చెట్టులెక్కగలను | Manchu Lakshmi climbs Mango tree for her daughter Nirvana | Sakshi
Sakshi News home page

చెట్టులెక్కగలను

Published Sun, Apr 26 2020 5:55 AM | Last Updated on Sun, Apr 26 2020 5:55 AM

Manchu Lakshmi climbs Mango tree for her daughter Nirvana - Sakshi

మంచు లక్ష్మి

లాక్‌ డౌన్‌ సమయాన్ని కూతురితో సరదాగా గడుపుతున్నారు మంచు లక్ష్మి. ఇంటి ముందు ఉన్న మామిడి చెట్టు ఎక్కిన వీడియోను పోస్ట్‌ చేశారామె. ‘‘నా చిన్నప్పటి నుంచి ఈ మామిడి చెట్టు మా  ఇంటి ముందే ఉంది. కానీ ఎప్పుడూ హాయ్‌ చెప్పి, మా పరిసరాలను చల్లగా ఉంచుతున్నందుకు థ్యాంక్స్‌ చెప్పే వీలు దొరకలేదు. ఈ లాక్‌ డౌన్‌ లో ఆ చాన్స్‌ దొరికింది. ఇన్ని రోజులూ మన చుట్టూ ఉన్నా మనం పట్టించుకోకుండా ఉన్నవాటికి కృతజ్ఞతలు తెలపాల్సిన సమయం ఇది’’ అని పేర్కొన్నారు లక్ష్మి. సరదాగా చెట్టు ఎక్కి, కుమార్తె విద్యా నిర్వాణకు మామిడికాయలు కోసిపెట్టారామె. ‘చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా’ అని ‘చెంచులక్ష్మి’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుని అంజలీదేవి అడిగితే... ‘చెట్టులెక్కగలనే ఓ చెంచిత..’ అంటారాయన. లక్ష్మి కూడా చెట్టులెక్కగలను అని నిరూపించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement