
హీరోయిన్ రష్మికా మందన్నా అంటూ మార్ఫింగ్ చేసిన ఓ డీప్ ఫేక్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా రష్మికా మందన్నా స్పందించారు. ‘‘ఢిల్లీ పోలీసులకు ధన్యవాదాలు. నన్ను అభిమానిస్తూ, నాకు అండగా నిలిచేవారు నా చుట్టూ ఉన్నందుకు సంతోషిస్తున్నాను.
అలాగే ఇలాంటి ఘటనలకు (మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను ఉద్దేశించి) పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అమ్మాయిలు... అబ్బాయిలు... ఎవరైనా కావొచ్చు. మీ అనుమతి లేకుండా మీ ఫొటోలను మార్ఫింగ్ చేయడం, దుర్వినియోగం చేయడం అనేవి తప్పు’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు రష్మికా మందన్నా. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప: ది రూల్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారామె. అలాగే ‘ది గాళ్ ఫ్రెండ్’, ‘రెయిన్ బో’ అనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారీ బ్యూటీ. వీటితో పాటు కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment