Singapore
-
ఇంట్లో సాఫ్ట్ వేర్ కొలువు..పొలంలో ప్రకృతి సేద్యం
ఇంటి దగ్గరి నుంచే విదేశీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తూనే 8.5 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు సాగు చేస్తూ చక్కని ఫలితాలు సాధిస్తున్నారు కర్నూలుకు చెందిన యు. బాల భాస్కర శర్మ. ఎంటెక్ చదివి సింగపూర్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నత స్థాయిలో డైరెక్టర్ స్థాయికి ఎదిగిన ఆయన కరోనా సమయంలో కర్నూలుకు వచ్చారు. ఇప్పటికీ అదే హోదాలో ఇంటి నుంచే ఉద్యోగం చేస్తూనే నిబద్ధతతో కూడిన ప్రకృతి వ్యవసాయం లో అద్భుతంగా రాణిస్తున్నారు. సొంత స్టోర్ నిర్వహించటంతో పాటు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అమ్మకాలతో పాటు కలెక్టరేట్లో ప్రతి సోమవారం కూరగాయలు విక్రయిస్తూ అందరి చేతా ఔరా అనిపిస్తున్నారు.సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూనే ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న బాల భాస్కర శర్మ కృషి ప్రశంసనీయం. కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకల్లు గ్రామం వద్ద‡వారసత్వంగా సంక్రమించిన 8.5 ఎకరాల భూమిలో అంబా గో ఆధారిత వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసి ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. 75 సెంట్లలో పాలీహౌస్ ఏర్పాటు చేసుకొని అందులో అనేక కొత్త పంటలు పండిస్తున్నారు. పెనుగాలులు, భారీ వర్షాలకు దెబ్బతింటున్నందున సాధారణంగా ఉద్యాన శాఖ పాలీహౌస్‌లను ప్రోత్సహించటం లేదు. అయితే, శర్మ తన పొలం చుట్టూ గాలులను తట్టుకునేలా నేరేడు, రేగు తదితర పండ్ల చెట్లు పెంచి, మధ్యలో పాలీహౌస్ నిర్మించి, సమర్థవంతంగా నిర్వహించటం విశేషం. జిల్లాకు పరిచయమే లేని వెల్లుల్లి, బ్రకోలి తదితర అనేక రకాల కూరగాయలను పాలీహౌస్లో సాగు చేస్తున్నారు. బ్రకోలిని కిలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. పాలిహౌస్‌లో వంగ, బీర, టొమాటో, పచ్చి మిరప, కాళీఫ్లవర్, క్యాబేజీ, ఎర్ర క్యాబేజి, ముల్లంగి, బీట్రూట్, క్యారెట్, బీన్స్, చిక్కుడు, కాకర, క్యాప్సికం, ఎర్రబెండ, సొర, పొట్ల, తంబకాయ, బుడం కాయ, కీరదోసతో పాటు.. ఎర్రతోట కూర, కొత్తిమీర, పుదీన, గోంగూర, తోటకూర, పాలకూర, బచ్చలి, చుక్కకూర, మెంతికూర వంటి 35 పంటలు సాగు చేస్తున్నారు. ఎతై ్తన బోదెలు ఏర్పాటు చేసుకొని మల్చింగ్, వీడ్ మ్యాట్ వేసి మొక్కలు నాటుకున్నారు. ఆరుబయట పొలాల్లో 3 నెలలు దిగుబడినిచ్చే కూరగాయలు పాలీహౌస్లో 5 నెలల వరకు దిగుబడినిస్తున్నాయి.పండ్ల చెట్లు.. ఫైనాపిల్ కూడా..7.75 ఎకరాల్లో చాలా రకాల పండ్ల చెట్లను పూర్తిగా ప్రకృతి సేద్య పద్ధతుల్లో శర్మ పెంచుతున్నారు. నిమ్మ 250, జామ 200, సీతాఫలం 200, మామిడి 40, అంజూర 100, నేరెడు 200, మునగ 200, అరటి 80 చెట్లతో పాటు కొన్ని సపోటా, కొబ్బరి, ఉసిరి, నేరెడు, రేగు, రామాఫలం చెట్లు పెంచుతున్నారు. రాయలసీమప్రాంతంలో ఇంతవరకూ లేని ఫైనాపిల్ మొక్కలను కూడా పెంచుతున్నారు. మధురై నుంచి ఎర్రబెండ సీడ్ తెప్పించి నాటుకున్నారు.ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్కెటింగ్కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు దగ్గర ఆర్గానిక్ స్టోర్ ఏర్పాటు చేయటంతో పాటు బాలబాస్కర శర్మ ఆన్లైన్ మార్కెటింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందించారు. తను పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో పాటు కెమికల్స్ లేకుండా ఆహార పంటలు పండిస్తున్న రైతుల నుంచి బియ్యం, పప్పులు, పసుపు తదితరాలను సేకరించి విక్రయిస్తున్నారు. 8 దేశీ ఆవులను పోషిస్తూ నాలుగు ట్యాంకుల ద్వారా ద్రవ జీవామృతం పంటలకు ఇస్తున్నారు. వర్మీ కంపోస్టుతో పాటు రోజుకు 40 లీటర్ల వర్మీవాష్ కూడా ఉత్పత్తి చేసి డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. చీడపీడల నివారణకు అవసరాన్ని బట్టి కషాయాలు, వేపనూనె తదితరాలను వాడుతున్నారు. సోలార్ ట్రాప్స్, తెలుపు, పసుపు జిగురు అట్టలను ఏర్పాటు చేశారు. పండ్ల తోటలకు నష్టం కలిగించే పండు ఈగ ట్రాప్‌కు ఏర్పాటు చేశారు. అన్ని పంటలకు డ్రిప్ సదుపాయం కల్పించారు.రసాయనాల్లేకుండా పండించిన పంట కావడం వల్ల కూరగాయలు, ఆకు కూరలకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. శర్మ కృషిని గుర్తించిన కర్నూలు జిల్లా యంత్రాంగం.. ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రతి సోమవారం ప్రత్యేకంగా కెమికల్స్ లేకుండా పండించిన కూరగాయలు విక్రయించేందుకు అవకాశం ఇచ్చిప్రోత్సహిస్తుండటం విశేషం. ఇంటి దగ్గరి నుంచే విదేశీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తూనే 8.5 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు సాగు చేస్తూ చక్కని ఫలితాలు సాధిస్తున్నారు కర్నూలుకు చెందిన యు. బాల భాస్కర శర్మ. ఎంటెక్ చదివి సింగపూర్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నత స్థాయిలో డైరెక్టర్ స్థాయికి ఎదిగిన ఆయన కరోనా సమయంలో కర్నూలుకు వచ్చారు. ఇప్పటికీ అదే హోదాలో ఇంటి నుంచే ఉద్యోగం చేస్తూనే నిబద్ధతతో కూడిన ప్రకృతి వ్యవసాయం లో అద్భుతంగా రాణిస్తున్నారు. సొంత స్టోర్ నిర్వహించటంతో పాటు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అమ్మకాలతో పాటు కలెక్టరేట్లో ప్రతి సోమవారం కూరగాయలు విక్రయిస్తూ అందరి చేతా ఔరా అనిపిస్తున్నారు.రసాయనాల్లేని ఆహారం అందిస్తున్నా..!సింగ్‌పూర్‌లో 2020 వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశా. కరోనా కారణంగా ఇంటికి వచ్చేశా. ఇంటి నుంచే సాఫ్ట్వేర్ ఉద్యోగం చే స్తూ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకున్నా. 8 ఆవులను పెంచుతూ పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. మా వ్యవసాయ క్షేత్రంలో కెమికల్స్ వాసన అనేది ఉండదు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో కూరగాయల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు జిల్లా కలెక్టర్ అవకాశం ఇచ్చారు. ప్రత్యేక స్టోర్‌తో పాటు వెబ్సైట్ ద్వారా కూడా విక్రయిస్తున్నాం. రసాయనిక అవశేషాలు లేని నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు తదితర ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తున్నామనే సంతోషం ఉంది. ఎర్ర బెండకాయకు మంచి ఆదరణ ఉంది. పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎర్ర బెండకాయను ప్రజలు ఇష్టంగా తీసుకుంటున్నారు.– యు. బాల భాస్కర శర్మ (62817 00553), సాఫ్ట్వేర్ ఇంజనీర్ కమ్ ప్రకృతి రైతు, కర్నూలు– గవిని శ్రీనివాసులు, సాక్షి కర్నూలు (అగ్రికల్చర్) -
హోం.. స్వీట్ హోం.. భర్తతో సింగపూర్‌లో పీవీ సింధు (ఫొటోలు)
-
రాజధానిలో కొత్త ఐటీ పార్క్
సాక్షి, హైదరాబాద్: సింగపూర్‌కు చెందిన క్యాపిట ల్యాండ్ రియల్ ఎస్టేట్ సంస్థ హైదరాబాద్‌లో రూ.450 కోట్లతో అత్యాధునిక ఐటీ పార్కు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఐటీ పార్క్‌ను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఆదివారం క్యాపిటల్యాండ్ ప్రతినిధి బృందంతో నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, క్యాపిటల్యాండ్ సంస్థ పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. క్యాపిటల్యాండ్ కొత్త ఐటీ పార్కు హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. బ్లూచిప్ కంపెనీలు కోరుకునే ప్రీమియం సదుపాయాలు, గ్లోబల్ కేపబులిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేలా అన్ని సౌకర్యాలను ఈ ఐటీ పార్కులో అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్ సారథ్యంలో హైదరాబాద్ సుస్థిరంగా వృద్ధి చెందుతోందని, అక్కడ తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించటం ఆనందంగా ఉందని క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ మేనేజ్మెంట్ సీఈవో గౌరీ శంకర్ నాగభూషణం పేర్కొన్నారు.ఇప్పటికే పలు పెట్టుబడులు..క్యాపిటల్యాండ్ సంస్థ ఇప్పటికే హైదరాబాద్‌లో అంతర్జాతీయ టెక్ పార్క్ (ఐటీపీహెచ్), అవాన్స్ హైదరాబాద్, సైబర్ పెర్ల్ పార్కులను చేపట్టింది. గతంలో ఈ సంస్థ ప్రకటించిన 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్ ఈ ఏడాది మధ్యలో అందుబాటులోకి రానుంది. ఐటీపీహెచ్ రెండో దశ కూడా ఈ ఏడాది ప్రారంభమై 2028 నాటికి పూర్తి కానుంది. సింగపూర్‌లో జరిగిన ఈ చర్చల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, రాష్ట్ర ఉన్నతాదికారులు, క్యాపిటల్యాండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ కియాతానీ పాల్గొన్నారు.మెరీనా బేలో సీఎం పడవ ప్రయాణంసీఎం రేవంత్‌రెడ్డి సింగపూర్‌లోని మెరీనా బేలో ఫెర్రీ ప్రయాణం చేశారు. మెరీనా బే తీరంలో నిర్మించిన ఆకాశహర్మ్యాలను తిలకించి, వాటి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ పర్యాటకాభివృద్ధికి చేపట్టిన చర్యలను పరిశీలించారు.ముగిసిన సింగపూర్ పర్యటనసీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు రోజుల సింగపూర్ పర్యటన ముగిసింది. సీఎం, మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు అక్కడి నుంచి ఆదివారం రాత్రి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయలుదేరారు. సోమవారం దావోస్‌కు చేరుకుంటారు. అక్కడ నాలుగు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొంటారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా పరిచయం చేసే లక్ష్యంతో దావోస్‌కు వెళుతున్నట్టు రాష్ట్ర ప్రతినిధి బృందం పేర్కొంది. ఇక సింగపూర్‌లో తమ పర్యటన విజయవంతమైందని తెలిపింది. సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ)తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన కుదుర్చుకోవటం కీలక పరిణామం అని అధికార వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో రూ.3,500 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలీ మీడియా ఒప్పందం, రూ.450 కోట్లతో భారీ ఐటీ పార్కు ఏర్పాటుకు క్యాపిటల్ ల్యాండ్ ఒప్పందం కీలక అంశాలని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలు, పెట్టుబడుల అవకాశాలపై సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్‌తో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని చెబుతున్నాయి.చివరి రోజు వరుస సమావేశాలుసింగపూర్ పర్యటనలో ఆదివారం సీఎం బృందం వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఇండియన్ ఓషన్ గ్రూప్ ఫౌండర్, సీఈవో ప్రదీప్‌తో బిశ్వాస్, డీబీఎస్ కంట్రీ హెడ్ లిమ్ హిమ్ చౌన్, డీబీఎస్ గ్రూప్ హెడ్ అమిత్ శర్మ, బ్లాక్ స్టోన్ సింగపూర్ సీనియర్ ఎండీ, చైర్మన్ గౌతమ్ బెనర్జీ, బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎండీ పెంగ్ వీ టాన్, మెయిన్ హార్డ్ గ్రూప్ సీఈవో ఒమర్ షాజాద్‌తో భేటీ అయింది. హైదరాబాద్‌లో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ విధానాలను వివరించింది. -
డేటా సెంటర్లకు రాజధాని: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ త్వరలోనే డేటా సెంటర్లకు రాజధానిగా అవతరిస్తుందని, సింగపూర్‌కు చెందిన ఎస్టీ టెలి మీడియా భారీ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకురావడం దీనిని చాటి చెబుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు, ప్రపంచస్థాయి అనుకూలతలు ఉన్నాయని చెప్పారు. సింగపూర్ పర్యటనలో భాగంగా రెండో రోజు శనివారం సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఎస్టీ టెలి మీడియా కేంద్ర కార్యాలయాన్ని సందర్శించింది. ఆ కంపెనీ ప్రతినిధులతో చర్చించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో రూ.3,500 కోట్ల పెట్టుబడితో ‘గ్లోబల్ డేటా సెంటర్’ ఏర్పాటుకు ఎస్టీ టెలి మీడియా ముందుకొచ్చింది. ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్పేటలో ఏఐ ఆధారిత అత్యాధునిక డేటా సెంటర్ క్యాంపస్ స్థాపించేందుకు అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఒప్పంద పత్రాలపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమల శాఖ ముఖ్య కార్య దర్శి జయేశ్ రంజన్, ఎస్టీటీ గ్రూప్ ప్రెసిడెంట్, సీఈఓ బ్రూనో లోపెజ్ సంతకాలు చేశారు. భారతదేశంలోని అతిపెద్ద డేటా సెంటర్లలో ఒకటిగా నిలిచే ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ తెలంగాణలో ఏర్పాటు కానుండటం... ఇక్కడి మౌలిక సదుపాయాలు, ప్రపంచస్థాయి అనుకూలతలను చాటి చెప్తుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత రంగాల్లో వస్తున్న మార్పుల్లో హైదరాబాద్ కీలకపాత్ర పోషిస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ఇక తెలంగాణలో మౌలిక వసతులు, ప్రభుత్వ ప్రగతిశీల విధానాలు ఆవిష్కరణలను ప్రోత్సహించేలా ఉన్నాయని ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ ప్రెసిడెంట్, సీఈవో బ్రూనో లోపెజ్ ప్రశంసించారు. భారీగా విస్తరణ దిశగా.. ఇప్పటికే హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో డేటా సెంటర్‌ను నిర్వహిస్తున్న ఎస్టీ టెలీమీడియా కొత్త క్యాంపస్ ఏర్పాటుతో తమ కార్యకలాపాలను విస్తరించనుంది. వంద మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటయ్యే కొత్త క్యాంపస్ సామర్థ్యాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పెంచనుంది. వచ్చే పదేళ్లలో భారత్‌లో తమ డేటా సెంటర్లను ఒక గిగావాట్ సామర్థ్యానికి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా వచ్చే పదేళ్లలో ఎస్టీ టెలీమీడియా సుమారు 3.2 బిలియన్ డాలర్లను (సుమారు రూ.27 వేల కోట్లు) పెట్టుబడిగా పెడుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు: సీఎం రేవంత్ సింగపూర్ వాణిజ్య, పర్యావరణ మంత్రి గ్రేస్ ఫు హెయిన్తో సీఎం నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం భేటీ అయింది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సింగపూర్ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. నగరాలు, పట్టణాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, నీటి వనరుల నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీ కండక్టర్ల తయారీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో.. తెలంగాణ, సింగపూర్ ప్రభుత్వాలు కలసి పనిచేసేందుకు ఉన్న అనుకూలతలను సీఎం రేవంత్ వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీనిపై సింగపూర్ మంత్రి గ్రేస్ ఫు హెయిన్ స్పందిస్తూ.. వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యంపై అందిన ఆహ్వానాన్ని పరిశీలిస్తామని, తెలంగాణకు తగిన సహకారం అందిస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, నీటి వనరుల నిర్వహణ, సుస్థిరాభివృద్ధి ప్రణాళికలపై ఆసక్తి చూపడంతోపాటు పలు ప్రాజెక్టుల్లో పరస్పరం కలసి పనిచేసేందుకు అంగీకరించారు. ఈ సందర్భంగా ఉమ్మడిగా చేపట్టాల్సిన ప్రాజెక్టులు, వాటిపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు, వివిధ రంగాల్లో సింగపూర్ అనుభవాలను పంచుకోవడంపై చర్చించారు. సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడికి సింగపూర్ ఆసక్తి సింగపూర్ పర్యటనలో భాగంగా శనివారం సింగపూర్ సెమీకండక్టర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (ఎస్ఎస్ఐఏ)తో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. తెలంగాణలో సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడికి అనుకూల వాతావరణం ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పెట్టుబడిదారులకు అందించే సహకారం, ప్రోత్సాహకాలు, ఇతర అనుకూలతలను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ కీలక కేంద్రంగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంపై సానుకూలంగా స్పందించిన ఎస్ఎస్ఐఏ ప్రతినిధులు... సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడులపై ఆసక్తి చూపారు. ఈ ఏడాది చివరిలో తమ ప్రతినిధుల బృందం హైదరాబాద్‌ను సందర్శిస్తుందని ప్రకటించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్ఎస్ఐఏ చైర్మన్ బ్రియాన్ టాన్, వైస్ చైర్మన్ టాన్ యూ కాంగ్, సెక్రటరీ సీఎస్ చుహ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడికి ఉన్న అవకాశాలు, ఆధునిక మౌలిక వసతులు, విధానాలు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆకర్షించాయని ఈ భేటీ అనంతరం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
‘సింగపూర్’ స్కిల్స్
ఒప్పందంతో లాభం ఇలా..⇒ ఐటీఈ పాఠాలను స్కిల్స్ వర్సిటీలో బోధిస్తారు. ⇒ టెన్త్ విద్యార్థులు మొదలుకుని చదువు పూర్తి చేసిన యువత, ఆసక్తి ఉన్న ఏ వయసు వారికైనా పరిశ్రమలు, ఐటీ సంస్థల సహకారంతో ఉద్యోగ నైపుణ్యాలపై సింగపూర్ సంస్థ శిక్షణనిస్తుంది. ⇒ ‘స్కిల్స్ ఫర్ ఫ్యూచర్, స్కిల్స్ ఫర్ లైఫ్’అనే నినాదంతో పనిచేస్తున్న ఐటీఈకి 5 వేల పరిశ్రమలతో భాగస్వామ్య ఒప్పందాలు ఉండగా, ప్రస్తుతం 28 వేల మంది శిక్షణ పొందుతున్నారు. ⇒ ప్రస్తుత ఒప్పందంతో స్కిల్స్ వర్సిటీలో వంద ఫుల్ టైమ్ కోర్సులకు ఆన్‌లైన్‌తో పాటు క్యాంపస్ శిక్షణ దొరుకుతుంది. పరిశ్రమలకు అవసరమయ్యే నైపుణ్యాలకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. సాక్షి, హైదరాబాద్: విదేశీ పర్యటనలో భాగంగా సింగపూర్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి( Revanth Reddy) నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం కీలక ఒప్పందం చేసుకుంది. నైపుణ్య అభివృద్ధిలో పరస్పర సహకారం, శిక్షణకు సంబంధించి.. సింగపూర్ ప్రభుత్వ విద్యాసంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ), రాష్ట్రానికి చెందిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీల మధ్య ఈ పరస్పర అవగాహన (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా సింగపూర్ ఐటీఈ పాఠ్యాంశాలను స్కిల్స్ యూనివర్సిటీలో బోధించనున్నారు. శుక్రవారం సింగపూర్‌కు చేరుకున్న రేవంత్‌రెడ్డి( Revanth Reddy) నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్ టీమ్’కు అక్కడి ప్రవాస తెలంగాణ వాసులు స్వాగతం పలికారు. అనంతరం సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, స్కిల్స్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ వీఎల్విఎస్ఎస్ సుబ్బారావుతో కూడిన ప్రతినిధి బృందం ఐటీఈ ప్రాంగణాన్ని సందర్శించింది. కోర్సులు, సదుపాయాల పరిశీలన ఐటీఈ నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి కోర్సులు, అధునాతన సదుపాయాలను రాష్ట్ర బృందం పరిశీలించింది. అక్కడ శిక్షణ ఇస్తున్న సుమారు 20 రంగాలకు చెందిన నిపుణులు, సంస్థ సిబ్బందితో మాట్లాడారు. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రంలోని స్కిల్స్ యూనివర్సిటీకి సహకరించాలని ఐటీఈ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కోరారు. వర్సిటీ ద్వారా వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పిం చేందుకు మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా నిర్వహిస్తున్న కోర్సులను మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. చర్చల అనంతరం ఐటీఈ, స్కిల్స్ యూనివర్సిటీల మధ్య ఎంఓయూ కుదిరింది. ఒప్పంద పత్రాలపై స్కిల్స్ వర్సిటీ వీసీ సుబ్బారావు, ఐటీఈ అకడమిక్, అడ్మిన్ సర్విసెస్ డిప్యూటీ డైరెక్టర్ పర్వేందర్ సింగ్, ఐటీ ఎడ్యుకేషన్ సర్విసెస్ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ సంతకాలు చేశారు. సింగపూర్ విదేశాంగ మంత్రితో భేటీ ఐటీఈతో భాగస్వామ్యం.. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పునరుత్పాదక వనరులు, పర్యాటకం, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక రంగాల్లో దీర్ఘకాలిక సహకారానికి మార్గం సుగమం చేస్తుందని సీఎం రేవంత్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా ఐటీఈ ప్రతినిధి బృందం త్వరలో హైదరాబాద్‌ను సందర్శిస్తుందని అధికారులు ప్రకటించారు. పర్యటనలో భాగంగా సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి( Revanth Reddy), మంత్రి శ్రీధర్‌బాబు బృందం భేటీ అయ్యింది. -
పాస్‌పోర్ట్‌లో.. సింగపూర్ ‘బాద్షా’
సాక్షి, హైదరాబాద్ : విదేశీ పర్యటనలు, దేశ పౌరులుగా గుర్తింపు విషయంలో పాస్‌పోర్ట్ అనేది కీలక డాక్యుమెంట్‌గా నిలుస్తోంది. దేశ సరిహద్దుల్లో ఐడెంటీ, వలసదారులను రెగ్యులేట్ చేయడంలోనూ ఇది ముఖ్యమైన పత్రంగా మారిన విషయం తెలిసిందే. విదేశాలకు విద్య, వైద్యం, పర్యాటకం, తీర్థయాత్రలు, వ్యాపారం, ఇతర అవసరాల నిమిత్తం వెళ్లేందుకు, మళ్లీ స్వదేశాలకు తిరుగు ప్రయాణం అయ్యేందుకు పాస్‌పోర్ట్ కలిగి ఉండడం తప్పనిసరి. వివిధ అధికారిక లేక వ్యక్తిగత, కుటుంబపరమైన విధులు, అవసరాలకు కూడా ఇది అధికారిక గుర్తింపుగా ఉపయోగపడుతోంది. మొత్తంగా చూస్తే పాస్‌పోర్ట్ అనేది ‘టికెట్ టు ద వరల్డ్’గా పరిగణిస్తున్నారు. సింగపూర్ అనే చిన్నదేశం ప్రపంచస్థాయిలో పాస్‌పోర్ట్‌ల గుర్తింపు, వాటి విలువ విషయంలో ‘బాద్షా’గా నిలుస్తోంది. ఈ దేశ పాస్‌పోర్ట్ కలిగి ఉంటే వీసా లేకుండానే 195 దేశాలు సందర్శించే అవకాశం లభిస్తుంది. ఈ గుర్తింపు కారణంగా సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. గత ఐదేళ్లుగా సింగపూర్ ప్రథమ స్థానంలో కొనసాగుతుండడం ఓ విశేషం. » పాస్‌పోర్ట్‌ల విలువ, గుర్తింపు విషయంలో ఆ తర్వాతి స్థానంలో జపాన్ నిలుస్తోంది. ఈ దేశ పాస్ట్‌పోర్ట్ ఉంటే 193 దేశాల్లో వీసా లేకుండానే పర్యటించే వీలుంది. »ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఫిన్లాండ్, దక్షిణకొరియాల పాస్ట్‌పోర్ట్ హోల్డర్లు వీసా లేకుండానే 192 దేశాలు సందర్శించొచ్చు. » ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, లగ్జ మ్బర్గ్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే దేశాల పాస్‌పోర్ట్‌లు కలిగిన వారు వీసా అవసరం లేకుండానే 191 దేశాల్లో పర్యటించొచ్చు. » బెల్జియం, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, యూకే వంటి దేశాల పాస్‌పోర్ట్ హోల్డర్లకు 190 దేశాలకు వీసా లేకుండా వెళ్లేందుకు అనుమతి ఉంది. ‘హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్’ఇలా... ఒకదేశ పౌరుడు స్వేచ్ఛగా ఇతర దేశాల్లో విహరించడం ఆధారంగా... ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలకు సంబంధించి జాబితాను ‘హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్’విడుదల చేస్తోంది. ఇతర దేశాల పర్యటనలకు వెళ్లినప్పుడు...అక్కడకు చేరుకునేలోగా వీసా అవసరం లేకుండా వెళ్లగలిగే అవకాశం ప్రాతిపదికన వివిధ దేశాలకు చెందిన పాస్‌పోర్ట్‌లకు ఈ ఇండెక్స్ ద్వారా ర్యాంకింగ్‌లు ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల పౌరులు జరుపుతున్న పర్యటనలకు సంబంధించి ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఐఏటీఏ) సమకూర్చిన సమాచారం, వివరాలు, గణాంకాల ఆధారంగా ర్యాంకింగ్‌లను ఈ సంస్థ నిర్థారిస్తోంది. వివిధ అంశాలతోపాటు, ఫలానా దేశ పాస్‌పోర్ట్ కలిగి ఉన్న పౌరుడు వీసా లేకుండానే ఏఏ దేశాలకు వెళ్లగలుగుతారు,ఆయా దేశాలతో ఈ పౌరుడి దేశానికున్న దౌత్యపరమైన సంబంధాలు, ఏ మేరకు అంతర్జాతీయ ఒప్పందాలు కలిగి ఉన్నాయనే దాని ప్రాతిపదికన సమగ్ర విధానాన్ని పాటించి పాస్‌పోర్ట్ ర్యాంకింగ్‌లను సిద్ధం చేస్తున్నారు. మరింత దిగజారిన భారత్ ర్యాంకింగ్ హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్–2025 నివేదికను బట్టి చూస్తే...భారత్ ర్యాంకింగ్ మరో 5 ర్యాంకులు దిగజారి 85వ ర్యాంక్ (2024లో 80వ ర్యాంక్) వద్ద నిలిచింది. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్ 103 స్థానంలో, బంగ్లాదేశ్ 100వ స్థానంలో ఉన్నాయి. అదే 2021లో ఇండియా 90వ ర్యాంక్ సాధించి మరింత అడుగున నిలిచింది. ఇదిలా ఉంటే 2006 భారత్ 71వ ర్యాంక్‌లో నిలిచి ఒకింత సత్తా చాటింది. రంగుల వారీగా చూస్తే... మొత్తంగా 84 దేశాలు నీలంరంగు (బ్లూరంగు షేడ్స్) పాస్‌పోర్ట్‌లతో అత్యధిక రంగులు ఉపయోగిస్తున్న దేశాలుగా ప్రథమస్థానంలో నిలిచాయి. 68 దేశాలు ఎరుపురంగు కలిగిన పాస్‌పోర్ట్‌లు కలిగి ఉంటే..40 దేశాల పాస్‌పోర్ట్‌లు ఆకుపచ్చ వర్ణంలో ఉన్నాయి. కేవలం ఏడు దేశాల పాస్ట్పోర్ట్లే నలుపు (బ్లాక్) రంగులో ఉండడం కొసమెరుపు. -
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దాదాపు 300 మంది పైగా భక్తులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, సంప్రదాయ భజనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంగణపతి, పూర్వాంగ పూజ , అయ్యప్ప స్వామి ఆవాహనంతో ప్రారంభమైంది. ఆ తరువాత సభ పాలక దేవత పూర్ణాంబికా సమేత శ్రీ ఆనందేశ్వరర్కు లఘున్యాసం, రుద్రాభిషేకం , రుద్రగణ పారాయణం జేశారు. తదనంతరం అయ్యప్ప స్వామికి సహస్రనామం, అష్టోత్ర అర్చన, చివరలో అయ్యప్పను కీర్తిస్తూ భజనలు చేశారు.ఈ కార్యక్రమములో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత విజయా మోహన్ తన బృందంతో తీర్చిదిద్దిన రంగవల్లి విశేషంగా ఆకట్టుకుంది. రంగవల్లిలో ఉపయోగించిన వివిధ రకాల రంగులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని దైవత్వాన్ని జోడించాయి.రాంకుమార్ బృందం నామసంకీర్తన భజనలు, కొంత మంది స్త్రీలు ప్రదర్శించిన కోలాట నాట్య ప్రదర్శన ప్రేక్షలకులను మంత్రముగ్ధుల్ని చేసింది. కార్యక్రమములో పాల్గొన్న భక్తులు ఎంతో తన్మయత్వంతో అయ్యప్పస్వామి భక్తి గీతాలను ఆలపించారు. సభా ట్రస్టీలలో ఒకరైన శంకర్ తాళాల (కంజీర) కళాకారుడిగా భజనలో పాల్గొనడం విశేషం.గత 40 సంవత్సరాలుగా ప్రత్యేక పాయసం తయారు చేయడంలో అనుభవంవున్న రత్నం గణేష్ నేతృత్వంలోని బృందం పాలు, బెల్లం , కొబ్బరి పాలతో పాయసం తయారు చేసారు. గత 6 దశాబ్దాలకుపైగా వారసత్వంగా ఈ పాయసం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో యువతరం చురుకుగా పాల్గొనడం అత్యంత విశేషం .ఉత్తరాంగ పూజానంతరం పడి పాట్టుతో 18 మెట్లపై దీపాలు వెలిగించారు. శబరిమలై లో రోజు ముగింపు పాటగా పాడే ప్రసిద్ధ హరివరాసనంతో కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా ఇటీవల ముగిసిన సభ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అతిరుద్రం కార్యక్రమం విజయవంతం కావడానికి విశేష కృషి చేసిన సభ స్వచ్చంద కార్యకర్తలు అయిన సురేష్ శ్రీనివాసన్, వి జయరామన్, శ్రీరామ్, ఎంవి సీతారామన్, నారాయణన్ కె జె, శివకుమార్ వెంకటసు బ్రమణియన్, శ్రీకాంత్ సోమసుందరం, సత్యనారాయణన్ గోపాలన్, గణేష్ రామన్, మణికందన్ బాలసుబ్రమణియన్, స్వామినాథన్ రమణి, నారాయణసామి వెంకటసుబ్రమణియన్, గణేష్ కుమార్ వి వి, రమేష్ ముకుంత్, సుజిత్ కుమార్ తదితరులను సభాధ్యక్షుడు ఘనంగా సత్కరించారు.SDBBS అధ్యక్షులు కార్తీక్, సెక్రటరీ ఆనంద్ చంద్రశేఖర్ , కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు మణికండన్ మాట్లాడుతూ కార్యక్రమము విజయవంతం కావడానికి విశేష కృషి చేసిన రాంకుమార్ బృందం, విజయా మోహన్ బృందం, కలై (AV వీడియో) తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కార్యక్రమానికి సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసారు. కార్యక్రమములో పాల్గొన్న భక్తులకు పెరుమాళ్ ఆలయం నుంచి తెచ్చిన ప్రసాదాన్ని వడ్డించడం విశేషం. -
ఆరోగ్య ఆసియా
సాక్షి, అమరావతి: ఆసియా దేశాల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. చిన్న దేశాల్లోనూ ఉత్తమ ఆహార అలవాట్లు, వ్యాయామ విధానాలతో ప్రజలు జీవన ప్రమాణాలను పెంచుకుంటున్నారు. ఎంతో అభివృద్ధి చెందినట్టు భావిస్తున్న అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గుతున్నట్టు గుర్తించారు. ప్రపంచంలోని 200 దేశాల్లో ఆహార అలవాట్లు, ఆరోగ్య శ్రద్ధపై చేసిన సర్వే నివేదిక ‘బ్లూమ్‌బర్గ్, గ్లోబల్ హెల్త్ ఇండెక్స్–2024’ను ఇటీవల విడుదల చేశారు. ఇందులో ప్రపంచంలో టాప్–3 హెల్త్ ర్యాంకులు ఆసియా దేశాలైన సింగపూర్, జపాన్, దక్షిణ కొరియావే. తొలి స్థానం సింగపూర్‌ది కాగా.. జపాన్, దక్షిణ కొరియా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగో స్థానంలో తైవాన్ ఉంది. భారత దేశం 112వ స్థానంలో నిలిచింది. బ్లూమ్‌బెర్గ్ గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ దేశ ప్రజల వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు, ప్రభుత్వాలు కల్పిస్తున్న సదుపాయాలను అన్ని కోణాల నుంచి అధ్యయనం చేయగా, గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ సంస్థ ప్రజల వ్యాధి నిరోధక శక్తి సామర్థ్యాలపై అధ్యయనం చేసింది. ఈ రెండు సంస్థలుసంయుక్తంగా గ్లోబల్ హెల్త్ ఇండెక్స్–2024 నివేదికను విడుదల చేశాయి.ఆరోగ్య ప్రగతికి ప్రత్యేక కొలమానం ఒక దేశ ఆరోగ్యాన్ని కొలవడానికి ప్రత్యేకంగా రూపొందించిన మెట్రిక్ విధానాన్ని బ్లూమ్‌బర్గ్ గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ వినియోగించింది. దేశ ప్రజల్లో పొగాకు వినియోగం, అధిక రక్తపోటు, ఊబకాయం, స్వచ్ఛమైన నీటి లభ్యత, సగటు ఆయుర్దాయం, పోషకాహార లోపం, మరణానికి కారణాలను ప్రామాణికంగా తీసుకుంది. తీవ్రమైన రోగాలు ప్రబలినప్పుడు ఆ దేశంలో చేపట్టే నివారణ చర్యలు, ప్రజల శ్రేయస్సు కోసం తీసుకునే విధానాలపై గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ నివేదిక రూపొందించింది.ఇందులో వ్యాధి నివారణ చర్యలు, అంతర్జాతీయ అంటు వ్యాధులను ముందస్తుగా గుర్తించి నిరోధించడం, వ్యా«ధులు వ్యాప్తి చెందకుండా వేగంగా చర్యలు చేపట్టడం (ర్యాపిడ్ రెస్పాన్స్), ఆ దేశ ఆరోగ్య వ్యవస్థ, అంతర్జాతీయ నిబంధనల అమలు వంటి అంశాల ఆధారంగా నివేదిక తయారు చేసింది. 2019 ర్యాంకింగ్ ప్రకారం స్పెయిన్ 92.75 స్కోరుతో ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన దేశంగా ఉండగా, అప్పట్లో 4వ స్థానంలో ఉన్న సింగపూర్ 2024లో 95.3 స్కోర్‌తో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. జపాన్ 95.1 స్కోరుతో రెండో స్థానంలో, 94.3 స్కోరుతో దక్షిణ కొరియా మూడో స్థానంలో నిలిచాయి.అభివృద్ధి చెందిన దేశాలు వెనుకే..అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకొంటున్న యునైటెడ్ కింగ్డమ్ (బ్రిటన్) 88.8 స్కోరుతో 34వ ర్యాంకులో ఉంది. అమెరికాది 2019లో 35వ ర్యాంక్ కాగా, ఇప్పుడు 69కు పడిపోయింది. ఇక మన పక్కనున్న పాకిస్తాన్ 61.3 స్కోరుతో 124వ ర్యాంకు, చైనా 46.3 స్కోరుతో 163వ ర్యాంక్ పొందాయి. భారతదేశం 61.5 స్కోరుతో 112వ ర్యాంకులో ఉంది. కాగా, కోవిడ్–19 మహమ్మారి కారణంగా 2021లో ప్రపంచంలోని అన్ని దేశాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయని, అయినప్పటికీ భవిష్యత్‌లో ఇలాంటి ఉపద్రవాలు ఎదురైతే మహమ్మారిని నిరోధించడానికి ఏ దేశమూ తగిన చర్యలు తీసుకోలేదని నివేదిక పేర్కొంది.ఆరోగ్యం, ఆయుర్దాయంలో సింగపూర్ టాప్ఆరోగ్యం, ఆయుర్దాయంలో సింగపూర్‌దే అగ్రస్థానమని నివేదిక తెలిపింది. అక్కడి ప్రభుత్వం ప్రత్యేక సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి, పెద్దలు, పిల్లల కోసం పలు రకాల ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొంది. ఈ దేశ జనాభాలో 14 శాతం మందే ధూమపానం చేస్తున్నట్టు గుర్తించింది. ప్రపంచంలో అత్యధిక ఆయుర్దాయం 84.8సంవత్సరాలతో సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. జపాన్ 84 సంవత్సరాలతో రెండో స్థానంలో ఉంది.ప్రస్తుతం స్పెయిన్ ప్రజల సగటు ఆయుర్దాయం 83.5 సంవత్సరాలు కాగా, ఇది 2040 నాటికి 85.8కి పెరిగి ప్రపంచంలోనే అత్యధిక ఆయుర్దాయం గల దేశంగా నిలుస్తుందని నివేదిక పేర్కొంది. ఇక్కడి ప్రజలు మాంసాహారం కంటే ఆరోగ్యకరమైన కొవ్వులు, చిక్కుళ్లు, పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకుంటారని, తక్కువ మొత్తంలో రెడ్ మీట్, ప్రాసెస్డ్ పదార్థాలు తింటున్నట్టు వివరించింది. ఐరోపాలోనే స్పెయిన్‌లో అత్యధిక శాతం వాకర్లు ఉన్నారని, ఇక్కడ 37 శాతం మంది ఉద్యోగాలకు నడిచే వెళతారని పేర్కొంది. అందుకు భిన్నంగా అమెరికాలో 6 శాతం మంది మాత్రమే పనికి నడిచివెళుతున్నట్టు పేర్కొంది. -
డీబీఎస్ బ్యాంక్ సీఈవోగా రజత్ వర్మ
సింగపూర్‌కు చెందిన డీబీఎస్ గ్రూప్ (DBS) తమ డీబీఎస్ బ్యాంక్ ఇండియా సీఈవోగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా రజత్ వర్మను నియమించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం మేరకు మార్చి 1 నుండి డీబీఎస్ బ్యాంక్ ఇండియా సీఈవోగా రజత్ వర్మ బాధ్యతలు స్వీకరిస్తారని డీబీఎస్ ప్రకటించింది.ప్రస్తుతం డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్ గ్రూప్ (IBG) హెడ్‌గా ఉన్న వర్మ, ఫిబ్రవరి 28న సురోజిత్ షోమ్ రిటైర్మెంట్ తర్వాత సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కొత్త పాత్రలో వర్మ డీబీఎస్ గ్రూప్ మేనేజ్మెంట్ కమిటీలో భాగం అవుతారు.రజత్ వర్మ గురించి.. అనుభవజ్ఞుడైన బ్యాంకర్ అయిన వర్మ లావాదేవీల బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు, స్థిరమైన ఫైనాన్స్, మైక్రో అండ్ ఎస్ఎంఈ (SME) బ్యాంకింగ్, అలాగే బ్రాంచ్ బ్యాంకింగ్‌తో సహా వినియోగదారు, కార్పొరేట్ బ్యాంకింగ్‌లో 27 సంవత్సరాల ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్నారు.2023 జూన్‌లో ఐబీజీ హెడ్‌గా డీబీఎస్‌లో చేరినప్పటి నుండి ఆయన అన్ని క్లయింట్ విభాగాలలో వ్యాపారాన్ని గణనీయంగా అభివృద్ధి చేశారు. ఇప్పటికే ఉన్న కార్పొరేట్ సంబంధాలను మరింతగా పెంచుకోవడం, కొత్త కస్టమర్ల సముపార్జనను వేగవంతం చేయడం, విస్తృతమైన వృద్ధి రంగాలలో కొత్త అవకాశాలను గుర్తించడం ద్వారా ఇది సాధ్యమైంది.రజత్ వర్మ నాయకత్వంలో డీబీఎస్ 2024లో గ్లోబల్ ఫైనాన్స్ నుంచి సస్టైనబుల్ ఫైనాన్స్ ఇండియా బెస్ట్ బ్యాంక్‌గా ఎంపికైంది. డీబీఎస్‌లో చేరడానికి ముందు ఆయన హెచ్ఎస్బీసీ (HSBC) ఇండియాలో మేనేజింగ్ డైరెక్టర్, కమర్షియల్ బ్యాంకింగ్ కంట్రీ హెడ్‌గా ఉన్నారు.“బ్యాంకింగ్ అనుభవజ్ఞుడైన రజత్ 18 నెలల క్రితం మాతో చేరినప్పటి నుండి మా ఇండియా ఐబీజీ వ్యాపారాన్ని పటిష్టం చేశారు. మా బలమైన ప్లాట్‌ఫామ్‌తో రాబోయే సంవత్సరాల్లో భారతదేశ వృద్ధిలో పాల్గొనడాన్ని డీబీఎస్ కొనసాగిస్తుంది. రజత్ వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తారని విశ్వసిస్తున్నాను’’ డీబీఎస్ సీఈవో పీయూష్ గుప్తా పేర్కొన్నారు.డీబీఎస్ గురించి..డీబీఎస్ అనేది 19 దేశాల్లొ ఉనికిని కలిగి ఉన్న ఆసియాలో ప్రముఖ ఆర్థిక సేవల సమూహం. సింగపూర్‌లో లిస్ట్ అయిన ఈ గ్రూప్ ప్రధాన కార్యాలయం అక్కడే ఉంది. 2024లో బాధ్యతాయుతమైన బ్యాంకింగ్‌పై దాని దృష్టికి అనుగుణంగా, గ్లోబల్ ఫైనాన్స్ ద్వారా డీబీఎస్ సస్టైనబుల్ ఫైనాన్స్‌లో భారతదేశానికి ఉత్తమ బ్యాంక్‌గా ఎంపికైంది. అంతే కాకుండా 2020 నుండి 2022 వరకు వరుసగా మూడు సంవత్సరాలు ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాంకుల ఫోర్బ్స్ జాబితాలో భారత్‌లోని మొదటి 3 స్థానాల్లో డీబీఎస్ బ్యాంక్ నిలిచింది.డీబీఎస్ బ్యాంక్ భారతదేశంలో 30 సంవత్సరాలుగా ఉనికిలో ఉంది. 1994లో ముంబైలో తన మొదటి కార్యాలయాన్ని ప్రారంభించింది. డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ భారతదేశంలోని అతిపెద్ద విదేశీ బ్యాంకులలో మొదటిది. దేశంలోని పెద్ద, మధ్యస్థ, చిన్న సంస్థలు, వ్యక్తిగత వినియోగదారులకు విస్తృత సేవలు అందిస్తోంది. 2020 నవంబర్‌లో లక్ష్మీ విలాస్ బ్యాంక్ డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్‌లో విలీనమైంది. డీబీఎస్ బ్యాంక్ ఇండియా ఇప్పుడు భారత్‌లోని 19 రాష్ట్రాల్లో సుమారు 500 శాఖల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. -
మహిళా క్యాషియర్‌పై దాడి, అనుచిత వ్యాఖ్యలు, ఎన్ఆర్ఐకు జైలు, జరిమానా
మహిళా క్యాషియర్‌పై అనుచితంగా ప్రవర్థించిన భారత సంతతికి చెందిన 27 ఏళ్ల వ్యక్తికి సింగపూర్ కోర్టు జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించింది. క్యూలో నిలబడమని చెప్పినందుకు సింగపూర్‌లోని ఒక కేఫ్‌లోని కేఫ్‌లోని క్యాషియర్‌పై (Cafe Cashier) దాడి చేశాడు. ఘటనలో భారత సంతతికి చెందిన రిషి డేవిడ్ రమేష్ నంద్వానీ (Rishi David Ramesh Nandwani ) దోషిగా తేలాడు. దీంతో సింగపూర్ కోర్ట్( Singapore Court ) నాలుగు వారాల జైలు శిక్షతో పాటు 4000 వేల సింగపూర్ డాలర్ల జరిమానా విధించింది.సింగపూర్‌లోని హాలండ్ విలేజ్‌లోని ప్రాజెక్ట్ అకాయ్ కేఫ్లొ అక్టోబర్ 31న ఈ ఘటన జరిగింది. కేఫేలో ఫుడ్ ఆర్డర్ చేయడానికి వచ్చాడు రిషి. దాదాపు మధ్యాహ్నం 12:20 గంటల సమయంలో అక్కడంతా పిల్లలతో సహా కస్టమర్లు కిక్కిరిసి ఉన్నారు. ఈ సమయంలో క్యూలో తప్పుగా నిలబడటం గమనించిన మహిళా క్యాషియర్, రిషీని వెనక్కి వెళ్లమని సూచించింది. దీంతో అతను వెళ్లలేదు సరికదా అసహనంతో రెచ్చిపోయాడు. ఆ దేశం, అక్కడి ప్రజల గురించి అభ్యంతరకరంగా వ్యాఖానించాడు. ఆమెపై దుర్భాషలాడాడుతూ, అసభ్యమైన పదజాలంతో దూషించాడు. ఆవేశంతో కౌంటర్లో ఉన్న టిప్ బాక్స్ తీసుకుని ఆమెపైకి విసిరాడు. దీంతో ఆమె పైఅధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రెండుగంటల్లోనే రిషిని అరెస్టు చేశారు. విచారణ అనంతరం రిషీ దురుసుగా ప్రవర్తించినట్లు తేల్చారు.వీడియో లింక్ ద్వారా రిషిని కోర్టులో హాజరుపరిచారు. కేఫ్ నుంచి బయటికి వెళ్లేటప్పుడు కూడా క్యాషియర్‌కు అసభ్యకరమైన సైగలు, దూషణలు చేస్తూ ఉన్న వీడియోను కోర్టులో ప్లే చేశారు. కేఫ్‌లో బాధితురాలి భద్రతకు హాని కలిగించే అవమానకరమైన పదాలను ఉపయోగించడం , అసభ్యకరమైన చర్యకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించాడు. ఛానల్ న్యూస్ ఆసియా ప్రకారం, శిక్ష సమయంలో రెండు అదనపు ఛార్జీలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అనంతరం డిసెంబరు 30 జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. -
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ 100వ వార్షికోత్సవం
లోకా సమస్తాః సుఖినోభవంతు సర్వేజనా సుఖినోభవంతు అనే భావనతో వందేండ్ల క్రితం ప్రారంభమైన సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ శతాబ్దిక (1924 -2024 ) వార్షికోత్సవము సందర్భముగా నిర్వహించిన అతిరుద్ర మహాయాగము అత్యంత ఘనంగా జరిగింది. ఈ యాగం మార్గశిర కృష్ణ షష్ఠి డిసెంబర్21, 2024 నుంచి కృష్ణ ఏకాదశి డిసెంబర్ వరకు 6 రోజుల పాటు ఘనంగా పిజిపి హాల్, పెరుమాళ్ దేవాలయ ప్రాంగణములో26, 2024 వరకు నిర్వహించారు. గత 5 రోజుల నుంచి అత్యంత విశేష ముగా యాగాలు నిర్వహించగా, కృష్ణ ఏకాదశి డిసెంబర్ 26, 2024 రోజున మహా పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసింది. సభ నిర్వహించిన అతి రుద్రం కార్యక్రమం మొదటిది, సింగపూర్‌లో రెండవది. సింగపూర్‌లో మొట్టమొదటి మహారుద్రం సభ 80వ వార్షికోత్సవాలలో భాగంగా 2004లో నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు . ఈ సందర్భముగా కార్యక్రమములో ఏర్పాటు చేసిన మహాదేవ, శివ, రుద్ర, శంకర, నీల లోహిత, ఈశాన, విజయ, భీమ, దేవ దేవ, భవోద్భవ, ఆదిత్యమఖ మొదలైన ఏకాదశ(11) కలశ రుద్రఘన మండపముల వద్ద 121 ఋత్విక్యరేణ్యులు ఏక కాలము నందు రెండు ఏకాదశ రుద్రములు పారాయణ చేశారు. సుమారు 11 మంది ఋత్విక్కులు రుద్ర హావనము చేస్తూ..ఐదు రోజుల పాటు ప్రతి రోజు 2662 రుద్రముల పారాయణ చేశారు. మహా పూర్ణాహుతి అయిన ఆరవ రోజు 1331 రుద్రమల పారాయణంతో 16,896 రుద్రములు నిర్వహించారు. ఇది ఒక అతిరుద్రం ప్లస్ ఒక మహారుద్రం ప్లస్ ఏడు ఏకాదశ రుద్రాలకు అవసరమైన సంఖ్య కంటే కొంచెం ఎక్కువ. అనంతరము ఏకాదశ కలశ మండపములవద్ద రుద్రముతో అభిమంత్రించిన 121 కలసములతో శ్రీ శ్రీ శ్రీ పూర్ణాంబికా సమేత శ్రీ ఆనందేశ్వర మహా స్వామి వారికి అభిషేకము తదనంతరం రుద్రార్చన మహా పూర్ణాహుతులతో అత్యంత వైభవోపేతముగా జరిపించారు. ఈ ఆరు రోజులు సాయంత్రం, వేద పురోహితులు క్రమార్చన చేశారు, తరువాత సామవేద జపం అవధారయాలు జరిగాయి.అతిరుద్రం 2024 నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఎస్‌డీబీబీఎస్ నిర్వహణ కమిటీలో - L కార్తికేయన్, డాక్టర్ I స్వామినాథన్, N ఆనంద్ చంద్రశేఖర్, బాలాజీ ఉన్నారు. రామస్వామి, గణేష్ రాధాకృష్ణన్, ఈశ్వర్ శ్రీనివాసన్, రాజా రామన్, ఎస్ కృష్ణన్, కె సాయిరామ్, కె రామ ప్రసాద్ మరియు వేణు మాధవ్ మల్లవరపు సభ్యులుగా ఉన్నారు.ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విశేషం ఏమిటంటే వివిధ దక్షిణ భారత రాష్ట్రాల నుంచి 22 మంది గౌరవనీయులైన పండితులు పాల్గొనగా, వారిలో ముగ్గురు హైదరాబాద్‌లోని స్కందగిరి నుండి విచ్చేసారు. సింగపూర్ నుంచి 121 మందికి పైగా ఋత్విక్కులతో పాటు, 4 దశాబ్దాలుగా నివాసి సభ పురోహితులచే వేద సంప్రదాయాలలో శిక్షణ పొందారు. ఇందులో గత దశాబ్దముగా పరమేశ్వరుని సేవలో ఎన్నో వైదిక కార్యక్రమములు చేస్తున్న సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజము అతిరుద్రం తొలి రోజు మధ్యాహ్న భోజనం స్పాన్సర్ చేయడంతో పాటు అతిరుద్రం మహాయాగంలో చల్లా శ్రీ ప్రదాయ, చల్లా శ్రీకాంత్, అనంత్ బొమ్మకంటి, ధర్మారావు అక్కిపెద్ది, గంటి చంద్రశేఖర్, వాడాలి ప్రసాద్, బాలాజీ గరిమెళ్ళ, రాఘవేంద్ర దేవరకొండ, గిరి పిండిప్రోలు, వాసు జనపాటి, కృష్ణ అయ్యగారి, గోవర్ధన్, జగన్, ఫణీన్ద్ర, రమేష్ నేమాని, సుబ్రమణ్యం, గణపతి శాస్త్రి ఆకెళ్ళ, రామ సంతోష్ శ్రీకర్ ఆకెళ్ళ, కామేశ్వర రావు భమిడిపాటి, వెంకట రమణ పమిడిఘంటం, వంశీకృష్ణ శిష్ట్లా, రత్నకుమార్ కవుటూరు తదితరులు పాల్గొన్నారు.ప్రతిరోజు వేలాదిగా భక్తుల శివనామ స్మరణలో పిజిపి హాల్ ప్రాగణం మార్మోగింది. భక్తులకు ఋత్విక్కులకు పెరుమాళ్ ఆలయం నుంచి తెచ్చిన ప్రసాదాన్ని వడ్డించి వేడుకలకు పవిత్రతను చేకూర్చారు. ప్రతిరోజు అన్ని పురోహితులకు సమారాధనై భోజనం వడ్డించబడింది. తిరుచ్చి నుంచి పాల్గొన్న పురోహితులలో ఒకరు కంచి మఠం జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామిగళ్ ఆశీర్వదించిన ప్రసాదాన్ని తీసుకువచ్చి అధ్యక్షుడు ఎల్ కార్తికేయన్‌కు అందజేశారు.సభ అధ్యక్షుడు ఎల్ కార్తికేయన్, కార్యక్రమ డైరెక్టర్ రాజారామన్, సభ కార్యదర్శి ఆనంద్ చంద్రశేఖర్, అందరి వాద్యార్లకు (పురోహితులు), ఋత్విక్లకు, దాతలకు, స్వచ్ఛంద సేవకులకు, అన్ని సహాయక సంస్థలకు (శ్రీ శ్రీనివాస్ పెరుమాళ్ ఆలయం, పిజిపి హాల్, శ్రీ శివన్ ఆలయం, హిందూ ఎండోమెంట్ బోర్డు, కవిత స్టోర్ & ట్రేడింగ్, ఇతర మౌలిక సదుపాయాల ప్రదాతలు) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం మీద ఈ కార్యక్రమం గొప్ప విజయాన్ని సాధించింది అని నిర్వాహకులు తెలియజేశారు, పరమశివుడు చాలా సంతోషించాడు, అందుకు నిదర్శనమే ఈ 6 రోజుల కార్యక్రమంలో 3వ రోజు భారీ వర్షం కురిసింది అని నిర్వహకులు ఆనందం వ్యక్తంజేశారు.(చదవండి: టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'' 209 వ సాహిత్య సదస్సు) -
సింగపూర్‌లో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సింగపూర్ లో ఘనంగా జరిగాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా జూంలో జాయిన్ అయ్యి ప్రసంగించారు. ఈ వేడుకలలో సింగపూర్ వైస్సార్సీపీ కన్వీనర్ మురళి కృష్ణ రెడ్డి, అడ్వైసర్ కోటి రెడ్డి, మలేషియా కన్వీనర్ భాస్కర్ రెడ్డి, జయప్రకాశ్ రెడ్డి, సందీప్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, చంద్ర, కృష్ణారెడ్డి, సుధీర్, సుహాస్, యుగంధర్, దొరబాబు, సత్యనారాయన రెడ్డి, శ్రీనాథ్, శ్రీని, మధుతో పాటు పెద్ద సంఖ్యలో జగన్ అభిమానులు పాల్గొన్నారు.సంక్షేమ పాలన అందించడంలో తండ్రిని మించిన తనయుడిగా అన్ని వర్గాల ప్రజలకు ఆప్తబంధువుగా జగనన్న నిలిచారని ప్రవాసులు కొనియాడారు. విద్య, వైద్యం, పోర్టులు వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులతో అభివృద్ధికి బాటలు వేసి ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపిరాని ప్రశంసించారు. -
విదేశాల్లోనూ ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను అనేక దేశాల్లోని ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం అక్కడి బే ఏరియా, డల్లాస్, అట్లాంటా, న్యూయార్క్, న్యూజెర్సీ తదితర ప్రాంతాల్లో ఎన్నారైలు వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా భారీఎత్తున కేక్‌లు కట్‌చేసి.. విందు భోజనాలతో ఘనంగా నిర్వహించారు. అలాగే.. బ్రిటన్‌లోనూ అంగరంగ వైభవంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి. లండన్ ఈస్ట్ హాంలో వైఎస్సార్సీపీ యూకే కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్చింతా ప్రదీప్, ఓబుల్‌రెడ్డి పాతకోట అధ్యక్షతన నిర్వహించిన జగన్ జన్మదిన వేడుకల్లో ఆ దేశం నలుమూలల నుంచి జగన్ అభిమానాలు భారీఎత్తున పాల్గొని అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా చింతా ప్రదీప్ మాట్లాడుతూ.. ఒకటే జీవితం, ఒక్కటే రాజకీయ పార్టీ, ఒక్కడే నాయకుడు వైఎస్ జగన్ అని చెప్పడంతో జై జగన్ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ విమలారెడ్డి తనయుడు యువరాజ్‌రెడ్డి ఆన్లైన్లో యూకేలోని అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నారైలకు అభినందనలు : చెవిరెడ్డిఅనేక దేశాల్లో భారీఎత్తున వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించిన ఎన్నారైలను ఆ పార్టీ అనుబంధ విభాగాల ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అభినందించారు. జగన్ పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలతో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం తథ్యమని.. జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయమని చెప్పారు.సింగపూర్‌లోనూ సంబరాలు..వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు సింగపూర్‌లో కూడా ఆదివారం ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సింగపూర్ వైఎస్సార్సీపీ కన్వీనర్ మురళీకృష్ణారెడ్డి, అడ్వైజర్ కోటిరెడ్డి, మలేసియా కన్వీనర్ భాస్కర్‌రెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో జగన్ అభిమానులు పాల్గొన్నారు. సంక్షేమ పాలన అందించడంలో తండ్రిని మించిన తనయుడిగా.. అన్ని వర్గాల ప్రజలకు ఆప్తబంధువుగా.. విద్య, వైద్యం, పోర్టులు నిర్మించి అభివృద్ధికి బాటలు వేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపారని జగన్‌ను కొనియాడారు.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! దుబాయ్‌లో అత్యంత వైభవంగా..ఇక యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరావు, వైఎస్సార్సీపీ ఎన్నాౖరె కమిటీ సలహాదారు ప్రసన్న సోమిరెడ్డి, వైఎస్సార్సీపీ యూఏఈ కో–కన్వీనర్ మైనర్ బాబు, తదితరుల ఆధ్వర్యంలో దుబాయ్‌లోని హోటల్ విస్తాలో నిర్వహించిన వేడుకల్లో ఆ దేశం నలుమూల నుంచి అభిమానులు భారీఎత్తున పాల్గొన్నారు. అనంతరం.. కారుమూరి నాగేశ్వరావు తదితర వక్తలు జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా శక్తివంచన లేకుండా పనిచేసి వైఎస్సార్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించుకుని.. వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా చేద్దామని పిలుపిచ్చారు. మరోవైపు.. కెనడా, ఖతార్, నెదర్లాండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా (మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్), జర్మనీ తదితర దేశాల్లోనూ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారుగ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సింగపూర్‌లో కిరణ్ ప్రభ-కాంతి కిరణ్ దంపతులతో ముఖాముఖీ
శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూరు ఆద్వర్యంలో "కిరణ్ ప్రభ, కాంతి కిరణ్ దంపతులతో" ఇష్టాగోష్టి కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. 18 డిసెంబర్, బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన ఆ ముఖాముఖీలో కౌముది మాసపత్రిక సంపాదకులు, కిరణ్ ప్రభ ప్రసంగించారు. అలాగే కౌమిది వెబ్ మాగజైన్ మొదలు పెట్టి 17 సంవత్సరాలు పూర్తి అయిందని, ఏ నెలా ఆలస్యం కాకుండా 1వ తేదీనే విడుదల అవ్వడం వెనుక ఎంతో శ్రమ ఉన్నప్పటికీ అది మనకు పని పట్ల ఉన్న నిభద్దతగా భావించి విడుదలలో జాప్యం రానివ్వమని అన్నారు. అలాగే దాదాపు 1300 టాక్ షోలను కూడా నిర్వహించామని, తెలిసినంతలో ఒక్క మన తెలుగు భాషలో తప్ప వేరే ఏ భాషలో కూడా ఇన్ని విభిన్న రంగాలను ఎంచుకుని రకరకాల సబ్జక్ట్ లలో ఒక్క మనిషి ఇన్ని టాక్ షోలను చేసింది లేదని అంతే కాకుండా ఇదంతా ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా, తెలుగు భాష మీద అబిమానంతో మాత్రమే చేస్తున్న కార్యక్రమం అని వివరించారు. అదే విధంగా వారి టాక్ షో లను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళే క్రమం ఎలా ఉంటుందో సోదాహరణలతో వివరించారు. ఎంతో మంది వింటున్న కార్యక్రమం కాబట్టి మాట్లాడే ప్రతి పదం నిజ నిర్ధారణతో, ఖచ్చితత్వం ఉండేలా చూసుకుంటానని వివరించారు, అదే విధంగా కౌముది పత్రిక నిర్వహణలో భార్య కాంతి కిరణ్ సహాయసహకారాలు ఎలా ఉంటాయో వివరించారు. కాంతి కిరణ్ మాట్లాడుతూ కౌముది పత్రిక ప్రారంభించినప్పుడు ఇంతమంది అభిమానుల్ని ప్రపంచవ్యాప్తంగా మాకు అందిస్తుందని అస్సలు అనుకోలేదని, ఈ రోజు ఈ కార్యక్రమం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తదుపరి వచ్చిన ఆహూతుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ దాదాపు 2 గంటల పాటు ముఖాముఖి కార్యక్రమంలో నిర్వహించారు.సుబ్బు వి పాలకుర్తి సభా నిర్వహణ గావించిన ఈ కార్యక్రమములో, శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ కిరణ్ ప్రభతో గత 3 సంవత్సరాలుగా ఆన్లైన్ వేదికలు ద్వారా పరిచయం ఉన్నప్పటికీ వారిని సింగపూర్ లో ఇలా ఇష్టాగోష్టి కార్యక్రమములో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెపుతూ వారిని పరిచయం చేసిన తానా సాహిత్య సంఘం అధ్యక్ష్యులు తోటకూర ప్రసాద్ కి ధన్యవాదములు తెలియచేసారు. అలాగే సింగపూర్ లో సాహిత్య కార్యక్రమాలకు నాంది పలికిన వంగూరి చిట్టెన్ రాజుకి మరొక్కసారి ధన్యవాదములు తెలియచేస్తూ, వర్కింగ్ డే అయినా కానీ 30 మందికి పైగా ఈ కార్యక్రమములో పాల్గొనటం అది కేవలం కిరణ్ ప్రభ మీద ఉన్న అభిమానానికి నిదర్శనం అని తెలిపారు. ఈ కార్యక్రమములో సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్ష్యులు జవహర్ చౌదరి, రంగా రవికుమార్, సీనియర్ సభ్యులు లక్ష్మీనారాయణ, శంకర్ వీరా, ధనుంజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి రామాంజనేయులు చామిరాజు, పాతూరి రాంబాబు, సునీల్ రామినేని, కోణాళి కాళీ కృష్ణ సహాయ సహకారాలు అందించగా, రాధాకృష్ణ గణేశ్న, సాంకేతిక సహకారం అందించారు. 30 మందికి పైన పాల్గొన్న ఈ కార్యక్రమములో పాల్గొన్న అతిధులందరికి విందు భోజన ఏర్పాట్లను సరిగమ బిస్ట్రో రెస్టారంట్ వారు కేశాని దుర్గా ప్రసాద్, సురేంద్ర చేబ్రోలు, మోహన్ నూకల ఏర్పాటు చేసారు. -
చదరంగంలో కొత్త రారాజు.. వరల్డ్ ఛాంపియన్‌గా గుకేష్ (ఫోటోలు)
-
విస్తరణ బాటలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్
న్యూఢిల్లీ: బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ .. గల్ఫ్, మధ్య ప్రాచ్యంలో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు ఆగ్నేయాసియాలోనూ తమ కార్యకలాపాలను విస్తరించనుంది. బ్యాంకాక్, సింగపూర్, కొలంబో తదితర కొత్త రూట్లను పరిశీలిస్తున్నట్లు సంస్థ ఎండీ అలోక్ సింగ్ తెలిపారు. 2025 మార్చి వేసవి షెడ్యూల్లో ఖాట్మండూ రూట్లో సరీ్వసులు మొదలుపెడతామని, వచ్చే ఆర్థిక సంవత్సరం లేదా ఆపై సంవత్సరం వియత్నాంకి ఫ్లయిట్స్‌ను ప్రారంభించే అవకాశం ఉందని ఆయన వివరించారు. ప్రధానంగా 5.5–6 గంటల ప్రయాణ దూరం ఉండే రూట్లు, ద్వితీయ .. తృతీయ శ్రేణి నగరాలకు సరీ్వసులపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితుల కారణంగా కోల్‌కతా నుంచి ఢాకాకు డైరెక్ట్ ఫ్లయిట్స్ ప్రణాళికను వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి నాటికి తమ విమానాల సంఖ్యను ప్రస్తుతమున్న 90 నుంచి 100కి పెంచుకోనున్నట్లు సింగ్ చెప్పారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం దేశీయంగా 36, అంతర్జాతీయంగా 15 గమ్యస్థానాలకు నిత్యం 400 ఫ్లయిట్స్ నడుపుతోంది. -
భార్యకోసం బంగారు గొలుసుకొన్నాడు.. దెబ్బకి కోటీశ్వరుడయ్యాడు!
భారతీయ సంతతికి చెందిన వ్యక్తి భార్య కోసం బంగారు గొలుసు కొనుగోలు చేసి జాక్‌పాట్ దక్కించు కున్నాడు. ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. 8 కోట్ల లాటరీ గెల్చుకున్నాడు. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఎక్కడ? ఎలా? అని ఆసక్తిగా ఉంది కదూ? అయితే క్షణం ఆలస్యం చేయకుండా వివరాలు తెలుసుకుందాం పదండి! సింగపూర్‌లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి రాత్రికి రాత్రికే కోటీశ్వరుడయ్యాడు. మూడు నెలల క్రితం భార్య సంతోషం కోసం సుమారు రూ. 3 లక్షల రూపాయలతో ఒక గోల్డ్ చైన్ కొన్నాడు. ప్రతీ ఏడాది నిర్వహించే లాటరీలో భాగంగా గత ఆదివారం (నవంబర్ 24) జ్యువెలరీ కంపెనీ నిర్వహించిన లక్కీ డ్రాలో 8 కోట్ల రూపాయలకు పైగా బహుమతిని గెలుచుకున్నాడు. దీంతో కుటుంబం అంతా సంతోషంతో పొంగిపోయింది. “ఈ రోజు మా నాన్నగారి నాలుగో వర్ధంతి.. ఇది ఆయన ఆశీర్వాదం’’ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు చిదంబరం. సింగపూర్‌లో ఉన్న ఇన్నాళ్లకు అదృష్టం వరించిందనీ, తన తల్లితో ఈ శుభవార్త పంచుకోవాలంటూ సంతోషం వ్యక్తం చేశాడు. తనకు వచ్చిన ఈ డబ్బులో కొంత సమాజానికి విరాళంగా ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిపాడు.ముస్తఫా జ్యువెలరీ షాపులో 250 సింగపూర్ డాలర్ల కన్నా ఎక్కువ విలువైన ఆభరణాలు కొనుగోలు చేసిన వారు లక్కీ డ్రాకి అర్హులు. ఈ లక్కీ డ్రాలో సింగపూర్‌లో 21 ఏళ్లుగా ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బాలసుబ్రమణ్యం చిదంబరం టాప్ ప్రైజ్‌ని కైవసం చేసుకున్నట్లు ఆసియా వన్ తెలిపింది. ఈయనతోపాటు మరి కొంతమందికి కూడా భారీ బహుమతులను అందించినట్టు కంపెనీ తెలిపింది. View this post on Instagram A post shared by Mustafa Jewellery Singapore (@mustafajewellerysg) -
ధర పెరిగినా, తగ్గినా.. భారత్‌లోనే బంగారం చీప్!
ఒమన్, ఖతార్, సింగపూర్, యూఏఈ వంటి దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో బంగారం ధరలు కొంత తక్కువగా ఉన్నాయని బిజినెస్ ఇన్సైడర్ నివేదిక పేర్కొంది.2024 నవంబర్ 16 నాటికి భారతదేశంలో బంగారం ధరలు రూ.75,650 (24 క్యారెట్ల 10గ్రా), రూ.69,350 (22 క్యారెట్ల 10గ్రా)గా ఉన్నాయి. నవంబర్ 1వ తేదీ ధరలతో పోలిస్తే.. ప్రస్తుత ధరలు చాలా క్షీణించినట్లు తెలుస్తోంది.యూఏఈలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.76,204. సింగపూర్‌లో రూ.76,805, ఖతార్‌లో రూ.76,293, ఒమన్‌లో రూ.75,763గా ఉంది. ఈ ధరలతో పోలిస్తే.. భారతదేశంలో బంగారం ధరలు కొంత తక్కువే అని స్పష్టంగా అర్థమవుతోంది.భారత్‌లో బంగారం తగ్గుదలకు కారణంమార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. బంగారం ధర తగ్గడానికి కారణం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ముగియడం, ఇతర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అని తెలుస్తోంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గుదల కూడా గోల్డ్ రేటు తగ్గడానికి దోహదపడింది.ఇదీ చదవండి: జాబ్ కోసం సెర్చ్ చేస్తే.. రూ.1.94 లక్షలు పోయాయ్భారతదేశంలో బంగారం మీద పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ఒమన్, ఖతార్, సింగపూర్, యుఏఈ వంటి దేశాల్లో మరింత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇది కూడా అక్కడ బంగారం ధరల పెరుగుదలకు కారణం అయింది. -
World Architecture Festival 2024: స్కూలు భవనం.. బహు బాగుంది
గది అంతటా సూర్యకాంతి ప్రసరించేలా రంపం పళ్లను ఆకారంలో రూఫ్.. ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడే ఆవరణలు.. పెద్ద బాస్కెట్‌బాల్ కోర్టు.. అందమైన కమ్యూనిటీ గార్డెన్.. ఓపెన్ ఎయిర్ టెర్రస్.. లోపలి వ్యక్తుల ప్రైవసీకి భంగం కలగకుండా చుట్టూ వంపులు తిరిగిన మెటల్ స్క్రీన్స్.. ఇంకా మరెన్నో ప్రత్యేకతలు. ఇదేదో రియల్ ఎస్టేట్ సంస్థ ప్రకటన కాదు! ఓ స్కూల్ భవన విశేషాలివి. దాంతో ఆకాశహర్మ్యాలను, మ్యూజియాలను, అందమైన విమానాశ్రయాలను కూడా తలదన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ భవనంగా ఎంపికైంది. సింగపూర్‌లో జరిగిన ప్రపంచ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ (డబ్ల్యూఏఎఫ్)లో ఈ ఘనత సాధించింది. దీని పేరు డార్లింగ్టన్ పబ్లిక్ స్కూల్. సిడ్నీలోని చిపండేల్లో ఉంది. సాంస్కృతిక పరిరక్షణ దక్షిణ సిడ్నీ ప్రాంతంలో ఉన్న ఈ స్కూలు నిజానికి ఆ్రస్టేలియా మూలవాసులతో బలమైన సంబంధాలున్న కమ్యూనిటీ పాఠశాల. 1970 నాటి పాత భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్తది నిర్మించాలనుకున్నారు. ఎఫ్‌జెడ్‌సీ స్టూడియో ఆ బాధ్యతలు తీసుకుంది. మూలవాసులతో బంధాన్ని ప్రతిబింబించేలా పాఠశాల హాల్, ఎంట్రన్స్ రిసెప్షన్, తరగతి గదుల్లో స్వదేశీ కళను చిత్రీకరించి సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించారు. పాత పాఠశాల గోడలపై ఉన్న ఆదిమ కుడ్యచిత్రాలను కొత్త భవనంలో పుననర్న్మించారు. ఆ స్ఫూర్తితోపాటు కొత్త, సమకాలీన అభ్యాస వాతావరణాన్ని సృష్టించారు. ప్రీసూ్కల్, కిండర్ గార్టెన్, ప్రైమరీ స్కూల్‌తో 500 మందికి పైగా విద్యార్థుల సామర్థ్యం ఈ కొత్త క్యాంపస్ సొంతం.ఆరోగ్యం, ఆహ్లాదం ప్రాధమిక పాఠశాల భవనంలో కాంతికోసం ప్రత్యేకంగా విద్యుత్ అక్కరలేదు. ప్రత్యేకమైన టెర్రస్ ప్రతి గదికీ సూర్యకాంతిని ప్రసరింపజేస్తుంది. అది బాగా వేడిగా కూడా ఉండదు. మృదువైన కాంతి స్థానిక కాసురినా చెట్ల ఆకుల మధ్య నుంచి జాలువారుతున్నట్లుగా ఉంటుంది. ఈ సహజకాంతి విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పాఠశాల భవనానికి అనుసంధానించి ఉన్న కమ్యూనిటీ హాల్, లైబ్రరీ విద్యార్థులను సమాజంలో భాగం చేస్తున్నాయి.175 మంది మనసు గెలుచుకుని.. క్రీడలు, రవాణా, ఆరోగ్యం, గృహనిర్మాణం వంటి 18 కేటగిరీల్లో డబ్ల్యూఏఎఫ్ అవార్డులు ఇస్తుంది. 175 మంది ఫెస్టివల్ డెలిగేట్ల ప్యానెల్ అన్ని కేటగిరీలకు చెందిన విజేతల నుంచి ‘వరల్డ్ బిల్డింగ్ ఆఫ్ ది ఇయర్’ ను ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది నేషనల్ స్టార్ అబ్జర్వేటరీ ఆఫ్ సైప్రస్, పోలండ్‌లోని ప్రఖ్యాత బస్ స్టేషన్, టర్కీలోని సోలార్ పవర్ ప్లాంట్ వంటి 220 ప్రాజెక్టులు అవార్డు కోసం పోటీపడ్డాయి. వాటన్నింటినీ తలదన్ని ఒక చిన్న పాఠశాల నెగ్గుకురావడం అసాధారణమని ఎఫ్జేసీ స్టూడియో అసోసియేట్ అలెస్సాండ్రో రోసీ అన్నారు. భవనంలో సమయాన్ని గడిపే పిల్లలే నిజమైన విజేతలని అభిప్రాయపడ్డారు. గతేడాది కూడా చైనాలోని ఓ బోర్డింగ్ స్కూల్ ఈ టైటిల్‌ను గెలుచుకోవడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చిప్ ప్రాజెక్టుల కోసం మాతోనే టాటా గ్రూప్ జట్టు ..
ముంబై: సెమీకండక్టర్ల తయారీ ప్రణాళికల్లో ఉన్న టాటా సన్స్ తమ దేశాన్ని కీలక భాగస్వామిగా ఎంచుకుంటుందని సింగపూర్ ధీమా వ్యక్తం చేసింది. అంతర్జాతీయ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ దేశంగా తమకు పేరుండటం ఇందుకు దోహదపడగలదని తెలిపింది. శుక్రవారం టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌తో భేటీ అనంతరం సింగపూర్ హోమ్ అఫైర్స్ శాఖ మంత్రి కె. షణ్ముగం ఈ విషయాలు తెలిపారు. సమావేశంలో సెమీకండక్టర్లపై విస్తృతంగా చర్చించినట్లు వివరించారు. సింగపూర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలకు అంతర్జాతీయంగా సెమీకండక్టర్ పరికరాల ఉత్పత్తిలో 20 శాతం వాటా ఉందని షణ్ముగం పేర్కొన్నారు. చిన్న దేశమే అయినప్పటికీ తమ దేశంలో 25 సెమీకండక్టర్ల ఫౌండ్రీలు ఉన్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో, దాదాపు అయిదు దశాబ్దాలుగా సింగపూర్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న టాటా గ్రూప్ తమతో జట్టు కట్టగలదని షణ్ముగం చెప్పారు. టాటా గ్రూప్ రూ. 91 వేల కోట్లతో గుజరాత్లో, రూ. 27,000 కోట్లతో అస్సాంలో సెమీకండక్టర్ల ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఇందుకోసం తైవాన్‌కి చెందిన పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్‌తో (పీఎస్ఎంసీ) చేతులు కలిపింది. -
సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజం దశమ వార్షికోత్సవం
-
ఘనంగా సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజం దశవర్ష వార్షికోత్సవం
లోకా సమస్తాః సుఖినోభవంతు సర్వేజనా సుఖినో భవంతు అనే భావనతో పదేళ్ల క్రితం ప్రారంమైన సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజం 2 నవంబర్, 2024 నాడు దశ వర్ష వార్షికోత్సవము ఘనంగా నిర్వహించుకుంది. ఈ సందర్భంగా దాదాపుగా 50 మంది తెలుగు బ్రాహ్మణ రుత్వికుల ఆధ్వర్యంలో శ్రీ మహా త్రిపురసుందరీ సమేత శ్రీ ఉమా సహస్ర లింగార్చన పూర్వక హరిద్రా కుంకుమార్చన సహిత లక్ష బిల్వార్చన కార్యక్రమంలో స్వామి వారిని అర్చనకార్యక్రమాన్ని నిర్వహించారు.కార్తీక మాసం మొదటి రోజున చేపట్టిన ఈ కార్యక్రమము లిటిల్ ఇండియాలో, ఆర్య సమాజ్ వారి ప్రాంగణములో 12 గంటలు పైగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు గణపతి పూజ పుణ్యాహవచనం తో మొదలుకొని మృత్తికా శోధన కార్యక్రమంతో మహాన్యాసా పూర్వకము గా భారతదేశం నుంచి తెప్పించిన శ్రేష్ఠమైన పుట్టమన్నుతో 1136 మహా పరమశివ లింగములు చేసి వాటిని సమంత్ర పూర్వకము గా మూల మంత్రము తో ఆవరణ అర్చన చేసి ఆ తరువాత అరుణపారాయణం చేసిన పిదప ఏకాదశ వార రుద్రాభిషేకం శ్రీ రుద్ర పూర్వకము గా చేసిన అనంతరం సూక్తముల పారాయణా సహితము గా వేదోక్త శాంతులయిన దశశాంతులు తో శ్రీ సహస్ర లింగేశ్వరుని సామ్రాజ్య పట్టాభిషేకం కావించుకుని, చిన్న విరామం అనంతరం 50 మంది దంపతులు కలసి లలిత సహస్రనామములతో హరిద్రాకుంకుమార్చన చేసి, అటుపిమ్మట శివ సహస్రనామ పూర్వక లక్ష బిల్వార్చనా అంతర్గత రుద్రాక్రమార్చన పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.చివరగా షోడశ ఉపచారా పూజ, దర్భార్ సేవతో ప్రదోష వ్రతం కార్యక్రమమును ఘనంగా ముగించారు.ఈ కార్యక్రమమును సింగపూర్ బ్రాహ్మణ సమాజ బ్రహ్మలు ప్రసాద్ కప్పగంతుల, నేమాని సత్య రమేష్ మరియు రాజేష్ శ్రీధర ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించగా, భారతదేశం నుంచి వచ్చిన సలక్షణ ఘనాపాటి వంశీ(రాధే) పాల్గొని కార్యక్రమానికి సహకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఇంతటి ఘనమైన కార్యక్రమాన్ని సింగపూర్‌లో తొలిసారిగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమానికి సహకరిచిన వర్కింగ్ టీం సభ్యులు గణపతి శాస్త్రి ఆకెళ్ళ, సూర్య పవన్ యనమండ్ర, వంశి కృష్ణ శిష్ట్లా , ముఖ్యదాతలు రంగనాథ్ వల్లభజోస్యుల, ఆదిత్య కర్రా , రామన్, భాను ఆకుండి, సంపూర్ణ స్వదేశ్, వీర ఫ్లవర్స్, వేద ఫ్లవర్స్ వాలంటీర్స్ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసారు. అలాగే అడగగానే హాల్ ని సమకూర్చిన ఆర్యసమాజ్ వారికీ ప్రత్యేక ధన్యవాదాలా తెలిపారు. కార్యక్రమములో పాల్గొన్న రిత్విక్ లకు, భక్తులకు పెరుమాళ్ దేవాలయం నుంచి తెప్పించిన ప్రసాద వితరణ చేసారు.ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతిఒక్కరికి నిర్వాహకులు శ్రీప్రదాయ చల్లా, రాజేష్ యనమండ్ర, వేణు మాధవ్ మల్లవరపు, రత్నకుమార్ కవుటూరు పేరు పేరున ధన్యవాదములు తెలియచేసారు. -
ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎస్కార్ట్‌గా యుద్ధ విమానాలు
భారత విమానయాన సంస్థలకు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతోంది.దేశవ్యాప్తంగా మంగళవారం ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు ఎదురయ్యింది. తాజాగా తాజాగా మధురై నుంచి సింగపూర్ వెళ్లిన ఎయిరిండియా విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది.విమానం సింగపూర్‌కు బయలుదేరిన తర్వాత విమానంలో బాంబు ఉందంటూ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు ఈ-మెయిల్ వచ్చింది.ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ ఐఎక్స్ 684కి ఈ బాంబు బెదిరింపు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సింగపూర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలోని చాంగీ విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ముందు విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా మళ్లించడానికి సింగపూర్ భద్రతా దళాలకు చెందిన రెండు ఫైటర్ జెట్లు రంగంలోకి దిగాయి. ఎయిరిండియా విమానానికి ఎస్కార్ట్‌గా వ్యవహరించి విమానాన్ని జనావాసాలకు దూరంగా తీసుకెళ్లాయి.కాగా, ఈ బెదిరింపుల వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు పౌర విమానయాన భద్రతా సంస్థ భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీల సాయం కోరింది. బాధ్యులను కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎయిరిండియా విమానానికి సింగపూర్ యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా రావడంపై సింగపూర్ రక్షణ మంత్రి ఎన్జీ ఎంగ్ హెన్ స్పందించారు. ఎయిరిండియా విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లడానికి రెండు ఆర్ఎస్ఏఎఫ్ ఎఫ్-15ఎస్జీలు రంగంలోకి దిగాయని తెలిపారు. విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లాయని, చివరకు విమానం చాంగీ విమానాశ్రయంలో రాత్రి (మంగళవారం) 10:04 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎక్స్ వేదికగా ప్రకటించారు.కాగా దేశవ్యాప్తంగా మంగళవారం 7 విమానాలకు బాంబు బెదిరింపు ఎదురయ్యింది. ఢిల్లీ నుంచి షికాగో వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని కెనడాలోని ఓ విమానాశ్రయానికి మళ్లించి తనిఖీ చేశారు. అలాగే జైపూర్ నుంచి అయోధ్య మీదుగా బెంగళూరు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం, దర్భంగా నుంచి ముంబయి వెళ్లే స్పైస్‌జెట్ విమానం, బాగ్డోగ్రా నుంచి బెంగళూరు వెళ్లే ఆకాశ ఎయిర్ విమానం, దమ్మం(సౌదీ అరేబియా) నుంచి లక్నవూ వెళ్లే ఇండిగో విమానం, అమృత్సర్-డెహ్రాడూన్-ఢిల్లీ అలయన్స్ ఎయిర్ విమానం, మదురై నుంచి సింగపూర్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. -
రాధిక మంగిపూడి రాసిన 'విజయనగర వైభవ శతకం' ఆవిష్కరణ
'విజయనగర ఉత్సవ్ 2024' ప్రారంభోత్సవ సభలో మంగిపూడి రాధిక రాసిన విజయనగర వైభవ శతకం ఆవిష్కరించబడింది. శాసనసభ సభాపతి అయ్యన్నపాత్రుడు, మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు, రాష్ట్ర MSME SERP NRI సంబంధాల మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, విజయనగరం శాసనసభ సభ్యురాలు ఆదితిగజపతి, జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ,ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు తదితర ప్రముఖులు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.విజయనగరం జిల్లా వైభవాన్ని కీర్తిస్తూ వెలువడుతున్న తొలి పద్యశతకం ఇది. రాధిక మంగిపూడి తన స్వస్థలమైన విజయనగరం చరిత్ర, వారసత్వం, కళలు, అక్కడ పుట్టిన మహానుభావుల గురించి, 111 తేటగీతి పద్యాలతో ఈ 'విజయనగర వైభవ శతకం' రచించారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దేవత పైడితల్లి అమ్మవారి ఉత్సవ సందర్భంగా ఆ అమ్మవారికి ఈ పుస్తకం అంకితమిచ్చారు. ' విజయనగరం సాగి జ్ఞానాంబ మెమోరియల్ బుక్ ట్రస్ట్' ఈ పుస్తకాన్ని ప్రచురించింది.రచయిత్రి, వ్యాఖ్యాత్రి, అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల రూపకర్త, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాధిక “శ్రీ సాంస్కృతిక కళాసారధి” సింగపూర్ సంస్థ ప్రధాన కార్యనిర్వాహకవర్గ సభ్యురాలు. ''గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం' సంస్థ' వ్యవస్థాపక అధ్యక్షురాలు. 100 కు పైగా అంతర్జాతీయ కార్యక్రమాలకు వ్యాఖ్యాత్రిగా వ్యవహరించారు. ఇప్పటివరకు రెండు కథా సంపుటులు, రెండు కవితా సంపుటలు, ఒక పద్య శతకం, ఒక వ్యాస సంపుటి రచించారు."ఈ శతకం తన ఆరవ పుస్తకం అని, విజయనగరంలో ఇందరు పెద్దల చేతులమీదుగా ఈ పుస్తకం ఆవిష్కరణ జరగడం చాలా సంతోషంగా ఉందని, ఆ అవకాశాన్ని అందించిన మంత్రివర్యులకు, జిల్లా అధికారులకు రాధిక ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.సింగపూర్ 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తదితర సభ్యులందరూ రాధికకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. త్వరలో మరల అంతర్జాతీయ స్థాయిలో "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు"వేదికపై ఖతార్ దేశంలో దోహా నగరంలో ఈ శతకంలో పాటుగా రాధిక రాసిన మరొక వ్యాస సంపుటి కూడా ఆవిష్కరింపబడుతోందని హర్షం వ్యక్తం చేశారు. -
అంబరాన్నంటిన సింగపూర్ తెలుగు సమాజం బతుకమ్మ సంబరాలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక టాంపినీస్ సెంట్రల్ పార్క్ లో సింగపూర్ బతుకమ్మ వేడుకలకు సింగపూర్ లోని వివిధ ప్రాంతాల ఆడపడచులు, పిల్లలు, మరియు పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పూలతో తయారు చేసిన అందమైన బతుకమ్మలను పేర్చి, జానపద పాటలు పాడుతూ, ఆడుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆనందంగా వేడుక జరుపుకున్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో చిన్నాపెద్దా అందరూ ఆడిపాడి సందడి చేశారు. సింగపూర్ స్థానికులు కూడా ఈ వేడుకను ఆసక్తిగా తిలకించారు. అనంతరం బతుకమ్మలను శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు.ఈ పండుగ తెలుగువారి ఐక్యతను ప్రపంచమంతా చాటుతుందనీ సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. తెలుగువారంతా మమేకమై ఈ సంబరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు సమాజంలో సభ్యత్వం తీసుకోవాలని, అందరూ కలిసి ఈ సంస్కృతి పునరుద్ధరణకు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమాన్ని ఆర్ ఆర్ హెచ్ సి , నార్పాణి టాంపినీస్ సిసి ఐఎఇసి వంటి స్ధానిక సంస్ధల సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు కార్యక్రమ నిర్వాహకులు పుల్లనగారి శ్రీనివాసరెడ్డి తెలిపారు.అందంగా అలంకరించిన మూడు బతుకమ్మలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. అలాగే ఈ సంవత్సరం 8 ప్రోత్సాహక బహుమతులు కూడా ప్రదానం చేశారు. కొత్త సుప్రియ సారధ్యంలో నడుస్తున్న ‘అమ్మ చారిటబుల్’ సంస్థ సహకారంతో ఈ బహుమతులు అందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి సుమారు 2000 మంది హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారని.. గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ పేర్కొన్నారు. కుంభకర్ణ, Mr.బిరియాని, ఫ్లేవర్స్, తందూర్ లాంజ్, ఆంధ్రకర్రీ, మరియు బంజార రెస్టారెంట్ వంటి వారి భాగస్వామ్యం లో భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేడుకను విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఆన్ లైన్ ద్వారా సుమారు 6000 మంది ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారని, 10 మంది లక్కీ విజేతలకు వెండి , ఇతర ఆకర్షణీయ బహుమతులు అందజేశారని చెప్పారు.సింగపూర్ లో తెలుగు వాసుల ఐక్యతను చాటుతూ, వారి సాంస్కృతిక భావాలను పదిలపరిచిన ఈ బతుకమ్మ వేడుక సింగపూర్ తెలుగు సమాజానికి మరింత గౌరవం తీసుకొచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.