
ఢిల్లీ: తిరుపతిలో కొత్తగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. రాజ్యసభలో రైల్వే సవరణ బిల్లుపై చర్చ జరిగింది. వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి చర్చలో పాల్గొన్నారు.
రాజ్యసభలో చర్చ సందర్భంగా ఎంపీ మేడ రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతిలో కొత్తగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి. చెన్నై, బెంగళూరుకు సమాన దూరంలో ఉన్న తిరుపతికి భారీ సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారు.
భారీ సంఖ్యలో ప్రయాణికులను నేపథ్యంలో ఈ డివిజన్ ఫీజిబిలిటీ ఉంది. తిరుపతి రైల్వే స్టేషన్‌ను వరల్డ్ క్లాసు రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దాలి. అన్నమయ్య జిల్లాలో నందలూరు రైల్వే స్టేషన్ వద్ద ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ స్థాపించాలి. అక్కడ 400 ఎకరాల భూమి, అవసరమైన నీరు అందుబాటులో ఉంది.
వైజాగ్ రైల్వే జోన్‌లో వాల్తేరు జోనును సంపూర్ణంగా విలీనం చేయాలి.రైల్వే బోర్డులో ఏపీకి తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. ప్రీమియం ట్రైన్లలో సామాన్య ప్రయాణికుల కోసం ఐదు కోచ్ లు అదనంగా ఏర్పాటు చేయాలి. రైల్వే ప్రమాదాల నేపథ్యంలో ఇండిపెండెంట్ సేఫ్టీ ఆడిట్ జరగాలి.అపరిశుభ్రమైన రైలు నాణ్యతలేని ఆహారం తదితరు అంశాలపై ప్రయాణికుల ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.’అని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment