Vietnam
-
12న భారత్, వియత్నాం ఫుట్‌బాల్ మ్యాచ్
న్యూఢిల్లీ: భారత సీనియర్ పురుషుల ఫుట్‌బాల్ జట్టు ఈ నెల 12న వియత్నాంతో అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. నిజానికి వియత్నాంలో ఈనెల 7 నుంచి 15 వరకు భారత్ ముక్కోణపు టోర్నీలో పాల్గొనాల్సి ఉండగా... మూడో దేశం లెబనాన్ టోర్నీ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం లెబనాన్‌లోని హెజ్»ొల్లా ఉగ్రవాద సంస్థ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర స్థాయిలో వైమానిక దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో లెబనాన్‌లో గగనతల ప్రయాణం క్లిష్టమైంది. దీంతో లెబనాన్ తప్పుకోవాల్సి వచ్చింది. ముక్కోణపు టోర్నీ సాధ్యపడకపోవడంతో ఇరు దేశాల ఫుట్‌బాల్ సమాఖ్యలు ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహణకు మొగ్గుచూపాయి. ‘లెబనాన్ వైదొలగడంతో ముక్కోణపు టోర్నీ రద్దయ్యింది. దీంతో ఆతిథ్య వియత్నాం జట్టుతో భారత సీనియర్ జట్టు ఏకైక ఫ్రెండ్లీ మ్యాచ్‌ను ఆడుతుంది’ అని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది. వియత్నాం రాజధాని హనోయ్‌కి 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న తియెన్ తువోంగ్ స్టేడియంలో ఈ నెల 12న ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. అక్కడికి బయలుదేరే ముందు భారత ఫుట్‌బాల్ ఆటగాళ్లంతా 5న కోల్‌కతాలో కలుసుకుంటారు. హెడ్‌కోచ్ మనొలో మార్కెజ్ నేతృత్వంలో 6న ట్రెయినింగ్ సెషన్లో పాల్గొంటారు. ఆ మరుసటి రోజే కోల్‌కతా నుంచి వియత్నాంకు భారత జట్టు పయనమవుతుంది. ఇదివరకే ఈ మ్యాచ్ కోసం 26 మంది సభ్యులతో కూడిన ప్రాబబుల్స్‌ను ప్రకటించారు. వియత్నాం బయలుదేరేముందు తుది 23 సభ్యుల జట్టును ఖరారు చేస్తారు. -
బర్డ్ ఫ్లూ కలకలం: వియత్నాంలో 47 పులుల మృతి
బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా దక్షిణ వియత్నాంలోని ఓ జూలో 47 పులులు, మూడు సింహాలు, ఓ పాంథర్ మరణించినట్లు స్థానిక మీడియా బుధవారం ఓ కథనంలో వెల్లడించింది. వియత్నాం న్యూస్ ఏజెన్సీ (VNA) మీడియా కథనం ప్రకారం.. లాంగ్ యాన్ ప్రావిన్స్‌లోని ప్రైవేట్ మై క్విన్ సఫారీ పార్క్ , హో చి మిన్ సిటీకి సమీపంలోని డాంగ్ నైలోని వూన్ జోయ్ జూలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఈ మరణాలు సంభవించాయని పేర్కొంది.నేషనల్ సెంటర్ ఫర్ యానిమల్ హెల్త్ డయాగ్నోసిస్ పరీక్ష ఫలితాల ప్రకారం ఈ జంతువులకు H5N1 రకం A బర్డ్ ఫ్లూ వైరస్ సోకటంతో మృతి చెందినట్లు తెలిపింది. అయితే పులుల మరణాలుపై జూ అధికారుల స్పందించకపోటం గమనార్హం. అదేవిధంగా జంతువులతో సన్నిహితంగా ఉన్న జూ సిబ్బంది ఎవరిలో కూడా శ్వాసకోశ లక్షణాలను బయటపడలేదని తెలుస్తోంది.⚠️Bird flu kills 47 tigers, 3 lions and a panther in Vietnam zoos, state media reports.47 tigers, 3 lions and a panther have died in zoos in south Vietnam due to the H5N1 bird flu virus, state media said Wednesday.@ejustin46@mrmickme2@DavidJoffe64https://t.co/P99Dn71HMF— COVID101 (@COVID19info101) October 2, 2024 ఎడ్యుకేషన్ ఫర్ నేచర్ వియత్నాం (ENV) ప్రకారం.. 2023 చివరి నాటికి వియత్నాంలో మొత్తం 385 పులులు జూలో ఉన్నాయి. ఇందులో 310 ప్రైవేట్ అధీనంలోని జూలలో ఉండగా.. మిగిలినవి ప్రభుత్వ అధీనంలోని జూల సంరక్షణలో ఉన్నాయి. 2022 నుంచి బర్డ్ ఫ్లూ వైరస్ H5N1 వేగంగా వ్యాప్తి చెందటం వల్ల పలు క్షీరదాల మరణాలు పెగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.ఈ H5N1 వైరస్ ఇన్ఫెక్షన్లు మానవుల్లో కూడా తేలికపాటి నుంచి తీవ్రమైన స్థాయి వరకు ఉండవచ్చని, కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా మారవచ్చని ప్రపంచ ఆగర్యో సంస్థ పేర్కొంది. మరోవైపు.. గతంలో 2004లో సైతం డజన్ల కొద్దీ పులులు బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయాయని వియాత్నం స్థానిక మీడియా తెలిపింది.చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై భారత్ ఆందోళన చెందుతోంది: జై శంకర్ -
నదిపై కుప్పకూలిన బ్రిడ్జి.. ఎనిమిది మంది గల్లంతు
హనోయ్: వియత్నాంలో ఎర్ర నదిపై ఉన్న 30 ఏళ్ల నాటి వంతెన కుప్ప కూలింది. ఉత్తర ప్రావిన్సు ఫుథోలో సోమవారం(సెప్టెంబర్9) ఈ ఘటన జరిగింది. బ్రిడ్జి కుప్పకూలిన సమయంలో దానిపై ప్రయాణిస్తున్న 8 మంది నదిలో పడి గల్లంతయ్యారు. ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. ఎర్ర నదిపై ఉన్న మిగిలిన వంతెనల మీద రాకపోకలపై ఆంక్షలు విధించడంతో పాటు కొన్ని చోట్ల పూర్తిగా నిషేధించారు.ట్రాఫిక్ ఆపేసిన వాటిలో రాజధాని హనోయ్‌లోని చోంగ్డోంగ్ బ్రిడ్జి కూడా ఉంది. భారీ తుపాను యాగీ బీభత్సం వల్లే వంతెన కూలినట్లు అధికారులు తెలిపారు. తుపాను ధాటికి మొత్తం 58 మంది మరణించగా 40 మంది గాయపడ్డారు. ఇదీ చదవండి.. నిప్పులు చిమ్మే డ్రోన్ డ్రాగన్ -
ప్రచండ గాలులు.. కొట్టుకుపోయిన మనుషులు, వాహనాలు
బీజింగ్: డ్రాగన్ దేశం చైనాలో యాగి తుపాన్ బీభత్సం సృష్టించింది. తుపాన్ ప్రభావంతో గంటకు 234 కి.మీ వేగాన్ని మించి బలమైన గాలులు వీచాయి. దీంతో, వాహనాలతో సహా మనుషులు కొట్టుకుపోయాయి. పలుచోట్ల రేకుల షెడ్స్ గాల్లోకి ఎగిరిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.మరోవైపు.. యాగి తీవ్ర తుపాను కారణంగా రెండు రాష్ట్రాల్లోని నదులకు వరద ముప్పు పొంచి ఉందని చైనా హెచ్చరించింది. తుపాను నేపథ్యంలో హైనాన్ రాష్ట్రంలో వెంగ్టియాన్ టౌన్షిప్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించవచని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. హైనాన్లోని నాండు, చాంగువా నదులకు వరద ముప్పుందని ప్రజలను అలర్ట్ చేసింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గౌంగ్‌డాంగ్‌లో 5.70 లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాజా తుపానుపై చైనా జాతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలెర్ట్ జారీ చేసింది.El #tifon Yagi llegando a China#SuperTyphoonYagi #Yagi #China pic.twitter.com/UHBR2EzHXG— Tutiempo (@tiempobrasero) September 6, 2024 The window glass was broken, it seemed to have been torn off the hotel building 😨🇻🇳🙏SUPER TYPHOON ALERT: YAGI INTENSIFIESSuper Typhoon #YAGI Heads Towards Northern #Vietnam#SuperTyphoonYagi #NorthernVietnam pic.twitter.com/6S6BGcmfFC— BeeLady 🇨🇭 📍🌼🐝 (@BeeLady__) September 7, 2024SUPER TYPHOON ALERT: YAGI INTENSIFIESSuper Typhoon #YAGI Heads Towards Northern #Vietnam#SuperTyphoonYagi #NorthernVietnam pic.twitter.com/iAsYzeoqL6— BeeLady 🇨🇭 📍🌼🐝 (@BeeLady__) September 6, 2024A hotel had its windows blown out by the wind and a lot of damage to homes.7 September 2024SUPER TYPHOON ALERT: YAGI INTENSIFIESSuper Typhoon #YAGI Heads Towards Northern #Vietnam#SuperTyphoonYagi #NorthernVietnam pic.twitter.com/348fxSa6xF— BeeLady 🇨🇭 📍🌼🐝 (@BeeLady__) September 7, 2024ఇదిలా ఉండగా.. యాగీ తుపాన్ కారణంగా దాదాపు 8 లక్షల ఇళ్లకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇక, తుపాన్ కారణంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా.. 92 మంది గాయపడ్డినట్టు చైనా ప్రభుత్వం చెబుతోంది. మరిన్ని మరణాలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, యాగీ తుపాన్ ప్రభావం ప్రస్తుతం వియత్నం మీద కూడా ఉంది. అక్కడ కూడా ఎడతెరపిలేని వర్షం కురుస్తూ భీకర గాలులు విస్తున్నాయి. Locals scream as truck is overturned # #SuperTyphoonYagi #TyphoonYagi #SouthernChina #915hPapic.twitter.com/ajkvpSyS8z https://t.co/KEocatMPCy— The Vigilante (@NewsByVigilante) September 6, 2024Terrifying winds hits due to Typhoon Yagi in Halong Bay of Quảng Ninh province, Vietnam 🇻🇳 (07.09.2024)TELEGRAM JOIN 👉 https://t.co/9cTkji4D9S pic.twitter.com/MruMSUuGx1— Disaster News (@Top_Disaster) September 7, 2024 -
వినూత్నం.. వియత్నాం కాఫీ
పొద్దున లేవగానే కాఫీ తాగనిదే చాలామందికి తెల్లారదు. కప్పులో అలా వేడి వేడి కాఫీ మన ముందుంటే ఆ పొగలతో వచ్చే ఆ వాసన చూస్తుంటే మనల్ని మనమే మైమరిచి పోతాం. పొట్టలో ఓ కప్పు కాఫీ పడితే ఉంటుంది గురూ.. ఆ లెవలే వేరు. మెదడు కూడా అంత వేగంగా పనిచేస్తుంది. చకచకా పనులు అయిపోతాయంతే.. ఇంక వేరే మాటే ఉండదు. కొందరికేమో ఇన్స్టంట్ కాఫీ అంటే ప్రాణం. మరికొందరు ఫిల్టర్ కాఫీ అంటే పడి చచి్చపోతారు. ఇంకొందరికేమో కోల్డ్ కాఫీ అంటే పిచ్చి. ఇలా జిహ్వకో రుచి అన్నట్టు.. ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన టేస్ట్.భాగ్యనగరం అంటేనే పలు రుచులకు కేరాఫ్ అడ్రస్. ప్రపంచ దేశాల్లో దొరికే అనేక రుచులు మన నగరవాసులకు దొరుకుతాయనడంలో అతిశయోక్తి లేదు. అలాగే ఇటీవల మన నగరంలో ఓ కొత్త రుచి క్రేజ్‌ను సంతరించుకుంటోంది.. దీంతో పాటు నగర ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటోంది.. దాని గురించి తెలుసుకుందాం.. వరల్డ్ ఫేమస్ హైదరాబాద్.. కోల్డ్ కాఫీ నగరంలో ఇటీవల ప్రాచుర్యం పొందుతోంది. అందులోనూ వియత్నాం కాఫీ నగరంలో మరింత ఫేమస్ అయిపోతోంది. నగర యువత ఈ కాఫీని లొట్టలేసుకుంటూ తాగేస్తోంది. ఒకప్పుడు ఇరానీ చాయ్.. ఇప్పుడు కోల్డ్ కాఫీ.. అప్పటికీ.. ఇప్పటికీ ప్రియమైన పానీయం టీ, కాఫీలే అయినా.. వైవిధ్యమైన రుచి ఆస్వాదించాలి అనుకునే వారికి మాత్రం ఇది పర్ఫెక్ట్ టేస్టీ చాయిస్ అని చెప్పొచ్చు. విభిన్న రుచులు.. వియత్నాం కాఫీలో కూడా అనేక రకాలు ఉన్నాయి. ఎగ్ కాఫీ, యోగర్ట్ కాఫీ, కోకోనట్ వియత్నమీస్ కాఫీ, వైట్ కాఫీ, కాఫెసురా, ఐస్డ్ బ్లాక్ కాఫీ, వియెట్ కాఫీ, లైబేరికా కాఫీ, కులీ కాఫీ, చెర్రీ కాఫీ ఇలా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. కోల్డ్ కాఫీల్లో కూడా కుకుంబర్ టానిక్, యాపిల్ కాఫీ యేల్, కివీ టానిక్ కాఫీ, స్పానిష్ లాటే ఇలా విభిన్నమైన రుచులు అందుబాటులోకి తెచ్చారు. ఫ్రెండ్స్‌తో కలిసి చిల్ అవ్వాలనుకున్నా.. గర్ల్ ఫ్రెండ్‌తో జాలీగా గడపాలనుకున్నా ఎంచక్కా మాంచి కాఫీ షాప్‌కి వెళ్లి రెండు వియత్నాం కాఫీలు ఆర్డర్ చేసి లాగించేయండి. అథ్లెట్స్, జిమ్ చేసే వారికి తక్షణ శక్తిని అందిస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి చిటికెలో ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఏదైనా సరే రోజుకు ఓ మోతాదులో తీసుకుంటేనే మంచిదని, అతి ఏదైనా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వియత్నాం కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. శక్తిని పెంచడమే కాకుండా రన్నింగ్, జాగింగ్, వ్యాయామాలు మరింత ఎక్కువగా చేసేందుకు దోహదపడుతుంది. గుండెకు మేలు చేస్తుంది. యాంగ్జయిటీని తగ్గిస్తుంది. మానసిక ప్రశాంతతతో పాటు మెదడుకు మంచి చేస్తుంది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాఫీ తాగితే సెరటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ జ్ఞాపక శక్తి పెంచుతుంది. దీంతోపాటు ఎక్కువ విషయాలు నేర్చుకునేలా చేయడం, మానసిక సంతోషాన్ని ఇవ్వడంతో పాటు డిప్రెషన్ తగ్గించడం, శారీరక ఉష్ణోగ్రతను నియంత్రించడంతో, నిద్ర సరిగ్గా పట్టడంలో తోడ్పడుతుంది.నా సోల్‌మేట్.. కాఫీ అంటేనే అద్భుతం. ఇక కోల్డ్ కాఫీ అంటే మహా అద్భుతం. ఒంటరిగా ఉన్నప్పుడు కాఫీ తాగితే నన్ను నేనే మైమరిచిపోతాను. కాఫీ తాగిన తర్వాత అరగంట వరకూ ఏమీ తినను. ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఆస్వాదించాలనేది నా భావన. చల్లచల్లటి కాఫీ తాగుతుంటే మస్తు మజా వస్తుంది. మంచి లొకేషన్లో కాఫీ తాగుతుంటే ఆ ఫీలింగే వేరు. స్నేహితులు తోడైతే అనుభూతి వేరే లెవల్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కాఫీ నా సోల్‌మేట్. బేగంపేటలోని పంచతంత్ర కాఫీ షాప్‌కి వారానికోసారి వెళ్లి కాసేపు కూర్చుని కాఫీ తాగుతుంటే భలే సరదాగా ఉంటుంది. :::మంజీర ఆరెట్టి, ప్రకాశ్‌నగర్, బేగంపేట స్వచ్ఛమైన కాఫీ అందించాలని.. కాఫీ ప్రియులకు అచ్చమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వచ్ఛమైన కాఫీ అందించాలనే ఆలోచనతో పంచతంత్ర కేఫ్ ఏర్పాటు చేశాం. కాఫీతో పాటు యాంబియెన్స్ కూడా బాగా ఉండేలా ప్రయత్నించాం. కస్టమర్లకు అద్భుతమైన అనుభూతి ఇవ్వడమే మా ప్రాధాన్యం. ::: విక్రమ్, పంచతంత్ర కేఫ్ -
వియత్నాం స్టీల్‌పై యాంటీ డంపింగ్!
న్యూఢిల్లీ: హాట్ రోల్డ్ స్టీల్ ఉత్పత్తులను వియత్నాం నుండి దిగుమతి చేసుకోవడంపై యాంటీ డంపింగ్ విచారణను భారత్ ప్రారంభించింది. హాట్ రోల్డ్ ఫ్లాట్ అల్లాయ్ లేదా నాన్–అల్లాయ్ స్టీల్ డంపింగ్ ఆరోపణలపై వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన దర్యాప్తు విభాగం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (డీజీటీఆర్) ఈ విచారణ జరుపుతోంది. డీజీటీఆర్ నోటిఫికేషన్ ప్రకారం వియత్నాం నుండి దిగుమతులపై యాంటీ డంపింగ్ విచారణను ప్రారంభించాలని కోరుతూ దేశీయ ఉత్పత్తిదారులైన జేఎస్‌డబ్లు్య స్టీల్ లిమిటెడ్, ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ తరపున ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ఒక దరఖాస్తును దాఖలు చేసింది. దేశీయంగా తయారీ కంటే తక్కువ ధరలకు ఉత్పత్తిని దిగుమతి చేసుకుంటున్నారని.. ఇది దేశీయ పరిశ్రమకు వస్తుపరమైన హాని కలిగిస్తోందని దరఖాస్తుదారులు ఆరోపించారు. అలాగే దేశీయ పరిశ్రమకు మరింత నష్టం వాటిల్లుతుందని, యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలని అభ్యర్థించారు. దేశీయ కంపెనీలకు ఈ డంపింగ్ కారణంగా నష్టం కలిగిందని నిర్ధారణ అయితే దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించాలని డీజీటీఆర్ సిఫార్సు చేస్తుంది. సుంకాలు విధించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుంది. చౌక దిగుమతులు పెరగడం వల్ల దేశీయ పరిశ్రమలు దెబ్బతిన్నాయో లేదో తెలుసుకోవడానికి వివిధ దేశాలు యాంటీ డంపింగ్ విచారణ నిర్వహిస్తాయి. -
వియత్నాంతో పుతిన్ చెట్టపట్టాల్
హనోయి: యుద్ధోన్మాదంతో ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగాక అంతర్జాతీయ మద్దతు కరువైన తరుణంలో రష్యా ఆసియా దేశాలతో మైత్రికి మొగ్గుచూపుతోంది. అందులోభాగంగానే ఉత్తర కొరియా పర్యటన ముగించుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం అక్కడి నుంచి నేరుగా వియత్నాం చేరుకున్నారు. అధికారిక పర్యటనలో భాగంగా గురువారం వియత్నాం అధ్యక్షుడు టో లామ్‌తో విస్తృతస్థాయి చర్చలు జరిపారు. విద్య, శాస్త్ర సాంకేతికత, చమురు, సహజవాయువుల అన్వేషణ, ఆరోగ్య రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అణు శాస్త్ర సాంకేతికతపై ఉమ్మడి పరిశోధనకూ అంగీకరించారు. -
Tanya Sharma: వియత్నాంలో హిందీ బుల్లితెర నటి సమ్మర్ వెకేషన్ (ఫోటోలు)
-
రియల్ ఎస్టేట్ క్వీన్‌కు మరణశిక్ష.. ఈమె చేసిన నేరం ఏంటంటే..
వియత్నాం రియల్ ఎస్టేట్ క్వీన్‌కు ఆ దేశ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసం కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త ట్రూంగ్ మై లాన్‌కు దక్షిణ వియత్నాంలోని హో చి మిన్ న్యాయస్థానం గురువారం మరణశిక్ష విధించిందని ఆ దేశ అధికార మీడియా థాన్ నీన్ తెలిపింది. ఇవీ అభియోగాలు వాన్ థిన్ ఫాట్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ అధినేత్రి అయిన 67 ఏళ్ల ట్రూంగ్ మై లాన్ 12.5 బిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. ఇది ఆ దేశ 2022 జీడీపీలో దాదాపు 3 శాతం. 2012 నుండి 2022 మధ్యకాలంలో ఆమె సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్‌ను అక్రమంగా నియంత్రించి డొల్ల కంపెనీలు, ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వడం ద్వారా ఈ నిధులను కొల్లగొట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. వియత్నాంలో అవినీతి నిరోధక డ్రైవ్‌లో భాగంగా 2022 అక్టోబరులో లాన్‌ను అరెస్టు చేశారు. ఇది ఆ దేశంలో అత్యంత హై ప్రొఫైల్ అరెస్ట్‌లలో ఒకటిగా నిలిచింది. బ్లేజింగ్ ఫర్నేస్ పేరుతో ఎగిసిన ఈ అవినీతి వ్యతిరేక ప్రచార ఉద్యమం వియత్నాం రాజకీయాలలో సంచలనం సృష్టించింది. దీంతో అప్పటి వియత్నాం ప్రెసిడింట్ వో వాన్ థుంగ్ రాజీనామా చేశారు. లాన్ అరెస్ట్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. విలాసవంతమైన నివాస భవనాలు, కార్యాలయాలు, హోటళ్లు, షాపింగ్ సెంటర్లు వంటి ప్రాజెక్ట్‌లతో వీటీపీ కంపెనీ వియత్నాంలోని అత్యంత ధనిక రియల్ ఎస్టేట్ సంస్థలలో ఒకటి. వియత్నాంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతింది. 2023లో 1,300 ప్రాపర్టీ సంస్థలు మార్కెట్ నుండి ఉపసంహరించుకున్నాయని అంచనా. డెవలపర్లు కొనుగోలుదారులను ఆకర్షించడానికి డిస్కౌంట్లు, బంగారాన్ని బహుమతులుగా అందిస్తున్నారు. స్థానిక మీడియా ప్రకారం.. హో చి మిన్ నగరంలో షాప్‌హౌస్‌ల అద్దె మూడవ వంతు తగ్గినప్పటికీ, సిటీ సెంటర్లో చాలా వరకూ ఖాళీగానే ఉన్నాయి. -
ఈయనకు ఆకలి ఉంది.. నిద్రే కరువైంది!
ఒక్కరోజు నిద్రకు దూరమైతే చాలు.. మర్నాడు మనం ముఖం వేలాడేసుకుని, నిస్సత్తువలో కూరుకుపోతాం. అదే ఏవో కారణాలతో రెండు రోజుల పాటు నిద్రకు దూరమయ్యామంటే ఇక ఎక్కడపడితే అక్కడ పడుకుండిపోతాం. మరి 60 ఏళ్లకుపైబడి నిద్రకు దూరమైన వ్యక్తి గురించి తెలిస్తే ఏమంటారు? థాయ్ అంజోక్.. ప్రపంచంలో 62 ఏళ్లకు పైగా నిద్రపోని వ్యక్తి. వియత్నాంకు చెందిన ఈ మహాశయుడు తనకు 62 ఏళ్లుగా నిద్ర పట్టడం లేదని మీడియాకు తెలియజేశాడు. 1962 నుంచి తన జీవితం నుంచి నిద్ర అనేది శాశ్వతంగా మాయమైందని థాయ్ అంజోక్ తెలిపాడు. ఆయన నిద్రపోవడాన్ని అయన భార్యాపిల్లలు ఎన్నడూ చూడలేదట. ప్రముఖ యూట్యూబర్ డ్రూ బిన్స్కీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో థాయ్ అంజోక్ తన కథను వివరంగా చెప్పాడు. దీనికి ముందు కూడా థాయ్ అంజోక్ నిద్రలేమి కథలు పలు మీడియా నివేదికలలో కనిపించాయి. 80 ఏళ్లుదాటిన థాయ్ అంజోక్‌కు 1962లో ఒక రోజు రాత్రి జ్వరం వచ్చిందట. అప్పటి నుంచి ఒక్కరోజు కూడా నిద్రపోలేనని అంజోక్ చెప్పాడు. అయితే అంజోక్‌కు హాయిగా నిద్రపోవాలనే కోరిక తీరనిదిగా మిగిలిపోయిందట. వైద్య నిపుణులు ఈ రకమైన వ్యాధిని నిద్రలేమి అని చెబుతారు. దీని కారణంగా శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతుంది. అయితే నిద్రలేమి అనేది థాయ్ అంజోక్ ఆరోగ్యంపై ఏమాత్రం ప్రభావం చూపకపోవడం వైద్యశాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. థాయ్ అంజోక్ ఈ వయసులోనూ పొలంలో పనిచేస్తుంటాడు. థాయ్ అంజోక్‌కు గ్రీన్ టీ, రైస్ వైన్ అంటే ఇష్టం. తాను రోజూ కళ్ళు మూసుకుని నిద్రపోయేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదని థాయ్ అంజోక్ తెలిపాడు. వేలాది రోజుల పాటు నిద్రకు దూరమైన థాయ్ అంజోక్ ఒక దేశీ మద్యం తయారీ కంపెనీలో పనిచేస్తున్నాడు. రాత్రి మూడు గంటల వరకు డ్యూటీలో ఉంటాడు. విదేశాల నుంచి పలువురు వైద్య శాస్త్రవేత్తలు తనను పరీక్షించేందుకు వస్తుంటారని ఆయన తెలిపాడు. -
Phu Quoc: వెహికిల్స్‌కు నో ఎంట్రీ.. ఎందుకంటే ఇది... కిస్సింగ్ బ్రిడ్జి
వియత్నాంలో అది అనగనగా ఓ వంతెన. కానీ దాన్ని కట్టింది అన్ని వంతెనల మాదిరిగా అటూ ఇటూ దాటడానికి కాదు. ముద్దులు పెట్టుకోవడానికి! అవును. వినడానికే విచిత్రంగా ఉంది కదూ! దక్షిణ వియత్నాంలోని ఫూక్వోక్ ద్వీపం అందమైన బీచ్‌లకు ప్రసిద్ధి. అక్కడి సన్‌సెట్ సిటీలో ఇటీవల నిర్మించిన 800 మీటర్ల పై చిలుకు పొడవైన బ్రిడ్జి అందరినీ ఎంతగానో అలరిస్తోంది. ఇది ముద్దుల బ్రిడ్జి కావడమే ఇందుకు కారణం. దీని డిజైన్‌ను ఇటలీకి చెందిన ఆర్కిటెక్ట్ మార్కో కాసామోంటీ రూపొందించాడు. లగ్జరీ టూరిజం డెవలపర్ సంస్థ సన్ గ్రూప్ నిర్మించింది. ఆడమ్ సృష్టికి సంబంధించి ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు మైకేలాంజిలో సిస్టిన్ చాపెల్‌లో సృజించిన ఫ్రెస్కో పెయింటింగ్ స్ఫూర్తితో దీని డిజైన్‌కు రూపకల్పన చేశారు. రెండు సగాలుగా ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఆ పెయింటింగ్‌లోని రెండు చూపుడు వేళ్ల మాదిరిగానే బ్రిడ్జి తాలూకు రెండు సగాలు కూడా పరస్పరం తాకవు. వాటి మధ్య 30 సెంటీమీటర్ల దూరముంటుంది. దూరంనుంచి చూస్తే ఆ రెండు కొనలూ ఒకదాన్నొకటి చుంబించుకుంటున్నట్టుగానే ఉండటం మరో విశేషం! ముద్దులాడాలనుకునే జంటలో ఒకరు ఆ సగం నుంచి, మరొకరు ఈ సగం మీద నుంచుని వీలైనంతగా ముందుకు వంగాలన్నమాట! ఆ మీదట పెదాలకు పని చెబుతూ తమ ప్రేమను వ్యక్తపరుచుకోవచ్చు. పెళ్లికి ప్రపోజ్ చేసుకోవచ్చు. ఈ బ్రిడ్జి పేరు చౌ హోన్. దాని అర్థం కూడా ‘పెళ్లికి ప్రపోజ్ చేసుకోవడం’ కావడం మరో విశేషం. వారం క్రితం ప్రారంభించిన ఈ బ్రిడ్జి చూస్తుండగానే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. దాన్ని చూడటానికి, చెరోవైపు నుంచి రొమాంటిక్‌గా ముద్దులాడటానికి జంటలు భారీగా వస్తున్నాయట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆర్బీకే వ్యవస్థ అద్భుతం
సాక్షి, అమరావతి/ఆనందపురం(విశాఖ): ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన సేవలందించేందుకు గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన ‘రైతు భరోసా కేంద్రాలు’ వంటి వ్యవస్థ మాకు తెలిసి ప్రపంచంలో మరెక్కడా లేదు. ఇదో విప్లవాత్మక ఆలోచన.. ఈ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని రైతులు చెబుతున్నారు’’ అని వియాత్నం ప్రావిన్షియల్ నేషనల్ అసెంబ్లీ ప్రతినిధి బృందం ప్రశంసించింది. ఇండో–వియత్నాం పార్టనర్‌షిప్‌లో భాగంగా వియత్నాంకు చెందిన ప్రొవిన్షియల్ పార్టీ కమిటీస్ చైర్మన్ వోడిన్ టిన్, జియాన్‌జియా సిటీ పీపుల్స్ కౌన్సిల్ చైర్మన్ వో ఫామ్ ఎక్స్వాన్ లామ్, ప్రొవిన్షియల్ పీపుల్స్ కమిటీ వైస్ చైర్మన్ లిట్రాంగ్యెన్ తదితరులతో కూడిన 14మంది సభ్యుల అత్యున్నత స్థాయి బృందం మూడురోజుల పర్యటనకు భారతదేశానికి విచ్చేసింది. దేశంలోని వివిధ రంగాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అమలు తీరుపై అధ్యయనం చేసేందుకు విచ్చేసిన ఈ బృందం కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ఏపీలో వివిధ రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు, విప్లవాత్మక మార్పుల పరిశీలన కోసం రాష్ట్రానికి వచ్చింది. ఇందులో భాగంగా శుక్రవారం వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానం, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయనం చేసింది. తొలుత వ్యవసాయ, ఉద్యాన శాఖ కమిషనర్లు చేవూరు హరికిరణ్, శ్రీధర్ తమ శాఖల్లో గడచిన నాలుగున్నరేళ్లుగా సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, వాటి ఫలితాలపై వియాత్నం బృందానికి వివరించారు. అనంతరం క్షేత్ర స్థాయి సందర్శనలో భాగంగా విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం వేములవలస గ్రామంలోని ఆర్బీకేను సందర్శించారు. ఆర్బీకే సేవలతో కూడిన ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. కాగా, ఇప్పటికే ఇథియోఫియా దేశం ఏపీలో పర్యటించి ఆర్బీకే సాంకేతికతతో పాటు ఇతర కార్యక్రమాలను తమ దేశంలో అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసిందని కమిషనర్ హరికిరణ్ వివరించారు. వ్యవసాయ ప్రాధాన్యతా దేశాల్లో ఇదే రీతిలో డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయని ఆకాంక్షిస్తూ ఆర్బీకే విజిటర్స్ బుక్‌లో బృందం తమ అభిప్రాయాన్ని రాశారు. వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు వెంకటేశ్లర్లు, జిల్లా వ్యవసాయాధికారి కె.అప్పలస్వామి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి మన్మధరావు, పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకుడు కరుణాకర్, ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్ డైరెక్టర్ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఆర్బీకే వ్యవస్థ అద్భుతం ఏపీలో విద్య, వైద్య, వ్యవసాయ ఇతర రంగాల్లో విప్లవాత్మక మార్పులొచ్చాయి. మీ కేంద్ర ప్రభుత్వం చూసి రమ్మంటే ఇక్కడకు వచ్చాం. నిజంగానే ఇక్కడ ప్రభుత్వం దూరదృష్టి చాలా బాగుంది. డిజిటల్ టెక్నాలజీని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లారు. వ్యవసాయంపై ఆధారపడిన దేశాలు ఖచ్చితంగా ఇలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.– లిట్రాంగ్యెన్, వైస్ చైర్మన్ వియాత్నం ప్రొవిన్షియల్ అసెంబ్లీ కమిటీ -
వీసా లేకుండానే వియత్నాంకి: టూరిస్టులకు బంపర్ ఆఫర్
థాయ్‌లాండ్, శ్రీలంక తరువాత వియత్నాం కూడా త్వరలోనే భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పనేంది. వీసా లేకుండా ఆ దేశంలో పర్యటించేందుకు భారతీయులకు అవకాశం కలగనుంది. టూరిస్టులను ఆకర్షించే పథకంలో భాగంగా ఈ యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే శ్రీలంక, థాయ్‌లాండ్ తర్వాత భారతీయులకు వీసా రహిత ప్రవేశం కల్పిస్తున్న మూడో దేశంగా వియత్నాం అవతరించనుంది. వియత్నాం సంస్కృతి, క్రీడలు మరియు పర్యాటక శాఖ మంత్రి న్గుయిన్ వాన్ జంగ్, చైనా, భారత్ వంటి ప్రధాన మార్కెట్లకు స్వల్పకాలిక వీసా మినహాయింపులపై కీలక సూచన చేశారు. దేశ పర్యాటక రంగం పునరుద్ధరణ కోసం పిలుపునిచ్చిన ఆయన కొంతకాలం పాటు ఈ మినహాయింపు నిచ్చేందుకు యోచిస్తోందని వియత్నాం వార్తా సంస్థ VnExpress నివేదించింది. 2023 ఏడాదిలో తొలి పది నెలల్లో, వియత్నాంను సందర్శించిన అంతర్జాతీయ టూరిస్టుల సంఖ్య దాదాపు 10 మిలియన్ల దాటింది. 2022 నుండి 4.6 రెట్లు పెరిగింది.కోవిడ్‌కు ముందు, వియత్నాంను సందర్శించిన ఇండియా టూరిస్టలు సుమారు 1,70,000 మంది . ప్రస్తుతం జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, ఇటలీ, స్పెయిన్, డెన్మార్క్ , ఫిన్లాండ్ జాతీయులు ప్రస్తుతం వీసా లేకుండా వియత్నాంలో ప్రయాణించవచ్చు. కాగా అక్టోబర్‌లో, థాయ్‌లాండ్ ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్ 10 నుండి మే 10, 2024 వరకు ఆరు నెలల పాటు భారతదేశం, తైవాన్ నుండి పర్యాటకులకు వీసా రహిత ప్రవేశానికి అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. -
మస్క్‌కు తెగ నచ్చేసిన సరికొత్త సైబర్ ట్రక్: వీడియో చూస్తే మీరూ ఫిదా!
ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సైబర్ట్రక్పై ప్రపంచవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా వియత్నాంకు చెందిన యూ ట్యూబర్ టెస్లా సైబర్ ట్రక్ ప్రతిరూపాన్ని చెక్కతో అద్భుతంగా రూపొందించాడు. చెక్కతో పూర్తిగా పనిచేసేలా ఈ సైబర్‌ట్రక్ రూపొందించడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో కోసం నెట్లో సెర్చ్ చేసి, డిజైన్ చేసుకొని మరీ మెటల్ ఫ్రేమ్మీద చెక్కతో దీన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు. ఎలక్ట్రిక్ మోటారు , బ్యాటరీలపై చెక్క పలకలను ఉపయోగించాడు. లైట్లను కూడా అందంగా పొందుపరిచాడు అలాగే X లోగోతో సైడ్ ప్యానెల్‌ను కూడా డిజైన్ చేశాడు. చివరికి తన వుడెన్ కారును కొడుకుతో కలిసి రైడ్‌కి తీసుకెళ్లడంతో క్లిప్ ముగుస్తుంది. దీనికి సంబంధించి వుడ్‌వర్కింగ్ ఆర్ట్ అనే YouTube ఛానెల్లో మస్క్ కోసం వందరోజుల్లో టెస్లా సైబర్ ట్రక్ తయారీ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేశాడు. దీంతో పాటు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు ఒక నోట్ పెట్టాడు. తనకు చెక్క వాహనాలంటే చాలా ఇష్టమని,అందులోనూ టెస్లాపై ఉన్న విపరీతమైన అభిమానంతో దీన్ని తయారు చేశానని చెప్పారు. ఇందులో అనుభవం సాధించాలనే లక్ష్యంతో కొన్నేళ్లుగా అనేక చెక్క కార్లను రూపొందించా.. ఇపుడు ఈ సైబర్‌ట్రక్ పూర్తి చేశా అన్నాడు. తన వ్యూయర్లలో చాలామందికి నచ్చిన, తాను మెచ్చిందీ, నిర్మించాలని కోరుకుంటున్న కారు కూడా ఇదే అంటూ యూట్యూబర్ వెల్లడించాడు. సైబర్‌ట్రక్ కోసం టెస్లా తన సవాళ్లను ఎదుర్కొందో తెలుసు. అయినా కూడా మస్క్ పైనా, టెస్లా సామర్థ్యాలపై అచంచలమైన విశ్వాసం ఉంది. ఇది కచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పడమే కాదు. టెస్లా చెక్క సైబర్‌ట్రక్‌ను బహుమతిగా ఇవ్వడం సంతోషంగా ఉందంటూ రాసుకొచ్చాడు. అయితే దీనిపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ స్పందించడం విశేషం. సూపర్.. చాలా అభినందించదగ్గదే అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో 9 లక్షలకు పైగా వ్యూస్ 14 వేల లైక్స్ సాధించింది. వాట్ ఎ లెజెండ్ అంటూ అతనిపై నెటిజనులు ప్రశంసలు కురిపించారు. ఖచ్చితంగా మస్క్ మీ దగ్గరికి వస్తారు అంటూ ఒకరు వ్యాఖ్యానించగా, టెస్లా సైబర్ ట్రక్ అంటే అత్యుత్తమంగా ఉండాలి తప్ప ఇలా కాదు.. దీన్ని టెస్లా హెడ్ క్వార్టర్ లో ఉంచితే బెటర్ అని ఒక యూజర్ కమెంట్ చేశాడు. -
వియత్నాంలో ఘోర అగ్ని ప్రమాదం
హనోయి: వియత్నాం రాజధాని నగరం హనోయి ఘోర అగ్నిప్రమాదానికి నిలయంగా మారింది. హనోయిలో మంగళవారం రాత్రి తొమ్మిది అంతస్తుల భవంతి పార్కింగ్ ప్రాంతంలో మొదలైన అగి్నకీలలు వెనువెంటనే భవనం మొత్తాన్నీ చుట్టేశాయి. అత్యవసరంగా బయటపడే మార్గం ఈ భవనానికి లేదు. దీంతో తప్పించుకునే మార్గం కానరాక ఏకంగా 56 మంది అగి్నకి ఆహుతయ్యారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. 37 మంది గాయపడ్డారు. 150 కుటుంబాలు నివసిస్తున్న ఈ భవనం ఇరుకైన దారిలో నిర్మించారు. దీంతో మంటలు ఆర్పే అగి్నమాపక సిబ్బంది భవనం దాకా చేరుకోలేకపోయారు. ఇరుకైన మార్గం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. మంటలు అంటుకుంటాయనే భయంతో కొందరు భవనం మీద నుంచి కిందకు దూకారు. ఇలా గాయపడిన వారిని హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రుల్లో చికిత్సనందిస్తున్నారు. పొగపీల్చడంతో ఇబ్బందులు పడుతున్న వారికీ చికిత్సచేస్తున్నారు. -
అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు.. 50 మందికిపైగా మృత్యువాత
వియాత్నంలోని అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దేశ రజధాని హనోయిలోని 9 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో 50 మంది మృత్యువాతపడ్డారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మరో 70 మందిని అధికారులు రక్షించారు. మంగళవారం రాత్రి 11.30 గంటలకు భవనంలోని పార్కింగ్ ఏరియాలో మొదలైన మంటలు క్షణాల్లోనే అపార్ట్మెంట్ మొత్తం వ్యాపించాయి. భవనం చుట్టూ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. బిల్డింగ్‌లో 45 కుటుంబాలు నివసిస్తుండగా ప్రమాద సమయంలో అందరూ ఇళ్లలోనే ఉన్నారు. నిద్రమత్తులో ఉన్న నివాసితులు తేరుకొని సాయం కోసం గట్టిగా కేకలు వేశారు. అయితే అపార్ట్మెంట్ నుంచి తప్పించుకునే మార్గం లేకుండా పోయిందని, ఈ కారణంతోనే మరణాలు భారీగా సంభవించాయని అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. అయితే అపార్టమెంట్ ఇరుకైన గల్లీలో ఉండటంతో అక్కడికి చేరుకునేందుకు అగ్నిమాపక సిబ్బందికి కష్టమవుతోంది. దీంతో అగ్నిమాపక వాహనాలను భవనానికి 300 నుంచి 400 మీటర్ల దూరంలో నిలిపి ఉంచి సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం -
వియత్నాం బయలుదేరిన జో బైడెన్
ఢిల్లీ: శనివారం జీ20 సమావేశాలు ముగిసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేడు రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం నేరుగా ఢిల్లీ విమానశ్రయానికి చేరుకున్నారు. ఆ తర్వాత భారత్ నుంచి వెనుదిరిగారు. ఢిల్లీ నుంచి నేరుగా వియత్నాం బయలుదేరారు. అక్కడ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. US President Joe Biden departs for Vietnam, take a look at key takeaways of India visit Read @ANI Story | https://t.co/IHeIsh2EWB#JoeBiden #USPresident #Vietnam #India pic.twitter.com/SXk8e1zj3F — ANI Digital (@ani_digital) September 10, 2023 భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ20 సమావేశానికి బైడెన్ శుక్రవారం ఢిల్లీకి వచ్చారు. దేశ రాజధానిలోని మౌర్య హోటల్లో బస చేశారు. శనివారం ఉదయం నుంచి జరిగిన జీ20 సమావేశాల్లో పాల్గొన్నారు. ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయానికి ఆమోదం తెలిపారు. బైడెన్ భార్య జిల్ బైడెన్‌కు కరోనా సోకిన కారణంగా జీ20 సమావేశాలకు ఆయన హాజరవుతారా..?లేదా..? అనే సందిగ్ధం నెలకొంది. కానీ జో బైడెన్‌కు కరోనా నెగిటివ్ అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రపంచ అగ్రదేశ నేతగా బైడెన్ జీ20 సమావేశాల్లో కీలకంగా పాల్గొన్నారు. ఇదీ చదవండి: బైడెన్ డ్రైవర్‌ను నిర్బంధించిన భద్రతా సిబ్బంది..ఎందుకంటే..? -
‘స్వయంభూ’ కోసం వియత్నామ్ వెళ్లిన హీరో నిఖిల్
హీరో నిఖిల్ సిద్ధార్థ వియత్నామ్లో వాలిపోయారు. ఏదో వెకేషన్‌కి వెళ్లుంటారేమో అనుకుంటే పొరబడినట్టే. తన తాజా పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ కోసం నెల రోజులు ప్రత్యేక శిక్షణ తీసుకునేందుకు వియత్నామ్ వెళ్లారాయన. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించనున్న మూవీ ‘స్వయంభూ’. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. యుద్ధం నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో యోధునిగా కనిపించనున్నారు నిఖిల్. ఈ పాత్రకు సంబంధించి ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుంటున్నారు. సైగాన్లోని కొంతమంది బిగ్గెస్ట్ స్టంట్ మాస్టర్లు ‘స్వయంభూ’ యూనిట్లో భాగంగా ఉండి యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం నిఖిల్‌కి శిక్షణ ఇస్తారు. నెల రోజుల పాటు శిక్షణ తీసుకోనున్నారు నిఖిల్. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: మనోజ్ పరమహంస, సహనిర్మాతలు: విజయ్ కామిశెట్టి, జీటీ ఆనంద్. -
అదృష్టం కాదిది.. అంతకు మించి! ఒక్క రోజులో రూ. 3.2 లక్షల కోట్ల సంపద..
సాధరణంగా ఊహించని లాభాలు, ఆదాయం వస్తే అదృష్టం వరించింది అంటుంటారు. కానీ ఒక్క రోజులో రూ. 3.2 లక్షల కోట్ల సంపద పెరిగితే దాన్ని ఏమంటారు? అదృష్టం కాదు.. అంతకు మించి అంటారు. సింగపూర్‌కు చెందిన ఆటోమొబైల్ సంస్థ విన్‌ఫాస్ట్ ఆటో లిమిటెడ్ (VinFast Auto Ltd) స్టాక్ మార్కెట్లలో ప్రవేశించిన మొదటి రోజునే దూసుకెళ్లి, దాని వ్యవస్థాపకుడి సంపదను భారీగా పెంచింది. దిగ్గజ కంపెనీలను దాటేసి.. ఈ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ షేర్లు మంగళవారం (ఆగస్టు 15) ఏకంగా 255 శాతం పెరిగాయి. దీంతో కంపెనీ చైర్మన్ వియత్నాంకు చెందిన ఫామ్ నాట్ వూంగ్ (Pham Nhat Vuong) నికర సంపదకు 39 బిలియన్ డాలర్లు (రూ.3.2 లక్షల కోట్లకు పైగా) చేరాయి. పరిశ్రమ దిగ్గజాలు జనరల్ మోటార్స్ కో, మెర్సిడెస్ బెంజ్ గ్రూప్ ఏజీ కంటే విన్‌ఫాస్ట్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, వియత్నాంకు చెందిన ఫామ్ నాట్ వూంగ్ సంపద ఇప్పుడు 44.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కంపెనీలో వూంగ్ వాటాను స్టాక్ ఇండెక్స్ గతంలో చేర్చలేదు. తన వింగ్ గ్రూప్ జేఎస్సీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 99 శాతం కంపెనీ అవుట్‌స్టాండింగ్ వూంగ్ నియంత్రణలోనే ఉన్నాయి. అత్యధిక వాటా ఆయనకే ఉండటంతో ఇతర ఇన్వెస్టర్లకు కంపెనీ షేర్లు అందుబాటులో లేవు. విన్‌ఫాస్ట్ ఆటో లిమిటెడ్‌ను 2017లో వూంగ్ స్థాపించారు. తమ వాహనాల అమ్మకాలు ఈ సంవత్సరం 45,000 నుంచి 50,000కి చేరుకుంటాయని కంపెనీ అంచనా వేసింది. గత నెలలో నార్త్ కరోలినాలో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఈ సంస్థ చేపట్టింది. వూంగ్తోపాటు అతని బంధువులు విన్‌ఫాస్ట్ సంస్థలో కనీసం 300 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు. న్యూడిల్స్ బిజినెస్‌తో మొదలుపెట్టి... రష్యాలో జియో-ఎకనామిక్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత 1990ల ప్రారంభంలో వూంగ్ ఉక్రెయిన్‌కు వెళ్లారు. అనంతరం వియత్నాంకు తిరిగి వచ్చిన తొమ్మిదేళ్ల తర్వాత ఇన్స్టాంట్ న్యూడిల్స్ బిజినెస్‌ను ప్రారంభించారు. తర్వాత దాన్ని 2010లో నెస్లే ఎస్ఏకి అమ్మేశారు. అప్పటికే ఆయన రియల్ ఎస్టేట్, రిసార్ట్లు, స్కూళ్లు, షాపింగ్ మాల్స్ వ్యాపారాలు నిర్వహించే వింగ్ గ్రూప్ జేఎస్సీ (Vingroup JSC)ని స్థాపించారు. హనోయి కేంద్రంగా కార్యకలాపాలు నర్వహిస్తున్న ఈ సంస్థ గత సంవత్సరం 4.4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. విన్‌ఫాస్ట్ కంపెనీలో ఇది ప్రధాన వాటాదారుగా ఉంది. -
వియత్నాంకు కానుకగా మన యుద్ధనౌక
న్యూఢిల్లీ: వియత్నాంకు భారత్ అరుదైన కానుక అందించింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి నిదర్శనంగా ఐఎన్ఎస్ కృపాణ్ యుద్ధనౌకను బహుమతిగా ఇచి్చంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యంపై ఇరు దేశాల్లో నెలకొన్న ఆందోళనల్ని దృష్టిలో ఉంచుకొని తీర ప్రాంతంలో గస్తీని బలోపేతం చేయడం దీని ఉద్దేశమంటున్నారు. పూర్తి సామర్థ్యంతో పని చేసే యుద్ధ నౌకను ఒక మిత్రదేశానికి భారత్ కానుకగా ఇవ్వడం ఇదే తొలిసారని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ వెల్లడించారు. వియత్నాం పర్యటనలో ఉన్న ఆయన శనివారం బే ఆఫ్ కామ్ రన్హ్ జలాల్లో జరిగిన కార్యక్రమంలో ఐఎన్ఎస్ కృపాణ్‌ను ఆ దేశానికి అందజేశారు. పూర్తిస్థాయి ఆయుధాలతో కూడిన నౌకను ఆ దేశ నేవీకి అప్పగించినట్టు వివరించారు. భారత్ జీ20 సదస్సు ప్రధాన థీమ్ అయిన వసుధైక కుటుంబం (ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్)లో భాగంగానే ఈ కానుక ఇచ్చినట్టు తెలిపారు. ఐఎన్ఎస్ కృపాణ్ గస్తీతో దక్షిణ చైనా జలాల్లో అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా అన్ని దేశాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఎన్ఎస్ కృపాణ్ జూన్ 28న విశాఖపట్నం నుంచి బయల్దేరి జూలై 8 నాటికి వియత్నాం చేరింది. -
వియత్నాం పర్యటనలో ఆర్థిక మంత్రి బుగ్గన
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వియత్నాంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వియత్నాం ప్రభుత్వ ప్రణాళిక, పరిశ్రమల డిప్యూటీ మినిస్టర్ డో తాన్హ్ ట్రంగ్ తో సమావేశమయ్యారు. ఇందులో వొకేషనల్ ట్రైనింగ్, పారిశ్రామికాభివృద్ధికి సంబంధించిన తోడ్పాటుపై ప్రధానంగా చర్చతో పాటు వియత్నాం నుంచి మరింత సహకారం దిశగా ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు కోసం చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం వియత్నాం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ప్రెసిడెంట్ ట్రాన్ కోక్ ఫుంగ్ను మంత్రి కలిశారు. వియత్నాంలోని అతి పెద్ద వస్త్ర తయారీ పరిశ్రమ 'గార్కో 10'ను సందర్శించారు. టెక్స్ టైల్ కంపెనీ, 'గార్కో 10' సహకారంతో వృత్తివిద్య కళాశాలల ఏర్పాటు, పెట్టుబడుల అవకాశాలపైనా చర్చించారు. వీటితో పాటు హానోయ్ టెక్స్ టైల్ అండ్ గార్మెంట్స్ యూనివర్శిటీని విజిట్ చేశారు. టెక్స్ టైల్ రంగంలోని సాంకేతికత, ఫ్యాషన్ శిక్షణలో సహకారానికి గల అవకాశాలపై అధ్యయనం చేశారు. ఇందులో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ వినోద్ కుమార్ తదితరులు హాజరయ్యారు. హనోయిలోని ఇండియా హౌస్‌లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించడంతో పాటు భారత రాయబారి సందీప్ ఆర్యాను కలిశారు. చదవండి నెల్లూరు ఆసుపత్రిలో మరణాలపై క్లారిటీ.. ఆక్సిజన్ కొరతపై దుష్ప్రచారాన్ని ఖండించిన వైద్యులు -
యుద్ధనౌక ఐఎన్ఎస్ కృపాణ్:ఈ కానుక ఏ తీరాలకి..?..ప్రత్యేకతలివే..!
► పసిఫిక్ మహా సముద్రంలోని దక్షిణ చైనా సముద్రంపై గత కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. చైనా ఈ ప్రాంతంపై తన సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడాన్ని సముద్రం చుట్టూ ఉన్న దేశాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రం కేవలం డ్రాగన్దేనంటే ఊరుకోబోమని అందులో తమకూ భాగం ఉందని గళమెత్తుతున్నాయి. అలాంటి దేశాల్లో వియత్నాం కూడా ఒకటి. చైనా పొరుగునే ఉన్న వియత్నాం ఇండో పసిఫిక్ ప్రాంతంలో మనకి అత్యంత కీలక భాగస్వామిగా ఉంది. భావసారూప్యత కలిగిన భాగస్వామ్య దేశమైన వియత్నాం నౌకాదళ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశ ఆధిపత్యానికి చెక్ పెట్టాలన్నది భారత్ వ్యూహంగా ఉంది. దక్షిణ చైనా సముద్రంపై చైనా పెత్తనం పెరుగుతున్న కొద్దీ ప్రపంచ పటంలో కొత్త మార్పులు వస్తాయన్న ఆందోళనలున్నాయి. ఇటీవల కాలంలో వియత్నాంతో మన దేశానికి ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్నాయి. రక్షణ రంగంలో సహకరించుకుంటున్నాం. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశ పెత్తనం సహించలేనిదిగా మారింది. ఈ నేపథ్యంలో వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ జియాంగ్ భారతదేశ పర్యటనకు వచి్చనçప్పుడు ఈ యుద్ధ నౌకను కానుకగా ఇవ్వాలని భారత్ నిర్ణయించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఇప్పటివరకు భారత్ ఎన్నో మిత్ర దేశాలకు మిలటరీ సాయాలు చేసింది. మాల్దీవులు, మారిషస్ వంటి దేశాలకు చిన్న చిన్న పడవలు, మిలటరీ పరికరాలు ఇచి్చంది. మయన్మార్‌కు ఒక జలాంతర్గామిని ఇచి్చంది. కానీ వియత్నాంకు క్షిపణిని మోసుకుపోగలిగే సామర్థ్యమున్న యుద్ధ నౌకను ఇవ్వడం వల్ల ఆ తీరంలో చైనా కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయడానికి వీలు కలుగుతుందన్నది భారత్ ఉద్దేశంగా ఉంది. ప్రత్యేకతలివే..! ► ఐఎన్ఎస్ కృపాణ్ ఖుక్రీ క్లాస్‌కు చెందిన అతి చిన్న క్షిపణి యుద్ధనౌక. 1,350 టన్నుల బరువైన, సముద్రజలాలను పక్కకు తోసేస్తూ వేగంగా ముందుకు దూసుకెళ్లగల శక్తివంతమైన నౌక ఇది. ► పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, ఇంజనీర్లు రూపొందించిన ఈ నౌక గత కొన్నేళ్లుగా మన నావికా దళానికి గర్వకారణంగా ఉంది. ► 1991 జనవరి 12న దీనిని నావికాదళంలోకి ప్రవేశపెట్టారు.. 25 నాట్స్ వేగంతో ప్రయాణించగలదు. ► మీడియం రేంజ్ గన్స్ అంటే 30 ఎంఎం తుపాకీలను ఈ నౌకకు అమర్చవచ్చు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, చాఫ్ లాంచర్స్ వంటి వైవిధ్యమైన పనులు చేయగలదు. ► తీరప్రాంతాల్లో భద్రత, గస్తీ, కదనరంగంలో పాల్గొనడం, యాంటీ పైరసీ, విపత్తు సమయాల్లో మానవతా సాయం వంటివి చేయగల సామర్థ్యముంది. ► భారత్ నావికాదళంలో చురుగ్గా సేవలు అందిస్తున్న యుద్ధనౌక ఐఎన్ఎస్ కృపాణ్‌ను కేంద్ర ప్రభుత్వం వియత్నాంకు కానుకగా ఇచ్చింది. విదేశాలకు ఒక నౌకని బహుమతిగా ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే మొదటి సారి. ఈ నౌక విశాఖ నుంచి ఈ నెల 28 బుధవారం వియత్నాంకు బయల్దేరి వెళ్లింది. 2016 నుంచి భారత్, వియత్నాం మధ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటివరకు మనం ఎన్నో దేశాలకు మిలటరీ సాయం చేశాము. కానీ కోట్లాది రూపాయల విలువ చేసే యుద్ధ నౌకను ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వలేదు ? ఎందుకీ నిర్ణయం? దీని వల్ల భారత్‌కు ఒరిగేదేంటి ? దక్షిణ చైనా సముద్రం వివాదమేంటి? ► దక్షిణ చైనా సముద్రంపై సుదీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. ఈ సముద్ర భూభాగంపై సార్వ¿ౌమాధికారాన్ని ప్రకటించుకున్న చైనా ఏకంగా కృత్రిమ దీవులను నిర్మిస్తోంది. ఈ సముద్రంలో ఎన్నో దీవులున్నాయి. మత్స్య సంపద అపారంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో 15 శాతం ఈ సముద్రంలో జరుగుతుంది. దీనిపై చైనా సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడం ఇతర దేశాలకు మింగుడు పడడం లేదు.ఈ సముద్రంలో ఉన్న అన్ని ద్వీపాలను ఒకే రేఖ మీద చూపిస్తూ చైనా విడుదల చేసిన ‘‘నైన్ డ్యాష్ లైన్’ మ్యాప్‌తో తనవేనని వాదిస్తోంది. ఈ సముద్రంలో భారీగానున్న చమురు నిల్వలపై అన్వేషణ కూడా ప్రారంభం కావడంతో దేశాల మధ్య పోటీ ఎక్కువైంది. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహా సముద్రం మధ్యలో దక్షిణ చైనా సముద్రం ఉండడం వల్ల అక్కడ చైనా జోక్యం పెరిగితే భారత్‌కూ నష్టమే. ఈ సముద్రం చుట్టూ చైనా, తైవాన్, వియత్నాం, మలేసియా, ఇండోనేసియా, బ్రూనై, ఫిలిప్పీన్స్ దేశాలున్నాయి. ఇవి కూడా సముద్రంలో తమకూ వాటా ఉందని ప్రకటించాయి. మరోవైపు చైనా కృత్రిమ దీవులు, సైనిక స్థావరాలతో ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య మనం పంపిన కృపాణ్ దక్షిణ చైనా జలాల్లో ఎంత మేరకు నిఘా పెడుతూ డ్రాగన్‌కు చెక్ పెడుతుందో వేచిచూడాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏయూలో వియత్నాం విద్యార్థుల సందడి
-
రూ. 407 కోట్లతో సీసీఎల్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టంట్ కాఫీ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ వియత్నాం తయారీ కేంద్రంలో కొత్త యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 6,000 టన్నుల వార్షిక సామర్థ్యంతో ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ ఫెసిలిటీని నెలకొల్పనున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.407 కోట్లు. కాగా, 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను మధ్యంతర డివిడెండ్ రూ.3 చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. డిసెంబర్ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ఫలితాల్లో కంపెనీ నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 24.9 శాతం ఎగసి రూ.73 కోట్లు సాధించింది. ఎబిటా 9 శాతం పెరిగి రూ.101 కోట్లుగా ఉంది. టర్నోవర్ 26.5 శాతం అధికమై రూ.535 కోట్లు నమోదు చేసింది. -
ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే!
వియత్నాంలోని కాన్‌థో నగరంలో ఇటీవల వెలిసిన బంగారు భవనం అంతర్జాతీయంగా వార్తలకెక్కింది. కాన్‌థో నగరానికి చెందిన ఎంగ్యూయెన్ వాన్ ట్రుంగ్ అనే ఆసామి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇబ్బడి ముబ్బడిగా సంపాదించాడు. కొత్తతరహాలో ఇల్లు నిర్మించుకోవాలనుకున్నాడు. ఇళ్ల నమూనాలు చూడటానికి దేశదేశాల్లో సంచరించాడు. ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డెకరేటర్లతో చర్చోప చర్చలు జరిపాక, ఇదివరకు ఎవరూ కనీవినీ ఎరుగని రీతిలో బంగారు తాపడంతో ఇల్లు నిర్మించాలని నిశ్చయించుకుని, తన నివాసంగా బంగారు భవనాన్ని నిర్మించాడు. ఇంటి వెలుపల గోడలను, పైకప్పును పూర్తిగా బంగారు రేకులతో తాపడం చేయించాడు. ఇంటి బయటే కాదు, లోపల కూడా అడుగడుగునా కళ్లుచెదిరేలా బంగారు వస్తువులతో నింపేశాడు. ఇంట్లోని చాలా వస్తువులు పూర్తి బంగారంతో తయారు చేయించనవి అయితే, కొన్ని భారీ విగ్రహాల వంటివి మాత్రం బంగారు తాపడం చేయించనవి. ఆరేళ్ల కిందటే బంగారు భవనాన్ని నిర్మించాలని అనుకున్నానని, దీని నిర్మాణం పూర్తి చేయడానికి మూడేళ్లు పట్టిందని ట్రుంగ్ మీడియాకు వెల్లడించాడు. ఇప్పుడు ఈ భవంతి వియత్నాం దేశానికే ప్రత్యేక ఆకర్షణగా మారింది. వియత్నాం వచ్చే విదేశీ పర్యాటకులు పనికట్టుకుని మరీ కాన్‌థో నగరానికి వచ్చి, ఈ ఇంటిని కళ్లారా చూసి వెళుతున్నారు. చదవండి: పాల ప్యాకెట్ తెచ్చిన అదృష్టం..వందల కోట్లు సంపాదిస్తున్న పేటీఎం సీఈవో! -
హైదరాబాద్ నుంచి వియత్నాంకు విమాన సర్వీసులు.. 4 గంటల్లోనే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి నేరుగా వియత్నాంకు విమాన సర్వీసులు త్వరలో ప్రారంభం కానున్నాయి. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వియత్నాంలోని హనోయి, హో చి మిన్, డా నాంగ్ నగరాలకు వియట్జెట్ ఫ్లైట్లను నేరుగా నడుపనున్నట్లు జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్ తెలిపారు. ఈ సర్వీసులు 4 గంటల్లో వియత్నాం చేరుకుంటాయి. హనోయికి అక్టోబర్ 7న, హో చి మిన్ సిటీకి అక్టోబర్ 9న, డా నాంగ్‌కు నవంబర్ 29వ తేదీన వియట్జెట్ తొలి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వారానికి నాలుగు సార్లు ఈ విమాన సర్వీసులు ఉంటాయి. వియత్నాంకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడం వల్ల పర్యాటకరంగం అభివృద్ధి చెందుతుందని ఫణికర్ అభిప్రాయపడ్డారు. అలాగే వ్యాపార, వాణిజ్య రంగాల్లోను సంబంధాలు మెరుగు పడతాయన్నారు. కొత్త సర్వీసుల వల్ల భారతదేశంలో తమ నెట్వర్క్ బలోపేతం అవుతుందని వియట్జెట్ కమర్షియల్ డైరెక్టర్ జె.ఎల్.లింగేశ్వర అన్నారు. ఆగ్నేయ, ఈశాన్య ఆసియా దేశాలకు వారధిగా ఉన్న వియత్నాం సౌందర్యాన్ని ఆస్వాదించడానికి రావాలని ఆయన హైదరాబాద్ పర్యాటకులను ఆహ్వానించారు. -
అక్టోబర్ నుంచి హైదరాబాద్–వియత్నాం ఫ్లయిట్ సర్వీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది అక్టోబర్ నుంచి హైదరాబాద్‌తో పాటు భారత్‌లోని మరో రెండు నగరాల నుంచి వియత్నాంకు నేరుగా ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించనున్నట్లు విమానయాన సంస్థ వియత్జెట్ డైరెక్టర్ జయ్ ఎల్ లింగేశ్వర తెలిపారు. ఒకో ప్రాంతం నుంచి వియత్నాంలోని హనోయ్, హో చి మిన్హ్ తదితర ప్రాంతాలకు వారానికి మూడు–నాలుగు సర్వీసులు ఉంటాయని గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు. ప్రస్తుతం న్యూఢిల్లీ, ముంబై నుంచి వియత్నాంలోని ప్రధాన నగరాలకు వారానికి 20 వరకూ సర్వీసులు నడుపుతున్నామని పేర్కొన్నారు. తమ కార్యకలాపాలు ప్రారంభమయ్యాక భారత్ నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య 60 శాతం మేర పెరిగిందని లింగేశ్వర చెప్పారు. ప్రయాణికులను ఆకర్షించడానికి రూ. 26 బేస్ రేటుకే టికెట్లు వంటి ఆఫర్లు రూపొందిస్తున్నామని వివరించారు. మరోవైపు సమర్ధమంతమైన వ్యయ నియంత్రణ చర్యల ద్వారా అధిక ఇంధన ధరల భారాన్ని ఎదుర్కొంటున్నామని ఆయన చెప్పారు. ఇంధన ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతుండటం పరిశ్రమకు సానుకూలాంశమని పేర్కొన్నారు. -
యాపిల్: వెళ్లిపోతాం..చైనాలో ఉంటే మునిగిపోతాం..పెట్టేబేడా సర్దుకుని!
త్వరలో చైనాకు భారీషాక్ తగలనుంది. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐపాడ్ ప్రొడక్షన్‌ను చైనాలో నిలిపి వేయనుందని నిక్కీ ఆసియా నివేదించింది. షాంఘై వంటి నగరాల్లో కొనసాగుతున్న లాక్డౌన్లతో పాటు, అక్కడ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల యాపిల్ చైనా నుండి ప్రొడక్షన్‌ను వియాత్నంకు తరలించాలని భావిస్తోంది. చైనాకు చెందిన బీవైడీ సంస్థ యాపిల్ ఐపాడ్లను తయారు చేస్తోంది. తయారు చేసిన వాటిని యాపిల్ అమ్మకాలు నిర్వహిస్తుంది. గతేడాది యాపిల్‌కు రెండో అతిపెద్ద ప్రొడక్ట్ ఐపాడ్లను 58మిలియన్ల షిప్ మెంట్ చేసింది. కానీ ఈఏడాది సాధ్య పడలేదు.పెరిగిపోతున్న కరోనా కేసులు, చిప్ కొరత, సప్లయ్‌తో పాటు ప్రభుత్వ నిర్ణయాలతో యాపిల్ సంస్థ ఐపాడ్ ప్రొడక్షన్‌ను చైనా నుంచి మరో చోటికి షిఫ్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకే భవిష్యత్‌లో చిప్ కొరత లేకుండా ఉండేలా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా చిప్ తయారీ సంస్థలకు చిప్‌లను వెంటనే పంపించాలని యాపిల్ విజ్ఞప్తి చేసినట్లు నీక్కీ ఆసియా తన నివేదికలో వెల్లడించింది చైనా టూ వియాత్నం! చైనా షాంఘైలో యాపిల్ సంస్థకు సగ భాగానికి పైగా 200 ప్రధాన సప్లయర్స్ ఉన్నారు. అందుకే యాపిల్ సంస్థ షాంఘై కేంద్రంగా 31 కంపెనీలతో తన ఉత్పత్తుల్ని తయారు చేస్తుంది. కానీ అక్కడ నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆ ప్రాంతం నుంచి వియాత్నంకు ఐపాడ్ ప్రొడక్షన్‌ను తరలించనుంది. ఇందుకోసం యాపిల్..బీవైడీ సంస్థ ఆధ్వర్యంలో ప్రొడక్షన్ షాంఘై నుంచి వియాత్నం కు తరలింపు, వియాత్నంలో తక్కువ సంఖ్యలో ఐపాడ్లను తయారు చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. -
గాజు వంతెన.. గుండె జారేనా!
అర కిలోమీటరు ఎత్తులో ఉన్న వంతెనను చూస్తేనే ‘అమ్మో..!’ అంటాం. అలాంటిది అంత ఎత్తులో ఉన్న వంతెన అడుగు భాగం గాజుతో నిర్మిస్తే..! నడవడానికి గజగజలాడిపోమా. కానీ వియత్నాం ప్రజలు మాత్రం తమ దేశంలో కట్టిన గాజు వంతెనను చూసేందుకు, దానిపై నడిచేందుకు ఎగబడుతున్నారు. సోన్ లా ప్రావిన్స్‌లో 632 మీటర్ల ఎత్తులో నిర్మించిన ప్రపంచంలోనే అతి పొడవైన ఈ వంతెనను ఇటీవలే ప్రారంభించారు. దీనికి బాచ్ లాంగ్ (తెల్ల డ్రాగన్) పెడెస్ట్రియన్ వంతెన అని పేరు పెట్టారు. చైనాలోని గువాంగ్డాంగ్ వంతెన కన్నా (526 మీటర్లు) ఇది పొడవైనది. ఫ్రాన్స్‌లో ఉత్పత్తి చేసిన టెంపర్డ్ గ్లాస్‌ను ఈ వంతెనకు వాడారు. ఒకేసారి 450 మంది వరకు దీనిపై నడవొచ్చు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. రెప్పపాటులో బిడ్డను వెనక్కి లాగడంతో..
ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు మించింది మరేది లేదు. తనకంటే పిల్లల కోసం ఆలోచించే మాతృమూర్తి అమ్మ. పేగు బంధాన్ని రక్షించేందుకు తల్లి ఎంతవరకైనా పోరాడుతుందనే విషయం మరోసారి రుజువైంది. తన ప్రాణాలు పోతున్న సమయంలో కూడా బిడ్డ గురించి ఆలోచించింది ఓ మహిళ. ట్రక్ కింద పడిపోతుండగా ప్రాణాలకు తెగించి మరీ కాపాడింది. ఈ ఘటన వియత్నాంలో చోటుచేసుకుంది. అయితే ఇది 2019లో జరగ్గా.. క్రికెటర్ జోఫ్రా ఆర్చర్ తాజాగా తన ట్విట్టర్లో షేర్ చెయ్యడంతో ఇది మరోసారి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నామ్ దిన్హా ప్రాంతంలో రోడ్డుపై వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి భార్య, కొడుకుతో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు. ఇంతలో ఓ కారు వీరిని తాకుతూ ఓవర్ టేక్ చూస్తూ వెళ్లింది. దీంతో బైక్ వెనక కూర్చున్న తల్లి, చేతిలోని పిల్లాడు కిందపడిపోయారు. అదే సమయంలో ఎదురుగా ఓ భారీ ట్రక్కు వస్తుండడాన్ని గమనించిన తల్లి.. వేగంగా స్పందించి చక్రాల కింద పడిపోబోతున్న తన బిడ్డను చాకచక్యంగా వెనక్కి లాగింది. పెను ప్రమాదం నుంచి కుమారుడిని కాపాడుకుంది. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. ఈ ఘటనలో తల్లీ, కొడుకులు వెంట్రుకవాసిలో తల్లి, క్షేమంగా భయటపడ్డారు. చదవండి👉 ఈ మగ దోమలు చాలా మంచివి.. యవ్వనంలోకి వచ్చేలోపే చనిపోతాయట దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో రికార్డయిన దృశ్యాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పుడిచేలా ఉన్నాయి. తల్లి చాకచక్య తెలివితేటలపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 5 మిలియన్ల మంది వీక్షించారు. 'తల్లి ప్రేమకు మించింది ఏది లేదు', 'కన్నపేగుబంధం అంటే ఇదే మరి' అంటూ కామెంట్లు చేస్తున్నారు. Mother of the year https://t.co/qIZlz1PYEZ — Jofra Archer (@JofraArcher) April 25, 2022 -
ఇంట్లోకి దూసుకెళ్లిన బైక్.. మొబైల్ చూస్తూ కూర్చున్న మహిళ, అక్కడే ఉన్న కుక్క షాక్!
Motorcycle Crashed Into A Shop: ఇంతవరకు మనం చాలా రకాల ప్రమాదాలను చూసి ఉన్నాం. చాలా ప్రమాదకరమైన యాక్సిడెంట్లను కూడా చూశాం. అయితే కొద్దిమంది మాత్రమే ఎలాంటి గాయాలపాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. అయితే అచ్చం అలాంటి ఘటనే వియాత్నంలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...వియాత్నంలోని హో చి మిన్లో ఒక వ్యక్తి నడుపుతున్న మోటారు బైక్ అదుపు తప్పి ఓ ఇంట్లోని లివింగ్ రూమ్‌లోకి దూసుకెళ్లింది. దీంతో లివింగ్ రూమ్‌లో మొబైల్ చూస్తూ కూర్చున్న ఓ మహిళకు ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. లక్కీగా ఆమె వెంటనే తేరుకుని ఒక్క ఉదుటున వెనక్కి జరగడంతో దూసుకొచ్చిన బైక్ ఆమెకు కొద్ది దూరంలో ఎగిరిపడింది. అక్కడే ఉన్న పెంపుడు కుక్క సైతం ప్రమాదాన్ని గ్రహించి పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. లేదంటే దాని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే! ఇక బైక్‌తోపాటు దాని రైడర్ కూడా వెళ్లకిలా పడి చచ్చాన్రా దేవుడో అని నడుము పట్టుకున్నాడు. స్వల్ప గాయాలతో అతను బయటపడటం, ఆ మహిళకు, కుక్కకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఆ బైక్ ఎందువల్ల అదుపుతప్పి ఇంట్లోకి దూసుకు వచ్చిందో తెలియలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: యుద్ధ ట్యాంక్ కారుని నుజ్జునుజ్జు చేసింది...కానీ ఆవ్యక్తి) -
బంగారంలో బప్పీ లహరిని మించిపోయాడు.. శరీరంపై 2 కిలోలు, కారు, బైక్ అన్నీ..
బప్పీలహిరి.. సంగీతమే కాదు.. ఆయన ఆహార్యమూ స్పెషలే.. ముఖ్యంగా బంగారం. అది తనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందన్నది ఆయన నమ్మకం.. ఈ చిత్రంలోని వియత్నాంవాసి ట్రాన్డక్లాయ్ అయితే.. దాన్ని మరింత ఎక్కువ నమ్ముతాడు.. అందుకే ఎప్పుడూ తన శరీరం మీద రెండు కిలోలకు తక్కువ కాకుండా ఇలా గోల్డ్ ఉంచుకుంటాడు. అదొక్కటేనా.. తన కారు, బైక్ అన్నీ గోల్డ్ ప్లేటింగ్ చేయించేశాడు.. దాని వల్ల లోకల్‌గా పాపులర్ కూడా అయ్యాడు. ఇంత బంగారం ఉంది.. ఏం చేస్తాడు అనేదేగా మీ డౌట్.. వియత్నాంలో దక్షిణ అమెరికా బల్లులను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు.. వాటిని తెచ్చి.. అమ్మడమే మనోడి పని. చదవండి: "భార్యలను కొట్టండి" భర్తలకు సలహలిచ్చిన మహిళా డిప్యూటి మంత్రి! -
కన్నడ అబ్బాయి వియత్నాం అమ్మాయి.. అలా ఒక్కటయ్యారు
బెంగళూరు(దొడ్డబళ్లాపురం): స్వచ్ఛమైన ప్రేమకు భాష, ప్రాంతం, కుల, మతాలు అడ్డంకి కాదని వియత్నాం యువతి, కర్ణాటక యువకుని వివాహం రుజువు చేసింది. హావేరికి చెందిన ప్రదీప్ వియత్నాంలో గత 8 ఏళ్లుగా యోగా శిక్షకుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ నాలుగేళ్ల క్రితం క్వీన్ అనే యువతితో పరిచయమై అది ప్రేమగా మారింది. వీరి ప్రేమను ఇరువైపుల కుటుంబాలు అంగీకరించడంతో హావేరి జిల్లా రామతీర్థ హొసకొప్పె గ్రామంలో ఇరువురి వివాహం జరిగింది. ప్రయాణాలపై నిర్భంధం ఉండడంతో వధువు వైపు బంధువులు రాలేకపోయారు. అయితే వీడియో కాల్ ద్వారా వివాహాన్ని వీక్షించారు. చదవండి: (ప్రేమించిపెళ్ళి చేసుకున్నా.. ఆ సంతోషం ఎక్కువసేపు నిలువలేదు) -
కొప్పున పువ్వులు పెట్టుకోవడం కాదు.. కొప్పునే పువ్వులా మార్చితే ఎలా ఉంటుందంటే?
‘‘పూల రెక్కలు.. కొన్ని తేనె చుక్కలు.. రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో’’అంటూ పూవులాంటి అమ్మాయిని పొగిడాడో సినీ కవి. కానీ ఆ పూల రెక్కలంత పలుచగా.. నిజమైన పువ్వేనేమో అన్నంత అం దంగా జుట్టును డిజైన్ చేయగలడీ హెయిర్‌డ్రెస్సర్. ఈ పూల కొప్పుల సృష్టికర్త వియత్నాంకు చెందిన 28 ఏళ్ల గుయెన్ ఫట్ ఫట్ ట్రి. ‘‘కొప్పున పువ్వులు పెట్టుకోవడం పాత పద్ధతి. కొప్పునే పువ్వులా దిద్దుకోవడం కొత్త స్టైల్’’అంటూ మందారం, చామంతి, లిల్లీ, లోటస్... ఇలా అనేక రకాల పూల డిజైన్లలో జుట్టును వేస్తున్నాడు. జియాంగ్ యూనివర్సిటీలో బయోటెక్నాలజీ డిగ్రీ చదివిన గుయెన్‌కు ఈ ఆర్ట్ ఏంటంటూ ప్రారంభంలో ఎన్నో అడ్డంకులు... అయినా కొన్నాళ్లకు తనది రైట్ ఛాయిస్ అని నిరూపించాడు. చదవండి: పెరిగే వయసుకు కళ్లెం.. నిత్య యవ్వనం ఇక సులువే.. ఇప్పుడు వియత్నాం హెయిర్ స్టయిల్ ఇండస్ట్రీలో గుయెన్దో ప్రత్యేక ముద్ర. ఆయన డిజైన్ చేసే ఒక్కో హెయిర్ స్టైల్ఖరీదు... పది, పదిహేను, ఇరవై వేల వరకు ఉంటుంది. ఇక సాధారణ స్టయిల్ చేయడానికి ఒకటి నుంచి రెండు రోజులుపడితే... కొన్ని మాత్రం రెండు మూడు నెలల సమయం తీసుకుంటాయి. వియత్నాం హెయిర్ ఇండస్ట్రీకి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడం, తనలాంటి కళాకారులను ప్రోత్సహించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. చదవండి: ‘ఆ పసి హృదయం ఎంతగా గాయపడిందో ఆ కళ్లే చెబుతున్నాయి' -
కూల్‌గా కూర్చోని ఫోన్ తెరిచాడు.. ఒక్కసారిగా మంటలు.. షాకింగ్ వీడియో
ఓ వైపు స్మార్ట్ ఫోన్ విక్రయాలు పెరుగుదలతో పాటే వాటి రిపేర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక కొన్ని ఫోన్లు వాటి లోపల సాంకేతిక సమస్య మరేదో కారణం వల్ల వాడుతున్నప్పుడో, లేదా జేబులో పెట్టుకున్నప్పుడో పేలిన ఘటనలు బోలెడు ఉన్నాయి. అందుకే నిపుణుల ఛార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్‌ని వాడకూడదని సూచిస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి ఫోన్‌ని రిపేర్ చేయాలని ప్రయత్నిస్తుండగా అది హఠాత్తుగా పేలిన ఘటన వియత్నాంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షాపులోని ఓ వ్యక్తి తన డెస్క్ ముందు కూర్చోని ఫోన్ రిపేర్ చేస్తుంటే... సడెన్‌గా అది పెద్ద శబ్దంతో పేలింది. హఠాత్తుగా ఫోన్ పేలి మంటలు వచ్చాయి. అదృష్టవశాత్తు అతను అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అనంతరం దాన్ని జాగ్రత్తగా తీసి... షాప్ బయటకు విసిరేశాడు. అతను ఆలస్యం చేసి ఉంటే... పెద్ద అగ్ని ప్రమాదం జరిగేదే. అక్కడి సీసీటీవీ కెమెరా ఈ దృశ్యాన్ని రికార్డ్ చేసింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. "ఇదే ఫోన్ పాకెట్లో పేలితే ఎలా ఉంటుందో ఊహించుకోండి" అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా... "లక్కీ బాయ్ నీకు ఏమీ కాలేదు" అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. చదవండి: హే! ఇది నా హెయిర్ స్టైయిల్... ఎంత క్యూట్‌గా ఉందో ఈ ఏనుగు!! -
క్వారంటైన్ ఉల్లంఘించినందుకు వియత్నంవాసికి ఐదేళ్ల జైలుశిక్ష
హనోయి: కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను వియత్నాంకి చెందిన లెవాన్ ట్రై అనే వ్యక్తికి అక్కడి ప్రాంతీయ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ట్రై.. హోచి మిన్ సిటీ నుంచి తన సొంత ఊరు కా మౌకి వెళ్లి చాలా మందికి ఈ వైరస్‌ను అట్టించాడంటూ వియత్నాం ప్రాంతీయ కోర్టు తన నివేదికలో తెలిపింది. ట్రై క్వారంటైన్ నిబంధలను ఉల్లంఘించి.. బయట తిరగి వైరస్‌ని వ్యాప్తి చేయడం వల్ల ఒకరు చనిపోవడం, మరికొంతమంది రకరకాల వ్యాధుల భారినపడినట్లు నివేదిక పేర్కొంది. హోచి మిన్ సిటీలో కరోనా కేసులు తక్కువగానే ఉన్నాయనని, ట్రై కారణంగా కేసులు అధికమైనట్లు నివేదిక వెల్లడించింది. (చదవండి: 41 ఏళ్లుగా అడవిలోనే.. స్త్రీలంటే ఎవరో తెలియదు) ఆగస్టు 7న ట్రైకి కరోనా పాజిటివ్ వచ్చిందని.. కానీ అతడు 21 రోజులపాటు హోం క్వారంటైన్లో ఉండకుండా బహిరంగప్రదేశాల్లో తిరగడం వల్ల చాలా మందికి వైరస్‌ని వ్యాప్తి చేశాడని నివేదిక పేర్కొంది. గత నెలలో ట్రై మాదిరిగా చేసిన మరికొంతమందికి కూడా వియత్నాం ప్రాంతీయ కోర్టుల ఇలాంటి శిక్షే విధించడం గమనార్హం. వియత్నాంలో సంకర కరోనా మ్యూటెంట్ ( హైబ్రిడ్ మ్యూటెంట్)కి సంబంధించిన ఏడు రకాల వేరియంట్లను శాస్త్రవేత్తలు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇలాంటి కఠిన చర్యలతో కరోనాకు అడ్డుకట్టవేయడానికి వియాత్నం శతవిధాలా ప్రయత్నిస్తోంది. చదవండి: కోవిడ్ నెగిటివ్.. అయినా క్వారంటైన్.. ఏకంగా బెడ్షీట్లతో.. -
వియత్నాంకు చేరుకున్న ఐఎన్ఎస్ ఐరావత్
దొండపర్తి (విశాఖ దక్షిణ): మిషన్ సాగర్ కార్యక్రమంలో భాగంగా కోవిడ్ వైద్య సామగ్రితో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ ఐరావత్ నౌక వియత్నాంలో ఉన్న హో ఛీ మిన్ సిటీ పోర్ట్‌కు సోమవారం చేరుకుంది. వియత్నాం ప్రభుత్వ కోరిక మేరకు భారత్ నుంచి 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తో పాటు 300 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, ఇతర కోవిడ్ సామగ్రిని నౌక ద్వారా తరలించారు. మిత్ర దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇప్పటికే భారత్ ఈ ఏడాదిలో రెండు సార్లు ఐఎన్ఎస్ ఐరావత్ నౌక ద్వారా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను, వైద్య సామగ్రిని ఇండోనేషియాకు పంపించింది. -
'వైజాగ్'.. ది ఇండియన్ శాన్ఫ్రాన్సిస్కో!
సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి కాన్వాస్ పై రమణీయ అందాలు..అడుగడుగునా మదిదోచే మనోహర దృశ్యాలు.. చక్కిలిగింతలు పెట్టే సహజ సిద్ధ సోయగాలు.. ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఎన్నో ఊసులు చెప్పే సాగరతీర ప్రాంతాలు.. ఇలా..విశాఖ సోయగాల్ని వర్ణించాలంటే అక్షరాలు సరిపోవు.. అందుకే సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ అందరూ విశాఖ అందాలకు ఫిదా అంటున్నారు. వచ్చిన ప్రతిసారీ సరికొత్తగా పరిచయమవుతున్న విశాఖ నగరాన్ని చూసి ‘ఐ లవ్ యూ వైజాగ్’ అంటూ మురిసిపోతున్నారు. తాజాగా విశాఖ పర్యటనకు వచ్చిన వియత్నాం అంబాసిడర్ షాన్‌చౌ ఫామ్ విశాఖ సిటీ సోయగాలకు ముగ్ధుడయ్యారు. నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించిన ఆయన వైజాగ్‌ను ఇండియన్ శాన్‌ఫ్రాన్సిస్కోగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. విశాఖను అమెరికాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన శాన్‌ఫ్రాన్సిస్కోతో పోల్చిన ఆయన ట్వీట్‌కు భారీగా రీట్వీట్లు, లైక్‌లు, కామెంట్లు వస్తున్నాయి. -
అమ్మో.. పే..ద్ద పాము.. ఎలాగైతేనేం బుడ్డోడు సేఫ్!
హనోయి: వరండాలో బొమ్మలతో ఆడుకుంటున్న ఓ బుడ్డోడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదాన్ని పసిగట్టిన ఆ పిల్లాడి తండ్రి వేగంగా స్పందించడంతో పాము కాటు నుంచి తప్పించుకోగలిగాడు. వియత్నాంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన భయానక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాలు.... ఓ పిల్లాడు ఇంటి ముందర కూర్చుని బొమ్మలతో ఆడుకుంటున్నాడు. ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకున్న తాత అతడికి రక్షణగా అక్కడే నిలబడి ఉన్నాడు. ఇంతలో ఓ పాము వేగంగా ఇంట్లోకి దూసుకురావడం గమనించాడు. కానీ, అనారోగ్య కారణాల దృష్ట్యా బాబును చేతుల్లోకి తీసుకోలేకపోయాడు. అయితే వెంటనే అప్రమత్తమై, ఇంట్లో ఉన్న పిల్లాడి తండ్రిని పిలిచాడు. దీంతో అతడు క్షణాల వ్యవధిలో అక్కడికి చిన్నారిని ఇంట్లోకి తీసుకువెళ్లాడు. ముగ్గురూ లోపలికి వెళ్లిన తర్వాత వెంటనే తలుపు మూసేశాడు. ఇక ఇంటి లోపలికి వెళ్లేందుకు విఫలయత్నం చేసిన పాము.. ఎంతకీ వీలుకాకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలో... ‘‘వామ్మో.. ఎంత పెద్ద పాము.. క్షణాల్లో ఎలా దూసుకువచ్చింది... కాస్త ఆలస్యమైతే బాబుకు ఏమయ్యేదో.. ఎలాగైతేనేం బుడ్డోడు సేఫ్ అయ్యాడు. చిన్నారులను ఎల్లప్పుడూ ఓ కంట కనిపెట్టుకునే ఉండాలి’’ అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. -
వియత్నాం ప్రధానితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: వియత్నాం ప్రధాని ఫామ్ మిన్‌చిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ కాల్లో మాట్లాడారు. కొత్తగా వియత్నాం ప్రధానిగా ఎన్నికైన ఫామ్ మిన్‌చిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరు ప్రధానులు చర్చించారు.భారత పర్యటనకు రావాలని మిన్‌చిన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు.కరోనా సెకండ్ వేవ్‌లో భారత్‌కు సహాకారం అందించిన వియత్నాం ప్రభుత్వానికి, ప్రజలకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కష్టకాలంలో ఇరుదేశాలు తమ సహయ,సహకారాలు కొనసాగించాలని ఇరు ప్రధానులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం భారత్,వియత్నాం రెండు యుఎన్ భద్రతా మండలిలో సభ్యులుగా ఉన్నాయనే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. 2022 నాటికి ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 50 సంవత్సరాలు పూర్తి అయ్యే సందర్భంలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ వియత్నాం ప్రధానికి సూచించారు. -
41 ఏళ్లుగా అడవిలోనే.. స్త్రీలంటే ఎవరో తెలియదు
హనోయి/వియాత్నం: కరోనా కారణంగా మనం కొద్ది రోజులపాటు ఇంటికి పరిమితం కావడానికి చాలా కష్టపడ్డం. చుట్టూ మనవారు నలుగరు ఉన్నప్పటికి.. బందీలుగా ఫీలయ్యాం. అలాంటిది ఓ వ్యక్తి దాదాపు 41 ఏళ్లుగా నాగరిక సమాజానికి దూరంగా అడవిలోనే ఉంటూ.. అక్కడ దొరికేవి తింటూ.. బతికాడు. ఊహ తెలిసిన నాటి నుంచి కేవలం అన్న, తండ్రిని మాత్రమే చూడటంతో అసలు లోకంలో ఆడవారు ఉంటారనే విషయమే అతడికి తెలియదు. ఇక వారిలో శృంగార వాంఛలు అసలు లేనేలేవు అంటే తప్పక ఆశ్చర్యం కలుగుతుంది. ప్రస్తుతం ఈ రియల్ టార్జాన్ లైఫ్ స్టోరీ నెట్టింటో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. వియాత్నంకు చెందిన హో వాన్ లాంగ్ చాలా చిన్నతనంలో అతడవిలోకి వెళ్లాడు. 1972నాటి వియాత్నం యుద్ధం వల్ల అతడి జీవితం ఇలా మారిపోయింది. ఈ యుద్ధంలో అతడి తల్లి, ఇద్దరు తోబుట్టువులు మరణించారు. హో వాన్ లాంగ్, అతడి తండ్రి, సోదరుడు మాత్రం యుద్ధ సమయంలో తప్పించుకుని అడవిలోకి వెళ్లారు. మనిషి కనిపించిన ప్రతి సారి వారు అడవిలో మరింత లోపలికి పయనం చేశారు. అలా నాగరిక సమాజానికి పూర్తిగా దూరం అయ్యారు. అక్కడే జీవిస్తూ.. అడవిలో దొరికే పండ్లు, తేనే, చిన్న చిన్న జంతువులను వేటాడి తింటూ కాలం గడిపారు. ఈ నలభై ఏళ్లలో ఈ ముగ్గురు తండ్రికొడుకులు కేవలం ఐదుగురు మానవులను మాత్రమే చూశారు. ఎలా వెలుగులోకి వచ్చారంటే.. ఇలా అడవిలో జీవనం సాగిస్తున్న వీరిని 2015లో అల్వారో సెరెజో అనే ఫోటోగ్రాఫర్ గుర్తించి.. అడవి నుంచి వారిని బయటకు తీసుకువచ్చాడు. అక్కడే సమీపంలో ఉన్న ఓ గ్రామంలో వారిని ఉంచాడు. ఈ సందర్భంగా అల్వారో మాట్లాడుతూ.. ‘‘మనుషులను చూసిన ప్రతి సారి వీరు అడవిలో మరింత దూరం వెళ్లేవారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటేంటే వీరికి లోకంలో స్త్రీలు ఉంటారని తెలియదు. ఇప్పుడిప్పుడే వారిని గుర్తించగలుగుతున్నారు. కానీ నేటికి స్త్రీ, పురుషుల మధ్య తేడా ఏంటో వీరికి తెలియదు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే వీరిలో శృంగారవాంఛలు అసలు లేవు. ఇక హోవాన్ లాంగ్ తండ్రి నేటికి కూడా వియాత్నం యుద్ధం ముగియలేదు అనుకుంటున్నాడు’’ అన్నాడు. మంచి, చెడు తేడా తెలియదు.. ‘‘హో వాన్ లాంగ్‌కు మంచి, చెడు తేడా తెలియదు. వేటాడటంలో దిట్టం. ఎవరినైనా కొట్టమంటే.. చచ్చేవరకు కొడతాడు. చంపమని ఆదేశిస్తే.. వెంటాడి వేటాడుతాడు. తప్ప మంచి, చెడు తెలియదు. ఎందుకంటే అతడి ఏళ్లుగా అడవిలో ఉండటం వల్ల హోవాన్ లాంగ్ మెదడు చిన్న పిల్లల మాదిరిగానే ఉంటుంది. ఇప్పుడిప్పిడే హో వాన్ లాంగ్ నాగరిక జీవితానికి అలవాటు పడుతున్నాడు. తొలి ఏడాది వీరిని పలు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఇక్కడి వాతావరణంలో ఉండే బాక్టీరియా, వైరస్ల దాడికి తట్టుకోలేకపోయారు. ఇక్కడి రణగొణ ధ్వనులు వీరికి నచ్చడం లేదు. కాకపోతే జంతువులు మనుషులతో స్నేహంగా ఉండటం వారిని ఆశ్చర్యానకి గురి చేస్తుంది’’ అన్నాడు అల్వారో. చదవండి: 16 ఏళ్లుగా భార్య శవంతో బెడ్‌పై... -
Viral Video: ప్రేమతో... మీ నాన్న ... గిఫ్ట్‌గా లంబోర్గిని
హనోయి(వియత్నాం): కొడుకు అడిగిందే ఆలస్యం అతని కోసం లంబోర్గిని కారును గిఫ్టుగా ఇచ్చాడు తండ్రి. అయితే ఆ కొడుకు వయసు కేవలం ఐదేళ్లు. అందుకుని కోట్లు పోసి షోరూంలో కారును కొనలేదు, 65 రోజులు శ్రమించి కొడుక్కి తగ్గట్టుగా వుడెన్ కారుతు తయారు చేసి తండ్రి తన ప్రేమను చాటుకున్నాడు. కొడుకు అడిగితే వియత్నాంకి చెందిన ట్రూంగ్ వాన్ డోవ్ కార్పెంటర్ పనిలో దిట్ట. అదే అతని జీవనాధారం. కార్పెంటర్ పనితో పాటు సాంకేతిక అంశాలపైనా తనకు పట్టుంది. దీంతో వడ్రంగి పనికి సాంకేతిక జోడించి కొత్తకొత్త డిజైన్లు చేస్తుండేవాడు. ఒకరోజు టీవీలో లంబోర్గిని కారును చూసి, అది కావాలని అడిగాడు అతని కొడుకు. 65 రోజుల శ్రమ కుమారుడు అడగటమే ఆలస్యం రంగంలోకి దిగిపోయాడు ట్రూంగ్ వాన్ డోవ్. వెంటనే కారు తయారీకి అవసరమైన వస్తువులు తెచ్చేశాడు. మొదటగా కారు బేస్‌ను సిద్ధం చేశారు. ఆ తర్వాత చక్రాలు తిరిగేందుకు అనువుగా కారు బాడీని రెడీ చేశాడు. ఆ తర్వాత అచ్చం లంబోర్గిని సియాన్ రోస్టర్ తరహాలో ముందు, వెనుక భాగంలో డిజైన్ సిద్ధం చేశాడు. కారు కదిలేందుకు వీలుగా బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్లు అమర్చాడు. దీంతో ఈ బుల్లి లంబోర్గిని కారు గంటలకు 25 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదని ట్రూంగ్ చెబుతున్నాడు. ఫిదా కారు తయారీకి సంబంధించిన వీడియోతో పాటు కారులో ట్రూంగ్ అతని కొడుకు వియత్నాం విధుల్లో చక్కర్లు కొట్టిన వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు ట్రూంగ్. కొడుకుపై అతని ప్రేమకు, కొడుకు ముచ్చట తీర్చేందుకు అతడు పడ్డ శ్రమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
Viral: వామ్మో.. పది అడుగుల పామును ఇట్టే పట్టేసింది!
హనోయి(వియత్నాం): మామూలుగా పాము కనిపిస్తే ఏం చేస్తాం? దూరంగా పరిగెడుతాం..సాధారణంగా పామును చూస్తే ఎవరికైనా భయమే.. కొంతమంది అయితే పామును చూడటంతోనే భయంతో వణికిపోతారు. ఇక కళ్ల ముందే పాము కనిపించిందంటే వాళ్లకు గుండె ఆగినంత పనవుతుంది. కానీ ఇక్కడ ఇదిగో ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న వియత్నాం లేడీ మాత్రం 10 అడుగుల పామును ఇట్టే పట్టేసింది. అంతటితో అయిపోలేదండోయ్. పాము ఆమె శరీరం చుట్టూ చుట్టుకుంటున్నా అదరలేదు..బెదరలేదు. ఆ పామును అట్టే పట్టుకుని దూరంగా నడుచుకుంటూ వెళ్తుంది. ఈ సంఘటన మే 21, 2021 న వియత్నాంలో జరిగింది. పామును పట్టుకునే మహిళ ముఖం కనిపించడం లేదు గానీ, ఆమె చేసిన సాహసం చూసిన నెటిజన్లు నోళ్లు వెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ...‘‘ నేను పాములను ప్రేమిస్తాను. ఇలాంటి సాహసం చేయాలనుకుంటున్నాను. కానీ నాకు ఇంకా అందుకు కావాల్సినంత ధైర్యం లేదు. ” అంటూ కామెంట్ చేశాడు. ఇక మరో నెటిజన్ “ఓ! నేను ఎప్పటికీ చేయలేను!! ” అంటూ రాసుకొచ్చారు. (చదవండి: వయసు డెబ్బై ఆరు.. ఈ విషయంలో యమ హుషారు!) -
మరోముప్పు.. కరోనా హైబ్రిడ్
వెబ్‌డెస్క్: కరోనా ముప్పు ప్రపంచాన్ని ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. ఇప్పటికే కరోనా వేరియంట్స్‌తో అన్ని దేశాలు ఇబ్బందులు పడుతుంటే..... కొత్తగా కరోనా హైబ్రిడ్ రకం వెలుగు చూసింది. గత వేరియంట్లను మించి ప్రమాదకరంగా ఈ హైబ్రిడ్ రకం విస్తరిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వియత్నాంలో సంకర కరోనా సాధారణంగా వైరస్లు ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూనే ఉంటాయి. మొదట వచ్చిన వైరస్‌లతో పోల్చితే హాని చేయడంలో మార్పు చెందిన వైరస్ వేరియంట్లు చాలా ప్రమాదకరం. అయితే తాజాగా ఇలా రూపు మార్చుకున్న రెండు ప్రమాదకర వేరియంట్ల నుంచి అత్యంత ప్రమాదకరమైన సంకర జాతి కరోనా వైరస్ పుట్టుకొచ్చింది. వియత్నాంలో సంకర కరోనా మ్యూటెంట్ ( హైబ్రిడ్ మ్యూటెంట్)ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఇండియాలో, బ్రిటన్లలో విపత్తును సృష్టించిన కరోనా మ్యూటెంట్ల లక్షణాలతో ఈ కొత్త హైబ్రిడ్ వేరియంట్ పుట్టుకొచ్చినట్టు వియత్నాం హెల్త్ మినిష్టర్ న్యూయెన్ థాన్ ప్రకటించారు. పాత వేరియంట్లను మించి వియత్నాం దేశాన్ని ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ చుట్టేస్తోంది. దేశంలో ఉన్న 63 నగరాల్లో 31 నగరాలు కరోనా కోరల్లో చిక్కుకున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగం కేసులు ఈ 31 నగరాల నుంచే వస్తున్నాయి. దీంతో ఇక్కడ కరోనా బారిన పడ్డ రోగుల నుంచి తీసుకున్న శాంపిల్స్ పరిశీలించగా.... ఇండియా, బ్రిటన్లలో వెలుగు చూసిన కరోనా వేరియంట్ లక్షణాలతో కొత్త హైబ్రిడ్ వేరియంట్ పుట్టుకొచ్చినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్ పూర్వపు మ్యూటెంట్లను మించిన వేగంతో త్వరగా వ్యాపిస్తోందని, గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరి సోకే లక్షణం ఈ హైబ్రిడ్‌కు రకానికి ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియా, బ్రిటన్లలో వెలుగు చూసిన వేరియంట్ల కంటే ఇది ప్రాణాలకు ఎక్కువ ముప్పు తెస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ హైబ్రిడ్‌వేరియంట్‌కి సంబంధించిన సమాచారం త్వరలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేస్తామని వియత్నాం అంటోంది. వియత్నాంలో వణుకు ఇప్పటికే వియత్నాంలో ఏడు రకాల వేరియంట్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ కరోనా వేరియంట్ల వ్యాప్తిని గతంలో అక్కడి ప్రభుత్వం కట్టడి చేసింది. కానీ హైబ్రిడ్ రకం మ్యూటెంట్‌కు అడ్డకట్ట వేయడం కష్టంగా మారింది. ఇప్పటికే ఆ దేశంలో 6,396 మంది కరోనా బారిన పడగా 47 మంది మరణించారు. దేశంలో రోజురోజుకి హైబ్రిడ్ రకం ప్రమాదకరంగా విస్తరిస్తుండటంతో వియత్నాం ప్రజల వెన్నులో వణుకు పుడుతోంది. -
16 ఏళ్లుగా భార్య శవంతో బెడ్‌పై..
సాక్షి,న్యూఢిల్లీ: భార్యపై ప్రేమతో ‘తాజ్‌మహల్’ లాంటి ప్రేమ సౌధాన్ని నిర్మించలేదు. గుడి కట్టి దేవతనూ చేయలేదు. కానీ తనకు శాశ్వతంగా దూరమైన భార్య శవంతోనే 16 ఏళ్లుగా కాలం గడుపుతున్న కథనం ఒకటి తాజాగా వెలుగు చూసింది. ఈ అభినవ షాజహాన్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. వివరాలను పరిశీలిస్తే.. వియత్నాంకు చెందిన లీవాన్, 1975లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఏడుగురు పిల్లలు ఉన్నారు. అయితే 2003లో అకస్మాత్తుగా వాన్ భార్య చనిపోయింది. దీంతో భార్యపై అమితమైన ప్రేమను చంపుకోలేక, భార్యనువిడిచి ఉండలేక ఎవరూ చేయని సాహసానికి పూనుకున్నాడు. రోజూ శ్మశానానికి వెళ్లి ఆమె సమాధిపైనే నిద్రించేవాడు. అలా నెలలు తరబడి అక్కడే గడిపేవాడు. ఒక రోజు వర్షం కురవడంతో ఆందోళన చెందిన వాన్, ఏం చేయాలా అని ఆలోచించాడు. భార్యకు దగ్గరగా ఉండటానికి ఏం చేయాలా తపన పడ్డాడు. ఆమె సమాధి పక్కన ఒక సొరంగం తవ్వి, అక్కడే ఆమె పక్కనే పడుకోవచ్చని అదే ఉత్తమమైన మార్గం అని నిర్ణయించు కున్నాడు. అయితే ఈ నిర్ణయాన్ని వాన్ సంతానం తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ అతని మనసు శాంతించలేదు.. భార్యపై ఉన్న ప్రేమ ఏమాత్రం చావలేదు. అందుకే రాత్రికి రాత్రి భార్య సమాధిని తవ్వి, అవశేషాలన్నింటినీ ఇంటికి తెచ్చేసుకున్నాడు. అయితే కుళ్లి, పాడైపోయిన స్థితిలో ఉన్న భార్య అస్థికలను భద్రంగా ఎలా దాచాలా అని మధనపడ్డాడు. ఇక్కడే అతని బుర్రలో మరో ఆలోచన వచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ పారీస్, సిమెంటు, జిగురు, ఇసుకల మిశ్రమంతో ఒక మహిళ బొమ్మను తయారు చేసి, అందులో తన భార్య అస్థికలను పొందికగా అమర్చాడు. అలా ఆ బొమ్మను కాదు కాదు.. తన భార్యను తన పడకగదిలో పెట్టుకుని నిశ్చింతగా నిద్రపోతూ కాలం వెళ్లదీస్తున్నాడు. -
ఇంటర్వ్యూలలో ఫెయిల్.. బాధతో 9 ప్లాస్టిక్ సర్జరీలు
హానోయ్ : జాబ్ ఇంటర్వ్యూలలో విఫలమవ్వటానికి తన ముఖమే కారణమని భావించిన ఓ యువకుడు ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించాడు. దాదాపు 9 సర్జరీలతో అందంగా తయారై అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. ఇంతకీ సంగతేటంటే.. వియత్నాంకు చెందిన 26 ఏళ్ల డూ కూయెన్ అనే యువకుడు జాబ్ ఇంటర్వ్యూలకు వెళ్లిన సమయంలో ఘోర అవమానాలకు గురయ్యాడు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు అతడి ముఖాన్ని చూసి గేలి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన డూకు తన ముఖంపై అసహ్యం వేసింది. ఎలాగైనా ముఖాన్ని మార్చుకోవాలని అనుకున్నాడు. మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేసి సంపాదించిన దాదాపు 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 9 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడు. సర్జరీల తర్వాత అతడి రూపు రేఖలు పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా.. అందంగా తయారయ్యాయి. అతడు తన మునుపటి, తర్వాతి ఫొటోను పక్కపక్కన పెట్టి టిక్‌టాక్‌లో షేర్ చేయగా ఎవరూ గుర్తు పట్టలేకపోయారు. ఆ రెండు ఫొటోలు డూవని తెలిసిన తర్వాత ‘‘అది నువ్వేనా?!’’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్లాస్టిక్ సర్జరీల తర్వాత మొదటి సారి ఇంటికి వచ్చినపుడు కుటుంబసభ్యులు కూడా అతడ్ని గుర్తుపట్టలేకపోయారు. దీనిపై డూ కూయెన్ మాట్లాడుతూ.. ‘‘ ఎల్లప్పుడూ ధృడ చిత్తంతో ఉండండి. మిమ్మల్ని కాన్ఫిడెంట్‌గా ఉంచే అందంకోసం అన్వేషించండి. నా దృష్టిలో అందం అంటే.. అద్దంలో మనల్ని మనం చూసుకున్నపుడు సంతృప్తిగా.. కాన్ఫిడెంట్‌గా ఉండాలి’’ అని చెప్పాడు. చదవండి : గుర్రం అంటే ఆయనకు ప్రాణం.. అందుకే.. వైరల్ : నీ టైం బాగుంది ఇంపాల -
ఇలాంటి క్యాచ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్
హనోయి: క్యాచ్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది క్రికెట్. బ్యాట్స్‌మెన్ బాదిన బాల్ని క్యాచ్ పట్టడం కోసం మిగతా ఆటగాళ్లంతా దీక్షగా ఎదురు చూస్తుంటారు. అయితే క్రికెట్లో క్యాచ్ పడితే ఔట్ అవుతారు.. కానీ ఇక్కడ ఓ వ్యక్తి పట్టిన క్యాచ్ ఓ ప్రాణాన్ని నిలబెట్టింది. ప్రస్తుతం అతడిని అందరు దేవుడివని పొగుడుతున్నారు. ఇంతకు ఆ వ్యక్తి పట్టిన క్యాచ్ ఏంటి.. అసలు ఏం జరిగింది అంటే ఇది చదవాల్సిందే.. వియాత్నంకు చెందిన న్గుయెన్ న్గోక్ మన్హ్(31) డెలివరీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఆదివారం రాజధాని హనోయ్‌లో ఓ ప్యాకేజీని డెలివరీ చేయడం కోసం ట్రక్కులో కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో మన్హ్కు చిన్నారి ఏడుపు వినిపించింది. ఎక్కడో పిల్లలు కోపంగా అరుస్తున్నారని భావించాడు మన్హ్. ఇంతలో చుట్టు పక్కల ఉన్న వారు కూడా కేకలు వేయడంతో ఏం జరిగిందోనని కిటికి తెరిచి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు మన్హ్. రెండేళ్ల చిన్నారి ఒకరు 12వ అంతస్తు నుంచి కిందకు పడిపోవడం గమనించాడు. బాలిక అపార్ట్మెంట్ పక్కనే ఉన్న గోడ మీద పడి వేలాడుతూ ఉంది. ఏ మాత్రం ఆలస్యం అయినా చిన్నారి కింద పడిపోయేది. ఈ లోపు చిన్నారి తండ్రి ఆమెను కాపాడటం కోసం రంగంలోకి దిగాడు. అపార్టమెంట్ పక్కన ఉన్న గోడ దూకి బిడ్డను కాపాడాలని ప్రయత్నించాడు. అయితే అదృష్టం కొద్ది బాలిక వెళాడుతున్న గోడ పక్కనే మన్హ్ ట్రక్కులో కూర్చొని ఉన్నాడు. ఒక్కసారిగా అక్కడ జరగబోయే దారుణాన్ని ఊహించుకుని వెంటనే అప్రమత్తమయ్యాడు. ఎంతో చాకచక్యంగా చిన్నారిని ఒడిసి పట్టుకున్నాడు. ఆ తర్వాత బాలికను తల్లిదండ్రులకు అప్పగించాడు. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు కానీ నడుము కొంచెం పక్కకు జరిగిందని తెలిపారు వైద్యులు. ప్రస్తుతం చిన్నారికి వైద్యం అందిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. హీరో, సూపర్ మ్యాన్ అంటూ మన్హ్ని ప్రశంసిస్తున్నారు వియాత్నం ప్రజలు, నెటిజనులు. సదరు చిన్నారి తన ఇంటి బాల్కనీలో ఆడుకుంటూ పట్టుతప్పి కింద పడిపోయింది. అదృష్టం బాగుండటంతో ప్రాణాపాయం తప్పింది. 😱¡HEROICA ATRAPADA!👏 Un repartidor le salvó la vida a una niña de 3 años que cayó del piso 12 de un edificio en Vietnam. La nena sufrió fracturas en la pierna y en los brazos, pero está viva gracias a la heroica acción de Nguyen Ngoc Manh❤️, quien sufrió un esguince.#VIRAL pic.twitter.com/eI03quT0IM — Unicanal (@Unicanal) March 1, 2021 చదవండి: 17 ఏళ్లకే ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు, కానీ ఇప్పుడు ఆ క్యాచ్ చూస్తే ఔరా అనాల్సిందే.. -
30కి పైగా దేశాల్లో కొత్త స్ట్రెయిన్
న్యూఢిల్లీ: 2020 చివర్లో యూకేలో గుర్తించిన కరోనా కొత్త స్ట్రెయిన్ వేగంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. తాజాగా శనివారం వియత్నాంలో ఈ స్ట్రెయిన్‌ను గుర్తించారు. దాంతో తక్షణమే అంతర్జాతీయ విమాన రాకపోకలపై ఆ దేశం నిషేధం విధించింది. ఇప్పటివరకు దాదాపు 30కి పైగా దేశాల్లో ఈ కొత్త వైరస్ ప్రకంపనలను సృష్టిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కారణంగా.. ఈ వైరస్‌పై అత్యంత అప్రమత్తత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఈ స్ట్రెయిన్ కారణంగా యూకేలో కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం, దాంతో, అక్కడ కఠిన ఆంక్షలను అమలు చేయడం తెలిసిందే. అమెరికాలోనూ దాదాపు 3 రాష్ట్రాల్లో ఈ స్ట్రెయిన్‌ను గుర్తించారు. అది మరిన్ని రాష్ట్రాలకు విస్తరించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ వైరస్ స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతుందే కానీ, గత వైరస్ కన్నా ఎక్కువ ప్రాణాంతకం కాదని వైద్యులు చెబుతున్నారు. అలాగే, ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన, త్వరలో మార్కెట్లోకి రానున్న టీకాలు ఈ వైరస్‌పై కూడా సమర్ధవంతంగా పనిచేస్తాయని చెబుతున్నారు. వైరస్‌లో జన్యు పరివర్తనాలు సహజమేనని వివరిస్తున్నారు. -
17 ఏళ్లకే ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు, కానీ ఇప్పుడు
తైహీ కొబయాషి... జపాన్ యువతకు ఆదర్శం. పాఠశాలకు డ్రాపౌట్ అయిన కారణంగా తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో బయటకు వచ్చిన అతడు.. ఎన్నో కష్టనష్టాలకోర్చి ఓ స్టార్టప్‌ను స్థాపించాడు. ప్రస్తుతం ఆ కంపెనీ మార్కెట్ విలువ సుమారు 1 బిలియన్ డాలర్లు. టోక్యో వీధుల్లో గడ్డకట్టే చలిలో వణుకుతూ అనాధలా బతికిన నాటి నుంచి నేడు సంపన్న వ్యక్తిగా, విజయవంతమైన వ్యాపారవేత్తగా అతడు ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి నుంచి కొబయాషికి సంగీతం అంటే ప్రాణం. మ్యూజిక్ నేర్చుకునేందుకు స్కూలు ఎగ్గొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా చదువును నిర్లక్ష్యం చేసిన కొబయాషి.. హైస్కూళ్లోనే డ్రాపౌట్ అయ్యాడు. ఉన్నత విద్యనభ్యసించి కొడుకు ప్రయోజకుడైతే చూడాలనుకున్న అతడి తల్లిదండ్రులు కొబయాషి తీరుతో ఎంతో బాధపడ్డారు. వీలైనంతగా ఖర్చులు తగ్గించుకుని అతడి చదువు కోసం పొదుపు చేసిన డబ్బుకు విలువ లేకుండా పోయిందని, కొబయాషి ఇకపై బాగుపడడు అనే బాధ వారిని వెంటాడింది. ఆ కోపంలోనే అతన్ని ఇంట్లో నుంచి గెంటేశారు. అలా 17 ఏళ్ల వయస్సులో కొబయాషి ఇల్లు విడిచాడు. టోక్యోలోని వీధులే అతడికి ఆశ్రయమిచ్చాయి. వానకు తడవడం, చలికి వణికకడం అతడికి అలవాటుగా మారాయి. అప్పుడు కార్డుబోర్డులే అతడికి దుప్పట్లు అయ్యాయి. అలా ఏడాదిన్నర పాటు ఏ దిక్కు లేక కాలం వెళ్లదీశాడు కొబయాషి. అయినప్పటికీ, సంగీతాన్ని మాత్రం వదల్లేదు. అలాంటి సమయంలో కొబయాషిలోని ప్రతిభను గుర్తించిన ఓ లైవ్ మ్యూజిక్ క్లబ్ మేనేజర్ అతడికి పిలిచి మరీ ఉద్యోగమిచ్చాడు. ఆరేళ్లపాటు కోబయాషి అక్కడే పనిచేశాడు. కానీ అదొక్కటే జీవితం కాదని అతనికి అర్థమైంది. సంగీతంతో ఒక్కటే కాదని, మంచి ఉద్యోగం అవసరమని నిర్ణయించుకున్నాడు. కోరుకున్నఉద్యోగం దొరికేంత వరకు నిలదొక్కుకోవడానికి ఆన్లైన్ మ్యూజిక్ రికార్డులతో కొంత డబ్బు పోగు చేసుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగ ప్రకటనల వేట మొదలుపెట్టాడు. అలా 2012లో వియత్నాం చేరుకున్నాడు. సరిగ్గా అప్పుడే అతడికి ఓ సువర్ణావకాశం వచ్చింది. ఎటువంటి అకడమిక్ అర్హతల అవసరం లేకుండానే ఓ కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందే వెసులుబాటు కల్పించింది. అందుకోసం ఆరు గంటల పరీక్ష.. మాథమెటికల్ స్కిల్స్‌తో పాటు లాజికల్ థింకింగ్, ఐక్యూ టెస్టు నిర్వహించగా.. కొబయాషి అన్నింటిలో పాసయ్యాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం. కానీ కొబయాషి ఆ ఉద్యోగంతోనే సరిపెట్టుకోలేదు.‘‘సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా మందే ఉంటారు. కానీ సరికొత్త బిజినెస్ మోడల్స్‌తో ముందుకు వెళ్లేవారు చాలా అరుదుగా ఉంటారనే ఆలోచనే అతనితో ఓ స్టార్టప్ స్థాపనకు దారి తీసింది. అక్కడే పనిచేసే మకాటో హిరాయి కూడా కొబయాషికి జతయ్యాడు. వారితో పాటు మరికొంత మంది. అంతాకలిసి 2013 మార్చిలో ఫ్రామ్గియా ఇన్కార్పొరేషన్ పేరిట స్టార్టప్ స్థాపించారు. తర్వాత దాని పేరును సన్ అస్టెరిస్క్గా మార్చారు. వియత్నాంలోని యువతకు పెద్దపీట వేశారు. స్టార్టప్‌లకు ఐడియాలు ఇవ్వడం, ఇప్పటికే నిలదొక్కుకున్న కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ పెరిగేలా చేయడం లక్ష్యంగా ఈ కంపెనీని స్థాపించారు. అందులో విజయవంతమయ్యారు. 70కి పైగా క్లైంట్లు ఉన్నారు. టోక్యో స్టాక్ ఎక్స్చేంజీలో కొబయాషీ కంపెనీ లిస్ట్ అయ్యింది. సెప్టెంబరు నాటికి దాని మార్కెట్ విలువ 1.4 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే ఆ తర్వాత కొన్ని ఒడిదొడుకులు ఎదురుకావడంతో ఇప్పుడు దాని విలువ 1 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఆ కంపెనీలో కొబయాషి వాటా 7.9 శాతం. విలువ 71 మిలియన్ డాలర్లు. ఇప్పుడు తనే ఆ కంపెనీ సీఈఓ. ఇప్పుడు అతని వయస్సు 37 ఏళ్లు. అలా ఓ స్థాయికి చేరుకున్న తర్వాత కొబయాషి 2019లో జపాన్‌కు చేరుకున్నాడు. అక్కడా తమ కంపెనీని విస్తరించాడు. ఇప్పుడు టోక్యో ఆఫీసులో 130 మంది ఉద్యోగులు, వియత్నాంలో 1300 ఉద్యోగులు ఉన్నారు. అతడి స్ఫూర్తితో ఇప్పుడు జపాన్‌లో చాలా మంది స్టార్టప్‌లు పెడుతున్నారు. ఇక బిజినెస్‌మెన్‌గా సక్సెస్ అయిన కొబయాషి తన తల్లిదండ్రులను కలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. కొబయాషి జీవితంలో అది పెద్దలోటు. ‘‘నాకప్పుడు అంతా నరకంలా అనిపించేది. కానీ వాటిని నేను అధిగమించాను. డ్రాపౌట్ అయిన నన్ను ఇక్కడి నుంచి వెళ్లిపో అన్నారు నా తల్లిదండ్రులు. నేను ఇల్లు వీడాను.. అంతే. నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేయాలనుకున్నాను. ఇప్పుడు అదే చేశాను. టోక్యోలోని షింజుకు, శిబుయా జిల్లాలోని వీధుల్లో గడిపాను. నిజానికి ఆ చలికి నేను చచ్చిపోయేవాడినే. ఎక్కడ చోటు దొరికితే అక్కడ నిద్రించేవాడిని’’అని కొబయాషి పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. అయితే ప్రతీసారీ అదృష్టం కలిసిరాదని, షేర్ మార్కెట్లో ఎత్తుపల్లాలు సహజం కాబట్టి అంతగా ఆనంద పడాల్సిన అవసరం లేదంటూ వ్యాపార ప్రత్యర్థులు హెచ్చరించినా తాను జీవితంలో ఇప్పటికే అతిపెద్ద కష్టాలు దాటి వచ్చానని, ఓటమి గురించి తానెప్పుడూ భయపడనని కొబయాషి ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. తన కంపెనీని టాప్‌లో నిలబెట్టడమే లక్ష్యమని అందుకోసం ఎంతకైనా శ్రమిస్తానని చెప్పుకొచ్చాడు. రిస్కు చేయడంలోనే అసలైన మజా ఉందని పేర్కొన్నాడు. -
రంగులు మారే వింతైన పాము
హనోయ్: అమెరికా, వియత్నాం శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఓ కొత్తరకం, వింతైన పామును కనుగొన్నారు. వియత్నాం అడువులు, కొండప్రాంతాల్లో బయోడైవర్సీటీపై పరిశోధనలు చేస్తున్న వారు హా జియాంగ్ ప్రావిన్స్‌లో రంగురంగుల ఆ పామును గుర్తించారు. వెలుతురులో దాని చర్మంపై ఉన్న పొలుసులు నీలంనుంచి ఆకుపచ్చకు రంగులు మారటం గమనించారు. చూసిన వెంటనే అది ఓ పామని గుర్తించలేకపోయారు. ఆ వింత పాముకు ‘అచలినస్ జుగోరమ్’ అని నామకరణం చేశారు. అంతేకాకుండా అది అత్యంత అరుదైన జాతికి చెందిందని తెలుసుకున్నారు. 2019లో దీన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లోని విషయాలను తాజాగా ‘కోపియా’ అనే జర్నల్‌లో మంగళవారం ప్రచురించారు. దీనిపై ఆరే మిల్లర్ అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ.. ‘‘ అది చాలా అద్భుత క్షణం. ఆ జీవి చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. చాలా ప్రత్యేకంగా.. నిజానికి అదేంటో చూసిన వెంటనే మేము తెలుసుకోలేకపోయాము’’ అని అన్నారు. -
‘కరోనా’ అంటే ఎందుకు భయం పోయింది?
లండన్: ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రాణాంతక కరోనా వైరస్ రెండో విడత దాడి కొనసాగుతోందని, తగిన ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే ప్రస్తుతానికున్న మార్గమని యూరప్ దేశాల ప్రభుత్వాలు మైకులు పట్టుకొని చెబుతున్నా ఆయా దేశాల ప్రజలు అంతగా పట్టించుకోవడం లేదు. బ్రిటన్‌లోనైతే రహస్య పార్టీలు, రేవ్ పార్టీలు జరుపుకుంటూనే ఉన్నారు. ఆరడుగుల దూరానికి అర్థం, స్వీయ నిర్బంధానికి నిర్వచనమే మారుపోయింది. ఇరుగు పొరుగు వారు కలసుకుంటూనే ఉన్నారు. పార్కుల వెంట, పబ్బుల వెంట తిరగుతూనే ఉన్నారు. ఎక్కువ మంది మాస్కులు కూడా ధరించడం లేదు. ఎందుకు..? బ్రిటన్ ప్రజల ఉద్దేశాలకు, వారి ప్రవర్తనకు మధ్య వ్యాత్యాసం ఉండడం వల్లనే కరోనా కట్టడికి క్రమక్షిణ తప్పుతోందని, దీన్ని ఆంగ్లంలో ‘ఇంటెన్షన్–బిహేవియర్ గ్యాప్’ అంటారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రజలు ముందు జాగ్రత్త హెచ్చరికలన్నీ పెడ చెవిన పెడుతున్నారన్న కారణంతో వదిలి పెట్టరాదు, పదే పదే పటిష్టంగా హెచ్చరికలు చేస్తుంటేనే ప్రజల ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఇందుకు మంచి ఉదాహరణ వియత్నాం ప్రభుత్వం. కరోనా జాగ్రత్తల పట్ల మంచి అవగాహన కల్పించడానికి అక్కడి ప్రభుత్వం అన్ని మాధ్యమాలను ఉపయోగించుకొని విస్తృతంగా ప్రచారం చేయడం కలసి వచ్చిందని, పర్యవసానంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గింది. మృతులు కూడా గణనీయంగా తగ్గాయి. (చదవండి: ప్రపంచానికి శనిలా పట్టుకుంది!) వియత్నాం ప్రచారంలో ఓ పాప్ సాంగ్ కూడా విస్తృతంగా తోడ్పడింది. ఈ విషయంలో జర్మనీ, న్యూజిలాండ్ దేశాలు కూడా విజయం సాధించడానికి వాటి పటిష్టమైన కమ్యూనికేషన్ల వ్యవస్తే కారణమని ‘పీఆర్ ప్రొఫెషనల్స్’ సర్వేలో తేలింది. ప్రజల మైండ్ సెట్ మారడానికి ‘కమ్యూనికేషన్’ అత్యంత ముఖ్యమైనదని మానసిక శాస్త్రవేత్తలు ఎప్పుడో తేల్చారు. రిస్క్ ఎక్కువగా ఉన్న విమానయానం, చమురు పరిశ్రమల్లో అప్రమత్తత, ముందస్తు జాగ్రత్తల గురించి ఎక్కువగా ప్రచారం చేయాల్సి ఉంటుంది. సింగపూర్ ప్రభుత్వం అక్కడి పౌరులందరికి ‘ఎలక్ట్రానిక్ ట్రేసింగ్ టోకెన్లు’ పంచింది. బ్రిటన్‌లో కూడా ఎన్హెచ్ఎస్, కోవిడ్–19 యాప్‌ను ప్రవేశపెట్టగా 1.86 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ఇంగ్లండ్, వేల్స్లో 30 శాతం ప్రజల వద్దనే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. కరోనా వైరస్ నుంచి పొంచి ఉన్న ముప్పు గురించి పదే పదే హెచ్చరించడం వల్ల ప్రయోజనం ఉండదని, అది ప్రజల హృదయాల్లో నాటుకునేలా సమాచారాన్ని తీసుకెళ్లడం, ప్రజలు తమ ప్రవర్తనను మార్చుకునేంతగా ఆకట్టుకోవడం అవసరమని కమ్యూనికేషన్ల నిపుణులు సూచిస్తున్నారు. (చదవండి: యూరప్‌లో థర్డ్ వేవ్) -
80 ఏళ్లుగా జుట్టు కత్తిరించలేదు..!
లాక్డౌన్ కాలంలో సెలూన్ షాపులు మూతపడిన నేపథ్యంలో కొంతమంది పురుషులు పెరిగిన జుట్టుతో చికాకు పడుతూ సొంతంగానే కటింగ్ చేసుకున్నారు. సెలబ్రిటీలు మొదలు సామాన్యుల వరకు చాలా మంది స్వయంగా క్షవరం చేసుకుని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు రిలీఫ్‌గా ఉందని, హెయిర్ కటింగ్ షాపులు ఇంకొన్నాళ్లు మూసి ఉంటే తమ పరిస్థితి ఏమయ్యేదోనంటూ కామెంట్లు చేశారు. అలాంటి వాళ్లు వియత్నాంకు చెందిన 92 ఏళ్ల గుయెన్ వాన్ చిన్ గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే దాదాపు 80 ఏళ్లుగా చిన్ ఒక్కసారి కూడా తన జుట్టును కత్తిరించుకోలేదు. దీంతో సుమారు ఐదు మీటర్ల పొడవు మేర పెరిగిన జుట్టుతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. మూడో తరగతి చదువుతున్న సమయంలోనే జీవితంలో ఎప్పుడూ హెయిర్‌కట్ చేయకూడదని నిశ్చయించుకున్నారట. అయితే చిన్ ఇలా చేయడం వెనుక ఓ బలమైన కారణం కూడా ఉందని చెబుతున్నారు. (చదవండి: కాలు చూపిస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు) ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఒకవేళ నేను నా జట్టు కత్తిరించుకుంటే చనిపోతానని నమ్ముతాను. అందుకే కనీసం ఒక్కసారి కూడా దువ్వెన ఉపయోగించలేదు. ముడివేసి కొప్పులా మార్చి దానిపై ఓ వస్త్రాన్ని చుడతాను. ఎల్లపుడూ పొడిగా, శుభ్రంగా ఉండేలా చూసుకుంటాను. చిన్నప్పటి నుంచి నా జుట్టు ఎంతో బలంగా, నల్లగా, ఒత్తుగా ఉండేది. అప్పుడు చక్కగా దువ్వుకొనేవాడిని. అయితే దేవుడి పిలుపు విన్న తర్వాత అంతా మారిపోయింది. జుట్టుకు, అమరత్వానికి మధ్య బలమైన సంబంధం ఉందని నేను నమ్ముతాను’’ అని రాయిటర్స్‌తో చెప్పుకొచ్చారు.(చదవండి: స్కిన్ ఎలర్జీ.. ఈ అమ్మాయి ఏం చేసిందంటే!) కాగా స్థానికంగా ప్రాచుర్యం పొందిన ‘కొకొనట్’ మత విశ్వాసాన్ని ఆచరిస్తున్నారు. 1963లో స్థాపించిన ఈ మతాచారం ‘దువా’పై ప్రస్తుతం వియత్నాంలో నిషేధం ఉంది. ఇక తాను కేవలం కొబ్బరికాయల వల్లే తమ మనుగడ కొనసాగిందని, వాటి కారణంగానే శారీకరంగా దృఢంగా ఉన్నానని ఈ మత స్థాపకులు బోధించినట్లు స్థానికులు చెప్పుకొంటారు. -
టన్ను బంగారంతో తళుకులు..
హనోయి : వెంటాడుతున్న మహమ్మారి.. ఆపై కఠిన ఆంక్షలు వీటన్నింటి మధ్య కస్టమర్లను ఆకర్షించేందుకు వ్యాపార సంస్థలు వినూత్న పోకడలతో ముందుకొస్తున్నాయి. కస్టమర్ దేవుళ్లను ఆకట్టుకునేందుకు మరికొందరు ఎంతటి ఖర్చుకైనా వెనుకాడటం లేదు. సుదీర్ఘ లాక్డౌన్ అనంతరం వియత్నాం రాజధాని హనోయిలో ఓ ఫైవ్‌స్టార్ హోటల్ సకల హంగులతో పునఃప్రారంభమైంది. అతిథులు, పర్యాటకులను ఆకర్షించేందుకు డాల్స్ హనోయి గోల్డెన్ లేక్ హోటల్ నిర్వాహకులు బాత్‌టబ్‌ల నుంచి బేసిన్ల వరకూ చివరికి టాయిలెట్లనూ బంగారు పూతతో పసిడిమయం చేశారు. హోటల్లో ఎటువైపు చూసినా స్వర్ణకాంతులు మెరిసేలా ఏర్పాట్లు చేశారు. మూడు నెలల లాక్డౌన్ అనంతరం వియత్నాంలో ఇప్పుడిప్పుడే పర్యాటకుల రాక మొదలవడంతో వారిని ఆకట్టుకునేందుకు ఈ హోటల్ అదనపు హంగులతో ముందుకొచ్చింది. సోవియట్ నాటి భవనాల పక్కన హు బిన్ గ్రూపుకు చెందిన ఈ హోటల్‌ను ప్రత్యేకంగా కనిపించేలా వన్నెలద్దారు. ప్రస్తుతం ప్రపంచంలోనే ఇలాంటి హోటల్ మరెక్కడా లేదని హు బిన్ గ్రూప్ చీఫ్, హోటల్అధిపతి నుయెన్ హు దుంగ్ చెప్పారు. ఎల్లో మెటల్ పూల్ హోటల్ పైకప్పుపై 24 కేరట్ల బంగారు పూతతో స్విమ్మింగ్‌పూల్ ప్రధాన ఆకర్షణ కాగా, అతిథుల రూంలు, బాత్రూమ్ గోడలు బాత్టబ్స్కూ బంగారు పూత ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. సిటీలోని ఇతర హోటల్స్ తరహాలోనే ఈ హోటల్లోనూ ఒక రాత్రికి 18,176 రూపాయలు వసూలు చేస్తారు. ఈ ఏర్పాట్లతో అతిథులు సైతం ఆశ్చర్యపోతున్నారు. లగ్జరీ అంటే ఏంటో ఈ హోటల్ తిరగరాసిందని, ఇతర లగ్జరీ హోటళ్లు సహజంగా టైల్స్‌కు మార్బుల్స్‌ను వాడుతుంటే ఈ హోటల్లో వాషింగ్ బేసిన్‌తో సహా అన్నీ బంగారుపూతతో మెరిసిపోతున్నాయని 62 ఏళ్ల ఓ అతిథి వాన్ తున్ అన్నారు. వాన్ కూడా ఓ హోటల్ అధినేత కావడం కొసమెరుపు. టన్ను బంగారంతో తళుకులు హోటల్ మొత్తం బంగారుపూత కోసం టన్ను బంగారాన్ని వాడామని హోటల్ అధిపతి హు దుంగ్ అన్నారు. వియత్నాం యుద్ధంలో పాల్గొన్న దుంగ్ ఆపై ట్యాక్సీ డ్రైవర్‌గానూ పనిచేశారు. నిర్మాణ, రియల్ఎస్టేట్ రంగంలో భారీగా సంపాదించిన దుంగ్ ఆతిథ్య రంగంలోనూ అదృష్టం పరీక్షించుకున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించకుంటే ఈ హోటల్ మొత్తం అంతర్జాతీయ అతిథులతో నిండిపోయేదని ఆయన చెప్పుకొచ్చారు. చదవండి : లాక్డౌన్; ఆగిన బతుకు బండి -
హంపి పరాజయం
చైన్నై: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల స్పీడ్ చెస్ చాంపియన్ షిప్లో భారత టాప్ ప్లేయర్, ప్రస్తుత ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్ కోనేరు హంపికి చుక్కెదురైంది. తొలి రౌండ్లో ఆమె 4.5–5.5తో లీ తావో న్యూయెన్ ఫామ్ (వియత్నాం) చేతిలో ఓటమిపాలైంది. అయితే భారత యువ మహిళా గ్రాండ్ మాస్టర్ వైశాలి రమేశ్ బాబు సంచలన విజయాన్ని నమోదు చేసింది. బల్గేరియాకు చెందిన మాజీ ప్రపంచ చాంపియన్ ఆంటోయినెటే స్టెఫనోవాను 6–5తో ఓడించింది. కరోనా కారణంగా ఈ టోర్నీ ఆన్లైన్లో జరుగుతోంది. -
ప్రేక్షకులొచ్చారు...
హో చి మిన్ సిటీ (వియత్నాం): కరోనాతో ప్రపంచవ్యాప్తంగా క్రీడా కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. కొన్ని చోట్ల బహిరంగ ప్రదేశాల్లో ఆటగాళ్లు కనీసం ప్రాక్టీస్ చేసే పరిస్థితి కూడా లేదు. అక్కడక్కడ చిన్నా చితకా ఈవెంట్లు జరుగుతున్నప్పటికీ ప్రేక్షకుల్ని అనుమతించేంత ధైర్యం ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి. అయితే దేశవాళీ ఫుట్‌బాల్ లీగ్‌కు అభిమానులను ఆహ్వానించి వియత్నాం మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వి–లీగ్‌లో భాగంగా అక్కడ శుక్రవారం జరిగిన మూడు మ్యాచ్‌లను దాదాపు 30 వేల మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించారు. మైదానానికి తరలి వచ్చిన అభిమానులకు ముందు జాగ్రత్తగా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. అయితే వారు మాస్కులు ధరించకపోవడం విశేషం. ప్రేక్షకుల సమక్షంలో ఆడటం సంతోషంగా ఉందని, వారే ఆటకు ప్రత్యేకమని ‘హో చి మిన్’ జట్టు కోచ్ జంగ్ హు– సంగ్ అన్నారు. చైనాతో పొడవైన సరిహద్దు కలిగి ఉన్నప్పటికీ వియత్నాం కరోనాను సమర్థంగా నియంత్రించింది. 10 కోట్ల జనాభా కలిగిన వియత్నాంలో కేవలం 328 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కాగా ఒక్క మరణం కూడా సంభవించలేదని అధికారులు ధ్రువీకరించారు. శుక్రవారం మొత్తం మూడు మ్యాచ్‌లు జరగ్గా... రెండు ‘డ్రా’గా ముగిశాయి. మరో మ్యాచ్‌లో ఫలితం వచ్చింది. -
కరోనా: స్టేడియానికి 30,000 మంది
న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ కారణంగా క్రీడా లోకం పూర్తిగా స్తంభించిపోయింది. మార్చి చివరి వారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ జరగలేదు. అయితే ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కాస్త కొలుకొని క్రీడా కార్యకలాపాలను కొన్ని దేశాలు పునరుద్దరిస్తున్నాయి. అయితే కరోనా ప్రభావం తక్కువగా ఉన్న వియత్నాం అన్ని దేశాల కంటే వేగంగా భారీ సంఖ్యలో అభిమానులతో తొలి ఫుట్ బాల్ మ్యాచ్‌ను నిర్వహించింది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి దాదాపు 30,000 ఫుట్‌బాల్ ప్రేమికులు హాజరైనట్లు స్టేడియం అధికారులు తెలిపారు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌కు పెద్ద ఎత్తున అభిమానులు హాజరు కాగా ఎవరు కూడా భౌతిక దూరం పాటించలేదు. అధికారులు కూడా స్టేడియంలో అభిమానులు భౌతిక దూరం పాటించేలా ఎలాంటి మార్కింగ్‌లు కూడా ఏర్పాటు చేయనట్లు తెలుస్తోంది. (వేచి చూద్దాం!) అంతేకాకుండా ముఖానికి మాస్క్‌లు కూడా చాలా తక్కువ మంది మాత్రమే ధరించారు. అయితే మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులకు థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు, శానిటైజేషన్ చేసినట్లు స్టేడియం అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఓ ఫుట్‌బాల్ ప్రేమికుడు మాట్లాడుతూ..‘ఇన్ని రోజులు ఫుట్‌బాల్ మ్యాచ్ చూడకుండా ఉంటే పిచ్చెక్కిపోయింది. కరోనా భయం ఉంటే మ్యాచ్‌లు చూడటానికి రాకండి. అంతేకాని మ్యాచ్‌లు జరగకుండా అడ్డుకోకండి’ అంటూ పేర్కొన్నాడు. వియత్నాంలో ఇప్పటివరకు ఒక్క కరోనా మరణం సంభవించనప్పటికీ 328 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక త్వరలోనే ఇంగ్లండ్, స్పెయిన్ వంటి దేశాలు కూడా ఫుట్‌బాల్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే జర్మనీలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. (‘ధోని మాటకు చిర్రెత్తుకొచ్చింది’) -
కరోనాను తరిమికొట్టిన వియత్నాం
-
చిన్న దేశాలు.. పెద్ద విజయాలు
విజేతల్ని ఈ ప్రపంచం ఆరాధిస్తుంది. వారిని అనుసరించి, ఆ మార్గానే పయనించి తానూ గెలవాలని ఉవ్విళ్లూరుతుంది. సరిగ్గా అందుకే అందరూ ఇప్పుడు దక్షిణ కొరియా, వియత్నాంల వైపు చూస్తు న్నారు. చైనా దరిదాపుల్లోవుండి కూడా ఈ దేశాలు అక్కడినుంచి వచ్చిన మహమ్మారిని ఎలా కట్టడి చేశాయో... ఏం మంత్రం వేశాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటలీ.. స్పెయిన్... అమెరికా! కరోనా వైరస్ తాకిడికి అట్టుడికి పోతున్న దేశాలివి. ఒక్కో దేశంలో రోజుకు కొన్ని వందల మంది ప్రాణాలు గాల్లో కలసిపోతూంటే.. కొత్తగా గుర్తిస్తున్న కేసుల సంఖ్య వేలల్లో ఉంటోంది. గత ఏడాది చైనాలో పుట్టిన ఈ వైరస్ ఆశ్చర్యకరంగా ఇరుగుపొరుగున ఉన్న వియత్నాం, దక్షిణ కొరియాల్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఎందుకిలా ఆ దేశాలు చేసిన పనులేమిటి. ఇతర దేశాలు మరచింది ఏమిటి ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం... దక్షిణ కొరియా.. చైనాకు పక్కనే ఉంటుంది. జనాభా సుమారు ఐదు కోట్లు. చైనాలోని వూహాన్లో వ్యాధి ఉధృతంగా ఉన్న ఫిబ్రవరి నెలలో దక్షిణ కొరియాలోనూ కొన్ని వందల కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 29వ తేదీ ఒక్కరోజే దాదాపు 909 కేసులు బయటపడటంతో అక్కడ కూడా వైరస్ విజృంభిస్తుందని అందరూ ఊహించారు. కానీ ఆశ్చర్యకరంగా ఆ తరువాత దక్షిణ కొరియాలో కేసులు తగ్గుముఖం పట్టాయి. మార్చి ఒకటవ తేదీ 586 కేసులు నమోదు కాగా.. మార్చి 19 నాటికి ఈ సంఖ్య 158కి తగ్గిపోయింది. దేశం మొత్తాన్ని లాక్డౌన్ చేయకుండానే దక్షిణ కొరియా వైరస్ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోగలిగింది. ఈ విజయానికి చాలా కారణాలే ఉన్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది చాలా విస్తృత స్థాయిలో చేపట్టిన పరీక్షల గురించి. ఉన్న ఐదు కోట్ల జనాభాలో దక్షిణ కొరియా సుమారు 3.5 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించింది. ఇంకోలా చెప్పాలంటే ప్రతి పది లక్షల మందిలో 6,000 మందికి పరీక్షలు చేశారన్నమాట. ప్రపంచంలోనే ఈ స్థాయిలో ఎవరూ పరీక్షలు నిర్వహించలేదు. అగ్రరాజ్యం అమెరికా పది లక్షల మందిలో 74 మందికి మాత్రమే పరీక్షలు చేయగలిగిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసకోవచ్చు. పకడ్బందీగా పరీక్షలు చేపట్టడం మాత్రమే కాకుండా.. వ్యాధి బారిన పడ్డ వారిని హుటాహుటిన నిర్బంధంలో ఉంచేందుకు తగిన ఏర్పాట్లు చేయడం, వీరితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ వేగంగా గుర్తించడం కూడా కొరియా విజయానికి కారణాలయ్యాయి. ఐదువేలకు పైగా కోవిడ్ కేసులు ఉన్న షిన్ఛెనోజీ చర్చ్ ఆఫ్ జీసస్ సమావేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం కూడా ఆ దేశానికి కలిసివచ్చిందని చెప్పవచ్చు. ఈ చర్చి సమావేశాలను లక్ష్యంగా చేసుకుని పరీక్షలు చేయడం వల్ల తాము ఇతర ప్రాంతాల్లో పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం రాలేదని సియోల్ నేషనల్ యూనివర్సిటీలోని సాంక్రమిక వ్యాధుల నిపుణుడు ఓ మ్యుయాంగ్ డాన్ అంటున్నారు. మెర్స్ అనుభవం అక్కరకు వచ్చింది.. దక్షిణ కొరియాలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు 2013 నాటి మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్) అనుభవం బాగా ఉపయోగపడింది. 2015లో మధ్యప్రాచ్య దేశాల నుంచి తిరిగి వచ్చిన ఓ వ్యాపారవేత్త ద్వారా ఈ వైరస్ దక్షిణ కొరియాలోకి ప్రవేశించింది. వ్యాధిని గుర్తించే లోపు మూడు ఆసుపత్రుల్లో వేర్వరు లక్షణాలకు చికిత్స పొందిన ఈ వ్యాపారవేత్త ఆ క్రమంలో 186 మందికి వైరస్‌ను అంటించాడు. ఆసుపత్రి సిబ్బంది.. ఇతర కారణాల వల్ల ఆసుపత్రిలో చేరిన వారు సుమారు 36 మంది ప్రాణాలు కోల్పోయారు కూడా. ఈ సంఘటనల తరువాత మేల్కొన్న ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వ్యాధిగ్రస్తులను గుర్తించి, నిర్బంధంలో ఉంచడం మొదలుపెట్టింది. దీంతో వ్యాధి సుమారు 17 వేల మందికి సోకినా రెండు నెలల్లో అతితక్కువ మరణాలతో దక్షిణ కొరియా పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఈ అనుభవం మొత్తం ఇప్పుడు సార్స్–సీఓవీ2 కట్టడికి ఎంతో ఉపయోగపడుతోందని, మరీ ముఖ్యంగా ఆసుపత్రుల్లో వైరస్‌ను నియంత్రించేందుకు అక్కరకు వచ్చిందని అంటున్నారు ఆ దేశ వైద్య నిపుణులు. మెర్స్ వ్యాధి ప్రబలిన కాలంలో దక్షిణ కొరియా చేసిన ఒక చట్టం అవసరమైనప్పుడు ప్రజల మొబైల్‌ఫోన్, క్రెడిట్ కార్డు తదితర వివరాలను సేకరించేందుకు వెసులుబాటు కల్పించడంతో కోవిడ్ కష్టకాలంలోనూ ఆ చట్టం సాయంతో వ్యాధి బారిన పడ్డవారిని వేగంగా గుర్తించడం వీలైందని అంచనా. చైనాలో కరోనా భూతం బయటపడిన వెంటనే కొరియా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వేగంగా వ్యాధి నిర్ధారణకు అవసరమైన కిట్లను అభివృద్ధి చేయించింది. ఫిబ్రవరి ఏడవ తేదీ, తొలి కిట్‌ను ఆమోదించగా పదకొండు రోజుల తరువాత షిన్ఛెనోజీ చర్చ్ ఆఫ్ జీసస్ సమావేశాలకు హాజరైన ఓ మహిళకు వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆ వెంటనే అధికారులు సమావేశాలకు హాజరైన వారందరినీ గుర్తించి పరీక్షలు చేపట్టడంతో వ్యాధి ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా అడ్డుకున్నట్లు అయ్యింది. ఆరోగ్య సమస్యలు ఉన్న వారిలో కోవిడ్ లక్షణాలు బయటపడితే వారికి ఆసుపత్రుల్లో ప్రాధాన్యమివ్వడం ఓ మోస్తరు లక్షణాలు ఉన్న వారిని తాత్కాలిక ఆసుపత్రులు మార్చిన భవనాల్లో ఉంచి కనీస వైద్య సదుపాయం అందేలా చేయడం, కోలుకున్న వారిలో వైరస్ లేదని రెండుసార్లు నిర్ధారణ చేసుకున్న తరువాత మాత్రమే డిశ్చార్జ్ చేయడం వంటి ప్రణాళికబద్ధమైన చర్యలు దక్షిణ కొరియాను కరోనా మహమ్మారి బారి నుంచి ఈ రోజు వరకూ రక్షించాయని చెప్పాలి. వియత్నాంలో 148 కేసులు మాత్రమే... చైనాలో సుమారు 1100 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న దేశం వియత్నాం. జనసమ్మర్ధం ఎక్కువ. ప్రజా ఆరోగ్య వ్యవస్థ చాలా బలహీనం. అయినప్పటికీ ఈ దేశంలో మార్చి 26వ తేదీ వరకూ వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య కేవలం 148 మాత్రమే. జనవరి నెల ఆఖరులో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రభుత్వం కరోనా వైరస్‌పై యుద్ధానికి దిగుతున్నట్లు చేసిన ప్రకటనతో ఆ దేశం నిజంగా యుద్ధ ప్రాతిపదికన పనిచేసింది. ఈ మహమ్మారిపై పోరంటే.. శత్రువుతో పోరేనని అధ్యక్షుడు నూగూయెన్ షువాన్ ఫుక్ ఇచ్చిన పిలుపుతో కదిలిన ప్రభుత్వ యంత్రాంగం వేల మందిని ముందస్తు క్వారంటైన్లో ఉంచేసింది. మిలటరీ ఆధ్వర్యంలోని పలు కేంద్రాల్లో తాత్కాలిక ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసింది. దక్షిణ కొరియా మాదిరిగా లక్షల సంఖ్యలో పరీక్షలు జరిపేంత ఆర్థిక స్థోమత లేకపోయినా, సుమారు 80 లక్షల జనాభా ఉన్న హో చి మిన్ నగరంలో కేవలం 900 ఐసీయూ పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నా వియత్నాం అదరలేదు. బెదరలేదు. కఠినాతికఠినమైన క్వారంటైన్ నిబంధనలు రూపొందించి వాటి కచ్చితమైన అమలుతో సమస్యను ఎదుర్కొంది. చైనా కంటే చాలా ముందుగానే లాక్డౌన్ ప్రకటించడం, వైరస్ సోకిన వారికి సన్నిహితంగా ఉన్న వారిని వేగంగా గుర్తించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోగలిగింది. దేశం మొత్తమ్మీద కేవలం పది కరోనా కేసులు మాత్రమే నమోదైనా ఫిబ్రవరి 12వ తేదీ వియత్నాం హనోయి సమీపంలో సుమారు పదివేల మంది జనాభా ఉన్న గ్రామం మొత్తాన్ని మూడు వారాల స్వీయ నిర్బంధంలో ఉంచిందంటే ఆ దేశం పరిస్థితిని ఎలా అదుపు చేసిందనేది అర్థం చేసుకోవచ్చు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించేందుకు కూడా వియత్నాం ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికను అమల్లోకి తెచ్చింది. జర్మనీలాంటి దేశం వైరస్ బారిన పడ్డవారిని.. వారు ప్రత్యక్ష కాంటాక్ట్‌లను మాత్రమే గుర్తిస్తే వియత్నాం మరో నాలుగు అంచెల వరకూ కాంటాక్ట్‌లను గుర్తించింది. వీరందరి కదలికలపై నియంత్రణలు పెట్టడం, ఇతరులతో కాంటాక్ట్ పెట్టుకోవడంపై ఆంక్షలు విధించడంతో సమస్య చాలావరకూ అదుపులోకి వచ్చిందని అంచనా. కరోనా సమస్య ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే వారిని చాలా ముందుగానే 14 రోజుల క్వారంటైన్లో ఉంచడంతోపాటు విశ్వవిద్యాలయాలకు, పాఠశాలలన్నింటికీ సెలవులు తొందరగా ప్రకటించిన దేశమూ వియత్నామే. ఇంకోలా చెప్పాలంటే వియత్నాం ఇటలీ, స్పెయిన్, అమెరికా, చైనాల మాదిరిగా వైద్యం, టెక్నాలజీలపై ఎక్కువగా ఆధారపడకుండా.. తన బలమైన నిఘా వ్యవస్థలపై ఆధారపడి నియంత్రణలన్నింటినీ ఉక్కు సంకల్పంతో అమలు చేయడం ద్వారా గట్టెక్కిందని చెప్పాలి. -
కరోనా: కలకలం రేపిన వియత్నాం బృందం
సాక్షి, నల్లగొండ : నల్గొండలో వియత్నాం బృందం పర్యటన కలకలం రేపింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రంలో విదేశీయులు ఎక్కడ కనిపించినా వెంటనే అదుపులోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులకు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్లగొండ పర్యటనకు వచ్చిన 12 మంది వియత్నాం పౌరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైల్ ఖానా సమీపంలో ప్రార్ధన మందిరంలో గురువారం అర్ధరాత్రి 12 మంది పెద్దలు, ఇద్దరు చిన్నారుల గల వియత్నాం బృందం సంచరించటాన్ని గుర్తించారు. ఆ తరువాత వైద్యులు, అధికారుల సూచనలతో వారందరినీ హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. (ఓ కరోనా.. ఇది నీకు వినిపిస్తోందా?) కాగా వియత్నాంకు చెందిన వీరంతా భారత్ పర్యటనలో భాగంగా మార్చి 4న ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగారు. అక్కడి నుంచి ఈనెల 9న నాంపల్లి స్టేషన్‌కు చేరుకున్నారు. ఇద్దరు గైడ్లతో కలిపి మొత్తం 14 మంది అదే రోజున నల్లగొండలో దిగారు. అయితే స్థానికుల సమాచారం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు నల్లగొండకు వచ్చి 14 రోజులు అవుతోన్న నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని.. అయినా ముందు జాగ్రత్త కోసం గాంధీకి తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా కరీంనగర్లో పర్యటించిన ఇండోనేషియా బృందంలోని ఎనిమిది మందికి కరోనా పాజిటీవ్ అని తేలడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. దీంతో విదేశీయులు ఎక్కడా పర్యటించకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. -
మిరాకిల్: 15 క్యాన్ల బీరు తాగించి బతికించారు
ముల్లును ముల్లు తోనే తీయాలి అనే సామెత మనం వింటూ ఉంటాం. అలాంటి సామెతే ఒక వ్యక్తి వ్యవహారంలో జరిగింది. కేన్ల కొద్ది బీర్లను లాగించేసే అతడి శరీరంలో మిథనాల్ స్థాయి భయంకరంగా పెరిగింది. దీంతో ఏమి చేయాలో అర్ధం కానీ వైద్యులు ఇలా ముల్లును ముల్లు తోనే తీయాలి అన్నట్లుగా అతడి శరీరంలోకి 15 కేన్ల బీరును ఆ మందుబాబు పొట్టలోకి పంప్ చేశారు. వివరాల్లోకెళ్తే.. వియత్నాంలోని క్వాంగ్త్రికి చెందిన గువన్ వాన్ నహత్ అనే వ్యక్తి ఫుల్లుగా బీర్లు వేయడంతో ఒంట్లో మిథనాల్ స్థాయి భయంకరంగా పెరిగింది. కాలేయం పూర్తిగా దెబ్బతిన్నది. చదవండి: సోషల్ మీడియా స్టార్స్ దీంతో డాక్టర్లు అతడిని బతికించడానికి చివరి ఉపాయంగా ముల్లును ముల్లుతోనే తీయాలనే సూత్రాన్ని ఎంచుకున్నారు. 15 కేన్ల బీరును నహత్ పొట్టలోకి పంప్ చేశారు. బీరుతో విషతుల్యమైన కడుపులోని విషాన్ని బీరుతోనే తీసేయాలన్నది వారి ప్లాన్. కానీ ఇది చాలా ప్రమాదకరం. అయితే రోగిని కాపడడానికి మరో మార్గం లేక దాన్నే ఎంచుకున్నారు. బీరులో మిథనాల్‌తోపాటు ఇథనాల్ కూడా ఉంటుంది. మిథనాల్ ద్వారా కడుపులో ఏర్పాడే యాసిడ్‌ను ఇథనాల్ నియంత్రిస్తుంది. డాక్టర్లు దానిపై నమ్మకం పెట్టుకుని పంప్ చేశారు. మంత్రం ఫలించింది. నహత్ బతికి బయటపడ్డారు. చదవండి: సరదాగా చదరంగంలోకి వచ్చా..! -
బైక్‌పై స్నానం.. తిక్క కుదిరింది
సోషల్ మీడియాలో పాపులర్ అవడం కోసం కొందరు ఎంతకైనా బరితెగిస్తారు అనేదానికి ఈ వీడియో ఒక చక్కటి నిదర్శనం. మనం ఏం చేస్తున్నాం, మనం చేసే పనులతో తోటి వారికి ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అనే వాటి గురించి ఏ మాత్రం ఆలోచించకుండా చేసిన ఆ ఇద్దరిపై సభ్య సమాజం చీవాట్లు పెట్టింది. అంతేకాకుండా చట్ట పరంగా శిక్షకు గురయ్యారు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. దక్షిణ వియత్నాంలో ఓ ఇద్దరు వ్యక్తులు బైక్‌పై హెల్మెట్ లేకుండా అర్థనగ్నంగా ప్రయాణించారు. అదేవిధంగా తమతో తెచ్చుకున్న బకెట్ వాటర్‌తో బైక్‌పైనే స్నానం చేశారు. అంతేకాకుండా వారు చేసిన ఘనకార్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇది కాస్త నెట్టింట్లో వైరల్ అయింది. దీంతో వారిద్దరూ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన వారిపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పాపులారిటీ కోసం పరితపించే వారిని శిక్షించాలని కొందరు నెటిజన్లు కోరారు. ఇక వీరిద్దరు చేసిన పనికి దక్షిణ వియత్నాం పోలీసులకు కూడా చిర్రెత్తుకొచ్చింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా వారిపై భారీ జరిమానా విధించింది. అంతేకాకుండా ఇలాంటివి మరోసారి పునరావృతం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో ఆ బైక్ రైడర్ల తిక్క కుదిరిందని నెటిజన్లు పేర్కొంటున్నారు. -
బైక్‌పై స్నానం.. తిక్క కుదిరింది
-
సౌరభ్ వర్మదే టైటిల్
హో చి మిన్ సిటీ: వియాత్నం ఓపెన్ సూపర్ 100 టైటిల్‌ను భారత షట్లర్ సౌరభ్ వర్మ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో సౌరభ్ వర్మ 21-12, 17-21, 21-14 తేడాతో సన్ ఫి యింగ్(చైనా)పై గెలిచి విజేతగా నిలిచాడు. తొలి గేమ్‌ను సౌరభ్ వర్మ అవలీలగా గెలిస్తే.. రెండో గేమ్‌ను కోల్పోయాడు. ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన రెండో గేమ్‌లో వర్మ వెనుకబడి దాన్ని కోల్పోయాడు. ఆపై నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మళ్లీ టచ్‌లోకి వచ్చిన సౌరభ్ సుదీర్ఘ ర్యాలీలతో పాటు అద్భుతమైన స్మాష్‌లతో ఆకట్టుకున్నాడు. మూడో గేమ్ ఆరంభంలో ఇరువురు 6-6తో సమంగా నిలిచిన సమయంలో సౌరభ్ వర్మ విజృంభించి ఆడాడు. వరుసగా పాయింట్లు సాధిస్తూ సన్ ఫి యింగ్‌ను వెనక్కినెట్టాడు. ఈ క్రమంలోనే కడవరకూ తన ఆధిక్యాన్ని కాపాడుకున్న సౌరభ్ వర్మ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఫలితంగా వియాత్నం ఓపెన్‌ను చేజిక్కించుకున్నాడు. -
అక్కడ అమ్మాయిని పేరడిగితే అపార్థాలైపోతాయి..
అపరిచితురాలైన వియత్నామీ అమ్మాయిని ‘చితేన్ లాజీ?’ అని అడిగితే అపార్థాలైపోతాయి. ‘మీ పేరేమిటండీ’ అని ఈ మాటకు అర్థం. కావాలంటే అపరిచితురాలైన అబ్బాయిని ‘మీ పేరేమిటండీ? అని అడగొచ్చు. ఏమని అడగాలి వియత్నామీ భాషలో? ఆచార్య రాజారెడ్డిని అడగండి. ఇవనే కాదు, వియత్నాం భాష గురించి ఆయన ఎన్నెన్నో మంచి విషయాలు చెబుతారు. వియత్నాంలో మోటార్ బైక్‌లు ఎక్కువ. మన దగ్గరలా రోడ్లనిండా కార్లు కనిపించవు. ఎటు చూసినా బైకులే. అక్కడి మహిళలు కూడా బైక్‌ల మీదే బయటి పనులు చక్కబెట్టేస్తుంటారు. ఇక వియత్నామీలు ఇష్టంగా తినే నూడుల్ సూప్ ‘ఫో’ ఆ దేశపు జాతీయ ఆహారం అనే అనుకోవాలి. ‘ఫో’ను వండని, ‘ఫో’ ఉండని హోటళ్లు, రెస్టారెంట్లు ఉండనే ఉండవు. కాఫీ ఘుమఘుమలు ఏ వేళనైనా దేశమంతటా వ్యాపించి ఉంటాయి. బ్రెజిల్ తర్వాత కాఫీ ఎక్కువగా పండే దేశం కూడా ఇదే. ‘ఎగ్ కాఫీ’ వియత్నాం స్పెషల్. పర్యాటక కేంద్రాలైతే ఎంత రమణీయంగా ఉంటాయో పని గట్టుకుని చెప్పనక్కర్లేదు. ఆ కల్చర్, కట్టడాలు, ప్యారడైజ్ బీచ్‌లు ఆ దేశానికే ప్రత్యేకం. రెండు రోజుల క్రితమే ఇండియా టూరిజం వియత్నాం టూరిజంతో ‘టైఅప్’ అయింది కూడా. వియత్నామీ భాష, సంస్కృతులపై ఆచార్య రాజారెడ్డి ప్రసంగం (ఫైల్ ఫొటో) అయితే వీటన్నిటికన్నా విలక్షణమైనది వియత్నామీ భాష. ‘‘విలక్షణమైనదే కాదు, మధురమైనది కూడా’’ అంటారు ఆచార్య కోనాపల్లి రాజారెడ్డి. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ‘సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఫసిఫిక్’ విభాగానికి ఆయన ముఖ్య సలహాదారు. ఆయనకేమిటి వియత్నాంతో సంబంధం? సంబంధం కాదు. బంధం. భారతదేశంలో వియత్నాం భాష మీద పరిశోధన చేసిన ఏకైక వ్యక్తి రాజారెడ్డి! భారత ఆర్మీ అధికారులు వియత్నాంకు వెళ్లే ముందు ఎస్వీయూకు వచ్చి రాజారెడ్డి దగ్గర వియత్నాం భాషలో శిక్షణ పొందారంటే చూడండి. ఎస్వీయూలో చాలామంది బోధన బోధనేతర సిబ్బందికి కూడా ఆయన పెద్దన్నయ్య. రాజారెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళెం సమీపంలోని కోటూరుగ్రామంలో జన్మించారు. బంగారుపాళెంలో చదివారు. చిత్తూరులో బి.ఏ. డిగ్రీ. తర్వాత ఎస్వీయూ నుంచి హిస్టరీలో ఎం.ఏ. పట్టా. ఆ తర్వాత ఆచార్య వి.యం.రెడ్డి పర్యవేక్షణలో వియత్నాం భాషలో పరిశోధన. ఈ పరిశోధన కోసం వియత్నాంలో ఆయన చాలాకాలం గడిపారు. ఫ్రెంచ్ డిప్లొమాను, వియత్నమీజ్ లాంగ్వేజ్ డిప్లొమాలను కూడా పొందారు. వియత్నాంలో పరిశోధన చేస్తున్న రోజుల్లోనే ఇంటర్వ్యూ లేకుండా నేరుగా ప్రత్యేక మినహాయింపుతో ఎస్వీయూలో అధ్యాపకుడిగా చేరారు. ఎస్వీయూ ఇండోచైనా విభాగంలో అధ్యాపక వృత్తిని చేపట్టారు. ఆ తర్వాత ఆచార్యులుగా, సెంటర్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏసియా అండ్ పసిఫిక్ డైరెక్టరుగా, పాఠ్య ప్రణాళికా సంఘ అధ్యక్షులుగా ఉన్నారు. భారత విదేశాంగ విధానం, వియత్నాం ఆధ్యయనం వంటి ప్రత్యేకాంశాలపై ఎన్నో పరిశోధనలు చేశారు. వియత్నాంలో జరిగిన కొన్ని సమావేశాలకు భారత ప్రభుత్వ ప్రతినిధిగా హాజరయ్యారు. రాజారెడ్డి వల్ల ఎస్వీయూలోని ఆయన స్నేహితులైన అధ్యాపకులకు కాస్త వియత్నాం భాషతో పరిచయం ఏర్పడింది. మో...తాయ్...బా... అంటే ఒకటి...రెండు...మూడు. శతబ్ అంటే సైకిల్. అంగ్ తేన్ లాజీ అంటే మగవారిని మీ పేరేమి అని అడగడం... చితేన్ లాజీ అంటే ఆడవారిని మీ పేరేమి? అని అడగడం. ఇలాంటి చిన్న చిన్న పదాలను, వాక్యాలను ఆయన స్నేహితులు సరదాగా వల్లె వేస్తుంటారు. సెప్టెంబర్ 2 వియత్నాం నేషనల్ డే. ఆ దేశ స్వాతంత్య్ర దినం. ఆ సందర్భంగానే సంస్కృత ప్రాకృత భాషల రంగరింపుతో తీపెక్కిన వియత్నామీ భాష గురించీ, ఆ భాషాఫలాలను తెలుగులో నేల సాగు చేస్తున్న రాజిరెడ్డి గురించీ. – ఆచార్య పేటశ్రీ -
‘బికినీ’ ఎయిర్‌లైన్స్ బంపర్ ఆఫర్ రూ.9 కే టికెట్
సాక్షి, న్యూఢిల్లీ : వియత్నాంకు చెందిన వియత్ జెట్ విమానయాన సంస్థ భారతదేశంలోకి ఎంట్రీ ఇస్తోంది. బికినీ ఎయిర్‌లైన్స్‌గా పేరొందిన ఈ విమాన సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇండియా-వియత్నాం మధ్య డిసెంబరు నుంచి ప్రత్యక్ష విమాన సేవలను ప్రారంభించనున్నట్లు వియత్ జెట్ మంగళవారం తెలిపింది. డిసెంబర్ 6న ప్రారంభమయ్యే న్యూఢిల్లీ-హోచి మిన్ సిటీ మార్గంలో వారానికి నాలుగు రిటర్న్ విమానాలను నడుపుతామని తెలిపింది. హనోయి-ఢిల్లీ మార్గం డిసెంబర్ 7 నుంచి వారానికి మూడు రిటర్న్ విమానాలను నడుపుతామని సంస్థ వెల్లడించింది. టికెట్ల ప్రారంభ ధర రూ. 9 అంతేకాదు మరో బంపర్ ఆఫర్ కూడా ఉంది. త్రి గోల్డెన్ డేస్ పేరుతో స్పెషల్ ప్రమోషన్ సేల్ నిర్వహిస్తోంది. ఆగస్టు 20-22వరకు రూ. 9 ప్రారంభ ధరతో "సూపర్-సేవింగ్ టిక్కెట్లను" అందిస్తోంది. విస్తరిస్తున్న నెట్‌వర్క్‌లో భారతదేశం తమ ప్రాధాన్యత మార్కెట్లలో ఒకటిగా ఉందని వియత్జెట్ ఉపాధ్యక్షుడు న్యూమెన్ తన్ సన్ తెలిపారు. కాగా వియత్జెట్ డిసెంబర్ 2011 లో పనిచేయడం ప్రారంభించింది. ఈ సంస్థకు చెందిన కొన్ని విమానాలలో సిబ్బంది బికినీలు ధరించి ఉంటారు. అంతేకాదు, ఏటా విమానయాన సంస్థ విడుదలచేసే క్యాలెండర్లో కూడా విమానంలో పనిచేసే అమ్మాయిలు బికినీల్లో ఉన్న ఫొటోలే దర్శనమిస్తాయి. మరోవైపు చైనాలో జరిగిన ఆసియా కప్‌పోటీలకు వియత్నాం అండర్ -23 ఫుట్‌బాల్ జట్టు ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో 'బికినీలు ధరించిన మోడల్స్' ఉన్న కారణంగా సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ వియత్నాం (సిఎవి) జనవరి 2018 లో వియత్ జెట్‌కు జరిమానా కూడా విధించింది. -
‘శిఖరాగ్ర’ వైఫల్యం
మొండి వైఖరిని ప్రదర్శించే అలవాటున్న ఇద్దరు దేశాధినేతలు శాంతి చర్చలకు సిద్ధపడినప్పుడు ఆ చర్చల వల్ల అద్భుతాలేవో జరుగుతాయని ఎవరూ ఆశించరు. అందరూ అనుకున్నట్టే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ల మధ్య వియత్నాం రాజ ధాని హనోయ్‌లో బుధ, గురువారాల్లో జరిగిన రెండురోజుల శిఖరాగ్ర సదస్సు ఒప్పందాలేమీ లేకుండానే ముగిశాయి. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని ట్రంప్ చెప్పినా, కిమ్‌వైపు నుంచి అటువంటి అభిప్రాయం వినబడలేదు. వాస్తవానికి అధినేతలిద్దరూ చర్చలు ముగించాక కలిసి భోజనం చేసి, ఆ తర్వాత ఒప్పందంపై అందరి సమక్షంలో సంతకాలు చేయాల్సి ఉంది. కానీ భేటీ రెండు గంటల్లోపే అర్ధంతరంగా ముగిసింది. అసలు ఈ శిఖరాగ్ర సదస్సుకు హనోయ్‌ను ఎంపిక చేయడంలో అమెరికాకు ఉన్న ఉద్దేశం వేరు...దాన్ని కిమ్ అవగాహన చేసుకున్న తీరు వేరు. ఒకప్పుడు తమను బద్ధశత్రువుగా పరిగణించిన కమ్యూనిస్టు వియత్నాం, తాము చెప్పినట్టు వినడం మొదలెట్టాక ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో ప్రత్యక్షంగా చూపాలని ట్రంప్ భావించారు. కానీ తమపై యుద్ధభేరి మోగించి దురాక్రమించడానికి ప్రయత్నించిన అమెరికాను తుదికంటా ఎదుర్కొని విజయం సాధించిన వియత్నాంను మాత్రమే కిమ్ చూడదల్చుకున్నట్టు న్నారు. అయితే ఈ శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావాలని నిజంగా ఆశిస్తే అమెరికా చేయాల్సిం దెంతో ఉంది. ముఖ్యంగా అది తన సహజసిద్ధమైన పెత్తందారీ పోకడల్ని మార్చుకోవాలి. ఈ శిఖ రాగ్ర సదస్సు సమయంలోనే అది వెనిజులాతో కయ్యం పెట్టుకుంది. అక్కడ తనను తాను దేశా ధ్యక్షుడిగా ప్రకటించుకున్న జువాన్ గైదోకు తక్షణం బాధ్యతలు అప్పగించాలని ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్ మదురోను బెదిరిస్తోంది. మరోపక్క క్యూబాపై కూడా అది విరుచుకుపడుతోంది. 59 ఏళ్లపాటు క్యూబాపై అమెరికా అత్యంత దారుణమైన ఆంక్షలు విధించింది. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు 1960లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌హోవర్ ప్రభుత్వం రూపొందించిన కఠినమైన నిబంధనలు అమలు చేస్తామని తాజాగా ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అవి నిజానికి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైనవి. క్యూబాలో విప్లవానంతరం ఆ దేశానికి చెందిన పౌరులు తమ ఆస్తుల్ని, వ్యాపారాలను వదిలిపెట్టి అమెరికా పరారైనప్పుడు వాటిని ఫైడల్ కాస్ట్రో ప్రభుత్వం జాతీయం చేసింది. అలా స్వాధీనం చేసుకున్న ఆస్తులకు పరిహారం చెల్లిస్తామని కూడా ప్రకటించింది. అలాం టివారంతా అనంతరకాలంలో అమెరికా పౌరసత్వాన్ని తీసుకున్నారు. వారంతా క్యూబాపై అమె రికా న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు వేయడానికి వీలు కల్పించే నిబంధనల్ని ఐసెన్‌హోవర్ ప్రభుత్వం రూపొందించింది. న్యాయస్థానాలు ఆ వ్యాజ్యాల్లో బాధితులకు అనుకూలంగా తీర్పిస్తే... ఆ పరి హారం చెల్లించడం క్యూబాకు తలకుమించిన భారమవుతుంది. అది పూర్తిగా దివాళా తీస్తుంది. ఒక పక్క కిమ్‌తో శాంతి చర్చలు జరుపుతూ వేరే దేశాలను ఇష్టానుసారం బెదిరించే చర్యకు పూనుకో వడం వల్ల అమెరికా చిత్తశుద్ధిని కిమ్ శంకించే అవకాశం ఉండదా? ఇప్పుడు హనోయ్ శిఖరాగ్ర సమావేశం విఫలం కావడానికి ట్రంప్, కిమ్‌లు వేర్వేరు కారణాలు చెబుతున్నారు. యాంగ్‌బియాన్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేస్తామని, అందుకు ప్రతిఫలంగా తమపై విధించిన ఆంక్షలన్నీ ఎత్తేయాలని కిమ్ కోరినట్టు అమెరికా ప్రభుత్వం చెబుతోంది. అక్క డున్న రెండో అణుకేంద్రాన్ని సైతం ధ్వంసం చేస్తేనే ఆంక్షలు సంపూర్ణంగా ఎత్తేస్తామని తాము చెప్ప డంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని ట్రంప్ అంటున్నారు. అయితే ఉత్తర కొరియా కథనం వేరేలా ఉంది. అమెరికా అమలు చేస్తున్న 11 ఆంక్షల్లో అయిదింటిని మాత్రమే రద్దు చేయమని అడిగామంటున్నది. ఆ అయిదూ అత్యంత కీలకమైనవని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా రెండు దేశాల అధినేతల మధ్య చర్చలు ప్రారంభం కావడానికి ముందు ఆ దేశాల దౌత్యవేత్తలు సమావేశమవుతారు. ఎజెండా ఖరారు చేస్తారు. అవతలి పక్షం తమనుంచి కోరుకుంటున్నదే మిటో... తాము అటునుంచి ఆశిస్తున్నదేమిటో రెండు దేశాల దౌత్యవేత్తలూ పరస్పరం చెప్పుకుం టారు. ఏ ఏ అంశాల విషయంలో తాము సుముఖంగా ఉన్నామో, వేటిని తిరస్కరిస్తున్నామో ముందే అవతలి పక్షానికి తేటతెల్లం చేస్తారు. ఆ తర్వాతే అధినేతల శిఖరాగ్ర చర్చలు జరుగుతాయి. అంతా ముందే నిర్ణయించుకుంటారు గనుక ఒప్పందాలపై సంతకాలవుతాయి. కానీ హనోయ్ శిఖరాగ్ర సదస్సుకు ముందు అటు అమెరికా, ఇటు ఉత్తర కొరియా ఇలాంటి కసరత్తులు జరిపిన దాఖలాలు లేవు. పైగా కిమ్‌తో ట్రంప్ తన సలహాదారులెవరూ లేకుండా ఏకాంతంగా చర్చించారు. వారిద్దరితోపాటు కేవలం ఉత్తర కొరియా దుబాసి మాత్రమే ఉన్నారు. ఇప్పుడు కిమ్‌తో మాత్రమే కాదు... ఏ దేశాధినేతతో చర్చించినా ట్రంప్ ఈ మాదిరే వ్యవహరి స్తున్నారు. గతంలో పుతిన్‌తో చర్చించినప్పుడు సైతం ట్రంప్ తన సలహాదారులను దూరం పెట్టారు. ఇప్పుడు ట్రంప్, కిమ్‌లు మాత్రమే చర్చలు సాగించారు గనుక వాటిపై ఇద్దరిలో ఎవరి కథనం నిజమో చెప్పడం కష్టం. అయితే ఈ చర్చల పర్వం ఇంతటితో ముగియలేదని, భవిష్యత్తులో కూడా ఇవి కొనసాగుతాయని అమెరికా అంటున్నది. కానీ ఉత్తర కొరియా వైఖరేమిటో ఇంకా తెలి యవలసి ఉంది. ఇప్పట్లో అయితే ఇవి ఉండబోవని స్పష్టంగా చెప్పవచ్చు. చర్చలు జరిపే పక్షాలు ఇచ్చిపుచ్చుకునే వైఖరితో ఉండాలి. పెత్తందారీ పోకడలకు స్వస్తి చెప్పాలి. అవతలివారిలో విశ్వాసం నింపాలి తప్ప అనుమానాలు కలిగించకూడదు. కానీ మొదటినుంచీ అమెరికా వ్యవహార శైలి ఇందుకు భిన్నంగా ఉంది. ఎంతసేపూ ఉత్తర కొరియా నుంచి ఆశించడం తప్ప, తన వంతు చేయా ల్సిందేమిటో గుర్తించడంలేదు. చేయడం లేదు. సరిగదా అత్యాశకు పోతోంది. ఈ పోకడ రాగల రోజుల్లో ఉత్తర కొరియాను మరింత మొండి వైఖరి దిశగా తీసుకెళ్తుంది తప్ప సత్ఫలితాలనీయదని అమెరికా గ్రహించడం మంచిది. -
హనోయ్‌లో ట్రంప్–కిమ్
హనోయ్: కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్ర రహితంగా మార్చే దిశగా మరో ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌లు రెండోసారి భేటీ అయ్యారు. వియత్నాంలోని హనోయ్ నగరంలో ఉన్న సోఫీటెల్ లెజెండ్ మెట్రోపోల్ హోటల్లో ఈ నేతలిద్దరూ బుధవారం మీడియా సమక్షంలో కరచాలనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తరకొరియా అధినేత కిమ్ మీడియాతో మాట్లాడుతూ..‘ఈసారి సదస్సులో గొప్ప ఫలితాన్ని సాధిస్తామని ఆశాభావంతో ఉన్నాను. దీన్ని ప్రతీఒక్కరూ తప్పకుండా స్వాగతిస్తారు’అని తెలిపారు. అనంతరం ట్రంప్ స్పందిస్తూ..‘గతంలో జరిగి న చర్చలతో పోల్చుకుంటే ఈ భేటీలో మెరుగైన ఫలితాలను సాధిస్తాం‘అని అభిప్రాయపడ్డారు. సింగపూర్‌లోని క్యాపెల్లా హోటల్లో 2018, జూన్ 12న ట్రంప్–కిమ్ తొలిసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉ.కొరియా పూర్తిస్థాయిలో అణ్వాయుధాలను త్యజించాలని ట్రంప్ కోరారు. అయితే అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణి ప్రయోగాలను నిలిపివేసేందుకు కిమ్ ప్రభుత్వం అంగీకరించింది. మీడియా సిబ్బందికి నో ఎంట్రీ.. హనోయ్‌లోని మెట్రోపోల్ హోటల్లో బుధవారం మీడియాతో మాట్లాడిన తర్వాత ట్రంప్–కిమ్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత నేతలిద్దరూ డిన్నర్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో ట్రంప్ వెంట మీడియా ప్రతినిధులు వెళ్లేందుకు వైట్‌హౌస్ అధికారులు అనుమతించలేదు. ఈ విషయమై వైట్‌హౌస్ అధికార ప్రతినిధి సారా శాండర్స్ స్పందిస్తూ.. ఈ సమావేశం సున్నితత్వం నేపథ్యంలోనే మీడియా సిబ్బందికి పరిమితులు విధించామని వివరణ ఇచ్చారు. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణ దిశగా ట్రంప్–కిమ్ భేటీ కీలక ముందడుగు అవుతుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అభిప్రాయపడ్డారు. కాగా, అమెరికా, ఉ.కొరియా ప్రతినిధి బృందాలు నేడు మరోసారి సమావేశమై అణ్వస్త్రాలను త్యజించడంపై మరోసారి చర్చలు జరుపుతున్నాయి. -
వాట్ యాన్ ఐడియా సర్జీ!
హడావుడిలో బయటకు వెళ్లేటప్పుడు ఏదో ఒక వస్తువు మర్చిపోతుంటాం.. అది సహజం కూడా. కానీ కొందరు అదే పనిగా రోజూ ఏదో ఒకటి మర్చిపోతుంటారు. అయితే వియత్నాంలో ఉన్న ఓ వ్యక్తి బయటకు వెళ్లేటప్పుడు ఎప్పుడూ తన గుర్తింపు కార్డు మర్చిపోతున్నాడట. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడట. ఆఖరికి తన ఫ్రెండ్స్‌తో బార్‌కు గట్రా వెళ్లినప్పుడు మైనర్‌వి అంటూ ఆల్కహాల్ కూడా ఇవ్వట్లేదట. దీంతో విసుగు చెందిన మనోడు ఓ చక్కని పరిష్కారానికి ఆలోచించాడు. తన ఐడీ కార్డును తన చేతిపై పచ్చ బొట్టు మాదిరిగా వేయించుకోవాలని నిర్ణయానికొచ్చాడు. అనుకున్నదే తడవుగా వెంటనే పచ్చబొట్లు వేసే దుకాణానికి వెళ్లి చేతిపై ఐడీకార్డు మొత్తం పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఆ ఆర్టిస్ట్‌కు ఐడీ కార్డు వేసేందుకు గంట సమయం పట్టిందట. ఆ యువకుడి పచ్చబొట్టును చూసిన స్నేహితులు ఫొటో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. అంతే ఈ ఫొటో వియత్నాం మొత్తం వైరల్ అయింది. ఎంతయినా మనోడి తెలివేతెలివిగురూ..! -
బంగారి రాజు!
అవును మీరు చూస్తున్నది నిజమే.. ఫొటోలో ఉన్న వ్యక్తి ధరించిన ఆభరణాలన్నీ నిజంగా బంగారంతో చేసినవే.. అయితే అతడు ఏదో ఫొటో కోసం అలా అలంకరించుకోలేదు.. ఎక్కడికి వెళ్లినా కూడా ఆ భారీ అభరణాలను ధరిస్తాడట. ఇంతకీ మనోడి గురించి చెప్పలేదు కదూ..! పేరు.. ట్రాన్ గోక్.. వియత్నాం దేశానికి చెందినవాడు. వయసు 36 ఏళ్లు. వృత్తి చమురు వ్యాపారి. ఇతడికి ఇలా భారీ ఆభరణాలు వేసుకుని తిరగడమంటే ట్రాన్‌కు మహా సరదా.. ఓ రకంగా పిచ్చి. అతడు వేసుకున్న బంగారు ఆభరణాలు మొత్తం 13 కిలోల బరువుంటాయట. బయటకి ఎక్కడికి వెళ్లినా కూడా అంత బరువున్న ఆభరణాలు వేసుకొని వెళ్లాల్సిందేనట. మరి దొంగలెవరైనా దాడి చేసి ఎత్తుకుపోతే అనుకుంటున్నారా.. ఎక్కడికి వెళ్లినా అతడి వెంట ఎప్పుడూ ఐదుగురు బాడీగార్డులు ఉండాల్సిందేనట. అంత బరువును మోయాల్సిన అవసరం ఏముందని ఎవరైనా అడిగితే.. ఈ బంగారం తనకు అదృష్టాన్ని తీసుకొస్తుందని చెబుతాడట. తాను ధరించిన ఆభరణాల్లో మెడ గొలుసు, లాకెట్ కలిపి 5 కిలోలు, చేతికి ధరించిన కంకణం 5 కిలోలు.. అర కిలో బరువుతో ఉండే నాలుగు ఉంగరాలు.. మొలతాడు కిలో ఉంటుందట. వీటి మొత్తం ఖరీదు దాదాపు రూ.4 కోట్లు ఉంటుందట. ఐదేళ్ల కిందటి నుంచే ఇంతటి భారీ ఆభరణాలు తయారు చేయించుకోవడం ప్రారంభించాడట ట్రాన్. ఇక్కడితో ఆగిపోకుండా తన కోసం బంగారు చొక్కా తయారు చేయించుకుంటున్నాడట కూడా. అయితే దానితో కష్టాలు కూడా ఉన్నాయి లెండి. అంత బరువు మెడ గొలుసు వేసుకోవడంతో తరచూ మెడనొప్పి వస్తుందట. అయితే డాక్టర్లను సంప్రదించి మందులు వాడుతున్నాడట కానీ బంగారం వేసుకోవడం మాత్రం ఆపట్లేదట మనోడు. యూట్యూబ్‌లో ఇతడి వీడియోలకు లక్షలాది వ్యూస్ వచ్చాయి. అంతే ఇక సామాజిక మాధ్యమాల్లో ఆయన ఫొటోలు తెగ వైరల్ అయిపోతున్నాయి. ఓ రకంగా రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయాడు. భారత్‌లో కూడా ఓ బంగారు బాబు ఉన్నాడు లెండి. ముంబైలోని పింప్రికి చెందిన దత్తా ఫుగ్ ఏకంగా 3.2 కిలోల బంగారంతో చేసిన చొక్కాను ధరించేవాడు. -
వియత్నాం అధ్యక్షుడు క్వాంగ్ కన్నుమూత
హనొయి/న్యూఢిల్లీ: వియత్నాం అధ్యక్షుడు ట్రాన్ డాయ్ క్వాంగ్ (61) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు వియత్నాం అధికారిక మీడియా తెలిపింది. క్వాంగ్ 2016 ఏప్రిల్‌లో అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకంటే ముందు 4 దశాబ్దాల పాటు కీలకమైన ప్రజా భద్రత మంత్రిగా చేశారు. శక్తిమంతమైన నేతగా క్వాంగ్‌కు మంచి పేరుంది. దేశ అధ్యక్ష పదవితో పాటు మరో నాలుగు దేశ అత్యున్నత పదవుల బాధ్యతలను క్వాంగ్ నిర్వర్తిస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్న క్వాంగ్.. పార్టీ అంతర్గత వర్గాల్లో మంచి ప్రభావవంతమైన, గట్టి నేతగా పేరు సంపాదించుకున్నారు. వియత్నాం అధ్యక్షుడు క్వాంగ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. -
వియత్నాంలో పర్యటిస్తున్న విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్
-
వియత్నాంలో వండర్ బ్రిడ్జ్
-
అరచేతిలో అద్భుతం.. ఎప్పుడైనా చూశారా?
డానాంగ్: అర చేతుల్లో అద్భుతం.. ఈ ఫోటో చూసిన వెంటనే ఎవరికైనా ఇదే మాట తడుతుంది. దూరం నుంచి చూసే వారికి ఇంత పెద్ద భారీ వంతెనను పడిపోకుండా ఈ రెండు చేతులు కాపాడుతున్నాయేమో అన్పిస్తోంది. మరి ఆ అర చేతుల్లో మనం కూడా వాలిపోవాలంటే.. చలో వియత్నాం. ‘గోల్డెన్ హ్యాండ్స్’ అని పిలుచుకుంటున్న ఈ వంతెన వియత్నాంలోని బనా హిల్స్ రిసార్ట్ వద్ద నిర్మించారు. ఈ వంతెనను సముద్ర మట్టానికి సుమారు 4593 అడుగుల ఎత్తులో కట్టారు. వంతెనకు ఇరు పక్కల వంగపువ్వూ రంగులో ఉండే లోబిలియా చామంతి పూల మొక్కలను నాటారు. దూరం నుంచి చూసినప్పుడు అడవిలో నుంచి రెండు భారీ చేతులు వచ్చి ఈ వంతెనను పట్టుకున్నాయేమో అనిపిస్తోంది. జూన్ నెలలో ప్రారంభించిన ఈ వంతెనను చూడటానికి ఇప్పుడు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు పోటెత్తుతున్నారు. అంతేనా ఈ వంతెనకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు వియత్నాం ప్రభుత్వం దాదాపు 10 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో భాగంగా ఈ ‘గోల్డెన్ బ్రిడ్జి’ని నిర్మించారు. ఈ వంతెనపై నిల్చోని చూస్తే ఆకాశానికి చాలా దగ్గరగా ఉన్నట్లు అన్పిస్తోంది అంటున్నారు పర్యాటకులు. అయితే ఈ వంతెనపైకి కేవలం పాదచారులను మాత్రమే అనుమతిచ్చింది వియత్నాం ప్రభుత్వం. -
వేగంగా కెనడా విద్యార్థి వీసా
టొరంటో: కెనడాలో చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇకపై వీసాలు మరింత వేగంగా లభించనున్నాయి. భారత్‌తోపాటు చైనా, ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాలకు చెందిన విద్యార్థులకు వీసాల జారీ విధానంలో కెనడా తాజాగా తీసుకొచ్చిన మార్పులతో ఈ ప్రయోజనం కలగనుంది. ఈ నాలుగు దేశాల విద్యార్థుల కోసం స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ (ఎస్డీఎస్) పేరుతో కెనడా ఓ కొత్త వీసా పథకాన్ని ప్రారంభించింది. ఆ దేశంలో చదివేందుకు అవసమైన భాషా పరిజ్ఞానం, ఆర్థిక స్తోమత ఉన్న విద్యార్థులు ఎస్డీఎస్ కింద దరఖాస్తు చేసుకుంటే 45 రోజుల్లోపే వీసా జారీ ప్రక్రియ పూర్తవుతుంది. సాధారణ విధానంలో అయితే ప్రస్తుతం కెనడా విద్యార్థి వీసా పొందడానికి రెండు నెలల సమయం పడుతోంది. అయితే ఎస్డీఎస్ కింద దరఖాస్తు చేసుకునే విద్యార్థులు సాధారణం కన్నా కఠినమైన భాషా పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గత కొన్నేళ్లుగా భారత్, చైనా, ఫిలిప్పీన్స్, వియత్నాం విద్యార్థులకు ఇంచుమించు ఎస్డీఎస్ లాంటి విధానాన్నే అమలుచేస్తున్నప్పటికీ, ఈ నాలుగు దేశాలకు ఉమ్మడిగా తాజాగా కొత్త పద్ధతిని తెచ్చినట్లు కెనడా వలసలు, శరణార్థులు, పౌరసత్వ సేవల విభాగం వెల్లడించింది. -
ఘోర అగ్నిప్రమాదం..13 మంది మృతి
హానోయ్ : వియత్నాంలోని హో చి మిన్ నగరంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ నివాస సముదాయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి సుమారు 13 మంది మృతిచెందారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగిన మూడు బిల్డింగ్‌లలో సుమారు 700 ల అపార్టుమెంట్లు ఉన్నాయని, వీటిని 6 సంవత్సరాల క్రితమే నిర్మించారని అధికారులు తెలిపారు. అయితే ఎంత మంది మంటల్లో చిక్కుకున్నదనే విషయం, ప్రమాదానికి గల కారణాలు అధికారులు తెలియజేసేందుకు నిరాకరిస్తున్నారు. చాలా మంది ప్రజలు గందరగోళంలో భవనంపై నుంచి దూకడం వల్ల చనిపోయారని స్థానికులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదం కింద ఫ్లోర్లో చోటుచేసుకోవడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువైందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదస్థలంలో సుమారు 200 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వియత్నాంలో 2002 సంవత్సరంలో జరిగిన అగ్నిప్రమాదంలో 60 మంది ప్రజలు చనిపోయారు. -
ఫీమేల్ డామినేషన్
వియన్నాః ప్రపంచం వ్యాప్తంగా స్త్రీ వివక్ష గురించి విస్త్రుతంగా చర్చజరుగుతోన్న తరుణంలో ఆస్ట్రియాలో పురుష వివక్ష వార్తల్లోకెక్కింది. లింగ వివక్ష రుజువై ఆస్ట్రియా రవాణా మంత్రిత్వ శాఖలో పనిచేస్తోన్న పీటర్ ఫ్రాంజ్‌మేయర్ 300,000 పైగా యూరోలను నష్టపరిహారంగా పొందిన విషయాన్ని డై ప్రెస్ వార్తా పత్రిక ప్రకటించింది. ఆస్ట్రియా రవాణా మంత్రిత్వ శాఖలో పనిచేసే ఫ్రాంజ్‌మేయర్ అనే ఉద్యోగికి రావాల్సిన ప్రమోషన్ ని ఉర్సులా జెంచ్నర్ అనే మహిళకు కట్టబెట్టడంతో తాను పదోన్నతిని కోల్పోయానంటూ 2011లో కోర్టుకెక్కారు. తను పదోన్నతి పొందలేకపోవడానికి వివక్షే కారణమనీ, జెంచ్నర్ అనే మహిళకి పదోన్నతినివ్వడంలో పక్షపాత వైఖరి అనుసరించారన్న ఫ్రాంజ్‌మేయర్ వాదనతో ఏకీభవించిన ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు అతనికి నష్టపరిహారంగా 300,000 యూరోలను చెల్లించాలని ఫిబ్రవరిలో తీర్పునిచ్చినట్టు డై ప్రెస్ పత్రిక పేర్కొంది. అయితే జెంచ్నర్కి పదోన్నతినిచ్చే సమయంలో నియామకానికి సంబంధించిన అన్ని నిబంధనలనూ పాటించామని ఆ సమయంలో రవాణా శాఖా మంత్రిగా ఉన్న సోషల్ డెమొక్రాట్ పార్టీకి చెందిన డోరిస్ బర్స్ వివరణ ఇచ్చారు. మహిళలకు తగిన ప్రాతినిధ్యం లేని కారణంగా, మహిళలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ పదోన్నతిని కల్పించినట్టు డోరిస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
బికినీ ఎయిర్‌లైన్స్ సేవలు ఇక ఢిల్లీకి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ బడ్జెట్ ఎయిర్‌లైన్ వియత్నాంకు చెందిన వియట్జెట్ ఢిల్లీనుంచి డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రకటించింది. బికినీ ఎయిర్‌లైన్స్‌గా పేరు తెచ్చుకున్న వియట్ జెట్ ఢిల్లీ నుంచి వియత్నాంలోని హోచిమిన్ నగరానికి నడపనున్నట్లు ప్రకటించింది. ఇండియా-వియత్నాం దౌత్య సంబంధాల 45వ వార్షికోత్సవం సందర్భంగా వియత్నాం-ఇండియా బిజినెస్ ఫోరమ్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. ఆసియన్ ఏజ్ నివేదించిన ప్రకారం బికినీ ఎయిర్‌లైన్స్‌గా పేరొందిన వియట్జెట్ ఎయిర్‌లైన్స్ జులై- ఆగస్టు లో భారత్‌కు డైరెక్ట్ ఫ్లైట్స్ సేవలు అందించనున్నామని వెల్లడించింది. ఈ రెండు నగరాలమధ్య వారానికి నాలుగు సార్లు విమానాలను నిర్వహిస్తుంది. పైలట్లు, ఎయిర్‌హోస్టెస్‌లు సహా ఇతర క్యాబిన్ క్రూ అంతా బికినీ ధరించి సేవలు అందించడమే ఈ బికినీ ఎయిర్‌లైన్స్ ప్రత్యేకత. అలా బికినీ ఎయిర్‌లైన్స్‌గా ప్రఖ్యాతి పొందింది. 2007లో మహిళా బిలియనీర్ గుయేన్ థీ ఫుంగ్ థావో స్థాపించిన వైమానిక సంస్థ వియత్నాం దేశంలోనే రెండవ అత్యుత్తమ సేవలు అందిస్తున్న అతిపెద్ద సంస్థగా పాపులారిటీ సాధించింది. పైలట్లు, ఫ్లైట్ అటెండెంట్లతో బికినీలు ధరింపజేసి 2011లో ఈ సంస్థ చేసిన ప్రచారం అప్పట్లో వివాదాస్పదమైంది. అ క్కడి ప్రభుత్వంనుంచి జరిమాను కూడా ఎదుర్కొంది.అయితే కొన్ని ప్రత్యేక విమానాల్లో మాత్రమే ప్రయాణీకులను ఆకర్షించడానికి బికినీల్లో ఉన్నమహిళా సిబ్బందిని ఉపయోగిస్తుంది. అయితే ఇంత ప్రతికూల ప్రచారం ఉన్నప్పటికీ, ప్రారంభించినప్పటి నుంచీ సంస్థ పెరుగుదల గణనీయంగా ఉంది. తాజా త్రైమాసికంలో లాభాల్లో 75.9 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. దీనికి తోడు కంపెనీకి 55 ఏ320, ఏ321 విమానాల విమానాలను కలిగి ఉంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో 385 విమానాలు నడుపుతోంది. -
అభివృద్ధి కోసం ఉమ్మడి కృషి
న్యూఢిల్లీ: స్వేచ్ఛ, అభివృద్ధితో కూడిన ప్రాంతీయ భద్రత కోసం కలిసికట్టుగా కృషి చేయాలని భారత్, వియత్నాం అంగీకరించాయి. భారత్‌లో ఉన్న వియత్నాం అధ్యక్షుడు త్రాన్ దాయి క్వాంగ్‌తో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శనివారం విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మూడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. అణు ఇంధనం, వాణిజ్యం, వ్యవసాయం రంగాలతోపాటు ఆయిల్, గ్యాస్ నిక్షేపాల అన్వేషణలో సహకారం పెంచుకునేందుకు అంగీకరించారు. అనంతరం ఇరువురు నేతలు కలిసి విలేకరులతో మాట్లాడారు. సముద్ర సంబంధ అంశాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇండో– పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, స్వతంత్రం, అభివృద్ధి కోసం ఐక్యంగా పని చేయనున్నామన్నారు. సార్వభౌమత్వం, అంతర్జాతీయ చట్టాలకు లోబడి వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మోదీ చెప్పారు. రక్షణ రంగంలో సహకారం, రక్షణ ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి సంబంధించి కొత్త అవకాశాలను అన్వేషిస్తున్నామన్నారు. ఆసియాన్ దేశాలతో అన్ని రంగాల్లోనూ అనుసంధానత కలిగి ఉండాలన్న భారత్‌ను వియత్నాం అధ్యక్షుడు బలపరిచారు. ఆసియాన్ ప్రాంతంలో స్వేచ్ఛా నౌకాయానం, విమాన యానం ఉండాలని అన్నారు. ఈ ప్రాంతంలో సైనికపరంగా విస్తరిస్తున్న చైనాకు ఈ ప్రకటన ఒక సందేశంగా పనిచేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. -
వియత్నాం అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికిన రాష్ట్రపతి
-
దక్షిణ చైనా సముద్రంపై చైనా, వియత్నాం రాజీ
హనోయ్: దక్షిణ చైనా సముద్రం వివాదం విషయంలో చైనా, వియత్నాం రాజీకొచ్చాయి. ఆ విషయంలో వెనక్కి తగ్గేందుకు ఇరు దేశాలు సోమవారం అంగీకరించాయి. దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల నౌకా రవాణా వాణిజ్యం జరిగే ఈ దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనా, వియత్నాంతో పాటు బ్రూనై, తైవాన్, ఫిలిప్పీన్స్ మధ్య ఎంతో కాలంగా వివాదం నలుగుతోంది. ఈ సముద్రంలో చైనా ఓ అడుగు ముందుకేసి మిలిటరీ కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా ఏకంగా కృత్రిమ ద్వీపాలను నిర్మించింది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హనోయ్ పర్యటన సందర్భంగా ఈ సముద్రం విషయంలో శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తామని రెండు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో అంగీకరించాయి. ‘సమస్యలు మరింత జఠిలం అయ్యే ఎటువంటి చర్యలు కూడా తీసుకోం. తూర్పు సముద్రంలో శాంతి సామరస్యాన్ని పెంపొందిస్తాం’అని పేర్కొన్నాయి. వియత్నాంలోని వివాదాస్పద కోస్తా తీర ప్రాంతంలో చైనా చేపట్టిన చమురు వెలికితీత ప్రాజెక్టును ఈ ఏడాది ప్రారంభంలో వియత్నాం ఆపేసింది.