
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు హీరోయిన్ శ్రుతీహాసన్. వీలు కుదిరినప్పుడల్లా తన అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటారు. తాజాగా ఫ్యాన్స్‌కి ఆ అవకాశం ఇచ్చారు. అయితే తన ఫేవరెట్ విషయాలను మాత్రమే అడగాలని కండీషన్ పెట్టారు శ్రుతి. కానీ నెటిజన్స్ ఊరుకుంటారా? ఎవరికి నచ్చినవి వాళ్లు అడిగారు. అవేంటో చూద్దాం.
వారంలో ఏ రోజు అంటే మీకు ఇష్టం?
ప్రత్యేకంగా కారణం చెప్పలేను కానీ శనివారం అంటే ఇష్టం. ఆ తర్వాత గురువారం.
వర్కౌట్స్ గురించి ఏం చెబుతారు?
మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకోవడాన్ని చాలా ఎంజాయ్ చేస్తాను. ఇంకా స్విమ్మింగ్, డ్యాన్సింగ్ అంటే ఇష్టం. అయితే ఎక్కువ సమయం కేటాయిం చాల్సిన యోగా అంటే నాకు అంత ఇష్టం లేదు.
ఎలాంటి పువ్వులను ఇష్టపడతారు?
రోజా పువ్వులంటే చాలా ఇష్టం. ఆ తర్వాత లిల్లీ పువ్వులు ఇష్టం.
మీరు ఏ ఫలాన్ని ఇష్టంగా తింటారు?
సీతాఫలాలు. వీటితో పాటు చెర్రీస్ కూడా.
మీకు ఇష్టమైన ఫుడ్?
దోసె, సాంబార్, రసం వడ.
శంతను (శ్రుతి బాయ్‌ఫ్రెండ్)ని మీరు ఎప్పుడు కలిశారు?
తొలిసారి 2018లో శంతనుని కలిశాను. 2020 నుంచి మేం రిలేషన్‌షిప్‌లో ఉన్నాం.
గిటార్ లేదా పియానోలలో ఏది ఇష్టం?
నాకు గిటార్ సౌండింగ్ ఇష్టం. కానీ గిటార్‌ను ప్లే చేయలేను. అందుకే పియానో నా ఫేవరెట్.
మీ ఫేవరెట్ బుక్?
ద ఓల్డ్‌మ్యాన్ అండ్ ది సీ
స్ట్రయిట్ లేదా కర్లీ హెయిర్.. ఏది ఇష్టం?
నాకు స్ట్రయిట్ హెయిర్ అంటేనే ఇష్టం.
ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్?
ఎప్పటికీ ఏఆర్ రెహమాన్‌గారే.
మీ శరీరంలో మీకు ఇష్టమైనవి?
నా బ్రెయిన్,నా హార్ట్.
Comments
Please login to add a commentAdd a comment