Railway Minister
-
ఐఆర్సీటీసీ టికెట్ ధరలలో తేడా: రైల్వే మంత్రి సమాధానమిదే..
ఐఆర్సీటీసీ టికెట్ ధరలలో వ్యత్యాసాల గురించి శివసేన (యుబిటి) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నలు లేవనెత్తారు. దీనికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. ఇంతకీ ఐఆర్సీటీసీ టికెట్ ధరలలో వ్యత్యాసం ఉండటానికి కారణం ఏమిటనే విషయాలు ఇక్కడ చూసేద్దాం..ఐఆర్సీటీసీ ద్వారా ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు.. సౌలభ్య రుసుము, లావాదేవీ ఛార్జీల కారణంగా రైల్వే కౌంటర్లలో భౌతికంగా కొనుగోలు చేసే వారి కంటే ఎక్కువ చెల్లిస్తున్నారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఆన్లైన్ టికెటింగ్ సౌకర్యాన్ని అందించడానికి ఐఆర్సీటీసీ గణనీయమైన ఖర్చును భరిస్తుంది. అయితే టికెటింగ్ మౌలిక సదుపాయాల నిర్వహణ, అప్‌గ్రేడేషన్ వంటి వాటికి అయ్యే ఖర్చును తగ్గించడానికి.. సౌకర్య రుసుమును వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా.. కస్టమర్లు బ్యాంకులకు లావాదేవీ ఛార్జీలను కూడా చెల్లిస్తారనే విషయాన్ని కూడా వెల్లడించారు.ఐఆర్సీటీసీ అందించే ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్ సౌకర్యం అనేది ప్రయాణీకులకు చాలా ఉపయోగకరం. ప్రస్తుతం చాలా మంది ముందుగా రిజర్వ్ చేసుకోవాలనుకునే వారిలో 80 శాతానికి పైగా ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారని వైష్ణవ్ అన్నారు.ఇదీ చదవండి: IRCTC సూపర్ యాప్: అన్నీ సేవలు ఒకేచోటఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందించిన తరువాత.. టికెట్స్ కోసం ప్రత్యేకంగా కౌంటర్లకు వెళ్లాల్సిన అవసరాన్ని నిరోదించింది. తద్వారా వారికి రవాణా కౌంటర్లకు వెళ్ళడానికి అయ్యే రవాణా ఖర్చు మాత్రమే కాకుండా సమయం కూడా తగ్గిందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ విషయాలను రౌత్ తప్పకుండా తెలుసుకోవాలనుకున్నారు.హైడ్రోజన్ రైళ్లుహైడ్రోజన్ రైళ్లను నిర్మించడానికి సంబంధించిన ప్రశ్నకు అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ.. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేయడానికి రైల్వేస్ అత్యాధునిక ప్రాజెక్టును చేపట్టాయని, ఇది ప్రపంచంలోనే అతి పొడవైన.. అత్యధిక శక్తితో నడిచే హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా ఉంటుందని అన్నారు. -
100 రూపాయల టికెట్ రూ.54కే.. మంత్రి కీలక వ్యాఖ్యలు
రైల్వే టికెట్ల తగ్గింపుకు సంబంధించిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి 'అశ్విని వైష్ణవ్' లోక్‌సభలో మాట్లాడుతూ.. ప్రతి టికెట్‌పై 46 శాతం రాయితీ ఇస్తున్నట్లు వివరించారు. భారతీయ రైల్వేలో ప్రయాణించే ప్రయాణీకులందరికీ ప్రభుత్వం అందించిన మొత్తం సబ్సిడీ రూ.56,993 కోట్లు అని స్పష్టం చేశారు.ఒక టికెట్ ధర రూ.100 అయినప్పుడు.. ప్రభ్యుత్వం దీనిని 54 రూపాయలకు అందిస్తుంది. అంటే ఒక టికెట్ మీద అందిస్తున్న రాయితీ 46 శాతం. ఇది అన్ని కేటగిరీ ప్రయాణికులను వర్తిస్తుందని మంత్రి వెల్లడించారు. వేగవంతమైన ట్రైన్ సర్వీసులకు సంబంధించిన ప్రశ్నకు జావాబిస్తూ.. అటువంటి సర్వీస్ ఇప్పటికే ప్రారంభమైందని పేర్కొన్నారు.వేగవంతమైన ట్రైన్ సర్వీస్.. భుజ్ & అహ్మదాబాద్ మధ్య ప్రారంభమైంది. నమో భారత్ ర్యాపిడ్ రైల్ భుజ్ - అహ్మదాబాద్ మధ్య 359 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లో అధిగమించడం ద్వారా ఇంటర్సిటీ కనెక్టివిటీని మెరుగుపరిచిందని వివరించారు. ఈ సేవ ప్రయాణికులకు చాలా సంతృప్తికరంగా ఉందని కూడా మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.ఎలాంటి జాప్యం లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి మేము ఎప్పుడూ ముందడుగు వేస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. సరసమైన ధరలతో సులభమైన ప్రయాణం అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. రైలు ప్రమాదాల సంఖ్య కూడా బాగా తగ్గిందని.. 2014లో రూ.29,000 కోట్లుగా ఉన్న రైల్వే బడ్జెట్‌ను రూ.2.52 లక్షల కోట్లకు పెంచినట్లు మంత్రి తెలిపారు. -
వాచీలోనే క్యూఆర్ కోడ్... అదిరిందయ్యా ఆటో డ్రైవర్!
బెంగళూరుకు చెందిన ఈ ‘స్మార్ట్’ఆటో డ్రైవర్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందనలు అందుకున్నాడు. ఎందుకంటే మనవాడు యూపీఐ చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్ స్మార్ట్ వాచ్‌ను వాడుతున్నాడు మరి! సదరు ఫొటోను ఓ నెటిజన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. దాంతో అది తెగ వైరలవుతోంది. అలా రైల్వే మంత్రి దృష్టినీ ఆకర్షించింది. ఆ ఫోటోను ఆయన రీట్వీట్ చేశారు. ‘యూపీఐ కా స్వాగ్! చెల్లింపులు మరింత సులువయ్యాయి’అంటూ కామెట్ చేశారు. ఆటోడ్రైవర్‌కు సోషల్ మీడియాలో ప్రశంసలు వెలులవెత్తుతున్నాయి. ఐటీలో ట్రెండ్ సెట్టర్ అయిన బెంగళూరు ఆ సాంకేతిక పరిజ్ఞానం వాడకంలోనూ ట్రెండ్ సెట్ చేస్తోందంటూ యూజర్లు కామెంట్ చేస్తున్నారు. ‘నవ భారత ముఖచిత్రమిది’అని ఒకరు, ‘డిజిటల్ ఇండియా మ్యాజిక్’అని మరొకరు పోస్ట్ చేశారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2016లో ప్రారంభించిన యూపీఐ బ్యాంకుల మధ్య తక్షణ బదిలీలకు వీలు కలి్పంచడం ద్వారా చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు వైఎస్సార్సీపీ ఎంపీల విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను వైఎస్సార్సీపీ లోక్‌సభ ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, తనుజరాణిలు సోమవారం కలిశారు. ఈ సందర్బంగా కడప-బెంగళూరు మధ్య నూతన రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని కేంద్రమంత్రిని వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్షనేత మిథున్ రెడ్డి కోరారు.కడప-బెంగళూరు రైల్వే లైన్‌తో వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల సరఫరా మెరుగవుతుందని తెలిపారు. పీలేరు-పుంగనూరు- మదనపల్లిల మీదుగా వెళ్లే ఈ రైల్వే లైన్ వల్ల రాయలసీమ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కాగా కడప నుంచి బెంగళూరుకు కొత్త రైల్వే లైన్‌ను 2008-09 రైల్వే బడ్జెట్లోనే మంజూరు చేశారని, ప్రాథమికంగా సర్వే నిర్వహించి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అయితే కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చేయాలని కోరారు. -
ఖుర్దా రోడ్-విజయనగరం మధ్య మూడో రైల్వే లైన్
సాక్షి, ఢిల్లీ: ఒడిశాలోని ఖుర్దా రోడ్ నుంచి విజయనగరం మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. ఖుర్దా రోడ్ నుంచి విజయనగరం వరకు 363 కిలో మీటర్ల దూరం మూడవ రైల్వే లైన్ నిర్మాణంతోపాటు భద్రక్-విజయనగరం సెక్షన్లో నెర్గుడి - బరంగ్ మధ్య 22 కిలో మీటర్ల మేర మూడో రైల్వే లైన్‌ను 4962 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ప్రతిపాదనలకు గత ఏడాది ఆగస్టులోనే ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. ప్రధాన మంత్రి గతి శక్తి పథకం కిందపైన పేర్కొన్న రెండు సెక్షన్లలో మూడో రైల్వే నిర్మాణ ప్రాజెక్ట్ ఎప్పటిలోగా పూర్తవుతుందో ఇప్పుడే చెప్పలేమని మంత్రి వివరించారు. రైల్వే ప్రాజెక్ట్‌ల నిర్మాణం పూర్తి చేయడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన పూర్తి చేయాలి. రైల్వే లైన్ నిర్మాణానికి ఆటంకంగా నిలిచే అడవుల తొలగింపుకు అటవీ శాఖ అనుమతులు మంజూరు చేయాలి. వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి అవసరమయ్యే అనుమతులు లభించాలి. రైల్వే లైన్ నిర్మాణం తలపెట్టే భూమి స్వరూప స్వభావాలపై అధ్యయనం జరగాలి. ప్రాజెక్ట్ సైట్లో శాంత్రి భద్రతలను పటిష్టం చేయాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏడాది కాలంలో ఎన్ని నెలలపాటు ప్రాజెక్ట్ పనులు నిర్విరామంగా కొనసాగుతాయే వంటి పలు అంశాల ఆధారంగా మాత్రమే ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పటిలోగా పూర్తవుతుందో ఒక అంచనాకు రాగలమని రైల్వే మంత్రి తన జవాబులో వివరించారు. హస్త కళల అభివృద్ధి కోసం ఏపీకి 3911 కోట్లు జాతీయ హస్తకళల అభివృద్ధి కార్యక్రమం, సమగ్ర హస్తకళల క్లస్టర్ అభివృద్ధి పథకం కింద గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.3911.25 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ సహాయ మంత్రి దర్శన జర్దోష్ పేర్కొన్నారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ 2018-19 నుంచి 2023-24 వరకు నేషనల్ హాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎన్హెచ్డిపి), సీహెచ్డీసీ పథకాల కింద విడుదల చేసిన మొత్తం నిధుల్లో రూ.2439.8 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఎన్‌హెచ్‌డీపీ కింద ఐదేళ్లలో రూ.3378.99 కోట్లు విడుదల చేయగా రూ.1907.54 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే కాంప్రహెన్సివ్ హ్యాండిక్రాఫ్ట్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీం కింద ఐదేళ్లలో రూ.532.26 కోట్లు నిధులు మంజూరు చేసి విడుదల చేయగా మొత్తం నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. హస్త కళల అభివృద్ధి కోసం ఎన్హెచ్డిపి, సీహెచ్డీసీ పథకాలను వేర్వేరు ఉద్దేశాలతో రూపొందించినట్లు మంత్రి తెలిపారు. హస్త కళాకారులు పదివేల మందికి మించి ఉన్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి గొలుసు అభివృద్ధి చేయడం సీహెచ్సీడీ పథకం ఉద్దేశమైతే, హస్త కళాకారులకు వ్యక్తిగతంగా అలాగే 1000 మందికి మించని చిన్న క్లస్టర్లకు మార్కెటింగ్ ప్లాట్ ఫాంలు ఏర్పాటు చేసి సామాజిక భద్రత కల్పించడం, నైపుణ్యాలను పెంపొందించడం ఎన్‌హెచ్‌డీపీ ఉద్దేశ్యమని తెలిపారు. ఎన్‌హెచ్‌డీపీ స్కీం కింద మార్కెటింగ్ సదుపాయం, నైపుణ్యాభివృద్ధి, క్లస్టర్ అభివృద్ధి, ఉత్పత్తిదారుల కంపెనీలు ఏర్పాటు, హస్తకళాకారులకు డైరెక్ట్ బెనిఫిట్, మౌలిక సదుపాయాలు, సాంకేతిక సహకారం, హస్తకళాకారులకు, క్లస్టర్లకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సహకారం అందించడం ద్వారా వ్యాపార ప్రోత్సాహక వాతావరణాన్ని కల్పించడం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సీహెచ్డీఎస్ కింద రాష్ట్ర స్థాయిలో ప్రాజక్టులు ఏర్పాటు చేయడం, అవి ఆయా రంగాల్లో విశేష అనుభవం కలిగిన కేంద్ర/ రాష్ట్ర హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్లు, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా క్లస్టర్ ప్రాజక్టు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. -
వచ్చే అయిదేళ్లలో 3 వేల కొత్త రైళ్లు
న్యూఢిల్లీ: రానున్న నాలుగయిదేళ్లలో మూడు వేల కొత్త రైళ్లను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.వీటివల్ల రైల్వేల ప్రయాణికుల సామర్థ్యం ప్రస్తుతమున్న 800 కోట్ల నుంచి వెయ్యి కోట్లకు పెరుగుతుందని వెల్లడించారు. రైళ్ల వేగాన్ని పెంచడం, నెట్‌వర్క్‌ను విస్తరించడం ద్వారా ప్రయాణ సమయాన్ని బాగా తగ్గించడం కూడా తమ శాఖ ప్రథమ లక్ష్యమని గురువారం ఆయన రైల్వే భవన్లో మీడియాకు తెలిపారు.ప్రస్తుతం 69 వేల కొత్త కోచ్‌లు అందుబాటులో ఉండగా, ఏటా 5 వేల కోచ్‌లు కొత్తగా తయారవుతున్నాయని రైల్వే వర్గాలు తెలిపాయి. వీటితో ఏడాదికి 200 నుంచి 250 వరకు కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తాయని, వీటికి తోడు రానున్న సంవత్సరాల్లో మరో 400 నుంచి 450 వరకు వందేభారత్ రైళ్లు కూడా ఉంటాయని పేర్కొన్నాయి. -
వరల్డ్ క్లాస్‌గా తిరుపతి రైల్వేస్టేషన్
ప్రపంచస్థాయి వసతులతో తిరుపతి రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దుతున్నారు. తిరుమల శ్రీవారి వైభవాన్ని చాటిచెప్పేలా ప్రత్యేక డిజైన్లతో నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రయాణికుల అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. రూ.వందల కోట్ల వ్యయంతో అధునాతన భవనాలను ఆవిష్కరించేందుకు శరవేగంగా కార్యాచరణ అమలు చేస్తున్నారు. తిరుపతి అర్బన్ : తిరుపతి రైల్వే స్టేషన్‌కు ఇప్పటికే ఏ క్లాస్ గుర్తింపు ఉంది. సుమారు రూ.500 కోట్లతో తిరుపతి రైల్వేస్టేషన్ వరల్డ్‌క్లాస్ స్టేషన్‌గా రూపాంతరం చెందనుంది. ఇందుకోసం అద్భుతమైన డిజైన్లను రూపొందించారు. ఆ మేరకు ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఇప్పటికే దక్షణం వైపు నూతన భవనాలు, 1 నుంచి 6వ ప్లాట్‌ఫాం వరకు ఎయిర్ కాన్కోర్స్ నిర్మాణం కోసం ఫౌండేషన్ కాస్టింగ్ పనులు పూర్తి చేశారు. స్టేషన్‌కు దక్షణం వైపు వాహనాల పార్కింగ్‌తోపాటు పలు భవనాలను నిర్మించారు. మరోవైపు రెండు రోజులుగా ఉత్తరం వైపు పనులు ప్రారంభించడానికి పురాతనమైన ప్రధాన ముఖద్వారం 1, 2 వద్ద భవనాలను కూల్చివేశారు. తాజాగా ఉత్తరం వైపుతోపాటు తూర్పు, పడమర అన్ని వైపులా పనులు చేపట్టారు. ఈ క్రమంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా డేరాలతో నీడను కల్పిస్తున్నారు. ఇతర మౌలిక వసతుల కల్పనకు రైల్వే అధికారు కృషి చేస్తున్నారు. వచ్చే ఏడాదికి అన్ని నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రయాణికులకు వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. సంతోషంగా ఉంది తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. రైల్వే మంత్రితోపాటు పలువురు ఉన్నతాధికారులను ఎప్పటికప్పుడు కలిసి మాట్లాడాం. ప్రధానంగా నూతన భవనాల నిర్మాణంలో భక్తిభావం ఉట్టిపడిలా డిజైన్లు రూపొందించేందుకు శ్రమించాం. తిరుపతి ఎంపీగా రైల్వేస్టేషన్, సెంట్రల్ బస్టాండ్‌ను రూ.వందల కోట్లతో అభివృద్ధి చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. – గురుమూర్తి, ఎంపీ, తిరుపతి మెరుగైన వసతులు రైల్వే స్టేషన్ నిర్మాణ పనుల నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మెరుగైన వసతులు కల్పిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక టీం పర్యవేక్షిస్తోంది. ఈ కీలక తరుణంలో ప్రయాణికులు సైతం సహకరించాలని కోరుతున్నాం. వరల్డ్ క్లాస్ స్టేషన్ పనులు పూర్తయితే అత్యంత ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. తిరుపతి కీర్తి మరింత ఇనుమడిస్తుంది. – సత్యనారాయణ, డైరెక్టర్, తిరుపతి రైల్వేస్టేషన్ -
మరిన్ని ఫీచర్లతో వందే భారత్ రైళ్లు.. కొత్తగా ఏమేం ఉన్నాయంటే..?
చెన్నై: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ప్రాజెక్టు వందేభారత్ రైళ్లు. దేశమంతటా వేగంగా ప్రయాణించగల వందేభారత్ రైళ్లను ప్రధాన నగరాల మధ్య ఇప్పటికే ప్రవేశపెట్టారు. అయితే.. ఈ రైళ్లలో నాణ్యతపై విమర్శలు కూడా ఎక్కువగానే వచ్చాయి. ప్రయాణికులు కూడా కొన్ని లోపాలను రైల్వే శాఖకు ఫీడ్‌బ్యాక్‌లో ఇచ్చారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని వందే భారత్ రైళ్లలో 25 రకాల మార్పులను చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఏమేం మార్పులంటే.. ► రైళ్లలో ప్రయాణికులు కూర్చునే కుషింగ్స్ గట్టిగా ఉన్న నేపథ్యంలో వాటిని మార్చనున్నారు. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునేలా మరిన్ని స్లాట్లను ఏర్పాటు చేయనున్నారు. ► సౌకర్యవంతంగా కూర్చునేందుకు ఎక్కువగా వంగేలా సీటును ఏర్పాటు చేయనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ సీట్ల రంగును రెడ్ నుంచి బ్లూకు మార్చనున్నారు. కోచ్‌లో అగ్ని ప్రమాదాలను గుర్తించే ఏరోసోల్ ఫైర్ డిటెక్షన్ వ్యవస్థను మరింత మెరుగుపరచనున్నారు. దివ్యాంగులకు ఉపయోగపడే విధంగా వీల్ ఛైర్ ఫిక్సింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. ► అత్యవసర సమయాల్లో ప్రయాణికులు లోకో పైలట్‌తో మాట్లాడేందుకు ప్రస్తుతం ఉన్న వాటి స్థానంలో బోర్డర్‌లెస్ ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులకు సులువుగా అందుబాటులో ఉండేలా హ్యామర్ బాక్స్ కవర్లో మార్పులు చేయనున్నారు. ► వందే భారత్ రైళ్లలో కోచ్‌ల మధ్య మెరుగైన కనెక్టివిటీ కోసం యాంటీ క్లైంబర్స్ అనే కొత్త భద్రతా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ఈ వ్యవస్థను వందే భారత్‌తోపాటు, అన్ని రైళ్లలో ఏర్పాటు చేస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ► మెరుగైన ఎయిర్ కండీషనింగ్ కోసం ఎయిర్‌టైట్ ప్యానల్స్‌లో మార్పులు చేయనున్నారు. అత్యవసర సమయాల్లో రైలును ఆపేందుకు ఉపయోగించే ఎమర్జెన్సీ పుష్ బటన్‌ను లోకో పైలట్‌కు సులువుగా యాక్సెస్ చేసేందుకు వీలుగా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ► నీరు బయటకు రాకుండా వాష్ బెసిన్ లోతులను పెంచనున్నట్లు తెలిపారు. టాయిలెట్స్‌లో లైటింగ్ సిస్టమ్స్ మెరుగుపరచనున్నట్లు పేర్కొన్నారు. ► త్వరలో రిజర్వేషన్ చేయించుకోనివారికి కూడా అధునాతన సదుపాయాలతో కోచ్‌లను తయారు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దశలవారిగా వందే భారత్ రైళ్లకు మరిన్ని సదుపాయాలను కల్పించనున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: Gyanvapi Case Updates: జ్ఞానవాపిలో పురావస్తు సర్వేకు బ్రేక్.. సుప్రీం కీలక ఆదేశాలు -
ఇక కాషాయ వందేభారత్
చెన్నై: వందేభారత్ రైళ్లు ఇకపై రంగు మార్చుకోనున్నాయి. ఇన్నాళ్లూ నీలం రంగులో ఉండే రైలు బోగీలు ఇకపై కాషాయం రంగులో కనిపిస్తాయి. కొత్తగా తయారు చేసే రైళ్లకు కాషాయం రంగు వేస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో వందేభారత్ రైలు కోచ్‌లు తయారవుతున్నాయి. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ఫ్యాక్టరీని సందర్శించారు. రైలు బోగీలోకి వెళ్లి సీట్లను పరిశీలించారు. లోకో పైలెట్ జోన్లోకి కూడా వెళ్లి అన్నీ సరిగ్గా అమర్చారా లేదా అని పరీక్షించి చూశారు. ఈ కొత్త రైళ్లు బూడిద, కాషాయం రంగు కలయికతో ఉన్నాయి. మన దేశ జెండా త్రివర్ణ పతాకం స్ఫూర్తితో ఈ రంగుల్ని ఎంపిక చేసినట్టుగా అశి్వన్ వైష్ణవ్ తెలిపారు. ‘‘వందేభారత్ రైళ్లు మేకిన్ ఇండియాలో భాగంగా రూపొందిస్తున్నాం. ప్రస్తుతమున్న రైళ్లలో లోటు పాట్లు గురించి సమాచారాన్ని సేకరించి కొత్తగా నిర్మించే కోచ్‌ల్ని మరింతగా మెరుగుపరుస్తున్నాం’’ అని వైష్ణవ్ వివరించారు. -
ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టం..భద్రతకు భరోసా
ఒడిశా రైలు దుర్ఘటనకు ప్రధాన కారణం ఏమిటన్న దానిపై చర్చ మొదలైంది. ఒకే ట్రాక్‌పై ప్రయాణించే రైళ్లు ఒకదానికొకటి ఢీకొట్టకుండా కవచ్ అనే ఆధునిక వ్యవస్థ ఉన్నప్పటికీ భారీ ప్రమాదం జరగడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఒడిశా ప్రమాద ఘటనకు కవచ్ వ్యవస్థతో సంబంధం లేదని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా ప్రకటించారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్(ఈఐ) వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పుల వల్లే ఈ ఘోరం జరిగిందని తెలిపారు. బాధ్యులను గుర్తించామని చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని, రైలు సేఫ్టీ కమిషనర్ త్వరలో నివేదిక అందజేస్తారని వెల్లడించారు. సిగ్నలింగ్‌లో లోపాల కారణంగానే రైలు ప్రమాదం జరిగినట్లు రైల్వే బోర్డు ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అసలు ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ అంటే ఏమిటన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ వ్యవస్థ ఎలా పని చేస్తుంది? దాని వల్ల రైళ్లు ఎంత భద్రం? అనేది తెలుసుకుందాం.. ఏమిటీ లాకింగ్ సిస్టమ్ ► రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలో ఇదొక అంతర్భాగం. నిర్దేశిత మార్గాల్లో రైళ్లు క్షేమంగా రాకపోకలు సాగించేలా ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ ద్వారా నియంత్రిస్తారు. ► గతంలో మెకానికల్, ఎలక్ట్రో–మెకానికల్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలు ఉండేవి. వాటి ఆధునిక రూపమే ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్. ► సంప్రదాయ ప్యానెల్ ఇంటర్‌లాకింగ్, ఎలక్ట్రో–మెకానికల్ ఇంటర్‌లాకింగ్‌తో పోలిస్తే ఈ అధునాతన వ్యవస్థతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ► సాఫ్ట్వేర్ ఆధారంగా పనిచేస్తుంది. సిగ్నలింగ్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేర్పులైనా సులభంగా చేసుకోవచ్చు. ► ఇది ప్రాసెసర్ ఆధారిత వ్యవస్థ అని నిపుణులు చెబుతున్నారు. విస్తృతమైన ప్రయోగ పరీక్షల తర్వాతే దీన్ని తీసుకొచ్చారు. ► ట్రైన్ డిటెక్షన్ సిస్టమ్, సిగ్నళ్లు, పాయింట్లు, ట్రాక్ సర్క్యూట్లు వంటి వాటితో అనుసంధానమై పనిచేస్తుంది. ఇందుకోసం కంప్యూటర్లు, ప్రోగ్రామ్బుల్ లాజిక్ కంట్రోలర్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్, సెన్సార్లు, ఫీడ్ బ్యాకింగ్ పరికరాలు ఉపయోగిస్తారు. ► రైళ్ల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ప్రమాదాల జరగకుండా నియంత్రించడానికి వీలుంటుంది. ► ఒకే ప్రాంతంలో ఒకే పట్టాల(ట్రాక్)పై ఏకకాలంలో రెండు రైళ్లు ఉండకుండా చూస్తుంది. రైళ్లకు ట్రాక్‌లను కేటాయించే వ్యవస్థ ఇది. ► ఒక మార్గంలో ప్రయాణం పూర్తి సురక్షితం అని తేలేదాకా రైలుకు సిగ్నల్ ఇవ్వకుండా ఆపేస్తుంది. ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక రైలు ప్రమాదాలు, పరస్పరం ఢీకొనడం వంటివి చాలావరకు తగ్గిపోయాయి రైళ్ల భద్రతే లక్ష్యంగా... ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ రైళ్ల భద్రతే లక్ష్యంగా పని చేస్తుంది. రైళ్ల రాకపోకలు, సిగ్నల్స్, ట్రాక్స్‌ను నియంత్రించడానికి ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఒకప్పుడు మనుషులు చేసిన పనిని ఇప్పుడు కంప్యూటర్ల సాయంతో నిర్వర్తిస్తున్నారు. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో 45 శాతానికి పైగా స్టేషన్లు ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థతో అనుసంధానమయ్యాయి. రైల్వేల ఆధునికీకరణలో భాగంగా ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తోంది. 2022–23లో కొత్తగా 347 స్టేషన్లలో ఈ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దేశంలో బ్రాడ్‌గేజ్(బీజీ) మార్గాల్లో 6,506 రైల్వే స్టేషన్లు ఉండగా, వీటిలో 6,396 స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ ఏర్పాటయ్యింది. ఒడిశాలో ప్రమాదం జరిగిన బహనాగ బజార్ రైల్వేస్టేషన్‌లోనూ ఈ వ్యవస్థ ఉంది. వైఫల్యాలు ఎందుకు? ► ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ సమర్థంగా పనిచేయడమే కాదు, మొరాయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ► ఈ వ్యవస్థలో ఏదైనా లోపం తలెత్తితే సిగ్నల్ వెంటనే ఎరుపు రంగులోకి మారిపోతుంది. తద్వారా రైలు నడిపించే లోకో పైలట్‌కు తక్షణమే సంకేతం అందుతుంది. ► ఒకవేళ ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ వైఫల్యం చెందితే అందుకు బహిర్గత పరిస్థితులు, మానవ చర్యలే చాలావరకు కారణమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ► ఒడిశా ఘటనలో ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లో నార్మల్ లైన్‌పై పాయింట్ సెట్ చేయాల్సి ఉండగా, లూప్‌లైన్‌పై చేశారని, మానవ ప్రమేయం లేకుండా ఇది జరిగేది కాదని సిగ్నలింగ్ నిపుణుడొకరు చెప్పారు. ► రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తవ్వకాలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. దానివల్ల అక్కడ సిగ్నలింగ్‌కు సంబంధించిన వైర్లు దెబ్బతినడం లేదా షార్ట్ సర్క్యూట్ జరగడం, ఫలితంగా రైలుకు సరైన సంకేతం ఇవ్వడంలో ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ వైఫల్యం చెంది ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒడిశా రైళ్ల ప్రమాదంపై... సీబీఐ విచారణ
బాలాసోర్/న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన ఒడిశా రైళ్ల ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రమాదానికి మూలకారణాన్ని, ఈ ‘నేరపూరిత’ చర్యకు ప్రధాన కారకులను ఇప్పటికే గుర్తించినట్టు ఆదివారం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించిన కాసేపటికే ఈ మేరకు ప్రకటన వెలువడింది. అంతేగాక, ‘‘ప్రమాదం వెనక విద్రోహ కోణాన్నీ తోసిపుచ్చలేం. రైళ్ల ఉనికిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ వాటి గమనాన్ని నిర్దేశించే అతి కీలకమైన ఇంటర్ లాకింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేసి ఉండే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం’’ అని రైల్వే వర్గాలు చెప్పుకొచ్చాయి. రైలును ట్రాక్‌ను మళ్లించే ఎలక్ట్రిక్ పాయింట్, ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సంబంధిత సమస్యే ప్రమాదానికి కారణమని ప్రమాద స్థలి వద్దే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న వైష్ణవ్ భువనేశ్వర్‌లో మీడియాకు చెప్పారు. ‘‘పూర్తి వివరాల్లోకి నేనిప్పుడే వెళ్లదలచుకోలేదు. అయితే పాయింట్ యంత్రం సెట్టింగ్‌ను మార్చారు. ఇదెందుకు, ఎలా జరిగిందన్నది విచారణ నివేదికలో వెల్లడవుతుంది’’ అని వివరించారు. మూడు రైళ్ల ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐకి సిఫార్సు చేసినట్టు వెల్లడించారు. విపక్షాలు మాత్రం ఈ విషయంలో కేంద్రంపై దుమ్మెత్తిపోశాయి. ప్రమాదానికి పూర్తి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి తక్షణం రాజీనామా చేయాల్సిందేనని తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ సహా పలు ఇతర విపక్షాలు రైల్వే మంత్రి రాజీనామాకు డిమాండ్ చేశాయి. మంత్రుల స్థాయి నుంచి కింది దాకా బాధ్యులందరినీ గుర్తించి కఠినాతి కఠినంగా శిక్షించి తీరాల్సిందేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. మోదీ సర్కారు మీడియా పిచ్చి, పీఆర్ గిమ్మిక్కులు ప్రభుత్వ వ్యవస్థను చేతగానిదిగా మార్చేశాయమంటూ ఖర్గే తూర్పారబట్టారు. యూపీఏ హయాంలో రైల్వే మంత్రుల పనితీరు ఎంత ఘోరంగా ఉండేదో కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ బీజేపీ ఎదురుదాడికి దిగింది. మహా విపత్తును కూడా రాజకీయం చేయడం దారుణమని మండిపడింది. ప్రమాదంలో మరణించిన వారి తుది సంఖ్యను 288 నుంచి 275గా రైల్వే శాఖ ఆదివారం సవరించింది. విద్రోహ కోణంపై రైల్వే ఏం చెప్పిందంటే... పాయింట్ మెషీన్, ఇంటర్ లాకింగ్ వ్యవస్థ పూర్తిగా సురక్షితమని రైల్వే వర్గాలు వివరించాయి. ‘‘అదెంత సురక్షితమంటే ఒకవేళ అది పూర్తిగా విఫలమైనా సిగ్నళ్లన్నీ వెంటనే రెడ్‌కు మారి రైళ్ల రాకపోకలన్నీ తక్షణం నిలిచిపోతాయి. అయినా సిగ్నలింగ్ సమస్యే ప్రమాదానికి కారణమైంది గనుక బయటి శక్తుల ప్రమేయాన్ని తోసిపుచ్చలేం. కేబుళ్లను చూసుకోకుండా ఎవరైనా తవ్వేయడంతో తెగిపోయి ఉండొచ్చు’’ అని రైల్వే బోర్డు సభ్యురాలు జయా వర్మ సిన్హా వివరించారు. ప్రమాదానికి మితిమీరిన వేగం, డ్రైవర్ల తప్పిదం కారణం కావని రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి. లోపలి, లేదా బయటివ్యక్తులు విద్రోహానికి పాల్పడే అవకాశాన్నీ తోసిపుచ్చలేమని రైల్వే అధికారి ఒకరన్నారు. టికెట్ లేని వారికీ పరిహారం షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ శుక్రవారం రాత్రి ఒడిశాలోని బహనగా బజార్ స్టేషన్ సమీపంలో లూప్లైన్లోకి దూసుకెళ్లి ఆగున్న గూడ్సును ఢీకొని పట్టాలు తప్పడం, పక్క ట్రాక్‌పై పడ్డ బోగీలను ఢీకొని బెంగళూరు–హౌరా ఎక్స్‌ప్రెస్ కూడా పట్టాలు తప్పడం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో గాయపడ్డ 1,175 మందిలో వందలాది మంది ఇంకా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రెండు రైళ్లలో చాలావరకు వలస కార్మికులే ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్డు గత ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని టికెట్ లేని ప్రయాణికులకు కూడా పరిహారం అందించనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. మరోవైపు సహాయ చర్యలతో పాటు ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. తూర్పు, దక్షిణ భారతాలను కలిపే ఈ కీలక రైల్వే లైన్లో పూర్తిగా దెబ్బ తిన్న ట్రాకుల్లో ఇప్పటిదాకా రెండింటిని పునరుద్ధరించారు. ప్రమాదంపై సుప్రీంలో పిల్ సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశాలో రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సారథ్యంలో విచారణకు కేంద్రాన్ని ఆదేశించాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలైంది. రైల్వే వ్యవస్థలో ప్రమాద, భద్రత పరామితులను కమిటీ విశ్లేషించి, వాటి బలోపేతానికి సలహాలు, సూచనలిచ్చేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ విశాల్ తివారీ కోరారు. కవచ్ వ్యవస్థను వెంటనే అమలు చేసేలా మార్గదర్శకాలివ్వాలన్నారు. -
వేడెక్కిన రాజకీయం
కొరాపుట్/భువనేశ్వర్/రాయగడ: బాలేశ్వర్‌లో జరిగిన రైలు ప్రమాదం కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఊహించని సంకటంగా మారింది. రైల్వేమంత్రి అశ్విని శ్రీవైష్టవ్ ఒడిశాకు చెందిన రాజ్యసభ ఎంపీ. రాజస్థాన్‌కు చెందిన ఆయన.. ఐఏఎస్ అధికారిగా ఒడిశా కేడర్‌లో పనిచేసి, ఉద్యోగ విరమణ పొందా రు. ఎన్డీఏ–2 అధికారంలోకి వచ్చిన వెంటనే రైల్వే శాఖలో సంస్కరణలు చేపట్టారు. ఈ క్రమంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అశ్విన్ అనేక సంస్కరణ లు చేపట్టడంతో దేశవ్యాప్తంగా బీజేపికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చాయి. రైల్వేశాఖ మీద దశాబ్దాలు గా బెంగాల్, బీహార్ ఆధిపత్య జోరుకు కల్లెం పడింది. ఈ నేపథ్యంలో రైల్వేమంత్రి ఆయా రాష్ట్రాల్లో బీజేపీయేతర ముఖ్యమంత్రులకు లక్ష్యంగా మారారు. ఈ క్రమంలో దుర్ఘటన జరడం, రైల్వేశాఖ నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు ప్రాథమికంగా తేలడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో అశ్విన్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. వెనువెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తన వెంట రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రప్పించుకున్నారు. మరోవైపు ఘటన జరిగిన ప్రాంతం బాలేశ్వర్‌కు చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీమంత్రి ప్రతాప్ షడంగి నేతృత్వం వహించడం కూడా విపక్షాలకు మరో అవకాశంగా మారింది. ఈరైలు బెంగాల్–తమిళనాడు మధ్య రాకపోకలు సాగిస్తుండగా, ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బీజేపీ తో సరిగ్గా పడదు. వారిద్దరూ కూడా పరిస్థితి గమనించి బీజేపీని ఇరుకున పెట్టేందుకు ముందుకు దిగారు. తమిళనాడు ముఖ్యమంత్రి తన రాష్ట్రం నుంచి మంత్రుల బృందం పంపించడం, అప్పటికే పశ్చిమబెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బయలు దేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్రం క్షతగాత్రులకు వెంటనే నష్ట పరిహారం అందజేయ డం ప్రారంభించింది. ప్రధాని నరేంద్రమోదీ సైతం స్వయంగా రంగంలో దిగి ఒడిశా బయలుదేరారు. మరోవైపు, విశ్రాంత రైల్వే ఉన్నతాధికారులు తమ ట్విట్టర్ హ్యాండిల్ వేదికగా రైల్వేశాఖ నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన జరిగినట్లు ప్రకటనలు చేస్తుండటం గమనార్హం. -
రైల్వే మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్
ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న సంఘటనలో జరిగిన ప్రాణ నష్టానికి బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలకు రాజకీయం చేయడానికిది సరైన సమయం కాదంటూ సున్నితంగా హెచ్చరించారు కేంద్ర మంత్రి. రైల్వే శాఖ వైఫల్యం... ఒడిశా రాష్ట్రంలో బాలాసోర్ సమీపంలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడం వెనుక సాంకేతిక లోపమే ప్రధాన కారణమని, ఈ ప్రమాదం జరిగిన కొద్దీ సేపటికి డౌన్ లేన్ లో వస్తున్న మరో రైలు బెంగుళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని చేరవేయడంలోనూ రైల్వే శాఖ విఫలమైందని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ కారణాలను ఎత్తిచూపుతూ కేంద్ర రైల్వే మంత్రి జరిగిన తప్పిదానికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యతగా రాజీనామా చెయ్... దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ... గతంలోనూ ఒకేసారి ఇదే విధంగా లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో ప్రమాదం జరిగితే అందుకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి వెంటనే రాజీనామా చేశారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రికి ఏమాత్రం నైతికత ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమయం సందర్భం లేదా... రైల్వే మంత్రి స్పందిస్తూ... రైలు ప్రమాదంలో ఊహించని స్థాయిలో ప్రాణ నష్టం జరిగింది. ఎన్నో కుటుంబాలు చెల్లా చెదురయ్యాయి. ఇది వారి జీవితాలను పునరుద్ధరించాల్సిన సమయం. మేము పూర్తి పారదర్శకతతో ఆ పనుల్లో ఉన్నాము. రాజకీయం చేయడానికిది తగిన సమయం కాదని అన్నారు. ఇది కూడా చదవండి: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అండగా సోను సూద్ -
రెండేళ్లలో నాలుగు... ఆరేళ్లలో మూడు!
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వ చేపట్టిన సమగ్ర విధానాలు 2014 నుండి దేశ సామాజిక, ఆర్థిక పురోగతికి దారితీశాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. రానున్న రెండేళ్లలో దేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నదని అన్నారు. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఒక ఆకర్షణీయ ప్రదేశంగా రూపొందిందనీ, ప్రపంచం దేశంపై తన విశ్వాసాన్ని ఉంచుతోందని పేర్కొన్నారు. 2047 నాటికి దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే ప్రస్తుత నిర్ణయాత్మక నాయకత్వంపై ప్రజలు తమ విశ్వాసాన్ని కొనసాగించాలని వైష్ణవ్ కోరారు. 2014లో మోదీ ప్రభుత్వం అదికారంలోనికి వచ్చినప్పుడు దేశ ఎకానమీ ప్రపంచంలో పదవ స్థానంలో ఉందని పేర్కొన్న ఆయన, ప్రస్తుతం ఇది 5వ స్థానానికి మెరుగుపడిన విషయం తెలిసిందేనన్నారు. మోదీ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో రైల్వే, ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రి కూడా అయిన వైష్ణవ్ మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ► ఆరేళ్లలో భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ప్రభుత్వ హయాంలో ఎకానమీ పటిష్టంగా పురోగమిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకుని నిలబడుతోంది. దేశాభివృద్ధే దృఢ సంకల్పంగా పూర్తి సానుకూల వాతావరణంలో కార్యకలాపాలు నిర్వహణ జరుగుతోంది. ► కేంద్రం చేపట్టిన పలు పథకాలు, విధానాలు ప్రజలను ఆర్థికంగా శక్తివంతులను చేశాయి. వారి జీవితాలో నాణ్యతను పెంచాయి. ► దేశ ప్రజల భవిష్యత్తు నేటి భారత్‌లో నిర్మితమవుతోంది. 2047 నాటికి, మీరు అభివృద్ధి చెందిన దేశంలో నివసిస్తారు. మీరు పురోగతి బాటన దేశాన్ని నడిపే మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వోటుచేస్తే, భారత్ అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంటుంది. ► ప్రధానమంత్రి నాయకత్వం కొత్త ఆలోచనా విదానాన్ని, దృక్పథాన్ని తీసుకొచ్చింది. దేశాభివృద్ధికి సానుకూలంగా ఆలోచనలను మార్చింది. ► గతంలో పేదలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసేవారు. 2014 నుండి ప్రభుత్వ పథకాలు ప్రజల సాధికారతకు దారితీశాయి. పరివర్తన, గుణాత్మక మార్పులను తీసుకువచ్చాయి. ప్రభుత్వ సేవలు, ఆర్థిక ఫలాలు అట్టడుగు స్థాయికి అందజేసేలా నిరంతరం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం చేసే ప్రతి పైసా పేదల పురోగతికి దోహదపడాలన్నది కేంద్రం లక్ష్యం. సమాజంలోని బడుగు, బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకుని పథకాలు, కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్న తీరును ఆయా అంశాలు ప్రతిబింబిస్తున్నాయి. ► వ్యాక్సిన్లను సకాలంలో పొందడం నుండి (కోవిడ్ సమయంలో), సురక్షితమైన తాగునీటిని అందించడం వరకూ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద సరసమైన గృహాలను అందించడం నుండి రైలు, విమాన రహదారి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం వరకు ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ దేశంలో వాస్తవ, సానుకూల మార్పును తీసుకువచ్చాయి. సమగ్ర పురోగతికి ఆయా చర్యలు దోహదపడుతున్నాయి. ► నేడు దేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3.5 కోట్ల ఇళ్లను నిర్మించడం జరిగింది. 12 కోట్ల మందికి నీటి కనెక్షన్లు జతయ్యాయి. 9.6 కోట్ల కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లను అందించారు. ► భారత్ నేడు ఆయుష్మాన్ భారత్ కింద ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ బీమా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇది అవసరమైన వారికి రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం తగిన సౌలభ్యత కల్పిస్తోంది. ఈ పథకం మొత్తం కవరేజీ అమెరికా, రష్యా జనాభా కంటే ఎక్కువ. ► ఇక దేశీయ మౌలిక సదుపాయాలు కూడా 2014 నుండి చక్కటి పురోగతి రూపాన్ని పొందాయి. గతంలో సరైన ఆలోచనా విధానం లేకపోవడం 2014కు ముందు ఈ రంగం అంతగా పురోగతి చెందలేదు. ► తొమ్మిదేళ్లలో 74 విమానాశ్రయాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2014 వరకు ఏర్పాటు చేసిన సంఖ్యకు సమానం. భారతదేశం 2014 వరకు జలమార్గాలు లేని స్థితిలో ఉండేది. ప్రస్తుతం దేశంలో ఈ సంఖ్య 111గా ఉంది. దేశంలోని రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ జరుగుతోంది. విమానాశ్రయాల మాదిరిగానే ప్రపంచ స్థాయి సౌకర్యాలను రైల్వేల్లో కల్పించడం జరుగుతోంది. ► ఇక దేశంలో డిజిటల్ సాంకేతికత పురోగతి పటిష్టంగా కొనసాగుతోంది. ఇది పేదలకు కొత్త అవకాశాలను తీసుకువచ్చింది. దేశంలో డిజిటల్ చెల్లింపుల సంఖ్య కూడా భారీగా పెరగడం ఇక్కడ గమనించాల్సిన అంశం. -
మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని
గువాహటి: గువాహటి(అస్సాం)–న్యూజల్పాయ్గురి(పశ్చిమబెంగాల్) వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం ప్రధాని మోదీ వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాల్లోనే మొట్టమొదటి ఈ వందేభారత్ రైలుతో ఈ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వారంతో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వంలో దేశం అభివృద్ధి దిశగా అద్భుతమైన ప్రయాణం సాగించిందన్నారు. 2014కు పూర్వం ఊహించని అనేక విజయాలను ప్రభుత్వం సాధించిందని తెలిపారు. గువాహటిలో ఈ రైలు ప్రారంభ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, సీఎం హిమాంత బిశ్వ శర్మ పాల్గొన్నారు. గువాహటి– న్యూజల్పాయ్గురి మధ్య రైలు ప్రయాణ సమయం ప్రస్తుతమున్న 6.30 గంటల నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాకతో 5.30 గంటలకు తగ్గనుంది. -
AP: 72 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు: రైల్వే శాఖ మంత్రి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో అమృత్ భారత్ పథకం కింద 72 స్టేషన్లలో అభివృద్ధి పనులు జరిగాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఏపీలో వివిధ రైల్వే ప్రాజెక్టులపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. 2022 ఏప్రిల్ నెల వరకు రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి సంబంధించి 16 కొత్త లైన్లు, 15 డబ్లింగ్ లైన్లు మొత్తం 31 ప్రాజెక్టులు కేటాయించామన్నారు. వాటి దూరం 5,581 కిలోమీటర్లు కాగా, 70,594 కోట్లుతో చేపట్టామన్నారు. ఈ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని, మార్చి 2022 వరకు 636 కిలోమీటర్ల దూరాన్ని 19,414 కోట్లతో నిర్మించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే 2014-19 మధ్య 219 శాతానికి పైగా రైల్వే బడ్జెట్లో కేటాయింపులు పెంచడం జరిగిందని జీవీఎల్ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద 72 స్టేషన్ల అభివృద్ధి అమృత్ భారత్ స్టేషన్ స్కీం రైల్వే స్టేషన్ల అభివృద్ధికి దేశవ్యాప్తంగా 1275 రైల్వే స్టేషన్లను, వాటిలో 72 స్టేషన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించగా అందులో 53 స్టేషన్లలో ఇప్పటికే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. చదవండి: మా నమ్మకం నువ్వే.. ఏప్రిల్ 7 నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం -
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. భారీ మార్పులు, నిమిషానికి 2 లక్షల టికెట్లు!
దేశ ప్రజలకు ఇండియన్ రైల్వేస్ అందిస్తున్న సేవలను గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి రోజూ లక్షల ప్రయాణికులను తక్కువ ఖర్చుతో వారి గమ్యస్థానానికి చేరుస్తోంది. తాజాగా ప్యాసింజర్ల అందించే సేవల విషయంలో మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతమున్న ఆన్లైన్ టిక్కెట్ల రిజర్వేషన్ వ్యవస్థ సామర్థ్యం మరింత పెంచేందుకు కీలక చర్యలు తీసుకోనుంది. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. భారీ మార్పులు.. నిమిషాల్లో 2 లక్షల టికెట్లు విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 7,000 కిలోమీటర్ల దూరం కొత్త రైల్వే ట్రాక్‌లు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ‘ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరచాలని ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతం, టిక్కెట్ల సామర్థ్యం నిమిషానికి 25,000 టిక్కెట్లు ఉండగా, ఆ సామర్థ్యాన్ని నిమిషానికి 2.25 లక్షలకు అప్‌గ్రేడ్ చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని' చెప్పారు. దీని ద్వారా రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మరింత సులభంగా టికెట్ లభించనుంది. ఎంక్వైరీలకు హాజరయ్యే సామర్థ్యం నిమిషానికి నాలుగు లక్షల నుంచి నిమిషానికి 40 లక్షలకు అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 2,000 రైల్వే స్టేషన్లలో “జన్ సువిధ” కన్వీనియన్స్ స్టోర్లను నిర్మిస్తామని, అవి 24 గంటలూ తెరిచి ఉంటాయని ప్రకటించారు. వీటితో పాటు 2014 కి ముందు, ఇది రోజుకు నాలుగు కిలోమీటర్లు ఉండగా, 2022-23లో 4,500 కిలోమీటర్ల (రోజుకు 12 కిలోమీటర్లు) దూరం వరకు రైల్వే ట్రాక్‌లు వేయాలనే లక్ష్యం ఇప్పటికే అందుకున్నట్లు చెప్పారు. చదవండి: ఎలన్ మస్క్‌కు భారీ ఊరట.. ఆ దూకుడుకు కళ్లెం వేయడం కష్టమే! -
వందే భారత్ రైలులో క్లినింగ్ ప్రకియ చేపట్టిన రైల్వే మంత్రి
ఇప్పుడిప్పుడే మెట్రో రైలు వంటి ఆధునికతతో కూడిన హైక్లాస్ రైళ్లను పట్టాలెక్కించి ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది కేంద్రిం. అందులో భాగంగానే తక్కవ సమయంలో దూర ప్రయాణాలు చేయగలిగే వందే భారత్ వంటి హైక్లాస్ రైలును కూడా తీసుకొచ్చింది. మంచి ఆధునికతతో కూడిన రైలు అని మురిసిపోయేలోగే దాన్ని కూడా ప్రజలు చెత్తతో నింపేశారు. దీంతో ఆ రైలులో పరిస్థితి ఇది అంటా, అది అంటా అంటూ.. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా రంగంలోకి దిగి చెత్తను క్లీన్ చేశారు. శానిటరీ వర్కర్ మాదిరిగా డ్రైస్ ధరించి ఓ సంచిని పట్టుకుని ప్రతి ప్రయాణికుడి సీటు వద్దకు వెళ్లి చెత్తను సేకరించారు. విమానాల్లో మాదిరిగా క్లీనింగ్ విధానాన్ని అనుసరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే రైళ్లలో పరిశుభ్రతను కాపాడుకోవడంలో ప్రజలు సహకరించాలని ట్విట్టర్లో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వందే భారత్ రైలు ప్లేట్లు, కప్పులు వంటి చెత్తతో నిండిపోయింది. సిబ్బంది నిర్ణిత వ్యవధిలో క్లీన్ చేసినప్పటికీ రైలు స్టేషన్‌కి చేరుకునే సరికి చెత్తతో దారుణంగా ఉంది. దీంతో నెటిజన్ల తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రిని కోరారు. ఈ నేపథ్యంలోనే రైల్వే మంత్రి ఈ క్లినింగ్ ప్రక్రయను చేపట్టారు. Cleaning system changed for #VandeBharat trains. आपका सहयोग अपेक्षित है। https://t.co/oaLVzIbZCS pic.twitter.com/mRz5s9sslU — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 28, 2023 (చదవండి: కళల అభ్యున్నతికి పాల్పడుతున్న వారిని గుర్తించాం.. 'మన్‌కీ బాత్'లో మోదీ) -
రైళ్లలో వృద్ధులకు రాయితీలు ఇప్పుడే కాదు: కేంద్రం
న్యూఢిల్లీ: రైల్వేలపై ఖర్చుల భారం విపరీతంగా పెరిగిపోతోందని ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గతేడాది ప్యాసింజర్ సేవలకు రూ.59,000 కోట్ల రాయితీలు ఇచ్చామని, పెన్షన్లు, జీతాల బిల్లు భారీగానే ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రైళ్లలో వృద్ధులకు రాయితీలను ఇప్పట్లో పునరుద్ధరించే అవకాశం లేదని పరోక్షంగా చెప్పారు. వాటిని కరోనా సమయంలో రద్దు చేయడం తెలిసిందే. ‘‘ప్రయాణికుల సేవలకు ఏటా రూ.59,000 కోట్ల రాయితీలివ్వడం మామూలు విషయం కాదు. పైగా రూ.60,000 కోట్ల పెన్షన్ బిల్లు, రూ.97,000 కోట్ల జీతాల బిల్లు, రూ.40,000 కోట్ల ఇంధన ఖర్చు భరించాల్సి వస్తోంది. కొత్త నిర్ణయాలు తీసుకొనే ముందు రైల్వేల ఆర్థిక పరిస్థితినీ పరిగణనలోకి తీసుకోవాలి’’ అని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: AP: 8.22లక్షల మందికి సున్నా వడ్డీ రాయితీ -
బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 4జీ టెక్నాలజీని 5–7 నెలల్లో 5జీకి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న 1.35 లక్షల టెలికం టవర్ల ద్వారా ఈ సర్వీసులు అందుబాటులోకి రాగలవని పేర్కొన్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఇతర టెలికం సంస్థలు ఇంకా పూర్తిగా కవర్ చేయని అనేక గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీఎస్ఎన్ఎల్ సర్వీసులు ఉన్నాయని మంత్రి చెప్పారు. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న టెల్కోలకు గట్టి పోటీనివ్వడంతో పాటు మారుమూల ప్రాంతాల్లో టెలికం సేవలకు బీఎస్ఎన్ఎల్ కీలకంగా మారగలదని ఆయన పేర్కొన్నారు. స్వదేశీ ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా టెలికం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్‌ను ఏటా రూ. 500 కోట్ల నుంచి రూ. 4,000 కోట్లకు పెంచే యోచన ఉన్నట్లు ఆయన వివరించారు. నవకల్పనలు, అంకుర సంస్థల వ్యవస్థను ప్రోత్సహించేందుకు భారతీయ రైల్వేస్, రక్షణ శాఖ తగు తోడ్పాటు అందిస్తున్నాయని వైష్ణవ్ చెప్పారు. రైల్వేస్ ఇప్పటికే 800 స్టార్టప్‌లతో, రక్షణ శాఖ 2,000 పైచిలుకు స్టార్టప్స్‌తో కలిసి పని చేస్తున్నాయని వివరించారు. -
విశాఖపట్నం రైల్వేజోన్‌కు ఓకే.. రూ.106 కోట్లు మంజూరు
సాక్షి, విశాఖపట్నం: సుదీర్ఘంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో విశాఖలో ఘనంగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి తీపి కబురు అందింది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ నిర్మాణానికి రైల్వే బోర్డు నుంచి గురువారం అనుమతులు మంజూరయినట్లు రైల్వే మంత్రి అశ్వినీ కుమార్ వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాని మోదీ విశాఖలో పర్యటిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన విశాఖ వచ్చారు. జోన్‌కు అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో రైల్వే బోర్డ్ చైర్మన్, సీఈవో వీకే త్రిపాఠీ సైతం కేంద్ర మంత్రితో విశాఖ చేరుకున్నారు. వారికి ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ రూప్ నారాయణ్, వాల్తేరు డీఆర్ఎం అనూప్ కుమార్ శ్రీవాత్సవ స్వాగతం పలికారు. అనంతరం కొత్తగా జోనల్ ప్రధాన కార్యాలయం నిర్మించనున్న వైర్ లెస్ కాలనీని మంత్రి శుక్రవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ వైర్లెస్ కాలనీలో ప్రతిపాదిత ఎస్‌సిఓఆర్ జోనల్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి రూ.106 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని, ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. చదవండి: మూడేళ్లుగా ఏపీ నంబర్ వన్.. ఇదీ మన ఘనత -
ట్రయల్ రన్లో దూసుకెళ్లిన ‘వందే భారత్’.. 180 కిలోమీటర్ల వేగంతో రికార్డ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన వందేభారత్ రైళ్లు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. ఈ క్రమంలో దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హైస్పీడ్ రైలు అయిన వందేభారత్ మూడో ప్రాజెక్ట్ ట్రయల్ రన్ చేపట్టారు అధికారులు. ఈ ట్రయల్ రన్లో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని నమోదు చేసి ఔరా అనిపించింది. ట్రయల్ రన్లో రైలు వేగాన్ని చూపుతున్న వీడియోలను రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. 2019లో తొలి వందేభారత్ రైలు దేశంలో అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ- వారణాసి మధ్య దీన్ని నడుపుతున్నారు. ఢిల్లీ- జమ్మూలోని వైష్ణోదేవీ మార్గంలో రెండో రైలును ప్రవేశపెట్టారు. తాజాగా రాజస్థాన్‌లోని కోటా- మధ్యప్రదేశ్‌లోని నగ్దా మధ్య మూడో రైలు నడపనున్న నేపథ్యంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకుంది ట్రైను. రైలు వేగాన్ని కొలిచే స్పీడో మీటర్ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఆన్ చేసి దాన్ని రైలు కిటికీ పక్కన పెట్టి వీడియోను చిత్రీకరించారు. ఓ దశలో రైలు 183 కిలోమీర్ల గరిష్ఠ వేగాన్ని అందుకోవడం ఆ వీడియోలో కనిపించింది. అంత వేగంతో వెళ్తున్నా.. పక్కనే ఉన్న మంచినీళ్ల గ్లాసు పెద్దగా కుదుపులకు లోనుకాకపోవడం విశేషం. आत्मनिर्भर भारत की रफ़्तार… #VandeBharat-2 at 180 kmph. pic.twitter.com/1tiHyEaAMj — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 26, 2022 Superior ride quality. Look at the glass. Stable at 180 kmph speed.#VandeBharat-2 pic.twitter.com/uYdHhCrDpy — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 26, 2022 ఇదీ చదవండి: వచ్చేస్తున్నాయ్ వందేభారత్ రైళ్లు -
వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్‌గా ‘తిరుపతి’.. డిజైన్లు విడుదల రైల్వే శాఖ మంత్రి
సాక్షి, తిరుపతి: తిరుపతి రైల్వేస్టేషన్‌కు త్వరలో మహర్దశ పట్టనుంది. కాంట్రాక్టులన్ని పూర్తి చేశామని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. ఆయన డిజైన్లు కూడా విడుదల చేశారు. దేశంలోనే ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్లుగా తొలిదశలో అభివృద్ధి చేస్తున్న 14 రైల్వే స్టేషన్లలో తిరుపతి ఒకటి. చదవండి: టీటీడీ కీలక నిర్ణయం.. కచ్చితంగా ఆ రూల్స్ పాటించాల్సిందే.. ఈ 14 రైల్వే స్టేషన్లను 5 వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ ఇక ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌గా రూపాంతరం చెందనుంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశవ్యాప్తంగా భక్తులు అధికంగా రైల్వే ద్వారానే వస్తుంటారు. వేలాది భక్తులతో తిరుపతి రైల్వే స్టేషన్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. దేశ విదేశాల నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు రావడంతో తిరుపతి రైల్వే స్టేషన్‌ను ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. -
‘కాంకర్ని కూడా ప్రైవేటీకరిస్తాం’.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ యూనిట్లలో పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగే ప్రక్రియేనని.. ఈ జాబితాలో కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) కూడా ఉందని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలియజేసింది. ప్రశ్నోత్తరాల సమయంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సభ్యుల ప్రశ్నకు స్పందిస్తూ మంత్రి సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ మొదలు పెట్టింది కాంకర్లో పెట్టుబడుల ఉపసంహరణ అన్నది 1994–95 కాంగ్రెస్ పాలనలోనే మొదలైనట్టు మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే రైల్వే మంత్రిగా ఉన్న సమయంలోనూ కాంకర్లో పెట్టుబడుల విక్రయానికి ప్రయత్నించినట్టు గుర్తు చేశారు. ‘1994–95లో కాంకర్లో 20 శాతం వాటాను విక్రయించారు. 995–96లోనూ కాంగ్రెస్ సర్కారు మరో 3.05 శాతం వాటాను విక్రయించింది. కాంగ్రెస్ హయాంలో కాంకర్లో మొత్తం 24.35 శాతం వాటాను విక్రయిస్తే.. కాంగ్రెసేతర ప్రభుత్వాలు 20.3 శాతం వాటాను విక్రయించాయి’’ అని సభ ముందు వివరాలు ఉంచారు. -
Indian Railways: ప్యాసింజర్ రైళ్లలో ఛార్జీల మోత
Indian Railways continue To reservations For passenger trains second class Journey: సెకండ్ క్లాస్ ప్రయాణాలను రిజర్వేషన్ కేటగిరీలో కొనసాగించడంపై రైల్వే శాఖ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడింది. సామాన్యుడికి రిజర్వేషన్ ఛార్జీల భారం తప్పదని పరోక్షంగా తేల్చేసింది రైల్వే మంత్రిత్వ శాఖ. ఈ మేరకు ప్యాసింజర్ రైళ్లలో ద్వితియ శ్రేణి తరగతిలో ప్రయాణాలకు ‘రిజర్వేషన్’ కొనసాగుతుందని పార్లమెంట్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఎదురైన ఓ ప్రశ్నకు రైల్వే మంత్రి సమాధానమిచ్చారు. కరోనా ఫస్ట్ ఫేజ్ తర్వా తి సడలింపులతో భారతీయ రైల్వే శాఖ ‘కొవిడ్ స్పెషల్’ పేరిట ప్రత్యేక రైళ్లు నడిపింది. ఆ టైంలో ప్యాసింజర్ రైళ్లను మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లుగా, పండుగ స్పెషల్‌గా మార్చేసి ఎక్కువ ఛార్జీలతో రైళ్లను నడిపించింది భారతీయ రైల్వేస్. పైగా సెకండ్ క్లాస్ సహా అన్ని కేటగిరీలను రిజర్వేషన్ కోటాలోకి మార్చేసింది. అయితే.. తాజాగా కొవిడ్ స్పెషల్ కేటగిరీని ఎత్తేస్తూ.. రెగ్యులర్ సర్వీసులుగా వాటిని మార్చేస్తున్నట్లు ప్రకటించింది రైల్వే శాఖ. దీంతో టికెట్ రేట్లు తగ్గుతాయని, సామాన్యుడికి ఊరట లభించిందని, ప్యాసింజర్ రైళ్లు ప్రయాణికుల కోలాహలంతో పూర్వవైభవం సంతరించుకోవచ్చని భావించారంతా. కానీ,. అనూహ్యంగా ప్యాసింజర్ రైళ్లలో సెకండ్‌క్లాస్ ప్రయాణాలకు ఇంకా రిజర్వేషన్ కేటగిరీ కిందే కొనసాగుతోంది. ఈ విషయమై ఎదురైన ప్రశ్నకు రైల్వే మంత్రి పార్లమెంట్లో బదులిచ్చారు. ప్యాసింజర్ రైళ్లలో సెకండ్ క్లాస్ ప్రయాణాలకు, ప్రయాణికులు రిజర్వేషన్ బుకింగ్ చేసుకోవాల్సిందేనని మంత్రి పేర్కొన్నారు. ఒకవేళ అత్యవసర లేదంటే ప్రత్యేక పరిస్థితులు ఏర్పడితే మాత్రం.. కొన్ని రైళ్లకు మినహాయింపు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. దీంతో రిజర్వేషన్ ఛార్జీల రూపంలో సామాన్యుడికి మోత మోగనుంది. అంతేకాదు తక్కువ దూరం ప్రయాణాలైనా సరే.. రిజర్వేషన్ కింద భారం మోయాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే రవాణాశాఖ నివేదికల ప్రకారం.. 364 ప్యాసింజర్ రైళ్లను 2020-2021 ఏడాది మధ్య ఎక్స్‌ప్రెస్ సర్వీసులుగా మార్చేసి నడిపించింది రైల్వే శాఖ. సెకండ్ క్లాస్ కేటగిరీలో సగటున రెండున్నర కోట్ల మంది ప్రయాణిస్తున్నట్లు ఒక అంచనా. సింగిల్ క్లిక్‌తో 35పై.లకే 10 లక్షల ఇన్సూరెన్స్ -
'విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు వెంటనే ప్రారంభిస్తాం'
న్యూఢిల్లీ: విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం కార్యకలాపాలను వెంటనే ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి, పార్టీ లోక్‌సభాపక్ష నాయకులు పీవీ మిధున్ రెడ్డి శుక్రవారం పార్లమెంట్‌లోని మంత్రి కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా కార్యకలాపాలను ప్రారంభించడంలో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన రైల్వే మంత్రి వెంటనే విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరచిన హామీలను కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేసేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కృషిని కొనసాగిస్తుందని విజయసాయి రెడ్డి, మిధున్ రెడ్డి పేర్కొన్నారు. చదవండి: (అబద్ధాలు, వితండవాదంతో కథనాలు: సజ్జల) -
ఇంజనీరింగ్ అద్భుతం.. భారత్‌లోనే తొలి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్
న్యూఢిల్లీ: భారత్‌లోనే తొలి వర్టికల్ లిఫ్ట్ పంబన్ బ్రిడ్జ్ మార్చి 2022 నాటికి వినియోగంలోకి వస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ పేర్కొన్నారు. అరేబియన్ సముద్రంలో రామేశ్వర ద్వీపంలోని ప్రధాన భూభాగానికి అనుసంధానిస్తూ దాదాపు 2 కి.మీటర్ల పొడవైన రైల్వే వంతెనను ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకు ముందు ఈ ప్రాంతంలో ఉన్న 104 ఏళ్ల నాటి వంతెన స్థానంలో ఈ సరికొత్త టెక్నాలజీతో కూడిన పైకి లెగిసే వంతెనను ఏర్పాటు చేశారు. ఇది ఏవైనా చిన్నచిన్న షిప్‌లు వచ్చినప్పుడూ ఆటోమేటిక్‌గా ఆ వంతెన పైకి లెగిసి వాటికి దారి ఇస్తుంది. ఈ క్రమంలో రైల్వే శాఖ మంత్రి కూ యాప్‌లో కొత్త పంబన్ వంతెన ఫోటోలు షేర్ చేశారు. అంతేకాదు ఇది ఇంజనీరింగ్ అద్భుతం అని "ఈ డ్యూయల్-ట్రాక్ అత్యాధునిక వంతెన దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెనగా నిలుస్తుందన్నారు. -
సరుకు రవాణా మరింత పెరగాలి
సాక్షి, హైదరాబాద్: రైల్వేలో టికెట్‌యేతర ఆదాయాన్ని భారీగా పెంచుకునేందుకు ప్రత్యేక చొరవ చూపాలని రైల్వే సహాయమంత్రి రావు సాహెబ్ పాటిల్ దాన్వే ఆదేశించారు. సరుకు రవాణాను మరింత పెంచేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం ఆయన రైల్‌నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరుకు రవాణా చేసే సంస్థలతో లాజిస్టిక్స్ కంపెనీలతో మెరుగైన అనుసంధానం ఉండేలా అధికారులు చొరవ చూపాలన్నారు. సరుకు రవాణా విషయంలో దక్షిణ మధ్య రైల్వే ముందు వరుసలో ఉండాల్సి ఉందని, ఇందుకు సరుకు రవాణా మరింత పటిష్టం కావాల్సిన అవసరముందని చెప్పారు. అలాగే ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించే విషయంలో లక్ష్యాలను సకాలంలో సాధించాలన్నారు. సీసీటీవీ నెట్వర్క్, భద్రత, కిసాన్ రైళ్లు, దూద్ దురంతో అంశాలను కూలంకషంగా చర్చించారు. కరోనా సమయంలో రైల్వే ఆస్పత్రి అందించిన సేవలను పాటిల్ ప్రశంసించారు. -
బుల్లెట్ రైలు.. మరో కొత్త మార్గంలో ?
జాల్నా (మహారాష్ట్ర) : అవసరం అనుకుంటే ముంబై- నాగ్‌పూర్ మార్గంలో బుల్లెట్ రైలు నిర్మించే అవకాశాలను పరిశీలిస్తామని రైల్వేశాఖ సహాయ మంత్రి రావు సాహేబ్ దన్వే అన్నారు. ప్రస్తుతం ముంబై- అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు పనులు జరుగుతుండగా దాన్ని నాగ్‌పూర్ వరకు పొడిగించే అంశాన్ని మంత్రి స్వయంగా ప్రస్తావించారు. భారీ నష్టాల్లో రైల్వే కరోనా కారణంగా రూ. 36,000 కోట్ల నష్టం వాటిల్లిందంటూ రైల్వేశాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ దన్వే అన్నారు. ముఖ్యంగా ప్యాసింజర్ రైళ్ల నడిపించడం ద్వారా రైల్వే ఎక్కువగా నష్టపోతుందంటూ చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలోని జాల్నా స్టేషన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను రైల్వేశాఖ సహాయ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్యాసింజర్ రైళ్ల వల్లే తక్కువ టిక్కెట్ చార్జీలతో ప్యాసింజర్ రైళ్లు నడిపించడం ద్వారా రైల్వే ఎక్కువగా నష్టపోతుందన్నారు. టిక్కెట్ చార్జీలు పెంచితే ప్రజలపై భారం పడుతుందని ఆ పని చేయడం లేదన్నారు. కేవలం గూడ్సు రవాణా ద్వారానే రైల్వేకా ఆదాయం సమకూరుతోందని మంత్రి అన్నారు. దేశ సరకు రవాణాలో గూడ్సు రైళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఇదేం చోద్యం ప్యాసిజంర్ రైళ్ల వల్లే నష్టాలు అంటూ రైల్వేశాఖ సహాయ మంత్రి రావు సాహేబ్ మాటలపై విస్మయం వ్యక్తం అవుతోంది. కరోనా సంక్షోభం తలెత్తిన తర్వాత రైల్వేశాఖ గూడ్సు రవాణాలో వేగం పెరిగిందని చెబుతూనే మళ్లీ నష్టాలేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కరోనా సమయంలో పట్టాలెక్కిన రైళ్లన్నింటీలో సబ్సీడీలు ఎత్తేయడమే కాకుండా స్పెషల్ పేరుతో అధిక ఛార్జీలు బాదుతున్న విషయం రైల్వే మంత్రి మర్చిపోయారా అంటూ నిలదీస్తున్నారు. వేగం పెంచారనే నెపంతో ఆఖరికి ఆర్డినరీ ప్యాసింజర్ రైళ్లకు కూడా ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు వసూలు చేస్తూ ఇప్పుడు నష్టాల పాట పాడటమేంటని రైల్వే ఉద్యోగులు అంటున్నారు. చదవండి : స్థిరాస్తి కొనేటప్పుడు తస్మాత్ జాగ్రత్త.. -
రైల్వే శాఖ మంత్రిని కలిసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలను త్వరితగతిన ప్రారంభించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశారు.ఎంపీ విజయసాయిరెడ్డి సారధ్యంలో పార్టీ ఎంపీలు గురువారం పార్లమెంట్ భవనంలోని కార్యాలయంలో రైల్వే మంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వివిధ రైల్వే ప్రాజెక్ట్‌ల అమలును వేగవంతం చేయాలని కోరుతూ వారంతా సంతకం చేసిన వినతి పత్రాన్ని మంత్రికి అందచేశారు. భేటీలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్ట్‌ల స్థితిగతులను మంత్రికి వివరించారు. రెండేళ్ళయినా రైల్వే జోన్ పట్టాలెక్కలేదు.... ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించి రెండేళ్ళు దాటినా ఇప్పటికీ జోన్ కార్యకలాపాలు ప్రారంభం కాలేదని ఎంపీ విజయసాయిరెడ్డి మంత్రికి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి విస్తరించే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలను ప్రారంభిస్తే ఏటా రమారమి 13 వేల కోట్ల రూపాయల ఆదాయంతో దేశంలోనే అత్యధిక లాభసాటి అయిన జోన్‌గా రాణిస్తుంది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వంటి పోర్టులకు ఈ జోన్ ద్వారా అందించే రైలు రవాణా సేవలు గణనీయంగా మెరుగుపడతాయి. దీని వలన రాష్ట్రంలో వాణిజ్య, పారిశ్రామిక వర్గాలకు ఎంతగానో అవసరమైన రవాణా అవసరాలు నెరవేరతాయి. రైల్వేకి కూడా గణనీయమైన ఆదాయం లభిస్తుందని విజయసాయి రెడ్డి రైల్వే మంత్రికి వివరించారు. అందువలన ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలను త్వరితగతిన ప్రారంభించాలని ఆయన కోరారు. విశాఖ కేంద్రగా వాల్తేరు డివిజన్‌ను కొనసాగించాలి... రైల్వేలో అత్యధిక ఆదాయం వచ్చే డివిజన్లలో విశాఖపట్నం కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్ ఒకటని విజయసాయిరెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దేశంలోని కొన్ని రైల్వే జోన్లకంటే కూడా వాల్తేరు డివిజన్ అత్యధిక ఆదాయం సంపాదిస్తోంది. తూర్పు కోస్తాలో అత్యధిక ఆదాయం గడించే డివిజన్లలో వాల్తేరు డివిజన్‌దే అగ్రస్థానం. నానాటికీ పురోగమిస్తున్న వాల్తేరు డివిజన్‌ను రద్దు చేసి విశాఖపట్నం నగరాన్ని విజయవాడ డివిజన్ కిందకు తీసుకురావాలన్న ఆలోచన ఘోర తప్పిదం అవుతుందని విజయసాయి రెడ్డి రైల్వే మంత్రికి స్పష్టం చేశారు. వాల్తేరు డివిజన్ రద్దు వలన కొత్త సమస్యలు కోరి తెచ్చుకున్నట్లవుతుందని కూడా ఆయన చెప్పారు. వాల్తేరు డివిజన్లో ప్రస్తుతం జరిగే కార్యకలాపాలను విశాఖపట్నం నుంచి 350 కిలోమీటర్ల దూరంలోని విజయవాడ డివిజన్‌కు తరలించడం వలన నిర్వహణా సమస్యలు, డిజాస్టర్ మేనేజ్మెంట్ సమస్యలు ఉత్పన్నమై ప్రమాదాల సమయంలో రైల్వే యంత్రాంగం స్పందించే వేగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. అలాగే విశాఖపట్నంలోని వాల్తేరు డివిజన్లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. కంటైనర్ టెర్మినల్స్, లోకో షెడ్, వాగన్ వర్క్‌షాప్, 2300 మంది సిబ్బందికి సరిపడ స్టాఫ్ క్వార్టర్లు ఉన్నాయి. వాల్తేరు డివిజన్‌ను విశాఖపట్నంలో కొనసాగించడం వల రైల్వే అదనంగా ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి 125 ఏళ్ళనాటి వాల్తేరు డివిజన్‌ను రద్ద చేయడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గాయపరచవద్దని విజయసాయిరెడ్డి రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. మరో 5 విస్టాడోమ్ కోచ్‌లు కేటాయించండి... ప్రకృతి రమణీయ దృశ్యాలతో కనువిందు చేసే బీచ్‌లు, తూర్పు కనుమలు, ఘాట్లు, గుహలతో విశాఖపట్నం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. తూర్పు తీరానికే ఆభరణంగా విరాజిల్లుతున్న విశాఖపట్నంలోని పర్యాటక ప్రాంతాలను ఏటా దేశ విదేశాలకు చెందిన లక్షలాది మంది పర్యాటకులు సందర్శిస్తుంటారని విజయసాయి రెడ్డి రైల్వే మంత్రికి వివరించారు. విశాఖపట్నం నుంచి అరకులోయ మధ్య నడిచే రైలుకు అనుసంధానించిన విస్టాడోమ్ కోచ్‌కు పర్యాటకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు. విస్టాడోమ్కు పర్యాటకుల నుంచి అత్యధిక డిమాండ్ ఉన్నప్పటికీ అదనపు విస్టాడోమ్ కోచ్‌లు ఏర్పాటు చేయడంలో రైల్వే శాఖ విపరీతమైన అలసత్వం ప్రదర్శిస్తోందని విజయసాయిరెడ్డి అన్నారు. అదనపు విస్టాడోమ్ కోచ్‌లు కావాలని గత ఏడాది మార్చిలో రాజ్యసభలో నేను చేసిన విజ్ఞప్తిపై స్పందించిన అప్పటి రైల్వే మంత్రి త్వరలోనే మరిన్ని కోచ్‌లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ విశాఖ-అరకు రైలుకు కేటాయించిన విస్టాడోమ్ కోచ్‌లను ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్న విషయాన్ని ఆయన రైల్వే మంత్రి దృష్టికి తీసుకువస్తూ విశాఖ-అరకు మధ్య నడిచే రైలుకు అదనంగా మరో 5 విస్టాడోమ్ కోచ్‌లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో కంటైనర్ తయారీ విభాగాన్ని నెలకొల్పండి... ఆంధ్రప్రదేశ్‌లో ఒక మేజర్ పోర్ట్, అయిదు సాధారణ పోర్టులు, 10 నోటిఫైడ్ పోర్టులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఏడాదికి 170 మిలియన్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేస్తున్నాయి. గుజరాత్ తర్వాత అత్యధిక కార్గో హ్యాండ్లింగ్ రాష్ట్రంలోని పోర్టులలోనే జరుగుతోంది. రామాయపట్నం పోర్టు నిర్మాణం కూడా పూర్తయితే మరో 15 మిలియన్ టన్నుల కార్గో హ్యాండిల్ చేసే సామర్ధ్యం వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో కంటైనర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం వలన రవాణా ఖర్చుల భారం బాగా తగ్గుతుందని విజయసాయి రెడ్డి అన్నారు. కాబట్టి చిత్తూరు జిల్లా మన్నవరంలో ఉన్న ఎన్టీపీసీ-బీహెచ్ఈఎల్ ఆవరణలో ఈ కంటైనర్ తయారీ విభాగాన్ని నెలకొల్పాలని ఆయన రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలి... రైల్వేలో నియామకాల కోసం దేశంలో 21 ప్రాంతాల్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బోర్డు లేదు. దీని వలన రాష్ట్రానికి చెందిన ఉద్యోగార్ధులు ఆర్ఆర్బీ పరీక్షలు రాయడానికి అటు సికింద్రాబాద్ లేదా భువనేశ్వర్‌కు వెళ్ళాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు ఆవశ్యకత ఉన్నందున దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. అలాగే చాలా కాలంగా సాగుతున్న నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైను నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, కర్నూలులో కోచ్ వర్క్‌షాప్ నెలకొల్పాలని, విజయవాడ-విశాఖపట్నం మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని, తిరుపతి-పాకాల-చిత్తూరు-కట్పడి మధ్య డబుల్ లైన్ నిర్మాణం చేపట్టాలని విజయసాయి రెడ్డి కోరారు. రాజరాజేశ్వరిపేట వాసులకు ఊరట కల్పించండి... విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని రైల్వే భూముల్లో మూడు దశాబ్దాలకు పైగా 800 మంది నిరుపేద కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆక్రమణలో ఉన్న తమ నివాసాలను క్రమబద్ధం చేయాలని ఆయా కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అందువలన ఆ భూమికి బదులుగా అజిత్ సింగ్ నగర్‌లోని రైల్వే భూములకు సమీపంలోనే ఉన్న 25 ఎకరాల భూమిని రైల్వేకి అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి రాజరాజేశ్వరిపేటలోని ఆక్రమిత రైల్వే భూమికి బదులుగా ఈ భూమిని తీసుకునేలా చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందంలో విజయసాయి రెడ్డితోపాటు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్, ఆళ్ళ ఆయోధ్య రామిరెడ్డి, డాక్టర్ బీవీ సత్యవతి, గొడ్డేటి మాధవి, చింతా అనురాధ ఉన్నారు. -
‘భద్రక్-విజయనగరం’ రైల్వే లైన్‌కు కేంద్రం మొండిచేయి?
న్యూఢిల్లీ: భద్రక్-విజయనగరం మధ్య 2015-16 రైల్వే బడ్జెట్లో ప్రతిపాదించిన మూడో రైల్ లైన్ నిర్మాణానికి ఇంకా ఆమోదం పొందలేదని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు శుక్రవారం కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి రూపొందించిన డీపీఆర్ ప్రకారం 385 కిలోమీటర్ల దూరం నిర్మించే ఈ రైలు మార్గం నిర్మాణానికి రూ.3,823 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఇంకా ఆమోదానికి నోచుకోకపోవడంతో కాలయాపన వలన ప్రాజెక్ట్ వ్యయం పెరిగే అవకాశమే లేదని చెప్పారు. -
కూలీలు, చిరువ్యాపారుల నగరబాట
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ల నుంచి అన్‌లాక్ దశ ముమ్మరం కావడంతో స్వస్ధలాలకు తరలిన కార్మికులు, చిరువ్యాపారులు, ట్రేడర్లు తిరిగి నగరాల బాటపడుతున్నారు. రైల్వే ట్రాఫిక్ పెరిగిన తీరు ఈ వివరాలు వెల్లడిస్తోందని రైల్వే సహాయ మంత్రి సురేష్ అంగది పేర్కొన్నారు. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ సమయంలో గ్రామాల బాటపట్టిన కూలీలు, చిరువ్యాపారులు మహా నగరాలకు తిరిగివస్తున్నారని చెప్పారు. ప్రధాన నగరాల్లో సాధారణ పరిస్థితి నెలకొనగానే వారి కుటుంబ సభ్యులు కూడా తిరిగి నగరాలకు చేరకుంటారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతో రైల్వేలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్రాలు కోరితే మరిన్ని రైళ్లను నడుపుతామని, అయితే పలు రాష్ట్రాలు ఇంకా కోవిడ్-19తో పోరాడుతున్నాయని అన్నారు కాగా రైల్వేలు 31 ప్రత్యేక రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లను, 254 స్పెషల్ మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతున్నాయని మంత్రి తెలిపారు. మే 12 నుంచి జులై 17 వరకూ ప్రత్యేక రాజధాని రైళ్లు దాదాపు 12 లక్షల మంది ప్రయాణీకులను గమ్యస్ధానాలకు చేర్చాయని, జూన్ 1 నుంచి జులై 17 మధ్య ఎక్స్‌ప్రెస్ రైళ్లు 1.6 కోట్ల మంది ప్రయాణీకులను గమ్యస్ధానాలకు చేర్చాయని అధికారులు తెలిపారు. ప్రధాన నగరాల నుంచి బయలుదేరే రైళ్లు 80 శాతం ఆక్యుపెన్సీతో వెళ్లగా, తిరుగుప్రయాణంలో 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్నట్టు రైల్వేలు గుర్తించాయని మంత్రి తెలిపారు. దీనిప్రకారం కార్మికులు, చిరువ్యాపారులు కుటుంబ సభ్యులతో కలిసి స్వస్ధలాలకు వెళ్లి తిరిగి ఒంటరిగా నగరాలకు చేరుకుంటున్నట్టు వెల్లడైందన్నారు. చదవండి: నా భర్త వంట చేస్తాడు... తప్పేంటి? అన్‌లాక్ 2.0తో ఢిల్లీలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోగా, వైరస్ తాకిడి తీవ్రంగా ఉన్న ముంబై.. బెంగళూర్‌లో ఆర్థిక కార్యకలాపాలు ముమ్మరం కావాల్సిఉందని చెప్పారు. యూపీ, బిహార్, అసోం, రాజస్ధాన్‌ల నుంచి కార్మికులు నగరాలకు చేరుకుంటున్నారని తెలిపారు. బెంగళూర్‌లో బుధవారం లాక్డౌన్ ముగియనుండటంతో అక్కడ ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్రాల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌తో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం రైల్వేలు తమ సర్వీసులను పునరుద్ధరిస్తాయని మంత్రి సురేష్ అంగడి తెలిపారు. -
న్యూస్ పేపర్‌తో రైలు.. ఆశ్చర్యపోయిన రైల్వే శాఖ
తిరువనంతపురం: కేరళకు చెందిన 12 ఏళ్లు బాలుడు న్యూస్ పేపర్‌తో అచ్చం రైలు నమూనాను తయారు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. లాక్డౌన్లో మెదడుకు పదును పెట్టి తన సృజనాత్మకతను చాటుకుని మాస్టర్‌గా మారాడు. తన టాలెంట్‌తో నెటిజన్లతో పాటు రైల్వే మంత్రిత్వ శాఖను కూడా అబ్బురపరిచిన ఈ బాలుడి పేరు అద్వైత్ కృష్ణ. ఇతడు కేరళలో త్రిస్పూర్‌లోని సీఎన్ఎన్ బాయ్స్ హై స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. మాస్టర్ అద్వైత్ న్యూస్ పేపర్‌తో రైలును తయారు చేస్తున్న వీడియోలను, ఫొటోలను గురువారం రైల్వే మంత్రిత్వ శాఖ తమ అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. (‘ఆ ఉద్యోగులకు భారీగా వేతన పెంపు’) Master Adwaith Krishna, a 12 year old rail enthusiast from Thrissur, Kerala has unleashed his creative streak and has made a captivating train model using newspapers. His near perfection train replica took him just 3 days. pic.twitter.com/H99TeMIOCs — Ministry of Railways (@RailMinIndia) June 25, 2020 ‘12 ఏళ్ల మాస్టర్ అద్వైత్ ఈ రైలును రూపొందించడానికి కేవలం 3 రోజుల సమయం తీసుకున్నాడు. ఇది తయారు చేయడానికి 33 న్యూస్ పేపర్లు, 10 ఎ4(A4) షిట్లు, గ్లూను ఉపయోగించి అచ్చమైన రైలు ప్రతిరూపాన్ని తయారు చేశాడు’ అని రైల్యే శాఖ తన ట్వీట్లో పేర్కొంది. మాస్టర్ అద్వైత్ రైలు ఇంజన్, బోగీలను, ఇతర భాగాలను తయారు చేసి వాటిని అమర్చిన విధానాన్ని ఈ వీడియోలో స్పష్టంగా చూపించారు. కాగా ఈ వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 32 వేలకు పైగా వ్యూస్, వందల్లో లైక్‌లు వచ్చాయి. ‘అద్భుతం’, ‘ఈ బాలుడి తెలివి అందరికి స్ఫూర్తి’, ‘ఇతడికి రైల్వే ఆర్ అండ్ డీలో ఉద్యోగం ఇవ్వండి తన తెలివితో కొత్త టెక్నాలజీని తీసుకువస్తాడు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. (చదువెందుకు..పెళ్లిచేసేయండి అన్నారు!) pic.twitter.com/qRN6WEQ3ms — Ministry of Railways (@RailMinIndia) June 25, 2020 -
మాజీ ప్రధాని, రైల్వే మంత్రికి కరోనా!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే లక్షకుపైగా కరోనా కేసులు నమోదు కాగా తాజాగా మాజీ ప్రధాన మంత్రికి, ప్రస్తుత రైల్వే మంత్రికి కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ రాయబారి మర్యం జౌరంగజేబ్ సోమవారం వెల్లడించారు. (పాక్‌లో లక్షకు చేరువలో కరోనా కేసులు) మాజీ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసి (61) , రైల్వే శాఖా మంత్రి షేక్ రషీద్ అహ్మద్‌కు సోమవారం కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందని జౌరంగజేబ్ తెలిపారు. 2017 ఆగస్టు నుంచి మే 2018 మధ్య నవాబ్‌షరీఫ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అబ్బాసీ ప్రధాన మంత్రిగా వ్యవహరించారు. కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో అబ్బాసీ ఆయన ఇంటిలోనే స్వీయ నిర్భంధంలోకి వెళ్లి పోయారు. రైల్వే మంత్రి షేక్ రషీద్ కూడా కరోనా వైరస్ సోకిందని నిర్థారణ కావడంతో క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. వైద్యుల సలహా మేరకు ఆయన రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉంటారని ఔరంగజేబు తెలిపారు. మరోవైపు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత మాజీ మంత్రి షర్జీల్ మీమొన్‌కు ఆదివారం కరోనా సోకిన సంగతి తెలిసిందే. (రూ. 75 వేలకు ఆర్మీ సమాచారం అమ్మేశారు!) -
అనేకచోట్ల టికెట్ బుకింగ్ కౌంటర్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న 1.7 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లలో శుక్రవారం నుంచి రైలు టికెట్ల బుకింగ్ పునఃప్రారంభం కానుందని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ప్రకటించారు. ఇందులో భాగంగా కంప్యూటర్లు, ఇంటర్నెట్ సరిగ్గా అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లోనూ కామన్ సర్వీస్ సెంటర్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయన్నారు. ప్రత్యేకంగా గుర్తించిన మరికొన్ని రైల్వే స్టేషన్లలోనూ రెండు, మూడు రోజుల్లో టికెట్ బుకింగ్ కౌంటర్లు ప్రారంభం కానున్నాయన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కౌంటర్ల వద్ద జనం గుమికూడరాదన్నదే తమ లక్ష్యమని, ఇందుకు అవసరమైన మరిన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. త్వరలోనే మరిన్ని రైళ్లను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. జూన్ 1వ తేదీ నుంచి నడిచే 200 ఏసీ, నాన్ ఏసీ రైళ్ల కోసం గురువారం బుకింగ్స్ ప్రారంభమైన రెండున్నర గంటల్లోనే 4 లక్షల మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి దాకా 2,050 శ్రామిక్ రైళ్ల ద్వారా 30 లక్షల మంది వలస కార్మికులను స్వస్థలాలకు తరలించినట్లు తెలిపారు. శ్రామిక్ రైళ్ల విషయంలో పశ్చిమబెంగాల్, జార్ఖండ్ ప్రభుత్వాలు సహకరించడం లేదని ఆరోపించారు. అన్ని రాష్ట్రాలు తమ కార్మికులు సొంతూళ్లకు చేరుకునేందుకు సహకరించాలన్నారు. రైల్వే శాఖ ఇప్పటిదాకా 225 స్టేషన్లలో ఉన్న 5 వేల బోగీలను కోవిడ్–19 కేర్ సెంటర్లుగా మార్చిందని తెలిపారు. -
'విశాఖ- బెంగుళూరు రైలును ప్రారంభించండి'
ఢిల్లీ : విశాఖ-బెంగుళూరు మధ్య డైలీ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును ప్రారంభించాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో రైల్వే మంత్రి పియూష్ గోయల్‌కు విజ్ఞప్తిచేశారు. రాజ్యసభలో మంగళవారం రైల్వేల పనితీరుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నం నుంచి బెంగుళూరుకు రోజువారీ నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు కావాలన్నది ఎంతోకాలంగా విశాఖపట్నం ప్రజల కోరిక అని ఆయన చెప్పారు. విశాఖ నుంచి బెంగుళూరుకు ప్రయాణించే ఐటీ నిపుణులకు ఈ రైలు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. అలాగే గతంలో రైల్వే శాఖ ప్రతిపాదించిన విశాఖపట్నం-వారణాసి-అలహాబాద్ రైలు సర్వీసును కూడా త్వరగా ప్రారంభించాలని ఆయన కోరారు. (ఎన్నికల వాయిదాకే గెలిచినట్టు ఫీలవుతున్నారు) ఇటీవల రెఫ్రిజిరేటెడ్ కంటైనర్లు కలిగిన రైలు ద్వారా రాయలసీమలోని తాడిపత్రి నుంచి ముంబైలోని పోర్టుకు అరటి పండ్ల రవాణా కోసం ప్రత్యేకంగా నడిపిన రైలు విజయవంతం అయిందని పేర్కొన్నారు. పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందిన రాయలసీమ ప్రాంతం నుంచి ముంబైకు ఈ తరహా ప్రత్యేక రైళ్ళను మరిన్నింటిని అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే మంత్రిని కోరారు. అలాగే ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో కిసాన్ రైలు సర్వీసును ప్రారంభిస్తామన్న ఆర్థిక మంత్రి హామీని ఆచరణలోకి తీసురావడం ద్వారా అటు రైల్వేలకు ఇటు రైతులకు కూడా ఆదాయపరంగా లాభదాయకంగా ఉంటుందని తెలిపారు.గత ఏడాది డిసెంబర్ 2న రైల్వేల ఆర్థిక పరిస్థితిపై కాగ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నివేదిక ఆందోళకరంగా ఉందని ఆయన అన్నారు. 2017-18లో రైల్వేల ఆపరేటింగ్ రేషియో 98.44 శాతంగా నమోదైంది. అలాగే 2016-17లో రైల్వేల రెవెన్యూ మిగులు కూడా గణనీయంగా తగ్గిపోయింది. నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడు కావడం, ఇతర ఆదాయ మార్గాలు కుంచించుకుపోవడం, సిబ్బంది జీతభత్యాలు, పెన్షన్ చెల్లింపులు వగైరా కారణాలతో రెవెన్యూ మిగులు క్షీణించిపోతున్నట్లుగా కాగ్ నివేదిక వెల్లడించింది. వివిధ వర్గాలకు ఇచ్చే పాస్‌లు, రాయితీలను ఎల్పీజీ లబ్దిదారులకు చెల్లిస్తున్న మాదిరిగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌పై దృష్టి సారించాలన్నారు. అర్హులైన లబ్దిదారులకు మాత్రమే ప్రయోజనం కల్పించి రెవెన్యూ నష్టాలను తగ్గించుకోవాలని ఆయన సూచించారు. రైల్వేలలో ఇటీవల కాలంలో ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి అనేక చర్యలు చేపట్టినందుకు రైల్వే మంత్రి పియూష్ గోయల్‌ను అభినందించారు.(ఏపీలో సోలార్ ఛర్ఖా క్లస్టర్) -
దక్షిణాదిపై చిన్నచూపు లేదు: కేంద్ర మంత్రి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మంగళవారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆనాడు పోరాటం చేశామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ అందరి కోసం పని చేస్తానని మాట ఇచ్చారని, దానికి కట్టుబడి పని చేస్తున్నామని తెలిపారు. దక్షిణ భారత్‌ను నిర్లక్ష్యం చేశారనడం అవాస్తవమన్నారు. ‘కాంగ్రెస్ హయాంలోనే సౌత్ సెంట్రల్ రైల్వేను నిర్లక్ష్యం చేశారు. ప్రధాని మోదీకి దేశమంతా ఒక్కటే, రూ.258 కోట్లు గతంలో ఇచ్చారు. కానీ ఇప్పటి బడ్జెట్లో పదింతలు ఎక్కువ నిధులు ఇచ్చాం. కేంద్రం ఎంత ఇచ్చిందో నా దగ్గర పూర్తి లెక్కలు ఉన్నాయని’ వివరించారు. రూ.258 కోట్లతో తెలంగాణలో రైలు మార్గాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. 2008లో ప్రారంభించిన పెండింగ్ పనులు అన్ని పూర్తి చేశామన్నారు. ఎంఎంటీఎస్ కోసం 500 కోట్లు కేంద్రం ఇచ్చిందని.. రాష్ట్రం ఇంకా డబ్బులు ఇవ్వలేదని..అది ఇస్తే పనులు పూర్తవుతాయన్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఆగదలేదని ఆయన తెలిపారు. ఎంఎంటీఎస్, సబ్బరన్ రైళ్ల సంఖ్య పెంచాలి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ప్రధాన సమస్య అని..సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి వేల మంది ప్రయాణిస్తారని..చర్లపల్లి రైల్వేస్టేషన్ వద్ద శాటిలైట్ టర్మినల్ ఏర్పాటుతో రద్దీ భారం తగ్గుందన్నారు. ఎంఎంటీఎస్, సబ్బరన్ రైళ్ల సంఖ్య పెంచాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రిని ఆయన కోరారు. యాద్రాది వరకు ఎంఎంటీస్‌పై కేంద్రం దృష్టిపెడితే రైల్వే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు. 427 రైల్వేస్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వైపై సౌకర్యం కల్పించడం మంచి పరిణామం అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపాలి.. సౌత్ సెంట్రల్ రైల్వే అభివృద్ధి విషయంలో కేంద్రం ప్రతిసారి నిర్లక్ష్యం చూపుతోందని..ఇప్పటికైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎన్నో పనులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ ను ఘట్కేసర్ వరకు పొడిగించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. -
రైల్వేకు నష్టం చేస్తే ‘కనిపిస్తే కాల్చివేత’!
బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో.. రైల్వే ఆస్తులను ధ్వంసం చేసేవారిపై ‘కనిపిస్తే కాల్చివేత’ ఆదేశాలు జారీ చేస్తామని రైల్వే శాఖ సహాయమంత్రి సురేశ్ అంగడి హెచ్చరించారు. ‘ఎవరైనా రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తే, వారిపై.. హైదరాబాద్ విలీనం సమయంలో సర్దార్ వల్లభాయి పటేల్ చేపట్టిన స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతాం’ అన్నారు. కఠిన చర్యలు అంటే కనిపిస్తే కాల్చివేతనే అని పేర్కొన్నారు. -
ప్రైవేట్ కాదు... ఔట్ సోర్సింగే
న్యూఢిల్లీ: రైల్వేలను ప్రైవేటీకరించబోవడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రయాణికులకు మెరుగైన సేవల్ని అందించడం ప్రైవేటు వ్యక్తులకు ఔట్‌సోర్సింగ్‌కు ఇస్తున్నట్టుగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. శుక్రవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. భారీ స్థాయిలో రైల్వేలను ప్రైవేటీకరించే ఉద్దేశమే లేదన్నారు. ప్రైవేటు వ్యక్తులకు రైళ్లను నడిపే బాధ్యతలు అప్పగిస్తామని వాటి భద్రతపై కేంద్రానిదే బాధ్యతని స్పష్టం చేశారు. లక్నో–ఢిల్లీ మధ్య నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించి రైల్వే ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్ వ్యవస్థ ఐఆర్సీటీసీ, దానికి అనుబంధంగా ఉన్న టూరిజం, కేటరింగ్ వంటివన్నీ ప్రైవేటు వ్యక్తులకు ప్రయోగాత్మకంగా అప్పగించిన విషయం తెలిసిందే. ఇటీవల నీతి ఆయోగ్ ఆదేశాల మేరకు ప్రభుత్వం 150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్లను నడపడానికి పరిమిత కాలానికి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి సిద్ధమైంది. 12 ఏళ్లలో రూ.50 లక్షల కోట్లు ఖర్చు రైల్వే వ్యవస్థను సజావుగా నడపాలంటే వచ్చే 12 ఏళ్లలో రూ. 50 లక్షల కోట్లు అవసరం ఉంటుందని, అంత బడ్జెట్ కేటాయించడానికి పరిమితులుంటాయని గోయల్ అన్నారు. ప్రయాణికులకు అత్యంత ఆధునిక సౌకర్యాలు కల్పించడమే కేంద్రం లక్ష్యం. .కానీ రైల్వేల భద్రత అంతా కేంద్రం చేతుల్లోనే ఉంటుందని వివరించారు. ప్రైవేటు పెట్టుబడులు మంచివే.. రైలు ప్రయాణికుల సంఖ్య పెరిగిపోతోందని వారందరికీ సదుపాయాలు కల్పించాలంటే కొత్త రైళ్లు నడపాలని, లైన్లు వేయా లని, ఇదంతా కేంద్ర ప్రభుత్వానికి శక్తికి మించిన భారమని గోయల్ అన్నారు. రైల్వే వ్యవస్థలో ప్రైవేటు వ్యక్తులెవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే మంచిదేనన్నారు. -
భారత్-పాక్ యుద్ధం ఖాయం, ఇదే చివరిది కూడా!
ఇస్లామాబాద్: దాయాది దేశాల మధ్య ఒక వైపు తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే పాకిస్తాన్ పదే పదే కయ్యానికి కాలుదువ్వుతోంది. తాజాగా పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్-భారత్ మధ్య అక్టోబర్-నవంబర్ మధ్య యుద్ధం రానుందంటూ వ్యాఖ్యానించారు. మరో స్వాతంత్ర్య యుద్ధం జరగనుందంటూ ప్రమాదకర వ్యాఖ్యలు చేసారు. రావల్పిండిలో బుధవారం మీడియాను ఉద్దేశించి షేక్ రషీద్ మాట్లాడుతూ "కశ్మీర్ తుది స్వాతంత్ర్య పోరాటానికి సమయం ఆసన్నమైంది" పేర్కొన్నారు. అంతేకాదు భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటికే పది యుద్ధాలు జరిగాయి.. కానీ ఇదే చివరి యుద్ధమని కూడా ప్రకటించారు. పనిలో పనిగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై నిప్పులు చెరిగారు. అనాగరిక, ఫాసిస్ట్ నరేంద్ర మోదీనే కశ్మీర్ విధ్వంసానికి కారణమని ధ్వజమెత్తారు. పాకిస్తాన్ మాత్రమే మోదీ కళ్లముందు కనిపిస్తోందనీ, ఈ సమస్యపై మిగతా ముస్లిం ప్రపంచం ఎందుకు మౌనంగా ఉందని షేక్ రషీద్ ప్రశ్నించారు. కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితి తీవ్రంగా పరిగణించలేదని పేర్కొన్న ఆయన ప్రజాభిప్రాయ సేకరణకు పిలుపు నిచ్చారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్ఎస్సి) ఈ సమస్యను నిజంగా పరిష్కరించాలనుకుంటే ఇప్పటికే కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగేదని వ్యాఖ్యానించారు. తమ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఈ విషయాన్ని సెప్టెంబర్‌లో మరోసారి ఐరాస సర్వసభ్య సమావేశానికి తీసుకువెళతారన్నారు. (చదవండి: భారత్‌తో అణు యుద్ధానికైనా రెడీ) شیخ رشید نے نومبر دسمبر میں پاک بھارت جنگ کا خدشہ ظاہر کردیاhttps://t.co/DXu35qUgMH https://t.co/LBdFSrPy50https://t.co/pHWrgEi8euhttps://t.co/wE5bEF66OK#Newsonepk #Islamabad #RailwaysMinister #SheikhRashid #India #Pak #War #November #December pic.twitter.com/onlwibk1xC — Newsonepk (@newsonepk) August 28, 2019 -
రైల్వే భద్రతకు ‘కోరాస్’
న్యూఢిల్లీ: రైళ్ల భద్రత కోసం ఇకపై కమాండోలు రంగంలోకి దిగనున్నారు. కమాండోస్ ఫర్ రైల్వే సేఫ్టీ (కోరాస్) యూనిట్‌ను రైల్వే మంత్రి గోయల్ బుధవారం ప్రారంభించారు. కోరాస్ కమెండోలకు అంతర్జాతీయ శిక్షణ ఇవ్వాల్సిందిగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)కు సూచించినట్లు తెలిపారు. కోరాస్ యూనిట్‌ను మొదట ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో మోహరించనున్నట్లు వెల్లడించారు. కశ్మీర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలు, తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా ఉండే ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బెంగాల్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కమాండోలు భవిష్యత్‌లో సేవలు అందించనున్నట్లు తెలిపారు. రైల్వేలకు నష్టం, అంతరాయం, రైళ్లపై దాడి, హైజాక్, విపత్తులకు సంబంధించిన ఏ పరిస్థితుల్లో అయినా కమాండోలు సేవలు అందిస్తారని ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అరుణ్‌కుమార్ తెలిపారు. -
ప్యాసింజర్ రైలును పునరుద్ధరించాలి
ఇల్లెందు/కొత్తగూడెంఅర్బన్: ఇల్లెందు ప్యాసింజర్ రైలును పునరుద్ధరించాలని కోరుతూ కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ను మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కలిసి వినతిపత్రం అందజేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలోని రైల్వేశాఖ కార్యాలయంలో మంత్రిని కలిసిన ఆమె.. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రైల్వే సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇల్లెందుకు ప్యాసింజర్ రైలు పునరుద్ధరణ కోసం స్థానిక ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ రెండు నెలలుగా కేంద్ర రైల్వే శాఖ దృష్టికి వినతిపత్రాలు అందించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోరిక మేరకు ఎంపీ కవిత కూడా సమస్యను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇల్లెందు నుంచి డోర్నకల్ జంక్షన్‌ను కలుపుతూ గతంలో కొనసాగిన రైలును పునరుద్ధరిస్తే ఈ ప్రాంత ప్రజలు కొత్తగూడెం, మణుగూరు, విజయవాడ, హైదరాబాద్, కాజీపేట, వరంగల్, బెల్లంపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుందని మంత్రికి వివరించారు. అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చిపోయే భక్తుల కోసం రైలు సౌకర్యం కల్పించాలని విన్నవించారు. దీనికి మంత్రి పీయూష్‌గోయల్ స్పందిస్తూ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని కవిత తెలిపారు. -
రైల్వేలను ప్రైవేటీకరించం కానీ..
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వేలను ప్రైవేటీకరించమని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా నూతన రైల్వే లైన్లు, ప్రాజెక్టులకు పెట్టుబడులను ఆహ్వానిస్తామని చెప్పారు. గోయల్ శుక్రవారం లోక్‌సభలో మాట్లాడుతూ రైల్వేల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కొన్ని యూనిట్ల కార్పొరేటీకరణకూ చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. గతంలో రైల్వే బడ్జెట్లలో రాజకీయ ప్రయోజనాల కోసం నూతన రైళ్లపై ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు గుప్పించేవారని మండిపడ్డారు. రాయ్‌బరేలిలోని మోడరన్ కోచ్ ఫ్యాక్టరీలో కాంగ్రెస్ హయాంలో ఉత్పత్తి ప్రారంభం కాలేదని, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2014 ఆగస్ట్‌లో తొలి కోచ్ తయారైందని చెప్పుకొచ్చారు. విజేతలు లక్ష్యం దిశగా దూసుకుపోవడంపైనే దృష్టిసారిస్తారని, పరాజితులు కష్టాలను చూసి డీలాపడతారని వ్యాఖ్యానించారు. -
విశాఖ కేంద్రంగా రైల్వేజోన్.. కేంద్రం కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న విశాఖ రైల్వే జోన్‌కు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. విశాఖ కేంద్రంలో నూతన రైల్వేజోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని షెడ్యూల్ 13 ఎనిమిదో ఆర్టికల్ ప్రకారం విశాఖ కేంద్రంగా సౌత్‌కోస్ట్ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. గుంటూరు, విజయవాడ, గుంతకుల్లు డివిజన్లతో నూతన జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతమున్న వాల్తేరు డివిజన్‌ను రెండు భాగాలుగా విభజించనున్నారు. పూర్తి వివరాలను రైల్వేశాఖ అధికారులతో చర్చించిన అనంతరం వెల్లడిస్తామని గోయల్ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఈమేరకు రైల్వేజోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 1న విశాఖ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో రెండురోజుల ముందు కేంద్ర ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. కాగా విశాఖ రైల్వే జోన్ ప్రకటనతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికను కేంద్ర ప్రభుత్వం తీర్చినట్లయ్యింది. కాగా గత నాలుగేళ్లుగా విశాఖ రైల్వేజోన్ కోసం వైఎస్సార్సీపీ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఫలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాటం.. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వాలనీ, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పోరాటానికి ఎట్టకేలకు ఫలితం దక్కింది. వీటీపై ఆయన పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఏపీ కేంద్రంగా వైఎస్సార్సీపీ అనేక ఉద్యమాలను చేపట్టింది. పార్లమెంట్ వేదికగా పార్టీ ఎంపీలు చేసిన కృషికి ఫలితంగా.. విశాఖ రైల్వే జోన్ ప్రకటిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జోన్ ప్రకటనపై పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. -
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా వస్తున్న ట్రైన్ 18
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి వారణాసి వరకూ నడిచే అత్యాధునిక హైస్పీడ్ ట్రైన్ 18 పేరును వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా నిర్ణయించినట్టు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. దేశీయ పరిజ్ఞానంతో భారత ఇంజనీర్లు రూపొందించిన ఈ రైలు మేక్ ఇన్ ఇండియా కింద ప్రపంచ స్ధాయి రైళ్ల నిర్మాణం మనకు సాధ్యమవుతుందనేందుకు నిదర్శనమని ఈ సందర్భంగా పీయూష్ గోయల్ పేర్కొన్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 16 కోచ్‌ల ఈ ట్రైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలును రూ 97 కోట్ల వ్యయంతో రాయ్‌బరేలిలోని మోడ్రన్ కోచ్ ఫ్యాకర్టీ 18 నెలల పాటు శ్రమించి పట్టాలపైకి ఎక్కించనుంది. 30 సంవత్సరాల కిందట ప్రారంభించిన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ వారసత్వానికి కొనసాగింపుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను భావిస్తున్నారు. పూర్తి ఏసీ సదుపాయం కలిగిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ దేశంలోనే తొలి ఇంజన్ రహిత రైలుగా గుర్తింపు పొందనుంది. రెండు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లుండే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కాన్పూర్, అలహాబాద్లలో ఆగుతుంది. -
రైళ్లలో బిల్లు ఇవ్వకుంటే భోజనం ఫ్రీ
న్యూఢిల్లీ: రైళ్లలో ఇకపై ఆహారపదార్థాల జాబితాను ధరలతో సహా రైళ్లలో ప్రదర్శించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ‘బిల్లు ఇవ్వకుంటే మీ భోజనం ఉచితమే. దయచేసి టిప్ ఇవ్వకండి’ అనే సందేశాన్ని టిన్ ప్లేట్లపై ముద్రించనున్నారు. రైల్వేమంత్రి గోయల్ అధ్యక్షతన రైల్వేబోర్డు, జోనల్ మేనేజర్లు, డివిజినల్ మేనేజర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రైళ్లలో అన్ని సాధారణ ఫిర్యాదుల కోసం ఒకే హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని గోయల్ అన్నారు. ప్రస్తుతం 723 స్టేషన్లకున్న ఉచిత వైఫై సౌకర్యాన్ని 2వేల స్టేషన్లకు విస్తరించాలని ఆదేశించారు. ఈ ఏడాది మార్చికల్లా రైళ్లలో కేటరింగ్ సిబ్బందికి పాయింట్ ఆఫ్ సేల్(పీవోఎస్)యంత్రాలను అందిస్తామని వెల్లడించారు. -
ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వండి: ఈటల
సాక్షి, న్యూఢిల్లీ: పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రాష్ట్రంలో హాల్టింగ్ సదుపాయం కల్పించాలని కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్‌ను మంత్రి ఈటల రాజేందర్ కోరారు. ఈటల నేతృత్వంలోని ఎంపీలు వినోద్ కుమార్, కొండా విశ్వేశ్వరరెడ్డి బృందం సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముంబై–నిజామాబాద్ రైలును కరీంనగర్ వరకు పొడిగించాలని వినతిపత్రాన్ని అందజేశారు. అంతేకాకుండా కాగజ్‌నగర్–సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌కు ఉప్పల్‌లో, ఇంటర్సిటీ, పట్నా ఎక్స్‌ప్రెస్‌కు జమ్మికుంటలో హాల్టింగ్ ఇవ్వాలని కోరారు. మరోవైపు రాష్ట్రంలో చేపడుతున్న ఫ్లైఓవర్ల నిర్మాణాలకు రైల్వే శాఖ నుంచి రావాల్సిన అనుమతులను త్వరగా మంజూరు చేయాలని ఈటల కోరారు. -
వందేళ్లు నిండినవి 37 వేలు
న్యూఢిల్లీ : వందేళ్లు దాటిని రైలు బ్రిడ్జ్‌లు దేశంలో 37వేలు ఉన్నాయని, వీటలో 32శాతం ఉత్తర రైల్వే జోన్ పరిధిలోనే ఉన్నట్లు రాష్ట్ర రైళ్లశాఖ మంత్రి రాజెన్ గోహెయిన్ ప్రకటించారు. మొత్తం 37,162 బ్రిడ్జ్‌ల్లో ఉత్తర రైల్వే జోన్లో 8,691, సెంట్రల్ జోన్లో 4,710, తూర్పు జోన్లో 3,119, దక్షిణ సెంట్రల్ జోన్లో3,040, పశ్చిమ జోన్లో 2,858 బ్రిడ్జ్‌లు ఉన్నట్లు లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో వెల్లడించారు. రాజెన్ గోహెయిన్ మాట్లాడుతూ ‘వందేళ్లు పూర్తయినప్పటికి ఈ బ్రిడ్జ్‌లు మంచి స్థితిలోనే ఉన్నాయి. వీటిని పర్యవేక్షించడానికి ఆధునాతన సాంకేతికను వాడుతున్నాం. ప్రతి సంవత్సరం వర్ష కాలనికి ముందు ఒకసారి, తరువాత ఒకసారి పరిక్షిస్తాం. అవసరమయిన చోట ఈ బ్రిడ్జ్‌లకు మరమ్మత్తులు కూడా చేస్తాం. ఆ సమయంలో రైళ్ల వేగాన్ని తగ్గిస్తాం. గత 5 సంవత్సరాలలో 3,675 బ్రిడ్జ్‌లకు మరమత్తులు చేశారు. ఏప్రిల్1, 2017నాటికి 3,017 బ్రిడ్జ్‌ల మరమత్తులకు అనుమతించినట్టు’తెలిపారు. 2017, అక్టోబరులో దేశంలో మరమత్తుల అవసరం వున్న రైలు బ్రిడ్జ్‌లు సమాచారాన్నిఇవ్వాల్సిందిగా రైల్వేబోర్డు ఆదేశాలు జారీ చేసింది. క్షీణ స్థితిలో ఉన్న 252 బ్రిడ్జ్‌ల మీద రైళ్లు నిత్యం ప్రయాణిస్తున్నాయని, ఇది ప్రమాదకరం అని తెలిపింది. రైలు బ్రిడ్జ్‌లు నాణ్యతకు సంబంధించి మూడు రకాల రేటింగ్లను పాటిస్తారు. దీన్ని ఒవర్ ఆల్ రేటింగ్ (ఓఆర్ఎన్) 1, 2, 3గా విభజించారు. ఓఆర్ఎన్ - 1ఉన్న బ్రిడ్జ్‌లకు తక్షణ మరమత్తులు అవసరం. ఓఆర్ఎన్ - 2 ఉన్న బ్రిడ్జ్‌లను ప్రణాళి ప్రకారం మరమత్తులు చేయాలి. ఓఆర్ఎన్ - 3 ఉన్న బ్రిడ్జ్‌లకు ప్రత్యేక మరమత్తులు అవసరం ఉన్నట్టు అర్థం. -
హై స్పీడ్ ట్రైన్...అదిరే ఫీచర్స్
ముంబై : భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ప్రాజేక్టుల్లో బుల్లెట్ ట్రైన్ ఒకటి. జపాన్ సహకారంతో ముంబాయి-అహ్మదాబాద్‌ల మధ్య రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌లో ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ వారి అధ్వర్యంలో బంద్రా కుర్ల కాంప్లెక్స్ (బీకేసీ) నుంచి నవంబర్‌లో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టు కోసం 108 గ్రామాలలోని 10వేల మంది నుంచి భూమిని సేకరించారు. ముంబాయి-అహ్మదాబాద్‌ల మధ్య 508 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,10,000 కోట్లు కాగా ఆ మొత్తంలో 88వేల కోట్లను 0.1శాతం వడ్డీతో జపాన్ నుంచి అప్పుగా తీసుకోనున్నారు. ఈ మొత్తాన్ని 50 సంవత్సరాలలోపు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంత భారీ వ్యయంతో చేపడుతున్న ఈ బుల్లెట్ ట్రైన్లో సదుపాయాలు కూడా ఆ విధంగానే ఉండబోతున్నాయని రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న రైళ్లలోకంటే అత్యాధునిక సాంకేతికతను బుల్లేట్ రైలులో వినియోగించనున్నారు. తిరిగే కుర్చీలు, కాఫీ మేకర్స్‌తో పాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 508 కి.మీ మార్గంలో 468 కి.మీ ఎత్తైన ట్రాక్ మార్గం, 27కి.మీ సొరంగ మార్గం, 13కి.మీ మైదాన ప్రాంతంలో నిర్మించనున్నారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ రైలు దేశంలోనే పెద్దదైన సొరంగం గుండా 21కి.మీ దూరం ప్రయాణిస్తుంది. మరో 7కిలోమీటర్లు సముద్రం గుండా ప్రయాణిస్తుంది. ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్‌లను కలుపుకుని 12 స్టేషన్లను ప్రతిపాదించారు. జపాన్ టెక్నాలజీతో నిర్మితం కానున్న ఈ బుల్లెట్ ట్రైన్ గంటకు 300కిమీ వేగంతో ప్రయాణించిప్పటికి కుదుపులు ఉండవని, నిలబడి కూడా హాయిగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ బుల్లెట్ ట్రైన్లో 10కార్లు (కోచ్‌లు) ఉంటాయని తెలిపారు. 2033 వరకూ మరో 6కార్లను అదనంగా వీటికి జత చేయనున్నారు. ప్రసుతం ఉన్న కార్లలో 750 సీట్లు ఉంటాయని, భవిష్యత్తులో వీటి సంఖ్యను 1250కి పెంచనున్నట్లు తెలిపారు. ప్రయాణ చార్జీలు బీకేసీ నుంచి థానే వరకూ రూ.250గా, బీకేసీ నుంచి విరార్ వరకూ రూ.500గా, బీకేసీ నుంచి బోయిసర్ వరకూ రూ.750గా నిర్ణయించారు. ప్రస్తుతం ఉండబోయే 10కార్లలో ఒకటి బిజినెస్ క్లాస్ కాగా మిగితావి జనరల్ కంపార్ట్మెంట్స్. ముంబాయి - అహ్మదాబాద్ మధ్య ప్రతిరోజు 40వేల మంది బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించవచ్చని అంచనా. బుల్లెట్ ట్రైన్‌ను చేరుకునేందుకు 14వేల మంది తమ సొంత వాహనాలను, 6500మంది విమానం ద్వారా, మిగితావారు ఇతర రైలు మార్గాల ద్వారా చేరుకోనున్నట్లు భావిస్తున్నారు. ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు 2023 వరకూ పూర్తి కానున్నట్లు అధికారులు తెలపగా, రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ మాత్రం 2022, ఆగస్ట్ 15నాటికి పూర్తి చేస్తానని ప్రకటించారు. -
కేంద్ర రైల్వేశాఖ మంత్రితో ఒంగోలు ఎంపీ భేటీ
ఒంగోలు: కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం మరోమారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అన్నవరప్పాడు గుడిసెవాసుల సంఘం సమస్యను చర్చించారు. 1927 నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద ప్రజానీకం చిన్న చిన్న నివాసాలు ఏర్పాటుచేసుకొని జీవిస్తున్నారన్నారు. ఎప్పటినుంచో అక్కడ నివాసం ఉంటున్నవారిని రైల్వే అ«థారిటీవారు వెళ్లిపొమ్మనడం అన్యాయమన్నారు. వారు అతికష్టం మీద ఇప్పటికే రైల్వే వర్గాలకు కోటిరూపాయలకు పైగా డబ్బు చెల్లించారన్నారు. కానీ ఇప్పటి మార్కెట్ రేటు ప్రకారం పాతిక కోట్లు వరకు చెల్లించాలనడం భావ్యం కాదన్నారు. పేద ప్రజలకు అనుగుణంగా వారి విజ్ఞప్తి మేరకు తక్షణమే ఆ స్థలాలు వారికి కేటాయించి సమస్య పరిష్కరించి పట్టాలు అందజేయాలన్నారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ ఈనెల 21వ తేదీ వారందరితో సమావేశం ఏర్పాటు చేశారని, కేంద్రమంత్రిగా మీరు చొరవ తీసుకొని రైల్వే జీఎం, రైల్వే బోర్డు, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరారు. సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. -
పార్లమెంటు చట్టాన్ని గౌరవించండి: కొణతాల
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రం రెండుగా చీలిపోయాక ఆంధ్రప్రదేశ్‌కి ఇస్తామన్న రైల్వే జోన్, ప్రత్యేక హోదా హామీలను బీజేపీ నెరవేర్చాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్, మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ శుక్రవారం రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్‌ను కోరారు. ఆయన రైల్వే మంత్రికి రాసిన సుదీర్ఘ లేఖలో ప్రస్తుత బడ్జెట్లోనైనా విశాఖరైల్వే జోన్‌ను ప్రకటించాలని విన్నవించారు. పార్లమెంటులో చట్టం చేసిన తర్వాత కూడా విశాఖ రైల్వే జోన్ అంశం కాగితాలకే పరిమితం కావడం బాధాకరమన్నారు. ఈ విషయమై మాజీ రైల్వే మంత్రి సురేష్ ప్రభుకి రెండు సార్లు అర్జీ పెట్టుకున్నా.. ఫలితం లేకుంగా పోయిందని తెలిపారు. ‘ఏపీ రీ-ఆర్గనైజేషన్ బిల్లు, 2014 లోని షెడ్యూల్ 3 అవశేష ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతులను కల్సిస్తామని తెలిపింది. దాంట్లో భాగంగానే ఆరు నెలల్లోగా కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న దక్షిణమధ్య రైల్వే జోన్ తెలంగాణకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలకు రైల్వే జోన్ ఏర్పాటు అనివార్యం అయినందున వెంటనే స్పందించండి’ అని లేఖలో రామకృష్ణ పేర్కొన్నారు. హామీల అమలుకు దిక్కు లేదు.. రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరమైన అన్ని మౌలికాంశాలు విశాఖపట్నం కలిగివుందని కొణతాల అన్నారు. 1052 కి.మీ. రైల్వే లైన్ వున్న ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన రైల్వేజోన్ ఏర్పాటు కొన్ని రాజకీయ కారణాలతోనే జాప్యం అవుతోందని ఆయన విమర్శించారు. ఆదాయార్జనలో దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్న వాల్తేర్ డివిజన్ ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం మరో విశేషమని అన్నారు. ఆర్థికాభివృద్ధి దిశగా సాగుతున్న దేశంలో న్యాయమైన తమ వంతు వాటాకోసం ఉత్తరాంధ్ర ప్రజానీకం కోరుకుంటోందని.. విశాఖ పట్నం హెడ్ క్వార్టర్స్‌గా రైల్వే జోన్ ఏర్పాటుతో వారి కలలను నిజం చేయాలని విఙ్ఞప్తి చేశారు. ఏపీ రీ-ఆర్గనైజేషన్ బిల్లులో రాష్ట్రం విడిపోయాక ఆరు నెలల కాలంలోనే రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తామన్న కేంద్రం ఆ దిశగా అడుగులేయక పోవడం శోచనీయమన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేజీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రైల్వే జోన్‌ను చేర్చారని గుర్తు చేశారు. పార్లమెంటు హామీలు కూడా అమలుకు నోచుకోకుంటే ప్రజాస్వామ్యంపై మాకు నమ్మకం పోతుందని నిరసన వెళ్లగక్కారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో చివరి ఈ బడ్జెట్లో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించాలని కోరారు. ఇంకా ఆలస్యం చేసి ప్రజల్లో ఉన్న అసహనాన్ని పెంచొద్దని హెచ్చరించారు. -
పండగ వేళ ఎక్స్ట్రా బాదుడు
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిర్‌లైన్స్ తరహాలో పీక్ సీజన్ సమయంలో అదనపు చార్జీలు వసూలు చేయాలని రైల్వేలు యోచిస్తున్నాయి. పండగ సమయంలోనూ ప్రయాణీకులపై అదనపు చార్జీలు ముక్కుపిండి వసూలు చేసేందుకు కసరత్తు సాగుతోంది. అయితే అదే సమయంలో అన్‌సీజన్‌లో చార్జీల్లో డిస్కౌంట్ ఆఫర్ చేసేందుకూ సన్నద్థమవుతున్నాయి. సీనియర్ రైల్వే అధికారులు, బోర్డు సభ్యులతో ఇటీవల రైల్వే మంత్రి పీయూష్ గోయల్ భేటీ అయిన సందర్భంగా ఈ ప్రతిపాదనపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఎయిర్‌లైన్స్ అనుసరిస్తున్న డైనమిక్ ప్రైసింగ్ విధానం ప్రవేశపెట్టాలని రైల్వే బోర్డు ఈ సమావేశంలో ప్రతిపాదించగా సానుకూల స్పందన వ్యక్తమైందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు అవసరమైన సూచనలతో తూర్పు, పశ్చిమ, పశ్చిమ కేంద్ర రైల్వే జోన్లు సవివర ప్రజెంటేషన్‌తో ముందుకొచ్చాయి. అసౌకర్య వేళల్లో తిరిగే రైళ్లలో ప్రయాణీకులను ఆకర్షించేందుకు చార్జీల్లో భారీ రాయితీలు ఇవ్వాలని జోనల్ అధికారులు సూచించారు. ఖాళీ బెర్త్‌లపై 10 నుంచి 30 శాతం డిస్కౌంట్ ఇవ్వాలనీ అధికారులు సూచించారు.ఇక పీక్ సీజన్, పండుగ వేళల్లో చార్జీలను 10 నుంచి 20 శాతం మేర పెంచాలని పలు జోనల్ అధికారులు ప్రతిపాదించారు. వారాంతాలతో పాటు దీపావళి, దసరా, క్రిస్మస్ వంటి పండుగల సమయంలో అదనపు చార్జీలను వసూలు చేయాలని సూచించారు.హైస్పీడ్ రైళ్లలోనూ ఆ రూట్లోని ఇతర రైళ్లతో పోలిస్తే అదనపు చార్జీలు ఉండాలని ప్రతిపాదించారు. -
కొత్త రైల్వేమంత్రిగా మరో కేంద్ర మంత్రి?
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన రైల్వే ప్రమాదాల నేపథ్యంలో రైల్వేశాఖలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రైల్వే మంత్రిగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీని నియమించే అవకాశం ఉందనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీంతోపాటు రోడ్డు, రైల్వే ,రవాణా శాఖలను కలిపి ఒకటి చేయాలనికూడా ప్రభుత్వం యోచిస్తోందట. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రోడ్డు, రవాణా మంత్రి గా ఉన్న ఆయనకు అదనంగా ఈ బాధ్యతలను కూడా అప్పగించనున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తాజా నివేదికల ప్రకారం సురేష్ ప్రభు రాజీనామాకు ఆమోదం లభిస్తుందనీ, ఆయన స్థానంలో కేంద్ర మంత్రి గడ్కరీ రైల్వేమంత్రి పదవిని చేపట్టనున్నారని తెలుస్తోంది. గత అయిదు రోజుల్లో రెండు బ్యాక్-టు-బ్యాక్ ప్రమాదాల కారణంగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు రాజీనామాకు సిద్ధపడ్డారు. ప్రమాదాలకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దురదృష్టకరమైన ప్రమాదాలు, ప్రయాణీకులు విలువైన జీవితాలను కోల్పోవటం గాయపడటం తనకు చాలా బాధ కలిగించిందంటూ బుధవారం మధ్యాహ్నం రైల్వే మంత్రి వరుస ట్వీట్లలో ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వేల మెరుగుకోసం తన రక్తాన్ని, చెమటను, అంకితం చేశానని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన అభిప్రాయాన్ని తెలిపానన్నారు. అయితే ప్రధాని వేచి వుండమని సూచించినట్టు ట్వీట్ చేశారు. అటు రైల్వే బోర్డు ఛైర్మన్ పదవికి ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఛైర్మన్ అశోక్ లోహానీ నియమితులయ్యారు. ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ రైల్వే బోర్డు ఛైర్మన్ అశోక్ మిట్టల్ స్థానంలో రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో అశ్వని లోహానిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అశ్వని ప్రస్తుతం ఎయిరిండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు కేంద్ర క్యాబినెట్ లో అతి త్వరలోనే భారీ మార్పులు చేర్పులు జరగనున్నాయినే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ముఖ్యంగా తమిళనాడులో పళని స్వామి, పన్నీరు సెల్వం విలీనం తరువాత అన్నాడీఎంకేకు క్యాబినెట్లో బెర్త్ ఖాయం అనే వార్త హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
రైళ్లు ఆలస్యమయ్యాయో.. ఇక అంతే!
రైళ్లు ఆలస్యం అవుతున్నాయంటే పదే పదే ఫిర్యాదులు రావడంతో రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు సీరియస్ అయ్యారు. రైళ్లన్నీ సకాలంలో తిరిగేలా చూసుకోవాలని, లేకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆదేశాలు జారీచేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఒక సీనియర్ అధికారి తప్పనిసరిగా నైట్ షిఫ్టులో ఉండాలని, ఏవైనా సమస్యలుంటే పరిశీలించి వెంటనే వాటిని పరిష్కరించాలని, తద్వారా రైళ్ల రాకపోకల్లో ఆలస్యాన్ని నివారించాలని జోనల్ స్థాయి అధికారులను ఆయన ఆదేశించారు. జాతీయ రైలు విచారణ వ్యవస్థలో ఉన్న సమయాలకు, భారతీయ రైల్వే అధికారిక వెబ్సైట్లలో ఉన్న సమయాలకు మధ్య ఉన్న తేడాలను కూడా సురేష్ ప్రభు గుర్తించారు. ఈ రెండింటికి, రైళ్లు వాస్తవంగా నడుస్తున్న సమయాలకు కూడా తేడా ఉండటం గమనార్హం. ఈ సమస్యను కూడా తక్షణం పరిష్కరించాలని రైల్వే అధికారులను ఆయన ఆదేశించారు. గత సంవత్సరం ఏప్రిల్ 1-16 తేదీల మధ్య రైళ్లు సకాలంలో నడిచే తీరు 84 శాతం వరకు ఉండగా, ఈ సంవత్సరం అది 79 శాతానికి పడిపోయింది. రైళ్లు ఆలస్యం కావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదని, దీన్ని వెంటనే అరికట్టాలని గట్టిగా చెప్పారు. చుట్టుపక్కల డివిజన్లకు చెందిన అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఆలస్యాలను నివారించాలన్నారు. -
రైల్వే ఫ్లెక్సీ–ఫేర్‌కి మరోసారి మార్పులు
న్యూఢిల్లీ: డిమాండ్‌కు అనుగుణంగా చార్జీలు (ఫ్లెక్సీ–ఫేర్) విధానంలో మరోసారి మార్పులు తీసుకురావాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఈ విధానంలో అందుబాటులో ఉన్న సీట్లు చాలా మిగులుతుండటంతో సవరణలు చేయాల్సిందిగా రైల్వే మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. ఈ విధానం ప్రకారం రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో 10 శాతం బెర్తులను ప్రామాణిక ధరలకు కేటాయిస్తారు. ఆ తర్వాత ప్రతి 10 శాతం సీట్లు నిండే కొద్దీ చార్జీ మరో 10 శాతం పెరిగిపోతుంటుంది. ప్రయాణికుల నుంచి స్పందన లేకపోవడంతో గతేడాది డిసెంబరులో రైల్వే శాఖ ఈ విధానానికి తొలిసారి సవరణ చేసి, రిజర్వేషన్ చార్ట్ తయారైన తర్వాత మిగిలిపోయిన బెర్తులను 10 శాతం తక్కువ ధరకే అమ్ముతోంది. ఇక నుంచి 50 శాతం సీట్లను ప్రామాణిక ధరలకు అమ్మాలని చూస్తున్నారు. -
పట్టాలెక్కని టెక్నాలజీ
- మానవ అప్రమత్తతపైనే ఆధారపడ్డ రైల్వే - పట్టా విరిగితే ట్రాక్‌మెన్ గుర్తించాల్సిందే - అత్యాధునిక యంత్రాలకు తీవ్ర కొరత - పట్టాల బిగింపు, కంకర సరిచేసే టాంపింగ్ మెషీన్లూ అరకొరే - దినదినగండంగా రైళ్ల పరుగులు సాక్షి, హైదరాబాద్: ‘రైల్వేలను లాభాల బాట పట్టించటంతోపాటు ప్రమాదరహితంగా మార్చాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి?’ కొద్దిరోజులుగా రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్ల అధికారులను అడుగుతున్న ప్రశ్న ఇది! దీనిపై ఢిల్లీ సూరజ్‌కుండ్‌లో ఓ మేధోమథన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ నెల 18న ప్రారంభమైన ఆ సదస్సు ఆదివారమే ముగిసింది. దీని ప్రారంభ, ముగింపు కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ కూడా హాజరయ్యారు. ఈ సమావేశాలు జరుగుతుండగానే.. దేశంలోనే ఘోర రైలు దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచిపోయే ప్రమాదం యూపీలో చోటుచేసుకుంది!! దేశంలో సురక్షితంగా భావించే రైల్వే జోన్లలో దక్షిణ మధ్య రైల్వే ఒకటి. పట్టాలు విరగటం వల్ల ప్రమాదాలు జరిగిన దాఖలాలు ఇక్కడ అతి తక్కువ. యూపీ ప్రమాదం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. వాటిని పరిశీలిస్తే... పట్టాలపై మరింత జాగ్రత్త పట్టాలు, వాటి దిగువ ఉండే సిమెంట్ స్లీపర్లలో తలెత్తే లోపాలను సాధారణంగా ట్రాక్‌మెన్ సులభంగానే గుర్తిస్తారు. కానీ కొన్నిసార్లు ట్రాక్‌మెన్ పరిశీలించి వెళ్లిన తర్వాత రైలు వచ్చే సమయంలో పట్టా విరిగే అవకాశం ఉంది. దీన్ని నిరోధించటం కష్టంగా మారింది. పట్టా-పట్టాను జోడించే చోట ఉండే జారుుంట్లు ప్రమాదకరంగా మారుతున్నారుు. అలాంటి చోట్ల వెల్డింగ్ చేస్తారు. ఒక్కోసారి ఈ వెల్డింగ్ జారుుంట్లు ఊడిపోరుు పట్టాలు పక్కకు జరిగి రైలు పట్టాలు తప్పే ప్రమాదం ఉంటుంది. ట్రాక్‌మెన్ అప్రమత్తతో వీటిని గుర్తించొచ్చు. కానీ జారుుంట్లలో చిన్న పగుళ్లను వారు గుర్తించటం కష్టమవుతోంది. ఈ పగుళ్లను కూడా గుర్తించేందుకు ప్రత్యేకంగా కొన్ని యంత్రాలుంటారుు. అల్ట్రాసానిక్ టెస్ట్‌ల ద్వారా, రోలింగ్ ఎగ్జామినర్ల ద్వారా వాటిని గుర్తించొచ్చు. కానీ మన వద్ద వాటి వినియోగం చాలా పరిమితంగా ఉంది. కంకర మెషీన్ల కొరత.. రైళ్ల వేగానికి పట్టాల దిగువన ఉన్న కంకర చెదిరిపోతుంది. ఎక్కువగా చెదిరితే అది ప్రమాదకరంగా మారుతుంది. రైలు వేగంగా దూసుకుపోతున్నప్పుడు పట్టాలు, వాటిని పట్టుకుని ఉండే స్లీపర్లపై భారం పడకుండా ఉండేందుకు ఈ కంకర కుషన్ మాదిరిగా ఉపయోగపడుతుంది. కంకర తగ్గితే పట్టాలపై భారం పడి ఏమాత్రం బలహీనంగా ఉన్నా విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కంకర తగ్గితే ఆటోమేటిక్‌గా సరిచేసే టాంపింగ్ మెషీన్‌ను వినియోగిస్తారు. కానీ మన వద్ద ఆ యంత్రాలకూ కొరత ఉంది. దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ సమీపంలోని రాయనపాడు స్టేషన్ వద్ద ట్యాంపింగ్ మెషీన్ డిపో ఉంది. ఇలాంటి డిపోలను మరిన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. వాతావరణ మార్పులూ కీలకమే.. వాతావరణ మార్పులు కూడా పట్టాలపై ప్రభావం చూపుతారుు. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు వేడికి పట్టాలు వ్యాకోచిస్తారుు. చలికి సంకోచిస్తారుు. దీంతో పట్టాల జారుుంట్ల వద్ద మార్పులొస్తారుు. అందుకే జారుుంట్ల వద్ద కొంత గ్యాప్ ఉంచుతారు. చలి పెరిగితే సంకోచం వల్ల ఈ గ్యాప్ మరీ ఎక్కువై చక్రం పట్టాలు తప్పే ప్రమాదం ఉంటుంది. దీన్ని నిరంతరం గమనిస్తూ ఉండాలి. పట్టా జారుుంట్లు, వెల్డింగ్‌లను పరిశీలించేందుకు ప్రతి మూడు నెలలకోమారు వెల్డింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. దీనికి కావాల్సినన్ని అల్ట్రా సోనిక్ పోర్టబుల్ యంత్రాలు మరిన్ని సమకూర్చుకోవాల్సి ఉంది. విద్రోహ చర్యలు.. దేవుడిపైనే భారం రెండు పట్టాల మధ్య దూరం నిర్ధారిత ప్రమాణంలో ఉండాలి. ఇందుకోసం వాటిని దిగువ ఉండే కాంక్రీట్ స్లీపర్లతో కట్టి ఉంచుతారు. బలమైన ఇనుప కడ్డీతో ఈ బంధం ఉంటుంది. కానీ విద్రోహులు వాటికి ఉండే బోల్టులు తొలగిస్తున్నారు. అప్పుడు పట్టా పక్కకు జరిగి బోగీలు పట్టాలు తప్పుతారుు. విద్రోహులు వాటిని విప్పదీయకుండా ఉండే వ్యవస్థ అందుబాటులో లేదు. భారమంతా ట్రాక్మెన్పైనే... నిరంతరం పట్టాలపై గస్తీ తిరిగే ట్రాక్‌మెన్‌ను నమ్ముకునే రైళ్లు పరుగుపెడుతున్నారుు. ప్రతి ఐదారు కిలోమీటర్ల పరిధిలో ఇద్దరు ట్రాక్‌మెన్ ఉంటారు. చెరో చివరి నుంచి పట్టాలను పరిశీలించుకుంటూ మరో చివరకు వెళ్తారు. ఏ చిన్న లోపమున్నా వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తారు. వీరిపై కీ మెన్ వ్యవస్థ, వారిపై ఇన్చార్జిగా గ్యాంగ్మేట్ ఉంటారు. వారిపైన సూపర్వైజర్లు ఉంటారు. ప్రతి ఇరవై, ముప్పై స్టేషన్లకు ఓ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఉంటారు. ఈ వ్యవస్థలు పటిష్టంగానే ఉన్నా ఇవన్నీ మానవ అప్రమత్తతపైనే ఆధారపడుతున్నారుు. ఇందులో మరింత సాంకేతిక పరిజ్ఞానం జోడించాల్సి ఉంది. -
నటి ట్వీట్‌కు స్పందించి మంత్రి సాయం
ముంబై: బాలీవుడ్ నటి రేణుక సహాని చేసిన ట్వీట్‌కు రైల్వే మంత్రి సురేష్ ప్రభు వెంటనే స్పందించారు. అనారోగ్యానికి గురైన రేణుక వదినకు వెంటనే సాయం చేయాల్సిందిగా రైల్వే అధికారులను మంత్రి ఆదేశించారు. రేణుక భర్త అశుతోష్ రాణా సోదరి అయిన కామిని గుప్తా (63) ఢిల్లీ నుంచి ముంబైకి సువిధ ఎక్స్‌ప్రెస్‌లో ఒంటరిగా ప్రయాణిస్తోంది. శనివారం రాత్రి ఆమె రేణుకకు ఫోన్ చేసి, తనకు అస్వస్థతగా ఉందని చెప్పింది. రేణుక వెంటనే రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ట్వీట్ చేసి, సాయం చేయాల్సిందిగా కోరింది. మంత్రి ఆదేశాల మేరకు కొన్ని నిమిషాల్లోనే రైల్వే అధికారులు రేణుకను సంప్రదించి వివరాలు అడిగారు. రైలు రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌కు వెళ్లేసరికి అక్కడ వైద్యులు బృందం సిద్ధంగా ఉన్నారు. ఛాతినొప్పితో బాధపడుతున్న కామినికి వైద్యులు చికిత్స చేశారు. తాను మంత్రికి ట్వీట్ చేసిన తర్వాత కేవలం 15 నిమిషాల్లోపే తన వదినకు వైద్యులు చికిత్స చేశారని రేణుక తెలిపారు. కామిని ఎలాంటి సమస్య లేకుండా ముంబైకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారని చెప్పింది. సమస్యల్లో ఉన్న ప్రయాణికులు ఎవరు ట్వీట్ చేసినా రైల్వే మంత్రి వెంటనే స్పందిస్తారని, వివరాలు తెలుసుకుని సాయం చేయాల్సిందిగా ఆదేశిస్తారని అధికారులు తెలిపారు. -
చుక్..చుక్ బండి.. వచ్చిందండి!
– నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్ ప్రారంభం – నంద్యాల – కడప ప్యాసింజర్ రైలు పరుగులు – నాలుగు దశాబ్దాల కల సాకారం – రైలుకు పెండేకంటి పేరు పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి నంద్యాల: నాలుగు దశాబ్దాల కల సాకారమైంది. కలల బండి పట్టాలెక్కింది. కూ.. చుక్..చుక్ మంటూ నంద్యాల – కడప ప్యాసింజర్ రైలు పరుగులు పరుగులెత్తింది. ఎంతో కాలంగా ఎదురు చూసిన ప్రజలు ఆనందంగా స్వాగతం పలికారు. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ను మంగళవారం విజయవాడ నుంచి వీడియో రిమోట్ లింక్ద్వారా ప్రారంభించారు. వెంటనే ఎంపీ ఎస్పీవైరెడ్డి, ఎమ్మెల్యేలు, రైల్వే అధికారులు జెండా ఊపడంతో డెమో రైలు కడపకు పరుగులు తీసింది. ఈ సందర్భంగా నంద్యాల రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నంద్యాల నుంచి తిరుపతికి రైలును ఏర్పాటు చేయాలని ఎంపీ ఎస్పీవైరెడ్డి కోరారు. తిరుపతికి వెల్లాలంటే రూ.350కి పైగా బస్ చార్జీలను చెల్లించాలని, కాని తక్కువ ధరకు భక్తులు తిరుపతికి వెళ్లి రావచ్చని చెప్పారు. ఈ రైల్వే లైన్‌కు శ్రీకారం చుట్టిన పెండేకంటి వెంకటసుబ్బయ్యకు ఆయన నివాళులు అర్పించారు. నంద్యాల–కడప రైలు పెండేకంటి ప్యాసింజర్ రైలుగా నామకరణం చేయాలని ప్రజా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. – నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి మాట్లాడుతూ రైల్వే లైన్ పూర్తి కావడంతో రవాణా సౌకర్యాలు మెరుగు పడి, అభివద్ధి జరుగుతుందన్నారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉన్న స్థలాల్లో నివాసం ఉన్న పేదలకు ఏడాదిలోగా ప్రత్యామ్నాయం చూపిస్తామని రైల్వే అధికారులు వారిని తొలగించవద్దని కోరారు. – ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ జమ్మలమడుగు, ప్రొద్దుటూరు మధ్య రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. – పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి మాట్లాడుతూ పాణ్యంలో రైల్వే రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలన్నారు. పాణ్యం రైల్వే బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతుండటంతో చుట్టుపక్కల వ్యాపారులు షాపులను మూసుకొని ఉపయోగించకున్నా షాప్‌రూంలకు అద్దెలు చెల్లిస్తూ నష్టపోతున్నారని చెప్పారు. జిందాల్ ఫ్యాక్టరీ రైల్వే స్టేషన్లో లోడింగ్, అన్లోడింగ్ చేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, దూరంగా తరలించాలని కోరారు. – బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ సంజామల రైల్వే స్టేషన్‌కు పెండేకంటి పేరు పెట్టాలని కోరారు. – నూనెపల్లె దళిత వాడ వద్ద ఉన్న రైల్వే స్థలాల్లో నివాసం ఉన్న పేదలపై దయచూపాలని కౌన్సిలర్ అనిల్ అమతరాజ్ రైల్వే అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. – కార్యక్రమంలో రైల్వే డీఆర్ఎం విజయ్‌శర్మ, పలువురు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నంద్యాల - ఎర్రగుంట్ల రైల్వే లైన్ ప్రారంభించిన ప్రభు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. రైలుమార్గం ద్వారా నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రాయలసీమను కలుపుతున్నామన్నారు. మంగళవారం డీఆర్ఎమ్ కార్యాలయంలో కేంద్రమంత్రి సురేష్ ప్రభు... నంద్యాల - ఎర్రగుంట్ల 123 కిలోమీటర్ల రైలుమార్గాన్ని రిమోట్ ద్వారా ప్రారంభించారు. అలాగే నంద్యాల - కడపకు డిమో రైలును సురేష్ ప్రభు, చంద్రబాబుతోపాటు వెంకయ్యనాయుడు ప్రారంభించారు. నంద్యాల - ఎర్రగుంట్ల మార్గం ద్వారా విజయవాడకు నేరుగా రైలు మార్గం ఏర్పడింది. ఈ రైలు మార్గం నిర్మాణానికి రూ. 967 కోట్లు వ్యయం అయింది. -
కేంద్రమంత్రికి స్వాగతం పలికిన మంత్రులు
విజయవాడ : కృష్ణా పుష్కరాలు మంగళవారంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కర స్నానం ఆచరించేందుకు న్యూఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుకు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఆయనకు రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎన్ చినరాజప్ప, మంత్రి కొల్లు రవీంద్ర ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయవాడలో పుష్కరస్నానం ఆచరించేందుకు వీఐపీకి ఘాట్‌కు కేంద్రమంత్రి సురేష్ ప్రభు... మంత్రులతో కలసి పయనమయ్యారు. ఆ తర్వాత సురేష్ ప్రభు... నగరంలోని డీఆర్ఎం కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నంద్యాల - ఎర్రగంట్ల రైల్వే లైన్, నంద్యాల - కడప పాసింజర్ రైలును రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనుల గురించి ఆ శాఖ ఉన్నతాధికారులతో సురేష్ ప్రభు సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం సంగమం వద్ద పుష్కరాల ముగింపు కార్యాక్రమంలో సురేష్ ప్రభు పాల్గొంటారు. -
కలల బండి కదిలివస్తోంది!
– నేడు నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్ ప్రారంభం – నంద్యాలకు వచ్చిన డెమో రైలు – రేపటి నుంచి రైళ్ల రాకపోకలు నంద్యాల: కర్నూలు, వైఎస్సార్ జిల్లా ప్రజలకు శుభవార్త. నాలుగు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ను మంగళవారం ప్రారంభమవుతోంది. బుధవారం నుంచి నంద్యాల–కడప మధ్య రైళ్లు పరిగెత్తనున్నాయి. నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్ పనులు కేంద్ర మాజీ హోంశాఖా మంత్రి పెండేకంటి వెంకటసుబ్బయ్య చొరవతో కార్యరూపం దాల్చాయి. ఎన్నో ప్రభుత్వాలు మారాక పనులు గత నెల పూర్తయ్యాయి. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం దశల వారీగా దాదాపు రూ.650 కోట్లు మంజూరు చేసింది. ప్రతి రైల్వే బడ్జెట్లో రూ.40 నుంచి రూ.60 కోట్లు మంజూరు చేస్తుండటంతో పనులు ముందుకు కదల్లేదు. నరేంద్రమోడీ ప్రభుత్వం పెండింగ్ రైల్వే లైన్లను పూర్తి చేయాలనే లక్ష్యంతో రెండు విడతలుగా రూ.150 కోట్లు మంజూరు చేసింది. 2016 అక్టోబర్ నాటికి పనులు పూర్తి చేయాలని టార్గెట్‌ను నిర్దేశించింది. దీంతో పనులు త్వరితంగా పూర్తయి నిర్ణీత టార్గెట్ కంటే నెల ముందే పూర్తయ్యాయి. దీంతో నంద్యాల–ఎర్రగుంట్ల మార్గంలో రైల్వే రాకపోకలకు క్లియరెన్స్ వచ్చింది. నంద్యాల–కడప మధ్య బుధవారం నుంచి రెగ్యులర్ రైళ్లు తిరగనున్నాయి. విజయవాడ నుంచి రిమోట్‌తో ప్రారంభం నంద్యాల–ఎర్రుగంట్ల రైల్వే లైన్‌ను ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం మధ్యాహ్నం 2.00– 2.03 గంటల మధ్యలో విజయవాడ నుంచి రిమోట్ ద్వారా నంద్యాలలోని రైల్వే లైన్‌ను ప్రారంభించనున్నారు. చెన్నైలో తయారైన డెమో రైలు సోమవారం తెల్లవారుజామున నంద్యాలకు చేరింది. కేంద్ర మంత్రి ప్రారంభించిన అనంతరం రైలు 3.30 గంటలకు కడపకు బయల్దేరుతుంది. ఈ రైలులో 8 క్యాబిన్లు ఉన్నాయి. ఒక్కో క్యాబిన్లో దాదాపు 80మంది కూర్చుకొనే అవకాశం ఉంది. రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారంపై ఈ ప్రారంభోత్సవ వేడుకలను తిలకించడానికి వేదికను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కష్ణమూర్తి, ఇన్చార్జి మంత్రి అచ్చెంన్నాయుడు, ఎంపీలు టీజీ వెంకటేష్, సీఎం రమేష్, ఎస్పీవైరెడ్డి, అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ పుల్లయ్య, జెడ్పీ చైర్మన్ రాజశేఖర్‌గౌడ్, కడప, కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. ఏర్పాట్లను రైల్వే గుంటూరు, గుంతకల్లు డీఆర్ఎంలు విజయశర్మ, గోపినాథ్మాల్య పర్యవేక్షిస్తున్నారు. నంద్యాల–కడప రైలు మార్గం వివరాలు దూరం: 160కి.మీ రైళ్ల వేగం : 42కి.మీ(గంటకు) స్టేషన్లు : నంద్యాల, మద్దూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల, నొస్సం, ఎస్.ఉప్పలపాడు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుడిపాడు, కమలాపురం, గంగాయపల్లె, క్రిష్ణాపురం, కడప నంద్యాల నుంచి వెళ్లే రైళ్ల సమయం.. బనగానపల్లెకు 33 నిమిషాలు, కోవెలకుంట్ల 49 నిమిషాలు, సంజామలకు 60 నిమిషాలు, నొన్సం 1.27 గంటలు, జమ్మలమడుగు 1.51గంటలు, ప్రొద్దుటూరు 2.17గంటలు, ఎర్రగుంట్ల 2.20గంటలు, కడప 3.45 గంటలు. చార్జీలు... నంద్యాల – బనగానపల్లె, కోవెలకుంట్లకు రూ.10, సంజామలకు రూ.15, నొస్సం రూ.20, జమ్మలమడుగు రూ.20, ప్రొద్దుటూరు రూ.25, కడప రూ.40. -
'తెలంగాణ అభివృద్ధికి పూర్తి సహకారం'
హైదరాబాద్: నవజాత శిశువు వంటి తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. సోమవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో హైదరాబాద్ - గుల్బర్గా ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును సురేష్ ప్రభు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సురేష్ ప్రభు మాట్లాడుతూ... ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగమైన గుల్బర్గాతో ఇక్కడి ప్రజలకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. తెలంగాణలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారి అవసరాల కోసం కాజీపేట్ - ఎల్టీటీ ముంబై రైలును ప్రారంభించామని గుర్తు చేశారు. రైల్వే శాఖకు అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే కార్గో రవాణాపై దృష్టి సారిస్తామని ఆయన స్పష్టం చేశారు. చర్లపల్లి, నాగులపల్లిల్లో అంతర్జాతీయ టెర్మినళ్ల నిర్మాణానికి తోడ్పడతామని సీఎం కేసీఆర్‌కు హామీ ఇచ్చినట్లు సురేష్ ప్రభు వెల్లడించారు. కాచిగూడలో టెర్మినల్తోపాటు ఎంఎంటీఎస్ సర్వీసును శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించే రైల్వేలను మరింత విస్తరించేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లైనును ఏడాదిలోగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం రైల్వే మంత్రి సురేష్ ప్రభు దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ రజతోత్సవాలకు హాజరైయ్యారు. ఉద్యోగుల బోనస్ సీలింగ్ విషయంలో ప్రభుత్వం పునరాలోచిస్తుందని ఆయన తెలిపారు. రైల్వే శాఖ సహాయ మంత్రి హంసరాజ్ గంగారం, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హాజరయ్యారు. -
2న నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్ ప్రారంభం
– హాజరు కానున్న రైల్వే మంత్రి, ముఖ్యమంత్రి నంద్యాల: నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ను ఆగస్టు 2న ప్రారంభించాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ ప్రారంభోత్సవానికి రైల్వే మంత్రి సురేష్‌ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కానున్నారు. మంత్రి సురేష్‌ప్రభును రైల్వే జనరల్మేనేజర్ రవీంద్రగుప్త బుధవారం ఢిల్లీలో కలిశాక ప్రారంభోత్సవ తేదీని నిర్ణయించారు. అయితే అధికారికంగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. -
స్వర్ణభారత్ సేవలు ప్రసంశనీయం
కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు వెంకటాచలం : గ్రామీణ ప్రజల కోసం స్వర్ణభార త్‌ట్రస్ట్ చేసే సేవలు ప్రసంశనీయమని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు అభినందించారు. వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ట్రస్ట్, అక్షర విద్యాలయాన్ని కేంద్ర సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో కలిసి ఆదివారం సందర్శించారు. తొలుత స్వర్ణభారత్ ట్రస్ట్‌కు వెళ్లి అక్కడ బ్రిడ్జిస్కూల్, రైతు శిక్షణ కేంద్రం, ఎల్వీప్రసాద్ కంటి వైద్యశాల, సైరెడ్‌లో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణను పరిశీలించారు. అనంతరం అక్షర విద్యాలయాన్ని సందర్శించారు. అక్కడ సోమా ఆధ్వర్యంలో యువతకు వత్తి నైపుణ్యతపై జరుగుతున్న శిక్షణ గురించి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆయనకు వివరించారు. అనంతరం కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు విలేకరులతో మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేందుకు ప్రతిచోటా స్వర్ణభారత్ ట్రస్ట్ లాంటి స్వచ్ఛందసంస్థలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలకశాఖా మంత్రి పి.నారాయణ, నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. రైతుల సమస్యకు పరిష్కారం చూపాలి: రైతుల సమస్యకు పరిష్కారం చూపాలని మండలంలోని చవటపాళెం గ్రామ రైతులు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కోరారు. వెంకటాచలం మండలం అక్షర విద్యాలయానికి వచ్చిన వెంకయ్యనాయుడును చవటపాళెం రైతులు కలిసి మాట్లాడారు. కష్ణపట్నం–ఓబులవారిపల్లెకు వెళ్లే రైల్వే మార్గంలో చవటపాళెం వద్ద చేపడుతున్న రైల్వే పనుల కారణంగా రైతులకు ఇబ్బందులు వస్తాయని తెలియజేశారు. స్పందించిన వెంకయ్యనాయుడు ఆర్డీఓ కాసా వెంకటేశ్వర్లు, రైల్వే అధికారులతో మాట్లాడారు. ఆ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
రాజధానికి రెండు గంటల్లో చేరుకోవాలి
- వేగంగా నడిచే రైళ్లు నడపండి - రైల్వేమంత్రికి సీఎం వినతి - విజయవాడ-సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ రైలు ప్రారంభం సాక్షి, విజయవాడ: చెన్నై, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు నగరాల నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి తక్కువ సమయంలో వచ్చే, అత్యంత వేగంగా నడిచే రైళ్లు కావాలని సీఎం చంద్రబాబు రైల్వేమంత్రి సురేష్ ప్రభును కోరారు. ఆయా నగరాల నుంచి రైళ్లు రెండు గంటల్లో రాజధానికి చేరుకోవాలన్నారు. విజయవాడ- సికింద్రాబాద్ మధ్య కొత్తగా ఏర్పాటుచేసిన సూపర్‌ఫాస్ట్ రైలు 5.30 గంటల్లో కాకుండా నాలుగు గంటల్లోనే గమ్యం చేరుకునేలా వేగం పెంచాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం విజయవాడలోని రైల్వే ఇనిస్టిట్యూట్ హాలులో విజయవాడ-సికింద్రాబాద్ ఇంటర్ సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వే మంత్రి సురేష్ ప్రభు, సీఎంలు రిమోట్ వీడియో లింకు ద్వారా ప్రారంభించారు. గుంతకల్-కల్లూరు రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు, రూ.240 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం వద్ద మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కుకు శంకుస్థాపన చేశారు. 3 లాజిస్టిక్ పార్కులు: సురేష్ ప్రభు రైల్వే మంత్రి మాట్లాడుతూ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రాష్ట్రంలో మూడు లాజిస్టిక్ పార్కులను రూ.1,000 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇం దులో భాగంగా పొట్టి శ్రీరాములు నెల్లూ రు జిల్లా కృష్ణపట్నం వద్ద మల్టీమోడల్ లాజి స్టిక్ పార్కుకు ఇప్పుడు శంకుస్థాపన చేశామన్నా రు. రాబోయే రోజుల్లో విశాఖపట్నం, కాకినాడల్లో కూడా ఇదే తరహాలో మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. అత్యుత్తమ వ్యవసాయ హబ్‌గా ఏపీ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యవసాయ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆయన సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరంలో ఏరువాక పున్నమి కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
‘ప్రభు’ వెనకడుగు!
రైల్వే జోన్ ప్రకటనపై సందిగ్ధం? విశాఖపట్నం : విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుపై కే ంద్ర ప్రభుత్వం దొంగాట ఆడుతోంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తందానతాన పాడుతోంది. ఈ రైల్వే జోన్‌పై ప్రకటనే తరువాయి అంటూ తొలుత లీకులివ్వడం, వాటిని అనుకూల మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయించడం పరిపాటిగా మారింది. ఇప్పుడు తాజాగా రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు ఈ నెల 21న విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వస్తున్నారని, అదే రోజు విశాఖకు రైల్వే జోన్‌పై ప్రకటన చేస్తారని ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా ద్వారా హడావుడి చేస్తున్నారు. ఇటీవలే సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన ఈ నెల 20న విజయవాడ వస్తున్నారు. ఆ రోజు రాత్రి విజయవాడ-హైదరాబాద్ మధ్య కొత్త రైలును ప్రారంభించనున్నారు. ఆ మర్నాడు విశాఖలో యోగా దినోత్సవంలో పాల్గొంటారని తొలుత సమాచారం అందించారు. అయితే తాజా సమాచారం ప్రకారం సురేష్ ప్రభు 21న విశాఖ రావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోజు రైల్వే మంత్రి విశాఖ వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. దీనిపై రైల్వే వర్గాలు కూడా స్తబ్దుగానే ఉన్నాయి. రైల్వే మంత్రి రాకపై ఆ వర్గాలు స్పష్టత ఇవ్వడం లేదు. శనివారం రాత్రి వరకూ విశాఖలోని బీజేపీ శ్రేణులకు కూడా రైల్వే మంత్రి పర్యటన ఖరారయినట్టు సమాచారం లేదు. ఒకవేళ ఆయన ఆఖరి నిమిషంలో వచ్చినా విశాఖకు రైల్వే జోన్‌పై ప్రకటన అనుమానమేనని చెబుతున్నారు. ఆందోళనల భయంతోనే..? రైల్వే జోన్ ఏర్పాటు అంశాన్ని రాష్ట్ర విభజన బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ సర్కారు తాత్సారం చేస్తూ వస్తోంది. విశాఖ రైల్వే జోన్ కోసం టీడీపీ, బీజేపీలు తప్ప వైఎస్సార్సీపీ, వామపక్షాలు, లోక్‌సత్తా, పలు ప్రజాసంఘాలు, విద్యార్థి, ఉద్యోగ, న్యాయవాదుల సంఘాలూ ఉద్యమాలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఏప్రిల్‌లో అమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో విశాఖకు రైల్వే జోన్ ఆకాంక్ష ఉత్తరాంధ్ర వాసుల్లో బలంగా నాటుకుపోయింది. ఈ పరిస్థితుల్లో యోగా దినోత్సవం నాడు విశాఖ పర్యటనకు వచ్చిన ఆయనను ఆయా పార్టీల నేతలు, వివిధ సంఘాల నాయకులు రైల్వే మంత్రిని గట్టిగా నిలదీసే అవకాశాలున్నాయి. ఈ సంగతి తెలిసే ఆయన విశాఖ రాకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రధానితో విభజన చట్టంలో పేర్కొన్న కీలకమైన రైల్వే జోన్‌పై ప్రకటన చేయించాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారన్న వాదన కూడా వినిపిస్తోంది. -
'ఏపీ అభివృద్ధికి రైల్వేశాఖ ద్వారా అన్ని అవసరాలు తీరుస్తాం'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రైల్వేశాఖ ద్వారా కావాల్సిన అన్ని అవసరాలు తీరుస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. శనివారం తిరుచానూరు క్రాసింగ్ రైల్వే స్టేషన్ నిర్మాణానికి సురేష్ ప్రభు తిరుపతి రైల్వేస్టేషన్లో ఆన్లైన్ ద్వారా శంకుస్థాపన చేశారు. అనంతరం సురేష్ ప్రభు మాట్లాడుతూ.... ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన తర్వాత తిరుపతి నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. నిత్యం లక్షల మంది ప్రయాణికులతో కిటకిటలాడే తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం నిర్ధుష్ట ప్రణాళికలు రూపొందిస్తామని ఆయన చెప్పారు. నెలరోజుల్లో టీటీడీ ఈవో, ఛైర్మన్‌ను ద.మ.రై. జీఎంతో వచ్చి కలుస్తానని తెలిపారు. రైల్వే బడ్జెట్ రూ. 40 వేల కోట్ల నుంచి రూ. లక్షా 20 వేల కోట్లకు పెరిగిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైల్వే బడ్జెట్లో నిధులు పెరగడం వల్ల అభివృద్ధి పనులు చురుకుగా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో మౌలిక వసతులదీ కీలక పాత్ర అని సురేష్ ప్రభు స్పష్టం చేశారు. అనంతరం సురేష్ ప్రభు విజయవాడకు బయలుదేరారు. అంతకుముందుకు సురేష్ ప్రభు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. -
'విశాఖ రైల్వేజోన్‌పై మార్గాలు అన్వేషిస్తున్నాం'
ఢిల్లీ: విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నామని రైల్వే మంత్రి సురేష్ ప్రభు అన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ...రైల్వేజోన్ అంశంపై నిపుణులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సురేష్ ప్రభు పేర్కొన్నారు. గత ప్రభుత్వాల కంటే రాష్ట్రాలకు రెండింతలు బడ్జెట్‌ను పెంచామన్నారు. ప్రతి రోజుకు 7.8 కిలో మీటర్ల బ్రాడ్‌గేజ్ నిర్మాణం చేస్తున్నామని.. దీన్ని 19 కి.మీ వరకు పెంచడం తమ లక్ష్యమని ఆయన తెలిపారు. -
కాచిగూడ రైల్వేస్టేషన్లో హైస్పీడ్ వైఫై
కాచిగూడ రైల్వేస్టేషన్లో గురువారం నుంచి ప్రయాణికులకు హైస్పీడ్ వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3 గంటలకు వీడియో లింకేజీ ద్వారా వైఫై సేవలను ప్రారంభిస్తారు. అదే సమయంలో కాచిగూడ రైల్వేస్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం వద్ద జరుగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇప్పటికే సికింద్రాబాద్, విజయవాడ స్టేషన్లలో వైఫై సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. -
ఏపీ ఎక్స్‌ప్రెస్ వేగం అంతే..!
న్యూఢిల్లీ : విశాఖ-న్యూఢిల్లీ మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ గరిష్టంగా 110 కి.మీ. వేగంతో మాత్రమే వెళ్తుందని కేంద్ర రైల్వే శాఖ స్పష్టం చేసింది. అందువల్ల ప్రస్తుత ప్రయాణ సమయాన్ని కుదించడం సాధ్యం కాదని పేర్కొంది. రాజ్యసభలో సభ్యుడు ఎం.ఎ.ఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు శుక్రవారం సమాధానమిచ్చారు. ఈ ఎక్స్‌ప్రెస్ పేరును రాజధాని ఎక్స్‌ప్రెస్‌గా గానీ, దురంతో ఎక్స్‌ప్రెస్‌గా గానీ మార్చడం సాధ్యపడదన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలను దేశరాజధానితో అనుసంధానించేందుకు ఉద్దేశించినందున 19 హాల్టింగ్‌లతో నడుస్తోందని చెప్పారు. రాజధాని, దురంతో తరహాలో పనిచేసే అవకాశం కూడా ఈ ఎక్స్‌ప్రెస్‌కి లేదని తెలిపారు. అందువల్ల అటు వేగం పెంచడం గానీ, ఇటు హాల్టింగ్‌లు కుదించడం గానీ సాధ్యపడదని చెప్పారు. అయితే ఈ ఎక్స్‌ప్రెస్ రైలుకి నాన్ -ఏసీ బోగీలను కలపాలని వినతులు వెల్లువలా వచ్చాయని గుర్తు చేశారు. అయితే 2014-15 బడ్జెట్లో ఏపీ ఎక్స్‌ప్రెస్‌గా ప్రకటించిన నేపథ్యంలో దానిని మార్చలేమని వివరించారు. -
ఖర్చుల తగ్గింపుపై రైల్వే దృష్టి
న్యూఢిల్లీ: కేంద్ర సాయం తగ్గడం, ఆదాయం పడిపోవడంతో ఈ సారి బడ్జెట్లో రైల్వే శాఖ నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఆర్థిక అవసరాల సర్దుబాటుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలు నేపథ్యంలో ఖజానాపై రైల్వే శాఖ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. నిర్వహణ ఖర్చుల్ని 15 శాతం తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం నిర్వహణ ఖర్చులకు రూ.1.62 లక్షల కోట్లు వెచ్చిస్తున్నారు. సిబ్బంది క్రమబద్దీకరణ, ఉద్యోగులు మరింత శ్రమించేలా చూడడం, ప్రోత్సాహకాలు తగ్గించడం వంటి చర్యలపై సురేష్ ప్రభు దృష్టిపెడుతున్నారు. ప్రకటనలు, పార్సిల్ లీజు, రైల్వే పరికరాల ఎగుమతుల ద్వారా కొంత ఆదాయం సమకూరుతాయని ఆయన భావిస్తున్నారు. ఫిబ్రవరి 25న రైల్వే మంత్రి తన రెండో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వనరుల్ని పెంచుకునేందుకు సొంతంగా రైల్వే శాఖ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఇప్పటికే చెప్పారు. సర్వేలో ప్రయాణికుల సూచనలు తత్కాల్ రద్దు చేసుకుంటే 50 శాతం ఛార్జీలు తిరిగివ్వాలని, బుకింగ్స్‌పై పరిమితి తొలగించాలంటూ సర్వేలో ప్రయాణికులు రైల్వేకు సూచనలు చే శారు. టీటీఈల లంచాలపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేయగా, అత్యవసర కేటాయింపులు దుర్వినియోగం అవుతున్నాయని తెలిపారు. ఈ బడ్జెట్లో అనేక కొత్త నిర్ణయాలు తీసుకొనున్నారు. ప్రయాణికులకు సౌకర్యాలు పెంచడంతో పాటు రైల్వేను వారికి మరింత చేరువ చేసే చర్యల్ని పొందుపరచనున్నారు. -
మంత్రికి ట్వీట్ చేస్తే.. ప్రాణాలు కాపాడారు!
సామాన్య పౌరులు మంత్రులకు ఏమైనా సమస్య చెబితే అది పరిష్కారం అవుతుందా? అది కూడా కేంద్ర మంత్రులైతే అసలు పట్టించుకుంటారా? సాధారణంగా అయితే దీనికి నో అనే సమాధానం వస్తుంది. కానీ రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు మాత్రం అలా వదిలేసే రకం కాదు. విషయం తన దృష్టికి ఎలా వచ్చినా వెంటనే స్పందించి, తక్షణం పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ సంఘటన. శంకర్ పండిట్.. బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బిహార్‌లోని కియుల్ ప్రాంతంలో తన మామగారి ఇంటికి భార్య, రెండేళ్ల కూతురితో సహా వెళ్లి తిరిగి బెంగళూరు వస్తున్నాడు. వాళ్లు అంగ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. రైలు బయల్దేరిన కొద్దిసేపటికే శంకర్ కూతురికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. తోటి ప్రయాణికులు సాయం చేద్దామనుకున్నా.. ఎవరికీ ఏం చేయాలో తెలియదు. శంకర్ సహా ఎవరిదగ్గరా మందులు కూడా లేవు. పోనీ మధ్యలో దిగిపోదామంటే, దగ్గర్లో ఆస్పత్రి ఉందో లేదో తెలియదు. ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో @RailMinIndia అనే ట్విట్టర్ ఐడీకి కాపాడమంటూ ట్వీట్ చేశారు. సరిగ్గా రెండు నిమిషాల్లో రైల్వే మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ఆ నిమిషం నుంచి వరుసపెట్టి రైల్వే అధికారులు ఫోన్ల మీద ఫోన్లు చేశారు. ఎక్కడున్నారు, సమస్య ఏంటి, ఇతర వివరాలన్నీ అడిగారు. అక్కడకు దగ్గర్లో ఉన్న అసన్సాల్ స్టేషన్ వద్ద పూర్తిస్థాయి వైద్యబృందంతో కూడిన అంబులెన్సు సిద్ధంగా ఉంది. విషయం ఏమిటంటే, ట్వీట్ చూసిన వెంటనే సురేష్ ప్రభు.. కోల్‌కతాలోని తూర్పు రైల్వే అధికారులను అప్రమత్తం చేశారు. ఆ పాపకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. అప్పటికే పాప పరిస్థితి కొంత విషమంగా ఉంది. ఆమెను రైల్వే ఆస్పత్రిలో చేర్చి.. వెంటనే చికిత్స చేయడంతో.. కోలుకుంది. ఇక ఆ తల్లిదండ్రుల ఆనందానికి అంతులేదు. కళ్ల ముందే తోటకూర కాడలా వడిలిపోతున్న కూతురిని చూసి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న తమను.. ఏదో వీఐపీలను చూసినట్లు చూసి, ఆదుకున్నారని పొంగిపోతున్నారు. పాపకు నయమైన తర్వాత రైల్వే అధికారులు అసనాల్ స్టేషన్ నుంచి బెంగళూరుకు కూడా టికెట్లు కన్ఫర్మ్ చేయించి వాళ్లను సురక్షితంగా పంపారు. నిజంగా ప్రజాప్రతినిధులు అందరూ ఇలా స్పందిస్తే.. ఇక ప్రజలకు సమస్యలు అన్నవే ఉండవు కదూ. -
శ్రీవారి సేవలో రైల్వే మంత్రి
తిరుమల: రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి మంత్రికి స్వాగతం పలికారు. నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి ఆయన ఆలయానికి విచ్చేశారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని, శ్రీవారిని, వకుళమాతను దర్శించుకున్నారు. అనంతరం కానుకలు సమర్పించారు. దర్శనమనంతరం ఆలయాధికారులు సురేష్ ప్రభుకు లడ్డూ ప్రసాదాలు, నూతన సంవత్సరం డైరీ, శ్రీవారి కేలండర్‌ను అందజేశారు. -
కేంద్ర మంత్రికి ట్వీట్.. తక్షణమే సాయం
జైపూర్: కష్టాల్లో ఉన్న ఓ ప్రయాణికుడు చేసిన ట్వీట్‌కు రైల్వే శాఖ తక్షణం స్పందించి సాయం చేసిన సంఘటన మరొకటి వెలుగు చూసింది. అతను దిగాల్సిన రైల్వే స్టేషన్లో సిబ్బంది ముందే ప్లాట్‌ఫామ్ పైకి చేరుకుని సాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలో స్థిరపడ్డ రాజస్థాన్ వ్యాపారవేత్త పంకజ్ జైన్ కుటుంబంతో కలసి యశ్వంత్‌పూర-బికనూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో సొంతూరుకు వెళ్తున్నాడు. పక్షవాతం సోకిన తండ్రి.. తల్లి,సోదరీమణులు అతనితో పాటు ప్రయాణిస్తున్నారు. పంకజ్ రాజస్థాన్‌లోని మెర్టా రోడ్ రైల్వే స్టేషన్లో దిగాలి. అక్కడ ఐదు నిమిషాలు మాత్రమే రైలు ఆపుతారు. ఈలోగా తండ్రిని, లగేజీని దించడం ఎలాగా అని ఆందోళన చెందాడు. మిత్రుల సలహా మేరకు తన సమస్యను తెలియజేస్తూ కేంద్ర మంత్రి సురేష్ ప్రభుకు, ఇండియన్ రైల్వేస్‌కు ట్వీట్ చేశారు. ఐదు నిమిషాల్లోపు రైల్వే శాఖ స్పందించి.. అతను ప్రయాణిస్తున్న కోచ్ నెంబర్, పీఎన్ఆర్ నెంబర్ పంపాలని సూచించింది. మెర్టా రోడ్ స్టేషన్‌కు రైలు చేరేసరికి ప్లాట్‌ఫామ్‌పై స్టేషన్ మాస్టర్, సిబ్బంది, ఓ కూలి.. వీల్ చైర్‌తో సిద్ధంగా ఉన్నారు. రైలును పది నిమిషాల పాటు ఆపి పంకజ్ కుటుంబ సభ్యులకు సాయపడ్డారు. రైల్వే శాఖ పనితీరుకు మొదట్లో ఆశ్చర్యపోయిన పంకజ్ వారి సేవలకు కృతజ్ఞతలు చెప్పాడు. ఇటీవల రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ.. తనకు అపాయం ఉంది రక్షించండీ.. అని రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ట్వీట్ చేయగా.. వెంటనే స్పందించిన అధికారులు ఆమెకు పోలీసుల రక్షణ కల్పించారు. -
ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
కొత్త రైల్వే సర్వీసును ప్రారంభించిన రైల్వేమంత్రి సురేష్ ప్రభు సాక్షి, న్యూఢిల్లీ, విశాఖ సిటీ: న్యూఢిల్లీ-విశాఖపట్టణం (22415/22416) ఏసీ ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు బుధవారం రిమోట్ ద్వారా ప్రారంభించారు. ప్రస్తుతం న్యూఢిల్లీ-హైదరాబాద్ (12723/12724) ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా పేరు మారుస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికులు అడ్వాన్సు రిజర్వేషన్లు చేసుకున్న దృష్ట్యా నవంబరు 15 నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా అధికారికంగా రికార్డులోకి ఎక్కనుంది. ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు విశాఖ నుంచి బుధవారం బయల్దేరగా... దీనిని కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, బండారు దత్తాత్రేయ, సహాయ మంత్రులు మనోజ్‌సిన్హా, సుజనాచౌదరిలతో కలిసి రైల్వేమంత్రి న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సులో ప్రారంభించారు. వేగం పెంచి, ప్రయాణ సమయాన్ని తగ్గించాలి: మంత్రి వెంకయ్య ఏపీ ఎక్స్‌ప్రెస్ వేగాన్ని పెంచి ప్రయాణ సమయాన్ని 36 గంటల నుంచి 32 గంటలకు తగ్గించాలని, వారంలో ఏడు రోజులపాటు రైలును నడిపించాలని మంత్రి వెంకయ్య నాయుడు కేంద్ర రైల్వేమంత్రి సురేష్‌ప్రభును కోరారు. తిరుపతి నుంచి విజయవాడ మీదుగా ఢిల్లీకి రైలు ఏర్పాటు చేయాలని విన్నవించారు. కొత్త రైళ్లు అత్యవసరం: మేకపాటి, వైవీ ఏపీ నుంచి మరిన్ని కొత్త రైళ్లను నడిపించే దిశగా ప్రయత్నాలు చేయాలని, తిరుపతి నుంచి ఢిల్లీకి ఏపీ ఎక్స్‌ప్రెస్-2 రైలు నడిపించాలని వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కోరారు. తిరుపతి-షిర్డి, విజయవాడ-బెంగళూరు రైళ్లను నడిపించాలని గతంలోనే వినతిపత్రాలను అందచేశామన్నారు. రైల్వేజోన్ ఏర్పాటు పరిశీలనలో ఉందని చెబుతుండడం బాగానే ఉన్నప్పటికీ, అన్నింటికన్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం చాలా అవసరమని చెప్పారు. -
'ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించడం సంతోషకరం'
-
విశాఖ-ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
విశాఖపట్టణం: దేశరాజధాని ఢిల్లీకి రాకపోకలు సాగించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన సూపర్‌ఫాస్ట్ రైలు ఏపీ ఎక్స్‌ప్రెస్ (22415) బుధవారం లాంఛనంగా విశాఖపట్నంలో ప్రారంభం అయింది. న్యూఢిల్లీ నుంచి రిమోట్ ద్వారా కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈ రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, అశోక్‌గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు. విశాఖ నుండి ఢిల్లీకి వారంలో మూడు రోజులు బుధ, శుక్ర, ఆది వారాల్లో నడవనుంది. ఈ నెల 15 నుంచి పూర్తిస్థాయిలో రైలు సేవలు అందుబాటులోకి వస్తామని అధికారులు తెలిపారు. ఈ రైలులో 16 ఏసీ బోగీలు ఏర్పాటు చేశారు. షెడ్యూల్ ప్రకారం.. విశాఖపట్నంలో ఉదయం 07.45 గంటలకు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 7 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి సోమ, బుధ, శుక్ర వారాల్లో (22416) నంబరుతో ఉదయం 06.45 గంటలకు ఢిల్లీలో బయలుదేరే ఈ రైలు మరుసటిరోజు సాయంత్రం 06.45 గంటలకు విశాఖ చేరుకుంటుంది. -
రెండు రాష్ట్రాల వివాదంగా చిత్రిస్తున్నారు
బీజేపీ పెద్దలతో మాట్లాడండి... ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ⇒ ఏపీలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయండి ⇒ రైల్వే మంత్రి సురేష్‌ప్రభుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తప్పులు కప్పి పుచ్చుకునేందుకు, అసలు విషయాన్ని ప్రజల దృష్టి నుంచి మళ్లించే యత్నం చేస్తున్నారని, సమస్యను రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిత్రిస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభుకు వివరించారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ టీడీపీ అధినేత పేరును మొదటి నిందితుడిగా చేర్చాలని కోరారు. ఆయన బుధవారం సాయంత్రం ఇక్కడి రైల్వే భవన్లో పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విప్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు వరప్రసాద్‌రావు, వై.ఎస్.అవినాశ్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి, బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు తదితరులతో కలిసి సురేష్ ప్రభుతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు అవినీతిపై, రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల అమలుపై రెండు వినతిపత్రాలు ఇచ్చినట్టు తెలిపారు. ‘‘నిన్న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ప్రస్తావించిన అంశాలనే సురేష్ ప్రభు వద్ద ప్రస్తావించాం. చంద్రబాబునాయుడు ఏ రకంగా లంచాలు తీసుకుని సంపాదించిన డబ్బును తిరిగి లంచంగా ఇవ్వజూపుతూ పట్టుబడ్డారో చెప్పాం. ఆ అంశంనుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు దీనిని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చూపుతున్న సంగతిని వివరించాం. రైల్వేపెండింగ్ ప్రాజెక్టు, జోన్ ఆవశ్యకత వివరిస్తూ.. ప్రజస్వామ్యాన్ని కాపాడాలని కోరాం. బీజేపీలోని పెద్దలతో గట్టిగా మాట్లాడాలని కోరాం’’ అని తెలిపారు. రైల్వే ప్రాజెక్టులపై ఇచ్చిన వినతిపత్రంలోని ముఖ్యాంశాలు ⇒ నేను మా పార్టీ ఎంపీలతో ఫిబ్రవరిలో మిమ్మల్ని కలిసి ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని హామీలతో పాటు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాలని కోరాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు గత కొన్ని దశాబ్దాలుగా రైల్వే బడ్జెట్లో జరుగుతున్న అన్యాయాన్ని మీకు వివరించాం. ఈసారైనా న్యాయం చేస్తారని ఆశించాం.మా ఆశలు నెరవేరలేదు. 2014 బడ్జెట్ నాటి హామీలూ అమలు కాలేదు.హా2014 బడ్జెట్లో రైల్వే మంత్రి విజయవాడ-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-నిజాముద్దీన్ ఏసీ ఎక్స్‌ప్రెస్, కాజీపేట-ముంబై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లను ప్రకటించారు. అవి పట్టాలెక్కలేదు. ⇒ కొత్త రాజధాని నుంచి హైదరాబాద్‌కు, తెలంగాణలోని ఇతర ముఖ్యపట్టణాలకు ర్యాపిడ్ రైలు, రోడ్డు కనెక్టివిటీ కేంద్రం ఏర్పాటుచేస్తుందని 13వ షెడ్యూలులో పొందుపరిచిన హామీ ఇప్పటివరకు నెరవేరలేదు. ⇒ ‘ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం రూ. 20,680 కోట్ల అంచనా వ్యయం కలిగిన 29 ప్రాజెక్టులు ప్రస్తుతం అమలులో ఉన్నాయి. రెండు కొత్త రాష్ట్రాల అధికారులతో సమన్వయ సమావేశాలు జరిపి వాటి అవసరాలను తెలుసుకుని వాటిని పరిగణనలోకి తీసుకుంటాం’ అని 2014-15 రైల్వే బడ్జెట్లో రైల్వే మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. కానీ 2015 రైల్వే బడ్జెట్లో దీని ప్రస్తావనే లేదు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను పట్టించుకోలేదు. కేవలం కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైన్ పనులను మాత్రమే ప్రస్తావించారు.ప్రత్యేక జోన్ అంశమే లేదు. విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు డివిజన్లు ఉండేవి. ఇప్పుడు ఒక్కటీ లేదు. ఎందుకు కేటాయించడం లేదో అర్థం కాని పరిస్థితి. ⇒ విభజన అనంతరం కొత్తగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి ఏపీ ఎక్స్‌ప్రెస్ ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ ఇప్పటివరకు దాన్ని ప్రకటించడం లేదు. నడికుడి-శ్రీకాళహస్తి, విజయవాడ-నిడదవోలు-జగ్గయ్యపేట-విష్ణుపురం, కాకినాడ-పిఠాపురం, ఓబులవారి పల్లె-కృష్ణపట్నం తదితర ముఖ్యమైన లైన్లను మొన్నటి బడ్జెట్లో ప్రస్తావించలేదు.గత ప్రభుత్వం 50 శాతం వ్యయాన్ని భరిస్తామని కోరినా కొన్ని ప్రాజెక్టులను మంజూరు చేయలేదు. ⇒ మొన్న ఫిబ్రవరిలో మీ బడ్జెట్ ప్రసంగంలో నాలుగు ఫ్రైట్ కారిడార్లు ఏర్పాటుచేస్తామన్నారు. కానీ వాటిని ఎక్కడ ఏర్పాటుచేస్తారో చెప్పలేదు. మా ప్రాంతంలో రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరించాల్సిన ఆవశ్యకతను గుర్తించండి. బెంగళూరు-కడప రైల్వే లైన్ లింక్‌కు చాలినంత నిధులు కేటాయించకపోవడంతో దాని నిర్మాణం నత్తనడకన సాగుతోంది. 2008-09లో మంజూరైన ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉన్నా బడ్జెట్లో ప్రస్తావన లేదు. ⇒ రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నందలూరులో ఉన్న లోకోషెడ్ ప్రస్తుతం పనిచేయడం లేదు. దాదాపు 150 ఎకరాల్లో ఉన్న ఈ యూనిట్ వద్ద 250 స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. వైఎస్సార్ జిల్లాకు చెందినవాడిగా ఈ ప్రాంత ప్రజలు ఈ యూనిట్‌పై పెట్టుకున్న భావోద్వేగమైన అనుబంధం నాకు తెలుసు. దీనిని తిరిగి పనిచేయించాల్సిన అవసరం ఉంది. అలాగే కోడూరులో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరం ఉంది. -
సురేష్ ప్రభుతో వైఎస్ జగన్ భేటీ
-
సురేష్ ప్రభుతో వైఎస్ జగన్ భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్నీ రైళ్లు కేటాయించాలని సురేష్ ప్రభుకు ఈ సందర్భంగా వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ భేటీలో వైఎస్ జగన్ వెంట ఆ పార్టీ ఎంపీలు కూడా ఉన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ 1గా చేర్చాలని వైఎస్ జగన్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ అంశంపై ఢిల్లీ పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి విజ్ఞప్తి చేసిన విషయం విదితమే.