chattishgarh
-
కంటెంట్ క్వీన్స్ మ్యాజిక్ : ‘యూట్యూబ్ విలేజ్’ వైరల్ స్టోరీ
ఛత్తీస్‌గఢ్‌లోని ఒక చిన్న గ్రామం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. రాయ్‌పూర్‌కి సమాపంలో ఉన్న తులసి అనే గ్రామం యూ ట్యూబ్ (YouTube) వీడియోలతో ఆర్థిక ,సామాజిక విప్లవాన్ని సాధించింది. తమ కథలు, ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేందుకు YouTubeను ఒక మార్గంగా ఎంచుకున్నారు గ్రామస్తులు. చిన్నాపెద్దా, తేడాఏమీలేదు. అక్కడందరూ కంటెంట్ కింగ్లే. అన్నట్టు ఇక్కడ యూట్యూబర్లలో మహిళలే ఎక్కువట.అందుకే ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న తులసి గ్రామాన్ని యూట్యూబర్స్ గ్రామంగా పేరుపడింది. ఈ గ్రామంలో దాదాపు 432 కుటుంబాలుంటాయి. వారి జనాభా 3-4వేల మధ్య ఉంటుంది. వీరిలో 1000 మంది యూట్యూబ్ ద్వారా తమ ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ గ్రామంలో నివసించే 5 ఏళ్ల చిన్నారి నుంచి 85 ఏళ్ల అమ్మమ్మ వరకు యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉంటారంటే అతిశయోక్తి కాదు. తమ స్పెషల్ స్కిట్లకోసం గ్రామస్తులంతా ఏకమవుతారు. ప్రతి ఒక్కరూ తలొక పాత్ర పోషిస్తారు.సామాజిక మార్పుకు నాంది పలికేందుకు యూట్యూబ్ ఒక వేదికగా మారిందనీ, మరింత ఆర్థిక సాధికారితను యూట్యూబ్ తీసుకువచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. యూట్యూబర్లలో, మహిళలే ఎక్కువగా ఉన్నారు. గతంలో జీవనోపాధికి తక్కువ అవకాశాలు ఉన్న మహిళలు ఇప్పుడు స్వతంత్రంగా దీని ద్వారా ఆర్జిస్తున్నారు. అంతేకాదు చెడు అలవాట్లు, నేరాల నుండి పిల్లలను దూరంగా ఉంచుతోందంటున్నారు గ్రామస్తులు. ఇదీ చదవండి: చిన్న కోడలు రాధికపై నీతా అంబానీ ప్రశంసలుకాగా తులసి గ్రామంలో నివసిస్తున్న ఇద్దరు స్నేహితులు జైవర్మ, జ్ఞానేంద్ర 2016లో యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించారు. చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం ఉన్న జై వర్మ అంతకుముందు ఒక కోచింగ్ సెంటర్‌ను నడిపేవాడు. అందులో 11వ తరగతి నుండి పిల్లలకు పాఠాలు చెప్పేవాడు. ఆ తర్వాత పొరుగున ఉండే జ్ఞానేంద్రతో కలిసి యూట్యూబ్, స్టడీ, కామెడీ వీడియోలను అప్లోడ్ చేయడం ప్రారంభించాడు. ప్రారంభంలో చాలా టెక్నికల్ సమస్యలు,కాపీ రైట్ సమస్యలు వచ్చేవి. కానీ వాటన్నింటినీ అధిగమించి సక్సెస్ అయ్యారు. అలా ఇది మంచి ఆదాయ వనరుగా మారడంతో అందరూ అటు వైపు మళ్లారు. మొదట్లో మొబైల్ ఫోన్లలో షూట్ చేసేవారు కాస్తా ఇప్పుడు కెమెరాలు, ఇతర షూటింగ్ పరికరాలను సమకూర్చుకున్నారు. హాస్యానికి అద్దం పట్టాలన్నా, విజ్ఞాన భాండాగారాన్ని అందించాలన్నా, చిన్న పిల్లలనుంచీ పెద్దల వరకు అంతా సిద్ధంగా ఉంటారు.ఇదీ చదవండి: భారీ ఊరట: ఆ మూడు కేన్సర్లకు త్వరలో వ్యాక్సీన్ -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 8 మంది మావోయిస్టులు, స్పెషల్ టాస్‌్కఫోర్స్(ఎస్టీఎఫ్) జవాను నితీశ్ ఎక్కా మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. లేఖారమ్ నేతమ్, కైలాశ్ నేతమ్ అనే మరో ఇద్దరు జవాన్లు గాయపడినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో పెద్ద సంఖ్యలో ఆయుధాలు, బ్యారెల్ గ్రనేడ్ లాంచర్‌తోపాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అబూజ్మడ్ అడవిలో ఈ నెల 12న ప్రారంభమైన ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా శనివారం ఉదయం భద్రతా సిబ్బంది గాలింపు కొనసాగిస్తుండగా, మావోయిస్టులు తారసపడ్డారని, ఇరువర్గాల మధ్య చాలాసేపు కాల్పులు కొనసాగాయని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ పోలీసులతోపాటు ఐటీబీపీ, బీఎస్ఎఫ్ సిబ్బంది సైతం ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారని వివరించారు. మావోయిస్టుల వైపునుంచి కాల్పులు ఆగిపోయిన తర్వాత వెళ్లి పరిశీలించగా 8 మృతదేహాలు కనిపించాయని స్పష్టం చేశారు. గాయపడిన ఇద్దరు జవాన్లను చికిత్స కోసం హెలికాప్టర్లో రాయ్‌పూర్‌కు తరలించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవలి కాలంలో భద్రతా సిబ్బంది దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నారు. కాంకేర్, కొండగావ్, నారాయణపూర్, బస్తర్, బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాలో కూడిన బస్తర్ డివిజన్లో ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 131 మంది మావోయిస్టులు మరణించారు. ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏకంగా 29 మంది మావోయిస్టులు మృతిచెందిన సంగతి తెలిసిందే. నక్సలైట్లను పూర్తిగా ఏరివేయడమే తమ లక్ష్యమని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రకటించారు. -
‘ ఏడాదిలోపు మధ్యంతర ఎన్నికలు ’.. చత్తీస్‌గఢ్ మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
రాయ్‌పూర్: దేశంలో ఆరు నెలల నుంచి ఏడాది లోపు మధ్యంతర ఎన్నికలు రానున్నాయని చత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యంతర ఎన్నికల కోసం కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం ఓ బహిరంగ సభలో మాట్లాడారు.‘‘ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండండి. ఆరు నెలల నుంచి ఏడాది లోపు దేశంలో మధ్యంతర ఎన్నికలు రానున్నాయి. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌లను పక్కన పెట్టనున్నారు. యోగి ఆదిత్యనాథ్ కుర్చి కదులుతోంది. సీఎం భజన్‌లాల్ తడబడుతున్నారు. ఫడ్నవిస్ రాజీనామా చేస్తున్నారు. .. రోజుకు మూడు డ్రెస్సులు మార్చే వారు (మోదీ) ఇప్పడు ఒకే డ్రెస్‌తో మూడు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇప్పడు వాళ్లు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, ఏం ధరిస్తున్నారనేది ఇక పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి గట్టి గుణపాఠం. పార్టీలను విడగొట్టే, ప్రజల చేత ఎన్నకోబడిన సీఎంలను జైలులో పెట్టిన బీజేపీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు’’ అని బఘేలా అన్నారు.మరోవైపు.. ఎన్డీయే కూటమి పక్షనేతగా నరేంద్రమోదీని భాగస్వామ్య పక్షనేతలు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్న రోజునే భూపేష్ ఇటువంటి వ్యాఖ్యలు చేయటంతో సంచలనంగా మారింది. -
జిమ్ చేస్తూ కుప్పకూలి 17 ఏళ్ల మైనర్ కన్నుమూత
జీవితంలో మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా కోవిడ్ సంక్షోభం తరువాత ఆరోగ్యం ఉన్నవారు వ్యాయామం చేస్తూ పలు ఆకస్మిక మరణాలు ఆందోళన రేపుతున్నాయి. జిమ్‌లో వ్యాయామం చేస్తూ 17 ఏళ్ల బాలుడు మరణించిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్పూర్లోఈ విషాదం చోటు చేసుకుంది. భాన్‌పురిలోని స్పేస్ జిమ్‌లో బుధవారం వ్యాయామం చేస్తూ 17 ఏళ్ల మైనర్ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. రోజు మాదిరిగానే ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతూ ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పోలీసుల సమాచారం ప్రకారం సత్యం (17) రహంగ్‌డేల్ భన్‌పురిలోని ధనలక్ష్మి నగర్లో నివాసముంటున్నాడు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం జిమ్‌లోని ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతున్న అతడు ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కిందపడిపో యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేదు. అయితే అతని మరణానికి గల కారణాలను ఇంకా అధికారికంగా వెల్లడిరచలేదు. పోస్టుమార్టం నివేదిక తరువాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.సత్యం తండ్రి సుభాష్ రహంగ్‌డేల్ చిరు వ్యాపారం చేసుకునేవాడు. ఇద్దరు కుమారుల్లో సత్యం పెద్దవాడు. ఇటీవల ధనలక్ష్మి నగర్‌లోని కృష్ణ ఇంగ్లీషు మీడియం స్కూల్లో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. కానీ ఈ సంతోషం వారికి ఎంతోకాలం నిలవలేదు. ఎదిగిన కొడుకు ఆకస్మికంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. -
మూడే నిమిషాల్లో వేడి వేడి పిజ్జా: పిజ్జా ఏటీఎం, ఎక్కడో తెలుసా?
సాధారణంగా నగదు లావాదేవీలకుపయోగించే ఏటీఎంలతోపాటూ గతంలో గోల్డ్ ఏటీఎంను కూడా చూశాం. తాజాగా పిజ్జా ఏటీఎం కూడా వచ్చేసింది. కేవలం మూడే మూడు నిమిషాల్లో వేడి వేడి పిజ్జా మనకందించే ఏటీఎం. ఈ పేరు వింటుంటేనే.. మీచుట్టూ పిజ్జా అరోమా నిండిపోయి, నోరూరుతోంది కదా? మరి ఎక్కడ? ఏంటి? ఎలా? ఈ వివరాలు కావాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి స్పీడీ పిజ్జా మెషిన్ ఇది. చండీగఢ్‌లోని సుఖ్నా సరస్సు సమీపంలో ఇది కొలువు దీరింది. యమ్మీ యమ్మీ పిజ్జా కేవలం 3 నిమిషాల్లో డెలివరీ అవుతుంది. చక్కటి ప్రకృతి అందాలకే కాదు రుచికరమైన పిజ్జా కేంద్రంగా ఇపుడు సుఖ్నా సరస్సు నిలుస్తోంది. పర్యాటకులకు హాట్‌స్పాట్‌గా ఉన్న సుఖ్నా సరస్సు వివిధ వంటకాలకు పాపులర్. ఇపుడిక పిజ్జా వెండింగ్ మెషీన్ మరింత ఎట్రాక్షన్ అని చండీగఢ్ ఇండస్ట్రియల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. (మహిళా ఖైదీల గర్భంపై హైకోర్టు సీరియస్!) ఈ ప్రత్యేకమైన ఆలోచన ఫ్రాన్స్ ప్రేరణగా వచ్చిందని ఐమ్యాట్రిక్స్ వరల్డ్ వైడ్ లైసెన్స్ పొందిన డాక్టర్ రోహిత్ శర్మ వెల్లడించారు. తమ మొహాలీ ఆధారిత ఫ్యాక్టరీలో యంత్రాన్నితయారు చేయాలని నిర్ణయించుకున్నారట. గత నెలలో దీన్ని ఇన్స్టాలేషన్ చేసినప్పటినుంచీ విపరీతమైన ప్రజాదరణ పొందిందన్నారు ఆయన. ప్రస్తుతం రోజుకు సగటున 100 దాకా ఆల్ వెజిటేరియన్ పిజ్జాలను సిద్ధం చేస్తోంది. వారాంతాల్లో, ఈ సంఖ్య 200-300 మధ్య ఏదైనా పెరుగుతుంది. ఇది కేవలం మొట్టమొదటిది, కొత్తదనంతో కూడుకున్నది మాత్రమే కాదని, డొమినోస్, పిజ్జా హట్ లాంటి వాటితో పోలిస్తే దాదాపు 35శాతం తక్కువ ధరకే అందిస్తున్నామన్నారు. త్వరలోనే మరిన్ని ప్రధాన నగరాల్లో దీన్ని ఇన్స్టాల్ చేస్తామని చెప్పారు. దీంతో పిజ్జా ప్రియులందరికీ ఇది వీకెండ్ డెస్టినేషన్‌గా మారిపోనుంది. Pearl Kapur మూడు నెలల్లోనే రూ. 9800 కోట్లు : ఎలా బ్రో..?! మెషిన్లోకిఎంట్రీ ఇచ్చి తమకిష్టమైన పిజ్జాను నమోదు చేయగానే ఒక రోబోటిక్ చేయి అవసరమైన టాపింగ్‌తో పిజ్జా బేస్‌ని ఎంచుకొని, దానిని కాల్చి, కేవలం మూడు నిమిషాల్లో సర్వ్ చేస్తుందట. అంతేకాదు ఏకకాలంలో టాపింగ్స్‌తో ఏడు పిజ్జా బేస్‌లను సిద్ధం చేసే సామర్థ్యం దీని సొంతం. iMatrix వరల్డ్ వైడ్ గతంలో ముంబై రైల్వే స్టేషన్లో ఇలాంటి ఏటీఎంను లాంచ్ చేసింది. కానీ కోవిడ్ ప్రభావం కారణంగా మూసివేయాల్సి వచ్చింది. -
పెళ్లికిచ్చిన రిటర్న్ గిఫ్ట్ చూసి అతిథులు ఫిదా : ఫాదర్ ఐడియా అదిరింది!
#HelmetsReturn Gifts:ఇటీవలి కాలంలోపెళ్ళిళ్లకు రిటన్ గిఫ్ట్‌లు ఇవ్వడం చాలా కామన్‌గా మారింది. అలా ఓ పెళ్లిలో పెళ్లి కుమార్తె తండ్రి ఇచ్చిన రిటన్ గిఫ్ట్ వైరల్‌గా మారింది. రిటన్ గిఫ్ట్ ఏంటి? వైరల్ కావడం ఏంటి? అనుకుంటున్నారా? అయితే మీరీ స్టోరీ తెలుసుకోవాల్సిందే. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కోర్బా జిల్లా, ముదాపూర్ ప్రాంతానికి చెందిన సెద్ యాదవ్ తన కుమార్తె వివాహం ఘనంగా జరిపించాడు. తన కుమార్తె, స్పోర్ట్స్ టీచర్ నీలిమతో, సరన్‌గఢ్-బిలైగఢ్ జిల్లాలోని లంకాహుడా గ్రామానికి చెందిన ఖమ్‌హాన్ యాదవ్‌తో మూడు ముళ్ల వేడుకను ముచ్చటగా జరిపించాడు. విందు భోజనాలు కూడా ఘనంగా ఏర్పాటు చేశాడు. అయితే ఆ పెళ్లికి వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్‌లుగా హెల్మెట్లు ఇవ్వడం వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఇది చూసిన అతిథులు ఆశ్చర్యపోయారు. ఇదీ చదవండి: అపుడు సల్మాన్ మూవీ రిజెక్ట్.. ఒక్క సినిమాతో కలలరాణిగా..ఈ స్టార్ కిడ్ ఎవరు? అయితే రోడ్డు భద్రతపై జనంలో అవగాహన కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు వధువు తండ్రి. రోడ్డుపై ప్రయాణిస్తున్నపుడు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినపుడు తామిచ్చిన హెల్మెట్లు ఉపయోగడాలని భావించామన్నాడు. పెళ్లికి వచ్చిన వారిలో 60 మంది అతిథులకు స్వీట్లతోపాటు హెల్మెట్లను రిటర్న్ గిఫ్ట్‌లుగా ఇచ్చినట్లు సెద్ యాదవ్ తెలిపాడు. అంతేకాదు ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కుటుంబ సభ్యులంతా కలిసి హెల్మెట్లు ధరించి మరీ డ్యాన్సులు చేసినట్టు సంబరంగా చెప్పుకొచ్చాడు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమైన మద్యం తాగి వాహనాలు నడపడం మానుకోవాలని అతిథులను కోరారు. అందరూ జీవితం విలువను గుర్తించాలని పిలుపునిచ్చాడు. రోడ్డు భద్రత, హెల్మెట్ల వాడకంపై అవగాహన కల్పించేందుకు తన కుమార్తె పెళ్లి వేడుక తనకొక వేదికను అందించిందంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అటు గిఫ్ట్స్ అందుకున్న బంధువులు, సన్నిహితులు చాలామంచి ఆలోచన అంటూ సెద్ను అభినందించారు. ఆనదంతో వారు స్టెప్పులు వేశారు. గతంలో బెంగళూరులో కూడా గతంలో బెంగళూరులో కూడా ఇలాంటి సంఘటన ఒకటి నమోదైంది. తమ పెళ్లికి వచ్చిన అతిథులకు హెల్మెట్లు, మొక్కలు గిఫ్ట్‌గా ఇచ్చారు నూతన జంట శివరాజ్, సవిత. ఇలా అయినా కొంతమంది ప్రాణాలైనా రక్షించగలిగితే తమకదే చాలని, అలాగే తామిచ్చిన మొక్కల్లో 500 మొక్కలు బతికినా తమకు ఆనందమేనని వెల్లడించారు. పెళ్లిళ్లలకు మందు, విందు, మ్యూజిక్ అంటూ చేసే వృధా ఖర్చులకు బదులుగా, ఇలా చేయడం ద్వారా, అటు పర్యావరణానికి, ఇటు భవిష్యత్తరాలకు మేలు చేసిన వారమవుతాంటూ వెల్లడించాడు శివరాజ్. -
అరచేతిలో బొంగరం తిప్పిన ఛత్తీస్‌గఢ్ సీఎం: ప్రత్యర్థులకు సవాలేనా?
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ ప్రత్యేకతే వేరు. ప్రత్యర్థులను తనదైన పంచ్‌లతో తిప్పి కొట్టడం ఈ కాంగ్రెస్ సీనియర్‌నేతకు బాగా అలవాటు. దీపావళి సందర్భంగా ప్రజల సంక్షేమం కోసం కొరడా దెబ్బలు తిన్నా, ఇటీవల కీలక సమావేశంలో కాండ్రీ క్రష్ ఆడినా ఆయనకే చెల్లు. తాజాగా బొంగరం తిప్పుతూ వార్తల్లో నిలిచారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో నెటిజన్లును ఆకట్టుకుంటోంది. దీంతో బొంగరం తిప్పినంత ఈజీగా ఈ సారి కూడా రాజకీయాల్లో చక్రం తిప్పుతారా అంటూ నెటిజన్లు కమెంట్ చేశారు. ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్ దేశాయ్ దీనికి సంబంధించిన ఒక వీడియోను ఎక్స్( ట్విటర్)లో షేర్ చేశారు. అలా విసిరి.. ఇలా అలవోకగా అరచేతిలో బొంగరం తిప్పుతూ ప్రత్యర్థులకు పరోక్షంగా సవాల్ విసురుతున్నట్టే కనిపించారు. దీంతో ‘వారెవ్వా.. లట్టూ మాస్టర్... డౌన్ టూ ఎర్త్ పోలిటీషియన్’ అంటూ సీఎంను రాజ్‌దీప్ అభివర్ణించారు. కాగా 2023 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. రాబోయే ఎన్నికల్లో కూడా తన సత్తా చాటుకునేందుకు భూపేష్ భగెల్ సర్వ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రైతులే నిర్ణయాత్మక అంశం అని, వారి సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలు తమకు విజయాన్ని అందిస్తాయనే విశ్వాసాన్ని ప్రకటించారు. అధికార కాంగ్రెస్ 90లో 75 ప్లస్ సీట్లు గెలుచు కుంటుందనే ధీమా వ్యక్తం చేశారు భూపేష్ బఘేల్. సీఎం పటాన్ నుంచి, డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవో అంబికాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. అటు రాష్ట్ర అసెంబ్లీ పోల్స్ కి సంబంధించి మొత్తం 90 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. ఆ క్రమంలో నలుగురు అభ్యర్థులతో కూడిన చివరి జాబితాను బీజేపీ బుధవారం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. A chief minister who is a master of the ‘lattoo’. Chattisgarh CM @bhupeshbaghel is hoping to spin a top around his opponents.. comes across as a down to earth politician. #ElectionsOnMyPlate is back with a new season from next week. We start with the battle for Chattisgarh. 👍 pic.twitter.com/jL5VpanSMB — Rajdeep Sardesai (@sardesairajdeep) October 26, 2023 -
మాట నిలబెట్టుకున్న సీఎం.. టెన్త్, ఇంటర్ టాపర్లకు హెలికాప్టర్ రైడ్
రాయ్‌పూర్: టెన్త్, ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి హెలికాప్టర్ రైడ్ కల్పిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాపర్లుగా నిలిచిన వారిని హెలికాప్టర్లో తనతో పాటు తీసుకెళ్లి గగన విహారం చేయించారు. తొలిసారి హెలికాప్టర్ ఎక్కిన క్రమంలో విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. చాలా సంతోషంగా ఉందని, ఈ రైడ్ ద్వారా ఇతర విద్యార్థుల్లోనూ ఉత్సాహం నింపినట్లవుతుందన్నారు. 10, 12వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10మంది విద్యార్థులను హెలికాప్టర్లో తిప్పుతామని గత మే నెలలో సీఎం భూపేశ్ బఘేల్ హామీ ఇచ్చారు. చదవుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు విద్యార్థుల్ని ప్రోత్సహించేలా ఈ ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీని నెరవేర్చిన సందర్భంగా హెలికాప్టర్ రైడ్‌పై ట్వీట్ చేశారు. ‘చూడండి పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారో. 10, 12వ తరగతి పరీక్షల్లో ఉత్తమంగా రాణించిన వారిని హెలికాప్టర్లో తిప్పుతామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నాం. 125 మంది విద్యార్థులు ఈ హెలికాప్టర్ రైడ్‌ను ఆస్వాదిస్తారు’ అంటూ సీఎం ట్వీట్ చేశారు. మరోవైపు.. విద్యార్థులను ప్రోత్సహించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర మంత్రి ప్రేమ్‌సాయి సింగ్ టెకమ్. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చామని తెలిపారు. #WATCH | Raipur, Chhattisgarh: Toppers of class 12 and class 10 were taken on a helicopter ride by the state govt as was promised by CM Bhupesh Baghel in May pic.twitter.com/gjHu8lGBKS — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 8, 2022 𝗛𝗲𝗹𝗶𝗰𝗼𝗽𝘁𝗲𝗿 𝗥𝗶𝗱𝗲🚁 देखिए, बच्चे कितने खुश हैं! हमने वादा किया था कि 10वीं और 12वीं के टॉपर बच्चों को हम हेलीकॉप्टर राइड कराएँगे। आज इसकी शुरुआत हो गयी है। कक्षा 10वीं और 12वीं के 125 छात्र-छात्राएं लेंगे हेलीकॉप्टर जॉयराइड का आनंद। pic.twitter.com/5c4dbOvTbx — Bhupesh Baghel (@bhupeshbaghel) October 8, 2022 ఇదీ చదవండి: అధ్యక్ష ఎన్నికల్లో చివరి వరకు కొనసాగుతా: శశిథరూర్ -
ఎంత కష్టమొచ్చింది.. పాము కాటుకు గురైన మహిళను మంచంపై అలా..!
రాయ్‌పూర్: దేశంలోని చాలా ప్రాంతాలకు నేటికీ సరైన రోడ్డు మార్గం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాము కాటుకు గురైన ఓ మహిళను మంచంపై నడుములోతు నీటిలో మోసుకెళ్లిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. భారీ వర్షాల కారణంగా స్థానిక వాగు పొంగింది. దీంతో ఆరోగ్య సిబ్బంది గ్రామానికి చేరుకోలేని పరిస్థితి తలెత్తటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ముంగేలి జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన గిరిజన మహిళ పాము కాటుకు గురైంది. అయితే, భారీ వర్షాల కారణంగా వాగు పొంగి ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో చేసేదేమి లేక ఎనిమిది మంది గ్రామస్థులు మహిళను మంచంపై నడుములోతు నీటిలోంచి మోసుకెళ్తూ పక్క గ్రామానికి తీసుకెళ్లి చికిత్స అందించారు. మహిళను మంచంపై తీసుకెళ్తుండగా అదే మంచంపై మరోమహిళ సైతం ఉన్నట్లు చిత్రాల్లో కనిపిస్తోంది. ‘భారీ వర్షాల కారణంగా వాగు పొంగి పక్క గ్రామంలోని ఆరోగ్య సిబ్బంది ఆ గ్రామానికి చేరుకోలేకపోయారు. ఇది ప్రత్యేకమైన కేసు. వాగు పొంగటం వల్ల మహిళను మంచంపై మోసుకొచ్చారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నిబంధనలు, 10-12 కోట్ల రూపాయల బడ్జెట్ కారణంగా వంతెన నిర్మాణం ప్రతిపాదనకు ఆమోదంలో జాప్యం జరుగుతోంది.’ అని తెలిపారు ముంగేలి అదనపు కలెక్టర్ తీర్థరాజ్ అగర్వాల్. Chhattisgarh| Villagers carry tribal woman bitten by a snake on a cot across river to reach hospital in Mungeli district Area is little difficult to reach & a village that has health officials was cut off from there due to heavy rains: Teerthraj Agarwal, Mungeli Addl Collector pic.twitter.com/BXikfRxCCf — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 19, 2022 ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. రహదారిపై వాహనాలను ఢీకొడుతూ వ్యక్తిని లాక్కెళ్లిన కారు -
విహారయాత్రలో విషాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి
రాయ్‌పుర్: వారాంతంలో సరదగా గడిపేందుకు విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. జలపాతంలో పడిపోయి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోరియా జిల్లాలో జరిగినట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన 15 మంది కుటుంబ సభ్యులు కొటడాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రామ్‌దాహా వాటర్‌ఫాల్స్ వద్దకు ఆదివారం పిక్నిక్కు వచ్చినట్లు చెప్పారు. జలపాతం కింద స్నానం చేస్తుండగా అక్కడి నీటిలో ఏడుగురు తప్పిపోయినట్లు ఆదివారం సమాచారం అందిందని అధికారులు తెలిపారు. అందులో ఇద్దరిని రక్షించించి ఆసుపత్రికి తరలించారు. అయితే, అందులో ఒకరు చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆ తర్వాత మరో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. సోమవారం ఉదయం మిగిలిన ముగ్గురు టూరిస్టుల మృతదేహాలను వెలికితీశారు. సోమవారం వెలికి తీసిన మృతులు.. శ్వేత సింగ్(22), శ్రద్ధా సింగ్(14), అభయ్ సింగ్(22)లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. నీటిలోకి దిగి స్నానం చేయకూడదనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ.. టూరిస్టులు స్నానం చేసేందుకు వెళ్లటం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: గుంతలో పడి అదుపుతప్పిన బైక్.. లారీ తొక్కటంతో యువకుడు మృతి! -
నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ పోలీసు.. రోడ్డుపై దొరికిన రూ.45 లక్షలను..!
రాయ్‌పుర్: రోడ్డుపై వెళ్తున్న క్రమంలో రూపాయి దొరికినా కళ్లకు అద్దుకుని జేబులో వేసుకుంటారు. అదే కట్టల కొద్ది డబ్బు దొరికితే ఇంకేమన్నా ఉందా.. గుట్టు చప్పుడు కాకుండా వాటిని స్వాధీనం చేసుకుంటారు. కానీ, కొందరు అలా ఉండరు. తమకు దొరికిన వాటిని ఎంతో నిజాయితీతో తిరిగి ఇచ్చేస్తారు. అలాంటి కోవకే చెందుతారు ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ ట్రాఫిక్ పోలీసు. రోడ్డుపై తనకు రూ.45లక్షలు దొరికితే పోలీసులకు అప్పగించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లోని నవా రాయ్‌పుర్ కయబంధా పోస్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలాంబర్ సిన్హా. మనా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారు జామున రోడ్డుపై ఓ బ్యాగు చూశారు. దానిని తెరిచి చూడగా నోట్ల కట్టలు బయటపడ్డాయి.‘ బ్యాగ్ తెరిచి చూడగా మొత్తం రూ.2వేలు, రూ.500 నోట్ల కట్టలు ఉన్నాయి. సుమారు రూ.45 లక్షలు ఉంటాయి. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు కానిస్టేబుల్. ఆ తర్వాత సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో బ్యాగ్‌ను అప్పగించారు.’ అని అదనపు ఎస్పీ సుఖ్నాందన్ రాథోడ్ తెలిపారు. రివార్డ్ ప్రకటన.. నోట్ల కట్టలతో బ్యాగు దొరికితే తిరిగి తీసుకొచ్చి తన నిజాయితీని చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను అభినందించారు ఉన్నతాధికారులు. రివార్డ్ ప్రకటించారు. బ్యాగు ఎవరిదనే విషయాన్ని తేల్చే పనిలో నిమగ్నమయ్యారు సివిల్ లైన్స్ పోలీసులు. ఇదీ చదవండి: గ్రీన్ సిగ్నల్ ఫర్ ‘టైగర్’.. నిలిచిపోయిన ట్రాఫిక్.. వీడియో వైరల్ -
మరో 4,187 మంది బలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో తొలిసారి కరోనా సంబంధిత మరణాలు 4వేల మార్క్‌ను దాటేశాయి. 24 గంటల్లో 4,187 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. దేశంలో ఒక్క రోజులో ఈ స్థాయిలో మరణించడం ఇదే మొదటిసారి. తాజాగా, కోవిడ్ మృతుల సంఖ్య 2,38,270కు చేరుకుంది. 24 గంటల్లో కర్ణాటకలో మొట్టమొదటి సారిగా 592 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో 898, ఉత్తరప్రదేశ్‌లో 372, ఢిల్లీలో 341, ఛత్తీస్‌గఢ్‌లో 208, తమిళనాడులో 197 మరణాలు అత్యధికంగా నమోదయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజులో 4,01,078 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14 నుంచి మే 7వ తేదీ వరకు దేశంలో 1,09,68,039 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో గతేడాది జనవరి 30 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 14 వరకు 1,09,16,481 కేసులను గుర్తించారు. అంటే గత 82 రోజుల్లో దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య రెట్టింపైంది. మరోవైపు, దేశంలో 24 గంటల్లో 3,18,609 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో మొత్తంగా రికవరీ అయిన వారి సంఖ్య 1,79,30,960కు చేరుకుంది. అదే సమయంలో, దేశంలో యాక్టివ్ కేçసుల సంఖ్య 37,23,446కు పెరిగింది. మొత్తం కేసుల్లో ఇది 17.01%గా ఉంది. ప్రపంచంలో అమెరికా తరువాత భారత్‌లోనే అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 22.17%గా నమోదైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం చేసిన 18,08,344 కరోనా సంక్రమణ టెస్ట్‌లతో కలిపి ఇప్పటివరకు దేశంలో 30 కోట్లకు పైగా టెస్ట్‌లు పూర్తయినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. భువనేశ్వర్‌లో వాహనదారునికి కోవిడ్ టీకా ఇస్తున్న దృశ్యం -
1,31,968 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజురోజుకీ ఉధృతరూపం దాలుస్తోంది. వరసగా మూడోరోజు లక్షకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. గత 24 గంటల్లో 1,31,968 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,30,60,542కి చేరుకుంది. ఇక ఒకే రోజు 780 మంది ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా మొత్త మరణాల సంఖ్య 1,67,642కి చేరుకున్నట్టు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత నెల రోజులుగా వరసగా కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 9,79,608కి చేరుకుంది. మహారాష్ట్రలో అత్యధికంగా 56,286 కేసులు నమోదు కాగా, ఛత్తీస్‌గఢ్‌లో 10,652, ఉత్తరప్రదేశ్‌లో 8,474 కేసులు నమోదయ్యాయి. వారియర్స్‌కి కరోనా కాటు కరోనా వారియర్స్నీ ఆ మహమ్మారి వదలడం లేదు. దేశ రాజధానిలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో వారం రోజుల వ్యవధిలో 22 మంది డాక్టర్లు సహా 32 మంది కరోనా బారిన పడ్డారు. ఏప్రిల్ 1, 9 మధ్య కాలంలో వైద్యులు, సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో 25శాతం మంది కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నవారే. ఢిల్లీలో సర్ గంగా రామ్ ఆస్పత్రిలో 37 మంది వైద్యులకు కరోనా సోకిన మర్నాడే నిమ్స్ వైద్యులకూ కరోనా పాజిటివ్‌గా తేలింది. మహారాష్ట్రలో లాక్డౌన్ తప్పదేమో గత కొద్ది రోజులుగా 50 వేలకు పైగా కేసులతో అల్లాడిపోతున్న మహారాష్ట్రలో లాక్డౌన్ విధించక తప్పని పరిస్థితులు ముంచుకొస్తున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా బాధితులతో ఆస్పత్రుల్లో రద్దీ పెరిగిపోతూ ఉండడంతో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల్ని పెంచడానికి రెండు నుంచి మూడు వారాలు లాక్డౌన్ విధించాల్సి వస్తుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ప్రభుత్వం ఎదుర్కోలేని పక్షంలో పూర్తి స్థాయి లాక్డౌన్ గురించి ఆలోచిస్తామన్నారు. కరోనా రోగులు పెరిగిపోయి, ఆస్పత్రుల్లో పడకలు చాలక, మందులు లేక పరిస్థితులు చెయ్యి దాటిపోతే అప్పుడు లాక్డౌన్ మినహా మార్గం లేదని అన్నారు. ఒమర్ అబ్దుల్లాకు పాజిటివ్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లాకు కరోనా వైరస్ సోకింది. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్లో ఉన్నట్టు శుక్రవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న రెండు రోజుల్లోనే ఆయనకు వైరస్ సోకింది. ఆయన తండ్రి ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. టీకా ఎగుమతులు ఆపండి కోవిడ్–19 టీకా డోసుల ఎగుమతుల్ని వెంటనే నిలిపివేయాలంటూ రాహుల్ గాంధీ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశంలో అవసరమైన అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ సేకరణ, పంపిణీ వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకే ఎక్కువ అధికారాలు కట్టబెట్టాలన్నారు. కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తున్న సమయంలో ప్రభావిత వర్గాలకు నేరుగా ఆర్థిక సాయం అందించాలన్నారు. ‘‘వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి అవసరమైన వనరులు టీకా తయారీ సంస్థలకు సమకూర్చాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే విధంగా ఇక్కడ మన ప్రాణాలను పణంగా పెట్టి వ్యాక్సిన్ డోసుల్ని ఎగుమతి ఎందుకు చేయాలి ? వాటిని వెంటనే నిలిపివేయండి. వ్యాక్సిన్ అవసరమైన వారందరికీ వెంటనే ఇవ్వడం ప్రారంభించండి’’అని రాహుల్ ఆ లేఖలో డిమాండ్ చేశారు. -
పోలీస్ ఫిర్యాదుకు వాట్సాప్ నంబర్..
రాయ్‌పూర్: పోలీసు వ్యవస్థను సామాన్య ప్రజలకు చేరువ చేసేందుకు 'సమాధాన్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు, అందులో భాగంగా సామాన్య ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోని తీసుకొచ్చినట్లు చత్తీస్ఘడ్ డీజీపీ అవస్తి వెల్లడించారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించే విధంగా ఈ వాట్సాప్ నంబర్‌ను ఫిబ్రవరి 1 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాట్సాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను డీజీపీ ఆఫీసు సిబ్బంది స్వయంగా పర్యవేక్షిస్తారని ఆయన వెల్లడించారు. అయితే ఫిర్యాదులను నేరుగా వాట్సాప్ నంబర్‌ను కాకుండా తొలుత సంబంధిత పోలీస్ స్టేషన్లలో నమోదు చేసేందుకు కృషి చేయాలని, అక్కడ సరైన స్పందన లేకుంటే వాట్సాప్ చేయాలని సూచించారు. పల్లెల్లో, మారుమూల ప్రాంతాల్లో స్థానికంగా ఎదురయ్యే ఒత్తిళ్ల కారణంగా కొందరు పోలీసులు ఫిర్యాదులను స్వీకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయని, అటువంటి పరిస్థితుల్లో బాధితులు నేరుగా ఈ నంబర్‌కు వాట్సాప్ చేసి ఫిర్యాదు నమోదు చేయవచ్చని డీజీపీ పేర్కొన్నారు. సామాన్య ప్రజలతో సరిగా వ్యవహరించని పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రంలో పోలీసులు ఈ రకమైన ఆలోచనతో ముందుకు రావడం హర్షనీయమని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. -
అటోమెటిక్ పానీపూరీ: అద్భుతమైన ఆలోచన
రాయ్‌పూర్: పానీ పూరీని ఆస్వాదించే వారికి ఓ తీపికరమైన విషయం. ఇక నుంచి మీరు ఎలాంటి భయం లేకుండా పానీపూరీ తినోచ్చు. కరోనా వల్ల మనుషుల మధ్య దూరం పెరిగడమే కాకుండా తమకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్స్‌కు దూరమయ్యారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తినే స్ట్రీట్ ఫుడ్‌లో పానీపూరి మొదటి స్థానంలో ఉంటుంది. బయటకు వెళితే రోడ్డు పక్కన పానీపూరీ బండిని చూడగానే అక్కడ వాలిపోతారు. ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా ఇష్టంగా తినే ఈ గప్‌చుప్‌ను మహమ్మారి వల్ల తినడానికి భయపడే పరిస్థితి వచ్చింది. దీంతో దీనిపైనే ఆధారపడిన పానీపూరీ వ్యాపారులకు సవాలుగా మారింది. ఓ పానీపూరీ వ్యాపారి వినూత్నంగా ఆలోచించాడు. (చదవండి: పెళ్లికి చీర కట్టుకుంటోంది.. అంతలోనే పాము!) సెన్సార్ ద్వారా గప్‌చుప్‌లో వాడే రుచికరమైన నీరు అటోమెటిక్ వచ్చేలా మిషన్‌ను తయారు చేసి చత్తీష్ గడ్‌లో గప్‌చుప్ విక్రయిస్తున్న వీడియోను ఓ ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ మంగళవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో పూదిన, వెల్లుల్లి నీరు, కట్టామిట్టా సెన్సార్ ద్వారా గప్‌చుప్‌లో పడుతున్న ఈ మీషిన్కు సదరు వ్యాపారి ‘టచ్ మీ నాట్ పానీపూరీ’ అనే పేరుతో విక్రయిస్తున్నాడు. దీనిని ఆ ఐఏఎస్ అధికారి ‘రాయ్‌పూర్‌లో ఆటోమేటిక్ పానిపురి.. అద్భుతం జుగాద్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. ఈ వీడియో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 24 వేలకు పైగా లైకులు వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఇది చూసిన గప్‌చుప్ ప్రియులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘ఖచ్చితంగా ఈ పానీపూరి బండిని సందర్శిస్తాను’, ‘అద్భుతమైన ఆలోచన’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: డ్రగ్స్‌కు బానిసగా మారాను: కంగనా) तेलीबांधा रायपुर का ऑटोमैटिक पानीपुरी वाला. ग़ज़ब का जुगाड़.👍👌 pic.twitter.com/rbEIwFe24l — Awanish Sharan (@AwanishSharan) September 15, 2020 -
నిషా జిందాల్ పేరుతో ఫేస్బుక్లో..
సాక్షి, రాయ్‌పుర్: సోషల్ మీడియాలో నకిలీ ఫేస్బుక్ ఖాతాను కొనసాగిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాలు.. రాయ్‌పుర్‌కు చెందిన రవి అనే వ్యక్తి ‘నిషా జిందాల్’ అనే అమ్మాయి పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ అకౌంట్‌కు ప్రస్తుతం పదివేల మందికిపైనే ఫాలోవర్స్ ఉన్నారు. కాగా నిషా జిందాల్ అకౌంట్‌పై అనుమానం వచ్చిన పోలీసలు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఇంజనీరింగ్ చదువుతున్న రవి ఇతర సోషల్ మీడియా వెబ్సైట్లలో కూడా నకిలీ ఖాతాలను నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (యుద్ధభూమిలో ఉన్నాం.. : రష్మిక) ఇక గత 11 సంవత్సరాల నుంచి నిందితుడు ఇంజనీరింగ్ కూడా పాస్ అవ్వలేదని ఐఎస్ అధికారి ప్రియాంక శుక్లా వెల్లడించారు. కాగా నకిలీ ఫేస్బుక్ ఖాతాను కొనసాగిస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులను ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ ప్రశంసించారు. ‘ఎటువంటి మోసమైనా పోలీసుల నుంచి తప్పించుకోదు. తప్పుదారి పట్టించాలనుకునే వారందరినీ బయటపెడతాం. రాయ్‌పూర్ పోలీసులు మంచి పని చేశారు’. అంటూ ట్వీట్ చేశారు. (సందీప్ ఛాలెంజ్ స్వీకరించిన రాజమౌళి) No fraud will be spared. Let us reveal all those element who wish to mislead. Good job @RaipurPoliceCG https://t.co/LYqCes5Iel — Bhupesh Baghel (@bhupeshbaghel) April 19, 2020 -
దంతెవాడలో హోరాహోరీ కాల్పులు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా కట్టెకళ్యాన్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆదివారం నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమచారం అందడంతో ప్రత్యేక బలగాలతో అటవీ ప్రాంతాన్ని మోహరించారు. ఈ సమయంలో మావోయిస్టులు ఎదురుపడడంతో వారిద్దరి మధ్య హోరాహోరీ ఎదురుకాల్పుల చోటుచేసుకున్నాయి. ఈ విషాయాన్ని కట్టెకళ్యాన్ ఎస్పీ సూరజ్ సిన్హా ధృవీకరించారు. కాగా వారోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున మావోయిస్టులు ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మావోయిస్టుల చేతిలో పాక్ ఆయుధాలు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని ముర్నార్ అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ఇద్దరు మావోయిస్టులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు.. వారి వద్ద నుంచి కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ ఆయుధాల్లో నాటో, పాకిస్తాన్ ఆర్మీ ఉపయోగించే ఆధునాతనమైన హెక్లెర్, కోచ్ జీ3 రైఫిల్లు ఉండటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇవి వీరికి ఎలా చేరాయి..? మావోస్టులు, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధం ఎంటీ..? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై డీఎమ్ అవస్తి మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ ఆర్మీ ఉపయోగించే జీ 3 రైఫిల్‌ను మేము స్వాధీనం చేసుకున్నాం. ఇలా మరో దేశం ఉపయోగించే ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం ఇది రెండోసారి. గతంలో కూడా మావోయిస్టుల వద్ద పాక్‌కు చెందిన ఆయుధాలు లభ్యమయ్యాయి. కాని అవి ఎక్కడి నుంచి వచ్చాయో మాత్రం తెలీలేదు’’ అని పేర్కొన్నారు. కాగా 2018 సంవత్సరంలో జరిగిన ఓ ఎన్కౌంటర్లో మావోల నుంచి జర్మన్లో తయారైన రైఫిల్, అమెరికాలో తయారైన సబ్- మెషిన్ గన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు విదేశాల్లో తయారైన టెలిస్కోప్‌లను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. -
‘మోదీకి మానసిక వైద్యం ఎంతో అవసరం’
రాయ్‌పూర్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నంబర్ వన్ అవినీతి పరుడు అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే చెలరేగుతోంది. మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ స్పందిస్తూ.. మోదీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా నిద్రలేకపోవడం మూలంగా మోదీకి మతిభ్రమించిందని, వెంటనే ఆయన్ని మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాలని బాఘేల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ రోజుకు మూడు, నాలుగు గంటలే నిద్రపోతున్నారని అందుకే ఆయనకు ఆ పరిస్థితి ఏర్పడిందన్నారు. కాగా మోదీపై కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తున్న భూపేష్ బాఘేల్.. తన మాటల యుద్ధాన్ని కొనసాగిస్తునే ఉన్నారు. సరిగా నిద్రపోనివారు మానసిక అనారోగ్యానికి గురవుతుంటారని, మోదీకి కూడా అలాంటి జబ్బే వచ్చిందని పేర్కొన్నారు. మోదీని మంచి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. రాజీవ్ గాంధీ చనిపోయి చాలా ఏళ్లైందని.. ఆయన గురించి ఇప్పుడు మాట్లాడటమేంటని బాఘెల్ ప్రశ్నించారు. రాజీవ్ హయాంలో ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను మోదీ మర్చిపోవడం దారుణమన్నారు. ఆయన పాలనలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలను తీసుకున్నారని గుర్తుచేశారు. కాగా మే 4న ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో నరేంద్రమోదీ మాట్లాడుతూ ‘‘ రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్‌గా దేశ రాజకీయాల్లో వచ్చారు. కానీ నంబర్ వన్ అవినీతి పరుడిగా జీవితం ముగించారు’’ అని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
ఛత్తీస్‌లో ఎస్‌యూవీని పేల్చిన నక్సల్స్
చర్ల/బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ ఓ పౌరుడి కారును పేల్చేశారు. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. బీజాపూర్ జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. పెద్దకోడెపాల్ గ్రామ సమీపంలో ఉదయం 7.45 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. దంతెవాడ జిల్లాలో జరుగుతున్న ఓ తిరునాలకు ఎస్‌యూవీలో వెళ్తుండగా నక్సల్స్ దానిని పేల్చేశారు. బీజాపూర్ సూపరింటెండెంట్ గోవర్ధన్ రామ్ ఈ వివరాలను వెల్లడించారు. -
కుర్చీ వెనుక కహాని!
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా భూపేశ్ బఘేల్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక్క రోజు ముందు వరకు రాజకీయం రోజుకో రంగు మారింది. సీఎం కుర్చీకోసం భూపేశ్ బఘేల్, టీఎస్ సింగ్‌దేవ్, తామ్రధ్వజ్ సాహు, చరణ్‌దాస్ మహంత్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. చరణ్‌దాస్ మహంత్ ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అంతగా కష్టపడిందేమీ లేదన్న భావన అందరిలోనూ ఉంది. దీంతో ఆయన మొదట్లోనే సీఎం రేసు నుంచి తప్పుకున్నారు. తామ్రధ్వజ్ సాహుకు జనాకర్షణ అంతగా లేకపోవడం ఆయనకు మైనస్‌గా మారింది. ఇక మిగిలింది భూపేశ్ బఘేల్, సింగ్‌దేవ్. వీరిద్దరూ సీఎం పదవి కోసం కాంగ్రెస్ అధిష్టానం వద్ద గట్టిప్రయత్నాలే చేశారు. ఇద్దరికీ చెరి రెండున్నరేళ్లు ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ భావించారు. రాజీ కుదరకపోతే సాహును సీఎంను చేయాలని రాహుల్ భావించారు. ఈ విషయాన్ని పార్టీలో అంతర్గతంగా ప్రకటించారు. కానీ, ప్రజాప్రతినిధుల మనసులో ఏముందో తెలుసుకోవాలనుకున్న రాహుల్ సమస్య పరిష్కారానికి సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేని రంగంలోకి దించారు. పార్టీకి చెందిన మొత్తం 68 మంది ఎమ్మెల్యేలతో ఖర్గే విడివిడిగా మాట్లాడారు. శక్తి యాప్ ద్వారా కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. ఖర్గే చేసిన కసరత్తులో సింగ్‌దేవ్‌కే భారీగా మద్దతు లభించింది. దీంతో, ఛత్తీస్‌గఢ్ కాబోయే సీఎం సింగ్‌దేవ్ అన్న ప్రచారం ఒక రోజంతా సాగింది. తన నివేదికతో మల్లికార్జున ఖర్గే ఢిల్లీ వెళ్లి రాహుల్‌ను కలుసుకున్నారు. అక్కడ మళ్లీ సీన్ మారిపోయింది. ఓబీసీ కార్డు బఘేల్‌కు అనుకూలంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్‌కు కారణం ఓబీసీల ఓట్లే. మరో అయిదు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు కూడా ఉండటంతో ఓబీసీ నాయకుడినే సీఎంను చేయాలని పార్టీ ప్రధానకార్యదర్శి పీఎల్ పూనియా వంటి నేతలు రాహుల్‌కి సలహా ఇచ్చారు. దీంతో సింగ్‌దేవ్ స్థానంలో బఘేల్ పేరు చేరింది. సీఎం కుర్చీలో బఘేల్ ఎంత కాలం ఉంటారన్నది అనుమానమే. బఘేల్, సింగ్‌దేవ్‌లను చెరో రెండున్నరేళ్లు సీఎంగా చేయడానికే రాహుల్ నిర్ణయానికి వచ్చారని, లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున మొదటి ప్రాధాన్యం బఘేల్‌కు ఇచ్చారని సమాచారం. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ఎన్నికల హామీల అమలు, ప్రభుత్వ పనితీరు వంటివాటి ఆధారంగానే కాంగ్రెస్ అధిష్టానం భవిష్యత్తులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఎమ్మెల్యేల అండదండలు, కార్యకర్తల మద్దతు సింగ్‌దేవ్‌కే ఉన్నప్పటికీ ఓబీసీ కార్డు బఘేల్‌ను సీఎం పీఠానికి దగ్గర చేసింది. -
రాహుల్ బాబా ఆ లెక్కలు మీకెందుకు..
సాక్షి, రాయపూర్ : మోదీ నాలుగేళ్ల పాలనపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా టార్గెట్ చేశారు. తమ ప్రభుత్వ నాలుగేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో రాహల్ విమర్శలను షా తోసిపుచ్చారు. త్వరలో ఎన్నికలు జరగనున్న చత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం భారీ ర్యాలీతో ఆయన ప్రారంభించారు. ‘రాహుల్ బాబా.. నాలుగేళ్ల మోదీ సర్కార్ లెక్కల గురించి మీరు ప్రశ్నిస్తున్నారు..మీకు మేం సమాధానాలు ఇవ్వం..ఖర్చు పెట్టిన ప్రతిపైసాకూ లెక్కలను ప్రజలకు వివరిస్తా’ మని అమిత్ షా అన్నారు. ప్రజలను ఓట్లు కోరేందుకు కలిసే క్రమంలో అన్నింటినీ వారి ముందుంచుతామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాలనలో దేశం 55 ఏళ్లుగా అభివృద్దిలో వెనుకబడిందని ఆరోపించారు. మీ కుటుంబం నాలుగు తరాల పాటు 55 సంవత్సరాలు దేశాన్ని పాలించినా అభివృద్దికి నోచుకోలేదని రాహుల్‌ను ఉద్దేశించి షా ప్రశ్నించారు. చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, 90 అసెంబ్లీ స్దానాలున్న అసెంబ్లీలో తాము 65 సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేవారు. రమణ్ సింగ్ నేతృత్వంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. -
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల పంజా
-
సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్
రాయ్‌పూర్ : రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలోనూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తిరిగి విజయాన్ని సాధిస్తుందని ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ ధీమా వ్యక్తం చేశారు. రాయ్‌పూర్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడిన సీఎం పలు అంశాలను ప్రస్తావించారు. గడిచిన పదేళ్లల్లో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యాక్రమాలు చేపట్టామని, తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని రమణ్ సింగ్ అన్నారు. గడిచిన ఐదేళ్లల్లో దేశంలో బీజేపీ అనేక సంస్కరణలను తీసుకువచ్చిందని చెప్పారు. ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యాక్రమాలు చేపట్టామని కేంద్రంలో కూడా తదుపరి ప్రభుత్వాన్ని బీజేపీయే ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలకు విశేష స్పందన వస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రంలో కరెంట్, మంచినీరు, విద్య, రోడ్డు రవాణా సౌకర్యాలను మెరుగుపరిచామని తెలిపారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 11 స్థానాల్లో 10 స్థానాలు తమ పార్టీ విజయం సాధించిందని అవే ఫలితాలు పునరావృతం అవుతాయన్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాల ఓటమిపై సీఎం స్పందిస్తూ.. ప్రజల ఆలోచనలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవని, ఉప ఎన్నికల ఫలితాలు 2019 లోక్‌సభ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపవని సీఎం పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో బీజేపి ప్రభుత్వాలు తప్పక ఏర్పాటు చేస్తుందని రమణ్‌సింగ్ ధీమా వ్యక్తం చేశారు. -
తడపలగుట్టల్లో భారీ ఎన్కౌంటర్
-
కోడి పెట్టిన చిచ్చు
-
ఛత్తీస్‌గఢ్‌లో మావోల దుశ్చర్య
- రూ. 5 కోట్ల ఆస్తి నష్టం ఛత్తీస్‌గఢ్: చత్తీస్‌గఢ్‌లోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. జిల్లాలోని సిరోంచ తాలూకా రోంపల్లి అటవీ శాఖకు చెందిన కలప డిపోకు ఆదివారం రాత్రి మావోయిస్టులు నిప్పుపెట్టారు. దీంతో సుమారు రూ. 5 కోట్ల విలువైన కలప కాలి బూడిదైంది. మావోయిస్టులు సోమవారం బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బంద్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీగా మావోయిస్టుల పోస్టుర్లు వెలిసాయి. మావోల బంద్ నేపథ్యంలో ఖమ్మం జిల్లా చర్లలో వ్యాపారులు దుకాణాలు మూసి వేశారు. -
మృతిచెందిన మహిళా మావోయిస్టు గుర్తింపు
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రెండు రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన మహిళా మావోయిస్టును గుర్తించారు. ఛత్తీసగఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా అడవుల్లో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఒక మహిళా మావోయిస్టు మృతిచెందింది. మృతురాలిని బీజాపూర్జిల్లా ఊసూరు బ్లాక్ పరిధిలో ఉడతపల్లి గ్రామస్తురాలు కుంజా అడిమె(26)గా పోలీసులు గుర్తించారు. ఈమె తండ్రి పేరు దేవా అని, ఏడేళ్లుగా మావోయిస్టు దళంలో పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏరియా కార్యదర్శి పాపారావు ఆధ్వర్యంలో పనిచేస్తున్నదన్నారు.