vidya nirvana
-
మంచు లక్ష్మీ కూతురు వరల్డ్ రికార్డ్
డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయ, ప్రముఖ నటి మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ మంచు ఆనంద్ అరుదైన రికార్డ్ ని సాధించింది. `యంగెస్ట్ చెస్ ట్రైనర్`గా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. డిసెంబర్ 19న నొబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిథి డా. చోకలింగం బాలాజి సమక్షంలో జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణురాలై ఈ రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.`చెస్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు అదొక లైఫ్ స్కిల్ అని నేను నమ్ముతాను. అందుకే విధ్యకి చిన్న వయసులోనే చెస్ ట్రైనింగ్ ఇప్పించాను. కాని రెండు వారాల్లోనే తన కోచ్ కార్తిక్ నా దగ్గరకు వచ్చి చెస్ చాలా బాగా ఆడుతుంది ఈ రికార్డ్‌కి మనం అప్లై చేద్దాం అని చెప్పారు. ఇప్పుడే వద్దు సార్ ఇంకా కొన్ని రోజుల తర్వాత చూద్దాం అన్నాను. కానీ విధ్యా నిర్వాణ ఇంత చిన్న వయసులోనే `యంగెస్ట్ చెస్ ట్రైనర్`గా నొబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. తన తల్లిగా ఎంతో గర్వంగా ఉంద’ని లక్ష్మీ అన్నారు.‘సో ఫ్రౌడ్ ఆఫ్ యూ మై యాపిల్’ అంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. మోహన్ బాబు మాట్లాడుతూ.. `నాకు చెస్ ఆడడం ఇప్పటికీ తెలీదు. అటువంటిది మా మనవరాలు విధ్యా నిర్వాణ చెస్ నేర్చుకుంటుంది అని లక్ష్మీ చెప్పినప్పుడు ఎందుకమ్మా ఇవన్ని చక్కగా చదువుకోనివ్వు అని అన్నాను. లేదు డాడి తను చాలా ఆసక్తిగా ఉంది అని చెప్పింది. ఇంత చిన్న వయసులో నా మనవరాలు ఈ రికార్డు సాధించడం సంతోషాన్ని కలిగిస్తోంది’అని అన్నారు. -
మంచు వారి మసాలా వడలు
ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్స్ ఒకరికొకరు సరదా ఛాలెంజ్ విసురుకోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా మోహన్ బాబుకి ‘కుకింగ్ ఛాలెంజ్’ విసిరారు ‘కళాబంధు’ సుబ్బరామిరెడ్డి కుమార్తె పింకీ రెడ్డి. ఆమె ఛాలెంజ్‌ను స్వీకరించిన మోహన్ బాబు.. మనవరాలు విద్యా నిర్వాణ (మంచు లక్ష్మి కుమార్తె) తో కలసి స్పెషల్ మసాలా వడలు తయారు చేశారు. ‘‘నా ఆత్మీయుడు డాక్టర్ టి. సుబ్బరామిరెడ్డి గారి కుమార్తె నేను వంట చేసి చూపించాలని నాకు సవాల్ విసిరింది, స్పెషల్ వడలు చేస్తా’’ అంటూ వంట చేస్తున్న వీడియోను షేర్ చేశారు మోహన్ బాబు. తాతయ్య వంట చేస్తుంటే విద్యా నిర్వాణ సహాయం చేస్తూ కనిపించింది. -
చెట్టులెక్కగలను
లాక్ డౌన్ సమయాన్ని కూతురితో సరదాగా గడుపుతున్నారు మంచు లక్ష్మి. ఇంటి ముందు ఉన్న మామిడి చెట్టు ఎక్కిన వీడియోను పోస్ట్ చేశారామె. ‘‘నా చిన్నప్పటి నుంచి ఈ మామిడి చెట్టు మా ఇంటి ముందే ఉంది. కానీ ఎప్పుడూ హాయ్ చెప్పి, మా పరిసరాలను చల్లగా ఉంచుతున్నందుకు థ్యాంక్స్ చెప్పే వీలు దొరకలేదు. ఈ లాక్ డౌన్ లో ఆ చాన్స్ దొరికింది. ఇన్ని రోజులూ మన చుట్టూ ఉన్నా మనం పట్టించుకోకుండా ఉన్నవాటికి కృతజ్ఞతలు తెలపాల్సిన సమయం ఇది’’ అని పేర్కొన్నారు లక్ష్మి. సరదాగా చెట్టు ఎక్కి, కుమార్తె విద్యా నిర్వాణకు మామిడికాయలు కోసిపెట్టారామె. ‘చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా’ అని ‘చెంచులక్ష్మి’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుని అంజలీదేవి అడిగితే... ‘చెట్టులెక్కగలనే ఓ చెంచిత..’ అంటారాయన. లక్ష్మి కూడా చెట్టులెక్కగలను అని నిరూపించుకున్నారు. -
అంతా బాగుంటాంరా
కరోనా వైరస్‌పై పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న వైద్య, పారిశుధ్య, పోలీస్ సిబ్బంది కృషిని అభినందిస్తూ మంచు మనోజ్ ఓ పాటను విడుదల చేశారు. ‘‘అంతా బాగుంటాంరా ...’’ అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించగా, అచ్చు కంపోజ్ చేశారు. తన మేనకోడలు విద్యా నిర్వాణతో (మంచు లక్ష్మి కుమార్తె) కలసి ఈ పాటను పాడారు మంచు మనోజ్. ఆదివారం ఈ పాటను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ‘‘ఈ పాట కొందరి మనస్సులో అయినా ఆశను, స్ఫూర్తిని కలిగిస్తుందనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు మనోజ్. -
పాటతో అదరగొట్టిన మంచు లక్ష్మీ కూతురు
-
మంచు లక్ష్మీ కుమార్తె ‘అయిగిరి నందిని’
మంచు లక్ష్మీ ప్రసన్న నటిగానే కాదు.. యాంకర్, నిర్మాతగానూ రాణిస్తున్నారు. తొలి రోజుల్లో ఆమె కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కుమార్తెగా పరిచయమైనప్పటికీ అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు మంచు లక్ష్మి కూతురు కూడా ఇదే బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె గారాల పట్టి విద్యా నిర్వాణ తల్లితో కలిసి ఈ మధ్యే యూట్యూబ్‌లో అడుగు పెట్టింది. ‘చిట్టి చిలకమ్మ’ అంటూ ప్రేక్షకులను పలకరించింది. ఇక తాజాగా ఈ చిన్నారి మహాశివరాత్రిని పురస్కరించుకుని తొలిసారిగా పాట పాడింది. అయితే వినేవాళ్లకు మాత్రం ఆమె మొదటిసారి పాడుతుందన్న భావన కలగకపోవడం విశేషం.(ఈ సిరీస్‌కు అందరూ కనెక్ట్ అవుతారు: మంచు లక్ష్మీ) అనుభవజ్ఞురాలిగా, ఎంతో నిబద్ధతగా, అంకితభావంతో ముద్దుముద్దు మాటలతో ఆమె పాడటం అందరినీ ఆకర్షిస్తోంది. ‘అయిగిరి నందిని..’ అంటూ ఉగ్రంగా పాడుతూనే అంతలోనే శాంతంగా మారుతూ ఎన్నో వేరియేషన్స్ చూపించింది. ఇలా పాటకు తగ్గట్టుగా హావభావాలు ఒలికించిన తీరు చూస్తుంటే నిర్వాణ తప్పకుండా గొప్ప సింగర్‌గా రాణిస్తుందని చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ, కొన్నిచోట్ల మాత్రం పదాలు పలకడానికి కాస్త కష్టపడిందనే చెప్పొచ్చు. ఇక ఈ వీడియోలో మంచు లక్ష్మితో పాటు, మనోజ్ కూడా చిన్నారితో ఆడిపాడుతూ కనిపించారు. ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేసిన మంచు లక్ష్మీ ‘ఇది తనకు గుర్తుండిపోయే శివరాత్రి’ అని సంతోషం వ్యక్తం చేశారు. (మూడేళ్ల తర్వాత వస్తున్న మంచు మనోజ్) -
మంచు ఫ్యామిలీ నుంచి మూడో తరం..!
విలన్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేసిన నటుడు మంచు మోహన్ బాబు. నటుడిగానే కాక నిర్మాతగానూ ఘన విజయాలు సాధించిన ఈ కలెక్షన్ కింగ్ వారసులుగా విష్ణు, మనోజ్, లక్ష్మీప్రసన్నలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ప్రస్తుతం మోహన్ బాబుతో పాటు వీరంతా నటులుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి మూడో తరం సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతోంది. గతంలో మనోజ్ కూడా బాలనటుడిగా చాలా సినిమాల్లో నటించాడు. అదే బాటలో లక్ష్మీ ప్రసన్న కూతురు విద్యా నిర్వాణ తెరంగేట్రానికి రంగం సిద్ధం మవుతోంది. అశ్వనిదత్ కూతురు ప్రియాంక దత్ నిర్మిస్తున్న మహానటి సినిమాలో సావిత్రి చిన్నప్పటి పాత్రను నిర్వాణతో చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్వని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా.. సమంత, దుల్కర్ సల్మాన్ లు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాతో మంచు ఫ్యామిలీ నుంచి మూడోతరం నటులు పరిచయం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. టాలీవుడ్ సర్కిల్స్ ఈ వార్త గట్టిగానే వినిపిస్తోంది. -
మంచు వారింట్లో పుట్టిన రోజు వేడుకలు
టాలీవుడ్ సెలబ్రిటీ ఫ్యామిలీ మంచు వారింట్లో పండుగ వాతావరణం నెలకొంది. మంచు లక్ష్మీ భర్త ప్రేమ్ ఆనంద్‌తో పాటు లక్ష్మీ దంపతుల గారాల పట్టి విద్యా నిర్వాణాల పుట్టిన రోజు నేడు(బుధవారం). దీంతో మిత్రులు, సన్నిహితులు వారికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. మంచు లక్ష్మీ సోదరుడు, హీరో మనోజ్ 'మా బావ ప్రేమ్ ఆనంద్‌కు, మా ఇంటి ఆనందం విద్యానిర్వాణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ మంచు లక్ష్మీ ఫ్యామిలీ ఫోటోను ట్వీట్ చేశాడు. Happy birthday to my Bava @premanand6 and my happiness Nivi @VidyaNirvana :) pic.twitter.com/PmtdgCdeDc — Manchu Manoj (@HeroManoj1) 15 June 2016 -
తిరుమలలో 'మంచు' ఫ్యామిలీ
తిరుమల : ప్రముఖ నటుడు మోహన్ బాబు బుధవారం తిరుమల విచ్చేశారు. ఆయన, తన కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ బ్రేక్ దర్శనంలో వెంకన్నను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మోహన్ బాబు విలేకర్లతో మాట్లాడుతూ... స్వామివారి దర్శనం బాగా జరిగిందని.. లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ.. పుట్టు వెంట్రుకలు తీయించేందుకు కుటుంబ సమేతంగా తిరుమల వచ్చామన్నారు. తమ కుటుంబంతో పాటు అందరూ క్షేమంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు మోహన్ బాబు తెలిపారు. రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని వెంకన్నను మొక్కుకున్నట్లు ఆయన చెప్పారు. శుక్రవారం విడుదలయ్యే ఎర్రబస్సు అన్నివర్గాలను ఆకట్టుకుంటుందని మోహన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌లతో ఫోటోలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు. గా మంచు లక్ష్మి తాజాగా సరోగసి పద్దతిలో తల్లి అయిన విషయం తెలిసిందే.