Mango
-
ఫ్యాషన్ టైకూన్ ఇసాక్ ఆండిక్ కన్నుమూత
ఫ్యాషన్ సామ్రాజ్యం ‘మ్యాంగో’ వ్యవస్థాపకుడు, అధినేత ఇసాక్ ఆండిక్ కన్నుమూశారు. శనివారం ఆయన పర్వత ప్రమాదంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆండిక్ వయసు 71 ఏళ్లు. బార్సిలోనా సమీపంలోని మోంట్సెరాట్ గుహలలో బంధువులతో హైకింగ్ చేస్తుండగా కొండపై నుండి 100 మీటర్లకు పైగా జారి పడిపోయాడని పోలీసు ప్రతినిధి తెలిపారు."మాంగో నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు ఇసాక్ ఆండిక్ ఆకస్మికంగా మృతి చెందారని తెలియజేయడానికి చింతిస్తున్నాం" అని కంపెనీ సీఈవో టోని రూయిజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన నిష్క్రమణ భారీ శూన్యతను మిగిల్చిందని, ఆయన కంపెనీ కోసం జీవితాన్ని అంకితం చేశారని, వ్యూహాత్మక దృష్టి, స్ఫూర్తిదాయకమైన నాయకత్వంతో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.ఇస్తాంబుల్‌లో జన్మించిన ఆండిక్ 1960లలో ఈశాన్య స్పానిష్ ప్రాంతమైన కాటలోనియాకు వలస వెళ్లి 1984లో ఫ్యాషన్ బ్రాండ్ మ్యాంగోను స్థాపించారు. ఫోర్బ్స్ ప్రకారం ఆయన నెట్‌వర్త్ 4.5 బిలియన్ డాలర్లు. ఆయన ప్రస్తుతం కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫాస్ట్ ఫ్యాషన్ రిటైలర్ అయిన ఇండిటెక్స్ అధినేత అమాన్సియో ఒర్టెగాను ఢీకొట్టిన వ్యాపారవేత్త ఆండిక్.తిరుగులేని బ్రాండ్దాదాపు 2,800 స్టోర్లతో యూరప్‌లోని అతిపెద్ద ఫ్యాషన్ గ్రూపులలో మ్యాంగో ఒకటిగా ఉంది. దాని వెబ్సైట్ ప్రకారం మ్యాంగో గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 120 కంటే ఎక్కువ దేశాలలో వ్యాపారాలు నిర్వహిస్తోంది. 15,500 మంది ఉద్యోగులతో ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ గ్రూపులలో ఒకటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 2023లో కంపెనీ టర్నోవర్ 3.1 బిలియన్ యూరోలు. -
ఆహా ఆవకాయ! ఒక ముద్ద పడిందంటే.. ఈ రుచులను ఎప్పుడైనా ట్రై చేశారా? (ఫొటోలు)
-
తోతాపురి పండు.. ఎగుమతుల్లో ట్రెండు
చిత్తూరు అర్బన్: తోతాపురి మామిడి కారణంగా చిత్తూరుకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు దక్కింది. తోతాపురి మామిడి కోసం ఏకంగా 48 దేశాలు చిత్తూరు వైపు చూస్తున్నాయి. ఇక్కడి నుంచి పంపిస్తున్న మామిడి గుజ్జు (మ్యాంగో పల్ప్)ను ఆయా దేశాల పౌరులు అపారమైన ప్రేమతో ఆస్వాదిస్తున్నారు. ఎగుమతుల్లో మరే దేశానికి లేని ప్రత్యేకత చిత్తూరు వల్లే భారత్‌కు దక్కుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తూరు మామిడిపై కాస్త దృష్టి సారిస్తే ఎగుమతుల్లో మరింతగా ముందడుగు వేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 1.12 లక్షల హెక్టార్లలోఏ రాష్ట్రంలో లేనివిధంగా మామిడి ఉమ్మడి చిత్తూరులో సాగవుతోంది. చిత్తూరు, మదనపల్లె, తిరుపతి జిల్లాల్లో 1.12 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇందులో తోతాపురి (బెంగళూరు) రకానికి చెందిన మామిడి చిత్తూరుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి0ది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 70 వేల హెక్టార్లు తోతాపురి, 42 వేల హెక్టార్లలో టేబుల్ రకాలకు చెందిన మామిడి సాగులో ఉంది. రమారమి ఏటా 7.5 లక్షల టన్నుల మామిడి కాయల దిగుబడి వస్తుండగా.. ఇందులో 5 లక్షల టన్నులతో తోతాపురి సింహభాగంలో ఉంది. తోతాపురి రకం కాయలను పండుగా తినడానికి, పచ్చళ్లకు ఉపయోగించరు. ఇది మృదువుగా, తీపిగా ఉండటంతో దీనిని పూర్తిగా గుజ్జు (పల్ప్) కోసమే ఉపయోగిస్తారు. మామిడి కాయల్ని వేడి నీటిలో శుభ్రంచేసి, టెంకను తొలగించి, గుజ్జును యంత్రాల ద్వారా వేరు చేస్తారు. సహజంగానే ఇది తియ్యగా ఉండటంతో కొద్దిమొత్తంలో చక్కెరను కలిపి మొత్తం గుజ్జును గాలి తీసేసిన కంటైనర్లలో నిల్వచేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. దేశంలోనూ డిమాండే దేశీయంగా తయారయ్యే పల్పీ, ఫ్రూటీ, స్లైస్, డాబర్, బి–నేచురల్ వంటి కంపెనీలు ఈ గుజ్జుతోనే మామిడి పానీయాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆ కంపెనీలు సైతం ఇక్కడి నుంచే గుజ్జును సేకరిస్తాయి. చిత్తూరు జిల్లాలో 47 మామిడి గుజ్జు తయారీ పరిశ్రమలు ఉన్నాయి. ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, పోలెండ్, ఉక్రెయిన్, బెల్జియం, ఆ్రస్టేలియా, క్రోషియా, డెన్మార్క్, నార్వే, స్వీడన్, రుమేనియా, ఆల్బేనియా, ఐర్లాండ్, సెజియా, ఐస్లాండ్, స్లోవేనియా, హంగేరి, ఫిన్లాండ్, సెర్బీ, మాల్టా, లాక్సంబర్గ్, సిప్రస్, స్లోవేకియా, మోనాకో లాంటి 48 దేశాలకు చిత్తూరు నుంచే మ్యాంగో పల్ప్ ఎగుమతి అవుతోంది. ఏటా ఏప్రిల్ నుంచి జూలై వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు తయారీ పరిశ్రమలు 24 గంటలపాటు పనిచేస్తుంటాయి. ఐదేళ్లలో 9 లక్షల టన్నుల ఎగుమతి ఐదేళ్లలో చిత్తూరు జిల్లా నుంచి దాదాపు 9 లక్షల టన్నుల మామిడి గుజ్జు ఎగుమతి అయ్యింది. ఇది దేశంలోని మరే ప్రాంతానికి దక్కని గుర్తింపు. గుజ్జు ఎగుమతుల ద్వారా ఏటా సగటున రూ.1,200 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆర్జిస్తోంది. 1.20 లక్షల మంది రైతులు, 2 లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగాను, 4 లక్షల మంది పరోక్షంగా మామిడి గుజ్జు పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వాలు సహకరిస్తే.. భారత్‌తో పాటు ఈజిప్‌్ట, ఆఫ్రికా, మెక్సికో, పాకిస్థాన్ వంటి దేశాలు కూడా అంతర్జాతీయ మార్కెట్‌కు మామిడి గుజ్జు ఎగుమతులు ప్రారంభించాయి. మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న మామిడి గుజ్జుపై 32% పన్ను వసూలు చేస్తున్నారు. దీనిని తొలగిస్తే వ్యాపారులు, ఎగుమతిదారులు మామిడి సేకరణ ధరను పెంచుతారు. తద్వారా రైతులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. కాగా.. చిత్తూరు నుంచి ఎగుమతి అవుతున్న మామిడి గుజ్జును కంటైనర్ల ద్వారా చెన్నైకు తీసుకెళ్లి, అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా విదేశాలకు పంపుతున్నారు. దీనివల్ల ఎగుమతి ప్రోత్సాహకాలు చెన్నైకి అందుతున్నాయి. అలాకాకుండా చిత్తూరు నుంచే కంటైనర్లతో గుజ్జును ఉంచి సీల్ చేసి, ఇక్కడి నుంచి చెన్నైకు పంపిస్తే ఆ ప్రోత్సాహకాలు మన రాష్ట్రానికి లభించడంతోపాటు పారిశ్రామిక రంగానికి అదనపు ఊతం ఇచ్చినట్టవుతుంది. దీనికోసం చిత్తూరులో ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో (ఐసీడీ)ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.మధ్యాహ్న భోజన మెనూలో చేర్చాలి మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు పెడుతున్నట్టే పిల్లలకు మ్యాంగో పల్ప్ కూడా ఇవ్వాలి. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో భక్తులకు అన్న ప్రసాదాలతో పాటు మ్యాంగో పల్ప్ ఇస్తే ప్రయోజనం చేకూరుతుంది. కాణిపాకం, అన్నవరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి లాంటి ఆలయాల్లో మ్యాంగో పల్ప్ వినియోగాన్ని తప్పనిసరి చేస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుంది. దీనిపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చాం. కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటే చిత్తూరు పల్ప్‌కు పేటెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. – గోవర్దన బాబి, చైర్మన్, ఆలిండియా ఫుడ్ ప్రాసెసర్స్ అసోసియేషన్, సౌత్‌జోన్, చిత్తూరు -
మామిడి, అరటి.. ఉత్పత్తిలో మనమే మేటి
సాక్షి, అమరావతి: అరటి పండ్లు, మామిడి ఉత్పత్తిలో దేశంలోనే అంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక వెల్లడించింది. అరటి పండ్లను ఉత్పత్తి చేసే ప్రధాన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 18.1 శాతంతో మొదటి స్థానంలో ఉందని.. అలాగే మామిడి ఉత్పత్తిలోనూ దేశంలోనే అత్యధికంగా 5.0 మిలియన్ మెట్రిక్ టన్నులతో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని తెలిపింది. దేశంలో ప్రధానంగా అరటి పండ్లు, మామిడి, ద్రాక్ష పండ్ల ద్రవ్యోల్బణం, ఉత్పత్తిపై ఆర్బీఐ తన అధ్యయన నివేదికను విడుదల చేసింది. అరటిపండ్ల ఉత్పత్తిలో ఏపీ తరువాత స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలున్నాయని.. ఇవన్నీ దేశం మొత్తం అరటి పండ్ల ఉత్పత్తిలో 80 శాతం వాటాను కలిగి ఉన్నాయని నివేదిక వివరించింది.ఇక ఆంధ్రప్రదేశ్‌లో అరటి పండ్ల ఉత్పత్తి కేంద్రాలుగా తూర్పు గోదావరి, పశి్చమ గోదావరి, కర్నూలు, కడప ఉన్నాయి. అలాగే, దేశంలో రెండో అతి ముఖ్యమైన పండు అరటి పండేనని నివేదిక తేల్చిచెప్పింది. ఇక దేశంలో అరటి పండ్ల ఉత్పత్తి 2012–13లో 26.5 మిలియన్ మెట్రిక్ టన్నులుండగా.. 2022–23 నాటికి అది 36.6 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగిందని ఆర్బీఐ తెలిపింది. అలాగే, దేశం నుంచి అరటి ఎగుమతులు 2013–14లో 35 వేల మెట్రిక్ టన్నులుండగా.. 2022–23లో అది 376 వేల మెట్రిక్ టన్నులకు పెరిగింది. అరటిపండ్ల అతిపెద్ద వినియోగదారుగా మన దేశమే ఉందని కూడా తెలిపింది. దేశీయ ఫార్మ్‌గేట్ 2021–22లో అరటి కిలో ధర రూ.14 నుంచి రూ.15 ఉండగా.. 2022–23లో రెండింతలు పెరిగి కిలో రూ.27 నుంచి 28 రూపాయలైందని నివేదిక పేర్కొంది.మామిడి ఉత్పత్తి, సాగులో ఏపీ ఆధిపత్యం.. మరోవైపు.. మామిడి ఉత్పత్తి, సాగులోనూ ఆంధ్రప్రదేశ్ ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు నివేదిక తెలిపింది. దేశంలో మామిడి సాగు విస్తీర్ణంలో 17 శాతం వాటాతో.. 5.0 మిలియన్ టన్నుల ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ఆ తర్వాత 12 శాతం వాటాతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. దేశంలో మొత్తం మామిడి ఉత్పత్తిలో ఏపీ వాటా 23 శాతమని కూడా పేర్కొంది. మామిడి సాగు ప్రధాన రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బిహార్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, తెలంగాణలు దేశవ్యాప్తంగా 75 శాతం ఉత్పత్తి కలిగి ఉన్నాయని నివేదిక తెలిపింది. -
ఈ డెజర్ట్‌తో గుండె ఆరోగ్యం పదిలం..!
మన ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే కొన్ని డెజర్ట్‌లను మన ఆహారంలో భాగం చేసుకుంటే చాల రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. అలాంటి డెజర్ట్ గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఫుడ్ గైడ్ టేస్టీ అట్లాస్ వెల్లడించిన ఉత్తమ డెజర్ట్‌ల జాబితాలో రెండో స్థానం దక్కించుకున్న ఈ డెజర్ట్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉనాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా మన గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుందట. అదెలాగా? దీన్ని ఎలా తయారు చేస్తారు?ఆ డెజర్ట్ పేరు మామిడి స్టిక్కీ రైస్. ఇది థాయిలాండ్ నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన డెడర్ట్. దీన్ని అక్కడ ప్రజలు మ్యాంగో స్టిక్కీ రైస్‌గా పిలుస్తారు. ఈ డెజర్ట్‌ని గ్లూటినస్ రైస్, తాజా మామిడిపండ్లు, కొబ్బరిపాలను మిళితం చేసి తయారు చేస్తారు. ఈ డెజర్ట్ తయారీలో ఉపయోగించే పదార్థాలన్నీ మంచి పోషక విలువలు కలిగినవి. ముందుగా ఇందులో ఉపయోగించే పదార్థాలు ప్రయోజనాలు గురించి సవివరంగా తెలుసుకుందాం.ఇందులో ఉపయోగించే అన్నంఈ పాయసం చేయడానికి గ్లూటినస్ రైస్ ఉపయోగిస్తారు. దీనిలోని కార్బోహైడ్రేట్లకి మంచి డైట్‌కి ఉపయోగపడే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం, గుండెల్లో మంట వంటి సమస్యల నుంచి బయటపడేస్తుంది. స్టిక్కీ రైస్‌లో కొవ్వులు, కొలెస్ట్రాల్ కూడా తక్కువగా ఉంటుంది. అందువల్ల నిపుణుల అభిప్రాయం ప్రకారం తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్న ఆహారాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. అదీగాక అధిక రక్తపోటు లేదా బరువు సమస్యలు ఉన్నవారికి ఈ డెజర్ట్ గొప్ప ఔషధం. కొబ్బరి పాలుకొబ్బరి పాలలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్‌ల ప్రమాదాన్ని నివారించే యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అంతేగాదు ధమనులలో ఫలకం కలిగించే బ్యాక్టీరియాను కూడా చంపుతుంది. గుండె జబ్బులకు దారితీసే రక్తంలోని లిపిడ్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. కొబ్బరి పాలల్లోని పొటాషియం రక్తపోటు స్థాయిలను నియంత్రించి గుండె పనితీరుని మెరుగ్గా ఉంచుతుంది. మామిడి పండ్లు..మామిడి పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి . ఇవన్నీ రక్త నాళాలు విశ్రాంతి తీసుకునేలా రక్తపోటు స్థాయిలను తగ్గించి సాధారణ పల్స్‌ను ప్రోత్సహిస్తాయి. ఈ సమ్మర్ పండులో మాంగిఫెరిన్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ సమ్మేళనం. ఇది గుండె కణాల్లోని మంట, ఆక్సీకరణ ఒత్తిడి. కణాల నశించడం వంటి వాటి నుంచి రక్షిస్తుంది. అంతేగాదు జంతు అధ్యయనాలు మాంగిఫెరిన్ రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, కొవ్వు ఆమ్లాలను తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొన్నాయి.ఈ డెజర్ట్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలుఈ పుడ్డింగ్ కడుపులో చాలా తేలికగా ఉంటుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అధిక మొత్తంలో డైటరీ ఫైబర్ కలిగి ఉండటం వల్ల శరీరంలోని అనేక ఎంజైమ్‌ల స్రావాన్ని పెంచి, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అలాగే గ్యాస్, ఉబ్బరం, వంటి ఇతర జీర్ణ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.రోగనిరోధక శక్తిని పెంచుతుందివిటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఈ డెజర్ట్, మితంగా తింటే శరీరంలో తెల్ల రక్త కణాల వృద్ధి అవుతాయి.ఇది రోగనిరోధక శక్తిని పెంచి, దీర్ఘకాలంలో వివిధ కాలానుగుణ వైరల్, బ్యాక్టీరియా వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.కంటి చూపును వృద్ధి చేస్తుందిఇందులో విటమిన్ ఏ, బీటా-కెరోటిన్ అధికంగా ఉంటాయి డెజర్ట్ తయారీ..ఒక పాన్‌లో బెల్లం పొడితో పాటు ఒక కప్పు కొబ్బరి పాలను వేసి, రెండు పదార్థాలు కలిసే వరకు వేడి చేయండి. అయితే, పాలల్లో బెల్లం కరిగిపోయేంత వరకు మరిగించాలి. ఆ తర్వాత అందులో చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. ఒక పెద్ద గిన్నెలో వండిన జిగురుతో కూడిన అన్నం తీసుకుని దానిపై ఈ కొబ్బరి పాలు గ్రేవీ సగం పోయాలి. దీన్ని బాగా కలపి ఒక గంట పక్కన పెట్టండి. ఆ తర్వాత ఒక మామిడికాయ ముక్కను తీసుకుని ముక్కలు చేసి ఈ అన్నంలో వేశాక, మిగిలిన కొబ్బరిపాల గ్రేవిని ఇప్పుడు వేయాలి. చివరగా వేయించిన నువ్వులతో అందంగా అలంకరించాలి. అంతే టేస్టీ టేస్టీగా ఉండే స్టిక్కీ రైస్ మామిడి పాయసం రెడీ..!.(చదవండి: హీరో మాధవన్ ఇష్టపడే బ్రేక్‌ఫాస్ట్ తెలిస్తే..నోరెళ్లబెడతారు!) -
నేషనల్ మ్యాంగో డే: నోరూరిస్తూ..ఆరోగ్యానికి మేలు చేసే పండు!
పండ్లలలో రారాజు మామిడి పండు. ఇది అంటే ఇష్టపడని వారుండరు. భారతీయ వంటకాల్లో ఈ మామిడితో చేసే రెసిపీలు అగ్రభాగన ఉంటాయి. ఈ మామిడితో చేపల కూర నుంచి మామిడి స్మూతీస్ వరకు వివిధ రకాల ప్రత్యేక వంటకాలు ఉంటాయి. వేసవిలో సెలవులతో గడిపే పిల్లలు సైతం ఇష్టంగా తినే పండు ఏదైనా ఉందంటే అది మామిడి పండే. అలాంటి మామిడి పండు కోసం ప్రత్యేకమైన రోజు ఒకటి ఉంది. ప్రతి ఏడాది జూలై 22న జాతీయ మామిడి దినోత్సవంగా జరుపుకుంటారు. అసలు ఈ మామిడిపండ్ల కోసం ఓ దినోత్సవాన్ని ఏర్పాటు చేసి మరీ ఎందుకు జరుపుకుంటున్నాం?. దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏం వచ్చింది?.దీని వెనుకున్న చరిత్ర..భారతీయ సంస్కృతితో మామిడిపండ్లకు ఉన్న సంబంధం ఐదు వేళ ఏళ్ల నాటిది. మామిడి అనే పేరు మలయన్ అనే పదం నుంచి ఉద్భవించింది. పోర్చుగీస్ వారు సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేయడానికి 1498లో కేరళకు వచ్చినప్పుడు "మాంగా"గా మార్చారు. కాలక్రమేణా దీనిని మ్యాంగోగా పిలుస్తున్నారు. ఇది జీడిపప్పు, పిస్తాపప్పుల జాతికి చెంందిన అనాకార్డియోసికి చెందింది. 1987లో, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ ఆఫ్ ఇండియా మామిడి రుచికి, ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధ చెందిన పండ్లగా గుర్తించి ప్రతి ఏడాది జూలై 22న నేషనల్ మ్యాంగో డే జరుపుకోవాలని ప్రకటించింది. అప్పటి నుంచి ఈ దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించుకుంటున్నాం. భారత్‌లో మామిడి రకాలు: భారతదేశంలో వాణిజ్య రకాలు సహా మొత్తం 15 వందల రకాల మామిడిని పండిస్తారు. మామిడి ప్రధాన రకాలు ఒక్కొక్కటి ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల మామిడి పండ్లను పండిస్తారు.ఆరోగ్య ప్రయోజనాలు..మామిడిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి అధికంగా ఉంటాయి.మామిడిలోని విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.మామిడిలోని ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని అంటున్నారు. 2021 లో "జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం మామిడి పండ్లు తినడం వల్ల అందులోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయంలో న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ మారియ విల్లరీల్ గాంజాలేజ్ పాల్గొన్నారు.మామిడిలోని ఫైబర్ జీర్ణక్రియ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుందని అంటున్నారు.మామిడిలోని విటమిన్ 'ఏ' కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.మామిడిలోని విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయని, ముఖంపై ముడతలను తగ్గించడానికి సహాయపడతాయని అంటున్నారు.మామిడిలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.మామిడిలోని యాంటీఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు తెలుపుతున్నారు.(చదవండి: ఈటింగ్ ఛాలెంజ్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్ మృతి..అంత ప్రమాదమా?) -
ప్రపంచంలోనే అతి పెద్ద మామిడితోట మనదగ్గరే.. ఆ కుబేరుడిదే!
పెట్రోలియం, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ గురించి అందరికి తెలుసు. కానీ ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారు కూడా అని కొంత మందికి మాత్రమే తెలిసి ఉంటుంది.ముకేశ్ అంబానీకి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సుమారు 600 ఎకరాల మామిడి తోట ఉంది. ఇక్కడ 1.5 లక్షల కంటే ఎక్కువ మామిడి పండ్ల రకాలు ఉన్నట్లు సమాచారం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడితోట కావడం గమనార్హం. ఇందులో కేసర్, అల్ఫోన్సో, రత్న, సింధు, నీలం, ఆమ్రపాలి వంటి దేశీయ మామిడి జాతులు.. ఫ్లోరిడాకు చెందిన టామీ అట్కిన్స్, కెంట్ & ఇజ్రాయెల్ దేశానికి చెందిన లిల్లీ, కీట్, మాయా వంటి అంతర్జాతీయ రకాలు ఉన్నట్లు సమాచారం.ముకేశ్ అంబానీ మామిడి తోటలో ప్రతి ఏటా 600 టన్నుల కంటే ఎక్కువ అధిక నాణ్యత కలిగిన మామిడి పళ్ళు ఉత్పత్తి అవుతాయి. వీటిని రిలయన్స్ సంస్థ భారతదేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయిస్తూ.. ఆసియాలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారుగా రికార్డ్ సృష్టించింది. -
టీడీపీ నేత తోట కంచెకు విద్యుత్ సరఫరా.. షాక్‌తో మహిళ మృతి
వి.కోట(చిత్తూరు జిల్లా): టీడీపీ నాయకుడికి చెందిన మామిడి తోటకు వేసిన కంచెకు విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై ఓ మహిళ మృతిచెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలం కేపీ బండ గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం... వి.కోట మండలంలోని యాలకల్లు గ్రామ పంచాయతీ కేపీ బండ గ్రామంలో అహ్మద్ జాన్ తన భార్య ఆసిఫా (35), ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటున్నారు. వారి ఇంటి బాత్రూమ్కు అత్యంత సమీపంలో టీడీపీ నాయకుడు, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు చక్రపాణి నాయుడుకు చెందిన మామిడి తోట ఉంది.దానికి చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటుచేశారు. తోటలోని విద్యుత్ మోటర్‌కు సంబంధించిన స్టార్టర్‌ను ఆ ఇనుప కంచెకు అమర్చారు. వైర్లను పక్కనున్న స్తంభానికి చుట్టారు. ఈ క్రమంలో ఆసిఫా స్నానం చేసి బయటకు వస్తూ మామిడి తోట ఇనుప కంచెను తగిలారు. ఆ కంచెకు కరెంటు సరఫరా కావడంతో ఆమె షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. స్టార్టర్కు సంబంధించిన వైర్లు తెగి ఇనుప కంచెపై పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. తోట యజమానిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
హైదరాబాద్ బిర్యానీకి 6వ స్థానం
సాక్షి, హైదరాబాద్: దేశంలో తనకంటూ ప్రత్యేక ప్రాచుర్యం పొందిన హైదరాబాద్ బిర్యానీ మరోసారి తన ఘనతను నిర్ధారించుకుంది. సంప్రదాయ వంటకాలకు సంబంధించిన పరిశోధన, సమీక్షలకు పర్యాటక ప్రదేశాల గురించిన సమాచారానికి పేరొందిన ఆన్లైన్ వేదిక టేస్ట్ అట్లాస్.. అత్యున్నత భారతీయ వంటకాల్లో హైదరాబాద్ బిర్యానీకి 6వ స్థానాన్ని కట్టబెట్టింది. గతేడాది ఇదే సంస్థ అందించిన ర్యాంకుల్లో మన బిర్యానీకి చోటు దక్కని నేప«థ్యంలో ఈ ఏడాది తన పాపులారిటీని తిరిగి నిలబెట్టుకోగలిగింది. సిటీజనులకు అత్యంత ప్రీతిపాత్రమైన వంటకంగానే కాక నగర సంప్రదాయ వంటకాల విశిష్టతను నలుదిశలా చాటేదిగా, దేశ విదేశీ ప్రముఖులకు నగర సందర్శనలో తప్పనిసరిగా ‘రుచి’ంచే మన బిర్యానీ టేస్ట్ అట్లాస్ జాబితాలో టాప్ 10లో నిలవగా.. మన నగరంలో విరివిగా ఇష్టపడే బటర్ చికెన్, తందూరీ చికెన్ వంటివి కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. నెం–1 గా మ్యాంగో లస్సీ... ఈ జాబితాలో మ్యాంగో లస్సీ నెంబర్ 1 గా నిలిచింది. వేసవిలో విరివిగా జనం ఆస్వాదించే ఈ లస్సీకి జాబితాలో అగ్ర స్థానం దక్కింది. అదే విధంగా దాని తర్వాతి స్థానంలో మసాలా చాయ్ నిలిచింది. ఇది అనేకమందికి, నగర వాసులకు రోజువారీ అవసరం అనేది తెలిసిందే. ఫుడ్ లవర్స్ ఇష్టపడే బటర్ గార్లిక్ నాన్కు మూడో ర్యాంక్ దక్కింది. ఆ తర్వాత అమృత్ సర్ కుల్చా, బటర్ చికెన్ వరుసగా నాల్గు, ఐదు ర్యాంక్‌లు దక్కాయి. ఆ తర్వాత మన హైదరాబాద్ బిర్యానీ ఆరు, షాహి పనీర్ ఏడు, చోలే భటూర్ ఎనిమిది, తందూరీ చికెన్ తొమ్మిది, కోర్మా పదో ర్యాంకును దక్కించుకున్నాయి. -
మండే ఎండల్లో కదిలి వచ్చిన మామిడిచెట్టు.. వైరల్ వీడియో
ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరూ.. ఒక్కో రకంగా తమ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. తమ చేష్టలతో తోటి వారికి ప్రేరణగా నిలవాలని భావిస్తారు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట విశేషంగా నిలిచింది. ఇందులో ఒక వ్యక్తి చేసిన పని చూసినవారంతా వాహ్.. అంటున్నారు. మరి అదేంటో మీరూ చూసేయండి...ఇన్‌స్టాలో షేర్ అయిన వీడియో ప్రకారం ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనం వెనుకాల సీట్లో కుండీలో పెరుగుతున్న మామిడి మొక్క (చెట్టు)ను భద్రంగా కట్టి తీసుకెళ్తున్నాడు. ఎండవేడికి తట్టుకోలేక ఇలా చేశాడా? నిరంతర ప్రయాణంలో కూలర్లను నెత్తిన పెట్టుకొని తీసుకెళ్లలేం గనుక ఇలా తీసుకెళ్లాడా? లేక నర్సరీనుంచి మొక్కను కొనుగోలు చేసి తీసుకెళుతున్నాడా? పెద్దగా పెరిగిన మామిడి చెట్టును ఒకచోటు నుంచి మరో చోటుకి షిఫ్ట్ చేస్తున్నాడా అనేది స్పష్టత లేదు. కానీ కొంతమంది అద్భుతమైన ఐడియా అంటూ కమెంట్ చేశారు. ఇది కావాలనే చేసిన జిమ్మిక్కు అని మరికొంతమంది వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Sethumadhavan Thampi (@sethumadhavan_thampi)ఏది ఏమైనా గ్రోబ్యాగ్‌లో భారీగా పెరిగిన మామిడి చెట్టును బండిపై తీసుకెళ్లడం వింతగా అనిపిస్తోంది. అంతేకాదు దీనికి మామిడి కాయలు కూడా కనబడుతుండటం విశేషం. వేగానికి చెట్టు కొమ్మలు హాయిగా ఊగుతోంటే.. అంతకంటే గమ్మత్తుగా ఆ మామిడికాయలు నాట్యం చేస్తున్నాయి. ఈ విన్యాసం చూడడానికి ఎంతో చూడముచ్చటగా కనిపిస్తోంది. ఈ వీడియో లక్షకు పైగా లైక్‌లను పొందింది. ప్రస్తుతం ఈ వీడియో 'సేతుమాధవన్ థంపి' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తెగ వైరల్ అవుతోంది. ఇవి చదవండి: మీ స్మార్ట్ ఫోన్లలో తరచూ ఇలా జరుగుతుందా? అయితే.. -
పండ్లలో రారాజు మామిడి.. కాదు కాదు అరటి
మనదేశంలో మామిడిని పండ్లలో రారాజు అని అంటారు. వేసవిలో మామిడి పండ్లు పుష్కలంగా లభిస్తాయి. మార్కెట్లో పలు రకాల మామిడి పండ్లు కనిపిస్తాయి. అయితే ఇకపై దేశంలో మామిడికి బదులు ‘అరటి’ పండ్లలో రారాజుగా మారబోతోంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది ముమ్మాటికీ నిజం.2022-23లో ఉత్పత్తి పరంగా అరటి.. మామిడిని అధిగమించింది. అరటి వాటా 10.9 శాతం కాగా మామిడి 10 శాతంగా ఉంది. దేశంలో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా మామిడి ఉత్పత్తి అవుతుంది. మన దేశానికి చెందిన మామిడి, అరటిపండ్లకు విదేశాలలో అత్యధిక డిమాండ్ ఉంది. మన మార్కెట్లలో కనిపించని అనేక రకాల మామిడిని నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తుంటారని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.మామిడి పండించే ప్రధాన దేశాలలో భారతదేశం ఒకటి. ప్రపంచ ఉత్పత్తిలో 42 శాతం వాటా భారత్‌దే. మామిడి ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. మొత్తం మామిడి ఉత్పత్తిలో 23.64 శాతం యూపీలో ఉత్పత్తి అవుతోంది. 2022-23లో మామిడి మొత్తం ఉత్పత్తి 21 మిలియన్ టన్నులు. దేశంలో 1,500కుపైగా మామిడి రకాలు ఉన్నాయి.మనదేశంలో అరటి పండ్లు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. అరటి పండు అన్ని రాష్ట్రాల్లోనూ ఉత్పత్తి అవుతుంది. అరటిపండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ ఐదు రాష్ట్రాలు సమిష్టిగా 67 శాతం అరటిపండ్ల వాటాను అందించాయి. అరటిపండ్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశంగా భారత్ ఉన్నప్పటికీ మనదేశ ఎగుమతుల వాటా ప్రపంచం మొత్తం మీద ఒకశాతం మాత్రమే. -
ది బెస్ట్ మ్యాంగో రెసిపీల్లో మామిడి చట్నీ ఎన్నో స్థానం అంటే..!
పండ్లలో రారాజు మామిడి పండు. దీనితో చాలా చోట్ల పలు రకాల రెసీపీలు, స్వీట్లు చేస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రలో అయితే మామిడి తాండ్ర వంటి వివిధ రకా స్వీట్లను తయారు చేస్తారు. ఇక కొన్ని చోట్ల చట్నీలు, డిజర్ట్లు చేస్తుంటారు. అలాంటి భారతీయ వంటకాలన్నింటికి ప్రపంచ వేదికపై గుర్తింపు లభించింది. టేస్ట్ అట్లాస్ ఇంత వరకు బెస్ట్ కర్రీ, బెస్ట్ డిజార్ట్ వంటి ర్యాకింగ్‌లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అలానే ఈసారి మ్యాంగోతో తయారు చేసే ఉత్తమ వంటకాల జాబితా ఇచ్చింది. వాటిలో రెండు భారతీయ వంటకాలు అగ్రస్థానంలో ఉన్నాయి. అవి రెండు తొలి టాప్ 10 జాబితాలోనే ర్యాంకులు పొందాయి. ముఖ్యంగా పశ్చిమ రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్‌లలో రుచికరమైన వంటకంగా పేరుగాంచిన ఆమ్రాస్ తొలి స్థానం నిలిచింది. ఇది ప్యూరీ విత్ మ్యాంగో జ్యూస్‌తో తయారు చేస్తారు. ఈ జ్యూస్‌ని పొడి అల్లం లేదా ఏలుకులతో జత చేసి కూడా తయారు చేస్తారు. ఈ జాబితాలోనే భారతీయ మామిడి చట్నీ కూడా ఐదో స్థానం దక్కించుకోవడం విశేషం. ఈ చట్నీని దాల్చిన చెక్కలు, యాలకులు, బ్రౌన్ షుగర్, వెనిగర్ వంటి వాటితో తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ చట్నీ తయారీలో కొద్దిపాటి వైవిధ్యాలు కూడా ఉన్నాయి. ఇక ది బెస్ట్ మ్యాంగో రెసీపీల జాబితాలో థాయిలాండ్‌కు చెందిన మ్యాంగో స్టిక్కీ రైస్ రెండో స్థానం దక్కించుకుంది. ఈసారి టేస్ట్ అట్లాస్ ఇచ్చిన వరల్డ్‌లోనే 50 బెస్ట్ మ్యాంగో రెసీపీలలో భారతీయ మామిడి వంటకాలే తొలి పది స్థానాల్లో నిలవడం విశేషం.(చదవండి: ఆ సమస్యలు ఉంటే.. పెరుగుతో ఈ ఆహారాలు జత చెయ్యొద్దు!) -
మామిడి తొక్కే కదా అని తీసిపారేయకండి..ఎన్ని లాభాలో తెలుసా..!
వేసవిలో మామిడి పండ్ల జాతర అన్నట్లుగా రకరకాల వెరైటీలు వస్తుంటాయి. మామిడి పండ్ల అంటే ఇష్టపడని వారెవరూ ఉంటారు చెప్పండి. అయితే మనం మామిడి పండ్ల తొక్కును పడేసి తినేస్తుంటాం. కానీ మామిడి పండ్ల తొక్కలో ఉన్నన్ని ఆరోగ్య ప్రయోజనాలు మరెందులోనూ ఉండవని అంటున్నారు. అవేంటో చూద్దామా..!మామిడి తొక్కలో ఏ, సీ, కే, ఫోలేట్, మెగ్నీషియం, కోలిన్, పొటాషియం, ఫైబర్లు, యాంటీఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు, పాలీఫైనాల్స్లు ఉంటాయి. ఇవి గుండెజబ్బులు, కేన్సర్ వంటి ప్రమాదాన్ని తగ్గిస్తాయని శాస్తవేత్తలు చెబుతున్నారు. అంతేగాదు 2008లో ప్రచురితమైన ఓక్లహోమ్ స్టేట యూనివర్శిటీ అధ్యయనంలో మామిడి తొక్కలు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటమే గాక బరువు కూడా అదుపలో ఉంటుందని తేలింది. ముఖ్యంగా నామ్ డాక్ మై, ఇర్వ్విన్ అనే రెండు మామిడి రకాల తొక్కలు శరీరంలోని కొలస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. పండ్లును చక్కగా తినేశాక ఆ మామిడి తొక్కలను ఏం చేయాలనే కదా..! వాటిని పడేయకుండా చక్కగా రకరకాల రెసీపీలు చేసుకుని తినేయండి అని చెబుతున్నారు నిపుణులు. మామిడి తొక్కలతో చేసే రెసీపీలు ఏంటంటే..మామిడి తొక్క టీ: మామిడితొక్కలను చక్కగా నీటిలో ఉడికించి, కొంచెం తేనే, నిమ్మకాయ వేసుకుని టీ మాదిరిగా తాగితే ఆ టేస్టే వేరే లెవల్ అన్నట్లు ఉంటుంది. ఈ టీ వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు అందుతాయి.మామిడి తొక్క ఊరగాయ: తొక్కతోపాటు ముక్కలు చేసుకుని ఉప్పులో ఊరబెట్టి, రోజ ఎండలో ఆరనియాలి. ఇలా వాటిలో నీరు మొత్తం ఇంకిపోయేలా ఆరనిచ్చి చక్కగా పచ్చడి మాదిరిగా పట్టుకోవడం లేదా వాటిని భద్రపర్చుకుని పప్పులో వేసుకుని తిన్న బాగుంటాయి. మామిడి తొక్కపొడి: ఎండలో ఎండబెట్టిన మామిడి తొక్కను పొడి చేసుకోవాలి. దీన్ని మెరినేడ్లు, సూప్‌లు, కూరల్లో జోడిస్తే మంచి టేస్ట్ వస్తుంది. పైగా మామిడి తొక్కను ఆహారంలో భాగం చేసుకున్నట్లువుతుంది కూడా. అంతేగాదు ఈ తొక్కల పొడిని బ్యూటీ టోనర్‌గా కూడా ఉపయోగించొచ్చు. హెయిర్ వాష్‌గా కూడా ఉపయోగించొచ్చ. బ్యూటీ స్క్రబ్: మామిడి తొక్కల పొడిని తేనే లేదా పెరుగులో కలిపి ముఖానికి స్క్రబ్‌లా ఉపయోగించొచ్చు. దీని వల్ల ముఖంపై ఉండే మృత కణాలు పోయి తాజాగా ఉంటుంది. పైగా చర్మం కూడా రిఫ్రెష్‌గా ఉంటుంది. జుట్టు సంరక్షణ: ఈ మామిడి తొక్కలను కలిపిని నీటితో షాంపు వేసుకుని తలను శుభ్రం చేసుకుంటే..జుట్టు చిట్లడం వంటి సమస్యలను అరికట్టి సిల్కీగా ఉండేలా చేస్తుంది. అంతేగాదు చర్మం కుచ్చులా ఉండి మెరుస్తూ ఉంటుంది. స్కిన్ టోనర్: మామిడి తొక్కలను నీటిలో వేసి మరిగించిన ద్రవాన్ని వడగట్టి చర్మానికి టోనర్‌గా ఉపయోగించొచ్చు. ఇది ముఖంపై ఉండే రంధ్రాను దగ్గర చేయడమే తాజాగా ఉండేలా చేస్తుంది.(చదవండి: మామిడి బఫే..ఐస్‌క్రీం నుంచి బ్రేక్‌ఫాస్ట్ వరకు అన్ని మ్యాంగో మయం..!) -
మామిడి బఫే..ఐస్‌క్రీం నుంచి బ్రేక్‌ఫాస్ట్ వరకు అంతా మ్యాంగో మయం..!
మ్యాంగో లవర్స్‌కి ఇష్టమైన వార్త అని చెప్పొచ్చు. సమ్మర్ అనంగానే గుర్తొచ్చేది పండ్ల రాజు మ్యాంగో. అలాంటి మామిడి పండ్లతో మ్యాంగో బఫేని అందిస్తోంది ఓ రెస్టారెంట్. కేక్‌లు దగ్గర నుంచి ఐస్క్రీమం వరకు అన్నింటిలోనూ మ్యాంగో ఫ్లేవర్ ఉంటుంది. ఎక్కడ? ఏ రెస్టారెంట్ ఇలా సర్వ్ చేస్తోందంటే..మామిడి అంటే ఇష్టపడే వాళ్ల కోసం దక్షిణ కొరియాలోని ఒక రెస్టారెంట్ మామిడి పండ్లతో వెరైటీ బఫేని పరిచయం చేసింది. సియోల్‌లోని లోట్టే అనే హోటల్ ఈ వైరైటీ బఫేట్ని కస్టమర్ల్కు సర్వ్ చేస్తోంది. దీని ధర వచ్చేసి రూ. 8,257లు. ఈ వేసవి మొత్తం ఈ బఫెట్ అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు. ఆ బఫేలో మామిడి పండ్లతో చేసిన కేక్, మ్యాంగో డ్రింక్, మ్యాంగో ఫుడ్డింగ్, మ్యాంగో డెజర్ట్, మ్యాంగో ఐస్‌క్రీం, స్పైసీ రైస్ కేక్‌లతో సహ పది రకాల వెరైటీలను ఈ బఫేలో అందిస్తారు.వవెరైటీ భోజనం కావాలనుకునే వాళ్లకు ఇది అద్భతమైన బఫే సెటప్ అని చెప్పొచ్చు. ఆ రెస్టారెంట్ చుట్టూ ఉండే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ బఫే కస్టమర్లకు ఓ గొప్ప అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉండే సుందరమైన జలపాతం, కళాత్మక అలంకరణల మధ్య ఈ మ్యాంగో బఫేని అధిక ధరకు వెచ్చించి మరీ తినడం కస్టమర్లకు ఓ మధురమైన జ్ఞాపకంలా ఉంటుందట. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు మామిడి ప్రియులకు ఇది బెస్ట్ ప్లేస్ అని ఒకరు, ఇది స్వర్గానికి మించి..! అని మరోకరు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: మే పుష్పం' గురించి విన్నారా! ఏడాదిలో ఒకసారి మాత్రమే..) View this post on Instagram A post shared by 포토그래퍼의 공간 탐닉 (@space_tamnik) -
ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
పిఠాపురం: మామిడిలో రారాజుగా పేరొందిన కొత్తపల్లి కొబ్బరి మామిడికి ఎక్కడాలేని గిరాకీ పలుకుతోంది. మామిడి ప్రియుల మనసు దోచుకున్న ఒకే ఒక్క మధుర ఫలం ఇది. రుచిలో అతి మధురంగా ఉండడంతో ఈ మామిడి పండ్ల రేటు పైపైకి ఎగబాకి పండ్ల ప్రియులను ఊరిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే... మామిడిలో ఎన్నో రకాలున్నప్పటికీ వాటిలో గోదావరి జిల్లాల్లో మాత్రమే లభించే కొత్తపల్లి కొబ్బరి, పండూరు మామిడికి ఉన్న డిమాండ్ వేరు. మామిడి రకాల్లో ఈ రెండింటినీ హిడెన్ జెమ్స్‌గా భావిస్తారు. వీటి ప్రాముఖ్యతను గుర్తించి, సంరక్షించిన గ్రామాల పేరిటే ఇవి ప్రసిద్ధి చెందాయని ఆ ప్రాంతవాసులు అంటున్నారు.ఉత్తమ లక్షణాలున్న పండ్లుగా ఇవి గుర్తింపు పొందడంతో రాజుల కాలం నుంచే వీటికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. పూర్వం ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు తమ తోటల్లో వీటిని పెంచుకుని, ఆ రుచిని తాము ఆస్వాదించడంతోపాటు మిత్ర రాజులకు కానుకలుగా పంపేవారట. అందుకే ఒకప్పుడు రాజ సంస్థానాల్లో మాత్రమే ఈ పండ్లు ఉండేవని, సాధారణ ప్రజానీకానికి అందుబాటులో ఉండేవి కావనే ప్రచారం కూడా ఉంది.ఇప్పటికీ ఈ రకం మామిడి పండ్లను తమ స్నేహితులకు, బంధువులకు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు బహుమతిగా పంపించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఏటా గోదావరి జిల్లాల నుంచి సుమారు 20 టన్నుల వరకూ కొత్తపల్లి కొబ్బరి, కాకినాడ రూరల్ మండలంలోని పండూరు మామిడి రకాలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఎక్కవ కాలం నిల్వ ఉండకపోవడంతో ప్రస్తుతం దూర ప్రాంతాలకు ఎగుమతులు జరగడం లేదని అంటున్నారు. కొత్తపల్లి కొబ్బరి గోదావరి జిల్లాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన మామిడి రకాల్లో కొత్తపల్లి కొబ్బరిదే ప్రథమ స్థానం. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి ప్రాంతంలో లభించే అమోఘమైన రుచి కలిగిన మామిడి పండు ఇది. కొబ్బరి కాయలో మాదిరిగా పీచు అధికంగా ఉండటంతో ఈ రకాన్ని కొత్తపల్లి కొబ్బరిగా పిలుస్తారు. మేలిమి బంగారు రంగులో మెరిసిపోతూ సువాసనలు వెదజల్లుతుంటుంది. పూదోటలో మాదిరిగా ఈ రకం మామిడి పండ్లు ఉన్నచోట సువాసనలు వెదజల్లుతుంటాయి.ఈ మామిడి పండులో కెరోటిన్, కాల్షియం, విటమిన్ ఎ, సి. ఎక్కువగా ఉంటాయి. తొక్క పలుచగా ఉండి సైజు చిన్నగా ఉంటుంది. పులుపు ఎక్కువగా ఉండటంతో పచ్చి మామిడి తినలేరు. కానీ పండు మాత్రం అతి మధురం. ఇవి మామిడి సీజన్లో మాత్రమే పండుతాయి. పీచు ఎక్కువగా ఉండటంతో ఆవకాయ, ఊరగాయలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మామిడితో పెట్టిన ఊరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఈ చెట్ల కాపు తక్కువగా ఉంటుంది. పండు చిన్నదే కానీ ధర మాత్రం అదరగొడుతుంది.పండూరు మామిడి ఇది అత్యంత పురాతనమైన మామిడి రకం. ఈ చెట్టు వంద అడుగుల ఎత్తు వరకూ పెరిగి, నిండా కాయలుంటాయి. చూడటానికి పప్పులో వేసుకునే చిన్న మామిడి కాయల్లా మాత్రమే ఉంటాయి. పండ్లు కూడా ఆకుపచ్చగానే ఉండటం వీటి ప్రత్యేకత. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వెలగదూరు గ్రామ పరిసరాల్లోని సంస్థానంలో పూర్వం కొందరు దొంగలు మామిడి పండ్లను దొంగిలించి, తిని, వాటి టెంకలను కోట అవతల పారేశారని, వాటిని తీసి నాటగా వచి్చన చెట్టు ద్వారా ఈ పండ్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయనే కథనం ఒకటి ప్రచారంలో ఉంది.దిగుబడి తగ్గి.. డిమాండ్ పెరిగి.. గత ఏడాదికంటే దిగుబడి తగ్గడంతో కొబ్బరి మామిడికి డిమాండ్ అమాంతం పెరిగింది. గత ఏడాది 100 కొబ్బరి మామిడి కాయలు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకూ విక్రయించగా ఈ ఏడాది రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ అమ్ముడవుతోంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు పంపడానికి స్థానిక నేతలు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో సామాన్యులు కొని తినే అవకాశం లేకుండా పోయింది. గతంలో దిగుబడి ఎక్కువగా ఉండటంతో అందరికీ అందుబాటులో ఉండేవి.కానీ ఈ ఏడాది కొబ్బరి మామిడి చెట్లు పూత రాలిపోయి తక్కువగా కాశాయి. దీంతో దిగుబడి చాలా తక్కువ వస్తోంది. కాయ సైజు కూడా చిన్నదిగా ఉంటోంది. ఎంత ఖరీదైనా కొనుగోలు చేయడానికి మామిడి ప్రియులు ఎగబడటంతో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకూ 2 టన్నుల కాయలు విక్రయించాం. మరికొద్ది రోజులు మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి. – కండేపల్లి సురేన్, మామిడి వ్యాపారి, కొత్తపల్లి వీటి గిరాకీ వేటికీ ఉండదు కొత్తపల్లి కొబ్బరి రకానికి ఉన్న గిరాకీ మరే మామిడి పండుకూ ఉండదు. పీచు అధికంగా ఉండటంతో ఊరగాయలకు ఎక్కువగా వాడుతుంటారు. ఈ ఏడాది కాపు తక్కువగా ఉండడంతో వీటికి ఎనలేని గిరాకీ పెరిగింది. దీంతో కాయ పెద్దది కాకముందే కోసేస్తున్నాం. మామిడి సీజన్లో మొదటిగా ఇవి అందుబాటులోకి వస్తాయి. కాయ టెంక కట్టగానే పండించడానికి వీలుంటుంది. వందల సంఖ్యలో ఆర్డర్లు ఇస్తున్నారు. ఇది తొందరగా ముగ్గిపోతుంది. కాయ బాగా ముదిరితే మంచి నాణ్యత ఉంటుంది. ప్రస్తుతం కొనుగోలుదారులు ఎక్కువగా ఉండటంతో ఇవి ఎక్కడా దొరకని పరిస్థితి ఏర్పడింది. – ఓరుగంటి నాగబాబు, మామిడి రైతు, చేబ్రోలు -
ఆవురావురుగా... కమ్మని ఆవకాయ!
ఎండాకాలం... మే నెల సగం అయిపోయింది. మామిడి కాయలు టెంక కట్టి ఎదురు చూస్తున్నాయి. జాడీలు స్నానాలు చేసి ఎండలో సేదదీరుతుంటాయి. ఇంట్లో మిక్సీలు గిర్ర్ర్ అంటూ గోల చేస్తుంటాయి. మామిడి కాయలు కొట్టే కత్తి పుల్లబారి పదునుదేలింది. ముక్కలు కొట్టండి... పళ్లెంలో వేయండి... కారం కలపండి. జాడీలకెత్తండి... పళ్లెంలో వేడి వేడి అన్నం వేసి కలపండి. ఇంటిల్లిపాదీ ఆవురావురుమని తినకపోతే అడగండి.ఆంధ్రా ఆవకాయ..కావలసినవి..పచ్చి మామిడి ముక్కలు – కేజీ;పచ్చి శనగలు – 50 గ్రాములు;సన్న ఆవాలు –పావు కేజీ;మెంతులు – రెండు టేబుల్ స్పూన్లు;గుంటూరు మిరపపొడి –పావు కేజీ;ఉప్పు – నూట యాభై గ్రాములు;పసుపు – టేబుల్ స్పూన్;నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె –పావు కేజీ.తయారీ..ఆవకాయ పెట్టడానికి ముందు రోజు మిరపకాయలు, ఆవాలు, మెంతులను విడిగా ఎండబెట్టాలి. మరునాడు ఉదయం ఆవాలను మిక్సీలో పొడి చేయాలి. మిరపపొడి రెడీమేడ్ది కూడా తీసుకోవచ్చు. కానీ ఆవాలు స్వయంగా చేసుకోవాలి.మామిడి కాయలను కడిగి తేమపోయే వరకు తుడిచి ఆరబెట్టాలి. బాగా ఆరిన తర్వాత కాయలకున్న తొడిమ తొలగించాలి.అప్పటికీ సొన కారుతుంటే శుభ్రమైన నూలు వస్త్రంతో తుడిచేయాలి. ఇలా సిద్ధం చేసుకున్న మామిడికాయలను టెంకతో సహా చిన్న ముక్కలు చేసుకోవాలి.శనగలను శుభ్రమైన వస్త్రంతో తుడిచి పక్కన పెట్టాలి.వెడల్పుగా ఉన్న పెద్దపాత్రలో మామిడి ముక్కలు వేయాలి. అందులో శనగలు, ఆవాల పొడి, మిరపపొడి, ఉప్పు, పసుపు వేసి అట్లకాడతో బాగా కలపాలి.మెంతులు కూడా వేసి బాగా కలపాలి. చివరగా నూనెపోసి ముక్కలకు ఒత్తిడికి కలగకుండా అడుగు నుంచి కలిపితే ఆవకాయ రెడీ. దీనిని పింగాణి జాడీలో పెట్టి అంచులకు తెల్లని శుభ్రమైన నూలు వస్త్రాన్ని కట్టాలి.ఆ పైన మూత పెట్టాలి. ఈ జాడీలోని ఆవకాయను రోజూ మూత తీయకూడదు. రోజువారీ వాడుకకు అవసరమైనంత చిన్న జాడీలోకి తీసుకుంటూ ఉంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.బెల్లం ఆవకాయ..కావలసినవి..మామిడి ముక్కలు – అర కేజీ; బెల్లం – అర కేజీ;మిరపపొడి– 200 గ్రాములు;ఉప్పు – 200 గ్రాములు;ఆవపిండి– 100 గ్రాములు;నూనె – 200 గ్రాములు.తయారీ..మామిడి కాయలను శుభ్రంగా కడిగి తుడిచి టెంకతో సహా ముక్కలు చేసుకోవాలి.బెల్లాన్ని తురిమి వెడల్పుపాత్రలో వేసి అందులో మామిడికాయ ముక్కలు, ఆవపిండి, మిరపపొడి, ఉప్పు, కప్పు నూనె వేసి కలపాలి.ఈ మిశ్రమాన్ని రెండు రోజులపాటు ఎండలో పెట్టాలి. బెల్లం కరిగిపాకంలా జిగురుగా వచ్చినట్లనిపిస్తే సరే, లేకపోతే మూడవ రోజు కూడా ఎండలో పెట్టాలి.పాకం వచ్చిన తర్వాత మిగిలిన నూనె కూడా వేసి బాగా కలిపి జాడీలోకి తీసుకోవాలి.ఈ బెల్లం ఆవకాయను పిల్లలు బాగా ఇష్టపడతారు. ఐరన్ రిచ్ ఫుడ్ కాబట్టి మహిళలు రోజూ తీసుకోవచ్చు.నువ్వుల ఆవకాయ..కావలసినవి..మామిడి కాయ ముక్కలు – 3 కప్పులు;నువ్వులు – ఒకటిన్నర కప్పులు;మిరపపొడి– ముప్పావు కప్పు;ఉప్పు–పావు కప్పు;పసుపు – అర టీ స్పూన్;వేరు శనగ నూనె – ఒకటిన్నర కప్పులు.తయారీ..నువ్వులను తయారీ దోరగా వేయించి చల్లారిన పొడి చేయాలి.మామిడి ముక్కలను వెడల్పుపాత్రలో వేసి అందులో నువ్వుల పొడి, మిరపపొడి, ఉప్పు, పసుపు వేసి అట్లకాడతో బాగా కలపాలి.ఉప్పు, కారం, నువ్వుపిండి సమంగా కలిసిన తర్వాత కప్పు నూనెపోసి మళ్లీ కలపాలి.ఈ మిశ్రమాన్ని జాడీలోకి తీసుకుని, మిగిలిన నూనెను పైన తేలేటట్లుపోయాలి.ఇందులో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వెల్లుల్లి ఆవకాయ..కావలసినవి..మామిడి కాయ ముక్కలు –పావు కేజీ లేదా (మీడియం సైజు కాయలు 3);వెల్లుల్లి – 200 గ్రాములు;ఉప్పు – 100 గ్రాములు;మిరపపొడి– 200 గ్రాములు;ఆవాలు – 150 గ్రాములు (ఎండబెట్టి పొడి చేయాలి);పసుపు – టీ స్పూన్;మెంతులు – టేబుల్ స్పూన్;నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె – కిలో.తయారీ..ఒకపాత్రలో నూనెపోసి మామిడి ముక్కలను వస్త్రంతో తుడిచి నూనెలో వేయాలి.వెల్లుల్లిపాయలను పొట్టు వలిచి ఒక ప్లేట్లో వేసి గాలికి ఆరనివ్వాలి.మరొకపాత్రలో మిరపపొడి, ఆవపిండి, ఉప్పు, పసుపు, మెంతులు వేసి సమంగా కలిసేవరకు కలపాలి. ఇప్పుడు వెల్లుల్లి రేకలను వేసి కలపాలి.మామిడి ముక్కల లోని నూనెను ఒక జాడీలోకి వంపాలి. ఇప్పుడు మామిడి ముక్కలలో ముందుగా కలిపి సిద్ధంగా ఉంచిన ఉప్పు, వెల్లుల్లి ఇతర పొడుల మిశ్రమాన్ని వేసి పొడులన్నీ మామిడి ముక్కలకు పట్టేలా కలపాలి.మామిడి ముక్కలను పట్టి ఉన్న నూనె ఈ పొడులను పీల్చుకుని కొంత తడి పొడిగా మారుతుంది.ఈ మిశ్రమాన్ని నూనె వంపుకున్న జాడీలో వేసి అదమాలి.నూనె పైకి తేలుతుంది. వెల్లుల్లి బ్లడ్ థిన్నర్. రక్తాన్ని పలచబరిచి రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా నివారిస్తుంది. కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ హాయిగా తినవచ్చు. -
మామిడి పండ్లను తినడం వల్ల మొటిమలు వస్తాయా?
మామిడి పండ్లు తినడం వల్ల ముఖంపై మొటిమలు, గడ్డలు వస్తాయని చాలామంది చెబుతుంటారు. పాపం ఆ ఉద్దేశ్యంతోనే మామిపండు తినేందుకు భయపడుతుంటారు. నిజానికి మామిడి పండ్లకు మొటిమలకు సంబంధం ఉందా? వాటిని తినడం వల్ల వస్తాయా ? అంటే..వేసవిలో అందరూ మామిడి పండ్లంటే ఇష్టంగా తింటారు. పోషకాల రీత్యా మామిడిని పండ్లలో రారాజు అని పిలుస్తారు. నిజానికి ఈ మామిడి ఆగ్నేయాసియాలో ఉద్భవించింది. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా సాగు చేసే సాధారణ పండుగా మారింది. ఈ మామిడి తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల విటమిన్లు, పోషకాలు అందుతాయి. దీనిలో బీటా కెరోటిన్ అధికంగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తుందని డెర్మటాలజీ నిపుణులు చెబుతున్నారు.ఈ బీటా కెరోటిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్ పిగ్మెంట్, శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతుంది. అంతేగాక దీనిలో ఉండే పోషకాలన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మంటను తగ్గించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అలాంటి మామిడి పండ్లను తింటే కొందరిలో మొటిములు ఎందుక వస్తాయంటే..? అధిక చక్కెర స్థాయి, గ్లైసెమిక్ సూచిక అని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను సూచించే స్కేల్. ఇక్కడ పండ్లు, బియ్యం, ఇతర కార్బ్ రిచ్ ఉత్పత్తులు, ముఖ్యంగా వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాల్లో అత్యధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసీయేషన్ ప్రకారం..తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారం బరువు తగ్గడానికి మెటిమలు తగ్గించడానికి 91% సహాయపడుతుందని వైద్యులు తెలిపారు. ఇక్కడ మొటిమలు రక్తంలోని చక్కెర స్థాయిలతో ముడిపడి ఉందని తెలిపారు. అందులోనూ ఈ మామిడిపండ్లను చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలు తెగ ఇష్టంగా తింటారు. ఇది వారు యుక్త వయసుకు చేరుకునే సమయం..సరిగ్గా ఈ టైంలోనే వారిలో సెబమ్ ఉత్పత్తి అవుతుంటుంది. దీంతో వారిలో జిడ్డు చర్మం, మొటిమలు మొదలయ్యే దశ స్లోగా మొదలవుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే ఈ మామిడి పండ్లు కూడా వాళ్లుగా ఇష్టంగా తినడంతో పెద్దవాళ్లు మొటిమలకి, మామిడి పండ్లకి లింక్ చేసి..అవి తినడం వల్లనే వస్తున్నాయని అనేస్తారు. వాస్తవానికి అది అపోహ అని తేల్చి చెబుతున్నారు నిపుణులు. సముతల్యమైన ఆహారం తీసుకున్నవాళ్లు హాయిగా మామిడి పండ్లను తినవచ్చని చెబుతున్నారు. ఇక్కడ మొటిమలు చర్మ పరిస్థితికి ఒక లక్షణం అనేది గ్రహించాలి. ఇక్కడ చర్మాన్ని శుభ్రంగా ఉంచుకుని, మంచి పరిశుభ్రతను పాటిస్తూ.. మొటిమలను నిరోధించే క్రీమ్‌లను ఉపయోగిస్తే..ఈ సమస్య నుంచి సులభంగా బయటపడగలుగుతారు. పైగా చర్మం కూడా ప్రకాశవంతంగా అందంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: గురుద్వారా సేవా కార్యక్రమంలో మోదీ! ఏంటీ లంగర్ ..?) -
జైల్లో కేజ్రీవాల్ కావాలనే అవి తింటున్నారు: ఈడీ
ఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసింది. మార్చి 21న అరెస్ట్ అయిన తరువాత మార్చి 28వ తేదీ వరకు అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ సిటీ కోర్టు స్పెషల్ జడ్జి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు. ఇటీవల షుగర్ లెవల్స్ పడిపోతున్నాయని.. క్రమం తప్పకుండా తనిఖీ చేసేందుకు వారానికి మూడుసార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన రెగ్యులర్ డాక్టర్‌ను సంప్రదించేందుకు అనుమతి కావాలని కోరుతూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారని, చక్కెరతో కూడిన టీ తాగుతున్నారని ఈడీ గురువారం ఢిల్లీ కోర్టుకు తెలిపింది. ఉద్దేశ్యపూర్వకంగానే స్వీట్స్ తిని షుగర్ లెవల్స్ పెంచుకుంటున్నారు. షుగర్ లెవెల్స్ పెరిగితే వైద్యపరమైన కారణాలను చూపుతూ బెయిల్ పొందాలంకునుటున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. ఇవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే అని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వివేక్ జైన్ ఈడీ సమర్పణల మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. -
'మోదీ మామిడి': ఈ పండు ప్రత్యేకత ఏంటో తెలుసా..!
సమ్మర్ అనంగానే గుర్తొచ్చొది తియ్యని మామిడి పండ్లు. వాటిని చూస్తేనే నోరూరిపోతుంది. అంత రుచికరమైన ఈ మ్యాంగో ఫ్రూట్లో ఎన్నో వైవిధ్యమైన రకాలు చూశాం. కానీ ఏకంగా దేశ ప్రధాని మోదీపేరు మీదగా కొత్త రకం దేశీ పండును తీసుకొచ్చాడు ఓ రైతు. ఏకంగా హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ ఇతి ప్రత్యేకు రుచిని కలిగి ఉన్న మామిడి పండు అని సర్టిఫై చేసింది. ఇంతకీ ఈ పండు ప్రత్యేకత ఏంటీ..? ఎవరు ఈ కొత్తరకం మామిడిని తీసుకొచ్చారు అంటే..! మామిడి పండు జ్యూస్ అయిన పండు పలంగా అయినా భలే రుచిగా ఉంటాయి. ఇంతవరకు అల్ఫోన్సో, దాషేరి, కేసర్, తోతాపురి, లాంగ్రా, బంగినపల్లి వంటి ఎన్నో రకాల మామిడి పండ్ల రుచులు చూశాం. ఇవన్నీ వేటికవే మంచి సువాసనతో కూడిన రుచిని కలిగి ఉంటాయి. వీటితో ప్రజలు స్మూతీస్, మిల్క్‌షేక్‌లు, జామ్‌లు, ఊరగాయలు, ఐస్‌క్రీమ్‌లు,డెజర్ట్‌లు వంటివి ఎన్నో తయారు చేస్తారు. దీన్ని 'పండ్ల రాజు' అని కూడా పిలుస్తారు. అలాంటి ఈ మామిడి పండంటే తనకెంతో ఇష్టం అని ప్రధాని మోదీ పలు సార్లు వేదికలపై చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొందరు ఆయన పేరు మీదగా కొత్త రకం మామిడి పండ్లను సాగు చేశారు. 'మ్యాంగో మ్యాన్'గా పిలిచే పద్మశ్రీ హాజీ కలిముల్లా కోల్‌కతాలోని 'హుస్న్ ఎ ఆరా' అనే మామిడి రకాన్ని, దేశీ దషేరి మామిడి రకంతో క్రాస్ సాగు చేసి ఓ కొత్త వేరియంట్ మామిడిని రూపొందించారు. దీనికి 'నమో' అని పేరు పెట్టారు. అదే విధంగా భాగల్పూర్కు చెందిన ఆశోక్ చౌదరి మోదీ 1,2,3 అనే మూడు రకాల మామిడి పండ్లను సాగు చేయడం జరిగింది. ఇంత వరకు భాగానే ఉంది. వారందరికంటే లక్నోలోని మలిహాబాద్‌కు చెందిన ఉపేంద్ర సింగ్ ప్రధాని మోదీ పేరుతో పండించిన కొత్త రకం మామిడి పండే బెస్ట్ మామిడి అని పేరు దక్కించుకుంది. ఉపేంద్ర రెండు దేశీ మామిడి రకాలను క్రాస్ కల్టివేట్ చేసి ప్రధాని పేరు మీద 'మోదీ' అనే పండుని పండించారు. ఆయన ఎందుకిలా 'మోదీ మామిడి' అనే పేరు పెట్టారంటే..ఆయన రాజకీయాల్లో చాల సందర్భాల్లో సాహోసోపేతమైన నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్యచకితులని చేసి అశేష ఆదరాభిమానాలు పొందారన్న ఉద్దేశ్యంతో మోదీ మామిడి పండు అనే పేరు పెట్టడం జరిగిందని చెప్పారు. ఉపేంద్ర సింగ్ అక్కడితో ఆగకుండా ఆ పేరు మీద పూర్తి హక్కులను కూడా సంపాదించుకున్నారు. అతడు సాగు చేసిన ఈ కొత్త రకం మోదీ మామిడి మిగతా వాటికంటే మంచి నాణ్యతో కూడిన పల్పు ఉండి, మంచి రుచిని కలిగి ఉందని పేర్కొంటూ మోదీ అనే పేరుపై ఉపేంద్రకి ప్రత్యేక హక్కును మంజూరు చేసింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఈ పండు త్వరలో వాణిజ్య మార్కెట్లోకి రానుంది. దీని రుచి ఇప్పటికే ఉన్న రకాల కంటే చాలా రుచికరమైనది, గుజ్జు కూడా ఎక్కువగా ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పైగా పరిమాణం కూడా పెద్దది. ఓ వ్యక్తి కడుపు నింపడానికి ఈ కొత్తరకం మామిడి పండు ఒకటి తింటే సరిపోతుందని చెబుతున్నారు. ఇది ఐదు నుంచి ఆరు రోజుల వరు పాడవ్వదని, చౌసా, దుషేరి, లాంగ్రా వంటి రకాల మామిడి పండ్ల కంటే పెద్దదిగా ఉండి టేస్టీగా ఉంటుందని సెంట్రల్ సబ్ట్రాపికల్ హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ కూడా ధృవీకరించింది. అంతేకాదండోయ్ ఈ మోదీ మామిడి పండు భారీ ధరతో కూడిన ట్యాగ్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇక ఈ ఏడాది జులై నుంచి ఆగస్టు మధ్య జరిగే వార్షిక మామిడి పండ్ల వెరైటీల ప్రదర్శనలో కూడా ఈ కొత్తరకం మామిడి పండును ఉంచనున్నారు. (చదవండి: కాలేజ్‌కి కూడా వెళ్లలేదు..కానీ ఏడాదికి ఏకంగా రూ. 10 కోట్లు..!) -
పూత రాలి.. కాయ కుళ్లి
కొల్లాపూర్ /జగిత్యాల అగ్రికల్చర్ ఈ ఏడాది మామిడి పూత చూసి రైతులెంతో మురిసిపోయారు. కానీ వాతావరణంలో తలెత్తిన మార్పులు, తెగుళ్ల కారణంగా పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో రైతుల ఆశలు అడియాసలు కాగా, కౌలు రైతుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. దిగుబడి సగానికి సగం తగ్గిపోగా, మార్కెట్లో సరైన ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. వాతావరణ మార్పులు, తెగుళ్లు డిసెంబర్లో చలి తీవ్రత, తేమ శాతం పెరగడం, అకాల వర్షం కారణంగా పూత పెద్దమొత్తంలో రాలిపోయింది. అదే నెలలో రెండో దశ పూతలు వచ్చాయి. వీటికి బూడిద తెగులు సోకి రాలిపోయాయి. అక్కడక్కడా పంటలో పూత నిలబడినా, గాలిలో తేమశాతం ఎక్కువగా ఉండటంతో తేనె మంచు పురుగు ఆశించింది. ఈ పురు గులు గుంపులు, గుంపులుగా మామిడి పూత, పిందెపై చేరి, వాటి నుంచి రసాన్ని పీల్చాయి. దీంతో, పూత, పిందె రాలి మాడిపోయాయి. కొన్నిచోట్ల పూత, పిందెలపై నల్లని మసి ఏర్పడింది. ఈ పురుగు వల్ల దాదాపు 20 నుంచి 100 శాతం వరకు నష్టం ఏర్పడుతుంది. మరోవైపు బంక తెగులు సోకి కాయలు నేలరాలాయి. మితిమీరి పురుగు మందుల పిచికారీ తేనె మంచు పురుగు కట్టడికి రైతులు విపరీతంగా రసాయన మందులు పిచికారీ చేశారు. ఇప్పటికే ఒక్కో రైతు ఒక్క ఎకరానికి దాదాపు రూ.20వేల వరకు ఖర్చు చేశారు. రెండుమూడు నుంచి ఏడుసార్ల వరకూ మందులు పిచికారీ చేసిన రైతులు ఉన్నారు. ధరలు సైతం నేలచూపులే ఏటా సీజన్ ప్రారంభంలో మామిడి కాయల ధర టన్నుకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.60 లక్షల వరకు పలికేది. కానీ, ఈసారి ఫిబ్రవరి రెండో వారంలో టన్ను ధర రూ.1.20 లక్షల వరకు పలికింది. నెలాఖరులో టన్ను ధర రూ.80 వేలకు పడిపోయి.. ప్రస్తుతం రూ.50–60 వేల వరకు పలుకుతోంది. వ్యాపారుల సిండికేట్‌తోనూ ధరలు తగ్గాయి. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లిలో హైదరాబాద్, ముంబయికి చెందిన వ్యాపారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి నెలాఖరులో రూ.60– 75 వేల వరకు టన్ను మామిడి కాయలను కొనుగోలు చేసి.. ఇప్పుడు తగ్గించేశారు. జగిత్యాల మామిడి మార్కెట్లో మొన్నటి వరకు కిలో రూ.65 వరకు ఉన్న బంగినపల్లి రకం ధర ప్రస్తుతం రూ.45–55 మధ్య పలుకుతోంది. దశేరి రకం కిలో రూ.75 వరకు పలకగా, ప్రస్తుతం రూ.50–65 మధ్య పలుకుతోంది. హిమాయత్ రకం కిలో రూ.130 వరకు పలకగా, ఇప్పుడు రూ.100గా కొనసాగుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 57,344 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. వీటిలో 70 శాతం మేర తోటలు కాపు కాసేవి ఉన్నాయి. సాగు చేస్తున్న తోటల లెక్కల ప్రకారం ఈ ఏడాది 1,38,848 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. అందులో 50 శాతం కూడా వచ్చే పరిస్థితి లేదు. జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లాలో 40వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 70శాతం మామిడి తోటల్లో పురుగు ఆశించి 100శాతం పంటనష్టం జరిగింది. మామిడికాయ ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు వస్తోంది. దిగుబడి నాలుగైదు టన్నులకే పరిమితమైంది. పూతకు ముందే తోటలు లీజుకు తీసుకున్నవారు ప్రస్తుతం ఆ తోటలను చూసి తమ అడ్వాన్సులు తిరిగి ఇవ్వమంటూ రైతులను కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా: బోధన్‌రూరల్(బోధన్): నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని మందర్న, హున్స గ్రామాలు మామిడి తోటల సాగులో ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఇక్కడ 80 నుంచి 100 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. పూత రాలిపోయి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. ఆదుకోవాలి.. నేను 40 ఎకరాల తోటలను రూ.42 లక్షలకు కౌలుకు తీసుకున్నా. సొంత తోటలు కూడా ఉన్నాయి. సాగు పనులకు రూ.15 లక్షలకు పైగా ఖర్చు చేశా. ఇప్పటి వరకు 20 టన్నుల కాయలు మాత్రమే అమ్మాను. సాగు, కౌలు కోసం ఖర్చు చేసిన డబ్బులు ఇంకా రాలేదు. రెండో విడత పూత కొంత మేరకు నిలబడింది. ఆ కాయలు వచ్చే నెలలో కోతకు వస్తాయి. వాటి మీదే ఆశలు పెట్టుకున్నా. – పెద్దూరి లక్ష్మయ్య, మామిడి రైతు, కొల్లాపూర్ రెండు సార్లు మందులు కొట్టాను పూత ప్రారంభానికి ముందు, పూత వచి్చన తర్వాత మందులు పిచికారీ చేశాను. ఎకరానికి రూ.30వేల వరకు ఖర్చు చేశాను. అయినా పూత సరిగ్గా నిలువ లేదు. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. – కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డి, వెంకట్రావుపేట, మేడిపల్లి పూత నిలబడలేదు వాతావరణంలో మార్పులు, తెగుళ్ల కారణంగా ఈసారి మామిడి దిగుబడి బాగా తగ్గింది. పంటనష్టం వివరాలు ఇంకా అంచనా వేయలేదు. పూతలు బాగానే వచి్చనా, తేనెమంచు పురుగు, నల్లి, బూడిద తెగుళ్ల కారణంగా పూత నిలవలేదు. – లక్ష్మణ్, ఉద్యానశాఖ అధికారి, కొల్లాపూర్ -
సమ్మర్ స్పెషల్ : మ్యాంగో పులిహోర అదరిపోయేలా!
వేసవికాలం వచ్చిందంటే చాలు మామిడికాయలు నోరూరిస్తాయి. వగరు.. పులుపు కలయికతో లేత మామిడి తొక్కు పచ్చడి, చిన్న ముక్కల పచ్చడి, మామిడి కాయ పప్పు ఇలా ఒకటేమిటి రకరకాల వంటకాలు ఘుమ ఘుమ లాడి పోవాల్సిందే. అసలు మామిడికాయతో ఏమి చేసినా ఆ రుచే వేరు కదా. మరి సమ్మర్ స్పెషల్‌గా మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దామా! మామిడికాయ పులిహోర చేసిపెడితే. పిల్లలు,పెద్దా అంతా ఇష్టంగా తింటారు. ఇది చదువుతుంటేనే మీకూ నోరు ఊరుతోంది కదా. మరింకెందుకు ఆలస్యం ఎలా చేయాలో, కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. కావల్సి పదార్థాలు: తోలు తీసేసి సన్నగా తురిమిన పచ్చిమామిడికాయ తురుము వేయించి పెట్టుకున్న పల్లీలు, లేదా వేరుశెనగలు నేతిలో వేయించుకున్న జీడిపప్పు ఉప్పు రుచికి సరిపడా కొద్దిగా కరివేపాకు ఎండు మిర్చి, పచ్చి మిర్చి తురిమిన అల్లం ఇంగువ పసుపు ముందుగా మందపాటి పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు వేయాలి. ఆవాలు చిటపలాడే వరకూ వేయించుకోవాలి. ఎండు మిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవి వేగుతుండగా, మధ్యకు చీల్చి పెట్టుకన్న పచ్చిముక్కలు, అల్లం తురుము, కరివేపాకు, అల్లం వేయాలి. పసుపు ,ఇంగువ వేసి ఇంకొంచెం సేపు వేగించు కోవాలి. పోపు కమ్మటి వాసన వస్తూ ఉంటుంది కదా. అపుడు ముందుగానే తరిమి పెట్టుకున్న మామిడికాయ తురుము వేసి 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి. ఇక చివరగా రోస్ట్ చేసి పెట్టుకొన్నవేరుశెనగలు, జీడిపప్పు వేయాలి. ముందుగా వండి పెట్టుకొన్న అన్నం పోపులో వేసి, అందులోనే ఉప్పుకూడా వేసి అన్నం చితికి పోకుండా బాగా కలపాలి. పులుపు, ఉప్పు సరిచూసుకుంటే..నోరూరించే మామిడికాయ పులిహోర రెడీ. బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ, సాయంత్రం పూటగానీ, లంచ్‌లోగానీ దీన్ని తీసుకోవచ్చు. -
జుట్టు సౌందర్యానికి మామిడి ఆకులు.. ఈ విషయాలు మీకు తెలుసా?
నోరూరించే మామిడి పళ్లు తినాలంటే వేసవి వచ్చేవరకు ఎదురు చూడక తప్పదు. అయితే మామిడి ఆకులు కోసుకోవడానికి ఎప్పుడూ ఇబ్బంది ఉండదు. అందుకే వివాహాది శుభకార్యాలు, పండుగలు, పర్వదినాలలో గుమ్మాలకు మామిడాకు తోరణాలు కట్టుకుంటూనే ఉన్నాం. ఇంతేనా? జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి, ఆరోగ్య సంరక్షణకు కూడా మామిడి ఆకులు ఉపయోగపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. మామిడి ఆకులలో జుట్టు కుదుళ్లు బలంగా ఉండటానికి అవసరం అయ్యే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే ఎ, ఇ, సి విటమిన్లు ఉండటం వల్ల ఇది సాధ్యం అవుతుందని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. మామిడాకులలో పైన చెప్పుకున్న విటమిన్లతో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉండటం వల్ల వీటిని ఉపయోగించిన వారికి జుట్టు బాగా పెరుగుతుంది. అంతేకాదు... తలపై మామిడి ఆకులను ఉంచి, వాటిని కప్పుతూ ఏదైనా పలుచని క్లాత్‌ను కట్టుకోవడం ద్వారా తలనొప్పి తగ్గుతుంది. తలలో రక్తనాళాలు దెబ్బతినకుండా ఉంటాయి. రక్త ప్రసరణ పెరుగుతుంది. మామిడి ఆకుల్లో ఉండే సహజ తైలాలు జుట్టు సంరక్షణకు ఉపకరిస్తాయి. మామిడి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు నెరవకుండా, బలహీనంగా మారకుండా ఉంచుతాయి. మామిడి ఆకులను ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ఫలితాలూ లేకుండా జుట్టు నల్లగా, ఒత్తుగా తయారవుతుంది. మామిడి ఆకులలో ఉండే ఫ్లేవనాయిడ్లు జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో , నిగారింపు వచ్చేలా చేయడంలో సహాయపడతాయి. ఎలా ఉపయోగించాలి? ►తాజా మామిడి ఆకులు కొన్ని తీసుకుని కాసిని నీళ్లు చేర్చి మిక్సీలో వేసుకుని లేదా రుబ్బుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. దానికి పెరుగు లేదా ఆలివ్ నూనెను చేర్చాలి. ఈ పేస్ట్‌ను చివళ్ల నుంచి కుదుళ్ల వరకు పట్టించాలి. ఆరేదాకా ఉంచి, ఆ తరవాత మైల్డ్ షాంపూతో స్నానం చేయాలి. ►మామిడి ఆకులను ఎండలో ఎండబెట్టి మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. తరువాత పేస్ట్ లా చేసుకుని బ్లాక్ టీని కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. ఇలా చేస్తే జుట్టుకు మంచి పోషణ అందటంతో పాటు నల్లగా మారుతుంది. ►మధుమేహంతో బాధపడేవారు కొన్ని మామిడి ఆకులను శుభ్రంగా కడిగి నీళ్లలో ఉడకబెట్టి కషాయంలా కాచుకోవాలి. గోరువెచ్చగా అయ్యాక వడపోసి తాగాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చేయడం వల్ల మధుమేహం అదుపులోకి వస్తుంది. -
‘మామిడి’లో మనమే ఘనం
సాక్షి, అమరావతి : దేశంలో అత్యధికంగా మామిడి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. అలాగే జాతీయ స్థాయి సగటు హెక్టార్‌కు మామిడి ఉత్పాదకతను మించి రాష్ట్రంలో సగటు హెక్టార్‌కు మామిడి ఉత్పాదకత అత్యధికంగా ఉంది. దేశంలో ఏపీ తర్వాత మామిడి ఉత్పత్తిలో ఒడిశా రాష్ట్రం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశాలో మామిడి తదితర పండ్ల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా రైతులకు మేలుతో పాటు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ అధ్యయన నివేదిక వెల్లడించింది. కొరియా ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ సహకారంతో ఈ అధ్యయనం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఆహార ప్రాసెసింగ్ రంగంలో సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక రూపంలో విడుదల చేశారు. నివేదికలో ఉన్న ముఖ్యాంశాలు జాతీయ స్థాయిలో హెక్టార్‌కు సగటున 9.6 టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుండగా, ఏపీలో హెక్టార్‌కు సగటున 12 టన్నులు ఉత్పత్తి అవుతోంది. ఒడిశాలో హెక్టార్‌కు సగటున 4 నుంచి 6.3 టన్నుల మామిడి ఉత్పత్తి అవుతోంది. ఏపీలో ఉత్పత్తయ్యే మామిడి పండ్లలో 16% ఫ్రూట్ ప్రాసెస్ చేపడుతున్నారు. ఇలా ప్రాసెస్ చేసిన ఉత్పత్తుల డిమాండ్‌ను పెంచాల్సి ఉంది. ఏపీలో బంగినపల్లి, సువర్ణ రేఖ, నీలం, తోతాపురి రకాలు ఎక్కువగా పండుతుండగా, ఎగుమతికి అనువైన ఇమామ్ పసంద్, బంగినపల్లి, సువర్ణరేఖ వంటి గుజ్జు రకాలూ ఎక్కువగానే పండుతున్నాయి. ఏపీలో ఉత్పత్తి అయ్యే గుజ్జు రకాల పండ్లలో దాదాపు 54 శాతం ఎగుమతి అవుతున్నాయి. ప్రాసెస్ చేసిన పండ్ల ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. గుజ్జు రకాల మామిడి పండ్ల ఉత్పత్తి ఏపీ, ఒడిశాలో అత్యధికంగా ఉంది. పండ్ల ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించడం ద్వారా అధిక ఉద్యోగాలు కల్పించవచ్చు. పండ్ల ప్రాసెసింగ్ పరిశ్రమలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్‌లో కీలకమైన పరిమితులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు నాణ్యమైన ముడి పదార్థాలను అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ పథకాలను అందుబాటులో ఉంచడంతో పాటు త్వరగా అనుమతులివ్వాలి. పండ్ల ప్రాసెసింగ్‌లో 75 శాతం మహిళలకు, 25 శాతం పురుషులకు ఉపాధి లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 3.39 మిలియన్ ఎంఎస్ఎంఈలను ఉండగా, ఒడిశాలో 1.98 మిలియన్ ఎంఎస్‌ఎంఈలున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఎంఎస్‌ఎంఈల్లోనే 111 మిలియన్ల మంది ఉపాధి పొందుతున్నారు. నమోదైన ప్రాసెసింగ్ యూనిట్ల కన్నా ఏపీ, ఒడిశాల్లో నమోదుకాని యూనిట్లు 26 నుంచి 80 రెట్లు ఉంటాయి. ఏపీ ప్రభుత్వం 2020–25 లక్ష్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ విధానాన్ని తెచ్చింది.. కొత్త సాంకేతిక బదిలీలను ప్రోత్సహించడం, సాంకేతికతను అప్‌గ్రేడేషన్ చేయడం, ముడి సరుకు సక్రమంగా సరఫరా అయ్యేలా సరైన పంటల ప్రణాళికలకు మద్దతు ఇవ్వడం, వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేయడం.యువతకు వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇంక్యుబేషన్ కేంద్రాల ఏర్పాటు, రైతు భరోసా కేంద్రాలు తదితరాలతో బ్యాక్వర్డ్ లింక్‌లను ఏర్పరచుకోవడం వంటివి లక్ష్యంగా విధానాన్ని రూపొందించుకుంది. -
మామిడి టెంకే!.. అని పడేయొద్దు!ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే..
పండ్లలలో రారాజు మామిడికాయ. టెంకే కదా అని తీసిపడేయొద్దు!. దీని వల్ల కలిగే అద్భత ప్రయోజనలు అన్ని ఇన్ని కావు. మామిడి టెంకను బ్యూటి ప్రొడక్ట్‌గా వాడతారని మీకు తెలుసా! ఇది మీ చర్మాన్ని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంలో బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇది అందించే ప్రయోజనాలు ఏంటంటే.. ప్రయోజనాలు ఈ టెంకలోని గింజల పొడిని సేవించినా ఆరోగ్యానికి మంచిదే ఇది అతిసారం, ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. దీని నుంచి తయారు చేసిన నూనె జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎలా ఆరోగ్యాన్ని సంరక్షిస్తుందంటే.. చుండ్రుకి చెక్‌పెడుతుంది మాడిగింజల పొడిని ఆవాల నూనెతో కలిపి అప్లై చేస్తే అలోపేసియా, జుట్టు రాలడం, నెరిసిపోవడం, చుండ్రు వంటివి రావు. టూత్ పౌడర్‌గా మామిడిగింజల పౌడర్ని టూత్ పౌడర్‌గా ఉపయోగిస్తే మీదంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. విరేచనాలకు ఔషధంగా మామిడి గింజల పొడిని రోజుకు మూడుసార్లు తీసుకుంటే విరేచనాలు తగ్గుముఖం పడతాయి. ఈ మామిడిగింజల పొడిని నీడలో ఎండబెట్టి తేనెతో తీసుకుంటే అతిసారం నుంచి సులభంగా బయటపడొచ్చు. ఒబెసిటీకి చక్కటి మందులా.. ఒబెసిటీ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది చక్కటి మందులా ఉపయోగపుడుతుంది. దీన్ని తీసుకుంటే తక్షణ శక్తి పొందడమే గాక కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. కొలస్ట్రాల్‌ని కరిగించేస్తుంది రక్తప్రసరణను పెంచి చెడు కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది రక్తంలో పడిపోయిన చక్కెర స్థాయిలను, సీ రియాక్టివ్ ప్రోటీన్ స్థాయిలను, జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధులకు.. రోజువారీ ఆహాకంలొ మామిడి గింజలను తక్కువ మొత్తంలో తీసుకుంటే గుండె సమస్యలు, అధిక రక్త పోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. డ్రై లిప్స్కి చెక్ పెదాలు హైడ్రేట్ చేయడానికి మామిడి గింజల పొడితో తయారు చేసిన బామ్ని ఉపయోగిస్తే పెదాలు మృదువుగా ఉంటాయి. చర్మకణాలు పునురజ్జీవింపజేస్తుంది. మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. మధుమేహం మామిడి గింజ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ప్రేగు, కాలేయంలలో గ్లూకోజ్ శోషణను తగ్గిస్తుంది. అలాగే నడుము చుట్టుకొలతను తగ్గిస్తుంది. మొటిమలు మాయం మామిడి గింజలతో మొటిమల స్క్రబ్‌ని తయారు చేసుకుని వాడితే చక్కటి ఫలితం ఉంటుంది. అంతేగాదు మామిడి గింజలను గ్రైండ్ చేసి టమాట రసంతో కలిపి ముఖానికి అప్లై చేస్తే బ్లాక్‌హెడ్స్, బ్రేక్ అవుట్లు, మెటిమలు, మచ్చలను నయ చేస్తుంది. ముఖంపై ఏర్పడే రంధ్రాలను తగ్గించి ఎరుపు మారకుండా సంరక్షిస్తుంది. (చదవండి: పెదవులు ఆరోగ్యంగా అందంగా కనిపించాలంటే ఇలా చేయండి!) -
ఇక్కడి మామిడి తాండ్రకు 200 ఏళ్ళ చరిత్ర ..