తన బాడీలో ఆ పార్ట్‌కే ఎక్కువ ఖర్చు పెట్టినట్లు రిప్లై ఇచ్చిన నటి | Shruti Haasan Shocking Reply About Her Nose To Netizen | Sakshi
Sakshi News home page

తన బాడీలో ఆ పార్ట్‌కే ఎక్కువ ఖర్చు పెట్టానంటున్న నటి

Published Wed, Jul 14 2021 6:22 PM | Last Updated on Thu, Jul 15 2021 2:15 AM

Shruti Haasan Shocking Reply About Her Nose To Netizen - Sakshi

విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ వారసురాలిగా సినీ ఇండ‌స్ట్రీలో​కి ఎంట్రీ ఇచ్చిన శృతి హాస‌న్ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి చాలా సమయమే పట్టింది. న‌టిగా, సింగ‌ర్‌గా, మంచి డ్యాన్స‌ర్‌గా ఎదుగుతూ.. కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్న సమయంలో తన వ్యక్తిగత కారణాల వల్ల కొన్నాళ్లు సినిమాల‌కు దూర‌మై.. మళ్లీ ఎంట్రీ ఇచ్చింది.  సినిమాల పరిస్థితి ఎలా ఉన్నా ఈ అమ్మడు తన అభిమానులతో అప్పుడప్పుడు చిట్‌ చాట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ అభిమాని అడిగిన వింత ప్రశ్నకు షాకింగ్‌ సమాధానమిచ్చింది.

ఎక్కువ ఆ పార్ట్‌కు ఖర్చు చేశాను..
సినీ పరిశ్రమలో కొంచెం గ్యాప్‌ తరువాత రీఎంట్రీలో సక్సెస్‌ సాధించడం అంత సులువు కాదన్న విషయం తెలిసిందే, కానీ ఇది శ్రుతి హాసన్‌ వీటిని మార్చిందనే చెప్పాలి.  తెలుగులో వకీల్‌సాబ్‌, క్రాక్‌ సినిమాలతో హిట్‌లు అందుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా మూవీ ‘సలార్‌’లో నటిస్తోంది.  ఈ రకంగా శ్రుతి స్పీడ్‌ చూస్తుంటే కాస్త విరామం వచ్చినప్పటికీ తిరిగి తన కెరీర్‌లో దూసుకెళ్తోంది. 

ఇటీవల సోషల్‌ మీడియాలో ఈ ముద్దు గుమ్మ ఓ అభిమానితో ముచ్చటిస్తుండగా ఆ వ్యక్తి .. ‘మీ శరీరంలో మీకు ఏ భాగం అంటే ఇష్టం.. మీ ముక్కు అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా.. అది నిజమేనా’ అని ప్రశ్నించాడు.అందుకు ఈ అమ్మడు సమాధానంగా.. ‘అవును నాకు ముక్కు అంటే ఇష్టమే.. దాని కోసమేగా చాలా డబ్బులు ఖర్చు పెట్టానంటూ’  ఏ మాత్రం తడుముకోకుండా బదులిచ్చింది. దెబ్బతో క్రాక్‌ నటి ఇచ్చిన రిప్లైకి షాక్‌లోకి వెళ్లాడు ఆ నెటిజన్‌. కాగా ప్రస్తుతం ఈ రిప్లై నెట్టింట వైరల్‌గా మారి హల్‌చల్‌ చేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement