Comment In X: అసెంబ్లీలో కునుకు తీస్తే.. ఆ కిక్కే వేరబ్బా! | Comment In X: Sakshi Satires Column Feb 26 2025 | Sakshi
Sakshi News home page

Comment In X: అసెంబ్లీలో కునుకు తీస్తే.. ఆ కిక్కే వేరబ్బా!

Published Wed, Feb 26 2025 1:02 PM | Last Updated on Wed, Feb 26 2025 1:55 PM

Comment In X: Sakshi Satires Column Feb 26 2025

సాధారణంగా.. కీలక సమావేశాల్లో లేదంటే ఉపన్యాసాలు జరుగుతున్న టైంలో మన నేతలు నిద్రపోతూ కనిపించే దృశ్యాలు అప్పుడప్పుడు వైరల్‌ అవుతుంటాయి. అయితే నేతలు ఇక మీదట హుషారుగా పని చేసేందుకు కర్ణాటక స్పీకర్‌ యూటీ ఖాదర్‌ ఓ నిర్ణయం తీసుకున్నారు. 

కర్ణాటక అసెంబ్లీ(Karnataka Assembly) సమావేశాల టైంలో భోజనం తర్వాత.. సభ్యులు కాసేపు నిద్ర తీసేందుకు ఏర్పాట్లు కలిగించబోతున్నారు. ఈ మేరకు అద్దె ప్రతిపాదిక 15 ‘కునుకు కుర్చీలు’ తెప్పించాలని ఆదేశాలు జారీ చేశారు. తద్వారా నేతలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, వాళ్ల పని తీరు మెరుగుపడుతుందని, పైగా సభ్యుల హాజరు శాతం పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు.

సర్‌ ఇంగ్లీష్‌ అంతే!
సీనియర్‌ నేత, తిరువంతపురం ఎంపీ శశిథరూర్‌(Shashi Tharoor) కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ట్రంప్‌-మోదీ భేటీపై ఆయన సానుకూలంగా మాట్లాడడం, బీజేపీ నేతలతో సెల్ఫీ దిగడంతో ఆయన పార్టీ మారడం ఖాయమని ఊహాజనిత కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఆయన వాటన్నింటినీ ఖండించేశారు. అయితే ఆయన ఆంగ్ల పరిజ్ఞానం అత్యంత అరుదు. పలకడానికి కష్టంగా ఉన్న ఇంగ్లీష్‌ పదాలు తరచూ ఆయన వాడుతుంటారు. అలాగే.. ఆ ఖరీదైన ఇంగ్లీష్‌కు చాలామంది అభిమానులే ఉన్నారు. ఇక.. హిందీ భాషాభిమానంలో బీజేపీని కొట్టేవారు ఈ దేశంలోనే లేరు. అలా.. అమిత్‌ షా-శశి మధ్య పార్టీ మారడం గురించి చర్చ జరిగితే ఇలా ఉంటుందనే సరదా ప్రయత్నం.. ఈ ఎక్స్‌ కామెంట్‌.

 

సొంత దేశంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీ టోర్నీలో పాకిస్థాన్‌ జట్టుకు ఘోర పరాభవమే ఎదురవుతోంది. తీవ్ర స్థాయిలో ఆ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే టైంలో జట్టు పేలవమైన ప్రదర్శన కారణంగా..  సోషల్‌ మీడియాలో జోకులు సైతం పేలుతున్నాయి. ఇక సొంతదేశంలోనే మీమ్‌ మెటీరియల్‌గా పేరున్న షాహిన్‌ అఫ్రిదీ(Shaheen Afridi)ని ఇలా.. భారత్‌లోని భాగేశ్వర్‌ ధామ్‌లో పూరీలు అమ్ముకునేవాడిలా చేసేశారు.

 

 
Note: ఈ పోస్టులు ఎవరినీ కించపరిచడానికో లేదంటే విమర్శించడానికో కాదు. కేవలం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయని తెలియజేయడం కోసమే.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement