viral story
-
కంటెంట్ క్వీన్స్ మ్యాజిక్ : ‘యూట్యూబ్ విలేజ్’ వైరల్ స్టోరీ
ఛత్తీస్‌గఢ్‌లోని ఒక చిన్న గ్రామం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. రాయ్‌పూర్‌కి సమాపంలో ఉన్న తులసి అనే గ్రామం యూ ట్యూబ్ (YouTube) వీడియోలతో ఆర్థిక ,సామాజిక విప్లవాన్ని సాధించింది. తమ కథలు, ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేందుకు YouTubeను ఒక మార్గంగా ఎంచుకున్నారు గ్రామస్తులు. చిన్నాపెద్దా, తేడాఏమీలేదు. అక్కడందరూ కంటెంట్ కింగ్లే. అన్నట్టు ఇక్కడ యూట్యూబర్లలో మహిళలే ఎక్కువట.అందుకే ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న తులసి గ్రామాన్ని యూట్యూబర్స్ గ్రామంగా పేరుపడింది. ఈ గ్రామంలో దాదాపు 432 కుటుంబాలుంటాయి. వారి జనాభా 3-4వేల మధ్య ఉంటుంది. వీరిలో 1000 మంది యూట్యూబ్ ద్వారా తమ ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ గ్రామంలో నివసించే 5 ఏళ్ల చిన్నారి నుంచి 85 ఏళ్ల అమ్మమ్మ వరకు యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉంటారంటే అతిశయోక్తి కాదు. తమ స్పెషల్ స్కిట్లకోసం గ్రామస్తులంతా ఏకమవుతారు. ప్రతి ఒక్కరూ తలొక పాత్ర పోషిస్తారు.సామాజిక మార్పుకు నాంది పలికేందుకు యూట్యూబ్ ఒక వేదికగా మారిందనీ, మరింత ఆర్థిక సాధికారితను యూట్యూబ్ తీసుకువచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. యూట్యూబర్లలో, మహిళలే ఎక్కువగా ఉన్నారు. గతంలో జీవనోపాధికి తక్కువ అవకాశాలు ఉన్న మహిళలు ఇప్పుడు స్వతంత్రంగా దీని ద్వారా ఆర్జిస్తున్నారు. అంతేకాదు చెడు అలవాట్లు, నేరాల నుండి పిల్లలను దూరంగా ఉంచుతోందంటున్నారు గ్రామస్తులు. ఇదీ చదవండి: చిన్న కోడలు రాధికపై నీతా అంబానీ ప్రశంసలుకాగా తులసి గ్రామంలో నివసిస్తున్న ఇద్దరు స్నేహితులు జైవర్మ, జ్ఞానేంద్ర 2016లో యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించారు. చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం ఉన్న జై వర్మ అంతకుముందు ఒక కోచింగ్ సెంటర్‌ను నడిపేవాడు. అందులో 11వ తరగతి నుండి పిల్లలకు పాఠాలు చెప్పేవాడు. ఆ తర్వాత పొరుగున ఉండే జ్ఞానేంద్రతో కలిసి యూట్యూబ్, స్టడీ, కామెడీ వీడియోలను అప్లోడ్ చేయడం ప్రారంభించాడు. ప్రారంభంలో చాలా టెక్నికల్ సమస్యలు,కాపీ రైట్ సమస్యలు వచ్చేవి. కానీ వాటన్నింటినీ అధిగమించి సక్సెస్ అయ్యారు. అలా ఇది మంచి ఆదాయ వనరుగా మారడంతో అందరూ అటు వైపు మళ్లారు. మొదట్లో మొబైల్ ఫోన్లలో షూట్ చేసేవారు కాస్తా ఇప్పుడు కెమెరాలు, ఇతర షూటింగ్ పరికరాలను సమకూర్చుకున్నారు. హాస్యానికి అద్దం పట్టాలన్నా, విజ్ఞాన భాండాగారాన్ని అందించాలన్నా, చిన్న పిల్లలనుంచీ పెద్దల వరకు అంతా సిద్ధంగా ఉంటారు.ఇదీ చదవండి: భారీ ఊరట: ఆ మూడు కేన్సర్లకు త్వరలో వ్యాక్సీన్ -
సమ్‌థింగ్ స్పెషల్: గాల్లో ఎగిరొచ్చి పరీక్ష, ఇది కారా, బైకా?
‘ఎగ్జామ్ సెంటర్‌కు ఎలా వెళతారు?’ అనే ప్రశ్నకు జవాబు తెలియనిదేమీ కాదు. అయితే ఈ స్టూడెంట్ మాత్రం తన రూటే సెపరేట్ అని నిరూపించుకున్నాడు. ‘మనసు ఉంటే ఇలాంటి మార్గం కూడా ఉంటుంది’ అని చెప్పకనే చెప్పాడు. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన బీకామ్ విద్యార్థి సమర్థ్ మహంగాడే పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి ఎవరూ ఊహించని మార్గాన్ని ఎంచుకున్నాడు. రోడ్డుమీద వెళ్లకుండా ట్రాఫిక్ జామ్ భయంతో సమర్థ్ ఎంచుకున్న మార్గం... పారాగ్లైడ్!ప్రముఖ పర్యాటక కేంద్రం పంచగనిలో సమర్థ్ చిన్న జ్యూస్ స్టాల్ నడుపుతున్నాడు. పరీక్ష కేంద్రం అక్కడి నుంచి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది, సమయం ఇంకా ఇరవై నిమిషాలు మాత్రమే ఉంది. ట్రాఫిక్ రద్దీ కారణంగా అక్కడికి సకాలంలో చేరుకోవడం అసాధ్యం అనుకున్న సమర్థ్ అసాధారణ మార్గాన్ని ఎంచుకున్నాడు. పారాగ్లైడింగ్ గేర్ ధరించిన సమర్థ్ గాలిలో ఎగురుతూ పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకున్నాడు. ఇందు కోసం అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎక్స్పర్ట్ గోవింద్ యెవాలే సహాయం తీసుకున్నాడు. తన బృందం సహాయంతో సమర్థ్‌కు అన్నిరకాల ఏర్పాట్లు చేసి తోడ్పాటు అందించాడు గోవింద్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.A Panchgani student paraglided 15 km to make it to his exam on time as the traffic was very high on the roads. 100 marks for creative problem solving! #ExamHacks #OnlyInIndia pic.twitter.com/YzFYKRWnSx— Harsh Goenka (@hvgoenka) February 17, 2025బైక్+కారు= బైకార్ కొన్ని వారాల క్రితం పాకిస్థాన్‌కు సంబంధించి హోమ్మేడ్ టెస్లా సైబర్ ట్రక్ రెప్లికా వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇక తాజా విషయానికి వస్తే... సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో ఒక పాకిస్థానీ వ్యక్తి విచిత్రమైన, ఆకర్షణీయమైన హైబ్రీడ్ వాహనంలో ప్రయాణిస్తున్నాడు. ఈ వాహనాన్ని కారు అనలేము. అలా అని బైక్ అనలేము. ఎందుకంటే సగం కారు, సగం బైక్ ‘కళ’యిక ఈ వాహనం!వాహనం ముందుభాగంలో మోటర్ సైకిల్ హ్యాండిల్ బార్, వీల్ కనిపిస్తాయి. ‘వోన్లీ ఇన్ పాకిస్థాన్’ ట్యాగ్‌లైన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్‌ను చూసి ‘అయ్ బాబోయ్’ అంటున్నారు నెటిజనులు. కొందరు ఈ విచిత్ర వాహనాన్ని సల్మాన్‌ఖాన్ ‘కిక్’ సినిమాలో ఉపయోగించిన వాహనంతో పోల్చారు. ‘కిక్ సినిమాతో ఇన్స్పైర్ అయ్యి ఈ బైక్ ప్లస్ కారును తయారు చేశారు’ అని రాశారు. ఈ వీడియో మూడు మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకోవడం మాట ఎలా ఉన్నా.... ‘సరదాలు, ప్రయోగాల సంగతి సరే... రోడ్ సేఫ్టీ మాటేమిటి’ అని ఘాటుగా ప్రశ్నించారు కొందరు. నిజమే కదా! -
ఆయనో స్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్! మీనా పెళ్లిలో మాత్రం భావోద్వేగంతో..
సముద్రం సునామీగా ముంచెత్తి దాదాపు 6 వేల మందిని పొట్టనబెట్టుకుంది. అంతటి ప్రళయం నుంచి అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడినవాళ్లు కొందరే. అందులో రెండేళ్ల ఓ పసిప్రాణం కూడా ఉంది. పసికందుగా ఆమెను తన చేతుల్లోకి తీసుకున్న ఆ ఐఏఎస్ అధికారి.. ఇప్పుడు తండ్రి స్థానంలో ఆమెపై అక్షింతలు జల్లి దీవించి భావోద్వేగానికి లోనయ్యారు. హృదయాన్ని హత్తుకునే ఈ ఘటనలోకి వెళ్తే.. డిసెంబర్ 26, 2004 ముంచెత్తిన సునామీలో తమిళనాడుకు జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే. నాగపట్టణంలో సహాయక చర్యలు పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం స్ట్రిక్ట్ ఆఫీసర్‌గా పేరున్న రాధాకృష్ణన్‌కు అప్పగించింది. అప్పుడు ఆయన తంజావూరు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో.. డిసెంబర్ 28వ తేదీన కీచన్‌కుప్పం ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్న బృందాలకు.. శిథిలాల కింద ఓ పసికందు ఏడుపులు వినిపించాయి. దాదాపు రెండేళ్ల వయసున్న చిన్నారిని సురక్షితంగా బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించారు. అదృష్టం కొద్దీ ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఆ సునామీ నుంచి బయటపడిన అతిచిన్న వయస్కురాలు కూడా ఆమెనే!. అయితే ఆమె తల్లిదండ్రులు ఏమయ్యారో తెలియదు. అలాంటప్పడు చిన్నారి సంరక్షణ బాధ్యతలు ఎలా? అని అధికారులు ఆలోచన చేశారు.ఈలోపు.. విషయం తెలిసిన అప్పటి జిల్లా కలెక్టర్ రాధాకృష్ణన్-కృతిక దంపతులు ముందుకు వచ్చారు. ఆ చిన్నారికి మీనా అని పేరు పెట్టి.. అన్నై సత్య ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించారు. అప్పటి నుంచి ఆమె సంరక్షణ మొత్తం ఆ జంటే చూసుకుంటూ వచ్చింది. ఈలోపు రాధాకృష్ణన్‌కు ట్రాన్స్ఫర్ అయ్యింది. అయితే మరో ప్రాంతానికి బదిలీ అయినప్పటికీ.. రాధాకృష్ణన్ జంట మీనా సంరక్షణ బాధ్యతను మరిచిపోలేదు. వీలు చిక్కినప్పుడల్లా ఆమె దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. అదే ఆశ్రమంలో సౌమ్య ఆమెకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది. అలా.. ఏళ్లు గడిచిపోయాయి. సాధారణంగా 18 ఏళ్లు నిండిన తర్వాత.. వాళ్లకు ఆశ్రమంలో కొనసాగడానికి వీలు ఉండదు. ఆశ్రమంలో సౌమ్య, మీనాలకు మాత్రమే ఈ ఇబ్బంది ఎదురైంది. విషయం తెలిసి.. రాధాకృష్ణన్ ముందుకొచ్చారు. మీనా, సౌమ్య బాధ్యతలకు దాతల సహకారం తీసుకున్నారు. అలా.. వాళ్లిద్దరూ ఉన్నత చదువులు పూర్తి చేసుకున్నారు. అలా వాళ్లిద్దరికీ తండ్రికాని తండ్రిగా మారిపోయారు.రెండేళ్ల కిందట.. సౌమ్య ఓ టెక్నీషియన్‌ను వివాహం చేసుకుంది. ఆ వివాహానికి సౌమ్య తరఫున పెద్దగా రాధాకృష్ణన్ హాజరై ఆశీర్వదించారు. కిందటి ఏడాది సౌమ్య ఓ బిడ్డకు జన్మనిస్తే.. ఇంటికి పిలిపించుకుని మరీ మనవరాలిని దీవించారు. ఇక మీనా వయసు ఇప్పుడు 23 ఏళ్లు. నర్సింగ్ పూర్తి చేసుకుంది. మీనాను వివాహం చేసుకునేందుకు మణిమరన్ అనే బ్యాంక్ ఉద్యోగి ముందుకు వచ్చాడు. విషయం తెలిసి రాధాకృష్ణన్ సంతోషించారు. ఫిబ్రవరి 2వ తేదీన నాగపట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మీనా-మణిమరన్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహ వేడుకకు సౌమ్య తన భర్త, కూతురితో హాజరైంది. ప్రస్తుతం రాధాకృష్ణన్ ప్రభుత్వంలో అదనపు చీఫ్ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దత్త పుత్రిక వివాహానికి స్వయంగా హాజరై తండ్రి స్థానంలో ఉండి తన బాధ్యతను నిర్వర్తించారు. ఆశ్రమంలో సౌమ్య-మీనాలు గడిపిన రోజులను, వాళ్ల స్నేహాన్ని, ఆశ్రమ నిర్వహణకు సహకరించిన సూర్యకళను ఆయన గుర్తు చేసుకున్నారు. అన్నింటికి మించి.. 2018లో గాజా తుపాన్ సమీక్ష కోసం వెళ్లినప్పుడు మీనా తనను ‘‘నాన్నా..’’ అని పిలవడాన్ని గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఆ వివరాలను ఆయనే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం గమనార్హం. -
ఫ్యామిలీ మ్యాన్ 3 విలన్ జైదీప్ అహ్లవత్ : 110 నుంచి 83 కిలోలకు ఎలా?
ది ఫ్యామిలీ మ్యాన్-3 విలనిజం పండిచబోతున్న నటుడు జైదీప్ అహ్లవత్ ఇపుడు ట్రెండింగ్‌లో ఉన్నాడు. మరీ ముఖ్యంగా భారీ బరువు నుంచి బరువును తగ్గించుకుని కండలు తిరిగిన దేహం స్మార్ట్ తయారైనాడు. ఐదు నెలల్లో 27 కిలోలు తగ్గాడు. దీని కోసం భారీ కసరత్తులే చేశాడు.ఫలితంగా 109.7 కిలోల నుండి 83 కిలోలకు చేరుకున్నాడు. ఈజీ చిట్కాలు, ట్రెండీ డైట్ లాంటివి కాకుండా 27 కిలోల బరువు తగ్గేందుకు ఎలాంటి ఆహారాన్ని తీసుకున్నాడు? అహ్లవత్ వెయిట్‌లాస్ జర్నీని క్రమంలో తెలుసుకుందామా?బాలీవుడ్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన నటుడు జైదీప్ అహ్లవత్. ముఖ్యంగా పాతాళ్ లోక్‌లో హతీ రామ్ చౌదరి పాత్ర ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. అలాగే విలన్‌గా గాకుండా రొమాంటిక్ మూవీలు చేయాలని ఉందనే కోరికనుకూడా వ్యక్తం చేశాడు. సినిమాల్లో మరింత రాణించాలనే పట్టుదలతో తనబాడీని అద్భుతంగా తీర్చుదిద్దుకున్నాడు. ఈ వెయిట్ టాస్ జర్నీ అచంచలమైన క్రమశిక్షణ, ఫిట్నెస్ పట్ల అంకితభావం , కఠినమైన ఆహార నియమావళికి నిదర్శనంగా నిలుస్తోంది.ఇందుకోసం అహ్లవత్ తీవ్రమైన వ్యాయామాల ద్వారా తన బాడీని మల్చుకున్నాడు. చీట్ మీల్స్ , చిన్ని చిన్ని వ్యాయామలు లాంటి సాకులు లేకుండా పూర్తి నిబద్ధతతో తనలక్ష్యంవైపు గురిపెట్టాడు. ఇది తీవ్రమైన బరువు తగ్గడానికి కేలరీలను తగ్గించుకోవడం చాలా అవసరం. లాక్డౌన్ తర్వాత నే దాదాపు ఒక సంవత్సరం పాటు వ్యాయామం చేయకపోవడంతో చాలా బరువు పెరిపోయానని, మళ్లీ టోన్డ్ బాడీకోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని ఒకసందర్బంలో తెలిపాడు . తన ట్రైనర్ ప్రజ్వల్ దర్శకుడు సిద్ధార్థ్ పి మల్హోత్రా ప్రోత్సాహంతో బరువు తగ్గినట్టు చెప్పాడు. ఈ విశేషాలు ఇన్‌స్టాలో తన ఫ్యాన్స్‌తో షేర్ చేశాడు. 2024లో సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వంలో వచ్చిన మూవీ మహారాజ్ పాత్రకోసం ఈ జర్నీని షురూ చేశాడు.అహ్లవత్ పాటించిన నియమాలు, స్పష్టమైన లక్ష్యాలుబరువు తగ్గించే ప్రయాణాన్ని ప్రారంభించే ముందు, స్పష్టమైన,సాధించగల లక్ష్యాలపై స్పష్టత ఉండాలి. సులువుగా, త్వరగా బరువు తగ్గడం ఆకర్షణీయంగా అనిపించవచ్చు. కాని వారానికి 0.5 నుండి 1 కిలోలు తగ్గాలనేది గోల్ పెట్టుకోవడం ఉత్తమం. ఇది ఎక్కువ కాలం ఈ జర్నీని కొనసాగించేలా ప్రేరేపిస్తుంది.కేలరీల లెక్కింపు కంటే పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వండిసరైన పోషకాహారం లేకుండా కేలరీలను తీవ్రంగా తగ్గించడం వల్ల కండరాల నష్టం, పోషక లోపాలు, జీవక్రియ మందగమనం లాంటివి రావచ్చు.కేలరీలను లెక్కించడానికి బదులుగా, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ , సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తినాలి.చాలామంది బరువు తగ్గడానికి కార్డియోపై మాత్రమేదృష్టి పెడతారు. బరువులు ఎత్తడం కండరాలు, ఎముకలు బలోపేతానికిసహాయపడుతుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది. కోల్పోయిన బరువులో ఎక్కువ భాగం కండరాలు నష్టపోకుండా కొవ్వు కరిగేలా చేస్తుంది. ఫ్యాడ్ డైట్లు త్వరగా బరువు తగ్గడానికి దారితీయవచ్చు కానీ , పాటించడం కష్టం, ఆరోగ్య సమస్యలొస్తాయి. దీనికి బదులుగా, స్థిరమైన, సమతుల్యమైన ఆహార ప్రణాళికను స్వీకరించాలి. క్రమంగా జీవనశైలి మార్పులు దీర్ఘకాలిక విజయానికి దారితీస్తాయి.హైడ్రేటెడ్‌గా ఉంటూ, ఎలక్ట్రోలైట్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. శరీరానికి తగినన్నినీళ్లు అందించడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది, ఆకలి అదుపులో ఉంటుంది, మొత్తం జీవక్రియకు సాయపడుతుంది. ఇది బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎక్కువగా బరువుగా తగ్గినపుడు శరీరం ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతుంది, ఇది అలసట, కండరాల తిమ్మిరి, తలనొప్పికి దారితీస్తుంది. కనుక శరీరం హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి.నిద్ర లేమి, అధిక ఒత్తిడి అనారోగ్యకరమైన ఆహారాలపై కోరికలను పెంచుతాయి. ఆకలి, జీవక్రియను నియంత్రించే హార్మోన్లను అంతరాయం కలిగించడం ద్వారా బరువు తగ్గించే ప్రయత్నాలను దెబ్బతీస్తాయి. సో..కనీసం 7–9 గంటల నాణ్యమైన నిద్ర ఉండాలి.ఎప్పటికపుడు ఎంత బరువు తగ్గుతున్నాం, బాడీ కొలతలు, ఫోటోలు, బట్టలు ఇలాంటి పారామీటర్లను చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవి విజయానికి ముఖ్యమైన గుర్తులు. ఒక వేళ అనుకున్నఫలితం రాకపోయినా నిరాశ పడకుండా వ్యాయామ తీవ్రతను సర్దుబాటు చేయడం, ప్రోటీన్ ఇన్‌టేక్ పెంచడం, లేదా ఇంటర్మిటెంట్ ఉపవాసంపై శ్రద్ధపెట్టాలి. ఇలా కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ, గణనీయమైన బరువును తగ్గించుకోవడంతోపాటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. -
సినిమాను మించిన సింగర్ లవ్ స్టోరీ : అదిగో ఉడుత అంటూ ప్రపోజ్!
సింగింగ్ సెన్సేషన్ శ్రేయా ఘోషల్(Shreya Ghoshal) తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం, బెంగాలీ, అస్సామీ ఇలా పలు భాషల్లో పాటలు పాడి పాన్ ఇండియా సింగర్‌గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే గాయనీమణి ఆమె. ఎన్నో జాతీయ అవార్డులు. ఏ భాషలో పాడినా అత్యంత సహజంగా తన గానమాధుర్యంతో అలరించడం ఆమె స్పెషాల్టీ. అందుకే కోట్లాదిమంది సినీ సంగీతా భిమానులకు, మరెంతోమంది గాయకులకు ఆరాధ్యదైవం. తాజాగా శ్రేయా ఘోషల్ లవ్ స్టోరీ నెట్టింట సందడిగా మారింది. సింగర్ శ్రేయ భర్త ఎవరు? ఆయనను తొలిసారి ఎక్కడ చూసింది, ఎవరు ప్రపోజ్ చేశారు. ఈ వివరాలన్నీ తెలుసుకుందాం.శ్రేయ ఘోషాల్ ప్రేమకథ (Love Story అద్భుతమైన సినిమా స్టొరీ కంటే తక్కువేమీకాదు. శ్రేయా ఘోషల్ భర్త పేరు శిలాదిత్య ముఖోపాధ్యాయ (Shiladitya Mukhopadhyaya). ఖ ట్రూకాలర్ గ్లోబల్ హెడ్. వీరి వివాహం 2015, ఫిబ్రవరి 5న జరిగింది. పెళ్లయిన ఆరేళ్లకు 2021లో వీరికి కుమారుడు దేవయాన్ జన్మించాడు.శ్రేయా ఘోషల్, శిలాదిత్య ప్రేమకథపాఠశాల విద్యార్థులగా ఉన్నప్పటినుంచే వీరి మధ్య ప్రత్యేకమైన అభిమానం ఉండేది. 10 ఏళ్ల డేటింగ్ తరువాత వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అయితే తనకు లవ్ ప్రపోజ్ చేయడానికి శిలాదిత్య పడిన కష్టాలను ఒక సందర్భంగా శ్రేయా స్వయంగా వెల్లడించింది. శిలాదిత్య తన స్నేహితుడి వివాహంలో శ్రేయాకు ప్రపోజ్ చేశాడట. చాలా రోజులుగా ఇద్దరి మనస్సులో ఉన్నప్పటికీ వ్యక్తం చేసుకోవడానికి సమయం దొరకలేదు. ఇద్దరూ కలిసి స్నేహితుడి పెళ్లి పెళ్లారు. ఈ సందర్భంగానే ఎలాగైనా తన మనసులోని మాటను చెప్పేయాలని శిలాదిత్య ప్లాన్ చేసుకున్నాడు. కానీ విషయం అస్సలు శ్రేయాకు తెలియదు. ఇద్దరూ ఒక చోట కూర్చుని ఉండగా, అదిగో ఉడుత అని తన దృష్టి మళ్లించి, మోకాలిమీద కూర్చుని రింగ్‌తో ప్రపోజ్ చేశాడు. నిజంగానే నవలల్లో చదివినట్టుగా, సినిమాలో చూపించినట్టుగానే జరిగింది..అస్సలేమీ అర్థం కాలేదు అంటూ తన మూడో వివాహ వార్షికోత్సవం (గతంలో) సందర్భంగా వెల్లడించింది.కాగా శ్రేయా ఘోషల్ 1984లో మార్చి 12,న పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లోని ఒక బెంగాలీ కుటుంబంలో జన్మించింది. రాజస్థాన్ కోట సమీపంలోని రావత్భట అనే చిన్న పట్టణంలో పెరిగింది. నాలుగేళ్ల వయసునుంచే శాస్త్రీయ వాయిద్యం, హార్మోనియం నేర్చుకుంది. గురువు మహేష్ చంద్ర శర్మ నుండి సంగీత పాఠాలు నేర్చుకుంది. శ్రేయ తొలి స్టూడియో ఆల్బమ్ 1998లో బెంధెచ్చి బీనా పేరుతో విడుదలైంది. సరేగమా టీవీ రియాలిటీ షో ద్వారా ప్రసిద్ధి చెందింది. 16 ఏళ్ల వయసులో సంజయ్ లీలా భన్సాలీ రొమాంటిక్ మూవీ దేవదాస్ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలిసినిమాకే జాతీయ అవార్డు ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. అప్పటినుంచి సినీ సంగీత లోకాన్ని ఏలుతోంది. 2012లో భారత దేశంలోని ప్రముఖుల ఆదాయం, ప్రజాదరణ ఆధారంగా రూపొందించిన 100 ఫోర్బ్స్ సెలబ్రిటీ జాబితాలో చోటు సంపాదించుకుంది. తొమ్మిది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, అనేక జాతీయ అవార్డులు ఆమె ఖాతాలో చేరాయి. 2017లో, ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో భారతీయ విభాగంలో మైనపు విగ్రహాన్ని పొందిన తొలి గాయకురాలు కూడా శ్రేయా ఘోషల్ కావడమ విశేషం. గాయనిగా, ప్రదర్శకురాలిగా, ప్లేబ్యాక్ సింగర్‌గా, సంగీత కంపోజర్‌గా రాణిస్తున్న ఆమె ఆదాయం సుమారు రూ. 240కోట్ల మేర ఉంటుందని అంచనా. ఇక ఆమె భర్త శిలాదిత్య ముంబై యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ట్రూకాలర్ కంటే ముందు ఆయన గతంలో కాలిఫోర్నియాలోని ఓ ప్రముఖ కంపెనీలో కూడా పనిచేశారని సమాచారం.ఇదీ చదవండి : Maha Kumbh Mela 2025: కలియుగ శ్రవణ్ కుమరుడు ఇతడు... -
మూడే మూడు చిట్కాలతో మిరాకిల్ : దెబ్బకు 8 కిలోలు తగ్గింది!
అసాధ్యం అనుకున్నదాన్ని సాధ్యం చేసిన చూపించిన వాళ్లే స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. చదువులో ర్యాంకు సంపాదించాలన్నా, మంచి ఉద్యోగం సాధించాలన్నా లక్ష్యం వైపు మన గురి, ఓపికతో మనం చేసిన ప్రయత్నాలే కీలకం. అలా పట్టుదల,ఓపిక తన డ్రీమ్‌ను సాకారం చేసుకున్న షీ’రో గురించి ఇపుడుతెలుసుకుందామా..!దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన మహిళ రవిషా చిన్నప్ప అనూహ్యంగా బరువు తగ్గి అందర్నీ సర్ప్రైజ్ చేసింది. కేవలం 34 రోజుల వ్యవధిలో 8 కిలోల బరువు తగ్గింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా విజయరహస్యాన్ని వెల్లడించింది. మంచి ఆహారం, స్థిరమైన వ్యాయామం ద్వారానే ఇది సాధించానని తెలిపింది. Ravisha Chinappa ('IVF Momma') ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన కథనం ప్రకారం తొలుత ఆమె 55 కిలోల బరువునుండి 47 కిలోలకు తగ్గింది. ఈ ప్రయాణం చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. ఒక పాపకు తల్లి అయిన రవీషా తాను గర్భం దాల్చిన తర్వాత అప్పుడు పెరిగిన బరువు, గత ఏడాది కాలంగా తగ్గడం లేదు. దీంతో మూడు సీక్రెట్స్‌ను పాటించాను. అవే తన బరువు తగ్గడానికి చాలా దోహదపడ్డాయని వెల్లడించింది. అంతేకాదు ఇంతకు ముందు తాను చాలా ప్రయత్నించినా విజయం సాధించలేదనీ, కానీ ఈ మూడు మార్గాలను స్వీకరించిన తర్వాత వేగంగా 8 కిలోల బరువు తగ్గానని తెలిపింది.మూడు చిట్కాలుజీవనశైలి,ఆహార మార్పులు : జీవనశైలి, శారీరక సామర్థ్యం, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. సానుకూలంగా, తన ఫిట్నెస్ లక్ష్యాలను దృశ్యమానం చేసుకుంది.ఆహారం,వ్యాయామ దినచర్య, ప్రతీ గంటన్నకు ఒకసారి నీళ్లు ఇవే ఆమె మార్గాలు. రోజువారీ 100 గ్రాముల ప్రోటీన్ తీసుకుంది ఎక్కువ ప్రోటీన్, తక్కువ కార్బ్ ఆహారం నియమాన్ని పాటించింది. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, సలాడ్లను ఎక్కువగా తీసుకుంది. తద్వారా చక్కెర, జంక్ ఫుడ్‌ను నివారించింది.కొంచెం బలమైన కార్డియో, యోగా చేసింది. ప్రతిరోజూ 45 నిమిషాల నుండి 1 గంట వ్యాయామం చేసింది. ఇందులో పరుగు, ప్లాంక్స్, వెయిట్ లిఫ్టింగ్ ఉన్నాయి.నీళ్లు : అలారం సెట్ చేసుకుని మరీ ప్రతిరోజూ 3-4 లీటర్ల చొప్పున నీళ్లు తాగింది. నీళ్ళు కొవ్వును కరిగిస్తాయి,మంచి అందాన్నిస్తాయని ఆమె అనుభవం. ఆకలి ఎక్కువగా అనిపిస్తే.. తక్కువ మోతాదులో రోజుకు 5-6సార్లు తినవచ్చట. View this post on Instagram A post shared by IVF momma 🌈🍍 (@ravisha.chinnappa)మానసిక ఆరోగ్యంపై దృష్టిఒత్తిడిని తగ్గించుకునేందుకు మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి రోజువారీ ధ్యానం సాధన చేసింది. అంకితభావం, సరైన ఆహారం, వ్యాయామం ,మానసిక శ్రేయస్సు , జీవనశైలిమార్పులు తమ వెయిట్ లాస్ జర్నీకి కీలకంగా పనిచేసాయని తెలిపింది. ఇదీ చదవండి : మీరందరూ తప్పకుండా ఇలా చేయాలనేదే నా కోరిక: సమంతాఅతిలోకసుందరి వారసురాలు జాన్వీకపూర్ లగ్జరీ ఇల్లు : ఎంత వైభోగమో! -
శానిటరీ ప్యాడ్ అడిగితే.. ఇంత దారుణమా! నెటిజన్ల ఆగ్రహం
పీరియడ్స్ లేదా ఋతుచక్రం అనేది మహిళలకు, ముఖ్యంగా చదువుకునే వయసులో ఆడపిల్లలకు ఎంత బాధాకరమో చాలా కొద్దిమందికే తెలుసు. ఆ నాలుగు రోజులు అనుభవించే శారీరక బాధలు కంటే.. సామాజికంగా అనుభించే క్షోభే దుర్భరమైంది. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన దారుణం ఈ విషయాన్నే మరోసారి గుర్తు చేసింది. 11 ఏళ్ల బాలికపట్ల అమానవీయంగా వ్యవహరించిన ఘటన విమర్శలకు దారితీసింది.ఉత్తరప్రదేశ్‌లోని బాలికల పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎంతో ఉత్కంఠతో పరీక్ష రాయడానికి వచ్చింది. సరిగ్గా ఈ సమయంలోనే ఆమెకు పీరియడ్స్ స్టార్ట్ అయింది. (చాలా మంది అమ్మాయిలకు ఇలాంటి సమస్య ఎదురౌతుంది. పరీక్ల ఒత్తిడి వల్ల రావాల్సిన సమయం కంటే ముందే మెన్సస్ సైకిల్ మొదలువుతుంది. ఈ సమయంలో వారు పడే కష్టాలువేదన వర్ణనాతీతం) టైం కంటే ముందే రావడంతో ప్రిపేర్డ్గాలేని బాలిక శానిటరీ ప్యాడ్కోసం ప్రిన్సిపాల్‌ను అడిగింది. సానుభూతి చూపించి సహాయం చేయడానికి బదులుగా ఆమేదో పెద్ద నేరంచేసినట్టు వ్యవహరించారు. దాదాపు గంటపాటు క్లాస్ రూం వెలుపల నిలబెట్టేశారు. శనివారం చోటు చేసుకున్న ఈ అమానుష ఘటనపై నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది.ఒక పక్క పీరియడ్స్..కాళ్లు, నడుము నొప్పితోపాటు రక్త స్రావం పెరుగుతూ ఉంటుంది. ఈ బాధలకంటే. దుస్తులకు ఎక్కడ రక్తపు మరకలు అంటు కుంటాయో అన్న బెంగ, భయం. ఇవన్నీ ఇలా ఉంటే.. గంటసేపు బయటనిలబెట్టడంతో అవమాన భారంతో ఆ బాలిక ఎంత వేదన పడి ఉంటుందో అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.మరోవైపు బాలిక తండ్రి ఫిర్యాదుతో సంఘటనపై అధికారిక విచారణ జరుగుతోంది.జిల్లా మేజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (DIOS), రాష్ట్ర మహిళా కమిషన్ , మహిళా సంక్షేమ శాఖకు అధికారికంగా ఆయన ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. విచారణ జరుగుతోందని జిల్లా ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ దేవ్కీ నందన్ ధృవీకరించారు. విచారణ అనంతరం, వాస్తవాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చదవండి: చదివింది 10వ తరగతే..ముగ్గురు పిల్లలు : అట్టడుగు స్థాయినుంచి వ్యాపారవేత్తగాచాలా కాస్ట్లీ గురూ! ఉప్పు పేరు చెబితేనే గూబ గుయ్య్..! -
అపుడు వాచ్‌మెన్‌గా, ఇపుడు దర్జాగా : శభాష్ రా బిడ్డా! వైరల్ స్టోరీ
పిల్లలు ప్రయోజకులైనపుడు ఆ తల్లితండ్రులు ఆనందంతో పొంగిపోతారు. తమ కష్టం ఫలించి కలలు నెరవేరాలని వేయి దేవుళ్లకు మొక్కుకుని, ఆశలు ఫలించాక వారికి కలిగే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. అలాంటి ఊహించిన దానికంటే మరింత ఉన్నత స్థితికి చేరితే .. ఆ ఆనందానికి అవధులు ఉండవు. సుమతీ శతకకారుడు చెప్పినట్టు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు పుట్టినపుడు కాదు, ప్రయోజకుడై తమకు గర్వంగా నిలిచినపుడు కలిగేది. అలాగే పిల్లలు కూడా అమ్మానాన్న కల నెరవేర్చాలని కలలు కంటారు. మంచి చదువు చదివి, ఉన్నతోద్యోగం సంపాదించాక కన్నవారిని ఆనందంగా అపురూపంగా చూసుకోవాలని పట్టుదలగా ఎదుగుతారు. తమ కలను సాకారం చేసుకొని పేరెంట్స్ కళ్లలో ఆనందం చూసి పొంగిపోతారు. అలాంటి ఆనందదాయకమైన స్ఫూర్తిదాయకమైన నిజజీవిత కథనం గురించి తెలుసుకుందాం.న్యూఢిల్లీకి చెందిన ఒక తండ్రికి ఇలాంటి అద్భుతమైన ఆనందమే కలిగింది. ఖగోళ శాస్త్రవేత్త ఆర్యన్ మిశ్రా తన సొంత తన తండ్రినీ, తల్లినీ లగ్జరీ హోటల్ ఐటీసీకి ఎలా తీసుకువచ్చాడో పంచుకున్నాడు. ఎక్స్( ట్విటర్)లో ఆయన షేర్ చేసిన ఈ స్టోరీ ఇంటర్నెట్ను విపరీతంగా ఆకర్షిస్తోంది. 20 లక్షలకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది.ఆర్యన్ తండ్రి ఐటీసీ హోటల్లో 1995- 2000 వరకు 25 సంవత్సరాలు వాచ్‌మెన్‌గా పనిచేశాడు. పాతికేళ్ల తరువాత అదే హోటల్‌కు భార్యతో కలిసి గెస్ట్‌గా రావడమే ఈ స్టోరీలోని విశేషం. దీనికి సంబంధించిన ఫోటోను కూడా ఆర్యన్ ట్వీట్ చేశారు. తరువాత విందు కోసం అతిథిగా పనిచేశాడు. వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నపుడు.. ఇదే హెటల్‌కి డిన్నర్‌కి వస్తానని బహుశా ఆయన ఊహించి ఉండడు. కానీ అతని కొడుకు మాత్రం తండ్రికి అంతులేని ఆనందాన్ని మిగిల్చాడు. బిడ్డల్ని పోషించేందుకు అహర్నిశలు శ్రమించే తల్లిదండ్రులకు ఇంతకంటే సంతోషం ఇంకేముంటుంది.ఈ స్టోరీ గురించి తెలుసుకున్న నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. తండ్రీ కొడుకులకు అభినందనలు తెలిపారు. తండ్రిని ఇంత బాగా సత్కరించినందుకు మరికొందరు మిశ్రాను ప్రశంసించారు. “మీ విజయోత్సాహంలో ఈ క్షణాలు చాలా గొప్పవి. మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి” అని ఒక యూజర్ చెప్పారు.My father was a watchman at ITC in New Delhi from 1995-2000; today I had the opportunity to take him to the same place for dinner :) pic.twitter.com/nsTYzdfLBr— Aryan Mishra | आर्यन मिश्रा (@desiastronomer) January 23, 2025 “మీరు ఎవరో నాకు తెలియదు, కానీ ఇంత అందమైన కథ చదివినప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోయింది. చాలా సంతోషంగా ఉంది” అని ఒక రాశారు. మరొకరు ఒక హృదయ విదారక జ్ఞాపకాన్ని పంచుకుంటూ, “చాలా అందంగా ఉంది. నాకర్తవ్యాన్ని గుర్తు చేశారు. అపుడు ఎక్కువ ఖర్చు చేయలేకపోయాము. ఇప్పుడు నేను చేయగలను, కానీ విధి మరోలా ఉంది’’ అన్నారు. చాలా సంతోషం.. ఈ భగవంతుడు మీకుటుంబాన్ని చల్లగా చూడాలి అంటూ చాలామంది ఆశీర్వదించారు. -
‘బాహుబలి ఫ్యామిలీ’ నెట్టింట వైరల్, ఎవరీ గేమ్ ఛేంజర్!
ఒక భార్య, ఓ నలుగురో , ఐదుగురో కొడుకులు, కుమార్తెలు,20-30 మంది మనవలు మనవరాళ్లతో అలరారే కుటుంబాన్ని పెద్ద కుటుంబం అంటూ ఉంటాం. మరి 12 మంది భార్యలు, 102 మంది పిల్లలు , 578 మంది మనవళ్లు ఉన్న ఫ్యామిలీని ఏమని పిలవాలి? 12 మంది భార్యలా? 102 మంది సంతానమా అని నోరెళ్ల బెట్టకండి. నిత్యం ఆకలి , కరువుతో సతమతమయ్యే ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఉగాండాలో ఉందీ బాహుబలి ఫ్యామిలీ.తూర్పు ఉగాండాలోని ముకిజాకు చెందిన 70 ఏళ్ల ముసా హసహ్య కసేరా (MusaHasahyaKasera) ఈ జెయింట్ ఫ్యామిలీకి మూల పురుషుడు. ఈయనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది. 'దిఇండోట్రెక్కర్' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ అయిన ఈ వీడియోకు ఒక్క రోజులోనే 8.6 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.1972లో 17 ఏళ్ల వయస్సులో వివాహం చేసుకోవడంతో అతని పెళ్లిళ్ల పరంపర మొదలైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 మందిని వివాహం చేసుకున్నాడు. వీరికి 102 మంది పిల్లలు పుట్టారు. అంటే ఒక్కో భార్యకు దాదాపు తొమ్మిది మంది. అంతేనా మరో 578 మంది వారసులకు తాత కూడా. దశాబ్దాలుగా, అతని కుటుంబం అలా విస్తరిస్తూ పోయింది. అతని పిల్లలు ఇప్పుడు 10 - 50 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నారు. అతని భార్యలలో చిన్న ఆమెకు 35 ఏళ్ల వయస్సు. ఇపుడు ఈ సంతానం కడుపు నింపేందుకు నానా పాట్లు పడటమే కాదు, మనవలు,మనవరాళ్ల పేర్లు గుర్తు పెట్టుకోవడం కూడా కష్టంగా ఉందట ముసాకు. అందుకే ఒక రిజిస్టర్‌ను మెయింటైన్ చేస్తున్నారు.అతనికున్న ఆస్తల్లా శిథిలావస్థలో ఇల్లు. రెండు ఎకరాల భూమి. దీంతో ఇల్లు గడవక చాలా కష్టపడుతున్నామని వాపోయింది మూడో భార్య జబీనా. పిల్లలు, మనుమలు చేతికి వచ్చిన పని చేస్తారు. మరికొందరు కుటుంబం కోసం నీళ్లు కట్టెలు తీసుకురావడానికి వారి రోజులు గడుపుతారు. వీరందరూ కడుపు నిండా భోంచేయండం కూడా గగనమే. View this post on Instagram A post shared by Kailash Meena (@theindotrekker)మరోవైపు అతని ఆరోగ్యం క్షీణించడం, ఇంత పెద్ద ఇంటిని నిర్వహించడం కష్టంగా ఉండటంతో, అతని ఇద్దరు భార్యలు వెళ్లిపోయారు. టీచర్‌గా పనిచేస్తున్న అతని కుమారుడు షాబాన్ మాజినో(30) కుటుంబ నిర్వహణలో సహాయం చేస్తాడు.దీంతో నెటిజన్లు ఛలోక్తులతో సందడి చేస్తున్నారు. 'ప్రపంచంలో ఎక్కువ మంది పిల్లలను ఉత్పత్తి చేసిన వ్యక్తి' ఒకరు, “ఇస్కో పరివార్ క్యోం బోల్తే హో ...? జిల్లా ఘోషిత్ క్యోం నహీ దేతే.” (వీళ్లని కుటుంబమని అంటారేంటి...జిల్లాగా ప్రకటించాలి) అంటూ వ్యాఖ్యానించారు. బాహుబలి ఫ్యామిలీ, తాతగారు గేమ్ ఛేంజర్ అంటున్నారు. -
శివగామినే మించిపోయిన సాహసమది!.. గుర్తుందా?
తన ప్రాణం పోతున్నా లెక్కచేయకుండా పసికందుగా ఉన్న మహేంద్రుడిని నీట మునగకుండా ఒక చేత్తో పైకెత్తి ముందుకెళ్తుంది రాజమాత శివగామి బాహుబలి(Bahubali)లో. కానీ, ఇక్కడో తల్లి తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ ఊపిరి కోసం.. ఏ తల్లి చేయని సాహసం చేసి చరిత్రకెక్కింది. అయితే ఆ సాహసమే ఆరేళ్ల తర్వాత.. అదే తల్లిని మళ్లీ వార్తల్లో నిలబెట్టింది.జే35 అనే ఓర్కా తిమింగలం.. మరో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 23వ తేదీన అది ఓ బిడ్డకు జన్మనిచ్చిందని సెంటర్ ఫర్ వేల్ రీసెర్చ్ అనే ఫేస్బుక్ పేజీ ప్రకటించింది. ఆ ఆడ ఓర్కా(Orca) పిల్లకు జే61గా నామకరణం చేశారు. సియాటెల్ నగరపు తీరాన ఉన్న రీసెర్చ్ సెంటర్ వద్దకు చేరుకుంటున్న అంతర్జాతీయ మీడియా సంస్థల ఫొటోగ్రాఫర్లు ఆ తల్లీబిడ్డలను క్లిక్‌మనిపిస్తున్నారు. ఇందులో అంత చెప్పుకోదగిన విషయం ఏముందని అంటారా?.. ఆరేళ్ల కిందట.. బ్రిటీష్ కొలంబియా విక్టోరియాలోని తీర ప్రాంతానికి ఓ ఓర్కా తిమింగలం ఈదుకుంటూ వచ్చింది. అయితే దాని వీపు మీద ఓ పిల్ల ఓర్కాను మోసుకుంటూ వచ్చిందది. ఆ ప్రయాణం వెనుక ఎంతో వ్యధ ఉందని తర్వాతే తేలింది. పుట్టిన గంటకే బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ తల్లి ఓర్కా బిడ్డకు వీడ్కోలు చెప్పాలని అనుకోలేదు. మళ్లీ ఊపిరి తీసుకుంటుందన్న ఆశతో తలపై మోసుకుంటూ నీటిలో పైకి, కిందకు ఈదటం(Swim) ప్రారంభించింది. అలా గంటలు గడిచాయి.. రోజులు దొర్లిపోయాయి. తలపై 400 పౌండ్ల(181 కేజీల) బరువుతో.. ఏకంగా 17 రోజులపాటు ఏకధాటిగా 1,600 కిలోమీటర్లు ప్రయాణించిందది!. చివరకు.. సాన్ జువాన్ ఐలాండ్ వద్ద ప్రముఖ వేల్ రీసెర్చర్ కెన్ బాల్కోమ్ ఆ అమ్మ ప్రేమను ఓ డాక్యుమెంటరీగా చిత్రీకరించారు. జంతువుల్లో ఇలాంటి ప్రవర్తన సాధారణమే అయినా.. జే35 ప్రేమ మాత్రం అసాధారణమని కొనియాడారు. అలా ఆ దృశ్యాలు.. చూపరుల గుండెను బరువెక్కించాయి. చరిత్రకెక్కిన ఆ తల్లి ఓర్కానే ఈ జే35. సాధారణంగా.. ఓర్కాలు కిల్లర్ వేల్(Killer Whale)లు. సముద్రపు డాల్ఫిన్ జాతిలోనే అతి పెద్దవి. అయితే వాటి మనుగడ చాలా కష్టంగా ఉంటుంది. గుంపుగా బతికే సమూహంలో.. ఏడాది వయసున్న పిల్లలను రక్షించుకోవడానికి అవి సాహసాలే చేస్తుంటాయి. ఆ గండం దాటితే అవి బతికి బట్టకట్టినట్లే!. అయితే.. జే35 ఓర్కాకు జే61ను ఏడాదిపాటు కాపాడుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆ తల్లి మనుసు గతంలోనే ఓసారి గాయపడింది. అయినప్పటికీ ఈ ఆరేళ్ల గ్యాప్‌లో జే47, జే57 అనే రెండు ఓర్కాలకు అది జన్మనివ్వగా.. అవి సజీవంగానే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: ఇరాన్లో తొలిసారి మహిళలతో.. -
రూ. 31 లక్షలు ఖర్చుపెట్టి మరీ యూట్యూబర్ ప్రయోగం : ఎందుకో ఊహించలేరు
భూమి ఫ్లాట్‌గా ఉందని నిరూపించడానికి యూట్యూబర్ అత్యంత సాహసానికి పూనుకున్నాడు. ఏకంగా రూ. 31 లక్షలతో యాత్ర చేశాడు. చివరికి ఏమైంది? ఆసక్తిగా ఉంది కదూ. పదండి అసలేమైందో ఈ కథనంలో తెలుసుకుందాం.భూమి బల్లపరుపుగా లేదా ఫ్లాట్‌గా ఉంటుందని గట్టిగా వాదన ఇప్పటిది కాదు. అయితే ఫ్లాట్‌గా ఉంటుందని గట్టిగా నమ్మేవాళ్లు ఎందరో ఉన్నారు. తాజాగా ఫ్లాట్ ఎర్త్ సిద్ధాంతాలపై పేరుగాంచిన యూట్యూబర్ జెరన్ కాంపనెల్లా (Jeron Campanella) భూమి ఆకారం గుండ్రంగా లేదు అని తేల్చాలను కున్నాడు. తన వాదనలను ధృవీకరించడానికి అంటార్కిటికాకు రూ. 31.4 లక్షల (37,000 డాలర్లు) ఖర్చుతో కూడిన యాత్ర చేశాడు.NEW: Flat Earther travels all the way to Antarctica to prove that the Earth is flat only to find out that it's not.Lmao.Flat Earth YouTuber Jeran Campanella went on a $35,000 trip to prove that there was "no 24-hour sun.""Sometimes you are wrong in life and I thought there… pic.twitter.com/8jvLWawB2J— Collin Rugg (@CollinRugg) December 18, 2024తన ప్రయాణానికి ముందు, కాంపనెల్లా అంటార్కిటికాలో ఉదయాస్తమాలు లేకుండా సూర్యుడు 24 గంటలూ ఉంటాడనే సిద్ధాంతాన్ని నమ్మలేదు. దక్షిణ ఖండానికి అతని పర్యటన ఈ నమ్మకాలను బద్దలు కొట్టింది.కాంపనెల్లా ప్రయాణం కొలరాడో పాస్టర్ విల్ డఫీ నేతృత్వంలో తన నమ్మకాన్ని పరీక్షించడానికి కాలిఫోర్నియా(California) నుంచి దాదాపు 14,000 కిలోమీటర్లు ప్రయాణించి అంటార్కిటాకు చేరాడు. అక్కడ మిడ్నైట్ సన్ని చూసి షాక్ అయ్యాడు. “అంటార్కిటికా ఓ మంచు గోడ, సూర్యుడు రోజూ ఉదయిస్తాడు, అస్తమిస్తాడు” అన్న తన నమ్మకం నిజంకాదని తేల్చుకున్నాడు. "కొన్నిసార్లు జీవితంలో తప్పు చేస్తాం," అంటూ కాంపనెల్లా తన పర్యటన తర్వాత ఒక వీడియోను షేర్ చేశాడు. తన తప్పును అంగీకరిస్తూ, ఫ్యాన్స్‌కు వివరణ ఇచ్చాడు "ఇలా చెప్పినందుకు నన్ను షిల్ అని పిలుస్తారని నాకు తెలుసు. అయినా నష్టంలేదు, నిజాయితీగా ఉండటం ముఖ్యం" అంటూ అసలు విషయాన్ని అంగీకరించాడు.ట్విస్ట్ ఏంటంటే...తన ఫ్లాట్ ఎర్త్ మ్యాప్ తప్పని తేలిందని అంగీకరించిన కాంపనెల్లా చేసిన మరో ప్రయోగం కూడా ఉంది. కాంపనెల్లా ప్రయాణం కొలరాడో పాస్టర్ విల్ డఫీ నేతృత్వంలోని ‘ది ఫైనల్ ఎక్స్పెరిమెంట్’ అనే కార్యక్రమంలో భాగమే ఈ పర్యటన. భూమి ఫ్లాట్‌గా ఉందని నమ్మే నలుగురు మిడ్నైట్ సన్ని ప్రత్యక్షంగా చూసేందుకు అంటార్కిటికాకు వెళ్లారు. చివరికి భూమి గోళాకారమని శాస్త్రీయంగా నిరూపించారు. ‘‘ఈ ప్రయోగంతో భూమి ఫ్లాట్‌గా ఉందనే వాదనకు ముగింపు పలకవచ్చు”అని డఫీ ధీమాగా చెప్పారు. దీంతో భూమి ఆకారాన్ని దాచడానికి ఎవరినీ అనుమతించరని ప్రచారంలో ఉన్న వాదనలకు కూడా చెక్‌పడింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎవరైనా అంటార్కిటికాను సందర్శించవచ్చని తేలింది.భూమి గోళాకారంలో అనడానికి నిదర్శనంగా అంటార్కిటికాలో దక్షిణ వేసవిలో సూర్యుడు అస్తమించడు. ఇక్కడ వేసవిలో సూర్యుడు 24 గంటలూ కనిపిస్తాడు. ఈ దృగ్విషయం, ధ్రువ ప్రాంతాలకు ప్రత్యేకమైనది. కాగా గతంలో భూమి గుండ్రంగా లేదని, బల్లపరుపుగా ఉందని నమ్మే ఓ అమెరికన్ పైలట్ తన అభిప్రాయం నిజమని నిరూపిస్తానంటూ ఈ రాకెట్ ప్రయోగం చేపట్టిన సంగతి గుర్తుందా? సొంతంగా తయారు చేసిన ఆవిరితో ప్రయాణించే రాకెట్ ద్వారా యాత్ర చేపట్టాడు. కానీ రాకెట్ ప్రయోగం విఫలం కావడంతో 64 ఏళ్ల 'మ్యాడ్' మైక్ హ్యూజ్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. -
‘స్వామీ.. ఎన్నాళ్లీ ఎదురు చూపులు, త్వరలో జంటగా’ : ఇన్ఫ్లూయెన్సర్పోస్ట్ వైరల్
బీర్‌బైసెప్స్‌గా పాపులర్ అయిన కంటెంట్ క్రియేటర్ రణవీర్ అల్లాబాడియా. భారతదేశంలోని అత్యంత ప్రముఖ యూట్యూబర్ పోడ్కాస్టర్కు ఒక మహిళా వీరాభిమాని ఉంది. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌తో ఇంటర్నెట్ సంచలనంగా మారిన రణవీర్‌ను రోహిణి అర్జు అనే అమ్మాయి విపరీతంగా అభిమానిస్తుంది. దీనికి సంబంధించి అనేక రీల్స్,వీడియోలు గతంలో నెట్టింట్ హల్చల్ చేశాయి. తాజాగా మరో వీడియోను పోస్ట్ చేయడం విశేషంగా నిలిచింది.ఆ అభిమాని పేరే రోహిణి అర్జు. ఈమె ఆధ్యాత్మికత కంటెంట్ క్రియేటర్. పశువైద్యురాలు. అల్లాబాడియా పట్ల తనకున్న అభిమానాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వీడియోలను పోస్ట్ చేసింది. తాజాగా "స్వామీ, నేను వేచి ఉన్నాను..."అంటూ అతనికి ప్రపోజ్ చేసింది. ‘‘ఎంతమంది వెక్కిరించినా, ఎగతాళి చేసినా,పిచ్చి అనుకున్నా, ఎక్కడ ఎలా, ఉన్నావనేదానితో సంబంధం లేకుండా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.. రణ్వీర్ అల్లాబాడియా.. నా స్వర్వస్వం నీవే’’ అంటే పోస్ట్ చేసింది. ఆమె శరీరంపై ‘రణవీర్’ టాటూను కూడా గమనించవచ్చు. అక్కడితో ఆగలేదు. మరొక పోస్ట్‌లో, "స్వామీ,మీ కోసం జీవితకాలం వేచి ఉన్నాను, చివరకు భార్యాభర్తలుగా త్వరలో మారబోతున్నాము" అని పేర్కొంది. అల్లాబాడియా ఫోటోలను అల్పాహారం చేయడం, బెడ్ మీడ పెట్టుకుని నిద్రపోవడం దాకా రీల్స్ చేసింది. దీంతో ఇది మరోసారి నెట్టింట చర్చకు దారి తీసింది. కొంతమంది రణవీర్‌కు ట్యాగ్ చేస్తుండగా, మరికొంతమంది ఈమెకు వెంటనే మానసిక చికిత్స కావాలంటూ వ్యాఖ్యానించారు. ఇది ఎరోటోమానియా అనే మానసిక రుగ్మత అని కొందరు, కేవలం ఆన్లైన్ క్రేజ్, డబ్బు కోసం చేస్తున్న పని అని మరికొందరు వ్యాఖ్యానించారు. గతేడాది సెప్టెంబరులో, అల్లాబాడియాకు, తనని తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోనని ప్రకటించేసింది. ఫలితంతో సంబంధం లేకుండా తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. గతంలో కర్వా చౌత్ ఆచారాన్ని (పెళ్లైన మహిళలు, కొత్త పెళ్లికూతుళ్లు వ్రతం ఆచరించే) పాటిస్తున్న వీడియోను ఫోటోతో షేర్ చేయడం వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Dr. Rohini Arju (@rohiniiarju) -
తాతగారి సెన్సేషనల్ విడాకులు : భరణం ఎంతో తెలిస్తే అవాక్కే!
బెంగళూరు టెకీ ఆత్మహత్మ, భరణం కేసు ప్రకంపనలు రేపుతున్న తరుణంలో మరో ఆసక్తికరమైన విడాకుల కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన 70 ఏళ్ల రైతు ఒకటీ రెండూ కాదు, ఏకంగా 18 ఏళ్ల పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి, కోట్ల రూపాయల భరణం చెల్లించిన ఉదంతం నెట్టింట హల్చల్ చేస్తోంది. అదీ పెళ్లి అయిన 44 ఏళ్ల తరువాత పట్టువీడకుండా, శాశ్వత భరణంగా రూ.3.01 కోట్లు చెల్లించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.వివరాలు ఇలా ఉన్నాయి...హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన సుభాష్ చంద్ 1980, ఆగస్టు 27వ తేదీన సంతోష్ కుమారిని పెళ్లి చేసుకున్నాడు. ఉన్నన్ని రోజులు వీరి సంసారం సజావుగానే సాగింది. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అంతా బావుంది అనుకుంటున్న క్రమంలో ఈ జంట మధ్య విభేదాలు మొదలయ్యాయి. అవి చిలికి చిలికి గాలివానలా మారాయి. దీంతో 2006, మే 8వ తేదీ నుంచి విడిగా జీవించడం ప్రారంభించారు. భార్యనుంచి విడాకులు ఇప్పించాల్సిందిగా 2006లొనే కోర్టును ఆశ్రయించాడు. అయితే కర్నాల్ కోర్టు 2013 జనవరిలో అతని విడాకుల అభ్యర్థనను తిరస్కరించింది. అయినా పట్టువీడని సుభాష్ హైకోర్టులో అప్పీల్ చేశాడు.దాదాపు 11 సంవత్సరాల తరువాత రాజీ చేసుకోవాల్సిందిగా కోరిన హైకోర్టు, ఈ ఏడాది నవంబర్ 4వ తేదీన ఈ విషయాన్ని మధ్యవర్తిత్వం మరియు రాజీ కేంద్రానికి సూచించింది. ఈ ప్రక్రియలో భాగంగానే వీరికి మంజూరైనాయి. అయితే భార్యకు శాశ్వత భరణంగా మొత్తం 3.07 కోట్ల రూపాయలను చెల్లించేందుకు అంగీకరించాడు సుభాష్. దీనికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలు కూడా అంగీకరించారు. అయితే ఈ భరణం ఎలా చెల్లించాడు అనేదే హాట్ టాపిక్ అంత భరణం ఎలా?తన వ్యవసాయ భూమిని అమ్మి మరీ డిమాండ్ డ్రాఫ్ట్‌గా 2 కోట్ల 16 లక్షల రూపాయలను చెల్లించాడు. పంట అమ్మగా వచ్చిన సొమ్ముతో 50 లక్షల నగదు చెల్లించాడు. ఇక మిగిలిన 40 లక్షల రూపాయలను బంగారు, వెండి రూపంలో చెల్లించాడు. ముదిమి వయసులో , 18 ఏళ్ల సుదీర్ఘం న్యాయ పోరాటం తరువాత 44 ఏళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి పలకడం చర్చకు దారి తీసింది. ఒప్పందం ప్రకారం చంద్‌కు చెందిన ఆస్తిపై భార్యాపిల్లలు అన్ని హక్కులను వదులు కున్నారని చంద్‌కు చెందిన రాజిందర్ గోయెల్ పేర్కొన్నారు. ఈ పరస్పర నిర్ణయాన్ని కోర్టు అంగీకరించి గత వారం విడాకులు ఖరారు చేసిందని ఆయన వెల్లడించారు. -
డివోర్స్ మెహిందీ : ఓ వివాహిత హృదయవిదారక గాథ వైరల్
శుభకార్యం అనగానే మహిళలకు ముందుగా గుర్తొచ్చేది గోరింటాకు. పెళ్లి అయినా, ఫంక్షన్ అయినా చేతి నిండా మెహిందీ (హెన్నా) పెట్టుకుంటే ఆ వేడుకకు మరింత కళ. ఈ మెహిందీ కళలో అనేక రకాలను చూశాం. వాటిల్లో ప్రధానంగా బ్రైడల్ మెహిందీ. కానీ విడాకుల మెహిందీ గురించి ఎపుడైనా విన్నారా? తన వైవాహిక జీవితంలో ఎదురైన కష్టాలు, కన్నీళ్ల గురించి ప్రస్తావిస్తూ మొత్తానికి విడాకులు తీసుకున్నాను అంటూ తన బాధను నెటిజన్లతో పంచుకుంది. ప్రస్తుతం ఇది నెట్టింట పలువురి హదయాలను కదిలిస్తోంది.ఊర్వశి వోరా శర్మ ఇన్‌స్టా వేదికగా విడాకుల స్టోరీని మెహిందీ డిజైన్ ద్వారా అభిమానులతో పంచుకుంది. తన విఫలమైన పెళ్లి, తన కలలు, భర్త చేసిన ద్రోహం, అనుభవించిన క్షోభను చాలా భావోద్వేగంతో ఈ కొత్త కాన్సెప్ట్ ద్వారా వివరించింది. కేవలం ఒక పనిమనిషిలాచూసిని అత్తమామలు, భర్త మద్దతు ఏమాత్రం లేక కుంగిపోయిన వైనం, ఒంటరితనంతో అనుభవించిన నరకం, భయంకరమైన ఒత్తిడి, చివరికి విడిపోవాలనే అంతిమ నిర్ణయంతో ముగుస్తుందీ మెహిందీ ఆర్ట్. దీనిపై నెటిజన్లు స్పందించారు. ‘మీ బాధను వ్యక్తం చేయడానికి ఇది చాలా శక్తివంతమైన మార్గం. మీకు మరింత బలం చేకూరాలి’ అంటూ చాలామంది ప్రశంసించారు."మెహిందీలో నొప్పిని చూడటం హృదయ విదారకం. కానీ ఆమె సాధించిన స్వేచ్చ సంతోషానిస్తోంది’’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘విడాకులు తీసుకోవడం అంత సులభం కాదు, కానీ ఈ మెహిందీ మళ్లీ మీ జీవితాన్ని ప్రారంభించడానికి అవసరమైన శక్తినిస్తుంది’“ఇది కేవలం కళ కాదు; అది ఒక ఉద్యమం. స్త్రీలు తమ బాధలను పంచుకుంటున్నారు’’ అంటూ మరికొంతమంది వ్యాఖ్యానించారు. ‘‘ఫైనల్లీ.. మెహిందీ ద్వారా వివాహాలకు ఆవల గాథలు. ఇవి పచ్చి నిజాలు, కఠోర వాస్తవాలు’’ అంటూ మరొకరు పేర్కొనడం గమనార్హం -
మొబైల్ వాడకుండా, ఎనిమిది గంటల్లో రూ. లక్ష సంపాదించింది!
అందాల పోటీల్లో విశ్వసుందరిగా నిలిచిన సుందరాంగుల గురించి విన్నాం.. కుస్తీ పోటీల్లో కండబలం చూపించిన ధీరేశ్వరుల గురించి తెలుసు. మేమేం తీసిపోయాం అంటూ అన్నింటా సమ ఉజ్జీగా పోటీ పడుతున్నమగువల కథనాలూ చాలానే విన్నాం. కానీ ప్రస్తుతం ఒక వింత..కాదు కాదు, చాలెంజింగ్ అండ్ క్రియేటివ్ పోటీ ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. చైనాకు చెందిన ఒక మహిళ మొబైల్ ఫోన్ వాడకుండా ఎనిమిది గంటలు గడిపి లక్షరూపాయలకు పైగా బహుమతిని గెల్చుకుంది. ఇంట్రస్టింగ్‌గా ఉంది కదా.. అదేంటి అంటే..!చాంగ్కింగ్ మునిసిపాలిటీలోని షాపింగ్ సెంటర్లో ఈ ప్రత్యేకమైన పోటీని నిర్వహించారు. ప్రశాంతంగా, ఎలాంటి ఆందోళన లేకుండా ఎనిమిది గంటల పాటు మొబైల్ ఫోన్ వాడకుండా గడపాలి. ఈ పోటీలో నైరుతి చైనాకు చెందిన ఒక మహిళ 10,000 యువాన్లను (సుమారు రూ.1,16,000) గెలుచుకుని వార్తల్లో నిలిచింది.నవంబరు 29న జరిగిన ఈ పోటీలో 100 మంది దరఖాస్తుదారులలో పది మంది పోటీదారులు పాల్గొన్నారు. మొబైల్ ఫోన్లు లేదా ఐప్యాడ్లు లేదా ల్యాప్‌టాప్‌ల వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు ప్రాప్యత లేకుండా, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బెడ్‌పై ఎనిమిది గంటలు గడపాలి. కంపోజ్డ్ గా, రిలాక్స్డ్గా ఉంటూ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్( స్మార్ట్‌ఫోన్, ఐప్యాడ్, ల్యాప్‌టాప్) వాడాలన్న ఉత్సుకత లేకుండా గడపాలి.నిబంధనలు, కత్తిమీద సామేజిము న్యూస్ రిపోర్టుల ప్రకారం, నిబంధనలూ కఠినంగా ఉన్నాయి. ఈవెంట్‌కు ముందు పోటీదారులు తమ మొబైల్ ఫోన్లను సరెండర్ చేయాల్సి ఉంటుంది . అత్యవసర పరిస్థితుల్లో పాత మొబైల్ మోడల్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఎమర్జెన్సీ ఫోన్లను కుటుంబ సభ్యులను సంప్రదించడానికి మాత్రమే ఉపయోగించాలి. అదనంగా, పాల్గొనేవారు ఎక్కువ సమయం పడుకునే ఉండాలి. టాయిలెట్ బ్రేక్ కూడా ఐదు నిమిషాలు మాత్రమే. అంతేకాదు ఈ ఎనిమిది గంటలు ఎంచక్కా బజ్జుంటాను అంటే అస్సలు కుదరదు. పోటీదారులు గాఢ నిద్రలోకి జారుకోవడం నిషేధం. పాల్గొనేవారి ఆహారపానీయలు అందిస్తారు. వారి మానసిక ధైర్యాన్ని పరీక్షించే ప్రయత్నంలో, నిర్వాహకులు మణికట్టు పట్టీలను ఉపయోగించి నిద్ర , ఆందోళన స్థాయిలను పర్యవేక్షించారు. ఈ పోటీలు శారీరక బలం కన్నా, మానసిక బలం, ఓర్పు ఎక్కువ అవసరం. అయితే పోటీదారుల్లో చాలామంది పుస్తకాలు, చదువుతా, విశ్రాంతిగా గడిపారు. (హలేబీడు ఉలి చెక్కిన గ్రంథం, ఆసక్తికర విషయాలు)100కి 88.99 స్కోరు చేసి, ఫైనాన్స్ సంస్థలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఒక మహిళ విజేతగా నిలిచింది. మంచం మీదే, ఎలాంటి ఆందోళన లేకుండా, నిద్రపోకుండా ప్రశాంతంగా గడిపిందట. పోటీల్లో పాల్గొన్నటి దుస్తుల ఆధారంగా "పైజామా సోదరి" అనే మారుపేరుతో సంచలనం రేపుతోంది. సంపాదించింది. పరుపుల కంపెనీ ఈ పోటీని స్పాన్సర్ చేసింది. ఈ పోటీపెట్టడంలో కంపెనీ ఉద్దేశ్యం ఏంటి అనేది స్పష్టత లేదు కానీ నో మొబైల్-ఫోన్ ఛాలెంజ్ చైనా అంతటా వైరల్‌గా మారింది. నిముష నిమిషానికీ మొబైల్ స్క్రీన్‌ను అన్‌లాక్ చేసే మొబైల్ యూజర్లకు ఇది నిజంగానే అగ్ని పరీక్షే. ఓసోసి.. అదెంత పని అనుకుంటున్నారా? అయితే మీరూ ప్రయత్నించండి. బోలెడంత ప్రశాంతత, ఆరోగ్యం మీ సొంతమవుతుంది. -
ఇక ఈ జీవితం ఇంతే అనుకున్నా..! 36 ఏళ్లకు విముక్తి : వైరల్ స్టోరీ
సోదరుడిని హత్య చేసిన ఆరోపణల కేసులో జీవిత ఖైదు అనుభవించి శతాధికవృద్ధుడిగా జైలునుంచి విడుదలైన ఘటన వైరల్‌గా మారింది. గత నెల సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మాల్డా కరెక్షనల్ హోం నుంచి విడుదలయ్యాడో వ్యక్తి. ఆయన పేరే 104 ఏళ్ల రసిక్ చంద్ర మోండల్. ‘‘జైలుకి ఎపుడొచ్చానో, ఎన్నేళ్లు గడిపానో గుర్తు లేదు. ఇక ఈ జీవితం ఇంతే అనుకున్నాను’’ అంటున్న రసిక్ చంద్ర మాటలు పలువురిని ఆలోచింప చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని మానిక్చక్ నివాసి రసిక్ చంద్ర. 1988లో స్వల్ప భూవివాదంలో సోదరుడిని హత్య చేశాడనే ఆరోపణలతో అరెస్టయ్యాడు. 1992లో మాల్డాలోని జిల్లా మరియు సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అప్పటికి మోండల్ వయస్సు 72 సంవత్సరాలు. కలకత్తా హైకోర్టు విచారణ సమయంలో బెయిలుపై విడుదలయ్యాడు. కానీ దిగువ కోర్టు జీవితఖైదు విధించడం,హైకోర్టు దానిని సమర్ధించడంతో తిరిగి కరెక్షనల్ హోమ్‌కు వెళ్లక తప్పలేదు. ఆ తరువాత 2020లో పేరోలు మీద బయటికి వచ్చి, మళ్లీ 2021లో కరెక్షనల్ హోమ్‌కు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి 36 ఏళ్లుగా జీవిత ఖైదుగా ఉన్నాడు. ఎలా విడుదలయ్యాడుజీవిత ఖైదు అనుభవించిన వ్యక్తి నిర్దేశించిన శిక్షాకాలంలో ఎలాంటి అక్రమ చర్యలకు పాల్పడ కుండా, సత్ర్పర్తనతో ఉంటే, జైలు నుంచి విడుదలయ్యే అర్హత ఉంటుంది. అలా 36 ఏళ్ల జైలు జీవితం తర్వాత మాల్డా కరెక్షనల్ హోమ్ నుండి 104 ఏళ్ల వృద్ధుడిగా జనజీవితంలోకి వచ్చాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తన తండ్రిని విడుదల చేసినట్లు మోండల్ కుమారుడు ప్రకాష్ మోండల్ తెలిపాడు. ఈ వయసులో కూడా మోండలు ఆరోగ్యంగా, చురుగ్గా కనిపించడం విశేషం. ఎందుకంటే మోండల్ జైలులో నిత్యం వ్యాయామం చేసేవాడట. క్రమశిక్షణతో ఉంటూ వయసుకు తగ్గట్టు ఫిట్నెస్ పెంచుకున్నాడు.అంతేకాదు మొక్కలను పెంచడం, తోటపనిలో బాగా పాలు పంచుకునేవాడు. బయటికి వచ్చాక తన అభిరుచికి తగట్టి తోట పని చేసుకుంటానని చెప్పాడు మోండల్. అంతేకాదు తాను నిర్దోషిని, పరిస్థితుల వల్ల తన పరిస్థితి ఇలా వచ్చిందని తెలిపారు. ఇన్నాళ్లుగాకుటుంబాన్ని, మనవలు మనవాళ్లతో గడిపేసమయాన్ని కోల్పోయాను అంటూ వాపోయాడు. అన్నట్టు మోండల్ భార్య మీనా ,ఇన్నాళ్లకు తన భర్త విడుదల కావడంపై సంతోషం ప్రకటించింది. -
భార్యకోసం బంగారు గొలుసుకొన్నాడు.. దెబ్బకి కోటీశ్వరుడయ్యాడు!
భారతీయ సంతతికి చెందిన వ్యక్తి భార్య కోసం బంగారు గొలుసు కొనుగోలు చేసి జాక్‌పాట్ దక్కించు కున్నాడు. ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. 8 కోట్ల లాటరీ గెల్చుకున్నాడు. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఎక్కడ? ఎలా? అని ఆసక్తిగా ఉంది కదూ? అయితే క్షణం ఆలస్యం చేయకుండా వివరాలు తెలుసుకుందాం పదండి! సింగపూర్‌లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి రాత్రికి రాత్రికే కోటీశ్వరుడయ్యాడు. మూడు నెలల క్రితం భార్య సంతోషం కోసం సుమారు రూ. 3 లక్షల రూపాయలతో ఒక గోల్డ్ చైన్ కొన్నాడు. ప్రతీ ఏడాది నిర్వహించే లాటరీలో భాగంగా గత ఆదివారం (నవంబర్ 24) జ్యువెలరీ కంపెనీ నిర్వహించిన లక్కీ డ్రాలో 8 కోట్ల రూపాయలకు పైగా బహుమతిని గెలుచుకున్నాడు. దీంతో కుటుంబం అంతా సంతోషంతో పొంగిపోయింది. “ఈ రోజు మా నాన్నగారి నాలుగో వర్ధంతి.. ఇది ఆయన ఆశీర్వాదం’’ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు చిదంబరం. సింగపూర్‌లో ఉన్న ఇన్నాళ్లకు అదృష్టం వరించిందనీ, తన తల్లితో ఈ శుభవార్త పంచుకోవాలంటూ సంతోషం వ్యక్తం చేశాడు. తనకు వచ్చిన ఈ డబ్బులో కొంత సమాజానికి విరాళంగా ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిపాడు.ముస్తఫా జ్యువెలరీ షాపులో 250 సింగపూర్ డాలర్ల కన్నా ఎక్కువ విలువైన ఆభరణాలు కొనుగోలు చేసిన వారు లక్కీ డ్రాకి అర్హులు. ఈ లక్కీ డ్రాలో సింగపూర్‌లో 21 ఏళ్లుగా ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బాలసుబ్రమణ్యం చిదంబరం టాప్ ప్రైజ్‌ని కైవసం చేసుకున్నట్లు ఆసియా వన్ తెలిపింది. ఈయనతోపాటు మరి కొంతమందికి కూడా భారీ బహుమతులను అందించినట్టు కంపెనీ తెలిపింది. View this post on Instagram A post shared by Mustafa Jewellery Singapore (@mustafajewellerysg) -
ఇంటర్వ్యూలో ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారా? యువతి పోస్ట్ వైరల్
ఉద్యోగం కావాలంటే అనేక ఇంటర్వ్యూలను ఎదుర్కోక తప్పదు. సంబంధిత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలంటే టీం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఉద్యోగ అర్హతలు, సామర్థ్యం, అనుభవం, ఫైనల్‌గా జీతం లాంటి ప్రశ్నలు సాధారణంగా ఉంటాయి. కానీ ఒక మహిళా అభ్యర్థి తన అనుభవాన్ని సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ఈ వింత ప్రశ్న ఎదురు కావడంతో షాక్ అ అయ్యానంటూపేర్కొంది. దీంతో ఇది వైరల్‌గా మారింది.యూకేకు చెందిన భారత సంతతికి చెందిన జాన్హవి జైన్ తన అనుభవాన్ని ఎక్స్‌లో షేర్ చేసింది. దీని ప్రకారం ఓ జాబ్ ఇంటర్వ్యూలో సదరు కంపెనీ హెచ్ఆర్ ఉద్యోగి వయసు ఎంత అని అడిగారు. పాతికేళ్లు అని తను జవాబు చెప్పింది. అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందాఅని అడగడంతో అవాక్కయ్యానంటూ చెప్పుకొచ్చింది జాన్హవి. తాను విన్నది నిజమేనా? లేక పొరబడ్డానా? అని ఒక్క క్షణం గందరగోళంలో పడిపోయానని తెలిపింది. ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారా? అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు లక్ష 20వేల వ్యూస్, వందల కమెంట్లు వెల్లువెత్తాయి. భారత దేశంలో తమకూ ఇలాంటి అనుభవం ఎదురయ్యాయని చాలామంది సమాధానం ఇచ్చారు. కొంతమంది అయితే పెళ్లి, పిల్లల ప్లానింగ్ గురించి కూడా అడుగుతారు కొన్ని మారవు అంతే కొందరు, ‘‘ఏం చేస్తాం మనం, గర్భసంచులతో పుట్టాం కదా, మనకి కొన్నితప్పవు’’ అని ఒక మహిళ వ్యాఖ్యానించారు. ‘‘నాకు ఇందులో తప్పు ఏమీ కనిపించడం లేదు. ఇది వారి ప్రాజెక్ట్ , టైమ్‌లైన్ కోసం. ఎక్కువ పనిచసేవాళ్లు కావాలి. వారి పనిని ప్రభావితం చేసేలా కుటుంబ బాధ్యతలు వద్దనుకుంటారు" అని మరో వినియోగదారు మద్దతివ్వడం గమనార్హం.This HR of an Indian company asked me how old I am and when I said 25, they asked me if I am looking to marry soon??? Is this still happening??— Janhavi Jain (@janwhyy) November 19, 2024 -
పప్పీకోసం...బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్, పెళ్లి క్యాన్సిల్
ఒక్క బుజ్జి కుక్క పిల్లనో, పిల్లి పిల్లనో పెంచుకోవడం ఒకపుడు ఫ్యాషన్ .. కానీ ఇపుడు అదొక ఎమోషన్‌గా మారిపోయింది. పెంపుడు జంతువులను తమ కుటుంబంలో ఒకరిగా ప్రేమించడం, పుట్టినరోజులు జరపడం, చనిపోతే ఆత్మీయులు చనిపోయినంతగా బాధపడటం, అంత్యక్రియలు జరిపించడం లాంటి ఘటనలు ఎన్నో చూశాం. కానీ కుక్క పిల్లకోసంఏడేళ్ల బంధాన్ని వదులుకున్న వైనాన్ని విన్నారా? అవును, పెళ్లి తర్వాత తన కుక్కను తనతో తీసుకురావాలనే కోరికను అత్తగారు నిరాకరించడంతో బాయ్ ఫ్రెండ్‌కు బై బై చెప్పేసింది. పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ప్రియాంక అనే ఇంటర్నెట్ యూజర్ తన కథను ఇలా వివరించింది. ఏడేళ్ల తరువాత మా బంధం ముగిసిపోయింది. అయితే ఇది నా వల్లనో, నా బాయ్ ఫ్రెడ్ వల్లనో కాదు. కేవలం అతని తల్లి వల్ల. మధ్యలో తల్లులు ఎందుకు రావాలి..ఎందుకు? ఏడేళ్లంటే మాటలా?’’ అంటూ తన గోడును వెళ్లబోసుకుంది.అయితే, విషయం ఏమిటంటే ప్రియాంక, ఒక అబ్బాయిని ఏడేళ్లుగా ప్రేమిస్తోంది. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించు కున్నారు. ఇరు కుటుంబాలుమాట్లాడుకున్నాయి. కానీ పెళ్లి తర్వాత తన వెంట కుక్కను కూడా తీసుకొస్తానని ప్రియాంక చెప్పింది. అందుకు ప్రియుడి తల్లి వ్యతిరేకించింది. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదు వద్దన్నాడు అతగాడు. అయితే తన ఇంట్లో తల్లి అనారోగ్యం కారణంగా కుక్కను చూసుకోలేకపోతోంది. బాధ్యతలను తానే ఎక్కువగా చూసుకుంటున్నాను. పైగా అదిలేకుండా జీవించ లేను అని భావించింది ప్రియాంక. అయితే అత్తగారింట్లో ఇప్పటికే ఒక కుక్క ఉందని, రెండు కుక్కలను పెంచుకోవడం ఇష్టం లేక తన కుక్కనుఅత్తగారు వారించిందని తెలిపింది. దీంతో బాయ్‌ఫ్రెండ్‌కు కటీఫ్ చెప్పేసానని తెలిపింది.అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. పెంపుడు కుక్క ఉన్న ఇంట్లో ఆడపిల్లలకు నిజంగా ఇది చాలా కష్టం. అయినా సర్దుబాట్లు, త్యాగాలు తప్పవు అని ఒకరు నిట్టూర్చగా, అది అతని ప్రాధాన్యత, ఇది మీ ప్రాధాన్యత అని ఇంకో వినియోగదారు వ్యాఖ్యానించారు. ఇది చిన్నపిల్ల ట్వీట్లా ఉంది ఇంకొకరు కమెంట్ చేశారు. అమ్మాయిల డిమాండ్లు అసాధారణంగా ఉంటాయి. అయినా, ఇది చాలా సున్నితమైన అంశం. ఆమె ఇప్పటికే తల్లిని, కుక్కను విడిచిపెట్టి అతని ఇంటికి వెళుతోంది. కానీ అతను మాత్రం తల్లిదండ్రులు, కుక్కతో కలిసి హ్యాపీగా అతని ఇంట్లోనే ఉంటాడు. ఆ అవకాశం అమ్మాయికి లేదు కదా? మరో యూజర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
గొంతు నొప్పితో ఆసుపత్రికి : డాక్టర్ చెబితే ‘ఏప్రిల్ పూల్’ అనుకుంది..చివరికి!
అనుకోకుండా, ఊహించని పరిణామాలు అద్భుతాలుగా నిలుస్తాయి. ఈ అద్భుతాల్లో మహాఅద్భుతాలు మరికొన్ని ఉంటాయి. అలాంటి అద్భుతం కమ్..షాకింగ్ లాంటి ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఆలస్యం చేయకుండా వివరాలను తెలుసుకుందాం పదండి!అమెరికాలోని ఇల్లినాయిస్కు చెందిన 20 ఏళ్ల నర్సింగ్ అసిస్టెంట్ కాట్లిన్ యేట్స్(Katelyn Yates)కు కూడా నమ్మలేని అనుభవం ఎదురైంది. గొంతు నొప్పిగా ఉండటంతో ఒకరోజు ఆసుపత్రికి వెళ్లింది. వైద్యులు ఎక్స్‌రే తీయించుకోమని సలహా ఇచ్చారు. అయితే ఎక్స్‌రేకి వెళ్లి ముందు ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాలని కూడా సూచించారు. ఎందుకంటే గర్భధారణ సమయంలో ఎక్స్‌రేలు ప్రమాదకరం. రేడియేషన్ పిండానికి హాని కలిగించే అవకాశం ఉన్నందున ముందుగానే గర్భంతో లేమనే నిర్ధారణ అవసరం. ఇక్కడే కాట్లిన్సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యే విషయం తెలుసుకుంది. అదీ కూడా నమ్మశక్యంగాని విధంగా కాట్లిన్ గర్భవతి అని తేలింది. ఇందులో ఆశ్చర్యం ఏముందు అనుకుంటున్నారా? ఆమె గర్బంలో పెరుగుతోంది ఏకంగా నలుగురు. ముందు షాకైనా, ఏప్రిల్ ఫూల్స్ డే కదా.. డాక్టర్ జోక్ చేస్తున్నారులే అని లైట్ తీసుకుంది కేట్లిన్. చివరికి విషయం తెలిసి మురిసి పోయింది.కానీ పిల్లలకు జన్మనివ్వడానికి చాలా కష్టపడింది. అయితే ఆమె భర్త జూలియన్ బ్యూకర్ కేట్లిన్కు పూర్తిగా సపోర్ట్ అందించాడు. ధైర్యం చెప్పాడు. ఎందుకంటే కాట్లిన్‌కు ప్రీక్లంప్సియా అనే అరుదైన వ్యాధి వచ్చింది. ఇది ప్రమాదకరమైన అధిక రక్తపోటుకు కారణమయ్యే తీవ్రమైన పరిస్థితి. ఫలితంగాఆమెకు రక్తపోటు పెరిగి, కాలేయం, మూత్రపిండాలు పనిచేయడం మానేశాయి. ఒక దశలో ఆమె శ్వాస అందక ఇబ్బంది పడింది. దీంతో కేవలం 28 వారాలు , 4 రోజులలో, వైద్యులు సిజేరియన్ చేసి నాలుగురు పిల్లలకు ప్రసవం చేశారు. ఎలిజబెత్ టేలర్, జియా గ్రేస్ , ఐడెంటికల్ ట్విన్స్‌గా మాక్స్ ఆష్టన్ , ఇలియట్ రైకర్ జన్మించారు. నెలలు నిండకుండానే పుట్టడంతో ఎలిజబెత్ కేవలం ఒక పౌండ్, రెండు ఔన్సులు, మాక్స్ బరువు రెండు పౌండ్లు, ఆరు ఔన్సులు మాత్రమే ఉన్నారు. తరువాత నాలుగు నెలల్లో బాగా పుంజుకుని బరువు పెరగడంతో కెట్లిన్, ఆమె భర్త జూలియన్ బ్యూకర్ సంతోషంలో మునిగిపోయారు. ఒకేసారి నలుగురు పిల్లలు జన్మించడం చాలా అరుదు అన్నారు ఆసుపత్రి గైనకాలజిస్ట్ మెఘనా లిమాయే. ఇదీ చదవండి : 50లో కూడా శిల్పం లాంటి బాడీ...ఇదిగో సింపుల్ వర్కౌట్ -
మనిషి చనిపోయాక ఏమవుతుంది? కీలక విషయాలు చెప్పిన సీనియర్ నర్సు
మనిషి మరణించిన తరువాత ఏం జరుగుతుంది? ఆత్మలున్నాయా? ఇలాంటి సందేహాలు సాధారణంగా చాలా మందికి వస్తాయి కదా. దీనిపై పురాణాల్లో ప్రస్తావనలు, సైన్స్ రచనల్లో కొన్ని కీలక విషయాలు న్నప్పటికీ అమెరికాకు చెందిన సీనియర్ నర్సు కొన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన కెరీర్లో అనేక మరణాలను చూసిన ఆమె, మరణం చుట్టూ కొన్ని అపోహలు, భయాల్ని తొలగించాలనే లక్ష్యంతో ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఏమి జరుగుతుందనే దానిపై వెలుగులోకి తెచ్చిన అంశాలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి.ఇంటెన్సివ్ కేర్‌లో విస్తృతమైన అనుభవం ఉన్న నర్సు జూలీ మెక్‌ఫాడెన్, మరణం తర్వాత సంభవించే శారీరక మార్పులపై కొన్ని విషయాలను తాజాగా వివరించింది. చనిపోవడం గురించిన సాధారణ ప్రశ్నలకు సమాధానాలిచ్చే ఉద్దేశంతో ఈమె ఒక యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే మరణం తరువాత ఏమి జరుగుతుందనే అంశంపై చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఇది ఆరు లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించింది.నర్స్ జూలీ అందించిన వివరాల ప్రకారం, మరణించిన వెంటనే శరీరం 'రిలాక్స్' అవుతుంది. సహజమైన రిలాక్సేషన్ ప్రక్రియకు లోనవుతుంది. మరణం తరువాత శరీరం కుళ్లిపోవడంలో ఇదే మొదటి దశ, దీనిని హైపోస్టాసిస్ అంటారు. అందుకే కొంత మందికి మూత్ర విసర్జన, ప్రేగు కదలికలు ఉండవచ్చు లేదా ముక్కు, కళ్ళు లేదా చెవుల నుండి ద్రవాలు స్రవిస్తాయి. ఆ తరువాత అన్ని కండరాలు, వ్యవస్థలు రిలాక్స్ అయిపోతాయి. శరీర ఉష్ణోగ్రత పడిపోతుందిమరణం తర్వాత ఒక్కో శరీర స్పందన భిన్నంగా ఉంటుంది. అల్గోర్ మోర్టిస్ అనే శీతలీకరణ ప్రక్రియ కొందరికి వెంటనే ప్రారంభం అవుతుంది. మరికొందరిలో ఒకటి లేదా రెండు గంటలదాకా ఆలస్యం కావచ్చు. ఈ ప్రక్రియలో సగటున, శరీర ఉష్ణోగ్రత గంటకు 1.5 డిగ్రీలు పడిపోతుంది.ఎవరికీ తెలియని విషయంనర్స్ జూలీ ప్రకారం, శరీరంలోని గురుత్వాకర్షణ కారణంగా రక్తం కింది వైపు కదలడం ప్రారంభమవుతుంది. ఇది చాలా మందికి తెలియదు. దీన్నే లివర్ మోర్టిస్ అంటారు. అలాగే సాధారణంగా మన ఆప్తులు చనిపోయిన తరువాత చాలాసేపు బాడీని ఇంట్లో ఉంచుకుంటాం. అపుడు వారి బాడీ తిప్పి చూసినా, పాదాలను గమనించినా మొత్తం ఊదారంగు లేదా నల్లగా మారిపోతుంది. దీనికి కారణం రక్తం కిందికి ప్రవహించడమే.శరీరం గట్టిపడుతుందిజీవక్రియ ప్రక్రియల ఆగిపోవడం వల్ల కండరాలు గట్టిపడతాయి. ఇది (రిగర్ మోర్టిస్) సాధారణంగా పోస్ట్‌మార్టం తర్వాత 2-4 గంటలలోపు ప్రారంభమవుతుంది. అయితే ఇది వివిధ భౌతికఅంశాలపై ఆధారపడి 72 గంటల వరకు కూడా సమయం పట్టవచ్చు. శరీరం బరువెక్కిపోతుంది.బాడీ చల్లగా అయిపోతుంది దాదాపు 12 గంటల తర్వాత, జీవక్రియ ఆగిపోవడంతో ఉష్ణోగ్రత నియంత్రణ ఆగిపోతుంది. వైటల్ ఎనర్జీ ప్రొడక్షన్ ఆగిపోతుంది. దీంతో బాడీ చల్లగా అయిపోతుంది. కుళ్ళిపోవడంలో చివరి దశ మొదలైనట్టు అన్నమాట. కుళ్ళిపోవడం అనేది ఒక సాధారణ భాగం. అయితే ఈ ప్రక్రియ మొదలు కాకముందే అంత్యక్రియలు జరిగిపోతాయి కాబట్టి చాలా అరుదుగా ఈ విషయాన్ని మనం గమనిస్తాం అని నర్స్ జూలీ వెల్లడించింది. -
కన్నవాళ్లు వద్దని విసిరేస్తే.. కిష్టయ్యగా పునర్జన్మ పొందాడు
ఆ పసికందు ఎక్కడ పుట్టాడో తెలీయదు. కన్నవాళ్లు కనీసం గుడి వద్దో, ఆస్పత్రి దగ్గరో వదిలేసిన ఆ నరకం తప్పేదేమో. కానీ, కర్కశంగా చెట్ల పొదల మధ్యకు విసిరేశారు. ఆ దెబ్బకు ఏడురోజుల వయసున్న ఆ పసికందు వీపు చిట్లిపోయింది. కాకులో, ఏ జంతువులో పొడిచాయో తెలియదు. గుక్కపట్టి ఏడ్చేందుకు శక్తిలేని స్థితిలో ఉన్న ఆ చిన్నారిని గుర్తించి.. ఎవరో మహానుభావులు ఆస్పత్రిలో చేర్పించారు.ఆగష్టు 26వ తేదీ. యాభైకిపైగా గాయాలతో ఉన్న ఓ పసికందును ఉత్తర ప్రదేశ్‌లోని హమీర్పుర్ జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు కొందరు. అప్పటికే ఆ బిడ్డ పరిస్థితి విషమించింది. బతుకుతాడో లేదో కచ్చితంగా చెప్పలేమన్నారు డాక్టర్లు. అక్కడి నుంచి కాన్పూర్ లాలాలజపతి రాయ్ ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడా వైద్యులు ఆ బిడ్డ ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేకపోయారు. కానీ, ఏ దేవుడు చల్లగా చూశాడో తెలియదు. రెండు నెలలపాటు ప్రయత్నించి ఆ మగబిడ్డకు పునర్జన్మ పోశారు వైద్యులు.నరకం నుంచి రెండు నెలలకు.. కన్నతల్లి దూరమైనప్పటికీ.. ఆస్పత్రిలో అమ్మ ప్రేమ ఆయాల రూపంలో దొరికింది ఆ బిడ్డకు. మొదట్లో ఈ చిన్నారికి అయిన గాయాల కారణంగా ఎత్తుకునే ప్రయత్నంలోనూ ఏడ్చేవాడట. దీంతో.. ఊయలలో పడుకోబెట్టి దూరం నుంచే లాలించేవారట. ఆ సమయంలో ఆ బిడ్డ ఏడుపు.. అక్కడి సిబ్బందికి కన్నీళ్లు తెప్పించేదట. అయితే గాయాల నుంచి కోలుకునే కొద్దీ ఆ బిడ్డ కూడా వాళ్లకు అలవాటయ్యాడు.ఆగష్టు 26వ తేదీన ఆ బిడ్డ దొరికాడు. ఎవరో బ్రిడ్జి మీద నుంచి కిందకు విసిరేశారు. అయితే అదృష్టవశాత్తూ చెట్ల పొదల్లో పడ్డాడు ఆ చిన్నారి. అదే రోజు జన్మాష్టమి. అందుకే వైద్య సిబ్బంది ఆ బిడ్డకు ‘కృష్ణ’ అని పేరు పెట్టారు. రెండు నెలలపాటు ఆస్పత్రిలో ఉన్న ఆయాలందరూ.. మగ సిబ్బంది కూడా ఆ కిష్టయ్యను జాగ్రత్తగా చూసుకున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత అక్టోబర్ 24వ తేదీన పోలీసుల సమక్షంలో చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు వైద్యులు. కృష్ణ ఆస్పత్రి నుంచి వెళ్లిపోతుంటే.. అక్కడున్న సిబ్బంది మొత్తం భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ఆ వెళ్తోంది తమ బిడ్డే భావించి.. అతనికి ఓ మంచి జీవితం దక్కాలని ఆశీర్వదించి పంపించేశారట. -
వింత ఉద్యోగం: పెళ్లిళ్లు చెడగొట్టడమే పని, భారీ ఆదాయం కూడా!
సమాజంలో ఒకపుడు పెళ్ళిళ్ల పేరయ్యలకు, ఇపుడు మ్యారేజ్ బ్యూరోలకున్న క్రేజ్ ఏపాటిదో అందరికీ తెలిసిందే. వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలనేది మ్యారేజ్ బ్రోకర్స్ ఆచరించే కామన్ సూత్రం. ప్రస్తుతం ఇదో పెద్ద వ్యాపారంగా మారిపోయింది. కానీ డబ్బులు తీసుకొని మరీ పెళ్లిళ్లను చెడగొట్టే (మ్యారేజ్ బ్రేకింగ్) ఉద్యోగం గురించి విన్నారా? ఇలాంటి జాబ్కూడా ఒకటి ఉందా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరీ కథనాన్ని చదవాల్సిందే!కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ప్రపంచంలోని వివిధ రకాల ఉద్యోగాల గురించి విన్నాం. వీటిలో కొన్ని సాధారణ ఉద్యోగాలు మరికొన్ని విచిత్రమైనవి, గొప్పవి, గౌరవనీయమైనవి, కష్టతరమైనవి ఇలా రకరకాలు. కానీ స్పెయిన్ దేశానికి చెందిన ఎర్నెస్టో (Ernesto ) అనే వ్యక్తి ఒక వింత పనిలో బిజీగా ఉన్నాడు. అంతేకాదు ఇందుకు భారీగా డబ్బులు కూడా సంపాదిస్తున్నాడు. ఆడిటీ సెంట్రల్ వెబ్సైట్ ప్రకారం ఈ విచిత్రమైన జాబ్ గురించి ఎర్నెస్టో స్వయంగా సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో ఇదేం చోద్యం రా బాబూ అంటూ నెటిజనులు విస్తుపోతున్నారు. దీంతో ఇతగాడు స్పెయిన్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు.డబ్బు కోసమే ఈ పనిచేస్తున్నా కొంతమంది పెళ్లి తరువాత సుఖంగా కాపురాలు చేసుకుంటోంటే, మరి కొంతమందికి మాత్రం అదొక పీడకలగా మారిందట. అందుకే చాలా మంది క్లయింట్లు తమ మ్యారేజ్‌ని బ్రేక్ చేయమని తనను ఆశ్రయిస్తున్నారని చెబుతున్నాడు ఎర్నెస్టో. ఇందులో తన ఖాతాదారులనుంచి కనీసం రూ. 46,135 వసూలు చేస్తాడు. పెళ్లి ఎలా చెడగొడతాడంటేఫీజు తీసుకున్న తర్వాత రోజునుంచి మనోడి పని షురూ అవుతుంది. అమ్మాయి, అబ్బాయి వివరాలు తీసుకుంటాడు. సరిగ్గా పెళ్లి జరుగుతున్న సమయానికి అక్కడ వాలిపోతాడు. అతిథులందరి ముందు అమ్మాయి లేదా అబ్బాయి ఇద్దరిలో ఒకర్ని ప్రేమిస్తున్నట్లు నటిస్తాడు. పారిపోదాం రమ్మంటూ ఆస్కార్ లెవల్లో నటిస్తూ నానా హంగామా చేస్తాడు. దెబ్బకి పెళ్లికి కేన్సిల్. క్లయింట్ ఖుష్.అదిరిపోయే ట్విస్టు కూడా ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఈ సమయంలోఅవతలివాళ్లు ఇతడిని కొట్టినా, చెంపదెబ్బ కొట్టినా అదనపు ఛార్జీ చెల్లించుకోవాలి. ప్రతి స్లాప్కి,4600 రూపాయలు అదనంగా తీసుకుంటాడు. అందుకే ఎక్కువ దెబ్బలు తినే ప్రయత్నం చేస్తాడట. చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు తనను ఈ పని చేయమని వేడుకుంటారని చెబుతున్నాడు ఎర్నెస్టో. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పెళ్లిళ్ల సీజన్లో మనోడి డిమాండ్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుందట.ఇదీ చదవండి : డ్రీమ్ వెడ్డింగ్: భారతీయ దుస్తులతో అమెరికాలో ఘనంగా, ఫోటోలు వైరల్ -
బాబోయ్ బొద్దింక! ముప్పు(క్కు)తిప్పలు పెట్టింది!
మన వంట ఇంట్లో బొద్దింకలు, ఈగలు,బల్లులు కనిపిస్తే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. కొంతమందైతే బల్లి, బొద్దింకల్ని చూడగానే చాలా హడలిపోతారు. ఇవి ఆహారంలో చేరితే చాలా ప్రమాదం. ఇవన్నీమనకు తెలుసు. కానీ హాయిగా నిద్రపోతున్న మనిషి ముక్కులోకి బొద్దింక చేరి ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది. ముప్పు తిప్పలు మూడు చెరువుల నీళ్లు తాగించింది. ఇంతకీ విషయం ఏమిటంటే..చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన 58 ఏళ్ల వ్యక్తి మాంచి నిద్రలో ఉన్నాడు. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో ఆయన ముక్కులోకి చేరిపోయిందొక బొద్దింక. ఏదో అసౌకర్యంగా అనిపించి మెలకువ వచ్చింది. కానీ పెద్దగా పట్టించుకోలేదు. అటు తిరిగి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. కట్ చేస్తే.. కొన్ని రోజులకు విపరీతమైన నొప్పి మొదలైంది. దీనికి తోడు భరించలేని దగ్గు పట్టుకుంది. ఇది చాలదన్నట్టు ముక్కులోంచి దుర్వాసన రావడం మొదలైంది. అప్పుడు అనుమానంతో ముక్కు, చెవి, గొంతు డాక్టర్‌ను కలిసాడు. అయినా ఫలితం లేదు.బొద్దింకను ఎలా గుర్తించారు?ఎంతకీ తన బాధలనుంచి విముక్తి లభించకపోవడంతో శ్వాసకోశ , క్రిటికల్ కేర్ వైద్యుడిని కలిసాడు. స్టోరీ అంతా విన్నాక సదరు వైద్యుడు ఎందుకైనా మంచిదని సీటీ స్కాన్, బ్రోంకోస్కోపీ చేయడంతో మన బొద్దింగ గారి గుట్టు రట్టు అయింది. శ్వాసనాళంలో కఫంతో కప్పి ఉన్న బొద్దింకను గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసిన వైద్యులు ఆ బొద్దింకను బయటకు తీసి, శ్వాసనాళాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. దీంతో దగ్గు, కఫం అన్నీ పోయి రోగికి ఉపశమనం లభించింది. దీంతో బాబోయ్ బొద్దింక అంటున్నారు నెటిజన్లు. -
పందొమ్మిదేళ్లకు.. ‘ఫ్యామిలీ ట్రీ’ట్!
జపాన్‌లోని ఒసాకా యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్‌లో ఒక విద్యార్థి రిన్. ఇరవై ఏళ్ల రిన్ని ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా కాలేజీ వాళ్లు ‘ఫ్యామిలీ ట్రీ’ తయారుచేయమన్నారు. తల్లి తప్ప మరెవరూ లేకపోవడంతో తండ్రి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించాడు రిన్. తల్లి సచియే తకహతాను అడిగాడు. తల్లి–తండ్రి విడిపోయే సమయంలో రిన్ వయసు కేవలం ఒక సంవత్సరం మాత్రమే. వారు విడిపోయిన తర్వాత ఇద్దరి మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. ‘ఆధారాల కోసం వెతికే క్రమంలో కొన్ని పాత ఫ్యామిలీ ఫొటోలు, తండ్రి సుఖ్‌పాల్ పేరు, అమృతసర్ అడ్రస్ దొరికాయి. గూగుల్ మ్యాప్‌లో లొకేషన్ కోసం వెతికి, టికెట్ బుక్ చేసుకొని ఆగస్టు 15న పంజాబ్‌లోని అమృత్‌సర్‌కి చేరుకున్నాడు.అయితే విధి అతన్ని మరింతగా పరీక్ష పెట్టింది. సుఖ్‌పాల్ అక్కడి నుండి ఎప్పుడో వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయ్యాడని తెలిసింది. తండ్రి ప్రస్తుతం ఉంటున్న అడ్రెస్ ఎవరూ చెప్పలేకపోయారు. ‘నా దగ్గర మా నాన్న పాత ఫొటోలు ఉండటంతో స్థానిక ప్రజలను అడిగి కనుక్కోవడానికి ప్రయత్నించాను. చాలా మందిని అడిగాక అదృష్టం కొద్దీ ఒక వ్యక్తి నా తండ్రి ఫొటో గుర్తించి, అతని కొత్త చిరునామా నాకు ఇచ్చే ఏర్పాటు చేశాడు. అలా 19 ఏళ్ల తర్వాత మా నాన్నను మళ్లీ కలవగలిగాను’ అని తండ్రిని కలుసుకున్న ఉద్విగ్న క్షణాలను పంచుకుంటున్నాడు రిన్.‘ఇలా జరుగుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. కానీ, జరిగింది. నా ప్రస్తుత భార్య గుర్విందర్‌జిత్ కౌర్, నా ఏకైక కుమార్తె అవ్లీన్ కూడా రిన్ను కుటుంబంలోకి హృదయపూర్వకంగా స్వాగతించినందుకు సంతోషంగా ఉన్నాను. నా మాజీ భార్య సచియేతో ఫోన్లో మాట్లాడాను. రిన్ క్షేమం గురించి చె΄్పాన’ని సుఖ్‌పాల్ కొడుకును కలుసుకున్న మధుర క్షణాలను పంచుకుంటున్నాడు.రక్షాబంధన్ రోజే...రిన్ తండ్రి కుటుంబాన్ని కలవడం, పండగప్రాముఖ్యతను గురించి తెలుసుకొని, ఆ రోజు సవతి సోదరి అవ్లీన్ చేత రాఖీ కట్టించుకోవడం.. వంటివి రిన్ను థ్రిల్ అయ్యేలా చేశాయి. ‘మా సోదర–సోదరీ బంధం చాలా బలమైనది’ అని ఆనందంగా చెబుతాడు రిన్.కొడుకును అమృత్‌సర్‌కి తీసుకెళ్లి..ఇన్నేళ్లకు వచ్చిన కొడుకును వెంటబెట్టుకొని సుఖ్‌పాల్ స్వర్ణదేవాలయాన్ని సందర్శించుకున్నాడు. అటారీ వాఘా సరిహద్దులో జరిగిన జెండా వేడుకను వీక్షించారు. సుఖ్‌పాల్ తన గతాన్ని వివరిస్తూ ‘2000 సంవత్సరం మొదట్లో థాయ్‌లాండ్ విమానాశ్రయంలో భారతదేశానికి తిరిగి వస్తున్నప్పుడు అనుకోకుండా సచియేను చూశాను. విమానంలో మా సీట్లు పక్కపక్కనే ఉన్నాయి. అలా మా మొదటి సంభాషణ జరిగింది. ఆమె వరుసగా ఎర్రకోట, తాజ్‌మహల్‌లను సందర్శించడానికి న్యూఢిల్లీ, ఆగ్రాకు వెళుతోంది.గోల్డెన్ టెంపుల్ గురించి చెప్పి, అమృత్‌సర్‌కి తన పర్యటనను పొడిగించమని సచియేని నేనే అడిగాను. ఆమె వెంటనే ‘ఓకే’ చెప్పి అమృత్‌సర్‌కి నాతో పాటు వచ్చింది. మా కుటుంబంతో కలిసి 15 రోజులకు పైగా ఉంది. ఇక్కడ ఉన్న సమయంలో స్థానిక పర్యాటక ప్రదేశాలతో పాటు ఎర్రకోట, తాజ్‌మహల్‌ను సందర్శించాం. సచియే జపాన్‌కు వెళ్లాక కూడా ఇద్దరం ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. అప్పుడు తనకు 19 ఏళ్లు, నాకు 20 ఏళ్లు. 2002లో సచియేను వివాహం చేసుకుని, జపాన్ పర్యటనకు వెళ్లాను. ఏడాది తర్వాత రిన్ జన్మించాడు. నేను జపనీస్ నేర్చుకున్నాను. అక్కడ చెఫ్‌గా పని చేశాను.కొన్ని రోజుల తర్వాత మేం కొన్ని కారణాల వల్ల కలిసి ఉండలేకపోయాం. దీంతో నేను భారతదేశానికి తిరిగి వచ్చేశాను. ఆమె రిన్‌తో కలిసి నన్ను చూడటానికి భారతదేశం వచ్చింది. మరోసారి తనతో కలిసి జపాన్‌కు వెళ్లాను. కానీ, కలిసి ఉండలేకపోయాం. 2004లో విడాకులు తీసుకున్నాం. ఆ తర్వాత మూడేళ్ళు జపాన్‌లోనే ఉన్నా కానీ, వారిని కలవలేదు. 2007లో స్వదేశానికి తిరిగి వచ్చి మళ్లీ పెళ్లి చేసుకున్నాను. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఇప్పుడు మేమంతా రిన్‌తో టచ్‌లో ఉంటాం’ అని గత స్మృతులను, ప్రస్తుత ఆనందాన్ని ఏకకాలంలో పొందుతూ ఆనందంగా చెబుతున్నాడు సుఖ్‌పాల్. -
తైమూర్-అముర్ విచిత్ర స్నేహం : ఈ మిరాకిల్ స్టోరీ వైరల్
పులికి ఆహారంగా మేకను వేస్తే ఏం చేస్తుంది. చంపి తినేస్తుంది కదా. ఇది మన అందరికి తెలిసిందే. కానీ దీనికి భిన్నంగా తనకు ఆహారంగా వచ్చిన మేకతో స్నేహం చేసిన ఘటన విస్మయానికి గురి చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్ట్ ఒకటి ఎక్స్‌లో సందడి చేస్తోంది.రష్యాలోని ప్రిమోర్స్కీ సఫారీ పార్క్‌లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ క్రూర జంతువులకు వారానికి రెండుసార్లు ప్రాణాలతో ఉన్న జంతువులను ఆహారాన్ని ఇస్తారు. ఇందులో భాగంగానే సైబీరియన్ పులి అమూర్కు, తైమూర్ అనే మేకను రాత్రి భోజనంగా అందించారు. కానీ విచిత్రంగా ఇవి రెండూ స్నేహితులుగా మారిపోయాయి.గతంలో ఇలా చాలాసార్లు పంపించిన మేకలను పులి చంపి తినేసింది ఈ సారి మాత్రం అలా చేయలేదు. తైమూర్, అముర్ విరోధులు కాస్త ఫాస్ట్ స్నేహితులుగా మారిపోవడం మాత్రమే కాదు. కలిసి దోబూచు లాడుకోవడం, కలిసి తినడం, ఆడుకోవడం, మంచులో ఒకర్నొకరు వెంబడించుకోవడం , సరదాగా తలలతో కొట్టుకోవడం లాంటివి చేస్తున్నాయని ఎన్‌క్లోజర్ కెమెరాల ఆధారంగా పార్క్ అధికారులు ప్రకటించారు.2015లో తైమూర్ , అముర్ విచిత్ర స్నేహం వెలుగు చూడగా ఇపుడు మళ్లీ ఎక్స్‌లో వైరల్ అవుతోంది. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విటర్ ఖాతా ఈ ఫోటోను షేర్ చేయడంతో 11 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది.Tiger refuses to eat goat who was given to him as live food, instead, they became friends. pic.twitter.com/u6PlxdaKXW— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 21, 2024 ఈ స్నేహం ఎలా జరిగింది?మేకను ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేసినప్పుడు అది ఎటువంటి భయాన్ని చూపలేదు. బెదిరిపోలేదు. అది మృత్యు వేటగా భావించలేదు. అలా వ్యవహరించ లేదు. అసలు పులులకు భయపడాలని మేకకు ఎవరూ నేర్పించలేదు అంటూ జూ చీఫ్ డిమిత్రి మెజెంట్సేవ్ వ్యాఖ్యానించారు. అందుకే ఇవి స్నేహితులుగా మారాయని, ఇది మిరాకిల్ అని పేర్కొన్నారు. -
నెలకు రూ. 35 లక్షలేంటి బ్రో! దిగ్గజాల షాకింగ్ రియాక్షన్
బిట్స్ పిలానీ డ్రాప్‌అవుట్, 20యేళ్ల యూట్యూబర్ ఇషాన్ శర్మ సంపాదన బిజినెస్ దిగ్గజాలను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది 2024లో బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ‘లీక్డ్’ పేరుతో నిర్వహించిన పోడ్కాస్ట్లో ఇషాన్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచకున్నారు. దీనికి సంబంధించిన చిన్న క్లిప్ ఎక్స్‌లో వైరల్‌గా మారింది.విషయం ఏమిటంటే 2024లో వ్యాపారం ఎలా ప్రారంభించాలి అనే అంశంపై భారత్‌పే ఫౌండర్ అష్నీర్ గ్రోవర్, ఆఫ్‌బిజినెస్ సహ వ్యవస్థాపకుడు సీఈవో, ఆక్సిజో ఫైనాన్షియల్ సర్వీసెస్ కో ఫౌండర్ ఆసిష్ మోహపాత్ర, సార్థక్ అహుజా, ఇంకా నౌకరీ డాట్‌కాంకు చెందిన ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్చందానీలతో షార్క్ ట్యాంక్ సీజన్1 పోడ్కాస్ట్లో భాగంగా ముచ్చటించాడు. ఈసందర్భంగా తాను గత నెలలో రూ. 35 లక్షలు సంపాదించానని, తాను వ్యాపారంలోకి ఇదే పెద్ద సమస్యగా మారిందంటూ వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోను కావడం అష్నీర్ గ్రోవర్ వంతైంది. ఈ వయస్సులో అద్భుతం ప్రశంసనీయం అటూ ఇషాన్శర్మపై పొగడ్తలు కురిపించాడు. "నెలకు రూ. 35 లక్షలు సంపాదిస్తావా? అంటూ ఆశ్చర్యపోయాడు. అందేకాదు ‘బాబూ నువ్వు ఇక్కడ కూచోవాలి, అక్కడ కాదు (ఇంటర్వ్యూ చేసే ప్లేస్)’’ అంటూ చమత్కరించాడు. అటు నెటిజన్లుపై అతనిపై ప్రశంసలు కురిపించారు.Shocking Reaction of Ashneer Grover and Sanjeev Bikchandani After Knowing Ishaan Makes Over ₹35 Lakhs a MonthThis is Excellent, Commendable at His Age pic.twitter.com/BCmO60Vgl9— Ravisutanjani (@Ravisutanjani) July 17, 2024 ‘‘ఇది చూసిన కుర్రాళ్లకు తామేమీ సాధించలేదనే ఆందోళన (ఫోమో) పట్టుకుంటుంది. నాకు 23 ఏళ్లు, నయాపైసా సంపాదన లేదు, నాన్న మీదే అధారపడుతున్నా... కానీ ఏదో ఒకరోజు ఇతనికి పోటీగా సంపాదిస్తా అని ఒకరు, ఇది చూసే దాకా నా రోజు చాలా బాగుంది. నెలకు 35 లక్షల రూపాయలు సింపుల్ మనీ అంటాడేంటి భయ్యా అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించాడు. -
గట్టి గాలొస్తే ఎగిరిపోయేలా ఉంది..ఇంకా బరువు తగ్గుతుందట!
మనిషి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం అవసరం. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, వ్యాయామం ఇవన్నీ ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా మనకు సహకరిస్తాయి. అయితే ప్రస్తుత జీవన శైలి,ఆహారం కారణంగా చిన్నా పెద్దా, తేడాలేకుండా ప్రపంచంలో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు.ఇలా శరీర బరువు పెరగడానికి చాలా కారణాలను విశ్లేషించుకుని బరువు తగ్గేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. అయితే బరువు తగ్గే ప్రయత్నంలో కొంతమంది విపరీతంగా ప్రవర్తిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి ఓ యువతి ఉదంతం నెట్టింట చర్చనీయాంశమైంది.బేబీ టింగ్జీ యువతి 160 సెం.మీ పొడవు (5అడుగుల 2 అంగుళాలు) ఉంటుంది. బరువు కూడా 25 కిలోలు మాత్రమే. సన్నబడాలనే విపరీతమైన కోరికతో అమ్మాయి బాగా తగ్గించుకుంది. ఎంతలా అంటే.. గట్టిగా గాలివీస్తే ఎగిరిపోతుందా అన్నట్టు పీలగా తయారైంది. గట్టిగా అడుగులు వేస్తేనే ఎముకలు విరిగిపోతాయో అన్నట్టు అస్థిపంజరం నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ ఇంకో క్రేజీ విషయం ఏమిటంటే..తన బరువును ఇంకా తగ్గించుకోవాలని ఆలోచిస్తోంది. ఇది చూసి నెటిజన్లు విస్తు పోతున్నారు. బేబీ టింగ్జీకి సోషల్ మీడియాలో 42 వేలకు పైగా ఫాలోయర్లున్నారు. బేబీ టింగ్జీ కోల్పోయిన బరువుని చూసి నెటిజన్లు పలు సలహాలిస్తున్నారు. ఇంతకంటే బరువు తగ్గవద్దని, పోషకాహారం లోపంతో పలు రోగాల బారిన పడే అవకాశం ఉందంటూ హెచ్చరించారు. -
వెంటాడి వేటాడేసింది.. ఈ కుక్కకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
విశ్వాసానికి పెట్టింది పేరు శునకం. పెంపుడు జంతువుల్లో బాగా పాపులర్ అయింది కూడా కుక్క. ఇంటి యజమాని, కుటుంబం ఏదైనా అనుకోని ప్రమాదంలో పడినపుడు చాకచక్యంగా వ్యవహరించి కాపాడుతుంది. ఒక్కోసారి ప్రాణాలకు తెగించి మరీ విశ్వాసాన్ని చాటుకుని హ్యాట్సాఫ్ అనిపించుకున్న ఘటనలు చాలానే చూశాం. అయితే పగబట్టి, వెంటాడి వేటాడిన ఘటనలు చాలా అరుదు కదా. ఇలాంటి ఘటన ఒకటి అట్లాంటాలో చోటు చేసుకుంది.వివరాలను పరిశీలిస్తే..తన యజమాని కుటుంబానికి చెందిన గొర్రెలు, మేకల మందకు కాపలాగా ఉంది ఒక కుక్క. దాని పేరు కాస్పర్. ఒకరోజు గొర్రెలమందపై ఒక్కసారిగా 13 తోడేళ్ల గుంపు (కొయెట్, అమెరికన్ జాకల్) దాడి చేసింది దీంతో అక్కడే ఉన్న కుక్క వాటిపై ఎటాక్ చేసింది. ఎనిమిదింటిని అక్కడికక్కడే చంపేసింది.Atlanta Dog fights 13 coyotes attacking his sheep. Kills 8 on the spot. Goes missing 4 days. Comes home after killing the remaining 5. Salute 🫡 pic.twitter.com/OYDKhuzscW— trader (@TicTocTick) June 25, 2024ఇంతటితో దాని కోపం చల్లారలేదు. నాలుగు రోజులు అదృశ్యమై, వాటిని వెదికి పట్టుకొని మరీ వేటాడి, మిగిలిన ఐదు తోడేళ్ల పని కూడా పట్టింది. ఆ తర్వాత మాత్రమే ఇంటికి చేరింది. తీవ్ర గాయాలతో ఇంటికి చేరిన దాన్ని చూసి, ఇక బతకదని భావించారట దాని యజమాని వీర్విల్లే. ఆ తరువాత కొంతకాలం లైఫ్‌లైన్ యానిమల్ ప్రాజెక్ట్ సంరక్షణలో కోలుకుంది హీరో కాస్పర్. గత ఏడాది చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇన్‌స్టా,, ఎక్స్‌లో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. -
ఖుషీ చాలా స్మార్ట్ : క్యాబ్ ఖర్చుతోనే హెలికాప్టర్ రైడ్, వైరల్ స్టోరీ
న్యూయార్క్ సిటీలో ఇండో అమెరికన్ మహిళ చేసిన పని వార్తల్లో నిలిచింది. న్యూయార్క్ సిటీ ట్రాఫిక్‌ను అధిగమించడానికి ఉబెర్ ట్రిప్‌లో కాకుండా తెలివిగా హెలికాప్టర్ రైడ్ ఎంచుకుంది. ఇందుకైన ఖర్చు కూడా పెద్దగా లేకపోవడంతో తెలివిగా వ్యవహరించింది. దీనికి సంబంధించిన వివరాలను ఎక్స్ పోస్ట్ చేయగా ఇది వైరల్‌గా మారింది. విషయం ఏమిటంటే..క్లీనర్ పెర్కిన్స్‌లో ఉద్యోగి అయిన ఖుషీ సూరి మాన్హాటన్ నుంmr క్వీన్స్‌లోని జాన్ ఎఫ్. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంది. ఇందుకు ఉబెర్‌లో వెళ్లాలని ప్రయత్నించింది. ఇందుకు పట్టే సమయం 60 నిమిషాలు చూపించింది. అమ్మో...అంత టైమా అనుకుని హెలికాప్టర్ రైడ్‌కి ఎంత సమయం పడుతుందా అని ఒకసారి చెక్ చేసింది. కేవలం 5 నిమిషాల్లో వెళ్లిపోవచ్చని చూపించింది. పైగా ఈరెండింటిమధ్య ఖర్చుకు పెద్ద తేడాలేదు. కేవలం 30 డాలర్లు మాత్రమే డిఫరెన్స్ చూపించింది. అంతే క్షణం ఆలస్యం చేయకుండా హెలికాప్టర్ బుక్ చేసుకుంది. ధరల స్క్రీన్షాట్లతో పాటు బ్లేడ్ ఎయిర్ మొబిలిటీని ట్యాగ్ చేసింది. ఎక్స్‌లో ఆమె షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం ఉబెర్ క్యాబ్ ఖర్చు రూ. 11,000. సమయం 60 నిమిషాలు. అదే బ్లేడ్ హెలికాప్టర్ రైడ్‌కు 5 నిమిషాలు. పైగా ఖర్చు సుమారు రూ. 13,765. అందుకే ఎచక్కా హెలికాప్టర్ ఎంచుకుంది. దీంతో ట్రాఫిక్ గందరగోళాన్ని తప్పించుకోవడంతోపాటు, హెలికాప్టర్ రైడ్‌ను కూడా ఎంజాయ్ చేయవచ్చు. అదన్నమాట ప్లాన్. దీంతో నెటిజనులు ఆమెపై ప్రశంసలు కురిపించారు. జూన్ 17న షేర్ అయిన ఈ వీడియోను 40.3 లక్షల మందికి పైగా వీక్షించారు.కాగా న్యూయార్క్ నగరంలో ఉన్న బ్లేడ్ ఎయిర్ మొబిలిటీ, హెలికాప్టర్ల సేవలందిస్తోంది. ప్రధానంగా మాన్హాటన్-జాన్ ఎఫ్. కెన్నెడీ విమానాశ్రయంక మధ్య హెలికాప్టర్ సేవలను అందిస్తుంది. -
డబ్బు ఎలా ఖర్చు చేయాలి.. జర చెప్పండి ప్లీజ్: బెంగళూరు టెకీ జంట
పలు అవసరాలకు డబ్బులు సాయం చేయమని, ఆపదలో ఉన్నాం ఆదుకోమని అడగడం చాలా కామన్. కానీ డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, ఎలా ఖర్చు చేయాలో చెప్పండి మహాప్రభో అని అడిగేవారిని ఎక్కడైనా చూశారా? సినిమాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి రియల్ స్టోరీ గురించి తెలుసుకుందాం రండి! బెంగళూరు టెకీ జంట నెలకు రూ. 7 లక్షల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. బెంగళూరులో ఇల్లు, ఖరీదైన కారు, సౌకర్యవంతమైన జీవితం. కానీ మిగిలిన డబ్బును పూర్తిగా ఎలా ఖర్చు చేయాలో తెలియడం లేదట. మిగులు ఆదాయాన్ని ఎక్కడ, ఎలా ఖర్చు చేయాలో తెలియని గందరగోళంలో ఉన్నామంటూ నెటిజనులను అభ్యర్థించడం వైరల్‌గా మారింది.భారతీయ నిపుణుల జీతాలు, ఆఫీస్ పరిస్థితులు, ఆర్థిక విషయాల గురించి చర్చించే ‘గ్రేప్‌వైన్’ అనే యాప్‌లో ఈ దంపతులు పోస్ట్ పెట్టగా ‘ఎక్స్’లోనూ చక్కర్లు కొడుతోంది. ‘గ్రేప్‌వైన్’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సౌమిల్ త్రిపాఠి ‘ఎక్స్’లో స్క్రీన్‌షాట్‌ను షేర్ చేయడంతో నెట్టింట ఇది హాట్‌టాపిక్‌గా నిలిచింది. 30 సంవత్సరాల వయస్సు గల భార్యాభర్తలు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వార్షిక బోనస్‌తో పాటు నెలవారీ సంపాదన రూ. 7 లక్షలు. ఇందులో 2 లక్షల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడతారు. ఇక నెల ఖర్చులు రూ. 1.5 లక్షలు పోను వారికి నెలకు రూ. 3లక్షలకు పైగానే మిగులుతోంది. ఈ దంపతులకు ఇంకా పిల్లలు కూడా లేరు. పైగా విలాసంగా జీవించాలనే, ఎక్కువగా ఖర్చు పెట్టాలనే కోరిక భార్యభర్తలిద్దరికీ లేదు. అందుకే మిగిలిన డబ్బును ఎలా, ఎక్కడ వినియోగించాలో అర్థం కావడంలేదు. అందుకే ఏమైనా సూచనలివ్వండి అంటూ పోస్ట్ పెట్టారు.దీంతో యూజర్లు కొంతమంది ఫన్నీగా, మరికొంతమంది సీరియస్‌గానే తెగ సలహాలిచ్చేస్తున్నారు. పబ్లిక్/ప్రైవేట్ కాస్ (లేదా రియల్ ఎస్టేట్) వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టమని, లగ్జరీ వెకేషన్‌కి వెళ్లమని కొందరు, పిల్లలకోసం ప్లాన్ చేసుకోమని ఇలా తోచినట్టు సలహాలిచ్చేశారు. దీంతోపాటు, జంతు సంక్షేమ స్వచ్ఛంద సంస్థలు లేదా అనాథాశ్రమాలకు విరాళం ఇవ్వాలని కోరారు. అంతేకాదు ''నాకు కొంత ఇవ్వండి, నాకు సరిపడా జీతం రావడం లేదు'' అని ఒకరు కమెంట్ చేశారు. మరి మీరేమంటారు.. కామెంట్ సెక్షన్లో తెలపండి. -
పెళ్లిలో గర్భిణీని అలా చూసి ‘నెత్తికెత్తుకున్నాడు’: తరువాత ఏమైందంటే..!
పెళ్లిళ్లు, జాతర్లు, ఊరేగింపుల్లో బలిష్ఠమైన పురుషులు పెద్ద పెద్ద విద్యుత్తు దీపాలను తలపై పెట్టుకుని మోస్తూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. చాలాసార్లు అలాంటి దృశ్యాలను అలా చూసి వెళ్లిపోతాం. చిన్న చిన్న పిల్లలు, ఆడవాళ్లు ఇలాంటి దీపాల్ని మోస్తున్నపుడు.. మహా అయితే... అయ్యో అనుకుంటాం. కూటి కోసం కోటి విద్యలు అనుకుంటాం. మరుక్షణం ఆ విషయాన్ని మర్చిపోతాం. ఇంతకుమించి పెద్దగా పట్టించుకోం. లేదంటే సాయానికి ముందు కెళ్లదామని అనిపించినా.. ఏదో తెలియని మొహమాటం వెంటాడుతుంది.. కదా. కానీ ఒక వ్యక్తి మాత్రం మానవత్వంతో ఆలోచించి, చురుగ్గా స్పందించారు. అంతేకాదు ఆయన చేసిన పని మరో నలుగురికి ఆదర్శప్రాయమైంది. విషయం ఏమిటంటే..తన స్నేహితుడి కుమారుడి వివాహ వేడుకలో తలపై దీపాన్ని మోస్తున్న గర్భిణీని చూశారు తన్వీర్ మహ్మద్. అది చూడగానే ఆయనకు తల్లి గుర్తొచ్చిందో ఏమో గానీ, వెంటనే స్పందించారు. ఆమె నెత్తిపై ఉన్న దీపాన్ని తన నెత్తిపైకి తీసుకున్నారు.At a wedding event of my friend’s son, I noticed a pregnant lady carrying light on her head. I offered to carry it for her. Inspired by my gesture, my friends also took turns carrying it and gave her three times payment and twice to the group. No heroism greater than Mother. pic.twitter.com/OkWkVJYOnN— Tanveer Ahmed 🇮🇳 (@TheTanveerAhmed) June 18, 2024ఆగండి..ఆగండి..కథ ఇక్కడితో అయిపోలేదు..తన్వీర్‌ను చూసిన ఆయన స్నేహితులు కూడా ముందు కొచ్చారు. వంతుల వారీగా ఆమె బరువును తమ నెత్తికెత్తుకున్నారు.అంతేకాదు స్నేహితులంతా కలిసి ఈ పనికోసం చెల్లించే దానికంటే రెండు రెట్లు ఎక్కువ చెల్లించారట ఆ బృందానికి. ‘తల్లిని మించిన హీరో లేరు’ అంటూ తన్వీర్ ఈ విషయాన్ని వీడియోతోపాటు ఎక్స్‌లో షేర్ చేశారు. దీంతో పలువురు మంచి పని చేశారు భయ్యా అంటూ అభినందించారు. ఆయన ఆలోచనలు, భావాలతో విభేదించేవారు కూడా తన్వీర్ స్పందించిన తీరుపై ప్రశంసలు కురిపించడం విశేషం. -
‘నాకీ ఉద్యోగం కావాలి సర్.. లేదంటే నా లవర్‌ను పెళ్లి చేసుకోలేను’ వైరల్ స్టోరీ
చదువు పూర్తయిన తరువాత ఉద్యోగాల వేటలో పడటం, ఉద్యోగాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం ఇదంతా తెలిసిందే. ఎలాగోలా కష్టపడి ఉద్యోగం సంపాదించడానికి రక రకాల ప్రయత్నాలు చేయడమూ కొత్తేమీ కాదు. కానీ ఒక యువకుడు ఉద్యోగం కోసం వెరైటీగా దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ఇది వార్తల్లో నిలిచింది.hiring can be fun too 🥲 pic.twitter.com/6RnKnOWhIM— Dipalie (@dipalie_) June 13, 2024విషయం ఏమిటంటే.. ఉద్యోగ యత్నాల్లో భాగంగా రెజ్యూమేను శ్రద్ధగా తయారు చేసుకుంటాం. ఇందులో మనకు సంబంధించిన అన్ని నైపుణ్యాలను పొందు పరుస్తాం. అలా ఉద్యోగం ఇచ్చే వ్యక్తులను, సంస్థలను ఇంప్రెస్ చేయడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తాం. కానీ ఈ స్టోరీలోని వ్యక్తి మాత్రం రెజ్యూమ్‌లో తాను సంబంధిత ఉద్యోగానికి ఎలా అర్హుడినో చెబుతూనే... తన ప్రేమ సంగతిని కూడా చెప్పుకొచ్చాడు. తనకీ ఉద్యోగం రాకపోతే తన చిన్నప్పటిని స్నేహితురాల్ని పెళ్లి చేసుకోలేను అంటూ మొరపెట్టుకున్నాడు. ఈ ఉద్యోగానికి మీరు అర్హులు అని ఎందుకు అనుకుంటున్నారు? అనే ప్రశ్నకు సమాధానంగా ‘‘నాకు ఈ పొజిషన్‌కి కావాల్సిన అన్ని నైపుణ్యలు నాకు ఉన్నాయి. నేను దీనికి 100 శాతం పర్ఫెక్ట్ అని అనిపిస్తోంది’’ అని రాశాడు. అలాగే ‘‘ఈ ఉద్యోగం నాకు రాకపోతే నేను నా చిన్ననాటి స్నేహితురాలని పెళ్లి చేసుకోలేను. ఎందుకంటే వాళ్ల నాన్న నాకు ఉద్యోగం లేకపోతే తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయను అంటున్నాడు’’ అని రాసుకొచ్చాడు. అర్వా హెల్త్ ఫౌండర్, సీఈవో డిపాలీ బజాజ్ ఇటీవల ఒక అభ్యర్థి ఉద్యోగ దరఖాస్తు స్క్రీన్‌షాట్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. ‘ఫైరింగ్ కెన్ మీ ఫన్ టూ’ అనే క్యాప్షన్‌తో ఆమె దీన్ని ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు కొంతమంది అతని పట్ల సానుకూలంగా స్పందించడం విశేషం. ‘వారిద్దరి జీవితాలు ఈ జాబ్‌పైనే ఆధారపడి ఉన్నాయి’ అని ఒకరు ఫన్నీగా కామెంట్ చేశారు. అతని నిజాయితీని గర్తించైనా అతనికి ఉద్యోగం ఇవ్వాలంటూ మరొకరు కమెంట్ చేశారు. -
ఐస్‌క్రీంలో ఆ ‘ముక్క’ చూసి డాక్టర్‌కు కక్కొచ్చినంత పనైంది!
Human Finger Inside Cone Ice Cream ఫింగర చిప్స్ గురించి విన్నాం కానీ, ఐస్ కీంలో ఫింగర్ గురించి విన్నారా?ఆన్లైన్ ఆర్డర్ చేసుకొని చల్ల..చల్లగా.. ఐస్‌క్రీం తింటూ ఉండగా, గట్టిగా ఏదో తగిలినట్టైంది. దీంతో పరిశీలనగా చూడగా తెగిన మనిషి వేలు ముక్క కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాకైన సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. చదువుతోంటేనే.. యాక్ అనిపిస్తోంది కదా.. ముంబైలో జరిగిన ఈ షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. ముంబైలోని మలాడ్ ప్రాంత నివాసి డా. ఓర్లెమ్ బ్రెండన్ సెర్రావ్ (27) బుధవారం ఆన్లైన్ డెలివరీ యాప్ ద్వారా బటర్‌స్కాచ్ కోన్ ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్ చేశాడు. ఆర్డర్ అందుకొని ఉత్సాహంగా తింటున్న సమయంలో నాలుకకు ఏదో గట్టిగా తగలడంతో ఏంటా? అని పరికించి చూశారు. అంతే ఒక్కసారిగా వాంతి వచ్చినంత పనైంది. 2 సెంటీమీటర్ల పొడవు ఉన్న మనిషి వేలి ముక్కను చూసి దిగ్భాంతికి లోనయ్యారు. దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఐస్‌క్రీం కంపెనీపై కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం ఐస్‌క్రీమ్‌లో లభించిన మానవ అవయవాన్ని పోలీసులు ఎఫ్ఎస్ఎల్ (ఫోరెన్సిక్)కు పంపినట్లు మలాడ్ పోలీసు అధికారులు తెలిపారు. This #Butterscotch ice cream was ordered online by a 27-year-old doctor in Mumbai, Orlem Brendan Serrao.He found a 2 cm piece of a human finger. Serrao had asked his sister to include the ice cream in her online grocery order. While enjoying the treat, he felt something… https://t.co/3uHXqorYIu pic.twitter.com/gbXFBqtH6U— Sneha Mordani (@snehamordani) June 13, 2024 తన అనుభవాన్ని బ్రెండన్ ఇలా షేర్ చేశారు. ‘ఉదయం నాసోదరి ఆన్లైన్ డెలివరీ యాప్ ద్వారా కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేస్తోంది.. దీంతో నేను మూడు బటర్‌స్కాచ్ కోన్ ఐస్‌క్రీమ్‌లను జాబితాలో చేర్చమని చెప్పాను. డెలివరీ రాగానే ఐస్‌క్రీం కోను ఆస్వాదిస్తుండగా ఈ భయంకరమైన అనుభవం ఎదురైంది’ అంటూ తెలిపారు. అయితే నిజంగానే ఇది మనషి ఫింగర్ ముక్కా, లేక మరేదైనా అనేది విచారణలో తేలనుంది. మరోవైపు ఈ వ్యవహారంపై ఐస్ క్రీం తయారీదారు ఇంకా స్పందించలేదు. -
పిజ్జా లవ్ : ఇద్దరమ్మాయిలు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు
పిజ్జా అంటే చెప్పలేనంత ప్రేమ ఇద్దరు స్నేహితులు చేసిన తెలిస్తే షాక్ అవుతారు. ఒకరోజు సెలవుపెట్టి ఏకంగా విమానంలో వెళ్లి మరీ పిజ్జా ఆరగించి వచ్చారు. దీనికి ఎంత ఖర్చయిందో తెలుసా? మాంచెస్టర్ ఈవెనింగ్ న్యూస్ ప్రకారం, యూకేకుచెందిన మోర్గాన్ బోల్డ్, ఆమె స్నేహితురాలు జెస్ వుడర్ ఇద్దరూ "ఎక్స్ట్రీమ్ డే ట్రిప్"ని ప్లాన్ చేసారు. అంటే ఒక్క రోజులోనే తిరిగి ఆఫీసుకు వచ్చేసేలా అన్నమాట. దీని ప్రకారం ఇద్దరు స్నేహితులు లివర్‌పూల్ నుండి పిసాకు (ఇటలీలో) మాంచెస్టర్ విమానాశ్రయంలో విమానంలో వెళ్లారు. డే రిటర్న్ ఫ్లైట్లను బుక్ చేసుకున్నారు. ఏప్రిల్ 24న ఉదయం 6 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు ఇంటికి చేరుకోవడం విశేషం. ఈ సుడిగాలి పర్యటనలో షాపింగ్ చేసుకొని, తమకిష్టమైన పిజ్జాను ఆస్వాదించారు.బోల్డ్, వుడర్ లీనింగ్ టవర్ ఆఫ్ పిసా ముందు ఫోటోలు తీసుకున్నారు. గూగుల్ మ్యాప్‌లో మంచి పిజ్జాతో రెస్టారెంట్లకు వెతుక్కున్నారు. విమానచార్జీలు, విమానాశ్రయం పార్కింగ్, ఫుడ్ కలిపి మొత్తం పర్యటనకు 170 పౌండ్లు (రూ. 17,715) వెచ్చించామని తెలిపారు. లివర్పూల్నుంచి లండన్‌కి ఇంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. పైగా అక్కడ పిజ్జా ఇతర డ్రింక్స్ ఖరీదు చాలా ఎక్కువ. దాదాపు అదే డబ్బుతో వేరే దేశం వెళలి వచ్చామంటూ చెప్పుకొచ్చారు. పిసా టవర్‌ను చూస్తూ పిజ్జా తినడం అద్భుతం. ఇక్కడఆహార ధరలు రీజనబుల్‌గానే ఉన్నాయంటూ వెల్లడించారు. వచ్చిన విమానంలోనే తిరిగి ఇంటికి వెళ్లడం ఇంకా బావుందంటూ తెగ సంబరపడిపోయారు. -
ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం
ఆరోగ్యానికి మంచిదంటూ పాతకాలపు వంటలు, వంటలు ఇపుడొక ఫ్యాషన్. జపాన్‌లో ఒక వింత వంటకం తెగర వైరల్ అవుతోంది. శతాబ్దాల నాటి చిరుతిండిని లేటెస్ట్గా వడ్డించడంతో, ఖరీదు ఎక్కువైనా సరే ఎగబడి తింటున్నారట అక్కడి జనం. అసలు స్టోరీ ఏంటంటే..ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నాయి జపాన్ రెస్టారెంట్లు. శతాబ్దాల చరిత్రగల పురాతన వంటకం ‘రైస్ బాల్’ ను వెరైటీగా సిద్ధంచేసి మరీ ఆహారప్రియులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి కూడా. ఇంతకీ ఈ స్నాక్ ఎలా తయారు చేస్తారో తెలిస్తే మాత్రం.. దిమ్మ దిరగాల్సిందే.జపాన్‌లో ఒనిగిరి లేదా రైస్ బాల్ (అన్నం ముద్దలు) వంటకం చాలా ఫేమస్. ఉడకబెట్టిన వివిధ కూరగాయలు, మాంసం, అన్నం, నోరి అనే ఎండబెట్టిన సముద్ర పాచిలో చుడతారు. సాధారణంగా ఒనిగిరి అన్నం ముద్దలను చేత్తోనే లడ్డూల్లా చుడతారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇటీవలి కాలంలో అందమైన మహిళా చెఫ్‌లను రెస్టారెంట్ల యజమానులు రంగంలోకి దించారు. ఆ అమ్మాయిలు ఒనిగిరి ముద్దలను చేత్తో బదులు చంక కింద పెట్టుకొని చుడతారు. ఇక్కడో ఇంకో సంగతి ఏంటంటే...ఆర్మ్పిట్ టెక్నిక్‌ను వంటగదిలో కస్టమర్లను చూడటానికి అనుమతిస్తాయి. అంతేకాదు మేము చాలా జాగ్రత్తగా ఎలాంటి ఇన్ఫోక్షన్స్ రాకుండా డిస్ ఇన్ఫెక్ట్ట్తోశుభ్రంగా ఉండేలా చూసు కుంటామంటూ యజమానులు హామీ ఇస్తున్నారు. ఆర్మ్పిట్ ఒనిగిరి ముద్దలను కొన్ని రెస్టారెంట్లు ఏకంగా 10 రెట్ల ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోందీరైస్ బాల్! కొందరు పాజిటివ్‌గా కమెంట్ చేస్తోంటే, మరికొందరు నెగిటివ్ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. మొత్తం మీద రైస్బాల్ తయారీ విధానంపై చర్చ రచ్చ రచ్చగా మారింది.కొందరు కస్టమర్లు వహ్వా అంటూ లొట్టలేసుకొని తింటుంటే మరికొందరు మాత్రం రుచిలో పెద్దగా తేడా రాలేదంటూ పెదవి విరుస్తున్నారట. చెఫ్‌కు ఏదైనా గుప్త రోగం ఉంటే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు మరికొంతమంది. సాధారణంగా తమకు రైస్‌బాల్స్ అంటే ప్రాణం.. కానీ ఇది అత్యంత జుగుప్సాకరంగా ఉందని మండి పడుతున్నారు. తాము ఎప్పటికీ ఈ డిష్‌ను ట్రై చేయబోమని తెగేసి చెబుతున్నారు.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం చంకలో తయారయ్యే చెమటలో ఒక ప్రత్యేకమైన ఫెరోమోన్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుందట. దీన్ని వాసన చూస్తే లైంగిక ఆకర్షణలు పెంచుతుందని 2013 నాటి అధ్యయనంలో తేలిందట. -
కలే నిజమైంది.. ప్రాణాలు కాపాడింది!
మనలో చాలా మందికి పీడకలలు వస్తుంటాయి. ఉలిక్కిపడి లేచి హమ్మయ్య నిజం కాదు గదా అని ఊపిరి పీల్చుకుంటాం. అయితే తమ కలలు చాలావరకు నిజం అవుతూ ఉంటాయని కొంతమంది చెబుతారు. యూకేలోని మహిళకు ఇలాగే జరిగిందట. తన కలే తన జీవితాన్ని కాపాడింది అంటోంది.. వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.మెట్రో నివేదిక ప్రకారం యూకేకు చెందిన వ్యాపారవేత్త 46 ఏళ్ల షార్లెట్ వ్రోకి ఒక విచిత్రమైన కల(2021లో ) వచ్చింది. తనకు రొమ్ములో ఒక గడ్డ ఉన్నట్టు, డాక్టరు మాట్లాడుతున్నట్టు కల వచ్చింది. అంతేకాదు ఆ వైద్యుడు బ్రెస్ట్ కేన్సర్ అని చెప్పినట్టుగా కూడా చాలా స్పష్టంగా వినిపించింది. దీంతో చటుక్కున మెలకువ వచ్చింది. అప్పటికి సమయం తెల్లవారుజామున 4 గంటలు అయింది.లేచి భయంతోనే రొమ్ములను చెక్ చేసుకుంది. నిజంగానే కలలో కనిపించిన ప్రదేశంలోనే చేతికి ఒక ముద్దలాగా తగిలింది. ఇది కలా? నిజమా అనుకుంటూనే వెంటనే వైద్యులను సంప్రదించింది. స్కానింగ్‌లు, పరీక్షల తరువాత ఆమెకు ట్రిపుల్ నెగెటివ్ కేన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. భర్త, పిల్లల సహకారంతో కేన్సర్ చిక్సితను మొదలు పెట్టింది. కీమోథెరపీ చేయించుకుంది. ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు మాస్టెక్టమీ, రేడియోథెరపీ ,మళ్లీ కీమోథెరపీలు జరిగాయి. చివరికి 2023 మార్చి నాటికి ఆమెకు కేన్సర్ నయమైంది.''నా కలలు..సినిమా చూస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఉంటాయి. నిజంగా ఆకలవల్లే భయంకరమైన కేన్సర్‌ను తొందరగార్తించి జయించగలిగాను లేదంటే పరిస్థితి ఏంటో ఊహించడానికి కూడా భయంగా ఉంది. కొంతమంది ఇది యాదృచ్ఛికం అన్నారు. కానీ విశ్వం లేదా మరెవరో ముందస్తుగా నన్ను ఇలా హెచ్చరించి ఉంటారనే కచ్చితంగా నమ్ముతున్నాను. ఎప్పటికీ కృతజ్ఞురాలిని’’కాగాభవిష్యత్తు గురించి సమాచారం అందించే, లేదా హెచ్చరించే కలలను ''ప్రికోగ్నిటివ్ డ్రీమ్స్'' అంటారట. 900 మందిపై జరిపిన ఒక అమెరికన్ అధ్యయనంలో 33 శాతం మంది పాల్గొనేవారు ఒక కలను గుర్తుకు తెచ్చుకోవడం, ఆ కల నిజం కావడం సంభవించిందట. -
కొడుకు కల సాకారం కోసం...ఒక టీవీ నటి సాహసం, వైరల్ స్టోరీ
అమ్మ ఎపుడైనా అమ్మే. అమ్మకు ప్రత్యామ్నాయం లేదు. మాతృత్వపువిలువ, కన్నపేగు మమకారం తెలుసు. అందుకే కేన్సర్‌తో చనిపోయిన కొడుకుకల సాకారం కోసం పెద్ద సాహసానికి పూనుకుంది. 68 ఏళ్ల వయసులో ఒక టీవీ స్టార్ కొడుకు వీర్యంతో వారసురాలికి జన్మనిచ్చిన ఘటన సంచలనంగా మారింది. సహజంగా పిల్లలకు కనే అవకాశం లేనపుడో, మరేకారణాల రీత్యానో సరోగసీని ఆశ్రయిస్తుంటారు. కానీ కొడుకు కోసం సరోగసీని ఎందుచుకుంది స్పెయిన్ దేశానికి చెందిన టీవీ నటి అనా బ్రెగాన్. ఈమెకు అలెస్ లెక్వియో అనే కొడుకు ఉండేవాడు. అయితే దురదృష్టవశాత్తూ కేన్సర్‌తో 27 ఏళ్లకే కన్నుమూశాడు. అయితే మరణానికి ముందు అలెస్‌కు తండ్రి కావాలన్న కోరిక బలంగా ఉండేది. అందుకే తన స్పెర్మ్‌ను భ్రద (ఫ్రీజ్) పర్చుకున్నాడు. ముందస్తు ప్రమాదాన్ని ఊహించాడో ఏమో, విధి ఫలితమో గానీ కొన్నాళ్లకు కేన్సర్ బారిన పడ్డాడు. తన కల నెరవేరకుండానే చనిపోయాడు. అయితే తండ్రి కావాలన్న ఆశతో అఎస్ లెక్వియో తన వీర్యాన్ని భద్రపర్చిన విషయం ఇంట్లో లభించిన రశీదు ఆధారంగా అనా ఓబ్రెగాన్ తెలుసుకుంది. అంతే తల్లి మనసు తన కొడుకు కలసాకారం కోసం ఆరాటపడింది. దీనికి సంబంధించిన 2023లో వైద్యులను సంప్రదించింది. అన్ని పరీక్షల అనంతరం సరోగసికీ ఓబ్రెగాన్ శరీరం సహకరిస్తుందని వెల్లడించారు. దీంతో ప్రాణాలకు తెగించి మరీ కొడుకు వీర్య కణాలతో గర్భం దాల్చి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపాయికి అనిత అని పేరుపెట్టుకుంది. ఫస్ట్ బర్త్‌డే సందర్భంగా ఈ విషయాలను స్వయంగా అనా ఇన్‌స్టాలో ఫోటోలతో సహా షేర్ చేసింది. “అనితా, నీకు ఏడాది నిండింది. అగాధమైన చీకటిలో మునిగిపోయి, విపరీతమైన బాధతో ఛిద్రమైపోయిన నా హృదయాన్ని కాంతితో నింపేశాయ్... నీ చిరునవ్వు, ముద్దు ముద్దుమాటలు, నీ బుడిబుడి అడుగులు ఇవి చాలు నాకు.. మీ నాన్న నన్ను ఎంత ప్రేమతో చూసాడో అదే ప్రేమతో నన్ను చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఇప్పటివరకూ ఎవరూ నన్ను అలా చూడలేదు. ” అని పోస్ట్ చేసింది. ఇది నెటిజనుల చేత కంటతడిపెట్టిస్తోంది. View this post on Instagram A post shared by Ana_Obregon Oficial (@ana_obregon_oficial) -
మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు: సెల్ఫీ వీడియో పుణ్యమే!
సెల్ఫీ వల్ల చాలామంది మనుషుల ప్రాణాలు బలైన సంఘటనలు అనేకం చూశాం. కానీ ఒక సెల్ఫీ వీడియో నిందితుడిని పట్టిచ్చిన వైనం వైరల్‌గా మారింది. ఓ రైలు ప్రయాణికుడి సెల్ఫీ వీడియో మరో ప్రయాణికుడి మరణం వెనకున్ మిస్టరీ ఛేదించిన ఘటన మహారాష్ట్రలోని కళ్యాణ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి: బ్యాంకు ఉద్యోగి ప్రభాస్ భాంగే హోలీ వేడుకలకు ఇంటికెళ్లి అనంతరం తిరిగి పూణే వెళ్లేందుకు ఈ నెల 24న సిద్దేశ్వర్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాడు. కానీ అనూహ్యంగా అతని మృతదేహం విఠల్వాడి రైల్వే స్టేషన్లో పట్టాలపై దర్శనమిచ్చింది. అయితే జారి పడి దుర్మరణం పాలై ఉంటాడని పోలీసులు తొలుత భావించారు. అయితే ఇక్కడే అసలు కథ వెలుగులోకిచ్చింది. రైలు విఠల్వాడి స్టేషన్ వద్దకు వచ్చేసరికి ప్రభాస్ భాంగే బయట రైలు డోరు దగ్గర నిలబడి ఉన్నాడు. ఇదే అదనుగా భావించిన సెల్‌ఫోన్ దొంగ ఆకాశ్ జాదవ్ హఠాత్తుగా అతని ఫోన్ లాక్కున్నాడు. అతని మొబైల్ ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించినపుడు అదుపు తప్పి పట్టాలపై పోయాడు. అయితే ఈ మొత్తం ఉందంతం మరో రైలు ప్రయాణికుడు జాహిద్ జైదీ సెల్ఫీ వీడియోలో రికార్డు అయింది. జాహిద్ ఫోన్ కొట్టేసేందుకు కూడా ఆకాశ్ జాదవ్ ప్రయత్నించాడు కానీ సాధ్యం కాలేదు. అది వీడియోలో రికార్డు అయింది.దీనిపై అతను ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దీనిపై విచారించాల్సిందిగా పోలీసులను కోరాడు.ఇది వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానితుడిగా ఆకాశ్ జాదవ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు కూడా నిజం అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. అతడి నుంచి ప్రభాస్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని రైల్వే పోలీసు అధికారి పండరీనాథ్ కాండే వెల్లడించారు. -
నిజంగానే..చర్మం ఒలిచి చెప్పులు కుట్టించాడు! ఇంట్రస్టింగ్ స్టోరీ
చేసిన మేలుకు కృతజ్ఞతగా ‘చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తా’ అనే మాటను సాధారణంగా వినే ఉంటాం కదా. కానీ ఎక్కడా చూసి ఉండం. కానీ మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన ఒక వ్యక్తి అక్షరాలా దీన్ని చేసి చూపించాడు. అదీ నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి పట్ల కృతజ్ఞతతో.. శ్రీరాముడి స్ఫూర్తితో. దీనికి సంబంధించిన స్టోరీ ఇపుడు నెట్టింట విశేషంగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన రౌనక్ గుర్జార్ ఒకప్పుడు రౌడీ షీటర్. తన చర్మంతో తన తల్లికి చెప్పులు తయారు చేయించి బహుమానంగా ఇచ్చాడు. అదీ రామాయణం స్ఫూర్తితో. రామాయణంలో శ్రీరాముడు తన తల్లి పట్ల చూపిన భక్తికి , ప్రేమకు చలించిపోయాడు రౌనక్. తాను కూడా అమ్మకోసం ఏదైనా చేయాలనుకున్నాడు. అందుకోసం ఏకంగా కుటుంబంలో ఎవరికీ తెలియకుండా ఓ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకుని, తొడ భాగంలోని కొంత చర్మాన్ని తొలగించి, దానితో తల్లికి సరిపోయేలా ఆ చర్మంతో చెప్పులు తయారు చేయించాడు. (ఇదే తొడమీద ఒకప్పుడు పోలీసులు కాల్పులు జరిపారట.) మార్చి 14 - 21 మధ్య తన ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన భగవత్ కథలో రౌనక్ తన తల్లికి ఆ చెప్పులు సమర్పించి తల్లి పాదాలపై మోకరిల్లాడు. దీంతో రౌనక్ తల్లితో పాటు గురు జితేంద్ర మహారాజ్ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడున్న ప్రతి ఒక్కరినీ ఈ సంఘటన కదిలించింది.రౌనక్ క్రమం తప్పకుండా రామాయణం పారాయణం చేస్తాడట. ఈ క్రమంలోనే శ్రీరాముడి పాత్ర తనలో స్ఫూర్తి నింపిందని చెప్పుకొచ్చాడు. తన చర్మంతో తనకు చెప్పులు కుట్టిస్తాడని ఊహించలేదంటూ రౌనక్ తల్లి కన్నీళ్లుపెట్టుకున్నారు. రౌనక్ లాంటి కొడుకును కనడం అదృష్టంగా భావిస్తున్నానంటూ, నిండు నూరేళ్లుగా చల్లగా వర్ధిల్లమని కొడుకుని మనసారా దీవించి గుండెనిండా హత్తుకుందామె -
డబ్బుల కోసం ఇంత కక్కుర్తా? స్వయానా అన్ననే.. వైరల్ స్టోరీ
పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటూ పవిత్రంగా భావిస్తారు. ప్రభుత్వం పోత్సాహం పథకం డబ్బుల కోసం కక్కుర్తి పడి, సొంత అన్నాచెలెళ్లే పెళ్లి తంతు ముగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సమూహిక్ వివాహ్ యోజన పథకం కింద నిర్వహించిన కమ్యూనిటీ వివాహ కార్యక్రమంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. 2024, మార్చి 5న మహారాజ్‌గంజ్ జిల్లాలోని లక్ష్మీపుర్ బ్లాక్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 38 నిరుపేద కుటుంబాలకు చెందిన జంటలకు సామూహిక వివాహం కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారందరికీ ‘సీఎం వివాహ పథకం’ కింద వధువుకు మంగళసూత్రం, ట్రంకుపెట్టె, దుస్తులతో పాటు రూ.51 నగదు అందించారు. అయితే మహారాజ్‌గంజ్ జిల్లాలో ఒక మహిళకు అప్పటికే పెళ్లయిపోయింది. కానీ భర్త దూరంగా ఉన్నాడు. దీంతో ప్రభుత్వ పథకం కోసం సొంత అన్నతో కలిసి పన్నాగం పన్నింది. ఏమాత్రం సంకోచం లేకుండా సోదరుడిని వివాహం చేసుకుంది. 'సప్తపది' (ఏడు సార్లు అగ్ని ప్రదక్షిణం) తో సహా అన్ని ఆచారాల్ని పాటించింది. అనంతరం బహుమతులు అందుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు విస్తుపోయారు. ఈ విషయం అధికారుల దృష్టికి కూడా చేరడంతో, పరిశీలించిన అధికారులు అప్పటికే ఆమెకు వివాహమైనట్లు గుర్తించారు. దీంతో లక్ష్మీపూర్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అమిత్ మిశ్రా విచారణకు ఆదేశించారు. వారికిచ్చిన బహుమతులను కూడా వెనక్కి తీసుకున్నామనీ, ఈ పథకం కింద ఇచ్చే నగదు సహాయం నిలిపి వేస్తామని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మిశ్రా తెలిపారు. కాగా ఇటీవల యూపీలోని బల్లియా జిల్లాలో కమ్యూనిటీ వెడ్డింగ్ స్కీమ్‌లో ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు, తమకు తామే దండలు వేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
ఏడేళ్లకు వచ్చిన అడ్మిట్ కార్డ్: షాకైన బెంగాలీ బాబు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని వ్యవసాయ శాఖలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. వ్యవశాయ శాఖలో ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న 7 సంవత్సరాల తర్వాత ఆ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డు వచ్చింది. దీంతో అది చూసి ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. ఆశ్యర్యకరమైన పరిణామం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. అటు రాజకీయంగా కూడా ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇండియా టుడే కథనం ప్రకారం 2016 లో పశ్చిమ బెంగాల్‌లోని వ్యవసాయ శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. అసిస్టెంట్ పోస్టుకు ఆ ఏడాది మార్చిలో వార్తాపత్రికలో ప్రకటన వచ్చింది. ఈ నోటిఫికేషన్‌ను చూసి ఆశిష్ బెనర్జీ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు వర్ధమాన్ జిల్లాకు చెందిన ఆశిష్ బెనర్జీ. పరీక్ష డిసెంబర్ 18, 2016న జరగాల్సి ఉంది. కానీ దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డు లేదా హాల్ టికెట్ రాలేదు. దీని కోసం కొన్నాళ్లు ఎదురుచూసి, ఇక దాని సంగతే మర్చిపోయాడు. కానీ ఆశ్యర్యకరంగా దాదాపు ఏడేళ్ల తరువాత షాక్య్యే ఘటన చోటు చేసుకుంది. (80 కోట్లమంది పేదలకు ప్రయోజనం: ప్రధాని మోదీ కీలక ప్రకటన) ఇటీవల (2023 నవబంరు 1వ తేదీ) ఆశిష్ బెనర్జీకి పశ్చిమ బెంగాల్ వ్యవసాయ శాఖ నుంచి ఒక సీల్డ్ కవరు అందింది. దాని లోపల ఏడేళ్ల క్రితం జరిగిన పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ ఉంది. దీంతో ఇంత కాలానికా.. జీవిత కాలం లేటు అన్నట్టుగా ఆశ్చర్యపోవడం ఆశిష బెనర్జీ వంతైంది. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే 2016 డిసెంబరు 18 వ తేదీనే నిర్వహించడం, పరీక్ష రాసి, సెలక్ట్ అవ్వడం, వారు ఉద్యోగంలో చేరిపోవడం అన్నీ జరిగిపోయాయి. (షాకింగ్ వీడియో: ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం, ఒకరు మృతి) దీంతో ఈ వ్యవహారంపై ఆశిష్ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాడు. తనకు అడ్మిట్ కార్డు ఆలస్యం కావడానికి కారణం ఏమిటో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశాడు. చేయని తప్పుకు తాను మూల్యం చెల్లించాల్సి వచ్చిందని తప్పు ఎవరిదో తేలాలని పట్టుబడుతున్నాడు. అంతేకాదు రాష్ట్రంలోని ఇతర ఉపాధి స్కామ్‌ల మాదిరిగానే ఈ కేసులో కూడా కుంభకోణం జరిగిదంటే ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆశిష్. -
ఈ కారణంతో టాప్ పెర్ఫార్మర్‌నే పీకేసిన కంపెనీ! ఇదేం చోద్యం అంటున్న నెటిజన్లు
కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు అవార్డులు, రివార్డులు, ప్రోత్సాహకాలు ఇవ్వడం, పనితీరు బాగా లేదు అనుకున్న వాళ్లని ఉద్యోగం నుంచి తొలగించడం చాలా కామన్. కానీ ఒక కంపెనీ మాత్రం ఉద్యోగులకు గుణపాఠం చెప్పే పేరుతో టాప్ పెర్ఫార్మర్‌నే ఉద్యోగంలోంచి తీసేసింది. దీనికి సంబంధించిన కథనం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. (నీతా అంబానీ అద్భుత గిఫ్ట్: మురిసిపోతున్న కాబోయే కోడలు) సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం రెడిట్ ఒక యూజర్ ఈ స్టోరీని షేర్ చేశాడు. కంపెనీలో బాగా పని చేసే టాప్ పెర్ఫార్మర్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ విషయాన్ని రెడిట్ యూజర్ పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో ఇదెక్కడి చోద్యం రా బాబూ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఉద్యోగులను భయపెట్టేందుకు బాగా పనిచేస్తున్న ఉద్యోగిని తీసివేయడం ఎంతవరకు సబబు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. (సినిమాలకు బ్రేక్: సమంతకు ఆర్థికంగా అన్ని కోట్లు నష్టమా?) అంతేకాదు కంపెనీకి సంబంధించి తర విషయాల గురించి కూడా చెప్పాడు. కార్మికుల కమీషన్లు దొంగిలించడం, కాంట్రాక్ట్ నిబంధనలను బేఖాతరు చేయడం, కనీసం వాష్‌రూంలో 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడిపినా వేధించడం, నచ్చకపోతే తలుపు తెరిచి ఉందని చెప్పడం లాంటివి చాలా వరకు తగ్గాయంటూ వీటి తీవ్రతను చెప్పుకొచ్చాడు రెడిటర్ పోస్ట్‌లో తెలిపారు. టార్గెట్ రీచ్ అవ్వని కారణంగా తొలగిస్తామని బెదిరించారు. నిజానికి నానుంచి కమీషన్ తీసుకున్నందుకు చేసిన పని అది. ఇది ఇలా ఉంటే అకస్మాత్తుగా టాప్ పెర్ఫార్మర్ అయినా తన సహో ద్యోగిని తొలగించారనీ వాపోయాడు. అంతేకాద సేల్స్ ఫిగర్స్ కాస్త తక్కువగా ఉండటంతో అంచనాలను అందుకోలేదని వారు చెప్పారు. కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే తమను ప్రశ్నించిన వారిక ఇలాటి గతే పడుతుందని ఇతర ఉద్యోగులకు ఇది పరోక్ష హెచ్చరిక అని కమెంట్ చేశారు.కమీషన్ కాంట్రాక్ట్ ఒప్పందాలను ఉల్లంఘిండం లాంటి విషయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే ఇదే గతి పడుతుందనే మెసేజ్‌ను డైరెక్ట్ మేనేజర్ ఇచ్చారని రెడిట్ పోస్టులో రాసుకొచ్చారు ఆ కంపెనీ ఉద్యోగి. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
థ్యాంక్స్ టూ యాపిల్ స్మార్ట్ వాచ్, లేదంటే నా ప్రాణాలు: వైరల్ స్టోరీ
యాపిల్ వాచ్‌లోని కీలక ఫీచర్ ఇప్పటివరకు చాలామంది ప్రాణాలను కాపాడింది. భయానక పరిస్థితుల నుంచి యాపిల్ వాచ్ కారణంగా బయటపడ్డానంటూ ప్రపంచవ్యాప్తంగా పలు యూజర్లు షేర్ చేసిన పలు కథనాలూ చదివాం. తాజాగా అలాంటి మరో స్టోరీ వైరల్‌గా మార్చింది. యాపిల్ వాచ్ లేకపోయి ఉంటే.. ఈ పాటికి నా ప్రాణాలు గాలి కలిసిపోయేవే అంటూ ఒక వ్యక్తి ఈ లిస్ట్‌లో చేరారు. (వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్: ఒకేసారి 32 మందితో) కెనడాకు చెందిన వ్యక్తి అలెగ్జాండర్ లేజర్సన్ కథనం ప్రకారం యాపిల్ వాచ్ కీలకమైన సమయంలో స్పందించి అత్యవసరమైన వ్యక్తుల ఫోల్ చేయడంతో సకాలంలో వైద్యం అందింది. తద్వారా తలకు భారీ గాయమైనా ప్రాణాలతో బతికి బైటపడ్డాడు. దీనికి ఆయన యాపిల్ స్మార్ట్‌వాచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలెగ్జాండర్ ఏదో పనిచేసుకుంటూ ఉండగా నిచ్చెనపై నుండి కింద పడిపోయాడు.దీంతో అతని తలికి తీవ్ర గాయమైంది. కానీ వెంటనే యాపిల్ వాచ్ సిరీస్ 8 స్మార్ట్ వాచ్ అత్యవసర సేవల నంబరు, అతని భార్యను డయల్ చేసింది.దీంతో వెంటనే అతడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.తలపై ఏడు కుట్లు పడ్డాయని, ప్రస్తుతం కోలుకుంటున్నానని పేర్కొన్న అలెగ్జాండర్ వాచ్‌లోని టెక్నాలజీకి ధన్యవాదాలు తెలిపారు. (టాప్ డైరెక్టర్ రాజమౌళి కొత్త అవతార్: హీరోలకు షాకే!?) కాగా యాపిల్ స్మార్ట్‌వాచ్ Apple Watch 4, ఆ తరువాతి మోడల్స్ లో ఫాల్ డిటెక్షన్ ఫీచర్ యూజర్ అందుబాటులో ఉంది. ఒకవేళ యూజర్ పడిపోతే ఈ ఫీచర్ వెంటనే అలర్ట్ అవుతుంది.ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ సర్వీస్‌లను, వ్యక్తులకు సమాచారం ఇస్తుంది. ఈ ఫీచర్ 55 ఏళ్లు పైబడిన వినియోగదారుల కోసం ఈ ఫీచర్ స్వయంచాలకంగా ఆన్ అవుతుంది. సెటింగ్స్‌లో మాన్యువల్‌గా కూడా దీన్ని సెట్ చేసుకోవచ్చు. (తొలి జీతం 5వేలే.. ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్‌గా కోట్లు, ఎలా?) -
వర్క్ టైంలో ఆన్ లైన్ షాపింగ్ అడ్డంగా దొరికిపోయిన ఉద్యోగి
-
తిండి లేదు.. తిప్పలు పడింది.. విశ్వాసమే మళ్లీ నెగ్గింది!
27 రోజులు.. 64 కిలోమీటర్లు.. దారి తెలీయకున్నా ఎక్కడా ప్రయాణం ఆపలేదు. తిండి లేదు.. తోవలో తిప్పలెన్నో పడింది.. చివరకు కథ సుఖాంతం అయ్యింది. విశ్వాసానికి మారుపేరైన శునకం మరోసారి తన స్వామి భక్తిని చాటుకుని వార్తల్లోకి ఎక్కింది. అదేంటో మీరూ చదివేయండి.. సృష్టిలో ప్రేమ అనంతం. కానీ, ఆ ప్రేమకు స్వచ్ఛతను.. అచ్చమైన అర్థాన్ని చెప్పేవి మాత్రం కొన్నిగాథలే. మూగజీవాలు మనుషుల పట్ల కనబరిచే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా ఇక్కడో శునకం.. యజమాని(కేర్ టేకర్) కోసం చేసిన సాహసం గురించి ముమ్మాటికీ చెప్పుకోవాల్సిందే. పైన ఫొటోలో ఉంది కూపర్. Golden Retriever జాతికి చెందిన శునకం. ఒక నెలకిందట.. ఐర్లాండ్ ఉత్తర భాగంలోని టైరోన్ కౌంటీలోని ఓ ఇంటికి దత్తత వెళ్లింది. కారు నుంచి దిగీదిగగానే పరుగులు అందుకుంది కూపర్. అలా మొదలైన ప్రయాణం 40 మైళ్ల పాటు సాగింది. లండన్డెర్రీలోని టోబర్మోర్లో ఉన్న తన కేర్ టేకర్ చెంతకు చేరింది. కనిపించకుండా పోయిన మూగజీవాల గురించి ఆరా తీసే లాస్ట్‌పాస్ ఎన్ఐ అనే ఛారిటీ కూపర్‌కు చెందిన అందమైన కథను సోషల్ మీడియాలో పంచుకుంది. దాదాపు నెలపాటు సాగిన కూపర్ ప్రయాణం.. ఎక్కడా ఆగలేదు. ఎవరి సాయం లేకుండానే అది ముందుకు సాగింది. దారి తెలియకపోయినా.. అది పాత ఓనర్ చేరుకున్న తీరు ఆశ్చర్యానికి గురి చేయిస్తోందని సదరు ఛారిటీ పేర్కొంది. మరోవైపు అది తిరిగి రావడం చూసి దానిని దత్తత ఇచ్చిన వ్యక్తి భావోద్వేగానికి లోనయ్యారు. ఇకపై కూపర్ ఎక్కడికి వెళ్లదని, తనతోనే ఉంటుందని కన్నీళ్లతో చెబుతున్నారు. -
బంపర్ ఆఫర్! ఏడాది వేతనంతో కూడిన సెలవు! ఎక్కడ?
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో వర్క్‌ఫ్రం హోం విధానానికి అలవాటు పడిన ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు వెళ్లాలంటే అయ్యో... అని నిట్టూరిస్తున్న పరిస్థితి. అలాంటిది ఒక ఉద్యోగికి 365 రోజులు పెయిడ్ లీవ్ ఇస్తే.. వావ్.. అది కదా బంపర్ఆఫర్ అంటే. చైనాలోని ఒక ఉద్యోగి ఇలాంటి జాక్‌పాట్ తగిలింది. ఏకంగా ఏడాది పాటు వేతనంతో కూడిన లీవ్ లభించింది. ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే, ఎలాంటి విధులు నిర్వహించకుండానే అతనికి నెలనెలా జీతం పొందే అవకాశం లభించింది. నమ్మలేకపోతున్నారా? ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న ఈ స్టోరీ చదవాల్సిందే. (రాధిక మర్చంట్, ఫ్రెండ్ ఒర్రీ: ఈ టీషర్ట్, షార్ట్ విలువ తెలిస్తే షాకవుతారు) స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించిన ప్రకారం చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రం షెన్జెన్ పట్టణంలోని పేరు వెల్లడించని కంపెనీ తమ ఉద్యోగి ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత ఇటీవల వార్షిక విందును ఏర్పాటు చేసింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కల్పించాలని భావించింది. వారిలో నైతిక స్థైర్యాన్ని పెంపొందించే ఆనోచన తోవిందులో లక్కీ డ్రాను నిర్వహించింది. ఈ డ్రా గెలుచుకున్న వారికి అధిక వేతనం, ఇతర బహుమతులతో పాటు ఏడాది పాటు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది. (సల్మాన్ ఖాన్ మూవీ బూస్ట్: ఏకంగా 21 వేల కోట్లకు ఎగబాకిన బిజినెస్‌మేన్) పెనాల్టీ కార్డులు కూడా ఈ డ్రాలో జోడించింది. అంటే పార్టీలో వెయిటర్‌గా వ్యవహరించడం లేదా ఇంట్లో తయారు చేసిన ప్రత్యేకమై ఒక రకంగా భయంకరమైన పానీయం తాగడం లాంటివి కూడా ఉన్నాయి. అయితే వీటన్నింటిని తోసి రాజని మేనేజర్ స్థాయి ఉద్యోగి ఒకరు 365 రోజుల సెలవుతో కూడిన బంపర్‌ప్రైజ్ గెల్చుకోవడంతో ఎగిరి గంతేశాడు. అతడు దీనికి సంబంధించిన చెక్ పట్టుకుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. (ఇదీ చదవండి: అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) 男子在公司年会抽到“365天带薪休假”奖项 pic.twitter.com/aOaSxgBAtO — The Scarlet Flower (@niaoniaoqingya2) April 12, 2023 మరోవైపు కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగి చెన్ మాట్లాడుతూ ఈ సెలవును నగదుగా మార్చుకోవాలనుకుంటున్నారా లేదా ఆనందించాలనుకుంటున్నారా అనేది నిర్ణయించడానికి విజేతతో కంపెనీ చర్చలు జరుపుతుందని పేర్కొన్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
‘నాకేం వద్దు.. నాకు ఇలా బతకడమే బాగుంది’
వారం రోజులుగా ఈ ‘దాదీజీ’ (అవ్వ) వీడియో వైరల్ అవుతోంది. దానికి కారణం ముంబై మెట్రో రైళ్లల్లో ఈ దాదీజీ చాక్లెట్లు అమ్ముతూ కనిపించడమే. ఆమె కథ ఏమిటో. పిల్లలు చూస్తున్నారో లేదో. కాని తన జీవితం తాను బతకడానికి చక్కని నవ్వుతో తియ్యని చాక్లెట్లు అమ్ముతోంది. ఒక ప్రయాణికుడు ఆమె వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. చాలామంది సాయం చేస్తామని వచ్చారు. ‘చాక్లెట్లు కొనండి చాలు’ అని సున్నితంగా, ఆత్మగౌరవంతో తిరస్కరించిందామె. ముంబై లోకల్ ట్రైన్లలో చక్కగా నవ్వుతూ, చుడీదార్లో చలాకీగా నడుస్తూ, చాక్లెట్లు అమ్మే ఆ పెద్దావిడను చూసి ఎవరో వారం క్రితం సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వయసులో కూడా జీవించడానికి శ్రమ పడుతున్న ఆమెను అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ అయితే ఆ వీడియోను ట్వీట్ చేసి అందరూ ఆమె దగ్గర చాక్లెట్లు కొనండి అని వినతి చేశారు. ఆ తర్వాత ‘హేమ్‌కుంట్ ఫౌండేషన్’కు చెందిన అహ్లూవాలియా అనే వ్యక్తి ఆమెకు పెద్ద ఎత్తున సాయం చేస్తాము ఆమె ఎక్కడ ఉంటుందో గుర్తించండి అని ముంబై వాసులను ఉద్దేశించి ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లను బాలీవుడ్ స్టార్లు కూడా రీట్వీట్ చేశారు. చాలామంది ముంబైవాసులు ‘మేము ఫలానా ట్రైన్లో చూశాం. ఆ స్టేషన్లో చూశాం’ అని స్పందనలు పెట్టారు. చివరకు వెతికి వెతికి ఆమెను పట్టుకున్నారు అహ్లూవాలియా మనుషులు. ఆమె పేరు వజ్జీ... ‘నా కుటుంబంలో సమస్య వచ్చింది. అప్పటినుంచి చాక్లెట్లు అమ్ముతున్నా’ అని ఆమె చెప్పింది వజ్జీ. ఫౌండేషన్ సభ్యులు ఆమెకు వెంటనే పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ‘నాకేం వద్దు. నాకు ఇలా బతకడమే బాగుంది’ అని చెప్పిందామె. ‘నా మనుషులు ఆమె చాక్లెట్లను రెట్టింపు రేటు ఇచ్చి కొందామన్నా ఆమె ఇవ్వలేదు. మామూలు రేటుకే ఇచ్చింది. ఇకపై ప్రతి వారం ఆమె చాక్లెట్లు మొత్తం మేము కొంటాం. ఎందుకంటే ఆ ఒక్క రోజు ఆమె అన్ని రైళ్లు తిరిగే అవస్థ తప్పుతుంది’ అని ట్వీట్ చేశాడు అహ్లూవాలియా. ‘ఆమె ఆత్మగౌరవం చూసి మేమందరం ఆమెకు మరింత అభిమానులం అయ్యాం’ అని నెటిజన్లు వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికీ ఏవో సమస్యలు వస్తాయి. కాని వజ్జీలా నవ్వుతూ హుందాగా వాటిని ఎదుర్కొనడం తెలియాలి. వజ్జీ నుంచి గ్రహించాల్సిన పాఠం అదే. -
రియల్ హీరో: ప్రాణత్యాగంతో 144 మందిని కాపాడాడు!
తన ప్రాణం పోతుందని తెలిస్తే.. ఎవరైనా భయపడతారు. తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, తన ప్రాణం పోయినా.. ఇతరులను కాపాడాలని చూసేవాళ్లను ఏం అనాలి?. రియల్ హీరో అనడం ఎంతమాత్రం తక్కువ కాదు. క్షణాల్లో ఘోర ప్రమాదం జరుగుతుందని తెలిసి.. తన ప్రాణం పోయిన పర్వాలేదనుకుని వంద మందికి పైగా ప్రాణాలు నిలబెట్టాడు యాంగ్ యోంగ్. దక్షిణ చైనాలో హైస్పీడ్ బుల్లెట్ రైలు డీ2809 శనివారం ప్రమాదానికి గురైంది. గుయిజౌ ప్రావిన్స్‌లో బుల్లెట్ రైలు ప్రమాదానికి గురికాగా.. డ్రైవర్ కోచ్ నుజ్జునుజ్జు అయ్యి అందులోని డ్రైవర్ యాంగ్ యోంగ్ ప్రాణం విడిచాడు. ప్రమాదంలో మరో ఎనిమిది మంది గాయపడగా.. 136 మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ప్రమాదం గురించి దర్యాప్తు చేపట్టిన అధికారులకు.. ట్రైన్ డేటా ఆధారంగా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. డీ2809 రైలు.. గుయియాంగ్ నుంచి రోంగ్జియాంగ్ స్టేషన్ల మధ్య ఒక టన్నెల్ వద్దకు చేరుకోగానే.. డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతోనే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు అధికారులు. అయితే.. టన్నెల్‌కు చేరుకునే ముందు ట్రాకుల మీద అసాధారణ పరిస్థితులను యాంగ్ గుర్తించాడు. వెంటనే.. ఎమర్జెన్సీ బ్రేకులు అప్లై చేశాడు. దీంతో ముందున్న బురద, మట్టి కుప్పలను బలంగా ఢీకొట్టి రైలు సుమారు 900 మీటర్ల దూరం జారుకుంటూ ముందుకు వెళ్లింది. ఆపై స్టేషన్ వద్ద బోల్తా పడడంతో డ్రైవర్ కోచ్ బాగా డ్యామేజ్ అయ్యింది. Train driver on D2809 "5 second braking" : Emergency braking becomes muscle memory, Yang Yong did everything he could pic.twitter.com/IkiMUvcknt — tigers tiger (@tigerstiger1) June 5, 2022 యోంగ్ బ్రేకులు గనుక వేయకుండా ఉంటే.. పూర్తిగా బల్లెట్రైలే ఘోర ప్రమాదానికి గురై భారీగా మృతుల సంఖ్య ఉండేది!. కానీ, యోంగ్ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. తన ప్రాణం కన్నా ప్రయాణికులే ముఖ్యం అనుకున్నాడు. యోంగ్ నేపథ్యం.. ఆయన ఇంతకు ముందు సైన్యంలో పని చేశారు. రిటైర్ అయిన తర్వాత.. కో-డ్రైవర్‌గా, అసిస్టెంట్ డ్రైవర్‌గా, ఫోర్‌మ్యాన్‌గా, డ్రైవర్ ఇన్‌స్ట్రక్టర్‌గా, గ్రౌండ్ డ్రైవర్‌గా.. చివరికి ట్రైన్ డ్రైవర్‌గా బాధ్యతలు చేపట్టాడు. దేశం కోసం సేవలు అందించిన వీరుడు.. చివరకు జనాల ప్రాణాలను కాపాడడం కోసమే ప్రాణాలు వదిలాడు. యోంగ్ చేసిన త్యాగం.. ఆ దేశాన్ని కంటతడి పెట్టించింది. రియల్ హీరోగా ఆయన్ని అభివర్ణిస్తోంది. తనను తప్ప.. మిగతా అందరినీ కాపాడుకున్న ఆ హీరోను ఆరాధిస్తోంది ఇప్పుడు అక్కడ. యోంగ్ పార్థివదేహానికి అతని స్వస్థలం గుయిజౌలోని జున్యీ వద్ద ప్రభుత్వ లాంఛనాలతో ప్రజల కన్నీళ్ల మధ్య ఘనంగా జరిగింది. The heroic driver of #D2809 Yang Yong returned to his hometown of #Zunyi , #Guizhou , under the escort of the convoy. Locals spontaneously lined the way to bid farewell Welcome home heroes. 6月5日,D2809司机杨勇在车队护送下回到家乡贵州遵义。当地人自发夹道送别:“欢迎英雄回家!” pic.twitter.com/c8OokOdx24 — Michael Franklin ( 100% follow back) (@Michael04222710) June 6, 2022 -
రెండుసార్లు గర్భస్రావం.. తర్వాత ప్రెగ్నెంట్.. నెలలోపే మళ్లీ గర్భం.. కవలలు!
మాతృత్వపు మధురిమలను ఆస్వాదించాలని కోరుకోని మహిళ ఉండదంటే అతిశయోక్తి కాదు. తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ బిడ్డను ప్రపంచంలోకి తీసుకువస్తుంది తల్లి. అందుకోసం ఎంతటి బాధనైనా పంటిబిగువన భరిస్తుంది. పొత్తిళ్లలో చిన్నారిని చూసుకోగానే తాను పడిన ప్రసవ వేదనను మరిచిపోతుంది. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన కారా విన్‌హోల్డ్ కూడా అలాంటి కోవకు చెందిన వారే! అయితే, ఇప్పటికే ఒక కుమారుడికి జన్మనిచ్చిన ఆమె.. తనకు తెలియకుండానే కవలలకు ప్రాణం పోశారు. వారిని ఈ లోకంలోకి తీసుకువచ్చారు. ఎన్నో అబార్షన్ల తర్వాత దక్కిన ఈ రెట్టింపు సంతోషంతో విన్‌హోల్డ్ దంపతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అసలేం జరిగింది? వాషింగ్టన్ పోస్ట్, మెట్రో కథనాల ప్రకారం.. విన్‌హోల్డ్, ఆమె భర్త 2018లో ఓ బాబుకి జన్మనిచ్చారు. తమ కుటుంబాన్ని మరింతగా విస్తరించుకోవాలని భావించిన ఆ జంట.. మరో సంతానం కోసం ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో 2019లో విన్‌హోల్డ్ గర్భం దాల్చడంతో ఎంతో సంతోషపడ్డారు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. అనారోగ్య కారణాల రీత్యా ఆమెకు గర్భవిచ్చిత్తి అయింది. 2020లోనూ ఇదే తరహాలో చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఆరోగ్యంపై కూడా ఈ అబార్షన్లు తీవ్ర ప్రభావం చూపాయి. అయినప్పటికీ మరో బిడ్డను కనాలన్న ఆ తల్లి మనసు నిరాశ చెందలేదు. ఈ క్రమంలో గతేడాది ఫిబ్రవరిలో విన్‌హోల్డ్ మరోసారి గర్భవతి అయింది. అన్నీ సజావుగా సాగడంతో పుట్టబోయే బిడ్డ కోసం ఎదురుచూడసాగింది. అయితే, ఊహించని విధంగా ఏడు వారాల తర్వాత తన కడుపులో మరో శిశువు ఎదుగుతున్నట్లు డాక్టర్లు ఆమెకు చెప్పారు. గర్భం దాల్చిన నెల రోజుల తర్వాతే మరో ప్రెగ్నెన్సీ రావడంతో ఇది సాధ్యమైందని వైద్యులు చెప్పడంతో విన్‌హోల్డ్ దంపతులు ఆశ్చర్యానికి లోనయ్యారు.ఈ నేపథ్యంలో ఆమె కవలలకు జన్మనిచ్చారు. దీంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. (PC: Kennedy News and Media Via Metro) కారణం ఏమిటి? కారా విన్హెల్డ్కు తెలియకుండానే కవలలు జన్మించడానికి కారణం సూపర్ఫెటేషన్. హెల్త్‌లైన్ జర్నల్ ప్రకారం.. ఒకేసారి విడుదలైన రెండు అండాలు వేర్వేరు సమయాల్లో(వారాల వ్యవధి) ఫలదీకరణం చెందితే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. దీనినే వైద్య పరిభాషలో సూపర్ఫెటేషన్ అంటారు. ఎప్పుడూ నిరాశ చెందలేదు.. అయితే ఇలా! ‘చాలా మంది పిల్లల్ని కనాలని.. వారితో అమ్మా అని పిలిపించుకోవాలని నాకు ఆశగా ఉండేది. గర్భస్రావాలు అయినప్పటికీ నేను పూర్తి ఆశావాద దృక్పథంతోనే ఉన్నాను. కచ్చితంగా ఇది జరిగి తీరుందని నమ్మాను. అమ్మగా నా ప్రయాణంలో ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుసు. అయినా ఏనాడు నిరాశ చెందలేదు. ఇప్పుడు నా కల నెరవేరింది’’ అని విన్‌హోల్డ్ వాషింగ్టన్ పోస్ట్‌తో వ్యాఖ్యానించారు. తన జీవితంలో అద్భుతం జరిగిందంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. కాగా విన్హోల్డ్కు కవలలుగా ఇద్దరు కుమారులు జన్మించారు. ఆరు నిమిషాల తేడాతో ఈ భూమ్మీదకు వచ్చిన ఆ బుజ్జాయిలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ముగ్గురు కుమారుల అల్లరితో ఈ దంపతుల ఇల్లు ఇప్పుడు ఎంతో సందడిగా ఉంది. ఇక గర్భవతికి మరో ప్రెగ్నెన్సీ అంటూ విన్‌హోల్డ్ జీవితంలోని ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: ఎనిమిది మంది భార్యలతో ఒకే ఇంట్లో.. వీడు మామూలోడు కాదండోయ్.. -
74 ఏళ్ల వయసులో గర్ల్ ఫ్రెండ్ కోసమే ఇదంతా...
బెంగళూరులో పట్టాభి రామన్ 74 ఏళ్ల వయసులో ఆటో నడుపుతాడు. గొప్ప ఇంగ్లిష్ మాట్లాడతాడు. గర్ల్ ఫ్రెండ్ కోసమే ఈ వయసులో కూడా ఆటో నడుపుతాను అంటాడు. గర్ల్ ఫ్రెండా? ఆశ్చర్యపోకండి. ‘నా భార్యను నేను గర్ల్‌ఫ్రెండ్ అనే పిలుస్తాను. భార్యను ఎప్పుడూ ప్రియురాలిగానే చూసుకోవాలి. సేవకురాలిగా కాదు’ అంటాడు. ప్రయివేట్ కాలేజీలో ఇంగ్లిష్ లెక్చరర్‌గా పని చేసిన రామన్ పిల్లల మీద ఆధారపడకుండా గత 14 ఏళ్లుగా ఆటో నడుపుతున్నాడు. భార్య అంటే ప్రేమ, గౌరవం... ఫిర్యాదులు లేని జీవితానందం ఉన్న రామన్ కథ ఒక పాసింజర్ ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని జీవన పాఠాలు పుస్తకాలు చదవడం వల్ల తెలుస్తాయి. మరికొన్ని జీవిత పాఠాలు నిలువెత్తు పుస్తకాలుగా తిరిగే మనుషుల వల్ల తెలుస్తాయి. మొన్నటి గురువారం బెంగళూరులో నికితా అయ్యర్ అనే ఉద్యోగిని ఇలాగే ఒక సజీవ జీవనపాఠాన్ని కలుసుకుంది. ఆ తర్వాత ఆమె ఆ పరిచయాన్ని లింక్డ్ఇన్లో పంచుకుంది. అంతే. ఆ పోస్ట్ వేలాదిమందిని ఆకట్టుకుంటోంది. ఇంతకూ ఆ పోస్ట్‌లో ఏముంది? ఆమె ఇలా రాసింది. ఆ రోజున... ఆ రోజున నేను ఉదయాన్నే పని మీద బయలు దేరాను. నేను బుక్ చేసుకున్న ఊబర్ ఆటోడ్రైవర్ నన్ను రోడ్డు మధ్యలో వదిలి వెళ్లిపోయాడు. అప్పటికే నాకు ఆఫీసుకు లేట్ అయ్యింది. నా ఆఫీసు ఊరికి ఆ చివర ఉంది. నా ముఖం కంగారుతో నిండి ఉంది. అది గమనించాడో ఏమో ఒక పెద్దాయన తన ఆటో ఆపి ‘ఎక్కడికి వెళ్లాలి’ అని ఇంగ్లిష్‌లో అడిగాడు. నేను ఆయన వయసు వాలకం చూసి జంకుతూనే చెప్పాను. ‘రండి మేడమ్. మీరు ఏమి ఇవ్వాలనుకుంటే అది ఇవ్వండి’ అన్నాడు మళ్లీ అంతే మంచి ఇంగ్లిష్‌లో. నేను ఆశ్చర్యపోయి ఆటో ఎక్కాను. ‘ఇంత మంచి ఇంగ్లిష్ మీకు ఎలా వచ్చు?’ అని అడిగాను. ఆయన ‘నేను గతంలో ఇంగ్లిష్ లెక్చరర్ని’ అన్నాడు. ఆ తర్వాత ఆయనే ‘ఇప్పుడు మీరు నన్ను మరి ఆటో ఎందుకు నడుపుతున్నావు అని అడగాలనుకుంటున్నారు కదూ’ అన్నాడు. ‘అవును. దయచేసి చెప్పండి’ అన్నాను. ఆయన నాతో ప్రయాణం పొడుగునా 45 నిమిషాల పాటు తన కథ చెప్పాడు. ఆయన పేరు పట్టాభి రామన్. ఎం.ఏ, ఎం.ఇడి చేశాడు. కాని బెంగళూరులో ఆయనకు ఎవరూ లెక్చరర్ ఉద్యోగం ఇవ్వలేదు. ‘ఎక్కడకు వెళ్లినా సామాజిక వర్గానికి చెందిన ప్రశ్న ఎదురైంది. అది చెప్పాక.. సర్లే, చెప్తాం లే అనేవారు. పిలుపు వచ్చేది కాదు. దాంతో విసిగి ముంబై వెళ్లిపోయాను’ అన్నాడాయన. ముంబైలోని పోవై కాలేజీలో 20 ఏళ్లు లెక్చరర్‌గా పని చేశాడట. 60 నిండాక తిరిగి బెంగళూరు చేరి ఆటో నడుపుతున్నాడు. ‘ప్రయివేట్ లెక్చరర్లకు పెన్షన్ ఉండదు. మళ్లీ టీచర్ ఉద్యోగం చేయాలన్నా పది– పదిహేను వేలకు మించి రాదు. అందుకని ఆటో నడుపుతున్నాను. దీనిని నడపడం వల్ల వచ్చే ఆదాయంతో నా గర్ల్‌ఫ్రెండ్‌ను హాయిగా చూసుకుంటున్నాను’ అన్నాడు. ఆ మాటకు నాకు నవ్వు వచ్చింది. ‘గర్ల్‌ఫ్రెండా?’ అన్నాను. ‘అవును. నా భార్యను నేను గర్ల్‌ఫ్రెండ్ అనే పిలుస్తాను. భార్యను ఎప్పుడూ సమస్థాయిలోనే చూడాలి. భర్త అనుకోగానే భార్య రూపంలో ఆమె సేవకురాలిగా కనిపిస్తుంది. అది నాకు ఇష్టం ఉండదు. ఆమెకు ఇప్పుడు 72 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఇంటిని, నన్ను చక్కగా చూసుకుంటుంది’ అన్నాడతను. మరి పిల్లలు?... ‘వాళ్ల జీవితం వాళ్లే. నేను, నా భార్య కారుగోడిలో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్‌లో ఉంటాం. దాని అద్దె 12 వేలు నా కొడుకు కడతాడు. అంతకు మించి మా పిల్లల నుంచి మేము ఏమీ ఆశించం. మేమిద్దరం మాకు ఉన్నదానితో హాయిగా ఉంటాం’ అన్నాడతను. ‘చూడండి. నేను ఈ రోడ్డుకు రాజుని. నా ఇష్టం వచ్చినప్పుడు ఆటో తీస్తా. లేదంటే ఇంట్లో ఉంటా’ అని నవ్వాడతను. అతనితో మాట్లాడుతున్నంత సేపు నిరాశ కాని నిస్పృహ కాని జీవితం పట్ల ఫిర్యాదు కాని లేవు. ఇలాంటి వాళ్లు నిజమైన హీరోలు. కాకుంటే వీళ్ల గురించి మనకు తెలియదు. నిజంగా ఈయన పరిచయం నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. ఆ తర్వాత?... నికితా అయ్యర్ ఈ అనుభవాన్ని లింక్డ్ఇన్లో ప్రచురించింది. ఆ పోస్ట్ వెంటనే వైరల్‌గా మారింది. 70 వేల మంది క్షణాల్లో లైక్ చేశారు. ఆ తర్వాత వేల మంది దానిని షేర్ చేశారు. ఎన్డిటివి, ఇతర సంస్థలు ఈ కథనాన్ని ప్రచారంలో పెట్టాయి. సింపుల్‌గా, సరళంగా, సంతోషంగా తన జీవితం తాను గడుపుతున్న ఆ ఆటో పెద్దాయన చాలామందిని ప్రభావితం చేశాడు. లక్షలు, కోట్లు ఉంటే ఏమిటి... మానసిక ఆనందం అంటే ఏమిటో తెలుసుకోవడం ముఖ్యంగాని అంటున్నారు. అతడు భార్యను చూసుకుంటున్న పద్ధతి ప్రతి ఒక్క భర్తకు ఆదర్శం అనీ అంటున్నారు. మొత్తానికి ఈ బోయ్ ఫ్రెండ్ మంచి మార్కులు కొట్టేశాడు. చదవండి: Ambali Health Benefits: అంబలి తాగుతున్నారా.. స్థూలకాయం, మధుమేహం.. ఇంకా -
నా బిడ్డ మొండిఘటం.. ఉక్రెయిన్ నుంచి క్షేమంగా వస్తాడు!: రజియా బేగం
‘‘ఉక్రెయిన్ దేశం యుద్ధంలో ఉందనే సంగతి మొదట నా బిడ్డే ఫోన్ చేసి నాకు చెప్పాడు. ఎప్పటికప్పుడు వాడు తన క్షేమసమాచారాలను అందిస్తున్నాడు. వీలైతే ఫోన్ చేస్తున్నాడు. లేదంటే మెసేజ్ చేస్తున్నాడు. నాకు గుండె ధైర్యం ఎక్కువ. నా బిడ్డ కూడా నాలాగే మొండి ఘటం. వాడు క్షేమంగా ఉక్రెయిన్ నుంచి తిరిగొస్తాడనే నమ్మకం ఉంది నాకు. కానీ, తల్లి ప్రేమ కదా. అందుకే అధికారుల సాయం కోరుతున్నా’’ అని చెబుతోంది యాభై ఏళ్ల టీచరమ్మ రజియా బేగమ్. అన్నట్లు ఈమె గురించి మీకు పరిచయం ఉందో లేదో.. ఈమె అప్పట్లో నేషనల్ ఫేమస్ అయ్యారు. సుమారు రెండేళ్ల కిందట కరోనా మొదలయ్యాక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. ఆ సమయంలో ఎక్కడికక్కడే చిక్కుపోయి.. స్వస్థలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు చాలామంది. ఈ తరుణంలో నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి ఓ తల్లి తన బిడ్డ కోసం వందల కిలోమీటర్లు స్కూటీ మీద వెళ్లి.. సురక్షితంగా అతన్ని తెచ్చేసుకుంది(1400కి.మీ.పైనే). నెల్లూరులో చిక్కుకుపోయిన కొడుకు నిజాముద్దీన్ అమన్‌ను తీసుకొచ్చుకునేందుకు బోధన్ ఎస్పీ నుంచి పర్మిషన్ తీసుకుని మరి సాహసం చేసింది. కొడుకు కోసం తల్లి పడ్డ ఆరాటాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసించారు. సాలంపాడ్ క్యాంప్ విలేజ్‌లో గవర్నమెంట్ టీచర్‌గా పని చేసే రజియాబేగం కథ అప్పుడు బాగా వైరల్ అయ్యింది. అయితే ఆ కొడుకు అమన్ ఇప్పుడు.. వేల కిలోమీటర్ల దూరంలో ఉక్రెయిన్ సంక్షోభంలో చిక్కుకుపోయాడు. అతను ఉంటున్న ప్రాంతంలో భారతీయుల తరలింపులో ఎలాంటి పురోగతి లేదని సమాచారం. రజియా భర్త 14 ఏళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూశాడు. అందుకే తన బిడ్డను డాక్టర్ కావాలని ఆమె కోరుకుంది. ఉక్రెయిన్ సుమీ స్టేట్ యూనివర్సిటీలో చేర్పించింది. సుమారు 50 దేశాల నుంచి రెండు వేల మంది దాకా విద్యార్థులు చదువుతున్నారు ఇక్కడ. మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్న అమన్. ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంలో ఓ బంకర్లో అతను ఆశ్రయం పొందుతున్నాడు. అయితే అతను ఉంటున్న ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన బిడ్డ మాత్రమే కాదు.. తన బిడ్డల్లాంటి వాళ్లందరినీ వీలైనంత త్వరగా ఇక్కడకు రప్పించే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను రజియాబేగం కోరుతున్నారు. ఇప్పటికే ఆమె నిజామాబాద్ కలెక్టర్‌కు లేఖ కూడా రాశారు. -
ప్రాణం నిలిపిన డెలివరీ బాయ్.. సర్వత్రా హర్షం
డెలివరీ బాయ్‌ల జీవితాల గురించి తెలియంది కాదు. కరోనాలాంటి కష్టకాలంలోనూ పొట్టకూటి కోసం రిస్క్ చేస్తున్న వాళ్లు కోకోల్లలు. అయితే డెలివరీ బాయ్‌ల విషయంలో కొంత మందికి చిన్నచూపు ఉంటుంది. అలాంటి వాళ్ల కళ్లు తెరిపించే ఘటన ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ముంబై(మహారాష్ట్ర)లో రిటైర్డ్ కల్నల్ మోహన్ మాలిక్ కుటుంబం నివసిస్తోంది. కిందటి నెల (డిసెంబర్ 25న) హఠాత్తుగా ఆ పెద్దాయన తీవ్ర అస్వస్థలకు లోనయ్యారు. వెంటనే ఆయన కొడుకు ఆస్పత్రికి తీసుకుని బయలుదేరాడు. దారిలో భారీ ట్రాఫిక్. ఇంచు కూడా కదల్లేని స్థితి. దీంతో టూవీలర్ మీద త్వరగా వెళ్లొచ్చన్న ఉద్దేశంతో కారు దిగి సాయం కోసం మాలిక్ కొడుకు అందరినీ బతిమాలాడు. కానీ, ఎవరూ సాయానికి ముందుకు రాలేదు. ఆ టైంలో డెలివరీలతో అటుగా వెళ్తున్నాడు ఒక స్విగ్గీ డెలివరీ బాయ్. మాలిక్ కొడుకు పడుతున్న కష్టం చూసి చలించి.. వెంటనే ఆ పెద్దాయన తన బైక్ మీద కూర్చోబెట్టుకుని ముగ్గురూ ఆస్పత్రికి బయలుదేరాడు. అడ్డుగా వాహనాలను గట్టిగా అరుస్తూ పక్కకు తప్పుకునేలా చేసి మరీ వీలైనంత త్వరగా ఆస్పత్రికి చేరుకున్నాడు ఆ డెలివరీ బాయ్. అలా సకాలంలో ఆస్పత్రికి చేరడంతో మోహన్ మాలిక్ ప్రాణం నిలిచింది. అయితే ఆస్పత్రికి చేరిన వెంటనే.. ఆ డెలివరీ బాయ్ అక్కడి నుంచి మాయమైపోయాడు. ఇన్నాళ్లూ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసి కోలుకున్న ఆ పెద్దాయన.. ఈ మధ్యే డిశ్చార్జి అయ్యారు. స్విగ్గీ ప్రతినిధులను సంప్రదించి.. ఎలాగోలా ఆ డెలివరీ బాయ్ జాడ కనుక్కోగలిగాడు. ఆ డెలివరీ బాయ్ పేరు మృణాల్ కిర్దత్. తన ప్రాణం కాపాడిన ఆ యువకుడిని.. రియల్ సేవియర్‌గా కొనియాడుతున్నాడు ఆ పెద్దాయన. సకాలంలో స్పందించిన ఆ డెలివరీ బాయ్ పనికి సోషల్ మీడియాలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అతనికి ఏదైనా సాయం అందించాలని పలువురు కామెంట్లు చేస్తున్నారు. హ్యాట్సాఫ్ టు దిస్ రియల్ హీరో. View this post on Instagram A post shared by Swiggy (@swiggyindia) -
ప్రేమ,పెళ్లి.. నా కౌశిక్ చచ్చిపోయాడు.. అయినా
సాక్షి, వెబ్‌డెస్క్: స్నేహితుల ద్వారా పరిచయం.. అభిరుచులు కలిశాయి.. స్నేహం ప్రణయంగా మారింది... బంధంలోని స్వచ్ఛత మనసులను మరింతగా పెనవేసింది.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు.. పెద్దల ఆమోదంతో పెళ్లితో ఒక్కటై బంధాన్ని ‘శాశ్వతం’ చేసుకున్నారు.. సరదాలు, సంతోషాల సవ్వడిలో నాలుగేళ్ల కాలం నాలుగు రోజుల్లా గడిచిపోయింది. ప్రపంచంలోని ఆనందమంతా తమ చెంతే ఉన్నట్లు భావించారు ఆ దంపతులు.. వీరి అన్యోన్యతను చూసి విధి కూడా కన్ను కుట్టిందేమో... జంటను వేరు చేసింది.. ఆమె నుంచి అతడిని శాశ్వతంగా దూరం చేసింది... అయినా ఆమె ఓటమిని అంగీకరించలేదు.. గుండెల నిండా అతడు పంచిన ప్రేమ, నేనున్నా లేకున్నా నీ చిరనవ్వు చెరగనీయొద్దు అనే మాటలు ఆమెను మళ్లీ మామూలు మనిషిని చేశాయి.. జీవన గమనాన్ని కొనసాగించేందుకు బాటలు వేశాయి. సరికొత్త ఆరంభానికి పునాదులు పరిచాయి. ఫొటో కర్టెసీ: హ్యూమన్స్ ఆఫ్ బాంబే ‘‘ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాళ్లు ఈ లోకాన్ని వీడితే వాళ్లతో పాటు మనమూ వెళ్లిపోలేము కదా... ఒకవేళ అదే జరిగితే ఈ ప్రపంచంలో ఒక్క మనిషి కూడా మిగలడు.. దుఃఖాన్ని దిగమింగి, వారు మిగిల్చిన జ్ఞాపకాలతో శేష జీవితాన్ని గడపాలి. అప్పుడే సాంత్వన చేకూరుతుంది’’ ముంబైకి చెందిన రేడియో జాకీ రోహిణి రామనాథన్ అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు ఇవి. భర్త హఠాన్మరణంతో కుంగిపోయిన ఆమె.. అతి తక్కువ కాలంలోనే ఆ బాధ నుంచి తేరుకుంది. తన ‘‘మాటలతో’’ ఎంతో మందికి ఆహ్లాదం పంచుతూ ముందుకు సాగుతోంది. కొంగొత్త ఆశలతో ప్రతి ఉదయాన్ని స్వాగతిస్తూ... భర్తను చేరేదాకా ఇలాగే మరింత ఉల్లాసంగా జీవితాన్ని గడుపుతానని చెబుతోంది. నేను ఆర్జే, తను రైటర్ ‘‘కామన్ ఫ్రెండ్స్ ద్వారా కౌశిక్‌ను కలిశాను. ఒక రేడియో జాకీగా కథలు చెప్పడం అంటే నాకు ఇష్టం. తను రచయిత.. అందుకేనేమో మా మనసులు తొందరగా కలిసిపోయాయి. తనతో ఉంటే సమయం తెలిసేదే కాదు. ఒక్క నిమిషం కూడా తనతో మాట్లాడకపోతే ఏమీ తోచేది కాదు. ఫోన్ నెంబర్లు మార్చుకున్నాం. గంటల తరబడి కాల్స్. వీలుచిక్కినప్పుడల్లా షికార్లు. ప్రేమికుడిగా మారడం కంటే ముందు తను నా బెస్ట్‌ఫ్రెండ్. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నాం. మూడేళ్ల డేటింగ్ తర్వాత.. ఒకరోజు తను నాకు ప్రపోజ్ చేశాడు. పెళ్లి చేసుకుందామా అని తను అడగగానే వెంటనే ఓకే చెప్పేశాను. తనే నా సంతోషం. ఈఫిల్ టవర్ కింద ఆత్మీయంగా ముద్దులు పెట్టుకున్నాం. నచ్చిన ప్రదేశాలు చుట్టేశాం. మొత్తానికి ప్రేమలో మునిగితేలాం. ఫొటో కర్టెసీ: హ్యూమన్స్ ఆఫ్ బాంబే సలహా ఇచ్చేందుకు తను లేడు తనకు న్యూయార్క్ సిటీ అంటే చాలా ఇష్టం. అందుకే అక్కడికి షిఫ్ట్ అయ్యాం. పెళ్లైన తర్వాత నాలుగేళ్లు ఎప్పుడు గడిచాయో తెలియనే లేదు. అస్సలు కలలో కూడా ఊహించని పరిణామం. నా కౌశిక్ చచ్చిపోయాడు.. నేను శోకసంద్రంలో మునిగిపోయాను. మాకే ఎందుకు ఇలా జరగాలి? నేను కోరుకున్న వ్యక్తితో జీవితం పంచుకున్నాను.. నాకు ఏ చిన్న సమస్య వచ్చినా కౌశిక్ సలహా తీసుకునేదాన్ని... జీవితకాల విషాదం.. అలాంటి సమయంలో నాకు తోడుగా ఉండేందుకు కౌశిక్ ఈ లోకంలోనే లేడు కదా.. ‘‘మానసిక ఒత్తిడి, బాధ, కోపం’’ ఇలా ఎన్నో భావోద్వేగాలు ఏకకాలంలో నన్ను చుట్టుముట్టాయి. అప్పుడే భర్తను మర్చిపోయిందా? ప్రపంచమంతా చీకటైపోయినట్లు అనిపించింది. ఎవ్వరితోనూ మాట్లాడలేకపోయాను. నిజం చెప్పాలంటే మా అత్తామామలు ఆ సమయంలో నాకు అండగా నిలబడ్డారు. తనివితీరా ఏడ్చాను. 14 రోజుల తర్వాత కాస్త తేరుకున్నాను. పనిలో నన్ను నేను బిజీ చేసుకోవడం మొదలుపెట్టాను. ఇంటర్వ్యూలు చేశాను. మామూలు స్థితికి వచ్చేశాను. కొంతమంది నన్ను చూసి... ‘‘తనేంటి ఇలా ఎలా నవ్వగలుగుతోంది? అసలు తనకు కొంచమైనా బాధ ఉందా?’’ అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ వాళ్లకు తెలియదు.. ప్రతిరోజూ రాత్రి బోసిపోయిన ఇంట్లోకి రాగానే దుఃఖం నన్ను ఆవహిస్తుంది. మౌనంగానే రోదించడం నాకు అలవాటుగా మారిపోయింది. సూటిపోటి మాటలు, చేదు అనుభవాలు.. పది నెలలు గడిచిన తర్వాత నేనొక నిర్ణయానికి వచ్చాను. ఫొటో కర్టెసీ: హ్యూమన్స్ ఆఫ్ బాంబే మానసిక చికిత్స తీసుకోవడం మొదలుపెట్టాను. చాలా మార్పు వచ్చింది. కౌశిక్‌కు నేను ఏడిస్తే అస్సలు నచ్చేది కాదు. తనకు నా నవ్వంటే ఇష్టం. మరి దానిని దూరం చేసుకోవడం ఎందుకు అనిపించింది. నాలుగేళ్ల కాలంలో తను నాకు ప్రపంచంలోని అన్ని సంతోషాలు అందించాడు. జీవితకాలానికి సరిపడా తను పంచిన ఆ జ్ఞాపకాలే నాకు ఊపిరి. తనను మళ్లీ కలుసుకునే దాకా నేనిలాగే సంతోషంగా ఉంటాను’’ అని రోహిణీ రామనాథన్ తన మనో అంతరంగాన్ని హ్యూమన్స్ ఆఫ్ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిష్కరించారు. ఇష్టమైన వారిని కోల్పోయినా.. జీవించే హక్కు, అర్హత అందరికీ ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Wuhan Lab: వయాగ్రా దోమల లీక్.. కలకలం!
వుహాన్ ల్యాబ్ పరిశోధకుల తాజా పరిశోధన బెడిసి కొట్టింది. వయాగ్రా ఇంజెక్ట్ చేసిన వేల కొద్దీ దోమలు .. ల్యాబ్ నుంచి బయటపడ్డాయి. ఓ పరిశోధకుడి నిర్లక్క్ష్యంతోనే ఇది జరిగిందని ల్యాబ్ నిర్వాహకులు ప్రకటించగా.. ఆ దోమల ప్రభావంతో విపరీత అనర్థాలు చోటు చేసుకున్నాయి. అవి కుట్టిన వాళ్లు వికృతంగా ప్రవర్తిస్తున్నారు. లైంగిక కోరికలతో రగిలిపోతూ ఆస్పత్రి పాలవుతున్నారు. ఈ వార్త ఇంటర్నెట్లో వైరల్ అవుతుండడంతో ఆందోళన మొదలైంది. వైరల్ వార్త.. చైనా నుంచి మరో షాక్. వయాగ్రా దోమల ప్రభావంతో చైనాలో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. పండు ముసళ్లోల్ల దగ్గరి నుంచి కుర్రాల దాకా కామ వాంఛతో రగిలిపోతున్నారు. వుహాన్కి చెందిన 87 ఏళ్ల వృద్ధుడు ఒకడు కోరికల్ని తట్టుకోలేక ఆస్పత్రిలో చేరాడు. మరో పేషెంట్ నగ్నంగా ఆస్పత్రిలో తిరుగుతూ.. పబ్లిక్‌గా వికృత చేష్టలకు పాల్పడ్డాడు. మరో వ్యక్తి కనిపించిన వాళ్లపైనా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇది వుహాన్ కెచ్‌లీ ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన స్టేట్మెంట్. ఇక ఇది మునుముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని వుహాన్ ల్యాబ్ హెడ్ రీసెర్చర్ డాక్టర్ వెంజి యింగ్ యిన్ జింగ్ భయపడుతున్నారని వరల్డ్‌న్యూస్‌డెయిలీరిపోర్ట్ డాట్ కామ్ అనే వెబ్ సైట్ ఒక కథనాన్ని ప్రచురించింది. One more shock from China. Wuhan: Thousands of mosquitoes inoculated with Viagra escape from high-security laboratory https://t.co/h4FAK7yp1g — किसान 🇮🇳 (@WadheshT) June 15, 2021 ఫ్యాక్ట్ చెక్.. వరల్డ్‌న్యూస్‌డెయిలీరిపోర్ట్ డాట్ కామ్ అనేది కంప్లీట్ సెటైరికల్ వెబ్సైట్. ‘‘నిజనిర్థారణలతో సంబంధం లేదు’’ అనేది ఆ వెబ్సైట్ క్యాప్షన్. అందులో కంటెంట్ మామూలుగా ఉండదు. కుక్కకు-పిల్లి తోకకు ముడిపెట్టి కథనాలు పబ్లిష్ చేస్తుంది. పైగా జనాలు అది నిజమని గుడ్డిగా నమ్మేంత పక్కాగా. అందులో ఉంది అధికారిక సమాచారమేమో అనేంతలా స్టోరీలు అల్లుతుంది. వుహాన్ ల్యాబ్ మీద సెటైరిక్‌గా పోయిన నెలలో రాసిన ఈ ఆర్టికల్.. ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఇందులో ఉన్న వృద్ధుడి ఫొటో అసలు చైనా వ్యక్తిదే కాదు. జపాన్ వ్యాపారవేత్త యుకిషి చుగంజి. 2003లో 114 వయసులో ఆయన అనారోగ్యంతో చనిపోయారు. ఆ టైంలో ప్రపంచంలో అత్యంత వృద్ధుడి రికార్డు ఆయన పేరు మీద ఉండేది. #CKMKB 😂😂 Good news “The effects of one mosquito bite can last up to forty-eight hours and symptoms include an increase in libido, sexual arousal, and possibly a very, very large erection,” Dr. Wenzi told the press during a press conference.https://t.co/iR5nHFIWBC — 🥃🚬 (@BeastOnDrive) June 15, 2021 -
వైరల్ స్టోరీ : ‘దేవుడు కరుణిస్తే.. అమ్మను చూస్తా’
సోషల్ మీడియాతో ఎవరి ఫేట్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియడం లేదు. చూపులేకున్నా తన టాలెంట్‌తో కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకోగలిగాడు బిలాల్ గోరెజెన్. ఒకప్పుడు వీధుల్లో డ్రమ్స్ వాయించే బిలాల్‌కు ఈ క్రేజ్ దక్కడానికి కారణం.. తెగ ఊగిన ఓ పిల్లితో ఉన్న అతని వీడియో ఒకటి వైరల్ కావడమే. టర్కీకి చెందిన బిలాల్ వయసు 33 ఏళ్లు. పుట్టుకతోనే అంధుడు. కానీ, డ్రమ్స్ నేర్చుకుని వీధుల్లో వాయిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. 2011లో ఓ సెస్ టర్కీ అనే రియాలిటీ షో అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కానీ, ఆర్థికంగా మాత్రం సాయం అందించలేదు. రెండేళ్ల క్రితం ఇస్తాంబుల్ మేయర్ ఎక్రెమ్తో కలిసి చేసిన వీడియో ఒకటి బాగా వైరల్ అయ్యింది. అయితే ఆ తర్వాత ‘లెవన్ పొల్క్కా’ వీడియో అతని నుదుటిరాతను పూర్తిగా మార్చేసింది. View this post on Instagram A post shared by Bilal Göregen (@bilalgoregen) పిల్లి తెచ్చిన లక్ లెవాన్ పొల్క్కా ఒక ఫిన్లాండ్ పాపులర్ సాంగ్. ఆ సాంగ్‌ను తనకొచ్చిన రీతిలో పాడుతూ.. డ్రమ్స్ వాయించాడు బిలాల్. అయితే ఆ వీడియోకు జపాన్ వైబింగ్ క్యాట్(పిల్లి సరదాగా తల ఊపిన వీడియో)ను ఎడిట్ చేయడంతో అది బాగా పేలింది. సోషల్ మీడియాలో బిలాల్‌కు పేరు దక్కింది. ఆ వీడియో తర్వాత బిలాల్ ఎన్నో ఫేమస్ పాటలకు డ్రమ్స్ వాయించాడు. మన వరకు బాలీవుడ్ ‘ఖలియో కా ఛమన్’, దలేర్ మెహందీ ’తున్క్ తున్క్ తున్’ ఆల్బమ్స్, లేటెస్ట్గా త్రీ ఇడియెట్స్లో ‘ఆల్ ఈజ్ వెల్’తో ఇండియన్స్‌ను బిలాల్ ఆకట్టుకోగలిగాడు. షకీరా ఆల్బమ్స్‌ను సైతం తన స్టయిల్లో కంపోజ్ చేశాడతను. ఇక పాపులర్ పాప్ సాంగ్స్‌తో పాటు టీవీ సిరీస్‌ల థీమ్ సాంగ్‌లను నోటితో హమ్మింగ్ చేస్తూ డ్రమ్స్ వాయిస్తాడు బిలాల్. View this post on Instagram A post shared by Bilal Göregen (@bilalgoregen) దేవుడంటే కోపం లేదు బిలాల్ ఇంటర్నెట్ సెలబ్రిటీ అయ్యాక ఈమధ్య ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. అందులో యాంకర్ దేవుడు కరుణించి వరాలిస్తే ఏం కోరుకుంటావని బిలాల్‌ను అడిగాడు. దానికి బిలాల్ స్పందిస్తూ.. ‘‘మా అమ్మ ముఖం చూడాలని ఉందని చెప్తా. ఆమె నన్ను కన్నదని ఈ మాట చెప్పట్లేదు. కానీ, నా అవిటితనపు బాధను ఆమె అనుభవించింది. కన్నీళ్లు కార్చింది. ఆ బాధను మోస్తున్నప్పుడు ఆమె ముఖం చూడాలన్నదే నా కోరిక’’ అని చెప్పాడు. పనిలో పనిగా రంగులు చూడాలన్న కోరికను కూడా అడిగేస్తానని చెప్పాడు. నాకు ఆ భగవంతుడి మీద నాకెలాంటి కోపం లేదు. ఎందుకంటే నా జీవితమే నాకు గొప్ప అని చెప్పడంతో అక్కడున్న ఆడియెన్స్ నిల్చుని చప్పట్లతో బిలాల్ పట్ల గౌరవం ప్రదర్శించారు. View this post on Instagram A post shared by Bilal Göregen (@bilalgoregen) -
అయ్యో జ్యోతి: అప్పట్లో సంచలనం.. ఇప్పుడు విషాదం
తండ్రి ఆరోగ్యం బాగోలేదు. పైగా లాక్డౌన్ కష్టాలు. అందుకే ఆ కూతురు సాహసానికి పాల్పడింది. వారంపాటు 1200 కిలోమీటర్లపైగా సైకిల్ మీద తండ్రిని ఇంటికి చేర్చింది. సైకిల్ జ్యోతి కుమారి సాహసానికి, ధైర్యానికి అప్పట్లో సర్వత్రా ప్రశంసలు కురిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఇంట విషాదం నెలకొంది. పాట్నా: సైకిల్ గర్ల్ జ్యోతి కుమారి తండ్రి మోహన్ పాశ్వాన్ సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయాన్ని జిల్లా మెజిస్ట్రేట్ త్యాగరాజన్ ప్రకటించారు. ఏ తండ్రి కోసమైతే జ్యోతి కుమారి అంత కష్టానికి ఓర్చిందో.. ఆ తండ్రే ఇక లేరని, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని త్యాగరాజన్ అన్నారు. అంతేకాదు ఆ కుటుంబానికి అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు కూడా. కాగా, జ్యోతి కుటుంబ స్వస్థలం బిహార్‌లోని దర్బంగా. యాక్సిడెంట్ తర్వాత.. జ్యోతి తండ్రి మోహన్ పాశ్వాన్ ఆటో డ్రైవర్. బతుకు దెరువు కోసం ఢిల్లీలోని గురుగ్రామ్‌కు వెళ్లాడు. ఇక పదో తరగతి ఫెయిల్ అయిన పెద్దకూతురు జ్యోతి కూడా ఆయతో పాటే వెళ్లింది. మోహన్ భార్య మిగిలిన పిల్లలతో ఊరిలో ఉండేది. పోయినేడాది ఓ రోడ్డు ప్రమాదంలో మోహన్ గాయపడ్డాడు. దీంతో ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. సరిగ్గా అదే టైంలో లాక్డౌన్ వచ్చి పడింది. ఇంటి కిరాయి కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఓనర్ ఖాళీ చేయమన్నాడు. దీంతో తండ్రి ఆరోగ్య దృష్ట్యా ఊరికి వెళ్లాలని జ్యోతి అనుకుంది. సైకిల్‌పై తండ్రిని కూర్చోబెట్టుకుని ఇంటి బాట పట్టింది. వారం కష్టం జబ్బు పడిన తండ్రి మోహన్‌ను సైకిల్ పై కూర్చోబెట్టుకుని ప్రయాణం మొదలుపెట్టింది జ్యోతి. రోజూ ముప్ఫై నుంచి నలభై కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కింది. మధ్య మధ్యలో కొందరు ట్రక్ డ్రైవర్లు లిఫ్ట్, భోజనం ఇచ్చి సాయపడ్డారు. మొత్తానికి వారం తర్వాత ఇంటికి చేరుకుంది. జ్యోతి ప్రయత్నానికి అప్పట్లో దేశమంతా సలాం కొట్టింది. అంత చిన్న వయసులో ఏమాత్రం అధైర్యపడకుండా... ఎక్కడా అలసిపోకుండా... అంత సుదీర్ఘ దూరం ఆమె సైకిల్‌పై ప్రయాణించడం అప్పట్లో అంతా మెచ్చుకున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం జ్యోతి తెగువకు హ్యాట్సాఫ్ చెబుతూ బాలపురస్కార్ ప్రకటించారు. ఇవాంక ట్రంప్ సహా పలువురు సెలబ్రిటీలు కూడా సైకిల్ జ్యోతి సాహసంపై స్పందించారు. అయితే ఆ టైంలో కొంత సాయం అందినప్పటికీ.. ఆర్థికంగా ఆ కుటుంబం నిలదొక్కుకోలేదని తెలుస్తోంది. జ్యోతి కుటుంబానికి సాయం జ్యోతి కథనాల తర్వాత అధికారులు ఆమెకు కొంత సాయం అందించారు. అప్పట్లో సైక్లింగ్ ఫెడరేషన్ కూడా జ్యోతిని సైకిల్ రైడర్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించింది. అయితే జ్యోతి తల్లి మాత్రం కూతురి చదువే మొదటి ప్రాధాన్యంగా పేర్కొంది. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన జ్యోతి కుటుంబం ఇప్పుడు విషాదంలో మునిగిపోయింది. దీంతో సాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. -
ఈ ఫొటో తీస్తుంటే మొహమాటపడ్డారు..
ముంబై: మహారాష్ట్రకు చెందిన మంజిరి ప్రభు తన సోదరి లీనాతో కలిసి పుణెలో ఆటో ఎక్కారు. గమ్యస్థానానికి చేరుకోగానే డ్రైవర్‌కు డబ్బు చెల్లించే క్రమంలో కనిపించిన ఓ అతిథి ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. డ్రైవర్ కాళ్ల దగ్గర కూర్చుని, రెండు అందమైన కళ్లేసుకుని తదేకంగా తననే గోముగా చూస్తూ దృష్టిని ఆకర్షించింది. ఆ అతిథి పేరు రీని. ఆటో డ్రైవర్ హర్వీందర్ సింగ్ ప్రియనేస్తం అది. ఎల్లప్పుడూ తనతోనే ప్రయాణం చేస్తుంది. కానీ ఎన్నడూ కస్టమర్లను విసిగించకుండా, ఒద్దికగా ఉంటూ విశ్వాసానికి మారుపేరన్న నానుడిని నిజం చేస్తోంది. ‘రియల్ లైఫ్ శాంటా’’ అంటూ క్రిస్మస్ పర్వదినాన మంజిరి, సదరు ఆటోడ్రైవర్- అతడి పెంపుడు కుక్కకు సంబంధించిన విశేషాలను తన ఫేస్బుక్ పేజీలో షేర్ చేశారు. ఈ స్టోరీ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘‘ఈరోజు నేను నిజమైన శాంటాను కలిశాను. నా సోదరి లీనా, నేను ఆటో ఎక్కాం. దిగిన తర్వాత డ్రైవర్‌కు డబ్బు ఇస్తున్నాను. అప్పుడే ఓ కుక్కపిల్ల నా కంటపడింది. డ్రైవర్ కాళ్ల దగ్గర ఓ రగ్గుమీద కూర్చుని నన్నే చూస్తోంది. కానీ ప్రయాణం చేస్తున్నంత సేపు తన అలికిడి అస్సలు వినిపంచనేలేదు. వాడి పేరు రోనీ అట. ఆటోడ్రైవర్ చెప్పారు. వీధిలో బేలగా చూస్తున్న ఆ కుక్కపిల్లను అతడి కొడుకు ఓ రోజు ఇంటికి తీసుకువచ్చాడట. అయితే ఎవరిపనుల్లో వారు బిజీగా ఉండటంతో పప్పీని చూసుకోవాల్సిన బాధ్యతను హర్వీందర్ తీసుకున్నారట. ఇంటి నుంచి బయల్దేరే ముందే తనతో పాటు రోనీకి కూడా భోజనం, బిస్కట్లు ఓ బాక్సులో సర్ది తనవెంటే తీసుకువెళ్తారట. నేను ఈ ఫొటో తీస్తుంటే హర్వీందర్ సింగ్ కాస్త మొహమాటపడ్డారు. కానీ కానీ అంతటి దయార్థ హృదయం కలిగిన వారు ఎంతమంది ఉంటారు. సాటి మనుషులను కూడా పట్టించుకోని వ్యక్తులు ఉన్న సమాజంలో మూగజీవి పట్ల ఇంత కేరింగ్ తీసుకుంటున్న ఆయన ఈ ప్రపంచంలో ఇంకా మానవత్వం మిగిలే ఉందని నిరూపిస్తున్నారు. వాళ్లిద్దరి బంధం చూస్తే నాకు ముచ్చటేస్తోంది’’ అని మంజిరి పేర్కొన్నారు.(చదవండి: వైరల్‌గా మారిన బస్ డ్రైవర్ ఫొటో..) -
ఆన్లైన్ పెళ్లి; ఇన్ని రకాల వంటలా!
ఒకప్పుడు పెళ్లిళ్లంటే కొబ్బరాకులతో ఇంటి ముందు పందిరి.. అరిటాకుల్లో బంతి భోజనాలు.. అంతా కలిసి ఒక్కచోట చేరి ముచ్చట్లు పెట్టే దృశ్యాలు.. వివాహ తంతు ముగిశాక బ్యాండ్ బాజాలతో ఊరేగింపులు గుర్తుకు వచ్చేవి.. అయితే కాలక్రమేణా పెళ్లి వేదిక ఫంక్షన్‌హాళ్లకు మారింది. ఇక సంపన్నులైతే డెస్టినేషన్ వెడ్డింగ్ పేరిట సుదూర ప్రాంతాలకు బంధు గణాన్ని తరలించి అత్యంత వైభవోపేతంగా వివాహాలు జరిపించే పోకడలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. కాసేపు ఈ విషయాన్ని పక్కన పెడితే.. కరోనా మహమ్మారి దెబ్బకు చాలా మంది శుభకార్యాలు వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం కోవిడ్ కారణంగా సుముహుర్తాన్ని వదులుకోవడం ఇష్టంలేక అత్యంత సన్నిహితుల సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక లాక్డౌన్ కాలంలో మెజారిటీ ప్రజలు ఆన్లైన్లో వివాహ తంతు కానిచ్చేసి ఆశీర్వచనాలు అందుకున్నారు. వీడియోకాల్‌లో ఆశీస్సులు ఓకే.. మరి భోజనం సంగతి ఎలా? శుభమస్తు అని దీవించిన బంధువర్గానికి విందు భోజనం పెట్టేదెలా? కల్యాణ సాపాడు పెట్టడం కనీస మర్యాద కదా! అదే పాటించకపోతే ఎలా? ఇలాంటి ఆలోచనలే వెంటాడాయి ఓ తమిళ కుటుంబాన్ని! అందులో పెద్దగా ఆలోచించాల్సి ఏముంది.. ఏ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థనో ఆశ్రయిస్తో సరిపోతుంది కదా అంటారేమో! అదీ నిజమే.. అయితే వాళ్లు డిజిటల్ అతిథులను కేవలం సాదా సీదా భోజనంతో సరిపెట్టేయాలనుకోలేదు. (చదవండి: అందుకే హనీమూన్ రద్దు చేసుకున్నారు!) అందుకే ఆహ్వాన పత్రికతో పాటు అచ్చమైన సంప్రదాయ పద్ధతిలో బుట్టభోజనం, అరిటాకులు, 18 రకాల వంటకాలను పంపించారు. మ్యారేజ్ వెబ్‌కాస్ట్ వివరాలతో పాటు భోజనాన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో కూడా వివరించే కార్డును కూడా పంపారు. హాయిగా పెళ్లిభోజనం చేస్తూ కంప్యూటర్ల ముందుకు కూర్చుని వధూవరులను ఆశీర్వదించమని కోరారు. ఈ వినూత్న ఆహ్వానాన్ని అందుకున్న శివానీ అనే నెటిజన్ ఇందుకు సంబంధించిన విశేషాలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. డిసెంబరు 10న వివాహ బంధంతో ఒక్కటైన శివప్రకాశ్, మహతి జంటకు నెటిజన్ల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. -
అందుకే హనీమూన్ రద్దు చేసుకున్నారు!
సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఓ మధుర జ్ఞాపకం. రెండు మనసులను ఒక్కటి చేసే వేడుక. ఇరు కుటుంబాల కలయిక. భార్యాభర్తలు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని సమన్వయంతో ముందుకు సాగితేనే ఆ బంధానికి విలువ ఉంటుంది. కర్ణాటకకు చెందిన నవ దంపతులు అనుదీప్ హెగ్డే, మినుషా కాంచన్ ఆ కోవకు చెందినవారే. పెళ్లి తర్వాత కచ్చితంగా హనీమూన్ వెళ్లాల్సిందేనని ఆమె పట్టుబట్టలేదు. భార్య కోరలేదు కదా అని అతడు అడగకుండా ఉండనూ లేదు. వీలు కుదుర్చుకుని ఇద్దరికీ నచ్చిన ప్రదేశానికి వెళ్లి ఏకాంతంగా సమయం గడపాలనుకున్నారు. అయితే అంతకంటే ముందు తమకు అత్యంత సమీపంలో ఉన్న సోమేశ్వర్ బీచ్‌ను సందర్శించారు. అక్కడికి వెళ్లిన తర్వాత హనీమూన్‌కు వెళ్లాలన్న ఆలోచనను పక్కకు పెట్టేశారు. సరదాగా గడపడం కంటే ప్రకృతిని కాపాడుకోవడమే వారికి ప్రథమ ప్రాధాన్యంగా తోచింది. వెంటనే రంగంలోకి దిగారు. తమతో పాటు నలుగురి మద్దతు కూడగట్టుకుని బీచ్ ప్రాంగణంలో పోగైన చెత్తను ఏరిపారేసే బృహత్కార్యం తలకెత్తుకున్నారు. 10 రోజుల పాటు శ్రమించి సుమారు 800 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు, పనికిరాని వస్తువులను అక్కడి నుంచి తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలు, ఫొటోలను అనుదీప్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ‘మీరిలాగే కలకాలం వర్ధిల్లాలి’ అంటూ నెటిజన్లు కొత్తజంటపై అభినందనల అక్షింతలు జల్లుతున్నారు.(చదవండి: తల్లిదండ్రులైన ఆకాశ్ దంపతులు ) పోస్ట్ వెడ్డింగ్ చాలెంజ్ ‘‘ మా ఇద్దరి కల ఇది. పోస్ట్ వెడ్డింగ్ చాలెంజ్, పది రోజుల అవిశ్రాంత శ్రమ తర్వాత బైందూరులోని సోమేశ్వర్ బీచ్‌లోని చెత్తాచెదారాన్ని తొలగించాం. ఇప్పుడు ఇదొక మహోద్యమంగా మారింది. అంతా కలిసి 8 క్వింటాళ్లకు పైగానే చెత్తను ఏరివేశాం. మాకొక మంచి అనుభవం ఇది. మానవత్వం ఇంకా బతికే ఉందనే నా నమ్మకాన్ని నిజం చేసింది. మేమంతా మిమ్మల్ని కోరుతున్నది ఒక్కటే. ఇలాంటి కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించండి. కలిసి పనిచేస్తే ఇంకెంతో మార్పును తీసుకురాగలం’’ అని అనుదీప్ విజ్ఞప్తి చేశాడు. అదే విధంగా... ‘‘నేను, నాలో సగభాగమైన నా భార్య మినుషా ఈ ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటున్నాం. ఎంతో మంది మాతో చేతులు కలిపి బీచ్‌ను శుభ్రం చేసేందుకు వచ్చిన తీరు అత్యద్భుతం. మా లక్ష్యాన్ని చేరుకునే దిశగా సాయం అందించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు’’ అని తమకు సహకరించిన వారి పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ఈ అనుదీప్- మినుషా స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(చదవండి: ఆన్లైన్లో పెళ్లికి 2 వేల మంది అతిధులు) View this post on Instagram A post shared by Anudeep Hegde (@travel_nirvana) -
‘మాకంటే ముందు అమ్మకే ముద్దు పెట్టేవారు’
పెళ్లినాటి ప్రమాణాలను మనసా, వాచా, కర్మణా ఆచరించే భర్తలు కొంతమందే ఉంటారు. పుట్టింటిని వీడి మెట్టినింట అడుగుపెట్టిన ‘ఆడపిల్ల’కు అన్ని బంధాలు తానే అయి ప్రేమానురాగాలు పంచుతారు. తండ్రిలా బాధ్యతగా వ్యవహరిస్తూ, తల్లిలా ఆప్యాయత కురిపిస్తూ, స్నేహితుడిలా తోడుంటూ, భర్తగా మనసెరిగి ప్రవర్తిస్తూ భార్య పట్ల అవాజ్యమైన ప్రేమను ప్రదర్శిస్తారు. ఇంతలా ప్రేమించే భర్త ఉంటే ఏ అమ్మాయి అయినా తనను తాను అదృష్టవంతురాలిగానే భావిస్తుంది. అంతేకాదు తాను పొందిన ప్రేమకు పదిరెట్లు ఎక్కువగానే ప్రేమను తిరిగి ఇస్తుంది. అలాంటి ఓ జంట కథ గురించి వారి కూతురు చెప్పిన విషయాలు వింటే కళ్లు చెమర్చకమానవు. ఒకరికొకరై బతికిన ఆ దంపతులు కొన్ని రోజుల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోయిన వైనం నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. న్యూయార్క్: ‘‘మా నాన్నకు ఐదుగురు కూతుళ్లం. బిజినెస్ ట్రిప్‌కు వెళ్లొచ్చినపుడు వెంటనే మేమంతా ఆయనకు ముద్దు పెట్టేందుకు వరుసలో నిలబడే వాళ్లం. కానీ నాన్న మాత్రం ముందుగా అమ్మ దగ్గరకు వెళ్లి ఆమె నుదుటిపై ముద్దుపెట్టేవారు. ఎందుకంటే మా నాన్న ఫస్ట్ లవ్ తనే కదా. అంతేకాదు మేం సరాదాగా రోడ్ ట్రిప్‌కు వెళ్లినపుడు గానీ, కుటుంబమంతా ఒక్కచోట చేరి కచేరీలు చేసినప్పుడు గానీ పాటల రూపంలో ఆమెపై ప్రేమను చాటుకునే వారు. అంతా మామూలు పాటలు పాడితే.. నాన్న మాత్రం పాతకాలం నాటి, బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్స్ ఆలపించేవారు. అమ్మను చూస్తూ ఆరాధనా భావం వ్యక్తం చేసేవారు. అయితే మా సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం నాన్న ప్రేమ అందరికీ కాస్త వింతగా తోచేది. అయినా ఆయనెప్పుడూ వెనకడుగు వేయలేదు. అమ్మ కూడా అంతే నాన్నకు తగ్గట్టుగా నడుచుకునేది. ఆయనకు నచ్చినట్లే తన కట్టూబొట్టూ ఉండేది. తను అనారోగ్యం పాలైనపుడు కూడా నాన్న బెంగ పెట్టుకోకూడదనే ఉద్దేశంతో అంతా బాగానే ఉన్నట్లు ప్రవర్తించేది. అమ్మకు బ్రెయిన్లో ట్యూమర్ వచ్చిన తర్వాత అనేక సర్జరీలు జరిగాయి. దాంతో రోజురోజుకీ తన ఆరోగ్యం క్షీణించసాగింది. సరిగ్గా నడవలేకపోయేది. (చదవండి: భార్య ప్రేమ కోసం సైకిల్ మీద ఖండాంతరాలు దాటి..) అప్పుడు నాన్నే తనకు ఊతకర్ర అయ్యారు. అమ్మను చేయి పట్టుకుని నడిపించేవారు. తనే బెడ్ పక్కనే కూర్చుని, సేవలు చేస్తూ.. గొంతు తడి ఆరేంత వరకు ఖురాన్ పటించేవారు. అమ్మ చివరి క్షణాల్లోనూ ఆయన తన పక్కనే ఉన్నారు. ‘‘ నువ్వెప్పుడూ ఒంటిరివి కావు. నేను నీతోనే వస్తున్నా’’అని అమ్మ చేతిలో చేయి వేసి మాట ఇచ్చారు. ఇదంతా చూస్తున్న నాకు నాన్న చాలా స్వార్థపరులు అనిపించింది. కోపం కూడా వచ్చింది. అంటే అమ్మ వెళ్లిపోయినా మేమంతా బతికి ఉన్నా విలువ లేదా అనిపించింది. నిజానికి అమ్మ మీద నాన్నకు ఉన్న ప్రేమ ఎలాంటిదంటే... అమ్మ చనిపోయిన తర్వాతి రోజే ఆయన తన సమాధి కోసం ప్లాట్ బుక్ చేసుకున్నారు. అమ్మ పక్కనే శాశ్వతంగా నిద్రించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. (చదవండి: నెటిజన్లను ఫిదా చేస్తున్న లవ్‌స్టోరి!) పేపర్ వర్క్ పూర్తైన తర్వాత రెండు రోజుల పాటు ఎంతో గంభీరంగా కనిపించారు. ఆ మరుసటి రోజే.. ఆరోగ్యం బాగాలేదని చెప్పారు. షూ లేసులు కట్టుకుంటూ నేలమీద పడిపోయారు. అయినా ఆయనలో ఎలాంటి ఆందోళన, బాధ కనిపించలేదు. అంబులెన్స్ వచ్చే సమయానికే మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు. బహుశా అమ్మను చేరుకుని ఉంటారు’’అంటూ ‘హ్యూమన్స్ ఆఫ్ న్యూయార్క్’ ఫేస్బుక్ పేజ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రుల అనుబందం గురించి సదరు మహిళ చెప్పుకొచ్చారు. అయితే తమ పేర్లు, పూర్తి వివరాలను మాత్రం ఆమె వెల్లడించలేదు. కేవలం వారి ఫొటోలను మాత్రం షేర్ చేశారు. ఈ క్రమంలో దివంగత దంపతుల లవ్‌స్టోరీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే విడాకుల దాకా వెళ్లే నేటి ఆధునిక యువతకు వీరి బంధం ఆదర్శప్రాయమంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేగాకుండా అంతటి గొప్ప ప్రేమజంటకు కూతురిగా జన్మించినందుకు మీరు అదృష్టవంతురాలు అని వారి కుమార్తెను అభినందిస్తున్నారు. వీళ్ల కథ వింటే.. నిజమైన ప్రేమికులను ఆ చావు కూడా విడదీయలేదు అనే మాట నిజమే అనిపిస్తోంది కదా!! -
నోరూరించే పీతల కూర..
-
నోరూరించే పీతల కూర.. ‘దీదీ’కి సాయం!
మనసుంటే మార్గం ఉంటుందనే నానుడిని మరోసారి రుజువు చేశాడు బెంగళూరుకు చెందిన అంకిత్ వెంగులేర్కర్. తమ ఇంట్లో పనిచేసే‘సరోజ్ దీదీ’ చేతివంటకు గుర్తింపు తీసుకువచ్చి ఆమెకు మరో ఆదాయ మార్గాన్ని చూపాడు. ‘అక్క’వంటపనిలో నిమగ్నమైతే.. ఆ వంటకాలను అమ్మిపెట్టే బాధ్యతను తలకెత్తుకుని పెద్ద మనసు చాటుకుంటున్నాడు. లాక్డౌన్ కారణంగా మాయమైన చిరునవ్వులను తిరిగి తీసుకువచ్చి ఆ మాతృమూర్తి ముఖాన్ని వికసింపజేస్తున్నాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ‘అక్కాతమ్ముళ్ల’పై ట్విటర్ ఇండియా, పేటీఎం సహా ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా వంటి సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.(శారదకు జాబ్ లెటర్: సోనూసూద్) వివరాలు.. సరోజ్(47) అనే మహిళ గతంలో తన భర్తతో కలిసి మంగమమ్మనపాళ్యలో చిన్నపాటి హోటల్ నడిపేవారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే కొన్నాళ్ల క్రితం భర్త మరణించడంతో ఒంటరైపోయిన సరోజ్.. కుటుంబ పోషణ కోసం పనిమనిషి అవతారమెత్తింది. అలా అంకిత్ ఇంట్లోనూ పనికి కుదిరింది. ‘సరోజ్ దీదీ’అంటూ ఆమెను ఆప్యాయంగా పిలిచే అంకిత్‌కు.. ఆ అక్క చేతి వంట ఎంతగానో నచ్చింది. ఈ క్రమంలో.. హోం-డెలివరీ ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాననే తన ఆలోచనను అతడితో పంచుకుంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అంకిత్.. సోషల్ మీడియా ద్వారా సరోజ్ వంటకాలను నెటిజన్లను పరిచయం చేశాడు. ఏడాది కాలంగా తమ ఇంట్లో పనిచేస్తున్న సరోజ్ దీదీ ఎంతో రుచికరంగా వండుతుందని, పరిశుభ్రత పాటిస్తారని చెప్పుకొచ్చాడు. ఆమె వంట చేస్తున్న వీడియోలు, నోరూరించే వంటకాల ఫొటోలను షేర్ చేశాడు. (మా ప్రాణాలు తీస్తారేంట్రా నాయనా) ‘‘ బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్ సమీపంలో నివసించే వాళ్లు రుచికరమైన భోజనం తినాలని భావిస్తే సరోజ్ దీదీని సంప్రదించండి. ఆమెకు అదనపు ఆదాయం సమకూరుతుంది. దయచేసి ఆమెకు అండగా నిలవండి’’అని అభ్యర్థించాడు. మంగళూరు పీతల కూర చేయడంలో సరోజ్ దీదీ దిట్ట అని, తన ట్వీట్‌కు స్పందించడం గొప్ప విషయమని, 10 ఆర్డర్లు వచ్చాయని, దీదీ ఎంతో సంతోషంగా ఉందంటూ ధన్యవాదాలు తెలిపాడు. ఈ నేపథ్యంలో అంకిత్ చొరవతో సరోజ్ జీవితంలో ఆనందం వెల్లివెరిసిందని, గొప్ప పనిచేశావంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. Saroj Didi's been cooking and cleaning at my Bangalore home for almost a year now. Extremely reliable. We bond over food and cats. She's been wanting to start a home-cooked food business for a few weeks now. We started today. She's extremely talented and experienced in cooking. pic.twitter.com/jEoRRofjQ3 — Gadgetwala (@ankitv) July 24, 2020 -
‘ఇన్నేళ్ల గౌరవం క్షణాల్లో నాశనం అయ్యింది’
టీచర్లను ఏడిపించడం.. వారిని ఎగతాళి చేస్తూ మాట్లాడటం వంటి చేష్టల్ని హీరోయిజంగా చూపిస్తారు సినిమాల్లో. కానీ వాస్తవంగా ఆ పరిస్థితులు ఎంత కఠినంగా ఉంటాయో.. ఎంతటి వేదనను కల్గిస్తాయో.. మనం ఊహించలేము. తాజాగా ఇందుకు సంబంధించిన స్టోరీ ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. తప్పకుండా ప్రతి ఒక్కరు చదివి, షేర్ చేసుకుని.. నిజ జీవితంలో ఇలాంటి పనులు చేయకూడదని కోరుతున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. కరోనా వైరస్ కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దాంతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. సాధారణంగా ప్రతి ఏడాది ఈ పాటికి అకాడమిక్ ఇయర్ ప్రారంభించాల్సిన సమయం. కానీ కరోనా వైరస్ నానాటికి విజృంభిస్తుండటంతో... విద్యా సంస్థలను ఇంకా తెరవలేదు. కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం ఆన్లైన్ క్లాస్‌లు నడుపుతున్నాయి. ఈ క్రమంలో నెలరోజుల క్రితం ఓ స్కూల్ ప్రిన్సిపాల్ తమ టీచర్లను పిలిచి ఈ ఏడాది ఆన్లైన్ క్లాస్‌లు తీసుకోవాల్సిందిగా ఆదేశించాడు. ప్రిన్సిపాల్ మాటలు వినగానే ఓ 55 ఏళ్ల టీచర్‌కు గుండెల్లో దడ మొదలయ్యింది. ఎందుకంటే ఆయనకు ఇంకా స్మార్ట్‌ఫోన్ వాడకం గురించి పూర్తిగా తెలీదు. అలాంటిది ఆన్లైన్లో క్లాస్‌లు తీసుకోవడం అంటే ఇక ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. తనకు చేతకాదని చెప్తే యాజమాన్యం జాబ్ నుంచి తొలగిస్తుంది. ఈ వయసులో ఆయనకు మరో ఉద్యోగం దొరకడం అంటే చాలా కష్టం. ఈ సమస్య గురించి కూతురుతో చెప్పాడు. ఆమె తండ్రికి ధైర్యం చెప్పి.. జూమ్‌లో ఆన్లైన్ క్లాస్ ఎలా తీసుకోవాలి.. స్మార్ట్‌ఫోన్ వాడకం గురించి కొన్ని బెసిక్స్ నేర్పింది. పిల్లలకు పాఠాలు చెప్పాలంటే బోర్డు కావాలని చెప్పి దాన్ని కూడా తెప్పించాడు సదరు ఉపాధ్యాయుడు. ఫస్ట్ రోజు క్లాస్‌లో బాగా కనిపించాలనే ఉద్దేశంతో కొత్త షర్ట్ తీసుకున్నాడు. ఇక ఆన్లైన్ క్లాస్‌లు మొదలు పెట్టే రోజు రానే వచ్చింది. అన్ని సిద్ధం చేసుకుని పాఠం ప్రారంభించాడు. (సోషల్ మీడియాలో టీచర్ల మార్ఫింగ్ ఫొటోలు) కానీ మొదటి సారి కెమరా ముందు నిల్చుని పాఠం చెప్పాలంటే కాస్తా భయపడ్డాడు. గొంతు వణుకుతోంది. ఆయన ఇలా ఇబ్బంది పడుతుండగా ఓ గుర్తు తెలియని ఐడీ నుంచి కొన్ని అసభ్యకరమైన మాటలు వినిపించాయి. అసలే ఆన్లైన్ గురించి సరిగా తెలియని ఆ టీచర్.. ఈ చర్యలకు మరింత భయపడ్డాడు. ఎలా స్పందించాలో అర్థం కాలేదు.. విద్యార్థుల మీద అరిచాడు. కానీ ఆ మాటలు మాత్రం ఆగలేదు. ఆయన ఇన్నేళ్లు సంపాదించుకున్న గౌరవం కొన్ని సెకన్లలో తుడిచిపెట్టుకుపోయింది. దాంతో వీడియోను మ్యూట్ చేశాడు. కానీ ఆ విద్యార్థి అన్‌మ్యూట్ చేసి.. టీచర్‌ను ఎగతాళి చేస్తూనే ఉన్నాడు. ఇదంతా ఆ విద్యార్థికి వినోదంగా అనిపిస్తుంది. దీన్నుంచి బయటపడాలంటే క్లాస్‌ను ముగించడం ఒక్కటే మార్గం. కానీ రేపు ఇలానే జరుగుతుంది. మరి అప్పుడేం చేయాలి. ప్రస్తుతం ఈ ఉద్యోగం చేయడం అతడికి ఎంతో అవసరం. దాంతో దుఖం తన్నుకొచ్చింది. (‘ఆన్లైన్’ ఆదేశాలపై కోర్టుకు వెళ్లిన హార్వర్డ్, ఎంఐటీ) కుమార్తెను పిలిచి ఒక్కసారిగా బోరున ఏడ్చాడు. ఇన్నేళ్లు ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన వ్యక్తి.. ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. ఏడుస్తూనే ఉన్నాడు. మరుసటి రోజును తలుచుకుంటే.. ఆ రాత్రి అతడికి నిద్ర కూడా పట్టలేదు. విద్యార్థులకు వినోదం.. అతడికి ప్రాణసంకటంగా మారింది పరిస్థితి. ‘టీచర్లను ఎగతాళి చేసి మీరు వినోదం పొందుతారేమో కానీ.. భవిష్యత్తులో మీరు బాధపడతారు’ అంటూ షేర్ చేసిన ఈ కథనం ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తోంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు వెల్లడి కాలేదు. -
ఆ ఫోటో వెనక ఇంత కథ ఉంది
2017 సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన ఫోటోల్లో ఇది ఒకటి. ఓ పెళ్లి కూతురు.. తన పెంపుడు కుక్కతో దిగిన ఈ ఫోటో నెటిజన్లను తెగ ఆకర్షించింది. పెళ్లి కూతురు, కుక్క ఇద్దరూ ఒకేలాంటి దుస్తులు ధరించి దిగిన ఈ ఫోటో జంతు ప్రేమికుల మనసు దోచింది. నాడు ఫోటో ఎంత వైరల్ అయ్యిందో నేడు దాని వెనక కథ అంత కన్నా ఎక్కువ ట్రెండ్ అవుతోంది. ఫోటోలోని యువతి పేరు మితాలి సాల్వి, కుక్కల ట్రైనర్. ఈ క్రమంలో కుక్కలతో తన పరిచయం, వాటితో తన అనుబంధం, కుక్కల ట్రైనర్‌గా విధానం వంటి పలు అంశాల గురించి ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు సాల్వి.ఆ వివరాలు ఆమె మాటల్లోనే కుక్కలే నా థెరపిస్టులు.. ‘నాకు ఐదేళ్ల వయసు వచ్చేటప్పటికి అమ్మ మరణించింది. ఆ సమయంలో నన్ను ఓదార్చింది.. నాకు స్వాంతన చేకూర్చింది ఈ కుక్కలే. చిన్న ముక్కుతో.. తోక ఊపుతూ నా చుట్టు తిరిగే ఈ కుక్కలే నాకు థెరపిస్టులు. ఇప్పటి వరకు నా జీవితంలో 13 కుక్కలు ఉన్నాయి. వాటి మీద అభిమానంతో వెటర్నరి డాక్టర్ కావాలనుకున్నాను. కానీ నా కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకోలేదు. వారి బలవంత మీద ఇంజనీరింగ్‌లో చేరాను’ అన్నారు సాల్వి. అలా ‘పాంటీ’ నా జీవితంలోకి వచ్చింది.. పాంటీతో తన పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘ఓ రోజు నేను, నా స్నేహితుడు అలీ ఇద్దరం రోడ్డు మీద నడుచుకుంటు వెళ్తున్నాం. అప్పుడు ఓ దుకాణదారుడు ఓ చిన్న కుక్క పిల్లను కొట్టడం గమనించాం. వెంటనే అక్కడికి వెళ్లి దాన్ని కాపాడం. తర్వాత ఆ చిన్న కుక్క పిల్లను నాతో పాటు హాస్టల్‌కు తీసుకెళ్లాలనుకున్నాను. కానీ పెంపుడు జంతువులను మా హాస్టల్లోనికి అనుమతించరు. దాంతో ఆ చిన్న కుక్కను నా కాలేజీ బ్యాగులో పెట్టుకుని.. సెక్యూరిటీ కంటపడకుండా నా రూమ్‌కు తీసుకెళ్లాను’ అని గుర్తు చేసుకున్నారు సాల్వి. ‘పాంటీ’ పేరు వెనక కథ.. అయితే తన కుక్కకు పాంటీ అని పేరు పెట్టడం వెనక ఓ తమాషా సంఘటన జరిగిందన్నారు సాల్వి. ‘రూమ్‌లోకి తీసుకువచ్చిన తర్వాత ఓ రోజు ఆ కుక్క పిల్ల లాండ్రీ బకెట్లోంచి బయటకు దూకింది. అప్పుడు దానితో పాటు నా పాంటీ, బ్రా కూడా వచ్చాయి. వాటిని మీద వేసుకుని నా వద్దకు పరిగెత్తుకు వచ్చింది. అది చూసి దానికి ‘పాంటీ’ అని పేరు పెడితే బాగుంటుందనిపించింది. అందుకే దానికి ‘పాంటీ ’అని పేరు పెట్టాను అంటూ గుర్తు చేసుకున్నారు సాల్వి. కుక్కల ట్రైనర్‌గా ఎలా మారానంటూ.. ‘ఓ రోజు ‘పాంటీ’కి వాక్సిన్ వేపించాలని ఆస్పత్రికి తీసుకెళ్లాను. అక్కడ అది ప్రవర్తించిన తీరు వైద్యులను ఆకర్షించింది. ‘పాంటీ’ఎక్కడైన శిక్షణ ఇప్పించారా అని ప్రశ్నించారు. వారి ప్రశ్న నాకొక అవకాశాన్ని చూపించింది. దాంతో నేను కుక్కల ట్రైనర్‌గా మారాలనుకున్నాను. దీని గురించి ఇంట్లో వారికి చెప్తే ఒప్పు కోలేదు. అయితే ఈ విషయంలో అలీ నాకు మద్దతిచ్చాడు. దాంతో మేం ఇద్దరం పొదుపు చేసిన డబ్బుతో నేను కుక్కల ట్రైనర్‌గా శిక్షణ పొందాను. ఇప్పటికి 500 కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చాను. ‘పాంటీ’ నాకు సహయకురాలిగా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు సాల్వి. అంతేకాక ‘నాకు నచ్చిన కెరియర్ను ఎంచుకోవడంతో పాటు.. అలీతో వివాహం వరకు నా జీవితంలోని ప్రతి ముఖ్య దశలో ‘పాంటీ’ నాతో పాటే ఉంది. అందుకే వివాహం రోజున నేను, ‘పాంటీ’ ఒకే రకమైన దుస్తులు ధరించాము. తను నాకు ఎంతో మంచి స్నేహితురాలు’ అంటూ చెప్పుకొచ్చారు సాల్వి. రెండు రోజుల క్రితం ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఈ స్టోరీ తెగ వైరలవుతోంది. ఇప్పటికే 16 వేల మంది దీనిపై స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 99 వేల మంది లైక్ చేశారు. ‘మీ కథనం చాలా బాగుంది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మేం కూడా మా పెళ్లిలో మా కుక్కలకు మేం వేసుకున్న లాంటి బట్టలే కుట్టించాం’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. -
జంతువులపై ప్రేమ జీవితాన్నే మార్చేసింది
మన మంచితనం, సహాయక గుణం ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుందనడానికి మరోసారి నిరూపించాడు ఓ 27 ఏళ్ల యువకుడు. రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న వీధి శునకాలను కాపాడడానికి ఆ యువకుడు కనుగొన్న పద్దతిని మెచ్చి అతన్ని అసిస్టెంట్‌గా పెట్టుకున్నాడు పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా. ఆ యువకుడి పేరు శాంతను నాయుడు. తాను ఉద్యోగం పొందిన తీరు, శునకాలను కాపాడడానికి కనుగొన్న పద్దతిని ఫేస్బుక్ పేజీ ‘ హ్యుమాన్స్ ఆప్ బాంబే’ లో వివరించారు. ‘ఐదేళ్ల కిత్రం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ వీధి కుక్కను చూపి చలించిపోయా. అవి రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నాయని తెలుసుకొని వాటిని ఎలాగైనా కాపాడాలని డిసైడ్ అయ్యాను. స్నేహితులతో కలిసి ఓ రిఫ్లెక్టర్ బెల్టు(పరావర్తనం చెందే బెల్టులు) ను తయారు చేశాను. రాత్రి పూట డ్రైవర్లకు కనిపించేలా ఆ బెల్టులను వీధి శునకాల మెడకు తొడిగించాను. దీంతో రాత్రి వేళలో శునకాలు రోడ్లపై పరిగెత్తినా.. డ్రైవర్లకు ఆ బెల్టులు కనిపించి వాహనాలను నిలిపివేస్తారు. ఈ ఆలోచనతో రోడ్డు ప్రమాదంలో చనిపోయే శునకాల సంఖ్య భారీగా తగ్గింది. ఈ ఆలోచన విస్తృతంగా వ్యాపించి టాటా గ్రూప్ ఆప్ కంపెనీ ‘న్యూస్‌లెటర్’లో అచ్చయింది. ఆలోచన బాగానే ఉన్నా.. రిఫ్లెక్ట్ బెల్టులను ఉచితంగా పంపిణీ చేయడం నాకు ఆర్థికంగా ఇబ్బందైంది. అదే సమయంలో రతన్ టాటాకు శునకాలంటే అమిత ప్రేమ అని, అతనికి లేఖ రాస్తే సహాయం అందుతోందని మా నాన్న సలహా ఇచ్చారు. తొలుత కొంత తటపటాయించినా, రాస్తే పోయేది ఏముందిలే అనుకొని టాటాకు లేఖ రాశాను. ఆ లేఖనే నా జీవితాన్ని మార్చేసింది. రెండు నెలల తర్వాత నన్ను కలవాలని రతన్ టాటా నుంచి లేఖ వచ్చింది. నమ్మలేక పోయాను. కొద్ది రోజుల తర్వాత రతన్ టాటాను ఆయన కార్యాలయంలో కలిశాను. నా ఆలోచన ఆయనకు ఎంతగానో నచ్చిందని చెప్పారు. ఆయన పెంచుకుంటున్న శునకాలను కూడా చూపించాడు. తర్వాత పై చదువుల కోసం విదేశాలకు పోయాను. నేను స్వదేశానికి తిరిగి వచ్చాక టాటా ట్రస్ట్‌లో పనిచేస్తానని ప్రామిస్ చేశా. చదువు ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చాక ఓ రోజు రతన్ టాటా నుంచి ఫోన్ వచ్చింది. ‘ ఆఫీస్‌లో ఉన్న పనులతో చాలా బీజీ అయిపోతున్నాను. నువ్వు నాకు అసిస్టెంట్‌గా ఉండగలవా ’అని కోరారు. ఒక్కసారిగా షాకయ్యాను. పారిశ్రామిక దిగ్గజం నన్ను అసిస్టెంట్‌గా ఉంటారా అని అడగడం నమ్మలేకపోయా. వెంటనే సరే అన్నాను’ అని శంతను చెప్పుకొచ్చాడు. కాగా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘గ్రేట్ స్టోరీ’, ‘మన మంచితనం ఎప్పటికైనా ఉపయోగపడుతుంది’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
ఆ ఎక్స్-రే హాలీవుడ్ స్టార్ మార్లిన్ మన్రోదట..
న్యూఢిల్లీ : అదేంటి! ఎక్స్‌రే ఫిల్మ్ హాలీవుడ్ సినీ అభిమానుల కలల సుందరి మార్లిన్ మన్రో అంటున్నారేంటి, ఆమె ఎప్పుడో చనిపోయిందిగా అనుకుంటున్నారా ? అక్కడే ఉంది అసలు విషయం .ముందు స్టోరీ మొత్తం చదవండి, తర్వాత మీకే విషయం మొత్తం అర్థమవుతుంది. జింబాబ్వేలో ఓ వ్యక్తి తన ఛాతిలో బొద్దింక కనిపించిన ఎక్స్‌రే ఫిల్మ్‌ను 'మిస్టర్ సైంటిఫిక్' ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి ఛాతి పరీక్ష కోసం జింబాబ్వేలో ఓ ఆసుపత్రికి వెళ్లగా.. వైద్య పరీక్షలు నిర్వహించి ఎక్స్‌రే తీశారు. ఎక్స్‌రే ఫిల్మ్‌లో బొద్దింక కనిపించడంతో వెంటనే సదరు వ్యక్తిని సర్జరీ చేయించుకోవడానికి ఇండియాకు వెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. డాక్టర్లు చెప్పిన విషయాన్ని నమ్మిన ఆ వ్యక్తి తనకున్న ఆస్తిని మొత్తం అమ్మి సర్జరీ కోసం ఇండియాకు వచ్చాడు. కాగా, ఇక్కడి వైద్యులు అతనికి అన్ని పరీక్షలు నిర్వహించి అతని ఛాతిలో బొద్దింక లేదని, అది కేవలం ఎక్స్‌రే మిషన్‌లో ఉన్న బొద్దింక ఇమేజ్... ఆ ఫిల్మ్ మీద పడటంతో అలా కనిపించిందని తెలిపారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న బాధితుడు గుండెలు బాదుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఫేక్ న్యూస్‌లను పసిగట్టడంలో సిద్ధహస్తులైన యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ రంగంలోకి దిగింది. ఇదంతా కల్పితమని, కేవలం ఫోటోలను మార్పింగ్ చేశారని బయటపెట్టింది. గూగుల్ ద్వారా రివర్స్ ఇమేజింగ్ ప్రాసెస్ ద్వారా ఒరిజినల్ ఇమేజ్ను కనుగొన్నామని పేర్కొన్నారు. కాగా, ఆ ఎక్స్‌రే ఫిల్మ్ ఒకప్పటి హాలీవుడ్ స్టార్ మార్లిన్ మన్రోదని, కొన్నేళ్ల క్రితం కూడా ఇలాంటి కథనమే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిందని తెలిపారు. 1954లోమార్లిన్ మన్రో గైనకాలజీకి సంబంధించిన ఆపరేషన్ కోసం ఓ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు నిర్వహించుకున్నారు. అందులో ఒకటి ఛాతికి సంబంధించిన ఎక్స్‌రే ఫిల్మ్ కూడా ఉందని వెల్లడించారు. కాగా 2010లో మన్రోకు సంబంధించిన మూడు ఫిల్మ్ ఎక్స్‌రేలు వేలం వేయగా 45వేల డాలర్ల ధర పలికిందని స్పష్టం చేశారు. ఇప్పుడు ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఫోటోనూ రివర్స్ ఇమేజింగ్ ప్రాసెస్ చేయడంతో అసలు విషయం బయటపడిందని పేర్కొన్నారు. అదండీ దీని వెనకున్న అసలు రహస్యం. -
‘అతని వల్ల మర్చిపోలేని జ్ఞాపకంగా మారింది’
ముంబై : సాధరణంగా మొబైల్, వాలెట్ వంటివి పోతే దొరకడం చాలా కష్టం. మన అదృష్టం బాగుంటే తప్ప తిరిగి మన చేతికి రావు. క్రెడిట్ కార్డు, ఏటీఎం కార్డులు అన్ని ఆ వాలెట్‌లోనే ఉంటాయి. దొరికితే బాగుండని.. దొరకాలని కోరుకుంటాం. మనం కోరుకున్నట్లు జరిగితే.. ఇదిగో ఇలా ప్రచారం చేస్తాం. ట్విటర్ యూజర్ దర్థ్ సియర్ర తాను కలిసిన ఓ నిజాయితీపరుడైన క్యాబ్ డ్రైవర్ గురించి ట్విటర్ ద్వారా ఎంతో మందికి పరిచయం చేశాడు. ప్రస్తుతం ఈ స్టోరీ తెగ వైరలవుతోంది. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి దర్థ్ సియర్ర ఇలా చెప్పుకొచ్చాడు. ‘ఈ నెల 10న నా పుట్టిన రోజు సందర్భంగా నేను, నా భార్య పబ్‌కు వెళ్లి ఎంజాయ్ చెద్దామని భావించాము. అందుకోసం ఓలా క్యాబ్ బుక్ చేశాం. మిని హుండాయ్ ఎక్సెంట్ మా కోసం వచ్చింది. దాని డ్రైవర్ అసిఫ్ ఇక్బాల్ అబ్దుల్ గఫర్ పథాన్. మా ప్రయాణం ప్రారంభమైన కాసేపటికి వర్షం ప్రారంభమైంది. దాంతో పథాన్ తన భార్యకు ఫోన్ చేసి.. పిల్లలన్ని బయకు పంపకుండా ఇంట్లోనే ఉంచి జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. ఆ తర్వాత మేం కబుర్లు చెప్పుకుంటూ మా ప్రయాణాన్ని కొనసాగించాం. వర్షం కారణంగా ట్రాఫిక్ దారుణంగా ఉంది. ఎలాగో అలా మేం వెళ్లాల్సిన పబ్‌కు చేరుకున్నాం. తర్వాత స్నేహితులను కలిసి పిచ్చాపాటి ప్రారంభించాం. ఓ గంట గడిచిన తర్వాత నా వాలెట్ మిస్సయిందని గుర్తించాను’ అన్నారు దర్థ్ సియర్ర. ‘ఓ నిమిషం పాటు నాకు కాళ్లు చేతులు ఆడలేదు. దాంతో క్యాబ్‌లో మర్చిపోయానేమో అని భావించి పథాన్కు కాల్ చేశాను. అతను చెప్పిన సమాధానం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నేను నా వాలెట్‌ను క్యాబ్‌లోనే మర్చిపోయానని.. అది గమనించిన పథాన్ దాన్ని తీసి భద్రం చేసినట్లు చెప్పాడు. అంతేకాక ఇంటికి వెళ్లేటప్పుడు.. నన్ను కలిసి వాలెట్ తిరిగి ఇవ్వాలని అనుకున్నట్లు చెప్పాడు. చెప్పడమే కాక సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేటప్పుడు నా దగ్గరకు వచ్చి వాలెట్ ఇచ్చాడు. అంతేకాక పుట్టిన రోజు శుభకాంక్షలు కూడా తెలియజేశాడు. నా పుట్టిన రోజు నాడే తన పుట్టిన రోజు కూడా కావడం నిజంగా అద్భుతం. అలా విషాదంగా ముగియాల్సిన నా పుట్టిన రోజు కాస్త పథాన్ నిజాయితీ వల్ల నా జీవితంలో మర్చిపోలేని రోజుగా మిగిలిపోయింది’ అన్నారు దర్థ్ సియర్ర. ‘ఈ సోషల్ మీడియా వేదికగా మనం కోపాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తూంటా. కానీ మంచి విషయాలను కూడా ఈ వేదిక మీదగా షేర్ చేసుకుందాం. దీని వల్ల కొందరైనా ప్రేరణ పొందుతారు’ అంటూ దర్థ్ సియర్ర ట్వీట్ చేసిన ఈ స్టోరీకి జనాలు ఫిదా అయి పోయారు. క్యాబ్ డ్రైవర్ నిజాయితీని తెగ మెచ్చుకుంటున్నారు. -
అమ్మాయిలు.. ఒక్క సారి ధైర్యం చేయ్యండి
ఇష్టపడుతున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి.. వారిని ప్రేమిస్తున్నట్లు చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. కానీ ఒక్క సారి అలా ధైర్యం తెచ్చుకుని ప్రయత్నిస్తే.. ప్రేమ, ఆనందం మీ సొంతం అవుతాయంటున్నారు ట్విటర్ యూజర్ రిలే. అందుకు తనే మంచి ఉదాహరణ అంటూ తన స్టోరిని ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ స్టోరి విపరీతంగా వైరలవడమే కాక ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. రిలే తన స్టోరి చెప్తూ.. ‘‘పబ్లిక్ స్పీకింగ్’ క్లాస్‌లో తొలిసారి ఆ అబ్బాయిని చూశాను. మొదటి చూపులోనే అతని మీద ఇష్టం కలిగింది. నెలలు గడుస్తున్న కొద్ది.. ఆ ఇష్టం ఇంకా పెరిగిపోయింది. ఓ రోజు ధైర్యం చేసి ఫేస్బుక్లో నా ప్రేమ గురించి తెలుపుతూ.. తనకు మెసేజ్ చేశాను. ఇది జరిగి ఓ సంవత్సరం గడిచింది. ప్రస్తుతం మేమిద్దరం చాలా సంతోషంగా కలిసి ఉన్నాం. అమ్మాయిలు ధైర్యం చేయ్యండి’ అంటూ రిలే చేసిన ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. After crushing on “the cute guy from public speaking” for months, I made the most impulsive decision I have ever made & messaged him on Facebook 😂 1 year later, we are happily dating & have been talking every day since. Moral is: don’t be afraid to shoot your shot, ladies (; pic.twitter.com/5vxD49XtZE — Riłëy (@rileyy__daviss) May 3, 2019 ఈ స్టోరి చూశాక చాలా మంది తాము కూడా ఇలానే ధైర్యం చేసి ప్రపోజ్ చేశామని.. ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నామంటూ తమ కథలను కూడా షేర్ చేయడం ప్రారంభించారు. ఇప్పటికే రిలే ట్వీట్‌ను దాదాపు 9 వేల మంది రీట్వీట్ చేయగా.. 97 వేల మంది లైక్ చేశారు. -
ఎంత క్యూట్‌గా రిక్వెస్ట్ చేశాడో..!
చిన్న పిల్లలతో విమానయానం చేసే వారి కష్టాలు చూడాలి. పాపం అనిపిస్తుంది. మాటలు రాని వయసులో ఆకలి, బాధ వంటి వాటిని ఏడుపు ద్వారానే తెలియజేస్తారు చిన్నారులు. కానీ అర్థం చేసుకోలేని వారు ఏంటీ గోళ అని విసుక్కుంటారు. అంతటితో ఊరుకోక ప్రయాణం మధ్యలోనే దించేస్తారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి వార్తలను చాలానే చూశాం. వీటి గురించి ‘లోకం తెలయని పిల్లలు.. కాస్తా ఓపిక పడితే ఏం పోతుంద’ని కొందరు.. ‘పిల్లలు ఏడుస్తూంటే ఇబ్బందిగా ఉండదా’ అని మరి కొందరు వాదించారు కూడా. ఏం చేస్తాం రెండు నిజమే. అయితే ఈ సమస్యను కాస్తా సృజనాత్మకంగా పరిష్కరించింది ఓ తల్లి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్టోరి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ మహిళ తన నాలుగు నెలల పసికందుతో కలిసి అమెరికా వెళ్తుంది. ఈ నేపథ్యంలో తన చిన్నారి వల్ల కలిగే ఇబ్బందిని పెద్ద మనసుతో అర్థం చేసుకోండంటూ కోరుతూ.. క్యాండీస్,ఇయర్‌ప్లగ్స్ ఉన్న ప్యాకెట్‌ను తోటి ప్రయాణికులకు పంచింది. ఇలా విమానంలోని దాదాపు 200 మంది ప్రయాణికులకు ఈ బ్యాగ్స్‌ను అందజేసింది. గిఫ్ట్ ప్యాక్‌ల కంటే కూడా వాటి మీద ఉన్న స్టోరి ప్రయాణికులకు తెగ నచ్చింది. గిఫ్ట్ ప్యాక్ మీద ‘హలో.. నా పేను జున్వూ.. నా వయసు నాలుగు నెలలు. ఈ రోజు నేను మా అమ్మ, నానమ్మతో కలిసి మా ఆంటీని చూడ్డానికి అమెరికా వెళ్తున్నాను. ఇదే నా తొలి విమానయానం. అందువల్ల కాస్తా నెర్వస్‌గా, భయంగా ఫీలవుతున్నాను. సో నాకేమన్నా ఇబ్బందిగా అనిపించినప్పడు ఏడుస్తాను.. బాగా గొడవ చేస్తాను. వెంటనే ఏడుపు ఆపేస్తానని మీకు ప్రామిస్ చేయలేను. ముందు జాగ్రత్తగా మా అమ్మ ఈ గిఫ్ట్ ప్యాక్‌లను మీకు ఇస్తుందన్నమాట. నేను బాగా గొడవ చేసినప్పుడు మీకిచ్చిన ప్యాకెట్లో ఉన్న ఇయర్ప్లగ్స్ను వాడండే. మీ ప్రయాణం సంతోషంగా సాగాలని కోరుకుంటూ చిన్నారి జున్వూ’ అని ఉంది. ఈ స్టోరిని ఫేస్బుక్లో షేర్ చేసిన డేవ్ కరోనా ఆ 200 మంది ప్రయాణికుల్లోఒకరు ఉన్నారు. ఈ తల్లి ప్రయత్నం నా హృదయాన్ని హత్తుకుందన్నారు కరోనా. అంతేకాక గిఫ్ట్ ప్యాక్‌ల మాట ఏమో కానీ.. జున్వూ రిక్వెస్ట్ మాత్రం ప్రయాణికులకు తెగ నచ్చేసిందని తెలిపారు. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోన్న ఈ స్టోరి నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం జున్వూ సోషల్ మీడియాలో చిన్న సైజు హీరో అయ్యాడు. ‘చాలా మంచి ప్రయత్నం’.. ‘విమానంలో ప్రయాణించే వారు చిన్నారుల పట్ల కాస్త దయగా వ్యవహరిస్తే బాగుంటుందం’టూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. -
ఆరుషి కోసం.. 6 గంటల్లో.. 16 లక్షలు
పుట్టిన ప్రతి మనిషి ఎదుగుతాడు. ఏళ్లు శ్రమించి ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు. పిల్లల విజయానికి తల్లిదండ్రులు ఎంత మురిసిపోయినా వారికి జీవితాంతం మధుర జ్ఞాపకంగా నిలిచేవి మాత్రం తమ చిన్నారి మొదటిసారి వేసిన బుడిబుడి అడుగులే. తప్పటడుగులతో ప్రారంభమయిన మనిషి జీవితం ఎన్నో మైళ్లు ప్రయాణించి విజయ తీరాలను చేరుకుంటుంది కానీ ఆరుషి విషయంలో ఈ సంతోషాలు ఏవి లేవు. ఎందుకంటే ఆ చిన్నారి పుట్టుకతోనే తల్లిని కోల్పోయింది.. ఆపై 20 రోజుల్లో తండ్రి కూడా మరణించాడు. మనవలు, మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వయసులో ఉన్న తాతనాయనమ్మలే ఆ పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఇప్పుడిప్పుడే బాధల నుంచి తేరుకుంటున్న ఆ కుటుంబాన్ని విధి మరోసారి చిన్న చూపు చూసింది. నిండా మూడేళ్లు లేని ఆ పసిపాపకు దేవుడు ఖరీదైన జబ్బును బహుమతిగా ఇచ్చాడు. దాని పేరు ‘కాన్జెనిటల్ సుడార్‌థ్రోసిస్ ఆఫ్ ద టిబియా’ (సీపీటీ). మన భాషలో చెప్పాలంటే విరిగిన కాలి ఎముక సరిగా అతుక్కోకపోవడమే కాక ఆ గాయం ఎన్నటికి మానదు. దాంతో జీవితాంతం నడవలేని పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతం ఆరుషి కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఆ చిన్నారి పుట్టి ఇప్పటికి రెండున్నరేళ్లు అవుతోంది. కానీ ఇంతవరకూ తొలి అడుగు వేయలేదు. కారణం సీపీటీ. చిన్నారి ఆరుషికి ఏడాది వయసు ఉన్నప్పుడు ఈ జబ్బు బయటపడింది. దాంతో ఆ చిన్నారి నడవకూడదని చెప్పిన డాక్టర్లు.. ఆరుషి పాదాలకు బ్యాండేజ్ వేశారు. ఆపరేషన్ చేస్తే ఆ పాప కూడా అందరిలానే నడవగల్గుతుందని చెప్పిన డాక్టర్లు.. అందుకు దాదాపు 16 లక్షల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. అసలే అమ్మనాన్న లేక తాతనాయనమ్మల దగ్గర బతుకుతున్నారు. పూట గడవడమే కష్టం అంటే ఇక ఇంత భారీ మొత్తం ఖర్చు చేసి వైద్యం చేయించడం వారి వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే ఆరుషి తాత చేసేదేమో చిన్న సెక్యూరిటి గార్డ్ పని. వచ్చే మూడువేల జీతం రాళ్లతో నలుగురి కడుపులు నింపాలి. అలాంటిది 16 లక్షల రూపాయలు ఖర్చు చేసి మనవరాలికి వైద్యం చేయించడం తన వల్ల కాదని అర్థమైంది. కానీ ఇంత బాధలోను మనవరాలి మొము మీద చిరునవ్వు చూసినప్పుడల్లా ఎలాగైనా ఆ చిన్నారిని నడిపించాలని ఆ ముసలి మనసు ఆరాటపడేది. దాంతో తన వంతు ప్రయత్నాలు ప్రారంభించాడు. తన, పర అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని సాయం కోరాడు. దీని వల్ల అంతగా ఉపయోగం లేకపోయింది. ఇలా అయితే లాభం లేదనుకుని తన దీన గాథను వివరిస్తూ ఫేస్బుక్లో ఓ స్టోరి పోస్ట్ చేశాడు. అతనికి తోడుగా ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ అనే సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు విరాళాలు సేకరించేందుకు ముందుకు వచ్చారు. అలా ఆరుషి వ్యధ ఇంటర్నెట్ ద్వారా ప్రపంచమంతా తెలిసింది. మేమున్నామంటూ దాతలు ముందుకొచ్చారు. దాంతో కేవలం 6 గంటల వ్యవధిలోనే ఆ చిన్నారి వైద్యానికి కావాల్సిన 16 లక్షల రూపాయల సొమ్ము సమకూరింది. తమకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఆరుషి కుటుంబ సభ్యులు. త్వరలోనే తమ మనవరాలు లేడిపిల్లలా గెంతుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. -
వైరల్‌గా మారిన మంచి మనిషి కథ
బీజింగ్: వృత్తి ఏదైనా ప్రవృత్తి ముఖ్యం. పెద్ద మనుసు ఉండాలిగానీ పేదలకు ఎలాగైనా సాయం చేయవచ్చు. అది చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని జియావోజువో అనే గ్రామం. అందులో వాంగ్ జెంగ్జియాన్ అనే వ్యక్తికి ఓ బార్బర్ షాపుంది. ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు, అంటే రోజుకు 17 గంటలపాటు క్షణం తీరిక లేకుండా నిర్విరామంగా పనిచేస్తున్నారు. గత 25 ఏళ్లగా ఆయన ఇలాగే అలుపు సొలుపూ లేకుండా పనిచేస్తూ ఈ వృత్తిలోనే తృప్తి పొందుతున్నారు. ఆయన బార్బర్ షాపుకు అంత ఎక్కువ గిరాకీ ఉండడానికి కారణం కటింగ్‌కు భారతీయ కరెన్సీలో కేవలం పది రూపాయలు మాత్రమే చార్జి చేయడం. అది కూడా ఇప్పుడు నిర్ణయించింది కాదు. తాను పాతికేళ్ల క్రితం ఈ వృత్తిలోకి ప్రవేశించినప్పుడు నిర్ణయించిన చార్జి. పాతికేళ్లలో కరెన్సీ విలువ ఎంతో మారినా, నిత్యావసర సరకుల ధరలు పెరిగినా ఆయన మాత్రం చార్జీనీ మార్చలేదు. పైగా పేదవాళ్లకు, దివ్యాంగులకు ఉచితంగా హేర్ కటింగ్ చేస్తున్నారు. తన షాపుకొచ్చి కూర్చోగలిగిన వారికి కుర్చీలో, అంత ఓపిక లేనివారికి చెట్టు కింద నీడలో, షాపు దగ్గరికి రాలేనివారికి ఎక్కడుంటే అక్కడే, ముఖ్యంగా దివ్యాంగులకు, మంచం పట్టిన రోగులకు ఇంటికెళ్లి మరీ కటింగ్ చేస్తున్నారు. ‘నేను గతంలో వాంగ్ షాపుకెళ్లి కటింగ్ చేయించుకునేవాణ్ని. గత కొంతకాలంగా అనారోగ్యం వల్ల మంచం పట్టాను. లేవలేకపోతున్నా. వాంగ్ రెగ్యులర్‌గా ఇంటికొచ్చి హేర్ కట్టింగ్, షేవింగ్ చేసి వెళుతున్నారు. నేను పేదవాడిని అవడం వల్ల నా దగ్గర డబ్బులు తీసుకోవడం లేదు. పది రూపాయలేగదా! ఇద్దామనుకుంటే, బాబాయ్! డబ్బులెవరికి కావాలి, ప్రేమకావాలిగానీ అంటూ ఆప్యాయంగా పలకరించి వెళతారు’ అని ఓ 80 ఏళ్ల కస్టమర్ వ్యాఖ్యానించారు. ఈ ప్రజా సేవ ఎలా అలవాటైందని వాంగ్‌ను ప్రశ్నించగా.. ‘ఇది ధనిక గ్రామమేమి కాదు. గ్రామంలో అందరూ సమానస్థాయి వాళ్లు ఉండరు. పేదవాళ్లు ఉంటారు, డబ్బులున్నవాళ్లు ఉంటారు. వారి వారి అవసరాలను దృష్టి పెట్టుకొని మన బతుకుతెరువుకు సరిపడినంతా చార్జిచేస్తే చాలు. వృత్తిలో డబ్బులు సంపాదించడం ముఖ్యం కాదు. వృత్తిని చిత్తశుద్ధితో చేయడం ముఖ్యం’ అని నాకు ఈ విద్యను నేర్పిన గురువు చెప్పారని, ఆ గురువు మాటలు ఇప్పటికీ మరచిపోలేదని వాంగ్ స్థానిక మీడియోకు తెలిపారు. వాంగ్‌కు సంబంధించిన ఈ వార్త ఇప్పుడు చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూజర్లు వాంగ్ గొప్పగుణాన్ని ప్రశంసిస్తున్నారు. -
ఈ భామ వేళ్లు ఎంత పొడవో..
ఓ తైవాన్ మహిళ పోస్ట్ చేసిన ఫోటో చూసి నెటిజన్లు గందరగోళంలో పడిపోయారట. చైనా సోషల్ మీడియాలో అందరీ దృష్టిని ఆకర్షించిన ఆ ఫోటో ఏంటంటే. అందరికంటే భిన్నంగా వున్న ఆమె కాలి వేళ్లు. అయితే అవి కాలివో.. చేతివో అర్థం కాక కొంచెం తికమక పడ్డారట. సుకుమారంగా, పొడవుగా ఉన్నాయో.. అంతే అసహజగా వున్న ఆమె వేళ్లు చేతివా....కాలివా అన్నంత ఆశ్చర్యకరంగా, ఆసక్తికరంగా మారాయి. ఈ వేళల్లో ఎక్కువగా పొడవుగా ఉన్న వేలు (బొటన వేలు పక్కన ఉన్) సైజ్..అక్షరాలా 5సెం.మీ. దీంతో అంత పొడవుగా, వింతగా ఉన్న ఆ ఫోటోను చేసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అవి కాలివేళ్లో.. చేతివేళ్లో అర్థంకాకుండా భలే వింతగా ఉన్నాయంటూ అబ్బురపడ్డారు పేరు వెల్లడికాని ఈ విశ్వవిద్యాలయం విద్యార్థిని తనపొడవు నాలుగు అడుగుల 11 ఇంచులనీ, కానీ తన టోస్ (కాలివేళ్లు) లో పెద్దగా వున్నాయంటూ ఫోటోలను తన బ్లాగ్ లోపోస్ట్ పెట్టింది. పాదంలో కాలి వేలి పొడవు అయిదు సెంటీ మీటర్లని పేర్కొంది. దీంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాననీ, తన గ్రీక్ ఫీట్ ( పాదంలో రెండవ వేలు పొడవుగా వుండడం) కారణంగా తనను తాను సౌందర్య సామ్రాజ్ఞిగా అభివర్ణించుకుంది. అయితే ఆమె బ్లాగ్ లో పోస్ట్ చేసినప్పటికంటే ఫేస్ బుక్ పేజీలో మరింత ఆసక్తికరంగా మారాయి. లైకులు..కామెంట్లు.. ట్యాగ్స్.. షేర్ల వెల్లువ తో బాగా హల్ చల్ చేస్తున్నాయి.