అటోమెటిక్‌ పానీపూరీ: అద్భుతమైన ఆలోచన | Touch Me Not Automatic Pani Puri Machine Video Goes Viral | Sakshi
Sakshi News home page

వైరల్‌: ‘టచ్‌ మీ నాట్‌ పానీపూరీ’

Published Wed, Sep 16 2020 3:38 PM | Last Updated on Wed, Sep 16 2020 3:47 PM

Touch Me Not Automatic Pani Puri Machine Video Goes Viral - Sakshi

రాయ్‌పూర్‌: పానీ పూరీని ఆస్వాదించే  వారికి ఓ తీపికరమైన విషయం. ఇక నుంచి మీరు ఎలాంటి భయం లేకుండా పానీపూరీ తినోచ్చు. కరోనా వల్ల మనుషుల మధ్య దూరం పెరిగడమే కాకుండా తమకు ఇష్టమైన స్ట్రీట్‌ ఫుడ్స్‌కు దూరమయ్యా​​​రు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తినే స్ట్రీట్‌ ఫుడ్‌లో పానీపూరి మొదటి స్థానంలో ఉంటుంది. బయటకు వెళితే రోడ్డు పక్కన పానీపూరీ బండిని చూడగానే అక్కడ వాలిపోతారు. ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా ఇష్టంగా తినే ఈ గప్‌చుప్‌ను మహమ్మారి వల్ల తినడానికి భయపడే పరిస్థితి వచ్చింది. దీంతో దీనిపైనే‍ ఆధారపడిన పానీపూరీ ​వ్యాపారులకు సవాలుగా మారింది. ఓ పానీపూరీ వ్యాపారి వినూత్నంగా ఆలోచించాడు. (చదవండి: పెళ్లికి చీర కట్టుకుంటోంది.. అంతలోనే పాము!)

సెన్సార్‌ ద్వారా గప్‌చుప్‌లో వాడే రుచికరమైన నీరు అటోమెటిక్‌ వచ్చేలా మిషన్‌ను తయారు చేసి చత్తీష్‌ గడ్‌లో గప్‌చుప్‌ విక్రయిస్తున్న వీడియోను  ఓ ఐఏఎస్‌ అధికారి అవనీష్‌ శరణ్‌ మంగళవారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ వీడియోలో పూదిన, వెల్లుల్లి నీరు, కట్టామిట్టా సెన్సార్‌ ద్వారా గప్‌చుప్‌లో పడుతున్న ఈ మీషిన్‌కు సదరు వ్యాపారి ‘టచ్‌ మీ నాట్‌ పానీపూరీ’ అనే పేరుతో విక్రయిస్తున్నాడు. దీనిని ఆ ఐఏఎస్‌ అధికారి ‘రాయ్‌పూర్‌లో ఆటోమేటిక్ పానిపురి.. అద్భుతం జుగాద్’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేశారు. ఈ వీడియో షేర్‌ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 24 వేలకు పైగా లైకులు వందల్లో కామెంట్స్‌ వచ్చాయి. ఇది చూసిన గప్‌చుప్‌ ప్రియులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  ‘ఖచ్చితంగా ఈ పానీపూరి బండిని సందర్శిస్తాను’, ‘అద్భుతమైన ఆలోచన’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.
(చదవండి: డ్ర‌గ్స్‌కు బానిస‌గా మారాను: కంగనా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement