కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్‌.. రైల్వే మంత్రి కీలక ప్రకటన | Minister Ashwini Vaishnaw Key Comments Over Kadapa-Bangalore Railway Line | Sakshi
Sakshi News home page

కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్‌.. రైల్వే మంత్రి కీలక ప్రకటన

Published Fri, Dec 6 2024 6:28 PM | Last Updated on Fri, Dec 6 2024 6:54 PM

Minister Ashwini Vaishnaw Key Comments Over Kadapa-Bangalore Railway Line

సాక్షి, ఢిల్లీ: కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని  వైష్ణవ్. ఈ క్రమంలో కడప-పెండ్లిమర్రి సెక్షన్ మధ్య లైన్ పూర్తి అయినట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు రూ. 359 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పుకొచ్చారు.

పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్‌పై వైఎస్సార్‌సీపీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్విని  వైష్ణవ్ లిఖితపూర్వక జవాబు ఇచ్చారు. ఈ క్రమంలో మంత్రి  అశ్విని వైష్ణవ్‌.. ఈ రైల్వే లైన్ కోసం రూ.2706 కోట్లు ఖర్చవుతుంది. ఇప్పటివరకు రూ.359 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. కడప-పెండ్లిమర్రి సెక్షన్ మధ్య లైన్ పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కొత్త లైన్ కోసం సర్వే కోసం ఆమోదం తెలిపాం. ముద్దనూరు-పులివెందుల-ముదిగుబ్బ-శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం మీదుగా కడప నుంచి ఈ లైన్ వెళ్తుంది అని స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement