Tattoo
-
అక్కడ టాటూ చూపిస్తూ స్టన్నింగ్ పోజులు ఇచ్చిన దీప్తి సునైనా (ఫోటోలు)
-
వీపుపై సీక్రెట్ టాటూతో టాలీవుడ్ బ్యూటీ (ఫొటోలు)
-
‘ఆయన దేవుడు’ వీరాభిమాని గుండెలపై శాశ్వతంగా రతన్ టాటా
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా అస్తమయం ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని దుఃఖసాగరంలో ముంచేసింది. పారిశ్రామిక వేత్తగానే కాకుండా, ప్రముఖ దాతగా మానవతావాదిగా నిలిచిన ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ అభిమానులు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. అయితే ఈ విషయంలో మరో అడుగు ముందు కేశాడు రతన్ టాటా అభిమాని ఒకరు. ఏకంగా ఆయన టాటూను గుండెలపై ముద్రించుకుని అపారమైన ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విశేషంగా మారింది.రతన్ టటా ఫొటోను ఒక అభిమాని గుండెపై టాటూగా ముద్రించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను టాటూ ఆర్టిస్ట్ మహేష్ చవాన్, ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను నెటిజనులను ఆకట్టుకుంటోంది. రతన్ టాటాను తమ దేవుడిగా భావిస్తున్నట్లు వీడియోలో ఆ యువకుడు తెలిపాడు. ఈ సందర్భంగా హృదయాన్ని హత్తుకునే ఒక విషయాన్ని కూడా వెల్లడించాడు. కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న తన స్నేహితడు వైద్యం కోసం ఎంతో కష్టపడ్డాడని ఆ సమయంలో టాటా ట్రస్ట్ ఆదుకుని, వైద్యం అందించి అతడి ప్రాణాలను కాపాడిందని గుర్తు చేసుకున్నాడు. అందుకే తాను రతన్ టాటా ఫొటోను గుండెలపై టాటూ వేయించుకున్నానని తెలిపాడు.దీంతో ‘‘దేశం ఒక తన రతన్ (రత్నం)ని కోల్పోయింది అని ఒకరు, నిజంగానే ఆయన చాలా గ్రేట్, నిజమైన కోహినూర్‌ను కోల్పోయాం’’ అంటూ నెటిజన్లు ఆయనకు నివాళి అర్పించారు. ఈ వీడియో లక్షలకొద్దీ లైక్స్‌ను 80 లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించింది. కాగా గతవారం ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో 86 ఏళ్ల రతన్ టాటా కన్నుమూశారు. భారతీయ వ్యాపారరంగంలో ఒక శకం ముగిసింది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇంకా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Mahesh Chavan (@themustache_tattoo) -
భర్తతో విడాకులు.. టాటూ మార్చేసిన బుల్లితెర నటి
కోటి ఆశలతో కొత్త జీవితం ప్రారంభించిన బుల్లితెర నటి దల్జీత్ కౌర్‌కు భంగపాటు ఎదురైంది. వ్యాపారవేత్త నిఖిల్ పటేల్‌ను రెండో పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిన ఆమెకు కొంతకాలానికే అతడితో విభేదాలు మొదలయ్యాయి. అతడి పేరును పచ్చబొట్టుగా పొడిపించుకుని జీవితాంతం కలిసుందామన్న ఆశలు అడియాసలయ్యాయి. దంపతుల మధ్యలోకి మూడో వ్యక్తి వచ్చిందని, అందువల్ల తమ బంధం బీటలు వారిందంటూ కొద్ది నెలల క్రితం విడిపోతున్నట్లు ప్రకటించింది.టాటూతిరిగి ఇండియాకు వచ్చేసింది. తాజాగా ఆమె తన టాటూను మార్చేసింది. అంతకుముందు నిఖిల్‌తో తన జర్నీ ప్రారంభానికి సంకేతంగా 'టేక్ 2.. 07/09/22' అని ఉండేది. ఇప్పుడు దాన్ని పూర్తిగా మార్చేసింది. తల్లీకొడుకుల బంధాన్ని చాటిచెప్పేలా కొత్తగా పచ్చబొట్టును రీడిజైన్ చేసింది. తన కుమారుడు జేడన్ మీద ఉన్న ప్రేమను ఈ టాటూ ద్వారా బయటపెట్టింది. ఈ టాటూ వేయించుకున్నందుకు ఈసారి నొప్పిగా అనిపించలేదని చెప్పింది.రెండు పెళ్లిళ్లు ఫెయిల్‌కాగా చూపులు కలిసిన శుభవేళ (ఇస్ ప్యార్ కో క్యా నామ్ ధూ) ఫేమ్ దల్జీత్.. 2009లో నటుడు షాలిన్ బానోత్‌ను పెళ్లాడింది. వీరికి జైడన్ అనే కుమారుడు జన్మించాడు. ఈ జంట మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2013లో విడాకులు తీసుకున్నారు. అనంతరం ఓ పార్టీలో నిఖిల్ అనే వ్యక్తిని కలిసింది. 2023 మార్చిలో అతడిని పెళ్లి చేసుకోగా ఏడాది తిరగకముందే విడాకులకు దరఖాస్తు చేశారు.చదవండి: ఆ సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడ్డా : అరవింద్ స్వామి -
ట్రెండీ.. టాటూ! ఇవి తెలియకుంటే తప్పదు చేటు!
సాక్షి, సిటీబ్యూరో: నేను ఫ్యాషన్ లవర్ని అని చెప్పకుండానే చెప్పే మార్గం టాటూ.. ఇప్పుడు వయసుతో పనిలేకుండా అన్ని వర్గాల వారూ టాటూస్‌ని ముద్రించుకోవడం నగరంలో సర్వసాధారణంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఎప్పటి నుంచో టాటూస్ వినియోగంలో అనుభవం ఉన్నవారితోపాటు కొత్తగా వాటి పట్ల ఆసక్తి పెంచుకుంటున్నవారికీ కొదవలేదు. ఈ నేపథ్యంలో ఎంత ఫ్యాషన్ అయినప్పటికీ టాటూ కల్చర్‌లోకి అడుగుపెట్టే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.టాటూ వేయించుకోవడానికి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం ఎందుకో తెలియాలంటే.. టాటూ సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా మనం తెలు సుకోవాలి. అప్పుడే ప్రిపరేషన్ లోపిస్తే వచ్చే పరేషాన్ ఏమిటో అర్థం అవుతుంది."స్వతహాగా చర్మ అలర్జీలకు గురయ్యే అవకాశం ఉన్నట్లయితే లేదా ముందుగా వ్యాధులు ఏవైనా ఉంటే, పచ్చబొట్టు వేయించుకునే ముందు వాటి గురించి వైద్యునితో చర్చించి వారి సలహా మేరకు టాటూ వేయించుకోవాలి."టాటూ వేయడానికి ముందు, దానికి వినియోగించే సూదులు క్రిమిరహితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. స్టెరిలైజ్ చేయని లేదా కలుíÙతమైన సూదులను ఉపయోగించడం వల్ల హెచ్ఐవీ, హెపటైటిస్ బీ–సీ వంటి రక్తం ద్వారా సంక్రమించే వ్యాధుల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. – వెంటనే లేదా టాటూ వేసిన మొదటి రెండు వారాల్లో స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. వాపు, నొప్పి, ఎరుపు, దురద లేదా దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. తీవ్రమైన సందర్భాల్లో జ్వరం, పుండ్లు లేదా చీముకు దారితీస్తుంది. శరీరంలోకి ఇంజెక్ట్ చేసే ముందు నాన్ స్టెరైల్ వాటర్‌ని కలిపితే స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. కాబట్టి తరచి చూసుకోవడం అవసరం. – ఎంఆర్ఐ స్కానింగ్ ప్రక్రియలు చేయించుకుంటున్న రోగులు పచ్చబొట్టు పొడిచిన ప్రదే శంలో మంట, దురద లేదా వాపును అనుభవించవచ్చు. – ఇది తక్కువ–నాణ్యత లేని రంగులు లేదా టాటూ పిగ్మెంట్లలో ఐరన్ ఆక్సైడ్ వంటి రసాయనాల వల్ల కూడా కావచ్చు. – టాటూ వేయడానికి అయ్యే ఖర్చు కళాకారుడిపై మాత్రమే కాక ఉపయోగించిన సిరా రకం, పచ్చబొట్టు పరిమాణం, ఇంక్ చేయాల్సిన ప్రాంతం మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. ఖర్చుతో రాజీపడకుండా పేరున్న కళాకారుడితో టాటూ వేయించుకోవడం మేలు. – టాటూ వేయించుకున్న కొన్ని నెలల తర్వాత రంగు వాడిపోతుంది. కాబట్టి, రంగు సాంద్రతను స్థిరీకరించడానికి కొన్ని టచ్–అప్లు అవసరం కావచ్చు. – స్కిన్ ఇన్ఫెక్షన్లు లేదా ఇతర సమస్యలను నివారించడానికి టాటూ అనంతర సంరక్షణ చాలా ముఖ్యం. ఆ ప్రాంతం పూర్తిగా నయం అయ్యే వరకూ కళాకారుడి సలహాను పాటించండి.– టాటూలు వేసే పదాల స్పెల్లింగ్‌లు సరైనవని నిర్ధారించుకోవాలి. ఒక్కసారి టాటూ పూర్తయిన తర్వాత అక్షర దోషాలను సరిదిద్దలేరు. – మధుమేహం నియంత్రణలో లేకుంటే వైద్య సలహా తీసుకోవడం మంచిది. – టాటూ ఆర్టిస్ట్ చేతులను కడుక్కొని, స్టెరిలైజ్ చేసుకున్న తర్వాత టాటూ ప్రక్రియకు ముందు కొత్త గ్లౌజ్‌లు ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి. – ప్రక్రియకు 24 గంటల ముందు కెఫిన్ లేదా ఆల్కహాల్‌ను తీసుకోవద్దు. ఈ పదార్థాలు రక్తాన్ని పలచన చేసేవిగా వైద్యులు చెబుతున్న నేపథ్యంలో ప్రక్రియ సమయంలో అధిక రక్తస్రావం ఉండవచ్చు. – టాటూ కోసం ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవలసి ఉంటుంది కాబట్టి వదులుగా సౌకర్యవంతంగా ఉండే దుస్తులను ధరించడం మంచిది. – కనీసం 24 నుంచి 48 గంటల ముందు రక్తాన్ని పలచబరిచే మందులను తీసుకోకుండా ఉండటం మంచిది.అనారోగ్య ‘ముద్ర’.. అనస్థీషియా లేకుండా టాటూ వేయడం వల్ల కొంత నొప్పి, రక్తస్రావం కలిగే అవకాశం ఉంది. దీని గురించి ముందుగా తెలుసుకోవడం అవసరం. అలాగే టాటూ ఇంక్‌లో ఉండే రసాయనాలు లేదా లోహాలు, ప్రత్యేకించి కొన్ని రంగుల కారణంగా కొంతమందిలో అలర్జీ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు దురద, దద్దుర్లు, వాపు తదితర లక్షణాలు టాటూ వేయించుకున్న వెంటనే లేదా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా కనపడవచ్చు. టాటూల వల్ల అరుదుగా చర్మ కారక క్యాన్సర్‌కు కూడా కారణం కావచ్చు. ఎందుకంటే కొన్ని రంగులు లేదా వర్ణ ద్రవ్యాలు క్యాన్సర్ కారకాలు కావచ్చు.జాగ్రత్తలు ఇలా..– క్రిమిరహితం చేసిన సూదులు, మంచి నాణ్యమైన పిగ్మెంట్లు, ఉపయోగించిన సూదులు సరిగ్గా డిస్పోజ్ చేయడం వంటి ప్రమాణాలు పాటించే పేరున్న, లైసెన్స్ పొందిన స్టూడియోను ఎంచుకోవాలి. పరిశుభ్రతగల పరికరాలు భద్రతా ప్రమాణాలకు కొలమానాలు. అవి మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచేందుకు వీలుంటుంది.– పచ్చబొట్టు వేసుకునే రోజున, ప్రక్రియ సమయంలో ఆకలి బాధలు, తల తిరగడం లేదా మూర్ఛ వంటివి నివారించడానికి పుష్కలంగా నీరు తాగండి. తగినంత ఆహారం తీసుకోండి. టాటూ వేయించుకోవడానికి ముందు రోజు రాత్రి తగినంత నిద్రకావాలి.శుభ్రతతోనే.. సురక్షితం...టాటూకి సురక్షితమైన ప్రొఫెషనల్ స్టూడియోను ఎంచుకోవాలి. ఆ ప్రదేశం కూడా పూర్తి పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా ఉండాలి. ఎటువంటి సందేహాలు కలిగినా ఆర్టిస్ట్‌ను ప్రశి్నంచాలి. నీడిల్స్ తమ ముందే ఓపెన్ చేయాలని కోరాలి. రీ యూజబుల్ మెటీరియల్ అంతా ఆటో క్లోవ్లో స్టెరైల్ చేశారో లేదో గమనించాలి. అలాగే టాటూ వేసే సమయంలో నొప్పి భరించగలిగినంతే ఉంటుంది. అయితే శరీరంలో తల, పాదాలు, చేతుల అడుగు భాగం, పొత్తికడుపు, వెన్నెముక వంటి కొన్ని భాగాల్లోని చర్మ స్వభావం వల్ల కొంచెం నొప్పి ఎక్కువగా అనిపించవచ్చు. టాటూ వేసే సమయంలో వేసిన తర్వాత, కొన్ని రోజుల పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. – అమిన్, టాటూ ఆర్టిస్ట్ -
రావణుడిపై ప్రేమతో పచ్చబొట్టు వేయించుకున్న బుల్లితెర నటుడు
కొందరికి కొన్నిరకాల పాత్రలు పెద్దగా నప్పవు. అందులోనూ పౌరాణిక పాత్రలు అందరికీ అంతగా సెట్టవవు. కొద్దిమందికి మాత్రమే పర్ఫెక్ట్గా సూటవుతాయి. అందులో ఒకరే బుల్లితెర నటుడు నికితిన్ ధీర్. శ్రీమద్ రామాయణ్ సీరియల్లో ఇతడు రావణుడిగా ఆకట్టుకుంటున్నాడు. కేవలం పేపర్‌పై ఉన్న డైలాగులు బట్టీపట్టి చెప్పడం లేదు. ఆ పాత్రను అర్థం చేసుకున్నాడు. రావణుడిని లోతుగా చదివి అందులోకి పరకాయ ప్రవేశం చేశాడు.కుడికాలిపై టాటూశివభక్తుడిగా, రావణుడిగా అలరిస్తున్న నికితిన్ తాజాగా తన కుడికాలిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఎన్నో అనుభవాలకు నిలువుటద్దమే జీవితం. మనకు నిజమైన సంపద శరీరమే! పురాతన కాలం నుంచి సనాతన ప్రజలు పచ్చబొట్లను నమ్మేవారు. మనం చనిపోయాక కూడా అవి మనతోనే ఉన్నాయంటారు. టాటూ అనేది చెరగని ముద్రవంటిది.9 నెలలుగా..రావణుడి పాత్ర పోషించే అవకాశం ఇచ్చిన మహాదేవుడికి కృతజ్ఞతలు. 9 నెలలుగా ఈ పాత్రలో జీవిస్తూ తనను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. తనలాంటి(రావణుడి వంటి) రాజు మరొకరు ఉండరని తనకూ తెలుసు. తనలాంటి రాక్షసుడు ఇంకెవరూ లేరని కూడా తెలుసు. తనలాంటి నిష్ట బ్రాహ్మణుడు కూడా ఎవరూ ఉండరని ఎరుక.నా లైఫ్‌లోకి వచ్చినందుకు..తను వీణ వాయిస్తే ఆ సంగీతం వినేందుకు దేవతలు దిగి వస్తారు. ఆయన చంద్రహాస ఖడ్గాన్ని పట్టుకున్నప్పుడు అదే దేవతలు భయంతో దాక్కుంటారు. అలాంటి నువ్వు నా జీవితంలోకి చ్చినందుకు థ్యాంక్స్ అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. వీణ, చంద్రహాస ఖడ్గాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. View this post on Instagram A post shared by निकितिन धीर (@nikitindheer) -
టాటూ.. మహాచేటు
సాక్షి, అమరావతి : ప్రపంచవ్యాప్తంగా పచ్చబొట్టు (టాటూ) సంస్కృతి విస్తరిస్తోంది. ఒకప్పుడు చేతులతో సూదులు పట్టుకుని పచ్చబొట్టు పొడిస్తే.. నేడు అత్యాధునిక మెషిన్ల సాయంతో నచ్చిన వెరైటీ, డిజైన్లలో సులభంగా టాటూలు వేస్తున్నారు. పురాతన ఆచారాలకు గుర్తుగా ఆదిమ తెగల్లో మాత్రమే ఉండే పచ్చబొట్టు సంస్కృతి నాగరిక సమాజంలో స్టేటస్ సింబల్, ఫ్యాషన్ పోకడగా మారిపోయింది. ముఖ్యంగా యువత సామాజిక మాధ్యమాల ద్వారా టాటూ సంప్రదాయాన్ని అలవర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ మార్కెట్లో టాటూ వ్యాపారం 2033 నాటికి రూ.5.21 లక్షల కోట్లు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, భారత్‌లోనూ పచ్చబొట్ల మార్కెట్ విస్తరిస్తోంది. ఏటా రూ.20 వేల కోట్ల మేర పచ్చ»ొట్ల వ్యాపారం జరుగుతుండగా 2023 నాటికి రూ.2.26 లక్షల కోట్లు ఉన్న మార్కెట్ 2032 నాటికి 5.21 లక్షల కోట్లకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణుల అంచనా. కానీ.. పరిశోధకులు పచ్చబొట్లపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పచ్చ»ొట్టు సిరాలో అనారోగ్యకర బ్యాక్టీరియాలు బయటపడటం చూసి ఆశ్చర్యపోతున్నారు. అమెరికాకు చెందిన సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ శాస్త్రవేత్తలు పచ్చ»ొట్ల కోసం వినియోగించే 75 సిరాలను పరీక్షించారు. వీటిలో 26 నమూనాలలో బ్యాక్టీరియాను గుర్తించారు. ఈ సిరాలలో మూడింట ఒకవంతు కంటే ఎక్కువగా బ్యాక్టీరియా ఉండటం గమనార్హం. ఇదే విషయాన్ని అప్లైడ్ అండ్ ఎని్వరాన్మెంటల్ మైక్రోబయాలజీ జర్నల్ ద్వారా వెలుగులోకి తెచ్చారు. పరిశోధనలో ఏం తేలిందంటే.. తాజా అధ్యయనం ప్రకారం.. పచ్చ»ొట్లు వేసుకున్న వారిలో అత్యధికంగా 6 శాతం మందిలో ఇన్ఫెక్షన్లు అధికంగా వస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో 10 నుంచి 20 శాతం మంది పచ్చబొట్లతోనే కనిపిస్తున్నారు. వీరిలో 6 శాతం ఇన్ఫెక్షన్ రేటును ప్రమాదకర స్థాయితోనే శాస్త్రవేత్తలు పోల్చారు. ఉదాహరణకు.. ఒక్క అమెరికాలోనే దాదాపు 33.30 కోట్ల మంది ప్రజల్లో కనీసం 3.3 కోట్ల మందికి టాటూలున్నాయి. ఇందులో 6 శాతం మందికి ఇన్ఫెక్షన్ అంటే దాదాపు 20 లక్షల మందికి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్టు అంచనా వేసింది. నిజానికి అమెరికాలో టాటూ అనేది సర్వసాధారణం. అమెరికన్లలో పచ్చ»ొట్టు ఉన్న వారిలో 22 శాతం మందికిపైగా ఒకటి కంటే ఎక్కువ టాటూలు వేయించుకున్న ధోరణి కనిపిస్తోంది. పురుషులతో పోలిస్తే మహిళలే టాటూలు వేయించుకోవడంలో ముందుంటున్నారు. ఇందులో 18 నుంచి 29 సంవత్సరాల వయసు గల స్త్రీలలో 56 శాతం, 30 నుంచి 49 సంవత్సరాల వయసు గల మహిళలు 53శాతం ఉండటం గమనార్హం. టాటూలతో వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పాటు అంటువ్యాధులు సోకి ప్రాణాపాయం కలిగిస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వీటిల్లో ముఖ్యంగా రక్తంలో బ్యాక్టీరియా చేరడం, గుండె లోపలి పొరల్లో ఇన్ఫెక్షన్ వస్తున్నాయి. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తిలో రక్తపోటు స్థాయి అమాంతం పడిపోతుండటంతో ప్రాణాంతకంగా మారుతోంది. కంటి ఇన్ఫెక్షన్లూ పచ్చ»ొట్ల చలవే 2010, 2011లో జరిగిన పలు అధ్యయనాల్లో పచ్చ»ొట్టు సిరాలో ఏరోబిక్ బ్యాక్టీరియాను గుర్తించాయి. తాజాగా శాస్త్రవేత్తలు 14 కంపెనీలు అమెరికాలో అమ్మకానికి ఉంచిన టాటూ సిరాల్లో 75 నమూనాలను పరీక్షించారు. వీటిలో 34 బ్యాక్టీరియాలను కనుగొన్నారు. అందులో 19 ‘వ్యాధికారక జాతులు’గా వర్గీకరించారు. ముఖంపై తీవ్రమైన మొటిమలు, కంటి ఇన్ఫెక్షన్లు (క్యూటి బ్యాక్టీరియం), రోగనిరోధక శక్తిలేని వ్యక్తుల్లో ఇన్ఫెక్షన్లు (స్టెఫిలోకాకస్ ఎపిడెరి్మడిస్), మూత్ర ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయని గుర్తించారు. వీటితో పాటు అలెర్జీ సమస్యలు, శరీరాన్ని రక్షించే తెల్లరక్త కణాలతోపాటు ఇతర కణజాలాల సమూహాన్ని దెబ్బతీయడం, పచ్చ»ొట్టు చుట్టూ మచ్చలు ఏర్పడటం పెరుగుతున్నాయి. బ్లడ్ క్యాన్సర్ ముప్పు పచ్చ»ొట్లు ప్రాణాంతక లింఫోమా(బ్లడ్ క్యాన్సర్)కు కారకాలవుతున్నాయి. ఇవి శరీరంలోని అవయవాల పనితీరును దెబ్బతీసి వ్యక్తి మరణానికి దారితీస్తున్నాయి. 11,905 మందిపై పరిశోధన చేస్తే.. పచ్చ»ొట్టు వేసుకోని వ్యక్తులతో టాటూ ఉన్న వ్యక్తులను పోలిస్తే మొత్తం లింఫోమా ప్రమాదం 21 శాతం పెరిగింది. ఆసక్తికరంగా, లేజర్ చికిత్స ద్వారా పచ్చ»ొట్టు తొలగించుకున్న వ్యక్తుల్లో లింఫోమా ప్రమాదం తీవ్రంగా ఉన్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పచ్చ»ొట్టు తొలగించే సమయంలో ఉత్పత్తి అయ్యే హానికరమైన సమ్మేళనాలతో ఇది సంభవిస్తున్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
కల్కి భామ టాటూ గోల.. ఇంతకీ ఏ భాషనో తెలుసా?
లోఫర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ దిశా పటానీ ఇటీవలే కల్కి సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఈ చిత్రంలో కీలక పాత్రలో మెరిసింది. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన కల్కి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం 11 రోజుల్లనే రూ.900 కోట్ల క్లబ్లో చేరింది. దిశా పటానీతో పాటు దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కూడా నటించారు.కాగా.. ఇటీవల PD అనే టాటూతో వార్తల్లో నిలిచింది. ఇది చూసిన కొందరు ప్రభాస్ డార్లింగ్ అంటూ అర్థం వచ్చేలా ఎవరికీ నచ్చింది వారు చెప్పుకొచ్చారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి తన ఒంటిపై టాటూతో కనిపించింది. ప్రభాస్ కల్కితో తన అనుభవాన్ని షేర్ చేస్తూ ఫోటోలు, వీడియోలు పంచుకుంది. ఇందుతో దిశా పటానీ శరీరంపై అర్థం కానీ విదేశీ భాషలో ఉన్న టాటూ కనిపించింది. ఇది చూసిన నెటిజన్స్ దీని గురించి తెగ ఆరా తీస్తున్నారు. అసలు అర్థం కానీ భాషల్లో ఉన్న ఆ టాటూ ఏంటని చర్చించుకుంటున్నారు.అయితే దిశా పటానీ నడుము మీద ఉన్న టాటూ.. హీబ్రూ భాషలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్, ఆసియా, ఆఫ్రికా మధ్య ఉండే కొన్ని దేశాల్లో ఈ భాష మాట్లాడతారు. 'అతను నమ్మే ప్రతిదీ పొందవచ్చు' అని ఆ టాటూ అర్థమట. మరీ ఆ టాటూ గురించి తెలుసుకోవాలంటే హీబ్రూ నేర్చుకోవాలా? నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇది చూస్తుంటే కేవలం సినిమా షూటింగ్ కోసమే వేయించుకున్న టాటూలా అనిపిస్తోంది. రాక్సీ గెటప్‌లో ఉన్న దిశా పటానీ ప్రభాస్‌తో ఉన్న సెల్ఫీని కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) -
Deepika Padukone: ఫైనల్లీ ఆ టాటూని తొలగించిన దీపికా పదుకొణె!
బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్లో దీపికొ పదుకొణె- రణ్వీర్ సింగ్ జంట ఒకటి. రామ్ లీలా సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట.. 2018 నవంబర్ 14న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. త్వరలోనే ఈ బ్యూటీ ఓ బిడ్డకి జన్మనివ్వబోతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా గర్భం దాల్చిందనే విషయాన్ని రణ్వీర్ వెల్లడించాడు. తాజాగా ఈ భామ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో చర్చనీయాంశంగా మారింది. శనివారం దీపికా తన ఇన్‌స్టా ఖాతాలో ఓ ఫోటోని షేర్ చేసింది.అందులో ఆమె మెడ కనిపించేలా వెనుక వైపు తిరిగి ఉంది. గతంలో ఆమె వీపు భాగంపై ఓ టాటూ ఉండేది. ఇప్పుడది కనిపించలేదు. ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో రణ్వీర్ సింగ్‌తో పెళ్లి కంటే ముందు దీపికా పదుకొణె మరో స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమాయణం కొనసాగించింది. ఈ ఇద్దరి ప్రేమ విషయం బాలీవుడ్ అంతా తెలుసు. పెళ్లి కూడా చేసుకుంటారని అంతా భావించారు. కానీ కారణం ఏంటో తెలియదు కానీ బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రణ్‌బీర్‌తో స్నేహం ఏర్పడడం..అది కాస్త ప్రేమగా మారడంతో 2018లో పెళ్లి చేసుకున్నారు. అయితే రణ్‌బీర్‌తో ప్రేమలో ఉన్న సమయంలో దీపికా తన వీపుపై RK(రణ్‌బీర్ కపూర్ షార్ట్ కట్) అని టాటూ వేయించుకుంది. పెళ్లి తర్వాత కూడా ఆ టాటూని చెరిపేయలేదు. దీంతో అప్పట్లో ఈ టాటూపై బాలీవుడ్లో పెద్ద చర్చే జరిగింది. కానీ దీపికా మాత్రం ఆ టాటూపై స్పందించలేదు. ఇక తాజాగా షేర్ చేసిన ఫోటోలో ఆ టాటూ కనిపించకపోవడంతో.. ప్రెగ్నెంట్ అయిన తర్వాత దీపికా ఆ టాటూని తొలగించిందనే నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ సరసన కల్కీ 2898 ఏడీ చిత్రంలో నటిస్తోంది. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
దటీజ్ వైయస్ జగన్! వైరల్ అవుతున్న డై హార్డ్ ఫ్యాన్ టాటూ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కోట్లాది మంది అభిమానులున్నారు. తమఅభిమాన నాయకుడిని గుండెల్లో పెట్టు కుంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఒక యువతి తన అభిమానాన్ని చాటుకున్న వైనం విశేషంగా నిలుస్తోంది. ప్రియతమ నాయకుడు సీఎం వైఎస్ జగన్ ఫోటోను తన చేతిపై పచ్చబొట్టు వేయించుకుంది. తద్వారా తన గుండెల్లో ఉన్న తమ ప్రియతమ నాయకుడిపై ఉన్న గౌరవాన్ని, ప్రేమను ఉన్నతంగా చాటుకుంది. అంతేకాదు జగనన్న పచ్చబొట్టు వేయించుకుంటున్న వీడియోలను, ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో వైసీపీ అభిమానులతో సహా పలువురు ఆమె అభిమానానికి ఫిదా అవుతున్నారు. -
నుదుటిపై క్యూఆర్ కోడ్ టాటూ.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!
ఫ్యాషన్ పేరుతో టాటూలు వేయించుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇందులో కూడా పాత పద్ధతులకు గుడ్ బై చెబుతూ.. కొత్త టాటూలకు వేయించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ వ్యక్తి క్యూఆర్ కోడ్‌ను టాటూ వేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నిజానికి నుదుటిన టాటూ వేయించుకున్న వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ క్యూఆర్ కోడ్‌ను టాటూగా వేయించుకున్నారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ అయింది. ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లలో కొందరు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి అని బంధువులను, స్నేహితులను అడగటం కంటే ఇదే మంచి ఆలోచన అంటున్నారు, మరి కొందరు అతని ఇన్స్టాగ్రామ్ పిచ్చి పట్టిందని ఇలా తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by UNILAD (@unilad) -
'జెర్సీ' హీరోయిన్ పచ్చబొట్టు కహానీ.. 18 ఏళ్లప్పుడు ప్రేమ.. అందుకే ఇప్పటికీ!
చాలామంది ఒంటిపై పచ్చబొట్టు చూస్తూనే ఉంటాం. దీన్ని ఇప్పటి జనరేషన్ స్టైల్‌గా టాటూ అంటున్నారు. అయితే ఒక్కో టాటూ వెనుక ఒక్కో స్టోరీ ఉంటుంది. దాన్ని సదరు వ్యక్తులు బయటపెడితే గానీ తెలియదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇందులో మినహాయింపు ఏం కాదు. ఇప్పుడు కూడా ఓ యంగ్ హీరోయిన్.. అలా తన ఎదపై ఉన్న పచ్చబొట్టు మీనింగ్, అసలు ఇది ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?) శ్రద్ధా శ్రీనాథ్.. స్వతహాగా కన్నడ బ్యూటీ. 2015లో ఓ మలయాళ మూవీతో నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత కన్నడ, తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో తెలుగులో నాని 'జెర్సీ'లో హీరోయిన్గా చేసి మన ప్రేక్షకులకు కూడా దగ్గరైపోయింది. డిఫరెంట్ పాత్రలు చేస్తూ క్రేజ్ పెంచుకున్న ఈ భామ.. వెంకటేశ్ 'సైంధవ్'లో యాక్ట్ చేసింది. ఇది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. తాజాగా 'సైంధవ్' సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న శ్రద్ధా శ్రీనాథ్.. మిగతా విషయాలతో పాటు తన ఎదపై ఉన్న టాటూ సీక్రెట్ కూడా చెప్పింది. 18 ఏళ్ల వయసులో ఓ అబ్బాయి అంటే తనకు క్రష్ ఉండేదని, అతడి ద్వారా తనకు బీటల్స్ బ్యాండ్ గురించి తెలిసిందని చెప్పుకొచ్చింది. లవ్ అని అర్థమొచ్చేలా ఉన్న ఈ టాటూని అప్పట్లోనే క్రష్ కోసం వేసుకున్నానని అసలు సంగతి చెప్పింది. అయితే ఆ అబ్బాయి ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు. సో శ్రద్ధా శ్రీనాథ్ టాటూ సీక్రెట్ అదనమాట. (ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు) -
కొంపముంచిన ‘హాలోవీన్’ మేకప్!.. భయంకరంగా మహిళ ముఖం!
హాలోవీన్ ఉత్సవాన్ని అమెరికా, ఐరోపా దేశాల్లో జరుపుకుంటారు. ఇప్పుడు భారత్‌లోనూ ఈ ఉత్సవం క్రేజ్ కనిపిస్తోంది. ఈ ఉత్సవంలోని ప్రత్యేకత ఏమిటంటే ఇందులో పాల్గొనే జనం ఇతరులను భయపెట్టేలాంటి మేకప్ వేసుకుని రోడ్లపై తిరుగుతారు. ఒకరికొకరు బహుమతులు లేదా చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 న జరుపుకుంటారు. ఈ ఉత్సవం సందర్భంగా ఒక మహిళ తన ముఖంపై వేయించుకున్న భయంకరమైన టాటూ ఆమెను మరింత ఇబ్బందులపాలు చేసింది. ఎలిజబెత్ రోజ్ అనే మహిళ హాలోవీన్ రోజున తాను భయానకంగా కనిపించేందుకు తన ముఖంపై తాత్కాలిక టాటూలు వేయించుకుంది. ఆ మహిళ నుదిటిపైన, నోటిపైన టాటూలు వేయించుకుంది. అయితే ఆ టాటూల గుర్తులు తొలగక పోవడంతో ఆమెకు ఇబ్బంది ఎదురయ్యింది. ఆ మహిళ తన ముఖంపై ఉన్న టాటూను తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఒక వీడియోలో తెలియజేసింది. ‘నేను నా ముఖంపై టాటూ వేయించుకుని హాలోవీన్‌కు వెళ్లాను’ అని రోజ్ ఆ వీడియోలో పేర్కొంది. ఆమె ఆ టాటూను తొలగించడానికి కాటన్ ప్యాడ్‌ను ఉపయోగించింది. అయినా ఉపయోగం లేకపోయింది. మరుసటి రోజు తనకు ఆఫీసులో మీటింగ్ ఉన్న విషయం గుర్తుకువచ్చి ఆమె మరింత ఆందోళనకు గురయ్యింది. అయితే వోడ్కా, యాంటీ బాక్ జెల్, సెల్లోటేప్, ఆలివ్ ఆయిల్, నెయిల్ వార్నిష్ రిమూవర్ మొదలైనవాటిని ఉపయోగించి ఎట్టకేలకు ఆ టాటూ గుర్తులను తొలగించింది. ఇది కూడా చదవండి: ప్రియుడు ఖరీదైన గిఫ్ట్ ఇస్తే బ్రేకప్ చెప్పింది.. ట్విస్ట్ ఇదే! -
కూతురిపై ప్రేమ: గిన్సిస్ వరల్డ్ రికార్డ్ కోసం ఏం చేశాడో తెలుసా?
Mark Owen Evans Record గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడం కొంతమంది ఒక గోల్. ఎవరూ చేయడానికి సాహసించని పనులు , విన్యాసాలతో తమ పేరును ప్రత్యేకంగా నిలుపుకోవాలని చూస్తాడు. అయితే ఇక్కడ ఓ 49 ఏళ్ల వ్యక్తి వ్యక్తి తన గారాల పట్టి మీద ఉన్న ప్రేమను అనూహ్యంగా చాటుకున్నాడు. యూఏకి చెందిన మార్క్ ఓవెన్ ఇవాన్స్ ఏకంగా తన ముద్దుల కుమార్తె పేరును శరీరంపై 667 సార్లు టాటూలా వేయించుకుని పంచ రికార్డు సాధించాడు. ఇలా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకోవడం ఇది రెండో సారికావడం విశేషం. అలా తన సొంత రికార్డును తానే అధిగమించాడు. 2017లో తొలిసారిగా తన కూతురు పేరును తన వీపుపై 267 సార్లు టాటూ వేయించుకుని రికార్డు సృష్టించాడు. కానీ 2020లో అమెరికన్ డైడ్రా విజిల్ తన పేరు మీద 300 సార్లు టాటూ వేయించుకోవడం ద్వారా రికార్డును బద్దలు కొట్టడంతో ఎవాన్స్ ఆ రికార్డును కోల్పోయాడు. తాజాగా ఇవాన్స్ తన కూతురు పేరు 'లూసీ'పై 667 టాటూలు వేయించుకుని తన రికార్డును తానే బ్రేక్ చేయడమేకాదు తమ తండ్రీకూతుళ్లు బంధం సాటిలేనిదని నిరూపించాడు. ఇద్దరు టాటూ ఆర్టిస్టులు గంటపాటు శ్రమించి మొత్తం భాగాన్ని పూర్తి చేశారు. ఒక్కో కాలుపై 200, మొత్తం 400 టాటూలతోపాటు ఈ మొత్తం టాటూలు పూర్తి కావడానికి ఐదున్నర గంటలు పట్టిందని ఇవాన్స్ మీడియాకుతెలిపారు. ఇది విచిత్రంగా ఉన్నా.. రికార్డును తిరిగి దక్కించు కోవడం, దీన్ని తన కుమార్తెకు అంకితం చేయడం సంతోషంగా ఉందంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. -
అంతులేని అభిమానం గుండెలపై సీఎం జగన్ పచ్చబొట్టు..!
-
యంగ్ హీరోయిన్ టాటూ.. చూపించుకోలేని ప్లేసులో అలా!
'96' సినిమా పేరు చెప్పగానే ఓ అందమైన లవ్ స్టోరీనే గుర్తొస్తుంది. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టులు కూడా చాలా ఫేమస్ అయ్యారు. చిన్నప్పటి త్రిషగా చేసిన నటి.. ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తోంది. అలాంటి ఆ బ్యూటీ తన బాడీలో ఎవరికీ చూపించుకోలేని ఓ చోట టాటూ వేసుకుని హాట్ టాపిక్ అయిపోయింది. (ఇదీ చదవండి: డేట్‌కి వెళ్లిన మెగా కపుల్.. ఆ ఫొటోలు వైరల్) 96 రీమేక్ గా తెలుగులో తీసిన 'జాను'లోనూ నటించిన గౌరీ కిషన్.. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. ఇప్పుడు మాత్రం హీరోయిన్ గా బిజీగా అయిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో తెలుగులో 'శ్రీదేవి శోభన్ బాబు' అనే మూవీలో నటించింది గానీ అది ఫ్లాఫ్ అవడంతో ఇక్కడ ఈమెకు అవకాశాలు రాలేదు. దీంతో తమిళ, మలయాళంలో మాత్రమే చేస్తోంది. తాజాగా ఇన్ స్టాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన గౌరీ.. తన ఒంటిపై టాటూ వేసుకుంటున్న చిన్న వీడియోని స్టోరీలో పోస్ట్ చేసింది. అది ఎక్కడ అనేది చెప్పుకోండి అని చిన్న పజిల్ పెట్టింది. ఆ తర్వాత కాసేపటికి తన రిబ్స్‌పై పచ్చబొట్టు వేసుకున్నానని చెబుతూ ఓ పిక్ షేర్ చేసింది. ఇది చూసి నెటిజన్స్ అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ టాటూ పిక్ కాస్త వైరల్‌గా మారిపోయింది. (ఇదీ చదవండి: ఆమె వల్ల చనిపోదామనుకున్నా.. నటుడు అబ్బాస్ కామెంట్స్) -
ఛాతిపై పచ్చబొట్టుగా పవర్‌స్టార్ పేరు..పిక్ వైరల్
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఈ లోకాన్ని విడిచి రెండేళ్లు కావోస్తున్నా.. అతని అకాల మరణాన్ని మాత్రం అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. కన్నడలో ఏ సినిమా ఈవెంట్ జరిగా పునీత్ పేరును స్మరించుకుంటున్నారు. పునీత్ కుటుంబ సభ్యులు కూడా ఆయన పేరు తెరపై కనిపిస్తే.. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా పునీత్ సోదరులు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్ అయితే ప్రతి సినిమా ఈవెంట్లో తమ్ముడిని తలచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఇక తాజాగా తన తమ్ముడి పేరుని ఛాతిపై టాటూగా వేయించుకున్నాడు రాఘవేంద్ర రాజ్‌కుమార్. (చదవండి: నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నా..హీరో అశ్విన్ కన్నీటి పర్యంతం) రాఘవేంద్రకు తమ్ముడు అంటే చాలా ఇష్టం. వయసులో చాలా చిన్నవాడు కావడంతో అతన్ని సొంత కొడుకులా చూసుకున్నాడు. అయితే 46 వయసులో పునీత్ గుండె పోటుతో మరణించాడాన్ని రాఘవేంద్ర తట్టుకోలేకపోయాడు. ఇప్పటికీ ఏదైనా స్టేజిపై పునీత్ ఫొటో కనిపిస్తే దుఃఖం ఆపుకోలేడు. ఇక తన తమ్ముడిని చిరకాలం గుర్తించుకోవడం కోసం చాతిపై ‘అప్పు’ అని టాటూ వేయించుకున్నాడు. ఇది పునీత్ ముద్దు పేరు. అప్పుతో పాటు టోటో, నుక్కి పేర్లను కూడా పచ్చబొట్టు వేయించుకున్నాడు. అవి పునీత్ ఇద్దరి కుమార్తెల ముద్దు పేర్లు. వాళ్ల అసలు పేర్లు ‘వందిత, ధృతి’. ఇక రాఘవేంద్ర విషయానికొస్తే.. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. రాఘవేంద్ర చివరగా పునీత్ నటించిన ‘జేమ్స్’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించాడు. ಅಪ್ಪು ಮತ್ತು ಅಪ್ಪು ಮಕ್ಕಳ ಹೆಸರನ್ನ ಎದೆ ಮೇಲೆ ಹಾಕಿಸಿಕೊಂಡ ರಾಘಣ್ಣ 🙏@iRaghanna #RaghavendraRajkumar pic.twitter.com/GMwRx7ZSYQ — Sagar Manasu (@SagarManasu) May 28, 2023 -
కమలహాసన్ నాస్తికుడు..శ్రుతిహాసన్‌కు దైవ భక్తి ఎక్కువట!
నటి శ్రుతిహాసన్ విశ్వనటుడు కమలహాసన్ వారసురాలు అనే విషయాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ బ్రాండ్‌ను ఆమె సినీరంగప్రవేశానికి మాత్రమే ఉపయోగించుకున్నారు. ఆ తరువాత తన స్వశక్తితోనే కథానాయకిగా ఎదిగారు. ఈ విషయాన్ని ఆమె పలుమార్లు బహిరంగంగానే పేర్కొన్నారు. అంతేకాదు తాను తన కాళ్ల మీదే నిలబడ్డానని, ఆర్థికపరంగా ఎప్పుడూ తన తల్లిదండ్రులను సాయం కోరలేదని చెప్పారు. తనకు తన తల్లిదండ్రులు స్వేచ్ఛనిచ్చారని చెప్పే శ్రుతిహాసన్ ఇప్పటికీ స్వతంత్రభావాలతోనే సినీ రంగంలో నటిగా ఎదుగుతున్నారు. ప్రస్తుతం ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం అంటూ బహుబాషా నటిగా పేరు తెచ్చుకున్నా తెలుగులో వరుస విజయాలతో క్రేజీ కథానాయకిగా వెలుగొందుతున్నారు. తమిళంలో ఇంతకుముందు విజయ్ సరసన పులి, అజిత్‌కు జంటగా వేదాళం, సూర్యతో ఏళాం అరివు, విశాల్ సరసన పూజై వంటి చిత్రాల్లో నటించినా ఎందుకనో ఇక్కడ పెద్దగా విజయాలను అందుకోలేకపోయారు. కాగా త్వరలో ఒక తమిళ చిత్రంలో నటించనున్నట్లు చెప్పారు. ఆ చిత్రం ఏమిటన్నది ఇప్పుడు ఆమె అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా కమలహాసన్ పక్కా నాస్తికుడు అన్న విషయం తెలిసిందే. అయితే అందుకు విరుద్ధ భావాలు కలిగిన నటి శ్రుతిహాసన్. తనకు దైవభక్తి ఎక్కువని చెప్పారు. అలాగని దేవాలయాలకు వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపనని, మనసు ఆలయం అని భావిస్తానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంట్లో పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. ఇకపోతే తన ఆధ్యాత్మిక భావాన్ని వ్యక్తం చేసే విధంగా శ్రుతిహాసన్ తన వీపు పైభాగంలో శ్రుతి అని తన పేరుతో పాటు కుమారస్వామి ఆయుధం అయిన వేలాయుధం గుర్తును టాటూ వేసుకున్నారు. ఈ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
డుప్లెసిస్ రిబ్స్ పై టాటూ దాని అర్ధం ఇదా...
-
టాటూలు.. మెహందీలు వద్దు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో కొలువు కోసం కలలుకంటున్న యువత కీలక ‘పరీక్ష’కు సమయం ఆసన్నమైంది. శనివారం(నేడు) ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఎస్సై తుదిరాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సివిల్ ఎస్సై, కమ్యూనికేషన్ ఎస్సై, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్సై, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టులకు శని, ఆదివారాల్లో నిర్వహించనున్న ఈ తుది రాతపరీక్షకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్పీఆర్బీ) పకడ్బందీగా చర్యలు చేపట్టింది. అభ్యర్థుల హాజరును బయోమెట్రిక్ విధానంలో తీసుకోనున్నారు. ఇప్పటికే ప్రాథమిక రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్షల సమయంలో నమోదైన వేలిముద్రలతో సరిపోలితేనే పరీక్షకు అనుమతిస్తారు. ఒకరికి బదులు వేరొక అభ్యర్థి పరీక్షకు హాజరయ్యేందుకు చెక్ పెట్టడంతోపాటు పారదర్శకత కోసం ఈ విధానాన్ని పోలీస్ నియామక మండలి చైర్మన్ వీవీ శ్రీనివాసరావు గత రెండు రిక్రూట్మెంట్ల నుంచి అమల్లోకి తెచ్చారు. అభ్యర్థులు చేతులకు మెహందీ(గోరింటాకు), టాటూలు వేసుకోవద్దని, వాటి కారణంగా బయోమెట్రిక్ హాజరులో ఇబ్బంది తలెత్తితే పరీక్షకు అనుమతించబోరని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి అభ్యర్థి విధిగా హాల్‌టికెట్ ఏ 4 సైజులో ప్రింటవుట్ తీసుకోవడంతోపాటు దానిలో సూచించిన ప్రాంతంలో పాస్‌పోర్ట్ సైజు ఫొటో(ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసింది) అతికించి తేవాలని, హాల్‌టికెట్‌పై ఫొటో అతికించకుండా వచ్చే అభ్యర్థులను పరీక్షకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. నిమిషం ఆలస్యంగా వచ్చినా నో ఎంట్రీ... సివిల్ ఎస్సై పోస్టుకు 1,01,052 మంది, కమ్యూనికేషన్ ఎస్సై పోస్టుకు 11,151 మంది, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్సైకి 2,762 మంది, ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టుకు 4,820 మంది పార్ట్–2 దరఖాస్తులు(తుది రాతపరీక్ష కోసం దరఖాస్తు) పూర్తి చేశారు. వీరంతా శని, ఆదివారాల్లో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ల్లో జరిగే తుది రాతపరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి అనుమతించబోమని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. పూర్తి సాంకేతికత.. పక్కాగా ఏర్పాట్లు లక్షకుపైగా యువత నెలలుగా తుది రాతపరీక్షకు సన్నద్ధమయ్యారు. అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా పక్కాగా ఎస్సై తుది రాతపరీక్ష నిర్వహణకు పోలీస్ నియామక మండలి పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. ప్రతి అభ్యర్థికి బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకోనున్నారు. పరీక్షకేంద్రాల్లో అవసరమైనచోట సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షపత్రాల లీకేజీల నేపథ్యంలో ఎస్సై తుది రాతపరీక్షలో పొరపాట్లకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్షకేంద్రాలున్న హైదరాబాద్, సికింద్రాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీస్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలున్నాయి: డీజీపీ ఎస్సై తుది రాత పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్ సూచించారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, చాలా రూట్లలో శనివారం ఉదయం 8–30 నుంచి 10–30 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు రెండు గంటల ముందే చేరుకునేలా జాగ్రత్తపడాలని సూచించారు. -
ఆస్కార్ వేదికపై దీపికా పదుకొణె.. ఇప్పుడు దాని గురించే చర్చంతా..!
అమెరికా లాస్ ఎంజిల్స్‌లో జరిగిన ఆస్కార్ వేడుకల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె సందడి చేసింది. ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రస్తావించింది. ప్రపంచ వేదికపై ఎంతో హుందాగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంది. దీపికను నటి కంగనా రనౌత్ సైతం మెచ్చుకుంది. విశ్వవేదికపై మనదేశ గొప్పదనాన్ని చాటారని ప్రశంసించింది. అయితే ఈ వేడుకల్లో దీపికా డ్రెస్‌తో పాటు ఆమె మెడపై ఉన్న టాటూపై నెట్టింట్లో చర్చ మొదలైంది. ఆమె సోషల్ మీడియాలో షేర్ ఫోటోల్లో కనిపించిన టాటూపై అభిమానులు ఆరా తీస్తున్నారు. ఆస్కార్ వేదికపై దీపిక ధరించిన నలుపు రంగు గౌను అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా డ్రెస్‌తో పాటు ఆమె మెడపై ఉన్న టాటూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీపిక మెడపై 82°E అని ఉన్న టాటూ కనిపించింది. ఇంతకీ ఆ టాటూకు అర్థం ఏంటా అని నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే టాటూకు 82 డిగ్రీస్ ఈస్ట్ అని అర్థం వస్తుంది. ఇది దీపికా పదుకొణె తన స్కిన్ కేర్ బ్రాండ్ పేరు. ఈ పేరుతో గత కొన్ని నెలలుగా చర్మ సంరక్షణ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. దీపిక తన సొంత బ్రాండ్ పేరును టాటూగా వేయించుకుంది. ఇది చూసిన ఫ్యాన్స్ కమిట్మెంట్ అంటే దీపికదే అని కామెంట్స్ చేస్తున్నారు. లాస్ ఎంజిల్స్‌లో జరిగిన ఆస్కార్ వేడుకలో దీపిక తన స్పీచ్‌తో అదరగొట్టింది. ఈ వేదికపై నుంచే ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటును అందరికీ పరిచయం చేసింది. కాగా.. దీపికా ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఫైటర్ చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్‌తో తొలిసారి దీపికా కనిపించనుంది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రభాస్ పాన్ ఇండియా మూవీ 'ప్రాజెక్ట్ కె'లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) -
నటి వీపుపై టాటు.. అసలు ఆమెకేమైంది?
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ నటిస్తున్న తాజాగా చిత్రం లియో. ఈ సినిమాలో హీరోయిన్గా అభిరామి వెంకటాచలం నటిస్తోంది. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఆమె ఇటీవల తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో కతెగ వైరలవుతోంది. ఎందుకంటే ఆమె వీపుపై నటరాజస్వామి టాటు కనిపించడమే. అయితే ఆమె టాటు ఎందుకు వేయించుకుందన్న దానిపై నెట్టింట్లో తెగ చర్చ నడుస్తోంది. అసలు అభిరామికి ఏమైందని అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆ వీపుపై ఆ టాటూ ఏంటని నిలదీస్తున్నారు. అంకే కాకుండా మహా శివరాత్రి రోజున ఆమె శ్రీ కాళహస్తీశ్వరాలయానికి వెళ్తూ నడిరోడ్డుపై డ్యాన్స్ కూడా చేశారు. ఆ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా ఆమె వీపుపై నటరాజ స్వామిని టాటూ కనిపించడం పలు చర్చలకు దారితీసింది. ఆ ఫొటోను తన ఇన్‌స్టా ఖాతాలో అభిరామి షేర్ చేశారు. అదే సమయంలో తనకు భక్తి గురించి ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదంటూ హాట్ కామెంట్స్ చేశారు. పైగా తాను ఆరాధించే శివుడిని ఎక్కడ ఉంచాలన్నది.. తన వ్యక్తిగత విషయమంటూ అభిరామి పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Abhirami Venkatachalam 🦋 (@abhirami.venkatachalam) -
పచ్చబొట్టు చెరిగీపోదులే! ‘మేం ఉన్నంతకాలం ఆచారాన్ని కొనసాగిస్తాం’
ఈ తరం వారికి పచ్చబొట్టు అంటే కేవలం ఒంటిపై వేయించుకొనే ఫ్యాషన్ చిహ్నం.. టాటూ పేరుతో చిత్రించుకొనే ప్రత్యేకమైన డిజైన్. కానీ నిన్నటితరం వారికి మాత్రం అది జీవితాంతం గుర్తుంచుకొనే ఒక పదిల జ్ఞాపకం.. ముఖ్యంగా గిరిజనులకైతే అదో సంప్రదాయం.. జీవన విధానంలో ఓ భాగం.. తరతరాల ఆచారం. గిరిజనుల్లో మొదలై మైదాన ప్రాంతాలు, అటు నుంచి మెట్రో నగరాలకు ఓ ఫ్యాషన్ గా మారిన పచ్చబొట్టు పుట్టుక, అందుకు ఉపయోగించే వస్తువుల గురించి తెలుసుకోవాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గూడేల్లోకి వెళ్లాల్సిందే. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గిరిజనుల్లో పచ్చబొట్టు అనేది తోటి అనే తెగలోని ఆడవాళ్లకు మాత్రమే పరిమితమైన కళ. ఐదేళ్ల నుంచే సూదులు చేతబట్టి, ఒంటిపై ఎలాంటి ఆకారమైనా వేయగల నేర్పు నాటి తరం తోటి మహిళల సొంతం. ఇందుకోసం సన్నని మూడు సూదులను దగ్గర చేర్చి చేతితో పట్టుకొనేలా దారంతో చుట్టగా చుడతారు. అడవిలో దొరికే (పెద్దేగి జాతి చెట్టు) బెరడును తెచ్చి చిన్న కుండలో వేసి మాడిపోయే వరకు వేడి చేస్తే పచ్చని రంగు వస్తుంది. సన్నటి కట్టెపుల్లతో శరీరంపై మొదట ఆకారం వేస్తారు. ఆముదం నూనెను, ఆ రంగులో ముంచి శరీరంపై సూదితో పొడుస్తారు. వేసిన పచ్చబొట్టు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇదంతా ఎంతో క్రమశిక్షణ, ఓర్పుతో వేస్తుంటారు. ఒక్కో బొట్టుకు ఒక్కో ప్రత్యేకత.. ఆది దంపతులైన శివపార్వతుల కల్యాణంలో తోటీలు పచ్చబొట్టు వేశారని పురాణ కథల్లో ఉంది. పార్వతికి నుదుటిపై పచ్చబొట్టు వేశాకే వివాహం జరిగిందని చెబుతుంటారు. ఇదే సంప్రదాయాన్ని రాజ్‌గోండ్ అమ్మాయిలు పెళ్లిపీటలు ఎక్కేముందు నుదుటిపై సూర్యచంద్రుల ఆకారంలో పచ్చబొట్టు వేయించుకొనేవారు. మూడు నెలల శిశువుకు దిష్టి చుక్కతో మొదలై, మహిళల చేతులపై నవగ్రహాలు, పుష్పాలు రకాల రూపాల్లో సందర్భాన్ని బట్టి వేసుకొనేవారు. రోగాలు, నొప్పులు వస్తే నుదిటి, కణత, గడ్డం, బుగ్గ, మెడ, వీపు, చేతి వేళ్ల మీద నుంచి భుజం వరకు, నడుము తదితర భాగాలపై వేసుకొనేవారు. అలంకారమే కాక, దైవభక్తి, భార్యాభర్తలు, అమ్మనాన్నలు, ఇష్ట దైవం, పేర్లను సైతం ఒంటిపై ముద్రించుకునేవాళ్లు. పూర్వం తమ పిల్లల్ని గుర్తుపట్టేందుకు శిశువుకు 3 నెలలు రాగానే పచ్చబొట్టు వేసేవారని నాటి తరం ఆదివాసీలు చెబుతున్నారు. పూర్వం గిరిజన మహిళలు చేతి నుంచి వీపు, తల వరకు ఒంటికి వేయని దుస్తుల వలే పచ్చబొట్టును వేయించుకొనేవారని గుర్తుచేసుకున్నారు. గిరిజన ప్రాంతాలకు వలసలు మొదలవడంతో గిరిజనేతరులకు సైతం ఈ ఆచారం అలవాటు అయిందని పేర్కొన్నారు. అయితే ఈ తరం గిరిజన మహిళల్లో ఎక్కువ మంది పచ్చబొట్టుపై ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. భవిష్యత్తు తరాలకు ఈ కళ అందితేనే పచ్చబొట్టు పదిలంగా ఉంటుందని చెబుతున్నారు. చరిత్రకారుల ప్రస్తావన.. గతంలో హైమన్ డార్ఫ్, మైఖేల్ యోర్క్ వంటి విదేశీ పరిశోధకులు తమ రచనలు, ఫొటోలు, డాక్యుమెంటరీల్లో పచ్చబొట్టును ప్రస్తావించారు. రెండేళ్ల క్రితం ఐఐటీ హైదరాబాద్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు పచ్చబొట్టుపై అధ్యయనం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్‌లు సైతం తమ ఒంటిపై కనీసం ఒక చుక్కనైనా తోటిల వద్ద వేసుకొని మురిసిపోయేవారు. ఆదివాసీల్లో ఒకటైన తోటి తెగ జనాభా 2011 లెక్కల ప్రకారం 4,811గా ఉండగా ప్రస్తుతం 10 వేల వరకు ఉండొచ్చని అంచనా. దేవుడిచ్చిన వరం మా ముందు తరం నుంచే పచ్చబొట్టు వేసే ఆచారం ఉంది.. మా తెగకు దేవుడు ఇచ్చిన వరం ఇది. రాను రాను గిరిజనుల్లో పచ్చబొట్టుపై ఆసక్తి తగ్గిపోయినా మేం ఉన్నంతకాలం ఆచారాన్ని కొనసాగిస్తాం. – వెడ్మ రాంబాయి, ఎదులపాడ్, తిర్యాణి మండలం, కుమురంభీం జిల్లా -
తారకరత్న చేతిపై పచ్చబొట్టు.. ఆ ఆటోగ్రాఫ్ ఎవరిదంటే?
నటుడు నందమూరి తారకరత్న మరణంతో అభిమానులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తారకరత్న సినిమాల గురించి, ఆయన మంచితనం గురించి అభిమానులు చర్చించుకుంటుండగా ఆయన చేతిపై ఉన్న టాటూ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ టాటూ ఏంటో తెలుసా? అది సింహం బొమ్మ. ఆ బొమ్మ కింద బాలకృష్ణ ఆటోగ్రాఫ్ కూడా ఉంది. బాలయ్యపై ఉన్న అభిమానంతోనే తారకరత్న ఈ పచ్చబొట్టు వేయించుకున్నారు. తారకరత్న, బాలకృష్ణలకు ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమ అలాంటిది. తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోయినప్పుడు అంతా తానై చూసుకున్నారు బాలయ్య. తను కోలుకునేందుకు ఆయన చెవిలో మృత్యుంజయ మంత్రం జపించారు. అలాగే బెంగళూరు నారాయణ హృదయాల డాక్టర్స్‌తో మాట్లాడి తనను అక్కడకు షిఫ్ట్ చేయించారు. ప్రత్యేక వైద్యులను పిలిచి మరీ ట్రీట్మెంట్ ఇప్పించారు. ఆస్పత్రి బిల్లులు చెల్లిస్తూ కుటుంబ సభ్యులకు ఓదార్పునిస్తూ ఎంతో బాధ్యతగా వ్యవహరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి తర్వాత తండ్రిగా తారకరత్న బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. చదవండి: ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన తారకరత్న -
చెరిగిపోని పచ్చబొట్టు సంతకం
‘ఒక మహిళ చిత్రకారిణిగా ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు.కాని టాటూ ఆర్టిస్ట్‌గా ఉంటానంటేఆశ్చర్యంగా చూస్తారు’ అంటుంది అర్చన భానుషాలి.దేశంలో ఉత్తమ మహిళా టాటూ ఆర్టిస్ట్‌గా గుర్తింపు ΄పొం దిన అర్చనమగవాళ్లు రాజ్యమేలే ఈ రంగంలో తన ఉనికిని సగర్వంగా చాటుతోంది. ఈ రంగంలో మగవారు విపరీతంగా ఉన్నారు. ఆడవాళ్ల ప్రవేశం అంత సులభం కాదు. కాని నేను పంతంతో ఈ స్థాయికి వచ్చాను. మహిళలకు నేను చెప్పేది ఒక్కటే. మీకు లక్ష్యం ఉంటే సరిపోదు. దానికి తగ్గ కష్టం చాలా చేయాలి. ఇవాళ నేను ఈ రంగంలో గుర్తింపుతో పాటు ఆర్థికంగా కూడా మంచి రాబడి ΄పొం దుతున్నాను. – అర్చన శివరాత్రి సందర్భంగా ‘శివ్ అండ్ శక్తి కాస్మిక్ డాన్స్’ అనే సబ్జెక్ట్‌ను పచ్చబొట్టుగా వేసింది అర్చన భానుషాలి. శివుడు, పార్వతి ఆనంద తాండవం చేస్తున్న ఆ పచ్చబొట్టులో జీవం ఉట్టి పడుతోంది. అర్ధనారీశ్వరుడి చిత్రం కూడా పచ్చబొట్టుగా వేస్తుందామె. ఇవే కాదు ఆమె బొమ్మల్లో మన సంస్కృతిని ప్రతిబింబించే భారతీయ పౌరాణిక, ఆధ్యాత్మిక చిహ్నాలు కనపడతాయి. శివాజీ వంటి వీరులూ, అన్నా హజారే వంటి సామాజిక ఉద్యమకారులు కూడా కనపడతారు. పచ్చబొట్టును ఒక విశృంఖల చిహ్నంగా కాకుండా వ్యక్తిత్వ ప్రకటనగా మార్చడం వల్లే అర్చనకు మంచి పేరొచ్చింది. అందుకే ఆమె ప్రస్తుతం దేశంలో ఉన్న మహిళా టాటూ ఆర్టిస్ట్‌లలో బెస్ట్ ఆర్టిస్ట్‌గా, సీనియర్ ఆర్టిస్ట్‌గా గౌరవం ΄పొందుతోంది. కమర్షియల్ ఆర్టిస్ట్‌గా అర్చన కుటుంబానిది గుజరాత్ అయినా ముంబైలో స్థిరపడింది. అర్చన ఏడేళ్ల వయసు నుంచే వయసుకు మించిన పరిణితిని ప్రదర్శిస్తూ బొమ్మలు వేసేది. దాంతో ఇంట్లోప్రో త్సహించారు. అయితే ఇంటర్ వయసు వచ్చే సరికి గుజరాతీలలో అమ్మాయిలకు పెళ్లి చేసి పంపాలనే తొందర ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు పెళ్లి చేస్తామని వెంటపడితే అప్పుడే వద్దని చెప్పి ముంబై జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో మూడేళ్ల డిప్లమా చేసింది కమర్షియల్ ఆర్ట్‌లో. ఆ తర్వాత లండన్ వెళ్లి ఒక సంవత్సరం కోర్సు చదవాలని అనుకుంది. ఆ కోర్సుకు అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తుండగా టీవీలో ఒక షో చూసింది. అందులో ప్రఖ్యాత అమెరికన్ టాటూ చిత్రకారిణి కేట్ వాన్ డి తన క్లయింట్లకు అద్భుతంగా టాటూలు వేయడం చూపించారు. ‘నేను పేపర్ మీద వేసేది ఈమె ఒంటి మీద వేస్తోంది. నేనెందుకు ఇలా వేయకూడదు’ అనుకుంది అర్చన. ఆమె యాత్ర మొదలైంది. ‘మా అమ్మానాన్నలు నేను టాటూ ఆర్టిస్ట్‌గా మారతానంటే కంగారు పడినా ఆ తర్వాతప్రో త్సహించారు. దాని వల్ల టాటూ వేయడంలో కోర్సు చేశాను. నాకు బొమ్మలు వచ్చు కనుక చాలా త్వరగా పని నేర్చుకున్నాను. మేము గుజరాతీలం. ఒకరి కింద పని చేయడం కంటే సొంత బిజినెస్ ఉండటాన్నే ఇష్టపడతాం. అందుకే ‘ఏస్ టాటూజ్’ పేరుతో ముంబైలో మా నాన్న నా కోసం టాటూ స్టూడియో ఏర్పాటు చేశాడు’ అంటుంది అర్చన. అయితే అసలుప్రో త్సాహం భర్త నిఖిల్ నుంచి, అత్తా మామల నుంచి లభించింది. ‘మా అత్తగారు నన్ను బాగాప్రో త్సహిస్తారు. పెళ్లయ్యాక నా మొదటి పచ్చబొట్టును ఆమెకే వేశాను’ అంది అర్చన. -
రష్మిక టాటూ వెనక ఇంత స్టోరీ ఉందా!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. విజయ్‌తో ఆమె నటించిన వారసుడు విడుదలై థియేటర్లో సందడి చేస్తుంది. అలాగే బాలీవుడ్లో సిద్ధార్థ్ మల్హోత్రాతో నటించిన ‘మిషన్ మజ్ను’ నేరుగా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా రీసెంట్గా బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన ఆమె తన వ్యక్తిగత విషయాలతో, పలు ఆసక్తిర విషయాలను పంచుకుంది. చదవండి: తండ్రి అయిన స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఈ సందర్భంగా తన చేతిపై ఉన్న టాటూ గురించి యాంకర్ ఆరా తీసింది. ఈ నేపథ్యంలో తన టాటూ వెనక పెద్ద స్టోరీ ఉందంటూ అసలు విషయం బయటపెట్టింది రష్మిక. ‘మొదట నాకు అసలు టాటూ వేయించుకోవాలనే ఆలోచనే లేదు. మా కాలేజీలో ఉన్నప్పుడు మా క్లాస్ అబ్బాయి ‘ఆడపిల్లలు బాధను ఓర్చుకోలేరు. వాళ్లకు సూదులన్నా భయమే’ అన్నాడు. అది తప్పు అని నిరూపించాలనుకున్నా. అందుకే టాటూ వేయించుకోవాలని నిర్ణయించుకున్నా. కానీ ఏం వేయించుకోవాలో తెలియదు. చాలా సేపు ఆలోచించాను. చదవండి: తండ్రి ఎమోషనల్.. ఇది నాకు అతిపెద్ద విజయం: డైరెక్టర్ వంశీ పైడిపల్లి అప్పుడే నాకు ఓ ఆలోచన వచ్చింది. ‘ఎవరూ, ఎవరిని భర్తీ చేయలేరనేది నా అభిప్రాయం. అలాగే ప్రతి ఒక్కరికి ఒక సొంత గుర్తింపు ఉంటుంది. ఎవరికి వారు స్పెషలే’ అని అనుకుంటాను. అదే అర్థం వచ్చేలా టాటూ వేయించుకోవాలి అనుకున్నా. అందుకే ఇర్రీప్లేసబుల్ (Irreplaceable) అనే పదాన్ని వేయించుకున్నా’’ అంటూ తన టాటూ వెనక ఉన్న రహస్యాన్ని చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం రష్మిక తెలుగులో పుష్ప 2, హిందీలో ఎనిమల్ చిత్రాలతో బిజీగా ఉంది. -
'కాంతా లగా..' నటి బర్త్‌డే.. ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన భర్త
బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ షెఫాలీ జరీవాలా గురువారం 40వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా నటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే షెఫాలీ భర్త, నటుడు పరాగ్ త్యాగీ ఆమెకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. తన భార్య పేరును చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. బర్త్‌డే పార్టీలో ఈ సర్ప్రైజ్ను రివీల్ చేశాడు. తనమీద ఆకాశమంత ప్రేమను కురిపించిన భర్తకు కృతజ్ఞతలు తెలిపింది షెఫాలీ. కాగా షెఫాలీ, పరాగ్ 2015లో పెళ్లి చేసుకున్నారు. తను ఇంతమంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి పరాగే కారణమని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది నటి. నువ్వు ఎదుగుతున్నకొద్దీ నటిగానూ ఎదగాలని అతడు బలంగా కోరుకున్నాడని చెప్పింది. అతడు స్క్రీన్‌పై చెడ్డవాడిగా కనిపించినప్పటికీ రియల్ లైఫ్‌లో మాత్రం ఎంతో మంచివాడని చెప్పుకొచ్చింది. ఇకపోతే 'కాంతాలగా..' అనే సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్‌లో అదరగొట్టింది షెఫాలి. ఆ ఒక్క పాటతో పాపులర్ అయిన ఆమె తర్వాత ఇండస్ట్రీలో నటిగా రాణించింది. చదవండి: రేవంత్ తండ్రి చనిపోయినా బతికే ఉన్నాడని అబద్ధమాడా: రేవంత్ తల్లి కీర్తి, శ్రీసత్యలలో ఎలిమినేట్ అయ్యేదెవరు? -
బికినీలో నిహారిక, టాటూ ఫొటోలు వైరల్
మెగా డాటర్ నిహారికకు వెకేషన్స్ అంటే మహా సరదా! సమయం దొరికితే చాలు బ్యాగు సర్దేసుకుని వెళ్లి వేకేషన్ ఎంజాయ్ చేస్తుంటుంది. అంతేనా, అందుకు సంబంధించిన ఫొటోలను సైతం అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో ఎన్నడూ లేనిది ఈ మధ్య బికినీలో కనిపించి అందరికీ షాకిచ్చింది నిహారిక. తాజాగా ఆమె మరోసారి బికినీ ఫొటోలను పంచుకుంది. టర్కీ టూర్లో సేద తీరిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో నీహా వీపుపై ఉన్న టాటూ స్పష్టంగా కనిపించింది. ఇందులో NK అనే అక్షరాలున్నాయి. వాటి అర్థం నిహారిక కొణిదెల అని కావచ్చు. అలాగే ఓ పక్షి ఎగురుతున్నట్లుగా, మరింకేదో డిజైన ఉంది. ఆ డిజైన్ పూర్తి మీనింగ్ ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు నెటిజన్లు. ఇకపోతే నిహారిక 'సైరా' సినిమా షూటింగ్ సమయంలో తన టాటూను రివీల్ చేసింది. తాజాగా బికినీలో దర్శనమివ్వడంతో మరోసారి ఆ టాటూ బయటపడింది. కాగా నిహారిక ప్రస్తుతం నటిగా, నిర్మాతగా ఫుల్ బిజీగా మారింది. ఓ పక్క నటిస్తూనే మరోపక్క వెబ్ సిరీస్‌లు నిర్మిస్తోంది. View this post on Instagram A post shared by Nihaa Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Sunny Bond (@sunnybond) చదవండి: హెబ్బా పటేల్‌తో ఫొటో దిగిన వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా? చిరంజీవికి అలీ దంపతుల ఆహ్వానం -
విజయ్ దేవరకొండ ఫ్యాన్ గర్ల్.. వీపుపై టాటూ.. వీడియో వైరల్
Vijay Devarakonda Meets Fan Who Has His Tattoo Video Viral: సినీ నటీనటులను ప్రేక్షకులు ఎంతగానే అభిమానిస్తారు, ఆరాధిస్తారు. వారిని చూసిన, వారిని కలిసినా ఎక్కడలేని విధంగా ఎమోషనల్ అవుతారు. వారి ఆనందానికి అవధులు లేవని ఆనందభాష్పాల ద్వారా తెలియజేస్తారు. ఇలాంటి సంఘటన తాజాగా జరిగింది. తన అభిమాన హీరోను చూసిన ఆ ఫ్యాన్ భావోద్వేగానికి లోనయ్యారు. అతన్ని కలుసుకుని మాట్లాడటంతో సంతోషం పట్టలేక కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఆ హీరో ఎవరో కాదు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ. విజయ్‌కు వీరాభిమాని అయిన చెర్రీతో పాటు మరో ఫ్యాన్ సోనాలి ఈ రౌడీ హీరోను కలిశారు. ఆ ఇద్దరితో సరదాగా ముచ్చటించి, కలిసి ఫొటోలు దిగాడు విజయ్ దేవరకొండ. అదే చోట ఉన్న డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మినీ వారిద్దరికి పరిచయం చేశాడు. తన వీపుపై విజయ్ దేవరకొండ టాటూతో అభిమానాన్ని చాటుకున్నారు చెర్రీ. ఈ క్రమంలోనే ఆనందభాష్పాలతో తన సంతోషాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం 'లైగర్' ఆగస్టు 25న విడుదల కానుంది. "SUPER FAN MOMENT" - Some FANS convey their affection in a most personal way and High Respect when they ink their Star on their Body Dr. Cherry - Hope you had best surprise meeting VD Sir and you cherish this moment@TheDeverakonda #VijayDeverakonda #TeamDeverakonda pic.twitter.com/8CuxiyJUbt — Team Deverakonda (@TeamDeverakonda) June 30, 2022 -
ప్రియాంక ఫొటోను ఏకంగా వీపుపై టాటూ వేసుకున్న సింగర్
సినీ సెలబ్రెటీలకు వీపరితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. తమకు ఇష్టమైన నటీనటులపై ఫ్యాన్స్ వివిధ రకాలుగా అభిమానం చూపిస్తుంటారు. వారి పేర్లను పెట్టుకోవడం, వారి ఫొటోలను ఇంట్లో పెట్టుకుని మురిసిపోతుంటారు. మరికొందరైతే ఏకంగా వారి పేర్లను టాటూ వేసుకుంటారు. సాధారణంగా స్టార్ హీరోహీరోయిన్ల పేర్లను పచ్చబొట్టు వేయించుకున్న సందర్భాలను మనం తరచూ చూస్తూనే ఉన్నాం. కానీ వారికి సాధారణ ప్రజలే కాదు సెలబ్రెటీల్లో సైతం ఫ్యాన్స్ ఉంటారు. చదవండి: ఛీ, భర్త చనిపోయినా ఎంజాయ్ చేస్తోంది.. నీతూ కపూర్‌పై ట్రోలింగ్ గ్లోబర్ స్టార్ ప్రియాంక చోప్రా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు సాధారణ ప్రజల్లోనే కాదు సెలబ్రిటీల్లో సైతం ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అమెరికాకు చెందిన ఓ సింగర్ ప్రియాంకకు వీరాభిమాని. తాజాగా అతడు ప్రియాంకపై ఉన్న అభిమానాన్ని చాటుకున్న తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. సింగర్, ర్యాపర్ ఆకాశ్ ఆహుజా ఆమె ముఖ చిత్రాన్ని టాటూగా వేసుకున్నాడు. ఇప్పటికే ప్రియాంక పేరును తన వీపుపై పచ్చబొట్టు వేసుకున్న ఆకాశ్ అక్కడితో ఆగకుండా ఇటీవల తన ఫోటోను సైతం వేయించుకోవడం విశేషం. చదవండి: ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ను ఓటీటీలో చూడాలంటే డబ్బు చెల్లించాలా? ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఆకాశ్ తన వీపు పూర్తి భాగంలో ప్రియాంక ముఖచిత్రాన్ని టాటూ వేసుకుంటున్నాడు. దానికి పైన ప్రియాంక అనే పేరు కూడా రాసి ఉంది. ఇదిలా ఉంటే ‘ప్రియాంక..’ అంటూ ఆకాశ్ ఇటీవల పాడిన పాటను తన ఫేవరెట్ హీరోయిన్‌కే అంకితమిచ్చాడు. ఇప్పుడు అదే పాట ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పిచ్చి ముదిరిందని కొందరు ఆకాశ్‌పై విమర్శలు చేస్తుండగా.. మరికొందరు మాత్రం అతడికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Akash Ahuja (@akashlife) -
మాజీ భర్త గుర్తులను వదిలించుకున్న బ్యూటీ
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ తన భర్త రితేశ్ సింగ్‌తో విడిపోయిన విషయం తెలిసిందే. రితేశ్‌కు ఆల్రెడీ పెళ్లైన విషయాన్ని తన దగ్గర దాచిపెట్టాడని, వారు విడాకులు తీసుకోలేదు కాబట్టి చట్టబద్ధంగా తమ వివాహం చెల్లదని బాధపడింది. అటు రితేశ్ కూడా మొదటి భార్యతో ఉండేందుకే సిద్ధపడి రాఖీని నిర్లక్ష్యం చేయడంతో వాలంటైన్స్‌డే రోజు అతడితో విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది రాఖీ సావంత్. మాజీ భర్త జ్ఞాపకాలను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్న రాఖీ తాజాగా తన ఒంటిపై ఉన్న రితేశ్ అనే టాటూను కూడా తీసేయించుకుంది. పచ్చబొట్టును తీసేటప్పుడు నొప్పి పెడుతున్నా దాన్ని పంటికింద భరించింది. 'మూడేళ్ల జర్నీ.. రితేష్, నువ్వు నా జిందగీలో నుంచే కాదు, నా శరరీంలో నుంచి కూడా శాశ్వతంగా వెళ్లిపోయినట్లే.. మీరు పీకల్లోతు ప్రేమలో మునిగితే ఇలా పచ్చబొట్టు వేయించుకోకండి.. ఎందుకంటే దాన్ని తీసేయడం చాలా కష్టం' అని చెప్పుకొచ్చింది. ఈ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511) చదవండి: యాంకర్ సుమతో నటించడం నా అదృష్టం -
పునీత్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న నటి నమ్రత
Namratha Inked Puneeth Rajkumar Name: కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణించి దాదాపు 6 నెలల కావోస్తోంది. అయినా ఇప్పటికీ ఆయన మరణాన్ని తలుచుకుని కన్నడిగులు కుమిలిపోతున్నారు. గతేడాది అక్టోబర్ 29న పునీశాండల్ వుడ్ సీని ప్రముఖులే కాదు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ పరిశ్రమలకు చెందిన సినీ సెలబ్రెటీలు నివాళులు అర్పించారు. ఇక కన్నడ ప్రజలు, ఫ్యాన్స్ అయితే పునీత్ లేడనే వార్త విని గుండెలు విలపించేలా రోధించారు. ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేక మరికొందరి గుండెలు ఆగిపోయాయి. చదవండి: నేరుగా ఓటీటీలో విడుదల కానున్న నాని సినిమా!, ఎక్కడంటే.. అంతలా ప్రతి ఒక్కరిని శోక సంద్రంలో ముంచిన పునీత్ రాజ్‌కుమార్ హీరోగానే కాదు ఓ మనిషిగా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయారు. 45 స్కూళ్లు కట్టించి, 26 అనాథశ్రమాలు, 16 ఓల్డ్ ఏజ్ హోమ్స్ నడిపించి, 19 గోశాలలకు సాయం చేస్తూ.. చనిపోయినా రెండు కళ్లూ దానం చేశారు. ఇవన్ని చేసిన ఏనాడు పబ్లిసిటి చేసుకోలేదు. ఆయన చేస్తున్న సాయం ఏంటో ఆయన మరణం తర్వాతే ప్రపంచానికి తెలిసింది. దీంతో యావత్ దేశం ఆయనకు సెల్యూట్ కొట్టింది. ఆయనకు సాధారణ ప్రజలే కాదు సెలబ్రెటీల్లో కూడా వీరాభిమానులు ఉన్నారు. ఆయనంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఇండస్ట్రీలో సైతం ఉన్నారడానికి ఈ తాజ సంఘటనే ఉదాహరణ. చదవండి: రానాను పక్కన పెట్టిన శేఖర్ కమ్ముల? ఆ హీరోతో లీడర్-2 పునీత్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ఓ నటి ఏకంగా ఆయన పేరునుఏ టాటూగా వేసుకుంది. కన్నడ టీవీ నటి, నాగిని 2 ఫేం నమ్రత గౌడ పునీత్ రాజ్‌కుమార్‌ను వీరాభిమాని. దీంతో ఆయన పేరును చేతిపై పచ్చబొట్టుగా వేయించుకుంది. ఆయన జయంతి సందర్భంగా వేయించుకున్న ఈ పోస్ట్‌ను రీసెంట్గా నమ్రత షేర్ చేస్తూ ‘ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా నమ్రత పునీత్ మిలనా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించింది. 2007లో వచ్చిన ఈ సినిమాలో నమ్రత ప్రముఖ నటుడు సిహి కహీ చంద్రుని కుమార్తెగా ఓ చిన్న రోల్ పోషించింది. నాగిని(కన్నడ) సీరియల్‌తో గుర్తింపు పొందిన ఆమె ప్రస్తుతం పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో సహానటి పాత్రలు చేస్తోంది. View this post on Instagram A post shared by namratha (@namratha__gowdaofficial) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1611343008.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గీరిన ముద్రలు మీ చర్మంపై ఉన్నాయా... అయితే ఇలా చేయండి!
మనిషి తన కళా ప్రదర్శనకు చివరికి సొంత చర్మాన్ని కూడా వదలలేదు. గోరింటాకు (మెహందీల)తో తాత్కాలికంగా, పచ్చబొట్ల(టాటూల)తో శాశ్వతంగా దాన్ని అలంకరించడం మానలేదు. మెహందీ లేదా టాటూ అయితే అది ప్రయత్నపూర్వయంగా చేసే పని. కానీ కొందరు ఎదుర్కొనే ఓ వింత సమస్య చర్మంపై చాలా చిత్రమైన ప్రభావం చూపుతుంది. ఏమాత్రం గీరినా లేదా చేయి బలంగా తగిలినా దేహంపైన ఉండే చర్మం పైకి ఉబికి ఎంబోజింగ్ చేసినట్లుగా మారుతుంది. ఇలాంటి వారి చర్మంపై ఏదైనా రాసినప్పుడు అది పైకి ఉబికి కనిపిస్తుండటం వల్ల ఈ సమస్యను ‘స్కిన్ రైటింగ్’ అని అంటారు. వైద్యపరిభాషలో దీన్ని ‘డర్మటోగ్రాఫియా’గా పిలుస్తారు. కారణాలు: ►మనకు ఏదైనా సరిపడనిది దేహంలోకి గానీ, లేదా చర్మంపైన చేరితే... మన వ్యాధినిరధకత (ఇమ్యూన్ సిస్టమ్ / సిగ్నల్స్) దాన్ని ఎదుర్కొనేందుకు హిస్టమైన్స్ అనే రసాయనాలను విడుదల చేస్తుంది. (అందుకే మనకు ఏదైనా సరిపడక రియాక్షన్ వచ్చినప్పుడు దాన్ని తగ్గించేందుకు యాంటీహిస్టమైన్ మందులు వాడటం మనకు తెలిసిన విషయమే). ►ఒక్కోసారి మనపై ఉన్న తీవ్రమైన మానసిక/శారీరక ఒత్తిళ్ల (స్ట్రెస్/యాంగై్జటీల) వల్ల కూడా ‘డర్మటోగ్రాఫియా’ కనిపిస్తుంది. ∙కొన్ని సందర్భాల్లో సరిపడని మందుల వల్ల కూడా ఇది కనిపించవచ్చు. ►ఎక్కువసేపు మైక్రోఒవెన్ దగ్గర ఉండే కొంతమందిలో ఈ సమస్యను పరిశోధకులు గుర్తించారు. ముప్పు ఎవరిలో ఎక్కువ... ►యౌవనంలో ఉన్నవారిలో ∙పొడిచర్మం ఉన్నవారిలో ∙డర్మటైటిస్ లేదా థైరాయిడ్ వంటి మెడికల్ హిస్టరీ ఉన్నవారిలో నివారణ ►దురద పుట్టించే బిగుతు దుస్తులు లేదా బెడ్‌షీట్స్ వాడకూడదు. అలాగే అలర్జీలకు కారణమయ్యే కంబళ్లు, ఊల్‌తో/ సింథటిక్ పద్థలుల్లో తయారయ్యే దుస్తులు, చర్మానికి అలర్జీ కలిగించేవి వాడకూడదు. ►అలర్జీ కలిగించే ఘాటైన వాసన సబ్బులు (సోప్స్ విత్ ఫ్రాగ్నెన్స్) వాడకూడదు. ►గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. (ఒక్కోసారి బాగా వేడిగా ఉండే నీళ్లు కూడా డర్మటోగ్రాఫియాను కలిగించవచ్చు.) ►చర్మంపై రోజూ మాయిష్చరైజింగ్ క్రీమ్ వాడుకోవడం మంచిది. ►ఇలాంటి సమస్య ఉన్నవారి చర్మంపై గీరడం, గీయడం చేయకూడదు. ►ఒత్తిడికి (స్ట్రెస్ / యాంగై్జటీలకు) దూరంగా ఉండాలి. చికిత్స ఇది చాలావరకు నిరపాయకరమైనదీ, హానికలిగించని సమస్య కావడంతో దీన్ని గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు అలర్జీలను ఎదుర్కొనే మందులైన కొన్ని డైఫిన్హైడ్రమైన్, యాంటీహిస్టమైన్ వంటి వాటితో చికిత్స అందిస్తారు. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు ఫొటోథెరపీనీ సిఫార్సు చేయవచ్చు. ఇక సంప్రదాయ చికిత్సలుగా టీట్రీ ఆయిల్, అలోవీరా వంటి వాటిని పూయడం వల్ల కూడా కొంతమేర ప్రయోజనం, ఉపశమనం ఉంటాయి. చదవండి: Prostate Gland: ఈ గ్రంథి లేనట్లయితే సంతానమే లేదు.. బాదంకాయంత సైజు నుంచి అమాంతం ఎందుకు పెరుగుతుంది? -
ఐ లవ్ యూ మై లబ్బూ..: జాన్వీ చేతిపై పచ్చబొట్టు
శ్రీదేవి ముద్దుల తనయ, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ యూత్‌లో యమ క్రేజ్ సంపాదించుకుంది. ఏ ట్రిప్పుకు వెళ్లినా, ఏ ఫ్రెండ్‌తో కలిసి రచ్చ చేసినా, వర్కవుట్ చేసినా, వెరైటీ ఫొటోషూట్ చేసినా.. ప్రతీది అభిమానులతో షేర్ చేసుకోవడం ఆమెకు ఎంతో ఇష్టం. ఈ క్రమంలో జాన్వీ కపూర్ పచ్చబొట్టు వేయించుకున్న విషయాన్ని వెల్లడించి ఫ్యాన్స్‌కు స్వీట్ షాకిచ్చింది. ఈ మేరకు పలు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో టాటూ ఆర్టిస్ట్ ఆమె చేతికి ఐ లవ్ యూ మై లబ్బూ అని పచ్చబొట్టు వేశాడు. ఇది చూసిన అభిమానులు లబ్బూ ఎవరబ్బా? అని తెగ ఆలోచించారు. ఒకవేళ జాన్వీ ఎవరితోనైనా పీకల్లోతు ప్రేమలో ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు. కానీ అలాంటిదేమీ లేదు. శ్రీదేవి తన గారాలపట్టి అయిన జాన్వీని లబ్బూ అని పిలిచేది. ఈ క్రమంలో 'ఐ లవ్ యూ మై లబ్బూ.. నువ్వు ఈ ప్రపంచలోనే బెస్ట్ బేబీవి' అని శ్రీదేవి పేపర్ మీర రాసిచ్చిన వాక్యాల్లో నుంచి 'ఐ లవ్ యూ మై లబ్బూ 'అనే పదాలు ఎప్పటికీ చెక్కు చెదరకుండా తన చేతి మీద పర్మినెంట్ టాటూ వేయించుకుంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
టాటూ ట్రెండ్: ఒళ్లంతా పచ్చబొట్లే.. ఏమంటే ఇదో ఫ్యాషన్
సాక్షి, జగిత్యాల: ప్రస్తుత కాలంలో టాటూ ట్రెండ్‌గా మారింది. నాడు పచ్చబొట్టు నేడు టాటూ.. పేరేదైనా జీవితకాలం ఉండే జ్ఞాపకం. టాటూ అంటే యంగస్టర్స్లో విపరీతమైన క్రేజ్. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు డిఫరెంట్‌గా కనిపించాలని శరీరమంతా టాటూస్ డిజైన్ వేయించుకుంటున్నారు. తమకు నచ్చిన వారి పేర్లతో పాటు నచ్చిన వ్యక్తుల ఫొటోస్ టాటూగా వేయించుకుంటున్నారు. ఇన్నర్ ఫీలింగ్స్, ఆలోచన విధానాన్ని బట్టి టాటూస్‌ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. కొందరు స్టైల్ కోసం టాటూ వేయించుకుంటుండగా మరికొందరు తమకు నచ్చిన వ్యక్తులు, నాయకుల ఫొటోలతో పాటు దేవతల ఫొటోలు టాటూగా వేయించుకుంటున్నారు. ప్రెజెంట్ ట్రెండ్‌కు తగ్గట్టుగా రకరకాల టాటూ డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. సింపుల్ టాటూ నుంచి రకరకాల బొమ్మల టాటూలు వేయించుకుంటున్నారు. నార్మల్, పర్మనెంట్, సెమీ పర్మనెంట్ డిఫరెంట్ వెరైటీస్‌లో టాటూస్ వస్తుండటంతో టాటూ లవర్స్ ఫిదా అవుతున్నారు. గతంలో కేవలం గ్రీన్ కలర్ టాటూస్ మాత్రమే ఉండేవి. ప్రస్తుతం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్‌లో టాటూస్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో తమ మనసుకు నచ్చిన భావాలను ఒంటిపై వేయించుకుంటూ మురిసిపోతున్నారు యూత్. యూత్ ఫ్యాషన్‌గా టాటూ.. ప్రస్తుతం యూత్‌ను ఎక్కువగా ఆకర్షిస్తున్న టాటూ యంగ్‌స్టర్స్‌కు ఫ్యాషన్‌గా మారింది. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన వారి పేరు లేదా ఫొటోతో పాటు తాము ఇష్టపడే నాయకులు, ఆరాధించే దేవతల ఫొటోలు టాటూగా వేయించుకోవడం ట్రెండ్‌గా మారింది. తమ ఫీలింగ్స్‌ను ఎదుటి వ్యక్తులకు తెలిపేందుకు టాటూ వేయించుకుంటున్నారు. డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైన్స్.. గతంలో కేవలం గ్రీన్ టాటూ మాత్రమే అందుబాటులో ఉండగా ప్రస్తుతం డిజైనర్లు డిఫరెంట్ వెరైటీస్ అండ్ కలర్ కాంబినేషన్స్‌లో టాటూస్ వేస్తున్నారు. నార్మల్, పర్మనెంట్, సెమీ పర్మనెంట్ టాటూస్ యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. సింపుల్ టాటూ నుంచి మల్టీకలర్‌తో డిఫరెంట్ డిజైన్స్‌లో లైఫ్‌లాంగ్ గుర్తుండేలా టాటూ వేయించుకోవడం ప్రెజెంట్ డేస్‌లో క్రేజ్‌గా మారింది. అభిమానంతోనే.. ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి అంటే నాకు కొండంత అభిమానం. అందుకే ఆయన ఫొటో నా గుండెల మీద టాటూగా వేయించుకున్నాను. ఎప్పటికీ ఆయన అడుగు జాడల్లో నడవడమే నా లక్ష్యం. అందుకే టాటూ వేయించుకుని నా అభిమానాన్ని చాటాను. – రఘువీర్‌గౌడ్ ముంజాల ఫ్యాషన్‌గా ఉండటం ఇష్టం స్టైలిష్‌గా ఉండటమంటే నాకిష్టం. అందుకు తగ్గట్టుగానే ఫ్యాషన్ బిజినెస్‌ను ఎంచుకున్నాను. నా వ్యాపారానికి ఫ్యాషన్‌గా ఉండటం అవసరం. ప్రస్తుత ట్రెండ్‌తో పాటు నా పర్సనాలిటీ కూడా అందుకు తగ్గట్టుగా ఉండటంతో టాటూ వేయించుకున్నాను. – పవన్‌సింగ్ ఠాకూర్ -
అషూ పేరు పచ్చబొట్టు.. కంటతడి పెట్టుకున్న భామ
జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూరెడ్డికి సోషల్ మీడియాలో ఫాలోవర్లు ఎక్కువే. నిత్యం ఫొటోషూట్లతో, ఫన్నీ వీడియోలతో ఫ్యాన్స్‌ను అలరించే ఆమెను ఓ వీరాభిమాని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆమె మీద ప్రేమను వ్యక్తీకరిస్తూ ఏకంగా అషూ అని చేతి మీద పచ్చబొట్టు వేయించుకున్నాడు. దీని పక్కనే ఎర్ర గులాబీ పువ్వును కూడా ముద్రించుకున్నాడు. ఇది చూసి షాకైన అషూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆ టాటూపై స్పందించింది. "ఓ మై గాడ్.. థాంక్యూ సో మచ్.. నిజంగా నాకు సంతోషంతో కన్నీళ్లొచ్చేస్తున్నాయి" అంటూ దండం పెడుతున్న ఎమోజీని జత చేసింది. కాగా అషూ ఈ మధ్యే వ్యాఖ్యాత అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. హోస్ట్‌గా మారడం గురించి ఆమె మాట్లాడుతూ.. ఎప్పటికైనా హోస్టింగ్ చేస్తాననుకున్నా, కానీ మరీ ఇంత త్వరగా హోస్ట్‌గా మారిపోతాననుకోలేదు' అని చెప్పుకొచ్చింది. ఇదిలా వుంటే అషూ, రాహుల్ సిప్లిగంజ్‌ల మధ్య ఏదో ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే తమ మధ్య స్నేహం మాత్రమే ఉందంటూ ఆ రూమర్లను కొట్టేపారేసింది ఈ జంట. కానీ ఈ మధ్యే రాహుల్.. సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ అంటూ అషూను హత్తుకున్న ఫొటోను షేర్ చేసి దానికి లవ్ సింబల్ యాడ్ చేశాడు. దీంతో అది ప్రేమా? ఏదైనా ప్రమోషన్ స్టంటా? అని అభిమానులు తలలు పట్టుకున్నారు. ఇప్పటికీ ఆ పోస్టు మీద వారు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. చదవండి: బిగ్‌బాస్ కలిపిన ప్రేమ.. తోటి కంటెస్టెంట్‌తో లవ్ హ్యాండ్ బ్యాగ్‌కు రెండు లక్షలు! అషూ తల్లి ఫైర్! -
TATTOO: పచ్చని ప్రేమ బొట్టు
‘‘పచ్చబొట్టు ఆదివాసీలకే అబ్బిన విద్య. మన దగ్గర మా బిరుద్ గోందులు మాత్రమే పచ్చబొట్టు వేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మా తెగ ఆడవాళ్లు మాత్రమే పచ్చబొట్టు వేస్తారు’’ అని చెప్పింది సుగుణాబాయ్. ఆమెది ఆదిలాబాద్ జిల్లా, తోషం గ్రామం. పచ్చబొట్టు వేయడానికి ఉపయోగించే కిట్ ఈ మహిళల దగ్గర ఎప్పుడూ ఉంటుంది. పచ్చబొట్టు వేయడానికి ఉపయోగించే సూదులు, అడవిలో సేకరించిన మూలికలతో చేసిన పసర్లు కూడా చిన్న సీసాల్లో ఉంటాయి. బిరుద్ గోందు మహిళల నుదుటి మీద కూడా పచ్చబొట్టు ఉంటుంది. అన్నిరకాల బొట్టుల కంటే ఇది తొలి బొట్టు అని చెబుతారు. పెళ్లికి ముందే పచ్చబొట్టు వేయాలని చెబుతారు. ఇందుకు వాళ్లు చెప్పే కారణం వింతగా ఉన్నప్పటికీ కొంత తార్కికత ఉందనే అనిపిస్తుంది. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాల్సిన యువతికి మానసిక దారుఢ్యం ఉండాలి. నొప్పిని భరించేది దేహమే అయినప్పటికీ మనసు గట్టిగా ఉంటేనే శారీరక బాధను తట్టుకోగలుగుతారని, పచ్చబొట్టు నొప్పి ని భరించిన తరవాత ధైర్యం వస్తుందని, ఆ తర్వాత అడవుల్లో సంచరించేటప్పుడు ఏ గాయం తగిలినా అధైర్యపడరని చెప్పిందామె. బంగారు నగల్లో ఉండే నైపుణ్యం పచ్చబొట్టును అందంగా వేయడం ఒక కళ. ఆ కళలో ప్రతి బిరుద్ గోంద్ మహిళా ఆరితేరి ఉంటుంది. అరచేతి నుంచి మోచేతుల వరకు మెహందీ పెట్టుకున్నట్లు సన్నటి లతలు తీగల డిజైన్‌ను సూదులతో వేస్తారు. మెడ చుట్టూ కంఠాభరణం, ముక్కుపుడక, కాళ్ల పట్టీలు, వంకీలు... అన్నిరకాల ఆభరణాలూ పచ్చబొట్టు వేసుకుంటారు. బంగారు ఆభరణాలలో ఉండే నైపుణ్యం పచ్చబొట్టులోనూ ఉంటుంది’’ అంటోంది సుగుణాబాయి. పచ్చని బంధానికి బొట్టు మన కవులకు పచ్చబొట్టు చక్కటి కథాంశం. ప్రేమికుల మధ్య బంధానికి చెరగని ముద్రగా పచ్చబొట్టు చుట్టూనే కథను అల్లేయడం మన చిత్రసీమ నైపుణ్యం. అయితే, పచ్చబొట్టు ప్రేమికులకు మాత్రమే కాదు, దంపతుల మధ్య ప్రేమను కూడా పెంచుతుందని చెబుతుంది సుగుణాబాయి. ఆడవాళ్లు ఎక్కువగా కృష్ణుడి పింఛాన్ని పచ్చబొట్టుగా వేసుకోవడానికి ఇష్టపడతారని చెప్పింది సుగుణాబాయ్. ఆమె పచ్చబొట్టు వేయడం కోసమే ఆదివాసీల నివాస ప్రదేశాలు, మైదాన ప్రాంతాలు, నగరాల్లోనూ పర్యటించింది. పచ్చబొట్టుమనిషికి – మనసుకు మధ్య ముడివడే అందమైన బంధం అంటుందామె. భార్య పట్ల ప్రేమ ఉన్న మగవాళ్లు భార్య ఎప్పుడూ చల్లగా ఉండాలని కోరుకుంటూ చందమామ బొమ్మ వేసుకుంటారని, భర్తకు ఏ ఆపదా రాకూడదని ఆడవాళ్లు సుదర్శన చక్రాన్ని, కలువ పువ్వు వేయించుకుంటారని చెప్పింది. కానీ, నిజానికి పచ్చబొట్టు వేయించుకునే వాళ్ల మైండ్‌ను ఆ రకంగా మలిచేది పచ్చబొట్టు వేసే మహిళల మాటల చాతుర్యమే. ఈ బాడీ ఆర్డ్ని అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, జార్ఖండ్, ఒడిషాల్లో స్థానిక ఆదివాసీలు వేస్తారు. మన తెలుగు రాష్ట్రాలకు మాత్రం చత్తీస్‌గఢ్, కచ్చర్ గఢ్ నుంచి విస్తరించింది. మాఘ పున్నమి జాతర సుగుణాబాయ్... తమ మూలాలను వివరిస్తూ ‘‘కచ్చర్‌గఢ్ గుహలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ సరిహద్దులో విస్తరించాయి. ఇది మాకే కాదు, అనేక ఆదివాసీ తెగలకు పవిత్రమైన ప్రదేశం. ఏటా ఇక్కడ మాఘపౌర్ణమి నుంచి నాలుగు రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. జంగుబాయి, లింగుబాబా జాతర చేసుకుంటాం. జంగుబాయి కచ్చర్‌గఢ్ లో సంచరించిన కథను పాటలుగా పాడుకుంటాం. పచ్చబొట్టు పసరు ఔషధం కూడా అక్కడే దొరుకుతుంది. మాకు రాయడం రాదు. మా పిల్లలకు మా పూర్వికుల గురించి చెప్పుకునేది పాటలతోనే. పచ్చబొట్టు వేయడానికి వెళ్లిన ప్రతి తావునా మా పాట పాడి వినిపిస్తాం. మా పాటలను మేము రికార్డు చేసుకుని దాచుకుంటున్నాం’’ అని పచ్చబొట్టు అందమైన చరిత్ర చెప్పింది సుగుణాబాయి. – వాకా మంజులారెడ్డి -
అభిమాని చేసిన పనికి షాకైన అఖిల్
అఖిల్ సార్థక్.. బిగ్‌బాస్ నాల్గో సీజన్లో అతివల మనసు దోచిన అందగాడితడు. కేవలం ఫిట్నెస్తోనే కాకుండా యాటిట్యూడ్‌తో, తనదైన గేమ్ ప్లేతో ఫినాలే వరకు చేరుకున్నాడు. కానీ గెలుపుకు అడుగు దూరంలో ఆగిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. అభిమానుల అండ మెండుగా ఉన్న ఇతడికి ఆ మధ్య ఓ ఫ్యాన్ ల్యాప్‌టాప్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. ఆ తర్వాత ఓ వ్యక్తి బిగ్‌బాస్ ఐ ఉన్న బ్రేస్లెట్ ఇచ్చి అతడి మెప్పు పొందాడు. కానీ తాజాగా ఓ వీరాభిమాని చేసిన పనికి అఖిల్‌కు షాక్ కొట్టినంత పనైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. బిగ్‌బాస్ షో సమయం నుంచి అఖిల్‌కు వీరాభిమానిగా మారిపోయాడు అర్జున్ అనే వ్యక్తి. అతడు అందరిలా తన హీరోతో సెల్ఫీ దిగి సంతృప్తిపడాలనుకోలేదు. అతడెప్పటికీ తనతోనే ఉండిపోవాలనుకున్నాడు. దీంతో అఖిల్ పేరును ఛాతీ మీద పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఈ మధ్యే అతడు అఖిల్‌తో ఫొటో దిగాడు. ఈ నేపథ్యంలో అతడి ఎద మీద టాటూ చూసిన అఖిల్‌కు దిమ్మతిరిగినంత పనైంది. తన మీద చూపించిన ప్రేమాభిమానాలకు నోట మాట రాకుండా పోయింది. ఈ క్రమంలో అతడు తన అభిమానితో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. "ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నాకిప్పుడు మాటలు కరువయ్యాయి. కానీ ఇలాంటి అభిమానులు దొరకడం నా అదృష్టం. నా పేరును పచ్చబొట్టు వేయించుకోవడం సాధారణ విషయం కాదు. నీ జీవితంలో నన్ను భాగస్వామ్యుడిని చేసినందుకు, నా మీద ఇంత ప్రేమ చూపిస్తునందుకు థ్యాంక్ యూ అర్జున్. తప్పకుండా మీ అందరూ గర్వపడే స్థాయికి ఎదుగుతాను. కానీ ఓ ముఖ్య విషయం: మీకు నేనంటే చాలా ఇష్టం, అది నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ టాటూలు వేయించుకోవడానికి బదులు ఎప్పటికీ మీరు నాతోనే ఉంటానని మాటిస్తే అదే చాలు.." అని రాసుకొచ్చాడు. ఈ ఫొటో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఇక పాతికేళ్ల వయసులో కారు కొనుక్కోవాలన్న అభిలాషను అఖిల్ ఈ మధ్యే నేరవేర్చుకున్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) చదవండి: హారిక నియామకానికి సంబంధించిన వివరాలు తొలగింపు పాతికేళ్లకే సాధించిన అఖిల్ సార్థక్ -
‘టాటూ’ ట్విస్ట్.. అత్యాచార నిందితుడికి బెయిల్
న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి.. బాధితురాలి చేతి మీద ఉన్న టాటూ ఆధారంగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎందుకంటే బాధితురాలి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించిన వ్యక్తి పేరునే తన చేతి మీద టాటూగా వేయించుకుంది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. కోర్టు విచారణ సందర్భంగా సదరు మహిళ.. నిందితుడు బలవంతంగా అతడి పేరును తన చేతి మీద టాటూ వేయించాడని ఆరోపించింది. అయితే కోర్టు బాధితురాలి ఆరోపణలని కొట్టి పారేసింది. బలవంతంగా ఓ వ్యక్తికి టాటూ వేయడం అంత సులభం కాదని తెలిపింది. ఈ సందర్భంగా జస్టిస్ రజ్నిష్ భట్నాగర్ మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం టాటూ వేయడం అనేది ఓ కళ. అందుకు ప్రత్యేకమైన పరికరం కావాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఓ వ్యక్తికి బలవంతంగా టాటూ వేయలేం. పచ్చబొట్టు పొడిపించుకోవడం ఇష్టం లేకపోతే అవతలి వారు దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. కనుక బలవంతంగా టాటూ వేయడం.. ఒకవేళ వేసినా అది పర్ఫెక్ట్గా రావడం అనేది జరగదు’’ అని తెలిపారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో సదరు మహిళ.. నిందితుడు తనను బెదిరించి, భయపెట్టి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. 2016 నుంచి 2019 వరకు ఇది కొనసాగిందని తెలిపింది. చివరకు ధైర్యం చేసి అతడి మీద పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించింది. మహిళ ఆరోపణలు ఇలా ఉండగా.. నిందితుడు మాత్రం సదరు వివాహితను తాను ప్రేమించానని.. ఇద్దరి సమ్మతితోనే తమ మధ్య శారీరక సంబంధం కొనసాగిందని వెల్లడించాడు. అయితే కొద్ది రోజులుగా మహిళ తనను దూరం పెడుతుందని.. దాని గురించి ప్రశ్నిస్తుండటంతో తన మీద పోలీసులకు ఫిర్యాదు చేసిందని వెల్లడించాడు. చదవండి: బెయిల్ ఓకే, ఆ బిడ్డకు తండ్రెవరు! ఏం జరిగింది? -
ఎవరిదీ మృతదేహం?
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో లభించిన మహిళ మృతదేహం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మృతురాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళగా అనుమానిస్తున్నట్లు సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ కె.చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. బోరబండ సమీపంలోని సున్నం చెరువులో ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని సనత్‌నగర్ పోలీసులు గత నెల 20న స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉంది. ప్రాథమిక ఆధారాలను బట్టి హతమార్చి, ప్లాస్టిక్ కవర్లో చుట్టి చెరువులో పడేసినట్లు తేల్చారు. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఆ మహిళ కుడి చేతిపై ‘ఎస్’ అక్షరం టాటూ వేసి ఉంది. ఆచూకీ తెలిసిన వారు సనత్‌నగర్ ఇన్స్పెక్టర్కు 9490617132 లేదా ఎస్ఐ 7901113461 లేదా పోలీసుస్టేషన్‌కు 8331013246 ఫోన్ చేసి తెలపాలని కోరుతున్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. -
నయనతార పచ్చబొట్టు మారింది
దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార, కొరియోగ్రాఫర్, నటుడు, డ్యాన్సర్, దర్శకుడు ప్రభుదేవాల మధ్య చిగురించిన ప్రేమ ఎక్కువకాలం నిలవలేదు. అయితే వీరు గాఢంగా ప్రేమించుకుంటున్న సమయంలో నయన్ అతని పేరును పచ్చబొట్టు పొడిపించుకుంది. ప్రభుదేవా పేరుని సగం ఇంగ్లీషులో, మిగతా సగం తమిళంలో వేయించుకుంది. అయితే తర్వాత ఏమైందో కారీ ఈ ప్రేమపక్షులు విడిపోయారు. కానీ ఆ టాటూ మాత్రం అలాగే ఉండిపోయింది. అయితే నయన్ తాజాగా షేర్ చేసిన ఫొటో ద్వారా టాటూను మార్చివేసినట్లు తెలుస్తోంది. ప్రభుదేవాని కాస్తా రీడిజైన్ చేయించి పాజిటివిటీగా మార్చింది. (మళ్లీ ఒంటరైన నయన) నయన్ తీసుకున్న అభిప్రాయం సరైనదని ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో శింబుతో, తర్వాత ప్రభుదేవాతో.. ఇలా రెండుసార్లు ప్రేమ బెడిసికొట్టడంతో నయన్ మానసిక వేదనకు గురైంది. అనంతరం దాని నుంచి కోలుకుని సినిమాలపై దష్టి పెట్టిన ఈ హీరోయిన్ ప్రస్తుతం డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. 2015 నుంచి వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇప్పటికే రెండుసార్లులో ప్రేమలో విఫలమైన నయన్ ఈసారైనాపెళ్లివరకు వెళుతుందో లేదో చూడాలి. (నయన్ విషయంలోనూ అలాగే జరగనుందా?) View this post on Instagram us ❤️ #vn💍#santorini A post shared by nayanthara🔵 (@nayantharaaa) on Jun 10, 2019 at 7:21am PDT -
మదిలో.. గదిలో.. ‘అల్లు’కున్న అభిమానం..
సాక్షి, బంజారాహిల్స్: ఒంటి నిండా 13చోట్ల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫొటోలతో.. 19 చోట్ల అల్లు అర్జున్ పేర్లతో పచ్చబొట్లు.. ఇక గదినిండా సుమారు 50వేల వరకు అల్లు అర్జున్ ఫొటోలు.. అభిమానానికి కొలమానం లేదన్నట్లుగా ఆ యువకుడు తన అభిమాన హీరో అల్లు అర్జున్ ఫొటోలతో ఇల్లంతా నింపేశాడు. తలుపులు, కిటికీలు, గోడలు, సీలింగ్, ఫ్యాన్లు ఇలా దేన్నీ వదల్లేదు. ఇంట్లోకి అడుగు పెడితే ఇల్లంతా ఫొటోలే కనిపిస్తాయి. తాను బన్నీకి వీరాభిమానని చెప్పుకుంటాడు సుజిత్. అంతేకాదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్‌లో కూడా ప్రతినిధిగా ఉన్నాడు. తాను ఎంత అభిమానినో చాటుకుంటూ ట్విటర్లో ఆ ఫొటోలను కూడా షేర్ చేసుకున్నాడు. దీనికి అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. ఎటు చూసినా బన్నీ కనిపించాలనే ఇలా ఫొటోలతో, టాటూలతో అలంకరించుకున్నట్లు ఈ యువకుడు వెల్లడించాడు. -
చెరిగిపోని వారసత్వం
విదేశీ యాత్రికుడు ఫిలిప్ లాంకాస్టర్ జెరూసలేంను సందర్శిస్తూ ప్రార్థనా మందిరం తర్వాత అక్కడి ప్రాచీన దారులను, గోడలను వీక్షిస్తూ ముందుకు వెళుతున్నాడు. జాఫా గేట్ వద్ద సెయింట్ జార్జ్ స్ట్రీట్‌లో ఒక టాటూ షాప్ కనిపించింది. జెరూసలేం యాత్ర జీవితాంతం గుర్తుండిపోయేలా పచ్చబొట్టు వేయించుకోవాలనుకున్నాడు. రజౌక్ టాటూ షాప్ అని కనిపిస్తున్న ఆ దుకాణంలోకి వెళ్లి ఆ షాప్ నిర్వాహకుడితో తన చేతి మీద పచ్చబొట్టు వేయమని కోరాడు. మాటల్లో వారి విషయాలు తెలుసుకున్న ఫిలిప్ ఆశ్చర్యానందాలకు లోనయ్యాడు. రజౌక్ టాటూ షాప్ 1300వ సంవత్సరం నుండి అక్కడే ఉంది! 700 సంవత్సరాలుగా జెరూసలేం యాత్రికులు ఆ షాప్‌కి రావడానికి ముచ్చటపడుతూనే ఉన్నారు. ఆ విధంగా ప్రపంచంలోని అతి పురాతన టాటూ షాపులలో రజౌక్ షాప్ ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం 27వ తరానికి చెందిన వాసిమ్ రజౌక్ ఈ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. శతాబ్దాల క్రితం అతని పూర్వీకులు ఈజిప్ట్ నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారట. నాటి సాధనాలు, పద్ధతులతో పచ్చబొట్టు వేసే వృత్తిని ఆ కుటుంబం చేపట్టింది. వాసిమ్ రజౌక్ ఉపయోగించే పచ్చబొట్టు ముద్రలు, నమూనాల ఎంపికకు సంబంధించినవన్నింటికీ వందల సంవత్సరాల వయసు ఉంది. వాసిమ్ బొట్టు వేయడానికి ఆధునాతనమైన, క్రిమిరహితం చేసిన పరికరాలనే ఉపయోగిస్తాడు. షాపులోని ఆలివ్ కలప నుండి చేతితో చెక్కబడిన గ్లాస్ డిస్ప్లే నమూనాలు చీకటిలో అద్భుతంగా మెరుస్తుంటాయి. మ్యూజియంలో ఉండే విలువైన పురాతన కళాఖండాలను పచ్చబొట్లుగా వాసిమ్ వేయడాన్ని వీక్షించాల్సిందే. ప్రాచీన జెరూసలేంలోని శిలువ నమూనాలు ఇప్పటికీ వాసిమ్ దగ్గర అత్యంత ప్రజాదరణ పొందిన డిజైన్లు. స్టెన్సిల్స్‌తో.. క్రీస్తు శిలువ నుండి పునరుత్థానం వరకు అన్ని వర్ణనలు ఈ పచ్చబొట్లలో ప్రతిఫలిస్తాయి. యాత్రికుడు ఒక స్టెన్సిల్‌ను ఎంచుకుంటాడు. వాసిమ్ దానిని ఒక ప్యాడ్‌లో వేసి, ఆ డిజైన్‌ను ఒంటిపైకి బదిలీ చేసి పచ్చబొట్టు పొడుస్తాడు. అతని పనితనం చాలా సునిశితంగా, సున్నితంగా ఉంటుంది. ‘‘జీవిత కాలం కొనసాగే స్మృతి చిహ్నం కోసం ఇలా రజౌక్ టాటూ షాప్‌లో ఒక రోజు గడపడం అంటే క్రైస్తవ ప్రపంచం కూడలి వద్ద కూర్చోవడంతో సమానంగా భావించవచ్చు’’ అని ఫిలిప్ లాంకాస్టర్ అంటారు. -
వాట్ యాన్ ఐడియా సర్జీ!
హడావుడిలో బయటకు వెళ్లేటప్పుడు ఏదో ఒక వస్తువు మర్చిపోతుంటాం.. అది సహజం కూడా. కానీ కొందరు అదే పనిగా రోజూ ఏదో ఒకటి మర్చిపోతుంటారు. అయితే వియత్నాంలో ఉన్న ఓ వ్యక్తి బయటకు వెళ్లేటప్పుడు ఎప్పుడూ తన గుర్తింపు కార్డు మర్చిపోతున్నాడట. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడట. ఆఖరికి తన ఫ్రెండ్స్‌తో బార్‌కు గట్రా వెళ్లినప్పుడు మైనర్‌వి అంటూ ఆల్కహాల్ కూడా ఇవ్వట్లేదట. దీంతో విసుగు చెందిన మనోడు ఓ చక్కని పరిష్కారానికి ఆలోచించాడు. తన ఐడీ కార్డును తన చేతిపై పచ్చ బొట్టు మాదిరిగా వేయించుకోవాలని నిర్ణయానికొచ్చాడు. అనుకున్నదే తడవుగా వెంటనే పచ్చబొట్లు వేసే దుకాణానికి వెళ్లి చేతిపై ఐడీకార్డు మొత్తం పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఆ ఆర్టిస్ట్‌కు ఐడీ కార్డు వేసేందుకు గంట సమయం పట్టిందట. ఆ యువకుడి పచ్చబొట్టును చూసిన స్నేహితులు ఫొటో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. అంతే ఈ ఫొటో వియత్నాం మొత్తం వైరల్ అయింది. ఎంతయినా మనోడి తెలివేతెలివిగురూ..! -
నవదంపతుల మధ్య చిచ్చుపెట్టిన పచ్చబొట్టు.!
-
పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన పచ్చబొట్టు.!
సాక్షి, చెన్నై: ఇష్టమైన వారిని మెప్పించడం కోసం ఒక్కొక్కరు ఒక్క విధంగా ప్రయత్నిస్తుంటారు. కొంద మంది బహుమతులు ఇస్తే మరికొంత మంది తాము ఇష్టపడిన వారి పేర్లను పచ్చబొట్లు (టాటూ)ల కూడా వేయించుకుంటారు. అలా వేయించుకున్న ఓ పచ్చబొట్టే పచ్చని కాపురంలో చిచ్చురేపింది. గతంలో తను ప్రేమించిన అమ్మాయి పేరును పచ్చబొట్టు వేయించుకన్న వ్యక్తి.. కాలం కలిసి రాకపోవడంతో వేరే మహిళను వివాహం చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఆ పచ్చబొట్టు మాత్రం అలాగే చేతిపై ఉండిపోయింది. అనుకోకుండా భర్త చేతిపై వేరే మహిళ పేరు ఉండటంతో నవవధువుకు పట్టలేని కోపం వచ్చింది. అతడిని చితకబాదింది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా మెట్టుపాళయంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ ప్రైవేట్ బస్సులో క్లీనర్‌గా పనిచేస్తున్న వ్యక్తి(20)కి, మహిళ(22)తో ఐదు రోజుల కిందట వివాహంజరిగింది. అయితే నవదంపతులు బుధవారం సాయంత్రం సాయిబాబ కాలనీలోని ఓ గుడికి వెళ్లారు. దర్శనం అనంతరం బస్టాండ్‌లో బస్సు కోసం వేచిచూస్తూ.. కబుర్లు చెప్పుకుంటూ నిల్చున్నారు. ఆ సమయంలో తన భర్త చేతిపై వేరే మహిళ పేరు ఉండటాన్ని గమనించి, ఆ పేరు ఎవరిదని ప్రశ్నించింది. అతడి నుంచి సమాధానం రాకపోవడంతో అందరూ చూస్తుండగానే చితకొట్టేసింది. చొక్కా పట్టుకొని చెంప చెళ్లుమనిపించింది. జుట్టు పట్టుకొని పిడిగుద్దులు గుద్దింది. కిందపడేసి చెడామడా వాయించింది. చుట్టూ ఉన్న జనం ఇదంతా చూసి షాకయ్యారు.అయినా ఆ పేరెవరిదో చెప్పకపోవడంతో ఆ నవవధువు తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
నాన్నకు ప్రేమతో..
తమిళసినిమా: కన్నవారిపై ఎవరికైనా ప్రేమ ఉంటుంది. అయితే దాన్ని నిరూపించుకోవడానికి విశేష సందర్భం అందరికీ కలగదు. యువ నటుడు షణ్ముగ పాండియన్‌కు అలాంటి మంచి తరుణం కలిసొచ్చింది. సీనియర్ నటు డు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌కాంత్ పుత్రరత్నాల్లో ఒకరే ఈ షణ్ముగపాండియన్. ఈయన కథానాయకుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. షణ్ముగ పాండియన్ నటించిన మదురైవీరన్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చిం ది. ఇక విజయకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనది 40 ఏళ్ల గొప్ప నట చరిత్ర. అందులో ఎన్నో సంచలన విజయాలను అందుకున్నారు. ఎందరికో నట జీవితా న్ని ప్రసాదించిన ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి న నటుడు విజయకాంత్. అలాంటి ఆయన 40 సినీ వసంతోత్సవ వేడుకను ఇటీవల కాంచీపురం సమీపంలో ఘనంగా నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు, వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆ వేడుకలో పాల్గొని ఆశీర్వాదాలు, అభినందనలు అందించారు. అదే వేదికపై విజయకాంత్ కుటుంబసభ్యులు పాల్గొన్నా, ఆయన చిన్న కొడుకు, నటుడు షణ్ముగపాండియన్ హాజరు కాలేదు. కారణం ఆ సమయంలో ఆయన లండన్‌లో ఉన్నారు. నాన్న 40 నట వసంతాల వేడుకలో పాల్గొన లేకపోయానన్న కొరతను ఇటీవల చెన్నైకి తిరిగొచ్చిన తరువాత తీర్చుకున్నారు. అది ఎలాగంటే తన తండ్రి రెండు కళ్లను తన బాహువులపై పచ్చబొట్టు పొడిపించుకుని ఆయన ముందు నిలిచి ఇది నాన్నపై తనకున్న ప్రేమ అని నిరూపించుకున్నారు. అదే సమయంలో తన తండ్రి ఆశీస్సులు అందుకుని ఎనలేని ఆనంద తరుణాన్ని పంచుకున్నారు. తండ్రితో ఫొటో తీసుకుని మధురానుభూతిని పొందారు. -
‘టాటూ’ దొంగను పట్టిచ్చింది
బనశంకరి: మోబైల్ దుకాణంలో చోరీకి పాల్పడిన చోరీదారుడిని ట్యాటూ ఆధారంగా పీణ్యాపోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.5 లక్షల విలువ చేసే సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఈ ఏడాది సెప్టెంబర్ 23న జాలహళ్లి క్రాస్‌లోని మోబైల్షోరూమ్లో రూ.5 లక్షల విలువైన సెల్ఫోన్లు, రూ.2 లక్షల నగదు దోచుకుని ఉడాయించాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పీణ్య పోలీసులు మోబైల్ దుకాణంలో అమర్చిన సీసీకెమెరా పుటేజీలను పరిశీలించారు. నిందితుడి చేతిపై ఉన్న ట్యాటూ గుర్తు కలిగి ఉండటం, వాట్సాప్ ఆన్‌చేసి చోరీకి పాల్పడినట్లు తెలిసింది. దీని ఆధారంగా పోలీసులు విభిన్నకోణాల్లో విచారణ చేపట్టిన నిందితుడిని జార్ఖండ్‌కు చెందిన సంజయ్గా గుర్తించారు. ఈమేరకు పోలీసులు జార్ఖండ్‌కు వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఎవరో కనుక్కోండి?
‘‘డిసెంబర్లో నా బర్త్‌డేకి ఓ సర్ప్రైజ్’’ అని గత నెల ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో రెజీనా అన్నారు. అన్నట్లుగానే అందరూ ఆశ్చర్యపోయేలా బుధవారం ఓ వెరైటీ లుక్‌లో కనిపించారు. ఇక్కడ మీరు చూస్తున్న లుక్ అదే. హెయిర్ స్టైల్, వీపు, చేతి మీద ట్యాటూ, వేళ్ల మీద స్నేక్ సింబల్.. టోటల్‌గా ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించనంత వెరైటీగా కనిపిస్తున్నారు కదూ. హీరో నాని సమర్పణలో ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తోన్న ‘అ’లోనే రెజీనా ఇలా కనిపించనున్నారు. పలు షార్ట్ ఫిల్మ్స్‌కి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. నిత్యామీనన్, శ్రీనివాస్ అవసరాల, ఈషా రెబ్బా, కాజల్ అగర్వాల్.. ఇలా భారీ తారాగణంతో సినిమా తెరకెక్కుతోంది. ఒక్కొక్కరి లుక్‌ని విడుదల చేసుకుంటూ వస్తున్నారు. ట్యాటూకి 12 గంటలు – ప్రశాంత్ వర్మ బుధవారం రిలీజ్ చేసిన రెజీనా లుక్ వెనక కహానీ ఏంటని దర్శకుడు ప్రశాంత్ వర్మని అడిగితే... ‘‘ఈ క్యారెక్టర్ కోసం రెజీనా తన హెయిర్‌ని ట్రిమ్ చేసుకున్నారు. మూడు డిఫరెంట్ షెడ్యూల్స్ కోసం మూడు సార్లు ఆమె ట్రిమ్ చేసుకోవాల్సి వచ్చింది. ఫొటోలో కనిపిస్తున్నట్లుగా హెయిర్ కట్ చేయించుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ‘మో’ అనే ఆర్టిస్ట్ రెజీనాకి ట్యాటూ వేశారు. ఈ ట్యాటూ వేయడానికి 12 గంటలు పట్టేది. చెరిపేయడానికి పెద్దగా ఏం చేయక్కర్లేదు. ఎక్కువ నీళ్లతో కడిగితే చాలు. సినిమా మొత్తం దాదాపు ఈ లుక్‌లోనే కనిపిస్తారు రెజీనా. కాస్ట్యూమ్ డిజైనర్ శాంతి క్రియేషన్ సూపర్బ్. దాదాపు 12 రోజులకు పైగా రెజీనా పాత్ర చిత్రీకరణకు పట్టింది. ట్యాటూలో ఉన్న చిన్న చుక్కకి కూడా స్టోరీ ఉంటుంది. అసలు రెజీనా క్యారెక్టరైజేషన్, సినిమా బ్యాక్‌స్టోరీ ఈ ట్యాటూలోనే ఉంటుంది’’ అన్నారు. లుక్ టెస్ట్‌కి 24 గంటలు – రెజీనా బర్త్‌డే బేబి రెజీనాని ‘ఏం నచ్చి ఈ సినిమా ఒప్పుకున్నారు?’ అని అడిగితే – ‘‘ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూశాను. మంచి స్టఫ్ ఉందనిపించింది. ప్రశాంత్ ‘అ’ కథ చెప్పగానే, ‘తప్పకుండా చేస్తాను. కానీ, ఈ పాత్ర అయితేనే చేస్తాను. బ్రహ్మాండంగా చేస్తాను’ అన్నా. కోరుకున్న పాత్రనే ఇచ్చారు’’ అని తెలిపారు. ఈ క్యారెక్టర్‌కి ఎలా ప్రిపేర్ అయ్యారో చెబుతారా? అన్నప్పుడు – ‘‘కాస్ట్యూమ్స్, మేకప్, హెయిర్ స్టైల్‌తో సహా మొత్తం రెడీ అయ్యి, లుక్ టెస్ట్ చేయడానికి ఫస్ట్ డే 24 గంటలు, తర్వాత రోజు 12 గంటలు పట్టింది. మంచి సినిమా చేస్తున్నప్పుడు ‘ఎన్ని అవర్స్ కష్టపడ్డాం’ అని ఆలోచించకూడదు’’ అన్నారు. -
పచ్చబొట్టు
-
టాటూలతో తిప్పలే!
మణికట్టుపై ఒకటి... చెవి వెనక ఒకటి... వీపుపై ఇంకొకటి... కాలి మీద మరొకటి... భుజంపై మళ్లీ ఒకటి... మొత్తంగా ఒంటిపై ఐదు పచ్చబొట్లు పొడిపించుకున్నారు శ్రుతీహాసన్. ఇప్పుడు సై్టలుగా ‘టాటూలు’ అంటున్నారు కదా... పచ్చబొట్లంటే అవే. ఈ ఐదింటికి తోడుగా మీ ఒంటిపై ఆరో పచ్చబొట్టు ఎప్పుడు చేరుతుంది? ఇంకో టాటూ ఎప్పుడు వేయించుకుంటారు? అని శ్రుతీని అడిగితే... ‘‘ఇక చాలు! ఈ ఐదు టాటూలు వేయించుకున్నందుకు చాలా బాధపడుతున్నా. ముఖ్యంగా మణికట్టుపై టాటూతో అయితే మరీ ఎక్కువ బాధపడుతున్నా. దీన్ని కవర్ చేయడానికి టూ మచ్‌గా మేకప్ వేసుకోవలసి వస్తుంది’’ అన్నారు. హీరోయిన్లకు టాటూలతో ఇలాంటి తిప్పలు తప్పవన్న మాట. -
పచ్చబొట్టు ప్రాణం తీసింది..
న్యూయార్క్: పచ్చబొట్టు వేయించుకున్న ఓ అమెరికన్ దాన్నుంచి శరీరంలోకి ఇన్ఫెక్షన్ సోకి ప్రాణాలు కోల్పోయాడు. టాటూ వేయించుకున్నాక∙కొన్ని వారాలు స్విమ్మింగ్‌పూల్‌లో స్నానం చేయకూడదు. అయితే టాటూ వేయించుకున్న ఐదు రోజులకే స్విమ్మింగ్‌పూల్‌లో అతడు స్నానం చేశాడు. దీంతో కండను తినేసే విబ్రియో వల్నిఫికస్ బ్యాక్టీరియా శరీరంలోకి చొరబడింది. తీవ్ర జ్వరంతోపాటు శరీరం ఎర్రగా మారింది. ఆస్పత్రిలో చేరిన బాధితుడు ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడంతో రెండు నెలల తర్వాత కాలేయం, కిడ్నీ, చర్మం పాడై ప్రాణాలు కోల్పోయాడు. -
ఆ పాట వింటే నా వెంటే!
‘డాడీస్ లిల్ గర్ల్’... ఇది ప్రియాంకా చోప్రా చేతి మీద ఉన్న టాటూ. తండ్రి అంటే ఆమెకు పిచ్చి ప్రేమ. అందుకే ఇలా పచ్చ బొట్టు పొడిపించుకున్నారు. మూడేళ్ల క్రితం ప్రియాంక తండ్రి అశోక్ చోప్రా చనిపోయారు. భౌతికంగా మాత్రమే ఆయన దూరమయ్యారని ఆమె అంటున్నారు. అప్పట్లో అశోక్ చోప్రా ఓ పాట పాడారు. ఆ పాటను రిలీజ్ చేద్దామని ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురి కావడం, చివరికి తిరిగి రాని లోకాలకు వెళ్లడం జరిగిపోయాయి. ఇప్పుడా పాటను తాను నిర్మించి న తాజా పంజాబీ చిత్రం ‘శర్వాణ్’లో వాడారు ప్రియాంక. ‘‘మా నాన్నంటే చాలా ఇష్టం. ఆయనే నాకు రోల్ మోడల్. నాన్న పాడిన పాట వింటున్నపుడు ఆయన నాతో ఉన్నారన్న భావన కలుగుతుంది. మా నాన్న మీద ఉన్న ప్రేమతోనే ‘శర్వాణ్’ నిర్మించా. ఆయన పాడిన పాటను ఈ సినిమాలో ఉపయోగించడం ఆనందంగా ఉంది’’ అని ప్రియాంక పేర్కొన్నారు. ఈ నెల 13న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
రైతు గుండెపై కేసీఆర్ పచ్చబొట్టు
చేగుంట: అభిమానాన్ని చాటుకోవడంలో ఒక్కో వ్యక్తి ఒక్కో రకంగా ఉండటం పరిపాటి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభిమానిస్తున్న ఓ రైతు ఏకంగా తన గుండెపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూర్ గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అతనికి కేసీఆర్ అంటే విపరీతమైన అభిమానం. ఆయన పేరును పచ్చబొట్టు పొడిపించుకోవడానికి చాలా ఊర్లు తిరిగాడు. చివరకు హైదరాబాద్‌లో పచ్చబొట్టు వేసేవారు దొరకడంతో కేసీఆర్ పేరును వేరుుంచుకున్నాడు. తన జీవితంలో ఒక్కసారైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, మంత్రి హరీశ్‌రావును కలవాలన్నదే తన కోరిక అని రైతు శ్రీనివాస్ తెలిపాడు. వీరాభిమానం అంటే ఇదేనేమో.. -
తాప్సీ టాట్టుకు పిచ్చ క్రేజ్
సినిమా, అందులో నటించే తారల ప్రభావం యువతపై ఎంతగా పడుతుందో అనడానికి చిన్న ఉదాహ రణ నటి తాప్సీ వంటిపై పొడిపించుకున్న టాట్టు. నటి తాప్సీ ఇప్పుడు యమ ఖుషీగా ఉన్నారు. ఈ ముద్దుగుమ్మకు దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటించినా లభించని విజయం బాలీవుడ్లో దక్కింది. నిజం చెప్పాలంటే తాప్సీ సాహసోపేతమైన పాత్రలో నటించి సక్సెస్ అయ్యార ని చెప్పవచ్చు. తను బిగ్‌బీ అమితాబ్‌తో కలిసి నటించిన చిత్రం పింక్. ఇందులో అత్యాచారానికి గురైన యువతిగా తాప్సీ నటించారు. ఇందులో అమితాబ్ బచ్చన్‌కు ఎంత పేరు వచ్చిందో అంతగా తాప్సీ నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. గత 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చిన పింక్ చిత్రం ఇప్పటికే రూ. 72.44 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. త్వరలోనే వంద కోట్ల క్లబ్లో చేరుతుందని కూడా అంచనాలు వేస్తున్నారు.ఈ చిత్రం కోసం నటి తాప్సీ మెడ కింద భాగంలో పక్షులు రెక్కలు విప్పి విహంగం చేసేలాంటి టాట్టును పొడిపించుకున్నారు. ఇది ఆమె పాత్ర స్వభావాన్ని ఆవిష్కరిస్తుంది. టాప్సీ టాట్టు బాహ్యప్రంచంలో యువతను విపరీతంగా ఆకర్శించేస్తోందట. ఆమెలా టాట్టు పొడిపించుకోవడానికి యువతులు టాట్టు దుకాణాల్లో బారులు తీరుతున్నారట. మెడ కింద టాట్టు పొడిపించుకోవడానికి చాల బాధగా ఉంటుంది. అయినా పర్వాలేదని అక్కడే టాట్టు కావాలంటున్నారట. నటి తాప్సీ టాట్టు యువతలో ఎంత పిచ్చిగా ప్రభావం చూపుతుందో చూశారా’ -
టాటూలతో ఉద్యోగావకాశాలు!
లండన్: శరీరంపై పచ్చబొట్టు (టాటూ) ఉద్యోగార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని గతంలో తేలినప్పటికీ తాజా అధ్యయనాల్లో మాత్రం ఉద్యోగావకాశాలు పెరుగుతాయని వెల్లడైంది. నైట్‌క్లబ్‌లలో మద్యం అందించే ఉద్యోగానికి(బార్టెండర్) టాటూ ఉన్నవారినే బార్ మేనేజర్లు ఎక్కువగా ఎంపిక చేస్తున్నట్లు యూకేలోని సెయింట్ ఆండ్రూ వర్సిటీకి చెందిన ఆండ్రూ టిమ్మింగ్ పరిశోధనలో తేలింది. యువ కస్టమర్లను టాటూలు ఆకర్షిస్తాయని, ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో టాటూలు మార్కెటింగ్, బ్రాండింగ్ సాధనాలుగా ఉపయోగపడుతున్నాయని టిమ్మింగ్ చెబుతున్నారు. పబ్మేనేజర్లను టాటూలపై ప్రశ్నించగా.. అవి సానుకూల ప్రభావం చూపుతాయని చెప్పారు. అయితే సాతానిజం, ఫాసిజం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే టాటూలు మాత్రం ప్రతికూల ప్రభావం చూపుతాయని బార్ యజమానులు చెబుతున్నారు. -
టాట్రూస్
ఒకప్పటి రోజుల్లో కొంతమంది తమకు ఇష్టమైన వారి పేరునో, ఇష్టదైవం ఆకృతినో, తమ మత చిహ్నాన్నో మాత్రమే పచ్చబొట్లుగా పొడిపించుకుని, పచ్చబొట్టూ చెరిగీ పోదులే అంటూ పాటలు పాడుకునేవారు. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. వొంటిమీద... ఇంకా చెప్పాలంటే వొళ్లంతా సందులేకుండా వింత వింత టాటూలు వేయించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్. అదోవిధమైన క్రేజ్. అయితే అలా ఎక్కడపడితే అక్కడ టాటూలు వేయించుకోవడమంటే కోరికోరి ముప్పును కొని తెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఎందుకంటే టాటూలు వేయడానికి వాడే పరికరాలు కనుక అపరిశుభ్రంగా ఉంటే బ్యాక్టీరియా త్వరగా వృద్ధిచెందే అవకాశం ఉందట. దానిమూలంగా ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. టాటూలు వేయించుకునేవారిపై యూరోపియన్ కమిషన్స్ జాయింట్ రిసెర్చ్ (జేఆర్సి) నిర్వహించిన ఒక సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. సాధారణంగా టాటూలంటే పలురకాలైన ఇంకులను చర్మంలోకి చొప్పించి, వాటిని దీర్ఘకాలం పాటు కనిపించేలా చేయడమే! ఇక్కడే అసలు చిక్కొచ్చిపడుతోంది. అదేమంటే, అలా చొప్పించే ఇంకులన్నీ రసాయనాలతో కూడుకున్నవి కావడం, ఒకవేళ ఆ ఇంకు కనుక వొంటికి సరిపడకపోతే అది క్రమేపీ చర్మసంబంధ క్యాన్సర్‌కి దారితీస్తుందట. అదేవిధంగా టాటూలు వేసేందుకు వాడిన ఇంజెక్షన్ సూదుల్లాంటి పరికరాలు కనుక సరైన పద్ధతిలో శుభ్రం చేయకపోతే అలర్జీ సంబంధమైన పలు ఇతర రకాల ఇబ్బందులూ తలెత్తుతాయి కాబట్టి, ఒకవిధంగా చెప్పాలంటే ఎక్కడపడితే అక్కడ అంటే చవగ్గా పొడుస్తున్నారు కదా అని మరీ రోడ్డుపక్కన కూర్చోబెట్టి టాటూలు వేసే వారి వద్దకు వెళ్లిపోకండి మరి! -
టాటూలతో క్యాన్సర్!
లండన్: టాటూల ద్వారా స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తున్నట్లు వెల్లడైంది. టాటూలు వేయించుకుంటున్నవారిలో 5 శాతం మంది చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారని అధ్యయనంలో తేలింది. టాటూలు ఎక్కువకాలం ఉండేందుకు చర్మంలోకి రసాయనాలను పంపుతారు. వీటివల్ల ఇన్ఫెక్షన్లు వస్తున్నట్లు గుర్తించారు. టాటూల ద్వారా చర్మ క్యాన్సర్ వస్తుందన్న విషయంపై శాస్త్రవేత్తలు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. టాటూల ద్వారానే చర్మ క్యాన్సర్ వస్తుందనేందుకు ఆధారాలు లేవని, రాదనే విషయాన్నీ కొట్టిపారేయలేమని చెబుతున్నారు. -
స్వర్ణం నెగ్గిన సంబరాలలో...
స్విమ్మింగ్ రారాజు, బంగారు చేపగా ప్రసిద్ధి గాంచిన అమెరికా దిగ్గజ స్విమ్మర్ మైకెల్ ఫెల్ప్స్‌కు షాకిచ్చిన సింగపూర్ చిన్నోడు జోసెఫ్ స్కూలింగ్ స్వర్ణాన్ని నెగ్గిన సంబరాల్లో మునిగి తేలుతున్నాడు. రియోలో జరిగిన 100 మీటర్ల బటర్ ఫ్లై ఈవెంట్లో జోసెఫ్ స్కూలింగ్ స్వర్ణాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రియో ఒలింపిక్ పతకానికి గుర్తుగా ఓ టాటూ వేయించుకున్నాడు. తాను ఎంత సంతోషంగా ఉన్నాడో తెలిపేందుకు ఆ టాటూను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. ఆ ఫొటోలో ఒలింపిక్స్ లోగోలే ఉండే ఐదు వలయాలు తన కుడిచేతిపై ఉన్న టాటూలో దర్శనమిస్తాయి. స్వర్ణం నెగ్గి సింగపూర్ చేరుకున్న ఈ చిన్నోడికి దేశం ఘన స్వాగతం పలికింది. జోసెఫ్ పోటీలో ఓడించింది అలాంటి ఇలాంటి స్విమ్మర్‌ను కాదు.. స్విమ్మింగ్ కే మారుపేరుగా నిలిచిన ఫెల్ప్స్‌ను రజతానికి పరిమితం చేసి స్వర్ణాన్ని కైవసం చేసుకోవడం చాలా గొప్ప విజయం. 'టాటూ చాలా ఏళ్లుగా ఉండిపోతుందని తెలుసు, నాకు కావాల్సింది చివరికి దక్కింది' అని జోసెఫ్ స్కూలింగ్ తన ఫేస్ బుక్ ఖాతాలో రాసుకొచ్చాడు. ఆ టాటూ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. -
చైతూ, సమంతలు మళ్లీ దొరికేశారా..?
కొంత కాలంగా టాలీవుడ్ యువ జంట నాగచైతన్య, సమంత ల గురించి రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు పీకల్లోతూ ప్రేమలో ఉన్నారంటూ, ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ వీరి వివాహానికి అంగీకరించిందంటూ ప్రచారం జరిగింది. అయితే అధికారికంగా చైతూ పెళ్లి చేసుకోబోయేది సమంతనే అన్న ప్రకటన మాత్రం రాలేదు. అదే సమయంలో నాగచైతన్య సమంతతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా మరో సంఘటన ఈ ఇద్దరి బంధం గురించి వస్తున్న వార్తలకు ఊతమిస్తోంది. ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ రెస్టారెంట్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సమంత తన చేతి మీద ఉన్న టాటూ కనిపించేలా ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. ఇప్పుడు ఆ టాటూనే హాట్ టాపిక్‌గా మారింది. సమంత కుడి చేతి మీద ఉన్న అదే తరహా టాటూ సరిగ్గా అదే ప్లేస్‌లో నాగచైతన్య చేతిమీద కూడా ఉండటం విశేషం. ఇద్దరూ కావాలనే అలా వేయించుకున్నారా.. లేక అనుకోకుండా అలా జరిగిందా.. ఏదైనా అక్కినేని ఫ్యామిలీ నోరు విప్పితే గాని అసలు విషయం బయటకి రాదు. -
హీరోయిన్ టాటూ వేస్తానంటే వద్దన్న హీరో
లాస్ ఏంజెలెస్: హాలీవుడ్ టాప్ హీరో విల్ స్మిత్ టాటూ వేయించుకోవడానికి నిరాకరించాడు. 'సూసైడ్ స్క్వాడ్' సినిమాలో తనతో పాటు నటించిన హీరోయిన్ మార్గట్ రాబీ.. స్మిత్ కు టాటూ వేసేందుకు ఉత్సాహం చూపించగా అతడు అయిష్టత వ్యక్తం చేశాడు. షూటింగ్ లో టాటూ గన్ పట్టుకుని పచ్చబొట్టు పొడిచేందుకు ఆమె ప్రయత్నించగా విల్ ఒప్పుకోలేదు. 'నా దగ్గర టాటూ గన్ ఉంది. పచ్చ బొట్టు పొడవమంటావా' అని మార్గట్ రాబీ అడగ్గా.. విల్ స్మిత్ వద్దని వారించాడు. టాటూ స్కిల్ చూపించాలన్న ఉత్సాహంపై స్మిత్ నీళ్లు చల్లాడని రాబీ వ్యాఖ్యానించింది. సహ నటుడు కోయిల్ కినర్మాన్ కు స్మిత్ టాటూ పెట్టడం విశేషం. -
మహిళపై దాడి చేసి ఏడుచోట్ల అసభ్య టాటూలు
జైపూర్: రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై ఘోరంగా దాడి చేసి ఆమెను బాగా కొట్టిపడేశారు. అంతటితో ఆగకుండా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగానే శరీరం నిండా ఏడు చోట్ల పచ్చబొట్లు అసభ్యకరంగా పొడిచారు. చెప్పకూడని చోట్లలో ఆమెకు పచ్చబొట్లు వేశారు. నుదురు భాగంలో ' మా నాన్న ఒక దొంగ' అంటూ పచ్చబొట్టేశారు. ఈ సంఘటన చూసి ఖిన్నులైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు ప్రకారం ఈ దారుణానికి పాల్పడింది ఆ మహిళ అత్తింటివాళ్లేనని తెలుస్తోంది. కట్నంగా తీసుకొస్తానని చెప్పిన రూ.51 వేలు చెల్లించలేదనే అక్కసుతో ఆమెను దారుణంగా కొట్టి వారు ఈ పనిచేసినట్లు తెలుస్తోంది. గత నెలలో కూడా ఒకసారి తమ కూతురుకి మత్తుమందు ఇచ్చి గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
పచ్చబొట్టేసినా..!
► పచ్చబొట్లపై పెరుగుతున్న మోజు ► 54 రంగుల్లో శాశ్వతంగా నిలిచిపోతున్న చిత్రాలు ► ఖరీదు ఎక్కువైనా కర్నూలుకు పాకిన టాటూ కర్నూలు(అర్బన్): పచ్చబొట్టూ చెరిగి పోదూలే ... నా రాజా ... అనే పాత తరానికి, పచ్చబొట్టేసినా ... పిల్లగాడా నీతో ... పచ్చి ప్రాయాలని పంచుకుంటాను రా ... అనే కొత్తదనానికి దీటుగా నేటి యువత టాటూ వేయించుకునేందుకు తెగ ఉత్సాహాన్ని చూపుతోంది. ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన టాటూ నేడు కర్నూలుకూ వచ్చింది. ఆరోగ్యవంతమైన శరీరం కలిగిన యువత.. చేతులపై తమకు ఇష్టమైన చిత్రాలను వేయించుకునేందుకు ఇష్టపడుతోంది. టాటూతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేక పోవడం వల్ల అమ్మాయిలు కూడా ఉత్సాహం చూపుతున్నారు. పూర్వం రాజుల కాలంలో ఖైదీలకు గుర్తించించేందుకు పచ్చబొట్లను పొడిచే వారని, అలాగే కొన్ని గిరిజన తెగలు సంప్రదాయంగా పచ్చబొట్లను పొడిపించుకునే వారని తెలుస్తోంది. కాలక్రమేణ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు అధికశాతం పచ్చబొట్లను వేయించుకునేవారు. అలాగే తల్లిదండ్రులు కూడా తమ కూతుర్లకు చేతి బొటన వేలు, చూపుడు వేలి మధ్యలో కనీసం మూడు చుక్కలు లేక స్వస్తిక్ సింబల్‌ను వేయించేవారు. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లోని పురుషులు తమ చేతి మణికట్టు పైభాగాన తమకు ఇష్టమైన వారి పేర్లు, దేవుళ్ల బొమ్మలను వేయించుకునే వారు. కాలానుగుణంగా పచ్చబొట్లు పోయి ఫ్యాషన్‌గా టాటూలు రంగ ప్రవేశం చేశాయి. నాడు పచ్చబొట్లు వేసే వారు ఊరూరు తిరిగి జీవనం సాగించేవారు. నేడు టాటూలు వేసే వారి దగ్గరకు మనమే వెళ్లాల్సి వస్తోంది. నాడు సూదులతో పచ్చబొట్లు పొడిస్తే ... నేడు అదే సూదిని యంత్రంలో అమర్చి టాటూ వేస్తున్నారు. స్క్వైర్ ఇంచ్‌కు రూ.600 గోవా, బెంగళూరు, మంగళూరు, చెన్నై, ముంబాయి, హైదరాబాద్ వంటి మహా నగరాలకే పరిమితమైన టాటూ నేడు చిన్న చిన్న పట్టణాలకు విస్తరిస్తోంది. కర్నూలు గాంధీనగర్‌లోని సైక్లోన్ డ్యాన్స్ ఇనిస్టిట్యూట్‌లో దీనిని వేస్తున్నారు. టాటూ వేయించుకునేందుకు ఒక స్క్వైర్ ఇంచ్‌కు రూ.600 ఫీజుగా తీసుకుంటున్నారు. 54 రంగులను మిక్స్ చేసి తమకు ఇష్టమైన చిత్రాలను గీయించుకునే అవకాశం ఉంది. శరీరం కింద రెండు లేయర్ల వరకు ఈ టాటూఉంటున్న నేపథ్యంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని నిపుణులు చెబుతున్నారు. పూర్తిగా తెలుసుకోవాలి టాటూ వేయించుకోవాలనే వారు ముందుగా దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. టాటూ వేసే వారి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మంగళూరుకు చెందిన మేం ఏడాదికి రెండు సార్లు కర్నూలుకు వచ్చి టాటూ వేస్తుంటాం. శరీరానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని రంగులను మిక్స్ చేసి యువత కోరుకున్న చిత్రాలను ఎలాంటి బాధ లేకుండా వేయడం మా ప్రత్యేకత. 15 సంవత్సరాలుగా మంగళూరు, బెంగళూరు, గోవా తదితర నగరాల్లో తమ బ్రాంచ్‌లు ఉన్నాయి. కనీసం 30 స్క్వైర్ ఇంచుల బిజినెస్ ఉంటే ఇక్కడకు వస్తుంటాం.- గాడ్విన్ మోజేస్ -
రక్తంతో బొమ్మలేయడమంటే ఇదే!
సిడ్నీ: ప్రేయసి పట్ల అమిత ప్రేమను వ్యక్తీకరించేందుకు ‘నా రక్తంతో వేశాను నీ చిత్రాన్ని’ అనే ప్రేమ పిచ్చోళ్లు మనకు అక్కడక్కడా కనిపించవచ్చు. ఆస్ట్రేలియాకు చెందిన రేవ్ మేయర్స్ అనే 39 ఏళ్ల టాటూ పెయింటర్‌కు అలాంటి ప్రేమ పిచ్చి లేదుగానీ రక్తంతో బొమ్మలేసే పిచ్చి మాత్రం బోలెడంతా ఉంది. ఇప్పటికే వందలకొద్ది బొమ్మలు రక్తంతో వేసి ప్రపంచవ్యాప్తంగా విక్రయించారు. నేరుగా చేతి నరం ద్వారా రక్తాన్ని క్యాన్వాస్‌పైకి చిమ్మేందుకు నరానికి ఎయిర్ బ్రష్‌ను కూడా ఇంజెక్టు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎప్పుడుపడితే అప్పుడు బొమ్మలు వేసేందుకు వీలుగా ఆయన ఫ్రిజ్ నిండా రక్తం నింపిన బాటిళ్లు ఎప్పుడూ ఉంటాయి. శరీరం నుంచి చిక్కని ఎర్రని రక్తం వచ్చేందుకు వీలుగా అందుకు అవసరమైన ఆహారాన్ని తీసుకుంటారు. ఎక్కువ సార్లు పచ్చి రెడ్ మీట్‌నే తింటారు. ఎందుకు రక్తంతో బొమ్మలు వేస్తావని అడిగితే అదో క్రేజీ, రాక్‌స్టార్ స్టైల్ అంటారు. ప్రజలను కాస్త వణికించేందుకు కూడా రక్తంతో బొమ్మలు వేస్తుంటానని చెప్పారు. దీనిపై ప్రతికూల విమర్శలు రాలేదా? అని ప్రశ్నిస్తే పదివేల మందిలో ఒక్కరంటే ఒక్కరే నెగెటివ్‌గా రియాక్ట్ అవుతారని అన్నారు. గత 11 ఏళ్ల నుంచి తాను తన రక్తంతో బొమ్మలు వేస్తున్నానని, ఇప్పుడు అది అలవాటుగా మారిపోయిందని మేయర్స్ తెలిపారు. శరీరం నుంచి రక్తం తీయడానికి నర్సు సేవలను ఉపయోగించుకుంటానని చెప్పారు. చేతి నరం నుంచి రక్తాన్ని నేరుగా క్యాన్వాస్‌పైకి చిందించేందుకు మాత్రం నర్సు సహాయం తప్పనిసరి అవుతుందని, ఆమె అప్పుడు పక్కనే ఉండాల్సిన అవసరం కూడా ఉందని ఆయన చెప్పారు. ఎయిర్ బ్రెష్లోని ఎయిర్ రివర్స్‌లో నరంలోకి వెళితే ప్రాణాపాయం తప్పదని, అందుకని నర్సు సేవలు తప్పనిసరని వివరించారు. ప్రాణాలకు ముప్పు ఉండడంతో ఈ మధ్య ఇలాంటి రిస్క్ తీసుకోవడం లేదని అన్నారు. ఇలా నరం నుంచి రక్తాన్ని చిందించినప్పుడు హ్యాంగోవర్గా ఉంటుందని, తెల్లారి మాత్రం భరించలేని బాధ ఉంటుందని మేయర్స్ తెలిపారు. రక్తంతో వేసే తన చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉందని చెప్పారు. ప్రపంచంలో తన లాగా రక్తంతో పెయింటింగ్‌లు వేసే వారు కొద్ది మంది ఉన్నారని తెలిపారు. -
ఇది నా ఫస్ట్ టాటూ అంటున్న హీరోయిన్
హైదరాబాద్: దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీలలో తనకంటూ ఈ ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్లలో అమలాపాల్ ఒకరు. అయితే, ఆ ముద్దుగుమ్మ ఎంతో ఇష్టపడి ఓ టాటును వేయించుకుంది. తన కాలి పాదం పై భాగంలో బాణం లాంటి గుర్తును, ఓ చిన్న రింగు ఆకారాన్ని పచ్చబొట్టు పొడిపించుకుంటూ ఆ ఫొటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మై ఫస్ట్ టాటూ అంటూ రాసుకొచ్చింది. డ్రీమ్ క్యాచర్, ఫ్రీడమ్, శాంతి, లవర్ లైఫ్ అనే పదాలను యాష్ ట్యాగ్ జత చేస్తూ తన ట్విట్టర్ లో రాసుకొచ్చింది. ఇప్పుడు ఈ పచ్చబొట్టు గురించి తెలిసిన ఆమె అభిమానులు ఆ టాటూ ఎంటో, ఎలా ఉందో అంటూ చూడాలని సోషల్ మీడియాలో వెతకడం మొదలెట్టారు. సినిమా ప్రొఫెషన్ విషయానికొస్తే పెళ్లి తర్వాత అమలాపాల్ లో కనిపిస్తున్న మార్పును సులభంగానే గ్రహించవచ్చు. ఆమె కెరీర్ ను పెళ్లికి ముందు, ఆ తర్వాత అని చెప్పవచ్చు. పెళ్లికి ముందు అందరు హీరోయిన్ల మాదిరిగానే హీరోలతో లవ్, రొమాన్స్ పాత్రల్లో జాలీగా నటించేశారు. వివాహానంతరం సెలెక్టెడ్ చిత్రాలే చేస్తాను అని ప్రకటించిన అమలాపాల్ అదే విధంగా ఇప్పుడు పాత్రల ఎంపిక విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటుంది. #Throwback to my first tattoo #dreamcatcher #Freedom, #peace n #loveforlife. #Tattoo #GotInked #Hipster #Gypsysoul pic.twitter.com/V31v9Fi7Zv — Amala (@Amala_ams) February 21, 2016 -
మాజీ ప్రియురాలి టాటూతో తంటాలు!
లండన్: ఆయన ఒంటిపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50కిపైగా పచ్చబోట్లు ఉన్నాయి. దేహం నిండా ఉన్న ఆ పచ్చబోట్లతో ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. ఓ టాటూను చూసి మాత్రం పాప్ స్టార్ జస్టిన్ బీబర్ తెగ ఇదయిపోతున్నాడు. ఆ టాటూ ఎవరికంట పడకుండా దాచాలనుకుంటున్నాడు. ఇంకుతో కవర్ చేసి.. ఆ పచ్చబొట్టు కనిపించకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇంతకూ ఆ బొమ్మ ఎవరిదంటే సింగర్ సెలెనా గోమెజ్ది. ఈ ఇద్దరు ఒకప్పుడు గాఢమైన ప్రేమికులు. చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఇప్పుడు బ్రేకప్ అయింది. అప్పట్లో ప్రేమగా తన చేతిపై పచ్చపొడుచుకున్న ఆ ముద్దుగుమ్మ బొమ్మను ఇప్పుడు చెరిపేయాలని బీబర్ భావిస్తున్నాడు. మాజీ ప్రియురాలి టాటూను కనిపించకుండా కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు 21 ఏళ్ల బీబర్ చెప్పాడు. ఈ బొమ్మను ఇంకుతో కప్పివేయడానికి ప్రయత్నించానని, అయినా ప్రజలు ఈ పచ్చబొట్టు ఎవరిదో గుర్తుపడుతున్నారని అతను చెప్పాడు. 'వాట్ డూ యూ మీన్' ఆల్బంతో తాజాగా హిట్ కొట్టిన ఈ యువ సంచలనం ఇప్పుడు హేలీ బల్ద్విన్తో డేటింగ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు ప్రణయ సల్లాపాల్లో మునిగి తేలుతున్నట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. మరోవైపు సింగర్ సెలెనా గోమెజ్ మాత్రం ఒంటరిగా గడుపుతూ.. తన స్నేహితురాళ్లతో వాలెంటైన్స్ డే జరుపుకున్నదట. -
త్రిష..క్లాప్ బోర్డ్..కెమెరా
త్రిష.. ఒకప్పటి కుర్రకారు కలలరాణి. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లయినా అభినయంతోపాటు అందంలో కూడా ఏమాత్రం వన్నెతగ్గని మెరుపుతీగ. అందుకే ఇప్పటికీ దక్షిణాది సినిమాల్లో అడపాదడపా హీరోయిన్గా కనబడుతూనే ఉంది. ఎప్పుడూ తనదైన నటనతో అభిమానుల మనసు కొల్లగొట్టే త్రిష.. ఈసారి ఓ టాటూతో అందరి మనసూ దోచేసింది. తన శరీరంపై క్లాప్ బోర్డును,కెమెరాను టాటూ వేయించుకుని ప్రొఫెషన్‌ను తాను ఎంతగా ప్రేమిస్తుందో చెప్పకనే చెప్పింది ఈ అందాలతార. ఆ ఫొటోను ట్విట్టర్లోను,ఇన్‌స్టాగ్రామ్‌లోను పోస్ట్ చేసి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. ఇంకేముంది.. ఫ్యాన్స్ మరోసారి ఫిదా!. గతంలోనూ త్రిషా తన ఎదపై టాటూ వేయించుకుంది. ఇప్పటికి మూడు సార్లు టాటూ వేయించుకున్న ఆమె మొట్టమొదట ‘నెమో’ అనే కార్టూన్ చేపను తన శరీరంపై పొడిపించుకున్న విషయం విదితమే. @trishtrashers went a step ahead by getting a tattoo signifying her profession,way to go 👏🏻👌🏻 #actor #dedication pic.twitter.com/BdkLDYKw44 — Trisha Online✨ (@trishakonline) January 4, 2016 -
లబ్‌డబ్ టాటూ
పచ్చబొట్టు చెరిగిపోదులే అన్న పాతపాట ఈ కాలానికి చెల్లదు. కానీ నేటి పచ్చబొట్లు చాలా హైటెక్ అని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ఎలాగంటారా? ఈ ఫొటో చూడండి. ఇందులో కనిపిస్తున్న పచ్చబొట్టు మీ గుండెకొట్టుకునే వేగంతోపాటు ఇతర ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తూ స్మార్ట్‌ఫోన్‌కు పంపిస్తుంది. కయాటిక్ మూన్ అనే కంపెనీ అభివృద్ధి చేసిన ఈ సరికొత్త టెక్నాలజీలో పచ్చబొట్లను విద్యుత్ ప్రవాహాన్ని అడ్డుకోని (ఎలక్ట్రిక్ కన్డ్యూసివ్) ఇంక్‌తో పొడుస్తారు. ఈ ఇంకుతో సర్క్యూట్ మాదిరి చిత్రాలను గీయడం... అవసరమైన చోట ట్రాన్సిస్టర్లు, డయోడ్లను అమర్చడంతో మన శరీరంపైనే ఓ చిన్నస్థాయి సెన్సర్ల నెట్వర్క్ ఏర్పాటవుతుందన్నమాట. ఫొటోలో పచ్చగా మిణుకు మిణుకుమంటున్న ఎల్ఈడీలు రక్త ప్రవాహంపై ఓ కన్నేసి ఆ వివరాలు అందిస్తే... సెన్సర్లు ఇతర పనులను చక్కబెడతాయి. టెక్టాట్ అని పిలుస్తున్న ఈ సరికొత్త టాటూలు గుండె కొట్టుకునే రేటు, నాడి, శరీర ఉష్ణోగ్రతలను నమోదు చేయగలవు. -
కొత్తటాటూతో యువ పాప్ స్టార్
లాస్ ఎంజిల్స్: హాలీవుడ్ ప్రముఖ యువ పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ ఓ కొత్త టాటూతో ముందుకొచ్చాడు. ఈసారి తాను కొత్తగా విడుదల చేయనున్న ఆల్బం పేరుతో పచ్చబొట్టుపొడిపించుకున్నాడు. 'పర్పోజ్' పేరిట బీబర్ కొత్త ఆల్బం రూపొందించాడు. అయితే, ఇలా, టాటూలు వేయించుకోవడం జస్టిన్ బీబర్‌కు కొత్తేం కాదు. తాను ఆల్బం విడుదల చేసిన ప్రతిసారి దాని పేరిట తన ఒంటిపై టాటూ వేయించుకోవడం అతడికి ఓ సరదా. తాను రూపొందించిన ఆల్బంను ఎంత ప్రేమిస్తానో అనే విషయం ఈ టాటూ ద్వారా చెప్తాడని అంటుంటారు. తొలిసారి విడుదల చేసిన బిలీవ్ అనే ఆల్బం పేరిట టాటూను 2012లో కుడిచేతిపై వేయించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ఆల్బంలకు సంబంధించి హిప్స్ పై వేయించుకొని విమర్శలపాలయ్యాడు. కానీ నెలలు తిరగకుండానే మరో నెలలో నవంబర్ 13న పర్పోజ్ ఆల్బం విడుదల కానుండగా దానిని తన బొడ్డుపై భాగంలో రివర్స్‌లో ఆంగ్ల అక్షరాలను టాటూగా వేయించుకొని చర్చల్లో నిలిచాడు. -
కుమారుడి పేరు టాటూ వేయించుకున్నాడు
లాస్ ఏంజిల్స్ : ఇంగ్లండ్ మాజీ ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెకహామ్ తన కుమారునిపై ప్రేమతో ఓ టాటూ వేయించుకున్నాడు. పెద్ద కుమారుడి కోసం 'బస్టర్' అనే పేరుతో మెడపై టాటూ వేయించుకుని తన ప్రేమను వ్యక్తం చేశాడు. మెడపై వేయించుకున్న టాటూను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. బ్రూక్లిన్ బెకహామ్ డేవిడ్ బెకహామ్ పెద్ద కొడుకు. కానీ వాడు పుట్టినప్పటి నుంచి అతడిని బస్టర్ అని తాను పిలుస్తానని చెప్పుకొచ్చాడు. ఈ విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. రోమియో(12), క్రూజ్(10), హార్పర్(4)లు డేవిడ్ మిగతా సంతానం. డేవిడ్ బెకహామ్ విక్టోరియాను వివాహం చేసుకున్న విషయం విదితమే. గత నెలలో తన చిన్నారి కూతురు హార్పర్ పేరును టాటూ వేయించుకున్న నెల రోజుల్లోనే మరో టాటూ వేయించుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారం గమనిస్తే పిల్లలంటే బెకహామ్కు ఎంత ప్రేమన్నది మనకు తెలుస్తోంది. గతంలో ఆయన ఇంగ్లండ్ జట్టుకు విశేష సేవలు అందించడంతో పాటు అత్యధిక పారితోషికం తీసుకునే ఆటగాళ్లలో టాప్ టెన్ స్థానంలో ఉండేవాడు. -
పచ్చబొట్టు చెరిగిపోవులే...
అరె... పోయిందే..! నేను చెప్పేది వినండి మేడం. నేను బ్రహ్మచారిని. నా వయసు నలభై నాలుగు. నేను అందంగా ఉంటానని చాలామందిలా మీరూ అన్నారు. పచ్చబొట్టు ఎప్పటికీ చెరిగిపోదనే సంగతి తెలిసిందే. ఆవేశంలోనో, అనాలోచితంగానో వేసుకున్న పచ్చబొట్టు కాలం తారుమారైనప్పుడు మాయని మచ్చగా మిగిలి మనుషులకు మనస్తాపం కలిగించే అనుభవాలూ తెలిసినవే. చర్మం లోలోతుల్లోకి ఇంకిపోయిన పచ్చబొట్టు సిరా మరకలను తొలగించాలంటే, ఇప్పటి వరకు శస్త్రచికిత్స, లేజర్ చికిత్సలు మాత్రమే అందుబాటులో ఉన్న మార్గాలు. పచ్చబొట్టు పొడిపించుకునేటప్పటి నొప్పి కంటే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సల ద్వారా దానిని తొలగించుకునేటప్పుడు మరింత నొప్పి అనుభవించాల్సి ఉంటుంది. వీటి వల్ల తలెత్తే దుష్ర్పభావాలూ ఎక్కువే. అయితే, పచ్చబొట్టును తేలికగా తొలగించగల క్రీమ్‌కు బ్రిటిష్ పరిశోధకుడు ఒకరు రూపకల్పన చేశాడు. హాలిఫాక్స్‌లోని డల్హౌసీ వర్సిటీ పాథాలజీ విభాగంలో పీహెచ్డీ చేస్తున్న అలెక్ ఫాల్కెన్హామ్ రూపొందించిన ఈ క్రీమ్ మార్కెట్లో అందుబాటులోకి వస్తే, ఎలాంటి నొప్పి లేకుండానే పచ్చబొట్లను తొలగించుకోవడం తేలికవుతుంది. -
జన్మలో టాటూ వేయించుకోనన్న హీరోయిన్
'ద గర్ల్ విత్ ఎ డ్రాగన్ టాటూ' సినిమాలో నటించిన నూమీ రాపేస్.. అసలు తాను జీవితంలో ఎప్పుడూ టాటూ అన్నదే వేయించుకోనని స్పష్టం చేసింది. ఒకసారి వేయించుకుంటే తాను దానికి అలవాటు పడిపోతానేమోనన్న భయం వల్లే టాటూలకు దూరంగా ఉన్నట్లు రాపేస్ (34) చెప్పింది. ఒక దాంతో మొదలుపెడితే ఇక ఒళ్లంతా ఎక్కడపడితే అక్కడే వేయించేసుకునే ప్రమాదం ఉందని ఆమె చెప్పినట్లు కాంటాక్ట్ మ్యూజిక్ తెలిపింది. ఒకసారి మొదలుపెట్టానంటే మాత్రం తాను పిచ్చి పట్టినట్లు వేయించుకుంటానన్న విషయం తనకు తెలుసని, చివరకు కాలి వేళ్లను కూడా వదిలిపెట్టనని ఆమె చెప్పింది. ఏ విషయాన్నీ తాను సగంలో వదిలేసే అలవాటు లేదని కూడా తెలిపింది. ఒకటి రెండు సార్లు తనకు తానే టాటూ వేసుకోడానికి ప్రయత్నించగా, బాగా రక్తం కారిందని, ఎర్రగా.. నల్లగా మచ్చలు కూడా పడ్డాయని, దాంతో దాదాపు నెల రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా దాక్కున్నానని రాపేస్ వివరించింది. అందుకే.. అసలు టాటూలకు పూర్తి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానంది. -
ఎర్రటి చిగుళ్లపై నల్లటి టాటూ
వెర్రి వెయ్యి రకాలన్నట్లు..... అందాన్ని పొందటం కోసం నేటి తరం ఎంతటికైనా లెక్కచేయటం లేదు. ఉన్న అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసుకోవటానికి చాలామంది బొటాక్స్, ఫేస్ లిప్ట్‌లు, రకరకాల సర్జరీలు చేయించుకోవటం ఈకాలంలో పరిపాటిగా మారిన విషయం తెలిసిందే. అయితే పచ్చబొట్టు పాతమాట. టాటూ అనేది కొత్త బాట. తాజాగా చాలామంది ఆకర్షణీయంగా ఉండటంతో పాటు, సెక్సీ లుక్ కోసం 'టాటూ'లపై పడుతున్నారు. ఈ మధ్య చాలామందికి టాటూల పిచ్చి బాగా ముదిరింది. చాలా మంది తమకు నచ్చిన విధంగా రకరకాల టాటూలు ఒంటి మీద వేయించుకుంటారు . ఈ కాలంలో ఇదో వేలం వెర్రి. అయితే ఈ వెర్రి ఇప్పుడు మరింత ముదిరింది. ఓ ఆఫ్రికన్ మహిళ అందమైన చిరునవ్వు కోసం తన చిగుళ్లపై నల్లటి టాటూలు వేయించుకుంది. పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో మహిళలు తమకు జన్మత వచ్చే సహజమైన ఎరుపురంగు చిగుళ్ల కంటే నల్లటి చిగుళ్లు మరింత ఆకర్షణీయంగా ఉంటాయని భావిస్తున్నారు. దానివల్ల తమ చిరునవ్వు మరింత ఆకర్షణీయంగా ఉంటుందని నమ్ముతుంటారు. దీనివల్ల చిగుళ్లు మరింత ఆరోగ్యవంతంగా ఉంటాయని, చెడు శ్వాసను దూరంగా ఉంచుతుందని భావిస్తుంటారు. దాంతో వారు చిగుళ్లకు రంగేసుకునేందుకు టాటూలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ టాటూల తతంగం ....ఏ సెలూన్లో కాకుండా తమ కుటుంబ సభ్యుల మధ్యే టాటూ ఆర్టిస్ట్‌తో ఇంటి ఆవరణలో చేయించుకోవటం విశేషం. అది కూడా చాలా చవకగా ఒక్క డాలర్ ఖర్చుతో టాటూ వేయించుకోవటం పూర్తవుతుంది. ఈ టాటూ వేయించుకోవటం కోసం అక్కడ మహిళలు ఎంతటి నొప్పిని అయినా భరించటానికి వెనకాడరు. ఏడు లేయర్లుగా ఈ టాటూను వేయాల్సి ఉంటుంది. చిగుళ్లను అందంగా తీర్చిదిద్దుకునేందుకు మరియం అనే మహిళ తన అనుభవాన్ని చెబుతూ 'టాటూ వేయించుకునే సమయంలో నొప్పిని భరించలేకపోయాను. చచ్చిపోతానేమోనని కూడా భయం వేసింది. ఈ టాటూల హింసను మరొకరికి సిఫార్సు చేయను' అని తెలిపింది. అయితే టాటూ వేయించుకున్న తర్వాత మాత్రం అందమైన చిరునవ్వు ముందు బాధ ఓ లెక్కలోనిది కాదని ఆమె చెప్పటం విశేషం. -
నమ్రతా శిరోద్కర్ చేతిపై పచ్చబొట్టు
హైదరాబాద్: పచ్చబొట్టుపై సినిమా తారలు మనసు పారేసుకుంటున్నారు. ఒంటిపై పచ్చబొట్టు పొడిపించుకుంటున్న తారల సంఖ్య రోజురోజకు పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలో ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి, మాజీ నటి నమ్రతా శిరోద్కర్ చేరారు. తన భర్త మహేష్ బాబు పేరును ముంజేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నారు. అంతేకాదు తన కుమారుడు గౌతమ్, కుమార్తె సితార పేర్లను ఆమె పచ్చబొట్టుగా వేయించుకున్నారు. 'ఆగడు' సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి భర్త మహేష్ బాబుతో నమ్రతా శిరోద్కర్ కలిసివచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోల్లో ఆమె చేతిపై పచ్చబొట్టు స్పష్టంగా కనబడింది. -
అతనంటే పిచ్చి ప్రేమ... అందుకే ఆ పచ్చబొట్లు!
త్రిషకు పచ్చబొట్లంటే చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పచ్చబొట్లు వేయించుకుంటుంది. ఇక్కడున్న ఫొటోని క్షుణ్ణంగా గమనిస్తే.. త్రిష ఎద భాగంలో ‘నీమో ఫిష్’ టాటూ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పచ్చబొట్టుని మాత్రం త్రిష చెరిపేయలేదు. ఆ విధంగా గత కొన్నేళ్లుగా ఆ చేప పిల్ల స్థానం పర్మినెంట్ అయిపోయింది. ఇప్పుడు త్రిష దేహంపై తాత్కాలిక పచ్చబొట్లు ప్రత్యక్షం అయ్యాయి. ఈసారి ఏకంగా తమిళ హీరో ‘జయం’ రవి బొమ్మను పచ్చబొట్టుగా వేయించుకుంది. ఈ బ్యూటీ చేతులు, తొడ, పొట్ట భాగాల్లో రవి దర్శనమిస్తున్నారు. అతనిపై ప్రేమ వల్లే త్రిష ఇలా చేసింది. అయితే అది రియల్ ప్రేమ కాదు.. రీల్ ప్రేమ. ఈ ఇద్దరూ జంటగా ‘భూలోగం’ అనే చిత్రం రూపొందుతోంది. ఇందులో రవి అంటే తనకెంత ప్రేమో త్రిష వ్యక్తం చేసే సన్నివేశం ఒకటుంది. ‘చూడు.. నీ మీద ప్రేమతో నా దేహాన్ని ఎలా హింస పెట్టుకున్నానో..’ అంటూ రవికి త్రిష ఆ పచ్చబొట్లు చూపించే సీన్ అది. దర్శకుడు కల్యాణ కృష్ణన్ ఈ పచ్చబొట్లు గురించి చెప్పగానే ముందు కుదరదనేశారట త్రిష. కానీ, సినిమాలో ఆ సన్నివేశానికి గల ప్రాధాన్యతను వివరించి చెప్పడంతో ఆమె ఈ పచ్చబొట్లకు పచ్చజెండా ఊపేశారని సమాచారం. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. -
పచ్చబొట్టు చెరిగిపోదా?
జీవితాంతం చెరిగిపోని విషయాలు, గుర్తులు చాలా ఉంటాయి. అలాంటివాటిలో ‘పచ్చబొట్టు’ ఒకటి. చెరిపేస్తే చెరిగిపోయే పచ్చబొట్టుతో సమస్య లేదు కానీ.. ఎటొచ్చీ చెరిగిపోని వాటితోనే సమస్యంతా. ఏదో ఒక మైకంలో వేయించుకునే ఆ పచ్చబొట్టుని వదిలించుకోవడానికి ఆ తర్వాత నానా తంటాలూ పడాల్సి వస్తుంది. రణబీర్ కపూర్‌తో ప్రేమలో ఉన్నప్పుడు ‘ఆర్కె’ అంటూ దీపికా పదుకొనే మెడ మీద ఓ పచ్చబొట్టు వేయించుకున్నారు. సినిమాల్లో నటించేటప్పుడు అది కనిపించకుండా మేకప్‌తో కవర్ చేస్తున్నారు. ఆ పచ్చబొట్టుని వదిలించుకోవాలంటే లేజర్ చికిత్స చేయించుకోవాల్సిందేనట. ఇప్పుడు నయనతార సమస్య కూడా అదే. ప్రభుదేవాని ప్రేమించినప్పుడు ‘ప్రభు’ అంటూ చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నారు. అతన్నుంచి విడిపోయి దాదాపు నాలుగేళ్లవుతున్నా ఆ పచ్చబొట్టు మాత్రం చేతి మీద అలానే ఉంది. నయన కని పించగానే చాలామంది చూపులు ఆ చేతి మీద పడటం, నయన ఇబ్బందిపడటం జరుగుతోంది. ఈ ఇబ్బంది నుంచి బయటపడాలంటే ఆ పేరుని తొలగించాలని నిర్ణయించుకున్నారట. అయితే, అదంత సులువైన విషయం కాదు. ఇలా చెరిపేస్తే అలా చెరిగిపోదట. శస్త్ర చికిత్స ద్వారానే అది సాధ్యపడుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో లేజర్ చికిత్స ద్వారా ఆ పచ్చబొట్టుని వదిలించుకోవాలనుకుంటున్నారనే వార్త వినిపించింది. కానీ, నయనతార ఇంకా ఆ ప్రయత్నం చేసినట్లు లేదు. ఎందుకంటే, ఆర్య తమ్ముడు హీరోగా రూపొందిన ‘అమర కావ్యం’ ఆడియో వేడుకలో ఇటీవల నయనతార పాల్గొన్నారు. కురచ చేతులున్న పొట్టి గౌనులో ఆ వేడుకలో నయన మెరిపోయారు. అలాగే, ఆమె చేతి మీద ఉన్న పచ్చబొట్టు కూడా అందర్నీ ఆకర్షించింది. మరి.. ఈ పచ్చబొట్టు జీవితాంతం ఉంటుందా? లేక చెరిగిపోతుందా? అనేది కాలమే చెప్పాలి. -
అమెరికాకి సైనికులు కరువవుతున్నారోచ్!
ప్రపంచ పెద్దన్నకి సైనికులు కరువవుతున్నారు. కారణం ఏమిటో తెలుసా? పచ్చబొట్టు. ఫేషన్ కోసం యువకులు పచ్చబొట్టు పొడిపించుకుంటే చివరికి దాని వల్ల సైన్యంలో చేరలేకపోతున్నారు. అమెరికా అంతటా వేలం వెర్రిలా వ్యాపిస్తున్న టాటూల పిచ్చి, పియర్సింగ్ పిచ్చి చివరికి అమెరికా సైన్యంలో సైనికులే లేని పరిస్థితికి తీసుకొస్తోంది. ఒక వేళ టాటూలు ఉన్న వారు వాటిని తొలగించుకోవాలంటే దానికి కనీసం ఏడాది పడుతుంది. అప్పట్లో పరిస్థితులు మారిపోయి, అర్హత కోల్పోతున్నారు. అందుకే అమెరికన్ సైన్యాధికారులు పచ్చబొట్టు వ్యతిరేక ప్రచారోద్యమాన్ని ప్రారంబించారు. ఇప్పటికే అమెరికన్ యువకుల్లో 71 శాతం మంది సైన్యంలో చేరడానికి పనికి రారు. నేర చరిత్ర ఉన్న వాళ్లు కొందరైతే, మాదక ద్రవ్యాలు వాడిన చరిత్ర ఉన్న వాళ్లు మరికొందరు. ఇవన్నీ చాలవన్నట్టు అమెరికన్ యువకుల్లో సగం మంది ఊబకాయులే. వీరు సైన్యానికి పనికిరారు. అమెరికన్ సైన్యంలో చేరాలంటే వయసు 17 నుంచి 24 మధ్యలో ఉండాలి. ఆర్మీ రాత పరీక్షలో పాసవ్వాలి. ఇన్సులిన్ తీసుకునేంత సీరియస్ డయాబెటిస్ ఉండకూడదు. పచ్చబొట్లు పొడిపించుకోకూడదు. చెవులకు పియర్సింగ్ చేయించుకోకూడదు. చెవి రింగులు ధరించకూడదు. ఇవి కాక మిగతా శారీరిక అర్హతలు, విద్యార్హతలు కూడా ఉండనే ఉన్నాయి. అమెరికా ఇప్పుడు పలు దేశాల్లో సైనిక చర్యలు జరుపుతుంది. దానికి ప్రపంచ వ్యాప్తంగా సైనిక స్థావరాలున్నాయి. నానాటికీ సైనికావసరాలు పెరుగుతున్నాయి. కానీ దానికి తగినంత సిబ్బంది మాత్రం లేకపోవడం అమెరికాను బాధిస్తోంది. -
టాటూ తెచ్చిన తంటా
ఒక్కోసారి మనకు ఇష్టం లేనివి, కష్టమైనవి చెయ్యక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. నటి ఇలియానా ప్రస్తుతం ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు. టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలుగొందిన ఈ గోవా సుందరి కోలీవుడ్‌లో విజయ్ సరసన నన్బన్ చిత్రంలో నటించి అలరించారు. అయితే ప్రస్తుతం దక్షిణాది చిత్రాలకు దూరంగా బాలీవుడ్ చిత్రాలపైనే దృష్టిసారిస్తున్న ఈ బ్యూటీ అక్కడి సంస్కృతికి అలవాటు పడటానికి అవస్థలు పడుతున్నారు. పలువురు బాలీవుడ్ స్టార్స్ నుంచి అవమానం ఎదుర్కొన్నారు. ఆమెను అంతగా అప్సెట్కు గురి చేసిన విషయం ఏమిటంటే బాలీవుడ్ తారల్లో టాటూల సంస్కృతి అధికం అవుతోంది. అక్కడ టాటూలు వేయించుకోని హీరో హీరోయిన్లు లేరనే చెప్పవచ్చు. అలాంటిది బాలీవుడ్లో వెలిగిపోవాలని తహతహలాడుతున్న ఇలియానాకు టాటూల మోహం లేదట. అయితే ఏ కార్యక్రమంలో కలిసినా సహ నటీనటులు టాటూ పొడిపించుకోలేదా అంటూ ఎగతాళి చేస్తున్నారట. వీరిపోరు పడలేక ఇలియానా తన పేరుతో కుడి చెయ్యిపై టాటూ పొడిపించుకున్నారట. అయినా సహ నటీనటులు ఒక్క టాటూనేనా అంటూ మళ్లీ పరిహాసం చేస్తుండడంతో అమ్మడు చాలా అప్సెట్ అయ్యారట. ప్రస్తుతం మంచి డిజైన్‌తో కూడిన టాటూ కోసం ఇలియానా అన్వేషిస్తున్నారట. -
నాన్న కూతుర్ని!
చేసే పనిలో ఆనందం వెతుక్కుంటే అలుపూ సొలుపూ తెలియదు. కానీ, అదే పనిగా పని చేసినా జీవితం బోర్ కొట్టేస్తుంది. అందుకే, అప్పుడప్పుడూ రిలాక్స్ అవ్వాలి. ఇటీ వల ప్రియమణి అలానే రిలాక్స్ అయ్యింది. అయితే, ఇక్కడ కాదు. ఏకంగా బ్యాంకాక్‌లో. అక్కడి టైగర్స్ టెంపుల్ వెళ్లి, ఏకంగా పులిని వళ్లో పడుకోబెట్టుకుని ఫొటో కూడా దిగారామె. అలాగే జలపాతాల దగ్గరికెళ్లి ఎంజాయ్ చేశారు. ఇలా బాగా ఎంజాయ్ చేసి, స్వదేశం తిరిగొచ్చారామె. ఈ విషయాలన్నీ ఒక ఎత్తయితే... ప్రియమణి వేయించుకున్న టాటూ మరో ఎత్తు. మామూలుగా టాటూ అంటే, ఏదో ఒక సింబల్నో, ఇష్టమైన పేరుకి సంబంధించిన అక్షరాలనో సెలక్ట్ చేసుకుంటారు. కానీ, ప్రియమణి మాత్రం తన తండ్రి మీద అభిమానం చాటుకునే విధంగా ‘డాడీస్ గాళ్’ అని టాటూ వేయించుకున్నారు. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా గతంలో ‘డాడీస్ లిటిల్ గాళ్’ అనే టాటూతో తండ్రి మీద అభిమానం చాటుకున్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకునే నేను కూడా ఇలాంటి టాటూని ఎంపిక చేసుకున్నా అని ప్రియమణి పేర్కొన్నారు. -
టాటూ తొలగించుకోబోయి ప్రాణం కోల్పోయాడు
ఓ వ్యక్తి ముచ్చటపడి టాటూ వేయించుకున్నాడు. ఉద్యోగానికి అది ప్రతిబంధకంగా మారడంతో దాన్ని తొలగించుకోవాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సరదా కోసం చేసిన పని.. అతని జీవితాన్ని విషాదాంతం చేసింది. మలేసియాలోని సుంగాయ్ పెటానీలో స్థిరపడ్డ దినేశ్ నాయర్ ((25) అనే భారత సంతతి వ్యక్తి పోలీస్ కావాలనుకున్నాడు. ఇంటర్వ్యూ కూడా వచ్చింది. అయితే అతనికో సమస్య వచ్చిపడింది. సరదాగా వేయించుకున్న టాటూ అతని ఉద్యోగవకాశానికి ప్రతికూలంగా మారింది. మలేసియా నిబంధనల ప్రకారం పోలీస్ ఉద్యోగాలు పొందాలంటే ఇలాంటివి నిషేధం. దీంతో దినేశ్ టాటూ తొలగించుకునేందుకు ఓ ప్రైవేట్ క్లినిక్‌ను సంప్రదించాడు. చికిత్స వికటించడంతో అతని పరిస్థితి విషమంగా మారింది. కోమాలోకి వెళ్లిన దినేశ్ గురువారం మరణించాడు. అతని కుటుంబ సభ్యులు క్లినిక్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. టాటూలను పలు పద్ధతుల్లో తొలగిస్తుంటారు. ఒక్కోసారి వికటించి ప్రాణాంతకంగా మారుతుంది.