హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్‌స్టంట్ కాఫీ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ వియత్నాం తయారీ కేంద్రంలో కొత్త యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 6,000 టన్నుల వార్షిక సామర్థ్యంతో ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ ఫెసిలిటీని నెలకొల్పనున్నారు.
ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.407 కోట్లు. కాగా, 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను మధ్యంతర డివిడెండ్ రూ.3 చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. డిసెంబర్ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ఫలితాల్లో కంపెనీ నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 24.9 శాతం ఎగసి రూ.73 కోట్లు సాధించింది. ఎబిటా 9 శాతం పెరిగి రూ.101 కోట్లుగా ఉంది. టర్నోవర్ 26.5 శాతం అధికమై రూ.535 కోట్లు నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment