![Niharika Konidela Interesting Answers To Netizens Questions Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/12/niharika.jpg.webp?itok=EFRaL2AK)
మెగాడాటర్, నాగబాబు కూతురు నిహారిక కొణిదెల టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. మెగా కుటుంబం నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు పోస్టులు చేస్తూ టచ్‌లో ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా నెటిజన్స్‌తో సరదాగా చిట్ చాట్ నిర్వహించారు. ఈ ఇంటరాక్షన్‌లో నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. అసలు ఆమెను ఎలాంటి ప్రశ్నలు అడిగారో ఓ లుక్కేద్దాం పదండి.
(ఇది చదవండి: ‘భోళా శంకర్’కు తొలి రోజు ఊహించని కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే.. )
నిహారిక తన ఫ్యాన్స్‌తో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆమె ఇష్టమైన విషయాల గురించి మాట్లాడారు. మీకిష్టమైన ప్రదేశం, వెబ్ సిరీస్‌లు ఏవని అడగ్గా.. ఇండోనేషియాలోని బాలి తన బెస్ట్ వెకేషన్ ప్లేస్ అని వెల్లడించింది. ఇక వెబ్ సిరీస్‌లు విషయానికొస్తే దిస్ ఇజ్ అజ్, డెక్ట్సర్ అని తెలిపింది. మరో నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేయగా.. నిహారిక బదులిచ్చింది. వరుణ్‌తేజ్‌తో దిగిన ఏ ఫోటో మీకు ఇష్టమని ప్రశ్నించగా.. ఎంగేజ్‌మెంట్‌లో అన్నయ్యతో దిగిన ఫోటోనే నా జీవితంలో అత్యంత ప్రత్యేక సందర్భమని తెలిపింది. అంతే కాకుండా నాకు బోర్డ్ గేమ్స్ అంటే చాలా ఇష్టమని.. రొమాన్స్, మర్డర్ మిస్టరీ జోనర్ సినిమాలంటే తనకు ఆసక్తి అని వెల్లడించింది. కాగా.. ఇటీవలే తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: 'జైలర్' థియేటర్లో అత్తగారి ముందే ఆ హీరోయిన్‌తో ధనుష్ రచ్చ)
Comments
Please login to add a commentAdd a comment