తిరుమలలో 'మంచు' ఫ్యామిలీ
తిరుమల : ప్రముఖ నటుడు మోహన్ బాబు బుధవారం తిరుమల విచ్చేశారు. ఆయన, తన కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ బ్రేక్ దర్శనంలో వెంకన్నను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మోహన్ బాబు విలేకర్లతో మాట్లాడుతూ... స్వామివారి దర్శనం బాగా జరిగిందని.. లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ.. పుట్టు వెంట్రుకలు తీయించేందుకు కుటుంబ సమేతంగా తిరుమల వచ్చామన్నారు.
తమ కుటుంబంతో పాటు అందరూ క్షేమంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు మోహన్ బాబు తెలిపారు. రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని వెంకన్నను మొక్కుకున్నట్లు ఆయన చెప్పారు. శుక్రవారం విడుదలయ్యే ఎర్రబస్సు అన్నివర్గాలను ఆకట్టుకుంటుందని మోహన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ బాబు, విష్ణు, మనోజ్లతో ఫోటోలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు. గా మంచు లక్ష్మి తాజాగా సరోగసి పద్దతిలో తల్లి అయిన విషయం తెలిసిందే.