
యూ ట్యూబర్స్ హబ్‌గా మారిపోయిన తులసి అనే గ్రామం
‘యూట్యూబ్ విలేజ్’ గా పాపులర్
యూట్యూబ్ వీడియోల ద్వారా అటు ఆదాయం, ఇటు సామాజిక విప్లవం
ఛత్తీస్‌గఢ్‌లోని ఒక చిన్న గ్రామం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. రాయ్‌పూర్‌కి సమాపంలో ఉన్న తులసి అనే గ్రామం యూ ట్యూబ్ (YouTube) వీడియోలతో ఆర్థిక ,సామాజిక విప్లవాన్ని సాధించింది. తమ కథలు, ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేందుకు YouTubeను ఒక మార్గంగా ఎంచుకున్నారు గ్రామస్తులు. చిన్నాపెద్దా, తేడాఏమీలేదు. అక్కడందరూ కంటెంట్ కింగ్‌లే. అన్నట్టు ఇక్కడ యూట్యూబర్లలో మహిళలే ఎక్కువట.
అందుకే ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న తులసి గ్రామాన్ని యూట్యూబర్స్ గ్రామంగా పేరుపడింది. ఈ గ్రామంలో దాదాపు 432 కుటుంబాలుంటాయి. వారి జనాభా 3-4వేల మధ్య ఉంటుంది. వీరిలో 1000 మంది యూట్యూబ్ ద్వారా తమ ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ గ్రామంలో నివసించే 5 ఏళ్ల చిన్నారి నుంచి 85 ఏళ్ల అమ్మమ్మ వరకు యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉంటారంటే అతిశయోక్తి కాదు. తమ స్పెషల్ స్కిట్‌లకోసం గ్రామస్తులంతా ఏకమవుతారు. ప్రతి ఒక్కరూ తలొక పాత్ర పోషిస్తారు.
సామాజిక మార్పుకు నాంది పలికేందుకు యూట్యూబ్ ఒక వేదికగా మారిందనీ, మరింత ఆర్థిక సాధికారితను యూట్యూబ్ తీసుకువచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. యూట్యూబర్లలో, మహిళలే ఎక్కువగా ఉన్నారు. గతంలో జీవనోపాధికి తక్కువ అవకాశాలు ఉన్న మహిళలు ఇప్పుడు స్వతంత్రంగా దీని ద్వారా ఆర్జిస్తున్నారు. అంతేకాదు చెడు అలవాట్లు, నేరాల నుండి పిల్లలను దూరంగా ఉంచుతోందంటున్నారు గ్రామస్తులు.
ఇదీ చదవండి: చిన్న కోడలు రాధికపై నీతా అంబానీ ప్రశంసలు
కాగా తులసి గ్రామంలో నివసిస్తున్న ఇద్దరు స్నేహితులు జైవర్మ, జ్ఞానేంద్ర 2016లో యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించారు. చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం ఉన్న జై వర్మ అంతకుముందు ఒక కోచింగ్ సెంటర్‌ను నడిపేవాడు. అందులో 11వ తరగతి నుండి పిల్లలకు పాఠాలు చెప్పేవాడు. ఆ తర్వాత పొరుగున ఉండే జ్ఞానేంద్రతో కలిసి యూట్యూబ్, స్టడీ, కామెడీ వీడియోలను అప్‌లోడ్ చేయడం ప్రారంభించాడు. ప్రారంభంలో చాలా టెక్నికల్ సమస్యలు,కాపీ రైట్ సమస్యలు వచ్చేవి. కానీ వాటన్నింటినీ అధిగమించి సక్సెస్ అయ్యారు. అలా ఇది మంచి ఆదాయ వనరుగా మారడంతో అందరూ అటు వైపు మళ్లారు. మొదట్లో మొబైల్ ఫోన్‌లలో షూట్ చేసేవారు కాస్తా ఇప్పుడు కెమెరాలు, ఇతర షూటింగ్ పరికరాలను సమకూర్చుకున్నారు. హాస్యానికి అద్దం పట్టాలన్నా, విజ్ఞాన భాండాగారాన్ని అందించాలన్నా, చిన్న పిల్లలనుంచీ పెద్దల వరకు అంతా సిద్ధంగా ఉంటారు.
ఇదీ చదవండి: భారీ ఊరట: ఆ మూడు కేన్సర్లకు త్వరలో వ్యాక్సీన్
Comments
Please login to add a commentAdd a comment