Health Problems
-
దేశంలో ఏటా.. లక్షల సర్జికల్ ఇన్ఫెక్షన్ కేసులు
సాక్షి, అమరావతి: దేశంలో అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్స చేయించుకున్న బాధితులు ఇన్ఫెక్షన్లతో సతమతమవుతున్నారు. ఏటా దాదాపు 15 లక్షల మంది సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్ (ఎస్ఎస్ఐ) బారినపడుతున్నారు. వీరిలో 54 శాతానికి పైగా ఆర్థోపెడిక్ శస్త్ర చికిత్సల బాధితులు ఉంటున్నారు. ఈ అంశం ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో ఎస్ఎస్ రేటు 5.2 శాతంగా ఉంది. అధిక ఆదాయ దేశాల కంటే ఇంది చాలా ఎక్కువ అని తెలి పింది. ఢిల్లీ ఎయిమ్స్, మణిపాల్‌లోని కస్తూర్బా, ముంబైలోని టాటామెమోరియల్ ఆస్పత్రుల్లో 3,090 మంది రోగులపై ఐసీఎంఆర్ అధ్యయనం చేపట్టింది. 161 మంది రోగుల్లో శస్త్ర చికిత్సల అనంతరం ఎస్ఎస్ఐ అభివృద్ధి చెందినట్టు గుర్తించింది. ముఖ్యంగా రెండు గంటల కంటే ఎక్కువ సమయం నిర్వహించే సర్జరీలు ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతున్నట్టు కనుగొన్నారు. పెరుగుతున్న వ్యయప్రయాసలురోగులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యాక వారి ఆరోగ్య పరిస్థితిపై సరైన నిఘా వ్యవస్థ లేకపోవడంతోనే ఎస్ఎస్ఐ సమస్య తీవ్రతరంగా ఉంటోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ప్రజారోగ్య సమస్యగా ఉందని వైద్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శస్త్ర చికిత్సల అనంతరం ఇన్ఫెక్షన్ కారణంగా రోగులు కోలుకునే సమయంతో పాటు, చికిత్సకు అయ్యే ఖర్చులు వంటి వ్యయప్రయాసలు పెరుగుతున్నాయి. అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో, శస్త్రచికిత్స చేయించుకునే రోగుల్లో 11శాతం మంది ఇన్ఫెక్షన్కు గురవుతున్నట్టు డబ్ల్యూహెచ్‌వో సైతం వెల్లడించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆర్థో, గైనిక్, ఇతర సర్జరీల అనంతరం రోగులు ఇన్ఫెక్షన్ల బారినపడుతున్న ఘటనలు ఉంటున్నాయి. లాప్రో, రోబోటిక్ సర్జరీలతో తక్కువ ఇన్ఫెక్షన్లు ఆస్పత్రుల్లో సరైన స్టెరిలైజేషన్ లేకపోవడం, రోగుల్లో వ్యాధి నిరోధకత తక్కువగా ఉండటం శస్త్ర చికిత్సల అనంతరం ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణం. శస్త్ర చికిత్సలకు ముందే సమగ్రంగా ప్రీ–ఆపరేటివ్ ఎవాల్యుయేషన్ చేపట్టాలి. గుండె వాల్వ్, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీల్లో శరీరంలో స్టీల్ మెటల్స్ అమరుస్తుంటారు. ఈ కారణంగా ఇన్ఫెక్షన్లకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇలాంటి సర్జరీల్లో ఒక శాతం ఇన్ఫెక్షన్ రేటు ఉన్నా ప్రమాదమే. ప్రస్తుతం ల్యాప్రోస్కొపీ, రోబోటిక్స్ వంటి అత్యాధునిక సర్జరీలు పద్ధతులు అందుబాటులో ఉంటు న్నాయి. ఈ విధానాల్లో శస్త్ర చికిత్సల్లో కచి్చతత్వంతో పాటు, ఇన్ఫెక్షన్లు సోకడానికి అవకాశం చాలా తక్కువ. సంప్రదాయ సర్జరీల్లో పెద్ద కోతలు ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి. విచ్చలవిడిగా యాంటిబయోటిక్స్ వినియోగించకూడదు. ప్రస్తుతం వైద్యుల సంప్రదింపులు లేకుండానే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలకు ప్రజలు యాంటిబయోటిక్స్ వాడేస్తున్నారు. ఇది మంచిది కాదు. – డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, రొబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ -
చిన్నప్పటి నుంచి ఉంది ప్లానింగ్ ఎలా?
నాకు 35 ఏళ్లు. చిన్నప్పటి నుంచి డయాబెటిస్ ఉంది. ఇన్సులిన్ తీసుకుంటున్నాను. ఈమధ్యనే పెళ్లయింది. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటున్నాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?– సీహెచ్. శరణ్య, గుంటూరుబ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేలా చూసుకుని, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. దీనివల్ల తల్లీబిడ్డలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ప్రెగ్నెన్సీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్‌ను పెంచుతుంది. మామూలుగా కన్నా ప్రెగ్సెన్సీ సమయంలో రెండు మూడు రెట్ల ఎక్కువ ఇన్సులిన్ మోతాదు మీద ఉండాల్సి వస్తుంది. అలాగే చెకప్స్ విషయంలో కూడా రెండు వారాలకు ఒకసారి అబ్స్టట్రిషన్ని సంప్రదించాలి. మీరు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి హెచ్‌బీఏ1సీ లెవెల్స్‌ని చెక్ చేసుకోండి. థైరాయిడ్, సీబీపీ టెస్ట్స్ చేయించుకోండి. హెబీఏ1సీ 5.5 లోపు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయండి. ఆ లెవెల్ ఎక్కువగా ఉంటే డయబెటాలజిస్ట్ని సంప్రదించండి. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ మోతాదును చేంజ్ చేస్తారు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి కనీసం మూడు నెలల ముందు నుంచి ఫోలిక్‌యాసిడ్ 5ఎమ్జీ మాత్రలను తీసుకుంటూండాలి. ప్రెగ్నెన్సీలో సుగర్స్ చాలా ఫ్లక్చువేట్ అవుతాయి. మొదటి మూడు నెలల్లో సుగర్ డౌన్ (హైపోగ్లైసీమియా) అయ్యే ప్రమాదం ఎక్కువ. డయాబెటిక్ రెటీనోపతి అంటే సుగర్ వల్ల కంటి సమస్య .. ఇది ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీలో మూడు నెలలకు ఒకసారి కంటి, కిడ్నీకి సంబంధించి స్క్రీనింగ్ చేయించుకుంటూండాలి. డయాబెటిస్ కంట్రోల్లో లేనప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మూడు నెలల్లోనే గర్భస్రావం అయ్యే చాన్సెస్, కంజెనిటల్ అనామలీస్ (పుట్టుకతో వచ్చే లోపాలు) ప్రమాదాలు ఎక్కువ. అంతేకాదు లోపల బిడ్డ ఎదుగుదలా సరిగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా బిడ్డకు గుండె సమస్యలు ఎక్కువవుతాయి. గ్రహణం మొర్రి, అంగిలి చీలి ఉండటం వంటి సమస్యలూ ఉంటాయి. హెబీఏ1సీ ఏడు శాతం దాటిన వారిలో ఇలాంటివి కనిపిస్తాయి. రెండు, మూడు త్రైమాసికాల్లో అంటే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో గ్లూకోజ్ సరిగా నియంత్రణలో లేకపోతే గర్భస్థ శిశువుకు కూడా గ్లూకోజ్ ఎక్కువ వెళ్తుంది. దీనివల్ల బిడ్డ ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉంటుంది. దాంతో బిడ్డకూ సుగర్ రావడం, డెలివరీ కష్టమవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే క్రమం తప్పకుండా గ్రోత్ స్కాన్స్ చేయించుకుంటూండాలి. 24 వారాలప్పుడు బేబీ హార్ట్ స్కాన్ చేస్తారు. ఇన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టే తొమ్మిదవ నెల వచ్చిన వెంటనే 37– 38 వారాలకు డెలివరీ ప్లాన్ చేస్తారు. బిడ్డ నాలుగు కేజీలు.. అంతకన్నా ఎక్కువ ఉంటే సిజేరియన్ ఆప్షన్‌కి వెళ్తారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యేంత వరకు మల్టీవిటమిన్స్, డాక్టర్ నిర్ణయించిన మోతాదులో ఇన్సులిన్‌ను కంటిన్యూ చేయాలి. ప్రెగ్నెన్సీలో ఏ టైప్ ఇన్సులిన్‌ను వాడాలో ప్రిస్క్రైబ్ చేస్తారు. తక్కువ మోతాదులో ఆస్పిరిన్‌ను మొదటి మూడునెలల్లో స్టార్ట్ చేయాలి. లేకపోతే బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువ ఉన్నవారిలో రిస్క్ పెరుగుతుంది. హైబీపీ, ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మీరు సుగర్‌కి మాత్రలు వేసుకుంటున్నట్లయితే అవి ప్రెగ్నెన్సీలో సురక్షితమో కాదో డాక్టర్ని సంప్రదించి తెలుసుకోవాలి. ఒకవేళ అవి సురక్షితం కాకపోతే వేంటనే ఆపేయించి, సురక్షితమైన మందులను ప్రిస్క్రైబ్ చేస్తారు. డెలివరీ తర్వాత చాలామందికి బ్లడ్ గ్లూకోజ్ నార్మల్ స్థాయికి వచ్చేస్తుంది. అప్పుడు మందుల మోతాదు కూడా తగ్గించేస్తారు. బ్రెస్ట్ ఫీడింగ్ కచ్చితంగా ఇవ్వాలి. డెలివరీ తర్వాత బిడ్డకు హఠాత్తుగా లో సుగర్ అవొచ్చు. అందుకే సీనియర్ నియోనేటాలజిస్ట్స్ ఉన్న చోటే డెలివరీ ప్లాన్ చేసుకోవాలి. సుగర్ డౌన్ అయితే కొంతమంది పిల్లలను ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీలో మూడు నెలలకు ఒకసారి కంటి, కిడ్నీకి సంబంధించి స్క్రీనింగ్ చేయించుకుంటూండాలి. డయాబెటిస్ కంట్రోల్లో లేనప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మూడు నెలల్లోనే గర్భస్రావం అయ్యే చాన్సెస్, కంజెనిటల్ అనామలీస్ (పుట్టుకతో వచ్చే లోపాలు) ప్రమాదాలు ఎక్కువ. -
ఉప్పెనలా ఊబకాయం
సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన 3వ తరగతి విద్యార్థి 46 కిలోల బరువు ఉన్నాడు. జంక్‌ఫుడ్ అతిగా తినడంతోనే బరువెక్కినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మిగతా విద్యార్థులతో సమానంగా క్రీడల్లో పాల్గొనలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊబకాయం కారణంగా చలాకీతనం కోల్పోయాడని అంటున్నారు.రెండు వారాల క్రితం తొమ్మిదో తరగతి చదివే ఓ విద్యార్థి బస్సులో ప్రయాణిస్తూ.. పుట్టపర్తి దాటిన తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. తోటి ప్రయాణికులు సాయం చేసి.. సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు నిర్ధారించారు. ఊబకాయమే సమస్యకు కారణమని వైద్యులు తేల్చారు. బొద్దుగా ఉంటే ముద్దుగా ఉన్నారంటారు. కానీ అధిక భారం అలాగే కొనసాగితే వారికి వారే భారం కావడం ఖాయం. అంతేకాదు పలు అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదమూ ఉంది. జీవనశైలిలో మార్పుల కారణంగా భవిష్యత్తులో ఊబకాయుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సాక్షి, పుట్టపర్తి: ఊబకాయం.. ప్రతి వందలో 20 మందిని తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమస్య. శారీరక వ్యాయామం తగ్గటం, ఆహార నియమాలు పాటించకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి విధానంతో ఇప్పుడు చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఊబకాయులుగా మారుస్తోంది. బాల్యంలోనే ఊబకాయం వస్తే చలాకీతనం కోల్పోతారు. చిన్న వయసులోనే అనేక మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. శారీరకంగా అనేక ఇబ్బందులు పడుతారు. వయసుకు తగిన బరువు ఉంటే చాలని.. అధిక బరువు అనర్థాలకు దారి తీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఊబకాయల్లో సమస్యలు ఇవే.. ∙ఊబకాయం ఉన్న పిల్లలు సహచరుల నుంచి తరచూ అవహేళనకు గురవుతారు. ఫలితంగా మానసికంగా డిప్రెషన్‌కు లోనయ్యే ప్రమాదం ఉంది. » ఊబకాయం ఉన్న పిల్లలు చలాకీతనం కోల్పోవడం కారణంగా క్రీడల్లో రాణించలేరు. కనీసం అవకాశాలు రావడం కూడా కష్టమే. » అందరితో పాటు వ్యాయామం చేయాలనుకున్నప్పటికీ.. కాసేపటికే అలసిపోతారు. శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతారు. » మానసిక ఒత్తిడి కారణంగా చదువులో వెనుకబడే అవకాశం ఉంది. విద్యలో ఉన్నత స్థానాలకు వెళ్లడం కష్టమే. » టీనేజీలోకి వచ్చేసరికి మరింత డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఫలితంగా అందరిలో కలవకుండా ఒక్కరే ఉండేందుకు ఇష్టపడతారు. » ప్రీ డయాబెటిస్, హైపర్‌టెన్షన్ చిన్న వయసులోనే దరి చేరుతాయి. ఫలితంగా జీవితాంతం వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిన పరిస్థితి. » ఊబకాయం కారణంగా స్కిన్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా సోకే ప్రమాదం ఉంది. ఊబకాయం ఇలా..» జంక్‌ఫుడ్, బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం, పిజ్జా, బర్గర్, నూడిల్స్ తినడం కారణంగా ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. » జంక్‌ఫుడ్ టేస్ట్ డిఫరెంట్‌గా ఉండటంతో ఎక్కువ మోతాదులో తీసుకుని బరువు పెరుగుతారని వైద్యులు చెబుతున్నారు. » కదలిక లేని జీవన విధానంతో బరువు పెరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది. బిజీ షెడ్యూల్లో చాలామంది నడవడం తగ్గించి వాహనాలను వినియోగిస్తున్నారు. » టీవీ, సెల్‌ఫోన్ చూస్తూ.. మోతాదుకు మించి భోజనం తినేస్తున్నారు. ఫలితంగా మనిషి సాధారణం కంటే బరువు పెరిగే అవకాశం ఉంది. » తల్లిదండ్రులు ఊబకాయులైనా పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుందని పలు అధ్యయనాలు తేల్చాయి. జన్యుపరమైన కారణాల రీత్యా కూడా ఊబకాయం రావచ్చని అంటున్నారు.ఇలా చేస్తే మేలు.... » జంక్‌ఫుడ్‌ను వీలైనంత వరకు తగ్గించాలి » టీవీ, సెల్‌ఫోన్ చూసే సమయం తగ్గించాలి » క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి » తల్లిదండ్రులు శ్రద్ధతో పిల్లలతో వాయింగ్ చేయించాలి »ఊబకాయం ఉన్న పిల్లలను రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించాలి వ్యాయామం తప్పనిసరిఊబకాయం ఉన్న వారిలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉండవు. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వారంలో రెండు , మూడుసార్లు జంక్‌ఫుడ్ తింటే ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. బయటి ఆహారం తినడమూ కారణంగా చెప్పవచ్చు. పిల్లల బరువు పెరుగుతున్నట్లు గుర్తిస్తే తల్లిదండ్రులు వారిని క్రమం తప్పకుండా వాకింగ్‌కు తీసుకెళ్లాలి. జంక్ ఫుడ్ బదులు ఆరోగ్యకర ఆహారం తీసుకునేలా చేయాలి. – డాక్టర్ ప్రతాప్, హిందూపురం జీవనశైలి మార్పులతో.. జంక్ ఫుడ్ బదులు ప్రత్యామ్నాయం ఆలోచించాలి. నిత్యం వ్యాయామం చేయలేని వారు ఇతర మార్గాల్లో శారీరక బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అవతలి వ్యక్తి అవహేళన చేసినప్పుడు డిప్రెషన్‌కు లోను కాకూడదు. పిల్లల బరువు తగ్గే విషయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకం. జీవన శైలిలో మార్పులతో ఊబకాయం నుంచి బయట పడవచ్చు. – డాక్టర్ రాజశేఖర్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ -
Delhi: నాలుగు సిగరెట్లకు సమానమైన పొగను పీలుస్తూ..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ వాయు కాలుష్యంతో తల్లడిల్లిపోతోంది. అక్కడి ప్రజలు సవ్యంగా ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితిలో చిక్కుకున్నారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీని చుట్టుముట్టిన కలుషిత గాలి జనాన్ని అనారోగ్యం బారిన పడేలా చేస్తోంది.నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత తీవ్ర స్థాయిలో ఉంది. ఇక్కడి ప్రజలు నాలుగు సిగరెట్లకు సమానమైన పొగను పీలుస్తున్నారని, ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నదని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జిమ్స్) వైద్యులు చెబుతున్నారు. జిమ్స్ ఆస్పత్రికి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ వస్తున్న రోగుల సంఖ్య పెరిగిందన్నారు.చెడు గాలి మరింతగా శరీరంలోనికి చొరబడకుండా ఉండేందుకు మాస్క్‌ని ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో ఊపిరితిత్తులకు హాని కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు కలుషిత గాలికి తీవ్రంగా ప్రభావితమవుతున్నారన్నారు. చెడు గాలి కారణంగా గొంతు, శ్వాసకోశ సమస్యలు వచ్చిన వారు కొన్ని సూచనలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. ఉదయం దట్టంగా పొగమంచు ఉన్నప్పుడు వాకింగ్‌కు వెళ్లకపోవడమే ఉత్తమమని, ఉదయాన్నే గోరు వెచ్చటి నీరు తాగాలని సూచించారు. దుమ్ము, ధూళితో కూడిన ప్రదేశాలకు వెళ్లడాన్ని నివారించాలని, అలాగే నిర్మాణ పనులు చేపట్టకపోవడం మంచిదని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మరింత ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: Medical College Fire: చిన్నారుల మృతి హృదయవిదారకం: ప్రధాని మోదీ -
కార్తీకమాసంలో ఉసిరిని పూజిస్తే...
పవిత్రమైన కార్తీకమాసంలో తులసి, ఉసిరికోట ముందు దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలుగుతాయి అని కార్తీక పురాణం చెబుతుంది. ఈ మాసంలో ఉసిరిచెట్టును పూజించటం వలన చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు దరిచేరవని శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక పార్ణమి రోజున ఉసిరికాయలతో దీపాలు వెలిగించి ఈ శ్లోకాలు పఠించాలి. దాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి పుత్రాన్ దేహి మహా ప్రాజే యశోదేహి బలంచమే ప్రజ్ఞం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీం నిరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా ఉసిరి చెట్టు పూజ సాధారణంగా అమావాస్య, పూర్ణిమ, ఇతర ముఖ్యమైన పండుగలు, పర్వదినాలలో నిర్వహిస్తారు. పూజ సమయంలో, చెట్టు వద్ద ఒక చిన్న, లోతులేని గొయ్యి తవ్వి, దానిలో ప్రమిదను ఉంచి దీపాన్ని వెలిగిస్తారు. చెట్టుకు పూలు, పండ్లు, ఇతర పూజాద్రవ్యాలను సమర్పించి శ్లోకాలను పఠిస్తారు. ఉసిరి చెట్టు చెట్టును విష్ణువుకు ప్రతి రూపంగా పరిగణిస్తారు. అందువల్ల ఉసిరి చెట్టును పూజించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు. అంతేకాదు, కార్తీక మాసంలో ఉసిరి చెట్టును, తులసి చెట్టును నాటడం వల్ల శ్రేయస్సు, సంతోషం కలుగుతాయంటారు. అందువల్ల ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ వంటి పర్వదినాలలో ఆలయాలలో ఉసిరి, తులసి మొక్కలను కూడా భక్తులకు ప్రసాదంగా పంచుతారు. పండ్లకు బదులు మనం ఎవరికైనా మొక్కలను కూడా పంచవచ్చు. -
టెకీ.. ఆరోగ్యం రిస్కీ..
ఎండ కన్నెరుగని శరీరాలు ఎండ్లెస్ సమస్యల చిరునామాలుగా మారుతున్నాయి. ఆరు అంకెల జీతాలు అందుకునే జీవితాలు అనారోగ్యాలకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులపై ఆందోళన పెరుగుతోంది. దీనికి పని ఒత్తిడి కారణం ఒకటైతే.. హైబ్రిడ్, వర్క్ ఫ్రమ్ హోం సైతం మరో కారణంగా పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆదోళన నేపథ్యంలో పలు కంపెనీలు.. కార్యాలయ ఆవరణల్లో మార్పులకు కారణమవుతున్నాయి. నగరంలో దాదాపు తొమ్మిది లక్షల మంది పైగా ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వీరు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడిపించే చోదకశక్తిగా మారినప్పటికీ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోలేకపోతున్నారు. తద్వారా రానున్న సంవత్సరాల్లో 30 ఏళ్లు 40 ఏళ్ల వయస్సు ఉద్యోగుల్లో నాన్–కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సిడి)లో భారీ పెరుగుదల కనిపించనుంది. నగరానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) పరిశోధకులు మాదాపూర్‌లోని హైటెక్ సిటీలోని ఐటీ సెక్టార్లో ఇటీవల వర్క్‌ప్లేస్ వెల్నెస్ స్టడీ వెల్లడించిన విషయం ఇది. ఈ అధ్యయనం న్యూట్రియెంట్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. అంతర్గత అధ్యయనాల్లోనూ.. ఇదే విధంగా పలు సంస్థలు నిర్వహిస్తున్న అంతర్గత అధ్యయనాల్లోనూ ఇలాంటి ఫలితాలే వస్తున్నాయి. ఎస్ఓఐ హెల్త్‌కేర్ అనే ఒక వెల్నెస్ సంస్థ జరిపిన అధ్యయనంలో అత్యధికంగా టెక్ ఉద్యోగులు మెడనొప్పి, హైపర్ టెన్షన్, లోయర్ బ్యాక్ పెయిన్, సరై్వకల్ స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నారని తేల్చింది. అలాగే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. అనే చేతులకు సంబంధించిన సమస్యతో, లోయర్ బ్యాక్‌కి కాళ్లకు కలిపి నొప్పులు అందించే సాక్రోలియక్ జాయింట్ డిస్ఫంక్షన్తో పలువురు ఇబ్బంది పడుతున్నారని స్పష్టం చేసింది. టెక్నోపార్క్ అంతర్గతంగా చేయించుకున్న అధ్యయనం ఇది. ఫలితం అంతంతే.. గత ఐదు సంవత్సరాల్లో, చురుకైన జీవితం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని ప్రోత్సహించడంలో అనేక స్వచ్ఛంద సంస్థలు, కంపెనీల హెచ్ఆర్ విభాగాలతో కలిసి పాలుపంచుకుంటున్నాయి. అయినప్పటికీ కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగులు మరింత నిశ్చల జీవనశైలికి అలవాటు పడ్డారని ఐటీ రంగ నిపుణులు అంటున్నారు. ‘చురుకైన జీవనశైలిని అలవర్చుకునే విషయంలో కొన్ని సంవత్సరాలుగా సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. జిమ్‌లో వర్కవుట్ చేయడం, రన్నింగ్, యోగా సెషన్లు, నడకలను ప్రోత్సహిస్తూ, ఆరోగ్యకరమైన జీవనంపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నాం. అయితే, ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది’ అని హైదరాబాద్ రన్నర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేష్ వెచ్చా చెబుతున్నారు.ఒత్తిడి ఫుల్.. శ్రమ నిల్.. నగర ఐటీ రంగంలో నిమగ్నమైన ఉద్యోగుల్లో ఎక్కువ మంది నిశ్చల జీవనశైలి కావడంతో శారీరక శ్రమ తక్కువ. మరోవైపు తీవ్ర పని ఒత్తిడి. ఈ కారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, పక్షవాతం, దీర్ఘకాలిక కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులు కొనసాగితే 26 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు్కల్లో మెటబాలిక్ సిండ్రోమ్ (ఎంఇటీఎస్)కు అంతిమంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్‌కు దారితీసే అవకాశం ఉందని అధ్యయనం హెచ్చరించింది. మగవారిలో 90 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ, మహిళల్లో 80 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ నడుము చుట్టుకొలత, ట్రైగ్లిజరైడ్స్ (టీజీ) స్థాయిలు 150 మి.గ్రా/డీఎల్ లేదా అంతకంటే ఎక్కువ, హై డెన్సిటీ లైపోప్రొటీన్ స్థాయి వంటివి ప్రమాద సంకేతాలుగా హెచ్చరించింది. ఆ అలవాట్లతో చేటు.. రోజుకు సగటున ఎనిమిది గంటలపైనే కూర్చుని ఉంటున్నారు. ఇదే కాకుండా తరచూ బయట, రెస్టారెంట్స్‌లో తినడం, వేళలు పాటించకపోవడం, తాజా పండ్లు, కూరగాయల వినియోగం స్వల్పంగా ఉండడం, పని ఒత్తిడితో తరచూ భోజనాన్ని మానేయడం, ఎయిర్ కండిషన్డ్ గదుల్లో ఉండడం.. వంటివి హానికరంగా మారుతున్నాయి. మొత్తం ఐటి ఉద్యోగుల్లో 20శాతం మంది మాత్రమే వారానికి 150 నిమిషాల పాటు శారీరక శ్రమ చేస్తున్నారు. మరోవైపు వర్చువల్ వర్క్ వారి పాలిట హానికరంగానే పరిణమిస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ మానసిక, శారీరక ఆరోగ్యానికి సమస్య తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీలు దిద్దుబాటు చర్యలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.వాటిలో కొన్ని.. 👉వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా సమస్యలు వస్తున్నప్పటికీ చాలా మంది దాన్నే ఎంచుకున్నారని ఈ పరిస్థితుల్లో పలు సంస్థలు ఉద్యోగిని బట్టి ఉద్యోగాన్ని, వర్క్‌ప్లేస్‌ని డిజైన్ చేసే ఎర్గోనామిక్స్‌ను పరిచయం చేస్తున్నాయి. 👉 ప్రతి 10 నిమిషాలకూ ఒకసారి కళ్లు బ్లింక్ చేయాలి లేదా సిస్టమ్ నుంచి బ్రేక్ తీసుకోవాలని టీసీఎస్ నోటిఫికేషన్స్ ఇస్తోంది. 👉 టెక్నోపార్క్ కంపెనీ.. తమ ప్రాంగణంలో వాక్ వే, యోగా సెంటర్స్.. వంటివి ఏర్పాటు చేసింది. అలాగే ఓపెన్ జిమ్, జాగింగ్ ట్రాక్, ఫుట్ బాల్ టర్ఫ్ వంటివి ప్లాన్ చేస్తోంది. 👉 కాలుష్యరహిత స్మార్ట్ బైక్స్‌ను ఇన్ఫోపార్క్ అందిస్తోంది. అలాగే వాటర్ ఫ్రంట్ వాక్ వే, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్ సైతం ప్లాన్ చేస్తోంది. 👉 జుంబా క్లాసెస్ నిర్వహిస్తున్న సైబర్ పార్క్.. త్వరలో ఫుట్ బాల్ టర్ఫ్ ఏర్పాటు చేయనుంది. -
టాటూ.. మహాచేటు
సాక్షి, అమరావతి : ప్రపంచవ్యాప్తంగా పచ్చబొట్టు (టాటూ) సంస్కృతి విస్తరిస్తోంది. ఒకప్పుడు చేతులతో సూదులు పట్టుకుని పచ్చబొట్టు పొడిస్తే.. నేడు అత్యాధునిక మెషిన్ల సాయంతో నచ్చిన వెరైటీ, డిజైన్లలో సులభంగా టాటూలు వేస్తున్నారు. పురాతన ఆచారాలకు గుర్తుగా ఆదిమ తెగల్లో మాత్రమే ఉండే పచ్చబొట్టు సంస్కృతి నాగరిక సమాజంలో స్టేటస్ సింబల్, ఫ్యాషన్ పోకడగా మారిపోయింది. ముఖ్యంగా యువత సామాజిక మాధ్యమాల ద్వారా టాటూ సంప్రదాయాన్ని అలవర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ మార్కెట్లో టాటూ వ్యాపారం 2033 నాటికి రూ.5.21 లక్షల కోట్లు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, భారత్‌లోనూ పచ్చబొట్ల మార్కెట్ విస్తరిస్తోంది. ఏటా రూ.20 వేల కోట్ల మేర పచ్చ»ొట్ల వ్యాపారం జరుగుతుండగా 2023 నాటికి రూ.2.26 లక్షల కోట్లు ఉన్న మార్కెట్ 2032 నాటికి 5.21 లక్షల కోట్లకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణుల అంచనా. కానీ.. పరిశోధకులు పచ్చబొట్లపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పచ్చ»ొట్టు సిరాలో అనారోగ్యకర బ్యాక్టీరియాలు బయటపడటం చూసి ఆశ్చర్యపోతున్నారు. అమెరికాకు చెందిన సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ శాస్త్రవేత్తలు పచ్చ»ొట్ల కోసం వినియోగించే 75 సిరాలను పరీక్షించారు. వీటిలో 26 నమూనాలలో బ్యాక్టీరియాను గుర్తించారు. ఈ సిరాలలో మూడింట ఒకవంతు కంటే ఎక్కువగా బ్యాక్టీరియా ఉండటం గమనార్హం. ఇదే విషయాన్ని అప్లైడ్ అండ్ ఎని్వరాన్మెంటల్ మైక్రోబయాలజీ జర్నల్ ద్వారా వెలుగులోకి తెచ్చారు. పరిశోధనలో ఏం తేలిందంటే.. తాజా అధ్యయనం ప్రకారం.. పచ్చ»ొట్లు వేసుకున్న వారిలో అత్యధికంగా 6 శాతం మందిలో ఇన్ఫెక్షన్లు అధికంగా వస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో 10 నుంచి 20 శాతం మంది పచ్చబొట్లతోనే కనిపిస్తున్నారు. వీరిలో 6 శాతం ఇన్ఫెక్షన్ రేటును ప్రమాదకర స్థాయితోనే శాస్త్రవేత్తలు పోల్చారు. ఉదాహరణకు.. ఒక్క అమెరికాలోనే దాదాపు 33.30 కోట్ల మంది ప్రజల్లో కనీసం 3.3 కోట్ల మందికి టాటూలున్నాయి. ఇందులో 6 శాతం మందికి ఇన్ఫెక్షన్ అంటే దాదాపు 20 లక్షల మందికి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్టు అంచనా వేసింది. నిజానికి అమెరికాలో టాటూ అనేది సర్వసాధారణం. అమెరికన్లలో పచ్చ»ొట్టు ఉన్న వారిలో 22 శాతం మందికిపైగా ఒకటి కంటే ఎక్కువ టాటూలు వేయించుకున్న ధోరణి కనిపిస్తోంది. పురుషులతో పోలిస్తే మహిళలే టాటూలు వేయించుకోవడంలో ముందుంటున్నారు. ఇందులో 18 నుంచి 29 సంవత్సరాల వయసు గల స్త్రీలలో 56 శాతం, 30 నుంచి 49 సంవత్సరాల వయసు గల మహిళలు 53శాతం ఉండటం గమనార్హం. టాటూలతో వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పాటు అంటువ్యాధులు సోకి ప్రాణాపాయం కలిగిస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వీటిల్లో ముఖ్యంగా రక్తంలో బ్యాక్టీరియా చేరడం, గుండె లోపలి పొరల్లో ఇన్ఫెక్షన్ వస్తున్నాయి. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తిలో రక్తపోటు స్థాయి అమాంతం పడిపోతుండటంతో ప్రాణాంతకంగా మారుతోంది. కంటి ఇన్ఫెక్షన్లూ పచ్చ»ొట్ల చలవే 2010, 2011లో జరిగిన పలు అధ్యయనాల్లో పచ్చ»ొట్టు సిరాలో ఏరోబిక్ బ్యాక్టీరియాను గుర్తించాయి. తాజాగా శాస్త్రవేత్తలు 14 కంపెనీలు అమెరికాలో అమ్మకానికి ఉంచిన టాటూ సిరాల్లో 75 నమూనాలను పరీక్షించారు. వీటిలో 34 బ్యాక్టీరియాలను కనుగొన్నారు. అందులో 19 ‘వ్యాధికారక జాతులు’గా వర్గీకరించారు. ముఖంపై తీవ్రమైన మొటిమలు, కంటి ఇన్ఫెక్షన్లు (క్యూటి బ్యాక్టీరియం), రోగనిరోధక శక్తిలేని వ్యక్తుల్లో ఇన్ఫెక్షన్లు (స్టెఫిలోకాకస్ ఎపిడెరి్మడిస్), మూత్ర ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయని గుర్తించారు. వీటితో పాటు అలెర్జీ సమస్యలు, శరీరాన్ని రక్షించే తెల్లరక్త కణాలతోపాటు ఇతర కణజాలాల సమూహాన్ని దెబ్బతీయడం, పచ్చ»ొట్టు చుట్టూ మచ్చలు ఏర్పడటం పెరుగుతున్నాయి. బ్లడ్ క్యాన్సర్ ముప్పు పచ్చ»ొట్లు ప్రాణాంతక లింఫోమా(బ్లడ్ క్యాన్సర్)కు కారకాలవుతున్నాయి. ఇవి శరీరంలోని అవయవాల పనితీరును దెబ్బతీసి వ్యక్తి మరణానికి దారితీస్తున్నాయి. 11,905 మందిపై పరిశోధన చేస్తే.. పచ్చ»ొట్టు వేసుకోని వ్యక్తులతో టాటూ ఉన్న వ్యక్తులను పోలిస్తే మొత్తం లింఫోమా ప్రమాదం 21 శాతం పెరిగింది. ఆసక్తికరంగా, లేజర్ చికిత్స ద్వారా పచ్చ»ొట్టు తొలగించుకున్న వ్యక్తుల్లో లింఫోమా ప్రమాదం తీవ్రంగా ఉన్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పచ్చ»ొట్టు తొలగించే సమయంలో ఉత్పత్తి అయ్యే హానికరమైన సమ్మేళనాలతో ఇది సంభవిస్తున్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
ఆగిన సిరిమువ్వల సవ్వడి..యామినీ కృష్ణమూర్తి శివైక్యం
సాక్షి, న్యూఢిల్లీ/మదనపల్లె/అమరావతి: ప్రముఖ భరతనాట్య, కూచిపూడి, ఒడిస్సీ నృత్య కళాకారిణి, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ యామినీ కృష్ణమూర్తి (84) కన్నుమూశారు. వయసు రీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఏడు నెలలుగా బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆమె పార్థి వదేహాన్ని ఢిల్లీ గ్రీన్‌పార్క్‌లోని డి–బ్లాక్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు గ్రీన్‌పార్క్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు వెల్లడించారు. చాలా ఏళ్లుగా ఢిల్లీలోనే ఉంటూ ప్రదర్శనలు ఇస్తున్న కృష్ణమూర్తి ఈ ఏడాది జనవరిలో వయోభార సంబంధిత సమస్యలతో అపోలో ఆస్పత్రిలో చేరారు. అప్పట్నుంచి ఆస్పత్రి ఐసీయూలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు. 17వ ఏట తొలి ప్రదర్శన యామిని పూర్తిపేరు యామినీ కృష్ణమూర్తి పూర్ణతిలకం. చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940 డిసెంబర్ 20న ముంగర కృష్ణమూర్తి, లక్ష్మి దంపతులకు జన్మించారు. తండ్రి కృష్ణమూర్తి సంస్కృత పండితులు. నృత్యంపై ఉన్న మమకారంతో మదనపల్లెలోని ఓ డ్యాన్స్ మాస్టర్ వద్ద చిన్న వయసులోనే నాట్యం నేర్చుకొనేందుకు యామిని వెళ్లారు. ఆ తర్వాత కొంతకాలానికి తమిళనాడులోని చిదంబరంలో స్థిరపడ్డారు.తన తండ్రి ప్రోత్సాహంతో 5వ ఏట చెన్నైలోని రుక్మిణీదేవి అరండేల్ కళాక్షేత్రంలో భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించారు. అనంతరం కూచిపూడి, ఒడిస్సీ కూడా అభ్యసించారు. ఎండీ రామనాథన్ వద్ద కర్ణాటక సంగీతం, కల్పక్కం స్వామినాథన్ దగ్గర వీణ నేర్చుకున్నారు. యామిని తన తొలి ప్రదర్శనను తన 17వ ఏట 1957లో చెన్నైలో ఇచ్చారు. ఖండాంతరాలను దాటిన ప్రతిభ యామిని భరతనాట్య ప్రతిభ ఖండాతరాలను దాటింది. 17 ఏళ్ల వయసులో తొలిసారి ఆస్ట్రేలియాలో భరతనాట్య ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత అమెరికా, యూరొప్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఇండోనేసియా, థాయ్‌ల్యాండ్, సింగపూర్, మయన్మార్ వంటి దేశాల్లో భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలతో మంత్రముగ్ధుల్ని చేశారు. ఢిల్లీలో నృత్య కౌస్తుభ కల్చరల్ సొసైటీ యామినీ స్కూల్ ఆఫ్ డాన్స్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి యువతకు భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో శిక్షణ ఇస్తున్నారు. 2014లో మహిళా దినోత్సవం సందర్భంగా శాంభవి స్కూల్ ఆఫ్ డాన్స్ సంస్థ యామినికి నాట్య శాస్త్ర పురస్కారాన్ని అందించింది. ఢిల్లీలోని ఇందిరా ప్రియదర్శిని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మ్యూజిక్ అండ్ డాన్స్ అనే సంస్థకు డైరెక్టర్‌గా ఆమె కొన్నేళ్లు సేవలందించారు. ‘డకోటా’ ఫ్లైట్‌లో పాకిస్తాన్‌కు.. యామినీ కృష్ణమూర్తి నాట్యం గురించి తెలుసుకున్న పాకిస్తాన్ దేశస్తులు.. అక్కడ ప్రదర్శన నిమిత్తం ఆహ్వానించారు. దీంతో 1970లో ఆమె లాహోర్‌లో ప్రదర్శన ఇచ్చారు. ఆ సమయంలో భారత్ నుంచి ‘డకోటా’ ఫ్లైట్‌లో అతికష్టం మీద పాక్‌కు వెళ్లాల్సి వచ్చి ందని పలు సందర్భాల్లో ఆమె ప్రస్తావించారు. భరతనాట్యం, కూచిపూడి నాట్యప్రదర్శలను చూసిన పాకిస్థానీలు మంత్రముగ్థులై పలుమార్లు ఆమెను ఆహ్వానించడం విశేషం. ప్రముఖ సేవామూర్తి మదర్ థెరెసా చేతుల మీదుగా యామిని జ్ఞాపికను అందుకోవడం విశేషం. వివాహం చేసుకోకుండా.. నాట్య రంగానికే జీవితాన్ని అంకితం చేసిన యామిని వివాహం చేసుకోలేదు. తన నృత్య జీవిత విశేషాలను, నృత్యం నేర్చుకొనే క్రమంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, నేర్పించిన గురువుల వివరాలతో ‘ఎ ప్యాషన్ ఫర్ డ్యాన్స్’ పేరుతో పుస్తకం రచించారు. అనేక అవార్డులు ఆమె సొంతంయామినీ కృష్ణమూర్తి దేశ, విదేశాల్లో కూచిపూడి నృత్యానికి ఎంతో పేరు, ప్రఖ్యాతలు తెచ్చిపెట్టారు. కర్ణాటక సంగీతం నేర్చుకున్న యామిని.. పాటపాడుతూ నృత్య ప్రదర్శనలు ఇచ్చేవారు. భరతనాట్యంలో యామిని ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆమెను 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. టీటీడీ ఆస్థాన నర్తకిగానూ యామిని కొనసాగారు.భాగ్యనగరంతో అనుబంధం సాక్షి, హైదరాబాద్: యామినీ కృష్ణమూర్తికి హైదరాబాద్‌తో అనుబంధం ఉంది. సౌత్ ఇండియా కల్చరల్ అసోసియేషన్, కళాసాగర్ వంటి సంస్థలు ఏర్పాటు చేసిన అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె దశావతారం, కృష్ణ శబ్దం తదితర ప్రదర్శనలిచ్చి ప్రేక్షక లోకాన్ని మైమరిపించారు. ఉస్మానియా విశ్వ విద్యాలయం రవీంద్రనాథ్ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన ఆమె నృత్య ప్రదర్శన హైదరాబాద్ కళాప్రియులకు సుపరిచితం. తెలుగు విశ్వవిద్యాలయం ఆమెను సిద్ధేంద్రయోగి పురస్కారంతో గౌరవించింది. 2012లో హైదరాబాద్ రవీంద్రభారతిలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవాల్లో ప్రదర్శనలిచ్చారు. -
రసాయనిక ఆహారం వల్లే రోగాలు..!
సాక్షి, హైదరాబాద్: భూతాపాన్ని పెంపొందించటం ద్వారా రైతులను ఆత్మహత్యలకు గురిచేయటంతో పాటు వినియోగదారులను రోగగ్రస్తంగా మార్చుతున్న రసాయనిక వ్యవసాయాన్ని నిషేధించాలని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాశ్ పాలేకర్ పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల్ని దీటుగా తట్టుకుంటూ సంపూర్ణ ఆహార స్వావలంబన ద్వారా అన్ని విధాలా సమృద్ధిని సాధించటం సుభాశ్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిని అనుసరించటం తప్ప మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు.ఫిలింనగర్ క్లబ్లో మంగళవారం సాయంత్రం పలువురు సినీ ప్రముఖులు, సామాజిక వేత్తలతో జరిగిన చర్చాగోష్టిలో డా. పాలేకర్ ప్రసంగించారు. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత, శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు కె.ఎస్. వరప్రసాద్‌రెడ్డి, ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్, టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, నాఫ్స్క్వాబ్ మాజీ అధ్యక్షులు కొండ్రు రవీంద్రరావు, ఆధ్యాత్మికవేత్త సత్యవాణి, సినీ రచయిత భారవి, నాబార్్డ పూర్వ సీజీఎం మోహనయ్య, సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్ తదితరులతో పాటు వందలాది మంది ప్రకృతి వ్యవసాయ ప్రేమికులు పాల్గొన్నారు.డా. పాలేకర్ మాట్లాడుతూ, రసాయనిక వ్యవసాయం వల్ల బియ్యం, గోధుమలను మాత్రం ఉత్పత్తి చేసుకుంటున్నామని, వంటనూనెలు, పప్పుధాన్యాలను విదేశాల నుంచి లక్షల టన్నుల దిగుమతి చేసుకుంటున్నామని విమర్శించారు. రసాయనిక వ్యవసాయోత్పత్తులు దేశ ప్రజలను మధుమేహం, కేన్సర్ వంటి భయంకర జబ్బుల పాలు జేస్తున్న విషయాన్ని పాలకులు, సమాజం ఇప్పటికైనా గుర్తించాలన్నారు. సేంద్రియ వ్యవసాయంలోనూ టన్నుల కొద్దీ పశువుల ఎరువులు వేయటం వల్ల రసాయనిక వ్యవసాయంలో మాదిరిగానే కర్బన ఉద్గారాలు పెద్ద ఎత్తున వెలువడి భూతాపాన్ని పెంపొందిస్తున్నాయని ఆయన తెలిపారు.రసాయనిక వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోవటం వల్ల రైతులు అప్పులపాలై ఆత్మహత్యల పాలవుతున్నారని, రైతు కుటుంబాల్లోని యువత వ్యవసాయేతర రంగాల్లోకి వలస వెళ్లటం వల్ల భవిష్యత్తులో వ్యవసాయం చేసే రైతులు కరువయ్యే దుర్గతి నెలకొనబోతోందన్నారు.సుభాశ్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో నేలలో సూక్ష్మజీవులను పెంపొందించే జీవామృతం, ఘన జీవామృతం వంటి మైక్రోబియల్ కల్చర్‌ను కొద్ది మొత్తంలో వేస్తే సరిపోతుందని, టన్నుల కొద్దీ పశువుల ఎరువులు వేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయాలను ఆకళింపు చేసుకొని 5 లేయర్ పద్ధతిలో సాగు చేస్తే ఎకరానికి తొలి ఏడాదిలోనే రూ. 1.5 లక్షల ఆదాయం వస్తుందని, ఆరేళ్ల నుంచి ఏటా ఎకరానికి రూ. 6 లక్షల ఆదాయం వస్తుందని.. రైతులు సాగు చేస్తున్న నమూనా క్షేత్రాలు సాక్ష్యంగా ఉన్నాయన్నారు. భూములను పునరుజ్జీవింపజేసుకుంటూ భవిష్యత్తులో పెరిగే జనాభాకు ఆహార కొరత లేకుండా చూడాలంటే ప్రకృతి నియమాలను అనుసరిస్తూ ఎస్.పి.కె. వ్యవసాయ పద్ధతిని అనుసరించాలన్నారు. ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఇదొక ప్రజా ఉద్యమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తోందని, తెలుగు రాష్టా్రల్లో ప్రతి గ్రామానికీ ఈ వ్యవసాయాన్ని తీసుకెళ్లడానికి అందరూ సహకరించాలని పాలేకర్ కోరారు.7 వేల మందితో మెగా శిక్షణా శిబిరం..2015 ఫిబ్రవరి 15 నుంచి 23 వరకు రంగరెడ్డి జిల్లాలోని కన్హ శాంతివనంలో 7 నుంచి 10 వేల మంది రైతు కుటుంబీకులతో మెగా శిక్షణా శిబిరాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు శిబిరం నిర్వాహకులు, సేవ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్ ప్రకటించారు. డా. పాలేకర్ ఈ 9 రోజుల శిబిరంలో రోజుకు పది గంటల పాటు శిక్షణ ఇస్తారన్నారు. 7 వేల మంది రైతులు, 3 వేల మంది రైతుల జీవిత భాగస్వాముల్ని సైతం ఈ శిబిరానికి ఆహ్వానిస్తున్నామన్నారు. తెలుగు రాషా్ట్రల్లో ప్రతి గ్రామానికీ సుభాష్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలన్నదే లక్ష్యమని విజయరామ్ వివరించారు.శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు కె.ఎస్. వరప్రసాద్‌రెడ్డి ప్రసంగిస్తూ పాలేకర్ వ్యవసాయ పద్ధతిపై రైతు శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పడానికి తన వంతు సహాయం చేస్తానని ప్రకటించారు. ఆధ్యాత్మికవేత్త సత్యవాణి మాట్లాడుతూ పాలేకర్ కారణజన్ములని, ఈ వ్యవసాయ పద్ధతిని ప్రతి గ్రామానికీ తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఇవి చదవండి: లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు -
సెల్‌ఫోన్‌తో హై బీపీ!
సాక్షి, అమరావతి: మొబైల్ ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడితే అధిక రక్తపోటు (హై బీపీ) ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దైనందిన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సెల్ఫోన్లతో అంతే స్థాయి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు మొబైల్ ఫోన్లో మాట్లాడేవారిలో దుష్ప్రభావాలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయని, ముఖ్యంగా రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనంలో తేల్చారు. ‘యూరోపియన్ హార్ట్ జర్నల్–డిజిటల్ హెల్త్’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. చైనాలోని గ్వాంగ్జౌలోని సదరన్ మెడికల్ వర్సిటీ పరిశోధకులు మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ శక్తి రక్తపోటు పెరుగుదలతో ముడిపడి ఉందని గుర్తించారు.130 కోట్ల మందిలో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30–79 సంవత్సరాల వయసు గల దాదాపు 130 కోట్ల మంది అధిక రక్తపోటు సమస్య ఎదుర్కొంటున్నారు. ఇందులో 82% మంది తక్కువ, మధ్య–ఆదాయ దేశాలలో నివసిస్తున్న వారే. భారత్‌లో 120 కోట్ల మందికిపైగా మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉంటే 22 కోట్ల మంది అధిక రక్తపోటు బాధితులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. రక్తపోటు సమస్య గుండెపోటు, అకాల మరణానికి దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.హైబీపీ వల్ల వచ్చే హైపర్ టెన్షన్, ఇతర సమస్యలపై అవగాహన పెంచుకోవాలన్నారు. తాజా పరిశోధనలో వారంలో 30 నిమిషాల కంటే తక్కువ సమయం ఫోన్లో మాట్లాడే వారితో పోలిస్తే మిగిలిన వారిలో రక్తపోటు వచ్చే ప్రమాదం 12% ఎక్కువగా ఉంటుందని తేల్చారు. వారానికి ఆరుగంటలకు పైగా ఫోన్లో మాట్లాడేవారిలో రక్తపోటు ప్రమాదం 25 శాతానికి పెరిగింది.కండరాలపై ఒత్తిడి..మెడ, భుజాలు, చేతుల్లో కండరాల నొప్పులు అత్యంత సాధారణ దుష్ప్రభావాలలో ఒకటిగా వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ సేపు ఫోన్‌ను పట్టుకోవడంతో కండరాలు ఒత్తిడికి గురవడంతో పాటు తీవ్ర తలనొప్పికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఫోన్‌ను చెవికి చాలా దగ్గరగా పెట్టుకుని మాట్లాడటం, ఇయర్‌ఫోన్లు్ల, హెడ్ఫోన్లను నిరంతరం ఉపయోగించడంతో టిన్నిటస్ (చెవుల్లో నిరంతరం రింగింగ్ సౌండ్ వినిపించే పరిస్థితి) వంటి చెవి సమస్యలు వస్తాయంటున్నారు. ఫోన్ స్క్రీన్‌పై ఎక్కువ సేపు చూడటంతో కంటిపై ఒత్తిడి పెరిగిన కళ్లుపొడిబారడం, చూపు మసకబారడం, తలనొప్పి, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుందని పేర్కొంటున్నారు. -
Silent Village of India: అక్కా చెల్లెళ్ల ‘నిశ్శబ్ద’ విప్లవం
గందోహ్(జమ్మూకశ్మీర్): ఆరోగ్యంగా ఉండి కూడా ఓటేయడానికి బద్ధకించే పౌరులున్న దేశం మనది. అలాంటిది పుట్టుకతోనే చెవుడు, మూగ సమస్యలతో ఇబ్బందులు పడుతూ కూడా ఓటేయడానికి ముందుకొచ్చి మొత్తంగా గ్రామానికే ప్రేరణగా నిలిచిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల స్ఫూర్తిదాయక గాథ ఇది. గ్రామంలో సగం కుటుంబాలకు సమస్యలు జమ్మూకశీ్మర్‌లోని డోడా జిల్లాలోని భద్రవాహ్ పట్టణానికి 105 కిలోమీటర్ల దూరంలోని కొండప్రాంతంలో దధ్‌కాయ్ గిరిజన గ్రామం ఉంది. గ్రామంలో కేవలం 105 కుటుంబాలే నివసిస్తున్నాయి. ఇందులో సగానికి పైగా అంటే 55 కుటుంబాలను దశాబ్దాలుగా ఆరోగ్యసమస్యలు చుట్టుముట్టాయి. ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరైనా మూగ, చెవిటివారిగా మిగిలిపోతున్నారు. ఇలా గ్రామంలో 84 మంది ఉన్నారు. వారిలో 43 మంది మహిళలు, పదేళ్లలోపు 14 మంది చిన్నారులు ఉన్నారు. ఎక్కువ మంది మాట్లాడలేని కారణంగా ఈ గ్రామానికి సైలెంట్ విలేజ్ ఆఫ్ ఇండియా అనే పేరు పడిపోయింది. రేహమ్ అలీ ముగ్గురు కూతుళ్లు రేష్మా బానో(24), పరీ్వన్ కౌసర్(22), సైరా ఖాటూన్(20)లకూ ఏమీ వినిపించదు. మాట్లాడలేరు కూడా. అయితే ఓటేసి తమ హక్కును వినియోగించుకోవాలనే కోరిన ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లలో బలంగా నాటుకుపోయింది. ఈసారి ఎలాగైనా ఓటేస్తామని ముగ్గురూ ఘంటాపథంగా చెబుతున్నారు. వీళ్లు ఓటేస్తుండటం ఇదే తొలిసారికావడం విశేషం. బీజేపీ నేత జితేంద్రసింగ్ పోటీచేస్తున్న ఉధమ్‌పూర్ ఎంపీ నియోజకవర్గం పరిధిలోనే ఈ గ్రామం ఉంది. శుక్రవారం జరగబోయే పోలింగ్‌లో ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నామని తమ ఊరికొచి్చన మీడియా వాళ్లకు ఈ అక్కాచెల్లెళ్లు తమ ఓటర్ ఐడీ కార్డులు చూపించిమరీ చెబుతున్నారు. ‘ మొదటిసారిగా ఓటేయనున్న మ్యూట్ మహిళల ఉత్సాహం ఊరి జనం మొత్తానికి స్ఫూర్తినిస్తోంది’ అని పొరుగింటి వ్యక్తి జమాత్ దానిష్ ఆనందం వ్యక్తంచేశారు. ‘‘ ఔత్సాహిత యువ మహిళా ఓటర్లను చూసి మొత్తం గ్రామమే గర్వపడుతోంది. ప్రతి ఇంట్లో ఇదే చర్చ. ఈ సారి ఇక్కడ 100 శాతం పోలింగ్ నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు ’’ అని గ్రామ మాజీ వార్డు సభ్యుడు మొహమ్మద్ రఫీఖ్ వ్యాఖ్యానించారు. -
‘కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోంది.. జైలులో 4.5 కేజీల బరువు తగ్గారు’
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ (రిమాండ్ ఖైదీ)లో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో తిహార్ జైల్లో ఉన్న సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యం సరిగా లేదని జలవనరుల శాఖ మంత్రి ఆతీశీ అన్నారు. ఆయన అస్వస్థతకు గురయ్యారని.. మార్చి 21న సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు 4.5 కిలోల బరువు తగ్గారని ‘ఎక్స్ ’వేదికగా ఆమె తెలిపారు. ‘సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రమైన మధుమేహం (డయాబెటిక్స్) కలిగి ఉన్నారు. ఆరోగ్య సమ్యలు ఉన్నపటికీ ఆయన దేశం కోసం రోజంతా పని చేస్తున్నారు. అరెస్ట్ అయిన దగ్గరి నుంచి కేజ్రీవాల్ 4.5 కిలోల బరువు తగ్గారు. ఇది చాలా బాధ కలిగించే విషయం. బీజేపీ కావాలని కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోంది. కేజ్రీవాల్‌కు ఏమైనా అయితే దేశమే కాదు.. భగవంతుడు కూడా క్షమించడు’అని మంత్రి ఆతీశీ ఆవేదన వ్యక్తం చేశారు. अरविंद केजरीवाल एक severe diabetic हैं। स्वास्थ की समस्याओं के बावजूद, वे देश की सेवा में 24 घण्टे लगे रहते थे। गिरफ़्तारी के बाद से अब तक, अरविंद केजरीवाल का वज़न 4.5 किलो घट गया है। यह बहुत चिंताजनक है। आज भाजपा उन्हें जेल में डाल कर उनके स्वास्थ को ख़तरे में डाल रही है। अगर… — Atishi (@AtishiAAP) April 3, 2024 అయితే తీహార్ జైలు అధికారు ఆతీశీ మాటలపై స్పందిస్తూ.. కేజ్రీవాల్ ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. రెండు రోజు క్రితం ఆయన తీహార్ జైలుకు వచ్చినప్పటి నుంచి కేజ్రీవాల్ బరువు తగ్గలేదని చెప్పారు. అత్యంత భద్రత గల జైలు గదిలో ఆయన్ను ఉంచినట్లు తెలిపారు. అదేవిధంగా కేజ్రీవాల్ 55 కేజీల బరువు ఉన్నారు. ఆయన బరువులో ఎలాంటి మార్పు లేదు. ఆయన షుగర్ లెవల్స్ కుడా నార్మల్‌గానే ఉన్నాయని జైలు అధికారులు తెలిపారు. ఉదయం కేజ్రీవాల్ యోగా, మెడిటేషన్ చేస్తున్నారని అన్నారు. ఆయకు కేటాయించిన సెల్లో కేజ్రీవాల్ నడుస్తున్నారని చెప్పారు. ఇక..ఈడీ కస్టీడీ ముగిసిన అనంతరం అరవింద్ కేజీవాల్ను సోమవారం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలు పంపిన విషయం తెలిసిందే. ఆయన జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 15ను వరకు కొనసాగనుంది. -
విషపూరిత నురుగులు కక్కుతున్న యమునమ్మ, ఎవరూ పట్టించుకోరే?
దేశంలో ఒక పక్క సార్వత్రిక ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకుంటోంది. మరో పక్క రోజు రోజుకి కాలుష్య కాసారంగా మారిపోతున్న పవిత్ర యమునా నదీ తీరం మరోసారి కాలుష్య సెగలు కక్కుతోంది. టన్నుల కొద్దీ మురుగునీరు, పారిశ్రామిక, గృహ వ్యర్ధాలతో విషపూరిత నురుగుతో నిండిపోయింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో అనూహ్యంగా పెరిగిపోతున్న కాలుష్యానికి సాక్షీభూతంగా నిలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. యమున ఉపరితలంపై విషపూరిత నురుగు తేలుతున్న వీడియోలు గతంలో చాలా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి .అలాగే కోవిడ్ లాక్డౌన్ కాలంలో యమునకు కాలుష్యం స్థాయి చాలావరకు తగ్గి ప్రశాంతంగా కనిపించడం గమనార్హం. తీవ్రమైన కాలుష్యంతో యమునా నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీని దుష్ప్రభావాలు, పొంచివున్న ముప్పుపై వాతావరణ నిపుణులు, శాస్త్రజ్ఞులు ఎంత మొత్తుకుంటున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదంటూ నెటిజన్లు మండి పడుతున్నారు. తక్షణమే కనీస జాగ్రత్తలు చేపట్టాలని కోరుతున్నారు. Kalindi Kunj ... Yamuna Delhi . Beautiful poisonous pink water froth with chemicals ,, @ArvindKejriwal promised clean Yamuna in 2017 ,,nothing happened@SwatiJaiHind @AtishiAAP ... IIT quota admission , is useless pic.twitter.com/svcQ3wdYGw — No Conversion (@noconversion) May 19, 2023 నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఢిల్లీ, హర్యానా ,ఉత్తరప్రదేశ్ నుండి శుద్ధి చేయని మురుగునీటిలో ఫాస్ఫేట్లు, సర్ఫ్యాక్టెంట్లు (రసాయన సమ్మేళనాలు) యమునలో కలిసిపోతున్నాయి. ఇదే విషపూరిత నురుగుకు కారణం. ఈ రెండింటిలోనూ 99 శాతం గాలి, నీటిలో కలిసి పోతుంది.ఫలితంగా అనేక బాధలు తప్పవు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, అలర్జీలు లాంటి సమస్యలొస్తాయి. ఈ రసాయనాలతో జీర్ణకోశ సమస్యలు ,టైఫాయిడ్ వంటి వ్యాధులు రావచ్చు. దీర్ఘకాలం పాటు ఈ పారిశ్రామిక కాలుష్య కారకాలకు ఎక్స్పోజ్ అయితే నరాల సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడతాయి. ఒక్కోసారి ఇది ప్రాణాంతకం కూడా కావచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
శాకాహారం మాత్రమే తీసుకుంటే..ఈ సమస్యలు వస్తాయట..!
ఇటివల కాలంలో ఆహారంపై స్ప్రుహ బాగా పెరిగింది. అందులోనూ శాకాహారమే మంచిందటూ వీగన్ డైట్ ఫాలో అవ్వుతున్నారు. ఇలా కేవలం శాకాహారం మాత్రమే తీసుకున్న సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా అందరిలోనూ ఉండదని అన్నారు. ప్రోటీన్ డెఫిషయన్సీతో బాధపడేవారు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని చెబుతున్నారు. ఇంతకీ ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటే..? కేవలం కూరగాయలు మాత్రమే తీసుకున్నా అనేక విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. అయితే ఎక్కువ కేలరీలు పొందడం కష్టం. కేలరీల కొరత మన శక్తి స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఎక్కవ కేలరీల కోసం పౌష్టికాహారంపై దృష్టి పెట్టక తప్పదు. ఇలా శాకాహారమే తినేవారు ముఖ్యంగా ప్రోటీన్ లోపం అనే మరో సమస్యను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఎందుకంటే? మాంసం ప్రోటీన్లకు నిలయం. అయితే శాకాహారులు కూరగాయల్లో కూడా ప్రోటీన్లతో కూడిన ఉంటాయి. వాటిని ఎంచుకుని తినడం అనేది అత్యంత ముఖ్యం. కేవలం కూరగాయలే తినడం వల్ల పీచుపదార్థం అధికమై గ్యాస్ సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది అందర్నీ ప్రభావితం చేసే సమస్య కాదు. కొందరిలో మాత్రం ఈ సమస్య ఎక్కువగా ఉండొచ్చు. అలాగా శాకాహారులు ప్రోటీన్ల కోసం సోయా ఉత్పత్తులపై దృష్టి పెట్టడంతో హార్మోన్ల మార్పులకు దారితీసి లేనిపోని సమస్యలు తలెత్తవచ్చు. కొంతమంది శాకాహారులలో పోషకాహార లోపం డిప్రెషన్‌కు దారితీస్తుంది. అలాగే వీళ్లు ఎక్కువగా రక్తహీనతను ఎదర్కొంటారు. దీంతో గాయాల బారిన పడ్డ, అధికస్రావం అయినా, వారికి ప్రాణాంతకంగా మారిపోతుంది. అందువల్ల శాకాహారులు కేవలం కూరగాయలు తినేటప్పుడూ శరీరానికి సముతుల్యమైన రీతిలో కావాల్సిన పోషకాలు అందుతున్నాయో లేదో గమనించి తీసుకోవాలి. అలాగే న్యూట్రిషియన్ల సాయంతో శరీరానికి సరిపడే ప్రోటీన్లు అందేలా చూసుకోవాల్సి ఉంటుంది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చింది. వ్యక్తిగత వైద్యులు లేదా న్యూటిషియన్లను సంప్రదించి పూర్తి స్థాయిలో తెలుసుకుని అప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. (చదవండి: ఫ్రిజ్‌లో పెట్టిన కర్రీ తింటే డేంజరా? ఎన్ని రోజుల ఉంచితే బెటర్..?) -
శానిటరీ నాప్కిన్ల పంపిణీలో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: ఆడబిడ్డల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ వారిపట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కనబరుస్తున్న ప్రత్యేక శ్రద్ధ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. మెన్స్ట్రువల్ హైజీన్ (నెలసరి పరిశుభ్రత) కార్యక్రమం అమలులో ఏపీ దేశంలోనే అగ్రగామిగా ఉంటోంది. ఈ అంశాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ లోక్‌సభలో వెల్లడించింది. నెలసరి సమయంలో స్కూళ్లు, కాలేజీల్లో చదివే విద్యార్థినులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ద్వారా శానిటరీ నాప్కిన్లను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఇలా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబరు మధ్య 72.59 లక్షల నాప్కిన్లను పంపిణీ చేసి పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉండగా.. 59,63,209 శానిటరీ నాప్కిన్ల పంపిణీతో ఏపీ రెండో స్థానంలో ఉంది. అనంతరం.. 45.86 లక్షలతో తమిళనాడు మూడో స్థానంలో నిలిచింది. ఇక కేరళలో 80,166, కర్ణాటకలో కేవలం 5,613, తెలంగాణలో 3,920 మాత్రమే పంపిణీ చేశారు. కేటాయించిన నిధుల ఖర్చులో నెంబర్ వన్.. ఇక నెలసరి పరిశుభ్రత కార్యక్రమాలు అమలుచేయడం ద్వారా భవిష్యత్తులో బాలికలు అనారోగ్య సమస్యల బారినపడకుండా నియంత్రించేందుకు కేటాయించిన నిధులను ఖర్చుచేయడంలో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్ల మేర నిధులు కేటాయించడమే కాకుండా దేశంలోనే అత్యధికంగా వంద శాతం నిధులను ఖర్చుచేసింది. పశ్చిమ బెంగాల్లో రూ.389 కోట్లు కేటాయించగా కేవలం రూ.9.32 కోట్లు, తెలంగాణాలో రూ.303 కోట్లు కేటాయించినప్పటికీ రూ.4 లక్షలు మాత్రమే ఖర్చుచేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రతీనెలా 10 లక్షల మంది బాలికలకు.. నెలసరి ఇబ్బందులతో బాలికలు విద్యకు దూరమవుతున్న పరిస్థితులను సీఎం జగన్ ప్రభుత్వం గుర్తించింది. దేశంలో దాదాపు 23 శాతం బాలికల చదువులు ఆగిపోవడానికి ప్రధాన కారణం నెలసరి సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులేనని యునైటెడ్ నేషన్స్ వాటర్ సఫ్లై అండ్ శానిటేషన్ కొలాబరేటివ్ కౌన్సిల్ నివేదికల్లో వెల్లడించారు. ఈ తరహా డ్రాపౌట్స్‌ను తగ్గించడంతో పాటు, బాలికలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని 2021లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఏడు నుంచి ఇంటర్మిడియట్ చదువుతున్న 10 లక్షల మంది బాలికలకు ప్రతినెలా ఒకొక్కరికి 10 చొప్పున నాణ్యమైన, బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్లను ఉచితంగా అందిస్తున్నారు. ఇందుకోసం ఏటా ప్రభుత్వం రూ.30 కోట్ల మేర ఖర్చుచేస్తోంది. ప్రత్యేకంగా స్నేహపూర్వక కౌమార దశ క్లినిక్‌లు.. ఇక కౌమార దశలో బాలబాలికలకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యల నివృత్తికి, వారికి వైద్యసేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రత్యేకంగా స్నేహపూర్వక కౌమార క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. క్లినిక్‌లలో సేవలు అందించే వైద్యులు.. కౌమార దశ పిల్లలపట్ల ఏ విధంగా వ్యవహరించాలి.. తదితర అంశాలపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చారు. అంతేకాక.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానంలో గ్రామాలకు వెళ్లిన డాక్టర్లు మధ్యాహ్నం నుంచి పాఠశాలలు సందర్శించి అక్కడి బాలికల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. ఎదుగుతున్న సమయంలో శరీరంలో వచ్చే మార్పుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళా ఉపాధ్యాయులు, మహిళా అధ్యాపకులు, గ్రామ సచివాలయాల్లోని ఏఎన్ఎంలు ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అపరిశుభ్ర పద్ధతులతో సమస్యలు.. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థినుల్లో చాలావరకు మధ్యతరగతి, పేద కుటుంబాల వారుంటారు. వీరికి శానిటరీ నాప్కిన్లు కొనే ఆర్థిక స్థోమత ఉండదు. దీంతో.. ► నెలసరి సమయంలో వస్త్రాన్ని వాడే విధానాన్ని అపరిశుభ్ర పద్ధతిగా వైద్యులు చెబుతారు. ఇలా వాడటంతో రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్ఫన్లు (జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్లు–ఆర్టీఐ) వస్తాయి. ► అలాగే.. సాధారణంగా జననాంగంలో రక్షణకు అవసరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను స్రవించే లాక్టోబాసిల్లై అనే మంచి బ్యాక్టీరియాతో పాటు కొద్ది మోతాదులో వేరే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. వస్త్రం వంటి అపరిశుభ్రమైన పద్ధతులతో జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్ల ముప్పు ఏర్పడిన తర్వాత కాలంలో సంతానలేమి, శృంగారంతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధులొస్తాయి. ► అంతేకాదు.. హానికరమైన బ్యాక్టీరియాతో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుంది. భవిష్యత్‌లో సంతానలేమి సమస్యలూ తలెత్తుతాయి. -
డాక్టర్లు లేకుండానే ఆరోగ్య పరీక్షలు... ఏఐ మహత్యం!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధస్సు) కొత్త పుంతలు తొక్కుతుంది. పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని మనిషి చేసే దాదాపు అన్ని పనులను యంత్రాలు చేయగలిగేలా తయారు చేస్తున్నారు. ఇప్పుడు వైద్య రంగంలోనూ సరికొత్త ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుంది ఏఐ. ఎందుకంటే ఇప్పుడు అనారోగ్యంగా అనిపిస్తే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పనిలేదు. బీపీ, షుగర్ నుంచి స్కానింగ్ వరకు అన్ని రకాల ట్రీట్మెంట్లను కృత్రిమంగా అందిస్తుంది. మనకు ఏదైనా జ్వరం వచ్చినా, అనారోగ్యంగా అనిపించినా ఏం చేస్తాం? వెంటనే డాక్టర్ వద్దకు పరుగులు తీస్తాం. సమస్యను బట్టి ఆయా డాక్టర్‌ను ఎంచుకుంటాం. కానీ ఇప్పుడు హాస్పిటల్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే మొభైల్లోనే మన హెల్త్ అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ఆధారితమైన వినూత్న హెల్త్ క్లినిక్ ఫ్లాట్ఫారమ్ను ఇప్పుడు పరిశోధకులు అభివృద్ది చేశారు. జిమ్, మాల్స్, ఆఫీసుల్లో ఏఐ ఆధారిత కేర్పాడ్స్ను అమెరికాలో ఈమధ్యే ప్రారంభించారు. పేషెంట్స్ లోపలికి అడుగుపెట్టగానే రొబాటిక్ వాయిస్ మెసేజ్‌తో గైడెన్స్ లభిస్తుంది. మన మొబైల్లో లాగిన్ అయ్యి స్క్రీన్‌పై చూపిస్తున్న ఫీచర్లలో మన అనారోగ్యానికి సంబంధించిన వాటిని ఎంచుకోవచ్చు. ఉదాహరణకు మీకు బాడీ స్కానింగ్ చేయించుకోవాలనిపిస్తే స్క్రీన్‌పై కనిపించే ఆఫ్షన్‌ను ఎంచుకొని చెకప్ చేయించుకోవచ్చు. మన బాడీలో సూది గుచ్చకుండానే బ్లాడ్ సాంపిల్స్ కలెక్ట్ తీసుకొనే అరుదైన ఫీచర్ ఇందులో ఉంది. హార్ట్ హెల్త్, బ్రెయిన్, బీపీ.. ఇలా మీ సమస్యకు సరిపోయే వైద్య సహకారం క్షణాల్లో లభిస్తుంది. కేర్ పాడ్స్‌లో నమోదైన పేషెంట్ డేటాను డాక్టర్‌కు పంపిస్తుంది. నిమిషాల్లో మీ పరిస్థితిని సమీక్షించి మొభైల్లో రిపోర్ట్స్‌ను పంపిస్తారు. ప్రైమరీ డాక్లర్ల కొరతను కేర్ పాడ్స్ రిప్లేస్ చేస్తుందన్నమాట. నెలకు 8200 మెంబర్ షిప్ కట్టి ఎప్పుడైనా మీ హెల్త్ అప్డేట్ను తెలుసుకోవచ్చు. ఇప్పటికే అమెరికాలో కొన్ని మాల్స్‌లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. రానున్న రోజుల్లో చాండ్లర్, అరిజోనా,చికాగో సహా మరిన్ని ప్రాంతాల్లో చేరువ చేసేందుకు ప్రణాళికులు సిద్దం చేస్తున్నారు. అయితే ఈ ఆర్టిఫిషియల్ డాక్టర్ కేర్‌ను కొందరు కొట్టిపారేస్తున్నారు. ప్రత్యక్షంగా డాక్టర్‌ను కలిసినప్పుడే పేషెంట్స్ చెప్పే కొన్ని విషయాలను బట్టి సమస్యను తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు తీవ్రమైన ఇబ్బందులు కూడా బయటకొచ్చిన సందర్భాలు ఎన్నో. కానీ ఇలా మెషీన్ సహాయంతో పేషెంట్ పరిస్థితి పూర్తిగా అంచనా వేయకపోవచ్చు అనే కొందరు విమర్శిస్తున్నారు. -
Dr. Lasya Sai Sindhu: సమస్యను గుర్తించడమే అసలైన మందు
ఎవరికీ చెప్పుకోలేని వేదన, భావోద్వేగాల ఒత్తిడి శరీరం మీద పడుతుంది. చాలావరకు ఆరోగ్య సమస్యలు మందులతో నయం కావచ్చు. కానీ, కొన్నింటికీ ఎంతకీ పరిష్కారం దొరకకపోతే, అందుకు మూల కారణమేంటో తెలుసుకోవడానికి తగిన శోధన అవసరం. వర్టిగో (కళ్లు తిరగడం) సమస్యకు మూల కారణమేంటో తెలుసుకుంటూ చికిత్స చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ వాసి న్యూరటాలజిస్ట్ డాక్టర్ లాస్య సాయి సింధుకు కేంద్రప్రభుత్వం ఇటీవల ‘నేషనల్ అచీవర్స్ అవార్డ్ ఫర్ హెల్త్ ఎక్సలెన్స్’ అవార్డును ఇచ్చి సత్కరించింది. ఈ సందర్భంగా లాస్య సాయి సింధును సాక్షి పలకరించింది. నలభైఏళ్లకు పైబడిన ఒక మహిళ... ‘మంచం మీద పడుకుంటే కళ్లు తిరుగుతున్నాయి’ అనే సమస్యతో వచ్చింది. రెండేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతూ మంచం మీద కాకుండా కుర్చీలో కూర్చుని నిద్రపోవడం అలవాటు చేసుకుంది. పూర్తి చికిత్స తర్వాత ఇప్పుడు మామూలుగా మం^è ం మీద నిద్రపోగలుగుతోంది. 90 శాతం మహిళలు భావోద్వేగాల ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. పదిహేనేళ్ల అబ్బాయి స్కూల్లో బెంచిమీద కూర్చున్న కాసేపటికి కళ్లు తిరిగే సమస్యతో బాధపడుతూ సరిగా చదవలేకపోతున్నాడు. చికిత్సలో అతనికి చదువుకు సంబంధించిన సమస్యనే కాదు, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉండే విభేదాలు కూడా కారణమని తెలిసింది. పనిలో చురుకుగా ఉండే యాభైఏళ్ల వ్యక్తి రెండు నెలలుగా కళ్లు తిరుగుతున్నాయన్న సమస్యను ఎదుర్కొంటూ పరిష్కారం కోసం వచ్చారు. కరోనా తర్వాత వైరల్ అటాక్ అతని మెదడు పనితీరులో సమస్యకు కారణం అయ్యిందని తేలింది. ఇలాంటివెన్నో ప్రతిరోజూ చూస్తుంటాం. నేను ఈఎన్టీ సర్జన్‌ని. వెర్టిగో అండ్ బ్యాలెన్స్ డిజార్డర్‌లో పరిశోధన చేశాను. ఈఎన్టీలోనే మరింత ఉన్నతమైన విద్యార్హత ఈ న్యూరటాలజిస్ట్. 200 మంది వర్టిగో పేషెంట్స్‌పై పరిశోధన చేసినప్పుడు నాకు ఈ విభాగంలో ఆసక్తి పెరిగింది. నాలుగేళ్లుగా న్యూరటాలజిస్ట్గా వైద్య రంగంలో సేవలందిస్తున్నాను. చేస్తున్న కృషికి గుర్తింపుతోపాటు గతంలోనూ రెండు జాతీయస్థాయి అవార్డులు అందుకున్నాను. వచ్చిన రివ్యూస్... ఈ సమస్యలో ప్రధానంగా మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అందుకని, 5–10 నిమిషాల్లో పేషెంట్ పూర్తి సమస్య అర్థం కాదు. ఈ గంట సమయంలో చేసిన చికిత్సకు రోగిలో సరైన మార్పులు రావడం, వారు ఇచ్చే రివ్యూస్.. మంచి గుర్తింపును తీసుకు వచ్చాయి. అన్ని వర్గాల్లోనూ... ఇటీవల చూస్తున్న కేసుల్లో మగవారిలోనూ సమస్య ఎక్కువ గమనిస్తున్నాం. నిజానికి ఆడవాళ్లలోనే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అనుకుంటాం. కానీ, మగవారు తమ సమస్యలను బయటకు చెప్పుకోరు. భావోద్వేగాలను బయటకు వెలిబుచ్చరు. ఈ సమస్య వర్టిగోకు దారితీస్తుంది. మరో ఆందోళనకర సమస్య ఏంటంటే.. టీనేజ్ పిల్లల్లో వర్టిగో కనిపిస్తోంది. మానసికంగా వారు ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నారు. వీరిలో చదువుకు సంబంధించినవి, కుటుంబ సమస్యలు... కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఫ్యామిలీ కౌన్సెలింగ్ ముందు పేషెంట్‌కు సంబంధించిన అన్నిరకాల టెస్ట్ రిపోర్ట్స్ పరిశీలించి చూస్తాం, వారు చెప్పిన ఆరోగ్య సమస్యమీద వర్క్ చేస్తాం. ఆ తర్వాత ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇస్తాం. వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వర్టిగో సమస్యలు పెరిగాయి కాబట్టి ఫిజికల్ హెల్త్ ఆ తర్వాత ఎమోషనల్ హెల్త్ కూడా చూస్తున్నాం. కుటుంబం కూడా ఈ సమస్య పట్ల అవగాహన పెంచుకొని, పేషెంట్‌కు సపోర్ట్‌గా ఉండాలి. ఆన్లైన్ అవగాహన కాన్ఫరెన్స్, సోషల్‌మీడియా ద్వారా కూడా అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. విదేశాల నుంచి కూడా ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకునేవారున్నారు. ముఖ్యంగా విదేశాలలో ఎమ్మెస్ చేసేవాళ్లు ఉంటున్నారు. జీవితంలో ఎవరికి తగ్గ సమస్య వారికి ఉంటుంది. దానినుంచి బయటకు రావడమే ముఖ్యం. అందుకోసం చేసే ప్రయత్నం ప్రతిరోజూ ఉంటుంది. డాక్టర్‌గా రోజు చివరలో నా నుంచి చికిత్స తీసుకున్నవాళ్లు ‘మా సమస్యకు సరైన పరిష్కారం దొరికింది’ అనుకుంటే చాలు. అదే పెద్ద అవార్డ్’’ అంటారు ఈ డాక్టర్. కోవిడ్ తర్వాత... ‘కళ్లు తిరుగుతున్నాయి..’ అనే సమస్యతో వచ్చే వారి సంఖ్య కోవిడ్ తర్వాత బాగా పెరిగింది. గతంలో ఒత్తిడి, భావోద్వేగాలలో మార్పు కారణం అనుకునేవాళ్లం. ఆ తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్ కూడా కారణం అని తెలిసింది. వర్టిగో సమస్యకు టాబ్లెట్స్ ఇస్తారు డాక్టర్లు. టాబ్లెట్లు వాడినప్పుడు బాగానే ఉంటుది. ఆ తర్వాత మళ్లీ మామూలే! దీనికి టాబ్లెట్స్తోపాటు కౌన్సెలింగ్, కొన్ని ఎక్సర్సైజ్లు కూడా అవసరం అని గమనించాను. ఒక పేషెంట్‌కి ఇచ్చే చికిత్స 40 నుంచి 50 నిమిషాల సమయం పడుతుంది. వారంలో మూడుసార్లు ఈ సెషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. – డాక్టర్ లాస్య సాయి సింధు – నిర్మలారెడ్డి -
దశాబ్దాల నిర్లక్ష్యానికి చికిత్స 'ప్రజారోగ్య విప్లవం'
పల్నాడు జిల్లా యండ్రాయి, ధరణికోట గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధి వడ్డే బాలశేఖర్: ఈ ఫొటోలోని షేక్ రిహానాకు ఏడేళ్లు. పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయి గ్రామం. తండ్రి జానీ చిరు వ్యాపారి, తల్లి ఫాతిమా గృహిణి. రిహానాకు పుట్టుకతో గుండె సమస్య ఉంది. దీనికి తోడు రెండేళ్ల వయస్సు వచ్చినా మాటలు రాలేదు. గుండె సమస్య కారణంగా మాటలు రావడం లేదని తొలుత తల్లిదండ్రులు భావించారు. కొద్ది రోజులకు గుంటూరు ఆస్పత్రిలో చూపించగా, పుట్టుకతో వినికిడి లోపం సమస్య కూడా ఉందని తేలింది. పాపకు మూడేళ్లు వచ్చాక గుండెకు సర్జరీ చేయించారు. వినికిడి లోపం సమస్యకు చికిత్స చేయించాలంటే ఎంత ఖర్చు అవుతుందోనని భయపడి ఆగిపోయారు. డబ్బు సమకూర్చుకున్నాక వైద్యం చేయిద్దామనుకున్నారు. ఇలా రోజులు గడుస్తూ పాపకు ఏడేళ్లు వచ్చాయి. అందరు పిల్లలు గలగలా మాట్లాడుతుంటే రీహానా మాత్రం మౌనంగా ఉండటం చూసి తల్లిదండ్రులు ఆవేదనకు గురవ్వని రోజంటూ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం వీరికి కలిసొచ్చింది. గత నెల 6వ తేదీన గ్రామంలో సురక్ష క్యాంప్ నిర్వహించారు. తల్లి ఫాతిమా.. రిహానాను ఆ క్యాంప్‌నకు తీసుకెళ్లింది. వైద్యులు పరీశీలించి గుంటూరు జీజీహెచ్‌కు రెఫర్ చేశారు. అక్కడ పలు పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు. అవి వాడాక వాస్తే మరికొన్ని పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఫలితాల ఆధారంగా స్పీచ్ థెరఫీ ఇవ్వడం లేదంటే కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ నిర్వహించడమో చేస్తామని తెలిపారు. ‘నా బిడ్డ మాట్లాడలేని స్థితిలో ఉండటం చూసి ఏడుపు వస్తోంది. సురక్ష క్యాంప్‌లో వైద్యులు చెప్పారని జీజీహెచ్‌కు వెళ్లొచ్చాను. పాపకు చికిత్స చేసి మాటలొచ్చేలా చేస్తామన్నారు. నా బిడ్డకు మాటలొస్తే చాలు అంతకు మించి ఏమీ వద్దు’ అని ఫాతిమా అంటోంది. ‘మీరు అధైర్యపడొద్దు. వైద్య పరీక్షలకు వెళ్లండి. ఆశా వర్కర్‌ను మీకు తోడుగా పంపుతాను. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ప్రభుత్వమే ఉచితంగా పాపకు మాటలు వచ్చేలా చికిత్స చేయిస్తుంది. ఆరోగ్యశ్రీ కింద రూ.12 లక్షల ఖరీదైన రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీని ప్రభుత్వం ఉచితంగా చేయిస్తోంది’ అని అత్తలూరు పీహెచ్సీ డాక్టర్ రవిబాబు ఫాతిమాకు ధైర్యం చెప్పారు. ఇలా రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్యానికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కొండంత అండగా నిలుస్తోంది. సీఎం జగన్ సర్కార్ ఆరోగ్య భరోసా అనారోగ్య సమస్యలున్నప్పటికీ సుదూర ప్రాంతంలో ఉండే ఆస్పత్రులకు వెళ్లి చూపించుకోలేక కొందరు, నిర్లక్ష్యంతో మరికొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ప్రాణం విలువ తెలిసిన సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలో ఏ ఒక్కరూ వైద్య సాయం అందక ఇబ్బంది పడటానికి వీల్లేకుండా ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించారు. అయినప్పటికీ ఇంకా ఎవరైనా ప్రజలు వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారేమోనని మరో అడుగు ముందుకు వేసి ప్రతి ఇంటిని జల్లెడ పట్టి.. ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలను గుర్తించి ఉచిత చికిత్సలు చేపట్టి, వైద్య పరంగా చేయి పట్టి నడిపించడం కోసం ఆరోగ్య సురక్షకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో అనేక సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉన్న ఊళ్లోనే 59.30 లక్షల మందికి వైద్యం ఏఎన్ఎం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో) నేతృత్వంలోని వైద్య బృందాలు 1.44 కోట్లకు పైగా గృహాలను సందర్శించి ప్రజలను స్క్రీనింగ్ చేపట్టాయి. బీపీ, షుగర్, హెచ్‌బీ, మలేరియా, డెంగ్యూ వంటి ఏడు రకాల పరీక్షలను 6.50 కోట్ల మేర నిర్వహించారు. తద్వారా వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారిని గుర్తించి సురక్ష శిబిరాలకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 9వ తేదీ నాటికి గ్రామాల్లో 9,982, పట్టణాల్లో 2,258 సురక్ష శిబిరాలను ప్రభుత్వం నిర్వహించింది. ఒక్కో శిబిరంలో సగటున 485 చొప్పున 59,30,972 మందికి సొంత ఊళ్లలోనే వైద్య సేవలు అందించారు. ప్రతి శిబిరంలో జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్, ఆప్తమాలజిస్ట్ వంటి స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించారు. ప్రతి శిబిరం వద్ద ర్యాపిడ్ టెస్ట్‌లతో పాటు, ఈసీజీ, ఇతర వైద్య పరీక్షలు నిర్వహణతోపాటు, 172 రకాల మందులను అందుబాటులో ఉంచారు. ఖరీదైన వైద్యం పూర్తిగా ఉచితం సురక్ష క్యాంప్‌లకు వచ్చిన వివిధ అనారోగ్య బాధితుల్లో మెరుగైన వైద్యం అవసరం ఉన్న వారిని ఆస్పత్రులకు రెఫర్ చేశారు. ఇలా 86,108 మందిని ఇప్పటి వరకు రెఫర్ చేయగా వీరందరికీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స చేపడుతోంది. గుండె, కిడ్నీ, మెదడు సంబంధిత జబ్బులు, క్యాన్సర్, ఇతర వ్యాధులకు ఖరీదైన చికిత్సలను పూర్తి ఉచితంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆఖరికి వీరు ఆస్పత్రులకు పోయి, రావడానికి అయ్యే ప్రయాణ చార్జీలు కూడా ప్రభుత్వమే అందిస్తోంది. ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఇస్తోంది. ప్రతి రెఫరల్ కేసును స్థానిక పీహెచ్సీ వైద్యుడు, ఏఎన్ఎం, సీహెచ్‌వోల ద్వారా పర్యవేక్షిస్తూ వైద్యం అందించేలా చూస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ 19,934 మంది ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లగా, 1,634 మందికి అడ్మిషన్ అవసరం ఉందని వైద్యులు నిర్ధారించారు. మిగిలిన వారికి మెడికేషన్ అందించారు. అడ్మిషన్ అవసరం ఉన్న వారిలో 1,060 మందికి సర్జరీలు, చికిత్సలు పూర్తయ్యాయి. చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వారి ఆరోగ్యంపై వైద్య శాఖ నిరంతరం వాకబు చేస్తోంది. కాలానుగుణంగా ఎప్పటికప్పుడు అవసరమైన మందులు, వైద్య సేవలు అందించేలా చర్యలు చేపడుతోంది. ఈ ఫోటోలో వైద్యుడు రవిబాబు పరిశీలిస్తున్న ఉషారాణిది యండ్రాయి గ్రామమే. చిన్నపాటి పాడి రైతు. కొద్ది నెలల క్రితం కాలికి సర్జరీ చేయించుకుంది. అనంతరం కాలు వాపు రావడంతో పాటు, గాయాలు మొదలయ్యాయి. సర్జరీ కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చిందేమోనని గుంటూరులోని పలు ఆస్పత్రుల్లో చూపించుకుంది. మందులు వాడినా సమస్య తగ్గలేదు. ఆరోగ్య సురక్షలో భాగంగా వైద్య సిబ్బంది ఇటింటి సర్వే నిర్వహించినప్పుడు ఆమె తన సమస్య వివరించింది. ఈ క్రమంలో సురక్ష శిబిరానికి హాజరవ్వమని సిబ్బంది సూచించారు. గత నెల 6వ తేదీన శిబిరానికి హాజరైంది. స్పెషలిస్ట్ వైద్యులు ఆమెను పరిశీలించి బోద వ్యాధి లక్షణాలున్నాయని, అమరావతి సీహెచ్‌సీకి రెఫర్ చేశారు. వైద్య సిబ్బంది సహాయంతో ఆమె అక్కడికి వెళ్లింది. వైద్య పరీక్షల అనంతరం తెనాలిలోని ప్రభుత్వ ఫైలేరియా సెంటర్‌కు రెఫర్ చేశారు. అక్కడ బోద వ్యాధిగా నిర్ధారించారు. ఉచితంగా మందులు అందించారు. ఈ క్రమంలో ఉషారాణి మాట్లాడుతూ.. ‘ఊళ్లో ఆరోగ్య సురక్ష క్యాంప్ పెట్టి ప్రభుత్వం నాకు ఎంతో మేలు చేసింది. లేకుంటే నా సమస్యను ఇంకా నిర్లక్ష్యం చేసేదాన్ని. నేను ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే వరకు వైద్య సిబ్బంది రోజు ఫాలోఅప్ చేశారు’ అని సంతోషం వ్యక్తం చేస్తోంది.1250 మంది జనాభా ఉన్న యండ్రాయి గ్రామంలో నిర్వహించిన సురక్ష క్యాంప్‌నకు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న 350 మంది హాజరయ్యారు. వీరిలో 88 మంది కంటి సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. మిగిలిన వారు గ్యాస్ట్రిక్, బీపీ, షుగర్ వంటి ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. కంటి సమస్యలున్న వారిలో 74 మందికి ఆప్తమాలజిస్ట్ సూచన మేరకు కళ్లద్దాల పంపిణీ చేపడుతున్నారు. ఇక రిహాన, ఉషారాణి తరహాలో పలు తీవ్రమైన సమస్యలున్న నలుగురిని ఇతర ఆస్పత్రులకు రెఫర్ చేశారు. స్పెషలిస్ట్ వైద్య సేవల కోసం ఈ గ్రామస్తులు 25 కి.మీ దూరంలో ఉండే గుంటూరు జీజీహెచ్‌కు వెళ్తుంటారు. దీంతో ఒకసారి గుంటూరుకు పోయి రావాలంటే కనీసం రూ.500 చొప్పున రవాణా, ఇతర అవసరాల కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఒక రోజంతా పని మానుకోవాల్సి రావడంతో కూలి డబ్బులు నష్టపోవాల్సి వస్తుంది. ఈ ఖర్చులకు భయపడి ఇదే గ్రామానికి చెందిన దస్తగిరి కొంత కాలంగా మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నప్పటికీ మందులు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. సురక్ష క్యాంప్‌లో స్పెషలిస్ట్ వైద్య సేవలుంటాయని స్థానిక ఏఎన్ఎం చెప్పడంతో హాజరయ్యాడు. తన సమస్యకు వైద్య సేవలు పొందాడు. క్యాంప్‌లోనే ఉచితంగా మందులు ఇచ్చారు. ఆ మందులు వాడినా సమస్య నయం అవ్వకపోతే తదుపరి వైద్యం ఉచితంగా అందిస్తామని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది నాకు 72 ఏళ్లు. రక్తపోటు, మధుమేహం సమస్యతో కొన్నేళ్లుగా బాధ పడుతున్నాను. గతంలో ప్రతి నెలా గుంటూరుకు మెడికల్ చెకప్ కోసం వెళ్లేవాడిని. ఒకసారి గుంటూరుకు పోయి, రావడానికి రూ.వెయ్యికి పైనే ఖర్చు అయ్యేది. ఈ ప్రభుత్వం వచ్చాక మా గ్రామంలోనే వైద్య సేవలు అందుతున్నాయి. ప్రతి నెలా మా గ్రామానికే డాక్టర్ వస్తున్నారు. దీంతో గుంటూరుకు వెళ్లడం మానేశాను. మందులు బాగా పని చేస్తున్నాయి. దీనికి తోడు ఈ మధ్య ఆరోగ్య సురక్ష క్యాంప్ పెట్టారు. గతంలో మేం వైద్యం కోసం వేరే ప్రాంతాలకు వ్యయ ప్రయాసలకోర్చి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మా వద్దకే వచ్చి వైద్యం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. – కె. పౌలేశు, యండ్రాయి, పల్నాడు జిల్లా కిడ్నీ సమస్యను గుర్తించి చికిత్స కొద్ది నెలలుగా నడుము భాగంలో నొప్పి వస్తుండేది. గుంటూరు వరకు పోయి చూపించుకోలేక ఏవో మందులు తెప్పించుకుని నొప్పి నుంచి విముక్తి పొందేదాన్ని. గ్రామంలో క్యాంప్ పెట్టడంతో వెళ్లాను. వైద్యులకు నా సమస్య వివరించాను. కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. క్యాంప్‌లోనే పలు మందులు ఇచ్చారు. జీజీహెచ్‌కు వెళ్లమని చీటీ ఇచ్చారు. ఆ మందులు వాడాక నొప్పి తగ్గుముఖం పట్టింది. జీజీహెచ్ కూడా వెళ్లొచ్చాను. క్యాంప్‌లో ఇచ్చిన మందులన్నీ వాడాక రమ్మన్నారు. – మొగల్ సబీరా, యండ్రాయి, పల్నాడు జిల్లా ఇంత శ్రద్ధ ఏ ప్రభుత్వం చూపలేదు ఎనిమిదేళ్ల క్రితం నా గుండెకు స్టెంట్ వేశారు. రోజూ మందులు వాడటంతో పాటు, రెండు, మూడేళ్లకు ఓసారి పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. మందులు అయితే వాడుతున్నా కానీ పరీక్షలు చేయించుకోలేదు. మా ఊళ్లో పెద్ద డాక్టర్లతో క్యాంప్ పెడుతున్నారని చెబితే వెళ్లి చూపించుకున్నాను. వాళ్లు ఈసీజీ తీశారు. ఎందుకైనా మంచిదని గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లండని చెప్పారు. వెళ్లాను.. పరీక్షలు చేశారు. అంతా బాగుందని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చాక మా గ్రామంలోనే బీపీ, రక్తం పలుచబడే బిళ్లలు ఇస్తున్నారు. నెలనెలా డాక్టర్ వస్తున్నారు. వైఎస్సార్ కంటి వెలుగు కింద ఉచితంగా కంటి ఆపరేషన్ చేశారు. ఇన్ని విధాలుగా గతంలో ఏ ప్రభుత్వం మా ఆరోగ్యాలపై శ్రద్ధ చూపలేదు. – ఎస్.ఆదం, ధరణికోట, పల్నాడు జిల్లా పెద్ద ఊరట కల్పించారు వయోభారం రీత్యా కాళ్లు, నడుము నొప్పులతో కొన్నాళ్లుగా బాధపడుతున్నాను. పట్టణంలోని ఆస్పత్రికి వెళ్లాలంటే ఎవరో ఒకరు తోడుండాలి. దీనికి తోడు రానుపోను చార్జీలు, ఇతర ఖర్చులు పెట్టుకోవాలి. ఇంట్లో ఎవరైనా పట్టణానికి పోయినప్పుడు తెచ్చి ఇచ్చే మాత్రలు వేసుకుంటూ కాలం వెల్లదీస్తుండేదాన్ని. ఈ పరిస్థితుల్లో గ్రామంలో క్యాంప్ పెట్టారని వలంటీర్ చెప్పడంతో వెళ్లాను. నాకున్న సమస్యలు చెప్పాను. మందులు ఇచ్చారు. అవి వేసుకుంటుంటే నొప్పులు తగ్గాయి. గ్రామంలోనే వైద్య శిబిరం పెట్టి చాలా పెద్ద ఊరట కల్పించారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులకు నెలనెలా ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ చేస్తున్నట్టే, వైద్య సేవలను చేరువ చేసి పుణ్యం కట్టుకున్నారు. – కింతలి రాజేశ్వరమ్మ, తోనంగి, గార మండలం, శ్రీకాకుళం జిల్లా. ప్రతి కేసుపై ప్రత్యేక శ్రద్ధ పీహెచ్సీ పరిధిలోని సురక్ష శిబిరాల్లో సుమారు ఏడు వేల మంది వైద్య సేవలు అందుకున్నారు. 168 మందిని ఆస్పత్రులకు రెఫర్ చేశారు. ప్రతి రెఫరల్ కేసుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. రెఫరల్ కేసుల్లో సంబంధిత వ్యక్తులను ఆస్పత్రులకు తరలించి, అక్కడ వైద్య సేవలు అందేలా పర్యవేక్షిస్తున్నాం. అవసరం మేరకు ఆశ వర్కర్‌ను తోడు పంపి మరీ వైద్య సేవలు అందిస్తున్నాం. చికిత్స అనంతరం డిశ్చార్జి అయిన రోగుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్యంపై వాకబు చేస్తున్నాం. – డాక్టర్ రవిబాబు, మెడికల్ ఆఫీసర్, అత్తలూరు పీహెచ్సీ, పల్నాడు జిల్లా నెలలో మండలంలో నాలుగు చోట్ల నిరంతరాయంగా ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు. జనవరి నుంచి ప్రతి మండలంలో నెలలో నాలుగు చోట్ల సురక్ష శిబిరాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇక ఇప్పటికే శిబిరాల నుంచి వచ్చిన రెఫరల్ కేసులన్నింటికీ వంద శాతం మెరుగైన, నాణ్యమైన చికిత్సలు అందించడానికి చర్యలు వేగవంతంగా చేపడుతున్నాం. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ -
చంద్రమోహన్ మృతికి కారణాలు ఇవే !
-
గట్ బ్యాక్టీరియా VS వ్యాయామం
-
చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ అనుభవిస్తున్న చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తన నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యంతర బెయిల్‌పై నిర్ణయం ఆధారంగా ప్రధాన బెయిల్ పిటిషన్‌పై విచారణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కంటి శస్త్ర చికిత్సను కారణంగా చూపుతూ తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ మల్లికార్జునరావు విచారణ జరిపారు. ‘ఆరోగ్య సమస్యల దృష్ట్యా బెయిలివ్వండి’ సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు పలు అరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. అందువల్ల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయమూర్తిని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. అందుకు ఆయనపై పెడుతున్న వరుస కేసులే నిదర్శనమని తెలిపారు. గత 52 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నారని వివరించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కుట్రపూరితంగా అరెస్ట్ చేశారన్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును సీఐడీ ప్రశ్నించడం పూర్తయిందని, అందువల్ల అతనిని జైలులో ఉంచాల్సిన అవసరం ఎంత మాత్రం లేదన్నారు. సీఐడీ రిమాండ్ రిపోర్టులో చంద్రబాబుపై నిర్ధిష్ట ఆరోపణలేవీ లేవన్నారు. జైలులో చంద్రబాబు 5 కేజీల బరువు తగ్గారన్నారు. పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వివరించారు. కుడి కన్నుకు అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉందని, ఇదే విషయాన్ని వైద్యులు సైతం ధ్రువీకరించారని పేర్కొన్నారు. నచ్చిన వైద్యునితో చికిత్స చేయించుకునే ప్రాథమిక హక్కు పిటిషనర్‌కు ఉందన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ‘ఆరోగ్య సమస్యల్ని సాకుగా చూపుతున్నారు’ సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, స్పెషల్ పీపీ యడవల్లి నాగవివేకానంద, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు జైలు నుంచి బయటకొచ్చేందుకు అరోగ్య సమస్యలను కారణంగా చూపుతున్నారని స్పష్టం చేశారు. ప్రధాన బెయిల్ పిటిషన్లో వాదనలు వినిపించేందుకు గడువు కావాలని సుధాకర్‌రెడ్డి కోర్టును కోరగా.. గడువు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని, ముందు మధ్యంతర బెయిల్‌పై వాదనలు వినిపించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చంద్రబాబు బరువు తగ్గారన్న వాదనలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఒకటిన్నర కేజీ బరువు పెరిగారని సుధాకర్‌రెడ్డి తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య స్థితిపై వైద్యుల నివేదికలను ఆయన కోర్టు ముందుంచారు. చంద్రబాబుకు జైల్లోనే అన్ని రకాల పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కంటి శస్త్రచికిత్స అత్యవసరం ఎంతమాత్రం కాదన్నారు. వైద్యులు సైతం ఇదే చెప్పారన్నారు. చంద్రబాబుకున్న అనారోగ్య సమస్యలు వయోభారంతో బాధపడే వారికి ఉండేవేనన్నారు. అవేమీ అసాధారణ సమస్యలు కాదన్నారు. జైలు నుంచి బయటకు వచ్చేందుకు ఆరోగ్య సమస్యలను కారణంగా మాత్రమే చూపుతున్నారని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి వీల్లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు మధ్యంతర బెయిల్‌పై మంగళవారం నిర్ణయాన్ని వెల్లడిస్తానని స్పష్టం చేశారు. -
ప్రెగ్నెన్సీలో వచ్చిన బీపీ,షుగర్.. డెలీవరీ తర్వాత తగ్గుతాయా?
ప్రెగ్నెన్సీ టైమ్‌లో వచ్చిన బీపీ, షుగర్.. డెలివరీ తర్వాత తగ్గుతాయా? నాకు ఇప్పుడు ఆరో నెల. బీపీ, షుగర్ రెండూ వచ్చాయి. అందుకే భయంగా ఉంది. – ఎన్. శ్రీలీల, చెన్నై ప్రెగ్నెన్సీలో అధికంగా బరువు పెరిగినా, పోషకాహారం.. జీవన శైలి సరిగ్గా లేకపోయినా హార్మోన్స్, వయసు కారణంతో ఈరోజుల్లో చాలామంది గర్భిణీలకు ఆరవ నెల, ఏడవ నెల నుంచి బీపీ, సుగర్లు వస్తున్నాయి. దీనిని జెస్టేషనల్ హైపర్‌టెన్షన్, జెస్టేషనల్ డయాబెటిస్ (జీడీఎమ్)అంటాం. డెలివరీ అయిన ఆరువారాలకు జీడీఎమ్ నార్మల్ లెవెల్‌కి వస్తుంది. అందుకే డెలివరీ అయిన ఆరువారాలకు ఓజీటీటీ అనే టెస్ట్ చేస్తారు. ఇది నార్మల్‌గా ఉంటే తర్వాత డయాబెటిక్ కేర్ అవసరం లేదు. కానీ సంవత్సరానికి ఒకసారి హెచ్‌బీఏ1సీ / ఎఫ్బీఎస్ టెస్ట్‌ను చేయించుకుంటూ ఫాలో అప్‌లో ఉండాలి. జీడీఎమ్ ఉన్నవారిలో తర్వాత టైప్ 2 డయాబెటిస్ రావడానికి 40 శాతం ఎక్కువ చాన్సెస్ ఉంటాయి. బీఎమ్ఐ 30 కన్నా ఎక్కువ ఉన్నా.. మీకు ఆరవ నెలలోపు జీడీఎమ్ వచ్చినా.. కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉన్నా.. డెలివరీ తరువాత అయిదేళ్లలోపు మీకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే చాన్స్ ఉంటుంది. అందుకే డెలివరీ తరువాత క్రమం తప్పకుండా ఫాలో అప్‌లో ఉండాలి. చక్కటి డైట్ కూడా ఫాలో కావాలి. - డా.భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
గ్రేటర్ జిల్లాల్లో మొత్తం 12 సెంటర్లే
హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, డయాలసిస్ కేంద్రాలు తగినంత సంఖ్యలో అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో పేద మధ్యతరగతి రోగులు కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తూ అప్పుల పాలవుతున్నారు. మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న రోగులు, ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం వేచి చూస్తున్నారు. అందరికీ వారి వారి అవసరాన్ని బట్టి వారంలో ఒకటి లేదా రెండుసార్లు లేదా మూడుసార్లు డయాలసిస్ చేయించుకుంటారు. కానీ వారి అవసరాలకు తగ్గట్టుగా డయాలసిస్ సెంటర్లు మాత్రం పెరగకపోవడం రోగులకి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. రెండు జిల్లాల్లో పదకొండే.. ► కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాల కంటే మెరుగైనవని అధికారులు చెబుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 2,400 మంది రోగులు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారంలో రెండు మూడుసార్లు డయాలసిస్ కోసం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న రోగుల సంఖ్య అంతకంటే ఎక్కువగానే ఉందని అంచనా. ► హైదరాబాద్ జిల్లా పరిధిలో కేవలం ఏడు డయాలసిస్ కేంద్రాలు ఉండగా, 34 లక్షల జనాభా ఉన్న రంగారెడ్డిలో కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రి, నాంపల్లి ఏరియా ఆసుపత్రి, గోల్కొండ ఏరియా ఆసుపత్రి, మలక్‌పేట ఏరియా ఆసుపత్రి, నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయి. ప్రధానంగా పాతబస్తీ ప్రాంతానికి చెందిన అనేకమంది పేద రోగులు సాధారణంగా మలక్‌పేట్ ఏరియా హాస్పిటల్‌తో పాటు అక్కడి మహావీర్ ఎక్స్టెన్షన్ సెంటర్, నాంపల్లి ఏరియా హాస్పిటల్ , గోల్కొండ ఏరియా హాస్పిటల్ అస్రా హాస్పిటళ్లను ఎక్కువగా ఆశ్రయిస్తారు. పెరిగిన రోగుల సంఖ్య.. ‘ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్ర ఆరోగ్యశ్రీలో విలీనం చేసిన తర్వాత హైదరాబాద్ జిల్లాలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య పెరిగింది. జిల్లాలో 2400 మంది రోగులు ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం నిర్వహిస్తున్న డయాలసిస్ కేంద్రాల్లో ఉచిత చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం రోగులకు రూ.2,000 పింఛను, ఉచిత బస్ పాస్‌లు కూడా అందజేస్తోంది. ప్రతి రోజు డయాలసిస్‌కు వెళ్లే రోగుల సేవల కోసం ప్రభుత్వం జిల్లాలోని 82 కేంద్రాలకు సింగిల్ యూజ్ డయాలిజర్లను అందజేస్తోంది’ అని జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్ చేసేందుకు అంగీకరించిన ప్రైవేటు ఆసుపత్రులతో కలిపితే 26 కేంద్రాల వరకూ జిల్లాలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఆరోగ్యశ్రీ కార్డును అనుమతించాల్సి ఉన్నప్పటికీ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు సాకులు చెప్పి తప్పించుకుంటున్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. ► ‘రంగారెడ్డి జిల్లా పరిధిలో వనస్థలిపురం, షాద్‌నగర్, చేవెళ్ల, మహేశ్వరంలలో మాత్రమే సెంటర్లు ఉన్నాయి. ‘టీవల ఇబ్రహీంపట్నం మండలంలో ఓ సెంటర్ చేశారు. కానీ కొన్ని విద్యుత్ సమస్యల కారణంగా ఇది పనిచేయడం లేదు. సమస్యను పరిష్కరించిన తర్వాత మరో రెండు వారాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుంది’ అని రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (డీసీహెచ్ఎస్) జి. రాజు యాదవ్ చెప్పారు. మేడ్చల్ జిల్లాలో ఒక్కటే.. ఇటీవలి కాలంలో అటు జనాభా పరంగా ఇటు రియల్ ఎస్టేట పరంగా శరవేగంగా వృద్ధి చెందుతున్న మేడ్చల్ జిల్లా పరిధిలో డయాలసిస్ సెంటర్ల వ్యాప్తి మాత్రం పుంజుకోలేదు. ఘట్కేసర్ ఏరియా ఆసుపత్రిలో ఉన్న 35 బెడ్స్ డయాలసిస్ కేంద్రం తప్ప స్థానికులకు మరేదీ అందుబాటులో లేదు. మేడ్చల్‌లో మరో సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు వైద్యాధికారులు అంటున్నారు. ప్రైవేటులో బిల్లు తడిసిమోపెడు... ప్రైవేటు ఆసుపత్రుల్లో డయాలసిస్ ఒక్క సిట్టింగ్‌కి కనీసం రూ.3వేల నుంచి రూ.4వేల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో నిరుపేద, మధ్య తరగతి రోగులు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. ‘వారానికి రెండుసార్లు తన మేనల్లుడికి డయాలసిస్ చికిత్స పొందేందుకు. ఆసుపత్రిలో స్లాట్‌ను పొందిన రహ్మెన్ మాట్లాడుతూ.. బహదూర్‌పురాలోని తమ ఇంటి దగ్గర అలాంటి సదుపాయం లేకపోవడంతో తమ 17 ఏళ్ల మేనల్లుడికి చికిత్స కోసం బంజారాహిల్స్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిని ఎంచుకున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాజేంద్రనగర్‌లోని మా ప్రాంతానికి సమీపంలో ఎక్కడా అందుబాటులో లేకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రిలో సెషన్‌కు 3,500 రూపాయలకు పైగా ఖర్చు చేస్తూన్నా’మని చెప్పారామె. ఈ నేపథ్యంలో కిడ్నీ రోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మరిన్ని డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తీవ్ర ఇబ్బందుల్లో కిడ్నీ రోగులు ఇబ్బందుల పాలవుతున్న బాధితులు ప్రైవేట్‌లో వేలాది రూపాయలు పెట్టలేని దీనావస్థ డయాలసిస్ కేంద్రాలను పెంచాలని సర్కారుకు వినతి -
మనోళ్ల ‘హెల్త్ కవర్’ అంతంతే..!
సాక్షి, హైదరాబాద్: జీవిత బీమా, హెల్త్ కవర్–ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా కవరేజీ వంటి విషయాల్లో భారతీయులు అంత చురుకుగా వ్యవహరించడం లేదనే అభిప్రాయం ఉంది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో జీవిత బీమా, సరైన ఆరోగ్య రక్షణలు లేనివారు రూ. 20 వేల కోట్లకు పైగానే కరోనా సంబంధిత ఆరోగ్య సమస్యలపై చికిత్స కోసం వ్యయం చేయాల్సి వచ్చిదనే అనధికార అంచనాలున్నాయి. కరోనా కేసులు ఉధృతంగా ఉన్న రోజుల్లో ఎదురైన పరిస్థితుల కారణంగా మధ్య, దిగువ, పేద వర్గాల ప్రజలకు చెందిన వారు తీవ్రమైన ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్న ఉదంతాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి అనంతర పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి అని 46 శాతం మంది భావిస్తున్నారు. ఇప్పుడు పెరుగుతున్న వైద్యఖర్చులకు ఈ హెల్త్ పాలసీలు ఉపయోగపడతాయని 43 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ఇదీ అధ్యయనం... తాజాగా భారతీయ టెక్–ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ–అక్నో అధ్యయనంలో వివిధ అంశాలు వెల్లడయ్యాయి. 68 శాతం మందికి రూ.10 లక్షలలోపే ఆరోగ్య బీమా కవరేజీ ఉందని, వారిలోనూ 27 శాతం మందికి మెడికల్ కవర్ రూ. 5 లక్షలలోపే ఉన్నట్టుగా ఇది స్పష్టం చేసింది. దేశంలోని ఆరు మెట్రో నగరాల్లోని 28–55 ఏళ్ల మధ్య వయసున్న వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ సంస్థ నివేదికను సిద్ధం చేసింది. అన్లిమిటెడ్ కవరేజీ, కన్జుమబుల్స్, రూమ్‌రెంట్ క్యాపింగ్ వంటి వాటిపై పాలసీ హోల్డర్లకు అంతగా అవగాహన ఉండటం లేదన్న విషయం నివేదికలో వెల్లడైంది. -
రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగిందా? వీరిలో ముప్పెక్కువ
ఈరోజుల్లో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం ఎక్కువగా చూస్తున్నాం. మనం తీసుకునే ఆహార పదార్థాల్లోని ‘ప్యూరిన్’ అనే రసాయనం విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది.శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే అనేక ఆనోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే కొన్ని ఆరోగ్య నియమాలు పాటిస్తే యూరిక్ యాసిడ్ స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. అవేంటో చూద్దాం. శరీరంలో యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగితే... అది సాధారణంగా కాలి బొటనవేలి ఎముకల మధ్యనో లేదా ఏ మోకాలు ప్రాంతంలోనో ఓ స్ఫటికంగా రూపొందుతుంది. అక్కడి ఎముకలతో ఒరుసుకుపోతూ... తీవ్రమైన నొప్పిని కలిగిస్తుందన్నది చాలామందికి తెలిసిన విషయమే. ఇలా వచ్చే కీళ్లనొప్పుల్ని ‘గౌట్’ అని అంటారు. ఇటీవలి కాలంలో యూరిక్ యాసిడ్ సమస్య చాలామందిని వేధిస్తుంది. తిన్న ఆహారం జీర్ణం అయిన తర్వాత విడుదల చేసే పోషకాలలో ఇది కూడా ఒకటి. యూరిక్ యాసిడ్ ఎప్పటికప్పుడు యూరిన్ ద్వారా బయటకు వెళ్లిపోతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా, విసర్జన సరిగా జరగకపోయినా ఇది రక్తంలో ఉండిపోతుంది. క్రమంగా ఇవి స్ఫటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతాయి. ముప్పు ఎవరెవరిలో ఎక్కువ...? యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగే అవకాశాలు కొందరిలో మరీ ఎక్కువ. వారెవరంటే... మద్యం తీసుకునేవారు మధుమేహం (డయాబెటిస్)తో బాధపడేవారు ∙అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవారు ∙రక్తాన్ని పలుచబార్చే మందులు వాడేవారిలో... ముప్పు ఎక్కువ. శరీరంలో మోతాదుకు మించి యూరిక్ యాసిడ్ ఉంటే కడుపులో మంట,కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలు, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చేతుల వేళ్ళు వాపులు వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. యూరిక్ యాసిడ్ ఇలా చేస్తే కంట్రోల్లో.. లేత సొరకాయ చెక్కు తీసి, చిన్న ముక్కలు చేసి, ఎటువంటి నీళ్లు పొయ్యకుండా మిక్సీలో వేసి, ఆ గుజ్జును (ఫిల్టర్ చెయ్యకుండా) పరగడుపున తినాలి. రోజూ ఒక చిన్న గ్లాసుడు(100ml) తిని చూడండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. కొన్ని వారాల పాటు అన్ని రకాల నాన్ వెజ్ ఆహారాలు (చికెన్, మటన్, లివర్, చేప, రొయ్యలు మొదలైనవి) పూర్తిగా ఆపేయండి రోజుకు 1 లేదా 2 గుడ్లు వరకు తినొచ్చు రోజుకు కనీసం 4-5 లీటర్ల నీటిని కచ్చితంగా త్రాగండి. తరచుగా నిమ్మకాయలు తీసుకోండి. పీచు పదార్థం అధికంగా ఉండే బీరకాయ, సొరకాయ, బెండ, బ్రోకలీ, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. కాలీఫ్లవర్, పాలకూర, పన్నీర్ మరియు పుట్టగొడుగులు వంటి కూరగాయలను కొన్నాళ్లు నివారించండి. -డా.నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
చిన్నవయసులోనే గజినీలుగా మరుతున్నారు.. విటమిన్ బి12 కారణమే
భద్రంగా దాచిన వస్తువును ఎక్కడ ఉంచిందీ గుర్తులేకపోవడం.. ఆఫీస్‌కు ఆలస్యమవుతోందనే భయంతో బైక్ కీస్‌ను మరిచి గబగబా ఇంటి నుంచి బయటకు వచ్చేయడం.. స్కూల్‌కి టైమ్ అవుతోందనే హడావుడిలో అమ్మ ఇచ్చిన లంచ్ బాక్స్ మరిచిపోవడం.. ఇలా చాలా మంది చిన్న వయసులోనే గజినీలుగా మారుతున్నారు. ఒకప్పుడు అరవై ఏళ్లు దాటిన వారిలో మతిమరుపు కనిపించేది. ఇప్పుడు 16 ఏళ్ల వారినీ మతిమరుపు వేధిస్తోంది. పాతికేళ్ల వారిలో ఇది తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. పరీక్షల భయం, పని ఒత్తిడి, ఆందోళనలు మతిమరుపునకు ప్రధాన కారణాలు. పౌష్టికాహార లోపం, కొన్ని రకాల రోగాలు కూడా మతిమరుపునకు దారితీస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. టీనేజ్లోనే.. మతిమరుపు సమస్యకు టీనేజ్‌లో బీజం పడు తోంది. 25 నుంచి 35 ఏళ్ల వయస్సు వారిలో అధికమవుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కొందరు ఏదో సమస్యతో తమ వద్దకు వచ్చినప్పుడు వాళ్లు మతిమరుపుతో బాధపడుతున్నట్లు గుర్తించగలుగుతున్నామని వైద్య నిపుణులు అంటున్నారు. 20 నుంచి 30 శాతం మంది యువత ఇలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. అధిక ఒత్తిడి చేసే పనిలో టెన్షన్, యాంగ్జయిటీ, మానసిక అంశాలు జ్ఞాపక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో గుర్తుకు రాని విషయం కోసం యువత సతమతమవుతోంది. తీరా సమయానికి అది గుర్తుకు రాదు. అంతలా మెదడు పట్టు తప్పుతోంది. యాంగ్జయిటీతో ముప్పు మెమరీ పవర్ తగ్గిపోవడానికి మానసిక సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం యాంగ్జయిటీ. ఏ పని చేసినా ఆందోళనతో చేయడం, హడావుడిగా మాట్లాడటంతో ఒత్తిడి పెరిగిపోతోంది. అది మనసుపై ప్రభావం చూపుతోంది. దీంతో విన్న విషయం గుర్తుకు రాని పరిస్థితి. ఉద్యోగంలో పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక అంశాలు కూడా యువతపై ప్రభావం చూపుతున్నాయి. పిల్లల్లో హోం వర్క్, మార్కులపై వత్తిడి, పనిష్మెంట్లు, వారిలో ఒత్తిడి పెంచి అదికాస్తా మతిమరుపునకు కారణమవుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. బీపీ, మధుమేహం ప్రభావం డయాబెటిస్, బీపీ, థైరాయిడ్ వంటివి సోకి ఐదేళ్లు దాటిన వారిలో మతిమరుపునకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాధులు ఉన్న వారిలో హార్మోన్ల అభివృద్ధిలో లోపాలు చోటుచేసుకుంటా యని వైద్యులు చెపుతున్నారు. ఆనందంగా ఉండకుండా, మానసికంగా మందకొడిగా ఉండటంతో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి విటమిన్ బీ 12 కారణమని, దాని లోపంతో సమస్య ఎదురవుతోందని వైద్యులు చెబుతున్నారు. పౌష్టికాహారం లేక పోవడంతో బ్రెయిన్ సెల్స్ అభివృద్ధి జరగడం లేదని చెబుతున్నారు. రెడీమేడ్ ఫుడ్ జోలికి వెళ్లకూడదని సూచిస్తున్నారు. బీ 12 నాన్ వెజ్‌లో అధికంగా, పుష్కలంగా లభిస్తుందని, ఆకుకూరలు తింటే కాస్త జ్ఞాపకశక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఏకాగ్రతే లేదు యువతలో ఏకాగ్రత లోపిస్తోంది. వినడం, విన్నదానిని మనసులో ముద్రించుకో వడం, తిరిగి దానిని చెప్పడం, చెప్పే విషయాల్లో యువతలో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. గుర్తుంచు కున్నట్లుగా ఉంటుంది.. కానీ గుర్తుకు రాదు. చాలా మంది ఒక పనిని చేస్తూ మరికొరితో మాట్లాడుతుంటారు. ఈ సమయంలో వారు చెప్పే విషయాలు పెద్దగా వినక పోవడంతో, తర్వాత గుర్తు చేసుకుందామన్నా జ్ఞప్తికి రాని పరిస్థితి ఉంటోంది. మతి మరుపునకు ప్రధాన కారణం ఒత్తిడి. డిప్రె షన్, యాంగ్జయిటీ, ఆల్కహాల్, మత్తు పదార్థా లకు అలవాటు పడిన వారిలో మతిమరుపు సమస్య తలెత్తుతోంది. ఒత్తిడిని జయించేందుకు ప్రతి ఒక్కరు బ్రెయిన్‌కు ఎక్సర్సైజ్ చేయించాలి. అంటే స్వతహాగా లెక్కలు కట్టడం, ఫోన్ నంబర్లు గుర్తు పెట్టుకోవడం వంటివి చేయాలి. అప్పుడు మతి మరుపు తగ్గే అవకాశం ఉంటుంది. పౌష్టికాహారం తీసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలపై మార్కుల కోసం ఒత్తిడి తేకూడదు. ఒత్తిడి వారిని మరింత ఆందోళనకు గురిచేస్తుంది. – డాక్టర్ ఆర్.తార, అసిస్టెంట్ ప్రొఫెసర్, మానసిక వైద్య విభాగం, జీజీహెచ్ -
నేనున్నానంటూ సీఎం జగన్ భరోసా
సాక్షి ప్రతినిధి, విజయవాడ/, గుంటూరు, నరసరావుపేట : అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి నేనున్నానంటూ సీఎం జగన్ అండగా నిలిచారు. తలసేమియాతో బాధపడుతున్న విజయవాడకు చెందిన దుర్గాభవానీ, సీతారామ్ దంపతులు కుమారుడు గౌతమ్వెంకట్, బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన సూర్యఆదిత్యరెడ్డి, ప్రమాదంలో కళ్లు కోల్పోయి, మానసిక స్థితి సరిగా లేని దుగ్గిరాలకు చెందిన నాగూర్‌తో పాటు కుమార్తె త్రివేణిలు వెంకటపాలెం వద్ద సీఎం జగన్‌కు గోడు వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలు ఓపికగా విన్న సీఎం.. తక్షణ ఆర్థిక సాయంతో పాటు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ మేరకు గంటల వ్యవధిలోని ఆయా జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు. వైద్యం అందిస్తామన్నారు. చదవండి: CM Jagan VenkatapalemTour: అమరావతి అందరిదీ -
ఆపుకోలేక.. చెప్పుకోలేక..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సగటు మనిషి ఆయుర్దాయం నూరేళ్లుగా లెక్క కడుతూంటారు. ఇందులో సగం అంటే 50 ఏళ్లు వచ్చేసరికి సాధారణంగా అనారోగ్య సమస్యలు చుట్టుముడుతూంటాయి. అలా వచ్చే కొన్ని సమస్యలను కంటికి రెప్పలా చూసుకునే కన్న పిల్లలకు కూడా చెప్పుకోలేక కొంతమంది లోలోపలే కుమిలిపోతున్నారు. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన 60 నుంచి 70 శాతం మందిలో హఠాత్తుగా చుక్కలు చుక్కలుగా యూరిన్ (మూత్రం) రావడం సమస్యగా ఉంటోంది. దీనిని వైద్య పరిభాషలో ‘స్ట్రెస్ ఇన్‌కంటినెన్స్’ అని పిలుస్తుంటారు. దీనికి వయోభారంతో వచ్చే కండరాల బలహీనత ప్రధాన కారణమని యూరాలజీ నిపుణులు చెబుతున్నారు. 50 ఏళ్ల వయస్సు పైబడిన ప్రతి 10 మందిలో ఒకప్పుడు ఇద్దరు, ముగ్గురు ఈ సమస్యతో బాధ పడేవారని, ఇప్పుడు ఆ సంఖ్య ఐదు నుంచి ఆరు ఉంటోందని యూరాలజీ వైద్యులు అంటున్నారు. కొంతమంది ఈ సమస్యను ఎవ్వరికీ చెప్పలేక.. ముందు జాగ్రత్తలు తీసుకోలేక కేన్సర్ బారిన పడుతూ ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారని అంటున్నారు. మహిళల్లో అధికం స్ట్రెస్ ఇన్‌కంటినెన్స్ పురుషుల్లో కంటే నాలుగు పదులు దాటిన మహిళల్లో ఎక్కువని ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది. పెల్విక్ కండరాల బలహీనత, ఈస్ట్రోజన్ హార్మోన్ స్రావంలో లోపాలు లైంగిక సామర్థ్యాన్ని దెబ్బ తీసి కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. అసాధారణ పరిస్థితుల్లో మూడు పదుల వయసు దాటిన వారిని కూడా ఈ సమస్య వెంటాడుతోంది. రుతుస్రావం నిలిచిపోయే పరిస్థితిలో ఏర్పడే పోస్ట్ మెనోపాజల్ దశలో స్ట్రెస్ ఇన్‌కంటినెన్స్, వెజైనల్ డ్రైనెస్ సమస్యలు మొదలవుతాయి. అధిక కాన్పులు, శస్త్రచికిత్సలు, ప్రొస్టేట్ చికిత్స మహిళల్లో మూత్రం చుక్కలు చుక్కలుగా రావడానికి కారణమవుతున్నాయి. పురుషుల్లో మధుమేహం, శస్త్రచికిత్సలతోనే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. తుమ్మినా, దగ్గినా తెలియకుండానే మూత్ర విసర్జన, వెజైనల్ సమస్యలు దీని లక్షణాలుగా చెబుతున్నారు.మూత్రం చుక్కచుక్కలుగా పడుతున్న వారికి కాకినాడ జీజీహెచ్‌లో యూరాలజీ, వెజైనల్ డ్రైనెస్ సమస్యకు గైనకాలజీ ఓపీల్లో సేవలందిస్తున్నారు. గడచిన ఆరు నెలల వ్యవధిలో ఈ రెండు విభాగాల ఓపీకి ప్రతి నెలా వస్తున్న కేసులను పరిశీలిస్తే రోగుల సంఖ్య పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం వంటి ప్రాంతాల్లో కూడా యూరాలజీ వైద్యుల వద్ద అవుట్ పేషెంట్లు, ఇన్‌పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్య పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. స్ట్రెస్ ఇన్‌కంటినెన్స్, వెజైనల్ డ్రైనెస్‌కు అధునాత వైద్య సదుపాయాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా కాకినాడలో అందుబాటులోకి తీసుకువచ్చామని స్థానిక సృజనా ఆస్పత్రి కాస్మెటిక్ గైనకాలజిస్టు డాక్టర్ ఏఎల్ సత్యవతి చెప్పారు. ముంబైకి చెందిన ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణురాలు సీజెల్ అజ్మీరా భాగస్వామ్యంతో ఈ సేవలు తీసుకువచ్చారు. మానసిక సమస్యలు ఉత్పన్నం స్ట్రెస్ ఇన్‌కంటినెన్స్ సహా, పెల్విక్ కండరాల బలహీనత, ఈస్ట్రోజన్ అసమతుల్యతలు మానసిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మహిళలు సంసార, సాధారణ జీవితాల్లో ఇబ్బందులు పడుతున్నారు. చెప్పుకోలేని వేదనతో సతమతమవుతూంటారు. తొలి దశలో నిర్వహించే కౌన్సెలింగ్‌లోనే ఈ సమస్యలను ధైర్యంగా వైద్య నిపుణుల వద్ద ప్రస్తావిస్తే తక్షణ పరిష్కారం ఉంటుంది. – డాక్టర్ వానపల్లి వరప్రసాద్, మానసిక వైద్య నిపుణుడు, జీజీహెచ్, కాకినాడ మందులు అవసరం లేని చికిత్స అవాంఛిత మూత్రం కేసులు పెరుగుతున్నాయి. స్ట్రెస్ ఇన్‌కంటినెన్స్ సమస్యకు చెమట పట్టని వ్యాయామాలతో పెల్విక్ కండరాల పటిష్టత ద్వారా మందుల అవసరం లేని పరిష్కారం లభిస్తోంది. దీనికి అధునాతన బీటీఎస్ ఎంసెల్లా చైర్‌ను వినియోగిస్తాం. 28 నిమిషాల వ్యవధిలో 11 వేల పెల్విక్ వ్యాయామాలు చేయించడం ఈ యంత్రం ప్రత్యేకత. వీటిని కిగెల్స్ ఎక్సర్సైజ్లు అంటారు. వెజైనల్ డ్రైనెస్ నివారణకు వెజైనల్ రెజువనేషన్ను కూడా అందుబాటులోకి తెచ్చాం. కుర్చీలో కూర్చోవడం ద్వారా నొప్పి లేని చికిత్స అందిస్తాం. – డాక్టర్ ఏఎల్ సత్యవతి, కాస్మెటిక్ గైనకాలజీ నిపుణురాలు, కాకినాడ ఆగితే తగ్గదు మూత్రం లీకేజీ, వెజైనల్ డ్రైనెస్లు నానాటికీ అధికమవుతున్న సమస్యలు. ముఖ్యంగా పోస్ట్ మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో ఈ సమస్య ఎక్కువ. తగ్గుతుందిలే అన్న ధీమా ఎంత మాత్రం సరికాదు. దీనివలన సమస్య తగ్గదు సరికదా, మానసిక సమస్యలు ఎక్కువై మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఇది శారీరక అనారోగ్యాలకూ దారి తీస్తుంది. తక్షణమే వైద్యులను సంప్రదించి వైద్యం పొందాలి. ఈ ఇబ్బందిని చెప్పుకొనేందుకు చాలా మంది మహిళలు ముందుకు రాకపోవడమే అసలు సమస్య. మందులు అవసరం లేని అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. సత్ఫలితాలిస్తున్నాయి. – డాక్టర్ మణికంఠన్ జంధ్యం, అసిస్టెంట్ ప్రొఫెసర్, రంగరాయ వైద్య కళాశాల, కాకినాడ -
మెనిస్కస్ బ్యాంకు అంటే..? మన ఇండియాలో ఎందుకు లేవు
-
డయాబెటిస్ రావడానికి అసలు కారణం ఇదే...
-
ఇన్సులిన్ కొనడానికి డబ్బులు లేక ..
-
మహిళా మెడిసిన్ కాన్క్లేవ్ 2022 AIG హాస్పిటల్స్ ద్వారా
-
మహిళా మెడిసిన్ కాన్క్లేవ్ 2022 AIG హాస్పిటల్స్ ద్వారా
-
మహిళా మెడిసిన్ కాన్క్లేవ్ 2022
-
మహిళా మెడిసిన్ కాన్క్లేవ్ 2022 AIG హాస్పిటల్స్ ద్వారా
-
మహిళా మెడిసిన్ కాన్క్లేవ్ 2022
-
మలబద్దకం నివారణ మార్గాలు ఇవే.!
-
హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ముందుగా ఇలా చేయండి
-
ఈ కార్యక్రమం లక్ష్యం ఇదే...!
-
హార్ట్ ఎటాక్, హార్ట్ అరెస్ట్ తేడా ఇదే!
-
చేసే పనీ.. చేటు చేయొచ్చు.. జలుబు నుంచి క్యాన్సర్ దాకా..
ఒక వ్యక్తి రోజులో ఎక్కువ భాగం గడిపే చోటు ఏదైనా ఉందంటే అది ఉద్యోగం/ వృత్తిపరమైన విధులు నిర్వర్తించే ప్రదేశమే. ఎవరికైనా ఇది తప్పనిసరే అయినా.. ఆయా ఉద్యోగాలు/వృత్తి ప్రదేశాలకు వ్యక్తుల అనారోగ్యాలకు సంబంధం ఏర్పడుతోంది. సాధారణ జలుబు నుంచి తీవ్రమైన అనారోగ్యాలకు కారణమయ్యే దాకా.. వివిధ ఉద్యోగాలు, వృత్తుల ప్రభావం పడుతోంది. ఆరోగ్యం క్షీణించడం మొదలయ్యే వరకు కూడా చాలా మంది ఈ సమస్యను గమనించలేని పరిస్థితి ఉంటుంది. ఇటీవలికాలంలో వృత్తి వ్యాపకాల ప్రభావం గతంలో కంటే మరింత పెరిగిందని.. శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఇబ్బంది పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. వీటినే ఆక్యుపేషనల్ హజార్డ్స్గా చెప్తున్నారు. ఈ సమస్యలు రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆక్యుపేషనల్ హెల్త్‌పై అవగాహన కలిగిస్తున్న పలు సంస్థల అధ్యయనాలు ఏయే రంగాల్లో పనిచేస్తున్నవారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నది తేల్చి చెప్తున్నాయి. వాటి ప్రకారం.. – సాక్షి, హైదరాబాద్ అనారోగ్య ‘గనులు’.. గనులలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు వారు పీల్చే కలుషిత గాలి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నెమ్మదిగా ఊపిరితిత్తులు పాడవుతాయి. ఎన్ని జాగ్రత్తలు, గట్టి టోపీలు, అగ్నిమాపక భద్రత పరికరాలు, గాగుల్స్ వంటివి వాడినా ప్రమాదం తప్పని పరిస్థితే ఉంటోందని నిపుణులు తేల్చారు. సమస్యల కర్మాగారాలు.. కర్మాగారాల్లో భారీ యంత్రాలు, ప్రమాదకరమైన పదార్థాలు ఉంటాయి. పెద్ద శబ్దాలు వెలువడతాయి. ఇవన్నీ వ్యక్తుల ఆరోగ్యానికి హానికరమే. ఫ్యాక్టరీ కారి్మకులు, మేనేజర్లు లేదా ఫ్లోర్ వర్కర్లలో వినికిడి లోపం సాధారణంగా మారుతోంది. భవన నిర్మాణం.. ఆరోగ్య ధ్వంసం.. నిర్మాణ రంగంలో ప్రతి ఒక్కరికీ, వారు కార్మికులు, ఉద్యోగులు, డిజైనర్లు ఎవరైనా సరే.. ఎక్కువసేపు అక్కడే గడిపితే ప్రమాదకరమే. సిమెంట్, మట్టి, ఇసుక ధూళి, పెయింట్లు, మరికొన్ని నిర్మాణ ఉత్పత్తులు ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. బిపీఓలలో.. బాడీ క్లాక్‌కు బ్రేక్.. బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్ (బీపీఓ) సెంటర్లలో రాత్రి షిఫ్టులలో పనిచేయడం, నిరంతర రాత్రి షిఫ్టులు, తరచూ షిప్టులు మారడం వంటివి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పగటిపూట నిద్రపోతున్నా, షిఫ్టులు మారుతున్నా శరీరంలోని జీవ గడియారం (బయోలాజికల్ క్లాక్) ప్రభావితమవుతుంది. దీర్ఘకాలిక నష్టానికి కారణమవుతోంది. రాత్రి షిఫ్టులలో పనిచేసేవారిలో హైపర్ టెన్షన్, డయాబెటిస్‌తోపాటు సెప్టిక్ అల్సర్లు, గ్యా్రస్టిక్ అల్సర్లు వస్తున్నాయి. శుభ్రత.. ఆరోగ్యానికి లేదు భద్రత.. విభిన్న రకాల ఆవరణలను శుభ్రపరిచే వారికీ ఆరోగ్యపు ముప్పు తప్పడం లేదు. టాయిలెట్, బాత్రూం, ఫ్లోర్ క్లీనర్లు వాడినప్పుడు విష వాయువులు వెలువడతాయి. అవి చాలా ప్రమాదకరం. కంప్యూటర్.. వెన్నెముక కష్టాలు.. కంప్యూటర్ స్క్రీన్ ముందు ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసేవారికి వెన్ను భాగం, చేతులు, కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇటీవల ఈ రకమైన కెరీర్‌ను ఎంచుకుంటున్నవారు పెరిగారు. చాలా మంది వెన్నెముక సమస్యలు, స్లిప్డ్ డిస్క్, కండరాల ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పూల డిజైనర్‌కూ డేంజర్.. అందంగా, ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ పూల డిజైనర్ వృత్తి కూడా సమస్య రేపేదే. పూల డిజైనర్ కాండం నుంచి పూలను కత్తిరించి, అందంగా అమర్చే సమయంలో వాటికి దగ్గరగా ఉంటారు. ఆ పూల మొక్కల కోసం వినియోగించే బలమైన పురుగుమందుల ప్రభావానికి లోనవుతారు. వినికిడికి.. ‘ధ్వని’ దెబ్బ.. ఎక్కువ ధ్వని వెలువడే పరిశ్రమలు, ప్రాంతాల్లో పనిచేస్తున్నవారు వినికిడి సమస్యల బారినపడుతున్నారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. ఏవైనా పరిశ్రమల్లో ఒక ఉద్యోగి 8గంటల పాటు 90 డెసిబుల్స్ ధ్వనిలో పనిచేయవచ్చు. 95 డెసిబుల్స్ ఉంటే 4 గంటలు, 100 డెసిబుల్స్ ఉంటే 2 గంటలు మాత్రమే పనిచేయాలి. అదే 115 డెసిబుల్స్, ఆపైన తీవ్రతతో ధ్వని ఉంటే.. ఒక్క నిమిషం కూడా ఉండొద్దు. అంతేకాదు.. ఇయర్ ప్లగ్స్, ఇయర్ కెనాల్స్ వంటివి వాడాలి. వృత్తికో వ్యాధి తప్పట్లేదు అనేక రకాల పరిశ్రమలు, రంగాలు, వృత్తులు, ఉద్యోగాలు వివిధ రకాల అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. ►ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు ఊపిరితిత్తుల సమస్యలు, అతిగా నిలబడడం వల్ల వెరికోసిటీస్, వినికిడి సమస్యలు వస్తున్నాయి. ►పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు ఆక్యుపేషనల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటోందని, డయాబెటిస్, హైపర్ టెన్షన్ బారినపడుతున్నారని అధ్యయనాలు తేల్చాయి. గట్టిగా మాట్లాడుతూ బోధించడం వల్ల గొంతు సమస్యలూ కనిపిస్తున్నాయని అంటున్నాయి. ► లారీలు, కంటైనర్లు వంటి భారీ వాహనాల డ్రైవర్లకు వెన్ను సమస్యలు, ఆస్టియో ఆర్థరైటిస్, వాహనాల వైబ్రేషన్ వల్ల రక్తపోటు సమస్యలు వస్తున్నాయి. కన్నార్పకుండా రోడ్లను చూస్తూ ఉండటం వల్ల కళ్లు పొడిబారుతూ దృష్టి సమస్యలు వస్తున్నట్టు గుర్తించారు. ►సిలికా పరిశ్రమలో పనిచేసేవారు ఊపిరితిత్తులకు సంబంధించిన సిలికోసిస్‌కు గురవుతారు. ఆస్బోస్టాస్ పరిశ్రమల్లో పనిచేసేవారు పలు రకాల కేన్సర్లకు, చక్కెర పరిశ్రమలో పనిచేసేవారు పెగసోసిస్ వంటివాటికి గురవుతారు. ముందు జాగ్రత్తలు పాటిస్తేనే మేలు ‘ఆక్యుపేషనల్ హజార్డ్స్’ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. తాము చేస్తున్న ఉద్యోగం/వృత్తి వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో గుర్తించి.. వాటి నుంచి తప్పించుకునే అంశాలను పాటించాలని స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని పనిచేసేవారు.. మధ్యలో కాసేపు లేచి నడవడం, దూరంగా ఉన్న వస్తువులను చూడటం, వీలైతే చిన్నచిన్న వ్యాయామాలు చేయడం మంచిదన్నారు. అపరిశుభ్ర, కాలుష్య పరిస్థితుల్లో పనిచేసేవారు మాస్కులు, గ్లౌజులు వంటివి కచ్చితంగా వాడాలన్నారు. వైద్యులను సంప్రదించి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో సలహాలు తీసుకుని పాటించాలని స్పష్టం చేస్తున్నారు. అవగాహన కల్పిస్తున్నాం.. వృత్తి, ఉద్యోగపరమైన బాధ్యతల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటి పై తరచుగా అవగాహన సద స్సులు నిర్వహిస్తున్నాం. గత వారం ట్రాఫిక్ పోలీసులకు వచ్చే సమస్యలపై సదస్సు ఏర్పాటు చేశాం. కొత్తగా పుట్టుకొస్తున్న ప్రొఫెషన్ల వల్ల కూడా కొత్త ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నాయి. ఈ తరహా ఆక్యుపేషనల్ హజార్డ్స్‌కు చికిత్సలు లేవు. అందువల్ల ఆయా రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్నవారు అవగాహన పెంచుకుని, జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ విజయ్‌రావు, జాతీయ అధ్యక్షుడు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ -
ఈ లక్షణాలుంటే మీకు థైరాయిడ్ సమస్య ఉన్నట్లే..
-
AIIMS డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా ఇంటర్వ్యూ
-
లూపస్ వ్యాధి మహిళలలో అధికం వాటిని మనం తొందరగా గుర్తించకపోతే జరిగేది ఇదే..
-
చలనం..ఆలోచనల ఫలం.. స్టాండింగ్ డెస్క్‌లకు పెరుగుతున్న డిమాండ్..
సాక్షి, హైదరాబాద్: స్టాండింగ్ పొజీషన్లో వర్క్ పట్ల ఆసక్తి రాను రాను పెరుగుతోంది. వివిధ ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతున్న నేపథ్యంలో కూర్చోవడం కంటే నిల్చుని పనిచేయడానికే ఉద్యోగులు ప్రాముఖ్యతనిస్తున్నారు. దీంతో స్టాండింగ్ డెస్క్‌లకు డిమాండ్ క్రమంగా పెరిగిపోతోంది. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉండగా కార్పొరేట్ ప్రొఫెషనల్ అన్షుల్‌కి వెన్నునొప్పి మొదలైంది. క్రమంగా అది అతని ఇతర రోజువారీ కార్యకలాపాలను సైతం ప్రభావితం చేయడం ప్రారంభించింది. దాంతో అన్షుల్ స్నేహితుల సలహా మేరకు స్టాండింగ్ డెస్క్‌ను ఎంచుకున్నారు. ‘ఇప్పుడు, నా వెన్నునొప్పి తగ్గిపోయింది‘ అని అన్షుల్ చెబుతున్నారు. ఎక్కువ గంటలు కూర్చోవడం స్మోకింగ్‌తో సమానమైన వ్యసనంగా ఇప్పుడు వైద్యులు పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన కార్పొరేట్ ఉద్యోగులు, ఇతర డెస్క్ జాబ్స్ చేసేవారు నిలబడు...బలపడు అంటున్నారు. వీరికి స్టాండింగ్ డెస్క్‌లు పరిష్కారంగా మారుతున్నాయి. కూర్చోవడం– నుంచోవడం మధ్య వ్యత్యాసం.. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్స్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు, మెదడుకు రక్త ప్రసరణ పరిమితమవుతుంది, ఇది చిత్త వైకల్యం వంటి మెదడు జబ్బుల ప్రమాదానికి దారితీస్తుంది. నిలబడి ఉన్నప్పుడు, మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. దానికి అవసరమైన ఆక్సిజన్ ఇతర పోషకాలను అందిస్తుంది. చాలా సేపు కూర్చోవడం వల్ల అలసట, బద్ధకం వస్తాయి. అయితే స్టాండింగ్ శక్తి స్థాయిలను పెంచి చురుకు దనాన్ని ఇస్తుంది. గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల వెన్నునొప్పికి దారి తీస్తుంది. అదే నిలబడి ఉన్న డెస్క్‌లు నిటారుగా నిలబడటానికి మన కోర్ కండరాలకు మద్దతు అందించడం ద్వారా వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడతాయి. ఆధునిక పరిస్థితుల్లో మనం కంప్యూటర్లు, టెలి విజన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ముందు కూర్చొని ఎక్కువ సమయం గడుపుతున్న కొద్దీ, మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు మరింత స్పష్టంగా కనిపిస్తు న్నాయి.ఈ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కో వడానికి ఒక సులభ పరిష్కారం స్టాండింగ్ డెస్క్., వీటినే సిట్–స్టాండ్ డెస్క్‌లు అని కూడా పిలుస్తారు. కూర్చున్న, నిలబడి ఉన్న భంగిమలకు అనుగుణంగా రోజంతా రెండు రకాల భంగిమలకు మధ్య మారడానికి వీలుగా ఇవి రూపొందాయి. చలనం...ఆలోచనల ఫలం.. నగరానికి చెందిన ప్రోగ్రామర్ అభిషేక్ మాండ్లోయ్ 3 నెలల క్రితం స్టాండింగ్ డెస్క్‌కి మారారు, దీని కోసం కంపెనీ అతనికి ఫర్నిచర్ అలవెన్స్ మంజూరు చేసింది. ‘‘ఈ మార్పునకు నాకు రూ.27,000 ఖర్చయింది. దీని వల్ల శారీరక ఆరోగ్యమే కాదు అంతకుమించి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. నిలబడి ఉన్నప్పుడు నేను నలువైపులా కదలగలను. అది నేను మరింత వేగంగా ఆలోచించగలిగేలా పనిలో చురుకుతనం పెరిగేలా చేస్తోంది’’అని మాండ్లోయ్ అన్నారు. దీని గురించి ఫిట్నెస్ అగ్రిగేటర్ జింపిక్ సంస్థ వ్యవస్థాపకుడు అమరేష్ ఓజా మాట్లాడుతూ, ‘స్టాండింగ్ డెస్క్ మరింత చురుకుగా పని చేసేలా చేస్తుందనీ తన స్టార్టప్‌లోని సగం మంది సిబ్బంది ఇప్పటికే స్టాండింగ్ డెస్క్‌లను కొనుగోలు చేశారని చెప్పారు. అదే క్రమంలో యాపిల్ సంస్థ సైతం తన కొత్త ప్రధాన కార్యాలయం యాపిల్ పార్క్‌లో పనిచేసే ఉద్యోగులందరికీ స్టాండింగ్ డెస్క్‌లను ఏర్పాటు చేసిందని సమాచారం. డెస్క్‌కు డిమాండ్... వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ బలపడడంతో అది స్టాండింగ్ డెస్క్‌ల డిమాండ్ పెరగడానికి దారితీసింది. ‘కోవిడ్‌కు ముందుతో పోలిస్తే ఈ డెస్క్‌ల సేల్స్ ఇప్పుడు రెట్టింపైంది‘ అని ఎర్గో డెస్క్ రిటైల్ స్టోర్ నిర్వాహకులు రాహుల్ మాథుర్ అన్నారు. గత త్రైమాసికం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ సొల్యూషన్ల డిమాండ్ 45% కంటే పెరిగి, ఇప్పటికీ స్థిరంగా పెరుగు తోందని ఫర్నిచర్ రెంటల్ పోర్టల్ సిటీ ఫర్నిష్ వ్యవస్థాపకుడు నీరవ్ జైన్ వెల్లడించారు. సరిగ్గా ఉపయోగిస్తేనే.. నగరంలోని ఓ ఆసుపత్రికి చెందిన సర్జన్ డాక్టర్ అరుణ్ మాట్లాడుతూ ‘‘సరైన భంగిమలో ఉపయోగించినప్పుడు స్టాండింగ్ డెస్క్‌లు మంచి ఫలితాలను అందిస్తాయి’’ అని స్పష్టం చేశారు. అయితే ఒంగిన భంగిమలో లేదా మరేదైనా అపసవ్య భంగిమలో గాని నిలుచుని పనిచేస్తే అది కొత్త సమస్యలకు దారితీస్తుంది, అని ఆయన హెచ్చరిస్తున్నారు. మణికట్టు డెస్క్‌పై ఫ్లాట్‌గా ఉన్నప్పుడు మోచేతులు 90–డిగ్రీల కోణంలో ఉండాలని ఆయన సూచిస్తున్నారు. అయితే 30 నిమిషాల కంటే ఎక్కువసేపు ఒకే భంగిమలో నిలబడడం కూడా మంచిది కాదని అటూ ఇటూ చలనం అవసరమని అంటున్నారు. ఇదీ చదవండి: Gita Press: 'దేవాలయం కంటే తక్కువేం కాదు..' గీతా ప్రెస్పై ప్రధాని ప్రసంశలు.. -
లూపస్ వ్యాధి చాలా డేంజర్.... తొందరగా గుర్తిస్తే నయం చేయవచ్చు
-
ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే ముందు...కచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి...
-
ఇలా చేస్తే ప్రెగ్నెన్సీ రావడం ఖాయం ...
-
ఇలా చేస్తే మీ నడుం నొప్పి క్షణాల్లో మాయం
-
స్కూల్ పిల్లలు, జిమ్ చేసేవారికి నడుము నొప్పి రావడానికి అసలు కారణం..
-
వెన్నెముక సర్జరీ కోసం లేటెస్ట్ టెక్నాలజీ
-
సర్జరీ లేకుండా నడుము నొప్పి మాయం
-
గురక ప్రమాదమా ..? రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ..
-
సైనస్ లక్షణాలు ఇవే .. సర్జరీ చేసినా తగ్గకపోతే ఏం చేయాలి
-
డేంజర్.. వర్షకాలంలో రోజూ పానీపూరీ తింటున్నారా?
పానీపూరి అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాధారణంగానే సాయంత్రం కాగానే వీధి చివర్లోని పానీపూరీ బండి వద్ద గుమిగూడుతుంటారు. ఇక మరీ ముఖ్యంగా వర్షాకాలంలో పానీపూరి క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు.కాస్త చినుకులు పడగానే పానీపూరీల కోసం జనాలు ఎగబడతారు. అయితే వర్షాకాలంలో పానీపూరీ తినడం డేంజర్ అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. పానీపూరీ అంటే ఆహా ఓహో అంటూ లొట్టలు వేసుకొని తినేవాళ్లు చాలామందే ఉంటారు. తినేటప్పుడు అది ఎలా తయరుచేశారో, ఆ తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యల గురించి ఏమాత్రం ఆలోచించరు. అయితే ఇలా అడ్డగోలుగా ఎక్కడపడితే అక్కడ పానీపూరీ తింటే మాత్రం రోగాల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పానీపూరీలు అమ్మే స్థలం పరిశ్రుభంగా లేకపోయినా, తయారు చేసే వ్యక్తికి ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా అవి మీకు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో పానీపూరీలు తినాలనుకుంటే మాత్రం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. లేదంటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అపరిశుభ్రమైన నీళ్లు తాగడం వల్ల టైఫాయిడ్, ఉదర సంబంధిత వ్యాధులకు గురవుతారు. ► పానీపూరీకి ఉపయోగించే నూనె మంచిది కాకపోతే డేంజరే. ఎందుకంటే స్ట్రీట్ వెండర్స్ చాలావరకు ఒకసారి వాడిన నూనెను మళ్లీమళ్లీ ఉపయోగిస్తుంటారు. ఇలా నూనెను ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ► పానీపూరీలో పాన్ మసాలా కలుపుతారు అన్న విషయంలో చాలా మందికి తెలియదు. ఇది క్యాన్సర్‌కు కారకం అవుతుంది. ► పానీపూరీలో సోడియం ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజూ తినడం వల్ల ఉదర సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. ► వీటితో పాటు అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. ఇది కేవలం పానీపూరీకే వర్తించదు. అన్ని రకాల స్ట్రీట్ ఫుడ్స్, పరిశ్రుభత పాటించని హోటళ్లు చాలానే ఉన్నాయి. వీటివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే బయటి ఫుడ్‌కు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు నిపుణులు. -
గర్భిణీలలో రక్తహీనత తగ్గాలంటే ఈ పని చేస్తే చాలు ...
-
షోల్డర్ డిస్లొకేషన్... భుజం నొప్పికి కారణాలు
-
దవడ నొప్పికి కారణాలు చికిత్స
-
షోల్డర్ జాయింట్ గాయాలు... ఇలా చేస్తే నొప్పి మాయం
-
షోల్డర్ జాయింట్ గాయాలు... ఇలా చేస్తే నొప్పి మాయం
-
ప్రతి ఆటగాడు తప్పక తెలుసుకోవాల్సిన ఫిట్నెస్ రహస్యాలు..
-
గుర్రాలతో ఆందోళన తగ్గించే సరికొత్త థెరపీ
-
గుర్రాలతో కొత్త తరహా థెరపీ మీ కోసమే
-
జ్ఞాన దంతం తొలగిస్తే సమస్యలు వస్తాయా..?
-
తుంటి నొప్పి ... ఆపరేషన్ ఒక్కేటే మార్గం..?
-
విటమిన్ D లోపం వల్ల ఇన్ని రోగాలు వస్తాయా..!
-
కంటి శుక్లాలు ఏర్పడడానికి కారణం ఈ చిన్న మార్పుతో అంధత్వం దూరం
-
రెండు కళ్ళకి ఒకేసారి శుక్లం ఆపరేషన్ చేయించవచ్చా..?
-
బీపీ కంట్రోల్ లో లేకపోతే మీకు ఈ సమస్యలు తప్పవు
-
యువతలో హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుంది..? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి
-
గుండె జబ్బులు - రకాలు
-
ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం
-
పొగ తాగుతున్నారా? అయితే క్యాన్సర్స్ తప్పవు
-
టొబాకోతో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి
-
కంటి పై ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు ...కంటి చూపు పూర్తిగా కోల్పోతారు
-
గ్యాస్ట్రిక్ నొప్పికి, గుండె నొప్పికి తేడా తెలుసుకోవడం ఎలా?
-
షుగర్ పేషెంట్స్ కి ఫ్రోజెన్ షోల్డర్ పెయిన్ వస్తే ఏం చేయాలి
-
మరోసారి పెద్ద మనస్సు చాటుకున్న సీఎం జగన్.. కీలక ఆదేశాలు
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండలో గురువారం వైఎస్సార్ రైతు భరోసా పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బాధితులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. బాధితుల సమస్యలను ఓపిగ్గా విని రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందచేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శుక్రవారం 9 మంది బాధితుల కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ డా.జి. సృజన తన కార్యాలయంలో ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందచేశారు. ఆర్థిక సహాయం అందుకున్న వారు.. K.సావిత్రి భర్త వెంకట్రాముడు 1. పత్తికొండ మండలం పత్తికొండ గ్రామానికి చెందిన కె.సావిత్రికి ఎనిమిది నెలల నుంచి గుండె, ఊపిరితిత్తుల సమస్య ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట తన సమస్యను విన్నవించుకున్నారు. T. నరసింహులు 2. కౌతాళ మండలం తోవి గ్రామం చెందిన టి నరసింహులు తను పేదరికంతో ఉన్నానని, కుమారునికి అనారోగ్య కారణంగా వైద్యం చేయించేందుకు ఆర్థిక సాయం అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు. మెహరున్నీసా 3. కర్నూలు నగరానికి చెందిన మెహరున్నీసా తన కుమార్తెకు కిడ్నీ సమస్య ఉందని, అలాగే తన కుమార్తె చదువుకు ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి తన సమస్యను విన్నవించుకున్నారు. దిలీప్ కుమార్ రెడ్డి 4.మద్దికెర మండలం, గురజాల గ్రామం చెందిన పి. దిలీప్ కుమార్ రెడ్డి తాను తలసేమియా వ్యాధితో బాధపడుతున్నానని, నెలకు రెండుసార్లు రక్తం ఎక్కించుకోవలసి వస్తుందని,. ఆపరేషన్ చేయించుకునేందుకు ఆర్థిక సోమత లేక ఇబ్బందులు పడుతున్నానని తనను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు విన్నవించుకున్నారు. బోయ నరసింహులు 5. నందవరం మండలం, సోమల గూడూరు గ్రామం చెందిన బోయ నర్సింహులు తనకు కుడి కాలు, కుడి చేయి పని చేయడం లేదని, తనకు ఆర్థిక సహాయం అందజేయాలని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. K.రంగమ్మ 6. పత్తికొండ మండలం, నక్కల దొడ్డి గ్రామానికి చెందిన కె.రంగమ్మ వికలాంగత్వంతో ఉన్న తన కుమార్తెకు ఆర్థిక సహాయం చేయాలని సీఎం జగన్‌కు విన్నవించుకున్నారు. P. ఈరన్న సోదరుడు 7.ఆలూరు మండలం, కోటవీధికి చెందిన పి. చిదానందం తన కుమారుడు ఈరన్నకు కడుపునొప్పి సమస్య ఉందని, ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. కురువ లక్ష్మి 8. ఆదోని మండలం, ఆదోని గ్రామానికి చెందిన కురవ లక్ష్మి తన కుమార్తెలు ఇరువురికి సరిగా చూపు కనపడక అందత్వంతో బాధపడుతున్నారని సీఎం జగన్‌కు విన్నవించుకున్నారు. L.మహేష్ 9. పత్తికొండ మండలం, పత్తికొండ గ్రామం ఎల్ మహేష్ తన కుమార్తె మూగ మరియు చెవిటి బాధతో ఇబ్బంది పడుతుందని తనను ఆదుకోవాలని వారు ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. తమ సమస్యలను విని మానవతా దృక్పథంతో ఇంత తొందరగా ఆర్థిక సహాయం అందజేయడంపై రాష్ట్ర ముఖ్యమంత్రికి, జిల్లా కలెక్టర్‌కు బాధితులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పాల్గొన్నారు. -
మిక్స్డ్ వెదర్‌తో మహా డేంజర్! డాక్టర్ల కీలక సూచనలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం వేసవి కాలం చివరి రోజుల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రమంతా ఉదయం నుంచే 40 నుంచి 45 డిగ్రీల ఎండలు హీటెక్కిస్తున్నాయి. వడగాడ్పులతోపాటు అప్పుడప్పుడు సాయంత్రం అకస్మాత్తుగా గాలివాన కురియడంతో వాతావరణం చల్లబడుతోంది. అదీగాక వేసవి సీజన్ ముగిసిపోతుండటంతో ఎండలు చండప్రచండంగా మారుతున్నాయి. త్వరలోనే రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించవచ్చని వాతావరణ శాఖ నివేదికలున్నా.. ప్రతీ ఏడాది ఇవి ఆలస్యంగానే వస్తున్నాయి. అందువల్ల మరికొన్ని రోజులపాటు ఇలాంటి ‘మిక్స్డ్ వెదర్’తోనే ప్రజలు నెట్టుకురాక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి వాతావరణంలో బ్యాక్టీరియాలు, వైరస్లు చురుగ్గా ఉండి దాడి చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల ప్రజలు జాగ్రత్తగా మసలుకుని తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరముందని సూచిస్తున్నారు. వ్యాధినిరోధక శక్తి పెంచుకోవాలి అటు వేడి, ఇటు చల్లదనం వంటి మధ్యస్థ వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్లు యాక్టివ్‌గా ఉంటాయి. మన శరీరాలు కూడా అటు వేడికి, ఇటు చల్లటి వాతావరణానికి అలవాటు పడటానికి కొంత సమయం తీసుకుంటుంది. అలాంటి సమయం కోసం వైరస్లు, బ్యాక్టీరియాలు వేచిచూసి దాడిచేస్తాయి. టైఫాయిడ్, సీజనల్ జ్వరాలు, గొంతు సంబంధిత ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లుయెంజా వైరస్ల వంటివి వచ్చే అవకాశాలు అధికమవుతాయి. ఇలాంటి వాటికి ఆహారాన్నే ఔషధంగా మార్చుకుని తిప్పికొట్టాలి. ఫ్రైడ్ పదార్ధాలు, జంక్‌ఫుడ్ వంటివి మానేయాలి. అప్పటికప్పుడు వేడిగా తయారుచేసిన ఆహారపదార్థాలు తీసుకోవాలి. వేడి చేసి చల్లార్చిన నీరు లేదా పరిశుభ్రమైన నీటిని తాగాలి. తేలికపాటి వ్యాయామం చేయాలి. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడే వ్యాధినిరోధక« శక్తిని పెంచుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి తీవ్ర ఎండ వేడిమి నుంచి చల్లటి వాతావరణానికి మారినపుడు అనేక జబ్బులు వ్యాపిస్తాయి. ఇంకా తీవ్రమైన ఎండలు కొనసాగుతున్నందున వడదెబ్బ తగులకుండా, డీహైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా నీటిని తాగడంతోపాటు సహజమైన పళ్లరసాలు వంటివి తీసుకోవాలి. దోమలు, ఎలుకలు వంటి వాటి ద్వారా నీరు.. గాలి ద్వారా ఇన్ఫెక్షన్లు, వైరస్లు వ్యాప్తి చెందుతాయి. డెంగీ, మలేరియా వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. దోమల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం నీటిలో తడిచిన ప్రతీసారి ఫ్రెష్‌గా స్నానం చేయాలి. ఏడాదికోసారి ఫ్లూవ్యాక్సిన్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. -
ఒబెసిటీ క్లినిక్‌ల నిర్వాకం.. కరెంట్ షాక్స్‌తో వాంతులు, కడుపునొప్పి
నగరానికి చెందిన ఓ మహిళ తీవ్ర అనారోగ్యం పాలైంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఉదంతంలో... కార్ఖానాలోని సదరు క్లినిక్‌పై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. నగరంలో జేబులు ఖాళీ చేయడంతోపాటు రోగాల పాలు చేస్తున్న వెయిట్ లాస్ క్లినిక్స్ నయామోసాలకు ఇది తాజా ఉదాహరణ మాత్రమే. సాక్షి, హైదరాబాద్: నగరం ఇప్పుడు ఒబె‘సిటీ’ క్యాపిటల్‌గా మారింది. అధిక బరువుతో బాధపడేవారితో పాటు ఆ బాధను సొమ్ము చేసుకోవాలనుకునే చికిత్సా కేంద్రాలూ పుట్టగొడుగుల్లా పెరిగాయి. కానీ వీటిలో పలు వెయిట్ లాస్ సెంటర్లకు సరైన చికిత్సా విధానం లేదు. సరైన వైద్య నిపుణులు లేరు. దీంతో తోచిన వైద్యం చేస్తున్నారు. రూ.వేలకు వేలు ముందే కట్టించేసుకుంటూ నెలల తరబడి ట్రీట్మెంట్స్ సాగదీస్తున్నారు. వెరసి ఎటువంటి ఫలితం లేకపోగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. పోనీ పోతే పోయింది డబ్బే కదా అనుకోవడానికి లేదు.. చాలామంది డబ్బుతో పాటు అనారోగ్యాల పాలవుతున్నారు. అదే ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. 15 కిలోల బరువు తగ్గడానికి 30 ఏళ్ల క్లయింట్ మహేశ్వరి కార్ఖానాలోని కలర్స్ క్లినిక్‌ని ఆశ్రయించింది. దీంతో ఆమెకు గత ఏప్రిల్ 15 నుంచి చికిత్స ప్రక్రియ మొదలైంది, ఆ తర్వాత ఆమెకు క్లినిక్ సిబ్బంది కరెంట్ షాక్స్ ఇచ్చారు. అలాగే కొన్ని మందులు కూడా ఇచ్చారు. వీటి కారణంగా ఆమెకు తీవ్రంగా వాంతులు, కడుపునొప్పి మొదలయ్యాయి. దీని గురించి క్లినిక్ సిబ్బందికి చాలాసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ నేపధ్యంలోనే శనివారం ఆమె స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆమె భర్త ఫిర్యాదు మేరకు క్లినిక్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: బుర్ర వేడెక్కి, కాలిపోతుంది.. బర్న్ ఔట్ సిండ్రోమ్, మూన్‌లైటింగ్ అంటే? శరీరం కాలిపోయింది... అధిక బరువు తగ్గించే చికిత్స కోసం నగరవాసి గాయత్రి రాణా గచ్చిబౌలిలోని రిచ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్‌కు రూ.3 లక్షలు చెల్లించారు. మూడు నెలల చికిత్స వల్ల కనీసం 1% ప్రయోజనం పొందలేదు. పైగా 30డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ‘మెషినరీ‘ ఉపయోగించడటం వలన చికిత్స సమయంలో తనకు కాలిన గాయాలు సహా ఒంటిపై ఇతరత్రా అనేక గాయాల య్యాయని ఈ విషయాన్ని క్లినిక్‌లోని సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాలేదని, సరైన వైద్యం అందించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆమె ఆరోపించారు. ఆమె ఫిర్యాదు పై విచారణ జరిపిన జిల్లా వినియోగదారుల ఫోరం నష్టాన్ని నిర్ధారించి, ఆమె చెల్లించిన రూ.3 లక్షలను 6% వడ్డీతో వాపసు చేయాలని ఇతర ఖర్చుల నిమిత్తం రూ.5,000 చెల్లించాలని క్లినిక్‌ని ఆదేశించింది. వెన్నునొప్పి, చర్మ సమస్యలు.. నగరానికే చెందిన కె.హాసిని యాదవ్ చికిత్స కోసం లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ ను సంప్రదించారు. తుంటి భాగంలో కొన్ని అంగుళాల కొవ్వు తగ్గించే చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. మూడు నెలల్లో కనీసం 10–15 కిలోల బరువు తగ్గుతుందని ఆమెను క్లినిక్ నిర్వాహకులు నమ్మించారు. దాంతో ఆమె చికిత్స రుసుముగా రూ.లక్ష చెల్లించారు. నాలుగు నెలలు గడిచినా అంగుళం, బరువు తగ్గలేదని పైగా తనకు కొత్తగా వెన్నునొప్పితో పాటు చర్మ సమస్యలు మొదలయ్యాయని ఆమె ఆరోపించారు. తన తొమ్మిది నెలల చికిత్స సమయంలో, ఫిజియోథెరపిస్ట్‌ని కనీసం ఆరు సార్లు మార్చారని, నేర్చుకోవడానికి ప్రయోగాలు చేయడానికి తనను ఒక మోడల్‌గా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కూడా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా నష్టపరిహారం ఇవ్వాలని క్లినిక్‌ను ఆదేశించింది. చదవండి: Weather Update: తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ అలర్ట్.. నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక జాగ్రత్తలు తీసుకోవాలి ►బరువు తగ్గించుకునే చికిత్సలు అందించే కేంద్రాల్లో ఉన్న నిపుణుల గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. ఏ ఆరోగ్య సమస్యలు రావని నిర్ధారించుకున్నాక, అది కూడా వైద్యుని సలహా తీసుకున్న తర్వాతే చికిత్స గురించి ఆలోచించాలి. ►వీలైనంత వరకూ మందులు, కఠినమైన వ్యాయామాలు, మసాజ్‌ల ద్వారా కాకుండా నిదానంగా ప్రారంభించి తగినంత సమయం తీసుకుని బరువు తగ్గే విధానాన్ని ఎంచుకోవాలి. ►ప్రకటనలు, ఆర్భాటాలు చూసి కాకుండా గత చరిత్ర, వ్యక్తిగత అనుభవాలు తెలుసుకుని క్లినిక్స్‌ను సెలక్ట్ చేసుకోవాలి. సంప్రదించిన రెండో నిమిషం నుంచే డబ్బులు కట్టమని ఒత్తిడి చేసే క్లినిక్స్‌ను దూరంగా పెట్టడమే మంచిది. -
కాలుష్యంతో శిశువుల్లో మానసిక సమస్యలు
సాక్షి, న్యూఢిల్లీ: వాయు కాలుష్యం, నాణ్యత లేని గాలి కారణంగా భారత్‌లో రెండేళ్లలోపు శిశువుల్లో మానసికంగా ఎదుగుదల సమస్యలు తలెత్తుతున్నట్లు అధ్యయనంలో తేలింది. సాధారణంగా రెండేళ్ల లోపు వయసున్న శిశువుల్లో మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ వయసులో స్పర్శ, అనుభవం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. జ్ఞానేంద్రియాలను పూర్తిగా ఉపయోగించుకుంటారు. కాలుష్యంతో కూడిన గాలిని పీల్చడం వల్ల మెదడు అభివృద్ధిలో వేగం మందగిస్తుందని, ఈ ప్రతికూల ప్రభావం జీవితాంతం ఉంటుందని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. వాయు కాలుష్యం వల్ల శిశువుల్లో మానసికపరమైన ఎదుగుదలతో పాటు భావోద్వేగ, ప్రవర్తన సంబంధిత సమస్యలు తలెత్తుతాయని, ఇవి వారి కుటుంబాలపైనా తీవ్ర ప్రభావం చూపుతాయని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా పరిశోధకుడు ప్రొఫెసర్ జాన్ స్పెన్సర్ చెప్పారు. (చదవండి: ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి బాంబు బెదిరింపు!) -
చేతిలో స్మార్ట్‌ఫోన్..వెన్నెముక డౌన్!
ఒకప్పుడు రైల్లోనో, బస్సులోనో కూర్చునే చోటు దొరక్క నిలబడాల్సి వచ్చిందని మాత్రమే చింతించేవారు.. మరి ఇప్పుడు మనం మొబైల్‌ను మిస్ అవుతున్నామని అంతకు మించి చింతిస్తున్న పరిస్థితి. (నిలబడీ మొబైల్ వాడేవాళ్లూ ఎక్కువే ఉన్నారనుకోండి). కూర్చునేందుకు కాస్త చోటు దొరికితే చాలు.. టక్కున ఫోన్లో తలదూర్చేస్తున్నారు. ఇదొక్కటే కాదు.. కూర్చున్నా, బెడ్‌పై ఉన్నా, బయట ఎక్కడైనా తిరుగుతున్నా, నడుస్తూ వెళుతున్నా మొబైల్ ఫోన్ చేతిలోనే ఉంటోంది. కానీ ఇదే అతిపెద్ద సమస్యను తెచ్చిపెడుతోంది. ఫోన్ చూడటం కోసం మెడ వంచడం, చేతులను ఎక్కువ సేపు పైకెత్తి ఉంచడం, కూర్చున్నా, పడుకున్నా ఫోన్ చూడటం కోసం ఏదో ఓవైపు వంగిపోతుండటం, స్క్రోలింగ్, టైపింగ్ కోసం వేళ్లను విపరీతంగా వినియోగిస్తుండటం వంటి వాటితో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ టెక్ నెక్.. సమస్యతో.. స్మార్ట్‌ఫోన్‌తో గంటల కొద్దీ గడిపేవారు, ఇందులో ముఖ్యంగా టీనేజర్లు ‘టెక్ నెక్’, లేదా ‘న్యూ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్’తో బాధపడుతున్నారని తాజా పరిశోధనలు గుర్తించాయి. దీనిద్వారా మెడ, వెన్నునొప్పితోపాటు తలనొప్పి, భుజాల నొప్పులు, చేతుల్లో జలదరింపు, కండరాలు పటుత్వం కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. చాలాసేపు మెడ వంచి చూడటం వల్ల.. మెడలోని స్నాయువులు, కండరాలు, కీళ్లపై ఒత్తిడి పడుతోందని ఇండియన్ స్పైనల్ ఇంజూరీస్ సెంటర్ (ఐఎస్‌ఐఈ) మెడికల్ డైరెక్టర్ డాక్టర్ హెచ్ఎస్ ఛబ్రా హెచ్చరించారు. దీర్ఘకాలికంగా, మెడ కండరాలు అపసవ్యంగా సంకోచించడం వల్ల పుర్రెతో అనుసంధానమైన ఉన్నచోట మంట, నొప్పిని కలిగిస్తుందని.. ఈ నొప్పి ఫాసియా ద్వారా మెడ నుంచి తలకు వ్యాపిస్తుందని వివరించారు. భంగిమ సరిగా లేక.. భారంగా.. మొబైల్‌ను చేతిలో పట్టుకున్నప్పుడు కేవలం వేళ్లు మాత్రమే ఉపయోగిస్తున్నామని అనుకుంటాం. కానీ మన చేతులు, మోచేయి, కండరం, మెడ ఇవన్నీ వినియోగిస్తాం. మొబైల్‌ను చూస్తున్నప్పుడు మెడను కిందకు వంచుతాం. దీనివల్ల మెడ, వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ అండ్ పబ్లిక్ హెల్త్’కథనం ప్రకారం.. ఇలా మెడ వంచి చూసే భంగిమ వల్ల వెన్నెముకపై తల బరువు పెరుగుతుంది. ‘‘వాస్తవానికి తల నిటారుగా ఉన్న స్థితిలో దాదాపు 5–8 కిలోల బరువుపడుతుంది. తల వంగుతున్నప్పుడు 15 డిగ్రీల దగ్గర.. మెడపై భారం సుమారు 12 కిలోలు, 30 డిగ్రీల దగ్గర 18.14 కిలోలకు 45 డిగ్రీల దగ్గర 22.23 కిలోలకు 60డిగ్రీల దగ్గర 27.22 కిలోలకు పెరుగుతుంది. ఇలా మెడ అతిగా వంగడంతో వెన్నెముక, సపోర్టింగ్ లిగమెంట్లు, కండరాలపై ప్రభావం పడుతుంది..’’అని ఆ కథనం స్పష్టం చేసింది. కీళ్లు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఫోన్ మాట్లాడే సమయంలో నిలబడే, కూర్చునే భంగిమలో లోపాలు మసు్క్యలోస్కెలెటల్ సమస్యలకు కారణం అవుతున్నాయని.. గర్భాశయ, థొరాసిక్, నడుము ప్రాంతాలలో వెన్నెముక దెబ్బతినడంతో అనేక మంది ఇబ్బందిపడుతున్నారని వైద్యులు చెప్తున్నారు. సాధారణంగా కీళ్ల పనితీరు బాగున్నప్పుడు ఒత్తిడికి గురైనా, విశ్రాంతి సమయంలో మరమ్మతు అవుతాయని వివరిస్తున్నారు. కానీ కీళ్లను అసాధారణ భంగిమలో ఎక్కువసేపు ఉంచడం, ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉంచడం వల్ల తీవ్రమైన ఒత్తిడి పడి.. అరిగిపోయి, తిరిగి బాగయ్యేందుకు అవకాశం లేనంతగా దెబ్బతింటున్నాయని స్పష్టం చేస్తున్నారు. నిపుణులు ఏమంటున్నారంటే? ♦ మెడ భుజం ముందుకు సాగినప్పుడు.. ముందువైపు కండరాలు బిగుతుగా మారుతూ, వెనుక వైపు బలహీనపడతాయి. కండరాల అసమతుల్యత ఏర్పడుతుంది. కాబట్టి మొబైల్ ఉపయోగిస్తున్నప్పుడు భంగిమపై శ్రద్ధ చూపడం తప్పనిసరి. ♦ శరీర భంగిమ అనేది ఫిట్‌నెస్‌కు కీలకం. ట్రెడ్మిల్, క్రాస్ ట్రైనర్ వంటివాటి మీద ఉండగా.. మొబైల్ ఫోన్ వినియోగించడం వంటివి చేయవద్దు. ♦ నిలబడి ఉన్నప్పుడు, ఎవరికైనా మెసేజీలు పంపుతున్నప్పుడు తల పైకి, భుజాలు కిందకు ఉంచాలి. వీలైనంత వరకు మొబైల్‌ను కళ్లకు సమాంతరంగా ఉంచడం సరైన భంగిమ. ♦ కురీ్చలో లేదా సోఫాలో కూర్చున్నప్పుడు ఫోన్ చూస్తూ వంగిపోవడం ఏ విధంగానూ ఆరోగ్యకరం కాదు. వెన్ను నిటారుగా ఉంచి కూర్చోవాలి. ఫోన్ చూడటానికి లేదా టెక్ట్స్ చేయడానికిగానీ మెడ ఎక్కువగా వంచకూడదు. ♦ పడుకున్నప్పుడు ఫోన్ పట్టుకోవడానికి.. మోచేతికి దిండు లేదా మరేదైనా మెత్తని దాన్ని ఆసరాగా తీసుకోవాలి. ♦ భోజనం చేసేప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, కంప్యూటర్ వినియోగిస్తూ, డ్రైవ్ చేస్తూ.. ఇలా పలు సందర్భాల్లో ఫోన్‌ను కూడా ఉపయోగించడమనే మల్టీ టాస్కింగ్ అటు శారీరకంగా, ఇటు మానసికంగా కూడా ఆరోగ్యానికి చేటు తెస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. బఫెలో హంప్ కనిపిస్తోంది టెక్ట్స్ నెక్ సిండ్రోమ్, స్పైన్ పెయిన్ వంటివన్నీ మనం నిలబడే, కూర్చునే, శరీరాన్ని ఉంచే తీరులో సమస్య వల్లే తలెత్తుతున్నాయి. దీర్ఘకాలంపాటు తప్పుడు భంగిమ వల్ల మెడ అలైన్మెంట్ సాగిపోతుంది. దాదాపు 60, 70ఏళ్ల వయసులో సంభవించే మెడలు సాగిపోవడం, ఫ్రోజెన్ షోల్డర్, రౌండెడ్ షోల్డర్ వంటివి 40 ఏళ్ల వయసులోనే వచ్చేస్తున్నాయి. మొత్తంగా సహజమైన శరీర నిర్మాణాన్ని ఈ భంగిమ లోపాలు దెబ్బతీస్తున్నాయి. ఒకప్పుడు బాగా తలవంచుకుని పనిచేసే కొందరు బ్యాంకు ఉద్యోగులు వంటివారిలో ఎక్కువగా కనిపించే మెడ వెనకాల సెమీ సర్కిల్ ఇప్పుడు చాలామందిలో కనిపిస్తోంది. బఫెలో హంప్గా పేర్కొనే దీన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర సమస్యలు తప్పవు. ఏదేమైనా భంగిమ లోపాలు సరిచేసుకుంటూనే ఫోన్ వాడకాన్ని వీలైనంత తగ్గించుకోవడమే ఉత్తమం. – డాక్టర్ విజయ్ బత్తిన, ఉఛ్వాస్ ట్రాన్సిషనల్ కేర్ ఫోన్ వినియోగాన్ని పరిమితం చేయాలి ఇటీవల భుజాల నొప్పులు, మణికట్టు బాధలు చాలా మందిలో గమనిస్తున్నాం. మొబైల్స్‌ని ప్రొఫెషనల్‌గా వాడేవారిలో బొటనవేలు మొద్దు బారడం సహా మరిన్ని సమస్యలు కనపడుతున్నాయి. పడుకునే భంగిమలో పుస్తకం చదివినట్టు ఫోన్ చూడడం సరికాదు. అలాగే వాష్‌రూమ్స్, టాయిలెట్స్‌లో కూడా వాడొద్దు. ఎలాపడితే అలా వాడటం వల్ల భుజాల కండరాలు, చేతులు, మణికట్టు ఒత్తిడికి గురవుతాయి. అయితే ఏది సరైన భంగిమ అనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. కాబట్టి వీలైనంత వరకూ ఫోన్ వాడేటప్పుడు మధ్యలో విరామాలు తీసుకోవడం, ఫోన్ వినియోగాన్ని పరిమితం చేయడం తప్పనిసరి. – డాక్టర్ శివరాజు, జనరల్ ఫిజీషియన్, కిమ్స్ ఆస్పత్రి -
పంచ్ ప్రసాద్‌కు తీవ్ర అనారోగ్యం.. మరోసారి ఆస్పత్రికి!
జబర్ధస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గత కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఆయన డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకుంటున్నా ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదు. అంతే కాకుండా రోజు రోజుకు కొత్త అనారోగ్య సమస్యలు ఆయన్ని చుట్టుముడుతున్నాయి. ఇటీవలే తీవ్రమైన జ్వరంతో ఆస్పత్రిలో పంచ్ ప్రసాద్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం గొంతు సమస్యతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన భార్య తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకున్నారు. (ఇది చదవండి: ‘పుష్ప -2’ టీజర్.. ఐకాన్ స్టార్ దెబ్బకు యూట్యూబ్ షేక్) పంచ్ ప్రసాద్ భార్య మాట్లాడుతూ.. 'ఇప్పుడు ఆసుపత్రికి వచ్చాం. ఇప్పటికే ఆయనకు థైరాయిడ్ సమస్య ఉంది. అది మరింత తీవ్రంగా మారింది. అల్ట్రా సౌండ్ స్కానింగ్ తర్వాత రిపోర్టులు చూసిన డాక్టర్స్ సర్జరీ చేయాలని చెప్పారు. ఆయన కాలికి లెగ్ ఇన్ఫెక్షన్ కూడా ఉండడంతో సర్జరీ ఇప్పుడే వద్దని చెప్పారు. లెగ్ ఇన్ఫెక్షన్ తగ్గిన తరువాత సర్జరీ చేస్తామని డాక్టర్లు అన్నారు. మెడిసిన్స్‌తో తగ్గాలని దేవుడిని కోరుకుంటున్నా.' అని ఆమె అన్నారు. కాగా, పంచ్ ప్రసాద్ తన పేరు మీద ఓ యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు. తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇది చూసిన ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. -
మారుతున్న ఉష్ణోగ్రతలు హానికరం.. వైద్యుల హెచ్చరిక
పగటి ఉష్ణోగ్రత పెరుగుదల, రాత్రిపూట చలి కారణంగా జ్వరం, గొంతు చికాకు మరియు దగ్గు, కంటి ఇన్ఫెక్షన్ వంటి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శరీర ఉష్ణోగ్రతను సమర్థవంతంగా నియంత్రించలేనివారికి ఇది హానికరమని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వాతావరణ మార్పులతో తీవ్రమైన ఉష్ణోగ్రతల నుంచి ప్రజలు తమను తాము రక్షించుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య ఇటీవలి అధిక వ్యత్యాసం ఆందోళనకరంగా ఉంది. ఈ ఉష్ణోగ్రతల్లో వైవిధ్యాలు వాతావరణ మార్పులకు సంకేతమని, ఇవి అనారోగ్యాల పెరుగుదలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ మార్పులు వైవిధ్యం సాధారణ నిద్రకు భంగం కలిగిస్తాయని, రోగనిరోధక శక్తిని దెబ్బతీసే ప్రమాదం కూడా ఉందంటున్నారు. గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక రుగ్మతలే కాక మానసిక ఆరోగ్య సమస్యలు కూడా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఈ వాతావరణ మార్పుల సమయంలో వేడి గాలి, పొడి గాలి, ఆరుబయట ఎక్కువ సమయం గడపడం వల్ల అనారోగ్య స్థాయి పెరుగుతోంది. ఉష్ణోగ్రత 40ని డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ పెరిగితే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. అలసట, చురుకుదనం కోల్పోవడం, కండరాల నొప్పులు, మూర్ఛలు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు దీనివల్ల ప్రభావితమవుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరిగి కంటి, గొంతు, చర్మ వ్యాధులకు కారణమవుతున్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ► శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి ► బయట ఉన్నప్పుడు మాస్క్ ధరించాలి, తరచూ చేతులను శుభ్రపరచుకోవాలి ► పిల్లలు, గర్భిణులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి ► మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడం మంచిది ► రోగనిరోధక శక్తికోసం తేలికపాటి వ్యాయామాలు చేయాలి ► అధిక ఉష్ణోగ్రతల్లో బయటకు వెళ్లేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. -
మేనరికపు పెళ్లి వల్లే పిల్లలకు అనారోగ్యం.. ఎంత పని చేశావ్ అమ్మా!
సాక్షి, అల్వాల్: కడుపున పుట్టిన ముగ్గురు బిడ్డలూ అల్పాయుష్షుతోనే కన్నుమూశారు. ప్రస్తుతం జన్మనిచిన కవలలూ అనారోగ్యానికి గురయ్యారు. మేనరికపు పెళ్లి కారణంగానే పిల్లలు ఆయుర్దాయం లేకుండా చనిపోతున్నారని ఆవేదనకు గురైంది ఆ తల్లి. భవిష్యత్‌లో తాను మాతృమూర్తిగా మనగలిగే పరిస్థితి ఉండదని భావించిన ఆమె పదిరోజుల వయసున్న పసికందులను ఇంటి ఆవరణలోని సంపులో పడేసి తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాజీగూడ శివనగర్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లాకు చెందిన నర్సింగ్‌రావుకు మేనమామ కూతురు సంధ్యారాణితో 2012లో వివాహమైంది. 5 సంవత్సరాల అనంతరం ఇద్దరు కవల పిల్లలు జన్మించి అనారోగ్యంతో చనిపోయారు. 2018లో పుట్టిన కొద్ది రోజులకే కూతురు మరణించింది. అనంతరం ఈ నెల 11న ఇద్దరు కవల (మగ, ఆడ) పిల్లలు జన్మించారు. వీరు సైతం అనారోగ్యానికి గురయ్యారు. బాబుని కొంపల్లిలోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. 14వ తేదీన ఇంటికి తీసుకువచ్చారు. పుట్టిన పిల్లలందరూ అనారోగ్యానికి గురవుతూ మృత్యువాత పడుతుండడం.. ఈ ఇద్దరు పసికందులు కూడా దక్కకుండాపోతారేమోనని భావించిన సంధ్యారాణి.. ఆదివారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంటి ఆవరణలో ఉన్న సంపులో వారిని పడేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో అర్ధరాత్రి సంధ్యారాణి కనిపించకపోడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి పరిసరాలను పరిశీలిస్తూ సంపులో వెతకగా సంధ్యారాణి, ఇద్దరు పిల్లల మృతదేహాలు సంపులో కనిపించాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మేనరికపు పెళ్లి వల్లే పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని భావించి ఈ ఘాతుకానికి పాల్పడుతున్నట్లు రాసి ఉన్న సూసైట్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. ఈ ఘటనపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Crime: ‘పిన్నమ్మా.. నాకు పెళ్లి చెయ్యవా?’ -
Health Tips: సాయంత్రం టీకి వీరు దూరంగా ఉండాలి!
భారతీయ జనాభాలో 64 శాతం మంది రోజూ టీ తాగడానికి ఇష్టపడతారు, అందులో 30 శాతం మంది సాయంత్రం పూట తాగుతున్నారు. అయితే... సాయంత్రం పూట టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్య శాస్త్రం ప్రకారం మంచి నిద్ర, సరైన లివర్ డిటాక్స్, ఆరోగ్యకరమైన జీర్ణక్రియ కోసం పడుకోవడానికి కొద్దిగంటల ముందు కెఫీన్ ను నివారించడం ఉత్తమం. టీ చెడ్డది కాదు.. కానీ.., అది పాలతో తాగాలా, ఎక్కువ తాగాలా.. తక్కువ తాగాలా.. ఏ సమయంలో తాగాలి.. అనేది చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. విదేశాలలో చాలా మంది బ్లాక్ టీనే తాగుతారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, థైరోఫ్లేవిన్, థైరోబిసిన్ వంటి పాలీఫెనాల్స్ ఉంటాయి–ఇవన్నీ ఆరోగ్యకరమైనవే. మనదేశంలో మాత్రం పాలు, చక్కెరను జోడించి టీ తయారు చేసుకొని తాగుతారు. అయితే ఇది అంత మంచిది కాదు. అందువల్ల మన టీరు తెన్నులు మార్చుకోవడం మంచిది. ♦ రాత్రి షిఫ్టులో పనిచేసే వ్యక్తులు ♦ ఎసిడిటీ లేదా గ్యాస్ట్రిక్ సమస్య లేని వ్యక్తులు ♦ ఆరోగ్యకరమైన జీర్ణక్రియ కలిగిన వారు ♦ నిద్ర సమస్య లేని వారు ♦ ప్రతిరోజూ సమయానికి భోజనం చేసేవారు ♦ సగం లేదా కప్పు కంటే తక్కువ టీ తాగే వారు.. వీరంతా ఎప్పుడు తాగినా ఫరవాలేదు. సాయంత్రం టీకి వీరు దూరంగా ఉండాలి! ♦ నిద్రలేమికి గురయ్యే వారు ♦ ఆందోళనతో బాధపడేవారు, ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడిపేవారు ♦ అధిక వాత సమస్యలు ఉన్న వ్యక్తులు (పొడి చర్మం,పొడి జుట్టు) ♦ బరువు పెరగాలనుకునే వారు ♦ ఆకలి సరిగా లేని వారు ♦ హార్మోన్ల సమస్యలతో బాధపడేవారు ♦మలబద్ధకం / ఆమ్లత్వం లేదా గ్యాస్ సమస్య. ♦జీవక్రియ, ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడే వారు. ♦ తక్కువ బరువు కలవారు ♦ ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు కోరుకునే వారు. ఇక ఏ టీ, ఎప్పుడు తాగాలో మీరే తేల్చుకోండి. నోట్: ఇది కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! -
డంపింగ్ గ్రౌండ్లతో మృత్యు ఘోష.. పదేళ్లలో 1,877 మంది మృతి
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చెత్తవేసే డంపింగ్ గ్రౌండ్ల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. 13 ఏళ్ల నుంచి గోవండీలో ఉన్న డంపింగ్ గ్రౌండ్, బయో మెడికల్ చెత్తను నిర్వీర్యం చేసే ప్రక్రియ ప్రాజెక్టువల్ల వాతావరణం కాలుష్యమైపోతోంది. ఫలితంగా గోవండి ప్రాంత ప్రజలు వివిధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. గడచిన పదేళ్లలో బీఎంసీకి చెందిన ఎం– తూర్పు వార్డు పరిధిలో 1,877 మంది క్షయ వ్యాధితో మృత్యువాత పడ్డారని సమాచార హక్కు చట్టం కింద సేకరించిన వివరాలను బట్టి తెలిసింది. అంతేగాకుండా గడచిన పదేళ్ల కాలంలో 45,051 మందికి క్షయ వ్యాధి సోకినట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో గోవండీ, పరిసరాల్లో భీతావహ వాతావరణం నెలకొంది. గోవండీలో ఉన్న డంపింగ్ గ్రౌండ్, బయో మెడికల్ చెత్త నిర్వీర్యం చేసే ప్రకియ ప్రాజెక్టు వల్ల కమలారమణ్ నగర్, డింపింగ్ రోడ్, డా.జాకీర్ హుస్సేన్ నగర్, రఫిక్ నగర్, బాబానగర్, బైంగన్ వాడి, శివాజీనగర్, పీఎంజీపీ కాలనీ, టాటా నగర్ కాలనీ, ఇండియన్ ఆయిల్ నగర్, దేవ్నార్ తదితర పరిసరాల్లో కాలుష్యం పెరిగిపోయింది. దీని ప్రభావం అక్కడుంటున్న స్థానిక ప్రజల ఆరోగ్యంపై పడసాగింది. దీంతో స్థానికుల నుంచి అనేక ఫిర్యాదులు రావడం మొదలయ్యాయి. కానీ వాటిని స్ధలాంతరం చేయడానికి బీఎంసీకి ప్రత్యామ్నాయ మార్గం కనిపించలేదు. దీంతో అక్కడే కొనసాగిస్తూ వస్తున్నారు. సామాజిక కార్యకర్త శేఖ్ ఫైయాజ్ ఆలం సమాచార హక్కు చట్టం ద్వారా బీఎంసీ ఎం–తూర్పు వార్డు పరిధిలో ఎంత మంది క్షయ రోగులున్నారో వారి వివరాలు సేకరించారు. అందులో 2013 నుంచి 2022 వరకు మొత్తం 45,051 మందికి క్షయ వ్యాధి సోకినట్లు తేలింది. అందులో 1,877 మంది చనిపోయినట్లు ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. కానీ క్షయ సోకిన వారు, మృతి చెందిన వారంతా బయో మెడికల్ చెత్త నిర్వీర్యం చేసే ప్రక్రియ ప్రాజెక్టు నుంచి వెలువడుతున్న విషవాయువుల వల్ల చనిపోయినట్లు నిర్ధారించాల్సిన అవరసం ఎంతైన ఉందని ఎస్ఎంఎస్ కంపెనీ అంటోంది. చెత్తను నిరీ్వర్యం చేసే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ఈ ప్రాజెక్టును కొనసాగిస్తున్నామని తెలిపింది. కొందరు స్థానికులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కంపెనీ స్పష్టం చేసింది. -
తిమ్మిర్లు.. అశ్రద్ధ చేస్తే అసలుకే ఎసరు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కాళ్లు, చేతులు నరాలు మొద్దుబారడం, స్పర్శ తెలియక పోవడం, మంటలు పుట్టడం వంటి సమస్యలను ఇటీవల కాలంలో చాలా మందిలో చూస్తున్నాం. ఇది పెరిఫరల్ న్యూరోపతి అనే నరాల జబ్బుగా వైద్యులు పేర్కొంటున్నారు. దీనిని తొలిదశలో గుర్తించడం ద్వారా మంచి మందులు అందుబాటులో ఉన్నాయని, నయం చేయవచ్చునంటున్నారు. అశ్రద్ధ చేస్తే కాళ్లు, చేతులకు రక్తప్రసరణ తగ్గి, గాంగ్రీన్స్ ఏర్పడడం, చివరికి అవయవాలు కోల్పోవడం, ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని న్యూరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. పెరిఫరల్ న్యూరోపతిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలంటున్నారు. ప్రభుత్వాస్పత్రికి క్యూ కడుతున్న రోగులు పెరిఫరల్ న్యూరోపతి బాధితులు ప్రభుత్వాస్పత్రికి క్యూ కడుతున్నారు. వారంలో మూడు రోజుల పాటు ఓపీ నిర్వహించే న్యూరాలజీ విభాగానికి ప్రతిరోజూ 250 నుంచి 300 మంది రోగులు వస్తుంటారు. వారిలో 15 నుంచి 20 శాతం పెరిఫరల్ న్యూరోపతి సమస్యకు గురైన వారు ఉంటున్నట్లు వైద్యులు చెపుతున్నారు. అంటే రోజూ 50 మంది చొప్పున వారానికి 150 మంది వరకూ పెరిఫరల్ న్యూరోపతి బాధితులు వస్తున్నారు. వీరిలో సమస్య తీవ్రతరమైన తర్వాత వస్తున్న వారే ఎక్కువగా ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇది ఎవరికి వస్తుంది? ♦ జనాభాలో 2.4 శాతం మంది పెరిఫరల్ న్యూరోపతి సమస్యతో బాధపడుతున్నారు. ♦ మధుమేహుల్లో 70 శాతం మందికి వచ్చే అవకాశం ఉంది. ♦ వంశపారంపర్యంగా కూడా రావచ్చు ♦ రక్తనాళాల్లో తేడాలుంటే వచ్చే అవకాశం ఉంది. ♦ వయస్సు 55 ఏళ్లు నిండిన వారిలో రావచ్చు. ♦ క్యాన్సర్‌కు కీమోథెరఫీ పొందే వారిలో 40 శాతం మందిలో రావచ్చు. ♦ హెచ్ఐవీ/ఎయిడ్స్, టీబీ మందులు వాడే వారిలోనూ రావచ్చు. ♦ ఆల్కహాల్ సేవించే వారిలో, లెప్రసీ ఉన్న వారిలో కూడా రావచ్చు. ♦ కొందరికి స్పష్టమైన కారణం లేకుండా కూడా వచ్చే అవకాశం ఉంది. ♦ నరాల తిమ్మిర్లు, మంటలు అనేవి కొందరిలో తాత్కాలికంగా కలిగి తగ్గిపోతే, మరికొందరికి దీర్ఘకాలంగా ఉంటూ చాలా ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాధి దుష్ఫలితాలివే... ► పెరిఫరల్ న్యూరోపతి ఉన్న కొందరిలో కండరాలు బిగుసుకుపోవడం, కండరాల అదురు, వణుకు కూడా ఉండవచ్చు. ► ఈ వ్యాధి సోకిన వారిలో కొందరిలో కండరాల బలహీనత, కండరాల క్షీణత, నడవడంలో ఇబ్బంది కూడా కలుగుతాయి. ► నడస్తూ ఉంటే స్పర్శ తెలియకుండా అవుతుంది. ► కొందరికి స్పర్శ తెలియకపోవడం, పాదం గాని, చేయిగాని, వేలు కానీ వంచితే ఎటు పక్కకి వంచారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ► కొందరిలో చెమటలు ఎక్కువగా పట్టడం, మరికొందరిలో తక్కువగా పట్టడం, నిల్చుంటే కళ్లు తిరగడం జరుగుతుంది. ► కంటినీరు, లాలాజలం తయారు కాదు. ► పురుషుల్లో లైంగిక పటుత్వం కూడా తగ్గే అవకాశం ఉంది. ► మూత్రకోశం, మలం పేగు అ«దీనంలో లేకుండా తయారవుతాయి. ► కంటిరెప్పలు పడిపోవడం, కంటి దగ్గర స్పర్శ తెలియకుండా పోతాయి. ► మూతి వంకర పోవడం కూడా జరగవచ్చు. వ్యాధిపై అవగాహన అవసరం పదేళ్లకు పైగా మధుమేహం ఉన్న వారిలో ఎక్కువగా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. థైరాయిడ్ లోపం, కిడ్నీ ఫెయిల్యూర్, లివరు జబ్బులు, ఆహారం జీర్ణం కాకపోవడం వంటి వాటికి వాడే కొన్ని మందులు పడకపోవడం వలన కూడా రావచ్చు. మూలకారణం తెలుసుకుని చికిత్స చేస్తే తేలికగా నయం చేయవచ్చు. ఈ వ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం. – డాక్టర్ దారా వెంకట రమణ, న్యూరాలజీ విభాగాధిపతి మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి మధుమేహుల్లో 70 శాతం మందిలో పెరిఫరల్ న్యూరోపతి వ్యాధి సోకుతున్నందున ప్రతి ఒక్కరూ శరీరంలో షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవాలి. తరచూ కాళ్లకు రక్తప్రసరణ సరిగా ఉందా లేదా పరీక్షించుకోవాలి. కాళ్లు, చేతులు తిమ్మిర్లు అనిపిస్తే వెంటనే నిపుణులైన వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స పొందాలి. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే దుష్ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. – డాక్టర్ కొండా వేణుగోపాలరెడ్డి, మధుమేహ నిపుణుడు -
గంటల కొద్దీ కూర్చుని పని చేస్తున్నారా..? ఎంత డేంజర్ అంటే?
కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయన్నది ఎప్పటి నుంచో ఉన్న నానుడి. కానీ కూర్చుని కదలకుండా పనిచేస్తే కొండంత ఆరోగ్య సమస్యలూ చుట్టుముడతాయన్నది నేటి సామెతగా మారింది. ఐటీతో పాటు అనేక రంగాల్లో కంప్యూటర్ల ముందు కూర్చుని చేసే డెస్క్‌జాబ్స్ పెరిగిపోయాయి. ఆ ఉద్యోగాల్లో ఎక్కువసేపు కూర్చునే ఉండటం, పనిఒత్తిడి కారణంగా వివిధ రకాల వ్యాధులూ పెరిగి పోతున్నాయి. అందువల్ల పనిప్రదేశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ డెస్క్ వర్క్.. ‘డిస్క్’పై ఎఫెక్ట్.. ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల శరీరంలో శక్తి ఖర్చు తగ్గి కొవ్వు పేరుకుపోతోంది. ఇది ఊబకాయానికి దారితీస్తుంది. ముందుకు వంగి కూర్చోవడం వల్ల వెన్నెముకపై ప్రభావం పడుతోంది. తొలుత పనిచేసేటప్పుడే ఈ ఒత్తిడి ఉంటుంది. తర్వాత పడుకున్పప్పుడు కూడా ఇబ్బంది పెడుతుంది. కొన్నేళ్లలో ఇది పూర్తి స్థాయి డిస్క్ సమస్యగా మారుతుంది. పనిచేసే చోట కూర్చునే తీరులో లోపాలు, దీర్ఘకాల పని గంటలే దీనికి కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. మణికట్టుపై ‘పని’కట్టు కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. ఈ సమస్య మణికట్టు దగ్గర వస్తుంది. మణికట్టు దగ్గర దాదాపు 15 చిన్నచిన్న కండరాలు ఉంటాయి. వీటిలో ఒక్క కండరానికి వాపు వచ్చినా మిగతా అన్నింటిపై ఒత్తిడి పడుతుంది. దీనితో చేతిలో తిమ్మిర్లులా రావడం, రాత్రి పడుకున్నప్పుడు వేళ్లు వణకడం వంటివి జరగొచ్చు. రోజంతా మౌస్, కీబోర్డు వాడి.. ఆ తర్వాత బైక్ హ్యాండిల్, కార్ స్టీరింగ్ పట్టుకోవాల్సిన అవసరం వల్ల మణికట్టు కండరాలు మరింత అధిక శ్రమకు గురవుతాయి. ఐటీ రంగంలో ఎక్కువగా.. ప్రముఖ వెల్నెస్ సంస్థ సోల్ హెల్త్‌కేర్ సంస్థ అధ్యయనం ప్రకారం.. ఐటీ రంగంలో ఆరోగ్య సమస్యలు బాగా పెరిగిపోయాయి. ఓ కంపెనీలో పనిచేసే 784 మందిని ఎంచుకుంటే.. అందులో 179 మంది నడుము నొప్పి, 129 మంది గర్భాశయం, వెన్నెముకలోని కీళ్లు/ డిస్క్‌లను ప్రభావితం చేసే గర్భాశయ స్పాండిలోసిస్, 65 మందిలో కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ (చేతుల్లో తిమ్మిర్లు), 61 మందిలో సాక్రోలియాక్ సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. ►ఐటీ ఉద్యోగుల్లో గుండె జబ్బులు 147 శాతం ఎక్కువని, వీటితో మరణించే ప్రమాదం 18 శాతం పెరుగుతోందని అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అధ్యయనంలో వెల్లడైంది. ►ది జర్నల్ ఆఫ్ నేషనల్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం.. ఎక్కువగా కూర్చోవడం పెద్దపేగు కేన్సర్ ప్రమాదాన్ని 24 శాతం, ఊపిరితిత్తుల కేన్సర్ ప్రమాదాన్ని 21 శాతం, ఎండోమెట్రియల్ కేన్సర్ ప్రమాదాన్ని 24 శాతం వరకు పెంచుతోంది. కాళ్లలోని సిరల్లో రక్తం గడ్డకట్టడం వల్ల వచ్చే డీప్ వెయిన్ థ్రాంబోసిస్కు దారి తీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు దూరం ►కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు వెన్నెముక కుర్చీకి ఆసాంతం ఆనుకునేలా నిటారుగా కూర్చోవాలి. కళ్లకు, స్క్రీన్కు మధ్య తగినంత దూరం ఉండేలా ఉంచుకోవాలి. పాదాలను నేలపై విశ్రాంతిగా ఆనించి ఉంచి మోకాలి వద్ద 90 డిగ్రీల కోణంలో కాళ్లు ఉంచాలి. ►మోచేయి ఎక్కువగా ఒత్తిడికి గురికావడం వల్ల కలిగే ‘టెన్నిస్ ఎల్బో’ సమస్య డెస్క్ జాబ్ ఉద్యోగుల్లో పెరుగుతోంది. ఈ పరిస్థితిలో కీబోర్డు, మౌస్‌లను వినియోగించేప్పుడు మణికట్టును వదులుగా ఉంచాలి. ►45 నిమిషాల నుంచి గంట కంటే ఎక్కు వసేపు నిర్విరామంగా కూర్చోవడం మంచిది కాదు. మధ్య మధ్యలో నిలబడటం, నడవటం చేయాలి. ►పని సమయంలో కాఫీలు/టీలు ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ అవకాశాలు పెరుగుతాయి. ►ప్రతి 20 నిమిషాల పాటు కంప్యూటర్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై పనిచేశాక.. కనీసం 20 సెకన్లపాటు మీకు దూరంగా ఉన్న వస్తువులను చూడాలి. దీనివల్ల కంటిపై ఒత్తిడి తగ్గుతుంది. – డాక్టర్ సుధీంద్ర, కిమ్స్ ఆస్పత్రి వైద్యుడు ముందే గుర్తించా.. కంప్యూటర్ ముందు పనిచేయడం మొదలెట్టిన కొన్నినెలల్లోనే ఆరోగ్యంలో తేడా గమనించాను. వేళ్ల తిమ్మిర్లు, నొప్పులు, కళ్లు పొడిబారడం వంటి సమస్యలు వచ్చాయి. డాక్టర్‌ను కలిసి వారి సూచనలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటూ పనిచేస్తున్నా. ఇప్పుడు సమస్యలు తగ్గిపోయాయి. మా సీనియర్లలో చాలా మంది మాత్రం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. – స్రవంతి, ప్రైవేటు ఉద్యోగిని హెల్త్ సెషన్స్ జరుగుతున్నాయి మానసిక ఒత్తిడి, శారీరక సమస్యలు కార్పొరేట్ సంస్థల ఉద్యోగుల్లో ఇప్పుడు సాధారణమైపోయాయి. అనేకమంది జాబ్స్ వదిలేసి సొంత ఉపాధి వైపు మళ్లుతుండటానికి ఇదో కారణం కూడా. అందుకే ఆఫీసుల్లోనే ఆరోగ్యంపై వర్క్‌షాప్స్ జరుగుతున్నాయి. – సంతోష్, ఐటీ ఉద్యోగి -
ఆరోగ్య బీమా.. ఆదుకునే నేస్తం
క్రాంతి (40) ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడాది క్రితమే ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మెరుగైన ప్యాకేజీ కోసం మారాడు. కొన్ని నెలలు గడిచిన తర్వాతే, మెరుగైన ప్యాకేజీ ఎందుకిచ్చారో అతడికి బోధపడింది. ఉదయం 7 గంటలకు వెళితే రాత్రి ఇంటికొచ్చేసరికి 10 అవుతోంది. ‘మనకొద్దురా బాబూ ఈ జాబు’ అనుకుని ఉన్నట్టుండి రాజీనామా ఇచ్చేశాడు. మరో కంపెనీలో ఉద్యోగం కోసం వెతుకులాట మొదలు పెట్టాడు. కానీ, దురదృష్టం ప్రమాదం రూపంలో ఎదురైంది. బైక్‌పై వెళుతున్న సమయంలో ప్రమాదం కారణంగా తీవ్ర గాయాలయ్యాయి. కాలికి, చేతికి ప్లేట్లు వేయాల్సి వచ్చింది. ఆసుపత్రి బిల్లు సుమారు రూ.4 లక్షలు వచ్చింది. ఈ మొత్తాన్ని అతడు క్రెడిట్ కార్డుపై సర్దుబాటు చేయాల్సి వచ్చింది. కారణం పాత కంపెనీలో ఉన్న గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ.. రాజీనామా ఇచ్చిన నెలతోనే ముగిసిపోయింది. అది తప్ప అతడికి మరో ప్లాన్ లేదు. ఈ చిన్న తప్పిదం అతడి మూడేళ్ల పొదుపు సొమ్మును పట్టుకుపోయింది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యతను సరిగ్గా అర్థం చేసుకోవాలి. పనిచేస్తున్న కంపెనీలపై ఆధారపడకుండా, తమకంటూ మెరుగైన కవరేజీతో రక్షణ కల్పించుకున్నప్పుడే ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా చూసుకోవచ్చు. మనిషి ప్రాణాలను కాపాడే విషయంలో, ఆయువును పెంచడంలో వైద్య రంగం ఎంతో ప్రగతి సాధించింది. కానీ, ఇందుకు అదనపు ఖర్చు అవుతుంది. నేడు జీవన శైలి వ్యాధులు పెరిగిపోయాయి. కేన్సర్ మహమ్మారి మన సమాజంలో వేగంగా విస్తరిస్తోంది. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, మూత్రపిండాలు, లివర్ వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ మారిన జీవనశైలి కారణంగా ప్రబలుతున్నవే. వీటికయ్యే వ్యయం సామాన్యులు, మధ్య తరగతి ప్రజల వల్ల అయ్యే పనికాదు. పైగా ఏటేటా వైద్య చికిత్సల వ్యయాలు 10–15 శాతం మేర భారమవుతున్నాయి. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఏటా కొంత ప్రీమియం చెల్లించడం ద్వారా కుటుంబం అంతటికీ రక్షణ కల్పించుకోవచ్చు. ఏటా తమ ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని ప్రీమియం రూపంలో చెల్లించడం అసాధ్యమేమీ కాదు. కానీ, ఆరోగ్య సమస్య లేదా ప్రమాదం కారణంగా హాస్పిటల్లోచేరితే వచ్చే బిల్లును పాకెట్ నుంచి చెల్లించడం నిజంగా తలకు మించిన భారం అవుతుంది. దీని కారణంగా అప్పుల పాలు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కరోనా మహమ్మారి సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఎన్నింటినో అప్పుల పాలు చేసింది. ఆస్తులున్న వారు అమ్ముకుని ఒడ్డెక్కాల్సి వచ్చింది. ఈ అనుభవాలు, వాస్తవలను చూసిన తర్వాత అయినా ప్రతి ఒక్క కుటుంబం ఏదో ఒక రూపంలో హెల్త్ కవరేజీ ఉండేలా చూసుకోవాలి. ప్రయోజనాలు.. ఆరోగ్య అత్యవసర సమయాల్లో ఆదుకునే సాధనం హెల్త్ ఇన్సూరెన్స్. ఇది ఉంటే అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో చేరాల్సి వస్తే అక్కడ చికిత్సల చార్జీలు, వైద్యుల కన్సల్టేషన్, అంబులెన్స్ చార్జీలు, రూమ్ చార్జీలను బీమా కంపెనీలు చెల్లిస్తాయి. అంతేకాదు డిశ్చార్జ్ చేసిన తర్వాత కొన్ని రోజుల పాటు ఔషధాలు, వైద్య పరీక్షలకు అయ్యే వ్యయాలను కూడా భరిస్తాయి. హాస్పిటల్లో చేరడానికి ముందు అదే సమస్య కోసం నిర్ణీత రోజుల కు చేసిన వైద్య వ్యయాలను సైతం చెల్లిస్తాయి. ఆర్థిక స్థిరత్వం వైద్యం ఎప్పుడు అవసరపడుతుందన్నది ఎవరూ చెప్పలేరు. ఎలాంటి చికిత్స అవసరపడుతుంది? ఎంత ఖర్చవుతుందన్నది ఊహించడం కష్టం. అలాంటి పరిస్థితి వస్తే పొదుపు సొమ్ము అంతా కరిగిపోకుండా, అప్పుల పాలు కాకుండా, ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిన అగత్యం రాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ ఆదుకుంటుంది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆర్థికంగా ఆదుకునే సాధనం కూడా అవుతుంది. మెరుగైన వైద్య చికిత్సలు/రక్షణ తమతోపాటు, తమపై ఆధారపడిన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల.. వైద్యం అవసరమైన సందర్భంలో వెనుకాడాల్సిన పని ఉండదు. అదే హెల్త్ ప్లాన్ లేదనుకోండి.. తగినంత ఆర్థిక పొదుపుల్లేనప్పుడు, హాస్పిటల్‌కు వెళ్లే విషయంలో చికిత్సల వ్యయాల గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మంచి హాస్పిటల్‌కు వెళ్లి, ఖర్చుకు వెనుకాడకుండా నాణ్యమైన వైద్యం పొందే ధైర్యం వస్తుంది. ఖర్చు గురించి కాకుండా, మంచి చికిత్స గురించి ఆలోచించే స్వేచ్ఛ హెల్త్ ప్లాన్‌తో వస్తుంది. జీవిత లక్ష్యాలకు మిగులు వైద్య చికిత్సల వ్యయాలు ఏటేటా పెరుగుతుంటాయి. ముఖ్యంగా నేడు వాతావరణ కాలుష్యం, జీవనశైలి వల్ల మధుమేహం, గుండె జబ్బులు, కేన్సర్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. వీటికి పెద్ద మొత్తంలో ఖర్చవుతోంది. ఈ భారాన్ని తమపై పడకుండా చూసుకుంటే.. జీవితంలో ముఖ్యమైన పిల్లల విద్య, వారి వివాహాలు, సొంతిల్లు, రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. హెల్త్ మాదిరిగా ఈ లక్ష్యాలకు ఎలాంటి కవరేజీ ఉండదని గుర్తు పెట్టుకోవాలి. పన్ను ప్రయోజనాలు హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సెక్షన్ 80డీ కింద 60 ఏళ్లలోపు వ్యక్తులు, తాను, తన జీవిత భాగస్వామి, పిల్లల కోసం చెల్లించే హెల్త్ ఇన్సరెన్స్ ప్రీమియం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.25,000 వరకు ఉంటే, ఈ మొత్తంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు రూ.50వేల ప్రీమియంపై ఆదాయపన్ను మినహాయింపు ఉంది. సొంతంగా ఉండాల్సిందే ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి ఆయా సంస్థలు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తుంటాయి. దీంతో వారు విడిగా హెల్త్ ప్లాన్ ఎందుకులేనని అనుకుంటుంటారు. కానీ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలకు భద్రత ఉండదని తెలుసు. కంపెనీలు ఇచ్చే గ్రూప్ హెల్త్ కవరేజీ.. ఉద్యోగం మానివేయడంతో నిలిచిపోతుంది. అందుకుని విడిగా ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తప్పకుండా తీసుకోవాలి. పనిచేస్తున్న సంస్థ నుంచి మెరుగైన కవరేజీ లేకపోయినా, ఇది ఆదుకుంటుంది. తక్కువ కవరేజీకి తీసుకుని, దానికి సూపర్ టాపప్ జోడించుకోవచ్చు. ఎంత ముందు అయితే అంత మంచిది వైవాహిక జీవితం ఆరంభించినప్పుడు లేదా ఉద్యోగ జీవితం ఆరంభించినప్పుడే హెల్త్ కవరేజీ ఉండాలి. 20ప్లస్‌లోనే ఆరోగ్య బీమా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో క్లెయిమ్‌ల తిరస్కరణ సమస్య ఎదురుకాదు. ఎందుకంటే 20ప్లస్‌లో ఆరోగ్య సమస్యలు దాదాపుగా ఉండవు. కానీ, నేడు 30 దాటిన దగ్గర్నుంచి రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం, శ్వాసకోస సమస్యలు వేధిస్తున్నాయి. ఆలస్యం చేసినకొద్దీ, ఇవన్నీ పూర్వం నుంచి ఉన్న ఆరోగ్య సమస్యల కిందకు వస్తాయి. కనుక వీటిని పాలసీ డిక్లరేషన్‌లో తప్పకుండా వెల్లడించాలి. అలా చేసినప్పుడు అధిక ప్రీమియం చెల్లించుకోవాల్సి వస్తుంది. పైగా అప్పటికే ఉన్న వాటికి కవరేజీ కోసం 3–4 ఏళ్లు వేచి చూడాల్సి రావచ్చు. పలు రకాల ప్లాన్లు.. వ్యక్తిగత ఆరోగ్య బీమా, ఫ్యామిలీ ఫ్లోటర్, క్రిటికల్ ఇల్నెస్, టాపప్, సూపర్ టాపప్ ఇలా పలు రకాల పాలసీలు ఉన్నాయి. బేసిక్ ప్లాన్ ఏదైనా కానీ, కాంప్రహెన్సివ్ అయి ఉండాలి. అంటే అన్ని రకాల కవరేజీలతో కూడి ఉండాలి. వివాహం అయిన వారు కుటుంబం అంతటికీ ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోవాలి. వృద్ధులైన తల్లిదండ్రులు ఆధారపడి ఉంటే, వారికి విడిగా మరో ప్లాన్ తీసుకోవడం వల్ల ప్రీమియం భారం తగ్గించుకోవచ్చు. ఇక క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లు అనేవి.. కేన్సర్, మూత్ర పిండాల సమస్యలు, గుండె జబ్బులు, లివర్ ఫెయిల్యూర్, స్ట్రోక్ ఇలా దీర్ఘకాలిక సమస్యలు నిర్ధారణ అయినప్పుడు బీమా మొత్తాన్ని ఒకే విడత చెల్లించే ప్లాన్లు. టాపప్ ప్లాన్లు అనేవి.. బేసిక్ హెల్త్ కవరేజీ మించి వైద్య చికిత్సల వ్యయాలు అయినప్పుడు.. బేసిక్ కవరేజీ పోను అదనపు మొత్తాన్ని చెల్లించేవి. వీటిని దృష్టిలో పెట్టుకోవాలి.. ► ఎంపిక చేసుకునే బీమా కంపెనీ జాబితాలో ఎన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయనేది చూడాలి. ముఖ్యంగా మీరు నివాసం ఉంటున్న పట్టణంలో ఎన్ని హాస్పిటల్స్ బీమా కంపెనీ నెట్వర్క్ కింద ఉన్నాయో చూడాలి. నెట్వర్క్ హాస్పిటల్ అయితే నగదు రహిత వైద్యం పొందొచ్చు. లేదంటే చికిత్సల ఖర్చు అంతా సొంతంగా భరించి, తర్వాత క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కొంచెం శ్రమతో, సమయంతో కూడుకున్నది అవుతుంది. ► బీమా కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోను చూడాలి. తనవద్దకు వచ్చే క్లెయిమ్‌లలో ఎన్నింటికి చెల్లింపులు చేస్తుంది.. అలాగే వచ్చిన క్లెయిమ్ అమౌంట్లో, ఎంత మొత్తానికి చెల్లింపులు చేసిందనే విషయాన్ని ముందే తెలుసుకోవాలి. కొన్ని బీమా కంపెనీలు పూర్తిగా తిరస్కరిస్తే, కొన్ని కంపెనీలు క్లెయిమ్‌లో కోతలు పెడుతుంటాయి. కనీసం 90 శాతానికి పైనే సెటిల్మెంట్ రేషియో ఉన్న వాటిని ఎంపిక చేసుకోవడం మంచిది. ► హాస్పిటల్లో చేరడానికి ముందు, డిశ్చార్జ్ అయిన తర్వాత ఎన్ని రోజులకు కవరేజీ ఉంటుందో (ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్) చూడాలి. సాధారణంగా 30–180 రోజుల వరకు ఈ కాలం ఉంటుంది. గరిష్ట కాలానికి చెల్లింపులు చేసే ప్లాన్లు అయితే అనుకూలం. ఎందుకంటే కొన్ని సమస్యలకు డిశ్చార్జ్ తర్వాత కూడా చాలా కాలం పాటు ఔషధాలు తీసుకోవాల్సి రావడం, మళ్లీ, మళ్లీ వైద్యుల రివ్యూలు అవసరపడతాయి. ► ఎంపిక చేసుకునే ప్లాన్‌కు తప్పకుండా రీస్టోరేషన్ సదుపాయం ఉండాలి. అంటే ఒక పాలసీ సంవత్సరంలో ఎవరైనా హాస్పిటల్లో చేరి కవరేజీ మొత్తం ఖర్చయిపోతే ఈ ఫీచర్ అక్కరకు వస్తుంది. కొన్ని ఒకటి నుంచి మూడు సార్లు రీస్టోరేషన్ ఇస్తుంటే, కొన్ని అన్లిమిటెడ్ రీస్టోరేషన్ ను కూడా ఆఫర్ చేస్తున్నాయి. దీనివల్ల అదే ఏడాది తదనంతరం హాస్పిటలైజేషన్కూ కవరేజీ ఉంటుంది. ► రూమ్ రెంట్ పరిమితులు, కోపే ఆప్షన్ లేని ప్లాన్ తీసుకుంటే భవిష్యత్తులో సమస్యలు ఉండవు. కోపే ఆప్షన్లో క్లెయిమ్ ఎదురైన ప్రతి సందర్భంలోనూ పాలసీదారు తనవంతు కొంత భరించడం. రూమ్ రెంట్ పరంగా షేరింగ్, సింగిల్ రూమ్ అనే పరిమితులు ఉంటే, హాస్పిటల్లో చేరినప్పుడు ఆయా రూమ్‌ల్లోనే చేరుతున్నామా? అన్నది జాగ్రత్త పడాలి. లేదంటే ఈ రూపంలోనూ పాలసీదారుపై అదనపు భారం పడుతుంది. ► నో క్లెయిమ్ బోనస్ ఫీచర్ కూడా ఉపయోగకరం. దీనికింద క్లెయిమ్ చేయని ప్రతీ సంవత్సరానికి నిర్ణీత శాతం మేర కవరేజీని బీమా కంపెనీలు పెంచుతాయి. క్లెయిమ్ వస్తే అంతే మేర తగ్గిస్తాయి. ► డైలీ క్యాష్ బెనిఫిట్‌ను చాలా బీమా కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఆసుపత్రిలో ఎక్కువరోజుల పాటు ఉండాల్సి వస్తే, పేషెంట్‌కు సాయంగా ఉండేవారికి అయ్యే వ్యయాలకు ఇది పనికొస్తుంది. ► అదనపు సభ్యులను చేర్చుకునే ఫీచర్ ఉండాలి. ► డేకేర్ చికిత్సలకు కవరేజీ ఇచ్చే ప్లాన్ మంచిది. కొత్త టెక్నాలజీలు, పరిశోధనలతో కొన్ని సమస్యలకు చికిత్సలు తేలిగ్గా మారుతున్నాయి. వీటికి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం పడదు. కానీ, బీమా కంపెనీలు ఆఫర్ చేసే ఇండెమ్నిటీ ప్లాన్లలో కవరేజీ కోసం కనీసం 24 గంటల పాటు అడ్మిట్ కావాల్సి ఉంటుంది. డేకేర్ చికిత్సలకు ఇది వర్తించదు. ► అంబులెన్స్ చార్జీలను చెల్లించేలా ఉండాలి. ► ఆధునిక, రోబోటిక్ చికిత్సలకు, అవయవమార్పిడి చికిత్సలకు కూడా కవరేజీ ఉండాలి. ► పెళ్లయి, పిల్లలు ఇంకా లేని వారు అయితే తప్ప కుండా మేటర్నిటీ కవరేజీ ఉండే ప్లాన్‌కు వెళ్లాలి. ► ఏడాదికోసారి ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలను బీమా కంపెనీ ఉచితంగా ఆఫర్ చేస్తుందా? అన్నది చూడాలి. ► పాలసీ తీసుకునే నాటికే ఉన్న వ్యాధులకు కవరేజీ కోసం సాధారణంగా 4 ఏళ్ల వరకు వేచి ఉండాల్సి రావచ్చు. ఆ కాలంలో ముందు నుంచి ఉన్న వాటికి క్లెయిమ్ చేసుకోలేరు. కొన్ని ప్లాన్లు 1–2 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్‌తో ఉంటున్నాయి. కాకపోతే వీటి ప్రీమియం అధికంగా ఉంటుంది. ► తీసుకున్న ప్లాన్ జీవిత కాలం పాటు రెన్యువల్ చేసుకునే ఫీచర్‌తో ఉండాలి. ► హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునే ముందు కంపెనీ సేవల నాణ్యత, ఎంత వేగంగా చెల్లింపులు చేస్తుంది? ఇతర కంపెనీల ప్లాన్లతో పోలిస్తే ప్రీమియం వ్యత్యాసం ఎంతన్నది తెలుసుకోవాలి. ► కొన్ని రకాల చికిత్సలకు కవరేజీ ఉండదు. పైగా కొన్ని రకాల చికిత్సలకు 2 ఏళ్లపాటు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. వీటి వివరాలను పాలసీ వర్డింగ్ డాక్యుమెంట్ చదివి తెలుసుకోవాలి. -
Aindrila Sharma: యువనటి ఆండ్రిలా శర్మ మృతి.. వైద్యులు చెప్తున్నదేంటి?
విధి వెక్కిరింతకు నేలరాలిన నవ్వుల పువ్వులెన్నో. కష్టాలెన్నింటినో దాటి బతుకుపోరులో బలవంతులుగా మిగిలినా.. ఉసురు తీసే ఉపద్రవాలు మరెన్నో. కళ్లముందే కళకళలాడుతూ కనిపించి.. కనురెప్పపాటులో కానరాకుండా పోతున్న జీవితాలెన్నెన్నో. లయతప్పిన జీవన విధానమో.. శ్రుతిమించిన వ్యాయామ వ్యవహారమో.. తరాలనుంచి సంక్రమించిన పెనుముప్పో! బతుకులైతే మిన్నుముట్టిమన్నులో కలిసిపోతున్నయ్! బెంగాలీ యువనటి ఆండ్రిలా శర్మ ‘ఆఖరి’పోరులో అలసిపోయిన సంగతి చెప్తున్నదేంటి... 24 ఏళ్ల ఆండ్రిలా శర్మ గుండెపోటుకు గురై ఆదివారం కన్నుమూసింది. రెండుసార్లు ప్రాణాంతక క్యాన్సర్ బారి నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఆమె ఉన్నట్టుండి నవంబర్ 1న తీవ్ర అస్వస్థతకు లోనైంది. ఆస్పత్రికి తరలించగా ఆండ్రియా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైందని తెలిసింది. అప్పటినుంచి ఆమెకు వెంటిలేటర్‌పైనే వైద్యులు చికిత్స అందించారు. బ్రెయిన్ సర్జరీ చేశారు. అయితే, కోలుకుంటోందన్న తరుణంలో ఆండ్రియాకు పలుమార్లు గుండెపోటు వచ్చింది. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి చివరకు ప్రాణాలు కోల్పోయింది. చిన్న వయసులోనే తీవ్రమైన గుండెపోట్లు యావత్ ప్రపంచాన్నిఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా మనదేశంలో ఈ ముప్పు అధికంగా ఉందని పలు మెడికల్ సర్వేలు చెప్పడం గమనించదగ్గది. (చదవండి: హు కిల్డ్ శ్రద్ధా వాకర్.. సినిమాగా రానున్న సంచలన హత్య కేసు) కారణాలేంటి? ఎందుకిలా? చిన్న వయసులోనే హృద్రోగ సమస్యలు రావడానికి వంశపారంపర్యం.. లేక జీవన విధానం కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా భారత్‌లో ఇటువంటి విషాదాలు మామూలైపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ చరిత్రలో హృద్రోగ సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లకు దూరంగా ఉండాలని, జీవన శైలి మార్చుకోవాలని సూచిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా గుండె సమస్యలు ఉత్పన్నం కావచ్చని అంటున్నారు. గుండెకు ఆక్సిజన్, రక్త సరఫరాలో ఆటంకం తలెత్తితే సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. చక్కని ఆహారం, సరిపడా నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవడం, వ్యాయామ గుండెజబ్బుల రిస్కును తగ్గిస్తాయని పేర్కొంటున్నారు. యువతకు గుండెపోటు సమస్యలపై పలు రిపోర్టులు ఏం చెప్తున్నాయంటే.. 1. నియంత్రణలేని జిమ్ పద్ధతులు పాటించడం. 2. మితిమీరిన జిమ్ సప్లిమెంట్స్ (ప్రోటీన్ పౌడర్, స్టెరాయిడ్స్) తీసుకోవడం. 3. సులభపద్ధతుల్లో వర్కౌట్స్ చేయపోవడం.. శరీరాకృతి కోసమంటూ మొండిగా కఠిన విధానాలు అవలంభించడం. 4. హెల్త్ చెకప్స్ రెగ్యులర్‌గా చేయించుకోకపోవడం. శరీరంలో కొవ్వు నిష్పత్తి ఏమేరకు ఉంది, బీపీ నియంత్రణలోనే ఉందా? అని తెలుసుకోవడం అత్యావశ్యకం. 5. గుండె ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం. సాచురేటెడ్ కొవ్వులు పరిమితికి మించి తీసుకోవడం. (చదవండి: గుండెపోటుతో ప్రముఖ నటి మృతి) -
అన్నీ బాగుండాలి.. అందులో మనముండాలి!
మలేరియా, చికెన్ గున్యా, డెంగీ వ్యాధుల వ్యాప్తికి దోమలు కారణం! ఇది అందరికీ తెలిసిన విషయమే.. మరి వీధి కుక్కల వెంట్రుకల్లో ఉండే పేనుతో మనకు ప్రమాదం లేదా? పాడి పశువులకు వచ్చే రోగాలు మనకు అంటవా? పోనీ మనల్ని ఇబ్బంది పెట్టే బ్యాక్టీరియా, వైరస్‌లతో జంతువులకు జబ్బులు రావా? అంతెందుకు నిన్న మొన్నటివరకు ప్రపంచాన్ని వణికించిన కరోనా మూలాలు జంతువులే! ఒక్కమాటలో చెప్పాలంటే మనకొచ్చే వ్యాధుల వ్యాప్తికి సగం కారణం జంతువులే! ఈ విషయాన్ని గుర్తించడంలో ఆలస్యమైతే జరిగిందిగానీ.. పరిష్కారం కోసం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నడుస్తున్న ‘వన్ హెల్త్’ కార్యక్రమం మాత్రం వేగంగా అడుగులేస్తోంది (కంచర్ల యాదగిరిరెడ్డి) ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అయితే కాలం గడుస్తున్న కొద్దీ మనుషులకు కొత్త కొత్త రోగాలు, ఆరోగ్య సమస్యలు పరిచయమవుతున్నాయి. దశాబ్దం క్రితం మనకు చికెన్ గున్యా అంటే ఏమిటో తెలియదు. డెంగీ మాట కూడా చాలా మంది విని ఉండరు. హెచ్1ఎన్1, హెచ్1ఎన్5 వంటివి కనీవినీ ఎరుగం. కానీ ఇప్పుడివన్నీ ఏటా పలకరించే చుట్టాల్లా మారిపోయాయి. ఎందుకిలా అంటే కారణాలు బోలెడు. ముఖ్యమైనది మాత్రం పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడమే. అందుకే ఐదేళ్ల క్రితం ఐక్యరాజ్యసమితి (యూఎన్) ‘వన్ హెల్త్’ కార్యక్రమాన్ని రూపొందించి ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తోంది. ‘సర్వే సంతు నిరామయ’ వేదాల్లోని శాంతి మంత్రంలో ఓ చిన్న భాగమిది. భూమ్మీద ఉన్న వారెవరికీ వ్యాధుల బాధ లేకుండా ఉండు గాక అని అర్థం. అంటే మనుషులతోపాటు జీవజాలం మొత్తం కూడా ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండటం. యూఎన్ ‘వన్ హెల్త్’ లక్ష్యం కూడా ఇదే. మానవుల ఆరోగ్యం బాగుండేందుకు.. కరోనా, ఎబోలా, వెస్ట్ నైల్ వంటి భయంకర వ్యాధులు ప్రబలకుండా, కొత్త కొత్త వ్యాధులు అంటకుండా చూసుకునేందుకు.. మన చుట్టూ ఉన్న జంతువులు, ప్రకృతిని కూడా కాపాడుకోవాలని చెబుతుంది ‘వన్ హెల్త్’. నిజానికి ఇదేమీ కొత్త విషయం కాదు. కాకపోతే ఇటీవలికాలంలో పెచ్చుమీరుతున్న జంతు వ్యాధుల నేపథ్యంలో మరింత ఎక్కువ ప్రాధాన్యం ఏర్పడింది. విస్తరిస్తూ పోతున్న కొద్దీ.. భూమ్మీద జనాభా పెరుగుతోంది. మనిషి కొత్త కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాడు. ఈ క్రమంలో మనుషులకు, అడవి జంతువులకు మధ్య ఉన్న దూరం తగ్గిపోతోంది. ఇలా ఆ జంతువులకు దగ్గరవుతున్న కొద్దీ వాటిలో ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న వ్యాధికారక సూక్ష్మజీవులు మనలోకి ప్రవేశించే అవకాశాలు పెరుగుతున్నాయి. అడవుల నరికివేత, వ్యవసాయ పద్ధతులు మారిపోవడం, పర్యావరణం దెబ్బతినడం దానికి ఊతమిస్తోంది. వ్యాపార, వాణిజాల్లో వృద్ధి కారణంగా వ్యాధులు ఒకచోటి నుంచి ఇంకో చోటకు ప్రయాణించడం సులువైపోయింది. అందుకే ఇటీవలికాలంలో జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సోకడం ఎక్కువైందన్నమాట. కుక్కల నుంచి వచ్చే రేబిస్ మొదలుకొని సాల్మోనెల్లా, వెస్ట్‌నైల్ ఇన్ఫెక్షన్లు, క్యూ ఫీవర్, ఆంథ్రాక్స్, బ్రుసెల్లోసిస్, లైమ్, రింగ్‌వర్మ్, ఎబోలా వంటివి మనం ఎదుర్కొంటున్న జునోటిక్ (జంతువుల నుంచి సోకేవి) వ్యాధుల్లో కొన్ని మాత్రమే. మారిన పరిస్థితులు జంతువులకూ మరిన్ని వ్యాధులు సోకేలా చేస్తూండటం ఆసక్తికరమైన అంశం. ఏయే అంశాలపై ‘వన్ హెల్త్’ దృష్టి ‘వన్ హెల్త్’ కార్యక్రమం కేవలం జంతువులు, మనుషులకు వచ్చే వ్యాధులపై మాత్రమే దృష్టిపెట్టడం లేదు. ఈ వ్యాధులకు కారణమైన ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటోంది. యాంటీ బయాటిక్‌లకు లొంగని సూక్ష్మజీవులు వీటిలో ఒకటి. ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించని పక్షంలో వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదముంది. ఆస్పత్రులు, ఆహారం, మట్టి, నీరు వంటి పలు మార్గాల ద్వారా మందులకు లొంగని వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు వ్యాప్తి చెందుతాయి. అలాగే వ్యాధికారక సూక్ష్మజీవులను మోసుకెళ్లే క్రిమికీటకాలు (దోమలు, పశువులు, జంతువులపై ఆధారపడి బతికే పేన్లు, ఇతర కీటకాలు)లను నియంత్రించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆహారంగా ఉపయోగించుకునే జంతువుల (కోళ్లు, గొర్రెలు, మేకలు, పందుల్లాంటివి) సంరక్షణ, ఆరోగ్యం కూడా ‘వన్‌హెల్త్’ కార్యక్రమంలో భాగమే. వన్ హెల్త్ కింద ఏం చేస్తున్నారు? వన్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నడుస్తున్నాయి. మానవ, జంతు వ్యాధుల నిపుణులు, పర్యావరణవేత్తలు కలిసికట్టుగా రకరకాల వ్యాధుల వ్యాప్తి ఎలా జరుగుతోందో తెలుసుకుంటున్నారు. పశువులతోపాటు మనుషుల్లోనూ యాంటీ బయాటిక్‌ల విచ్చలవిడి వాడకానికి చెక్ పెట్టేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెంపుడు జంతువుల యజమానులు, రైతుల్లోనూ వన్‌హెల్త్ కార్యక్రమం ఉద్దేశాలు, లక్ష్యాలు, జరుగుతున్న నష్టాలను వివరిస్తున్నారు. అవసరమైన సందర్భాల్లో తగిన చర్యలు చేపడుతున్నారు. కంబోడియాలో రేబిస్, ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజాల నివారణ కోసం వ్యవసాయ, మత్స్య, అటవీ శాఖల అధికారులతో కూడిన ప్రత్యేక విభాగం ఏర్పాటైంది. అమెరికాలోని అట్లాంటా అక్వేరియంలోని జలచరాలు కొన్నింటికి కరోనా సోకింది. వాటికెలా సోకిందో తెలుసుకునేందుకు వన్‌హెల్త్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా ఇది ఇతర జంతువులకు మనుషులకు మళ్లీ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నవంబర్ మూడు.. వన్‌హెల్త్ డే! 1964లో కాల్విన్ ష్వాబ్ అనే పశువైద్యుడు తొలిసారి ‘వన్ మెడిసిన్’ పేరుతో రాసిన ఒక పరిశోధన వ్యాసంలో జంతువులు, మనుషులకు వచ్చే వ్యాధుల్లోని సారూప్యతలను ప్రస్తావించారు. పశు, మానవ వైద్యులు కలిసికట్టుగా పనిచేస్తే అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించవచ్చని సూచించారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో ష్వాబ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం ఈ అంశంపై కృషి చేయడం మొదలుపెట్టింది. 2004లో వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ, రాక్ఫెల్లర్ యూనివర్సిటీలు ‘వన్ వరల్డ్.. వన్‌హెల్త్’ పేరుతో కార్యక్రమం చేపట్టాలని సూచించాయి. సాంక్రమిక వ్యాధులను అరికట్టేందుకు జంతువులు, పర్యావరణం రెండింటిపైనా దృష్టి కేంద్రీకరించాలని, ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ప్రభుత్వాలు తగిన విధానాలను రూపొందించాలని ప్రతిపాదించాయి. అమెరికన్ హెల్త్ అసోసియేషన్ 2007లో మానవ, జంతు వైద్య పరిశోధన సంస్థల మధ్య సహకారానికి తీర్మానం చేయగా.. తర్వాతి కాలంలో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్), ప్రపంచబ్యాంకు తదితర అంతర్జాతీయ సంస్థలు ‘వన్ హెల్త్’ కార్యక్రమం కోసం ఓ ప్రణాళికను రూపొందించడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత కూడా పలు అంతర్జాతీయ స్థాయి సదస్సులు, చర్చలు, విధానాల రూపకల్పనతో 2016లో ‘వన్ హెల్త్ కమిషన్, వన్ హెల్త్ ప్లాట్‌ఫామ్, వన్ హెల్త్ ఇనిషియేటివ్’ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయి. నవంబరు మూడో తేదీని ‘వన్ హెల్త్ డే’గా ప్రకటించాయి. నైజీరియాలో సీసంతో.. 2010లో నైజీరియాలో అకస్మాత్తుగా డజన్ల కొద్దీ బాతులు చచ్చిపోయాయి. కారణాలేవీ తెలియలేదు. బాతులే కదా అని ప్రజలూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొన్ని నెలల తర్వాత అదే ప్రాంతంలో వందలాది మంది పిల్లలు జబ్బు పడటం మొదలైంది. సమస్య ఎక్కడుందో వెతికేందుకు జరిగిన ప్రయత్నంలో.. ఆ ప్రాంతంలోని వారు ఎక్కువమంది ముతక పద్ధతుల్లో బంగారాన్ని అన్వేషిస్తున్నారని.. ఈ క్రమంలో విడుదలైన సీసం నీళ్లలో చేరి పిల్లల అనారోగ్యానికి కారణమైందని తేలింది. నమీబియా చీతాలతో లాభం నమీబియా చీతాలు ఇటీవలే ఇండియాకు వచ్చాయి. దశాబ్దాలపాటు భారత్‌లో కనుమరుగైపోయిన చీతాలు మళ్లీ కనిపించడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు కూడా. అయితే దీనివల్ల ఇంకో ప్రయోజనమూ ఉంది. వేటాడి బతికే చీతాలు క్షీణించిపోతున్న గడ్డి మైదానాలను పరిరక్షించుకునేందుకు ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. వేటాడే జంతువులు లేకపోవడం వల్ల గడ్డి తిని బతికే జంతువులు ఎక్కువై మైదానాలు లేకుండా చేస్తున్నాయని, చీతాల ప్రవేశంతో సమతౌల్యత ఏర్పడి గడ్డి మైదానాలు మళ్లీ పుంజుకుంటాయని అంటున్నారు. కాలిఫోర్నియాలో ఓ మిస్టరీ 2007లో కాలిఫోర్నియాలో ఓ మిస్టరీ చోటు చేసుకుంది. మోంటెరీబే ప్రాంతంలో సీఒట్టర్స్ (సీల్ల తరహాలో ఉంటాయి) అని పిలిచే జలచరాలు కొన్ని జబ్బుపడ్డాయి. మరికొన్ని ప్రాణాలు కోల్పోయాయి. వాటి చిగుళ్లు పసుపుపచ్చ రంగులోకి మారిపోయాయి. కాలేయం ఉబ్బి ఉంది. మామూలు జబ్బులేవీ ఈ లక్షణాలకు కారణం కాదు. వన్‌హెల్త్ కార్యక్రమం కింద సముద్ర, మత్స్య శాఖల అధికారులు పరిశోధన మొదలుపెడితే.. పజారో నది నుంచి పింటో సరస్సుకు అక్కడి నుంచి సముద్రంలోకి కలుస్తున్న నీళ్లలో కొట్టుకొస్తున్న నాచులోని ఓ రసాయనం సీఒట్టర్స్‌ల మరణానికి కారణమని తెలిసింది. పింటో సరస్సులో విపరీతంగా పెరిగిన నాచులోని నత్తగుల్లలు తినడం సీఒట్టర్స్ ప్రాణాలమీదకు తెచ్చిందని స్పష్టమైంది. -
జీవనశైలి మార్పుల ప్రభావం గుండెపైనే అధికం
సాక్షి, హైదరాబాద్: మూడు పదుల వయసు దాటిన భారతీయుల్లో గుండె సంబంధిత సమస్యలు మొదలవుతున్నాయి. జీవనశైలిలో వస్తున్న మార్పులతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతుండగా.. వీటిలో అత్యధికంగా గుండెపైనే తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇలాంటి అనారో గ్య సమస్యలపై సకాలంలో జాగ్రత్తలు తీసుకోకుంటే అవి దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తున్నాయి. శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్న ప్రతి వంద మందిలో ఐదుగురు గుండె సంబంధిత సర్జరీలు చేయించుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఎక్కడైనా కార్పొరేట్ వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు చేయించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆయుష్మాన్ భారత్ పథకం కింద చేయించుకుంటున్న శస్త్ర చికిత్సలపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గత ఆర్థిక సంవత్సరంలో పరిశీలన నిర్వహించింది. ఇందులో ప్రతి వంద సర్జరీల్లో 5 శాతం హృదయ సంబంధిత శస్త్ర చికిత్సలే ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద జరుగుతున్న సర్జరీల్లో 79 శాతం ప్రైవేటు ఆస్పత్రుల్లో నిర్వహిస్తుండగా.. 21 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేస్తున్నట్లు వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద ఖర్చు చేస్తున్న ప్రతి రూ.100లో ఏకంగా రూ.26 గుండె సంబంధిత సమస్యల చికిత్సకే ఖర్చు చేస్తున్నట్లు విశ్లేషణలో వెల్లడైంది. అలవాట్లలో మార్పులతో.. గుండె సమస్యలు ముప్ఫై ఏళ్లు దాటిన తర్వాత మోదలవుతున్నాయి. ప్రస్తుతం శస్త్ర చికిత్సల తీరును పరిశీలిస్తే ప్రతి వంద మందిలో 70 మంది పురుషులు హృదయ సమస్యలతో సతమతమవుతున్నారు. మహిళలు మాత్రం 30 శాతమే ఉన్నారు. ప్రధానంగా ప్రజల జీవన శైలిలో వస్తున్న మార్పులు.. ఆహారపు అలవాట్లను మారుస్తుండడంతో హృదయ సమస్యలు తలెత్తుతున్నట్లు పరిశీలన చెబుతోంది. విద్యార్థి దశ నుంచి ఉద్యోగం చేసే స్థాయికి వచ్చే వారి వయసు సగటున 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఈ దశలోనే ఆహారపు అలవాట్లు గాడితప్పుతున్నాయి. క్రమంగా ఈ ప్రభావం గుండెపైన పడు తున్నట్లు తెలుస్తోంది. సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం, జంక్‌ఫుడ్ తదితరాలకు అలవాటు పడటం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుదలతో గుండె నాళాలు ముసుకుపోతున్న ఘటన లు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో రక్త ప్రసరణలో తేడాలు రావడంతో శస్త్రచికిత్స చేసి స్టెంట్స్ వేయాల్సిన పరిస్థితి వస్తోంది. ప్రస్తుతం గుండె సంబంధిత శస్త్రచికిత్సలను పరిశీలిస్తే 52 శాతం స్టెంట్ వేసే సర్జరీలే ఉంటున్నట్లు స్పష్టమవుతోంది. వయసుల వారీగా విశ్లేషిస్తే 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో 29 శాతం సింగిల్ స్టెంట్ వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ►గుండెకు శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్న వారిల్లో పిల్లల సంఖ్య కూడా అధికంగానే ఉంది. అయితే వీరిలో మెజార్టీ బాధితులు పుట్టుకతోనే గుండె సమస్యలతో జన్మిస్తున్నట్లు ఆరోగ్య శాఖ పరిశీలనలో వెల్లడైంది. అందులోనూ 26 శాతం బాధితులు హోల్ క్లోజర్ (గుండెలో ఏర్పడిన రంధ్రాల పూడిక) కోసమే సర్జరీలు చేయించుకుంటున్నారు. మిగతా 74 శాతం వివిధ రకాల సమస్యలతో చికిత్స చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ►గుండె సంబంధిత శస్త్రచికిత్సలు అత్యధికంగా చేస్తున్న రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో ఉన్నాయి. ►తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు ఆలస్యంగా జరిగింది. దీంతో ఈ పరిశీలన నుంచి తెలంగాణను మినహాయించారు. అయితే తెలంగాణలో ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్సల తీరును పరిశీలిస్తే హృదయ సంబంధిత కేటగిరీ ప్రథమ స్థానంలో ఉంది. గుండె సంబంధిత ఆస్పత్రుల సంఖ్య పెరగాలి ఆయుష్మాన్ భారత్ పథకం కింద నమోదైన ఆస్పత్రుల సంఖ్యను పరిశీలిస్తే ప్రతి ఎనిమిది ఆస్పత్రుల్లో ఒకటి మాత్రమే కార్డియాక్ కేర్ హాస్పిటల్ ఉంది. వీటి సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉంది. ప్రజలు జీవనశైలిలో మార్పులకు అనుగుణంగా వ్యాయామం, యోగాలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. తెలంగాణలో ‘స్టెమీ’పేరుతో హైదరాబాద్‌లోని వైద్య నిపుణుల సహాయంతో టెలీమెడిసిన్ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలో గుండె వైద్యం అందిస్తున్నారు. వైద్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వాడుకలోకి తీసుకురావాలి. – డాక్టర్ కిరణ్ మాదల, అఖిల భారత ప్రభుత్వ వైద్య సంఘాల సమాఖ్య జాతీయ కార్యవర్గ సభ్యుడు -
సేఫ్ సెకండ్ ఒపీనియన్ ప్లీజ్!
ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్‌కు చూపించుకుని, ఆయన సూచించిన చికిత్స సక్రమమైన మార్గంలోనే వెళ్తుందా లేదా అని తెలుసుకోడానికి సెకండ్ ఒపీనియన్ కోసం చాలామంది మొగ్గుచూపుతుంటారు. తమ చికిత్స సక్రమమైన మార్గంలోనే సాగుతుందని మరో డాక్టర్ కూడా భరోసా ఇస్తే... బాధితులకు అదో ధీమా. నిజానికి మొదటి డాక్టర్ మీద సందేహం కంటే... ఈ భరోసా కోసం, ఈ ధీమా కోసమే చాలావరకు సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్తుంటారు. ఒకరికి ఇద్దరు డాక్టర్లు ఒకేమాట చెబితే మనసుకెంతో ఊరట. కానీ ఒక్కోసారి సెకండ్ ఒపీనియన్ మరీ తేడాగా ఉంటే... మరోసారి మనం సందర్శించిన మొదటి డాక్టర్‌తోనూ ఒక మాట మాట్లాడటం ఎంతో అవసరం. అదెందుకో చూద్దాం. ఓ కేస్ స్టడీ: వైద్య విషయాలపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి ఓ డాక్టర్‌ను సంప్రదించారు. ఆయనకు కడుపులో ట్యూమర్స్ వంటివి ఉన్నాయనీ, ఆపరేషన్‌తో తొలగించాల్సిన అవసరముందని డాక్టర్ చెప్పారు. మరో ఒకరిద్దరు డాక్టర్ల దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు వారూ శస్త్రచికిత్స తప్పదని చెప్పడంతో... బాధితుడు సర్జరీ చేయించుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం ఇచ్చే పోస్ట్ ఆపరేటివ్ మందుల్లో ఒకదాని గురించి డాక్టర్ ఓ మాట చెప్పారు. ‘‘ఈ మందు మీకు కాస్త ఇబ్బందిని తెచ్చిపెట్టవచ్చు. అందరికీ అలా జరగాలని లేదు. ఒకవేళ మీ విషయంలో ఇబ్బంది కలిగితే నాకు చెప్పండి. నేను మందు మారుస్తాను’’ అని చెప్పారు డాక్టర్. ఎప్పటిలాగే సెకండ్ ఒపీనియన్లో భాగంగా ఆ పేషెంట్ ఆ మందు గురించి మరో డాక్టర్‌ను అడిగారు. ‘‘ఆ... అదంత ముఖ్యమైన మందు కాదులే’’ అని ఆ డాక్టర్ చెప్పడంతో బాధితుడు ఆ మందు తీసుకోలేదు. బాధితుడికి ఆర్నెల్లలోనే కడుపులో ట్యూమర్ మరోసారి పెరిగింది. సమస్య ఎందుకు పునరావృతమైందో తెలియక డాక్టర్ తలపట్టుకున్నారు. ఈ ఆర్నెల్ల కాలంలో బాధితుడి దగ్గర్నుంచి ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రయత్నంలో తాను మొదట ఇచ్చిన మందుల్లో ఒకదాన్ని బాధితుడు వాడలేదని తెలియవచ్చింది. దాంతో డాక్టర్ కాస్తంత ఆగ్రహం చూపాల్సివచ్చింది. ‘‘నిజానికి అదో కీమో తరహా మందు. కీమో అన్న మాట వినగానే తమకు క్యాన్సరేనేమో అని పేషెంట్ అపోహ పడవచ్చు. కానీ కాన్సర్ కానటువంటి కొన్ని రకాల (నాన్ క్యాన్సరస్) ట్యూమర్లు మళ్లీ మళ్లీ రాకుండా కీమోలాంటి చికిత్సనే అందించే ఓరల్ ట్యాబ్లెట్లను డాక్టర్లు ఇస్తుంటారు. ట్యూమర్ తొలగింపులో... దాన్ని పూర్తిగా తొలగించడానికి వీలుకాని ప్రదేశంలో సూక్షా్మతిసూక్ష్మమైన భాగం కొంత మిగిలిపోతే... మళ్లీ పెరగకుండా ఉండేందుకు ఇచ్చిన మందు అది. మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం తప్పుకాదు. కానీ ఆ తర్వాత మళ్లీ నాతో మాట్లాడితే... నేను మరింత వివరించేవాణ్ణి. ఇప్పుడు మరోసారి సర్జరీ చేయాల్సి వస్తోంది. అది కూడా గతంలో కంటే పెద్ద సర్జరీ. ఖర్చు కూడా దాదాపు రెట్టింపు’’ అంటూ మందలించారు డాక్టర్. ఇదీ మరోమారు జబ్బు రిలాప్స్ (పునరావృతం) అయిన ఓ బాధితుడి వాస్తవ గాధ. ఆందోళన కలిగించే విషయాలు అనవసరం : ఈ కేస్ స్టడీలో డాక్టర్ కావాలనే కొన్ని విషయాలను బాధితలకు విపులంగా చెప్పలేదు. దానికీ కారణం ఉంది. నిజానికి డాక్టర్ ఇచ్చిన మందు వాడేసి ఉంటే... ఆ మిగిలిపోయిన భాగమూ మృతిచెంది... రోగి పూర్తిగా స్వస్థుడయ్యేవాడు. కానీ ఈ మందు కీమో వంటిది అనగానే రోగిలో అనవసరమైన ఆందోళన మొదలయ్యే అవకాశం ఉంటుంది. దాంతో లేనిపోని ఊహలూ, అనవసరమైన సందేహాలతో మరింతమంది డాక్టర్లను సంప్రదించవచ్చు. దాంతో డబ్బూ, సమయమూ వృథా కావడమే కాదు... అవసరమైన యాంగై్జటీ, కుంగుబాటుకు తావిచ్చినట్టు అవుతుంది. అందుకే రోగి మానసిక ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని అతడికి అనవసరమైన విషయాలను చెప్పకపోవచ్చు. లేదా ఒకవేళ బాధితులు మంచి విద్యావంతులే అని చెపినప్పటికీ, వారిలో మరిన్ని సందేహాలు చెలరేగే అవకాశాలు ఎక్కువ. నిజానికి ఇలాంటి సందేహాలు విద్యావంతుల్లోనే ఎక్కువ అని డాక్టర్లు అంటుంటారు. సరికొత్త అనర్థాలకు తావిచ్చే గూగుల్ : ఏదైనా విషయాన్ని డాక్టర్లు యథాలాపంగా చెప్పినా సరే... చాలామంది విద్యావంతులు గూగుల్‌ను ఆశ్రయిస్తారు. వైద్యవిజ్ఞానానికి చెందిన చాలా అంశాలు గూగుల్‌లో విపులంగా ఉంటాయి. నిజానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది వ్యక్తికీ, వ్యక్తికీ వేరుగా ఉండవచ్చు. కొన్ని అంశాలు వారికి వర్తించకపోవచ్చు. అవి డాక్టర్‌కు తెలుస్తాయి. కానీ గూగుల్‌లో మొత్తం సమాచారమంతా ఉంటుంది. అది తమకు వర్తించదన్న అంశాన్ని గ్రహించలేని పేషెంట్లు... ఆ అనవసర పరిజ్ఞానాన్ని తలకెక్కించుకుని మరింతమంది డాక్టర్ల చుట్టూ తిరుగుతూ మనశ్శాంతిని దూరం చేసుకుంటుంటారు. ఫేస్బుక్, యూట్యూబ్‌లలో పనికిరాని పరిజ్ఞానం : దీనికి తోడు ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో మరిన్ని క్లిప్స్ ఉంటాయి. తమ లైక్స్ కోసం లేదా తమ పాపులారిటీని పెంచుకునేందుకు అర్హత లేని నకిలీలు (క్వాక్స్) కూడా ఏమాత్రం శాస్త్రీయతకు తావు లేని అంశాలతో వీడియోలు చేసి పెడుతుంటారు. వీటిని చూసి బాధితులు మరింత అయోమయానికి గురవుతుంటారు. సెకండ్ ఒపీనియన్ బాధితుల హక్కు నిజానికి మరో డాక్టర్ దగ్గర్నుంచి వారి అభిప్రాయం తీసుకోవడం పేషెంట్స్ హక్కు. మరొకరి ఒపీనియన్ తీసుకున్న తర్వాతే చికిత్సకు రమ్మని చాలామంది డాక్టర్లూ సూచిస్తుంటారు. దానికి కారణమూ ఉంది. సెకండ్ ఒపీనియన్ వల్ల పేషెంట్స్‌లో మంచి నమ్మకమూ, తాము తీసుకునే చికిత్స సరైనదే అనే విశ్వాసం పెంపొందుతాయి. అది బాధితులను మరింత వేగంగా కోలుకునేలా చేస్తుంది. చాలా సందర్భాల్లో తొలి డాక్టర్ చెప్పిన విషయాలూ, సెకండ్ ఒపీనియన్ ఇచ్చిన్న డాక్టర్ చెప్పిన అంశాలు నూటికి తొంభై పాళ్లు ఒకేలా ఉంటాయి. కొన్ని అటు ఇటుగా ఉన్నప్పటికీ మొదటి డాక్టర్ చెప్పిన అంశాలను చాలావరకు రెండో డాక్టర్ విభేదించరు. ఒకవేళ విభేదిస్తే కారణాలు చెబుతారు. కానీ తాము తీసుకున్న సెకండ్ ఒపీనియన్ గనక మన డాక్టర్ చెప్పిన విషయాలకు దాదాపుగా పూర్తిగా భిన్నంగా ఉన్నప్పుడు అదే విషయాన్ని మనం చికిత్స తీసుకునే డాక్టర్‌తో ఆ విషయాలపై స్పష్టంగా, నిర్భయంగా, విపులంగా చర్చించవచ్చు. మన సందేహాలనూ, సంశయాలనూ తీర్చడం డాక్టర్ విధి కూడా. అలాంటప్పుడు ఒకసారి మన డాక్టర్‌తోనూ మాట్లాడటం మంచిది. డాక్టర్ షాపింగ్ వద్దు ఓ డాక్టర్‌ను సంప్రదించాక... ఇంకా తమ సందేహాలు తీరలేదనో లేదా మరోసారి డాక్టర్‌ను అడిగితే ఏమనుకుంటారనో ఒకరి తర్వాత మరొకరి దగ్గరకు వెళ్తుంటారు. దీన్నే ‘డాక్టర్ షాపింగ్’ అంటారు. నిజానికి డాక్టర్ షాపింగ్ అన్నది మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుందని గ్రహించడం మంచిది. డాక్టర్ జి. పార్థసారధి, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ -
స్మార్ట్‌ఫోన్‌తో తెగ ఎంజాయ్ చేస్తున్నారా? అయితే, ఇది మీకోసమే..
8 పలమనేరు పట్టణంలో అద్దెగది తీసుకొని ఇంజనీరింగ్ చదవుతున్న ఓ విద్యార్థిని సెల్‌ఫోన్ అతిగా వాడొద్దని తల్లిదండ్రులు మందలించారు. దీంతో అప్పటికే సెల్ (smart phone addiction)కు బానిసైన ఆ విద్యార్థి తన గదిలోనే ఆత్మహత్య చేసుకొని ఇటీవలే మృతి చెందాడు. పట్టణంలోని పదోతరగతి చదివే బాలికకు మొబైల్ కొనివ్వలేదని తన చేతిని బ్లేడ్‌తో కోసుకొని ఆస్పత్రి పాలైంది. ఇలాంటి సంఘటనలు జిల్లాల్లో నిత్యకృత్యంగా మారాయి. ఒకప్పుడు ‘అరచేతిలో ప్రపంచం’ అనే నినాదంతో స్మోర్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు సెల్ చేతిలో జీవితమే బందీగా మారిపోయింది. రోజురోజుకూ పెరుగుతున్న మొబైల్ ఫోన్ల వినియోగం అనర్థాలకు దారితీస్తోంది. ఈ ఫోన్ చిన్న, పెద్ద, ఆడ, మగా తేడా లేకుండా, అందరి జీవితాలను అరచేతిలోకి తీసుకుంది. పదుల సంఖ్యలో కంపెనీలను మార్కెట్ నుంచి తరిమేసింది. మంచి కంటే చెడుకే ఎక్కువగా ఉపయోగపడుతోంది. తక్కువ శాతం మంది మాత్రమే అవసరాలకు వినియోగిస్తున్నారని పలు సర్వేల్లో తేలింది. ఎక్కువ శాతం మంది కాలక్షేపం కోసం ఫోన్ చూస్తుండడం పరిపాటిగా మారింది. అలాంటి వారిని క్రమంగా మొబైల్ బానిసలుగా మార్చేస్తోంది. పలమనేరు (చిత్తూరు): శరీరానికి కాసేపు రక్తం అందకపోయినా, ముక్కుకు శ్వాస ఆడకపోయినా పర్వాలేదుగాని నిమిషం పాటైనా చేతిలో సెల్ లేకుంటే బతకలేమన్నట్టుగా తయారయ్యారు నేటి యువత. డ్రగ్స్‌కు బానిసైనట్లు స్మార్ట్‌ఫోన్ బందీఖానాలో జనం బందీలుగా మారారు. ఇప్పుడు పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా స్మార్ట్ఫోన్ల వాడకం ఎక్కువైంది. మొబైల్ లేకుంటే బుర్ర కూడా పనిచేయడం లేదు. మితిమీరిన సెల్ వాడకం మనిషి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నా మార్పు రావడం లేదు. ఇప్పటికే చాలామంది వారికి తెలియకనే మానసిక రోగుల్లా మారారు. ఇంకొందరు అనారోగ్యం పాలవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పదిలక్షల ఫోన్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1990లో కీప్యాడ్ ఫోన్ల వాడకం మొదలైంది. తొలుత తిరుపతి, చిత్తూరు, కుప్పం, మదనపల్లె వంటి పట్టణాల్లో మాత్రమే రిలయన్స్ మొబైల్ టవర్ల ద్వారా నెట్‌వర్క్‌ను అందిస్తూ సేవలను మొదలు పెట్టారు. ఆపై పలు సెల్ కంపెనీలు మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 8వేల సెల్‌ఫోన్ టవర్లున్నాయి. ఉమ్మడి జిల్లా జనాభా 44 లక్షలు కాగా వీరిలో సెల్ఫోన్లు వాడేవారి సంఖ్య ప్రస్తుతం 10 లక్షలకు చేరింది. నాలుగేళ్ల నుంచి సెల్ఫోన్ల వాడకం ఏటా 15 శాతం పెరుగుతున్నట్టు ట్రాయ్ (టెలీఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) లెక్కలు చెబుతున్నాయి. ఈ ట్రాయ్ గణాంకాలను పరిశీలిస్తే ఇలా ఉన్నాయి. అన్ని రంగాలపై ప్రభావం విద్యార్థులు సెల్‌ఫోన్ వాడకంతో విలువైన సమయాన్ని వృథా చేసుకొని చదువుల్లో వెనుకబడడం, ఫెయిల్ కావడం జరుగుతోంది. ఇక ప్రైవేటు సెక్టార్లలో పనిచేసేవారు ఈ మొబైల్ కారణంగా పనులన్నీ సకాలంలో పూర్తి చేయడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు సెల్‌తోనే రోజంతా గడిపేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో ప్రభుత్వ సేవలు కుంటుపడుతున్నాయి. ముఖ్యంగా ఉత్పాదక రంగంలోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. ప్రధానంగా ఈ మొబైల్ అధికంగా వినియోగించే వారిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు్యహెచ్‌ఓ)తెలిపింది. ఎన్ని రకాల సమస్యలు ఎదురవుతున్నాయో డబ్లు్యహెచ్‌ఓ సర్వే వివరించింది. రాత్రి పూటే ప్రమాదకరం ప్రధానంగా రాత్రిపూట నిద్రపోకుండా సెల్చూడడం వల్ల కొన్ని రోజుల తర్వాత నిద్రరాని పరిస్థితి ఏర్పడుతుంది. శరీరంలో మెలటోనియన్ నిల్వలు నశించి డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. చీకట్లో సెల్‌ఫోన్ చూడడంతో దాని నుంచే వచ్చే బ్లూ కిరణాలు రెటీనాను బలహీనం చేసే కార్ట్‌డాక్ సమస్యలు తప్పవు. రాత్రుల్లో ఫోన్ చూసే పిల్లలకు తలనొప్పి, చూపు మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీంతోపాటు మెడనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సెల్ సమస్యలు: ► నిద్రలేమి, తలనొప్పి ► భుజం, మెడ నొప్పి ► బరువు పెరగడం ► చూపు తగ్గిపోవడం ► జ్ఞాపకశక్తి కోల్పోవడం ► ఏకాగ్రత దెబ్బతినడం ► డిప్రెషన్లోకి వెళ్లడం అనర్థాలపై అవగాహన అవసరం మితిమీరిన సెల్‌ఫోన్ వాడకంతో కలిగే అనర్థాలపై కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నాం. ఈమధ్య కాలంలో యూట్యూబ్‌లో పలు రకాల చోరీలు, నేరాలను చూసి వాటిని ప్రయోగాత్మకంగా చేస్తున్నారు. ఇలాంటి వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఏదేనా అవసరం ఉంటే తప్ప ఫోన్ వాడకం తగ్గించాలి. దీంతో ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. – గంగయ్య, డీఎస్పీ, పలమనేరు మానసిక ఇబ్బందులు తప్పవు పాలు తాగే పసిపిల్లల నుంచి సెల్ ఉంటేనే అన్నట్లుగా తయారైంది నేటి సమాజం. పిల్లలు ఏడుస్తుంటే బొమ్మలిచ్చే కాలం పోయింది. చేతికి సెల్ ఇస్తేనే వారు ఏడుపు ఆపుతారు. అధికంగా సెల్ వాడడం వలన మెడనొప్పి, కళ్లు కనిపించకపోవడం, తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. ఇక నిద్రపోకుండా రాత్రుల్లో సెల్ చూసేవారికి పలు రకాల ఆరోగ్య సమస్యలు తప్పవు. మనిషికి కనీసం ఏడు గంటల నిద్ర ఉండాలి. – మమతారాణి, ప్రభుత్వ చిన్నపిల్లల వైద్య నిపుణులు -
ప్రతి ముగ్గురిలో ఒకరికి కొలెస్ట్రాల్..
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. వంద మందిలో 33 మంది అనారోగ్యంతో ఉన్నారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ–హెల్త్ ప్రొఫైల్ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోనే మొదటిసారిగా సమగ్ర ఆరోగ్య సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రయోగా త్మకంగా చేపట్టిన ఈ–హెల్త్ ప్రొఫైల్స్ సిద్ధమవుతున్నాయి. ఆరోగ్య సర్వేలు ఇంటింటా సాగుతూ ముగింపు దశ (96%)కు చేరాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మార్చి 5న మంత్రి కె.తారక రామారావు, ములు గులో మంత్రి టి.హరీశ్‌రావు పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇంటింటా సర్వేలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 203 ఆరోగ్య కార్యకర్తల బృందాలు ఇంటింటా సర్వేలు చేస్తున్నాయి. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ సుమారు 30 రకాల ఆరోగ్య పరీక్షలు చేస్తు న్నారు. ఇప్పటికి 4,05,988 మందికి టెస్టులు పూర్తయ్యా యి. బ్లడ్‌గ్రూప్, రక్తహీనత, కిడ్నీ, షుగర్, కాల్షియం, కొలెస్ట్రాల్, కాలేయం, ఇతర పరీక్షలను సిరిసిల్లలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరి ఎత్తు, బరువు వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను ‘డిజిటల్ హెల్త్ ప్రొఫైల్’ రూపంలో భద్రపరుస్తున్నారు. ఈ సమాచారంతో ఆధార్ కార్డు నంబరు, మొబైల్ నంబరుతో అనుసంధానం చేసి పేరు, పుట్టిన తేదీ, యూనిక్ కోడ్, ఎమర్జెన్సీ ఫోన్ నంబర్ వంటి వివరాలు కార్డులో పొందుపరుస్తు న్నారు. యూనిక్ బార్‌కోడ్‌ను స్కాన్ చేస్తే.. చాలు సదరు వ్యక్తి సమగ్ర సమాచారం కళ్ల ముందు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేయడమే ఈ–హెల్త్ ప్రొఫైల్ లక్ష్యం. ఆధునిక పరిజ్ఞానంతో పరీక్షలు టీ–డయాగ్నోస్టిక్ సెంటర్లోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నమూనాలను విశ్లేషిస్తున్నారు. రోజుకు సగటున ఆరు వేల రక్త నమూనాలను పరీక్షిస్తూ.. ఆ వివరాలను కంప్యూటర్లో నమోదు చేస్తున్నారు. ఈ మూడు నెలల్లో ఒకరోజు గరిష్టంగా 14,690 రక్తపరీక్షలు చేయగా.. ఇప్పుడు సగటున 400 నుంచి 600 శాంపిళ్లు పరీక్షిస్తు న్నారు. ఇప్పటివరకు పూర్తయిన పరీక్షల్లో ఎక్కువ మందిలో కొలెస్ట్రాల్ సమస్య బయట పడగా, ఆ తర్వాత స్థానంలో కాల్షియం సమస్య ఉంది. థైరాయిడ్ సమ స్యతో 17,001 మంది, కాలేయ సమస్యతో 15,839 మంది, మూత్రపిం డాల సమస్యతో 14,267 మంది, మధుమేహంతో 10,186 మంది ఉన్నట్టు గుర్తించారు. -
గుండె ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులతో మరణిస్తున్న వారిసంఖ్య ఏటా పెరుగుతోంది. దేశంలో ఏటా మూడు మిలియన్ల మంది గుండె సంబంధిత సమస్యలతో మృత్యువాత పడుతున్నారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎంతో శ్రద్ధ తీసుకునే ప్రముఖ వ్యక్తులు కొందరు ఇటీవల హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. దీనికితోడు కోవిడ్ మహమ్మారి దాడి అనంతరం కొందరిని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ కారణాలన్నీ వెరసి గుండె ఆరోగ్య రక్షణపై ప్రజల్లో శ్రద్ధ పెరిగింది. ఇందుకు నిదర్శనం గడిచిన ఏడాది కాలంలో కార్డియాలజీకి సంబంధించి పురుషుల ఆన్లైన్ సంప్రదింపులు 300 శాతం, ఆస్పత్రిలో నేరుగా సంప్రదింపులు 150 శాతం పెరిగాయి. ఈ అంశాన్ని ఇటీవల ఇండియన్ హార్ట్ అసోసియేషన్ (ఐహెచ్ఏ) ఒక నివేదికలో వెల్లడించింది. ఆస్పత్రుల్లో నేరుగా, ఆన్లైన్లో సంప్రదిస్తున్న వారిలో 60 శాతం మంది 21–40 ఏళ్ల మధ్య వయస్కులు ఉన్నట్టు పేర్కొంది. 50 శాతం మంది 50 ఏళ్లు లోపు వారే దేశంలో గుండెపోటుకు గురవుతున్న పురుషుల్లో 50 శాతం మంది 50 ఏళ్ల లోపు వారే. 25 శాతం మంది 40 ఏళ్ల లోపు వారు ఉంటున్నట్టు ఐహెచ్ఏ తెలిపింది. ఆన్లైన్లో వైద్యులను సంప్రదిస్తున్న వారిలో 40 శాతం మంది నగరాలు, పట్టణాలకు చెందిన వారు కాగా 60 శాతం మంది మెట్రో నగరాలకు చెందినవారు. కరోనా ప్రభావం ఏ విధంగా ఉంటుంది? వైద్యులను సంప్రదిస్తున్న వారిలో ఎక్కువ మంది హృద్రోగుల్లో కరోనా ప్రభావం ఎంత.. ఏ విధంగా ఉంటుంది? అనే విషయాలను ఆరా తీస్తున్నారు. అదేవిధంగా గుండెపోటు లక్షణాలు ఎలా ఉంటాయి.. కార్డియాక్ అరెస్ట్, కరోనరీ ఆర్డరీ డిసీజ్.. ఇతర గుండె సమస్యలు ఏమిటి.. వాటి లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎలా గుర్తించాలి? అనే అంశాల గురించి తెలుసుకుంటున్నారు. అవగాహన పెరగడం మంచిదే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గడిచిన రెండేళ్లలో ప్రజల జీవన విధానాలు పూర్తిగా మారిపోయాయి. దీనికితోడు పోస్ట్ కోవిడ్ సమస్యలు కొందరిని వెంటాడుతున్నాయి. రక్తం చిక్కబడి గడ్డలు కట్టడం సంభవిస్తోంది. పోస్ట్ కోవిడ్ సమస్యలకు తోడు ప్రముఖులు గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో ప్రజల్లో గుండె సమస్యల పట్ల అవగాహన పెరుగుతోంది. మాకు గుండె సంబంధిత ఓపీలు పెరిగాయి. సంప్రదిస్తున్న వారిలో మెజారిటీ యువకులే ఉంటున్నారు. ఆరోగ్యంపై అవగాహన పెరగడం మంచిదే. అయితే ఏదైనా సమస్య ఉందని తెలిసి ఆందోళన చెందడం మంచిది కాదు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గింది. ఈ క్రమంలో పూర్వపు జీవన విధానాలు ప్రారంభించడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి. యోగ, వ్యాయామం చేయాలి. – డాక్టర్ విజయ్‌చైతన్య, కార్డియాలజిస్ట్ విజయవాడ నేరుగా సంప్రదింపులే ఉత్తమం గుండె సంబంధిత సమస్యలకు ఆన్లైన్లో కంటే నేరుగా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ వంటి పరీక్షలు చేస్తేనే గుండె సమస్యలను గుర్తించవచ్చు. గుండె సంబంధిత సమస్యలకు ప్రధాన కారణం జీవనశైలి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరు జీవనశైలి మార్చుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలను వీడాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఆధునిక జీవన విధానాలతో చిన్న వయసులోనే బీపీ, షుగర్ చుట్టుముడుతున్నాయి. 20 ఏళ్ల వయసు వారు గుండెపోటుకు గురవుతున్నారు. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు, కర్నూలు -
మరుగుదొడ్డే ఆమెకు ఆవాసం ..‘ఆకలితో అలమటిస్తున్నాం ఆదుకోండి’
సాక్షి, మెదక్: అందరూ ఉన్న అనాథ. కుమారులు పట్టించుకోకపోవడంతో ఆసరా కరువై వృద్ధురాలు భిక్షాటనచేస్తోంది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా చిన్న కుమారుడితో కలిసి రోడ్డు భవనాలశాఖకు చెందిన గెస్ట్‌హౌస్ మరుగుదొడ్డిలో తలదాచుకుంటోంది. తల్లీకుమారుల దయనీయస్థితిపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రామాయంపేట పట్టణానికి చెందిన జెట్టి రామలక్ష్మి భర్త భాస్కర్ గతంలోనే మృతిచెందాడు. దీంతో ఆమె కష్టపడి కూలీపనులు చేసి ముగ్గురు కొడుకులను పెంచి పెద్దచేసి పెళ్లిళ్లు చేసింది. పెద్ద కుమారుడు తన భార్యాపిల్లలతో పక్క గ్రామంలోని అత్తగారింటిలో స్థిరపడ్డాడు. బీసీ కాలనీలో ఉంటున్న రెండో కొడుకు కూలీపనులు చేసుకుంటూ తన బార్యా పిల్లను పోషించుకుంటున్నాడు. మూర్చవ్యాధితో తరచూ అనారోగ్యానికి గురవుతున్న మూడో కుమారుడు శ్రీనివాస్‌తో కలిసి తల్లి రామలక్ష్మి బీసీ కాలనీలోని అద్దె ఇంటిలో నివాసం ఉండేది. అనారోగ్యంతో శ్రీనివాస్ సరిగా పనులు చేసుకోకపోవడంతో అతడి భార్య ఇద్దరు కూతుర్లను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదే క్రమంలో అద్దె ఇల్లు యజమాని ఇల్లు ఖాళీ చేయించడంతో వారి బతుకులు రోడ్డున పడ్డాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో రామలక్ష్మి తన కుమారుడితో పట్టణంలోని మెదక్ రోడ్డులో శిథిలమైన రోడ్డు భవనాల శాఖకు చెందినన గెస్ట్‌హౌస్ మరుగుదొడ్డిలో తలదాచుకుంటుంది. కూలీ పనులు చేయాలన్నా ఆరోగ్యం సహకరించకపోవడంతో తల్లీకొడుకులు కొన్నాళ్లూ అర్థాకలితో గడిపారు. దీంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో రామలక్ష్మి భిక్షటన చేపట్టింది. తనకు వస్తున్న పించన్ డబ్బుతోపాటు భిక్షాటన ద్వారా వచ్చింది తింటూ తల్లీకొడుకులు కాలం గడపుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తమకు మందులకోసం ప్రతినెలా రూ.1500 ఖర్చవుతోందని వృద్ధురాలు వాపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో గత నెలనుంచి మందులు కూడా వేసుకోవడంలేదని కంటతడి పెట్టింది. రెండు పడకల ఇళ్లు మంజూరు చేయాలి దయనీయ పరిస్థితిలో అర్థాకలితో అలమటిస్తున్న తల్లీకొడుకులు మూడు నెలలుగా మరుగుదొడ్డిలో నివాసం ఉంటున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదు. ప్రతిరోజూ పట్టణంలో భిక్షాటన చేస్తున్న రామలక్ష్మిని చూస్తున్న స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు ఎవరూ ఆసరా ఇవ్వకపోడంతో భిక్షాటన ఎంచుకుంది. డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరుచేయాల్సిన అవసరం ఉంది. ఆకలితో అలమటిస్తున్నాం ఆదుకోండి కొంతకాలంగా నేను, చిన్నకుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాం. మాకు ఎలాంటి ఆస్తులు లేవు. అద్దె ఇంటిలో ఉండేవాళ్లం. ఇంటి యజమాని ఖాళీ చేయించడంతో విధిలేక మరుగుదొడ్డిలో ఉంటున్నాం. పూటగడిచే మార్గంలేక సిగ్గువిడిచి భిక్షాటన చేస్తున్నా. పించన్ డబ్బులు, భిక్షాటన ద్వారా వస్తున్న డబ్బులు మందులకు కూడా సరిపోవడంలేదు. ప్రభుత్వపరంగా ఇల్లు మంజూరుచేసి ఆదుకోవాలి. – జెట్టి రామలక్ష్మి, వృద్ధురాలు -
పిల్లల్లో జలుబు, గొంతునొప్పి, తీవ్రజ్వరం.. లైట్ తీసుకోకండి!
చిన్నపిల్లలకు జలుబు చేశాక వచ్చే గొంతునొప్పితో పాటు చాలా ఎక్కువ తీవ్రతతో వచ్చే జ్వరం (హైఫీవర్) తో బాధపడుతున్నారనుకోండి.. ‘ఆ... జలుబే కదా... చిన్న గొంతునొప్పే కదా..’ అని నిర్లక్ష్యం చేయకూడదు అంటే ఆశ్చర్యంగా అనిపిస్తోందా? కానీ వాస్తవం. పిల్లలకు జలుబు చేసి గొంతునొప్పితో బాధపడుతున్నప్పుడు దాన్ని కేవలం ఒక చిన్న సమస్యగా చూడకూడదు. ఇందుకు ఓ కారణం ఉంది. జలుబు, గొంతునొప్పి లాంటి లక్షణాలు కనిపించినప్పుడు తొలుత అది టాన్సిల్స్‌కు ఇన్ఫెక్షన్ వచ్చే టాన్సిలైటిస్‌కు దారితీయవచ్చు. ఇది కొందరిలో గ్రూప్–ఏ స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చినట్లయితే దీనికి సరైన యాంటీబయాటిక్స్‌తో పూర్తి కోర్సు వాడుతూ చికిత్స అందించాలి. అలా జరగకపోతే... ఈ సమస్య వచ్చిన ఒకటి నుంచి ఐదు వారాలలోపు రుమాటిక్ ఫీవర్ అనే సమస్యకు దారితీసే ప్రమాదం ఉంది. లక్షణాలు తొలుత జలుబు, గొంతునొప్పి, తీవ్రమైన జ్వరం వచ్చి తగ్గాక ఒకటి నుంచి ఐదు వారాల లోపు మళ్లీ జ్వరం వస్తుంది. ఆ జ్వరంతో పాటు కీళ్లనొప్పులు, కీళ్లవాపులు, ఒంటిమీద ర్యాష్ రావడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని రుమాటిక్ ఫీవర్‌గా అనుమానించాలి. అలాగే ఈ పిల్లల్లో శ్వాసతీసుకోవడం వంటి ఇబ్బంది కూడా కనిపిస్తుంది. తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ వంటివీ కనిపిస్తాయి. ఇంకా మరికొన్ని లక్షణాలూ కనిపిస్తాయి గానీ... ఇక్కడ పేర్కొన్నవి మాత్రం రుమాటిక్ ఫీవర్‌ను గుర్తించేందుకు తోడ్పడే ప్రధాన లక్షణాలు. అయితే చిన్న పిల్లల్లో ముందుగా వచ్చే ఈ జలుబు, గొంతునొప్పి, జ్వరాలను చాలామంది సాధారణ సమస్యగానే చూస్తారు. అది రుమాటిక్ ఫీవర్‌కు దారి తీసే ప్రమాదమూ ఉందని కూడా వారికి తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి జ్వరం వచ్చి తగ్గి, మళ్లీ ఒకటి నుంచి ఐదు వారాలలోపు జ్వరం వస్తే గనక... అప్పుడు తల్లిదండ్రులు కాస్త అప్రమత్తంగా ఉండాలి. చదవండి: పన్ను నొప్పి: ఆ చీము క్రమంగా దవడకూ, తలకూ పాకవచ్చు.. జాగ్రత్త! నిజానికి రుమాటిక్ ఫీవర్ అనేది సాధారణంగా 5 – 15 ఏళ్ల చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది దాదాపు పదేళ్లు కొనసాగితే మాత్రం... గుండె కవాటాల (వాల్వ్స్)ను తీవ్రంగా ప్రభావితం చేసి గుండెకు ముప్పు తెచ్చిపెడుతుంది. చికిత్స / నివారణ వాస్తవానికి తొలిదశలోనే పూర్తిగా తగ్గిపోయేలా చికిత్స చేస్తే... కేవలం చాలా చిన్న కోర్సు యాంటీబయాటిక్స్తోనే సమస్య పూర్తిగా ముగిసిపోతుంది. కానీ ఆ చిన్న చికిత్సే అందించకపోతే అది గుండె ఫెయిల్యూర్‌కూ దారితీయవచ్చు. చికిత్స అందించాక కూడా కొంతమంది పిల్లల్లో అది వాల్వ్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అవసరం పడేవరకూ వెళ్లే అవకాశం ఉంది (చాలా కొద్దిమంది పిల్లల్లోనే). మరికొందరిలో బ్లడ్‌థిన్నర్స్ (రక్తం పలుచబార్చే మందులు) కూడా జీవితాంతం వాడాల్సి రావచ్చు. ఇలాంటి చిన్నారుల్లో ఆడ పిల్లలు ఉండి, వారు పెద్దయ్యాక గర్భం దాల్చినప్పుడు సైతం అదీ ఓ సమస్యగా పరిణమించవచ్చు. అందుకే పిల్లల్లో జలుబు, గొంతునొప్పితో కూడిన తీవ్రమైన జ్వరం వస్తే దాన్ని చిన్న సమస్యగా పరిగణించకూడదు. పీడియాట్రీషియన్‌ను ఓసారి తప్పనిసరిగా సంప్రదించడమే మేలు. ఇంత పెద్ద సమస్య కేవలం ఒక పూర్తి (కంప్లీట్) కోర్సు యాంటీబయాటిక్తోనూ... అంతేగాక... శారీరక/వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్)తోనూ నివారించవచ్చని గుర్తుంచుకోవాలి. -
ఢిల్లీకి సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 10:30 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధానికి బయల్దేరనున్నారు. ఆరోగ్యం విషయమై ఆయన ఢిల్లీకి పయనమవుతున్నారు. కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభ సైతం వెళ్లనున్నారు. అయితే వరి కొనుగోలు అంశంపై కూడా కేసీఆర్ కేంద్రంతో చర్చిస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ కేవలం ఆరోగ్య పరమైన అంశాలపై మాత్రమే ఢిల్లీ వెళ్తున్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది. కాగా ఇటీవలే కేసీఆర్ అస్వస్థతకు గురవ్వడంతో యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఎడమ చేయి, ఎడమ కాలు నొప్పితో బాధపడుతున్న సీఎం కేసీర్‌కు ఆసుపత్రిలో వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. అనంతరం కొన్ని రోజులు సీఎంను విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ మేరకు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న కేసీఆర్.. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సభకు హాజరై బడ్జెట్‌పై ప్రసంగించారు. చదవండి: ఉక్రెయిన్ విద్యార్థులను ఇక్కడే చదివిద్దాం -
చెమట పట్టడం మంచి లక్షణమే.. కానీ శరీర దుర్వాసనను తగ్గించాలంటే..
చెమట పట్టడం చాలా సాధారణమైన జీవక్రియ. మనం బాగా శారీరక శ్రమ చేసినప్పుడు లేదా బాగా ఆటలాడినప్పుడు లేదా టెన్షన్ పడినప్పుడు, భయపడ్డప్పుడు చెమట పడుతుంది. ఇది సాధారణ పరిస్థితులలో. అయితే వేసవిలో మాత్రం ఇలాంటి వాటì తో పనిలేదు. కేవలం వాతావరణంలోని వేడి కారణంగా చెమట పడుతుంది. ఇది చాలా చికాకుగా అనిపిస్తుంది. నిజానికి చెమట పోయడం అనేది మంచి లక్షణమే అయినప్పటికీ వేసవిలో తలెత్తే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యను ఎదుర్కొనేందుకు కొన్ని మార్గాలు... ఒంటికి చెమటలు పట్టగానే చాలామంది చిరాకు పడతారు. నిజానికి అలా చెమట పట్టడం మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రకృతి ఏర్పాటు చేసిన ఓ అద్భుత ప్రక్రియ. వాతావరణంలోని వేడి వల్ల లేదా, వేసవి ఎండల వల్ల దేహంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు శరీరంలోని వ్యవస్థలన్నీ విఫలమయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి సందర్భాల్లో చర్మం మీద చెమట పట్టేలా చేసి, ఆ వేడిమి నుంచి కాపాడి దేహం చల్లగా అయ్యేలా ఏర్పాటు చేసింది ప్రకృతి. అంటే చెమట మన ప్రాణాలు కాపాడటమే కాదు. శరీర ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా ఉండేలా చూసి దేహక్రియలన్నీ సక్రమంగా జరిగేలా చూసే అపూర్వమైన ప్రక్రియ. అయితే కొన్ని సందర్భాల్లో అధికంగా చెమట పట్టడం వల్ల కొన్ని ఇబ్బందులూ తలెత్తవచ్చు. వాటికి ఉపశమనం కోసం జాగ్రత్తలను తెలుసుకుందాం. చెమట వల్ల సమస్యలు ►నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బందిగా అనిపించడం, శరీర దుర్వాసన. ►పిల్లల్లో చెమట పట్టడం వల్ల పరీక్షలు రాసే సమయంలో ఒక్కోసారి జవాబు పత్రం చిరిగిపోయే ప్రమాదమూ ఉంటుంది. ►టెన్నిస్, క్రికెట్ వంటి ఆటలు ఆడే క్రీడాకారుల్లో ఇలాంటి సమస్య ఉంటే బ్యాట్ లేదా టెన్నిస్ రాకెట్ జారిపోతుంటాయి. అందువల్ల వారు మాటిమాటికీ తుడుచుకోవలసి వస్తుంది. ►ఆఫీసులో పని సక్రమంగా జరగకపోవడం ►నలుగురు కలిసే సోషల్ గ్యాదరింగ్స్‌లో అందరితోనూ కలవలేకపోవడం, షేక్‌హ్యాండ్ ఇవ్వలేకపోవడం చదవండి: Summer Tips: చెరకురసంలో అల్లం, నిమ్మకాయ, పుదీనా కూడా కలిపి తాగితే.. ► కొందరిలో నడుస్తుండగానే చెమటల కారణంగా చెప్పులు/పాదరక్షలు జారిపోతుంటాయి. అలాంటివారు బూట్లు వేసుకోవడం కొంత మెరుగు. అయితే ఎప్పటికప్పుడు ఉతికిన, శుభ్రమైన సాక్సులు వాడుతుండాలి. లేకపోతే ఈ చెమటకు తోడు మలినమైన మేజోళ్ల కారణంగా మరికొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి ► రోజుకు రెండుసార్లు స్నానం చేయడం ►మాయిశ్చరైజర్ సబ్బులు వాడేవారిలో చెమట ఎక్కువగా పట్టే అవకాశం ఉంది. ఇలాంటివారు నార్మల్ సబ్బులు వాడటం మంచిది. ►చెమటలు ఎక్కువగా పట్టేవారు దాన్ని తేలిగ్గా పీల్చుకునేలా కాటన్ / నూలు దుస్తులు «ధరించడం మంచిది. ►ఎప్పటికప్పుడు ఉతికిన, శుభ్రమైన బట్టలు ధరించాలి. శరీర దుర్వాసన ►శరీర దుర్వాసనను తగ్గించాలంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. క్యాల్షియం, మెగ్నీషియం కలిసి ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ►అందుకోసం పాలు, క్యారెట్, ఆకుకూరలు, చేపలు, గుడ్లు, గుమ్మడి గింజలు ఎక్కువగా తీసుకోవాలి. జింక్ తగినంత ఉంటే నోటి, శరీర దుర్వాసన తొలగిపోవడంతోపాటు శరీరం చురుగ్గా పనిచేసేట్టు చేస్తుంది. ►నిమ్మరసం సహజసిద్ధమైన డియోడరెంట్ గా పనిచేస్తుంది. ఇది అధిక చెమటనూ తగ్గిస్తుంది. ►గోధుమగడ్డి జ్యూస్ తాగడం లేదా పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండ్లు తదితర ఆహారాలను తినడం వల్ల చెమట ఎక్కువగా పట్టకుండా చూసుకోవచ్చు. ► ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనానికి ముందు రెండు టీస్పూన్లు వెనిగర్, టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌లను కలిపి తాగితే చెమట ఎక్కువగా రాకుండా ఉంటుంది. ► ప్రతిరోజూ ఒక గ్లాసు టమాటా జ్యూస్‌ను తాగడం వల్ల చెమట సమస్య చాలా వరకు తగ్గుతుంది. ►బిగుతుగా ఉండే సింథటిక్ వస్త్రాలు వద్దు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకోండి. లో దుస్తుల్ని ఎప్పటికప్పుడు మార్చేయాలి. ► లో దుస్తులను వేడినీటిలో ఉతికి ఎండలో బాగా ఆరబెట్టువాలి. ►రోజుకు రెండుసార్లు కచ్చితంగా స్నానం చేయండి. బాహుమూలల్ని బాగా శుభ్రం చేసుకోండి. అవాంఛిత రోమాల్ని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. ►డియోడరెంట్ వాడవచ్చు. లేదంటే టాల్కమ్ పౌడర్ రాసుకోవడం. ►ఆహారంలో అల్లం, వెల్లుల్లి, మసాలాల్ని బాగా తగ్గించాలి. శరీర ఉష్ణోగ్రతను పెంచే ఆహార పదార్థాలు, పానీయాలు తగ్గించాలి. తులసి, వేప ఆకులను కలిపి పేస్ట్ లా చేపి... స్నానం చేసేముందు ఒళ్లంతా బాగా రుద్దుకోవాలి. ఆపైన గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. కొన్నాళ్ల పాటు ఇలా చేస్తే చెమట సమస్య శాశ్వతంగా తీరిపోయే అవకాశం ఉంది. ►ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా ‘చెమట’లు పట్టిస్తుంటే ఓసారి స్కిన్ స్పెషలిస్ట్‌ను సంప్రదించి వారి సలహాను బట్టి మందులు వాడటం ఉత్తమం. అంతేకానీ, అతిగా పట్టించుకున్నా, అసలు పట్టించుకోపోయినా ఇబ్బందే! చెమటలు ఎక్కువగా ఎందుకు పడతాయి? దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. శరీరం లో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోయే వాళ్లలో చెమట సమస్య అధికంగా ఉంటుంది. థైరాయిడ్, డయాబెటిస్, హైపర్ టెన్షన్ లేదా కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు కూడా అధిక చెమటకు కారణమవుతాయి. ఎలా బయటపడాలి? ఇంట్లోనే కొన్ని చిట్కాలతో ఈ అధిక చెమట సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు. మంచి నీళ్లు బాగా తాగడం, తేలికపాటి పోషకాహారం తీసుకోవడం, తినే ఆహారంలో విటమిన్ బి ఉండేలా చూసుకోవడం. (అరటిపండ్లు, గుడ్లు, గింజలు, ఆకుకూరలు ఈ జాబితాలో వస్తాయి.) ►రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్, టేబుల్ స్పూన్ తేనెను ఓ గ్లాసు నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ►నిమ్మకాయ రసాన్ని బాహుమూలల్లో రుద్దుకుని చల్లటి నీటితో కడిగేయాలి. ►కొబ్బరినూనెను చెమటలు ఎక్కువగా పట్టే ప్రాంతంలో రాస్తే అధిక చెమట నుంచి ఉపశమనం లభిస్తుంది. ►అలోవెరా జెల్లో చల్లదనాన్ని అందించే లక్షణం ఉంటుంది. ఈ జెల్‌ను చెమటలు ఎక్కువగా పట్టే ప్రాంతంలో నేరుగా రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ►బేకింగ్ సోడా వల్ల చెమట వల్ల శరీరం నుంచి వచ్చే దుర్వాసన పోతుంది. బేకింగ్ సోడాను కొంచెం నీటిలో కలిసి బాహుమూలల్లో రుద్దుకుని కాసేపటి తరువాత నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. ► బ్లాక్ టీలో ఉండే టానిక్ ఆసిడ్.. రక్తస్రావాన్ని ఆపే లక్షణాలతో పాటు, చెమటను ప్రభావవంతంగా అదుపులో పెడుతుంది. చల్లటి బ్లాక్ టీ లో ఓ శుభ్రమైన బట్టను ముంచి దాంతో బాహుమూలల్లో రుద్దుకోవడం వల్ల అధిక చెమట సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. -
శిశువుకు సర్కారు పునర్జన్మ
సాక్షి, అమరావతి : ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ పసికందుకు సీఎం వైఎస్ జగన్ సర్కార్ పునర్జన్మ ప్రసాదించింది. బిడ్డకు మెరుగైన చికిత్స అందించే స్తోమత లేని తల్లిదండ్రులకు ఆపన్న హస్తం అందించింది. గుంటూరు జిల్లా రేపల్లె మండలం బేతపూడికి చెందిన బడుగు రవికుమార్ ఇదే మండలం పేటేరు గ్రామంలో గ్రామ సచివాలయ సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. రవికుమార్ భార్య జయలక్ష్మి నెలన్నర క్రితం మగ శిశువుకు జన్మనిచ్చింది. 1.50 కిలోల తక్కువ బరువుతో శిశువు పుట్టడంతో పలు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో రేపల్లెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కొద్దిరోజులు చికిత్స అందించారు. మంగళవారం శిశువులో ఎలాంటి చలనం లేకపోవడంతో వెంటనే విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తుల్లో తీవ్ర ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించి.. చికిత్సకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. ఇంత పెద్ద మొత్తం భరించే స్తోమత రవికి లేదు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం సూచన మేరకు శిశువు చికిత్సకు ఫండ్ రైజింగ్ చేశారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా మంత్రి ఆళ్ల నాని దృష్టికెళ్లింది. వెంటనే ఆయన ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్యానికి నిధులు మంజూరయ్యేలా చూడాలని అధికారులకూ సూచించారు. ప్రభుత్వం మేలు మరువలేం చికిత్స కోసం డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్న నాకు మంత్రి ఆళ్ల నాని పీఏ ఫోన్ చేసి వివరాలు తీసుకున్నారు. కొద్దిసేపటికి మంత్రి ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడారు. ప్రభుత్వమే చికిత్స మొత్తం చూసుకుంటుందని భరోసా ఇవ్వడంతో చాలా సంతోషంగా ఉంది. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం మేలు జన్మలో మరువలేం. – బడుగు రవికుమార్, శిశువు తండ్రి -
'నులి'పేద్దాం
సాక్షి, అమరావతి: పిల్లలను పట్టి పీడించే అనారోగ్య సమస్యల్లో నులిపురుగులు ప్రధానమైనవి. ఈ పురుగులు పిల్లల పొట్టలో చేరి మెలిపెడుతూ వారి ఎదుగుదలను శాసిస్తుంటాయి. రక్తహీనత, పోషకలోపం, పలు అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంటాయి. నులిపురుగుల నివారణలో భాగంగా ఏటా రెండు సార్లు ఆల్బెండజోల్ మాత్రలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది తొలి విడత పంపిణీ మార్చి 2న ప్రారంభమైంది. 5వ తేదీ వరకూ కొనసాగనుంది. అంగన్వాడీలు, స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కళాశాలలకు తిరిగి వైద్య సిబ్బంది ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. 1–19 ఏళ్ల వయసున్న 1,04,93,350 మందికి మాత్రలు అందజేస్తున్నారు. 1–2 ఏళ్ల లోపు చిన్నారులకు ఆల్బెండజోల్ 400 ఎంజీ సగం మాత్ర, 3–19 ఏళ్లలోపు వారికి 400 ఎంజీ పూర్తి మాత్ర వేస్తున్నారు. అపరిశుభ్రత ప్రధాన కారణం పిల్లల్లో నులిపురుగులు సంక్రమించడానికి ప్రధాన కారణం అపరిశుభ్రత. దుమ్ము, ధూళి, మట్టిలో ఆడుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయడం వల్ల నులి పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. పిల్లల చేతిగోర్లను శుభ్రంగా ఉంచేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. భోజనం చేసేటప్పుడు, మూత్ర, మల విసర్జన అనంతరం చేతులు శుభ్రం చేసుకోవడం పిల్లలకు నేర్పించాలి. నులిపురుగుల ప్రభావం ఇలా.. నులిపురుగులు పిల్లల శారీరక, మానసిక పెరుగుదలపై ప్రభావం చూపుతాయి. రక్తహీనత, పోషకాల లోపం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, బలహీనంగా మారడం, తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు అవుతాయి. ఈ సమస్యల కారణంగా పిల్లలు చదువుపై ఏకాగ్రత చూపలేరు. ఆల్బెండజోల్ మాత్ర వేసుకోవడం ద్వారా వీటిని నిర్మూలించవచ్చు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తప్పనిసరిగా మాత్రలు వేసుకోవాలి 1.5 కోట్ల ఆల్బెండజోల్ మాత్రలను అన్ని జిల్లాలకూ సరఫరా చేశాం. విద్యా సంస్థల వారీగా 19 ఏళ్లలోపు పిల్లల వివరాలను ఫోన్ నంబర్లతో సహా సేకరించి, వారికి మాత్రలు అందాయో లేదో ఐవీఆర్ఎస్ ద్వారా విచారిస్తున్నాం. రాష్ట్రంలోని అందరు పిల్లలకు మాత్రలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. పిల్లలందరూ తప్పనిసరిగా మాత్రలు వేసుకోవాలి. – శ్రీనివాసరెడ్డి, ఆర్బీఎస్కే రాష్ట్ర ప్రత్యేకాధికారి -
కొడుకు మృతి.. ఆగిన తల్లి గుండె..
సాక్షి, వరంగల్: కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిగుండె ఆగిపోయింది. ఈ ఘటన బుధవారం వరంగల్ రైల్వేగేట్ ప్రాంతం పెరకవాడలో చోటుచేసుకుంది. వివరాలు.. వరంగల్ 33వ డివిజన్ పెరకవాడలో టింగిల్‌కార్ కృష్ణ(45) కులవృత్తి మటన్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. భార్య, తల్లి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల కృష్ణ అనారోగ్యానికి గురై బుధవారం సాయంత్రం మృతి చెందాడు. చదవండి: Hyderabad: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్ గురువారం తెల్లవారు జామున కొడుకు మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే తల్లి భారతిబాయ్(85) గుండె ఆగిపోయింది. ఒకే ఇంట్లో ఇద్దరి మృతితో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మధ్యాహ్నం మృతదేహాలను శివనగర్ శ్మశాన వాటికలో ఖననం చేశారు. చదవండి: తెల్లారితే లోకం చూడాల్సిన పసికందు.. అమ్మా ఎందుకిలా చేశావ్! -
హలో గురూ.. జర జాగ్రత్త! అంతా తెలుసు అని కొట్టిపడేయొద్దు.. చిట్కాలివిగో..
చలి తీవ్రతకు జనం గజగజ వణుకుతున్నారు. ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. చలిలో సైతం కొందరు మైదానాల్లో జాగింగ్, వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఈ కాలంలో అనేక వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉందని పలువురు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా షుగర్, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య నిపుణుల సలహాలు, సూచనలు మీకోసం. ఆస్తమా, అలర్జీ ప్రమాదంపొంచి ఉంది చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఆస్తమా, అలర్జీ ఉన్నవారు ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటికి రావద్దు. ఎప్పుడూ వెచ్చగా ఉండే విధంగా చూసుకోవాలి. గోరు వెచ్చని నీరే తాగాలి. చలికి దగ్గు, తుమ్ములు వస్తుంటాయి. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. చల్లటి ఆహార పదార్థాలు తీసుకోవద్దు. ఎప్పటికప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయాలి. దాని వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఆస్తమా రోగులు ఆయాసానికి గురి కాకుండా ఉంటారు. మంచి పోషకాలు ఉన్న పదార్థాలు తీసుకోవాలి. ఊపిరితిత్తుల సమస్య కారణంగా శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్నందున వృద్ధులు, పిల్లలు, గర్భిణులు అసలే బయటికి రావద్దు. రెండు రోజులకు మించి దగ్గు, జలుబు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ రవిప్రసాద్, ఎండీ, పలమనాలజిస్టు , నల్లగొండ చదవండి: రోజూ ఉసిరికాయ తింటున్నారా... ఇందులో ఉండే క్రోమియం వల్ల చర్మ వ్యాధులు ఉన్నవారు చలికాలం జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో చర్మం పొడిబారి పోతుంది. చర్మ వ్యాధులు కూడా ఎక్కువవుతాయి. ఈసారి చలి మరింత ఎక్కువగా ఉన్నందున సోరియాసిస్ ఉన్నవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. సోరియాసిస్ వ్యాధి చలికి తీవ్రమవుతుంది. ఒల్లంతా పొలుసుల మాదిరిగా మారుతుంది. శరీరంలో తేమ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. ఇంకా ఎక్కువైతే శరీరం, కాళ్లు పగిలినట్లు అవుతాయి. పెద్ద వయస్సువారు, పుట్టుకతోనే పొడి చర్మం ఉండేవారు మరీ జాగ్రత్తగా ఉండాలి. పెదాలు, కాళ్లు కూడా పగులుతుంటాయి. కొందరిలో చలికి తల వెంట్రుకలు రాలిపోతుంటాయి. గాయాలైనా కూడా మానని పరిస్థితి. దురద కూడా ఎక్కువగా ఉంటుంది. చర్మవ్యాధి పెరిగి కొందరిలో శరీరం, కాళ్లు, పగిలిపోతాయి. అలాంటివారు వైద్యులను సంప్రదించాలి. చదవండి: 2021 గుణపాఠాలు.. ఇప్పుడైనా కొత్త నిర్ణయాలు తీసుకుందామా.. చర్మం పొడిబారకుండా కొబ్బరి నూనె మంచిది చలికాలం ఆయిల్ శాతం ఎక్కువగా ఉన్న సబ్బులను వాడాలి. గ్లిజరిన్‌తో తయారు చేసిన సబ్బులను వాడడం వల్ల చర్మం వాడిపోకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు మ్యాయిశ్చరైజ్ క్రీమ్‌లను వాడుకోవాలి. అవి కొనుగోలు చేయలేనివారు కొబ్బరి నూనె రాసుకోవడం మంచిది. ఫ్యారాఫిన్ నూనె కూడా తక్కువ ధరలో ఉంటుంది. దాన్ని కూడా వాడొచ్చు. చలికాలం నీరు తక్కువగా తాగుతారు. దానివల్లన చర్మం పొడిబారే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా నీరు తాగాలి. సాధ్యమైనంత వరకు చిన్న చిట్కాలతో, ఎప్పటికప్పుడు ఆయిల్‌తో మాయిశ్చరైజ్ చేసుకుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది. – డాక్టర్ అనితారాణి, చర్మవ్యాధుల వైద్య నిపుణులు, నల్లగొండ చదవండి: అకస్మాత్తుగా వాంతి ,ఫిట్స్ రావడం జరుగుతుందా.. ఆలస్యం చేయకండి నీరు ఎక్కువ తాగాలి.. బయటి పదార్థాలు తినొద్దు వారం రోజులుగా చలి చంపేస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చిన్న పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. చల్లటి గాలులు వీస్తుండడంతో చిన్నపిల్లలు దగ్గు, జలుబు బారిన పడుతున్నారు. పెద్దలతో పోల్చితే చిన్నపిల్లల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అందువల్ల చలి కాలంలో పిల్లలను వెచ్చని ప్రదేశాల్లోనే ఉంచాలి. నెలలోపు పిల్లలకు చలిగాలి తగలకుండా దుప్పట్లు కప్పి ఉంచాలి. గదుల్లో ఫ్యాన్లు, ఏసీలు వేయొద్దు. నెలలు ఉన్న పిల్లలకు ఎప్పుడూ సాక్సులు, గ్లౌజ్‌లు, స్వెర్టర్లు వేయాలి. సంవత్సరం దాటిన పిల్లలకు కూడా స్వెర్టర్లు వేసి ఉంచాలి. చిన్నారుల చర్మం పొడి బారిపోకుండా మెత్తగా ఉంచుకునేలా క్రీమ్స్ రాయాలి. చల్లటి గాలికి జలుబు, దగ్గు వస్తుంది. పిల్లలను బయటికు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనాలపై తిప్పకపోవడమే మంచిది. ఎదిగిన పిల్లలకు మాస్క్ వాడాలి. పిల్లలకు వేడివేడిగా ఆహార పదార్థాలు పెట్టాలి. గోరువెచ్చని నీరు తాగించాలి. ఈ కాలంలో బయటి ఆహార పదార్థాలు తినకూడదు. శీతల పానియాలు తాపొద్దు. చాక్లెట్స్, ఐస్‌క్రీమ్స్ తినకుండా చూడాలి. –డాక్టర్ తేజావత్ విద్యాసాగర్ , సూర్యాపేట ‘షుగర్’ బాధితులూ.. జర జాగ్రత్త గతంలో ఎప్పుడూలేని విధంగా ఈసారి చలి తీవ్రత బాగా పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు 10డిగ్రీల వరకు పడిపోతున్నాయి. చలి కాలంలో షుగర్ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చలికి రక్తం చిక్కబడే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితిలోనూ బయటికి రావొద్దు. ఒకవేళ తప్పని పరిస్థితి అయితే మాస్కు ధరించడంతోపాటు తగు జాగ్రతలు తీసుకోవాలి. వృద్ధులు, చిన్న పిల్లలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. గోరువెచ్చని నీరు తాగుతూ వెచ్చదనం ఉండేలా చూసుకోవాలి. చలికి జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. రెండు రోజులు అవి తగ్గకపోతే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. ఒమిక్రాన్‌కు కూడా ఇవే లక్షణాలతోపాటు ఒల్లు నొప్పులు ఉంటున్నాయి. అలాంటి వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. అప్పటి వరకు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటే మంచిది. షుగర్ వ్యాధికి, కీళ్ల నొప్పులు, స్టెరాయిడ్స్ వాడేవారు మరింత జాగ్రతగా ఉండాలి. ఈ రెండు నెలలపాటు చాలా జాగ్రత్తగా ఉండకపోతే చలి కారణంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కోక తప్పుదు. – డాక్టర్ విజయ్‌కుమార్, జనరల్ ఫిజీషియన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నల్లగొండ మెడికల్ కాలేజీ వ్యాయామం మరువొద్దు రామగిరి(నల్లగొండ) : చలికాలం వ్యాయామం ఎంతో ముఖ్యం. ఈ కాలంలో వ్యాధిగ్రస్తుల్లో రక్త చిక్కబడే ప్రమాదం ఉంటుంది. దీంతో వారు రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేస్తుంటారు. ఈ కాలంలో మైదానాలన్నీ మార్నింగ్ వాకర్స్‌తో కిటకిటలాడుతుంటాయి. చిన్నా పెద్ద అని తారతమ్యం లేకుండా వృద్ధులు సైతం వ్యాయామం చేయాలి. -
కేపీహెచ్‌బీ కాలనీ: హాస్టల్లో యువతి ఆత్మహత్య
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): అనారోగ్య కారణాలతో ఓ యువతి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. కృష్ణాజిల్లాకు చెందిన పాలపర్తి శాంతి (26) భాగ్యనగర్ ఫేజ్–2లోని తనూజ హాస్టల్లో నివాసం ఉంటూ బాలానగర్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుంది. కొంతకాలంగా తలనొప్పి తదితర అనారోగ్య కారణాలతో బాధపడుతుంది. ఆదివారం ఉదయం శాంతి ఫోన్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో ఆందోళనకు గురైన శాంతి తల్లి హాస్టల్ నిర్వాహకులకు ఫోన్ చేసి వాకబు చేసింది. హాస్టల్ నిర్వాహకులు శాంతి గదికి వెళ్ళి చూడగా ఆత్మహత్యకు పాల్పడిన విషయం ఆమె తల్లికి, సోదరికి తెలిపారు. దీంతో వారు హుటాహుటిన తరలివచ్చి పోలీసులకూ సమాచారం ఇచ్చారు. అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసి ఉందని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: హైదరాబాద్: అన్నను కొట్టి చంపిన తమ్ముడు -
చలికాలం సమస్యలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సాక్షి, తూర్పుగోదావది: జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతున్నా సాయంత్రం 6 గంటల నుంచి చలి తీవ్రత పెరుగుతోంది. ఈ కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే చాలామంది ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల దారి పడుతుండడం ఇందుకు నిదర్శనం. దోమల వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో చిన్నారుల నుంచి పెద్ద వారి వరకు డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా బారిన పడుతున్నారు. గతంలో ఊపిరితిత్తులు, ఆస్తమా ఇతరత్రా సమస్యలతో బాధపడుతున్న వారికి చలి తీవ్రత కారణంగా ఎక్కువ అవుతోంది. జాగ్రత్తలు పాటించకుంటే ప్రాణాలకు ముప్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో మార్పులతో పాటు అల్పపీడన ప్రభావాలతో ఈ ఏడాది నవంబర్ రెండోవారం నుంచి నమోదు అవుతున్న తక్కువ ఉష్ణోగ్రతలతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ చలికాలంలో సీజనల్ వ్యాధులతో పాటు ఆయాసం, గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం జాగింగ్, వాకింగ్‌కు వెళ్లే వారి చర్మం పొడిబారి బిరుసుగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వీటితో పాటు కాళ్ల మడమలు, పెదాలు పగలడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. చిన్న పిల్లలపై చలి ప్రభావం ఎక్కువగా ఉండనుంది. వివిధ రుగ్మతలు ఉన్నవారు జాగ్రత్తలు పాటిస్తే చలికాలంలో వ్యాధులు బారిన పడకుండా రక్షించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. గ్లిజరన్ సబ్బుల వాడకం మేలు చలికాలంలో చర్మం తెల్లగా పొడిబారకుండా ఉండడానికి గ్లిజరిన్ సబ్బుల వాడితే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనెతో మసాజ్ చేసుకుని తలస్నానం చేయాలి. వేడి నీటితో స్నానం చేస్తే చర్మం పొడి బారుతుంది. గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. పాదాలు పగిలే ప్రమాదం చలికాలంలో పాదాలు పగలడం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు కలిపిన గోరు వెచ్చని నీటిలో పాదాలను పది నిమిషాలు ఉంచాలి. నీటిలో ఉంచిన తరువాత సబ్బుతో కడుక్కుని పొడిగుడ్డతో శుభ్రంగా తుడవాలి. పగిలిన చోట మాయిశ్చరైజర్ రాయాలి. విటమిన్–ఈ క్రీమ్ రాస్తే మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులు డాక్టర్ల సలహాలను పాటించాలి. చిన్నారుల పట్ల జాగ్రత్తలు చలికాలంలో చిన్నారులకు చలి నుంచి రక్షణకు స్వెటర్లను తొడిగించాలి. వేడి నీటితో స్నానం చేయించాలి. పిల్లలకు ఇచ్చే ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా ఉండాలి. చలికాలంలో రాత్రి వేళ తమ పనులు ముగించుకొని ఇంటికి వెళ్లేవారు. పనుల నిమిత్తం బయటకు వచ్చే వారు ఉన్ని దుస్తులు ధరించాలి. బ్రాండెడ్ దుస్తులు అయితే మంచిది. బైక్‌పై వెళ్లేవారు మంకీక్యాప్, కాళ్లకు షూ, చేతులకు గ్లౌజ్‌లు ధరించాలి. ఆస్తమా ఉంటే.. చలికాలంలో ఆస్తమా ఉన్నవారు నిత్యం వాడే మందులను సిద్ధంగా ఉంచుకోవాలి. దుమ్ము, ధూళి పనులకు దూరంగా ఉండాలి. చల్లని గాలిలో తిరగవద్దు. శ్వాస నాళాలు మూసుకుపోకుండా వైద్యుడి సలహా మేరకు మందులు వాడాలి. ఇన్హేలర్, నెబ్యులైజర్ వంటివి అందుబాటులో ఉంచుకోవాలి. గుండెజబ్బులు ఉన్న వారు, గుండె ఆపరేషన్ చేయించుకున్నవారు వాకింగ్ చేయకూడదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ►చలిగాలులు వీస్తున్న సమయంలో ఇంటి తలుపులు, కిటికీలను మూసి ఉంచాలి. ►శరీరానికి వేడిని కలిగించే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ►పొలం పనులకు వెళ్లేవారికి చలి వల్ల కాళ్లు, చేతులు దురదలు పెడుతుంటాయి. వ్యాజిలిన్, చర్మ క్రీములు రాసుకోవడం ఉత్తమం. ►శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా ఉండేందుకు పొడి దుస్తులను ధరించాలి. ►చలి తీవ్రతతో జలుబు బాగా వచ్చి ఊపిరి తీసుకునే అవకాశం ఉండదు. అలాంటప్పుడు నెబ్యులైజర్ వినియోగించుకోవాలి. శ్వాసకోస వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు పాటించాలి ఆస్తమా, టీబీ వ్యాధిగ్రస్తులు ఉదయం 8 గంటల వరకు సాయంత్రం 6 గంటల తరువాత బయటికి వెళ్లకూడదు. బయటికి వచ్చే సమయంలో మాస్కులు ధరించడం మేలు. గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వెంటనే సమీప ప్రాంతాల్లోని వైద్య సిబ్బందిని ఆశ్రయించాలి. వేడి ఆహార పదార్థాలు, నీటిని స్వీకరించాలి. చిన్నపిల్లలకు న్యుమోనియా వచ్చే అవకాశాలు ఉంటాయి. చల్లటి వాతావరణంలో బయటకి వెళ్లకుండా చూడాలి. – డాక్టర్ కేవీఎస్ గౌరీశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జిల్లాలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు ఇలా.. కనిష్టం గరిష్టం మంగళవారం 23 29 బుధవారం 22 29 గురువారం 22 32 శుక్రవారం 20 29 శనివారం 19 32 ఆదివారం 19 28 సోమవారం 19 28 -
జాండీస్ ఎఫెక్ట్‌తో లివర్, కిడ్నీలు సరిగ్గా పనిచేయవు.. దయ చూపి.. ప్రాణం నిలపండి
సాక్షి,జ్యోతినగర్(పెద్దపల్లి): జాండీస్ బారినపడి లివర్, కిడ్నీలు సరిగా పనిచేయకపోవడంతో ఓ నిరుపేద వైద్య ఖర్చులకు దాతల సాయ కోసం ఎదురుచూస్తోంది. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు సూచించడంతో అప్పులు చేస్తూ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. తన భర్తను ఎలాగైనా కాపాడుకోవాలని ఆ ఇల్లాలు దీనంగా రోధిస్తుంది. రామగుండం కార్పొరేషన్ నాలుగో డివిజన్ కృష్ణానగర్‌కు చెందిన రామగిరి శ్రావణ్‌కుమార్ కిరాణా వ్యాపారం చేసుకుంటూ భార్య మౌనిక, తల్లి లలిత, కుమారులు మోక్షానంద్(మూడేళ్లు), అనిరుధ్(మూడు నెలలు)లతో జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శ్రావణ్‌కుమార్ అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లాడు. వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు జాండీస్ ఎఫెక్ట్‌తో లివర్, కిడ్నీలు సరిగ్గా పనిచేయడం లేదని మెరుగైన వైద్యం అందించాలన్నారు. దీంతో ఆ కుటుంబం అప్పులు చేసి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యం మెరుగుపడటానికి ఇంకా డబ్బులు ఖర్చు అవుతాయని డాక్టర్లు తెలుపడంతో దాతలు ఆదుకోవాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే దాతలు రామగిరి శ్రావణ్‌కుమార్ గూగుల్ పే, ఫోన్ పే: 8465921213 -
‘హృదయ’ వేదన! చిన్న వయసులోనే ఆగుతున్న శ్వాస.. కారణలివే!
గాంధారి మండలం గుజ్జుల్ తండాకు చెందిన జగ్గు అనే వ్యక్తి ఛాతీలో నొప్పంటూ కుప్పకూలిపోయాడు.. ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. జగ్గును బతికించడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో వైద్యుడు లక్ష్మణ్ సైతం గుండెపోటుకు గురై అక్కడికక్కడే తనువు చాలించారు. వైద్యం కోసం వేరే ఆస్పత్రికి తరలించే క్రమంలో పేషెంట్ కూడా మృత్యు ఒడికి చేరాడు. ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటనలు గాంధారిలో విషాదాన్ని నింపాయి. ఇలా రోజూ ఎందరో గుండెపోటుకు గురై మృత్యువాతపడుతున్నారు. సాక్షి, కామారెడ్డి: అన్ని రంగాల్లో పెరిగిన పో టీ, మారిన ఆహారపు అలవాట్లు ప్రజల జీవన ప్రమాణాలపై ప్రభావం చూపుతున్నాయి. శారీరక శ్రమ తగ్గడం, మానసిక ఒత్తిళ్లు పెరగడంతో ఆరోగ్యం దెబ్బతింటోంది. రక్తపోటు గుండెపోటుకు దారితీస్తోంది. సకాలంలో గు ర్తించకపోవడం, సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో పలువురు మృత్యుఒడికి చేరుతున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతూ చాలా మంది గుండె సమస్యల బారిన పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు 33,137 మంది, నిజామాబాద్ జిల్లాలో 60 వేల మంది వరకు ఉన్నారు. అంటే ఉమ్మడి జిల్లాలో 90 వేల పైచిలుకు మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. అలాగే మధుమేహం బారిన పడిన వారు కామారెడ్డి జిల్లాలో 17,690 మంది ఉండగా, నిజామాబాద్ జిల్లాలో దాదాపు 30 వేల మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మధుమేహం బాధితులు 47 వేలు దాటారు. ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లతో.. పొగ పీల్చడం, అతిగా మద్యం సేవించడం, అనవసరపు ఒత్తిళ్లు, జంక్ ఫుడ్ తినడం వంటి వాటితో రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఒత్తిళ్లను అధిగమించాలి ముఖ్యంగా యువత సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, సరిపడా నిద్రలేకపోవడం, జంక్‌ఫుడ్ తినడం, మద్యం సేవించ డం, స్థూలకాయం, ఒత్తిడి వంటి వాటితో గుండె జబ్బులబారిన పడుతున్నారు. సరైన వ్యాయామం లేకపోవడం కూడా ఇబ్బంది కలిగిస్తోంది. – సురేశ్, ఎండీ, జనరల్ ఫిజీషియన్, కామారెడ్డి -
ప్రకృతే పరమౌషధం!
ఎన్నో రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి మానవాళిని కాపాడిన మందు పెన్సిలిన్.. దాని తయారీకి మూలం ఓ ఫంగస్.. ఇప్పుడు కరోనా టెస్టుల కోసం వినియోగిస్తున్న ఆర్టీపీసీఆర్ విధానంలో వాడేది ఓ బ్యాక్టీరియా.. ఇవే కాదు.. మానవాళిని పట్టిపీడిస్తున్న రోగాలు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపినదీ ప్రకృతే. అత్యంత ముఖ్యమైన ఔషధాల తయారీకి స్ఫూర్తినిచ్చినదీ ప్రకృతే.. ఇలా ప్రకృతి ఇచ్చిన కొన్ని ముఖ్యమైన మందులు, వాటి ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామా.. జంతువులు, మొక్కల నుంచి.. వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల వల్లగానీ, మన జీవనశైలి వల్లగానీ ఎన్నో రకాల రోగాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వాటికి ఉపశమనం కోసం ఎన్నో ప్రయోగాలు, మరెన్నో పరిశోధనలతో మందులు తయారు చేస్తుంటారు. ఒక్కోసారి కొన్నిరకాల జంతువులు, చెట్లలోని రసాయనాల సమ్మేళనాలు నేరుగా రోగాలు, ఆరోగ్య సమస్యలకు ఔషధాలుగా పనిచేస్తుంటాయి. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగానో, అనుకోకుండానో అలాంటి వాటిని గుర్తించి.. మానవాళికి అందుబాటులోకి తెచ్చారు. మధుమేహానికి మందు ఇచ్చి.. గిలా మాన్స్టర్.. నలుపు, నారింజ రంగుల్లో ఉండే ఒక రకమైన పెద్దసైజు బల్లి. అమెరికా, మెక్సికో దేశాల్లో ఉండే ఈ బల్లి లాలాజలంలో ఎక్సెండిన్–4 అనే హార్మోన్ ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టైప్–2 మధుమేహం చికిత్సలో వాడుతున్న ఎక్సెనటైడ్ ఔషధానికి మూలం ఆ హార్మోనే. టైప్–2 మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి, పేషెంట్లు బరువు తగ్గడానికి ఈ హార్మోన్ తోడ్పడుతుందని నార్త్ కరోలినా వర్సిటీ శాస్త్రవేత్తలు 2007లో గుర్తించారు. దానిని ప్రస్తుతం కృత్రిమంగా తయారు చేస్తున్నారు. కరోనాను గుర్తిస్తున్నది ఇదే.. థర్మస్ అక్వాటికస్ బ్యాక్టీరియా.. 1969లో అమెరికాలోని ప్రఖ్యాత ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లో దీనిని గుర్తించారు. ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకుని ప్రొటీన్ల పునరుత్పత్తి చేయగల సామర్థ్యం ఈ బ్యాక్టీరియాకు ఉంది. దీనిని ఆర్టీపీసీఆర్ టెస్టులో ఉపయోగించినప్పుడు.. సంబంధిత వైరస్ల ప్రొటీన్లను గుర్తించడానికి వీలవుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో దీనిని విస్తృతంగా వినియోగిస్తున్నారు. హా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లెక్కల ప్రకారం.. ఇండియా, అమెరికా, బ్రిటన్, ఇటలీ, టర్కీ ఈ ఐదు దేశాల్లోనే ఏడాది మే చివరినాటికి ఏకంగా 100 కోట్ల కరోనా టెస్టులు చేశారు. ఫంగస్‌పై పోరు నుంచి.. కేన్సర్ చికిత్సకు.. పాక్లిటాక్సెల్.. కేన్సర్ చికిత్సలో ఉపయోగించే అత్యంత కీలకమైన ఔషధం. పసిఫిక్ యూ అనే చెట్టు బెరడులో లభించే ఈ రసాయన మిశ్రమాన్ని 1971లోనే గుర్తించారు. అది కేన్సర్లపై సమర్థవంతంగా పనిచేస్తుందని 2015లో జరిగిన పరిశోధనల్లో తేల్చారు. దాదాపు అన్నిరకాల కేన్సర్లకు చేసే కెమోథెరపీ చికిత్సలో ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన అత్యవసర మందుల జాబితాలో ఈ పాక్లిటాక్సెల్ ఔషధం కూడా ఉండటం గమనార్హం. నిజానికి పసిఫిక్ యూ చెట్లు ఈ రసాయన సమ్మేళనాన్ని ఎందుకు ఉత్పత్తి చేస్తాయో తెలుసా.. తమపై ఫంగస్‌లు పెరిగి తెగుళ్లు కలిగించకుండా ఉండటం కోసమే. వాటి ఇమ్యూనిటీ మనకు ఔషధంగా మారింది. సూక్ష్మజీవులను నాశనం చేసే కప్ప మాగేనిన్.. ఆఫ్రికన్ క్లాడ్ రకం కప్ప చర్మంలో ఉండే ఓ ప్రత్యేకమైన ప్రొటీన్. చాలా రకాల బ్యాక్టీరియాలు, ఫంగస్‌లు, ఇతర సూక్ష్మజీవులను నాశనం చేయగల సామర్థ్యం దీని సొంతం. కొన్నేళ్ల కింద ఆ కప్పలపై పరిశోధనలు చేస్తున్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. వాటి శరీరంపై గాయాలైనా ఇన్ఫెక్షన్లు పెద్దగా సోకడం లేదని గుర్తించారు. దానికి కారణం ఏమిటని పరిశోధించి ‘మాగేనిన్’ ప్రొటీన్‌ను గుర్తించారు. ఇది సూక్ష్మజీవుల పైపొరను ధ్వంసం చేస్తోందని తేల్చారు. అయితే ఈ ప్రొటీన్‌ను మానవ వినియోగానికి అనుగుణంగా మార్చడం, వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడంపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. మరెన్నో మందులు.. ►జ్వరం, నొప్పులతోపాటు మరెన్నో అనారోగ్య లక్షణాలకు ఉపశమనంగా వాడే ఆస్పిరిన్ అనే మందు విల్లో చెట్ల బెరడు, ఆకుల్లో ఉంటుంది. వందల ఏళ్లుగా ప్రజలు దానిని వాడుతూ వచ్చారు. 1850వ దశకంలో ఆస్పిరిన్‌ను కృత్రిమంగా తయారుచేశారు. ►మలేరియాకు మందుగా వినియోగించే క్వినైన్ అనే ఔషధం సింకోనా చెట్ల బెరడు నుంచి వస్తుంది. వందల ఏళ్లుగా దాన్ని వినియోగిస్తున్నారు. 1940వ దశకంలో శాస్త్రవేత్తలు క్వినైన్‌ను కృత్రిమంగా తయారు చేశారు. ►రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ‘స్టాటిన్స్’ను పలు రకాల ఫంగస్ల నుంచి విడుదలయ్యే రసాయనాల నుంచి అభివృద్ధి చేశారు. లక్షల కోట్ల విలువ! మనం పండించే, పెంచే చెట్లు, జంతువులు వంటివి కాకుండా.. సహజ ప్రకృతి నుంచి మనం ఏటా లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను వాడేసుకుంటున్నాం. ప్రపంచ వన్యప్రాణి నిధి (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) అంచనాల ప్రకారం.. భూమ్మీద ఉన్న ప్రకృతిని రూపాయల్లో లెక్కిస్తే.. 92.5 కోట్ల కోట్లు (125 ట్రిలియన్ డాలర్లు) విలువ ఉంటుంది. ప్రకృతిని సంరక్షించుకోకపోవడం వల్ల ప్రస్తుతం ఏటా రూ.35.4 లక్షల కోట్లు (479 బిలియన్ డాలర్లు) నష్టపోతున్నామని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ హెచ్చరించింది. -
కవలలు పుట్టారన్న ఆనందం.. కానీ అంతలోనే..
