జీవితం చాలా చిన్నది: రష్మికా మందన్నా | Rashmika Mandanna Reveals She Suffered A Minor Accident, Says Life Is Super Fragile And Short | Sakshi
Sakshi News home page

జీవితం చాలా చిన్నది: రష్మికా మందన్నా

Published Tue, Sep 10 2024 12:29 AM | Last Updated on Tue, Sep 10 2024 12:11 PM

Rashmika Mandanna reveals she suffered a minor accident says Life is super fragile and short

హీరోయిన్  రష్మికా మందన్నా స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ సోమవారం ఓ పోస్ట్‌ని షేర్‌ చేశారు రష్మిక. ‘‘కొన్ని రోజులుగా నేను సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండటం లేదు. అలాగే పబ్లిక్‌లో కనిపించడం లేదు. కానీ, ఇందుకు ఓ కారణం ఉంది. నాకు చిన్న ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి కోలుకునే క్రమంలో వైద్యుల సలహాల మేరకు ఇంట్లోనే ఉంటున్నాను. ప్రస్తుతం నాకు బాగానే ఉంది. 

అయితే ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రధాన్యత కల్పించుకోండి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. అసలు రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకే ప్రతిరోజూ సంతోషంగా ఉండండి’’ అంటూ పేర్కొన్నారు రష్మికా మందన్నా. ఇక ఆమె సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్  ‘పుష్ప: ది రూల్‌’, విక్కీ కౌశల్‌ ‘ఛావ’, ధనుష్‌–నాగార్జునల ‘కుబేర’, సల్మాన్  ఖాన్  ‘సికందర్‌’ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు రష్మికా మందన్నా. అలాగే  ‘ది గాళ్‌ఫ్రెండ్‌’ అనే లేడీ ఓరియంటెడ్‌ సినిమా కూడా చేస్తున్నారామె.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement