Lord Venkateswara
-
చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు (ఫోటోలు)
-
ఆధ్యాత్మిక సిరి.. స్వర్ణగిరి! అందరి నోటా ఇదే మాట..
సాక్షి, సిటీబ్యూరో, యాదాద్రి: హైదరాబాద్ తూర్పున టెంపుల్ టూరిజానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఇష్టదైవాన్ని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇటీవల భువనగిరి పట్టణ శివారులో నిర్మించిన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఆధ్యాతి్మక భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. నిత్యం వేల సంఖ్యలో సందర్శకులు, యాత్రికులు క్యూ కడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దడం విశేషం. దీంతో పాటు దేవాలయం పరిసర ప్రాంతాల్లో అనేక ఇతర ఆధ్యాత్మిక మందిరాలు సైతం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి..భువనగిరిలోని స్వర్ణగిరితోపాటు కొలనుపాకలో వెలసిన జైన మందిరం, జగద్గురు రేణుకాచార్యులు ఉద్భవించిన చండికాండ సహిత సోమేశ్వరాలయాలకు సైతం భక్తుల తాకిడి కనిపిస్తోంది. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఇదే ప్రాంతంలో ఉండనే ఉంది. ఒక్క రోజులో దేవాలయాలన్నీ చుట్టి రావచ్చు. వారాంతం, సెలవు రోజుల్లో ఆధ్యాతి్మక పర్యాటకుల తాకిడి మరింత పెరుగుతోంది.భక్తులతో కిటకిట.. స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు గడిచిన నాలుగు నెలలుగా భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. నిత్యం భక్తులతో కిటకిటలాడే యాదగిరిగుట్టకు రోజుకు సుమారు 40 వేల మంది భక్తులు సందర్శించుకుంటుండగా, తాజాగా స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరాలయంలోనూ సుమారు 25 వేల మంది భక్తులు వస్తున్నారని అంచనా వేస్తున్నారు. వారాంతం, సెలవు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయ నమూనాను పోలి ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాలకు చెందినవారే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి సైతం భక్తులు దేవాలయాలను దర్శించుకుంటున్నారు.తెలుగు రాష్ట్రాల్లో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం తెలియనివారుండరు. తాజాగా స్వర్ణగిరి ఆదే స్థాయిలో గుర్తింపు పొందుతోంది. వరంగల్ జాతీయ రహదారికి ఆనుకుని ఆలయాలు రూపుదిద్దుకోవడం, బస్సు, రైళ్ల సదుపాయాలూ ఉండటంతో ప్రయాణం మరింత సులభంగా మారుతోంది. అదే సమయంలో విశాలమైన రహదారి సదుపాయాలు ఉన్నాయి. దీంతో సొంత వాహనాల్లోనూ పెద్ద సంఖ్యలోనే వస్తున్నారు. స్వర్ణగిరి ఆలయంలో భక్తులకు మధ్యాహ్నం అన్న ప్రసాదాలు అందిస్తున్నారు.ప్రయాణం ఇలా.. హైదరాబాద్ నుంచి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో స్వర్ణగిరి దేవాలయం ఉంది. ఈ ఆలయానికి సమీపంలోనే యాదగిరిగుట్ట, కొలనుపాక ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలకు వెళ్లేందుకు వరంగల్ జాతీయ రహదారి ఉపయోగకరంగా ఉంటుంది. నిత్యం వేలాదిగా బస్సులు, కార్లు, ఇతర రవాణా వాహనాలు ఆ మార్గంలో నడుస్తున్నాయి. ఉప్పల్‌లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఆర్టీసీ బస్సులను నడిపిస్తుంది. కొలనుపాక వెళ్లాలనుకునే జైన భక్తులు ఆలేరు నుంచి ఆరు కిలోమీటర్లు వెళ్లాలి. సికింద్రాబాద్ నుంచి ఖాజీపేట మార్గంలో వెళ్లే కృష్ణా, గోల్కొండ, భాగ్యనగర్, కాకతీయ, పుషు్పల్, ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైళ్లు భువనగిరి, యాదాద్రి, ఆలేరు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. అక్కడి నుంచి ఆటో, బస్సులో వెళ్లవచ్చు.మరికొన్ని దర్శనీయ ప్రాంతాలు..యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, స్వర్ణగిరి ఆలయంతో పాటు తెలంగాణలో పేరొందిన పది దేవాలయాలు ఉన్నాయి.. ఆ వివరాలు... – అలంపూర్ జోగులాంబ దేవాలయం – బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం – వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయం – కొండగట్టు వీరాంజనేయస్వామి దేవాలయం – యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం – చిలుకూరు బాలాజీ దేవాలయం – ఖర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం – ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంతిరుపతి ఫీల్ ఉంది..కుటుంబ సభ్యులతో కలసి స్వర్ణగిరి, యాదగిరి గుట్ట, ఆ చుట్టూ ఉన్న టెంపుల్స్ వెళ్లాము. స్వర్ణగిరి కొత్తగా కడుతున్నారు. అక్కడికి వెళ్లగానే తిరుపతి ఫీల్ ఉంటది. యాదగిరి గుట్ట కొత్తగా కట్టిన తరువాత తప్పనిసరిగా ప్రతిఒక్కరూ చూడాలి. ఒక్క రోజులో దేవాలయాలన్నీ దర్శనం చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేశాం. ఆధ్యాత్మిక టూర్ ప్లాన్ చేసుకున్నవారికి ఇది బాగుంది. – జలజా రెడ్డి, మణికొండ -
తిరుమల: అలంకార ప్రియునికి ప్రకృతి సొబగులు
తిరుమల: ఇల వైకుంఠపురంలో కొలువుదీరిన శ్రీనివాసుడు అలంకార ప్రియుడిగా పూజలందుకుంటున్నా రు. సప్తగిరుల్లో లభ్యమయ్యే ప్రకృతి సిద్ధమైన వాటితో పాటు దేశ, విదేశాల నుంచి ఫలపుష్పాదులను తెప్పించి స్వామివారిని అలంకరిస్తుంటారు. వైఖానస ఆగమోక్తంగా శ్రీవారి ఉత్సవాల్లో పూటకో అలంకరణ చేస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయ్యప్ప స్వామికి స్నపన తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. చదవండి: రెండవ రోజూ దేవదేవుడి సేవలో సీఎం ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించడం సంప్రదాయం. ఈ సారి స్నపన తిరుమంజన సేవల్లో పవిత్రాలు, సజ్జ కంకులతో తయారు చేయించిన కిరీటాలు, మాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వామివారి అలంకరణలో ఎప్పటికప్పుడు కొత్తదనం కనిపించేలా టీటీడీ ఉద్యానవనశాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే యాలకులు, పట్టువ్రస్తాలు, సజ్జ కంకులు, పవిత్రాలు, ఎండు ద్రాక్ష–రోస్ పెటల్స్, వట్టివేర్లు–ముత్యాలు, నల్ల–తెల్లద్రాక్ష, కురువేరు–పసుపు, ఎరుపు పెటల్స్, మల్లె–రోజా మొగ్గలతో స్వామివారికి వేర్వేరుగా కిరీటాలు, మాలలు తయారు చేయించి, స్వామివారి తిరుమంజన సేవలో అలంకరించారు. బహుసుందరం రంగనాయకుల మండపం శ్రీవారి ఉత్సవాల్లో స్నపన తిరుమంజనానికి ప్రత్యేకత ఉంది. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆగమోక్తంగా స్నపన తిరుమంజన సేవ చేస్తారు. ఇందులో భాగంగా ఉద్యానవనశాఖ సిబ్బంది రంగనాయకుల మండపాన్ని విదేశీ ఫలపుష్పాలతో బహుసుందరంగా అలంకరించారు. ఎన్నడూ కనీవినీ ఎరుగని ఫలపుష్పాదులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, భక్తులకు కనువిందు చేశాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
శ్రీనివాసుని ఏ వారం దర్శించుకుంటే ఏ ఫలితం...
అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవారిని క్షణకాలం దర్శించుకుంటే చాలు తమ జీవితం ధన్యమవుతుందని భావిస్తారు భక్తులు. నిత్యం వేలాది భక్తులు శ్రీనివాసుని దర్శనార్థం తిరుమలకు తరలి వస్తుంటారు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడిని కళ్లారా దర్శించుకోవాలన్నది భక్తులందరి కోరిక. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనార్థం భక్తులు ఏడుకొండలకు చేరుకుంటారు. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండి, క్షణకాలం మాత్రమే లభించే శ్రీవారి దివ్యమంగళ రూప దర్శనం కోసం తహతహలాడతారు. కేవలం క్షణమైనా సరే, శ్రీవారి దర్శనం దక్కితే చాలు తమ జీవితం ధన్యమవుతుందని భావిస్తారు. ఇదివరకు వారాంతంలో తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండేది. మంగళ, బుధవారాలలో భక్తుల తాకిడి అతి తక్కువగా ఉండేది. గురువారం నుంచి భక్తుల రద్దీ క్రమంగా పుంజుకుని శుక్ర, శని, ఆదివారాల్లో బాగా పెరిగేది. తిరిగి సోమవారం నుంచి కాస్త తగ్గుముఖం పట్టేది. రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతూ వస్తూండడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు రోజులతో సంబంధం లేకుండా, ప్రతిరోజూ వేలాదిగా తరలి వస్తున్నారు. దీంతో వారాంతం స్థాయిలో కాకున్నా, మిగిలిన రోజుల్లో కూడా భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటోంది. శ్రీవారి ఆలయంలోని పరిస్థితుల కారణంగా ఏరోజు దర్శనం చేసుకుంటే, ఎలాంటి పుణ్యఫలాలు లభిస్తాయన్న అంశంపై భక్తులు దృష్టి పెట్టకుండా, స్వామివారి దర్శనభాగ్యం దక్కితే చాలన్నట్లుగా ఎప్పుడు కుదిరితే అప్పుడే భక్తులు వస్తున్నారు. అయితే, శ్రీవారిని ఏ రోజు దర్శించుకుంటే, ఎలాంటి ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం... శ్రీనివాసుడిని ఆదివారం దర్శించుకుంటే రాజానుగ్రహం, ప్రభుత్వాధి నేతల దర్శనం, అధికార కార్యానుకూలత, శత్రునాశనం, నేత్ర, శిరోబాధల నుంచి ఉపశమనం వంటి ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. సోమవారం శ్రీవారిని దర్శించుకుంటే, స్త్రీసంబంధంగా పనుల సానుకూలత, తల్లికి, సోదరీమణులకు శుభం, వారి నుంచి ఆదరణ, భార్యతో అన్యోన్యత కలుగుతాయి. పౌర్ణమినాడు గరుడవాహనంపై శ్రీవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. మంగళవారం శ్రీవారిని దర్శించుకుంటే భూమికి సంబంధించిన వ్యవహారాలలో కార్యసిద్ధి, భవన నిర్మాణ పనులకు అవరోధాలు తొలగి, కార్యానుకూలత కలుగుతాయి. బుధవారం దర్శించుకుంటే విద్యాప్రాప్తి, విదేశీయానం, సామాజిక గౌరవం లభిస్తాయి. గురువారం దర్శించుకుంటే ఉత్తమ జ్ఞానలాభం, వాక్శుద్ధి, గురువుల ఆశీస్సులు లభిస్తాయి. శుక్రవారం దర్శించుకుంటే సమస్త భోగభాగ్యాలు, వాహన సౌఖ్యం, ఇష్టకార్యసిద్ధి వంటి ఫలితాలు కలుగుతాయి. ఇక శనివారం శ్రీవారిని దర్శించుకుంటే రుణపీడ, ఈతిబాధలు తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి. -
TTD: తిరుమల వెళ్లే భక్తులకు కీలక సూచన
సాక్షి, తిరుమల: వేసవి సెలవులు కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భక్తులకు కీలక సూచనలు అందించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వరుస సెలవుల కారణంగా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కాగా, భక్తులకు అవసరమైన సౌకర్యాలను అందిస్తున్నాము. స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు ఆహారం, తాగేందుకు నీరు అందిస్తున్నాము. తిరుమలకు వచ్చే భక్తులు కూడా రద్దీని దృష్టిలో పెట్టుకుని స్వామి వారి దర్శనానికి రావాలని కోరారు. ఇక, తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ఏకాదశి, గరుడ సేవ లాంటి పర్వదినాల కంటే ఎక్కువ మంది భక్తులు విచ్చేశారు. సర్వదర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది. ఆలయంలో గంటకు 4,500 మంది భక్తులకు మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉంది. ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం చేయించేందుకు 48 గంటల సమయం పడుతోంది. ఇది కూడా చదవండి: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలు -
శ్రీవారి బ్రహ్మోత్సవాలు: శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
-
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దర్శించుకున్నారు. సాంప్రదాయ పంచకట్టుతో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీఎంకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం 2022 టీటీడీ క్యాలెండర్, డైరీ సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. అనంతరం గరుడ వాహన సేవలో సీఎం పాల్గొన్నారు. తిరుపతి, తిరుమలలో పర్యటిస్తున్న సీఎం వైఎస్ జగన్.. పలు అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ముందుగా తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం అలిపిరి వద్దకు చేరుకున్న సీఎం జగన్.. శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి తిరుమల చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో, మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం బేడి ఆంజనేయ స్వామిని సీఎం దర్శించుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వేడుకగా వెంకన్న పుష్పయాగం
సాక్షి, తిరుమల: పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం పుష్పయాగ మహోత్సవం శోభాయమానంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అర్చకులు, ఉద్యోగులు, భక్తుల వల్లగానీ జరిగిన దోషాల నివారణకు పుష్పయాగం నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో గల కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టువస్త్రాభరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్ప కైంకర్యం చేశారు. చామంతి, వృక్షి, సంపంగి, సెంటు జాజులు, పొగడ, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, కలువ, మొగలిరేకులు, మానసంపంగి పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు. పుష్పాలకు అధిపతి అయిన దేవుడు పుల్లుడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చించారు. ఉత్సవమూర్తుల నిలువెత్తు వరకు ఉండేలా పుష్ప నివేదన చేపట్టారు. అనంతరం స్వామివారు తన దేవేరులతో కలిసి సహస్రదీపాలంకార సేవలో పాల్గొన్నారు. ఆ తరువాత ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. పుష్పయాగానికి మొత్తం 7 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు విరాళంగా అందించారు. తమిళనాడు నుండి 4 టన్నులు, కర్ణాటక నుండి 2 టన్నులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి కలిపి ఒక టన్ను పుష్పాలు, పత్రాలను దాతలు అందజేశారు. -
తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు
సాక్షి, తిరుమల : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులె పోటెత్తుతున్నారు. కాగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి కోసం టీటీడీ ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసింది. వైకుంఠం కాంప్లెక్స్, నారాయణగిరి ఉద్యానవనం సహా నాలుగు మాడ వీదుల్లో 90 వేలకు పైగా భక్తులు వేచి ఉన్నారు. సోమవారం తెల్లవారుజాము 2గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని టీటీడీ తెలిపింది. ఈ సందర్భంగా వీవీఐపీల దర్శనానంతరం సామాన్య భక్తులకు అనుమతించనున్నారు. ధనుర్మాసకైంకర్యాల అనంతరం తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు ఈ నెల 8వరకు అదే ద్వారా గుండా భక్తులను అనుమతించనున్నారు. కాగా స్వామి వారి సర్వదర్శనం మినహా అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. అలాగే సోమవారం స్వామివారిని స్వర్ణ రథంపై తిరువీధుల్లో తిప్పనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో టీటీడీ పాలక మండలి సమావేమయి వైకుంఠ ద్వారాలు ఎన్ని రోజులు తెరిచి ఉంచాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే ఉచిత లడ్డూ ప్రసాదంపై కూడా పాలకమండలి నిర్ణయం తీసుకోనుంది. -
రూ.14 కోట్ల విరాళం ఇచ్చిన ఇద్దరు భక్తులు
తిరుపతి : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుడికి భక్తులు పెద్ద మొత్తంలో విరాళాలు సమర్పిస్తుండటం అందరికి తెలిసిన విషయమే. తాజాగా అమెరికాకు చెందిన ఇద్దరు ప్రవాస భారతీయులు తిరుమల శ్రీవారికి 14 కోట్ల రూపాయలను విరాళాల రూపంలో అందజేశారు. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని శుక్రవారం వీరు కుటుంబ సమేతంగా తిరుమలేశుడి దర్శనానికి వచ్చారు. ఈ నేపథ్యంలో రూ.14 కోట్లను డీడీ రూపంలో టీటీడీ స్పెషల్ ఆఫీసర్ ఏవీ ధర్మారెడ్డికి అందించారు. ఈ మొత్తాన్ని టీటీడీ ఆధ్వరంలోని వివిధ ప్రజా సంక్షేమ ట్రస్టులకు ఉపయోగించాలని వారు కోరినట్లు తెలిసింది. కాగా, ఈ ఇద్దరు ప్రవాస భారతీయులు ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు అందించడం ఇది రెండోసారి. గతేడాది జూలై నెలలో రూ.13.5 కోట్ల మేర విరాళాన్ని టీటీడీ సంక్షేమ నిధికి అందించినట్లు అధికారులు పేర్కొన్నారు. -
అమెరికాలోని శ్రీవారికి వజ్రాలతో ఆభరణాలు
సాక్షి, తెనాలి: శిల్పకళల్లో ఖండాంతర ఖ్యాతిని పొందిన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అక్కల సోదరుల్లో ఒకరైన ‘కళారత్న’ అక్కల శ్రీరామ్ అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం క్యారీ నగరంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామికి వజ్రాభరణాలను రూపొందించారు. ఆలయ నిర్వాహకుల ప్రతిపాదనల మేరకు స్వామివారికి కఠి హస్తము, వరద, శంఖు, చక్ర హస్తములు, పాదాలను వెండితో తయారు చేసి ముంబయి నుంచి తెప్పించిన అమెరికన్ వజ్రాలను వీటిలో పొదిగారు. ఈ ఆభరణాల రూపకల్పనకు తొమ్మిది నెలల సమయం పట్టిందని శ్రీరామ్ వెల్లడించారు. ఆభరణాలను మంగళవారమే అమెరికాకు పంపుతున్నట్టు చెప్పారు. త్వరలోనే అమెరికాలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి వజ్ర కిరీటాన్ని కూడా తయారు చేయనున్నట్టు తెలిపారు. కాగా, ఆభరణాల్లో వాడిన వజ్రాల విలువ రూ.10 లక్షలు పైగానే ఉంటుందని చెప్పారు. -
సర్వాభీష్ట ప్రదాయకం
భగవంతునికి ఎన్నో నామాలున్నాయి. ఆయన వేయి నామాల విష్ణుదేవుడు కదా! అయినా గోవిందనామం చాలా ప్రశస్తమైనది. తిరుపతి యాత్రికులు శ్రీ వేంకటేశ్వరసామిని గోవిందనామంతోనే ఎక్కువగా కీర్తిస్తారు. గోవింద నామాంకితమైన మాలను ధరించి శ్రీ వేంకటేశ్వర వ్రతం ఆచరించే సంప్రదాయం ఏర్పడింది. ‘మాల’ అనే శబ్దానికి లక్ష్మిని కల్గించేది అని అర్థం. అంటే అశుభాలను తొలగించి సకల సంపదలను కల్గించేది మాల. శ్రీ వ్రతమాల వేయు విధానం: ‘ఓం శ్రీ వేంకటేశ్వర పరబ్రహ్మణే నమః, ఓం శ్రీ గోవింద పరబ్రహ్మణే నమః, ఓం శ్రీ నారాయణ పరబ్రహ్మణే నమః, ఓం శ్రీ వాసుదేవ పరబ్రహ్మణే నమః’ ముడుపు: ఎవరైతే దీక్షాధారణ చేయదలచారో వారు స్వామికి ముడుపు కట్టి దీక్షను ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకాలు రాకుండా ఆ దేవదేవుడు కాపాడగలడు. కావలసిన వస్తువులు: అరచేయి వెడల్పు ఉన్న తెల్లని లేదా పసుపు వస్త్రము 1 మీటరు, 7 రూపాయి బిళ్లలు + 7 పావలా బిళ్లలు. ఇప్పుడు పావలా బిళ్లలు దొరకవు కాబట్టి, చిల్లర పైసలు ఏవి దొరికితే అవే. తెల్లని వస్త్రమైతే దానికి పసుపు అద్ది, ఆరబెట్టి బాగా ఆరిన తరువాత దీక్షకు కూర్చొని, మొదట మాలను కింద చెప్పిన విధంగా శుభ్రపరచుకొని ధూప దీప పూజా కార్యక్రమాలొనర్చి సిద్ధపరచుకోవాలి. తరువాత పసుపు వస్త్రాన్ని తీసుకొని ఎడమ అరచేతిలో ఉంచుకొని, అందులో రూపాయి పావలా ఉంచి స్వామి సకలాభీష్టసిద్ధి మంత్రాన్ని జపిస్తూ ఒక ముడి వేయాలి. అలాగే కొంత స్థలమిచ్చి రెండో ముడి వేయాలి. ఈ రెండవ ముడి వేసేటప్పడు ఇదివరకువేసిన ముడిని దాటించి వేయరాదు. ఖాళీగా వున్న వస్త్రాన్నే తిప్పుతూ ముడివేయాలి. ముడుపు కట్టే సమయంలో ఎవ్వరితోను మాట్లాడరాదు. స్వామి అభీష్ట సిద్ధిమంత్రాన్ని జపిస్తూ ఏడు ముడుపులు కట్టాలి. ఈ ముడుపు కార్యక్రమం అయిన తర్వాత పూజ కావించి మాలధారణ చేయవలెను. మాలను ఇలా పవిత్రం చేయాలి ఆవు పంచితం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, గంధం, నీళ్లు– వీటితో మాలను అభిషేకం చేసి, కర్పూర నీరాజనం çసమర్పించి, గోవింద నామాన్ని 108 పర్యాయాలు జపిస్తూ ధరించాలి. వ్రత నియమం ♦ వైకుంఠ ఏకాదశికి 7 వారాలు, 6 వారాలు, 5 వారాలు, 4 వారాలు, 7 రోజులు ముందుగా గాని ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ♦ మాలను తులసి పూసలతో గాని తామర పూసలతో గాని, పటిక పూసలతో గాని పవిత్రం చేసి శ్రీవేంకటేశ్వరస్వామికి తమ శక్త్యనుసారం పూజ కావించి ధరించాలి ♦ స్త్రీలు అయితే 7 రోజుల వ్రతాన్ని ఆచరించవచ్చు ♦ వైకుంఠ ఏకాదశి ముందురోజు ఉదయం 9–30 గంటలకు తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయంవద్ద ’యాగపూజ –కంకణ ధారణ జరుగుతుంది. భక్తులు విధిగా హాజరుకావాలి. భక్తులు యాగానికి కావలసిన 7 రకముల సమిధలు 500 గ్రా. ఆవు నెయ్యి తీసుకు రావాలి ♦ శ్రీస్వామివారికి ముఖ్యమయిన పసుపు వస్త్రాలను విధిగా ధరించాలి. నుదుట తిరునామాలు పెట్టుకోవాలి ♦ వ్రతకాలంలో ధూమం మద్యం, మత్తుపదార్థాలు, మాంసాహారం సేవించరాదు. దాంపత్యానికి దూరంగా ఉండాలి. సాత్వికాహారం ఉత్తమం ♦ ప్రతి నిత్యం ఉదయం, సాయంత్రం స్నాన కార్యక్రమం ముగించుకొని శ్రీ స్వామి వారి గోవిందనామము ధ్యానించాలి. వీలైతే రోజుకు 1008 సార్లు ‘ఓం నమోవేంకటేశాయ’ అనే సకలాభీష్ట సిద్ధిమంత్రాన్ని జపించాలి. భజనలో పాల్గొనాలి ♦ ఎదుటి వారిని తనమాటల చేతకాని, చేతలచేతగాని బాధింపరాదు ♦ దీక్షాకాలంలో ఇతరులను ‘గోవిందా’ అని పిలవాలి ♦ ఉపవాస కార్యక్రమాన్ని తూ.చ. తప్పక భక్తిగా, నిష్ఠగా పాటించాలి. ఈ వ్రతాన్ని అన్ని వర్ణాలవారు ఆచరించవచ్చు. ఆచరించినవారు స్వామివారి కృపా కటాక్షం వలన తలచిన కోర్కెలు నెరవేర్చుకొని సకల సుఖాలు పొందవచ్చు. శ్రీవారి హుండీ ముడుపు పచ్చకర్పూరం 50 గ్రా.; జీడిపప్పు 50 గ్రా.; ఎండు ద్రాక్ష 50 గ్రా.; ఏలకులు 50 గ్రా.; మిరియాలు 50 గ్రా.; జీలకర్ర 50 గ్రా.; బియ్యం 50 గ్రా.; కర్పూరం 50 గ్రా. ఇంటికి తెచ్చుకొనే ముడుపు బియ్యం 100 గ్రా; టెంకాయ 1; కర్పూరం 1 ప్యాకెట్ పై పదార్థాలు రెండు విడి విడి సంచులలో వేరువేరుగా కట్టుకొని ముడుపుల మూటతో నడచి శ్రీ స్వామివారి సన్నిధి చేరాలి. ఇంటికి తెచ్చుకొను ముడుపు మూటను దగ్గరిలో వచ్చే శనివారం రోజున వారి వారి ఇంటిలో పూజ చేసుకుని ముగించుకొనవచ్చు. – టి.వి.ఆర్.కె. మూర్తి (విశ్వపతి) -
వడ్డీకాసులవాడికి వందల కోట్ల వడ్డీ ఆదాయం
సాక్షి, అమరావతి: తిరుమల వేంకటేశ్వరస్వామి వారి పేరిట వివిధ బ్యాంకుల్లో రూ. 7,359 కోట్లు నగదు డిపాజిట్లు ఉన్నాయి. ఈ డిపాజిట్లపై ఏటా వడ్డీ రూపంలో టీటీడీకి రూ. 766 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ సమాచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శాసనమండలి హామీల అమలు కమిటీకి అందజేసిన నివేదికలో పేర్కొన్నారు. భక్తులు దర్శన టికెట్ కొనుగోళ్ల ద్వారా టీటీడీకి రెండేళ్ల క్రితం రూ. 210 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది దర్శన టికెట్ల ద్వారా రూ. 256 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే టీటీడీ వార్షిక ఆదాయం రూ. 2,858 కోట్లు. భక్తులు హుండీలో వేసే కానుకల ద్వారా రోజూ రెండున్నర నుంచి మూడు కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ఇతర కానుకల ద్వారా ఈ ఏడాది రూ. 1,110 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. టీటీడీకి వచ్చే ఆదాయంలో ఉద్యోగుల జీతభత్యాలకే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతభత్యాలకు రూ. 800 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. స్వామి పూజా సామగ్రి, తదితర వస్తువుల కొనుగోలుకు రూ. 300–400 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. హామీల అమలు కమిటీకి టీటీడీ ఇచ్చిన నివేదికలో బ్యాంకు డిపాజిట్ల వివరాలు.. బ్యాంకు నగదు డిపాజిట్లు(రూ. కోట్లలో) విజయా బ్యాంకు 2,938 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 1,965.01 సిండికేట్ బ్యాంకు 945.37 స్టేట్ బ్యాంకు 938.06 కెనరా బ్యాంకు 298.10 సప్తగిరి గ్రామీణ బ్యాంకు 105.09 ఏపీ కోఆపరేటివ్ బ్యాంకు 36 బ్యాంకు ఆఫ్ ఇండియా 31.55 ఆంధ్రా బ్యాంకు 21.79 ఇతర బ్యాంకులు 52.50 మొత్తం 7,359.42 -
చినవెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
వరపల్లి : ద్వారకాతిరుమలేశుని క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది. కిక్కిరిసిన భక్తులతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి. ప్రసాదం, టికెట్ కౌంటర్లు, దర్శనం క్యూలైన్లు, కేశఖండన శాల ఇతర విభాగాలు భక్తులతో నిండిపోయాయి. దర్శనం క్యూలైన్లు పూర్తిగా నిండిపోవడంతో ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలో భక్తులు బారులు తీరారు. దాదాపు 20 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించినట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు. సాయంత్రం వరకు ఆలయంలో రద్దీ కొనసాగింది. దాదాపు 5 వేల మందికి పైగా భక్తులు స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించినట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలరించిన కోలాట భజనలు శ్రీవారి ఆలయ పరిసరాల్లో తిరుమల తిరుపతి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట భజనలు ఆద్యంతం భక్తులను అలరించాయి. ముందుగా వారు స్వామి, అమ్మవార్లను దర్శించి పూజించారు. ఆ తరువాత ఆలయ ఆవరణలోను, శ్రీహరికళాతోరణ వేదికపైన భక్తిగీతాలను ఆలపిస్తూ కోలాట భజనలు జరిపారు. -
శ్రీవారి సేవలకు 10,737 టిక్కెట్ల కేటాయింపు
తిరుమల: ఆన్ లైన్లో సేవా టిక్కెట్లు లక్కీ డిప్‌కు96,837 మంది భక్తులు రిజిష్టర్ చేసుకున్నారని జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. లక్కీ డిప్ ద్వారా సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజ పాదదర్శనం, విశేష పూజ సేవలకు 10, 737 టిక్కెట్లు కేటాయించామని వివరించారు. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు విచ్చేసే భక్తులకు ఆధార్ కార్డు తప్పనిసరి చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన అన్నారు. భక్తులలో 94 శాతం మంది ఆధార్ కార్డు తీసుకొస్తున్నట్లు సర్వే ద్వారా వెల్లడైందన్నారు. సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయింపు జూలై 1వ తేదీ నుంచి పునరుద్దరిస్తామని చెప్పారు. బ్రేక్ దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా ఆధార్ ను గుర్తింపుగా కార్డుగా చూపాలని అన్నారు. వసతి గదులు పొందిన భక్తులు 12 గంటలలోపు ఖాళీ చేస్తే సగం నగదు తిరిగి చెల్లించేలా ఏర్పాట్లు చేశామని జేఈఓ చెప్పారు. -
వెంకన్న హుండీకి నోట్ల వెల్లువ
-
వెంకన్న హుండీకి నోట్ల వెల్లువ
తిరుపతి: పెద్ద నోట్ల రద్దు వల్ల తోపుడు బండ్లు, చిల్లర దుకాణాలు మొదలు మాల్స్ వరకు వ్యాపారాలు పడిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. బంగారం షాపులు కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. అయితే పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు కరెన్సీ కష్టాలు పడుతున్నా.. వడ్డికాసులవాడు తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలోని హుండీపై ఏమాత్రం ప్రభావం పడలేదు. మునిపటి కంటే ఎక్కువగా శ్రీవారికి కానుకలు పోటెత్తుతున్నాయి. 'ఏడాదికి హుండీ ద్వారా మాత్రమే దాదాపు వెయ్యి కోట్ల నగదు వస్తుంది. పెద్ద నోట్లను రద్దు చేసినా ఏమాత్రం ప్రభావం పడలేదు. దేశవ్యాప్తంగా వస్తున్న భక్తులు శ్రీవారికి కానుకలు సమర్పిస్తున్నారు. బంగారు, వెండి కానుకలు గాక హుండీ ద్వారా రోజుకు సరాసరిన మూడు కోట్ల రూపాయల డబ్బు వస్తోంది. నవంబర్ 9 నుంచి పది రోజుల్లో హుండీ ద్వారా 30.36 కోట్ల రూపాయల నగదు కానుకగా వచ్చింది. గతేడాది ఇదే సమయంలో వచ్చిన డబ్బుతో పోలిస్తే ఈ మొత్తం 8 కోట్ల రూపాయలు ఎక్కువ' అని టీటీడీ అధికారులు చెప్పారు. -
‘నా జీవితం ఆయన పాదసేవకే అంకితం’
-
‘నా జీవితం ఆయన పాదసేవకే అంకితం’
తిరుమల : తనపై వచ్చిన ఆరోపణలపై తిరుమల స్వామివారి ఆలయం ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు స్పందించారు. తన జీవితం స్వామివారికే అంకితమని, 50 ఏళ్లుగా తన పేరు ప్రతిష్టలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా గతనెలలో స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నైవేద్య విరామ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా మనవడిని ఆలయంలోనికి తీసుకువెళ్లడంతో పాటు తిరునామానికి సంబంధించి రమణ దీక్షితులపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ...'1974 నుంచి స్వామిరవారికి కైంకర్యాలను నిర్వహిస్తున్నాం. ఉత్తమమైన పదవులను వదులుకుని దైవ సేవకు వచ్చా. సామరస్యం, సంస్కారం నా సొంతం. ఇంత అనుభవం ఉన్నా...నన్ను వేలెత్తి చూపుతున్నారు. ఇది దురదృష్టకర ఘటన. అర్చకులపై నిందారోపణలు రావడం శోచనీయం. నాపై కక్ష సాధింపు కోసమే ఈ ఆరోపణలు. నా పాత్ర వరకే నేను పరిమితం, ఇతర విషయాలు పట్టించుకోను. అపచారాలను నేను వేలెత్తి చూపుతాను. దేవాలయంలో ప్రలోభకరమైన విషయాలు ఉన్నాయి. కానుకలు, డబ్బులు, పదవుల కేంద్రంగా ఇవి సాగుతున్నాయి. ఈ ప్రలోభాలకు నేను దూరం. చేసేవారికి సహకరించకపోవడం వల్లే కక్ష కడుతున్నారు.’ అని తెలిపారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా తన మనవడిని ఆలయంలోకి తీసుకు వెళ్లిన ఘటనపై టీటీడీ యాజమాన్యం.. రమణ దీక్షితులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. -
మోహినీ అవతారంలో శ్రీనివాసుడు
-
హంస వాహనంపై శ్రీవారి దర్శనం
-
అక్టోబర్ 2 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
జిన్నారం: మండలంలోని గుమ్మడిదల గ్రామంలో గల కల్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహోత్సవాలను వచ్చే నెల 2 నుంచి నిర్వహించనున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తల ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు స్వామివారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను కూడ అర్చకులు ఆవిష్కరించారు. ఉత్సవాల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున స్వస్తి వాచనం, 3న ధ్వజారోహణం, శేషవాహనం, 4న స్వామివారి అభిషేకం, గజవాహన సేవ, 5న కల్యాణోత్సవం, హనుమంత వాహన సేవ, 6న సదస్వం, గరుడవాహన సేవ, 7న మహాపూర్ణాహుతి, అశ్వవాహన సేవ కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆలయ వంశపారం పర్య ధర్మకర్తలు సుందరాచార్యులు, నర్సింహ్మాచార్యులు తెలిపారు. స్వామివారి బ్రహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. స్వామివారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించటంలో తాము కూడా భాగస్వాములవుతామని సర్పంచ్ సురేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ నరేందర్‌రెడ్డిలు తెలిపారు. -
శ్రీవారికి పరదాలు సమర్పించిన టైలర్
-
వెంకన్న కొండకు.. ఆర్టీసీ దర్శన సర్వీసు
కుటుంబ సమేతంగా తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లాలంటే ఒకటే తర్జనభర్జన. దర్శన టికెట్లు తీసుకోవాలి, రూమ్ బుక్ చేసుకోవాలి, రైలు లేదా బస్సు రిజర్వేషన్ చేసుకోవాలి.. రిజర్వేషన్ దొరికితే దర్శన టికెట్లు ఉండవు, పోనీ దర్శన టికెట్లు ఉన్నాయనుకుంటే రిజర్వేషన్ అందుబాటులో ఉండదు. ఈ గందరగోళం, గజిబిజిలో ఒక్కోసారి ప్రయాణాన్ని రద్దు చేసుకునేవారూ ఉంటారు. అలాంటి అయోమయ పరిస్థితులకు గురికాకుండా భక్తుల కోసం ప్రత్యేక దర్శన సర్వీసులను నడుపుతోంది ఆర్టీసీ. తిరుపతికి బస్ టికెట్ తీసుకుంటే చాలు.. దర్శన టికెట్‌ను ఆర్టీసీనే బుక్ చేసి అందజేస్తుంది. ఆ వివరాలు మీకోసం.. విజయవాడ (బస్‌స్టేషన్) : విజయవాడ నుంచి తిరుపతికి ఆర్టీసీ ప్రత్యేక దర్శన సర్వీసులను నడుపుతోంది. బస్సు టికెట్‌తో పాటే శీఘ్రదర్శన టికెట్లు కూడా ఇస్తారు. ఇందుకోసం రెండు ఏసీ, ఆరు సూపర్ లగ్జరీ సర్వీసులను ఆర్టీసీ అధికారులు ఎంపిక చేశారు. వీటిని ఉదయం 11, సాయంత్రం 4 గంటలకు శీఘ్ర దర్శనం టికెట్లకు అనుసంధానం చేశారు. ఆ సర్వీసుల్లో ప్రయాణించేవారు దర్శనం టికెట్లు తీసుకునే వెసులుబాటు ఉంది. ప్రయాణికులు నిర్ణయించుకున్న తేదీని బట్టి టికెట్లు ఉన్నాయా, లేదా అని విచారణ చేసి, వారి కోరిన ప్రకారం టోకెన్ రూపంలో టికెట్ మంజూరు చేస్తారు. ప్రయాణికులు చెల్లించిన డబ్బుతో టీటీడీ దేవస్థానంలో దర్శనం టికెట్లు కొనుగోలు చేస్తారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి ఈ ప్రత్యేక బస్సు సర్వీసుల ద్వారా తిరుపతి బస్టాండ్‌కు చేరవేస్తారు. అక్కడి నుంచి తిరుమల చేరుకోవాలి. కొండపై ఉన్న ఆర్టీసీ బస్టాండ్ బుకింగ్ సిబ్బందికి టికెట్ చూపిస్తే అప్పటికే తీసుకుని ఉన్న శీఘ్రదర్శనం టికెట్లను భక్తులు అందిస్తారు. వాటిని తీసుకుని దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. బస్సుల వివరాలు సూపర్ లగ్జరీ సర్వీసులు ఉదయం 8.40, 11 గంటలు, మధ్యాహ్నం 2.15, రాత్రి 10.35, 11, 11.45 గంటలకు, ఏసీ సర్వీసులు ఉదయం 10 గంటలకు (అమరావతి స్కానియా), రాత్రి 10 గంటలకు గరుడ బస్సు బయలుదేరుతుంది. బస్సు చార్జీలు ఇలా.. అధికారులు తిరుపతి వరకూ టికెట్ వసూలు చేస్తారు. వాటితో పాటు అదనంగా ఒక్కో మనిషికి శీఘ్ర దర్శనానికి రూ.300 తీసుకుంటారు. తిరుపతి బస్టాండ్‌లో దిగిన ప్రయాణికులు తిరుమలకు చార్జీలతో వెళ్లాలి. సూపర్ లగ్జరీ సర్వీసులు : పెద్దలకు రూ.535, పిల్లలకు రూ.262 అమరావతి స్కానియా సర్వీసులు : పెద్దలకు రూ.856, పిల్లలకు రూ.735 గరుడ సర్వీసు : పెద్దలకు రూ.815, పిల్లలకు రూ.650 ఉదయం 11, సాయంత్రం 4 గంటలకు మాత్రమే దర్శనం కల్పిస్తారు. మిగతా సమయంలో ప్రయాణికులే వసతి సదుపాయాలు కల్పించుకోవాలి. ఆర్టీసీ అందుకు బాధ్యత వహించదు. -
అన్నవరప్పాడు ఆలయంలో చోరీ
అన్నవరప్పాడు (పెరవలి) : జాతీయ రహదారి పక్కన పెరవలి మండలం అన్నవరప్పాడు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ జరిగింది. గర్భాలయం ఎదుట ఉన్న ప్రధాన హుండీని దొంగ అపహరించాడు. రెండు నెలలుగా హుండీ ఆదాయం లెక్కించకపోవడంతో సుమారు రూ.50 వేలకు పైగా సొమ్ము ఉంటుందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలయ మేనేజర్ బ్రహ్మారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. రోజూ మాదిరిగానే శనివారం రాత్రి 8.30 గంటలకు ఆలయ ప్రధాన తలుపులు మూసివేశారు. నైట్ వాచ్మెన్ కోటిపల్లి ఆంజనేయులు విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి 1–2 గంటల మధ్య చోరీ జరిగినట్టు ఆలయంలోని సీసీ కెమెరాలో నమోదైంది. అసలేం జరిగిందంటే.. రాత్రి 1 గంటకు ప్రధాన ఆలయం పక్కన ఉన్న అలివేలు మంగతాయారు గుడి తలుపులు పగులకొట్టేందుకు దొం గ ప్రయత్నించాడు. అవి తెరుచుకోకపోవడంతో 1.15 నిమిషాలకు గర్భాలయం ఎదుట ఉన్న ప్రధాన హుండీకి ఉన్న ఇనుమ గొలుసులను తెంపి హుండీతో ఉడాయించాడు. ఈ సమయంలో ఆలయంలోని విద్యుత్ దీపాలను దొంగ ఆర్పివేశాడు. దీనిని గమనించిన నైట్ వాచ్మెన్ దీపాలు వేశాడు. మరలా దొంగ దీపాలను ఆర్పివేశాడు. దీంతో అనుమానం వచ్చిన నైట్ వాచ్మెన్ ఆలయం వెనుక నివాసం ఉంటున్న సిబ్బందిని తీసుకురావడానికి వెళ్లాడు. వారు వచ్చి ఆలయ ప్రాంగణంలో పరిశీలించినా దొంగను మాత్రం గమనించలేదు. తర్వాత కొద్దిసేపటికి దొంగ హుండీతో సమీపంలోని పొలంలోకి వెళ్లాడు. నైట్‌వాచ్‌మెన్, ఆలయ సిబ్బంది గర్భాలయం వద్ద చూడగా హుండీ చోరీకి గురైనట్టు గుర్తించారు. పొలంలో హుండీ పగులగొట్టిన దొంగ సొమ్ముతో ఉడాయించాడు. ఆ సమయంలో ఆలయం వద్ద మోటార్ బైక్ శబ్ధం రావడంతో ఆలయ సిబ్బంది, స్థానికులు పొలం వైపుగా వెళ్లారు. దొంగ వేగంగా మోటార్ బైక్‌పై తప్పించుకుని పోయాడు. స్థానికులు ఖండవల్లి గ్రామం వరకూ దొంగను వెంబడించినా ఫలితం లేదు. ఖండవల్లి నుంచి తూర్పువిప్పర్రు రోడ్డులోకి దొంగ వేగంగా వెళ్లిపోయాడు. ఇది మూడోసారి అన్నవరప్పాడు గ్రామంలో ఆలయాల్లోని హుండీలు అపహరణకు గురికావడం ఇది మూడోసారి. గతేడాది జూలైలో ఇదే తరహాలో ఈ ఆలయంలోనే చోరీ జరిగింది. గత నెలలో గ్రామంలోని శక్తమ్మవారి ఆలయంలో హుండీని అపహరించారు. మరలా ఇప్పుడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీ చోరీకి గురైంది. -
తిరుచ్చిపై శ్రీనివాసుడు చిద్విలాసం
శ్రీనివాస మంగాపురం(చంద్రగిరి): శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వెంకటేశ్వర స్వామి వారు శనివారం తిరుచ్చి వాహనంపై నాలుగు మాడ వీధులలో విహరించారు. వారపు ఉత్సవాలలో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతసేవతో మేల్కొలిపారు. అనంతరం స్వామివారికి ఫల, పుష్ప సుగంధ పన్నీటి ద్రవ్యాలతో అభిషేక సేవ నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కల్యాణమండంపంలోకి వేంచేపు చేసి, వైఖానస ఆగమోక్తంగా కన్నుల పండువగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లు తిరుచ్చి వాహనంపై ఆశీనులై నాలుగుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈసందర్భంగా భక్తులు దేవేరులకు ధూపదీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో ధనుంజయ, ఇన్స్పెక్టర్లు దినకర రాజు, కష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని గురువారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఏపీ డీజీపీ సాంబశివరావు శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనమనంతరం వీరికి టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. -
శ్రీవారికి కారు విరాళం
తిరుమల : తిరుమల శ్రీవారికి ఆదివారం రూ.14 లక్షల విలువ కలిగిన కారు విరాళంగా అందింది. అనంతపురంలోని శ్రీదుర్గ మారుతి ఆటోమోటివ్స్ సంస్థ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వరరావు ఈ విరాళాన్ని ఇచ్చారు. శ్రీవారి ఆలయం వద్ద కారుకు ప్రత్యేక పూజలను నిర్వహించి టీటీడీ అధికారులకు వాహన తాళాలను అందజేశారు. -
శ్రీవారి సేవలో మెత్రిపాల సిరిసేన
సాక్షి, తిరుమల : శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజాము 3 గంటలకు సుప్రభాతసేవ, తర్వాత ఉదయం 6 గంటలకు నైవేద్య విరామ సమయం అనంతరం ఆయన ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సతీమణి జయంతి పుష్పకుమారి, కుమారుడు దహం తారక, ఇతర కుటుంబ సభ్యులు, శ్రీలంక ప్రతినిధులు మొత్తం 40 మందితో కలసి ఆలయానికి చేరుకున్నారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత పచ్చకర్పూరపు వెలుగులో గర్భాలయ మూలమూర్తిని దర్శించుకున్నారు. తర్వాత వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు పట్టువస్త్రంతో సత్కరించారు. శ్రీవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి, జేఈవో పోల భాస్కర్ ఉన్నారు. డ్రైవర్ కోసం శ్రీలంక అ«ధ్యక్షుడి నిరీక్షణ.. పరుగులు తీసిన యంత్రాంగం శ్రీలంక అధ్యక్షుడు శ్రీవారిని దర్శించుకుని తిరుగుప్రయాణం కోసం కారులో కూర్చున్నారు. అదే సమయంలో కారు డ్రైవర్ ఆలయంలోనే ఉన్నాడు. దీంతో ఖంగారు పడిన తిరుపతి అర్భన్జిల్లా ఎస్పి జయలక్ష్మి భద్రతాధికారును చివాట్లు పెట్టి ఆలయంలో ఉండే డ్రైవర్‌ను తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ పది నిమిషాల తర్వాత డ్రైవర్ పరుగులు తీస్తూ కారు వద్దకు వచ్చారు. అప్పటికే కారులో ఉన్న అధ్యక్షుడితోనే కారును వెనక్కు తిప్పుకుని తిరుగుప్రయాణం అయ్యారు. ఈ ఘటనపై ఎస్పీ జయలక్ష్మి ఆలయ డెప్యూటీఈవో కోదండరామారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దేశాధ్యక్షుడి హోదాలో వచ్చిన వీవీఐపీ కారు డ్రైవర్‌ను తమ అనుమతి లేకుండా శ్రీవారి దర్శనానికి ఎలా తీసుకెళతారు? జరిగిన జాప్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అంటూ మండిపడ్డారు. దీంతో ఆలయ డెప్యూటీఈవో రామారావు తమకేమి సంబంధం లేదన్నట్టుగా నవ్వుతూ ఉండిపోయారు. శ్రీవారికి హెచ్‌సీఎల్ అధినేత శివ్‌నాడార్ రూ. కోటి విరాళం హెచ్‌సీఎల్ అధినేత శివ్‌నాడార్ ఆదివారం తిరుమల శ్రీవారికి రూ.కోటి విరాళం ఇచ్చారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావును కలసి రూ.కోటి డీడీ అందజేశారు. ఈ మొత్తాన్ని సర్వశ్రేయ ట్రస్టుకు వాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శివ్‌నాడార్‌ను శ్రీవారి పట్టువస్త్రం, లడ్డూ ప్రసాదాలతో ఈవో సాంబశివరావు సత్కరించారు. శ్రీవారిని దర్శించుకున్న ప్రతిసారి శివ్‌నాడార్ శ్రీవారికి భారీ స్థాయిలో విరాళం సమర్పించటం ఆనవాయితీ. -
27 నుంచి పవిత్రోత్సవాలు
ద్వారకా తిరుమల : శ్రీవారి ఆలయ ఉపాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాసుని దివ్య పవిత్రోత్సవాలు ఈ నెల 27 నుంచి 30 వరకు జరగనున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసీ తెలియక జరిగిన తప్పుల ప్రాయశ్చిత్తం నిమిత్తం ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. 27న అంకురార్పణ, 28న పవిత్రాదివాసము, 29న పవిత్రారోహణ, 29న పవిత్ర అవరోహణ నిర్వహించనున్నట్టు ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. -
27 నుంచి పవిత్రోత్సవాలు
ద్వారకా తిరుమల : శ్రీవారి ఆలయ ఉపాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాసుని దివ్య పవిత్రోత్సవాలు ఈ నెల 27 నుంచి 30 వరకు జరగనున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసీ తెలియక జరిగిన తప్పుల ప్రాయశ్చిత్తం నిమిత్తం ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. 27న అంకురార్పణ, 28న పవిత్రాదివాసము, 29న పవిత్రారోహణ, 29న పవిత్ర అవరోహణ నిర్వహించనున్నట్టు ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. -
వెంకటేశ్వరుడిగా దర్శనమిచ్చిన సౌరబ్
అన్నమయ్య, శ్రీ రామదాసు, శిరిడి సాయి లాంటి భక్తి రస చిత్రాలను అందించిన నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్లో మరో భక్తి రస చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని పరమ భక్తుడు హథీరాం బాబా జీవితకథ ఆధారంగా సినిమా రూపొందించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సాక్ష్యాత్తు శ్రీనివాసుడితో పాచికలాడిన పరమ భక్తుడు హథీరాం బాబా కథతో సినిమా అంటే ఆ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర కూడా చాలా సమయం తెర మీద కనిపిస్తోంది. అందుకే ఆ పాత్రలో కనిపించే నటుడి ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. గతంలో అన్నమయ్య, శ్రీ రామదాసు సినిమాల్లో సుమన్ దేవుడి పాత్రలో కనిపించగా కొత్త సినిమా కోసం ఓ ఉత్తరాది నటుణ్ని తీసుకున్నారు. పలు హిందీ సీరియల్స్‌లో శ్రీమహావిష్ణువు, కృష్ణుడు, శ్రీ రాముడి పాత్రల్లో కనిపించిన సౌరభ్ రాజ్ జైన్ ఓం నమో వెంకటేషాయలో వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తున్నాడు. సినిమా రిలీజ్ లోపు సౌరబ్ ను తెలుగు ప్రేక్షకులకు అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ టీజర్ లో అతని లుక్ ను మాత్రమే రివీల్ చేశారు. హీరో నాగార్జున ఒక్క ఫ్రేమ్ లో కూడా కనిపించని టీజర్ నాగ్ అభిమానులకు నిరాశకలిగించినా.. వెంకటేశ్వరుడిగా సౌరబ్ లుక్ మాత్రం సినిమా మీద అంచనాలను పెంచుతోంది. నాగార్జున సినిమా కోసం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు బుల్లి తెర మీదే కనిపించిన సౌరభ్‌కు తొలిసారిగా సినిమా అవకాశం రావటం పై ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. త్వరలో సౌరభ్ క్యారెక్టర్‌పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది. -
తెలుగు తెరకు కొత్త దేవుడు
అన్నమయ్య, శ్రీ రామదాసు, శిరిడి సాయి లాంటి భక్తి రస చిత్రాలను అందించిన నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్లో మరో భక్తి రస చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని పరమ భక్తుడు హథీరాం బాబా జీవితకథ ఆధారంగా సినిమా రూపొందించే పనిలో ఉన్నారు. ఈ సినిమాకు నమో వెంకటేషాయ అనే పేరును పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సాక్ష్యాత్తు శ్రీనివాసుడితో పాచికలాడిన పరమ భక్తుడు హథీరాం బాబా కథతో సినిమా అంటే ఆ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర కూడా చాలా సమయం తెర మీద కనిపిస్తోంది. అందుకే ఆ పాత్రలో కనిపించే నటుడి ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిత్రయూనిట్. గతంలో అన్నమయ్య, శ్రీ రామదాసు సినిమాల్లో సుమన్ దేవుడి పాత్రలో కనిపించగా కొత్త సినిమా కోసం ఓ ఉత్తరాది నటుణ్ని తీసుకురావాలని భావిస్తున్నారట. పలు హిందీ సీరియల్స్‌లో శ్రీమహావిష్ణువు, కృష్ణుడు, శ్రీ రాముడి పాత్రల్లో కనిపించిన సౌరభ్ రాజ్ జైన్‌ను నాగార్జున సినిమా కోసం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు బుల్లి తెర మీదే కనిపించిన సౌరభ్‌కు తొలిసారిగా సినిమా అవకాశం రావటం పై ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. త్వరలో సౌరభ్ క్యారెక్టర్‌పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభుతోపాటు పలువురు ప్రముఖులు శనివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ మురళీమోహన్, టీటీడీ చైర్మన్ తదితరులు ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి కూడా స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. అశోక్‌లేలాండ్ కంపెనీ ఎండీ వినోద్ కే దాసరి స్వామిని దర్శించుకుని రూ.18 లక్షల విలువ చేసే లారీని టీటీడీకి విరాళంగా అందజేశారు. -
శ్రీవారికి బైక్ కానుకగా ఇచ్చిన భక్తుడు
తిరుమల: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారికి ఓ భక్తుడు బైక్‌ను కానుకగా సమర్పించాడు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నానికి చెందిన ప్రసాదరాజు అనే భక్తుడు స్వామి వారికి హీరో బైక్‌ను కానుకగా ఇచ్చాడు. టీటీడీ ఆలయ డిప్యూటీ ఈవో రామారావుకు బైక్‌ను ప్రసాదరాజుకు అందజేశారు. ఈ బైక్ ధర రూ. 72 వేలు అని భక్తుడు ప్రసాదరాజు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించడానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి గంట, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట, కాలినడక భక్తులకు ఒక గంట సమయం పడుతోంది. నిన్న(బుధవారం) స్వామివారిని 38,442 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
రెండు గంటల్లోనే శ్రీవారి సర్వదర్శనం
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో బుధవారం ఉదయం సయమానికి శ్రీవారి దర్శనానికి వేచి ఉండే భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కేవలం రెండు గంటల్లోనే స్వామివారి సర్వదర్శనం లభిస్తోంది. కాలినడక భక్తులకు కూడా రెండు గంటల్లోనే దర్శనం పూర్తవుతోంది. రెండు కంపార్ట్ మెంట్లలో మాత్రమే స్వామి వారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం కేవలం గంటలోనే పూర్తవుతున్నట్లు సమాచారం. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి నాలుగు గంటలు, కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటల్లోపే పూర్తవుతోంది. గదుల వివరాలు: ఉచిత గదులు - 5 ఖాళీగా ఉన్నాయి రూ.50 గదులు - 10 ఖాళీగా ఉన్నాయి రూ.100 గదులు - ఖాళీ లేవు రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జిత సేవల టిక్కెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీలేవు సహస్ర దీపాలంకరణ - 80 ఖాళీగా ఉన్నాయి వసంతోత్సవం - ఖాళీలేవు సోమవారం ప్రత్యేక సేవ - విశేష పూజ. -
శ్రీవారికి కొప్పెర కష్టాలు
► కొప్పెరకు కొత్త వస్త్రాల్లేవ్! సాక్షి, తిరుమల: భక్తుల కొండంత కోరికలను నెరవేర్చే కోనేటిరాయుడికి కొప్పెర కష్టం వచ్చింది. భక్తులు కానుకలు సమర్పించుకునేందుకు కొప్పెర వస్త్రాలు కుట్టే దర్జీ కరువైపోయాడు. ఉద్యోగ విరమణ చేసిన దర్జీ స్థానంలో కొత్తవారిని నియమించకపోవడంతో కొప్పెర వస్త్రాలు కుట్టే పని అర్ధంతరంగా నిలిచిపోయింది. అపర కుబేరుడికి దర్జీ కరువే కొప్పెర ద్వారా భక్తుల నుంచి కానుకలు అందుకునే తిరుమలేశుడికే దర్జీ కరువైపోవడం సంబంధిత అధికారుల పనితీరుకు దర్పణం పడుతోంది. తిరుమల ఆలయ కొప్పెర(హుండీ) కోసం వాడే కేస్‌మెట్ వస్త్రాన్ని కుట్టేందుకు గతంలో ప్రత్యేకంగా అనుభవం గడించిన దర్జీ ఉండేవారు. ఐదారేళ్ల క్రితం ఆయన ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో కొంతకాలంగా టీటీడీ ఆరోగ్య శాఖలోని ఓ మల్టిపుల్ వర్కర్(అవసరాన్ని బట్టి ఏ విభాగానికైనా వినియోగించుకునే టీటీడీ ఉద్యోగి) చేత ఈ దర్జీ పనిచేయించారు. రోజువారీ విధుల్లో భాగంగా ఆ దర్జీ తిరుమల ఆలయానికి అవసరమైన కొప్పెర వస్త్రాలను కుట్టి ఇచ్చేవారు. ఆయన కూడా రెండు నెలల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. కానీ, ఆయన స్థానంలో కొత్తవారిని నియమించలేదు. దీంతో కొప్పెరతయారు చేసేందుకు మార్కెటింగ్ విభాగం కొనుగోలు చేసిన వస్త్రాలు సంబంధిత కార్యాలయంలో కుప్పలుతెప్పలుగా పేరుకుపోయాయి. దర్జీలేని కారణంగా ఆలయంలో కొప్పెరకు కొత్త వస్త్రాల కొరత ఏర్పడింది. ఆలయ నిబంధనల ప్రకారం ఒకసారి గంగాళం లేదా పాత్రకు కట్టిన వస్త్రాన్ని మరోసారి వాడకూడదు. దర్జీ లేకపోవడంతో ఒకసారి ఉపయోగించిన వస్త్రాలనే మళ్లీ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని ఆలయ అధికారులు ధ్రువీకరించడం లేదు. తమ వద్ద స్టాకు ఉందని, అవసరమైతే తెప్పించుకుంటామని చెబుతున్నారు. కొప్పెర కొలతలేమిటి? హుండీ ఎత్తు తొమ్మిది అడుగులు, వెడల్పు మూడు అడుగులు. మూడు అడుగుల ఎత్తు కలిగిన రాగి గంగాళాన్ని నేల నుంచి తొమ్మిది అడుగుల ఎత్తులో సిద్ధం చేసిన దళసరి కేస్‌మెట్ వస్త్రంలో ఉంచి హుండీ రూపొందిస్తారు. భక్తులు చేయి ఎత్తి కానుకలు వేస్తే అవి సరిగ్గా రాగి గంగాళంలో పడే విధంగా నాలుగు వైపులా ఆంగ్ల అక్షరం ‘వి’ ఆకారంలో రంధ్రాలు వేస్తారు. హుండీ మధ్యలో చుట్టిన తాడుపై ఏడు టీటీడీ సీళ్లు, మరో ఆరు జీయంగార్ సీళ్లు వేస్తారు. మూడు అడుగుల ఎత్తు కలిగిన రాగి గంగాళంతోపాటు మరో రెండు అడుగుల వరకు కానుకలు నిండాక, ఆ హుండీ పైకప్పు తాళ్లను విప్పి సీలు వేసి పరకామణికి తరలిస్తారు. తర్వాత అదే స్థానంలో కొత్త హుండీని ఏర్పాటు చేస్తారు. కరెన్సీ నోట్లు, బంగారం, వెండి, విలువైన రాళ్లు హుండీ ద్వారా నగదు కానుకల్లో చిల్లర నాణేల నుంచి అన్ని రకాల కరెన్సీ నోట్ల రూపంలో ఏడాదికి సుమారు రూ.వెయ్యి కోట్లు, 1,000 నుంచి 1,500 కిలోల బంగారం, 2,000 కిలోల వెండి, వజ్రాలు, కెంపులు, పచ్చలు, గోమేధికాలు, ఇతర విలువైన రంగురాళ్లు అందుతున్నాయి. పదవీ విరమణ చేసిన దర్జీతో కుట్టిస్తాం ‘‘హుండీ వస్త్రాలు కుట్టే దర్జీ ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఔట్సోర్సింగ్ కింద ఒకరిని తీసుకునేందుకు ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చారు. హుండీ వస్త్రాలను కుట్టి కొరత లేకుండా సరఫరా చేసేందుకు అవసరమైతే ఉద్యోగ విరమణ చేసిన దర్జీనే కాంట్రాక్ట్ విధానం కింద కొనసాగిస్తాం’’ అని అధికారులు చెప్పారు. కొప్పెర (హుండీ) అంటే? భక్తులు కానుకలు వేసే పాత్ర లేదా రాగి గంగాళాన్ని కొప్పెర(హుండీ) అంటారు. చెన్నైలోని ఆర్కియాలజీ విభాగం నుంచి సేకరించిన ఆధారాల ప్రకారం క్రీ.శ.17 శతాబ్దం ముందు నుంచే తిరుమల ఆలయంలో ఈ కొప్పెర ఉన్నట్లు తేల్చారు. టీటీడీ వద్ద అప్పటి నుంచి హుండీ లెక్కలున్నాయి. అయితే, ఈస్టిండియా కంపెనీ పాలన కాలంలో 1821 జూలై 25న కొప్పెర (హుండీ)ని ఏర్పాటు చేశారని ఆలయ పరిపాలనా విధానాలను నిర్దేశించే చట్టం బ్రూస్‌కోడ్-12 ఆధారం కూడా ఉంది. అప్పట్లో ఆలయ పోషణకు హుండీ తప్ప మరొక ప్రధాన ఆదాయ మార్గం ఉండేది కాదు. కొప్పెరను తిరుమల ఆలయంలోని తిరుమామణి మండపం (ఘంటా మండపం)కు ఉత్తర పార్శ్వంలో నాలుగు రాతి స్తంభాల నడుమ ఏర్పాటు చేశారు. ఇక్కడ జగద్గురు ఆది శంకరాచార్యులవారు ‘శ్రీచక్రం’ ప్రతిష్టించారని.. అందువల్లే అంతులేని ధన, కనక, వస్తు, ద్రవ్య కానుకలతో స్వామివారి హుండీ నిండుతోందని భక్తుల విశ్వాసం. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా హుండీ స్థలం ఎత్తు పెంచేందుకు అక్కడి నేలను తవ్వినప్పుడు కొందరు శ్రీచక్రాన్ని ప్రత్యక్షంగా దర్శించారని టీటీడీ రికార్డుల్లో పొందుపరిచారు. దీన్ని ఆలయ జీయంగార్లు, అర్చకులు, అధికారులు, చరిత్రకారులు కూడా విశ్వసిస్తున్నారు. అందువల్లే ఆలయంలో ఎన్ని మార్పులు చేర్పులు చేసినా హుండీ స్థలాన్ని మాత్రం అంగుళం కూడా మార్చలేదు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుపతి: వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చిన భక్తులకు 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. నిన్న 65,354 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. -
శ్రీవారి సేవలో రైల్వే మంత్రి
తిరుమల: రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి మంత్రికి స్వాగతం పలికారు. నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి ఆయన ఆలయానికి విచ్చేశారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని, శ్రీవారిని, వకుళమాతను దర్శించుకున్నారు. అనంతరం కానుకలు సమర్పించారు. దర్శనమనంతరం ఆలయాధికారులు సురేష్ ప్రభుకు లడ్డూ ప్రసాదాలు, నూతన సంవత్సరం డైరీ, శ్రీవారి కేలండర్‌ను అందజేశారు. -
శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
తిరుమల: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన ఆలయానికి విచ్చేశారు. శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానంతరం వకుళమాతను దర్శించుకుని, కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు లడ్డూ, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట స్థానిక జడ్జి శేషాద్రి కూడా పాల్గొన్నారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుపతి: వరుస సెలవులు రావడంతో తిరుమలలో శుక్రవారం ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు 11 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చిన భక్తులకు ఆరు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. గదులు ఏవీ ఖాళీ లేవు. గదుల వివరాలు: ఉచిత గదులు - ఖాళీ లేవు రూ.50 గదులు - ఖాళీ లేవు రూ.100 గదులు - ఖాళీ లేవు రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జిత సేవల టిక్కెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం - 57ఖాళీగా ఉన్నాయి సహస్ర దీపాలంకరణ - ఖాళీ లేవు వసంతోత్సవం - 28 ఖాళీ ఉన్నాయి శుక్రవారం ప్రత్యేక సేవ - పూరాభిషేకం. -
స్వర్ణ రథంపై శ్రీవారు
-
విశాఖజిల్లాలో పురాతన విగ్రహం లభ్యం
యలమంచిలి: విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం ఓ పురాతన విగ్రహం బయటపడింది. యలమంచిలి మండలం రామచంద్రమ్మ కొండపై తవ్వకాలు జరుపుతున్న సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం లభించింది. ఈ విగ్రహం14వ శతాబ్దానికి చెందిందని స్థానికులు భావిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి విగ్రహన్ని చూడటానికి గ్రామస్థుల భారీగా తరలివస్తున్నారు. దీంతో గ్రామస్థులు పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించారు. -
శ్రీవారి సేవలో అజిత్
ప్రముఖ తమిళ నటుడు అజిత్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సుప్రభాత సమయంలో ఏడుకొండల వాడిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సిబ్బంది ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయనను చూసేందుకు భక్తులు పోటీపడ్డారు. -
18న శ్రీవారి పుష్పయాగం
తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి ఈనెల 18వ తేదీన పుష్పయాగం నిర్వహించనున్నారు. ఏటా బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత కార్తీకమాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున యాగం నిర్వహించడం సంప్రదాయంగా వస్తుంది. తామర, మల్లె, చామంతి, సంపంగి, రోజా, మరువం, దవనం, తులసి, గన్నేరు, నందివర్థనం వంటి 20 రకాలకు పైగా సంప్రదాయ పుష్పాలతో స్వామివారికి నివేదన చేస్తారు. తాయార్లు, మలయప్ప సమక్షంలో అగ్నిప్రతిష్ట చేసి బిల్వ పత్రాలతో 108 సార్లు హోమం నిర్వహిస్తారు. పుష్పాధిపతిని ఆవాహనం చేసి 12 పర్యాయాలు వైష్ణవాంతంగా యాగం పూర్తి చేసి ఉత్సవర్లకు తిరుమంజనం, అభిషేకం, నైవేద్య, హారతులు ఇవ్వనున్నారు. -
వైభవంగా శ్రీవారికి చక్రస్నానం
-
వెంకన్న చరిత్ర
-
అప్రదక్షిణంగా వేంకటేశ్వరుని ఊరేగింపు!
వేంకటేశ్వరుడిని శుక్రవారం తిరుమల మాడ వీధుల్లో అప్రదక్షిణంగా ఊరేగించనున్నారు. 'బాగ్ సవారీ' ఉత్సవం తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనుంది. గురువారం సాయంత్రం ధ్వజావరోహణతో బ్రహ్మోత్సవాలు ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో భక్తులు తిరుమలకు వెల్లువెత్తుతున్నారు. 24 కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, కాలినడక భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. -
సింహవాహనంపై శ్రీనివాసుడు
తిరుమల : అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడోరోజు శుక్రవారం ఉదయం సర్వాలంకరణా భూషితుడైన మలయప్ప స్వామి సింహవాహనంపై విహరించారు. స్వామివారు వజ్రఖచిత కిరీటంతో, సకల ఆభరణాలతో అలంకృతమయి ఉంటారు. జంతుజాలానికి రాజైన సింహాన్ని మృగత్వానికి ప్రతీకగా భావిస్తారు. ప్రతిమనిషి తనలోని మృగత్వాన్ని సంపూర్ణంగా అణచి ఉంచాలనీ తలపైన ఆదిదేవుడిని ధరించాలనీ చెప్పే ప్రతీకగా ఈ సింహవాహనంపై స్వామివారు ఊరేగుతారని భక్తులు భావిస్తారు. తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకుని భక్తులు తరిస్తున్నారు. గోవింద నామ స్మరణతో మాఢ వీధులు మార్మోగుతున్నాయి. కాగా సాయంత్రం ఊంజల్ సేవ నిర్వహిస్తారు. రాత్రి ముత్యపుపందిరి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి తిరువీధుల్లో విహరిస్తారు. చల్లని ముత్యాల పందిరిలో శైత్యోపచారాన్ని స్వీకరిస్తున్నట్లున్న శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం భక్తుల తాపత్రయాలను పోగొడుతుంది. మరోవైపు కోరిన కోర్కెలు తీర్చే కోనేటిరాయుడు వెలసిన తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం.. పచ్చ తోరణంగా విలసిల్లుతూ ఉంటోంది. అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకునికి నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే స్వామివారికి జరిగే అన్ని సేవలలో... ప్రతి శుక్రవారం జరిగే అభిషేకానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ అభిషేక సేవలో స్వామివారి మూలవిరాట్‌కు కొన్ని ప్రత్యేక పదార్ధాలతో మర్ధనా చేస్తారు. అందుకే తిరుమలేషుని అర్చవతార రూపం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఈ అభిషేక ప్రత్యేకత గురించి తిరుమల ప్రధాన అర్చకులు రమణదీక్షితులు 'సాక్షి'కి వివరించారు. -
శుక్రవారం జరిగే అభిషేకానికి చాలా ప్రత్యేకత
-
శ్రీవారిని దర్శి౦చుకున్న చ౦ద్రబాబు
-
వెంకన్న కుబేరుడి వద్ద తీసుకున్న అప్పు ఎంత?
బెంగళూరు : సామాన్యుడికి ఆయుధంగా మారిన సమాచార హక్కు చట్టం... ఇప్పుడు 'దేవుడు' తీసుకున్న అప్పు ఎంత అనే లెక్క కూడా అడుగుతోంది. 'తిరుపతి వెంకటేశ్వరస్వామి తన వివాహం కోసం కుబేరుడి వద్ద తీసుకున్న అప్పు ఎంత? భక్తుల కానుకల ద్వారా ఇప్పటివరకూ తీర్చిన అప్పు లెక్క చెప్పండి? ఆ అప్పు ఎప్పుడు తీరుతుంది..' అని బెంగళూరుకు చెందిన సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కార్యకర్త టి.నరసింహమూర్తి తిరుమల తిరుపతి దేవస్ధానానికి ప్రశ్నలు సంధించారు. బెంగళూరులో నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ...'చాలా కాలంగా వెంకటేశ్వరుడి అప్పు తీర్చడం కోసం భక్తులు హుండీలో డబ్బులు వేస్తున్నారు. ఇలా ఇంకెంత కాలం వేయాలి. ఈ విషయంపై పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా సమాచార హక్కు చట్టం ద్వారా టీటీడీకి 2012 ఫిబ్రవరి 6న దరఖాస్తు చేసుకున్నాను. అయితే ఇప్పటివరకూ సమాధానం రాలేదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టను. సమాధానం వచ్చే వరకూ పోరాటం సాగిస్తాను' అని చెప్పారు. -
వెంకన్న సన్నిధిలో స్పీకర్ కోడెల, శివమణి
తిరుమల : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రత్యేక దర్శన సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోడెలకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందచేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్, ప్రముఖ వాద్యకారుడు శివమణి కూడా స్వామివారిని దర్శించుకున్నాడు. -
తుది శ్వాస వరకూ స్వామి సేవలోనే: డాలర్ శేషాద్రి
తిరుపతి : డాలర్ల కుంభకోణం కేసులో ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా చివరకు న్యాయమే గెలిచిందని డాలర్ శేషాద్రి అన్నారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో తనను ఇరికించేందుకు కొంతమంది ప్రయత్నించారని ఆరోపించారు. స్వామివారి ఆశీస్సులు ఉన్నంతవరకూ నన్ను ఎవరూ ఏమీ చేయలేరని డాలర్ శేషాద్రి అన్నారు. తుది శ్వాస ఉన్నంత వరకూ స్వామివారి సేవలోనే తరలించాలనేది తన కోరిక అని ఆయన పేర్కొన్నారు. కాగా తిరుమల శ్రీవారి డాలర్ల మాయం కేసులో డాలర్ శేషాద్రి నిర్దోషిగా బయటపడ్డారు. ఈ మేరకు చిత్తూరు కోర్టు తుదితీర్పునిచ్చింది. 2006లో తిరుమలలో 5 గ్రాముల బరువున్న 300 బంగారు డాలర్లు మాయమయ్యాయి. ఈ కేసులో డాలర్ శేషాద్రితో పాటు ఇతర అధికారులపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం అప్పట్లో సీబీసీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. సీబీసీఐడీ విచారణ చేసి 2008లో తమ నివేదికను కోర్టుకు సమర్పించింది. సుదీర్ఘకాలం ఈ కేసును విచారించిన న్యాయస్థానం డాలర్ శేషాద్రిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో టీటీడీ షరాబు వెంకటా చలపతికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. -
తిరుమలలో 'మంచు' ఫ్యామిలీ
తిరుమల : ప్రముఖ నటుడు మోహన్ బాబు బుధవారం తిరుమల విచ్చేశారు. ఆయన, తన కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ బ్రేక్ దర్శనంలో వెంకన్నను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మోహన్ బాబు విలేకర్లతో మాట్లాడుతూ... స్వామివారి దర్శనం బాగా జరిగిందని.. లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ.. పుట్టు వెంట్రుకలు తీయించేందుకు కుటుంబ సమేతంగా తిరుమల వచ్చామన్నారు. తమ కుటుంబంతో పాటు అందరూ క్షేమంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు మోహన్ బాబు తెలిపారు. రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని వెంకన్నను మొక్కుకున్నట్లు ఆయన చెప్పారు. శుక్రవారం విడుదలయ్యే ఎర్రబస్సు అన్నివర్గాలను ఆకట్టుకుంటుందని మోహన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌లతో ఫోటోలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు. గా మంచు లక్ష్మి తాజాగా సరోగసి పద్దతిలో తల్లి అయిన విషయం తెలిసిందే. -
ఇద్దరు సీఎంలకు జ్ఞానం ప్రసాదించాలని కోరుకున్నా
తిరుమల : వైఎస్ఆర్సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆయన వెంకన్న దర్శనం చేసుకున్నారు. అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను నెరవేర్చే విధంగా వారికి జ్ఞానం ప్రసాదించాలని స్వామివారికి కోరినట్లు ఆయన చెప్పారు. కాగా గోవా గవర్నర్ మృదులా సిన్హా కూడా వెంకన్నను ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. -
ఘనంగా తిరుమల తెప్పోత్సవాలు
-
సప్త వాహనాలపై తిరుమలేశుడు
తిరుమల : సూర్య జయంతిని పురస్కరించుకుని నిర్వహించే రథసప్తమి వేడుకలతో తిరుమల పులకించిపోతోంది. ఏడుకొండలూ గోవింద నామస్మరణతో గురువారం మారుమోగుతున్నాయి. రథసప్తమి సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్పస్వామి.. ఏడు వాహానాల్లో తిరుమాడ వీధుల్లో విహరించనున్నారు. ఉదయం 5గంటలకు సూర్యప్రభ వాహనంలో .. 9గంటలకు చిన్నశేష వాహనం,11 గంటలకు గరుడ వాహనంపై ఊరేగారు. ఒంటి గంటకు హనుమంత వాహనంలో విహరించిన అనంతరం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ఆ తరువాత కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం..చంద్రప్రభ వాహనసేవలతో స్వామివారు ఊరేగుతారు. శ్రీవారి వాహన సేవలను తిలకించి.. భక్తులు తరిస్తున్నారు. -
వెంకన్న దర్శనానికి 18 గంటలు
తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. వేకువజాము 3 గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు 44,917 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వ దర్శనం కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయి క్యూ వెలుపలకు వచ్చింది. వీరికి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. రద్దీ పెరగడంతో సాయంత్రం 5 గంటలకు రూ.300 టికెట్ల ప్రత్యేక దర్శనాన్ని నిలిపివేశారు. అన్ని కంపార్ట్మెంట్లలో నిండి ఉన్న కాలిబాట భక్తులకు దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. కాగా, శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.20 కోట్లు లభించింది. -
వెంకన్నను దర్శించుకున్న మంచు విష్ణు, శ్రీదేవి
తిరుమలలో శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు మంగళవారం వేర్వేరుగా దర్శించుకున్నారు. ఇటీవల విడుదలై విజయఢంకా మోగిస్తున్న దూసుకెళ్తా చిత్రం విజయోత్సవంలో భాగంగా హీరో మంచు విష్ణువర్థన్ తన చిత్ర యూనిట్‌తో కలసి ఈ రోజు ఉదయం కలియుగ దైవాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... దూసుకెళ్తా చిత్రం విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. ఆ చిత్రాన్ని తమిళ వర్షన్లో త్వరలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక సాగుతున్నాయన్నారు. అలాగే ప్రముఖ నటీ మంజుల కుమార్తె , వర్థమాన నటీ శ్రీదేవి కూడా ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో నటీ శ్రీదేవి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. -
స్వర్ణరధం పై ఊరేగిన శ్రీనివాసుడు
-
బ్రహ్మోత్సవ నాయకునికి బ్రహ్మాండ నీరాజనం
దసరా నవరాత్రులలో వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణ నక్షత్రం శుభముహూర్తాన నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించటం అనాదిగా వస్తున్న ఆచారం. స్వామికి తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. బ్రహ్మోత్సవ సమయంలో ఉదయం, రాత్రివేళల్లో స్వామి ఒక్కోవాహనంపై ఊరేగుతూ దివ్యదర్శనంతో కటాక్షిస్తాడు. అంకురార్పణతో ఆరంభం బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాలకి ముందురోజు రాత్రి ఆలయానికి నైరుతిదిశలో ఉన్న వసంత మండపం వద్ద నిర్ణీత ప్రదేశంలో భూదేవి ఆకారంలో చిత్రించిన చోట లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. యాగశాలలో ఈ పవిత్ర మృత్తికతో నింపిన తొమ్మిది పాలికలలో(కుండలు) నవధాన్యాలను పోసి, ఆ మట్టితో మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. నిత్యం నీరుపోసి, శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా చేస్తారు. అంకురాలను ఆరోపింప చేసే కార్యక్రమం కాబట్టి దీనిని అంకురార్పణ అంటారు. ధ్వజారోహణం స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక కొత్తవస్త్రం మీద గరుడుని బొమ్మను చిత్రీకరించడాన్నే ‘గరుడ ధ్వజ పటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవ మూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో మీనలగ్నంలో కొడితాడుకు కట్టి, పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకలదేవతలు, అష్టదిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానపత్రం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటిదేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ కొండమీదే ఉంటూ, ఉత్సవాలను తిలకిస్తారని పురాణాలు చెబుతున్నాయి. పెద్ద శేషవాహనం స్వామివారు కొలువుదీరింది శేషాద్రి. ధరించేది శేషవస్త్రం. ఆయన పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ తొలిరోజు ఆ వాహనం మీదే ఊరేగుతారు. చిన్నశేషవాహనం రెండవరోజు ఉదయం స్వామివారు ఉభయ దేవేరులతో కలసి ఐదు శిరస్సుల చిన్న శేషవాహనంపై దర్శనమిస్తారు. శుద్ధసత్త్వానికి ప్రతీకయైన పరమశివుని గళాభరణంగా విరాజిల్లే వాసుకి శ్రీనివాసుని సేవలో చిన్న శేషవాహనంగా తరిస్తున్నాడు. హంసవాహ నం రెండవరోజు రాత్రి స్వామివారు శారదామాత రూపంలో హంస వాహనంపై ఊరేగుతారు. హంస అనే శబ్దానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే పరిశుద్ధమైన మనోమందిరమని కూడా అర్థం. తుచ్ఛమెన కోర్కెలనే అంధకారాన్ని వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తిమార్గం వైపు నడవాలని ఈ వాహనం ద్వారా స్వామి చాటుతారు. సింహవాహనం బ్రహ్మోత్సవాలలో మూడవరోజు ఉదయం సింహవాహనమెక్కి వేంకటనాథుడు భక్తులకు దర్శనమిస్తాడు. జంతువులకు రాజైన సింహాన్ని సైతం తానేనంటూ మనుషులలో జంతుస్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు. యోగశాస్త్రంలో సింహాన్ని వాహనశక్తికి, గమనశక్తికి ఆదర్శంగా భావిస్తారు. శ్రీవేంకటేశ్వరుడు తనలోని పరాక్రమాన్ని ప్రపంచానికి చాటడానికి ఈ వాహనంపై వేంచేస్తారని ఆర్యోక్తి. ముత్యపు పందిరివాహనం ముక్తిసాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. మూడవరోజు రాత్రి శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోరంజకంగా దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు. కల్పవృక్ష వాహనం కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తే... తన భక్తులకు అడగకుండానే వరాలు ఇచ్చే దేవదేవుడు వెంకటాద్రివాసుడు. శాశ్వతమైన కైవల్యం ప్రసాదించే కల్పతరువైన స్వామివారు నాలుగోరోజు ఉదయం సువర్ణకాంతులీనే కల్పవృక్ష వాహనంపై సర్వాలంకార భూషితుడై ఊరేగుతారు. సర్వభూపాల వాహనం లోకంలో భూపాలులందరికీ భూపాలుడు తానేనని చాటుతూ నాలుగోరోజు రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనం మీద కొలువుదీరుతారు. సర్వభూపాల వాహనసేవ జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది. మోహినీ అవతారం బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది మోహినీ అవతారం. ఆ రోజు ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్తజనానికి సాక్షాత్కారమిస్తారు. పరమ శివుడిని సైతం సమ్మోహన పరచి, క్షీరసాగర మథనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసిన అవతారమిది. మంచిపనులు చేయడం ద్వారా ఎలా మేలు చేయవచ్చో లోకానికి చాటడానికే శ్రీవారు జగన్మోహిని రూపంలో తిరువీధుల్లో విహరిస్తారు. గరుడవాహనం స్వామివారు ఐదోరోజు రాత్రి తనకు నిత్యసేవకుడైన గరుడుని మీద ఊరేగుతారు. మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాల ధరించి మలయప్పస్వామి భక్తులను అనుగ్రహిస్తారు. గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు నుంచి పంపే తులసిమాల, ఛత్రాలు గరుడవాహనంలో అలంకరిస్తారు. గరుడుడితో స్వామికి గల అనుబంధాన్ని ఈ సేవ చాటి చెబుతుంది. హనుమంత వాహ నం ఆరవరోజు ఉదయం జరిగే సేవ ఇది. త్రేతాయుగంలో తనకు సేవ చేసిన హనుమంతుడిని వాహనంగా చేసుకుని స్వామివారు తిరువీధుల్లో ఊరేగింపుగా వెళతారు. రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు అన్నీ ఆయనేనని ఈ సేవ ద్వారా తెలుస్తుంది. గజవాహనం గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు కోరే వారిని కాపాడతానని చాటిచెప్పడానికి శ్రీనివాసుడు ఆరో రోజు రాత్రి ఈ వాహనంపై ఊరేగుతారు. గజవాహనారూఢుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. సూర్యప్రభవాహనం ఏడవరోజు ఉదయం ఏడుగుర్రాలపై భానుడు రథసారథిగా ఎర్రటిపూలమాలలు ధరించి స్వామి ఈ వాహనంపై ఊరేగుతారు. ప్రపంచానికి వెలుగు ప్రసాదించే సూర్యభగవానుడికి తానే ప్రతిరూపమని చాటి చెబుతారు. చంద్ర ప్రభవాహనం ఏడోరోజు రాత్రి తెల్లటివస్త్రాలు, పువ్వులమాలలు ధరించి స్వామి చంద్ర ప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణత్వం, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశలేనని తెలియజేస్తారు. రథోత్సవం గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామి ఎనిమిదోరోజు తన రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. స్వామివారి రథ సేవలో పాల్గొన్న వారికి పున ర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అశ్వవాహనం ఎనిమిదోరోజు రాత్రి అశ్వవాహనం మీద స్వామి ఊరేగుతారు. చతురంగ బలాలలో ప్రధాన మైనది అశ్వబలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్టశిక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీని ఉద్దేశం. చక్రస్నానం ఎనిమిది రోజుల పాటు వాహనసేవల్లో అలసిపోయిన స్వామి సేద తీరడం కోసం తొమ్మిదోరోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహస్వామి ఆలయ ఆవరణలో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం శ్రీవారికి మరో రూపమైన చక్రతాళ్వార్‌ను వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ధ్వజావరోహణం చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని ఆవరోహణం చేస్తారు. తొమ్మిది రోజులపాటు నిర్వహించిన ఉత్సవ సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్సవాలను ముగిస్తారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు తేది ఉదయం రాత్రి 05.10.2013 ధ్వజారోహణం పెద్ద శేషవాహనం (సా.6గం.) 06.10.2013 చిన్నశేషవాహనం హంసవాహనం 07.10.2013 సింహవాహనం ముత్యపుపందిరి వాహనం 08.10.2013 కల్పవృక్షవాహనం సర్వభూపాల వాహనం 09.10.2013 మోహినీ అవతారం గరుడవాహనం 10.10.2013 హనుమంతవాహనం సాయంత్రం స్వర్ణరథోత్సవం గజవాహనం 11.10.2013 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం 12.10.2013 రథోత్సవం అశ్వ వాహనం 13.10.2013 చక్రస్నానం ధ్వజావరోహణం పవిత్ర చక్రస్నానం... ఏడాదిలో నాలుగుసార్లు తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో సంవత్సరంలో నాలుగుసార్లు చక్రస్నానం నిర్వహిస్తారు. భాద్రపద మాస శుక్ల చతుర్థశిలో అనంత పద్మనాభవ్రతం రోజు, బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు, ముక్కోటి మరునాడు, రథసప్తమి రోజు చక్రస్నానం నిర్వహిస్తారు. సుదర్శన చక్రతాళ్వార్ పల్లకిలో అధిరోహించి ఊరేగింపుగా ఆలయ తిరువీధులలో మహాప్రదక్షిణగా వరాహస్వామివారి ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. వైదిక ఆచారాలతో అభిషేకం నిర్వహించి పుష్కరిణిలో పవిత్ర స్నానం చేస్తారు. ఆయా పర్వదినాల్లో 3 కోట ్ల 50 లక్షల పుణ్యతీర్థాలు తిరుమల పుష్కరిణిలో ఆవహిస్తాయని, ఆ సమయంలో సర్వదేవతలూ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని పురాణ వచనం. ఇదే సమయంలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించటం వల్ల దోషాలు, అరిష్టాలు, తెలిసీ తెలియక చేసిన తప్పులు తొలగి పుణ్యఫలాలు సిద్ధిస్తాయని విశ్వాసం. ఆదివరాహుని జయంత్యుత్సవం ప్రతిఏటా భాద్రపద శుక్ల తృతీయ దినాన వరాహజయంతిని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. పుష్కరిణి గట్టుపై వెలసిన భూ వరాహస్వామి ఆలయంలోని గర్భాలయ మూలమూర్తికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. వేంకటాచల మాహాత్మ్యం ప్రకారం తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారికి స్థానం ఇచ్చింది వరాహస్వామియే. అందుకే ఆ స్వామికి అంగరంగ వైభవంగా జయంత్యుత్సవం జరిపిస్తారు. -
శ్రీవారికి నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ
తిరుమలలో శ్రీవారికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవను టీటీడీ నేడు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఆర్జీత సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్నాహ్నం 12.00 గంటల వరకు సర్వదర్శనం రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. అయితే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. -
వెంకన్న స్వర్ణరథం ట్రయల్ రన్
తిరుమల : తిరుమలేశుని కైంకర్యసేవకు కొత్త స్వర్ణరథం ఎట్టకేలకు సిద్ధమైంది. సోమవారం ఉదయం టీటీడీ అధికారులు ... ఆలయ వీధుల్లో ప్రయోగాత్మకంగా ఊరేగించారు. ఎస్వీ మ్యూజియం నుంచి మాడవీధుల్లో రథ మండపానికి తరలించారు. సుమారు గంట సమయం పట్టింది. కాగా స్వర్ణ రథం ఎత్తు 32 అడుగులు. బరువు 28 టన్నులు. ఇటువంటి స్వర్ణరథం దేశంలో మరెక్కడా లేదు. ఎస్వీ మ్యూజియం నుంచి మాడవీధుల్లో రథ మండపానికి తరలిస్తున్న టీటీడీ అధికారులు రథం తయారీలో 74 కిలోల బంగారం, 2,900 కిలోల రాగి, 25 టన్నుల దారుచెక్క, ఇనుము వినియోగించారు. 18 అడుగుల గేజ్ కలిగిన రాగిపై 9సార్లు బంగారుపూత పూశారు. ఇందుకోసం రూ.24.34 కోట్లు వ్యయం అయ్యింది. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వ దర్శనానికి పది గంటల సమయం పడుతోంది. -
24న శ్రీవారికి మరోసారి సమైక్య సెగ
తిరుమలలో శ్రీవారికి మరోసారి సమైక్యాంధ్ర సెగ తగలనుంది. ఈ నెల 24న ప్రైవేట్ వాహనాలను సైతం తిరమల కొండపైకి వెళ్లనివ్వమని ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్ రామచంద్రారెడ్డి శనివారం తిరుపతిలో వెల్లడించారు. అందుకు శ్రీవారి భక్తులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను సైతం అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. తిరుమలలోని కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి వాహనాల్లో వచ్చే భక్తులు 24వ తేదీ తిరుపతిలోనే ఉండాల్సి వస్తుందన్నారు. అవసరమైతే వారికి తిరుపతిలోనే ఉచిత వసతి సౌకర్యం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని రామచంద్రారెడ్డి వెల్లడించారు. -
తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం
-
తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుమల : శ్రావణమాసం సందర్భంగా తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటినుంచి వరుసగా మూడురోజులపాటు కన్నుల పండవగా ఉత్సవాలు సాగనున్నాయి. తెలిసో తెలియకో భక్తులు, సిబ్బంది ద్వారా ఆలయంలో జరిగే తప్పులను శుద్ధి చేసే పవిత్ర కార్యక్రమమే పవిత్రోత్సవం. ప్రతి యేడు శ్రావణ మాసంలో ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవాలు శనివారం ఉదయం అత్యంత ఘనంగాప్రారంభమైయ్యాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో, ప్రత్యేకాధికారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలను మూడురోజుల పాటు టీటీడీ రద్దు చేసింది. ఈ ఉత్సవాలకు సంబంధించి శుక్రవారం సాయంత్రం అంకురారోపణ కార్యక్రమం జరిగింది. ఉత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని పూలతో అలంకరించారు. తొలిరోజైన శ్రీవారి ఆలయంలోని యాగశాలలో ఉదయం 7గంటలకు హోమాన్ని నిర్వహించి పవిత్ర ప్రతిష్ట చేశారు. అనంతరం స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రెండో రోజు మధ్యాహ్నం 12-2గంటల మధ్య పవిత్రాల ఊరేగింపు, మూలవరులకు, ఉత్సవరులకు పవిత్రాల సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. చివరిరోజు పూర్ణాహుతి, హోమంతో ఈ ఉత్సవాలు సమాప్తమవుతాయి.పవిత్రోత్సవాల నేపథ్యంలో 17నుంచి 19వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణసేవలను రద్దు చేశారు. ఈ నాలుగు రోజులు పాటు తోమాల, అర్చన సేవలను స్వామివారికి ఏకాంతంగా నిర్వహిస్తారు. మరోవైపు తిరుమలలో భక్తులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఏడు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది.