freeze
-
4.5 లక్షల ‘మ్యూల్’ ఖాతాలను స్తంభింపజేసిన కేంద్రం
సైబర్ నేరాల ద్వారా వచ్చే ఆదాయాన్ని వినియోగించుకునేందుకు వాడే దాదాపు 4.5 లక్షల ‘మ్యూల్’(మనీ లాండరింగ్ కోసం వాడే ఖాతాలు) బ్యాంక్ ఖాతాలను కేంద్రం స్తంభింపజేసింది. సైబర్ మోసగాళ్లు ఈ మ్యూల్ ఖాతాల ద్వారానే లావాదేవీలు జరుపుతున్నట్లు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) అధికారులు తెలిపారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం అధికారులతో జరిగిన సమావేశంలో ఈమేరకు వివరాలు వెల్లడించారు.బ్యాంకింగ్ వ్యవస్థలో మ్యూల్ ఖాతాలను వినియోగించుకుని సైబర్ నేరస్థులు చెల్లింపులు చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది అన్ని బ్యాంకుల్లో కలిపి మొత్తంగా 4.5 లక్షల మ్యూల్ ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిపారు. అందులో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణంI4C సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఎస్బీఐలోని వివిధ శాఖల్లో సుమారు 40,000 మ్యూల్ బ్యాంక్ ఖాతాలు కనుగొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 10,000 (ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా), కెనరా బ్యాంక్‌లో 7,000 (సిండికేట్ బ్యాంక్‌తో సహా), కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో 6,000, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో 5,000 మ్యూల్ ఖాతాలు కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 2023 నుంచి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో సుమారు ఒక లక్ష సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయని చెప్పారు. గత ఏడాదిలో సుమారు రూ.17,000 కోట్ల నగదు మోసం జరిగిందని పేర్కొన్నారు.మ్యూల్ ఖాతాల నిర్వహణ ఇలా..సైబర్ నేరస్థులు బ్యాంకు ఖాతాదారులను నమ్మించి వారికి తెలియకుండా కేవైసీ పూర్తి చేస్తారు. మనీలాండరింగ్‌కు పాల్పడుతూ ఖాతాదారుల ప్రమేయం లేకుండా లావాదేవీలు పూర్తి చేస్తారు. లీగల్ కేసు అయితే ఖాతాదారులను అదుపులోకి తీసుకుంటారు. కాబట్టి బ్యాంకులోగానీ, బయటగానీ అపరిచితులు, బంధువులకు బ్యాంకు, వ్యక్తిగత వివరాలు తెలియజేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఓటీపీలు కూడా ఇతరులతో పంచుకోకూడదని చెబుతున్నారు. -
Summer Season: మట్టికుండ.. సల్లగుండ!
రాను రాను.. ఎండకాలం చాలా ముదురుతోంది. వేసవిలో పడే తిప్పలు అంతింతా కాదు. చెప్పడానికి కూడా మాటలురాని విధంగా ఓ వైపు దాహం దారుణంగా వెంటాడుతూంటుంది. ఇలాంటి దాహానికి చల్లని నీళ్లు తప్ప మరేది తాగిన ఉపశమనం లభించదనే విధంగా వేసవి విజృంభిస్తుంది. కానీ నీళ్లు మరీ చల్లగా ఉన్నా ఇబ్బందే.. చల్లగా లేకున్నా ఇబ్బందే. ఇప్పుడు కొనసాగుతున్న కాలానికి చాలా ఇళ్లల్లో ఫ్రిడ్జ్ సదూపాయాలు కలవు. మరీ చల్లటి నీరు, అందులో.. ఫ్రిడ్జ్‌లోని మెనస్ డగ్రీల వద్ద చల్లబడ్డ నీళ్లను తాగినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.., అందుకు బదులుగా కుండలో నిల్వచేయబడ్డ నీళ్లు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతాయని నిపుణుల సూచనలు. ఇందుకు అనుగుణంగానే వేసవి కారణంగా మార్కెట్లలో మట్టికుండ విక్రయాలు భారీగా పెరిగాయి. వేసవిలో మట్టి కుండ చల్లని నీరందిస్తూ దాహార్తి తీరుస్తుంది. కాలక్రమంలో దీని వినియోగం నామోషీగా మారి, ఫ్రిడ్జ్ రాజ్యమేలుతున్నా.. మట్టి కుండ మాత్రం తన ఉనికి కోల్పోలేదు. ఆరోగ్యానికి ఉపయోగమని భావిస్తున్న చాలామంది వినియోగిస్తున్నారు. ఏటా వేసవిలో కుండలు ఆరోగ్య విషయంలో తమవంతు ప్రాధాన్యతను చాటుకుంటున్నాయి. ట్యాబ్‌లతో కూడిన రాజస్థాన్ కుండలు, మట్టి వాటర్ బాటిల్స్, కూజాలు, రంజన్లపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువవుతుండడంతో వాటి వ్యాపార స్థాయి కూడా పెరిగింది. ఈవిషయంలో కుండల తయారీదారులు సరికొత్త డిజైన్లు సృష్టిస్తుంటే.., అమ్మకందారులు మార్కెట్లలో అమ్మడానికి సిద్ధమవుతున్నారు. ఇవి చదవండి: సమ్మర్లో ఈ రైస్ తింటే..లాభాలే..లాభాలు! -
Income Tax Department: కాంగ్రెస్ ఖాతాల స్తంభన
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని రద్దుచేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో మోదీ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిన మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలను ఆదాయ పన్ను శాఖ స్తంభింపజేయడం కలకలం సృష్టించింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేసులో ఐటీ రిటర్నుల్లో రూ.210 కోట్ల వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో వాటి రికవరీ కోసం ఆయా ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేసినట్లు వార్తలొచ్చాయి. పార్టీ ప్రధాన ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో కాంగ్రెస్ వేగంగా స్పందించింది. వెంటనే ఐటీ, ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ)ను ఆశ్రయించింది. దీంతో ట్రిబ్యునల్ కాస్త కాంగ్రెస్‌కు అనుకూలంగా ఆదేశాలిచ్చింది. ఆయా ఖాతాల్లో మొత్తంగా రూ.115 కోట్లు అలాగే నిల్వ ఉంచి మిగతాది మాత్రమే విత్‌డ్రా, ఇతరత్రా అవసరాలకు వాడుకోవచ్చని సూచించింది. వెంటనే ఆయా ఖాతాలను డీ ఫ్రీజ్ చేయాలని ఐటీ అధికారులను ఆదేశించింది. ట్రిబ్యునల్ ఆదేశాలతో సంబంధిత ఖాతాలన్నీ పునరుద్ధరించబడ్డాయి. ట్రిబ్యునల్ ఈ అంశంపై బుధవారం మరోసారి వాదనలు విననుంది. ఫ్రీజ్ చేసిన ఖాతాల్లో యూత్ కాంగ్రెస్ ఖాతాలూ ఉన్నాయి. ఖాతాల స్తంభనపై మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ‘‘ 2018–19 ఆర్థికంలో ఐటీ రిటర్నులను కాస్త ఆలస్యంగా సమరి్పంచాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ జీతభత్యాలను పారీ్టకి విరాళాల రూపంలో ఇచ్చారు. అలాంటి కొన్ని మొత్తాలు ఐటీ రిటర్నుల్లో ప్రతిబింబించలేదు. అంతమాత్రానికే ప్రధానమైన తొమ్మిది ఖాతాలను స్తంభింపజేస్తారా?’ అని కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ మాట్లాడారు. ‘‘ ఖాతాల్లో ఉన్న మొత్తంలో రూ.115 కోట్లే అత్యంత ఎక్కువైనది. సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ బిల్లులు చెల్లించడానికి మిగతా డబ్బు అస్సలు సరిపోదు. రాబోయే లోక్‌సభ ఎన్నికల వేళ ఇలా ఖాతాలను ఫ్రీజ్ చేస్తే ఎన్నికల్లో పార్టీ భాగస్వామి కావడం చాలా కష్టం’’ అని మాకెన్ అన్నారు. భయపడకండి మోదీ జీ: రాహుల్ ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘ భయపడకండి మోదీ జీ! కాంగ్రెస్ ప్రజాశక్తికి కాంగ్రెస్ చిరునామా. నియంతృత్వం ముందు మోకరిల్లేది లేదు’’ అన్నారు. అధికార దాహంతో లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ ఖాతాలను ప్రభుత్వం స్తంభింపచేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. మోదీ మూడోసారి పగ్గాలు చేపట్టాక ఇలాంటి ఆరోపణలకు కాంగ్రెస్ చాలా సమయం దొరుకుతుందంటూ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎద్దేవాచేశారు. -
కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్, కాసేపటికే..
సాక్షి, ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన బ్యాంకు అకౌంట్లు అన్ని ఫ్రీజ్ అయ్యాయి. పన్ను చెల్లించలేదన్న కారణంగానే అకౌంట్లను ఫ్రీజ్ చేశారని, ఇందులో రాజకీయ దురేద్దేశం కనిపిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే కాంగ్రెస్ ఈ విషయాన్ని మీడియా దృష్టికి తెచ్చిన గంటలోపే.. ఆ పార్టీకి ఉపశమనం లభించింది. అకౌంట్లను పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అకౌంట్లు ఫ్రీజ్ అయిన విషయాన్ని కాంగ్రెస్ నేత, పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ శుక్రవారం మీడియా ద్వారా తెలియజేశారు. ఈ చర్యను రాజకీయ కుట్రగా అభివర్ణించిన ఆయన.. న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని కలవరపరిచే అంశం ఇది. రూ.210 కోట్లు ట్యాక్స్ కట్టలేదని ఆదాయ పన్ను శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత చర్య.. పార్టీ ఎన్నికల సంసిద్ధతను దెబ్బ తీసేందుకే’ అని మాకెన్ ఆరోపించారు. 2018-19 ఎన్నికల ఏడాదికి సంబంధించి 45 రోజులు ఆలస్యంగా పార్టీ తమ అకౌంట్లను సమర్పించిందని.. ఆ మాత్రం దానికే అకౌంట్లను స్తంభింపజేయడం ఏంటని? మాకెన్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో అనుమానాలు కలుగుతున్నాయని అన్నారాయన. .. ఇది ఉద్దేశపూర్వక చర్య అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం మా నాలుగు అకౌంట్లు ఒకే పాన్ నెంబర్ మీద లింక్ అయ్యి ఉన్నాయి. అకౌంట్ల ఫ్రీజ్‌తో అన్నీ ఆగపోతాయి. సిబ్బందికి జీతాలు ఇవ్వలేం. కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేని స్థితికి చేరాం. ఆఖరికి న్యాయ్ యాత్రపై కూడా ప్రభావం పడుతుందని చెప్పారాయన. .. దేశంలో ప్రజాస్వామ్యం ఉనికి లేకుండా చేస్తున్నారు. ఏక పాలన పార్టీ.. ప్రధాన ప్రతిపక్షం లొంగదీసుకునే యత్నం చేస్తోంది. కానీ, మేం తలొగ్గం. న్యాయవ్యవస్థ, మీడియా, ప్రజల నుండి న్యాయం కోరుతున్నాం అని మాకెన్ చెప్పారు. ఈ చర్యపై న్యాయపరంగా పోరాడతామని అజయ్ మాకెన్ వెల్లడించారు. ఇప్పటికే ఢిల్లీలోని ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను (ITAT) ఆశ్రయించామని తెలిపారు. #WATCH | Congress Treasurer Ajay Maken says "We got information yesterday that banks are not honouring the cheque we are issuing. On further investigation, we got to know that the Youth Congress bank accounts have been frozen. The accounts of the Congress party have also been… pic.twitter.com/JsZL1FEy9d — ANI (@ANI) February 16, 2024 మరోవైపు ఈ పరిణామంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం స్పందించారు. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బగా అభివర్ణించారాయన. ఎక్స్ ఖాతాలో ఆయన.. ‘‘ ఎన్నికల కోసం బీజేపీ రాజ్యాంగేతర పద్ధతిలో సేకరించిన సొమ్మును ఖర్చు చేస్తోంది. కానీ, మేం ప్రజల నుంచి సేకరించుకున్న డబ్బును సీజ్ చేసింది. అందుకే బీజేపీ మళ్లీ నెగ్గితే భవిష్యత్తులో ఎన్నికలనేవే ఉండవని.. ప్రజాస్వామ్యం పోయి నియంతృత్వం వస్తుందని మేం చెబుతున్నాం. ఈ విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లి నియంతృత్వ పాలన తీరును ఎండగడతాం’’ అని సందేశం ఉంచారు. सत्ता के नशे में चूर, मोदी सरकार ने लोक सभा चुनाव के ठीक पहले देश की सबसे बड़ी विपक्षी पार्टी - भारतीय राष्ट्रीय कांग्रेस - के Accounts Frozen कर दिए है। ये लोकतंत्र पर गहरा आघात है। भाजपा ने जो असंवैधानिक धन इकट्ठा किया है, उसका इस्तेमाल वे चुनाव में करेंगे, लेकिन हमने… — Mallikarjun Kharge (@kharge) February 16, 2024 ఖాతాలు స్తంభించాయనే విషయం గురువారం తమ దృష్టికి వచ్చిందని పార్టీ న్యాయవాది వివేక్ తన్ఖా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పేరు మీద జారీ చేసే చెక్‌లను అంగీకరించకూడదని బ్యాంకులకు ఐటీ విభాగం సూచనలు జారీ చేసిందనే విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అయితే అజయ్ మాకెన్ మీడియా సమావేశం నిర్వహించిన గంటలోపే.. ఆ ఖాతాలు పని చేయడం ప్రారంభించాయి. -
చలికాలంలో కొబ్బరి నూనె గడ్డకట్టకూడదంటే ఇలా చేయండి!
శీతాకాలంలో జుట్టు, ముఖం డ్రైగా మారి ఇబ్బంది పెడుతుండటమే గాక కొన్ని ఆహార పదార్థాలు కూడా గడ్డకట్టుకుపోయి వాడుకోవడానికి ఇబ్బందిగా ఉంటాయి. ఈ కాలంలో ప్రతిది మైల్డ్‌గా ఉంటుంది. ఓ పట్టనా ఏది తొందరగా వేడెక్కదు. దీనికి తగ్గట్టు వాతావరణం అలానే ఉంటుంది. ఇలాంటప్పడూ కొన్ని చిట్టి చిట్కాలు ఫాలో అయితే ఈజీగా పరిష్కారం దొరుకుంతుంది. మనకు కూడా చాలా వెసులుబాటుగా ఉంటుంది. ఆ ఇంటి చిట్కాలేంటో చూసేద్దామా! తలకు పెట్టుకోవడానికి సరిపడా కొబ్బరిపాలలో కొన్నిచుక్కల నిమ్మరసం కలపాలి. ఈ పాలను కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి గంట తరువాత మైల్డ్‌షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు మూడుసార్లు కొబ్బరి పాలను ఇలా తలకు పట్టిస్తూ ఉంటే కురులకు మంచి పోషణ అంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జిడ్డుతత్వం గల కురులు ఉన్నవారికి ఈ కొబ్బరిపాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఎండబెట్టిన కమలాతొక్కలను దోరగా వేయించి మెత్తటి పొడిలా చేయాలి. దీనిలో టీస్పూను పసుపు, రెండు టీస్పూన్ల శనగపిండి, కొద్దిగా నీళ్లుపోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూతలా వేసి ఆరనివ్వాలి. ఇరవై నిమిషాల తరువాత తడిచేతులతో రుద్ది కడిగేయాలి. మృతకణాలు, ట్యాన్ తొలగిపోయి ముఖం కాంతిమంతంగా మారుతుంది. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే ముఖం మిలమిలలాడుతుంది. టేబుల్ స్పూను ఉసిరి నూనె లేదా బాదం నూనె తీసుకుని కొబ్బరి నూనెలో కలిపితే చలికాలంలో కొబ్బరినూనె గడ్డకట్టదు. ఉసిరి, బాదంలోని గుణాలు నూనెని గడ్డకట్టనివ్వవు. అందువల్ల వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ కొబ్బరి నూనె గట్టిగా కాదు. మాయిశ్చరైజర్ లేదా లోషన్లో రెండు చుక్కల గ్లిజరిన్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, చేతులకు రాసుకోవాలి. ఈ మిశ్రమం చర్మానికి తేమనందించి చర్మం పొడిబారకుండా చేస్తుంది. (చదవండి: ఆత్రేయపురం పూతరేకులను తలపించే ఇరానీ పుతరేకు! ఎలా చేస్తారంటే..) -
విశాక ఇండస్ట్రీస్‌కు చెందిన రూ.8 కోట్లు ఫ్రీజ్!
సాక్షి, హైదరాబాద్: చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్‌కు సంబంధించిన విశాక ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్విసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఖాతాలోకి బదిలీ అయిన రూ.8 కోట్లు సైఫాబాద్ పోలీసులు ఫ్రీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ఆదేశాల మేరకు నగర పోలీసు ఉన్నతాధికారుల సూచనలతో ఈ చర్య తీసుకున్నట్లు మధ్య మండల డీసీపీ వెంకటేశ్వర్లు ఆదివారం వెల్లడించారు. గత సోమవారం జరిగిన ఈ వ్యవహారంపై ఆ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్ బుధవారం సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ విజిలెన్స్ కంపెనీ రామగుండంలోని వివేక్ ఇంటి చిరునామాతో ఉందని, ఆయన సంస్థ ఉద్యోగులే ఈ సంస్థ డైరెక్టర్లుగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. ఈ లావాదేవీపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని, ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికే వివేక్ ఈ షెల్ కంపెనీ ఖాతా వినియోగిస్తున్నట్లు సీఈఓకు ఇచ్చిన ఫిర్యాదుతో పేర్కొన్నారు. దీంతో ఈ విషయాన్ని సీఈఓ నగర పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన సైఫాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బేగంపేట బ్రాంచ్‌లో ఉన్న విశాక ఇండస్ట్రీస్‌కు చెందిన ఓ గుర్తుతెలియని ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీస్ సంస్థకు ఐడీబీఐ బ్యాంక్ బషీర్‌బాగ్ బ్రాంచ్‌లోకి బదిలీ అయినట్లు గుర్తించారు. సోమవారం ఉదయం 10.57 గంటలకు జరిగిన ఈ లావాదేవీ అనుమానాస్పదంగా ఉండటంతో సైఫాబాద్ పోలీసులు ఈ మొత్తాన్ని ఫ్రీజ్ చేయించారు. దీనిపై ఎన్నికల అధికారులతో పాటు ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తదితర విభాగాలకు సమాచారం ఇచ్చారు. దీనిపై దర్యాప్తు చేపట్టామని, వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
ఆరుగంటలకు పైగా మంచులోనే..! బతికే ఛాన్సే లేదు! కానీ..
అద్భుతాలెప్పుడూ అకస్మాత్తుగానే జరుగుతాయి. వాటిని కళ్లారా చూసినవారికి ‘ఔరా!’ అనిపిస్తే... చూడనివారికి, కొన్నాళ్ల తర్వాత ఆ కథ విన్నవారికి.. ‘ఔనా..?’ అనిపిస్తుంది. ఈ రెండిట్లోనూ ‘ఇదెలా సాధ్యం?’ అనే అనుమానం అంతర్లీనంగా ధ్వనిస్తుంది. ఆ అనుమానం తీరిందంటే.. ‘కొత్త ఒక వింత పాత ఒక రోత’ అన్నట్లుగా ఆ ఘటన ఇట్టే మరుగున పడిపోతుంది. అది అస్పష్టంగా మిగిలితే మాత్రం.. హిస్టరీలో మిస్టరీగా నిలిచిపోతుంది. అది 1980 డిసెంబర్ 20, రాత్రి పది దాటింది. అమెరికా, మినెసోటాలోని లెంగ్బి అనే ప్రాంతం గుండా ఓ కారు వేగంగా దూసుకుపోతోంది. ఆ కారులో 19 ఏళ్ల జీన్ హిలీయార్డ్ అనే అమ్మాయి.. తన ఇంటికి చేరుకోవడానికి ఆ చిన్న మార్గాన్నే అడ్డదారిగా ఎంచుకుంది. చుట్టూ నిర్మానుష్యం. అక్కడక్కడా వీథి దీపాలు వెలుగుతున్నా కమ్ముకున్న మంచు ఆ వెలుతురును మసకబార్చే పనిలో పడింది. ఇంకాస్త ముందుకెళ్లేసరికి కారు హెడ్‌లైట్స్ కూడా చీల్చలేనంత చిమ్మచీకటి ముసిరింది. ఉన్నపళంగా బ్రేక్స్ ఫెయిల్ అయ్యి పక్కనే ఉన్న గుంతవైపు కారు ఒరిగిపోయింది. కారు చక్రాలు మంచు పెళ్లల్లో చిక్కుకోవడంతో.. ఎంత ప్రయత్నించినా ముందుకు కదల్లేదు. గడ్డకట్టే ఆ చలికి రాత్రంతా కారులోనే ఉంటే ప్రాణాలకే ప్రమాదమని వెంటనే కారు దిగి.. సమీపంలోని ఏదో ఒక ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది. అప్పటికి ఆమె చేతులకు గ్లౌజులు, ఒంటి మీద పొడవాటి చలి కోటు, కాళ్లకు బూట్లు ఉన్నాయి. అయితే కంగారులో టోపీ కారులోనే మరచిపోయింది. ఆ సమయంలో దాదాపు మైనస్ 22 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్‌తో మంచు.. వానలా పడుతుంది. అదంతా తనకు తెలిసిన దారే కావడంతో దగ్గర్లోని ఓ ఇంటికి వెళ్లి తలుపు కొట్టింది. అయితే ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. పెరుగుతున్న చలి ఒంట్లో వణుకు పుట్టిస్తోంది. జీన్స్, నెల్సన్(లేటెస్ట్ ఫోటోలు) బుర్ర మొద్దు బారిపోతోంది. ఆ క్షణంలో జీన్ కి.. స్నేహితుడు వాలే నెల్సన్ గుర్తొచ్చాడు. అతడి ఇల్లు అక్కడికి సరిగ్గా రెండు మైళ్ల దూరంలో ఉంటుందని తనకు బాగా తెలుసు. వెంటనే అతడి ఇంటి వైపు నడక సాగించింది. అయితే చీకటి, పొగమంచు కలసి జీన్‌ని తికమక పెడుతున్నాయి. కళ్లు ఆర్పకుండా.. మిణుకు మిణుకుమంటున్న వెలుతురులో తోవ వెతుక్కుంటూ అడుగులు వేస్తున్న జీన్ లో ప్రాణభయం మొదలైంది. ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరవుతోంది. తీక్షణంగా చూసుకుంటూ.. తిన్నగా నడుస్తూ.. మొత్తానికి నెల్సన్ ఇంటి సమీపానికి చేరుకుంది. అప్పటికే సత్తువ సన్నగిల్లింది. నరాలు బిగుసుకుని.. శరీరం ఆధీనం కోల్పోయింది. ∙∙ మరునాడు ఉదయం ఏడు దాటింది. నెల్సన్ ఇంటి తలుపు తెరుచుకున్నాయి. గుమ్మానికి కాస్త దూరంలో మంచు పెళ్లల మధ్య.. ఓ వింత ఆకారం నెల్సన్ కంటపడింది. బెరుగ్గానే వెళ్లి చూశాడు. చూసి నివ్వెర పోయాడు. అచ్చం దెయ్యంలాగా కళ్లు పెద్దగా తెరచుకుని.. ఇనుప కడ్డీలా బిగుసుకుపోయి.. మంచులో కూరుకుపోయి ఉంది జీన్ హిలీయార్డ్. ఉలుకూ పలుకూ లేదు. సుమారు ఆరుగంటలకు పైగా.. ఆ మంచు గాలుల్లో ఉండిపోవడంతో ఆమె పూర్తిగా గడ్డకట్టుకుపోయింది. వెంటనే ఆమెను కాలర్ పట్టుకుని వరండాలోకి లాక్కెళ్లాడు నెల్సన్. ఆమె బోర్డు కంటే గట్టిగా బిగుసుకుపోయుంది. ఆ తీరుకు ఆమె చనిపోయిందనే అనుకున్నాడు. కానీ ఆమె ముక్కు నుంచి కొన్ని బుడగలు రావడం చూశాడు నెల్సన్. వెంటనే ఫోస్టన్లోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే ఆమెను పరీక్షించిన డాక్టర్లు షాక్ అయ్యారు. కనీసం ఇంజెక్షన్ చేయడానికి కూడా ఆమె శరీరం సహకరించలేదు. సూది చర్మంలోకి దిగలేదు. దాంతో వాళ్లు ఆమె చనిపోయిందని అనుకున్నారు. వెంటనే హీటింగ్ ప్యాడ్లతో ఆమెను వేడెక్కించే ప్రయత్నం చేశారు. కొన్ని గంటలకు ఆ ప్రయత్నం ఫలించింది. ఆమెలో కదలికలు మొదలయ్యాయి. మధ్యాహ్నం అయ్యేసరికి విషయం తెలుసుకున్న జీన్ తల్లి బెర్నిస్, తండ్రి లెస్టర్లు ఆసుపత్రికి పరుగుతీశారు. కూతురు ప్రాణాలతో తమకు దక్కినందుకు పొంగిపోయారు. జీన్ స్నేహితుడు నెల్సన్ కి వేలవేల కృతజ్ఞతలు తెలిపారు. కొన్నిరోజుల్లోనే ఆమె పూర్తిగా కోలుకుంది. అయితే ‘ఆ రాత్రి నెల్సన్ ఇంటి ముందు పడిపోవడం వరకే నాకు గుర్తుంది. ఆసుపత్రి బెడ్ మీద నిద్రపోయి లేచినట్లుగా అనిపించింది. పడిపోయాక ఏం జరిగిందో నాకు ఏదీ గుర్తు లేదు’ అని జీన్ చెప్పడం ఆశ్చర్యకరం. కళ్లు తెరిచే బిగుసుకుపోయిన జీన్ కి ఏదీ కనిపించకుండా, ఏదీ గుర్తు లేకుండా, తిరిగి ప్రాణాలతో బయటపడటం అందరినీ నివ్వెరపరచింది. వార్తా ప్రతికలన్నీ ఈ అద్భుతాన్ని కథలు కథలుగా ప్రచురించాయి. ఇదే మూలాన్ని అల్లుకుంటూ.. ఎన్నో సినిమాలు, కథలు, డాక్యుమెంటరీలు పుట్టుకొచ్చాయి. నెల్సన్ , జీన్లకి ఎలా పరిచయం అంటే.. నెల్సన్ స్నేహితుడు పాల్.. గర్ల్‌ఫ్రెండే ఈ జీన్. ఘటన జరిగిన ముందు రోజు కూడా జీన్, నెల్సన్ ఇద్దరూ పాల్ సమక్షంలో కలిశారట. ఫోస్టన్ అమెరికన్ లెజియన్‌లో హాటెస్ట్ స్పాట్లో ఓ పార్టీలో కలసి.. ఆటపాటలతో ఎంజాయ్ చేశారట.నెల్సన్ ఇప్పటికీ లెంగ్బీకి ఉత్తరాన ఉన్న క్లియర్బ్రూక్ సమీపంలో మీట్ షాప్ నడుపుకుంటూ నివసిస్తున్నాడు. జీన్ కొన్నాళ్లకు పెళ్లి చేసుకుని.. పిల్లల్ని కూడా కన్నది. కొన్నేళ్లకు విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తోంది. ప్రస్తుతం కేంబ్రిడ్జ్‌లో ఉంటూ.. వాల్‌మార్ట్‌లో పని చేస్తోంది. ఈ ఘటన గురించి ఎప్పుడు అడిగినా ఆమె మొదటి స్పందన ఏంటో తెలుసా? ‘నేనురాత్రి పూట కారు డ్రైవింగ్ మానేశాను’ అని. ఈ రోజుల్లో, వైద్యరంగం బాగా అభివృద్ధి చెందింది. కానీ 1980లో.. అదీ.. ఒక గ్రామీణ ఆసుపత్రిలో.. కేవలం కొన్ని హీటింగ్ ప్యాడ్లతో.. చావు అంచులకు చేరిన మనిషిని కాపాడటం అనేది నేటికీ మిస్టరీనే. సంహిత నిమ్మన (చదవండి: బుడగల మాదిరి భవనం..కట్టడానికే 14 ఏళ్లు..కానీ..) -
ఎంతసేపు ఫ్రిజ్‌లో ఉంచినా మద్యం గడ్డకట్టదు.. ఎందుకంటే?
ఈ రోజుల్లో చాలామందికి మద్యం అలవాటు ఉంది. మద్యాన్ని చాలామంది చల్లగా తాగేందుకు లేదా, ఐస్ ముక్కలు వేసుకుని తాగేందుకు ఇష్టపడుతుంటారు. అయితే మద్యాన్ని ఫ్రిజ్‌లో ఎంతసేపు ఉంచినా అది ఎందుకు గడ్డకట్టదో మీకు తెలుసా? దీనికి వెనుకనున్న కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంగతి తెలుసుకునేముందు ఏ ద్రవ పదార్థమైనా ఏ విదంగా గడ్డ కడుతుందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ లిక్విడ్లోనూ దాని అంతర్గత ఉష్ణోగ్రత ఉంటుంది. అది దాని వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అది ఉన్న వాతావరణంలోని ఉష్ణోగ్రత తగ్గితే దానిలోని అణువులు ఒకదానికొకటి మరింత దగ్గరవుతాయి. ఫలితంగా ద్రవ పదార్థం గడ్డకట్టే స్థితికి చేరుకుంటుంది. ద్రవ పదార్థం గడ్డకట్టడమనేది వివిధ కారణాలపై ఆధారపడివుంటుంది. మద్యంలో ఉండే ఆర్గానిక్ మాలిక్యూల్స్ దానిని గడ్డకట్టనీయకుండా చేస్తాయి. ద్రవపదార్థం గడ్డకట్టడం అనేది దాని ఘనీభవనస్థానంపై ఆధారపడి ఉంటుంది. ప్రతీ పదార్థానికి దాని ఘనీభవన స్థానం వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు నీటినే తీసుకుంటే అది జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఘనీభవిస్తుంది. అంటే నీటి ఘనీభవన స్థానం జీరో డిగ్రీ సెంటీగ్రేడ్. మద్యం విషయానికొస్తే దాని ఘనీభవన స్థానం 114 డిగ్రీ సెంటీగ్రేడ్. ఈ కారణం చేతనే మద్యం గడ్డ కట్టాలంటే 114 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. మన ఇళ్లలో ఉండో ఫ్రిజ్‌లలో 0 నుంచి -10 లేదా అత్యధిక ఉష్ణోగ్రత -30 డిగ్రీ సెంటీగ్రేడ్‌గా ఉంటుంది. అందుకే మద్యాన్ని ఇంటిలోని ఫ్రిజ్‌లో ఎంతసేపు ఉంచినా గడ్డకట్టదు. ఇది కూడా చదవండి: తొలి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్‌కు 56 ఏళ్లు.. ఆరోజు జరిగిందిదే.. -
క్యూనెట్ స్కాంపై ఈడీ కొరడా.. రూ.137 కోట్ల విలువైన ఆస్తులు జప్తు
సాక్షి, హైదరాబాద్: క్యూనెట్ స్కాంకు సంబంధించి వీహాన్ డెరెక్ట్ సెల్లింగ్ సంస్థపై ఈడీ కొరడా ఝులిపించింది. ఈ కంపెనికీ చెందిన రూ.137కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. హైదరాబాద్, బెంగళూరులోని 8 భవనాలను జప్తు చేసింది. సైబరాబాద్‌లో నమోదైన కేసు విచారణలో భాగంగా ఈమేరకు హైదరాబాద్ విభాగం ఈడీ చర్యలు తీసుకుంది. 58 బ్యాంకు ఖాతాలను కూడా సీజ్ చేసింది. దేశవ్యాప్తంగా క్యూనెట్‌పై మొత్తం 38 చోట్ల కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోనూ 9 కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ దాడులు చేసి కఠిన చర్యలు తీసుకుంది. చదవండి: పేపర్ లీక్ వ్యవహారంలో మరో ట్విస్ట్! -
రూ. 407 కోట్లతో సీసీఎల్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టంట్ కాఫీ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ వియత్నాం తయారీ కేంద్రంలో కొత్త యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 6,000 టన్నుల వార్షిక సామర్థ్యంతో ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ ఫెసిలిటీని నెలకొల్పనున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.407 కోట్లు. కాగా, 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను మధ్యంతర డివిడెండ్ రూ.3 చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. డిసెంబర్ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ఫలితాల్లో కంపెనీ నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 24.9 శాతం ఎగసి రూ.73 కోట్లు సాధించింది. ఎబిటా 9 శాతం పెరిగి రూ.101 కోట్లుగా ఉంది. టర్నోవర్ 26.5 శాతం అధికమై రూ.535 కోట్లు నమోదు చేసింది. -
ఫ్రిజ్‌లో నాగుపాము
తుమకూరు: తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా కొత్తగెరె గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తికి చెందిన ఇంటిలో నాగుపాము దూరింది. శనివారం ఉదయం ఇంటిలోకి ప్రవేశించిన నాగుపాము ఫ్రిజ్ వెనుకభాగంలోకి చేరింది. కుటుంబ సభ్యులు స్నేక్ నిపుణుడు మహాంతేశ్కు సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకుని పామును పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారు. -
చీకటి ఒప్పందాలు.. సైబర్ నేరస్తులతో బ్యాంకర్ల దోస్తీ
సాక్షి, హైదరాబాద్: ‘నగరానికి చెందిన ఓ బాధితురాలు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ మోసానికి గురైంది. తన అకౌంట్లోని సొమ్ము మాయం కాగానే ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే సంబంధిత బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేయాలని పోలీసులు బ్యాంకు నోడల్ ఏజెన్సీకి సూచించారు. అయినా సైబర్ నేరస్తుడు బాధితురాలి అకౌంట్లోని సొమ్మును స్వాహా చేసేశాడు’.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు బ్యాంక్ అధికారులు కావాలనే అకౌంట్‌ను ఫ్రీజ్ చేయడంలో ఆలస్యం చేశారన్న విషయం తెలిసి షాక్ గురయ్యారు. సైబర్ నేరస్తులు బ్యాంక్ అధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని, కొట్టేసిన సొమ్ములో వారికీ కమీషన్లు ఇస్తున్నారన్న నిజాలు తెలిసి విస్తుపోయారు. ఝార్ఖండ్, బిహార్ తదితర రాష్ట్రాల్లోని పలు బ్యాంక్‌లలో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అడ్మిని స్ట్రేటర్లు, బ్యాంకర్లు అందరూ నేరస్తులకు సహకరిస్తున్నారని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఒకరు తెలిపారు. జీరో అకౌంట్లయిన జన్‌ధన్ ఖాతాల్లో రోజుకు రూ.లక్ష, రూ.2 లక్షల లావాదేవీలు జరుగుతున్నా పట్టించుకోవటం లేదని తెలిపారు. బ్యాంకు ఖాతాలలో అనుమానాస్పద లావాదేవీలు గుర్తిస్తే వెంటనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి దృష్టికి తేవాలి. అధికారులు వాటిని పట్టించుకోకుండా... నేరస్తులకు సహకరిస్తున్నారని ఆయన వివరించారు. చదవండి: మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నారాజ్! మ్యూల్ అకౌంట్లలోనే లావాదేవీలు.. నిరక్షరాస్యులు, పేదల గుర్తింపు కార్డులతో ఏజెంట్లు నకిలీ(మ్యూల్) అకౌంట్లను తెరిచి, పాస్‌బుక్, చెక్‌బుక్, డెబిట్ కార్డ్, ఫోన్ బ్యాంక్ కిట్ మొత్తాన్ని నేరస్తులకు అందజేస్తుంటారు. ఒక్కో ఖాతాకు రూ.25–30 వేలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఈ బినామీ అకౌంట్లలోనే సైబర్ మోసాల లావాదేవీలను నిర్వహిస్తున్నారు. గుజరాత్, బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి మ్యూల్ అకౌంట్లు ఎక్కువగా ఉన్నాయి. వీటి తాలూకు లావాదేవీలు మాత్రం బిహార్, ఝార్ఖండ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల నుంచి చేస్తున్నారు. దీంతో కేసు దర్యాప్తులో సైబర్ క్రైమ్ పోలీసులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాస్తవానికి ఖాతాదారుల చిరునామాలను ధ్రువీకరించిన తర్వాతే బ్యాంకులు అకౌంట్లను తెరవాలి. లేకపోతే వారి మీద కూడా ఐపీసీ 109 అబాట్మెంట్ సెక్షన్ కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాచకొండ సైబర్ క్రైమ్‌లో నమోదయిన ఓ కేసులో బాధితుడి నుంచి కొట్టేసిన రూ.60 లక్షల సొమ్మును నేరస్తులు అసోంకు చెందిన ఒక ఓలా డ్రైవర్ అకౌంట్లో డిపాజిట్ చేశారు. ఆ డ్రైవర్ నగదును విత్‌డ్రా చేసి నేరస్తులకు అందించాడు. ఖాతాదారుకు ఆ లావాదేవీ మోసపూరితమైనదని తెలిసినా నేరస్తుడికి సహకరించిన నేపథ్యంలో పోలీసులు ఆ డ్రైవర్‌పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భారతీయ టెకీలకు ట్రంప్ మరోసారి షాక్!
వాషింగ్టన్: వైట్‌హౌస్ వీడడానికి కొద్ది రోజుల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ టెక్కీలకు మళ్లీ షాక్ ఇచ్చారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించిన గ్రీన్ కార్డు, హెచ్–1బీతో పాటుగా వివిధ కేటగిరీల్లో ఉద్యోగ ఆధారిత వీసాలపై నిషేధాన్ని మార్చి 31వరకు పొడిగించారు. అమెరికన్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి వీటిపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్టుగా స్పష్టం చేశారు. కరోనాతో అతలాకుతలమవుతున్న అగ్రరాజ్యంలో గత ఏడాది జూన్‌లో ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా అన్ని రకాల వీసాలపై డిసెంబర్ 31 వరకు నిషేధం విధించిన విషయం తెలిసిందే. మరికొద్ది గంటల్లో నిషేధం గడువు ముగుస్తుందనగా గురువారం పొడిగింపు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ట్రంప్ వలస విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ హెచ్–1బీ వీసాలపై నిషేధాన్ని ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ట్రంప్ వలసదారుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. ట్రంప్ నిర్ణయంతో భారతీయ టెకీలకు తీవ్ర ఎదురు దెబ్బ తగలనుంది. డాలర్ డ్రీమ్స్ కలల్ని నెరవేర్చుకోవడానికి అమెరికా వెళ్లాలంటే భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన వారు మరో మూడు నెలలవరకు ఎదురు చూడాల్సిందే. అమెరికా కంపెనీలకు 10 వేల కోట్ల నష్టం ! ట్రంప్ వీసా విధానంపై అమెరికాలోనూ తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం జరుగుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. మరోవైపు జూన్‌లో ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులతో 500 టెక్ కంపెనీలకు 10వేల కోట్ల డాలర్లు నష్టం కలిగినట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ సారి నిషేధం పొడిగింపు వల్ల పెద్దగా నష్టం జరగదని, బైడెన్ అధ్యక్షుడిగా పదవీ ప్రమాణం చేశాక వలసదారులకు అనుకూలంగా నిర్ణయాలుంటాయని భావిస్తున్నారు. దేశంలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో 6.7శాతం ఉన్నందుకే నిషేధాన్ని పొడిగించానంటూ ట్రంప్ సమర్థించుకున్నారు. -
రాత్రికి రాత్రే రైతు ఖాతాలో రూ.473 కోట్లు
నల్లగొండ/యాదాద్రి/తుర్కపల్లి: ఓ సామాన్య రైతు ఖాతాలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.473 కోట్ల మేర నగదు జమైంది. అంత డబ్బు తన ఖాతాలో చూసిన ఆ రైతు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామానికి చెందిన అనుమూల సంజీవరెడ్డి అనే రైతుకు భువనగిరిలోని డక్కన్ గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. సంజీవరెడ్డి బుధవారం పక్కనున్న సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌కు వెళ్లాడు. డబ్బులు అవసరం ఉండగా ఏటీఎం కార్డు ద్వారా డీసీసీబీ ఏటీఎం సెంటర్లో డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా డబ్బులు రాకపోవడంతో బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. అంతే తన ఖాతాలోని బ్యాలెన్స్ చూసి ఆశ్చర్యపోయాడు. ఖాతాలో రూ.473,13,30,000 అని ఉంది. ఇన్ని డబ్బులు తన ఖాతాలో ఎందుకు ఉన్నాయో అతనికి అర్థం కాలేదు. ఆ ఏటీఎంలో తప్పుడు రిసిప్ట్ ఏమైనా వచ్చిందేమోనని ఎస్బీఐ ఏటీఎంలో కూడా చెక్ చేశాడు. అక్కడా అంతే బ్యాలెన్స్ చూపించింది. (చదవండి: నోట్లోంచి డబ్బులు రప్పిస్తానని.. ) అయితే తన ఖాతాలో అన్ని డబ్బులు ఉన్నా.. ఏటీఎం నుంచి డబ్బులు ఎందుకు రావడం లేదో తెలుసుకునేందుకు గురువారం భువనగిరిలోని డక్కన్ గ్రామీణ బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు అధికారులకు విషయం తెలపగా వారు చెక్ చేసి ‘మీ అకౌంట్ ఫ్రీజ్ అయ్యింది.. ఏటీఎం సర్వర్ పనిచేయడం లేదు’.. అని సమాధానం ఇచ్చారు. ఏటీఎం రిసిప్ట్‌లో భారీ మొత్తంలో బ్యాలెన్స్ చూపిస్తోందని చెప్పగా.. ‘మీ ఖాతాలో కేవలం రూ.4వేల చిల్లర మాత్రమే ఉందని’సమాధానం ఇచ్చారు. దీంతో సంజీవరెడ్డి ఏమీ అర్థంకాక వెనుదిరిగి ఇంటికి చేరుకున్నాడు. కాగా, అతని ఖాతాలో కోట్ల కొద్ది డబ్బు జమైందన్న విషయం రెండు రోజులుగా మండలంలో చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్యేకు ఎదురు దెబ్బ
భువనేశ్వర్: చంపువా నియోజకవర్గం ఎమ్మెల్యే సనాతన్ మహాకుడు బ్యాంకు ఖాతాల్ని స్తంభింపజేశారు. ఈ ఖాతాల్లో ఆయన పేరు మీద రూ. 165 కోట్లు జమ అయి ఉన్నట్లు గుర్తించారు. రూ. 50 లక్షల నగదుకు సంబంధించిన వివరణ సంతృప్తికరంగా లేనందున ఇండస్ ఇండ్ బ్యాంకు ఖాతాని ఇటీవల స్తంభింపజేశారు. బాసుదేవ్‌పూర్‌లో ఎమ్మెల్యే ఇంటి నుంచి బ్యాంకు సిబ్బంది వ్యక్తిగతంగా తీసుకు వెళ్తుండగా పోలీసులకు చిక్కారు. ఈ వ్యవహారంపట్ల బ్యాంకు అధికార వర్గం, ఎమ్మెల్యే సంతృప్తికరమైన వివరణ దాఖలు చేయడంలో విఫలం అయ్యారు. ఈ సంఘటనలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు బ్యాంకు మేనేజరుగా పేర్కొన్నారు. బ్యాంకు ఖాతా లావాదేవీల్ని స్తంభింపజేసి వివరణ కోరుతు పోలీసులు ఎమ్మెల్యేకి తాఖీదు జారీ చేశారు. వివరణ దాఖలు చేసేందుకు ఎమ్మెల్యే 20 రోజుల గడువు కోరినట్లు తెలిపారు. ఆరోగ్య కారణాలతో గడువు అభ్యర్థించడంతో అనుమతించారు. గడువు ముగిసిన ఎమ్మెల్యే పోలీసుల ముందు హాజరు కానందున బ్యాంకు ఖాతాల్ని స్తంభింపజేసినట్లు తెలిపారు. కొత్త పార్టీ సన్నాహాలు! స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగుతున్న కెంజొహర్ జిల్లా చంపువా నియోజకవర్గం ఎమ్మెల్యే సనాతన్ మహాకుడు సొంత పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ప్రాథమిక ప్రక్రియ ముగిసింది. జన సమృద్ధ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ప్రజా ప్రాతినిథ్యం చట్టం–1951 సెక్షన్ 29–ఎ కింద కొత్త పార్టీకి దరఖాస్తు దాఖలు చేశారు. భారత ఎన్నికల కమిషను ఆమోదం కోసం నిరీక్షిస్తున్నారు. కెంజొహర్‌గొడొ కాశీపూర్–బలరామ్‌పూర్ పార్టీ ప్రధాన కార్యాలయంగా నమోదు చేశారు. కొత్త పార్టీ అధ్యక్షుడు సనాతన్ మహాకుడు కాగా సరోజ్ సాహు కార్యనిర్వాహక అధ్యక్షునిగా ప్రాథమిక దరఖాస్తులో వివరాల్ని దాఖలు చేశారు. వీరివురితో మరో 8 మందిని పార్టీ సభ్యులుగా పేర్కొన్నారు. అభ్యర్థన మేరకు అంతా సజావుగా ముగిస్తే జన సమృద్ధ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 147 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీ చేస్తారని సనాతన్ మహాకుడు ప్రకటించారు. శ్రీ జగన్నాథుడు కొలువుదీరిన శ్రీ క్షేత్రం(పూరీ) నుంచి పార్టీ కార్యకలాపాల్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. పూరీ నుంచి కెంజొహర్ జిల్లా ఘొటొగాంవ్ మా తరిణి దేవస్థానం వరకు కొత్త పార్టీ కార్యకర్తలు ఊరేగింపు నిర్వహించేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఈ సన్నాహాల వెనక అదృశ్య హస్తం ఉన్నట్లు అధికార పక్షం బిజూ జనతా దళ్ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పార్టీ తీవ్ర ప్రకంపనలు ప్రేరేపిస్తుందని సనాతన్ అనుచరులు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. కెంజొహర్ జిల్లా గనుల అక్రమ తవ్వకాల నిధులతో ఇదంతా సాగుతున్నట్లు రాజకీయ శిబిరాల్లో ఊహాగానాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సనాతన్ లోగడ సనా సేన పేరుతో ఒక సంస్థ నిర్వహించారు. నిన్న మొన్నటి వరకు సనాతన్ మహాకుడు అధికార పక్షం బిజూ జనతా దళ్‌లో చేరుతారని భావించారు. ఈ ఊహలు తలకిందులు కావడంతో రాజకీయంగా చర్చనీయాంశం అయింది. కెంజొహర్ జిల్లా దళిత వర్గాలత్లో సనాతన్ మహాకుడుకు గట్టి పట్టు ఉంది. సనాతన్ మహాకుడు ఏర్పాటు చేసిన కొత్త పార్టీ అధికార పక్షం బిజూ జనతా దళ్‌కు కెంజొహర్ జిల్లాలో పక్కలో బల్లెంగా మారుతుందని కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. -
గడ్డకట్టిన నయాగరా జలపాతం
-
అక్కడ కార్లపై నిషేధం
సింగపూర్ : రహదారులపై భరీదైన బైక్‌లు, కార్లలో జామ్..జామ్ అంటూ దూసుకుపోవడం చాలామందికి సరదా. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ఇటువంటి సన్నివేశాలే కనిపిస్తాయి. కార్లు.. బైక్‌లో నిత్యావసరాల జాబితాలో చేరిపోవడంతో సగటున ప్రతి ఇంటికి కారో.. బైక్‌లో ఉంటోంది. దీంతో రోడ్లపై విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మనదేశంలోనూ.. ప్రధానంగా ఢిల్లీ-గుర్గావ్ హైవే మీద ట్రాఫిక్ సమస్యలను మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. ఆధునిక రవాణా వ్యవస్థకు కేంద్రగా నిలిచిన సింగపూర్‌లోనూ ట్రాఫిక్ జామ్‌లు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. ఆసియాలో అభివృద్ధి చెందిన దేశాల్లో సింగపూర్ ఒకటి. ఇక్కడ వ్యక్తిగత వాహనాలు సంఖ్య అధికం కావడంతో రహదారులపై ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి సింగపూర్‌లో వ్యక్తిగత వాహనాలను అంచెలంచెలుగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజా రవాణ వ్యవస్థకు ఊపు తీసుకురావడంతో పాటు.. వ్యక్తిగత వాహనాలు ఉపయోగించాలనుకునే వారు.. భారీగా ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది 0.25 శాతం వాహనాలను తగ్గిస్తూ.. చివరకు వ్యక్తిగత వాహనాలు లేకుండా చేయాలన్నది తమ ఆలోచనగా సింగపూర్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ ఆథారిటీ (ఎల్‌టీఏ) పేర్కొంది. కొత్త చట్టం ప్రకారం సింగపూర్‌లో వ్యక్తిగత వాహనాన్ని కొనుగోలు చేయడం అనేది అత్యంత ఖరీదైన వ్యవహరం. కారును కొనడంతో పాటు.. దానిని పదేళ్ల పాటు వినియోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వానికి ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎన్టైటిల్మెంట్‘ కింద 2లక్షల 50 వేల రూపాయాలు చెల్లించాలి. అంతేకాక ప్రభుత్వం విధించిన వివిధరకాల పన్నులతో కార్ల ధరలు ఆకాశానికి చేరుకున్నాయి, టయోటా కరోలా ఆల్టీస్, అయిదు డోర్ల సెడాన్ కారు ఖరీదు.. రూ. 52 లక్షలకు చేరింది. సింగపూర్‌లోని భూభాగంలో ఇప్పటికే 12 శాతాన్ని రహదారుల నిర్మాణం కోసం వినియోగించినట్లు ఎల్‌టీఏ అధికారులు తెలిపారు. -
ఫీజు.. ఫ్రీజ్
- విద్యార్థులకు అందని ఫీజు, ఉపకార వేతనాలు - ఫ్రీజింగ్‌తో ట్రెజరీలో మూలుగుతున్న బిల్లులు - బడుగు విద్యార్థులతో ప్రభుత్వ ఆటలు - మరో మూడు నెలల్లో ముగుస్తున్న విద్యా సంవత్సరం కర్నూలు(అర్బన్): బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలు ఆడుకుంటోంది. వారికి సకాలంలో చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల విషయంలో అంకెల గారడీ చేస్తోంది. ఫీజుల రూపంలో ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులకు కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తుందే తప్ప క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో అనే విషయాలను పట్టించుకోవడం లేదు. ఆయా సంక్షేమ శాఖలకు చెందిన ఉన్నతాధికారుల నుంచి కాగితాలపై విడుదల చేస్తున్న మొత్తాలను చూసి సంబంధిత జిల్లా అధికారులు ఆఘమేఘాల మీద బిల్లులను తయారు చేసి ట్రెజరీలకు పంపుతున్నారు. తీరా ట్రెజరీలకు వెళ్లిన బిల్లులకు మోక్షం లభించడం లేదు. కారణమేమిటని విచారిస్తే ఎలాంటి బిల్లులు పాస్ చేయరాదని ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించినట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవైపు కుడిచేత్తో కోట్ల రూపాయలను విడుదల చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు ఎడమచేత్తో ఫ్రీజింగ్‌ను విధిస్తోంది. దీంతో ఇంటర్మీడియట్ నుంచి పీజీ, మెడికల్ తదితర ఉన్నత విద్యలను అభ్యసిస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు నేటి వరకు ఎలాంటి ఫీజులు విడుదల కాలేదు. మరో మూడు నెలల్లో పలు కోర్సులకు సంబంధించి విద్యా సంవత్సరం ముగుస్తోంది. అలాగే మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న కారణంగా ఆ నెలలో అన్ని రకాల బిల్లులను ప్రభుత్వం సాధారణంగానే నిలిపివేస్తుంది. దీంతో ఈ విద్యా సంవత్సరంలోనైనా విద్యార్థులందరకీ సరైన సమాయానికి ఫీజులు, ఉపకార వేతనాలు అందుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ట్రెజరీ కార్యాలయానికి ఈ నెల మొదటి వారంలోనే ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు నుంచి బిల్లులు వెళ్లాయి. అయితే ప్రభుత్వం.. ఫ్రీజింగ్ విధించిన కారణంగా ఒక్క బిల్లు కూడా మంజూరుకు నోచుకోలేదు. విడుదలైన బడ్జెట్ ఇదీ.. జిల్లాలో 29,046 మంది ఎస్సీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 23,127 మందికి ఫీజు, ఉపకార వేతనాలు మంజూరు అయ్యాయి. ఈ శాఖకు ఆర్టీఎఫ్ కింద రూ.15,64,84,606, ఎంటీఎఫ్ కింద రూ.6,81,75,405 విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. అలాగే 55,933 మంది బీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 44,720 మందికి, ఈబీసీ విద్యార్థులు 11,997 మంది దరఖాస్తు చేసుకోగా 9907 మందికి మంజూరు చేశారు. ఈ శాఖకు బీసీ విద్యార్థుల ఆర్‌టీఎఫ్‌కు రూ.59,31,76,000, ఈబీసీ విద్యార్థుల ఆర్‌టీఎఫ్‌కు రూ.26,14,32,000, బీసీ విద్యార్థుల ఎంటీఎఫ్‌కు రూ.31,08,59,000 విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. అలాగే 2736 మంది గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1946 మందికి ఫీజును మంజూరు చేశారు. వీరికి ఆర్టీఎఫ్ కింద రూ.1,55,50,000, ఎంటీఎఫ్ కింద రూ.1,15,50,000 విడుదల చేశారు. ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు వచ్చిన సమాచారం ఆధారంగా బిల్లులను ట్రెజరీకి పంపించారు. ఫ్రీజింగ్ కారణంగా అవి విడుదల కాలేదు. హాల్‌టిక్కెట్లు ఇస్తారో లేదో: బీ పవన్‌కుమార్, బీటెక్ ఫైనలియర్ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ ప్రభుత్వం సకాలంలో ఫీజులు, ఉపకార వేతనాలను అందించాలి. మరో రెండు నెలల్లో విద్యా సంవత్సరం పూర్తవుతుంది. ఫైనలియర్ పరీక్షలు కూడా దగ్గరపడుతున్నాయి. ఫీజులను విడుదల చేయకుంటే కళాశాల యాజమాన్యాలు హాల్ టిక్కెట్లు ఇచ్చే విషయంలో ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో అనేక మంది పేద వర్గాలకు చెందిన విద్యార్థులు ఫీజులు చెల్లించలేక విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. వేలిముద్రలు తీసుకోలేదు: ఆర్ మహేష్, బీటెక్ ఫైనలియర్ నిర్ణీత సమయంలోనే ఫీజు, ఉపకార వేతనాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నాను. కానీ ఇంతవరకు తన వేలిముద్రలు కూడా తీసుకోలేదు. ఈ విద్యాసంవత్సరంలో ఫీజు, ఉపకార వేతనాలు విడుదలవుతాయో లేదో అనే భయం పట్టుకుంది. ఒకవేళ ఫీజు విడుదల కాకపోతే పరిస్థితి ఏమిటనే ఆందోళనతో ఉన్నాం. పేద విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం వెంటనే ట్రెజరీల్లో ఆంక్షలను ఎత్తివేసి ఫీజులు, ఉపకార వేతనాలను విడుదల చేయాలి. -
పదార్థాల ప్రత్యేకత కోల్పోకుండా...
ఇంటిప్స్ పదార్థాలను శుభ్రపరచడం, వేరు చేయడం, వండటం, నిల్వ చేయడం.. ఈ నాలుగు విధానాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, మాంసాహారాన్ని శుభ్రపరిచేటప్పుడు గోరువెచ్చని ఉప్పు నీటిని ఉపయోగించాలి. {ఫిజ్‌లో లేదా షెల్ఫ్‌లలో పదార్థాలను ఒకే పాకెట్లో 3-4 రకాలవి వేసి ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఆయా పదార్థాలకున్న ప్రత్యేక వాసన, పోషకాలు కోల్పోతాయి. పదార్థాలను కట్‌చేసేటప్పుడు, వేరు చేసేటప్పుడు గోరువెచ్చని నీటితో తప్పనిసరిగా చేతులను శుభ్రం చేసుకోవాలి. కటింగ్ బోర్డులు, గిన్నెలు ఉపయోగించడానికి ముందు, తర్వాత తప్పనిసరిగా సబ్బు నీటితో శుభ్రపరచాలి. నీచు వాసన రాకుండా ఉండటానికి ఘాటువాసనలు లేని బ్లీచ్‌ని ఉపయోగించవచ్చు. -
మామిడి రసగుల్లా
కావలసినవి: మామిడిపండ్లు - రెండు; మైదా - రెండు కప్పులు; పంచదార - ఒక కప్పు; కోవా - 150 గ్రా. ఏలకులపొడి - చెంచా; పాలు - అరకప్పు తయారి ఒక పాత్రలో మైదా, కోవా వేసి బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి. బాణలిలో నెయ్యి వేసి స్టౌమీద ఉంచి, నెయ్యి కాగాక, తయారుచేసి ఉంచుకున్న ఉండలను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో మామిడిపండ్ల రసం, ఏలకుల పొడి వేసి కలపాలి. వేయించి పెట్టుకున్న మైదా ఉండల్ని వేసి నాననివ్వాలి. {ఫిజ్‌లో ఉంచి అరగంట తర్వాత సర్వ్ చేయాలి.