అమెరికాలో పచ్చబొట్టు వేయించుకున్న 20 లక్షల మందికి తీవ్ర ఆరోగ్య సమస్యలు
తీవ్రమైన బ్లడ్ క్యాన్సర్ నుంచి వివిధ రకాల ఇన్ఫెక్షన్లు
టాటూ తొలగింపుతోనూ క్యాన్సర్ కారకాల పెరుగుదల
ప్రపంచ మార్కెట్‌లో విస్తరిస్తున్న టాటూ కల్చర్
సాక్షి, అమరావతి : ప్రపంచవ్యాప్తంగా పచ్చబొట్టు (టాటూ) సంస్కృతి విస్తరిస్తోంది. ఒకప్పుడు చేతులతో సూదులు పట్టుకుని పచ్చబొట్టు పొడిస్తే.. నేడు అత్యాధునిక మెషిన్ల సాయంతో నచ్చిన వెరైటీ, డిజైన్లలో సులభంగా టాటూలు వేస్తున్నారు. పురాతన ఆచారాలకు గుర్తుగా ఆదిమ తెగల్లో మాత్రమే ఉండే పచ్చబొట్టు సంస్కృతి నాగరిక సమాజంలో స్టేటస్ సింబల్, ఫ్యాషన్ పోకడగా మారిపోయింది. ముఖ్యంగా యువత సామాజిక మాధ్యమాల ద్వారా టాటూ సంప్రదాయాన్ని అలవర్చుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ప్రపంచ మార్కెట్‌లో టాటూ వ్యాపారం 2033 నాటికి రూ.5.21 లక్షల కోట్లు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, భారత్‌లోనూ పచ్చబొట్ల మార్కెట్ విస్తరిస్తోంది. ఏటా రూ.20 వేల కోట్ల మేర పచ్చ»ొట్ల వ్యాపారం జరుగుతుండగా 2023 నాటికి రూ.2.26 లక్షల కోట్లు ఉన్న మార్కెట్ 2032 నాటికి 5.21 లక్షల కోట్లకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణుల అంచనా. కానీ.. పరిశోధకులు పచ్చబొట్లపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పచ్చ»ొట్టు సిరాలో అనారోగ్యకర బ్యాక్టీరియాలు బయటపడటం చూసి ఆశ్చర్యపోతున్నారు.
అమెరికాకు చెందిన సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ శాస్త్రవేత్తలు పచ్చ»ొట్ల కోసం వినియోగించే 75 సిరాలను పరీక్షించారు. వీటిలో 26 నమూనాలలో బ్యాక్టీరియాను గుర్తించారు. ఈ సిరాలలో మూడింట ఒకవంతు కంటే ఎక్కువగా బ్యాక్టీరియా ఉండటం గమనార్హం. ఇదే విషయాన్ని అప్లైడ్ అండ్ ఎని్వరాన్‌మెంటల్ మైక్రోబయాలజీ జర్నల్ ద్వారా వెలుగులోకి తెచ్చారు.
పరిశోధనలో ఏం తేలిందంటే..
తాజా అధ్యయనం ప్రకారం.. పచ్చ»ొట్లు వేసుకున్న వారిలో అత్యధికంగా 6 శాతం మందిలో ఇన్ఫెక్షన్లు అధికంగా వస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో 10 నుంచి 20 శాతం మంది పచ్చబొట్లతోనే కనిపిస్తున్నారు. వీరిలో 6 శాతం ఇన్ఫెక్షన్ రేటును ప్రమాదకర స్థాయితోనే శాస్త్రవేత్తలు పోల్చారు. ఉదాహరణకు.. ఒక్క అమెరికాలోనే దాదాపు 33.30 కోట్ల మంది ప్రజల్లో కనీసం 3.3 కోట్ల మందికి టాటూలున్నాయి.
ఇందులో 6 శాతం మందికి ఇన్ఫెక్షన్ అంటే దాదాపు 20 లక్షల మందికి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్టు అంచనా వేసింది. నిజానికి అమెరికాలో టాటూ అనేది సర్వసాధారణం. అమెరికన్లలో పచ్చ»ొట్టు ఉన్న వారిలో 22 శాతం మందికిపైగా ఒకటి కంటే ఎక్కువ టాటూలు వేయించుకున్న ధోరణి కనిపిస్తోంది. పురుషులతో పోలిస్తే మహిళలే టాటూలు వేయించుకోవడంలో ముందుంటున్నారు.
ఇందులో 18 నుంచి 29 సంవత్సరాల వయసు గల స్త్రీలలో 56 శాతం, 30 నుంచి 49 సంవత్సరాల వయసు గల మహిళలు 53శాతం ఉండటం గమనార్హం. టాటూలతో వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పాటు అంటువ్యాధులు సోకి ప్రాణాపాయం కలిగిస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వీటిల్లో ముఖ్యంగా రక్తంలో బ్యాక్టీరియా చేరడం, గుండె లోపలి పొరల్లో ఇన్ఫెక్షన్ వస్తున్నాయి. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తిలో రక్తపోటు స్థాయి అమాంతం పడిపోతుండటంతో ప్రాణాంతకంగా మారుతోంది.
కంటి ఇన్ఫెక్షన్లూ పచ్చ»ొట్ల చలవే
2010, 2011లో జరిగిన పలు అధ్యయనాల్లో పచ్చ»ొట్టు సిరాలో ఏరోబిక్ బ్యాక్టీరియాను గుర్తించాయి. తాజాగా శాస్త్రవేత్తలు 14 కంపెనీలు అమెరికాలో అమ్మకానికి ఉంచిన టాటూ సిరాల్లో 75 నమూనాలను పరీక్షించారు. వీటిలో 34 బ్యాక్టీరియాలను కనుగొన్నారు. అందులో 19 ‘వ్యాధికారక జాతులు’గా వర్గీకరించారు.
ముఖంపై తీవ్రమైన మొటిమలు, కంటి ఇన్ఫెక్షన్లు (క్యూటి బ్యాక్టీరియం), రోగనిరోధక శక్తిలేని వ్యక్తుల్లో ఇన్ఫెక్షన్లు (స్టెఫిలోకాకస్ ఎపిడెరి్మడిస్), మూత్ర ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయని గుర్తించారు. వీటితో పాటు అలెర్జీ సమస్యలు, శరీరాన్ని రక్షించే తెల్లరక్త కణాలతోపాటు ఇతర కణజాలాల సమూహాన్ని దెబ్బతీయడం, పచ్చ»ొట్టు చుట్టూ మచ్చలు ఏర్పడటం పెరుగుతున్నాయి.
బ్లడ్ క్యాన్సర్ ముప్పు
పచ్చ»ొట్లు ప్రాణాంతక లింఫోమా(బ్లడ్ క్యాన్సర్)కు కారకాలవుతున్నాయి. ఇవి శరీరంలోని అవయవాల పనితీరును దెబ్బతీసి వ్యక్తి మరణానికి దారితీస్తున్నాయి. 11,905 మందిపై పరిశోధన చేస్తే.. పచ్చ»ొట్టు వేసుకోని వ్యక్తులతో టాటూ ఉన్న వ్యక్తులను పోలిస్తే మొత్తం లింఫోమా ప్రమాదం 21 శాతం పెరిగింది. ఆసక్తికరంగా, లేజర్ చికిత్స ద్వారా పచ్చ»ొట్టు తొలగించుకున్న వ్యక్తుల్లో లింఫోమా ప్రమాదం తీవ్రంగా ఉన్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పచ్చ»ొట్టు తొలగించే సమయంలో ఉత్పత్తి అయ్యే హానికరమైన సమ్మేళనాలతో ఇది సంభవిస్తున్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment