responds
-
విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: విజయసాయిరెడ్డి రాజీనామాపై వైఎస్సార్సీపీ స్పందించింది. ‘‘మేము మీ నిర్ణయాన్ని ఆమోదించనప్పటికీ, మీ నిర్ణయాన్ని గౌరవిస్తాము. మా పార్టీ ఆవిర్భావం నుండి మీరు మా పార్టీకి బలమైన మూలస్తంభాలలో ఒకరిగా ఉన్నారు. కష్టాలు, విజయాలు రెండింటిలోనూ మీరు మాతో నిలబడే ఉన్నారు. ఇప్పుడు పార్టీ నుండి వైదొలగాలనే మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తాము’’ అని వైఎస్సార్సీపీ పేర్కొంది.‘‘హార్టికల్చర్‌లో మీ అభిరుచిని కొనసాగించడానికి.. రాజకీయాల నుండి వైదొలగాలనే మీ నిర్షయానికి మేము గౌరవిస్తున్నాము. పార్టీకి మీరు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. భవిష్యత్తులో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము’’ అని వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది. "Even though we do not approve your decision, we still respect your choice. You’ve been one of the pillars of strength for our party since its inception, standing with us through both tough times and triumphs. We respect your decision to step away from politics to pursue your… https://t.co/NCoaEYxCEq— YSR Congress Party (@YSRCParty) January 25, 2025 -
కాల్పులపై తొలిసారి స్పందించిన ట్రంప్
న్యూయార్క్: ఎన్నికల ర్యాలీలో తన మీద జరిగిన కాల్పులపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా స్పందించారు. ‘ఊహించనిది జరగకుండా ఆ దేవుడు మాత్రమే కాపాడాడు. అమెరికన్లందరూ ఒక్కటి కావాలి. ధృడనిశ్చయంతో నిలబడాలి. చెడు విజయం సాధించకుండా అడ్డుపడాలి’అని పిలునిచ్చారు. ఈ మేరకు ఆదివారం(జులై 14) ఉదయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌సోషల్‌లో ట్రంప్ ఒక పోస్టు పెట్టారు. కాగా, శనివారం సాయంత్రం పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతుండగా ట్రంప్‌పై దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ట్రంప్ చెవికి బుల్లెట్ గాయమై రక్తం చిందింది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది కాల్పలు జరిపిన దుండగుడిని మట్టుబెట్టి ట్రంప్‌ను అక్కడి నుంచి తరలించారు. ఘటన తర్వాత ట్రంప్ తన ప్రైవేట్ విమానం ట్రంప్ ఫోర్స్‌లో నుంచి దిగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్,రిపబ్లికన్ల తరపున ట్రంప్ హోరాహోరీ తలపడుతున్నారు. -
ఎగ్జిట్‌పోల్స్‌పై రాహుల్‌గాంధీ సంచలన కామెంట్స్
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్ ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. అవి ఎగ్జిట్‌పోల్ ఫలితాలు కాదని మోదీ మీడియా పోల్స్ అని రాహుల్ మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలనేదానిపై చర్చించడానికి ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి 295 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కేంద్రంలో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని తేల్చాయి. ఇండియా కూటమి ప్రతిపక్ష హోదాతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని చెప్పాయి. -
హార్దిక్ పాండ్యాతో విడాకులంటూ వదంతులు.. ట్రెండింగ్‌లో నటాషా(ఫొటోలు)
-
స్వాతిమలివాల్‌పై దాడి.. తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఎంపీ స్వాతిమలివాల్‌పై తన ఇంట్లో జరిగిన దాడి పట్ల పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. ఈ ఘటనలో రెండు వెర్షన్లు ఉన్నాయని ఏది నిజమో తేలాలంటే నిష్పక్షపాత దర్యాప్తు జరగాలన్నారు. ఈ విషయంలో తనకు న్యాయం కావాలన్నారు. ఈ విషయమై బుధవారం(మే22) కేజ్రీవాల్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. కాగా, మే13న ఎంపీ స్వాతిమలివాల్ సీఎం కేజ్రీవాల్‌ను కలవడానికి ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని మలివాల్ తొలుత ఆరోపించారు. వివాదం పెద్దదైన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బిభవ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయంలో ఆప్ నేతలు, స్వాతిమలివాల్ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. -
Hasan Sex Scandal: తొలిసారి స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ
బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హసన్ సెక్స్ వీడియోల వివాదంపై ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారిగా స్పందించారు. లైంగిక వేధింపుల వీడియోలు బయటికిరాగానే ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ వివాదానికి సంబంధించి రేవణ్ణ తాజాగా సోషల్ మీడియాలో ఒక లేఖ పోస్టు చేశారు.సెక్స్ స్కాండల్‌ను దర్యాప్తు చేస్తున్న సిట్ ముందు వారం రోజుల్లో హాజరవుతానని తెలిపారు. నిజమే గెలుస్తుందన్నారు. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియగానే మరుసటి రోజు ఏప్రిల్ 27న ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందే రేవణ్ణ సెక్స్ వీడియోలు హసన్ ప్రాంతంలో వైరల్ అయ్యాయి.ప్రజ్వల్ లోక్‌సభ ఎన్నికల్లో హసన్ నియోజకవర్గం నుంచి జేడీఎస్ పార్టీ తరపున బరిలోకి దిగారు. ప్రస్తుతం ఆయనే హసన్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2019 నుంచి 2022 వరకు హసన్, బెంగళూరుల్లోని ప్రజ్వల్ రేవణ్ణ ఇళ్లలో పలువురు మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తుండగా వీడియోలు చిత్రీకరించారు. ఈ వీడియోలున్న పెన్‌డ్రైవ్ బయటికి రావడంతో సెక్స్ స్కాండల్ వెలుగులోకి వచ్చింది. -
అలా చేయడం తప్పు, అందుకు ఇదే ఒక ఉదాహరణ: రష్మిక
హీరోయిన్ రష్మికా మందన్నా అంటూ మార్ఫింగ్ చేసిన ఓ డీప్ ఫేక్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా రష్మికా మందన్నా స్పందించారు. ‘‘ఢిల్లీ పోలీసులకు ధన్యవాదాలు. నన్ను అభిమానిస్తూ, నాకు అండగా నిలిచేవారు నా చుట్టూ ఉన్నందుకు సంతోషిస్తున్నాను. అలాగే ఇలాంటి ఘటనలకు (మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను ఉద్దేశించి) పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అమ్మాయిలు... అబ్బాయిలు... ఎవరైనా కావొచ్చు. మీ అనుమతి లేకుండా మీ ఫొటోలను మార్ఫింగ్ చేయడం, దుర్వినియోగం చేయడం అనేవి తప్పు’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు రష్మికా మందన్నా. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప: ది రూల్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారామె. అలాగే ‘ది గాళ్ ఫ్రెండ్’, ‘రెయిన్ బో’ అనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారీ బ్యూటీ. వీటితో పాటు కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. -
Zee-Sony Merger Deal: సోనీతో విలీన డీల్‌కు కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాతో (ప్రస్తుతం కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ – సీఎంఈపీఎల్) విలీన డీల్‌కు కట్టుబడి ఉన్నామని జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) స్పష్టం చేసింది. ఈ ఒప్పందాన్ని విజయవంతంగా పూర్తి చేసుకునేందుకు కృషి చేస్తున్నామని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలిపింది. విలీన సంస్థకు జీల్ సీఈవో పునీత్ గోయెంకా సారథ్యం వహించడం ఇష్టం లేని కారణంగా సోనీ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో జీల్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. జీల్‌తో తమ భారత విభాగం సీఎంఈపీఎల్ను విలీనం చేసేందుకు జపాన్‌కు చెందిన సోనీ గ్రూప్ రెండేళ్ల క్రితం డీల్ కుదుర్చుకుంది. అప్పట్నుంచి వివిధ కారణాలతో అది వాయిదా పడుతూ వస్తోంది. జీల్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర, ఆయన తనయుడైన గోయెంకా .. కంపెనీ నిధులను మళ్లించారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. దీనిపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విచారణ జరిపింది. గోయెంకాను ఏ లిస్టెడ్ కంపెనీ బోర్డులో చేరరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై అప్పిలేట్ న్యాయస్థానంలో ఆయనకు ఊరట లభించింది. అయితే, ఈ మొత్తం వ్యవహారాన్ని కార్పొరేట్ గవర్నెన్స్ వైఫల్యంగా భావిస్తున్న సోనీ.. విలీన సంస్థకు గోయెంకాను సీఈవోగా చేసేందుకు ఇష్టపడటం లేదని, ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని భావిస్తోందని వార్తలు వచ్చాయి. ఒప్పందం పూర్తి కావడానికి జనవరి 20 వరకు గడువు ఉండటంతో ఏం జరగనుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
60 ఏళ్ల వృద్ధుడు ఖననం చేసేశాక..హఠాత్తుగా బతికే ఉన్నానంటూ..
మహారాష్ట్రలో వింత ఘటన చోటు చేసుకుంది. 60 ఏళ్ల వృద్ధుడు అంత్యక్రియలు అయిపోయాక బతికే ఉన్నానంటూ స్నేహితుడికి కాల్ చేశాడు. దీంతో ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు బంధువులు. వారు ఈ విషయాన్ని పోలీసులకి తెలపడంతో ఈ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు. వివరాల్లోకెళ్తే..మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో 60 ఏళ్ల ఆటో డ్రైవర్ రిఫీక్ షేక్ అనే వృద్ధుడు కొద్దినెలల క్రితం తప్పిపోయాడు. దీని గురించి కుటుంబసభ్యులు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు కూడా. ఐతే జనవరి 29న బోయిసర్ మరియు పాల్ఘర్ స్టేషన్ల మధ్య ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. దీంతో రైల్వే పోలీసులు అతడి ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీన్ని చూసిన ఒక వ్యక్తి రైల్వే పోలీసులను సంప్రదించి అతను తన సోదరుడు రఫీక్ షేక్ అని చెప్పాడు. అతను తప్పిపోయినట్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిపాడు. ఆ తర్వాత రఫీక్ భార్య సైతం మృతి చెందింది తన భర్తే అని గుర్తిచడం విశేషం. దీంతో పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కుంటుంబికులు ఆ మృతదేహాన్ని ఖననం చేసేశారు కూడా. ఇంతలో రఫీక్ తన స్నేహితుడికి బతికే ఉన్నానంటూ సడెన్‌గా కాల్ చేశాడు. దీంతో అతను ఒక్కసారిగా షాక్ తిన్నాడు. వీడియో కాల్ చేసి మాట్లాడేంత వరకు నమ్మలేకపోయాడు. ఈ విషయాన్ని అతను షేక్ కుటుంబికులకు చెప్పాడంతో వారు కూడా బిత్తరపోయారు. అతన్ని చూసి ఆ కుంటుంబం ఆనందానికి ఆవధులే లేకుండా పోయింది. అంతేకాదు వారు ఈ విషయాన్నిపోలీసులకు తెలియజేయడంతో వారు ఖననం చేసిన మృతదేహన్ని వెలికితీసి.. అతను ఎవరో కనిపెట్టి పని ప్రారంభించారు. ఆ వృద్ధుడు కొద్ది నెలల వరకు పాల్ఘర్లోని ఒక నిరుపేద ఇంటిలో ఉన్నట్లు సమాచారం. (చదవండి: తాజ్‌మహల్‌ని చూసి మంత్రముగ్దులయ్యి ముషారఫ్ ఏం అన్నారంటే..) -
ఎగ్జిట్ పోల్స్ పై స్పందించిన అరవింద్ కేజ్రీవాల్
-
మర్రి శశిధర్‌రెడ్డి వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ స్పందన
-
ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదుపై స్పందించిన ఆర్బీఐ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదుపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్పందించింది. రఘురామకృష్ణరాజుకు సంబంధించిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్‌కు బ్యాంక్ రుణాల అవకతవకలపై విచారణ జరపాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆర్బీఐ.. తగిన చర్యలు తీసుకుంటామంటూ విజయసాయిరెడ్డికి తెలిపింది. (చదవండి: రెండో పెళ్లి చేసుకోవాలంటే ఆ గుడికే వెళ్తారు.. ఎందుకంటే..!) 2014-18 మధ్యలో పంజాబ్ కాన్సార్షియం దగ్గర రూ.826 కోట్ల రుణాలను ఇండ్ పవర్ తీసుకుంది. 2020 అక్టోబర్‌లో రుణాల స్కాంపై ఇండ్ పవర్ సంస్థకు చెందిన 11 చోట్ల సీబీఐ రైడ్స్ నిర్వహించింది. రుణాలు తీసుకుని ఇండ్ పవర్ సొంత అకౌంట్లకు డబ్బులు మళ్లించుకున్నట్లు సీబీఐ గుర్తించింది. చదవండి: చంద్రబాబు దీక్షలపై డిక్షనరీ రాయాలి: కన్నబాబు -
యవ్వనంగా ఉండాలంటే పాము రక్తం తాగుతారా?
సాక్షి, ముంబై: బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ ఫిట్నెస్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనందరికీ తెలిసిందే. 64 వయస్సులో కూడా కుర్రహీరోలు కుళ్లుకునేలా మజిల్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటారు. అయితే యంగ్‌గా కనిపించేందుకు పాము రక్తంగా తాగుతారన్న వ్యాఖ్యలకు తాజాగా స్పందించారు. ఇపుడిదే బీ టౌన్ టాపిక్‌గా మారిపోయింది. ఫిట్‌గా కండలు తిరిగిన బాడీతో అనిల్ కపూర్‌ను చూసిన యువ హీరోలు వావ్ అంటారు. జెరోజ్ క్లూనీస్ లా హాట్‌గా ఉన్నాడనే కమెంట్లు చాలా సాధారణంగా వినిపిస్తుంటాయి. ఈ మధ్య కాలంలో మరింత స్టయిలిష్‌గా అదరగొడుతున్నాడు. (చదవండి :Ramya krishna: రమ్యకృష్ణకు హ్యాపీ బర్త్‌డే) తాజాగా అర్బాజ్ ఖాన్ టాక్ షోలో అనిల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మీరు యవ్వనంగా ఉండటానికి పాము రక్తం తాగుతారటగా అని అర్బాజ్ ఖాన్ ప్రశ్నించాడు. అంతేకాదు ఏకంగా ప్లాస్టిక్ సర్జన్ వెంటబెట్టుకని తిరుగుతారటగా అన్న నెటిజనుల కమెంట్లను చూపించాడు. దీంతో షాకైన అనిల్ కపూర్..ఇవి నిజమైన ప్రశ్నలేనా? లేదంటే మీరే డబ్బులిచ్చి కల్పించారా అంటూ చమత్కరించారు. పెద్దగా నవ్వేసి ఆయా కమెంట్లను కొట్టి పారేశారు. ఒక్క రోజుకి 24 గంటలు...ఇందులో ఒక గంట కూడా మనం మన శరీరం మీద శ్రద్ద పెట్టకపోతే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. తద్వారా వ్యాయామ అవసరాన్ని చెప్పకనే చెప్పారు. అలాగే తనను అభిమానిస్తున్న ఫ్యాన్స్‌కు రుణపడి ఉంటానని అనిల్ చెప్పుకొచ్చారు. -
KTR Office: మేము చూసుకుంటాం.. సాయం చేస్తాం
సాక్షి, సప్తగిరికాలనీ(కరీంనగర్): న్యుమోనియాతో బాధ పడుతున్న 45 రోజుల పసిపాప కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కరీంనగర్‌కు చెందిన ఆ చిన్నారి తండ్రి అసీఫ్ రోజువారీ ఆటోడ్రైవర్. ఆటోను కిరాయికి తీసుకొని నడుపుతున్న అతను తన బిడ్డ ఆసుపత్రి బిల్లు చెల్లించే పరిస్థితిలో లేడు. ఆ కుటుంబ దీనస్థితిని చూసి చలించిన కరీంనగర్‌కు చెందిన సామాజిక సేవకురాలు మునిపల్లి ఫణిత తన ట్విట్టర్ ఖాతా ద్వారా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు పలువురికి పాప ఆసుపత్రిలో ఉన్న ఫొటోలను గురువారం పోస్ట్ చేసి, ఆదుకోవాలని కోరారు. ఆమె ట్వీట్‌కు గంటలోపే మంత్రి కార్యాలయం స్పందించింది. ‘మేము చూసుకుంటాం.. వీలైనంత త్వరగా సహాయం చేస్తాం’ అని రీట్వీట్ చేశారు. శుక్రవారం ఉదయం అసీఫ్కు మంత్రి కేటీఆర్ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. పాప వైద్య చికిత్స వివరాలు అడిగారని, ఆసుపత్రి బిల్ ఎంత అవుతుంది.. ఇంకా ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉంటారు.. తదితర వివరాలు అడిగారని, వీలైనంత త్వరగా మళ్లీ ఫోన్ చేస్తామని చెప్పారని అసీఫ్ తెలిపాడు. చదవండి: ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ బీమా -
ఢిల్లీ సీఎం ట్వీట్‌పై సింగపూర్ విదేశాంగ మంత్రి ఫైర్
న్యూఢిల్లీ: దేశమంతా ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ ధాటికి గజగడలాడుతుంటే థర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఈ క్రమంలో సింగపూర్ లో విజృంభిస్తున్న కొవిడ్-19 కొత్త వేరియంట్ భారతదేశం థర్ఢ్ వేవ్ కు కారణం కావచ్చని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ట్వీట్‌పై సింగపూర్ విదేశాంగ మంత్రి వివిన్ బాలకృష్టన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగపూర్ వేరియంట్ అనేది లేదు క్రేజీవాల్ ట్వీట్‌పై స్పందించిన సింగపూర్ విదేశాంగ మంత్రి వివిన్ బాలకృష్టన్ బదులుగా ట్వీట్ చేస్తూ.. ‘రాజకీయ నేతలు వాస్తవాలకు కట్టుబడి ఉండాలి. ‘సింగపూర్ వేరియంట్’ అనేదేమీ లేదని పేర్కొన్నారు. ఇలా మాట్లాడటం తగదని ఢీల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్‌కు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించడం తెలిసిందే. కాగా.. సింగపూర్ లో చిన్నారుల్లో వ్యాపిస్తున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ పట్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేస్తూ.. సింగపూర్ లో కొవిడ్-19 కొత్త వేరియంట్‌ను కనిపెట్టారని అది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ వైరస్ పిల్లలకు చాలా ప్రమాదకరమని, సింగపూర్‌తో విమాన సేవలను తక్షణమే నిలిపివేయాలని, పిల్లల టీకా డ్రైవ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు. చదవండి: Delhi: చేతులపై మోసుకెళ్లి..బామ్మకు కరోనా టీకా Politicians should stick to facts! There is no “Singapore variant”. https://t.co/SNJaF7wkwC https://t.co/pNgw4bkV4H — Vivian Balakrishnan (@VivianBala) May 19, 2021 -
ఐటీ దాడులపై తాప్సీ ఏమన్నారంటే..
ముంబై: బాలీవుడ్ నటి తాప్సీ పన్ను తన ఇంటిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడి చేసిన 3 రోజుల తర్వా త స్పందించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘మూడు రోజుల పాటు మూడింటి గురించి అధికారులు గాలించారు. మొదటిది పారిస్‌లో నాకు ఉందని అనుకుంటున్న బంగ్లా తాళాల కోసం గాలించారు. ఎందుకంటే వేసవి సెలవులు దగ్గరకొస్తున్నాయి కదా’’ అని పేర్కొన్నారు. ‘‘నేను దాచి పెట్టాననుకున్న రూ.5 కోట్ల రసీదు కోసం ఇల్లంతా వెతికారు. నేను ఆ డబ్బు తీసుకోలేదు కాబట్టి రసీదు కూడా దొరకలేదు’’ అని మరో ట్వీట్ చేశారు. మూడో ట్వీట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2013లో ఐటీ శాఖ వీరిపైనే దాడులు జరిపితే ఎవరూ ఏమీ అనలేదని, ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని నిర్మల ప్రశ్నించారు. దీనిపై తాప్సీ స్పందిస్తూ గౌరవ ఆర్థిక మంత్రి చెబుతున్న ప్రకారం 2013 నాటి దాడుల్ని నా జ్ఞాపకశక్తిని కూడా శోధించారు’’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. -
సుశాంత్‌కి తొలి అవకాశం ఇచ్చింది నేనే
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు కారణమయ్యానంటూ తనపై కేసు పెట్టిన నేపథ్యంలో నిర్మాత ఏక్తాకపూర్ స్పందించారు. సుశాంత్‌కు నటుడిగా తొలి అవకాశమిచ్చింది తానేనని, అలాంటిది తనపైనే కేసు నమోదు కావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సుశాంత్ ఆత్మహత్యకు చిత్రపరిశ్రమలో పాతుకుపోయిన బంధుప్రీతే కారణమంటూ వెల్లువెత్తున్న విమర్శలపై ఏక్తా ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్ర రిస్తా టీవీ సీరియల్లో సుశాంత్‌కు ఏక్తా కపూర్ తొలి అవకాశమిచ్చారు. అయితే, సుశాంత్‌కు లీడ్ రోల్ ఇవ్వడానికి చానెల్ తొలుత ఒప్పుకోలేదని, చివరికి సదరు చానెల్‌ను కన్విన్స్ చేసి ఒప్పించానని ఏక్తా కొన్ని వారాల క్రితమే తెలిపిన సంగతి తెలిసిందే. View this post on Instagram Thanku for the case for not casting sushi....when Actually I LAUNCHED HIM. I’m beyond upset at how convoluted theories can b! Pls@let family n frns mourn in peace! Truth shall@prevail. CANNOT BELIEVE THIS!!!!! credit: @jagranenglishnews... A police case has been filed against eight people including Bollywood directors @karanjohar, Sanjay Leela Bhansali and @ektarkapoor along with actor @beingsalmankhan in connection with the death of actor Sushant Singh Rajput, news agency ANI reported on Wednesday . "In the complaint, I have alleged that Sushant Singh Rajput was removed from around seven films and some of his films were not released. Such a situation was created which forced him to take the extreme step," Advocate Sudhir Kumar Ojha was quoted as saying . . . #sushantsinghrajput #sushantsinghrajputdeath #sushantsinghrajpurrip #jagranenglish #instawithjagranenglish #ripsushantsinghrajputsir💔🙏 #ripsushant #ripsushantsinghrajput🙏 #ripsushantsinghrajput💔 #ripsushantsinghrajput🙏🙏 #ripsushantsinghrajput #sushantnomore #salmankhan #salmankhanfans #salmankhanswag #salmankhanmerijaan #salmankhanfilms #salman #salmankhanfanclub #salmankhanfc #karanjohar #karanjoharfilm #karanjoharupdates #karanjoharfan A post shared by Erk❤️rek (@ektarkapoor) on Jun 17, 2020 at 1:26am PDT సుశాంత్ ఆత్మహత్యపై బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, ఏక్తాకపూర్, సంజయ్ లీలా భన్సాలీ సహా 8 మందిపై బిహార్ ముజఫర్ కోర్టులో బుధవారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. సుశాంత్ ఆకస్మి మరణం సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పలువురిని దిగ్ర్భాంతికి గురిచేసింది. దీంతో అతడి ఆత్మహత్యకు బాలీవుడ్‌లోని కొంతమంది ప్రముఖులే కారణమంటూ న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా ముజఫర్‌పూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 14న సుశాంత్ సింగ్ తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. యువ నటుడి ఆకస్మిక మరణంపై పలువురు దిగ్ర్భాంతికి గురయ్యారు. అంతేకాకుండా బాలీవుడ్లో పేరుకుపోయిన నెపోటిజమ్ వల్లనే సుశాంత్ బలయ్యాడంటూ సామాన్యులు సహా కంగనా రనౌత్, ప్రకాశ్‌రాజ్, అభినవ్ కశ్యప్ లాంటి పలువురు ప్రముఖులు బాహాటంగానే ఆరోపణలు చేశారు. -
ఖుర్షీద్ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ సీఎం
శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఇటివల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. ఇటివల అలీగడ్ ముస్లిం యూనివర్సిటీలో సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ చేతులకు ముస్లింల రక్తపు మరకలు’ అని చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఈ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీల నేతలు గమనించాలని, ఇకనైన కనువిప్పు కలగాలని ఆయన కోరారు. ‘ఖుర్షీద్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా.. ఇలాంటి పరిస్థితిని తిరిగి రానివ్వకూడదు. గతంలో చేసిన తప్పుల్ని నేతలు మళ్లీ జరగకుండా చుసుకోవాలి. రాజకీయ నాయకత్వం, రాజకీయ పక్షపాతాన్ని పక్కనపెట్టి, కశ్మీర్‌కు జరిగిన అన్యాయాన్ని, కశ్మీర్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలి. ఇంత వరకూ చేసిన తప్పుల్ని ఒప్పుకుని ప్రజలను క్షమాపణలు కోరాలి ’ అని అన్నారు. దేశంలోని ముస్లింలు నిస్వార్థంతో పనిచేస్తున్నారు. వారికి శాంతి, సామరస్యం తప్ప మరొకటి తెలియదని ఫరూక్ అన్నారు. ముస్లింల గతమంతా అన్యాయం, అసమానత్వం, దురభిప్రాయం వంటి అంశాలతోనే ముడిపడి ఉంది. ప్రస్తుతం ముస్లింలు గౌరవంగా బతుకుతున్నారని అబ్దుల్లా పేర్కొన్నారు. -
అది వారి అభిప్రాయం!
దుబాయ్: టి20 ఫార్మాట్ నుంచి తాను తప్పుకోవాలంటూ పలువురు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు చేస్తున్న విమర్శలపై మహేంద్ర సింగ్ ధోని తొలిసారి స్వయంగా స్పందించాడు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా స్పష్టతనిచ్చాడు. ‘ప్రతీ ఒక్కరికీ జీవితంలో తమదైన సొంత అభిప్రాయాలు ఉంటాయి. వాటిని మనం గౌరవించాలి. భారత జట్టులో భాగం కావడమే అన్నింటికంటే ఎక్కువగా స్ఫూర్తినిచ్చే అంశం. సహజ ప్రతిభ లేని చాలా మంది క్రికెటర్లు ఎంతో సాధించడం కూడా మనం చూశాం. కేవలం ఆటపై ఉన్న పిచ్చి ప్రేమే దానికి కారణం. ప్రతీ ఒక్కరికి దేశం తరఫున ఆడే అవకాశం రాదు’ అని ధోని వ్యాఖ్యానించాడు. శనివారం ఇక్కడ ధోని తన సొంత అకాడమీ ప్రారంభించిన అనంతరం పలు అంశాలపై మాట్లాడాడు. ఫలితాలకంటే ప్రక్రియపైనే ఎక్కువగా నమ్మకం ఉంచే తాను... ఫలితాలు తనకు వ్యతిరేకంగా వస్తే ఏం జరుగుతుందని తానెప్పుడూ భయపడలేదని చెప్పాడు. తన ట్రేడ్‌మార్క్ ‘హెలికాప్టర్’ షాట్‌ను నేర్చుకోమని ఈతరం కుర్రాళ్లకు ఎప్పుడూ చెప్పనని ధోని అన్నాడు. ‘రోడ్లపై టెన్నిస్‌బాల్ క్రికెట్ ఆడేటప్పుడు నేను ఆ షాట్‌ను నేర్చుకున్నాను. అది చాలా కష్టమైన షాట్. టెన్నిస్ బంతితో అయితే బ్యాట్‌పై ఎక్కడా తగిలినా అది దూరం వెళుతుంది కానీ సాధారణ క్రికెట్లో మాత్రం బ్యాట్ మధ్యలోనే బంతి తగలాలి. ఈ షాట్ ఆడే సమయంలో గాయాలపాలు అయ్యేందుకు చాలా అవకాశం ఉంటుంది కాబట్టి నేనెప్పుడూ అది నేర్పించను’ అని ధోని స్పష్టం చేశాడు. పాండ్యాకు అప్పుడే విశ్రాంతా: గంగూలీ కోల్‌కతా: శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందుగా ఎంపిక చేసి ఆ తర్వాత ‘విశ్రాంతి’ పేరుతో హార్దిక్ పాండ్యాను తప్పించడంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఘాటుగా స్పందించారు. ‘నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది. అతను గాయంతో ఉన్నాడా అనే విషయం నాకైతే తెలీదు. పాండ్యా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. ఇది విరామం లేకుండా ఆడాల్సిన వయసు. కాబట్టి సరైన కారణం కూడా తెలీదు’ అని గంగూలీ అభిప్రాయపడ్డారు. మరోవైపు వన్డేలతో పోలిస్తే టి20ల్లో ధోని తడబడుతున్నాడనే విషయం అర్థమవుతోందని గంగూలీ అన్నారు. ఈ విషయంపై కోహ్లి, టీమ్ మేనేజ్మెంట్ ధోనితో విడిగా మాట్లాడాలి అని సౌరవ్ సూచించారు. -
కోర్టు తీర్పును గౌరవించాలి
-
మతాల కంటే కూడా రాజ్యాంగమే ఎక్కువ
-
ఇది కావాలనే చేశారు..!
