panipuri vendor
-
పానీ పూరీ ప్రియులకు ఇక పూనకాలే.. వైరల్ వీడియో
పానీ పూరీ అంటేనే చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఇష్టంగా లొట్టలేసుకుంటూ తింటారు. దాని గురించి ఎన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసినా, పానీ పూరీకున్న క్రేజ్ముందు అవన్నీ దిగదిడుపే. అందుకే దుకాణదారులు కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా వెరైటీ పానీపూరీ వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. బంగారం, సిల్వర్ రంగుల్లో పానీపూరీలు తెగ వైరల్అవుతున్నాయి. ఫుడ్ హ్యాండిల్ అనే ఇన్‌స్టా ఖాతా వివరాల ప్రకారం పూరీలపై బంగారు , వెండి రేకులను పూయడం ఇందులో చూడొచ్చు. బెంగళూరుకు చెందిన ఒక వ్యాపారి ఈ సరికొత్త పానీపూరీలను అమ్ముతున్నాడు. గోల్డ్, సిల్వర్ పూతతో పానీపూరీలను విక్రయిస్తున్నాడు. అంతేకాదు ఆ పానీపూరీల్లో డ్రైఫ్రూట్స్, తేనె కూడా జోడిస్తున్నాడు. వీటిని బంగారు రంగు ప్లేట్లోనే పెట్టి అందిస్తుండటం మరో విశేషం. దీన్ని షారియత్ అంటారట. దేశంలోఇదే తొలి హైజీనిక్ పానీ పూరీ అట. ఇప్పటికే 20 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.కొందరు ఆ వ్యాపారి క్రియేటివిటీని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ఇది ‘‘ బప్పి లాహిరి పానీ పూరి అని పిలవాలి అని ఒకరు వ్యాఖ్యానించగా, దీని పేరును కూడా మార్చండి” బ్రో అని మరొక నెటిజన్ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Khushbu Parmar | Manan | CTT (@cherishing_the_taste_) -
డేంజర్.. వర్షకాలంలో రోజూ పానీపూరీ తింటున్నారా?
పానీపూరి అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాధారణంగానే సాయంత్రం కాగానే వీధి చివర్లోని పానీపూరీ బండి వద్ద గుమిగూడుతుంటారు. ఇక మరీ ముఖ్యంగా వర్షాకాలంలో పానీపూరి క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు.కాస్త చినుకులు పడగానే పానీపూరీల కోసం జనాలు ఎగబడతారు. అయితే వర్షాకాలంలో పానీపూరీ తినడం డేంజర్ అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. పానీపూరీ అంటే ఆహా ఓహో అంటూ లొట్టలు వేసుకొని తినేవాళ్లు చాలామందే ఉంటారు. తినేటప్పుడు అది ఎలా తయరుచేశారో, ఆ తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యల గురించి ఏమాత్రం ఆలోచించరు. అయితే ఇలా అడ్డగోలుగా ఎక్కడపడితే అక్కడ పానీపూరీ తింటే మాత్రం రోగాల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పానీపూరీలు అమ్మే స్థలం పరిశ్రుభంగా లేకపోయినా, తయారు చేసే వ్యక్తికి ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా అవి మీకు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో పానీపూరీలు తినాలనుకుంటే మాత్రం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. లేదంటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అపరిశుభ్రమైన నీళ్లు తాగడం వల్ల టైఫాయిడ్, ఉదర సంబంధిత వ్యాధులకు గురవుతారు. ► పానీపూరీకి ఉపయోగించే నూనె మంచిది కాకపోతే డేంజరే. ఎందుకంటే స్ట్రీట్ వెండర్స్ చాలావరకు ఒకసారి వాడిన నూనెను మళ్లీమళ్లీ ఉపయోగిస్తుంటారు. ఇలా నూనెను ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ► పానీపూరీలో పాన్ మసాలా కలుపుతారు అన్న విషయంలో చాలా మందికి తెలియదు. ఇది క్యాన్సర్‌కు కారకం అవుతుంది. ► పానీపూరీలో సోడియం ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజూ తినడం వల్ల ఉదర సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. ► వీటితో పాటు అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. ఇది కేవలం పానీపూరీకే వర్తించదు. అన్ని రకాల స్ట్రీట్ ఫుడ్స్, పరిశ్రుభత పాటించని హోటళ్లు చాలానే ఉన్నాయి. వీటివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే బయటి ఫుడ్‌కు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు నిపుణులు. -
బీటెక్ అమ్మాయి.. బుల్లెట్‌పై హైజీనిక్ పానీపూరి
ఈ మధ్య చదువులకు, చేసే పనికి సంబంధం ఉండటం లేదు. డిగ్రీలున్నా ఉద్యోగ అవకాశాలు లేక కొందరు చిరు వ్యాపారాలతో స్వయం ఉపాధి చూసుకుంటుంటే మరికొందరు మాత్రం డిగ్రీ చేసినా ప్రత్యేకమైన లక్ష్యంతో చిరువ్యాపారాల బాట పడుతున్నారు. 21 ఏళ్ల తాప్సీ ఉపాధ్యాయ్.. బీటెక్ పానీపూరి వాలీగా ప్రసిద్ధి చెందారు. బుల్లెట్ బండికి ఏర్పాటు చేసుకున్న చిన్న బండిపై ఆమె పానీపూరీలను విక్రయిస్తున్నారు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఆమె ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతోనే తాను ఈ వ్యాపారాన్ని ప్రారంభినట్లు తాప్సీ చెబుతున్నారు. (జీవితాంతం ఒంటరిగానే ఉంటా కానీ! హోలీ యాడ్‌పై దుమారం: అసలేమైంది?) ఇదీ చదవండి: టాప్ సీక్రెట్ చెప్పిన గూగుల్ మాజీ వైస్ ప్రెసిడెంట్... ఇది ఉంటే జాబ్ పక్కా! View this post on Instagram A post shared by Are you hungry (@are_you_hungry007) తాజాగా ఆమె బుల్లెట్ వాహనానికి పానీపూరి బండిని కట్టుకుని తీసుకెళ్తున్న వీడియోను ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. అంత చదువు చదువుకుని ఇలా పానీపూరీ అమ్ముకుంటున్నావేంటి అని చాలా మంది ప్రశ్నించారని, కొందరైతే భద్రంగా ఉండాలంటే ఇంటికి తిరిగి వెళ్లాలని సలహా ఇచ్చారని తాప్సీ చెప్పారు. ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి దాదాపు మూడు లక్షల లైక్‌లు వచ్చాయి. ఆ యువతి స్ఫూర్తిని అభినందిస్తూ పలువురు కామెంట్లు పెట్టారు. -
ఉన్న ఊరిని... వ్యవసాయాన్ని వదిలి
వరుణుడు కరుణించలే.. నమ్ముకున్న భూమాత గుప్పెడు గింజలివ్వలే...ఉన్న ఊరు జానెడు పొట్టను నింపలే... చేసేదేమీ లేక పొట్ట చేత పట్టుకుని అయిన వారినంతా వదిలి బతుకు జీవుడా అంటూ వలసి వచ్చారు. ఊరుగాని ఊరులో తెలియని వ్యక్తుల మధ్య కొత్త జీవితానికి నాంది పలికారు. నేడు నలుగురు మెచ్చే స్థాయికి ఎదిగారు. మెరుగైన జీవనంతోపాటు నాలుగు కాసులు వెనకేసుకుంటూ కన్నబిడ్డలను తమలాగా కాకుండా నాలుగు అక్షరం ముక్కలను నేర్పించుకుంటూ జీవనయానం సాగిస్తున్నారు. కడప ఎడ్యుకేషన్: అన్నమయ్య జిల్లా మదనపల్లె, తంబళ్లపల్లె నియోజక వర్గాల పరిధిలోని 50 గ్రామాలకు చెందిన దాదాపు వెయ్యి కుటుంబాల వారు పానీ పూరి బండ్లే జీవనోపాధిగా ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరంతా గత 18 ఏళ్లకు పైగా కడపతోపాటు జిల్లాలో పలు నియోజకవర్గ, మండల కేంద్రాలలో పానీపూరీ బండ్లను ఏర్పాటు చేసుకుని స్థిర జీవనాన్ని సాగిస్తున్నారు. నీటి వసతి లేక ఉన్న ఊరిని వదిలి... మదనపల్లె, తంబళ్లపల్లె నియోజక వర్గ పరిధిలో దండోరుపల్లె, కురువపల్లె, రెడ్డింపల్లె, బాటవారికురువపల్లె, అమరేపల్లె, వాయల్పాడు, సీటీఎం, బి. కొత్తకోట, పెద్దతిప్ప సముద్రంతోపాటు దాదాపు 50 గ్రామాల పరిధిలో రైతులందరూ వ్యవసాయమే జీవనోపాధిగా జీవనం సాగించేవారు. ప్రతి రైతు రెండు నుంచి ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న ఆసాములే. అయితే రానురాను సకాలంలో వర్షాలు లేక, సరైన నీటి వసతి లేక.. పంటలు పండక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. దీంతో చేసేదేమీ లేక వలసలు పోవాల్సి వచ్చేది. ఈ తరహాలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 20 ఏళ్ల క్రితం కడపకు వలసి వచ్చి పానీపూరీ బండితో జీవనాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత అతని బంధువులు ఇలా ఒక్కొక్కరికిగా ఎవరి అçనుకూలమై స్థావరానికి వారు వెళ్లి పానీపూరీ బండ్లను ఏర్పాటు చేసుకుని బతుకు వెళ్లదీస్తున్నారు. ఇలా వలస వచ్చిన వారే వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా దాదాపు వెయ్యి కుటుంబాల వారున్నారు. ఉదయమంతా పానీపూరి తయారీ... సాయంత్రం బండ్ల నిర్వహణ... వలస వచ్చిన వారంతా ఉదయాన్నే పానీపూరి నిర్వహణకు కావాల్సిన కూరగాయలు, సరకులు మార్కెట్ నుంచి తెచ్చుకుని పూరీలు, పానీ, మసాలాలతోపాటు కావాల్సిన వస్తువులన్నీ వారే సొంతంగా సిద్ధం చేసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి నగరంలోని ప్రధాన కూడళ్లలో వారు వారు ఎంచుకున్న స్థావరాల్లో బండ్లను ఏర్పాటు చేసుకుని వ్యాపారాన్ని సాగిస్తారు. రాత్రి 9 గంటలకంతా వ్యాపారాన్ని ముగించుకుని ఇళ్లకు చేరిపోతారు. కూలీ, ఖర్చులు పోను ఇలా ఒక్కో బండిపైన రోజుకు వెయ్యి నుంచి 15 వందల రూపాయల వరకు ఆదాయం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అంతా ఒకే కులానికి చెందిన వారే... వలస వచ్చిన వారిలో ప్రత్యేకతేంటంటే వేరే వేరే ఊళ్లకు చెందిన వారైనా సరే అంతా ఒకే కులానికి చెందిన వారు కావడం విశేషం. పానీపూరి బండి నిర్వహణ ను ప్రధాన వృత్తిగా మలుచుకుని జీవిస్తున్నారు. 18 ఏళ్ల క్రితం పొట్ట చేతపట్టుకుని... నాపేరు కొల్లె రమణయ్య. మాది దండువారిపల్లె గ్రామం. నాకు మా గ్రామంలో రెండు ఎకరాల పొలం ఉండేది. ఆ పొలం వర్షాధారంతోనే పండేది. వర్షాలు సరిగా రాకపోవడంతో ఉన్న పొలం పండక బీడుగా ఉండేది. జీవనం కష్టం కావడంతో చేసేదేమీ లేక 18 క్రితం పొట్ట చేతపట్టుకుని కడపకు వలస వచ్చాను. అప్పట్లో పానీ పూరి బండిని ఏర్పాటు చేసుకుని ప్లేటు పానీపూరి రూపాయితో వ్యాపారాన్ని మొదలు పెట్టాను. తరువాత నా కుమారులు ఇద్దరితో కూడా ఇదే వ్యాపారాన్ని పెట్టించాను. ఇప్పుడు జీవనం బాగానే ఉంది. ఉన్న ఊరిలో బతకలేక... నా పేరు తొల్లగోర్ల శ్రీరాములు. మాది బి.కొత్తకోట మండలం రాపూరివారిపల్లె. నాకు మా గ్రామంలో 3 ఎకరాల పొలం ఉంది. కానీ నీటి వసతి లేదు. వర్షం వస్తే పంటలు పండాలి లేదంటే ఎండాలి. ఈ తరుణంలో మా బంధువులు పానీపూరీ బండి పెట్టుకుని జీవనం సాగించేవారు. వారి ద్వారా నేను 18 ఏళ్ల క్రితం కడపకు వచ్చి పానీపూరి బండి వ్యాపారాన్ని ప్రారంభించాను. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు పడ్డా రానురాను మెరుగుపడి దేవుడి దయవల్ల బాగానే ఉన్నాను. నా ముగ్గురు పిల్లలను నాలా కాకుండా బాగా చదివించుకుంటున్నాను. కాంట్రాక్టు ఉద్యోగాన్ని వదిలేసి... నాపేరు రేషమ్ మహేష్. మాది అంగళ్లు గ్రామం. నేను చదువు ముగించుకుని హైదరాబాదులో ఏపీ ట్రాన్స్ కోలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. అప్పటో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ట్రాన్స్‌కోలో కాంట్రాక్టు కింద ఉద్యోగం చేసేవారందరిని తొలగించారు. దీంతో చేసేదేమీ లేక మా బంధువుల ద్వారా కడపకు వచ్చాను. అప్పటి నుంచి పానీ పూరి బండి ఏర్పాటు చేసుకుని జీవనం ప్రారంభించాను. 3 ఎకరాల పొలం ఉన్నా ... నాపేరు గంట్ల నారాయణమ్మ, మాది దండువారిపల్లె. మాకు 3 ఎకరాల పొలం ఉండేది. నీటి వసతి లేని కారణంగా పంటలను సకాలంలో సాగు చేసుకోలేక పోయేవాళ్లం. వర్షం వచ్చినప్పుడు పంటలను సాగు చేస్తాము. తరువాత సకాలంలో వర్షం వచ్చి అన్ని అనుకూలిస్తే పంట చేతి కొస్తే వస్తుంది లేదంటే పోతుంది. ఇలా కొన్నేళ్లపాటు పోరాటం చేశాం. అయినా ఏం లాభం ఉండేదికాదు. దీంతో మా కుమారుడిని తీసుకుని కడపకు వచ్చి పానీపూరి బండి ఏర్పాటు చేసుకుని ప్లేటు రూ.3తో వ్యాపారం ప్రారంభించాను. ప్రస్తుతం ప్లేటు రూ. 20కి అమ్ముతున్నాం. -
కూతురు పుట్టిందని.. పానీపూరి వ్యాపారి గొప్పతనం
సమాజంలో లింగ వివక్ష కొనసాగుతూనే ఉంది. తల్లి కడుపులో పెరుగుతుంది ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్ చేయించేవాళ్లు నేటికి లేకపోలేదు. స్త్రీ పురుష సమానత్వం కోసం ఎంత పోరాడినా ఆశించిన స్థాయిలో ఫలితాలు అందండం లేదు. అయితే ఇందుకు భిన్నంగా కూతురు పుట్టినందుకు ఓ వ్యక్తి తెగ సంబరపడిపోయాడు. ఆడపిల్లను మహాలక్ష్మిలా భావించి సంతోషంతో వేల రూపాయలు ఖర్చు చేశాడు. వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని కోలార్కి చెందిన అంచల్ గుప్తా అనే పానీ పూరి వ్యాపారికి ఆగస్టు 17న కూతురు పుట్టింది. ఆడపిల్లలతోనే భవిష్యత్తు బాగుంటుందని నమ్మే అంచల్‌కు కూతురు పుట్టిందన్న విషయం తెలియడంతో ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాడు. గుర్తుగా ఏమైనా చేయాలనుకున్నాడు. దీంతో ఆదివారం కోలార్ పట్టణంలో రూ.50వేల ఖర్చు చేసి స్థానికులందరికీ ఉచితంగా పానీపూరి అందించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాకు ఆడపిల్ల పుట్టడం ఒక కల. నేను వివాహం చేసుకున్నప్పటి నుంచి నాకు అమ్మాయే పుట్టాలని కోరుకున్నా. కానీ మొదటి సంతానంలో రెండేళ్ల క్రితం కొడుకు జన్మించాడు. అయితే అదృష్టం బాగుండి ఈ ఆగష్టు 17న కూతురు జన్మించింది. నిన్న నా కొడుకు రెండవ పుట్టినరోజు. ఈ సమయంలోనే నాకు కుమార్తె జన్మించిందని ప్రకటిస్తూ భోపాల్ ప్రజలకు ఉచిత పానీ పూరీని అందించాలని నిర్ణయించుకున్నాను. చదవండి: వైరల్: కిమ్ జోంగ్ హెయిర్ కట్ కావాలి.. చివరికి ఏమైందంటే! అంతేగాక వారికి అమ్మాయిలు ఉంటేనే భవిష్యత్తు ఉంటుందనేనే సందేశాన్ని ఇవ్వాలనుకున్నాను. నాకు చేతనైనంతలో ఏం చేద్దామని ఆలోచించి.. చివరకు ఉచిత పానీపురి పంపిణీ చేయాలనుకున్నాను. తద్వారా సమాజంలో ఆడపిల్లలు, మగపిల్లలు ఇరువురు సమానమేనని.. వివక్షకు తావు లేదని చెప్పదలుచుకున్నాను.' అని తెలిపారు. ఏదేమైనా అంచల్ గుప్తా చేసిన ఈ ప్రయత్నం స్థానికంగానే కాదు దేశవ్యాప్తంగా చాలామంది దృష్టిని ఆకర్షించింది. అతని నిర్ణయాన్ని చాలా మంది అభినందించారు. ఇలాంటి తండ్రులు ఇప్పటి సమాజానికి అవసరమని అభిప్రాయపడుతున్నారు. చదవండి: వైరల్: ఇంటర్వ్యూలో ఉండగా చెల్లిని చితకబాదిన అక్క.. గ్యాప్ కూడా ఇవ్వలే.. -
ఓరి దుర్మార్గుడా.. పానీపూరీలో.. ఛీ అది కలిపావేంట్రా
Assam Man Mixing Urine In Pani Puri Water: సోషల్ మీడియాలో వచ్చే వాటిలో కొన్ని వైరల్ గా మారి రచ్చ చేస్తే, మరి కొన్ని మాత్రం మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తాయి. ఇక నోరూరించే వంటకాలు సైతం నెట్టింట కనిపించడం ఇటీవల ట్రెండ్‌గా మారిందనే చెప్పాలి. అదే క్రమంలో కొన్ని ఘటనలు చూస్తే బయట తిండి తినాలంటే భయమేస్తుంది. ప్రత్యేకంగా బయట పుడ్ ఇష్టపడే భోజన ప్రియులు రోడ్డు పక్కన తినే తినుబండారాల విషయంలో ఎంతో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని చాటే ఒక వీడియో తాజాగా వైరల్ అవడమే గాక చూసిన వారిని షాక్‌కు గురి చేస్తుంది. ఈ ఘటన అసోంలోని గువాహటిలో చోటు చేసుకుంది. అసలు ఏముంది అందులో.. గువహటి నగరంలో ఓ పానీ పూరీ బండి నిర్వహకుడు చేసిన పని చూస్తే అత్యంత అసహ్యంగా అనిపిస్తోంది. పాస్టపుడ్ సెంటర్లు మొదలైనప్పటి నుంచి భోజన ప్రియులు బయట పుడ్ తినడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో పానీపూరి తినే వారి జాబితా పెద్దదే అని చెప్పాలి. అయితే వారు ఈ వీడియో చూస్తే మాత్రం ఇకపై తినడం మానేస్తారేమో. రోడ్డు పక్కన పానీపూరీ బండితో జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి పానీపూరి చేస్తూనే మరో వైపు ఏమీ తెలియనట్లు మగ్గుతో తన మూత్రాన్ని చాటుగా పట్టి దాన్ని పానీపూరీ బకెట్లో కలిపాడు. కాగా అతను ఇది ఎందుకు చేశాడు తెలియదు. అయితే ఈ వ్యవహారమంతా ఎవరో చాటుగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అతి జుగుప్సాకరమైన దీన్ని చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. చివరకు ఇది ఆహార శాఖ అధికారుల వరకు చేరింది. వెంటనే అధికారులు స్పందించి సదరు స్ట్రీట్ వెండర్ అయిన పానీపూరీ బండి నిర్వహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రోడ్డు పక్కన అమ్మే తినుబండారాలాను తినేముందు ఒకసారి ఆలోచించుకోవాలిని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. Shocking!A street vendor(pani puri saller) has been arrestd in Guwahati after viral a sensational video in which he mixed his urine with water and using the same Water in Pani Puri.#ViralVideo #Guwahati @ABPNews @ANI @the_viralvideos @ViralPosts5 @indiatvnews @TheQuint @SkyNews pic.twitter.com/ncekjhMeh1 — Mamun Khan (@Mk817Khan) August 20, 2021 -
ప్రేమ విఫలం: పానీపూరి బండి వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, నాయుడుపేట టౌన్: పట్టణంలోని అమరాగార్డెన్ వీధిలో నివాసం ఉంటూ పానీపూరి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హమీర్పూర్ జిల్లాకు చెందిన యువకుడు సర్వేష్‌కుమార్ ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ప్రేమ విఫలమవడంతోనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. గత కొంత కాలంగా యువకుడు మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ యువతితో మనస్పర్థలతో రావడంతో సర్వేష్ కుమార్ దిగాలుగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం కుటుంబ సభ్యులకు సైతం ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పగా వారు నమ్మలేదు. దీంతో నిరాశ చెంది ఆత్మహత్య చేసుకున్నాడని సోదరుడు సోముకుమార్తో పాటు బంధువులు అవేదన చెందారు. పోలీసులు సర్వేష్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం జరిపి సోమవారం సాయంత్రం అప్పగించారు. యువకుడి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్‌కు తీసుకెళ్లేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో నాయుడుపేటలో ఉంటున్న బంధువులే దగ్గరుండి మృతుడి సోదరుడి చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి కుటుంబ సభ్యులు వాట్సప్ ద్వారా కడ చూపులు చూసుకున్నారు. యవతి మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగింత పట్టణంలోని గరిఢీ వీధిలో నివాసం ఉంటున్న మైనార్ ప్రేమ విఫలం కావడంతో ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మైనర్ మృతదేహానికి పోలీసులు పోస్టమార్టం జరిపించి కుటుంబ సభ్యులకు సోమవారం అప్పగించారు. వైద్యశాల వద్ద మృతురాలి కుటుంబ సభ్యుల రోదనలకు అంతులేకుండా పోయింది. (చదవండి: విచారణకు వస్తానని చెప్పి..) -
పానీపూరీ.. ఇక నో పరేషాన్!
పానీ పూరీ, వావ్.. ఈ పేరు వినగానే స్ర్టీట్ ఫుడ్ లవర్స్ నోట్లో నీళ్లూరడం ఖాయం. గప్‌చుప్, గోల్ గప్పా, పానీకే పటాషే... ఇలా ప్రాంతాలను బట్టి పేరెలా మారితేనేం? దీని రుచిని ఆస్వాదించే వారిలో మాత్రం ఈ వంటకంపై ఉన్న ప్రేమాభిమానాలు మాత్రం మారవు. రోడ్డు పక్కన ఆ పానీపూరీ బండి దగ్గర నిల్చుని అలా ఒకదాని తర్వాత మరొకటి, నోట్లో వేసుకొని తింటూ ఉంటే.. ఆహా.. ఆ మజానే వేరుగా ఉంటుంది. కానీ, ఈ లాక్డౌన్ కారణంగా చాలామంది కచ్చితంగా ఈ ఫుడ్‌ని బీభత్సంగా మిస్సయ్యే ఉంటారు. అందుకే చాలా మంది దీన్ని ఇంట్లోనే తయారు చేయడం కూడా నేర్చేసుకున్నారు కూడా. అయినా పానీపూరి బండి వద్ద దొరికే రుచి దొరకక ఎప్పుడెప్పుడు లాక్డౌన్ ఎత్తివేస్తారా అంటూ ఎదురుచూశారు. కానీ మహమ్మారి కరోనా భయంతో పాటుగా, ఈ మధ్య బండి వాళ్లు ఇష్టానుసారంగా గోల్ గప్పాను తయారు చేస్తున్న విధానాన్ని చూస్తే ప్రతి ఒక్కరూ దీనిపై ఇష్టాన్ని చంపుకోవాల్సి వచ్చింది. ఇలాంటి తరుణంలో ఇండోర్‌లోని స్వచ్ఛ పానీ పూరీ అనే ఒక ఫుడ్ స్టాల్ సరైన ఇందుకు తగిన పరిష్కారం కనుగొంది. మనుషులతో సంబంధం లేకుండా కేవలం మెషిన్‌తోనే అన్ని పనులు చక చకా జరిగిపోయేలా, అత్యంత పరిశుభ్రమైన పద్ధతిలో పానీపూరీని తయారు చేసే యంత్రాన్ని రూపొందించింది. ఇందులో, ముందుగానే వారు పూరీని సిద్ధం చేసి పెడతారు. ఎవరైనా కస్టమర్లు వచ్చినప్పుడు వారంతట వారే మెషిన్ ద్వారా పానీని నింపి పూరీ తినవచ్చు. దీంతో సామాజిక దూరం పాటిస్తూ, ఎలాంటి భయం లేకుండా సంతోషంగా పానీపూరిని లాగించేస్తున్నారు అక్కడి కస్టమర్లు. (చదవండి: షాకింగ్.. టాయిలెట్ నీళ్లతో పానీపూరీ!) ఇక మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ కేంద్రంగా ఉన్న ఒక ప్రముఖ ఫుడ్ బ్లాగింగ్ అయిన ఇండోరిజైకా ఈ హైజీనిక్ పానీ పూరి యంత్ర వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి, అది పని చేసే తీరును వివరించింది. అంతే ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసి, మిలియన్ వ్యూస్‌తో పాటు 55 వేల లైక్‌లను సంపాదించుకుంది. ఇక పానీ పూరీ ప్రేమికులైతే, ప్లేట్ రేటెంత ? ఎక్కడెక్కడ ఈ హైజీనిక్ పానీ పూరి దొరుకుతుందా అనే ఉత్సాహంతో ప్రశ్నల వర్షం కురుపిస్తున్నారు. ఏదేమైనా, ఎలాంటి బెదురు లేకుండా ఇక గప్‌చుప్‌గా ఈ గప్‌చుప్‌లను నోట్లో వేసేయొచ్చుఅని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల కొల్హాపూర్‌లోని ‘ముంబై కా స్పెషల్ పానీ పూరి వాలా’ పేరుతో పానీపూరీ బిజినెస్ వాళ్లు, ఇందుకోసం టాయిలెట్ నీళ్లను వాడటంతో కస్టమర్లు వారిని చితకబాదిన సంగతి తెలిసిందే. -
అటోమెటిక్ పానీపూరీ: అద్భుతమైన ఆలోచన
రాయ్‌పూర్: పానీ పూరీని ఆస్వాదించే వారికి ఓ తీపికరమైన విషయం. ఇక నుంచి మీరు ఎలాంటి భయం లేకుండా పానీపూరీ తినోచ్చు. కరోనా వల్ల మనుషుల మధ్య దూరం పెరిగడమే కాకుండా తమకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్స్‌కు దూరమయ్యారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తినే స్ట్రీట్ ఫుడ్‌లో పానీపూరి మొదటి స్థానంలో ఉంటుంది. బయటకు వెళితే రోడ్డు పక్కన పానీపూరీ బండిని చూడగానే అక్కడ వాలిపోతారు. ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా ఇష్టంగా తినే ఈ గప్‌చుప్‌ను మహమ్మారి వల్ల తినడానికి భయపడే పరిస్థితి వచ్చింది. దీంతో దీనిపైనే ఆధారపడిన పానీపూరీ వ్యాపారులకు సవాలుగా మారింది. ఓ పానీపూరీ వ్యాపారి వినూత్నంగా ఆలోచించాడు. (చదవండి: పెళ్లికి చీర కట్టుకుంటోంది.. అంతలోనే పాము!) సెన్సార్ ద్వారా గప్‌చుప్‌లో వాడే రుచికరమైన నీరు అటోమెటిక్ వచ్చేలా మిషన్‌ను తయారు చేసి చత్తీష్ గడ్‌లో గప్‌చుప్ విక్రయిస్తున్న వీడియోను ఓ ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ మంగళవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో పూదిన, వెల్లుల్లి నీరు, కట్టామిట్టా సెన్సార్ ద్వారా గప్‌చుప్‌లో పడుతున్న ఈ మీషిన్కు సదరు వ్యాపారి ‘టచ్ మీ నాట్ పానీపూరీ’ అనే పేరుతో విక్రయిస్తున్నాడు. దీనిని ఆ ఐఏఎస్ అధికారి ‘రాయ్‌పూర్‌లో ఆటోమేటిక్ పానిపురి.. అద్భుతం జుగాద్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. ఈ వీడియో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 24 వేలకు పైగా లైకులు వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఇది చూసిన గప్‌చుప్ ప్రియులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘ఖచ్చితంగా ఈ పానీపూరి బండిని సందర్శిస్తాను’, ‘అద్భుతమైన ఆలోచన’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: డ్రగ్స్‌కు బానిసగా మారాను: కంగనా) तेलीबांधा रायपुर का ऑटोमैटिक पानीपुरी वाला. ग़ज़ब का जुगाड़.👍👌 pic.twitter.com/rbEIwFe24l — Awanish Sharan (@AwanishSharan) September 15, 2020 -
పానీపూరీ ఇవ్వలేదని.. పొడిచి చంపేశారు!
దేశ రాజధానిలో మరో ఘోరం జరిగింది. ఔటర్ ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో పానీపూరీ అమ్ముకునే వ్యక్తిని కొంతమంది కలిసి దారుణంగా చంపేశారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా, ఇద్దరు బాలనేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లంతా బాగా తాగేసి ఉన్నారు. వాళ్లకు అర్ధరాత్రి సమయంలో పానీపూరీ ఇచ్చేందుకు రాజు (24) నిరాకరించడంతో వాళ్లు అతడిని 18 సార్లు కత్తితో పొడిచారు. హత్యలో తమ పాత్ర ఉన్నట్లు ఈ ఐదుగురూ అంగీకరించారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో గోగి (22), అనిల్ (28), నిఖిల్ (24) అనే ముగ్గురిని అరెస్టు చేశారు. రాజు తన కుటుంబంతో కలిసి మంగోల్‌పురి బ్లాక్ 1లో నివసించేవాడు. రోడ్డు పక్కన తన తండ్రి రాధేశ్యామ్‌తో కలిసి పానీపూరీ, ఇతర స్నాక్స్ అమ్మేవాడు. రాత్రి 11.30 గంటల సమయంలో అతడు తన షాపు కట్టేసి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. అతడి తండ్రి కాస్త ముందు వెళ్తూ దాదాపు ఇంటికి చేరుకున్నాడు. అంతలో ఐదుగురు వ్యక్తులు మద్యం తాగుతూ రాజును ఆపి పానీపూరీ అడిగారు. అయితే సరుకులు అయిపోయాయని, ఇప్పుడు ఇవ్వలేనని రాజు చెప్పాడు. అయినా సరే తమకు కావల్సిందేనని వాళ్లు పట్టుబట్టారు. రాజు నిరాకరించడంతో వాళ్లలో ఒకడు కత్తితీసి రాజు పడిపోయేవరకు పొడిచాడు. అతడి అరుపులు విన్న తండ్రి, ఇరుగు పొరుగువారు అక్కడకు వచ్చేసరికి నిందితులు పారిపోయారు. వాళ్లలో ఇద్దరిని పట్టుకున్నారు. రాజును సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించినా, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. గోగి, అనిల్ ఇద్దరికీ గతంలో నేరచరిత్ర ఉంది. నిఖిల్‌కు నేరచరిత్ర లేదు గానీ, అలాంటివాళ్లతో కలిసి తిరిగేవాడు.