![Vietnam Guy Tattoo His Identity Card On Forearm - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/24/tattoo.jpg.webp?itok=RsMKOn9P)
హడావుడిలో బయటకు వెళ్లేటప్పుడు ఏదో ఒక వస్తువు మర్చిపోతుంటాం.. అది సహజం కూడా. కానీ కొందరు అదే పనిగా రోజూ ఏదో ఒకటి మర్చిపోతుంటారు. అయితే వియత్నాంలో ఉన్న ఓ వ్యక్తి బయటకు వెళ్లేటప్పుడు ఎప్పుడూ తన గుర్తింపు కార్డు మర్చిపోతున్నాడట. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడట. ఆఖరికి తన ఫ్రెండ్స్‌తో బార్‌కు గట్రా వెళ్లినప్పుడు మైనర్‌వి అంటూ ఆల్కహాల్ కూడా ఇవ్వట్లేదట. దీంతో విసుగు చెందిన మనోడు ఓ చక్కని పరిష్కారానికి ఆలోచించాడు.
తన ఐడీ కార్డును తన చేతిపై పచ్చ బొట్టు మాదిరిగా వేయించుకోవాలని నిర్ణయానికొచ్చాడు. అనుకున్నదే తడవుగా వెంటనే పచ్చబొట్లు వేసే దుకాణానికి వెళ్లి చేతిపై ఐడీకార్డు మొత్తం పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఆ ఆర్టిస్ట్‌కు ఐడీ కార్డు వేసేందుకు గంట సమయం పట్టిందట. ఆ యువకుడి పచ్చబొట్టును చూసిన స్నేహితులు ఫొటో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. అంతే ఈ ఫొటో వియత్నాం మొత్తం వైరల్ అయింది. ఎంతయినా మనోడి తెలివేతెలివిగురూ..!
Comments
Please login to add a commentAdd a comment