
‘ఎగ్జామ్ సెంటర్‌కు ఎలా వెళతారు?’ అనే ప్రశ్నకు జవాబు తెలియనిదేమీ కాదు. అయితే ఈ స్టూడెంట్ మాత్రం తన రూటే సెపరేట్ అని నిరూపించుకున్నాడు. ‘మనసు ఉంటే ఇలాంటి మార్గం కూడా ఉంటుంది’ అని చెప్పకనే చెప్పాడు. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన బీకామ్ విద్యార్థి సమర్థ్ మహంగాడే పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి ఎవరూ ఊహించని మార్గాన్ని ఎంచుకున్నాడు. రోడ్డుమీద వెళ్లకుండా ట్రాఫిక్ జామ్ భయంతో సమర్థ్ ఎంచుకున్న మార్గం... పారాగ్లైడ్!
ప్రముఖ పర్యాటక కేంద్రం పంచగనిలో సమర్థ్ చిన్న జ్యూస్ స్టాల్ నడుపుతున్నాడు. పరీక్ష కేంద్రం అక్కడి నుంచి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది, సమయం ఇంకా ఇరవై నిమిషాలు మాత్రమే ఉంది. ట్రాఫిక్ రద్దీ కారణంగా అక్కడికి సకాలంలో చేరుకోవడం అసాధ్యం అనుకున్న సమర్థ్ అసాధారణ మార్గాన్ని ఎంచుకున్నాడు. పారాగ్లైడింగ్ గేర్ ధరించిన సమర్థ్ గాలిలో ఎగురుతూ పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకున్నాడు. ఇందు కోసం అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎక్స్‌పర్ట్ గోవింద్ యెవాలే సహాయం తీసుకున్నాడు. తన బృందం సహాయంతో సమర్థ్‌కు అన్నిరకాల ఏర్పాట్లు చేసి తోడ్పాటు అందించాడు గోవింద్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
A Panchgani student paraglided 15 km to make it to his exam on time as the traffic was very high on the roads. 100 marks for creative problem solving! #ExamHacks #OnlyInIndia pic.twitter.com/YzFYKRWnSx
— Harsh Goenka (@hvgoenka) February 17, 2025
బైక్+కారు= బైకార్
కొన్ని వారాల క్రితం పాకిస్థాన్‌కు సంబంధించి హోమ్‌మేడ్ టెస్లా సైబర్ ట్రక్ రెప్లికా వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఇక తాజా విషయానికి వస్తే... సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో ఒక పాకిస్థానీ వ్యక్తి విచిత్రమైన, ఆకర్షణీయమైన హైబ్రీడ్ వాహనంలో ప్రయాణిస్తున్నాడు. ఈ వాహనాన్ని కారు అనలేము. అలా అని బైక్ అనలేము. ఎందుకంటే సగం కారు, సగం బైక్ ‘కళ’యిక ఈ వాహనం!
వాహనం ముందుభాగంలో మోటర్ సైకిల్ హ్యాండిల్ బార్, వీల్ కనిపిస్తాయి. ‘వోన్లీ ఇన్ పాకిస్థాన్’ ట్యాగ్‌లైన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్‌ను చూసి ‘అయ్ బాబోయ్’ అంటున్నారు నెటిజనులు.
కొందరు ఈ విచిత్ర వాహనాన్ని సల్మాన్‌ఖాన్ ‘కిక్’ సినిమాలో ఉపయోగించిన వాహనంతో పోల్చారు. ‘కిక్ సినిమాతో ఇన్‌స్పైర్ అయ్యి ఈ బైక్ ప్లస్ కారును తయారు చేశారు’ అని రాశారు. ఈ వీడియో మూడు మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకోవడం మాట ఎలా ఉన్నా.... ‘సరదాలు, ప్రయోగాల సంగతి సరే... రోడ్ సేఫ్టీ మాటేమిటి’ అని ఘాటుగా ప్రశ్నించారు కొందరు. నిజమే కదా!
Comments
Please login to add a commentAdd a comment