![Rashmika Mandanna Answers To Netizens - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/29/rashmika.jpg.webp?itok=bqAzYaRW)
జీవితంలో ఏదీ ఊరికే రాదనీ, కష్టపడి సాధించుకోవాలనీ అంటున్నారు హీరోయిన్ రష్మికా మందన్నా. ప్రస్తుతం హిందీ చిత్రం ‘గుడ్ బై’ షూటింగ్‌లో పాల్గొంటున్న రష్మిక షూటింగ్ గ్యాప్‌లో సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ‘మీరు స్మోక్ చేస్తారా?’ అని ఓ నెటిజన్ అడిగితే, ‘‘నేనా.. స్మోకింగా? నాకు స్మోకింగ్ అంటే అసహ్యం. స్మోక్ చేస్తున్న వారి పక్కన నిలబడాలన్నా నాకు ఇష్టం ఉండదు’’ అని పేర్కొన్నారు రష్మిక. ఇంకా తనకు ఆరు భాషలు వచ్చనీ, ఈ ప్రపంచంలో ఎవరూ పర్‌ఫెక్ట్ కాదనీ.. తనలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయనీ చెప్పిన రష్మిక.. హీరో విజయ్ దేవర కొండ తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment