న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను వైఎస్సార్‌సీపీ లోక్‌సభ ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, తనుజరాణిలు సోమవారం కలిశారు. ఈ సందర్బంగా కడప-బెంగళూరు మధ్య నూతన రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని కేంద్రమంత్రిని వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్షనేత మిథున్ రెడ్డి కోరారు.
కడప-బెంగళూరు రైల్వే లైన్‌తో వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల సరఫరా మెరుగవుతుందని తెలిపారు. పీలేరు-పుంగనూరు- మదనపల్లిల మీదుగా వెళ్లే ఈ రైల్వే లైన్ వల్ల రాయలసీమ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
కాగా కడప నుంచి బెంగళూరుకు కొత్త రైల్వే లైన్‌ను 2008-09 రైల్వే బడ్జెట్‌లోనే మంజూరు చేశారని, ప్రాథమికంగా సర్వే నిర్వహించి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అయితే కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment