పానీపూరి అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాధారణంగానే సాయంత్రం కాగానే వీధి చివర్లోని పానీపూరీ బండి వద్ద గుమిగూడుతుంటారు. ఇక మరీ ముఖ్యంగా వర్షాకాలంలో పానీపూరి క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు.కాస్త చినుకులు పడగానే పానీపూరీల కోసం జనాలు ఎగబడతారు. అయితే వర్షాకాలంలో పానీపూరీ తినడం డేంజర్ అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.
పానీపూరీ అంటే ఆహా ఓహో అంటూ లొట్టలు వేసుకొని తినేవాళ్లు చాలామందే ఉంటారు. తినేటప్పుడు అది ఎలా తయరుచేశారో, ఆ తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యల గురించి ఏమాత్రం ఆలోచించరు. అయితే ఇలా అడ్డగోలుగా ఎక్కడపడితే అక్కడ పానీపూరీ తింటే మాత్రం రోగాల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పానీపూరీలు అమ్మే స్థలం పరిశ్రుభంగా లేకపోయినా, తయారు చేసే వ్యక్తికి ఏమైనా ఇన్‌ఫెక్షన్లు ఉన్నా అవి మీకు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వర్షాకాలంలో పానీపూరీలు తినాలనుకుంటే మాత్రం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. లేదంటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అపరిశుభ్రమైన నీళ్లు తాగడం వల్ల టైఫాయిడ్, ఉదర సంబంధిత వ్యాధులకు గురవుతారు.
► పానీపూరీకి ఉపయోగించే నూనె మంచిది కాకపోతే డేంజరే. ఎందుకంటే స్ట్రీట్ వెండర్స్ చాలావరకు ఒకసారి వాడిన నూనెను మళ్లీమళ్లీ ఉపయోగిస్తుంటారు. ఇలా నూనెను ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది.
► పానీపూరీలో పాన్ మసాలా కలుపుతారు అన్న విషయంలో చాలా మందికి తెలియదు. ఇది క్యాన్సర్‌కు కారకం అవుతుంది.
► పానీపూరీలో సోడియం ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజూ తినడం వల్ల ఉదర సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు.
► వీటితో పాటు అనేక రకాల ఇన్‌ఫెక్షన్ల బారిన పడతారు. ఇది కేవలం పానీపూరీకే వర్తించదు. అన్ని రకాల స్ట్రీట్ ఫుడ్స్, పరిశ్రుభత పాటించని హోటళ్లు చాలానే ఉన్నాయి. వీటివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే బయటి ఫుడ్‌కు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు నిపుణులు.
Comments
Please login to add a commentAdd a comment