తిరుమల: రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి మంత్రికి స్వాగతం పలికారు. నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి ఆయన ఆలయానికి విచ్చేశారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని, శ్రీవారిని, వకుళమాతను దర్శించుకున్నారు. అనంతరం కానుకలు సమర్పించారు. దర్శనమనంతరం ఆలయాధికారులు సురేష్ ప్రభుకు లడ్డూ ప్రసాదాలు, నూతన సంవత్సరం డైరీ, శ్రీవారి కేలండర్ను అందజేశారు.