
మామిడి రసగుల్లా
కావలసినవి: మామిడిపండ్లు - రెండు; మైదా - రెండు కప్పులు; పంచదార - ఒక కప్పు; కోవా - 150 గ్రా. ఏలకులపొడి - చెంచా; పాలు - అరకప్పు
తయారి
ఒక పాత్రలో మైదా, కోవా వేసి బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి. బాణలిలో నెయ్యి వేసి స్టౌమీద ఉంచి, నెయ్యి కాగాక, తయారుచేసి ఉంచుకున్న ఉండలను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో మామిడిపండ్ల రసం, ఏలకుల పొడి వేసి కలపాలి. వేయించి పెట్టుకున్న మైదా ఉండల్ని వేసి నాననివ్వాలి. {ఫిజ్‌లో ఉంచి అరగంట తర్వాత సర్వ్ చేయాలి.