న్యూఢిల్లీ: దేశమంతా ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ ధాటికి గజగడలాడుతుంటే థర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఈ క్రమంలో సింగపూర్ లో విజృంభిస్తున్న కొవిడ్-19 కొత్త వేరియంట్ భారతదేశం థర్ఢ్ వేవ్ కు కారణం కావచ్చని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ట్వీట్‌పై సింగపూర్ విదేశాంగ మంత్రి వివిన్ బాలకృష్టన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగపూర్ వేరియంట్ అనేది లేదు
క్రేజీవాల్ ట్వీట్‌పై స్పందించిన సింగపూర్ విదేశాంగ మంత్రి వివిన్ బాలకృష్టన్ బదులుగా ట్వీట్ చేస్తూ.. ‘రాజకీయ నేతలు వాస్తవాలకు కట్టుబడి ఉండాలి. ‘సింగపూర్ వేరియంట్’ అనేదేమీ లేదని పేర్కొన్నారు. ఇలా మాట్లాడటం తగదని ఢీల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్‌కు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించడం తెలిసిందే. కాగా.. సింగపూర్ లో చిన్నారుల్లో వ్యాపిస్తున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ పట్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేస్తూ.. సింగపూర్ లో కొవిడ్-19 కొత్త వేరియంట్‌ను కనిపెట్టారని అది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ వైరస్ పిల్లలకు చాలా ప్రమాదకరమని, సింగపూర్‌తో విమాన సేవలను తక్షణమే నిలిపివేయాలని, పిల్లల టీకా డ్రైవ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు.
చదవండి: Delhi: చేతులపై మోసుకెళ్లి..బామ్మకు కరోనా టీకా
Politicians should stick to facts!
— Vivian Balakrishnan (@VivianBala) May 19, 2021
There is no “Singapore variant”. https://t.co/SNJaF7wkwC https://t.co/pNgw4bkV4H
Comments
Please login to add a commentAdd a comment