భారతీయ సంతతికి చెందిన వ్యక్తి భార్య కోసం బంగారు గొలుసు కొనుగోలు చేసి జాక్‌పాట్ దక్కించు కున్నాడు. ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. 8 కోట్ల లాటరీ గెల్చుకున్నాడు. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఎక్కడ? ఎలా? అని ఆసక్తిగా ఉంది కదూ? అయితే క్షణం ఆలస్యం చేయకుండా వివరాలు తెలుసుకుందాం పదండి!
సింగపూర్‌లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి రాత్రికి రాత్రికే కోటీశ్వరుడయ్యాడు. మూడు నెలల క్రితం భార్య సంతోషం కోసం సుమారు రూ. 3 లక్షల రూపాయలతో ఒక గోల్డ్ చైన్ కొన్నాడు. ప్రతీ ఏడాది నిర్వహించే లాటరీలో భాగంగా గత ఆదివారం (నవంబర్ 24) జ్యువెలరీ కంపెనీ నిర్వహించిన లక్కీ డ్రాలో 8 కోట్ల రూపాయలకు పైగా బహుమతిని గెలుచుకున్నాడు. దీంతో కుటుంబం అంతా సంతోషంతో పొంగిపోయింది.
“ఈ రోజు మా నాన్నగారి నాలుగో వర్ధంతి.. ఇది ఆయన ఆశీర్వాదం’’ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు చిదంబరం. సింగపూర్‌లో ఉన్న ఇన్నాళ్లకు అదృష్టం వరించిందనీ, తన తల్లితో ఈ శుభవార్త పంచుకోవాలంటూ సంతోషం వ్యక్తం చేశాడు. తనకు వచ్చిన ఈ డబ్బులో కొంత సమాజానికి విరాళంగా ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిపాడు.
ముస్తఫా జ్యువెలరీ షాపులో 250 సింగపూర్ డాలర్ల కన్నా ఎక్కువ విలువైన ఆభరణాలు కొనుగోలు చేసిన వారు లక్కీ డ్రాకి అర్హులు. ఈ లక్కీ డ్రాలో సింగపూర్‌లో 21 ఏళ్లుగా ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బాలసుబ్రమణ్యం చిదంబరం టాప్ ప్రైజ్‌ని కైవసం చేసుకున్నట్లు ఆసియా వన్ తెలిపింది. ఈయనతోపాటు మరి కొంతమందికి కూడా భారీ బహుమతులను అందించినట్టు కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment