‘రాహుల్‌కు వియాత్నాంపై అంత ఇంట్రెస్ట్ ఏమిటో..?’ | Rahul Gandhi In Vietnam Yet Again BJP Questions | Sakshi
Sakshi News home page

‘రాహుల్‌కు వియాత్నాంపై అంత ఇంట్రెస్ట్ ఏమిటో..?’

Published Sat, Mar 15 2025 5:51 PM | Last Updated on Sat, Mar 15 2025 6:10 PM

Rahul Gandhi In Vietnam Yet Again BJP Questions

న్యూఢిల్లీ: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వియాత్నాం పర్యటనపై బీజేపీ మరోసారి విమర్శల వర్షం కురిపించింది. ప్రత్యేకంగా  న్యూ ఇయర్, హోలీ సమయాల్లో రాహుల్ వియాత్నాంకు వెళ్లడానికి కారణం ఏమిటో అని సెటైర్లు వేసింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ రవి శంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ వియాత్నాం పర్యటనను ప్రధానంగా టార్గెట్ చేశారు. 

వియాత్నాం పర్యటనలు పదే పదే చేయడంపై రాహుల్ గాంధీనే క్లారిటీ ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ తరచు వియాత్నాం అంటూ విమానం ఎక్కుతున్నారని, ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకలకే కాకుండా, ఇప్పుడు హోలీ సంబరాల సమయంలో కూడా రాహుల్ వియాత్నాంలోనే ఉన్నారన్నారు. రాహుల్ ఆ దేశ పర్యటనకు వెళ్లడానికి ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలని తమకు కూడా చాలా ఆతృతగా ఉందన్నారు.

గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు జాతీయ సంతాప సభ ఏర్పాటు చేసిన సమయంలో కూడా రాముల్ గాంధీ వియాత్నాంలోనే ఉన్నారు. అప్పుడు కూడా బీజేపీ విమర్శలు ఎక్కువ పెట్టింది. తమ నాయకుడు మన్మోహన్ సింగ్ సంతాప సభకు దూరంగా ఉండి రాహుల్ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడింది. ఈ జనవరిలో రాహుల్ వియాత్నాం పర్యటనకు వెళ్లిన సమయంలో బీజేపీ విమర్శించగా, కాంగ్రెస్ సంయమనం పాటించింది,. అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకడు హరీష్ రావత్.. రాహుల్ ను వెనకేసుకొచ్చారు. వియాత్నాం ఎకానామిక్ ఫ్రేమ్ వర్క్ ను స్టడీ చేయడానికి రాహుల్ అక్కడకు వెళ్లారంటూ చెప్పుకొచ్చారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement