా కూడా అవతారమెత్తినట్లున్నారు? జ: అవును. తమిళంలో నంబియార్ అనే చిత్రంలో కథానాయకుడిగా నటించి నిర్మించాను. చిత్ర నిర్మాణం పూర్తి అయ్యింది.దీన్ని ఎప్రిల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను. ప్ర: చిత్ర నిర్మాణ రంగంలోకి దిగడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? జ: ప్రత్యేక కారణం అంటే నాలాంటి వారికి ఎవరోఒకరు అవకాశం కల్పించడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నామ్.అలాగే ప్రతిభావంతులన వారికి అవకాశం కల్సించాలన్న భావంతోనే చిత్ర నిర్మాణం ప్రారంభించాను.తెలుగులో విజయం సాధించిన సామిరారా చిత్రం రీమేక్ హక్కుల్ని పొందాను. త్వరలోనే నా సంస్థలో నిర్మించనున్నాను. జవహర్ మిత్రన్‌కు ఈ చిత్ర దర్శకత్వం బాధ్యతల్ని అందించనున్నాను. ప్ర: తెలుగులో వరుసగా చిత్రాలు చేయడం లేదే? జ: తెలుగు చిత్రాల్లో నటించాలన్న కోరిక నాకూ ఉంది. అయితే మంచి అవకాశాలు రావడం లేదు. మంచి కథ,నిర్మాణ సంస్థ అనిపిస్తే హీరోగా తెలుగులో నటించడానికి నేనెప్పుడూ సిద్ధమే. ప్ర: ఏ తరహా చిత్రాలు చేయాలనుకుంటున్నారు? జ: మంచి ప్రేమ కథా చిత్రాలు చేయడానికే ఇష్టపడతాను.యాక్షన్ కథా చిత్రాలైనా చేయడానికి రెడీ. ప్ర: మల్టీస్టారర్ కథా చిత్రాలు చేస్తారా? జ: కథ, నా పాత్ర నచ్చితే మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు.అదే విధంగా ఇకపై నా చిత్రాలు ద్విభాషా చిత్రాలుగా ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. -
ఆర్యను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు
ఆర్యను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. అయితే... అంటున్న త్రిషను ఎవర్గ్రీన్ ప్రైమ్‌టైమ్ కథానాయిక అనిపేర్కొనవచ్చు. కారణం అందరికీ తెలిసింది.మూడు పదుల వయసు దాటిన ఈ ప్రౌఢ నిత్య సంచలన నటి. నటీమణుల్లో అధిక వదంతులకు కేంద్రబిందువు ఎవరన్న విషయంలో నయనతార, త్రిష పేర్లు పోటీ పడతాయనడంలో అతిశయోక్తి ఉండదేమో. విశేషం ఏమిటంటే వారిద్దరు ఒకప్పుడు బద్దశత్రువులైతే ఇప్పుడు ప్రియమైన నేస్తాలు. 13 ఏళ్ల నట జీవితంలో ఐదు పదుల చిత్రాల సంఖ్యను అవలీలగా అధిగమిస్తున్న నేటికీ క్రేజీ హీరోయిన్గా వెలుగొందుతుండడం సాదారణ విషయం కాదు.ఈ హారర్‌కు మారిన ఈ చెన్నై చిన్నది నటించిన తాజా చిత్రం అరణ్మణై-2 శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా త్రిషతో చిన్న చిట్‌చాట్. ప్ర: మీకూ దెయ్యంగా మారాలని ఆశ పుట్టినట్లుందే? జ: తొలిసారిగా అరణ్మణై-2 చిత్రంలో దెయ్యంగా నటించాను. అరణ్మణై చిత్రం నాకు బాగా నచ్చింది. దానికి సీక్వెల్ చిత్ర కథ దర్శకుడు సుందర్.సీ చెప్పినప్పుడు అందులో నటించే అవకాశాన్ని వదులుకోదలచుకోలేదు. కుష్బూ నాకు మంచి స్నేహితురాలు. అరణ్మణై-2లో నటించడానికి ఇదొకకారణం. ఇందులో నటించే అవకాశం రావడం ఘనతగా భావిస్తున్నాను. సిద్ధార్ధ్, హన్సిక, సూరి తదితర కొత్త టీమ్‌తో నటించడం సంతోషకరం. ప్ర: సెకెండ్ ఇన్నింగ్‌లోనూ బిజీగా నటించడం గురించి? జ: నేను సినిమాలోకి వచ్చి 13 ఏళ్లుఅయ్యిందన్నది నమ్మలేకపోతున్నాను. అధిక చిత్రాలు చేయాలి, ప్రముఖ నటులతో నటించాలీ అనే మొదట్లో భావించాను. అయితే ఆ అనుభవం ఇప్పుడు మంచి కథాపాత్రలపై దృష్టి సారించాలని చెబుతోంది. ఇప్పుడు సెలెక్టెడ్ చిత్రాలే చేస్తూ రాశి గల నటిగా రాణిస్తున్నాను. ప్ర: నాన్న మరణం, ఆగిపోయిన పెళ్లి లాంటి బాధాకరమైన సంఘటనలకు కుంగిపోకుండా వాటిని అధిగమించడం గురించి? జ: నిజం చెబుతున్నా. మా కుటుంబంలో అందరూ ధైర్యవంతులే. ఎలాంటి విషయాన్నైనా ఈజీగా తీసుకుంటాం. నాకు మార్గదర్శిగా అమ్మ ఉన్నారు. జీర్ణించుకోలేని చేదు అనుభవాలు ఎదురైనప్పుడు కొన్ని రోజులు ఏకాంతంగా మౌనంగా ఉంటాను. ఆ తరువాత పనికి సిద్ధం అవుతాను. ఇదే నా కేరెక్టర్. ప్ర: కొడి చిత్రంలో ధనుష్‌కు జంటగా నటించడం గురించి? జ: మీకో విషయం తెలుసా? ఆడుగళం చిత్రం తొలుత నేనే కథానాయికని.ధనుష్‌తో కొన్ని సన్నివేశాల్లో నటించాను కూడా. ఆ సమయంలో హిదీ చిత్రంలో నటించాల్సి రావడంతో కాల్షీట్స్ సమస్య కారణంగా ఆడుగళం చిత్రం నుంచి వైదొలిగాను. ఆ తరువాత ఇన్నాళ్లకు కొడి చిత్రంలో ధనుష్‌తో నటిస్తుండడం సంతోషంగా ఉంది. ఇందులో మరో నాయికగా షామిలి నటిస్తున్నారు. ప్ర: మీ యవ్వన రహస్యం? జ: రహస్యం అంటూ ఏమీలేదు. అన్నీ ఫుల్‌గా లాగించేస్తాను. ఆర్య చెప్పినట్లు రెండు ప్లేట్లు బిరియాని కూడా తినేస్తాను. అయితే ఎంత తిన్నానో అన్ని రోజులు తినడం మానేస్తాను. పళ్ల రసం మాత్రమే తీసుకుంటాను. ప్ర: ఇన్నేళ్ల నట జీవితంలో కథాపాత్ర కోసం పారితోషికం విషయంలో పట్టువిడుపుల సంఘటనలు ఉన్నాయా? జ: అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి.ఇం కా చెప్పాలంటే తొలుత పారితోషికం గురించి మా ట్లాడను. కథే ముఖ్యం. అది బాగా నచ్చితే పారితోషికం తగ్గించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ప్ర: నయనతారతో కలిసి నటించనున్నారటగా? జ: అలాంటిదేమీ లేదు. మీడియా వాళ్లు కొందరు అలా ప్రచారం చేశారు. నిజంగా అలాంటిదేదైనా ఉంటే సోషల్ మీడియాలో నేనే పోస్ట్ చేసేదాన్ని. నేను నయనతార మంచి స్నేహితులమే. సరైన కథ అమరితే ఇద్దరం కలిసి నటిస్తాం. ప్ర: నటుడు ఆర్య ఇటీవల ఒక కార్యక్రమంలో త్రిష నాకు చెల్లెలు మాదిరి అన్నారే? జ: ఆర్య అలా అన్నారా? నిజంగానే ఆర్య చాలా మంచి వ్యక్తి. ఆయనతో ఎలాంటి విషయమైనా పంచుకోవచ్చు. హీరోయిన్లకు మంచి మిత్రుడు. ఆయన ఇంటికి ఎప్పుడు వెళ్లినా భోజనం చేయవచ్చు. ఆయన్ని ఎక్కడికైనా పిలుచుకుపోవచ్చు. ఇక నన్ను చెల్లెలు అనడమే కామెడీ. ఈ విషయం గురించి ఆర్యను అడిగే తీరుతాను. ప్ర: ఈ మధ్య పార్టీలకు వెళ్లడం తగ్గించినట్లున్నారే? జ: క్లోజ్ ఫ్రెండ్స్ బర్త్‌డే పార్టీలు అంటేనే నేను పాల్గొంటాను. అలాంటిది ఎక్కువగా పార్టీలకు వెళతానే ప్రచారం జరుగుతోంది. అప్పుడప్పుడు స్నేహితురాళ్లం ఒక చోట కలుసుకుంటాం. ఇది సాధారణంగా అందరూ చేసే పనే. అయితే సినిమా వాళ్ల విషయంలో దాన్ని భూతద్దంలో చూపించే ప్రయత్నం జరుగుతోంది. ప్ర: మళ్లీ రానాతో ప్రేమాయణం అన్న ప్రచారం గురించి? జ: అందరితో మసలుకున్నట్లే రానాతోనూ ఉంటాను. మా మధ్య స్నేహం తప్ప మరేమీలేదు. ఈ విషయం గురించి పత్రికల వాళ్లే రాస్తున్నారు. అలాంటిది ప్రేమా అని అడగడంలో అర్థం లేదు. ప్ర: సరే.. పెళ్లెప్పుడు చేసుకుంటారు? జ: బిజీగా ఉన్నప్పుడు నేనే కాదు ఏ నటి పెళ్లి గురించి నిర్ణయం తీసుకోదు. మరో విషయం ఏమిటంటే ఇప్పుడు 30, 40 ఏళ్ల వయసన్నది పెద్ద విషయమే కాదు. ఇక నాకు పెళ్లి ఎప్పుడు జరుగుతుందో నాకే తెలియదు. మనసుకు నచ్చిన వాడు లభించాలి. రాణీముఖర్జీ, ఐశ్వర్యారాయ్‌లాంటి వారు లేట్‌గానే పెళ్లి చేసుకున్నారు. నటి ప్రియాంక ఇప్పటికీ దుమ్మురేపుతున్నారు. ఇంకా చెప్పాలంటే జీవిత భాగస్వామి లభించడం అంత సులభం కాదు. సమయం వచ్చినప్పుడు పెళ్లి విషయం ఆలోచిస్తాను. -
హాస్య గిరితో చిట్‌చాట్
-
వంగవీటి సినిమా పై వర్మ ఏమన్నారు?
-
'భలే మంచిరోజు' టీంతో చిట్ చాట్
-
టైగర్స్‌తో చిట్‌చాట్
-
శంకరాభరణం టీంతో చిట్‌చాట్
-
కుమారిని లవ్ చేయాల.. వద్దా..!?
-
రాజు గారి గదిలో ఏముంది?
-
ఫైటర్స్
-
'ఊ.. గుడ్లు ఉడకబెట్టడం వచ్చు'
ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ శనివారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చట్లు పెట్టారు. తన లేటెస్ట్ మూవీ 'బ్రూస్ లీ' విశేషాలతోపాటు అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు. వాటిలో కొన్ని మీ కోసం.. అభిమాని : మీ రోల్ మోడల్ ఎవరు? రకుల్ : మా నాన్నగారు అభిమాని : మీ నిక్ నేమ్? రకుల్ : అకు అభిమాని : మెగాస్టార్ తో మీ ఎక్స్పీరియన్స్ ? రకుల్ : కల నిజమైంది అభిమాని : బాహుబలి కాకుండా తెలుగులో మీ ఫేవరెట్ మూవీ? రకుల్ : నువ్వొస్తానంటే నేనొద్దంటానా అభిమాని : సెలబ్రిటీల్లో మీ క్రష్? రకుల్ : రణ్వీర్ సింగ్, తను నా ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్ కూడా అభిమాని : రణ్వీర్ సింగ్‌తో నటించే అవకాశం వస్తే ఎలా ఫీలవుతారు? రకుల్ : కళ్లు తిరిగి పడిపోతా... అభిమాని : మీకు కాబోయే భర్త ఎలా ఉండాలనుకుంటున్నారు ? రకుల్ : చాలా పొడుగ్గా.. నేను 4 అంగుళాల హీల్ వేసుకున్నా కూడా నాకంటే పొడుగ్గా కనిపించాలి అభిమాని : 'బ్రూస్ లీ' కి సంబంధించి మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్స్ ? రకుల్ : చిరంజీవి గారి నుంచి.. లే చలో పాటలో చాలా బాగున్నానని అభిమాని : మీకు ఏదైనా సూపర్ పవర్‌ని ఎంచుకునే అవకాశం వస్తే దేన్ని సెలక్ట్ చేసుకుంటారు ? రకుల్ : ఎదుటివాళ్ల మనసు చదివే శక్తిని అభిమాని : మీ ఫేవరెట్ క్రికెటర్ ? రకుల్ : విరాట్ కోహ్లి అభిమాని : మీ ఫేవరెట్ డైరక్టర్ ? రకుల్ : రాజమౌళి సార్ అభిమాని : హీరోయిన్స్‌లో ఎవరిని మీరు కాంపిటీషన్‌గా భావిస్తున్నారు ? రకుల్ : నాకు నేనే పెద్ద కాంపిటీషన్. ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర నేర్సుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అభిమాని : మీ ఫేవరేట్ హాలి డే స్పాట్ ? రకుల్ : ఢిల్లీలో ఉన్న మా ఇల్లు అభిమాని : మీకు బాగా నచ్చిన, స్ఫూర్తినిచ్చిన నటి ఎవరు? రకుల్ : కాజోల్ అభిమాని : మీరు అందుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ ? రకుల్ : ఐదు వేలు.. ఫస్ట్ ఫొటో షూట్‌కి అభిమాని : దక్షిణాది వంటకాల్లో మీకు నచ్చిన ఫుడ్ ? రకుల్ : ఉలవచారు, రాజు గారి కోడి పలావ్ అభిమాని : మీకు వంట చేయడం వచ్చా ? రకుల్ : ఊ.. గుడ్లు ఉడకబెట్టడం వచ్చు. -
బ్రూస్లీ తో కబుర్లు
-
'శివమ్' సినిమా టీంతో చిట్ చాట్
-
జ్యోతిక స్థానాన్ని అందుకోవాలి
సమంత, హన్సిక, శ్రుతిహాసన్ లాంటి వాళ్లు భారీ చిత్రాల అవకాశాలను కైవశం చేసుకు కోవడానికి పోటీ పడుతుంటే చిన్న చిత్రాలను దక్కించుకుంటూ కోలీవుడ్‌లో కథానాయికగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది నటి సృష్టి డాంగే. ప్రస్తుతం మూడు నాలుగు చిత్రాలు ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి. అయితే ఈమెకు ఆశలు మాత్రం చాలానే ఉన్నాయి. సృష్టితో చిట్‌చాట్. ప్రశ్న: చిన్న చిత్రాల లక్కీ నాయికగా మారినట్లున్నారే? జవాబు: ఉన్నైప్పోల్ ఒరువన్, డార్లింగ్ చిత్రాల్లో నటించాను. అవి పెద్ద బడ్జెట్ చిత్రాలే. ప్రస్తుతం విల్‌అంబు, నవరస తిలగన్, అచ్చమిండ్రి చిత్రాలు చేతిలో ఉన్నాయి. కత్తుకుట్టి చిత్రం గురువారం తెరపైకొచ్చింది. అయితే నా వరకూ చిన్న చిత్రాలు, పెద్ద చిత్రాలు అన్న తారతమ్యాలు చూపించడం లేదు. కథా పాత్ర బాగుంటే నటించడానికి అంగీకరిస్తున్నారు. ప్రశ్న: పారితోషికం విషయంలో పెద్దగా డిమాండ్ చేయడం లేదట? జ: అవునా? అయితే అది మంచి విషయమేగా. ఆ విధంగా మంచి పేరే తెచ్చుకుంటున్నానుగా. ఇంకో విషయం ఏమిటంటే నాకు ఇంత పారితోషికం కావాలని ఇప్పటివరకూ ఏ నిర్మాతనూ అడగలేదు. నేను ఆశించని విధంగా నిర్మాతలు పారితోషికం చాలానే ఇస్తున్నారు. ఇక ఒక కథానాయికకు ఏమేమి కావాలో అవి మాత్రం అడిగి పొందుతున్నాను. ప్రశ్న: కొత్త హీరోయిన్ల రాక అధికంగా ఉంది. ఈ విషయం గురించి మీ అభిప్రాయం? జ: ఇప్పుడు చిత్రాలు అధికంగానే తయారవుతున్నాయి. దీంతో కొత్త హీరోయిన్లు ఎక్కువగానే పరిచయం అవుతున్నారు. అయితే ప్రేక్షకుల్లో స్థానం సంపాదించుకోవడం కష్టమైన విషయమే.అవకాశాలు వచ్చినా నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. మంచి గుర్తింపు పొందే ఒక్క చిత్రం అందరు నూతన హీరోయిన్లకు అమరాలి. అప్పుడే తమకంటూ ఒక స్థాయిని అందుకోగలరు. ప్రశ్న: మీరు గ్లామర్ విషయంలో హద్దుల్లాంటివి పెట్టుకున్నట్లు లేదే? జ: బికినీ దుస్తుల్లో నా స్టిల్ చూసి మీరు ఇలాంటి అభిప్రాయానికి వచ్చినట్లున్నారు. ఒక చిత్రానికి సంబంధించిన స్టిల్ అది. నిజానికి ఆ చిత్రంలో అలాంటి సన్నివేశాలు లేవు. చిత్ర ప్రచారం కోసం ఆ స్టిల్స్ వాడుకుంటున్నారు. అది బాధాకరమైన విషయమే.ఆ చిత్రం గురించి మాట్లాడడమే ఇష్టం లేదు. ఇక గ్లామర్ విషయం అంటారా అందుకు నా హద్దులు నాకున్నాయి. ప్రశ్న: మీరు ఏ హీరోయిన్ స్థానాన్ని పొందాలనుకుంటున్నారు? జ: ఈ అమ్మాయి ఇండ స్ట్రీలో ఒక రౌండ్ చుట్టేస్తుంది అని నన్ను చూసి చాలా మంది అన్నారు.అలాంటి మాటల్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. నా రోల్ మోడల్ జ్యోతిక మేడమ్.ఆమె స్థానాన్ని అందుకోవాలన్నది నా ఆశ. -
రెజీతో ఈజీగా...
-
సుబ్రమణ్యం ఫర్ సీత టీంతో చిట్ చాట్
-
కష్టే ఫలి అన్నది అనుభవమైంది
కషే ఫలి అన్నది నాకు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది అన్నారు నటి సమంత. సూపర్ హీరోయిన్గా దూసుకుపోతున్న ఈ చెన్నై చిన్నది ప్రస్తుతం చేస్తున్నవన్నీ భారీ చిత్రాలే. విక్రమ్, విజయ్, సూర్య,ధనుష్ వంటి స్టార్ హీరోలతో రీల్లో రొమాన్స్ చేస్తున్న సమంత తాజా చిత్రాల కబుర్లు, వ్యక్తిగత విషయాల గురించి చిన్న చిట్‌చాట్.. ప్ర: తమిళ చిత్రాలతో చాలా బిజీగా ఉన్నట్లున్నారు? జ: అవును. ప్రస్తుతం తమిళ చిత్రాలపైనే అధిక శ్రద్ధ పెడుతున్నాను. ధనుష్‌తో వేలై ఇల్లా పట్టాదారి-2, చిత్రం పూర్తయింది. విక్రమ్‌కు జతగా 10 ఎండ్రదుకుళ్, విజయ్ సరసన అట్లీ దర్శకత్వంలో ఒక చిత్రం, సూర్యకు జంటగా 24 చిత్రం చిత్రాలతో పాటు తెలుగులోనూ కొన్ని చిత్రాలు చేస్తున్నాను. ఇక కన్నడం, మలయాళం, హిందీ చిత్రాలపై దృష్టి సారించలేదు. కారణం సమయం చాలకే. ప్ర: 10 ఎండ్రదుకుళ్ చిత్రంలో డబుల్ రోల్ చేశారట నిజమేనా? జ: 10 ఎండ్రదుకుళ్ చిత్ర కథ 60 లొకేషన్స్‌లో జరుగుతుంది. అందుకోసం పలు రాష్ట్రాల్లో పయనించాం.అలాగే కథలో కొంత షూటింగ్ నేపాల్‌లో జరుగుతుంది. అందువల్ల నేపాల్ అమ్మాయి గెటప్‌లో కనిపిస్తాను. దాన్ని చూసి సమంత డ్యూయల్ రోల్ చేస్తోందనే ప్రచారం చేస్తున్నారు. దీన్ని నేను చాలా సార్లు ఖండించాను. ప్ర: సరే ఈ చిత్రంలో ఫైటింగులు కూడా చేశారట? జ; ఫైటింగులే కాదు ఏవేవో చేశాను. లారీలు, జీప్‌లు కూడా నడిపాను. ఒక జీప్‌ను వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాలి. ఆ పని స్వయంగా నేనే చేశాను. యూనిట్ అంతా ఆశ్చర్యపోయారు. నన్నీ చిత్రంలో పాత్రకు ఎంపిక చేయడం కరెక్ట్ అని దర్శకుడు విజయ్విల్టన్, హీరో విక్రమ్ అనుకోవడం విన్న తరువాత నా మనసు కుదుట పడింది. చిత్రంలో ఫైట్స్ సన్నివేశాల్లో నేనే నటించాను. డూప్‌తో చేయిద్దామని స్టంట్‌మాస్టర్ అన్నారు. నేను అంగీకరించలేదు. ప్రేమ,సెంటిమెంట్ సన్నివేశాల్లో జాలీగా నటిస్తున్నాను.ై ఫెట్ సన్నివేశాల్లో ఎందుకు వెనక్కుతగ్గాలి అని నేనే నటించాను. అయితే గాయాలు బాగానే అయ్యాయి. కష్టపడితే గానీ ఫలితం దక్కదని అప్పుడు అనుభవపూర్వకంగా అర్థమైంది. ప్ర: గుర్రపు స్వారీ కూడా చేశారట? జ; 10 ఎండ్రదుకుళ్ చిత్రం షూటింగ్లో పాల్గొన్న తరువాతే నేర్చుకున్నాను. ఒక ట్రైనర్ వచ్చి నేర్పించారు.అయితే నేపాల్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు గుర్రపు స్వారీ రాదు. అప్పుడు చాలా గుర్రాలను నిలబెట్టారు. అవన్నీ రేస్ గుర్రాలు. అందులో ఒక తెల్లని గుర్రం అందంగా కనిపించింది. దాని వద్దకు వెళ్లాను. ఎగిరి తన్నుతుందని భయపెట్టారు. అయినా ధైర్యం చేసి ముందుగా గుర్రం ముఖాన్ని తడిమాను. ఆ తరువాత దాని మీద ఎక్కి కూర్చుని స్వారీ చేయడం ఆరంభించాను. చిత్ర యూనిట్ అంతా బిత్తరపోయి చూస్తుండిపోయారు. అలా కొన్ని నిమిషాలకే గుర్రం నా ఆధీనంలోకి వచ్చేసింది.అందరూ ఆశ్చర్యపోయారు. మొండి ధైర్యం అంటే ఇదేనేమో అనిపించింది నాకు. మొత్తం మీద ఆ విధంగా వర్కౌట్ అయ్యిందా సన్నివేశం. ప్ర: వేలై ఇల్లా పట్టాదారి-2 చిత్రంలోని పాత్ర నచ్చిందని చెప్పినట్లున్నారు? జ: నచ్చడం కాదు పిచ్చ పిచ్చగా నచ్చింది. ఆ చిత్రంలో తొలిసారిగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్ర చేశాను. చీరకట్టులో నన్ను చూసుకున్నప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. నా సినీ కేరీర్లో వీఐపీ-2 కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్ర: సాధారణంగా హీరోయిన్ల మధ్య ఈర్ష్యాద్వేషాలుంటాయంటారు. మీరేంటి సహ నటీమణులందర్నీ పొగిడేస్తున్నారు? జ: నిజమే ఒక హీరోయిన్ గురించి మరో హీరోయిన్ మాట్లాడరంటారు. కానీ నేనలా కాదు. మంచి విషయం ఎక్కడున్నా వెతికి అభినందిస్తాను. ఇంజి ఇడుప్పళగి చిత్రం కోసం నటి అనుష్క ఎంత లావు అయ్యారో చూశారా? ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. హీరోయిన్లు స్లిమ్‌గా అందంగా కనిపించాలని కోరుకుంటారు. అనుష్క అలా కాదు పాత్రగా మారడానికి శ్రమించారు. అలాగే నటి ఎమిజాక్సన్ అంటే నాకు చాలా ఇష్టం. ప్ర: సోషల్ వర్క్స్ చేస్తున్నారట? జ: అందుకోసం ఒక సంస్థను ప్రారంభించాను. చాలా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాను.వాటిని పబ్లిసిటీ చెయ్యాలనుకోవడం లేదు. -
’భలే భలే మగాడివోయ్ టీమ్’తో చిట్ చాట్
-
వాళ్లకు భయపడొద్దు... - రాశీ ఖన్నా
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో రాశీఖన్నా తెలుగువారిని ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘జిల్’ సినిమాలో గోపీచంద్ పక్కన మార్కులు కొట్టేసింది. ఇప్పుడు రామ్‌తో ‘శివమ్’లోనూ, రవితేజతో ‘బెంగాల్ టైగర్’లోనూ నటిస్తోంది. సాయి ధరమ్ తేజ్ సినిమాలో కూడా కనిపించనుంది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న రాశీఖన్నాతో ‘సాక్షి’ చిట్‌చాట్... ♦ ఫస్ట్ ఓ జనరల్ క్వశ్చన్. ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్యలు చేసుకుని విద్యార్థులు చనిపోతున్నారు. ఈ సంఘటనల గురించి మీరు విన్నారా? రిషితేశ్వరి గురించి విన్నాను. టీవీ చానల్స్‌లో న్యూస్ చూశాను. చాలా బాధ అనిపించింది. ర్యాగింగ్ అనే పేరు ఎత్తడానికి వీల్లేనంతగా కఠినమైన నిబంధనలు విధించాల్సిన బాధ్యత కళాశాలలదే. అలాగే, ఫ్రెషర్స్ భయపడకూడదు. యాజమాన్యానికి ఫిర్యాదు చేయాలి. ప్రతి కళాశాలలోనూ ఓ ఫోరమ్ ఉంటుంది. ఆ ఫోరమ్‌కి కంప్లయింట్ చేయాలి. ♦ ఆత్మహత్యే సమస్యకు పరిష్కారం అంటారా? కానే కాదు. అది పిరికితనం. మనం లేకపోతే మనవాళ్లు ఏమైపోతారు? అని ఆలోచించాలి. ఆ తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చేసి మన దారి మనం చూసుకోవడం సరి కాదు. జీవితం ఎంతో విలువైనది. ♦ అత్యాచారం చేసేసి, ఆ తర్వాత అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయే అబ్బాయిలను ఊరికే వదలొచ్చా? ఇదే విషయమై సుప్రీం కోర్టు ‘పెళ్లి చేసుకున్నా.. దోషి శిక్ష అనుభవించాల్సిందే’ అని తీర్పు ఇచ్చింది.. మీరేమంటారు? ఈ తీర్పుని పూర్తిగా ఆమోదిస్తున్నాను. ‘ఎ రేపిస్ట్ ఈజ్ ఎ రేపిస్ట్’. అత్యాచారం చేసినవాణ్ణిచ్చి పెళ్లి చేస్తే అంతకన్నా ఘోరమైన పరిష్కారం మరోటి ఉండదు. ఆ అమ్మాయిని కూపంలోకి నెట్టినట్లే. ♦ సినిమాల విషయానికొస్తే... దాదాపు హీరోయిన్లే హీరోల చుట్టూ తిరుగుతారు. సో.. అమ్మాయిలను తక్కువ చేస్తున్నారేమో అంటే మీరు ఒప్పుకుంటారా? ఆడవాళ్లు ఆర్ట్లాంటి వాళ్లు. వాళ్ల అందాన్ని ఆవిష్కరించడం తప్పు కాదు. కానీ అభ్యంతరకరంగా చూపించడం తప్పు. అలాగే ప్రతి సినిమాలోనూ అమ్మాయిలు హీరోల చుట్టూ తిరుగుతారంటే నేనొప్పుకోను. పరిస్థితుల్లో మార్పొస్తోంది. సో.. కథానాయికలను గ్లామర్ డాల్స్‌లా మాత్రమే చూసే పరిస్థితి పోతుంది. ♦ పదే పదే ఓ అబ్బాయి వెంటపడితే కనికరించి ఐ లవ్ యూ చెప్పాలనిపించిన సందర్భాలేమైనా ఉన్నాయా? (నవ్వుతూ) లక్కీగా అలా ఇబ్బందిపడిపోయే సందర్భాలేవీ రాలేదు. ♦ ఇవాళ కథానాయికలు ముప్పై ఏళ్ల తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్స్ మారుతున్నారు లేకపోతే అవకాశాల్లేకుండా మిగిలిపోతున్నారు. కథానాయికల కెరీర్‌కి లాంగ్విటీ తక్కువనే విషయంపై మీ అభిప్రాయం? ఒక్కసారి గ్లామర్ డాల్ ఇమేజ్ నుంచి బయటపడి పూర్తిగా నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తే అప్పుడు హీరోల్లా హీరోయిన్స్ కెరీర్‌కి కూడా లాంగ్విటీ ఉంటుంది. కథల్లో మార్పు రావాలి. అప్పుడు మొత్తం ఫిలిం కమ్యూనిటీలో మంచి మార్పొస్తుంది. ఆల్రెడీ బాలీవుడ్లో ఈ మార్పు మొదలైంది. ఇక్కడ కూడా ఆ మార్పు వస్తుందనే నమ్మకం ఉంది. ♦ మీరు ఎవరి ముందు తలవంచాలనుకుంటారు.. అమ్మ, నాన్న, గురువు, దైవం...? నన్ను ఇన్‌స్పయిర్ చేసే వ్యక్తుల ముందు నేను తలవంచడానికి వెనకాడను. అలాగే ఎవరి దగ్గరైనా మంచి విషయాలు నేర్చుకునే వీలు ఉంటే వాళ్లకు తల వంచుతాను. నాకన్నా చిన్నవాళ్లయినా సరే బెండ్ కావడానికి రెడీ అవుతాను. ♦ ఇప్పుడు మీరు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కాబట్టి కోట్లు సంపాదించే అవకాశం ఉంది. మరి.. పేదవాళ్లను చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? విధి నిర్ణయం మేరకు అందరూ పుడతారు. హార్డ్ వర్క్‌తో దాన్ని మార్చుకోవచ్చు. స్వతహాగా నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిని. నా హార్డ్‌వర్కే నన్నీ స్థాయికి తీసుకొచ్చింది. పేదవాళ్లని చూసినప్పుడు జాలి కలుగుతుంది. ధనవంతులందరూ తమ సంపాదనలో ఐదు శాతం డొనేట్ చేస్తే చాలు.. పేదరికం అనే మాట వినపడదు... మెల్ల్ల మెల్ల్లగా పేదవాళ్లు కనపడరు. ♦ మరి.. మీ సంగతేంటి? సామాజిక సేవ చేస్తుంటారా? తప్పకుండా. కానీ, దాని గురించి చెప్పను. ఎందుకంటే, మనం కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదని మా అమ్మ అంటుంది. ♦ అది సరే.. తెలుగు భాష తెలియకుండా ఎలా మ్యానేజ్ చేస్తున్నారు? నాకు తెలుగు తెలియదని ఎందుకు అనుకుంటున్నారు? భాష తెలియకుండా నటించడం ఈజీ కాదు. అందుకే నా మొదటి సినిమా అప్పుడే నేర్చుకున్నాను. తెలుగు మాట్లాడతాను కానీ, బోల్డన్ని తప్పులొస్తాయి. కాకపోతే బాగా అర్థమవుతుంది. అందుకని, కష్టంగా లేదు. ♦ హిందీలో మీ ఫేవరెట్ హీరో? రణ్‌బీర్ కపూర్.. ♦ తెలుగు ఏ దర్శకుడితో సినిమా చేయాలని ఉంది? రాజమౌళి. ♦ మీరు చేయబోయే పాత్రలు... త్వరలో మీరు నన్ను పోలీసాఫీసర్‌గా చూడబోతున్నారు. ఓ చిత్రంలో ఆ పాత్ర చేస్తున్నా. నాకెప్పుడూ నాన్-గ్లామరస్ రోల్స్ అంటే ఇష్టం. ఒకవేళ గ్లామరస్ రోల్ అయితే అందులో విషయం ఉండాలి. నేను చేసే గ్లామరస్ రోల్స్‌లో విషయం ఉంటుంది. నా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, ప్రేక్షకుల ప్రేమాభి మానాలు కూడా నా సక్సెస్‌కి కారణం. - డి.జి. భవాని -
కొరియర్ బాయ్ లవర్ బాయ్
-
మంచు విష్ణు ముచ్చట్లు
-
కాజల్ కబుర్లు
-
రుద్రమ్మగా జేజమ్మ
-
శ్రీమంతులు!
-
’శ్రీమంతుడు’తో స్పెషల్ చిట్‌చాట్
-
నవతెలంగాణ సమాజం ఫౌండర్‌తో చిట్ ఛాట్!
-
లెజెండ్-సి.నారాయణరెడ్డి
-
నా ఫిగరే జవాబు చెబుతుంది
నటి సురభి చూడడానికి చాలా ఇన్నోసెంట్‌గా ఉంటుంది. అయితే ప్రవర్తనలో మాత్రం చాలా బోల్డ్. ఇవన్‌వేరమాదిరి చిత్రం ద్వారా తమిళసినిమాకు పరిచ యం అయిన ఈ ఢిల్లీ బ్యూటీ ఇక్కడ వరుసగా అవకాశాలను దక్కించుకుంటూనే ఉంది. ఆ మధ్య వేలై ఇల్లా పట్టాదారి చిత్రం చిన్న పాత్ర అయినా పెద్ద పేరే పొందిన సురభి తాజాగా నటుడు జై సరసన పుగళ్ చిత్రంతో తెరపైకి రావడానాకి సిద్ధం అవుతోంది. మరిన్ని ఆఫర్లు ఎదురు చూస్తున్నాయంటున్న ఈ భామతో చిన్న చిట్‌చాట్.. ప్రశ్న: ఉత్తరాది నుంచి వచ్చారు. తమిళ భాషలో నటించడం కష్టం అనిపించడం లేదా? జ: నాకు చిన్నతనం నుంచి నట నంటే యమ పిచ్చి. హిరోయిన్ కా వాలన్నది నా కల. అందుకే యా క్టింగ్లో శిక్షణ పొందాను. అయితే తమిళంలో పెద్ద పెద్ద సంస్థల్లో అవకాశాలు వస్తాయని ఊహించలే దు. ఇక్కడ మరిన్ని చిత్రాలను చెయ్యాలని ఆ శిస్తున్నాను. అందుకే తమిళ భాష కష్టం అయి నా ఇష్టపడి నటిస్తున్నాను. ఒక రకంగా ఛాలెంజింగే. సంభాషణలను ఇంగ్లిష్ లో రాసుకుని బట్టీ పట్టి ముందుగా నే ప్రాక్టీస్ చేసుకుంటాను.డబ్బింగ్ నే ను చెప్ప ను కాబట్టి లిప్ మూమెంట్ విషయంలో జాగ్రత్త వహిస్తాను.చెన్నైకి వచ్చి వెళ్లడం వల్ల ఇప్పుడు తమిళ భాషను అర్థం చేసుకోగలుగుతున్నాను. ప్రశ్న: మీ శారీరక భాష గురించి కామెంట్ చేసే వాళ్లపై మీ స్పందన? జ: తమిళ భాష నాకిప్పుడు చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉంది. నా శారీరక భాష సమ్‌థింగ్ బ్యాడ్ అనే వాళ్లకు ముందు ముందు నా ఫిగరే సమాధానం చెబుతుంది. ప్రశ్న: ఇంకా యాక్షన్ క్లాసులకు వెళుతున్నారట? జ: అవును ఢిల్లీలోని మెర్రీ జాన్ యాక్టింగ్ సూడియోలో యాక్టింగ్ క్లాసులకు వెళుతున్నాను. ఈ క్లాసులు నా యాక్టింగ్‌కు చాలా హెల్ప్ అవుతున్నాయి. ప్రశ్న: సరే జైతో నటిస్తున్న పుగళ్ చిత్రం గురించి? జ: ఇది రాజకీయ నేపథ్యంలో రూపొం దుతున్న విభిన్న కథా చిత్రం.ఇందులో నాది చిన్న చిన్న విషయాల్లో కూడా ఫైట్ చేసే డామినేటెడ్ గర్ల్ పాత్ర. చిత్ర రెండవ భాగంలో హీరో జై మంచి పనులను అర్థం చే సుకుని తనకు సహకరిస్తాను. చాలా ఆసక్తికరమైన పాయింట్‌తో రూపొందుతున్న కథా చిత్రం. ప్రశ్న: ఇతర భాషల్లో కూడా నటిస్తున్నట్లున్నారు? జ: తెలుగులో ఇప్పటికే బిరువా చిత్రంలో నటించాను. త్వరలో శర్వానంద్ సరసన మరో చి త్రం చేయనున్నాను.అలాగే తమిళంలో ఒక పెద్ద చిత్రం చేయనున్నాను.ఆ విషయాలు తరువాత వెల్లడిస్తాను. -
’బస్తీ’ మూవీ టీమ్‌తో చిట్ చాట్
-
టైగర్ టీమ్ తో చిట్ చాట్
-
అతను సో స్వీట్!
న్యూ టాలెంట్ తెలుగు పరిశ్రమలో ఉత్తరాది భామలదే హవా. ఒక్క చాన్స్, హిట్ వస్తే చాలు.. ఆ తర్వాత ఇక్కడ తిరుగులేని తారలుగా మారిపోతారు. ‘రన్ రాజా రన్’ వంటి సక్సెస్ఫుల్ మూవీతో కథానాయికగా పరిచయమైన సీరత్ కపూర్ కూడా సౌత్‌లో తన కెరీర్ బాగుంటుందనే నమ్మకంతో ఉన్నారు. ఆమె నటించిన ‘టైగర్’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా సీరత్‌తో చిట్ చాట్.. ♦ ముందు ఓ విషయం చెప్పండి.. హిందీ రంగంలో పెద్ద పేరున్న ‘కపూర్’ కుటుంబానికీ, మీకూ ఏమైనా బంధుత్వం ఉందా? ఇంటి పేరు ఒకటే కాబట్టి, అందరూ ఆ కపూర్ కుటుంబానికి బంధువునని అనుకుంటున్నారు. బాలీవుడ్లో కూడా చాలామంది విలేకరులు నన్నీ ప్రశ్న అడిగారు. కానీ, ఆ కుటుంబంతో నాకు బంధుత్వం లేదు. నేను ‘ఓన్ సీరత్ కపూర్’ని (నవ్వుతూ). ♦ పోనీ.. మీ కుటుంబంలో సినిమా రంగానికి చెందినవారెవరైనా ఉన్నారా? ముంబయ్‌లో రోషన్ తనేజా యాక్టింగ్ స్కూల్ ఉంది కదా.. రోషన్ తనేజా మా రెండో తాతగారు. ♦ రెండో తాతగారంటే? అంటే.. రోషన్ తనేజా కొడుకుని మా పిన్ని పెళ్లి చేసుకుంది. ఆయన యాక్టింగ్ స్కూల్లోనే నేను నటన నేర్చుకున్నా. ♦ ముందు డ్యాన్స్ మాస్టర్‌గా చేశారు కదా..? నేను క్లాసికల్ డ్యాన్సర్‌ని. క్లాసికల్ సింగర్‌ని కూడా. శిక్షణ తీసుకున్నాను. హిందీ సినిమాలకు నృత్యదర్శకురాలిగా చేసే అవకాశం వస్తే, ఒప్పుకున్నాను. ముందు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా, ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్‌గా చేశాను. ♦ రణబీర్ కపూర్ నటించిన ‘రాక్‌స్టార్’కి అసిస్టెంట్ డ్యాన్స్ డెరైక్టర్‌గా చేశారు కదా.. రణబీర్ గురించి నాలుగు మాటలు? రణబీర్‌కి పెద్ద స్టార్ అనే ఫీలింగే ఉండదు. అందరితో కలిసిపోతాడు. ఏదైనా స్టెప్ అర్థం కాకపోతే, ‘ఎలా చెయ్యాలి’ అని అడిగి, నేర్చుకుని చేసేవాడు. ‘రాక్‌స్టార్’ మ్యూజికల్ బేస్డ్ ఫిలిం కాబట్టి, డ్యాన్సులకు మంచి స్కోప్ ఉండేది. రణబీర్ చాలా బాగా చేశాడు. ♦ ఓకే.. తెలుగు చిత్రాల విషయానికొద్దాం... ‘రన్ రాజా రన్’లో కనిపించిన పదకొండు నెలలకు ‘టైగర్’తో వస్తున్నారు.. ఈ సినిమా అంగీకరించడానికి కారణం? ఈ చిత్రదర్శకుడు ఆనంద్ ముంబయ్‌కి ఫోన్ చేసి, నాకీ కథ వినిపించారు. చాలా బాగా నచ్చింది. కథతో పాటు నా పాత్ర కూడా బాగుంటుంది. ఇందులో నా పాత్ర పేరు ‘గంగ’. వారణాసిలో నివసించే సంప్రదాయబద్ధమైన కుటుంబానికి చెందిన అమ్మాయిని. ఒకవైపు ట్రెడిషనల్, మరోవైపు మోడర్న్.. రెండు రకాలుగా ఉంటుంది గంగ. నిజజీవితంలో నేను కూడా అంతే. సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్‌లతో కలిసి సినిమా చేయడం మంచి అనుభూతినిచ్చింది. మేమంతా మనసు పెట్టి చేశాం. విజయం ఖాయం అని నమ్ముతున్నా. ♦ ‘రన్ రాజా రన్’ అప్పుడు మిమ్మల్ని ప్రభాస్ అభినందించారు కదా.. ఏమనిపించింది? ప్రభాస్ సో స్వీట్. ఆ సినిమా షూటింగ్ లొకేషన్‌కి వచ్చేవారాయన. బాగా యాక్ట్ చేస్తున్నావని అప్పుడే అభినందించారు. ఆ తర్వాత ఫంక్షన్లో అందరి ముందూ ప్రశంసించారు. అంత పెద్ద స్టార్ నన్ను అభినందించడం మర్చిపోలేని విషయం. ♦ క్లాసికల్ సింగర్‌ని అన్నారు.. సినిమాలకు పాడతారా? యాక్చువల్‌గా నేనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇంకా చెప్పాలంటే నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకోవాలని కూడా ఉంది. కానీ, తెలుగు భాష తెలియదు కాబట్టి, వేరే దారి లేక డబ్బింగ్ చెప్పించుకోవాల్సి వస్తోంది. ♦ మరి.. తెలుగు నేర్చుకుంటున్నారా? తెలుగు పదాలు పలకడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. పట్టుదల ఉంటే ఏదీ సాధ్యం కాదు. మొత్తం నేర్చేసుకుని, భవిష్యత్తులో నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటా. ♦ కొరియోగ్రఫీ, యాక్టింగ్.. దేనికి ప్రాధాన్యం ఇస్తారు? ప్రస్తుతానికి నటనపైనే. సినిమాల్లో ఎలాగూ డాన్స్ చేస్తాం కాబట్టి, దానికి దూరమయ్యే అవకాశం లేదు. భవిష్యత్తులో మాత్రం డెరైక్షన్ చేస్తా. ♦ తెలుగులో వేరే సినిమా ఏదైనా చేస్తున్నారా? సుమంత్ అశ్విన్ సరసన ‘కొలంబస్’లో నటిస్తున్నా. -
'వినవయ్యా రామయ్య' టీం తో చిట్ చాట్
-
కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని టీమ్‌తో చిట్ చాట్
-
పూరీ, చార్మీలతో చిట్ ఛాట్ Part- 2
-
పూరీ, చార్మీలతో చిట్ ఛాట్ Part- 1