మిస్ యూనివర్స్ గందరగోళం ఇంకా సర్దుమణగలేదు. గత ఆదివారం వెల్లడించిన మిస్ యూనివర్స్ పోటీ విజేతల ప్రకటనలో తప్పు దొర్లడం పెద్ద దుమారమే రేపింది. కార్యక్రమం నిర్వాహకుడు స్టీవ్ హార్వే విజేతల పేర్లు మార్చి ప్రకటించడం వెంటనే మళ్ళీ పేరు మార్చి సారీ చెప్పడం కొలంబియా ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. ఇది కావాలనే చేశారని మండిపడుతున్నారు. 2015 మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఫిలిప్పైన్స్ కు చెందిన పియా అలోంజ్ దక్కించుకుంది. గత సంవత్సరం విజేత... కొలంబియా సుందరి పౌలినా వెగాపియా.. అలోంజ్ కు కిరీటం అలంకరించారు. అయితే రెండవస్థానంలో నిలిచిన కొలంబియా సుందరి అరియాడ్నా మాత్రం మొదట తానే విజేత అని చెప్పి... తిరిగి మాట మార్చారని ఎంతో అసహనం వ్యక్తం చేస్తోంది. దీని వెనుక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తోంది. మరోవైపు ఇదే విషయంపై తాజాగా మిస్ జర్మనీ సారా లోరైన్ రెక్ కూడ విమర్శలు గుప్పించింది. ఓ వీడియో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మిస్ యూనివర్స్ ఫలితాలు... పోటీల్లో పాల్గొన్న వారెవరికీ సక్రమంగా అనిపించలేదని చెప్పింది. మిస్ ఫిలిప్పైన్స్ విజేత కావాలని తామెవ్వరూ కోరుకోలేదని అంది. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో మిస్ జర్మనీ లోరైన్ రెక్.. '' నేను నిజంగా ఇది నమ్మలేకపోయాను. ఎంతో బాధపడ్డాను. చెప్పాలంటే.. మిస్ ఫ్రాన్స్ రియల్ విన్నర్'' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. మిస్ యూనివర్స్ పోటీల్లోని చివరి దశలో అమెరికా, ఫిలిప్పైన్స్, కొలంబియా దేశాల యువతులు నిలిచారు. అయితే మిస్ ఫిలిప్పైన్స్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకోగా... నిర్వాహకుడు పొరపాటున మిస్ కొలంబియాను ప్రకటించడం సర్వత్రా విమర్శలు చోటు చేసుకున్నాయి. పొరపాటును గమనించిన క్షణాల్లోనే తిరిగి మిస్ ఫిలిప్పైన్స్ ను విజేతగా ప్రకటించారు. దీంతో ఎలాగైతేనేం తమకు న్యాయం జరిగిందని ఫిలిప్పైన్స్ ప్రజలు సంతోషపడుతుంటే.. కొలంబియన్లు మాత్రం దీన్ని తీవ్ర తప్పిదంగా భావిస్తున్నారు. దీనికి తోడు ఇతర పోటీ దారులు కూడ తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
పవన్ మాట్లాడిన విధానంలో తప్పులేదు