నా పేరు సఫీరా.. నా భర్త సేల్స్‌మ్యాన్‌గా పని చేసేవాడు. మాకు ఓ ముద్దుల కూతురు కూడా ఉంది. కానీ కరోనా సంక్షోభం కారణంగా నా భర్త ఉద్యోగం పోయింది. ఈ బాధలో ఉన్న మాకు నేను రెండో సారి గర్భవతిని అయ్యానంటూ ఓ తీపి కబురు అందింది. ఆ వార్త వినగానే కష్టాల వెంటనే సంతోషాలు ఉంటాయనే మాటను నమ్మాకు. కానీ అంతలోనే ఊహించనది జరిగింది ? అబార్షన్ తప్పదు ? ప్రెగ్నెంట్ కావడంతో ప్రతీ నెల చెకప్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లవాడు నా భర్త. కొంతకాలం తర్వాత నన్ను పరీక్షించిన డాక్టరు నాకో చేదు నిజం చెప్పారు. కడుపులో కవలలు ఉన్నారని, అయితే వారి పరిస్థితి బాగాలేదని అబార్షన్ చేయించుకోకుంటే తల్లి, బిడ్డలకు ప్రమాదమంటూ సూచించారు. పొత్తిళ్లలోనే పసికందులను చిదిమేయాలా లేక అల్లాపై దయ ఉంచి ముందుకు వెళ్లాలా అని మదనపడిపోయాను. చివరకు కష్టాల వెంటే సంతోషాలు ఉంటాయని నమ్ముతూ.. ఆ అల్లాపై భారంపై భారం వేసి అబార్షన్‌కి ఒప్పుకోలేదు. సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి గండం గడిచింది డాక్టర్లు భయపడినట్టు కాన్పు సందర్భంగా నాకేమీ కాలేదు. కవలలుగా మగ పిల్లలు జన్మించారు. వారిద్దరి బోసి నవ్వులు మాలో మరోసారి సంతోషం నింపాయి. తన తమ్ముళ్లతో ఆడుకునేందుకు వాళ్ల అక్క కూడా ఆస్పత్రికి వచ్చింది. అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకునే తరుణంలో మరోసారి కష్టాలు వెంటాడాయి, సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ డాక్టర్లు సూచించిన దాని కంటే చాలా ముందుగా కవలలు ఇద్దరు నెలలు నిండకుండానే పుట్టారు. దీంతో సాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు శ్వాస తీసుకునేందుకు ఇద్దరు పసి పాపాయిలు ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రి సిబ్బంది వారికి ఉన్న సమస్యని రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అని చెప్పారు. ప్రస్తుతం వాళ్లని ఎన్ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి బిడ్డల ఆరోగ్యం మెరుగవ్వాలంటే కనీసం రెండు నెలలు ఎన్ఐసీయూలో ఉంచి చికిత్స అందివ్వాలని డాక్టర్లు చెప్పారు. అందుకు రూ.10 లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పారు. సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి చిన్నారుల కోసం ఆ చిన్నారులు ఈ లోకాన్ని చూడాలంటే వైద్య చికిత్సలు చేయించాలి. ఇప్పటికే ఉద్యోగం పోగొట్టుకున్న నా భర్త అంత డబ్బు సర్థుబాటు చేయలేడు. అందుకే మెడికల్ ఎమర్జెన్సీ ఫండ్ రైజింగ్ సంస్థ కెట్టోని సంప్రదించాం. ఊపిరి తీసుకునేందుకు పోరాడుతున్న ఆ చిన్నారులకు సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. -
అధిక శక్తులు ఉన్నాయని లక్షలు దండుకుంటున్న కేటుగాడు
హైదరాబాద్: పూజల పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న కేటుగాడిని రాచకొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల ప్రకారం.. లోయర్ ట్యాంక్ బండ్‌కు చెందిన సదరు మహిళ తన ఇంట్లో నెలకొన్న ఆర్థిక, అనారోగ్య సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. రాకేష్ అనే వ్యక్తిని ఆశ్రయించింది. ఈ క్రమంలో అతగాడు.. తనకు అధిక శక్తులు ఉన్నాయని, మంత్రాలతో మహిళ సమస్యలను దూరం చేస్తానని నమ్మించాడు. అయితే, దీనికోసం అమ్మవారికి పూజ చేయాలని దానికి పెద్ద మొత్తంలో ఖర్చుఅవుతుందని తెలిపాడు. అంతటితో ఆగకుడండా.. పూజలు చేస్తానని చెప్పి ఆ మహిళ నుంచి 1,60,000ల నగదు, 5 తులాల బంగారాన్ని రాకేష్ తీసుకున్నాడు. పూజల గురించి ఎన్నిసార్లు ప్రస్తావించిన ఆ వ్యక్తి మాటను దాటవేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ మహిళకు అనుమానం వచ్చి.. తాను ఇచ్చిన నగదు, బంగారం తిరిగి ఇచ్చేయాలని వేడుకుంది. ఈ నెల (ఆగస్టు) 10 న మహిళ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కోరింది. దీంతో మోసగాడు.. బాధిత మహిళను అసభ్యపదజాలంతో దూషించి ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టాడు. దీంతో బాధితురాలు తాను మోసపోయినట్లు గ్రహించి నెరెడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోనికి తీసుకుని పలుసెక్షన్ల కింద కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు విచారణలో రాకేష్ ఇప్పటికే మరో 5 గురిని కూడా మోసం చేసినట్లు గుర్తించారు. చదవండి: మద్యానికి బానిసైన కొడుకును మందలించినందుకు... -
మరణంలోనూ నీవెంటే: భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య
చౌటుప్పల్: ఐదు దశాబ్దాల సంసార జీవితంలో ఎలాంటి కలతలు లేకుండా అన్యోన్యంగా గడిపారు ఆ దంపతులు. తమ పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించి బతుకుదెరువు చూపించారు. బరువు బాధ్యతలన్నీ ముగించుకున్న తరుణంలో భార్య అనారోగ్యంపాలైంది. అంతకంతకూ పెరుగుతున్న తన అనారోగ్య సమస్యలతో భర్త ఇబ్బంది పడకూడదని అగ్నికి ఆహుతైంది. అది కళ్లారా చూసి కలత చెందిన ఆమె భర్త కూడా నీ తోడై వస్తానంటూ.. ఉరివేసుకుని ప్రాణాలు వదిలాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గంటల వ్యవధిలో వృద్ధ దంపతుల మరణం అందరినీ కలచివేసింది. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన పిసాటి మారారెడ్డి(70), మల్లమ్మ(63) దంపతులకు ఇద్దరు కుమారులు. ప్రస్తుతం వారు హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. మారారెడ్డి గ్రామంలోనే వ్యయసాయం చేసుకుంటున్నాడు. కాగా, కొంత కాలంగా మల్లమ్మ అనారోగ్య సమస్యలతో అవస్థ పడుతోంది. వైద్యం చేయించుకున్నా సమస్య తగ్గకపోగా ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైంది. తన సమస్యతో భర్త, కుటుంబ సభ్యులను బాధపెట్టడం ఇష్టం లేని ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇది గమనించిన భర్త మంటలార్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. తీవ్రంగా గాయపడిన మల్లమ్మ మృతిచెందింది. కళ్లెదుటే భార్య అగ్నికి ఆహుతైపోవడాన్ని మారారెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. అదే రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయి, గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉదయం గ్రామస్తులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దంపతుల మృతదేహాలకు చౌటుప్పల్‌లోని ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. దంపతులిద్దరూ ఒకేసారి మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పెద్ద కుమారుడు బాల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అధిక ప్రొటీన్లు తీసుకుంటున్నారా? ఈ సమస్యలు రావొచ్చు
సాక్షి, హైదరాబాద్: అధిక ప్రొటీన్లు, తక్కువ ఫైబర్ తీసుకోవడం ద్వారా జీర్ణకోశ సంబంధ సమస్యలకు దారితీస్తుంది. కోవిడ్ సోకిన సమయంలో వైద్యంతో పాటు సూచిస్తున్న ఆహారం, పోషకాల్లోని వ్యత్యాసాల వల్ల పలువురికి ఇలాంటి సమస్యలే తలెత్తుతున్నట్లు వైద్యులు గుర్తిస్తున్నారు. సమతుల ఆహారంతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని వారు సూచిస్తున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత అనేక మందిలో మలబద్ధకం, కడుపులో ఇబ్బందులు సర్వసాధారణంగా మారాయని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలోని యూరాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్.ఆనంద్ పేర్కొన్నారు. దీనిద్వారా మలద్వారం దగ్గర పగుళ్లు, రక్తస్రావం వంటి సమస్యలతో కొందరు తమను సంప్రదిస్తున్నారని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్నవారు ఇతరత్రా తీవ్రమైన సమస్యలేవీ లేకుండా మలబద్ధకం మాత్రమే ఉంటే వంటింటి వైద్యం ద్వారా ఉపశమనం పొందుతున్నారని తెలిపారు. తాత్కాలిక ఉపశమనం సంగతెలా ఉన్నా ఆహారంలో మార్పు చేర్పులు అవసరం అని సూచిస్తున్నారు. లిక్విడ్ డైట్, వాకింగ్ బెస్ట్.. ఆహారం ద్వారా ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే మలబద్ధకం సమస్యలు రావడం సాధారణమే. దీనికి విరుగుడుగా ఫైబర్, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఆహారంలో రోజుకు కనీసం 30 గ్రాముల ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. వాకింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు, శారీరక శ్రమ ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. – జి.సుష్మ, సీనియర్ క్లినికల్ డైటీషియన్, కేర్ హాస్పిటల్స్ ఎక్కువైతే ముప్పే.. శరీరం సక్రమంగా తన విధులు నిర్వర్తించడానికి, వ్యాధి నిరోధక వ్యవస్థ పనితీరుకు రోజుకు ఒక వ్యక్తి తన శరీరం బరువులో ఒక కిలోకు 0.66 గ్రాముల ప్రొటీన్ అవసరం. అత్యధికంగా అది ఒక్క గ్రాము దాటకూడదు. రోజుకు 15 శాతం శక్తి (కేలరీలు)నిచ్చే హై ప్రొటీన్ ఆహారం సాధారణ పరిస్థితుల్లో వైద్యులు సూచించరు. అయితే కోవిడ్ చికిత్స సమయంలో తక్కువ ఫైబర్, అధిక ప్రోటీన్ ఉన్న ఆహారం చాలా మంది తీసుకున్నారు. దీంతో బాధాకరమైన మలవిసర్జన, పగుళ్లకు కారణమవుతుంది. ఎక్కువ రోజుల పాటు ఇలాగే ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు, మలబద్ధకమే కాకుండా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడొచ్చని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ డైరెక్టర్ ఆర్.హేమలత పేర్కొన్నారు. సమతుల ఆహారం క్షేమం ఎక్కువ ప్రోటీన్ కారణంగా వచి్చన సమస్యలను అధిగమించడానికి తగినంత ఫైబర్, తగినంత నీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని స్టెరాయిడ్స్, యాంటీ బయాటిక్స్ సైతం ఆకలి పెరిగేందుకు కారణమవుతాయని పేర్కొంటున్నారు. దీంతో కోవిడ్ చికి త్స తర్వాత అధికంగా ఆహారం తీసుకునే అవకాశం లేకపోలేదు. అయితే ప్రొటీన్ ఎక్కువగా ఉన్నవి కాకుండా ఫైబర్, కార్బోహైడ్రేట్లు, యాం టీఆక్సిడెంట్లు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు తప్పనిసరిగా దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు తగినంత ఫైబర్ ఆహారం కూడా ఉండాలి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా కారణమే.. ఏ రకమైన ఔషధం వల్లనైనా ఎసిడిటీ, అజీర్తి తదితర జీర్ణకోశ సంబంధ సమస్యలు అత్యంత సాధారణ దుష్ప్రభావాలు. జీర్ణకోశ సమస్యలు, ఎసిడిటీని ఎదుర్కోవటానికి తాము సాధారణంగా యాంటీయాసిడ్స్ సూచిస్తామని వైద్యులు చెబుతున్నారు. అయితే ఖాళీ కడుపుతో లేదా ఆహారం తర్వాత మందులు తీసుకోవాలా అనే విషయంలో రోగులకు స్పష్టత ఉండాలంటున్నారు. ఆకుకూరలు, పండ్లు, సలా డ్స్, మొలకలు, చిక్కుళ్లు వంటివి అధికమైన పీచు పదార్ధాలను తినాలని ఉంటాయి. అలాగే తృణ/చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, బీన్స్, పండ్లు, కూరగాయలు ద్వారా కూడా ఫైబర్‌ను పొందవచ్చు. పీచు తగినంత ఉండేలా చూసుకుంటే మలబద్ధకాన్ని నివారించడానికి, హృద్రోగ, డయాబెటిస్, పెద్ద ప్రేగు కేన్సర్లను అడ్డుకుంటుంది. -
ఆదిలాబాద్‌లో విషాదం: అనారోగ్యంతో ఆర్మీ జవాన్ మృతి
సాక్షి, తాంసి(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ దాసరి నవీన్ (26) అనారోగ్యంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో ఆర్మీ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం మృతి చెందాడు. ఎనిమిదేళ్ల క్రితం ఆర్మీలో చేరిన నవీన్ ఉత్తరప్రదేశ్‌లో జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నెల క్రితం సెలవులపై స్వగ్రామమైన పొన్నారికి వచ్చి, తిరిగి ఈనెల 2న లక్నో వెళ్లిపోయాడు. స్వగ్రామం నుంచి బయల్దేరే సమయంలోనే నవీన్ జ్వరంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విధుల్లో చేరిన కొన్ని రోజులకే తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆర్మీ అధికారులు ఆస్పత్రిలో చేర్పించారు. 15 రోజులుగా చికిత్స పొందుతున్న నవీన్ పరిస్థితి విషమించి, ఆదివారం ఉదయం మృతి చెందినట్లు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో తల్లిదండ్రులు దాసరి స్వామి–సువర్ణ కన్నీరు మున్నీరవుతున్నారు. ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వర్తిస్తూ అందరితో కలివిడిగా ఉండే నవీన్ ఆకస్మిక మరణంతో పొన్నారి గ్రామంలో విషాదం నెలకొంది. సోమవారం మధ్యాహ్నం మృతదేహం స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: ఐటీ సంస్థ మహిళా అధికారి ఆత్మహత్య -
ఆర్నెల్లు సమస్యలు వేధిస్తాయి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నెగెటివ్ వచ్చిన అనంతరం మహమ్మారితో పోరాటం పూర్తయినట్లేనా అంటే... కాదంటున్నారు నిపుణులు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మూడు నుంచి ఆరు నెలల పాటు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారంపై పీఐబీ నిర్వహించిన వెబినార్‌లో ఊపిరితిత్తులు, టీబీ నిపుణులు డాక్టర్ నిఖిల్ నారాయణన్ బాంటే, న్యూట్రిషనిస్ట్ ఇషా కోస్లాలు పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కరోనా సెకండ్ వేవ్‌లో మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో పోస్ట్ కోవిడ్–19 లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారని డాక్టర్ నిఖిల్ నారాయణన్ తెలిపారు. 50 నుంచి 70 శాతం మంది స్వల్ప, తీవ్ర లక్షణాలతో బాధపడుతున్నారని, మూడు నుంచి ఆరునెలల పాటు ఈ ఇబ్బంది ఉంటోందని తెలిపారు. అయితే మధ్యస్థ, తీవ్రస్థాయి కరోనాతో బాధపడిన వారే ఈ ఇబ్బందులు ఎదుర్కొన్నారని నిఖిల్ వివరించారు. పోస్ట్ కోవిడ్‌లో ఎదుర్కొంటున్న సమస్యలు... ► నీరసం/అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దడ, విపరీతంగా చెమట పట్టడం, కీళ్ల నొప్పులు, రుచి, వాసన కోల్పోవడం, నిద్రలేమి, మానసికంగా కుంగుబాటు, నిరాశ, ఆందోళన. పోస్ట్–కోవిడ్–19 లక్షణాలకు కారణం ► 1. వైరస్ సంబంధిత: కరోనా ఒక్క ఊపిరితిత్తుల పైనే కాదు శరీరంలోని అన్ని అవయవాలపైనా ప్రభావం చూపుతుంది. కాలేయం, మెదడు, కిడ్నీలు ఇలా అన్నింటిపైనా ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో శరీరం పూర్తిస్థాయిలో మహమ్మారి నుంచి కోలుకోవడానికి సమయం పడుతుంది. ► 2. రోగనిరోధక శక్తి సంబంధిత: శరీరంలోకి వైరస్ ప్రవేశించిన వెంటనే రోగనిరోధక శక్తి హైపర్ యాక్టివ్ అవుతుంది. వైరస్‌తో పోరాటంలో భాగంగా పలు రసాయనాలు ఉద్భవించి అవయవాల్లో మంట పుట్టిస్తుంది. కొంతమంది రోగుల్లో ఈ మంట దీర్ఘకాలం ఉంటుంది. ఎక్కువగా కనిపిస్తున్న లక్షణాలు: ► త్రొంబోఎంబాలిజం: పోస్ట్–కోవిడ్–19లో ఎక్కువ భయపడాల్సిన లక్షణం. రక్తం గడ్డకట్టిన ప్రాంతాన్ని బట్టి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే ఈ లక్షణాలు ఐదు శాతం రోగుల్లోనే కనిపించాయి. ► పల్మోనరీ ఎంబాలిజం: ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలను ముందుగా తెలియజేస్తుంది. రక్తపోటు తగ్గిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉన్నవారిని వెంటనే ఆసుపత్రికి తరలించాలి. ► డీ–డైమర్ స్థాయి ఎక్కువ: కరోనా తీవ్రమైన లక్షణాలున్న రోగులు, అధిక డీ–డైమర్ స్థాయి ఉన్న వారికి ఆసుపత్రిలో ఉన్న వారు 2 నుంచి 4 వారాలపాటు చికిత్స సమయం, ఆ తర్వాత కూడా రక్తం గడ్డ కట్టడాన్ని తగ్గించే చికిత్స తీసుకోవాలి. వైద్యుల సూచన మేరకే ఈ చికిత్స పొందాలి. ► దీర్ఘకాలిక దగ్గు: పోస్ట్–కోవిడ్–19లో ప్రధానమైన వ్యాధుల్లో దీర్ఘకాలిక దగ్గు ఒకటి. పొడి దగ్గు వచ్చే రోగులకు శ్వాస వ్యాయామాలు సిఫార్సు చేయాలి. ► పక్కటెముకల్లో నొప్పి: పోస్ట్–కోవిడ్‌లో తరచుగా దగ్గు కారణంగా నొప్పులు కనిపిస్తాయి. దీర్ఘకాలిక దగ్గు వల్ల ఛాతీ దిగువ భాగంలో ఎడమవైపు పక్కటెముకల్లో నొప్పులు రావచ్చు. ఈ లక్షణాలు గుర్తించడం ఎంతో అవసరం. ► పల్మోనరీ ఫైబ్రోసిస్: పోస్ట్ కోవిడ్‌లో మరో ప్రధానమైన లక్షణం. కరోనా నుంచి ఊపిరితితుత్తులు రికవరీ అయ్యే క్రమంలో మచ్చలు ఏర్పడతాయి. పది శాతం మంది రోగులు దీర్ఘకాలం ఆక్సిజన్ తీసుకోవాల్సి వస్తోంది. 70 శాతంపైగా ఊపిరితిత్తులు దెబ్బతిన్న రోగుల్లో ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. అయితే ఆ రోగుల్లో కూడా పల్మోనరీ ఫైబ్రోసిస్ ఒక శాతం మందిలోనే వెలుగుచూసింది. మోడరేట్, తీవ్ర లక్షణాలతో ఆక్సిజన్ థెరపీ తీసుకున్న వారిలో కోలుకున్న నెలరోజుల తర్వాత ఊపిరితిత్తులు పూర్తిగా పునరుద్ధరణ అయ్యాయా లేదా అనే దానిపై పరీక్ష చేయించుకోవాలి. కరోనా నుంచి కోలుకున్నవారు ఛాతినొప్పి వస్తే గుండెపోటు వస్తోందని భయపడుతున్నారు. కానీ కరోనా నుంచి కోలుకున్న రోగుల్లో మూడు శాతం కన్నా తక్కువ మందికే గుండెపోటు వచ్చింది. పోషణ నిర్వహణ సూచనలు ► కరోనా కారణంగా మరణించిన వారిలో 94 శాతం మంది సహ అనారోగ్యాల కారణంగానే మరణించారని క్లినికల్ న్యూట్రిషనిస్ట్ ఇషా కోస్లా తెలిపారు. తగిన ఆహారం తీసుకొని రోగనిరోధక శక్తి కాపాడుకోవాలని ఆమె సూచించారు. మసాలాలు లేకుండా సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. రెండు పూటలా ఆహారంలో తప్పకుండా ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. ► జింకు, విటమిన్–సి, డి, బి కాంప్లెక్స్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి. శరీరం తిరిగి శక్తిపొందడానికి ఇవెంతో ఉపకరిస్తాయి. ► రెయిన్బో డైట్ ఎంతో అవసరం. ఇవి ఏయే జన్యువులు పనిచేయాలి. వేటిని అణచివేయాలనేది త్వరగా గుర్తిస్తాయి. వేర్వేరు రంగుల కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. రంగురంగుల ఆహారం కనీసం ఒక భోజనంలోనైనా తీసుకోవాలి. రక్షిత ఆహారంలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ– ఇన్ఫ్లమేటరీ, కోల్డ్‌ప్రెస్డ్ ఆయిల్స్, పసుపు, అల్లం, టీ ఉండాలి. ► హైడ్రేషన్: శరీరం డీహైడ్రేషన్ కాకుండా తగినంత నీరు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. -
మంచి నిద్రతో గుండెపోటు దూరం
నిద్రకూ గుండెపోటు నివారణకూ సంబంధం ఉంది. నిద్రకు సంబంధించిన కొన్ని జాగ్రత్తల తో గుండెపోటును ఇలా నివారించుకోవచ్చు. ►మరీ తక్కువ నిద్రపోవడం గుండెకు మంచిది కాదు. మరీ ఎక్కువ నిద్రపోవడం డిప్రెషన్‌కు సూచిక. ►మధ్యాహ్నం పూట తీసే చిన్న నిద్ర గుండెకూ, మెదడుకూ మంచిది. భోజనం తర్వాత ఓ చిన్న కునుకు తీయడం వల్ల మీ సామర్థ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ►తక్కువ నిద్రపోయేవారిలో రక్తపోటు పెరిగే అవకాశాలు ఎక్కువ. తగినంత నిద్రపోయేవారితో పోలిస్తే తక్కువ నిద్రపోయేవారు 70 శాతం ఎక్కువగా జబ్బుపడతారు. ►నిద్రలేమి ఉండేవారిలో మిగతావారితో పోలిస్తే కనీసం 25% మెదడు సామర్థ్యం తక్కువ ఉంటుంది. ►నిద్రలేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ప్రతిరోజూ కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం. -
కూల్‌డ్రింక్స్‌తో శరీరం చల్లబడుతుందా?
చల్లని పానీయాలు వేసవిలో మంచి ఉపశమనం కలగజేస్తాయనే అపోహతో మనం కూల్‌డ్రింక్స్ తాగుతుంటాం. వాటిని తాగగానే దాహం తీరుతుందనే దురభిప్రాయంతో చాలామంది నీటికి బదులుగా తాగేస్తుంటారు. కానీ వాటిని తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందని అధ్యయనాల్లో రుజువైంది. పిల్లల్లో వీటి వల్ల ఊబకాయం వస్తుంది. భవిష్యత్తులో వాళ్లకు డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా ఉంది. కూల్‌డ్రింక్స్‌లో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్ దంతాలపై ఉండే అనామిల్ను దెబ్బతీస్తుంది. ఫాస్ఫారిక్ యాసిడ్‌తో క్యాల్షియం మెటబాలిజమ్ సైతం దెబ్బతిని, ఎముకల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడతాయనే పరిశోధనల నివేదికలు ఉన్నాయి. పైగా కూల్‌డ్రింక్స్‌ను నిల్వ ఉంచేందుకు దోహదపడే రసాయనాలు (ప్రిజర్వేటివ్స్) వల్ల పిల్లల్లో విపరీత ధోరణులు పెరిగి మానసిక అనారోగ్యాలకు దారితీస్తుందని తెలిసింది. -
జీవితంలో సగభాగం నిద్దురకే...
జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు... అని సినీకవి చెప్పిన మాట గతంలో ఓకే కానీ, ప్రస్తుత బిజీ లైఫ్‌కు వర్తించదనేది కాదనలేని వాస్తవం. హడావుడి జీవితం, పోటీ ప్రపంచంలో మనుగడ సాధించేందుకు ప్రతి ఒక్కరూ రేయింబవళ్లు కష్టపడాల్సిందే! గతంలో కాయకష్టం చేసిన శరీరాలను నిద్ర తల్లి వెంటనే జోకొట్టేది, కానీ ప్రస్తుత లైఫ్స్టైల్లో శారీరక కష్టం చాలా తక్కువైంది. టెక్నాలజీ కారణంగా శరీరాలు సుఖమరిగాయి. దీంతో నిద్ర సరిగా రాకపోవడం, నిద్రలేమి సమస్యలు తలెత్తుతున్నాయి. కారణాలేవైనా, ఎక్కువ కాలం నిద్రలేమితో బాధపడేవారికి వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ప్రతి వ్యక్తికి 8 గంటల కనీస నిద్ర అవసరం. చిన్నపిల్లలు, యువతకు 10 గంటల నిద్ర తప్పనిసరి. పైగా కరోనా రాకుండా కాపాడుకోవడానికి బలవర్థక ఆహారం ఎంతముఖ్యమో, కంటినిండా నిద్ర పోవడం కూడా అంతే ముఖ్యమని సూచిస్తున్నారు. కంటి నిండా నిద్రకు చిట్కాలు దుష్ప్రభావాలనేకం పెద్దవారిలో నిద్రలేమితో జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది. నిద్రపోతున్న సమయంలో జ్ఞాపకాలను నిల్వచేసే ముఖ్యమైన మెదడు తరంగాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి మెదడులోని హిప్పోకాంపస్ అనే భాగం నుంచి ప్రిఫ్రంటల్ కార్టెక్స్‌కు దీర్ఘకాలిక జ్ఞాపకాలను బదిలీ చేస్తాయి. నిద్రలేమితో ఈ మొత్తం ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. సరిగా నిద్రలేకపోతే ఆకలి పెరిగి ఊబకాయానికి దారి తీస్తుంది. మనిషి ఆలోచనలు, కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యంపై నిద్రలేమి తీవ్ర ప్రభావం చూపుతుంది. సరిపడినంత నిద్రలేకపోవడం వలన ఏ విషయంపైనా శ్రద్ధ పెట్టలేకపోవడం, చురుకుదనం తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. నిద్రలేమి సమస్య దీర్ఘకాలం కొనసాగితే నిరాశ, నిస్పృహ, ఆందోళన చుట్టుముడుతుంటాయి. ఫలితంగా శరీరంలో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ అధిక మోతాదులో విడుదల అవుతుంది. ఇది చర్మసంరక్షణకు తోడ్పడే కొల్లాజెన్‌ను విచ్ఛిన్నం చేసి చర్మ సౌందర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. కేవలం శారీరక సమస్యలే కాకుండా పలు రకాల మానసిక సమస్యలు కూడా నిద్రలేమితో ఉత్పన్నమవుతాయి. శరీరానికి సరైన నిద్ర ఉంటే అది వివిధ జీవక్రియలను సమన్వయపరుస్తుంది, మంచి నిద్రలేకపోతే జీవక్రియలలో మార్పులు సంభవిస్తాయి, దీంతో వైరస్ల బారిన పడే అవకాశం పెరుగుతుందని లెనోక్స్ హిల్ హాస్పిటల్ సీనియర్ న్యూరో సైకాలజిస్ట్ పిహెచ్డి బ్రిటనీ లెమోండా తెలిపారు. క్రమబద్ధమైన దినచర్య కోవిడ్ అనంతర కాలంలో ఎదురయిన సామాజిక పరిస్థితుల కారణంగా చాలా నెలలు అందరి దినచర్యలు మారిపోయాయి. ముఖ్యంగా ఉద్యోగస్థుల సమస్యలు పెరిగాయి, కొందరైతే ఉద్యోగాలు కోల్పోయారు, కొందరేమో వర్క్ ఫ్రం హోమ్‌కు పరిమితమయ్యారు. మరోవైపు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే పరిస్థితుల్లేక విద్యాసంవత్సరం ప్రశ్నార్థకంగా మారింది. తిరిగి ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తుండడంతో మరలా మునపటి జీవనశైలికి అలవాటు పడడం కష్టంగా అనిపిస్తుంటుంది. అయితే ఈ సమస్యలు కేవలం మన ఒక్కరికే పరిమితం కాదని, అందరూ ఎదుర్కొంటున్న సమస్యలని గుర్తించాలి. ఎప్పటికప్పుడు పరిస్థితులకనుగుణంగా దినచర్యను మార్చుకోవడం కన్నా, క్రమబద్ధమైన దినచర్య అంటే రోజూ ఒకే సమయానికి లేవడం, తినడం, పడుకోవడం వంటివి పాటిస్తే ఒత్తిడి ప్రభావం ఉండదని కొలంబియా యూనివర్సిటీ మనస్తత్వ శాస్త్రవేత్త నవ్యాసింగ్ తెలిపారు. అతి నిద్ర వద్దు అతినిద్రాలోలుడు.. తెలివిలేని మూర్ఖుడు అన్నట్లు కోవిడ్, లాక్డౌన్ కారణంగా ఎప్పుడు పడితే అప్పుడు ఎంతసేపు కావాలంటే అంతసేపు నిద్రపోవడం చాలామందికి అలవాటైంది. కరోనా అనే కాకుండా, కొందరికి అతినిద్ర ఒక అలవాటుగా ఉంటుంది. అయితే ఇలాంటి దీర్ఘకాలిక నిద్ర అనర్ధదాయకమని సైంటిస్టులు చెబుతున్నారు. దీనివల్ల శరీర సహజసిద్ధ గడియారం (బయలాజికల్ క్లాక్) దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. బ్లూ లైట్ వాడొద్దు నేటి తరం ఖాళీ సమయం దొరికితే ఫోన్లు, ల్యాపీల వద్ద సమయాన్ని ఎక్కువగా గడుపుతున్నారు. యంగ్ జనరేషన్‌తో పాటు పెద్దవారికి కూడా మొబైల్ వాడకం వ్యసనంగా మారింది. నిద్రపోయే ముందుకూడా మొబైల్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే వీటిలో ఉండే బ్లూలైట్ కారణంగా కళ్ళు ఒత్తిడికి లోనవుతాయి. దీంతో కంటి నిండా నిద్ర ఉండదు. అందువల్ల పుస్తకాలు చదవడం, బ్లూలైట్ ప్రభావం తక్కువగా ఉన్న మొబైల్‌ను వాడటం మంచిది. వ్యాయామం మరవద్దు కరోనా కారణంగా చాలా రోజులపాటు వర్క్‌ఫ్రమ్ హోమ్‌తో ఇంట్లోనే గడిపాం. దీనితో వ్యాయామం చేయడానికి కూడా కుదరలేదు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు కనుక కాస్త బద్దకంగా అనిపించినా.... జిమ్‌లో లేదా అందుబాటులో ఉన్న ఫిట్నెస్ సాధానాల ద్వారా రోజూ ఎక్సర్సైజ్ చేయాలి. వ్యాయమం చేయడం వలన శరీరంలోని అన్ని భాగాలకు రక్తసరఫరా జరిగి కొంత అలసట తీరి నిద్రకూడా బాగా పడుతుంది. అయితే పడుకునే ముందు ఎలాంటి వ్యాయామాలు చేయకూడదు. దీని వలన నిద్ర సరిగ్గా పట్టదు. నో ఆల్కహాల్ చాలా మంది ఒత్తిడిని, ఆందోళనను అధిగమించడానికి, నిద్ర పట్టడానికి ఆల్కాహల్ తీసుకుంటారు. దీని వలన మంచి నిద్ర పడుతుందని, తర్వాతి రోజు దినచర్య బాగుంటుందని భ్రమపడతారు. కానీ ఒక మోతాదుకు మించి తాగితే, ఆల్కహాల్ వల్ల అదనపు సమస్యలు ఉత్పన్నమవుతాయని, వ్యాధినిరోధక శక్తిపై దుష్ప్రభావం చూపుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే స్లీపింగ్ పిల్స్‌కు అలవాటు పడడం కూడా మంచిది కాదని సూచిస్తున్నారు. సో.. ఆరోగ్యం బాగుండాలంటే కంటినిండా సరైన కునుకుండాలి, సరైన నిద్ర ఉండాలంటే శరీరాన్ని క్రమ పద్ధతిలో ఉంచాలి. లేదంటే నిద్రలేమితో స్టార్టయ్యే సమస్యలు ఎలా ముగుస్తాయో ఎవరం చెప్పలేము. బీకేర్‌ఫుల్! -
ట్యూమర్ అయ్యే అవకాశం ఉందా?: హాస్టల్ గర్ల్
నా వయస్సు 19. ఎత్తు 5.6 బరువు 42. అయితే నాకూ 5 సంవత్సరాల నుండి రొమ్ము లో కొంత బాగం గట్టిగా ఉంది కదులుతూ ఉంటుంది కూడా. నేను చాలా సన్నగా ఉంటాను నాకూ ఛాతీ కూడా చిన్నగా ఉంటుంది. పీరియడ్ రెగ్యులర్‌గానే ఉంటుంది కాని, కడుపు నొప్పి ఉంటుంది. తెలిసిన డాక్టర్ని అడిగితే పెరుగుతున్న కొద్దీ శరీరంలో వచ్చే మార్పులకు పోతుంది అన్నారు. కానీ కొన్ని నెలల నుండి నొప్పి ఎక్కువగా ఉంటోంది. మసాజ్ చేయడం వల్ల కొంతకాలం ఉపశమనం లభిస్తోంది. నేను హాస్టల్లో ఉండి చదువుకుంటున్నా, అక్కడ ఫుడ్ బాగా ఉండదు. ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవు. కడుపు నొప్పి కోసం హోమియోపతి మందులు 3 నెలలు వాడాను. నా సమస్య ఏంటో అర్థం కావడం లేదు. ఏమయినా ట్యూమర్ అయ్యే అవకాశం ఉందా?? సమస్య ఏంటో దానికి కారణం చికిత్స తెలియచేయాలని మనవి. – శ్రీ విద్య, కరీంనగర్ నువ్వు నీ ఎత్తుకి తగ్గ బరువు లేవు, సన్నగా ఉన్నావు. నీకు రొమ్ములో కదులుతూ ఉండే గడ్డ ఉన్నట్లుంది. అది ఫైబ్రోఅడినోమా గడ్డ కావచ్చు. ఒకసారి డాక్టర్ని సంప్రదించి రొమ్ము స్కానింగ్ చేయించుకుంటే అది సాధారణ గడ్డా కాదా అని తెలుస్తుంది. అది మామూలు చిన్న ఫైబ్రోఅడినోమా గడ్డ అయితే... దానిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. పీరియడ్స్ సమయంలో విడుదలయ్యే ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ల మోతాదును బట్టి, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి గర్భాశయ కండరాలు ముడుచుకుంటూ... గర్భాశయ పొరని బ్లీడింగ్ రూపంలో బయటకు పంపిస్తుంది. ఈ సమయంలో కొందరిలో కడుపునొప్పి, నడుంనొప్పి ఎక్కువగా ఉంటుంది. కొందరిలో నొప్పి తీవ్రత కొద్దిగా ఉంటుంది. ఇంకొందరిలో ఏమీ ఇబ్బంది ఉండదు. ఇలా హార్మోన్స్ విడుదలలో మార్పుల వల్ల వచ్చే నొప్పి వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. ఈ సమయంలో నొప్పి నివారణ మాత్రలు రెండు మూడు రోజులు వేసుకోవచ్చు. కాని కొందరిలో గర్భాశయంలో కంతులు, ఫైబ్రాయిడ్స్, ఇన్ఫెక్షన్లు, ఆడినోమయోమా, వాపు, ఎండోమెట్రియోసిస్, అండాశయాలలో కంతులు, సిస్ట్లు వంటి అనేక సమస్యల వల్ల పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. నెలనెలా నొప్పి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుని పైన చెప్పిన సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేవా అని నిర్ధారించుకుని దానినిబట్టి సమస్య ఏమిటో తెలుసుకుని చికిత్స తీసుకోవడం మంచిది. హాయ్ మేడం.. నాకు 25 ఏళ్లు. గవర్నమెంట్ ఆఫీసర్ని. నాకు 4 నెలల కింద లెఫ్ట్ ఒవేరియన్ సిస్ట్ ఆపరేషన్ అయింది. దాంతో మొత్తం ఎడమవైపు ఓవరీనే తీసేశారు. నాకు ఇంకా పెళ్లి కాలేదు.పెళ్లి అయ్యాక పిల్లలు పుట్టడంలో ఏదైనా సమస్య ఉంటుందా? లేక పిల్లలు పుడతారా లేదా అని భయంగా ఉంది. మా తల్లి తండ్రులు బాధ పడుతున్నారు. ప్లీజ్ చెప్పండి. – ఇ– మెయిల్ సాధారణంగా గర్భాశయానికి రెండువైపులా ఒక్కొక్క అండాశయం (ఓవరీ) అతుక్కుని ఉంటాయి. అంటే మొత్తంగా రెండు అండాశయాలు ఉంటాయి. ఒక నెల ఒక వైపు అండాశయం నుంచి, మరలా నెల ఇంకొక వైపు అండాశయం నుండి అండం విడుదల అవుతుంది. ఈ సమయంలో కలయికలో ఉండటం వల్ల మగవారి నుంచి శుక్రకణాలు యోని నుంచి గర్భాశయంలోకి వెళ్లి అక్కడి నుండి ఫెలోపియన్ ట్యూబ్‌లోకి చేరి, అక్కడికి చేరిన అండాశయం నుంచి విడుదలయిన అండంతో ఫలధీకరణ చెంది పిండం ఏర్పడుతుంది. ఈ పిండం ట్యూబ్‌లో నుంచి గర్భాశయంలోకి చొచ్చుకుని గర్భం ఏర్పడి పెరగడం మొదలవుతుంది. నీకు ఒక అండాశయం తొలగించినా, ఇంకొక అండాశయం ఉంది కాబట్టి, దాని నుంచి విడుదలయ్యే అండం వల్ల గర్భం తప్పకుండా వస్తుంది. (ఇతర వేరే సమస్యలు లేకపోతే) కాబట్టి నువ్వు భయపడకుండా, మీ తల్లిదండ్రులకు కూడా ఏమీకాదని ధైర్యాన్ని చెప్పడం మంచిది. నా వయసు 43 ఏళ్లు. ఆరు నెలలుగా పీరియడ్స్ సమయంలో విపరీతంగా బ్లీడింగ్ అవుతోంది. కడుపులో నొప్పిగా ఉంటోంది. గత రెండు నెలల్లో పీరియడ్స్‌కి పీరియడ్స్‌కి మధ్య కూడా బ్లీడింగ్ అయ్యింది. ఇదేమైనా ప్రమాదకరమా? – నాగమణి, సోంపేట ఆడవారిలో 40 సంవత్సరాలు పైబడిన తర్వాత హార్మోన్లలో మార్పులు, అండాశయం పనితీరులో మార్పులు, గర్భాశయంలో ఫైబ్రాయిడ్ కంతులు, ఎండోమెట్రియల్ పాలిప్స్, సర్వైకల్ పాలీప్స్, ఇన్ఫెక్షన్లు, గర్భాశయంలో వాపు, అడికోమయోసిన్, ఎండోమెట్రియోసిస్, అండాశయాలలో సిస్ట్లు, కంతులు ట్యూమర్స్, అరుదుగా గర్భాశయ క్యాన్సర్ వంటి అనేక సమస్యల వల్ల బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడం, కడుపులో నొప్పి, మధ్యలో బ్లీడింగ్ కనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. మీరు కంగారు పడకుండా ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, స్పెక్యులమ్ పరీక్ష, పెల్విక్ స్కానింగ్, పాప్‌స్మియర్, ధైరాయిడ్ పరీక్ష చేయించుకుని, అవసరమైతే సర్వైకల్ బయాప్సీ, ఎండోమెట్రియల్ బయాప్సీ వంటివి కూడా చేయించుకుని సమస్య ఏమిటి, ఎక్కడ ఉంది అని తెలుసుకుని దానిని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. - డా‘‘ వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
ములుగు జిల్లాలో మరో అంతుచిక్కని వ్యాధి
సాక్షి, ములుగు: అంతుచిక్కని ఆరోగ్య సమస్యతో జనాలు మరణిస్తున్న సంఘటన ములుగు జిల్లాలో కలకలం రేపుతోంది. అసలేంటో తెలియని ఈ రోగం ఇప్పటికే ఒకే కాలనీకి చెందిన ఆరుగురి ప్రాణాలు బలి తీసుకుంది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉండటం విస్మయపరుస్తోంది. జిల్లాలోని కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి ఎస్సీ కాలనీలో 70 కుటుంబాలు ఉండగా, 20 రోజుల వ్యవధిలో ఆరుగురు మృతి చెందారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. ముందు రోజు జ్వరానికి గురైన వీరంతా కేవలం రెండ్రోజుల్లోనే కడుపు ఉబ్బి చనిపోయారు. ఇప్పటి వరకూ వీరి మరణాలకు కారణాలేంటో తెలియరావట్లేదు. కాలనీకి చెందిన వారు ఒక్కొక్కరుగా మృత్యువాత పడుతుండటంతో మిగతా కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే, కలుషిత నీరే కారణమై ఉండొచ్చని డీఎంహెచ్ఓ అప్పయ్య అనుమానం వ్యక్తం చేశారు. గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, 72 మందికి వైద్యపరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
డయాబెటిస్‌కు.. టెస్టోస్టిరాన్‌కు లింకు!
ఆస్ట్రేలియా: పురుష హార్మోన్ టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్లతో మధుమేహం బారిన పడకుండా నివారించొచ్చా..? అది సాధ్యమే అంటున్నారు ఆస్ట్రేలియాలోని అడిలైడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. సుమారు వెయ్యి మందిపై తాము ప్రయోగాలు నిర్వహించి ఈ అంచనాకు వచ్చామని చెబుతున్నారు. ఈ స్థాయిలో ఇదివరకు ఎన్నడూ ప్రయోగాలు జరగలేదని పేర్కొంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. ఈ పురుష హార్మోన్ స్థాయి తక్కువగా ఉన్న వారు మధుమేహం బారిన పడొచ్చని ఇప్పటికే కొన్ని పరిశోధనలు స్పష్టం చేశాయి. టెస్టోస్టిరాన్ తక్కువగా ఉన్నప్పుడు లైంగిక కోరికలు తగ్గడంతో పాటు కండరాలు బలహీనపడతాయి. ఎముకలు గుల్ల బారడమూ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అడిలైడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధనలు చేశారు. 50 నుంచి 74 ఏళ్ల మధ్య వయసున్న సుమారు వెయ్యి మందిని ఎంపిక చేసి.. రెండు గుంపులుగా విడదీశారు. ప్రయోగాలకు ఎంపికైన వారందరూ అధిక బరువు లేదా ఊబకాయం సమస్యతో బాధపడుతున్న వారే. ఒక వర్గానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్ ఇచ్చారు. వెయ్యి మంది అనుసరించేందుకు కొన్ని వ్యాయామాలను సూచించారు. రెండేళ్ల పరిశీలనల తర్వాత పరిశీలించగా ఇరు వర్గాల్లోని వారు సగటున నాలుగు కిలోల బరువు తగ్గారు. సుమారు 22 శాతం మందిలో ఎర్ర రక్త కణాల సంఖ్య ఎక్కువయ్యాయి. రెండో గుంపు వారిలో 21 శాతం మంది మధుమేహం బారిన పడగా.. టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్లు తీసుకున్న వారిలో 12 శాతం మందికి మాత్రమే మధుమేహం వచ్చింది. హార్మోన్ తీసుకున్న వారి రక్తంలో చక్కెర మోతాదు గణనీయంగా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీన్నిబట్టి మధుమేహం నుంచి తప్పించుకునేందుకు కొంతమందికి టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్లు ఓ మార్గం కావచ్చని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. కొత్త సోలార్ సెల్స్ భలే! ఖరీదైన సిలికాన్‌తో తయారయ్యే సోలార్సెల్స్కు సమర్థమైన ప్రత్యామ్నాయం లభించింది.పెరోవెక్సైట్ అనే వినూత్న పదార్థంతో తయారు చేసిన సరికొత్త సోలార్ సెల్స్ ఏకంగా 30 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నట్లు తాజా పరిశోధనల ద్వారా స్పష్టమైంది. నిజానికి పెరోవెస్కైట్ అనేది ఇటీవలే గుర్తించిన పదార్థమేమీ కాదు. దశాబ్దకాలం కిందటే దీన్ని సౌరశక్తి ఉత్పత్తికి వినియోగించొచ్చని గుర్తించారు. కాకపోతే అప్పట్లో ఈ పదార్థంతో తయారైన సోలార్ సెల్స్ సామర్థ్యం చాలా తక్కువగా ఉండేది. పెరోవెస్కైట్ ప్రత్యేకత ఏంటంటే.. చాలా చౌకగా లభిస్తుంది. దృశ్య కాంతి నుంచి పరారుణ కిరణాల వరకు అన్ని రకాల రేడియోధార్మికతను శోషించుకుని విద్యుత్తుగా మార్చగలదు. సిలికాన్ మాదిరిగా తయారీ కష్టం కాదు. ఎక్కడ కావాలంటే అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో జర్మనీలోని హెల్మ్హోల్ట్ –జెంట్రమ్ శాస్త్రవేత్తలు తయారు చేసిన పెరోవెక్సైట్ సోలార్ సెల్స్ 30 శాతం సామర్థ్యాన్ని సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఐదేళ్ల కింద ఈ సెల్స్ సామర్థ్యం 13.7 శాతం మాత్రం ఉంది. -
భరించరాని నొప్పి.. చెప్పుకోలేని బాధ
సాక్షి, బెల్లంపల్లి: పన్నెండేళ్లపాటు ప్రేమించి, పెళ్లి చేసుకున్న వారి జీవనప్రయాణం పదినెలల్లోనే అర్ధాంతరంగా ముగిసింది. బెల్లంపల్లిలోని సుభాష్‌నగర్‌కు చెందిన మోసం మల్లేష్‌కుమార్ (36), బాబుక్యాంపు బస్తీకి చెందిన నర్మద (28) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్రంగా కలిచివేసింది. నర్మద మందమర్రి గురుకులంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. మల్లేష్ ఓ ప్రైవేట్ టీవీ ఛానల్లో రిపోర్టర్. పెళ్లయిన కొద్ది నెలలకే దంపతులిద్దరికీ అనారోగ్య సమస్యలు ఏర్పడ్డాయి. వాటిని ఎలా భరించాలో తెలియక.. చనిపోదామనే నిర్ణయించుకున్నారు. గురువారం అర్ధరాత్రి దాటాక (12.40 గంటల ప్రాంతంలో) మల్లేశ్ తన సన్నిహితులైన కొందరికి వాట్సాప్ మెసేజ్ చేశాడు. పోచమ్మ చెరువు కట్ట వద్దకు బైక్ వచ్చి అందులో దూకారు. కొద్దిసేపటికి మిత్రులు మెసేజ్ చూసి వారికోసం వెదకడం ప్రారంభించారు. చెరువు కట్ట వద్ద బైక్ కనిపించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం ఉదయం ఏసీపీ ఎంఏ రహమాన్, వన్‌టౌన్ ఎస్హెచ్ఓ రాజు, తహసీల్దార్ కుమారస్వామి గజ ఈతగాళ్లను రప్పించారు. మల్లేశ్ మృతదేహం 11 గంటలకు బయటపడగా.. నర్మద మృతదేహం కోసం గజ ఈతగాళ్లు శ్రమించాల్సి వచ్చింది. చివరకు సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని బయటకు తీయించారు. వారి మృతదేహాలను చూసి ఇరు కుటుంబాలు బోరున విలపించాయి. మిత్రులు, సన్నిహితులు కన్నీరుపెట్టుకున్నారు. చదవండి: (పెళ్లంటూ ఎర... గిఫ్టంటూ టోకరా! ) కలచివేసిన సూసైడ్ నోట్ “నా కుటుంబ సభ్యులను, నా ప్రాణమిత్రులను, అందరిని వదిలి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. రోజురోజుకూ నా ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. రోజు నరకం చూస్తున్న. భరించరాని నొప్పి. చెప్పుకోలేని బాధ. ఈ లోకాన్ని వదిలి వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు. కడుపునొప్పితో రోజూ నరకం చూస్తోంది. ఇలా బతకడం కంటే చావడం మేలని ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. నా నిర్లక్ష్యం, జర్నలిజం వృత్తియే నా అనారోగ్యానికి కారణం అనుకుంటున్న. సమయానికి తినక ఎన్నోసార్లు టెన్షన్‌కి గురయ్యాను. నా ప్రాణమిత్రులు, విలేకరులు నాకుటుంబానికి బాసటగా నిలవాలని వేడుకుంటున్న. అని సూసైడ్ నోట్లో రాసి ఉంది. “అమ్మను, అన్నయ్యను, అక్కలను మంచిగా సూసుకో, నీదే బాధ్యత, నీకు కొడుకుగానో, బిడ్డగానో పుడుత’ అని తన తోబుట్టువు శ్రీనివాస్‌ను ప్రాధేయపడిన తీరు కలిచివేసింది. అలాగే వారు తీసుకున్న అప్పులు.. తమ వద్ద అప్పు తీసుకున్నవారి వివరాలను కూడా అందులో రాసి పెట్టారు. -
లాల్జీ టాండన్ కన్నుమూత
లక్నో/న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్(85) కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో లక్నోలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టాండన్ మంగళవారం ఉదయం కన్నుమూశారని కుటుంబసభ్యులు తెలిపారు. లాల్జీ గుండెపోటుతో చనిపోయినట్లు లక్నోలోని మేదాంత ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. లాల్జీ టాండన్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. లాల్జీ కుమారుడు అశుతోష్ టాండన్ ప్రస్తుతం యూపీలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం లక్నోలోని గులాలా ఘాట్‌లో అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. అంత్యక్రియలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. టాండన్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ తదితరులు సంతాపం ప్రకటించారు. బీజేపీ నేతలు అటల్ బిహారీ వాజ్‌పేయి, అడ్వాణీలకు సన్నిహితుడిగా, పరిపాలనాదక్షుడిగా ఆయనకు పేరుంది. ఏపీ గవర్నర్ విచారం: లాల్జీటాండన్ మృతిపట్ల ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ప్రజాజీవితంలో 50ఏళ్లకుపైగా నిరుపమాన సేవలు అందించారని చెప్పారు. లాల్జీ టాండన్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఏపీ సీఎం జగన్ సంతాపం: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఆకస్మిక మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. యూపీ రాజకీయాల్లో ఆయన సుదీర్ఘకాలం విశేష సేవలు అందించారన్నారు. తెలంగాణ గవర్నర్ సంతాపం: టాండన్ మృతి పట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు అన్నారు. -
మీకు అర్థమవుతోందా...!
సాక్షి, కోల్‌సిటీ(రామగుండం) : మీకు..అర్థమవుతోందా..పొగతాగడం ఆరోగ్యానికి హానికరం.. నో స్మోకింగ్ ప్లీజ్ అని సినిమాహాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రచారం నిర్వహిస్తున్నా ధూమపానం మానడం లేదు జనం. తెరపై చూసిన పొగ రాయుళ్లు సినిమా మధ్యలోనే సిగరేట్ పొగను పీల్చేస్తున్నారు. తెరపై మీరేసుకున్నది మీరేసుకుంటే.. మేం తాగాలనుకున్నది తాగేస్తామంటూ గుప్పు గుప్పుమంటూ పొగలాగేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి యువత ధూమపానాన్ని ఓ ఫ్యాషన్‌గా భావిస్తోంది. ప్రాణాలు తీసే పొగ... ఫ్రెండ్స్‌తో..కాలేజీ రోజుల్లో ప్రారంభమయ్యే సిగరేట్ తాగే అలవాటుకి బీజం పడుతోంది. ఇలా సరదాగా మొదలై..హృదయానికి “పొగ’బెడుతోంది. మొదట్లో సరదాగానే ఉన్నా తర్వాత పొగకు అడిక్ట్ అయిపోతున్నారు. ఒక్కరోజు సిగరేట్ తాగకుంటే ఆ రోజంతా పిచ్చెక్కినట్టుగా, చిరాగ్గా ఉంటోందని చెబుతున్నారు. కొందరైతే రోజుకు ఒక సిగరేట్‌తో మొదలు పెట్టి..క్రమంగా రోజుకో పెట్టె వరకూ పీల్చేస్తుంటారు. ప్రకటనలు ఇస్తున్నా.. అంతే ప్రభుత్వాలు ఎన్ని రకాల ప్రకటనలు ఇస్తున్నా..ఇదొక వినోదంలా మారిపోయింది. ధూమపానం లేని లోకాన్ని చూడగలమా..? అనే సందేహం కలుగుతోంది. బహిరంగ ప్రదేశాల్లో ఎంత నిషేధం విధించినప్పటికీ పొగరాయుళ్లు దర్జాగా సిగరేట్ కాల్చుతూనే ఉన్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా మిలియన్ల కొద్దీ ప్రజలు పొగతాగడం ద్వారా మృత్యువాతకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఏటా పది లక్షల మంది మృత్యువాత... పొగాకు మనుషులకు హాని తలపెట్టే అత్యంత ప్రమాదకరమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పొగ తాగడం ద్వారా ఏటా 10 లక్షల మంది బాధితులు మృత్యువాతకు గురవుతున్నారని అంచనా. పొగాకు నివారణ చర్యలు పాటించకపోతే 2030 నాటికి 10 మిలియన్ వరకు మృతుల సంఖ్య చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. బహిరంగంగానే... యువతలో సిగరేట్ ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. పాశ్చాత్య సంస్తృతికి ఆకర్షితులై “పొగ’కు బానిసవుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగరాదని ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తెచ్చినా ఫలితం లేకుండా పోతోంది. ఆస్పత్రులు, హోటళ్లు, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, క్రీడా మైదానాలతోపాటు బహిరంగ స్థలాల్లో పొగ తాగడం మాత్రం మానడం లేదు. ప్రభుత్వ హెచ్చరికలు ఎంతమాత్రం ఫలితం ఇవ్వలేకపోతున్నాయి. సిగరేట్లు, బీడీలు, అంబార్ తదితర పొగాకుతో కూడిన వస్తువులు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మైనర్లకు కూడా విక్రయించరాదని చట్టంలో ఉంది. కానీ ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. క్యాన్సర్‌కు కారణం పొగ సిగరేట్, బీడీలు, గుట్కా తదితర పొగాకు ఉపయోగించడం గొంతు, ఊపిరిత్తులు, పేగు క్యాన్సర్లు, కిడ్నీ, గుండె జబ్బులు, నోటి దుర్వాసన, పెదవులపై తెల్లపూత, పళ్లు రంగు మారడం తదితర జబ్బులకు గురవుతారని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పుట్టబోయే బిడ్డకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అంగవైకల్యం కలిగే అవకాశం ఉంది. ధూమ ప్రియుల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోవడం, జ్ఞాపకశక్తి మందగించడం సమస్యలు వస్తాయి. గుట్కాలు తీసుకోవడం ద్వారా గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో 20 నుంచి 60 సంవత్సరాలు వయసు మధ్య ఉన్నవారు ఎక్కువగా పొగాకు వాడుతున్నారని అంచనా. జరుగుతున్న మరణాల్లోనూ 90శాతం వరకు పొగాకు వాడిన వారే ఉండడం బాధాకరం. ఆరోగ్యానికి మంచిదికాదు సిగరేట్, బీడీలు, గుట్కా తదితర పొగాకు ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిదికాదు. వీటితో గొంతు, ఊపిరిత్తులు, పేగు, కడుపులో క్యాన్సర్లు, కిడ్నీ, గుండె జబ్బులు, నోటి దుర్వాసన, పెదవులపై తెల్లపూత, పళ్లు రంగు మారడం, నరాల వ్యాధులు, గ్యాస్ట్రబుల్లాంటి జబ్బులకు గురవుతారు. పుట్టబోయే బిడ్డకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అంగవైకల్యం కలిగే అవకాశం కూడా ఉంది. ధూమ ప్రియుల్లో జ్ఞాపకశక్తి మందగించే సమస్యలు వస్తాయి. వీటికి దూరంగా ఉండడం మంచిది. – డాక్టర్ అహ్మద్, గయాసౌదీన్, జనరల్ ఫిజీషియన్, గోదావరిఖని చుక్కేస్తే.. చిక్కులే కరీంనగర్‌క్రైం : మద్యం తాగి వాహనాలతో రోడ్డెక్కితే పోలీసులు చుక్కలుచూపడం ఖాయం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించడమే ఈ సంవత్సరం ప్రధాన లక్ష్యంగా పోలీసులు గట్టిగా కృషి చేస్తున్నారు. ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్న పోలీసుల యంత్రాంగం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఒకవైపు ట్రాఫిక్ వినియోగంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తూ పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. 2018 నుంచి 2020 వరకు 19631 కేసులు నమోదు కాగా 2020 సంవత్సరం జనవరి నుంచి 2354 కేసుల నమోదయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడపొద్దని పోలీసులు సూచించినా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. 23 మంది లైసెన్స్‌లు రద్దు తరచూ మద్యం తాగి పట్టుబడిన వ్యక్తుల లైసెన్స్‌ల రద్దుకు రవాణాశాఖ అధికారులకు పోలీసులు ప్రతిపాదన పంపుతున్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 23 మంది వాహనదారులకు సంబంధించిన లైసెన్స్‌లు 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకూ రద్దు చేశారు. పోలీసులు అన్నివేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతుండడంతో మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా తమ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. క్యూఆర్ కోడ్ విధానం అమలు కూడా ప్రైవేటు వాహనాల డ్రైవర్ల దురుసు ప్రవర్తన, ఇతరత్రా విషయాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి దోహదపడుతోంది. దడపుట్టిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పోలీసులు చేపడుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మందుబాబుల్లో దడపుట్టిస్తున్నాయి. మద్యం తాగి పట్టుబడిన వారందరికీ శిక్షలు పడుతున్నాయి. ఒక రోజు నుంచి మొదలుకొని మోతాదును మించి తాగిన వాహనాలు నడిపిన వారికి మూడునెలల వరకు జైలు శిక్షలు, జరిమానాలు విధిస్తున్నారు. మద్యంతాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురవడంతోపాటు ఎలాంటి సంబంధం లేని పాదాచారులు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. రెండేళ్లుగా జనవరి 2018 నుంచి డిసెంబర్ 2019 వరకు కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 17,277 మంది మద్యం తాగి వాహనాల తనిఖీల్లో పట్టుబడగా ఇందులో 4483 మందికి జైలుశిక్షలు, 8362 జరిమానా విధించారు. జరిమానా రూపంలో రూ.1,78,36,825లు వచ్చింది. జనవరి 2020 నుంచి మార్చి 6 వ తేదీ వరకు 2354 మంది పట్టుబడగా 464 మందికి జైలుశిక్ష, 1132 మందికి జరిమానా విధించారు. రూ.33,67,100లు జరిమానా రూపంలో వచ్చింది. అవగాహన...కౌన్సెలింగ్‌లు.. మద్యంతాగి వాహనాలు నడిపే వారిని నియంత్రించడానికి పోలీసులు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వారికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తూ కోర్టులో హాజరుపరుస్తున్నారు. పోలీసులు రోడ్డు ప్రమాదాలు నివారించాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొంతమంది వాహనదారులు మాత్రం మారడం లేదు. ఆన్లైన్ ద్వారా కేసు నమోదు వాహనాల తనిఖీల సమయంలో బ్రీత్ అనలైజర్ ద్వారా డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో పట్టుబడిన వారు గతంలో డిపార్ట్మెంట్లో తెలిసిన వారితో ఫోన్ చేయిస్తున్నారు. ప్రస్తుతం వాహనదారులకు అలాంటి అవకాశం లేకుండా పరీక్షల్లో పట్టుబడిన వెంటనే వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్, బ్రీత్ అనలైజర్ చూపించిన అల్కాహల్శాతం రిపోర్టు తదితర వివరాలు ఆన్Œలైన్లో నమోదు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. బీఏసీ (బ్లడ్ అల్కాహాల్ కన్సంట్రేషన్) ప్రమాణాల మేరకు ప్రతీ వంద మీటర్ల రక్తంలో 30 మిల్లీ గ్రాములకు మించి మద్యం మోతాదు దాటకూడదు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడిన వాహనం వెంటనే స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించి, తర్వాత చార్జీషీట్ నమోదు చేసి కేసును కోర్టుకు పంపిస్తారు. కేసు తీవ్రతను బట్టి జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. వాహనదారుల భద్రతలో భాగంగా.. వాహనదారుల భద్రత కోసమే డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నాం. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తప్పనిసరి. ప్రమాదాలు సంభవించకముందే వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యంతాగి వాహనాలు నడపడం ద్వారా చాలామంది ప్రమాదాలబారినపడ్డారు. ట్రాఫిక్ రూల్స్‌ను వాహనదారులు బాధ్యతగా పాటించాలి. డ్రంక్ అండ్ డ్రైవ్‌ల నిర్వహణను అన్నివర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు. – విబి.కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ పోలీసు కమిషనర్ -
స్పైరస్ ఎంటరోస్కోపీ అంటే ఏమిటి?
మావారి వయసు 42 ఏళ్లు. కొన్నేళ్లుగా తరచూ కడుపునొప్పితో బాధపడుతున్నారు. తీవ్రమైన నీరసం, మలంతో పాటు రక్తం కారడం జరుగుతుండటంతో మాకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించాం. వారు సిటీలో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలవమన్నారు. హైదరాబాద్‌లో చూపిస్తే అక్కడ కొన్ని పరీక్షలు చేసి, చిన్న పేగుల్లో సమస్య ఉందని చెప్పారు. కాప్సూ్యల్ ఎండోస్కోపీ కూడా చేశారు కానీ ఫలితం లేదు. చిన్నపేగులో క్యాన్సర్ లేదా పాలిప్ ఉండవచ్చని అంటున్నారు మావారికి ఉన్న ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఎంటిరోస్కోపీ అనే పరీక్ష వీలుకాదనీ, స్పైరస్ ఎంటిరోస్కోపీ అవసరమనీ, దాంతో అటు పరీక్ష, ఇటు చికిత్స... రెండూ జరుగుతాయని చెప్పారు. మాకెంతో ఆందోళనగా ఉంది. ఆ పరీక్ష/చికిత్స గురించి వివరాలు చెప్పండి. ‘స్పైరస్ ఎంటిరోస్కోపీ’ అనేది కూడా ఒక రకమైన ’ఎండోస్కోపీ’ పరీక్ష లాంటిదే. ఇది చిన్నపేగును పరీక్షించేందుకు ఉపకరించే ఓ ప్రభావవంతమైన పరీక్షాసాధనం. మన జీర్ణవ్యవస్థ సరిగా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. అది సరిగా పనిచేయకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. మీవారిలాగే చాలామంది కడుపునొప్పితో ఏళ్లతరబడి బాధపడుతూ కూడా... తమకు ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల లేదా మరో కారణం వల్ల ఇలా జరుగుతోందం టూ చిట్కావైద్యాలు చేసుకుంటూ చాలా అశ్రద్ధ చేస్తుంటారు. కానీ ఏళ్ల తరబడి తరచూ కడుపునొప్పి వస్తుంటే తప్పక డాక్టర్ చేత పరీక్ష చేయించుకుని, తగిన సలహా / చికిత్స తీసుకోవాలి. మీవారికి మలంతో పాటు రక్తం రావడమనే లక్షణంతో పాటు, నీరసంగా ఉండటం అనేది చిన్నపేగుల్లోని సమస్యను సూచిస్తోంది. సాధారణంగా కడుపులో సమస్య ఉంటే ‘ఎండోస్కోపీ’ అనే పరీక్ష ద్వారా నోరు, అన్నవాహిక నుంచి జీర్ణాశయం వరకు ఉన్న సమస్యలను తెలుసుకోవచ్చు. మలద్వారం గుండా చేసే ‘కొలనోస్కోపీ’ పరీక్ష ద్వారా పెద్దపేగుకు ఏవైనా సమస్యలుంటే తెలుసుకోడానికి వీలవుతుంది. అయితే చిన్నపేగుల్లో ఉండే ప్రధాన సమస్యలను గుర్తించాలంటే ప్రత్యేకమైన ఎండోస్కోపీ చేయాల్సి ఉంటుంది. అందులో క్యాప్సూల్ ఎండోస్కోపీ ఒకటి. అయితే మీవారి విషయంలో ఆ పరీక్ష చేసినా ఫలితం రాలేదని రాశారు. సాధారణంగా క్యాప్సూల్ ఎండోస్కోపీతో మొత్తం జీర్ణవ్యవస్థలో ఉండే అన్ని అవయవాల సమస్యలూ తెలుసుకోవచ్చు. ఒక్కోసారి క్యాప్సూల్ వెళ్లే మార్గంలో ఏ భాగమైనా మూసుకుపోతే అక్కడ క్యాప్సూల్ ఇరుక్కుపోతుంది. మీవారి విషయంలో ఇదే జరిగి ఉంటుంది. ఇది కాకుండా చిన్నపేగులో మాత్రమే ఉండే సమస్యలను తెలుసుకోడానికి చేసే మరో పరీక్షే ‘ఎంటిరోస్కోపీ’. బెలూన్ సహాయంతో చేసే ఈ పరీక్ష కొంతమందికి సూట్ కాదు. టైమ్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. మీవారిలాగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ పరీక్ష వీలుకాదు. అందుకే మీవారికి పవర్ స్పైరస్ ఎంటిరోస్కోపీ అనే పరీక్షను సూచించి ఉంటారు. ఇది చాల సరళమైన, సురక్షితమైన, ప్రభావవంతమైన వైద్యపరీక్ష. చాలా తక్కువ సమయంలోనే దీన్ని చేయవచ్చు. ఈ ఎండోస్కోపీలో బెలూన్‌కు బదులు ఓవర్ట్యూబ్ను ఉపయోగిస్తారు. ఈ ఓవర్ట్యూబ్ సహాయంతో చిన్నపేగులోని మొత్తం దృశ్యాలను క్యాప్చర్ చేసి అక్కడి సమస్యలను స్పష్టంగా రికార్డు చేయవచ్చు. సాధారణ ఎంటిరోస్కోపీకి మూడు గంటల సమయం పడితే దీన్ని కేవలం గంటలోనే పూర్తిచేయవచ్చు. ఈ పవర్ స్పైరస్ ఎంటిరోస్కోపీతో కేవలం పరీక్ష మాత్రమే కాకుండా, చికిత్స కూడా చేయవచ్చు. దీంతో చాలా ప్రొసిజర్లను చేసి, చాలా సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని కూడా అందించవచ్చు. ఈ విధానంలో రోగికి అనస్థీషియా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ చిన్నపేగుల్లో ట్యూమర్గానీ, పాలిప్స్గానీ, పుండుగానీ ఉన్నట్లయితే వాటిని తొలగించి, మంచి చికిత్స అందించవచ్చు. చిన్నపేగులో ఎక్కడైనా మూసుకుపోతే, ఆ ప్రదేశంలో దీనిసాయంతో వెడల్పు చేయవచ్చు. డాక్టర్‌కు కూడా ఇది చాలా సౌకర్యవంతంగా, చికిత్స చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఒక్కోసారి సీటీ, ఎమ్మారైలలో కూడా కనుగొనలేని (మిస్ అయ్యే) సూక్ష్మసమస్యలను సైతం ఈ పరికరంతో గుర్తించి చికిత్స అందించడం సాధ్యమవుతుంది. మీవారి విషయంలో డాక్టర్లు క్యాన్సర్ లేదా పాలిప్స్‌ను అనుమానిస్తున్నారని మీరు రాశారు. ఆ రెండు సందర్భాల్లోనూ ఈ స్పైరస్ ఎంటిరోస్కోపీతో చాలా సమర్థమైన చికిత్సను అందించే అవకాశం ఉంది. దీనితో ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి మీరు ఎలాంటి భయాలు, ఆందోళనలు పెట్టుకోకుండా మీవారికి అవసరమైన చికిత్స చేయించండి. డాక్టర్ బి. రవిశంకర్, డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్. -
సెల్‌ఫోన్ వల్ల బొటనవేలి నొప్పి!
ప్ర: నేను స్మార్ట్‌ఫోన్‌ను చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంటాను. బ్యాంకింగ్ వ్యవహారాలకూ, ఆఫీస్ కమ్యూనికేషన్స్ వేగంగా టైప్ చేయడంతో పాటు చాలా కీస్ నా బొటనవేలితో నొక్కుతుంటాను. ఈమధ్య ఆ వేలు చాలా నొప్పిగా ఉంటోంది. సెల్‌ఫోన్ ఎక్కువగా వాడటం వల్లనే వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఇదేమైన సమస్యా? నా బొటనవేలి నొప్పి తగ్గడానికి మార్గాలు చెప్పండి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ బొటనవేలి నొప్పికి మీ సెల్‌ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించడమే కారణమనిపిస్తోంది. మీరు బ్లాక్‌బెర్రీ థంబ్ లేదా గేమర్స్ థంబ్ అనే కండిషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీన్నే వైద్యపరిభాషలో ‘డీ–క్వెర్‌వెయిన్ సిండ్రోమ్ అని అంటారు. మనం మన స్మార్ట్ ఫోన్‌ను వాడేటప్పుడు బొటనవేలిని మాటిమాటికీ ఉపయోగిస్తుంటాం. దాంతో బొటనవేలి వెనకభాగంలో ఉన్న టెండన్ ఇన్ఫ్లమేషన్కు గురై వాపు వస్తుంది. మళ్లీ అదేపనిగా దాన్ని ఉపయోగించడం వల్ల ఆ గాయం మళ్లీ మళ్లీ తిరగబెడుతుంటుంది. ఫలితంగా ఈ సమస్య వస్తుంది. మీలా సెల్‌ఫోన్‌ను చాలా ఎక్కువగా వాడేవారు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ తరహా నొప్పిని చాలావరకు నివారించుకోవచ్చు. ఆ జాగ్రత్తలివే... ►టైపింగ్ లేదా టెక్ట్స్ మెటీరియల్ పంపడం కోసం ఒక బొటన వేలినే కాకుండా ఇతర వేళ్లను కూడా మార్చి మార్చి ఉపయోగిస్తూ బొటనవేలిపై పడే భారాన్ని తగ్గించడం. ►ఫోన్‌ను ఒక చేత్తో పట్టుకొని మరో చేతి బొటనవేలిని ఉపయోగించే బదులు, దాన్ని ఒక ఉపరితలం మీద పెట్టి ఇరుచేతుల వేళ్లను మార్చి ఉపయోగిస్తూ ఉండటం. ►మణికట్టును చాలా రిలాక్స్‌గా ఉంచి వీలైనంత వరకు మణికట్టుపై భారం పడకుండా చూడటం. ►మీ స్మార్ట్‌ఫోన్‌ను ఒళ్లో పెట్టుకొని ఉండకుండా, కాస్త ఛాతీ భాగం వద్ద ఉండేలా చూసుకోవడం. ఒళ్లో పెట్టుకోవడం వల్ల కంటి మీద, ఒంగి స్క్రీన్ చూస్తూ ఉండటంతో మెడ మీద భారం పడుతుంది. అదే ఫోన్‌ను ఛాతీ వద్ద పెట్టుకుంటే అన్నివిధాలా సౌకర్యంగా ఉంటుంది. ►ఫోన్‌ను శరీరానికి ఏదో ఒక వైపున ఉంచకుండా మధ్యన ఉంచడం. దీని వల్ల శరీరం అసహజ భంగిమలో ఒంగకుండా బ్యాలెన్స్‌తో ఉంటుంది. ఇక ఈ జాగ్రత్తలతో పాటు మరికొన్ని జాగ్రత్తలూ అవసరం. అవి... ►ఫోన్ ఉపయోగించే సమయాన్ని సాధ్యమైనంతగా తగ్గించడం. ►పొడవు పొడవు వాక్యాలు కాకుండా అర్థమయ్యేరీతిలో షార్ట్‌కట్స్ వాడుతూ బొటనవేలి ఉపయోగాన్ని తగ్గించడం. దీనివల్ల మీ బొటనవేలు, ఇతర వేళ్లు, మణికట్టుపై భారం తగ్గుతుంది. ►‘ఐ యామ్ ఇన్ మీటింగ్’ లాంటి కొన్ని రెడీమేడ్ వాక్యాలు ఉంటాయి. వాటి సహాయం తీసుకుంటే టైపింగ్ బాధ తగ్గడంతో పాటు, సమయమూ ఆదా అవుతుంది. ►ఎవరిపేరునైనా కనుగొనాలంటే పూర్తిగా స్క్రీన్ స్క్రోల్ చేస్తుండే బదులు షార్ట్‌కట్స్ ఉపయోగించడం ద్వారా సమయాన్నీ, బొటనవేలి ఉపయోగాన్నీ తగ్గించవచ్చు. ►అదేపనిగా ఫోన్ ఉపయోగించే వారు... ప్రతి 15 నిమిషాల్లో కనీసం 2–3 నిమిషాల పాటు మీ బొటనవేలికి విశ్రాంతినివ్వాలి. అప్పటికీ మీ సమస్య తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించండి. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
వేర్వేరు అవయవాలపై ఒత్తిడి ప్రభావం అధిమించండి
మీరు బాగా ఒత్తిడిలో ఉన్నారా? ఆ విషయం మీ శరీరం ద్వారానూ మీకు స్పష్టంగా తెలుస్తోందా? ఎందుకంటే దాని ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. మానసిక ఒత్తిడి తీవ్రమైనప్పుడు కొందరిలో తలనొప్పి రావచ్చు. మరికొందరిలో ఛాతీ బరువుగా ఉన్నట్లు అనిపించవచ్చు. ఇలా తల మొదలుకొని, పాదాల వరకు రకరకాల అవయవాల్లోని ఇబ్బందులు రకరకాల రూపాల్లో వ్యక్తమవుతాయి. మానసిక ఒత్తిడి మీలోని ఏ అవయవాన్ని ఎలా ప్రభావితం చేసి, ఏయే లక్షణాలను కనబరుస్తోందో... దాన్ని బట్టి ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఏం చేయాలో తెలుసుకోండి. ఇవి చాలా తేలికైనవి. అనుసరించి చూడండి. రిలాక్స్ అవ్వండి. తల, మెడ భాగాల్లో కొందరిలో ఒత్తిడి వల్ల తల గట్టిగా పట్టేసినట్లుగా అనిపిస్తుంది. నుదురు ముడుచుకుపోతుంది. ఆ తర్వాత సన్నగా తలనొప్పి మొదలై తీవ్రం కావచ్చు. మరికొందరిలో తెలియని భారమంతా తమ భుజాలపైన ఉన్నట్లుగానూ, ఆ బరువు తమను కుంగదీస్తున్నట్లుగానూ ఉండవచ్చు. మెడ, భుజాల కండరాలు గట్టిగా పట్టేసినట్టు అనిపించవచ్చు. ఇది తగ్గాలంటే కొన్ని చిట్కాలివి... ►మొదట కుర్చీలో హాయిగా, సౌకర్యంగా కూర్చుని రిలాక్స్ అవ్వండి. చేతులు, కాళ్లు రిలాక్స్డ్గా ఉంచాలి. ►మీ ముఖాన్ని కుడి భుజం వైపుకు, మళ్ళీ ఎడమ భుజం వైపు తిప్పాలి. ఆ తర్వాత పైకీ, ఆ వెంటనే కిందకు వంచాలి. ఇలా ఐదు సార్లు చేయాలి. ►మీ తలను మొదట ఎడమ భుజం వైపు తర్వాత ఛాతీ వైపుకు, అక్కడి నుంచి కుడి భుజం వైపుకు ఇలా గుండ్రంగా తిప్పాలి. ఆ తర్వాత మళ్లీ నెమ్మదిగా వ్యతిరేక దిశలో తిప్పాలి. ఇలా ఐదు సార్లు చేయాలి. ►నోటిని పెద్దగా తెరవాలి, కళ్ళను రెప్పలతో గట్టిగా నొక్కిపెట్టాలి. నోటితో గట్టిగా అరుస్తున్నట్టుగా నోరు తెరవాలి. కానీ ఎలాంటి శబ్దం చేయకూడదు. అలా విశాలంగా నోరు తెరచి గాలిని బాగా పీల్చాలి. మీకు బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. ఛాతి: ఒత్తిడి కారణంగా ఛాతీ చాలా బరువుగా ఉన్నట్లు అనిపించడం, శ్వాస గుండెల నిండా పూర్తిగా తీసుకోలేకపోవడం, ఏదో ఇబ్బందిగా ఉన్నట్టు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే ఈ కింది విధంగా చేయండి. ►రిలాక్స్డ్గా కూర్చోవాలి. ఆ సమయంలో నడుమును నిటారుగా ఉంచాలి. ►కళ్ళు మూసుకుని మీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ►ఐదు వరకు అంకెలు లెక్కపెడుతూ నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. అలాగే మళ్లీ ఐదు అంకెలు లెక్కపెడుతూ శ్వాసను నెమ్మదిగా బయటకు వదిలేయాలి. ►వీలైతే శ్వాస లోపలికి తీసుకుంటున్నప్పుడు ఉదరాన్ని బయటకు పెట్టాలి. అలాగే శ్వాసను వదలుతున్నప్పడు ఉదరాన్ని లాగినట్టుగా లోపలికి తీసుకోవాలి. ►ఇప్పుడు మీ ఉచ్ఛాస్వ–నిశ్శాస్వలను లెక్కించండి. ఈ లెక్కపెట్టడం రివర్స్‌లో జరగాలి. మీకు సమయం ఉంటే 60 నుంచి వెనక్కి సున్న వచ్చేంత వరకూ, సమయం లేకపోతే కనీసం 20 సంఖ్య నుంచి వెనక్కి సున్న వచ్చేంత వరకూ లెక్కించాలి. శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు ఒక అంకె, శ్వాస వదిలినప్పుడు తర్వాత అంకె... ఇలా సున్న వరకు లెక్కించి, సున్న తర్వాత కళ్ళు తెరవాలి. ఛాతీ, మొండెం భాగాల్లో మీరు ఒత్తిడికి గురయ్యినప్పుడల్లా మీరు ఎలా నుంచున్నారో లేదా కూర్చొని ఉన్నారో మీ పోశ్చర్‌ను ఒకసారి గమనించుకోండి. సాధారణంగా ఒత్తిడి తీవ్రమైనప్పుడు చాలామంది ఒంగిపోయి, తల ఒంచుకుని ఉంటారు. ఇది మీ వెన్ను మీద ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ కింది చిట్కాలు పాటించి ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ►మొదటగా మీకు తెలిసిందే... తలవంచుకుని లేదా తలవాల్చి ఉండవద్దు. నిటారుగా కూర్చోండి. ►ఎక్కువ సేపు కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉండేవారు ప్రతి అరగంటకి ఒకసారి లేచి నిలబడి అక్కడికక్కడే ఒకటిరెండు నిమిషాలు నడవండి. ►నడుం నొప్పి వచ్చేవారికి భుజంగానసం చాలా బాగా పనిచేస్తుంది. కాళ్లు... పాదాలపై చాలామందిలో ఒత్తిడి తమ పాదాలపై ప్రభావం చూపుతుంది. మరీ ఒత్తిడికి గురైన చాలామందిలో పిక్కలు పట్టేయడం, కాళ్ల కండరాలు పట్టేయడం (మజిల్ క్రాంప్స్) కనిపిస్తాయి. ఒత్తిడి వల్ల కాళ్లు, పాదాలు ప్రభావితమయ్యేవారు ఈ కింది టిప్స్ పాటించాలి... ►కాళ్ళను కాస్తంత ఎత్తు మీద పీటలాంటిదానిపై పెట్టి ఉంచండి. ►మీ కాళ్ళను స్ట్రెచ్ చేసి మీ పాదాలను మీ వైపు తీసుకురావడానికి ప్రయత్నించండి, అలాగే దానికి వ్యతిరేక దిశలో మళ్లీ స్ట్రెచ్ చేయండి. ►నిలబడి గాని, కూర్చునిగాని ఒక కాలిని పైకి లేపి మడమను గుడ్రంగా రొటేట్ చేస్తున్నట్లుగా తిప్పాలి. మొదట కుడివైపుకు, తర్వాత ఎడమవైపుకు తిప్పాలి. రెండుకాళ్లతో ఇలా ఐదుసార్లు చేయాలి. ►పెడిక్యూర్ చేయడం /పాదాల మసాజ్ వల్ల కూడా పాదాలపై ఒత్తిడి తగ్గుతుంది. అదనంగా... ►పైన పేర్కొన్న వాటన్నింటితో పాటు టెన్నిస్, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, హాకీ లేదా క్రికెట్ వంటి ఆటలు కూడా ఆడుతుండటం మంచిది. ►ప్రతి రోజు ఒక గంట ఎరోబిక్స్ చేయడం మంచిది. టీవీ చూస్తూ డ్యాన్స్ కూడా చేయవచ్చు. ►వాకింగ్, జాగింగ్, స్విమింగ్ వీటిలో ఏదో ఒకటి రోజుకు గంట పాటు చేయాలి. వీటన్నింటి వల్ల మన గుండె , ఊపిరితిత్తులు, రక్తకణాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. కండరాలు, కీళ్ళు గట్టిపడతాయి. దేహమంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఎండార్ఫిన్స్ వంటి మంచి హార్మోన్లు విడుదలయ్యి అవి ఒత్తిడిని కలిగించే రసాయనాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. కళ్లు ఒత్తిడి బాగా ఉన్నప్పుడు కొందరిలో కళ్లు నొప్పిగా ఉండటం, కళ్లు లాగినట్లు అనిపించడం, కళ్ల వెంట నీరుకారడం జరుగుతుంది. టీవీ, మొబైల్స్ ఎక్కువగా వాడటం, కంప్యూటర్‌పై ఎక్కువగా పనిచేయడం వల్ల కూడా కళ్లపై ఒత్తిడి పడి ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఈ కింది సూచనలు పాటించండి. ►ప్రతి గంటకోసారి కళ్లను గట్టిగా కాకుండా, మృదువుగా మూసుకొని... కళ్లపై మునివేళ్లతో నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఇది గుండ్రంగా చేయాలి. తొలుత క్లాక్‌వైజ్‌గా ఐదుసార్లు, ఆ తర్వాత యాంటీక్లాక్‌వైజ్‌గా మరో ఐదుసార్లు చేయాలి. ►కళ్లకు ఆహ్లాదంగా ఉండే రంగు (సూదింగ్ కలర్) లైట్ గ్రీన్. కాబట్టి కిటికీలోంచి పచ్చటి చెట్లను చూడవచ్చు. లేదా కంప్యూటర్ మానిటర్ పక్కన ఇన్డోర్ ప్లాంట్స్ పెట్టుకొని చూస్తుండటం కూడా మంచి పద్ధతి. ►కంప్యూటర్ / మొబైల్ ఫోన్స్‌లో రీడింగ్ మోడ్‌లో ఉంచి చదవడం మంచిది. ►రోజూ రాత్రి పడుకునే ముందు కళ్లమీద తాజానీటిలో ముంచిన తడిగుడ్డ కాసేపు ఉంచుకోవడంమంచిది. వీటన్నింటివల్ల ప్రయోజనం కనిపించినప్పుడు ఒకసారి కంటి డాక్టర్‌ను సంప్రదించి తమ ఐ–సైట్ చెక్ చేయించుకోవాలి. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
కాళ్ల వాపులు కనిపిస్తున్నాయా?
కొంతమంది పెద్దవయసువారు తమ కాళ్లపై కాస్తంత నొక్కుకుని పరిశీలనగా చూసుకుంటూ ఉంటారు. అలా నొక్కగానే కొద్దిగా గుంట పడ్డట్లుగా అయి... అది మళ్లీ క్రమంగా నెమ్మదిగా పూడుకుపోయి మామూలు స్థితికి వస్తుంది. ఇది చాలామందిలో కనిపించే సాధారణ సమస్య. చాలావరకు హానిలేనిదే అయినా కొన్నిసార్లు ఈ కాళ్లవాపు లోపల ఉన్న ప్రమాదకరమైన పరిస్థితికి ఒక సంకేతం కావచ్చు. రెండు కాళ్లలోనూ వాపు కనిపిస్తే అది మూత్రపిండాలు, కాలేయం, హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలకు సూచన కావచ్చు. అదే ఒకే కాలిలో వాపు ఉంటే అది ఫైలేరియాసిస్లాంటి సమస్యకు సంకేతం కావచ్చు. కాళ్లవాపులపై అవగాహన పెంచుకునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం. కాళ్లలో నొక్కిన చోట గుంట పడి, అది మెల్లగా సర్దుకోడాన్ని సాధారణ పరిభాషలో ‘పిట్టింగ్’ అంటారు. ఇదే సమస్యను వైద్యపరిభాషలో ‘ఎడిమా’ అని చెబుతారు. సాధారణంగా పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్యకు అనేక కారణాలుంటాయి. మనమందరమూ సాధారణంగా ఈ తరహా కాళ్లవాపును మన జీవితంలోని ఏదో ఒక దశలో గమనించే ఉంటాం. అన్నిటికంటే సాధారణమైన దేమిటంటే చాలా దూరం కూర్చుని ప్రయాణం చేయడం వల్ల చాలామందిలో కాళ్లవాపు వస్తుంటుంది. ఇది నిరపాయకరం. కాసేపట్లో తగ్గిపోతుంది. కానీ కొన్ని సమస్యలు అంత సింపుల్‌గా ఉండవు. ఈ సమస్యకు గల కారణాలేమిటో చూద్దాం. నిర్ధారణ పరీక్షలు ►సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) ►యూరిన్ స్పాట్ ప్రోటీన్ / కియాటినిన్ రేషియో ►బ్లడ్ యూరియా క్రియాటినిన్ లివర్ ఫంక్షన్ పరీక్ష 2–డీ ఎకో కార్డియోగ్రామ్ టీ3, టీ4, టీఎస్‌హెచ్ ►అల్ట్రా సౌండ్ హోల్ అబ్డామిన్ ►వీనస్ డాప్లర్ ఆఫ్ ద లెగ్స్ ►నైట్ స్మియర్ ఫర్ మైక్రోఫైలేరియా లాంటి పరీక్షలతో పాటు, డీడైమర్ అనే పరీక్షను కాళ్ల వాపులు ఉన్నవారిలో చేయించాల్సి ఉంటుంది. చికిత్స రెండు కాళ్లూ వాచినప్పుడు... సాధారణంగా కాళ్ల వాపు వచ్చిన అన్ని సందర్భాల్లోనూ ఒకేలాంటి నిర్దిష్టమైన చికిత్స ఉండదు. కారణాన్ని బట్టి చికిత్స మారుతుంది. అందుకే ముందుగా పరీక్షలు చేయించి కాళ్ల వాపుకు కారణాన్ని కనుగొనాల్సి ఉంటుంది. ►మూత్రపిండాల సమస్యలో: ఇమ్యునోసప్రెసెంట్స్, డైయూరెటిక్స్ వంటి మందులు. ►కాలేయ సమస్య అయితే : స్పైరనోలాప్టోన్ అనే మందులు. ►గుండెకు సంబంధించిన సమస్యలో : అయనోట్రోపిక్స్, డైయూరెటిక్స్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. ►హైపోథైరాయిడిజమ్‌లో : థైరాక్సిన్ అనే హార్మోన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకే కాలి వాపునకు చికిత్స ►ఫైలేరియాసిస్‌లో: డై ఇథైల్ కార్బోమైసిన్ను సాధారణంగా ఉపయోగిస్తారు. ►వేరికోస్ వెయిన్స్ : నిర్దిష్టంగా మందులు ఉండవు. అయితే కాళ్లకు తొడిగే తొడుగు (స్టాకింగ్స్) వల్ల ఈ సమస్యను నియంత్రణలో ఉంచవచ్చు. అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స చేయించాల్సి రావచ్చు. ►వీనస్ ఇన్సఫిషియెన్సీ : ఈ సమస్యకు కూడా నిర్దిష్టంగా చికిత్స ఉండదు. అయితే ప్రత్యేకమైన ఎలాస్టిక్ తొడుగుల ద్వారా కాళ్ల వాపును అదుపు చేయవచ్చు. ఒకవేళ కాళ్ల వాపు మరీ ఎక్కువగా ఉంటే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ►సెల్యులైటిస్ : ఈ సమస్య వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని రకాల కాళ్ల వాపుల విషయంలో ఈ సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలి. 1. ఆహారంలో ఉప్పు తగ్గించాలి. 2. చాలాసేపు అదేపనిగా కూర్చోవడం, నిలబడటం తగ్గించాలి. 3. రాత్రివేళల్లో కాళ్లను ఎత్తుగా తలగడపై విశ్రాంతిగా ఉంచాలి. 4.అవసరాన్ని బట్టి ఎలాస్టిక్ స్టాకింగ్స్ వాడాలి. ఈ అవగాహన కల్పించుకుని కాళ్లవాపు తరచూ వస్తుంటే వైద్యుణ్ణి సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. తెలుసుకోవాల్సిన కారణాలివే ►రెండు కాళ్లకూ నీరొస్తుంటే... ఈ కింది సమస్యలు ఉండే అవకాశం ఉంది. ►గుండె సమస్యలు : హార్ట్ ఫెయిల్యూర్ వంటి గుండెకు సంబంధించిన సమస్యలున్నప్పుడు ఇలా కాళ్లపై నీరు రావడం చాలా మామూలే. ►కాలేయ సమస్యలు : సిర్రోసిస్ ఆఫ్ లివర్ వంటి కాలేయ సమస్య ఉన్నప్పుడు ►కిడ్నీ సమస్యలు : నెఫ్రోటిక్ సిండ్రోమ్, గ్లామరూలో నెఫ్రైటిస్ వంటి మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారిలో ►హైపోథైరాయిడిజం : మహిళల్లో సాధారణంగా కనిపించే ఈ సమస్యలో కాళ్ల వాపు అనేది నీరుపట్టడం వల్ల జరగదు. కానీ... ‘ప్రీటిబియల్ మిక్స్ ఎడిమా’ అనే తరహా కాళ్లవాపు కనిపిస్తుంది. ఇది గ్రేవ్స్ డిసీజ్ అనే థైరాయిడ్ సమస్యలో కనిపిస్తుంది. ►పోషకాహార లోపాలు : ఆహారంలో తగినంతగా ప్రోటీన్లు తీసుకోకపోవడం (హైపో ప్రోటీనీమియా), బెరిబెరీ వంటి పోషకాహార లోపాలు ఉండటం ►కొన్ని రకాల మందుల వల్ల : కొన్ని రకాల హైబీపీ మందుల వల్ల (క్యాల్షియమ్ ఛానెల్ బ్లాకర్స్), డయాబెటిస్‌కు వాడే మందులు (పయోగ్లిటజోన్స్), నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్ ఎన్ఎస్ఏఐడీస్) వాడే వారిలోనూ, స్టెరాయిడ్స్ (గ్లూకో కార్టికాయిడ్స్), అసిడిటీకి వాడే మందుల (ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్)... వల్ల కాళ్లవాపు కనిపించవచ్చు. ►ఎలాంటి కారణాలు లేకుండా : కొంతమందిలో నిర్దిష్టంగా ఎలాంటి కారణం లేకుండానే కాళ్లవాపులు రావచ్చు. ముఖ్యంగా పిల్లలను కనే వయసులోని మహిళల్లో ఇది కనిపించడం చాలా సాధారణం. దీన్ని ఇడియోపాథిక్ సైక్లిక్ అడిమా అంటారు. ఒకే కాలిలో వాపు వస్తుంటే... 1 ఫైలేరియాసిస్: క్యూలెక్స్ దోమకాటు వల్ల వచ్చే వాపు. 2 వేరికోస్ వెయిన్స్ : కాళ్లపై ఉండే రక్తనాళాల్లోని (సిరలు) కవాటాలు పనిచేయకపోవడం వల్ల నరాలు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. ఇలాంటప్పుడు కూడా ఏదో ఓ కాలిపై వాపు రావచ్చు. 3 డీప్ వెయిన్ థ్రాంబోసిస్ : రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఈ సమస్య వస్తుంది. 4 వీనస్ ఇన్సఫిషియెన్సీ : కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం... తాను పయనించాల్సిన మార్గంలో ప్రయాణం చేయకపోవడం వల్ల వచ్చే సమస్య ఇది. 5 సెల్యులైటిస్ : కాళ్ల చర్మంలోని డెర్మల్, సబ్‌క్యుటేనియస్ అనే పొరలలో ఉండే కనెక్టివ్ టిష్యూలో సమస్యల వల్ల ఈ వాపు వస్తుంది. ఇతర సమస్యల కారణంగా... ►పోషకాహార లోపాల్లో : ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ►ఏదైనా మందుల వల్ల కాళ్ల వాపు వస్తే... పేషెంట్ వాడుతున్న నొప్పినివారణ మందులు, హైబీపీ మందులు, స్టెరాయిడ్స్ నిలిపివేసి, వాటికి బదులుగా ఇతర మందులు మార్చాలివస్తుంది. ►ఏ కారణం లేకుండా వచ్చే వాపు : ఇది ఏ కారణం లేకుండా వచ్చే ఇడియోపథిక్ సైక్లిక్ ఎడిమా అయితే ఎలాంటి మందులు వాడనవసరం లేదు. దానంతట అదే తగ్గిపోతుంది. ఒకవేళ అప్పటికీ తగ్గకపోతే కొద్ది రోజుల పాటు (షార్ట్ కోర్స్) డైయూరెటిక్స్ వాడవచ్చు. ►ప్రయాణంలో వచ్చే వాపులు... వీటికి ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేదు. కాస్త ఎత్తుగా ఉండేలా తలగడపై కాళ్లు పెట్టుకోవడంతో కాళ్ల వాపు తగ్గుతుంది. అరికాళ్లను ప్రతి అరగంటకోసారి గుండ్రంగా తిప్పుతున్నట్లుగా (రొటేటింగ్ మోషన్లో) చేయాలి. ప్రయాణంలో ఉన్నప్పటికీ ప్రతి గంటకోసారి కాస్తంత లేచి అటు ఇటు నడవాలి. బస్‌లోనో లేదా రైల్లోనో ఉన్నప్పటికీ ఈ పని చేయాలి. ఫ్లైట్స్‌లో యూఎస్ వంటి దూరప్రాంతాలకు వెళ్లేవారిలో ఇది మరీ ముఖ్యం. ఇలా తప్పక నడవాల్సిందేనంటూ డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. డాక్టర్ టి.ఎన్.జె. రాజేశ్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ ఇంటర్నల్ మెడిసిన్ – ఇన్ఫెక్షియస్ డిసీజెస్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఆ ప్రోటీన్‌తో దీర్ఘాయుష్షు?
వయసు పెరిగే కొద్దీ మన శరీర కణాల్లో సత్తువ సన్నగిల్లుతుంది. విషతుల్యమైన పదార్థాలు ఎక్కవ అవుతూంటాయి. ఫలితంగా జబ్బులు, ఇతర ఆరోగ్య సమస్యలు. ఈ విషయం మనకందరికీ తెలుసు. కానీ శరీరంలో పెరిగిపోయే విషపదార్థాలు ఎప్పటికప్పుడు నాశనమైపోతూంటే? అబ్బో.. అద్భుతమైన ఆరోగ్యం మన సొంతం అవుతుంది. అయితే ఈ అద్భుతాన్ని సాధించడం ఎలా? స్టాన్‌ఫర్డ్ బర్న్‌హామ్ ప్రీబిస్ మెడికల్ డిస్కవరి ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఓ మార్గం కనుక్కున్నారు. మనుషుల్లో కాదుగానీ.. కొన్ని రకాల పురుగులు ఒక ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా ఎక్కువ కాలం బతుకుతున్నట్లు వీరు గుర్తించారు. పీ62 అని పిలుస్తున్న ఈ ప్రొటీన్ విషతుల్యమన కణ ప్రొటీన్లను గుర్తించి నాశనమయ్యేలా చేస్తూండటం దీనికి కారణం. కణాల్లోని చెత్త చెదారాన్ని తొలగించేందుకు ఉన్న ఆటోఫేగీ వ్యవస్థను బలోపేతం చేస్తే జీవితకాలం పెరుగుతుందని ఇప్పటికే చాలా పరిశోధనలు రుజువు చేశాయని ఈ ప్రొటీన్ ద్వారా ఆటోఫేగీ బలోపేతమవుతోందని మెలేన్ హాన్సెన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. నిన్నమొన్నటివరకూ శాస్త్రవేత్తలు ఈ కణ రీసైక్లింగ్ శరీరం మొత్తమ్మీద ఒకేలా ఉంటుందని అంచనావేశారుగానీ.. పీ62 ప్రొటీన్ వాడకం మొదలుకొని కొన్ని ఇతర పద్ధతులు కూడా ఉన్నాయని తాజా పరిశోధన ద్వారా తెలిసింది. పీ62 కణాల్లోని మైటోకాండ్రియా, విషతుల్యమైన ప్రొటీన్లను రీసైకిల్ చేసేందుకు తరలిస్తాయని మెలేన్ వివరించారు. ఈ పరిశోధన ద్వారా అల్జైమర్స్ వంటి వ్యాధులకు కొత్త చికిత్స లభిస్తుందని అంచనా. పరిశోధన వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
సాధారణ ఆరోగ్య సమస్యలుగా పొరబడే క్యాన్సర్లు
నిరక్షరాస్యత, గ్రామీణ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు, అమాయకత్వం ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేయడానికి ఒక కారణమైతే... బిజీలైఫ్, అందుబాటులో ఉండే మెడికల్ షాప్‌లు, ఫోన్లలోనే డాక్టర్ సలహాలు, ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, పెయిన్‌కిల్లర్స్, ఇంటర్నెట్ సమాచారం అనారోగ్య లక్షణాలకు తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చినా... సమస్యను తీవ్రం చేసే అంశమని చెప్పవచ్చు. వేడి చేసిందనీ, పడని ఆహారం తీసుకున్నామనీ, ప్రయాణాల వల్ల అని, అలసట అని, ఎప్పుడో తగిలిన దెబ్బల చిహ్నాలంటూ భ్రమపడటం వల్ల అనీ, వయస్సు పైబడే కొద్దీ కనిపించే లక్షణాలే అంటూ సర్దుకుపోవడం వల్ల... ఇలా కారణాలేమైనప్పటికీ అవి క్యాన్సర్‌ను చాలా లేటు దశలో గుర్తించే పరిస్థితులే చాలా సందర్భాల్లో ఏర్పడుతుంటాయి. క్యాన్సర్ చికిత్స విధానాలన్నీ ఏ దశలో వ్యాధి కనుగొన్నామనే అంశం మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. తలనొప్పి : తలనొప్పి తరచూ అందరూ ఎదుర్కొనేదే. చికాకు, పనుల ఒత్తిడి, ఎండ, కొన్ని రకాల వాసనలు, ఆకలి వంటి కారణాలతో మైగ్రేన్ లేదా తలనొప్పి అప్పుడప్పుడు రావడం చాలా సహజమే. మందులు వాడినప్పటికీ తలనొప్పి రావడం, అలాగే ఉదయం లేవగానే తలభారం, తీవ్రమైన నొప్పి, వాంతులు కావడం, వికారం లాంటి లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్‌కు సంకేతం కావచ్చు. గొంతునొప్పి : చల్లటి పదార్థాలు, కొత్తప్రదేశం, తాగేనీరు మారాయి అందుకే గొంతు బొంగురు, నొప్పి అని బాధపడే వారిని చాలామందినే చూస్తుంటాం. వీటికి మందులు కోర్సుగా వాడాక కూడా ఆ సమస్య బాధిస్తుంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించి చెకప్స్ చేయించుకోవాలి. థైరాయిడ్ క్యాన్సర్, గొంతు సంబంధిత క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ లక్షణాలు తొలిదశలో ఇలాగే ఉంటాయి. దగ్గు, ఆయాసం : సిగరెట్టు తాగేవారు మాకు ఇలాంటి లక్షణాలు అలవాటే అనుకుంటారు. కానీ వీరికి లంగ్ క్యాన్సర్‌తో పాటు అనేక రకాల ఇతర క్యాన్సర్లు వచ్చే ముప్పు ఎక్కువ అని గ్రహించాలి. గొంతులో నస, ఆగని దగ్గు, కళ్లె/తెమడలో రక్తం, ఆయాసం వంటివి టీబీ లేదా లంగ్‌క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. కడుపు ఉబ్బరం, మంట : సరైన జీవనశైలి అలవరచుకుని నీరు, పీచు ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నప్పటికీ, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వేధిస్తూ ఉంటే ఎండోస్కోపీ, స్కానింగ్ లాంటి పరీక్షలతో జీర్ణాశయానికి సంబంధించిన క్యాన్సర్లు, కాలేయం, పాంక్రియాస్, గాల్‌బ్లాడర్ క్యాన్సర్లను తొలిదశలోనే కనుగొనే అవకాశం ఉంది. మూత్రవ్యవస్థలో తేడాలు : మూత్రంలో రక్తం పడటం, ఆగి ఆగిరావడం, మంటగా ఉండటం మొదలైన లక్షణాలు కనిపించినప్పుడు తమకు వేడిచేసిందని భ్రమిస్తూ ఉంటారు. సాధారణంగా నీళ్లు తక్కువ తాగడం, ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు వంటి కారణాలవల్ల ఈ లక్షణాలు కనిపించవచ్చు. ఇవి మరీ తీవ్రంగా ఉండి చికిత్సలకు లొంగకపోతే యూరినరీ బ్లాడర్‌కు సంబంధించిన క్యాన్సర్ కావచ్చని అనుమానించాలి. 50 ఏళ్లపైబడిన పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, క్యాన్సర్ లక్షణాలు ఈ విధంగానే ఉండవచ్చు. నెలసరిమధ్య రక్తస్రావం, పొట్టభారంగా ఉండటం, ఆకలి మందగించడం, స్త్రీల నెలసరి ముందు ఉండే సమస్యలుగా (పీఎమ్ఎస్)గా పొరబడవచ్చుగానీ కొన్నిసార్లు అవి ఒవేరియన్, యుటిరైన్ క్యాన్సర్లూ కావచ్చు. మలవిసర్జనలో తేడాలు : అజీర్తి, విరేచనాలు, మలంలో రక్తం వంటి లక్షణాలు ఆహారపు అలవాట్లు మారినప్పుడు పైల్స్, ఫిషర్, ఫిస్టులా వంటి సమస్యలున్నప్పుడు కనిపించవచ్చు. కానీ మలవిసర్జన సమయంలో ఎప్పుడూ రక్తం పడుతుంటే అవి కోలన్ క్యాన్సర్ లక్షణాలు కూడా కావచ్చు. సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ వంటి పరీక్షలతో సమస్య ఏమిటో తెలిసిపోతుంది. అసలు విషయాన్ని గమనించక రకరకాల ఆహార పదార్థాల వల్ల ఈ సమస్య తలెత్తోందంని ఇతర అంశాలకు దీన్ని ఆపాదించుకుంటాం. తీవ్రమైన అలసట, ఆకలి, బరువు తగ్గడం, వీడని జ్వరం ఇంకా ఆయా అవయవాలకు సంబంధించిన లక్షణాలు ఉన్నట్లయితే ‘గాలిసోకిందీ’, ‘దయ్యంపట్టిందీ’, ‘చేతబడి చేశారు’ అంటూ పూజలు, మంత్రాలు, విభూది, తాయెత్తులు, దిష్టితీయడాలు వంటి అనేక మూఢనమ్మకాల పాలబడకుండా ఉండాలి. ఇలాంటివి చేస్తూ ఉండే ఫలితం కనిపించకపోగా అసలు సమస్య బయటపడే సమయానికి చేయిదాటిపోయే ప్రమాదం ఉంది. క్యాన్సర్ ఇతర భాగాలకూ వ్యాపించి, చికిత్సకు లొంగకుండా తయారుకావచ్చు. ప్రతినెలా కనిపించే గడ్డలే అనీ, పాలగడ్డలనీ రొమ్ములో దీర్ఘకాలం పాటు కనిపించే కణుతులను అశ్రద్ధ చేస్తే కణితి ఇతర భాగాలకు పాకే ప్రమాదం పొంచిఉంటుంది. అలసట, చర్మం మీద ఊదారంగు మచ్చలు, తేలికగా కమిలిపోవడం వంటివి బ్లడ్‌క్యాన్సర్‌ను హెచ్చరించవచ్చు. గోళ్లలో మార్పులు, ముందుకు వంగి ఉండటం లివర్ / లంగ్ క్యాన్సర్లకు సూచన కావచ్చు. ఒత్తిడికి గురైనప్పుడు, వాతావరణం, ఆహారం మారినప్పుడు పైన పేర్కొన్న లక్షణాలు దాదాపుగా అందరూ ఎదుర్కొనేవే. అయితే తీవ్రంగా ఉన్నప్పుడు కూడా అవే కారణాలని భ్రమపడి ముందు వాడిన మందులనే మళ్లీ వాడుకుంటూ కాలయాపన చేస్తే సమస్యలను మనమే తీవ్ర చేసుకున్నవాళ్లమవుతాం. అందుకే చాలావరకు క్యాన్సర్ ముదిరాకే చికిత్సకు వస్తూ ఉంటారు. అదృష్టవశాత్తూ గత కొంతకాలంగా హెల్త్‌చెకప్స్ చేయించుకోవడం, అవగాహన పెంచుకోవడం శుభపరిణామంగా చెప్పవచ్చు. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
తినగానే ఈ సమస్యలు ఎందుకిలా?
నా వయసు 45 ఏళ్లు. భోజనం పూర్తికాగానే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి. మలంలో జిగురు కూడా కనిపిస్తుంది. కడుపులో మెలిపెట్టినట్లుగా నొప్పి వస్తోంది. తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన వంటివి ఉన్నాయి. దయచేసి నా సమస్య ఏమిటో వివరించి, హోమియోలో చికిత్స చెప్పండి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా తెలియదు. అయితే ►జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ►దీర్ఘకాల జ్వరాలు ►మానసిక ఆందోళన ►కుంగుబాటు ►ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం ►జన్యుపరమైన కారణలు ►చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తాయి. సాధారణంగా ఈ వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు ఎక్కువ. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయెలెట్‌కు పరుగెత్తాల్సి వస్తుంది. ఐబీఎస్ క్యాన్సర్‌కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. దీని నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్ బ్రీత్ టెస్ట్ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు: ►పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ►ఒత్తిడిని నివారించుకోవాలి ►పొగతాగడం, మద్యపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ►రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. హోమియోలో చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌కు హోమియోలో అత్యంత శక్తిమంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ అంటే ఉదాహరణకు జీర్ణవ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావం వల్ల జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పులు, ఒత్తిడి, ఆందోళన వల్ల ఐబీఎస్ వస్తే దాన్ని హోమియో ప్రక్రియలో కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
కలుషితం.. నదీజలం
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాలను తడిపి సిరులు కురిపించే నదీ జలాలు స్వచ్ఛమైనవి కావా? వీటిల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుందా? దిద్దుబాటు చర్యలు చేపట్టకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవా? అనే ప్రశ్నలకు అవుననే హెచ్చరిస్తోంది కేంద్ర జల్‌శక్తి శాఖ. గోదావరి, కృష్ణా, పెన్నా, కుందూ, నాగావళి, మానేరు, కిన్నెరసాని తదితర నదుల్లో బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్(బీవోడీ), డిసాల్వ్డ్ ఆక్సిజన్(డీవో), క్షార స్వభావం (పీహెచ్) ప్రమాదకర స్థాయికి చేరిందని తాజా నివేదిక తేల్చింది. ఈ నదుల్లోని నీటిలో కోలి బ్యాక్టీరియా,కరిగిన ఘన పదార్థాల(టీడీఎస్) శాతం ప్రమాదకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర నదులతో పోల్చితే వంశధారలో కాలుష్య ప్రభావం కాస్త తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. దేశవ్యాప్తంగా 323 నదుల్లో కాలుష్య ప్రభావంపై కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి(సీపీసీబీ), అన్ని రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లు(పీసీబీ), కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్తంగా అధ్యయనం నిర్వహించాయి. సీపీసీబీ ప్రకారం నీటి స్వచ్ఛత ప్రమాణాలు ఇవీ.. - మనుషులు తాగడానికి వినియోగించే నీటిలో కోలి బ్యాక్టీరియా ఎంపీఎన్ (మోస్ట్ పాపులర్ నంబర్) వంద మిల్లీ లీటర్లకు 50 లోపు ఉండాలి. పీహెచ్ శాతం 6.5 వరకు ఉండవచ్చు. లీటర్ నీటికి డీవో ఆరు మిల్లీ గ్రాములు, బీవోడీ 2 మిల్లీ గ్రాముల వరకు ఉండవచ్చు. - మనుషులు స్నానానికి వినియోగించే నీటిలో కోలి బ్యాక్టీరియా ఎంపీఎన్ వంద మిల్లీలీటర్లకు 500 వరకు ఉండవచ్చు. పీహెచ్ 6.5 శాతం వరకు ఉండవచ్చు. లీటర్ నీటికి డీవో 5 మిల్లీగ్రాములు, బీవోడీ మూడు మిల్లీ గ్రాముల వరకు ఉండవచ్చు. - అడవి జంతువులు తాగడానికి, చేపల జీవనం, పెంపకానికి వినియోగించే నీటిలో పీహెచ్ 6.5 శాతం, డీవో లీటర్ నీటికి నాలుగు మిల్లీ గ్రాముల దాకా ఉండవచ్చు. కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం... - గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర, నాగావళి, కుందూ, మానేరు, కిన్నెరసానిలో కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరినట్లు తాజా సర్వేలో వెల్లడైంది. - తెలుగు రాష్ట్రాల్లో ప్రవహించే నదుల్లో కోలి బ్యాక్టీరియా మోతాదు పరిమితి దాటింది. డీవో, బీవోడీ, పీహెచ్ శాతం కూడా అధికంగా ఉంది. శుద్ధి చేయకుండా నదీ జలాలను తాగితే మూత్రపిండాలు, శ్వాసకోస సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. - తెలుగు రాష్ట్రాల్లో అన్ని నదులతో పోల్చితే తుంగభద్రలో కాలుష్య తీవ్రత అధికంగా ఉంది. తుంగభద్ర జలాల్లో ఘన వ్యర్థాలు ఒక లీటర్ నీటిలో గరిష్టంగా 347 మిల్లీగ్రాములున్నాయి. ఇష్టారాజ్యంగా గనుల తవ్వకం, పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీరు చేరడమే దీనికి ప్రధాన కారణం. - కుందూ నదిలో కోలి బ్యాక్టీరియా వంద మిల్లీ లీటర్లకు గరిష్టంగా 900(టి.కోలి 800, ఎఫ్.కోలి 100) ఉండటం గమనార్హం. - వంశధార నదీ జలాల్లో పీహెచ్, డీవో, బీవోడీ, టి.కోలి, ఎఫ్.కోలి, టీడీఎస్ శాతం ఇతర నదులతో పోల్చితే కాస్త తక్కువగా ఉన్నప్పటికీ శుద్ధి చేయకుండా తాగడం శ్రేయస్కరం కాదు. - నదీ జలాల్లో కాలుష్య తీవ్రత వల్ల వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. మత్స్య సంపద కూడా అంతరిస్తోంది. కాలుష్యానికి ప్రధాన కారణాలు - పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటిని నదుల్లోకి పెద్ద ఎత్తున వదలడం. - విచ్చలవిడిగా గనుల తవ్వకం. ఏం జరుగుతుంది? పరిస్థితులు ఇలాగే కొనసాగితే నదీ జలాలు స్నానానికి కూడా పనికి రావు శుద్ధి చేయని నదీ జలాలను తాగితే ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది -
నైట్‌షిఫ్టులో పని చేస్తున్నారా?
ఈ రోజుల్లో రాత్రంతా డ్యూటీలు చేయాల్సిన ఉద్యోగాలు పెరిగాయి. దాంతో చాలా మంది ఉద్యోగులు రాత్రిపూట నుంచి వేకువజాము వరకు పని చేయాల్సివస్తోంది. మామూలుగా రోజూ రాత్రి నిద్రపోయే వారి ఆహారపు అలవాట్లతో పోలిస్తే... నైట్ షిఫ్ట్‌లలో పనిచేసేవారు తమ ఆహారపు అలవాట్లు మార్చుకోకపోతే వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. గాస్ట్రోఇంటస్టినల్ సమస్యతో పాటు రక్తపోటు, గుండె సమస్యలు, యాంగై్జటీ, ఒత్తిడి, నిద్రలేమి, డిప్రెషన్ వంటివి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. ఇలాంటి వాళ్లలో బరువు పెరిగి ఊబకాయం వచ్చే అవకాశాలూ ఎక్కువే. ఎందుకంటే... సాధారణ వ్యక్తులు రాత్రి నిద్రపోవడం వల్ల, ఉదయం వరకు భోజనం తీసుకోరు. రాత్రి డ్యూటీలు చేసేవారికి మెలకువగా ఉన్న సమయంలో ఆకలేయడం వల్ల రాత్రివేళ్లలోనూ యథావిధిగా తింటుంటారు. సాధారణంగా ఆ తినేవన్నీ మామూలు భోజనంలా కాకుండా కొవ్వులు ఎక్కువగా ఉండే ఫాస్ట్ఫుడ్స్, జంక్ఫుడ్స్ వంటివే ఎక్కువ. అందుకే రాత్రివేళ పనిచేసే అసమతౌల్య ఆహారపు అలవాట్లు చోటుచేసుకోవడంతో పాటు... వారికి సాధారణంగా శారీరక శ్రమ చేయాల్సిన అవసరం కూడా బాగా తగ్గుతుంది. ఊబకాయంతో వచ్చే ఆరోగ్యపరమైన ముప్పులను తప్పించుకునేందుకు అనుసరించాల్సిన ఆహారపు అలవాట్లు... ►రాత్రుళ్లు పెద్ద పెద్ద పరిమాణాల్లో తక్కువ సార్లు కాకుండా... చిన్న చిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి. దాంతో ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. దాంతో పైన చెప్పిన గ్యాస్ట్రో ఇంటస్టినల్ సమస్యలను నివారించవచ్చు. ►ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఎక్కువగా లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. పీచుపదార్థాలు ఎక్కువగా ఉండాలి. ►ఆఫీసుల్లోని వెండింగ్ మెషిన్, కాఫెటేరియా వద్ద ఉన్న ఆహారపదార్థాలను సాధ్యమైనంత వరకు తీసుకోకండి. ఇంటిదగ్గర నుంచి తెచ్చుకున్న ఆహారాన్నే తీసుకోండి. ►ఒకవేళ కాఫెటేరియా ఫుడ్‌నే తీసుకోవాల్సి వస్తే.. పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు అంటే... సలాడ్స్, పళ్లు, మొలకెత్తిన గింజలు, పొట్టుతో ఉన్న పప్పుధాన్యాలు, గింజధాన్యాలు (ఉదాహరణకు... పొట్టుతోనే ఉన్న గోధుమలతో చేసిన రోటీలు, మొక్కజొన్నలతో చేసిన పదార్థాలు, బ్రౌన్‌బ్రెడ్ శాండ్విచ్లు) వంటివి తీసుకోండి. కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, బాగా ఎక్కువగా వేయించిన వేపుళ్లు (ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు, చిప్స్ వంటివి) అవాయిడ్ చేయండి. ►రాత్రివేళల్లో తీపి పదార్థాలు, రిఫైన్డ్ ఫుడ్స్ (క్యాండీలు, చాక్లెట్లు, వైట్ బ్రెడ్స్, బన్స్, పాస్తాస్, పిజ్జాలు, కూల్‌డ్రింక్స్) వంటి వాటిని సాధ్యమైనంత వరకు తీసుకోకండి. ►రాత్రివేళల్లో పనిచేసేవారు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి. పగటితో పోలిస్తే రాత్రి ఒకింత చల్లగా ఉంటుంది కాబట్టి నీళ్లు తాగడం తగ్గుతుంది. దాని వల్ల డీహైడ్రేషన్ ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి తరచూ నీళ్లు తాగటం మంచిది. ►రాత్రివేళల్లో పనిచేసేటప్పుడు కాఫీ, టీ లు తాగడం చాలా ఎక్కువవుతుంది. కానీ వాటిని వీలైనంతగా తగ్గించడం మంచిది. ►రాత్రివేళల్లో పనిచేసేవారు చాలావరకు తమ వ్యాయామాలను వదిలేస్తుంటారు. అయితే వర్క్షెడ్యూల్ను అనుసరించి రోజులో ఏదో ఒక నిర్ణీత సమయంలో ప్రతిరోజూ 45 – 60 నిమిషాల పాటు తప్పనిసరిగా ►వ్యాయామం చేయడం మంచిది. ఈ వ్యాయామం అన్నది మీరు పనికి వెళ్లే ముందర చేస్తే రాత్రంతా ఎక్కువ ఉత్సాహంగా ఉంటుంది. పైగా రాత్రి సమయంలో పని చేసేటప్పుడు తూగురావడం వంటివి జరగవు. ►ఇలా వ్యాయామం చేయడం వల్ల బరువు పెరిగే అవకాశం తక్కువ. బరువు నియంత్రణలో ఉంటుంది. ►వ్యాయామం కారణంగా ఆడ్ టైమింగ్ అయిన రాత్రి పనివేళల్లో పనిచేయడం వల్ల కలిగే ఒత్తిడిని నివారించడం సాధ్యమవుతుంది. అధిక రక్తపోటు (హైబీపీ), డిస్లిపిడేమియా (రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు అసాధారణంగా పెరగడం) వంటి వాటిని కూడా నివారించవచ్చు. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
చదివింది హోమియోపతి.. చేసేది అల్లోపతి!
సాక్షి, రంగారెడ్డి : జిల్లాల్లో శంకర్‌దాదాల వైద్య లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పవిత్రమైన వైద్య వృత్తిని అడ్డుపెట్టుకొని రోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు. చిన్న రోగాన్ని సైతం పెద్దగా చూపించి రోగులకు మిడిమిడి వైద్యపరిజ్ఞానంతో ట్రీట్మెంట్ చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నాడీపట్టే వారంతా వైద్యులేనని నమ్మిన గ్రామీణ ప్రజలు ఆరోగ్యం కోసం వేల రూపాయలను ధారపోస్తున్నారు. ప్రథమ చికిత్స చేయాల్సిన ఆర్ఎంపీలు తమకు వచ్చిన విద్యతో రోగులకు వైద్యం చేస్తున్నారు. మరోవైపు పాతకాలపు వైద్యవిద్య హోమియోపతి చదివిన వారు కూడా డాక్టర్లుగా అవతారమెత్తి రోగులకు అల్లోపతి వైద్యం చేస్తుండడం మరోకోణం. వీరితో పాటు ఆయుర్వేదం, యునానీ, న్యాచురోపతి చదివిన వారు కూడా పాలీక్లినిక్‌లు అల్లోపతి వైద్యం అందిస్తున్నారు. జిల్లాలో సుమారు 200లకు పైగా పాలీకేంద్రాలను ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు. భారత పూర్వకాలపు ప్రకృతి వైద్యవిధానంలోని ఆయుర్వేదం, యునానీ, న్యాచురోపతి æవంటి వైద్యం నేటి ఆధునిక కాలంలో ప్రాధాన్యత చాలా తక్కువ. హోమియోపతి వైద్యంలోనూ వివిధ రకాల రోగాలకు వివిధ మూలకాలతో హోమియోపతి పిల్స్ ఇస్తారు. అయితే బీహెచ్ఎంఎస్ చేసిన వారు కూడా పాలీ క్లినిక్‌లుల బోర్డులు పెట్టి రోగులకు వైద్యం చేస్తుండటం గమనార్హం. హోమియోపతి వైద్యం కోసం వచ్చే వారికి అల్లోపతి వైద్యం చేస్తున్నారు. క్లినిక్‌లో బెడ్లు ఏర్పాటు చేసి స్టెరాయిడ్ మందులు, యాంటిబయోటిక్స్ గోలీలు, సూదులు ఇస్తున్నారు. ఇంతటితో ఆగకుండా రక్తపరీక్షలు చేస్తున్నారు. బీపీలు, షుగర్ టెస్టులు నిర్వహిస్తున్నారు. చదువుకు సంబంధం లేకుండా తమకు తెలిసిన వైద్యపరిజ్ఞానంతో గ్రామీణ రోగుల ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్యాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. బషీరాబాద్ మండల కేంద్రంలోని ఓ వ్యక్తి ప్రభుత్వ అనుమతులు లేకుండా పాలీక్లినిక్ను నిర్వహిస్తున్నారు. హోమియోపతి వైద్యం చాటున అల్లోపతి వైద్యం చేస్తున్నారు. మారుమూల గ్రామాల రోగులతో పాటు, కర్ణాటక నుంచి వచ్చే రోగులకు అల్లోపతి వైద్యం అందిస్తుండటం గమనార్హం. నిద్దరోతున్న అధికారులు జిల్లాలో శంకర్‌దాదాల వైద్యం యథేచ్ఛగా సాగుతున్నా జిల్లా వైద్యాధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. మరోవైపు ఎలాంటి అనుమతులు లేకుండా మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపుల్లో మందులు విక్రయిస్తున్నారు. అలాగే ఆర్ఎంపీ, బీఎంపీ, బీఎమ్మెస్ వారు రాసిన ప్రిస్క్రిప్షన్లకు స్టెరాయిడ్ మందులు ఇస్తున్నారు. ఇంతా జరుగుతున్నా డ్రగ్స్ అధికారులు కనీసం పర్యవేక్షణ కూడా చేయకపోవడం ఆరోపణలకు తావిస్తోంది. -
అప్పటి నుండి భయం పట్టుకుంది
మెనోపాజ్ లక్షణాల గురించి రెండు, మూడు సార్లు వినడం జరిగింది. అప్పటి నుంచి నాకు తెలియకుండానే ఒకలాంటి భయం పట్టుకుంది. మెనోపాజ్ సమస్యలను తగ్గించడానికి ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, మెనోపాజ్ దశలో బరువు పెరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సీయన్, నెల్లిమర్ల నలభై సంవత్సరాలు దాటిన తర్వాత పీరియడ్స్ ఒక సంవత్సరం పాటు రాకుండా ఆగిపోతే దానిని మెనోపాజ్ దశ అంటారు. ఈ సమయంలో అండాశయాల పనితీరు మందగించిపోయి వాటి నుంచి స్రవించే ఈస్ట్రోజన్ హార్మోన్ దాదాపుగా పూర్తిగా ఆగిపోవడం వల్ల మెనోపాజ్ లక్షణాలు ఏర్పడతాయి. ఈ సమయంలో శరీరంలో నుంచి ఉన్నట్లుండి వేడిగా ఆవిర్లు రావడం, అంతలోనే చెమటలు పట్టడం (హాట్ ఫ్లషెస్), గుండె దడగా ఉండడం, ఒళ్లు నొప్పులు, అలసట, మతిమరుపు, డిప్రెషన్, మూత్రసమస్యలువంటి లక్షణాలు ఒకొక్కరిలో ఒక్కోలాగా ఏర్పడవచ్చు. మెనోపాజ్ దశలో అందరూ బరువు పెరగాలని ఏమిలేదు. ఈ సమస్యలను పూర్తిగా రాకుండా నివారించలేము. కాకపోతే లక్షణాల తీవ్రతను తగ్గించడానికి ఆహారంలో సోయాబీన్స్ వాటి ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవడం, ఆకుకూరలు, పాలు, పెరుగువంటివి తీసుకోవడం, ఉండే పరిసరాలు చల్లగా ఉండేట్లు చూసుకోవడం, యోగా, నడక, ధ్యానం వంటివి తప్పనిసరిగా చేయడం వల్ల మెనోపాజ్ దశ నుంచి చాలావరకు ఉపశమనం పొందవచ్చు. అలాగే బరువు పెరగకుండా, ఎముకలు బలహీన పడకుండా ఉంటాయి. ఇంకా లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే డాక్టర్ పర్యవేక్షణలో ఈస్ట్రోజన్ హార్మోన్‌ను మాత్రల రూపంలో లేదా స్ప్రేలాగా, జెల్లాగా తక్కువ మోతాదులో వాడుకోవచ్చు. మా అత్తగారికి పొత్తికడుపులో నొప్పి వస్తుంది. అపుడప్పుడూ కళ్లు తిరిగి పడిపోతుంది. దీని గురించి వైద్యం మీద కాస్త అవగాహన ఉన్నవారిని సంప్రదిస్తే ‘డిఫికేషన్ సింకప్ కావచ్చు’ అంటున్నారు. ఇది నిజమేనా? డిఫికేషన్ సింకోపి ఎందుకు వస్తుంది? చికిత్స పద్ధతుల గురించి తెలియజేయండి. – డి.మాలతి, సంగారెడ్డి పొత్తి కడుపులో నొప్పి రావటానికి, కళ్లు తిరిగిపడిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మీ అత్తగారి వయసు ఎంత? బీíపీ, షుగర్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది రాయలేదు. కొంతమందిలో కొన్నిరకాల ఒత్తిడులకు గురైనప్పుడు లేదా ఏదైనా ఉన్నట్లుండి తీవ్రమైన నొప్పికి గురైనప్పుడు రక్తంలో కొన్ని రకాల హార్మోన్స్ విడుదలయ్యి, కొన్ని నరాలను స్పందింపజేసి మెదడుకి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు సంకోచించడం జరుగుతుంది. అలాగే గుండె తక్కువగా కొట్టుకుంటుంది. దీనివల్ల మెదడుకి ఉన్నట్లుండి రక్తసరఫరా, ఆక్సిజన్ అందకపోవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. దీనినే వేసోవేగల్ షాక్ అంటారు. అలాగే కొందరిలో మలవిసర్జన సమయంలో ఇబ్బంది పడటం వల్ల కళ్ళు తిరిగి పడుతుంటారు. దీనినే డిఫికేషన్ సింకప్ అంటారు. ఇది ఎందుకు, ఎవరికి వస్తుందనేది ఖచ్చితంగా చెప్పలేము. కారణాలను బట్టీ చికిత్స పద్ధతులు ఉంటాయి. మొదట మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. మొదట మీ అత్తగారిని డాక్టర్‌కి చూపించి పొత్తికడుపు నొప్పికి, కళ్ళు తిరిగిపడటానికి గల కారణాలను విశ్లేషించుకొని, అవసరమైన పరీక్షలు చేయించుకుని, దానికి తగ్గ చికిత్స తీసుకోవడం మంచిది. నేను చిన్న చిన్న విషయాలకే స్ట్రెస్ అవుతుంటాను. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. ఈ సమయంలో ‘స్ట్రెస్’ పడితే ‘చైల్డ్ పర్సనాలిటీ డిజార్డర్’ సమస్య ఏర్పడుతుందని చదివాను. ఇది ఎంతవరకు నిజం? ‘ప్రెగ్నెన్సీ ఫిట్నెస్’ అంటే ఏమిటి? – ఆర్.శ్రావణి, జహీరాబాద్ సాధారణంగా గర్భంలో బిడ్డ తొమ్మిదినెలల పాటు పెరిగేటప్పుడు బిడ్డ శారీరక ఎదుగుదలే కాకుండా మానసిక ఎదుగుదల కూడా ఉంటుంది. తల్లి ఆరోగ్యపరిస్థితి, మానసిక పరిస్థితిని బట్టి బిడ్డ మానసిక ఎదుగుదల కొద్దిగా ఆధారపడి ఉంటుంది. తల్లిలో ఉండే స్ట్రెస్లెవెల్స్ను బట్టి, స్ట్రెస్ మరీ తీవ్రంగా ఉంటే కొన్నిసార్లు బిడ్డ మానసిక ఎదుగుదల మీద ప్రభావం పడే అవకాశాలు కొద్దిగా ఉండవచ్చు. అలాగే తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల, తల్లి సరిగా ఆహారం, మందులు తీసుకోకపోవడం వల్ల కూడా బిడ్డ ఎదుగుదల మీద ప్రభావం పడవచ్చు. చైల్డ్ పర్సనాలిటీ డిజార్డర్ ఏర్పడటానికి తల్లి మానసిక ఒత్తిడి ఒక్కటే కారణం కాదు. దీనికి తల్లి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు తీసుకునే కొన్ని యాంటిడిప్రెసెంట్ మందుల వల్ల తల్లిలో స్మోకింగ్, ఆల్కహాల్...కొన్ని జన్యుపరమైన కారణాలు ఇంకా తెలియని ఎన్నో కారణాల వల్ల రావచ్చు. కాబట్టి గర్భం దాల్చక ముందు నుంచే సరైన జాగ్రత్తలు తీసుకోవడం, గర్భం దాల్చిన తర్వాత కొన్ని రకాల మందులు డాక్టర్ సంరక్షణలో తీసుకోవటం, గర్భిణి సమయంలో యోగా, నడక, ప్రాణాయామం, ధ్యానం వంటివి పాటిస్తూ, సరైన పౌష్ఠికాహారం తీసుకుంటూ, మానసిక ఒత్తిడికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది. దీనినే ‘ప్రెగ్నెన్సీ ఫిట్నెస్’ అని అంటారు. ఇందులో మరీ ఎక్కువ బరువు పెరగకుండా, ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. డా. వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ -
అర కిలోమీటరుకు 60పైగా గుంతలు
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు నగర రోడ్లను పూర్తిగా ధ్వంసం చేశాయి. ఇప్పటికే రోడ్లన్నీ గుంతల మయంగా మారడంతో అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి. అరకిలోమీటరు ప్రయాణిస్తే చాలు అరవైకి పైగా గుంతలు శరీరాన్ని కుదిపేస్తున్నాయి. ఫలితంగా వాహనాలే కాదు ప్రయాణికుల ఒళ్లు గుళ్లవుతోంది. వెన్నుపూస కదిలిపోతోంది. నొప్పిని భరించలేక ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. నిమ్స్ సహా నగరంలోని ఏ కార్పొరేట్ ఆస్పత్రిలోకి చూసినా బ్యాక్‌పెయిన్ బాధితులే దర్శనమిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: మెట్రోరైల్ వర్క్స్, విద్యుత్ కేబుళ్లు, సీవరేజ్ పైప్‌లైన్స్ కోసం తవ్విన గుంతలు ఇప్పటికే ప్రయాణికులను ఓ కుదుపు కుదుపుతుండగా, ఇటీవల ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు రహదారులనే కాదు నగరవాసుల ఒంటిని కూడా గుళ్ల చేస్తున్నాయి. సాధారణ పౌరులు తిరిగే రహదారులే కాదు వీవీఐపీలు తిరిగే బంజారాహిల్స్, బేగంపేట్, ఎన్టీఆర్మార్గ్, రాజ్‌భవన్‌రోడ్డు, అసెంబ్లీ, పంజêగుట్ట, లక్డికపూల్, ట్యాంక్‌బండ్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి రహదారు లపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఇక ఎల్బీనగర్ నుంచి మెజంజాహీ మార్కెట్, ఉప్పల్, రామంతాపూర్, అంబర్పేట్, నల్లకుంట, నారాయణగూడ, హిమాయత్ నగర్, లిబర్టీ చౌరస్తా రహదారులు మరీ అధ్వానంగా మారాయి. అడుగుకోగుంత దర్శనమిస్తోంది. ఈ గుంతల రోడ్లపై ప్రయాణిస్తున్న అనేక మంది వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. వీరిలో కొంరు కాళ్లు, చేతులకు గాయాలై చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరుతుండగా, మరికొందరు స్పైన్, నెక్, నడుము నొప్పుల బారిన పడుతున్నారు. డ్రైవరే కాదు..ప్రయాణికులు కూడా.. వాహనం నడిపే వారే కాదు..వెనుక సీట్లో కూర్చొన్న వారికి కూడా వెన్ను, భుజం, తొడ, మెడ జాయింట్స్ పెయిన్స్ తప్పడం లేదు. బైక్ నడిపే వారు వెన్ను, మెడ, భుజాలు, ఇతర కండరాల నొప్పులతో బాధ పడుతుంటే, కారు నడిపేవారు నడుము, పిరుదులు, కాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. వీరు సరైన భంగిమలో కూర్చోకపోవడం వల్ల గుంతల్లో ఎత్తేసిన ప్రతి సారీ డిస్క్‌ల మధ్య కదలికలు ఎక్కువై జాయింట్స్ అరిగి పోతున్నట్లు వైద్యులు స్పష్టం చేస్తున్నారు. జంట జిల్లాల్లో ప్రస్తుతం 50 లక్షలపైగా వాహనాలు ఉండగా, వీటిలో 35 లక్షలకుపైగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఏడు లక్షల కార్లు, లక్షకుపైగా ఆటోలు ఉండగా, మరో లక్ష ఇతర వాహæనాలు ఉన్నాయి. రహదారులపై ఏర్పడిన గుంతల వల్ల వాహనాల నిర్వహణ ఖర్చులు రెట్టింపయ్యాయి. ద్విచక్ర వాహనాలకు క్లచ్, బ్రేక్ సిస్టమ్ దెబ్బ తింటుంది. టైర్లు కూడా అరిగిపోతున్నాయి. తరచూ ఇలాంటి గుంతల్లో కార్లు, ద్విచక్రవాహనాల్లో ప్రయాణిస్తే ఇంజిన్ దెబ్బ తింటుంది. బుష్‌లు పగులుతున్నాయి. ఇక గుంతలు వచ్చినప్పుడు బ్రేకులు వేస్తూ.. గేర్లు మార్చడం వల్ల మైలేజీ తగ్గుతుంది. నిటారుగా కూర్చోవాలి ♦ బైక్ నడిపేటప్పుడు తల, నడుము, షోల్డర్ వంచకుండా నిటారుగా ఉండటం అలవాటు చేసుకోవాలి ♦ మెడపై భారం పడకుండా తేలికైన హెల్మెట్లను వాడాలి. తలను అటూ, ఇటూ తిప్పరాదు ♦ ర్యాష్ డ్రైవింగ్ చేయరాదు. సీటు దిగజారినట్లు ఉండకూడదు. ♦ కారులో సిట్టింగ్ 110 డిగ్రీలు తప్పని సరిగా ఉండాలి ♦ క్లచ్‌లు, గేర్లు చేతికి చేరువలో ఉండేలా చూడాలి. ♦ వీపు భాగాన్ని పూర్తిగా సీటుకు అనించి కూర్చోవాలి ♦ గుంతలు, ఎగుడు దిగుడు రోడ్లు, స్పీడ్బ్రెకర్ల ఉన్నప్పుడు వేగం తగ్గించాలి ♦ లాంగ్ జర్నీ చేసేప్పుడు ప్రతి గంట, రెండు గంటలకోసారి కొంత విరామం తీసుకోవాలి. –డాక్టర్ నరేంద్రనాథ్, ఆర్థోపెడిక్ నిపుణుడు, మాజీ డైరెక్టర్, నిమ్స్ -
తీవ్రమైన దగ్గు... ఆయాసం... పరిష్కారం చెప్పండి.
నా వయసు 42 ఏళ్లు. నేను చేసే పనిలో టార్గెట్లతో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. చిన్నప్పట్నుంచీ సిగరెట్లు కాల్చే అలవాటు ఉంది. ఇప్పుడు నా వృత్తిలో బాగా ఒత్తిడి ఉండటం వల్ల సిగరెట్లు కాల్చడం కూడా ఎక్కువైంది. ఇటీవల నాకు తీవ్రంగా ఆయాసం, దగ్గు వస్తోంది. దాంతో సరిగా నిద్రపట్టడం లేదు. సాధారణ సమస్యే కదా, అదే తగ్గిపోతుందిలే అని పట్టించుకోలేదు. ఇప్పుడు ఉపశమనం కోసం ఎన్ని మందులు వాడిన ఫలితం కనిపించడం లేదు. దగ్గు, ఆయాసం తగ్గకపోగా రోజురోజుకూ మరింత పెరుగుతోంది. నాకు తగిన పరిష్కారం సూచించండి. సిగరెట్లు కాల్చడం ఒత్తిడిని తగ్గించకపోగా అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలగజేస్తుంది. మొదట్లో సరదాగా ప్రారంభమయ్యే అలవాటు వదులుకోలేని వ్యసనంగా మారి మీ ఆరోగ్యాన్నీ పూర్తిగా దెబ్బతీస్తుంది. మీరు రోజుకు మూడు పాకెట్ల వరకూ సిగరెట్లు కాలుస్తున్నట్లు చెప్పారు. అంత ఎక్కువ సంఖ్యలో సిగరెట్లు కాల్చడం మీ ఆరోగ్యంపై చాలా తీవ్రమైన దుష్ప్రభావం తప్పక చూపుతుంది. ఊపిరితిత్తులు పాడైపోయి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఊపిరితిత్తుల క్యాన్సర్, గొంతుక్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. పొగతాగడం వల్ల శరీరంలోని రక్తనాళాలు పూడుకుపోయి గుండె సంబంధిత సమస్యలు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ), నిద్రలేమి వంటి సమస్యలూ వచ్చే అవకాశం ఉటుంది. కాబట్టి మీరు వెంటనే సిగరెట్లు కాల్చడం మానేసి వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకోండి. పొగతాగడం వల్ల ఎలాంటి ప్రయజనమూ ఉండదు. సిగరెట్ ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తుందనేది కేవలం ఒక అపోహ మాత్రమే. మీరు ఎంత త్వరగా పొగతాగడం మానేస్తే అది మీ ఆరోగ్యానికి అంత మంచిది. టీబీ పూర్తిగా తగ్గుతుందా? మా అమ్మ వయసు 58 ఏళ్లు. ఆమె గత ఆరేళ్లుగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ రక్తహీతన (అనీమియా)కు గురైంది. ఇటీవలే పరీక్షలు చేయిస్తే ఆమెకు టీబీ ఉన్నట్లు తెలిసింది. టీబీ పూర్తిగా నయమవుతుందా? మాకు తగిన సలహా ఇవ్వండి. సరైన రీతిలో చికిత్స తీసుకుంటే టీబీ వ్యాధి పూర్తిగా, శాశ్వతంగా నయమవుతుంది. ఇది మైకోబ్యాక్టీరియమ్ ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా సూక్ష్మజీవి వల్ల సంక్రమించే వ్యాధి. జ్వరం, దగ్గు వస్తూ తెమడపడుతుండటం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. టీబీకి ఐసోనియాజిడ్, రిఫామ్పిసిన్, పైరజినమైడ్, ఎథాంబుటాల్ అనే నాలుగు రకాల మందులను కాంబినేషన్స్‌లో ఉపయోగించి చికిత్స చేస్తారు. ఈ మందుల మోతాదును రోగి బరువును పరిగణనలోకి తీసుకొని నిర్ణయిస్తారు. పూర్తి చికిత్స కోసం కనీసం ఆర్నెల్లు మందులు వాడాల్సి ఉంటుంది. మొదటి రెండు నెలలను ఇంటెన్సివ్ ఫేజ్ అంటారు. ఇందులో నాలుగు రకాల మందులనూ ఉపయోగిస్తారు. చివరి నాలుగు నెలలనూ కంటిన్యూయేషన్ ఫేజ్ అంటారు. ఇందులో మూడు మందులు వాడతారు. అవి... ఐసోనియజిడ్, రిఫామ్పిసిన్, ఎథాంబుటాల్ అనే మందులు. టీబీ చికిత్సలో రోగి ఓపికగా పూర్తికాలం పాటు మందులు వాడి తీరాలి. కొన్నాళ్ల తర్వాత లక్షణాలు తగ్గినట్లు కనపడగానే, తనకు వ్యాధి నయమైనట్లుగా భావించి, మందులను వదిలేస్తే వ్యాధి మళ్లీ తిరగబెట్టే ప్రమాదం ఉంది. అందుకే రోగి మందులు వాడుతూ క్రమం తప్పకుండా డాక్టర్ ఫాలో అప్‌లో ఉండాలి. చికిత్స సమయంలో రోగి మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. చాలామందిలో ఆకలి తగ్గడం, తగిన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోకపోవడం వల్ల రోగులు బరువు తగ్గుతారు. అయితే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే గుడ్ల వంటివి తీసుకోవడం వల్ల రోగులు మెరుగ్గా కోలుకుంటారు. డయబెటిస్ వ్యాధి కూడా టీబీతో బాధపడే రోగులను ప్రభావితం చేసే అంశమవుతుంది. ఎందుకంటే చక్కెరను సక్రమంగా అదుపులో పెట్టుకోని రోగుల్లో వ్యాధి నయం కావడం అంత తేలిక కాదు. ఇక చివరగా టీబీ వచ్చిన రోగులకు తప్పనిసరిగా హెచ్ఐబీ స్క్రీనింగ్ పరీ చేయించాలి. ఎందుకంటే వ్యాధి నిరోధకత తగ్గడం వల్ల చాలామందిలో టీబీ బయటపడుతుంది. వ్యాధి నిరోధకత తగ్గిందంటే అది హెచ్ఐవీ వల్లనా అనేది తెలుసుకొని, ఒకవేళ హెచ్ఐవీని కనుగొంటే దానికి కూడా చికిత్స చేయించాల్సి ఉంటుంది. ఇక మీ అమ్మగారి రక్తహీనత సమస్యకు వస్తే అది క్రమంగా ట్యాబ్లెట్లతో పరిష్కరించవచ్చు. ఒకవేళ ఆమెకు రక్తహీనత చాలా తీవ్రంగా ఉంటే రక్తం ఎక్కించడం అవసరం కావచ్చు. డాక్టర్ జి. హరికిషన్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ చెస్ట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
పైన రక్షణ.. కింద మాత్రం సమస్యలు!
వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇది. భూమికి సుమారు 10–50 కిలోమీటర్ల ఎత్తులో ఉండే ఓజోన్ పొర హానికారక రేడియో ధారి్మకత నుంచి భూమిని రక్షిస్తుంటే.. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వాడకం వల్ల భూమ్మీద తయారయ్యే ఓజోన్ వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వాహనాల పొగలోని నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ల రసాయన చర్య వల్ల ఓజోన్ తయారవుతుంది. అదీ ప్రతి వంద కోట్ల అణువులకు గరిష్టంగా వంద వరకు ఓజోన్ అణువులు ఉండొచ్చు అంతే. కానీ అవే రకరకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంటాయి. ఇక భూమి పైపొరల్లోని ఓజోన్ గురించి మాట్లాడుకుందాం. భూమ్మీద ఉన్న ఓజోన్‌లో 90 శాతం స్ట్రాటోస్ఫియర్లోనే ఉంటుంది. యూవీ–బీ కిరణాల నుంచి మనల్ని రక్షిస్తుంటుంది ఓజోన్ పొర. అతి నీలలోహిత కిరణాలు మూడు రకాలు యూవీ–ఏ, యూవీ–బీ, యూవీ–సీ. యూవీ–ఏ కిరణాల శక్తి తక్కువ కాబట్టి ప్రభావమూ అంతగా ఉండదు. యూవీ–సీ స్ట్రాటోస్ఫియర్‌లో ఆక్సిజన్‌తో కలసిపోవడం వల్ల భూమిని చేరే అవకాశం లేదు. యూవీ–బీతోనే సమస్య అంతా. ప్రమాదకరమైన ఈ యూవీ–బీ కిరణాలు తగిలినప్పుడు ఓజోన్ కాస్తా.. ఆక్సిజన్ (ఓ2), ఆక్సిజన్ అణువుగా విడిపోతాయి. ఆ తర్వాత ఈ రెండూ కలిసిపోయి ఓజోన్‌గా మారతాయి. ఓజోన్‌తో సమస్య ఇది.. భూ వాతావరణంలోకి చేరుతున్న కొన్ని రసాయనాల కారణంగా ఓజోన్ పొర పలుచన కావడం, చిల్లు పడుతోందని శాస్త్రవేత్తలు 1970లలోనే గుర్తించారు. సాధారణంగా స్ట్రాటోస్ఫియర్‌లో ఒకపక్క ఓజోన్.. ఆక్సిజన్ పరమాణువులుగా విడిపోతుంటే ఇంకోవైపు ఈ పరమాణవులన్నీ కలిసిపోయి ఓజోన్ ఏర్పడుతుంటుంది. ఈ వాతావరణ పొరలో ఉండే నైట్రోజన్, హైడ్రోజన్ వంటి ఇతర వాయువులు కూడా ఓజోన్‌తో రసా యన చర్య జరపడం వల్ల సమస్యలు వస్తాయి. ఇవి కాస్తా ఓజోన్ ఆక్సిజన్‌గా మారకుండా నిరోధిస్తుంటాయి. ఫలితంగా ఓజోన్ వాయువు మోతాదు తగ్గుతూ వస్తుంది. మానవ చర్యల కారణంగా వాతావరణంలోకి చేరే క్లోరిన్, బ్రోమిన్లు కూడా సమస్యను జటిలం చేస్తున్నాయి. ఓజోన్ పొరకు చిల్లుపెట్టే వాయువుల్లో క్లోరోఫ్లోరోకార్బన్స్ (ఫ్రిజ్‌లు, డియోడరెంట్ క్యాన్లు, షేవింగ్ ఫోమ్, హిట్ వంటి కీటకనాశనుల్లో వాడతారు) ముఖ్యమైనవి కాగా.. హైడ్రో క్లోరోఫ్లోరో కార్బన్స్, హాలోన్స్, మిథైల్ బ్రోమైడ్స్ వంటివీ ప్రమాదకరమైనవే. మన కంప్యూటర్లు, ఇతర ఎల్రక్టానిక్ పరికరాలను శుభ్రం చేసేందుకు వాడే సాల్వెంట్స్, కార్ డ్యాష్‌బోర్డు, ఇళ్లు, ఆఫీసుల్లో వేడి నుంచి రక్షణ కోసం ఉపయోగించే ఫోమ్, అగ్నిమాపక యంత్రాల్లో వాడే రసాయాలన్నీ ఓజోన్ పొరకు చేటు తెచ్చేవే. -
పెద్దలకూ పరీక్షలు
మనం ముఖం చూసుకోడానికి అద్దం వాడతాం. ఏమైనా తేడా వస్తే వెంటనే గుర్తిస్తాం. ముఖం మీద ఏదో గాయమో, అలర్జీయో లాంటిది కనిపిస్తే వెంటనే తగిన చికిత్స తీసుకునేందుకు హాస్పిటల్‌కు పరుగెడతాం. ఇక మిగతా ఒళ్లు భాగం కూడా అంతే. కాకపోతే ముంజేతి కంకణానికి అక్కర్లేనట్టే మిగతా శరీరభాగాలకూ అద్దం అవసరం లేదు. ఇలా బయట కనిపించే తేడాలను గుర్తించడం సరే... కానీ మరి ఒంట్లోని మిగతా శరీర భాగాలు, అంతర్గత అవయవాలు, వాటి పనితీరులో తేడాలు ఇవన్నీ గుర్తించడం ఎలా? అందుకు వైద్య పరీక్షలు తోడ్పడతాయి. మరీ ముఖ్యంగా నలభై, యాభై ఏళ్లు దాటాక ప్రతి వ్యక్తిలోనూ అంతర్గత అవయవాల పనితీరులో మార్పులు రావడం మొదలవుతుంది. అయితే ఒంటి మీద వచ్చినట్టుగా అవి బయటకు కనిపించవు కదా. అందుకే ఒక వయసు దాటాక తరచూ వైద్య పరీక్షలు చేయిస్తూ ఉండాలనీ, అందులో కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలు లేదా వైద్య సమస్యలు రాబోతున్న విషయం ముందగానే తెలుసుకుంటే మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. యాభై ఏళ్లు దాటినవారిలో మరీముఖ్యంగా పురుషుల్లో ఎలాంటి వైద్య పరీక్షలు అవసరమో, అవి ఎందుకు చేయించాలో తెలిపేందుకు ఉపయోగపడేదే ఈ ప్రత్యేక కథనం. సాధారణంగా యాభై, అరవైలలో వచ్చే ఆరోగ్య సమస్యలు చాలావరకు వెన్వెంటనే బయటకు తమ లక్షణాలను కనిపించనివ్వవు. బయటకు అంతా బాగున్నట్లు అనిపించినా, లోపల ఆరోగ్యం అంతే బాగుండకపోవచ్చేమో! ఉదాహరణకు హైబీపీ. అది ఉన్నట్లే తెలియదు. కానీ లోపలంతా డొల్ల చేసేస్తుంది. ఆరోగ్యాన్ని గుల్లబారుస్తుంది. అలాగే డయాబెటిస్. ఇలాంటిదే కొలెస్ట్రాల్. అందుకే యాభై, అరవైలలో ఆ వయసు పురుషుల ఆరోగ్యానికి కొన్ని పరీక్షలు అవసరం. ఇక మధ్య వయసు వచ్చే వరకూ వాళ్లకు పొగతాగే అలవాటు ఉంటే పైన పేర్కొన్న జబ్బులతో పాటు గుండెపోటూ, క్యాన్సర్ వంటి వాటికీ అవకాశం ఎక్కువ. ఇక క్యాన్సర్ వంటి కొన్ని జబ్బులను ముందుగానే కనుగొంటే మంచి ఫలితం ఉంటుంది. ఉదాహరణకు చాలా రకాల క్యాన్సర్లను మొదటి దశలోనే కనుగొన్నామనుకోండి. 85కి పైగా రకాలను దాదాపుగా నూరుపాళ్లు పూర్తిగా నయం చేయవచ్చు. యాభై ఏళ్ల పురుషులకు చేయించాల్సిన పరీక్షలు చక్కెర వ్యాధి కోసం: సాధారణంగా ఉదయాన్నే పరగడుపున ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేయించాలన్న విషయం ఈ రోజుల్లో చాలామందికి తెలిసిందే. అనంతరం భోజనం చేసిన రెండు గంటల తర్వాత పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ కూడా చేయించాలి. ఈ రెండు పరీక్షలతో రక్తంలోని చక్కెర పాళ్ల ఆధారంగా డయాబెటిస్ తీవ్రతను నిర్ధారణ చేస్తారు. ఇక వీటితో పాటు సీరమ్ క్రియాటినిన్, సీయూఈ అనే పరీక్షలు కూడా అవసరమవుతాయి. డయాబెటిస్ కారణంగా మూత్రపిండాలూ ప్రభావితం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి క్రియాటినిన్ పరీక్షలో మూత్రపిండాలు ఏమైనా ప్రభావితం అయ్యాయా అన్న విషయం తెలుస్తుంది. అలాగే సీయూఈ పరీక్ష అన్నది మూత్రపరీక్ష. దీని ద్వారా జాండిస్ ఏమైనా వచ్చాయా అన్నది తెలుసుకుంటారు. అంతేగాక చక్కెర పాళ్లు నియంత్రణలో ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోడానికి హెచ్‌బీఏ1సీ, జీటీటీ (గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్) అనే పరీక్షలు అవసరమవుతాయి. గుండె జబ్బుల నిర్ధారణ కోసం: ► గుండెజబ్బుల నిర్ధారణ కోసం కొన్ని సాధారణ వైద్య పరీక్షలు ►ఈసీజీ, ►లిపిడ్ ప్రొఫైల్ వంటివి చేయిస్తారు. ఇక గుండెజబ్బల కోసమే చేయించాల్సిన ప్రత్యేక పరీక్షలు... ►2డి ఎకో ►టీఎమ్‌టీ ►సీటీస్కాన్‌తో పాటు అవసరాన్ని బట్టి ►కరోనరీ యాంజియో వంటివి డాక్టర్ల సలహా మేరకు చేయించాల్సి ఉంటుంది. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు: ►క్యాన్సర్ నిర్ధారణ కోసం ఈ కింది సాధారణ పరీక్షలు చేస్తారు. ►పురుషుల్లో ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ (పీఎస్ఏ) అనే పరీక్షను ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ కోసం చేస్తారు. చాలా చిన్న రక్త పరీక్ష అయిన దీని ద్వారా త్వరగా ప్రోస్టేట్ క్యాన్సర్‌ను దాదాపుగా నయం చేయవచ్చు. ►ఛాతీ ఎక్స్–రే (ఇది అనేక వ్యాధులతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లనూ నిర్ధారణ చేస్తుంది), అల్ట్రాస్కాన్ అబ్డామిన్ ప్రత్యేక పరీక్షలు కూడా చేస్తారు. ►బోన్‌స్కాన్ పరీక్ష, ► పెట్ స్కాన్ పరీక్ష వంటివి ఎముకల పరిస్థితిని ఎలా ఉందో తెలుసుకోవడం కోసం, పెట్ స్కాన్ ద్వారా ఒంట్లో ఎక్కడైనా క్యాన్సర్ కణం ఉందేమో తెలుసుకునేందుకు చేస్తారు. (ఇవి క్యాన్సర్ నిర్ధారణలో ముందుగా చేసే ప్రాథమిక పరీక్షలు, వీటిలో ఏదైనా తేడా ఉన్నట్లు తెలిస్తే మరి కాస్త అడ్వాన్స్డ్ పరీక్షలు అవసరమవుతాయి. వీటిలో ఏమీ లేదని తెలిస్తే ఇప్పటికి క్యాన్సర్ ముప్పేమీ లేదని నిశ్చింతగా ఉండవచ్చు. అయితే యాభై ఏళ్ల వయసు దాటాక ఈ క్యాన్సర్‌ను కనుగొనే స్క్రీనింగ్ పరీక్షలను డాక్టర్ చెప్పిన వ్యవధుల్లో (ఇంటర్వెల్స్‌లో) చేయించాలి.) పళ్లకు సంబంధించిన పరీక్షలు: మన నోటి ఆరోగ్యం (ఓరల్ హెల్త్) మీదే అనేక ఒంటి సమస్యలు ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మన నోటిలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది గుండె సమస్యలకూ దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి నోటిని శుభ్రంగా ఉంచుకుంటే దేహంలోని అంతర్గత అవయవాల్లో చాలా వాటిని ఆరోగ్యంగా ఉంచవచ్చు. అందుకే దంతాలను పరీక్షింపజేసుకోవడం కోసం ప్రతి ఆర్నెల్లకు ఒకమారు డెంటిస్ట్‌ను సంప్రదించాలి. వాటి సలహా మేరకు అవసరాన్ని బట్టి పళ్లు క్లీన్ చేయించుకోవాలి. ఇక చిగుళ్ల వ్యాధులు ఏవీ లేవని నిర్ధారణ చేసుకుని నిశ్చింతగా ఉండాలి. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చిగుళ్ల వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. కంటి పరీక్షలు: మీ కళ్లను ప్రతి రెండేళ్లకు ఒకసారి కంటి నిపుణులకు చూపించుకోవాలి. ఎందుకంటే ఓ వయసు దాటాక కళ్లలో ఇంట్రాఆక్యులార్ ప్రెషర్ అనే ఒక రకం ప్రెషర్‌ను చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఇది ఎక్కువైతే గ్లకోమాకు దారితీయవచ్చు. అందుకే ఇంట్రాఆక్యులార్ ప్రెషర్‌ను పరీక్ష చేయించుకుని గ్లకోమా అవకాశాలు ఏవీ లేవని తెలుసుకుని నిర్భయంగా ఉండవచ్చు. మీకు మద్యం, సిగరెట్ అలవాట్లు ఉంటే... ►పురుషుల్లో చాలామందికి పొగతాగడం, మద్యం తీసుకోవడం వంటి అలవాట్లు ఉంటాయి. మీరు పొగతాగేవారైతే... గుండె పరీక్షలతో పాటు... ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలుసుకునే పీఎఫ్‌టీ పరీక్ష కూడా చేయించుకోవాలి. ►ఇక ఆల్కహాల్ అలవాటు ఉన్నవారైతే... కాలేయ సామర్థ్యాన్ని తెలుసుకుని లివర్ ఫంక్షన్ టెస్ట్ (ఎల్ఎఫ్టీ పరీక్ష), గుండె పరీక్షలతో పాటు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పరీక్షలు చేయించుకోవాలి. ►స్థూలకాయం ఉంటే... మీరు ఏ మేరకు స్థూలకాయులో తెలుసుకునేందుకు బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ)తో పాటు, థైరాయిడ్ సమస్యలను తెలుసుకునేందుకు అవసరాన్ని బట్టి టీ3, టీ4, టీఎస్‌హెచ్ పరీక్షలనూ చేయించుకోవాలి. ఇక స్థూలకాయులు ఎఫ్బీఎస్, లిపిడ్ ప్రొఫైల్స్ చేయించడం కూడా అవసరం. ►ఇక్కడ ప్రస్తావించిన సమస్యలేగాక ఇతరత్రా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే... వాటిని బట్టి మీ ఫిజీషియన్ సలహా మేరకు అవసరమైన మరికొన్ని పరీక్షలు చేయించుకోవాలి. అరవైలలో ఆరోగ్య పరీక్షలివే... పురుషుల్లో వయసు అరవైకి చేరాక ఆ వయసుకు తగినట్లుగా కొన్ని పరీక్షలు చేయించుకోవడం మంచిది. అవి... ►అబ్డామినల్ అయోర్టిక్ అన్యురిజమ్ స్క్రీనింగ్: పురుషుల వయసు 65–75 మధ్య ఉన్నవాళ్లు... గతంలో వాళ్లకు పొగతాగిన అలవాటు ఉంటే... అయోర్టిక్ అన్యురిజమ్ అనే కండిషన్ కోసం ఒకసారి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పరీక్ష చేయించుకోవడం మంచిది. బీపీ స్క్రీనింగ్: ఒక వయసు దాటాక ఇక తరచూ బీపీ చెక్ చెయించుకోవడం అవసరం. ఇకవేళ డయాబెటిస్, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, ఇతరత్రా ఏవైనా జబ్బులు ఉంటే దానికి సంబంధించి డాక్టర్ పేర్కొన్న పరీక్షలను క్రమం తప్పకుండా చేయంచాలి. కొలెస్ట్రాల్ స్క్రీనింగ్: యాభై దాటాక ఒకసారి కొలెస్ట్రాల్ పరీక్ష చేయించి, అది నార్మల్ గనక వస్తే ఇక అప్పట్నుంచి ప్రతి ఐదేళ్లకోమారు కొలెస్ట్రాల్ స్థాయులు తెలుసుకుంటూ ఉండటం మంచిది. ►ఒకవేళ వారికి డయాబెటిస్, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం డాక్టర్ పేర్కొన్న వ్యవధిలో క్రమం తప్పకుండా కొలెస్ట్రాల్ స్క్రీనింగ్ పరీక్ష చేయిస్తూ ఉండాల్సిందే. ►డయాబెటిస్ కోసం తరచూ పరీక్షలు చేయిస్తూనే ఉండాలి. ఒకవేళ అది ఉన్నట్లు తేలితే డాక్టర్ పేర్కొన్న వ్యవధిలో క్రమం తప్పకుండా చక్కెర నిర్ధారణ పరీక్షలు చేయించాలి. గుండె పరీక్షలు: ఈసీజీ, 2 డి ఎకో, టీఎమ్‌టీ వంటి పరీక్షలు డాక్టర్ సలహా మేరకు చేయించాలి. పెద్ద వయసులో ఈ పరీక్షలతో ఇక నిశ్చింత ►ఏడాదిలో ఒకసారి మల పరీక్ష ►ప్రతి ఐదేళ్లకోసారి ఫ్లెక్సిబుల్ సిగ్మాయిడోస్కోపీ. దీనితో పాటు స్టూల్ అక్కల్ట్ బ్లడ్ టెస్ట్ కొలనోస్కోపీ అనే పరీక్ష యాభై దాటిన నాటి నుంచి ప్రతి పదేళ్లకోమారు చేయించుకోవడం మంచిది. ►కొలనోస్కోపీ అనే పరీక్షను ప్రతి పదేళ్లకోమారు చేయించుకోవడం మంచిది. ►ఇక వ్యక్తిగతంగా ఉన్న లక్షణాలను, కుటుంబ చరిత్రను, రిస్క్ ఫ్యాక్టర్స్‌ను బట్టి డాక్టర్ సూచించిన ఇతర పరీక్షలు చేయించుకోవాలి. వయసు పైబడ్డాక తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు : పురుషులు 65 ఏళ్లు దాటాక అంతకు ముందు ఎప్పుడూ తీసుకుని ఉండకపోతే ‘న్యూమోకోకల్ వ్యాక్సిన్’ తీసుకోవాలి. ఒకవేళ గతంలో తీసుకుని ఉండి, ఐదేళ్లు దాటినా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. ► ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాధి నుంచి రక్షణకోసం ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. ► ప్రతి పదేళ్లకోమారు టెటనస్–డిఫ్తీరియా బూస్టర్ డోస్ తీసుకుంటూ ఉండాలి. ►గతంలో ఎప్పుడూ తీసుకోకపోతే 65 ఏళ్లు దాటక టీ–డాప్ వ్యాక్సిన్ తీసుకోవాలి. (ఇది డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది). ►అరవై దాటక షింగిల్స్ లేదా హెర్పిస్ జోస్టర్ వ్యాక్సిన్ తీసుకోవాలి. గతంలో తీసుకుని ఉండకపోతే ఇది వెంటనే తీసుకోవడం మేలు. చివరగా... ఇవేగాక సాధారణంగా చూసుకునే పరీక్షలైన బరువు చెక్ చేయించుకోవడం, కింద జారిపడకుండా చూసుకోవడం, చెవులు చక్కగా వినిపిస్తున్నాయేమో చూసుకోవడం, ఆహ్లాదంగా లేకపోతే డిప్రెషన్‌కు గురికాకుండా జాగ్రత్త పడటం వంటి ఎవరికి వారు చేసుకునే పరీక్షలతోపాటు పొగతాగడం, ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా వాకింగ్ వంటి వ్యాయామాలు చేయడం, మంచి పుష్టికరమైన ఆహారం తీసుకోవడం వంటివి చేస్తుంటే వయసు పైబడ్డా సరే... ఆ సమయంలోనూ దీర్ఘకాలం ఆరోగ్యంగా, ఎలాంటి సమస్యలూ లేకుండా చాలాకాలం ఆరోగ్యంగా ఉంటారు. మహిళల కోసంఉద్దేశించిన ప్రత్యేక పరీక్షలివి... ఇక మహిళల విషయానికి వస్తే... పైన పేర్కొన్న పరీక్షలతో పాటు (పురుషుల కోసం ఉద్దేశించిన పీఎస్ఏ వంటివి కాకుండా... వారికే ప్రత్యేకమైన మామోగ్రామ్ పరీక్షలు, పాప్‌స్మియర్ పరీక్షల వంటివి చేయించుకుంటూ ఉండాలి. మహిళల్లో మెనోపాజ్ దాటాక వారిలో కొన్ని సమస్యలు కనిపించడం చాలా సాధారణం. వారి వచ్చే ఆ సమస్యలను బట్టి అవసరమైతే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ వంటివి అవసరం కావచ్చు. అందుకోసం డాక్టర్లు సూచించిన మరికొన్ని ప్రత్యేక పరీక్షలు అవసరమవుతాయి. ఇక మెనోపాజ్ దశకు చేరకముందు... మహిళల్లో వారిలోని ఈస్ట్రోజెన్ హార్మోన్ కారణంగా వారి గుండెకు ఒక స్వాభావికమైన రక్షణ ఉంటుంది. మెనోపాజ్ తర్వాత ఆ స్వాభావిక రక్షణ తొలగిపోతుంది కాబట్టి గుండెకు సంబంధించిన పరీక్షలనూ దాంతోపాటు క్రమం తప్పకుండా హైబీపీ, షుగర్ పరీక్షలను చేయించుకుంటూ ఉండాల్సిందే. డాక్టర్ జి. హరిచరణ్ సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
నగరానికి రేడియేషన్
సాక్షి, హైదరాబాద్ : కళ్ల మంటలు, త్వరగా అలసిపోవడం, తెల్లరక్త కణాలు తగ్గడం, జట్టు రాలడం, జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు లాంటి సమస్యలు నగరజీవికి సాధారణమయ్యాయి. ఇంట్లో ఉండే వారి కంటే వివిధ కారణాలతో రోడ్లపైకి వస్తున్న వారిలో ఇది ఎక్కువ. ఇలాంటి సమస్యలకు రేడియేషన్ కూడా ఓ కారణమంటోంది బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్). తాజాగా బార్క్ చేపట్టిన అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు తేలాయి. దక్కన్ పీఠభూమిలో అనేక భౌగోళిక ప్రత్యేకతలున్న గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఇటీవలి కాలంలో రేడియేషన్ (వికిరణ తీవ్రత) అధికంగా నమోదవుతున్నా దీన్ని శాస్త్రీయంగా లెక్కించే విషయంలో పీసీబీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గతేడాది గ్రేటర్ పరిధిలో రేడియేషన్ తీవ్రతపై బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) నిపుణులు చేపట్టిన అధ్యయనంలో ఏటా 2 మిల్లీసీవర్ట్స్ (రేడియేషన్ కొలిచే ప్రమాణం) మేర నమోదవుతున్నట్లు తేలింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఈ తీవ్రత ఏటా 1 మిల్లీ సీవర్ట్స్‌కు మించరాదు. కాగా ఈ రేడియేషన్ తీవ్రతను శాస్త్రీయంగా లెక్కించేందుకు ఎన్విరాన్మెంటల్ రేడియేషన్ మానిటర్స్ (ఈఆర్ఎం)ను నగరవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని బార్క్ పరిశోధన సంస్థ పీసీబీకి సూచించినా ఫలితం లేదు. హైదరాబాద్‌తోపాటు పలు మెట్రో నగరాల్లో ఇటీవల రేడియేషన్ తీవ్రత క్రమంగా పెరుగుతోందని బార్క్ అధ్యయనంలో తేలింది. రేడియేషన్ పెరుగుతోంది ఇలా.. దక్కన్ పీఠభూమిలో సముద్ర మట్టానికి సుమారు 536 మీటర్ల ఎత్తున ఉన్న హైదరాబాద్‌లో గ్రానైట్, బాసాల్ట్, గోండ్వానా శిలా స్వరూపాలు అత్యధికంగా ఉండటమూ వాటి నుంచి వెలువడే వికిరణాలు సైతం రేడియేషన్ పెరిగేందుకు ఒక కారణం. పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాల వినియోగం పెరగడం, కాలం చెల్లిన వాహనాలు వాడకం, పరిశ్రమల కాలుష్యం పెరుగుతూనే ఉంది. మరోవైపు భూమి పైపొరలపై విశ్వకిరణాలు (కాస్మిక్ కిరణాలు) పడుతుండటం, సిటీ కాంక్రీట్ జంగిల్లా మారడంతో భూమి వాతావరణం నుంచి వికిరణ తీవ్రత పైకి వెళ్లే దారులు లేక, హరిత వాతావరణం తగ్గడంతో రేడియేషన్ తీవ్రత పెరుగుతోందని తేలింది. విముక్తి ఇలా... గ్రేటర్ పరిధిలో 8 శాతం మేర ఉన్న హరిత వాతావరణాన్ని 30 శాతానికి పెంచాలి. ప్రతి ఇళ్లు, కార్యాలయం, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్, కాలనీల్లో విరివిగా మొక్కలు నాటాలి. ఎక్కువ సేపు మోటారు వాహనాల కాలుష్యాన్ని పీల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండటం కూడా రేడియేషన్ తీవ్రత బారిన పడకుండా కాపాడుతుంది. ఇక పీసీబీ సైతం ఎన్విరాన్మెంటల్ రేడియేషన్ మానిటర్స్‌ను ఏర్పాటు చేసి తీవ్రతను శాస్త్రీయంగా లెక్కించడంతోపాటు నివారణ చర్యలను చేపట్టే అంశంపై బల్దియా యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేయాలి. రేడియేషన్ అధికంగా ఉన్న ప్రాంతాలు... బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ప్రశాసన్‌నగర్, మసాబ్‌ట్యాంక్, నాచారం, జీడిమెట్ల, బాలానగర్, కాటేదాన్, పాశామైలారం, కుత్బుల్లాపూర్ అనర్థాలు ఇలా.. చర్మం, కళ్ల మంటలు, ఉక్కపోతతో సతమతం. త్వరగా అలసిపోవడం, తలనొప్పి, గుండెకొట్టుకునే వేగం పెరుగుతుంది. తెల్ల రక్తకణాలు తగ్గిపోతాయి. డయేరియా, వాంతులు, జుట్టు రాలడం, జీర్ణవ్యవస్థ దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతాయి. -
వయస్సు 50 తర్వాత అయితే...!
న్యూఢిల్లీ : యాభై ఏళ్లు దాటిన ఆలు మగల మధ్య లేదా స్త్రీ, పురుషుల మధ్య సెక్స్ అంతంత మాత్రంగానే ఉంటుందని తెల్సిందే. కొందరి మధ్య అంతంత మాత్రమే కాదు, అస్సలు ఉండకపోవచ్చు. 50 ఏళ్లు దాటిని పురుషుడికి సరైన సెక్స్ లేకపోతే మూడింట రెండు వంతులు జబ్బున పడే అవకాశం ఉందట. అలాగే 50 ఏళ్లు దాటిన మహిళలకు లేకపోతే వ్యాధి గ్రస్తులయ్యే అవకాశం 64 శాతం ఉందట. 50 ఏళ్లు దాటిన స్త్రీ, పురుషులు సెక్స్‌లో పాల్గొంటే వారిలో 85 కాలరీలు కరగిపోతాయని, ఆనందాన్ని కలిగించే ఎండార్పిన్స్ విడుదలవుతాయని పరిశోధకులు తేల్చి చెప్పారు. సెక్స్లేని మగవాళ్లకు 64 శాతం క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, 41 శాతం దీర్ఘకాలిక జబ్బు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడించారు. నపుంసకులైన మగవాళ్లలో వాస్కులర్ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉందని డాక్టర్ లీ స్మిత్ తెలిపారు. ఆంగ్లిన్ రష్కిన్ యూనివర్శిటీ అధ్యయన బందం 5,700 స్త్రీ, పురుషులపై జరిపిన అధ్యయనం వివరాలను డాక్టర్ లీ స్మిత్ మీడియాకు వెల్లడించారు. సెక్స్‌తో సహా అన్ని వ్యాయామాలు ఆరోగ్యానికి మంచివేనని ఆయన చెప్పారు. సెక్స్‌లో పాల్గొనని వారిలో మధుమేహం, కీళ్ల నొప్పులు ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉందని ఆయన వివరించారు. 50 ఏళ్లు పైబడిన స్త్రీ, పురుషుల మధ్య సెక్స్ ఏ మేరకు తగ్గుతూ వస్తుందో, ఆ మేరకు వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ లీ స్మిత్ చెప్పారు. ఈ వయస్కుల వారిలో సెక్స్ తగ్గినట్లయితే వారు ఏదో జబ్బుకు గురైనట్లు భావించవచ్చా? ప్రశ్నకు వారీ అధ్యయనంలో ఎలాంటి వివరణా పేర్కొనలేదు. ‘ఆర్కీవ్స్ ఆఫ్ సెక్సువల్ బిహేవియర్’ అనే పత్రికలో ఈ సెక్స్ అధ్యయనానికి సంబంధించిన వివరాలను ప్రచురించారు. -
నకిలీ మందుల మాయగాళ్లు!
జిల్లాలో నకిలీ మందుల వ్యాపారం జోరుగా సాగుతోంది. కొందరు వైద్యులు కాసుల కక్కుర్తితో, విదేశీ పర్యటనలపై మోజుతో నాసిరకం మందులను రోగులకు రాసిస్తున్నారు. కర్నూలుతో పాటు నంద్యాల, ఆదోని, ఇతర పట్టణాల్లో ఈ దందా కొనసాగుతోంది. కొన్ని మెడికల్ స్టోర్ల నిర్వాహకులు కూడా నకిలీ మందులతో జీరో బిజినెస్ చేస్తున్నారు. దీనివల్ల ఒకవైపు రోగులకు నష్టం జరగడంతో పాటు మరో వైపు ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. సాక్షి , కర్నూలు : రాయలసీమలో అత్యధికంగా మెడికల్ ఏజెన్సీలు ఉన్న ప్రాంతం కర్నూలు జిల్లా. ఇందులో కొన్ని ఏజెన్సీలు నకిలీ ఔషధ దందా సాగిస్తున్నాయి. కాంట్రాక్టు బేసిస్ మెడిసిన్ పేరుతో ఈ దందా సాగుతోంది. ఏజెన్సీలతో పాటు మందుల తయారీ కంపెనీలు కొన్ని నేరుగా వైద్యులతో సంబంధాలు పెట్టుకుని, వారు నడుపుతున్న ఆస్పత్రులకు నకిలీ మందులను సరఫరా చేస్తున్నాయి. వీటికి ఎలాంటి బిల్లులు ఉండవు. మరికొందరు వైద్యులు మందుల దుకాణాల యజమానులతో కుమ్మక్కై అధిక లాభాలు వచ్చే కొన్ని రకాల నకిలీ మందులనే రాసిస్తున్నారు. ప్రతి ఫలంగా భారీ పర్సెంటేజీలు అందుకుంటున్నారు. ఈ వ్యవహారం డ్రగ్ కంట్రోల్ అధికారులకు తెలిసినా కాసుల కక్కుర్తితో దుకాణాలపై దాడులు చేయడం లేదు. భారీ నజరానాలు కాంట్రాక్ట్ బేసిస్ మందులు సిఫారసు చేసినందుకు డాక్టర్లకు కంపెనీ ప్రతినిధులు ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ.లక్ష వరకూ ముట్టజెబుతున్నారు. అలాగే ఖరీదైన బహుమతులు అందజేస్తున్నారు. ఏడాదికి రెండుసార్లు థాయ్‌లాండ్, దుబాయ్, మలేషియా, సింగపూర్, హాంకాంగ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి విదేశీ పర్యటనలకు పంపుతున్నారు. అలాగే దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో సమావేశాల పేరుతో స్టార్ హోటళ్లలో విందులు ఏర్పాటు చేస్తున్నారు. వైద్యుల అండ కోసం కంపెనీలు ఇంత భారీగా వ్యయం చేస్తున్నాయంటే వారికి ఏ స్థాయిలో లాభాలు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అవసరార్థం వచ్చే రోగుల నుంచి మెడికల్ కంపెనీలు అడ్డగోలుగా దండుకున్న సొమ్మునే ఇలా ఖర్చు చేస్తున్నారని స్పష్టమవుతోంది. సంగారెడ్డి, మెదక్ నుంచి సరఫరా నకిలీ మందులు ఎక్కువగా సంగారెడ్డి, మెదక్ కేంద్రంగా కర్నూలు జిల్లాకు సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పరిసరాల్లో డ్రగ్స్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో కొన్నింటిలో నకిలీ మందులు తయారు చేసి పంపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మందులు వాడటం వల్ల రోగులకు కొత్తగా ఎలాంటి దుష్పరిణామాలూ ఉండవు. ఆరోగ్యానికి హానికరం కాని పౌడర్లను ఉపయోగించి తయారుచేస్తుండడమే ఇందుకు కారణం. ఈ నకిలీ మందుల తయారీకి అయ్యే ఖర్చు తక్కువ. కానీ ఎమ్మార్పీ మాత్రం భారీగా ఉంటుంది. ఈ మందులు వాడితే రోగికి ఉన్న జబ్బు నయం కాదు. పైగా మరింత ముదిరి రోగి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమయ్యే పరిస్థితి కూడా ఉత్పన్నమవుతుంది. నకిలీ మందులు ఇవిగో.. నొప్పి నివారణకు వాడే అసిక్లోఫినాక్ మందు స్థానంలో ‘ఎ...ఆ...’అనే రెండురకాల కంపెనీల పేర్లతో ఉన్న మందులు అంటగడుతున్నారు. జలుబు, అలర్జీ నియంత్రణకు వాడే సిట్రిజిన్‌న్‌స్థానంలో ఓ..సె.., ఆ.. పేర్లతో ఉండే మందులను, కడుపులో మంట నివారణకు వాడే ఫాంటాప్రిజోల్ స్థానంలో ‘ ఫా’ పేరుతో ఉండే మరో మూడు రకాల నకిలీ మందులను రాసిస్తున్నారు. ఇలా చాలా రకాల నకిలీ మందులు మెడికల్ స్టోర్ల నుంచి రోగులకు చేరుతున్నాయి. వీటిపై లాభాల శాతం అధికంగా ఉంటోంది. దీంతో మందుల దుకాణ యజమానులు భారీగా దండుకుంటున్నారు. ఇందులో కొంత పర్సెంటేజీ వైద్యులకు ముట్టజెప్పుతున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో మెడికల్ స్టోర్లు ఏర్పాటు చేసిన వారు ఆస్పత్రి కరెంటు బిల్లు, ఇతర ఖర్చులను కూడా భరిస్తున్నారు. రుగ్మతలతో డాక్టర్ల వద్దకు వచ్చే రోగులను డాక్టర్లు, మెడికల్స్టోర్ నిర్వాహకులు కలిసి నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదంతా తెలిసినా డ్రగ్ ఇన్స్పెక్టర్లు మాత్రం చర్యలు తీసుకోకుండా నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. -
మంచి ఆహారంతోనే ఆరోగ్యం
సాక్షి, పార్వతీపురం(విజయనగరం) : మన దేశంలో 45 శాతం మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు ఓ సర్వే నివేదిక. ఇది నిజంగా అందరినీ కలవరపెట్టే సామాజిక సమస్య. ఇదే దేశంలోని కొద్దో, గొప్పో మంది పిల్లలు విపరీతమైన జంక్‌ఫుడ్స్‌కు అలవాటు పడి ఊబకాయులుగా తయారౌతున్న పరిస్థితి. ఈ రెండింటికీ చెందని మధ్యతరగతి పిల్లలది మరో ప్రత్యేక కేటగిరి. ఈ పిల్లల ఆహారపు అలవాట్లు ఇటీవల కాలంలో చిత్రంగా తయారవుతున్నాయి. పట్టణాలు, నగరాల్లో నివసించే వారిలో అధికశాతం తల్లులు పిల్లలకు కేవలం తిండితినిపించడం పైనే శృతిమించిన శ్రద్ధ కనబరుస్తారని, అది బెడిసి కొట్టి మొదటికే మోసం వచ్చి పిల్లలు అసలు తినాలంటేనే మారాం చేసే మొండి ఘటాలుగా తయారవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇష్టంగా తింటే ఒంటికి మంచిది... చందమామ రావే... జాబిల్లి రావే...కొండెక్కిరావే..గోగుపూలు తేవే... అంటూ చిన్నప్పుడు తల్లులు ఏంచక్కా పాటల పాడుకుంటూ పిల్లలకు గోరుముద్దలు తినిపించడమనేది కాస్తా వెనుకటి తరం వారికి చిరపరిచయమే. ఇప్పుడు అలాంటి కమనీయ దృశ్యాలు కనుమరుగైపోయి జీవితం యాంత్రికంగా తయారైపోయింది. ఆకలివేసినా, వేయకపోయినా పిల్లలను పట్టుకుని నోట్లో తప్పనిసరిగా ఏదో ఒకటి కుక్కాలన్నట్లుగా తల్లులు బలవంతం చేయడం, పిల్లలు అందుకు ప్రతీకారంగా తినకుండా ముప్పతిప్పలు పెట్టడం, వాంతులు చేసుకోవడం, ఆ తరువాత తన్నులు, ఆపై బుజ్జిగింపులు వంటి సంఘటనలు ప్రతి ఇంటిలో నేడు కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల వైద్యుల వద్దకు వచ్చే కేసుల్లో దాదాపు 50 శాతానికి పైగా తమ పిల్లలు సరిగ్గా తినడం లేదనే ఫిర్యాదులే ఉంటాయి. ఇష్టంగా తింటేనే పిల్లల ఒంటికి మంచిదన్నది వైద్యుల సూచన. అలవాట్లను మార్చాల్సిందే... దాగుడు మూతలు, గోళీకాయలాట, బొంగరాలు, కబడ్డీ, ఖోఖో వంటి ఆటలతో బిజీగా గడపడం.. సరదాగా చదువుకోవడం.. దశాబ్దం కిందటి చదువు సంద్యల చిత్రం. కంప్యూటర్లో, లేదంటే సెల్ఫోన్లలో టెంపుల్‌రన్, హేండీక్రష్ లాంటి గేమ్సు ఆడడం, టీవీల్లో కార్టూన్ షోలకి, క్రికెట్ షోలకి పరిమితమైపోవడం.. పొద్దస్తమానం హోంవర్కులు, ట్యూషన్లు, పరీక్షలు, ర్యాంకులు ఇవీ నేటి పిల్లల ఆటపాటలు. శారీరక వ్యాయామం లేకపోవడంతో చిన్నారుల్లో రకరకాల ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. అలాగే స్వీట్లు, ఐస్క్రీమ్సు, పిజ్జాలు, బర్గర్లు, చాక్లైట్లు, కోక్ పానియాలు ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయి కొవ్వుగా మారిపోయే జంక్ ఫుడ్స్‌కి పిల్లలు ఇటీవల కాలంలో బాగా అలవాటు పడిపోతున్నారు. దీనికి తోడుగా ఏమాత్రం ఆటలో శారీరక శ్రమ లేకపోవడం, పైగా చదువుల ఒత్తిళ్లు ఇవన్నీ కలగలసి చిన్నపిల్లల్లో ఊబకాయంతో పాటు ప్రవర్తనా పరమైన సమస్యలు తలెత్తేలా చేస్తున్నాయి. పిల్లల ఆహారం, అలవాట్లలో మార్పు అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
క్రమం తప్పితే ముప్పే!
సాక్షి, విశాఖపట్నం : మధుమేహ వ్యాధి మెరుగైన నియంత్రణకు మంచి జీవనశైలితో పాటు, మందులు కచ్చితంగా వాడటం ఎంతో ముఖ్యమైన విషయం. మందులు వాడకంలో ఏ మాత్రం తేడా వచ్చినా శరీరంలో సుగర్ లెవల్స్ అదుపు తప్పుతాయి. ప్రస్తుతం మధుమేహంతో బాధపడుతూ మందులు వాడుతున్న వారిలో సగం మందికిపైగా తమ శరీరంలో సుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోలేకపోతున్నారు. అందుకు సరైన పద్ధతిలో, వైద్యులు సూచించిన విధంగా మందులు వాడకపోవడమే కారణాలుగా తేలింది. ఇటీవల మధుమేహం అదుపులో లేకపోవడానికి క్లినికల్ ఫార్మసిస్టులు చేసిన అధ్యయనాల్లో మందులు సరిగ్గా వాడక పోవడమే కారణంగా తేలింది. క్రమం తప్పకుండా మందులు వేసుకోవడం ఎలా?. దాని ప్రాముఖ్యం, రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుందాం. వైద్యులు చేయాల్సినవి... తమ వద్దకు వచ్చిన రోగులకు మెరుగైన సుగర్ నియంత్రణ మందులు ఇవ్వగలగాలి చికిత్స ఫలితం ఆలస్యంగా ఉంటుందని, క్రమం తప్పకుండా మందులు వాడితే ఫలితం ఉంటుందని రోగికి ఓపిగ్గా వివరించగలగాలి. 12 నుంచి 15 రకాల మందులు రాయడం, చేతిరాత అర్థం కానటువంటి మందులు రాయడం చేయరాదు. తాము రాసే బిళ్లలు ఎప్పుడు వేసుకోవాలి? ఎలా వేసుకోవాలో వివరించడంతో పాటు, ఏ మందులు దేనికి పనిచేస్తుందో తెలియజెప్పాలి. నూతన ఇన్సులిన్ విధానం సులభతరంగా ఉండాలి. ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్ రాయడం వలన ప్రిస్కిప్షన్‌లో మందుల సంఖ్య తగ్గించవచ్చు. రోగులు చేస్తున్న తప్పులు ప్రయాణాలు, శుభకార్యాల సమయంలో మందులు వేయడం మర్చిపోతుంటారు. మందులు రోజులో నాలుగుసార్లు వేసుకోవాల్సి ఉంటే.. రెండు, మూడుసార్లు వేసుకుని సరిపెట్టడం. మతిమరపు కారణంగా ఒకసారి మందులు వేసుకున్న తర్వాత సుగర్ లెవల్స్ చెక్ చేసుకుని ఆపివేస్తుంటారు. కుటుంబం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం. అంటే ఏ సమయానికి మందులు వేసుకోవాలి, ఏ మందు వేసుకోవాలో తెలిపే వారు లేకపోవడం. -
నిను వీడని నీడను నేనే
సాక్షి, విశాఖపట్నం : కంటినిండా కునుకు కరువయ్యిందా..?అయితే.. పనిలో ఏకాగ్రత కోల్పోతారు.చిన్న విషయానికే కోపం, చిరాకు పడుతుంటారు..ఊబకాయులుగా మారిపోతారు..అవునా.. సరిగా నిద్రపోకపోతే ఇన్ని సమస్యలు వెంటాడతాయా? అని ఆశ్చర్యపోతున్నారా.? ఇది అక్షరాలా నిజం. ఎందుకంటే ఎవరైనా నిద్రపోతున్న వారిని మేల్కొలిపితే ‘బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు’ అంటూ కొంచెం అసహనం వ్యక్తం చేస్తారు. నిద్రను బంగారంతో పోల్చడం చూస్తే ఎంతటి ప్రాధాన్యం ఉందో ఇక్కడే తెలిసిపోతోంది. మానవుడికే కాదు పశుపక్ష్యాదులకూ నిద్ర అవసరమే. ఆకలి రుచి ఎరగదు.. నిద్ర సుఖమెరగదు.. అంటారు. కడుపు నిండా తిండి.. కంటి నిండా నిద్ర.. ఇంతకు మించిన జీవితం ఏముంటుందనడంలో అతిశయోక్తి లేదనిపిస్తోంది. అయితే మారుతున్న జీవన శైలి కారణంగా కంటికి కునుకు దూరమైపోతోంది. నిద్రలేమితో కనురెప్పలు మూతలు పడక అలసిపోతున్నాయి. ఈ విపత్కర పరిణామాలు ఎన్నో అనర్థాలకు దారితీస్తున్నాయి. ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, చదువులో విపరీతమైన పోటీ.. సాధారణంగా వీటివల్లే నిద్రలేమి సమస్యలు వస్తాయి. వీటన్నింటికంటే యువత నిద్రలేని రాత్రులు గడుపుతుండటానికి మూలకారణం ఇంటర్నెట్ వినియోగం, స్మార్ట్‌ఫోన్ ఫీవర్. వీటితో సావాసం చేసుకుంటూ నిద్రమానుకుంటున్నారు. అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ అంటూ గంటలు గంటలు గడిపేస్తున్నారు. ఏడాది కిందట ఎయిమ్స్ విడుదల చేసిన ఓ సర్వే ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా 70 శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని వెల్లడైంది. ఇక విశాఖ నగరం విషయానికొస్తే 60 శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారని తేలింది. ఇందులో యువతే ఎక్కువ శాతం ఉంది.. రోజుకు 7 గంటలు నిద్రపోయిన వారిలో మరణశాతం రేటు తక్కువగా ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. అలాగే రోజుకు 6 గంటల కంటే తక్కువ 8 గంటల కంటే ఎక్కువ పడుకున్నా.. 15 శాతం మరణ రేటు పెరుగుతుందని వెల్లడించింది. ఒకప్పుడు నిద్ర పోయే సమయం రాత్రి 7 నుంచి 8 గంటలకు ప్రారంభమయ్యేది. టీవీలు వచ్చాక అది కాస్తా 10 గంటలైంది. కంప్యూటర్లు వచ్చాక 11 గంటలు., స్మార్ట్ఫోన్లు వచ్చాక అర్ధరాత్రి 12.. ఒంటి గంట, 2 గంటలు.. ఇలా.. దాటిపోతోంది. నగరంలోనూ నిద్రలేమి దేశ రాజధానిలోనే కాదు.. ప్రతి నగరం దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. విశాఖ నగరంలో ముఖ్యంగా యువతరం నిద్రకు దూరమైపోతోంది. ఒక దశలో అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల వరకూ నిద్రపోకుండా కొన్ని నెలల పాటు కాలం వెళ్లదీసిన వారి శరీర గడియారంలో వచ్చిన మార్పుల కారణంగా నిద్రపోదామని ఇప్పుడు ప్రయత్నిస్తున్నా.. ఫలితం శూన్యం. కేవలం యువతరమే కాదు.. ఉద్యోగులు, వ్యాపారులు సైతం.. తమ పనులు ముగించుకుని ఇంటికి వచ్చాక.. సెల్‌ఫోన్‌తో సావాసం చేస్తూ.. ఆరోగ్యానికి మేలు చేకూర్చే నిద్రను మరిచిపోతున్నారు. ఓవైపు పని ఒత్తిడి, మరోవైపు.. టెక్నాలజీ రెండూ కలిసి సిటీజనులను నిద్రకు దూరం చేస్తున్నాయని నగరానికి చెందిన పలు సంస్థలు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. 83 శాతం మంది కలత నిద్రకు గురవుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. ప్రభుత్వ, ప్రైవేట్, సొంత వ్యాపారాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ప్రజలు నిద్ర సుఖానికి దూరమైపోతున్నారు. నిత్యం 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నవారు 31 శాతం కాగా, 6 గంటల కంటే తక్కువ సమయం శయనిస్తున్నవారు 27 శాతం మంది ఉండటం గమనార్హం. ఇక 25 శాతం మంది ఏకంగా 5 గంటల కంటే తక్కువ సమయమే నిద్రపోతున్నారని అధ్యయనంలో తేలింది. 35 శాతం మంది అర్ధరాత్రి 12 నుంచి ఒంటిగంట దాటిన తర్వాత కానీ.. నిద్రకు ఉపక్రమిస్తున్నారంట. రాత్రి సమయంలో నిద్రలేమి కారణంగా పని చేస్తున్న ప్రాంతాల్లో 83 శాతం మంది ఓ పావు గంట సేపు కునుకు తీస్తున్నారని అధ్యయనంలో తేలింది. చక్కటి నిద్రకు చిట్కాలివే.... నిద్రకు ఉపక్రమించే ముందు టీ, కాఫీలు తాగకూడదు. నిద్రపోయే ప్రదేశంలో చీకటిగా ఉండాలి. వెలుతురు కళ్లపై పడకుండా జాగ్రత్త పడాలి. నిద్రకు ఉపక్రమించే సమయంలో సెల్ఫోన్లను దూరం పెట్టాలి. అవసరమైతే స్విచాఫ్ చేయాలి. వీలైనంత వరకూ పడుకునే సమయానికి గంట ముందుగానే టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు ఆఫ్ చేయాలి. మంచి పుస్తకం చదువుతూ నిద్రపోతే గాఢనిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో వైఫై కనెక్షన్ ఉంటే.. రాత్రి 8 గంటలకే ఆఫ్ చేయాలి. అప్పుడే సోషల్‌మీడియాలో ఎలాంటి అప్డేట్స్ మిమ్మలను విసిగించవు. మెడిటేషన్ సాధన చేస్తూ.. శరీరంపై పట్టు సాధించాలి. యోగా, నడక, వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. మధ్య వయసులో ఉన్న వారు 24 గంటల్లో కచ్చితంగా నిద్రకు 8 గంటలు కేటాయించాలి. మిగిలిన 8 గంటలు పని, మరో 8 గంటలు శారీరక అవసరమైన పనులకు వినియోగించాలి. -
కాయిల్ పొగ.. పెడుతుంది సెగ..!
వానాకాలం వచ్చేసింది.. దోమలు విజృంభించే కాలమిది. ఏం ఫర్వాలేదు.. వాటిని తరిమేందుకు మా దగ్గర కాయిల్ ఉందిగా అనుకుంటున్నారా.. అయితే మీరు ఈ వార్త చదవాల్సిందే. ఎందుకంటే దోమలను పారదోలేందుకు వాడే కాయిల్స్‌తో కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కాయిల్స్ పొగతో పాటు ఇళ్లలోపల సిగరెట్ పొగ కారణంగా అనారోగ్యం గ్యారంటీ అని తాజా అధ్యయనం చెబుతోంది. అయితే ఇక్కడ ఓ శుభవార్త ఉంది. ఈ రెండు పొగల కారణంగా కేన్సర్ మాత్రం రాదని ఎస్ఎన్ అప్లయిడ్ సైన్సెస్ తాజా సంచికలో ప్రచురితమైన పరిశోధన వ్యాసం చెబుతోంది. ఇళ్ల లోపలి గాలిలోని కాలుష్యం మన ఆరోగ్యంపై ఏ రకమైన ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు ఆగ్రాలోని అంబేడ్కర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. సీల్ చేసిన గదిలో వేర్వేరు పొగల ద్వారా ఏయే రసాయనాలు, లోహాలు గాల్లో కలుస్తున్నాయి.. వాటి పరిమాణం ఎంత.. (పీఎం 25, పీఎం 10, పీఎం 2.5, పీఎం 1) అన్నది లెక్కకట్టారు. మండించేందుకు ముందు.. మండుతూ ఉండగా, ఆ తర్వాత పరిశీలించగా అల్యూమినియం, రాగి, జింక్, కాడ్మియం, క్రోమియం, మాంగనీస్, నికెల్, సీసం, వనాడియం, సెలీనియం, స్కాండియం వంటివి ఉన్నట్లు స్పష్టమైంది. వీటిల్లో కూడా అల్యూమినియం, జింక్‌ల మోతాదు ఎక్కువగా ఉందని, కాడ్మియం, వనాడియంలు లేశమాత్రంగా ఉన్నాయని అజయ్ తనేజా అనే శాస్త్రవేత్త తెలిపారు. కేన్సర్ ప్రమాదం తక్కువే.. క్రోమియం, సీసం, నికెల్‌ల ద్వారా కేన్సర్ వచ్చే అవకాశం ఉన్నా.. దోమల కాయిల్, సిగరెట్ పొగ రెండింటి ద్వారా వెలువడే ఈ లోహాలు పరిమితమైన స్థాయిలోనే ఉన్నాయని ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. అయితే ఎంతకాలం పాటు ఈ విషవాయువులను పీలిస్తే శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయో స్పష్టంగా తెలియదని అజయ్ తనేజా వివరించారు. కాయిల్‌కు బదులుగా ద్రవాన్ని వాడినా ఇవే రకమైన రసాయనాలు విడుదలవుతాయని చెప్పారు. వాయుకాలుష్యం అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్న నేపథ్యంలో కేంద్రం వాయుకాలుష్య నివారణకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాయిల్, సిగరెట్లను మండించినప్పుడు అతి సూక్ష్మమైన ధూళికణాలు గాల్లోకి చేరతాయని వీటిని పీల్చడం వల్ల.. శరీరంపై దద్దుర్లు, అనేక రకాల అలర్జీలు, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశముందని అజయ్ తెలిపారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేసి ఫలితాలను నిర్ధారించుకోవాల్సి ఉందని చెప్పారు. -
ప్రాణం మీదకి తెచ్చిన నూడుల్స్ చట్నీ
న్యూఢిల్లీ : నూడుల్స్ అంటే చిన్నా పెద్దా అంతా ఎగబడి మరీ లాగించేస్తారు. అయితే నోరూరించే చట్నీతో నూడుల్స్ తిన్న మూడేళ్ల చిన్నారి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. నూడుల్స్‌తో అందించే స్పైసీ చట్నీని ఆరగించి, తీవ్ర అనారోగ్యం పాలైన బాలుడు దాదాపు చావు అంచుల వరకు వెళ్లి తృటిలో బయట పడ్డాడు. హర్యానాకు చెందిన మజూర్ కుమారుడు ఉస్మాన్ నూడుల్స్ లో వేసే చట్నీ అంటే ప్రాణం. ఎంత ప్రాణం అంటే కప్పుల కొద్దీ దాన్ని లాంగించేంత. ఒక రోజుసాయంత్రం ఎప్పటిలాగే నూడుల్స్‌తో పాటు కప్ చట్నీని ఆబగా ఆరగించేశాడు. అంతే ఇక ఆ రాత్రి ఉస్మాన్ ఆరోగ్యం క్రమంగా క్షీణించడం ప్రారంభించింది. ఉస్మాన్ శరీరం నలుపు రంగులోకి మారింది. బీపీ పూర్తిగా పడిపోవడంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బాలుడిని ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు ఊపిరితిత్తులు పాడయ్యాయని గుర్తించారు. వెంటనే అతడికి వెంటిలేటర్‌పై వైద్యం అందించారు. దాదాపు 16 రోజులపాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించి బాలుడికి తిరిగి ప్రాణం పోశారు. అయితే స్ట్రీట్ ఫుడ్‌లో అమ్మకందారులు, నూడుల్స్ , ఇతర ఆహార పద్దార్థాల్లో రుచి కోసం వాడే ఎసిటిక్ యాసిడ్ దీనికి కారణమని వైద్యులు తేల్చారు. ఇది మోతాదు మించితే ఆరోగ్యానికి హానికరని చెప్పారు. అదే బాలుడి ప్రాణాలమీదకితెచ్చిందని స్పష్టం చేశారు. -
మైగ్రేన్ నయమవుతుందా?
నా వయసు 26 ఏళ్లు. నాకు కొంతకాలంగా తలలో ఒకవైపు విపరీతమైన తలనొప్పి వస్తోంది. ఆఫీసులో ఏపనీ చేయలేకపోతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే మైగ్రేన్ అన్నారు. హోమియో మందులతో ఇది తగ్గుతుందా? – ఆర్. జానకి, అమలాపురం పార్శ్వపు నొప్పి అని కూడా పిలిచే ఈ మైగ్రేన్ తలనొప్పిలో తలలో ఒకవైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. సాధారణంగా ఇది మెడ వెనక ప్రారంభమై కంటివరకు వ్యాపిస్తుంది. యువకులతో పోలిస్తే యువతుల్లో ఇది ఎక్కువ. కారణాలు: తలలోని కొన్ని రకాల రసాయనాలు అధిక మోతాదులో విడుదల కావడం వల్ల పార్శ్వపు నొప్పి వస్తుందని తెలుస్తోంది. ఇక శారీరక, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, చాలాసేపు ఆకలితో ఉండటం, సమయానికి భోజనం చేయకపోవడం, సైనసైటిస్, అతి వెలుగు, గట్టి శబ్దాలు, ఘాటైన వాసనలు, పొగ, మద్యం వంటి అలవాట్లు, మహిళల్లో నెలసరి సమయాల్లో, మెనోపాజ్ సమయాల్లో స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వంటివి ఈ సమస్యకు కారణాలుగా చెప్పవచ్చు. లక్షణాలు: పార్శ్వపు నొప్పిలో చాలారకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిని మూడురకాలుగా విభజించవచ్చు. 1 పార్శ్వపు నొప్పి వచ్చేముందు కనిపించే లక్షణాలు : ఇవి పార్శ్వపునొప్పి వచ్చే కొద్ది గంటలు లేదా నిమిషాల ముందు వస్తాయి. చికాకు, నీరసం, అలసట, నిరుత్సాహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రకాల తినుబండారాలు ఇష్టపడటం, వెలుతురు, శబ్దాలను తట్టుకోలేకపోవడం, కళ్లు మసకబారడం, కళ్లముందు మెరుపులు కనిపించడం జరగవచ్చు. వీటినే ‘ఆరా’ అంటారు. 2 పార్శ్వపునొప్పి సమయంలో కనిపించే లక్షణాలు: తీవ్రమైన తలనొప్పి, తలలో ఒకవైపు వస్తుంటుంది. ఇది 4 నుంచి 72 గంటల పాటు ఉండవచ్చు. 3 పార్శ్వపు నొప్పి వచ్చాక కనిపించే లక్షణాలు: చికాకు ఎక్కువగా ఉండటం, నీరసంగా ఉండటం, వికారం, వాంతులు విరేచనాలు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స / నివారణ: కొన్ని అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. మనకు ఏయే అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తున్నాయో జాగ్రత్తగా గమనించి, వాటికి దూరంగా ఉండటం ద్వారా మైగ్రేన్‌ను నివారించవచ్చు. అలాగే కాన్స్టిట్యూషన్ పద్ధతిలో ఇచ్చే ఉన్నత ప్రమాణాలతో కూడిన హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. -
ఆపరేషన్ లేకుండా పైల్స్ తగ్గుతాయా?
నా వయసు 60 ఏళ్లు. మలవిసర్జన అవుతున్నప్పుడు రక్తం పడుతోంది. కొన్నిసార్లు నొప్పిగానూ ఉంటోంది. ఆపరేషన్ అవసరం అంటున్నారు. హోమియోలో చికిత్స ఏదైనా ఉందా? – ఎమ్‌డి. మౌలానా, వరంగల్ పైల్స్ చాలా సాధారణ సమస్య. మలవిసర్జన సమయంలో తీవ్రమైననొప్పి, రక్తస్రావం కావడం వంటి సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం మొలలు (పైల్స్). మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల ఈ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. మలద్వారం వద్ల ఉన్న రక్తనాళాలపై ఒత్తిడి తీవ్రంగా ఉండటం వల్ల వాటిల్లో కొన్ని బొడిపెల్లా తయారవుతాయి. వాటినే పైల్స్ అంటారు. మల విసర్జన తర్వాత వీటి బాధ ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట, దురద ఉండి సూదులతో గుచ్చినట్లుగా అనిపిస్తుంది. ఒకచోట కూర్చోలేరు. నిలబడలేరు. రకాలు: ఇందులో ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ అని రెండు రకాలు ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ మలవిసర్జన మార్గంలోనే ఉంటాయి. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే బయటకు వచ్చేవి. ఇవి బఠాణీగింజ అంత పరిమాణంలో గులాబీరంగులో మూడు లేదా నాలుగు గుత్తులుగా ఉంటాయి. కారణాలు : ∙మలబద్దకం, తగినంత నీళ్లు తాగకపోవడం ∙పొత్తికడుపు ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం ∙గర్భం ధరించిన స్త్రీలు కొందరు పైల్స్ బారిన పడుతుంటారు ∙మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం ∙ఎక్కువ సమయం పాటు నిలబడి ఉండటం ∙మద్యం, హెపటైటిస్ వల్ల కాలేయం దెబ్బతిన్నవాళ్లలో కూడా పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చికిత్స: హోమియో వైద్యవిధానంలో ఆపరేషన్ అవసరం లేకుండానే చికిత్స చేయవచ్చు. బ్రయోనియా, నక్స్‌వామికా, అల్యుమినా వంటి మందులను వ్యక్తిగత లక్షణాలను బట్టి అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.