Kadapa-Bangalore railway line
-
కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్.. రైల్వే మంత్రి కీలక ప్రకటన
సాక్షి, ఢిల్లీ: కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ క్రమంలో కడప-పెండ్లిమర్రి సెక్షన్ మధ్య లైన్ పూర్తి అయినట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు రూ. 359 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పుకొచ్చారు.పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్‌పై వైఎస్సార్సీపీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వక జవాబు ఇచ్చారు. ఈ క్రమంలో మంత్రి అశ్విని వైష్ణవ్.. ఈ రైల్వే లైన్ కోసం రూ.2706 కోట్లు ఖర్చవుతుంది. ఇప్పటివరకు రూ.359 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. కడప-పెండ్లిమర్రి సెక్షన్ మధ్య లైన్ పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కొత్త లైన్ కోసం సర్వే కోసం ఆమోదం తెలిపాం. ముద్దనూరు-పులివెందుల-ముదిగుబ్బ-శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం మీదుగా కడప నుంచి ఈ లైన్ వెళ్తుంది అని స్పష్టం చేశారు. -
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు వైఎస్సార్సీపీ ఎంపీల విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను వైఎస్సార్సీపీ లోక్‌సభ ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, తనుజరాణిలు సోమవారం కలిశారు. ఈ సందర్బంగా కడప-బెంగళూరు మధ్య నూతన రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని కేంద్రమంత్రిని వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్షనేత మిథున్ రెడ్డి కోరారు.కడప-బెంగళూరు రైల్వే లైన్‌తో వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల సరఫరా మెరుగవుతుందని తెలిపారు. పీలేరు-పుంగనూరు- మదనపల్లిల మీదుగా వెళ్లే ఈ రైల్వే లైన్ వల్ల రాయలసీమ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కాగా కడప నుంచి బెంగళూరుకు కొత్త రైల్వే లైన్‌ను 2008-09 రైల్వే బడ్జెట్లోనే మంజూరు చేశారని, ప్రాథమికంగా సర్వే నిర్వహించి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అయితే కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చేయాలని కోరారు. -
నిధులు చాలక..నత్తనడక
కడప–బెంగళూరు రైల్వేలైనుపై కేంద్ర ప్రభుత్వ స్పందన ఆశాజనకంగా లేదు. అందువల్లే పనులు వేగమందు కోలేకపోతున్నాయి. దివంగత సీఎం వైఎస్సార్ తన హయాంలో ఈ రైల్వేలైనుపై ప్రత్యేక ప్రేమ కనబరిచేవారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటాను సక్రమంగా కేటాయించారు. ఆయన మరణానంతరం పనులు మందగించాయి. పదకొండేళ్లవుతున్నా ప్రాజెక్టు పెళ్లినడకగా నేసాగుతోంది. టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేర నిధులు కేటాయించలేదు. తాజాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం బడ్జెట్లో రైల్వేలైన్లకు రూ.185కోట్లు కేటాయించడం కొంత ఉత్సాహాన్నిస్తోంది. కేంద్రం కూడా ఇదే రీతిన స్పందిస్తే పనులు పరుగందుకునేవని ప్రజలంటున్నారు. సాక్షి, రాజంపేట(కడప) : కడప వయా మదనపల్లె–బెంగళూరు రైలుమార్గంలో మలిదశపనులు మొదలయ్యాయి. రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఆర్‌ఐడీసీ)లోకి ఈమార్గాన్ని తీసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కడప–బెంగళూరు రైలుమార్గాన్ని పూర్తి చేయాల్సి ఉంది. 2010 సెప్టెంబరులో జాయింట్ వెంచర్లో చేపట్టనున్న ఈ మార్గానికి అప్పటి రైల్వేశాఖ మంత్రి మునియప్ప శంకుస్ధాపన చేశారు. ఈ రైల్వే మార్గం దివంగత సీఎం వైఎస్సార్ మానసపుత్రిక. 2008–2009లో కేంద్రం ఆమోదించిన ఈ ప్రాజెక్టు పనులను రూ.1000కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. 258 కిలోమీటర్ల మేర నిర్మాణానికి 1,531 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఐదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలనేదిలక్ష్యం. తాజా పరిస్థితులు గమనిస్తే అయిదేళ్లలో కాదు కదా కనీసం 15 ఏళ్లు దాటిపోయేటట్లు కనిపిస్తోంది. భూసేకరణకు రూ.199.2కోట్లు కేటాయించారు. 2016–2017లో రూ.58కోట్లు, 2017–2018లో రూ.240కోట్లు కేటాయించారు. మొదటిదశలో పెండ్లిమర్రి వరకు లైను సిద్ధం చేసి డెమోరైలును నడిపిస్తున్నారు. నాలుగుదశల్లో ఈ రైలుమార్గం చేపట్టాలని రైల్వేశాఖ నిర్ణయించింది. కేంద్రం ఆమోదం ఆమోదం: 2008–2009లో రైలుమార్గం ప్రారంభం: 2010లో అంచనా వ్యయం: రూ.1000కోట్లు రైలుమార్గం: 258కి.మీ నిర్మాణం: 4దశల్లో... మొదటిదశలో మొదటిదశలో రూ.153కోట్లు కేటాయించారు. ఈ దశలో 21.8కి.మీ వరకు లైన్ నిర్మించారు. కడప నుంచి గంగనపల్లె, పెండ్లిమర్రి వరకు పట్టాలు వేశారు. 311.84 ఎకరాలు భూమిని సేకరించారు. 54 చిన్నబ్రిడ్జిలు, ఆరుపెద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు.నిర్మాణం కోసం రూ.199.2కోట్లు వెచ్చించారు. రెండోదశలో పెండ్లిమర్రి–రాయచోటి టు వాల్మీకిపురం వరకు లైన్‌ను చేపట్టాల్సి ఉంది. మూడవదశలో మదనపల్లెరోడ్డు టు మదగట్ట (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు), మదగట్ట–ముల్భాగల్ (కర్నాటక రాష్ట్రం సరిహద్దు) లైను పూర్తి చేయాలనుకుంటున్నారు. 4వదశలో ముల్బాగల్ టు కోలార్ వరకు నిర్మాణం చేపట్టేలా రూపకల్పన చేసి ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఈ ఏడాది అరకొరే.. ఆంధ్రప్రదేశ్‌లో 205 కిలోమీటర్ల రైలుమార్గం ఉండగా, కర్నాటకలో 50.40కిలోమీటర్ల మేర రైలుమార్గం నిర్మించాలి. ఈ మార్గ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సగం వాటా భరిస్తోంది. ఈ ఏడాది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త రైల్వే నిర్మాణాలకు బడ్జెట్లో తమ వాటా కింద రూ.185కోట్లు కేటాయించారు. మొదటిదశలో కడప నుంచి పెండ్లిమర్రి వరకు మార్గం పూర్తి చేసిన సంగతి తెలిసిందే. 21 కిలోమీటర్ల మార్గం అందుబాటులో ఉంది. రాష్ట్రంలోని ముఖ్యమైన రైలుమార్గాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటాను కేటాయించాల్సి ఉంటుంది. గత టీడీపీ ప్రభుత్వం సక్రమంగా వాటాలు కేటాయించకపోవడంతో ఈలైను నిర్మాణం జాప్యం జరుగుతూ వస్తోందని విమర్శలున్నాయి. కేంద్రం కూడా రైల్వేబడ్జెట్‌లో ఏటా అరకొరగా నిధులు కేటాయిస్తూ వచ్చింది. ఈ ఏడాది కూడా కడప–బెంగళూరు లైనుకు నామమాత్రంగా రూ.2కోట్లు కేటాయించడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. -
ఆర్‌ఐడీసీలోకి కడప–బెంగళూరు రైలుమార్గం
► జాయింట్ వెంచర్లో రైలుమార్గానికి కదలిక ► కేంద్ర, రాష్ట ప్రభుత్వాల మ«ధ్య కుదిరిన ఒప్పందం ► నాలుగు దశల్లో రైలుమార్గం నిర్మాణం ఎన్నో ఏళ్లుగా జిల్లా వాసుల కలగా మిగిలిన కడప– వయా మదనపల్లె – బెంగళూరు రైలుమార్గంలో మలిదశ పనులు మొదలయ్యాయి. ఆర్‌ఐడీసీలోకి ఆ మార్గాన్ని తీసుకోవడంతో కాస్తంత ఊరట లభించినట్లైంది. త్వరగా ఆ మార్గాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ, రాష్ట్రప్రభుత్వం సంయుక్తంగా అడుగులు వేస్తున్నాయి. మదనపల్లె సిటీ : కడప– బెంగళూరు మధ్య రైలు మార్గం నిర్మాణానికి 2010 సెప్టెంబర్‌లోఅప్పటి రైల్వేశాఖ మంత్రి మునియప్ప శంకుస్థాపన చేశారు. ఇది దివంగత సీఎం వైఎస్సార్ మానసపుత్రిక, ఈ రైలుమార్గానికి 2008–09 బడ్జెట్లో ఆమోదం లభించింది. రూ.1,000 కోట్ల అంచనా వ్యయంతో రైలుమార్గం నిర్మాణ పనులు మొదలయ్యాయి. 258 కిలోమీటర్ల మేర రైలుమార్గం నిర్మాణానికి 1,531 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. మొత్తం ఐదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఆ లక్ష్యం 15 ఏళ్లు దాటిపోయేటట్లు కనిపిస్తోంది. భూసేకరణకు రూ.199.2 కోట్లు కేటాయించా రు. కాగా రైల్వేలైన్ నిర్మాణానికి 2016–17లో రూ.58 కోట్లు, 2017–18లో రూ.240 కోట్లను కేటాయించా రు. మొదటి దశలో భాగంగా ఇప్పటికే పెండ్లిమర్రి వరకు లైను సిద్ధం చేసి డెమో రైలును నడిపిస్తున్నారు. మొత్తం నాలుగు దశల్లో కడప–బెంగళూరు రైలుమార్గం చేపట్టాలని రైల్వేశాఖ నిర్ణయించుకుంది. రూ.100 కోట్ల వ్యయంతో ఆర్‌ఐడీసీ.. రైల్ నెట్వర్క్ విస్తరణలో భాగంగా రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో రైల్వే ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు, సమగ్ర నివేదికలు రూపొందిస్తున్నాయి. ఇందులో భాగంగా నూతనంగా రూ.వందకోట్ల వ్యయంతో రైల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. నిర్మాణ దశలు ఇలా... మొదటి దశలో రూ.153 కోట్లు కేటాయింపులు జరిగాయి. భూసేకరణకు సంబంధించి రూ.89 కోట్లలో రూ.20 కోట్లను రైల్వేశాఖ వ్యయం చేసింది. ఈ దశలో 21.8 కిలోమీటర్ల వరకు లైన్ నిర్మాణం చేపట్టారు. కడప నుంచి గంగనపల్లె, పెండ్లిమర్రి వరకు పట్టాలు వేశారు. 311.84 ఎరరాల భూమిని సేకరించారు. 54 చిన్నబ్రిడ్జిలు, ఆరుపెద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. రూ.199.2 కోట్లు నిర్మాణం కోసం వ్యయం చేశారు. రెండవదశలో పెండ్లిమర్రి–రాయచోటి, రాయచోటి – వాల్మీకిపురం లైన్ చేపట్టనున్నారు. మూడవ దశలో మదనపల్లెరోడ్డు – మదగట్ట(ఆంధ్రప్రదేశ్ సరిహద్దు), మదగట్ట– ముళబాగల్ (కర్ణాటక రాష్ట్ర సరిహద్దు) లైను పూర్తి చేయాలనుకుంటున్నారు. నాలుగవ దశలో ముళబాగల్– కోలార్ మధ్య నిర్మాణం చేపట్టేలా కడప–బెంగళూరు రైల్వేలైన్ రూపకల్పన జరిగింది. -
కడప-బెంగళూరు రైలు మార్గానికి మోక్షం
కడప సిటీ: ఎన్నో ఏళ్లుగా జిల్లా వాసుల కలగా మిగిలిన కడప వయా మదనపల్లె-బెంగళూరు రైలు మార్గంలో మలిదశ పనులు మొదలయ్యాయి. రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఆర్‌ఐడీసీ)లోకి ఆ మార్గాన్ని తీసుకోవడంతో ఊరట లభించినట్లయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కడప-బెంగుళూరు రైల్వే లైన్ పూర్తి చేసేందుకు నడుం బిగించాయి. జాయింట్ వెంచర్లోకి కడప–బెంగుళూరు రైల్వే లైన్ తీసుకురావడంతో వీలైనంత త్వరలో పనులు ప్రారంభమవుతాయని అధికారులు చెబుతున్నారు. కడప–బెంగుళూరు మధ్య రైలుమార్గం నిర్మాణానికి 2010 సెప్టెంబర్‌లో అప్పటి రైల్వేశాఖమంత్రి మునియప్ప శంకుస్థాపన చేశారు. ఇది దివంగత సీఎం వైఎస్సార్ మానసపుత్రిక. ఈ రైలు మార్గానికి 2008–2009 బడ్జెట్లో ఆమోదం లభించింది. రూ.1,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు మొదలయ్యాయి. 258 కిలోమీటర్ల మేర రైలుమార్గం నిర్మాణానికి 1,531 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. మొత్తం ఐదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ లక్ష్యం ఐదేళ్లు కాదు కదా 15ఏళ్లు దాటిపోయేటట్లు కనిపిస్తోంది. భూసేకరణకు రూ.199.2 కోట్లు కేటాయించారు. కాగా 2016–2017లో రూ.58 కోట్లు, 2017–18లో రూ.240 కోట్లు కేటాయించారు. మొదటి దశలో భాగంగా ఇప్పటికే పెండ్లిమర్రి వరకు లైను సిద్దం చేసి డెమో రైలును నడిపిస్తున్నారు. మొత్తం నాలుగుదశల్లో కడప–బెంగుళూరు రైలుమార్గం చేపట్టాలని రైల్వేశాఖ నిర్ణయించుకుంది. మొదటి దశలో రూ.153 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఈ దశలో 21.8 కి.మీ వరకు లైన్ నిర్మాణం చేపట్టారు. కడప నుంచి గంగనపల్లె,పెండ్లిమర్రి వరకు పట్టాలు వేశారు.311.84 ఎకరాల భూమిని సేకరించారు. 54 చిన్నబ్రిడ్జిలు, ఆరుపెద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. రూ.199.2 కోట్లు నిర్మాణం కోసం వ్యయం చేశారు. రెండవదశలో పెండ్లిమర్రి–రాయచోటి, రాయచోటి టు వాల్మీకిపురం వరకు లైన్‌ను చేపట్టనున్నారు. మూడవ దశలో మదనపల్లెరోడ్డు టు మదగట్ట(ఆంధ్రప్రదేశ్ సరిహద్దు), మదగట్ట– ముల్బాగల్ (కర్ణాటక రాష్ట్ర సరిహద్దు) లైను పూర్తి చేయాలనుకుంటున్నారు. నాలుగో దశలో ముల్బాగల్ టు కోలార్ వరకు నిర్మాణం చేపట్టేలా రూపకల్పన చేశారు.