balaji
-
వైభవంగా జరిగిన నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం - హాజరైన ప్రముఖులు (ఫోటోలు)
-
కుమారులకు విషమిచ్చి... ఆత్మహత్యాయత్నం చేసిన తల్లి
సంతబొమ్మాళి: తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ప్రాణాలు తీసిన అనంతరం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా, సంత»ొమ్మాళి మండలం కుముందవానిపేటలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుముందవానిపేట గ్రామానికి చెందిన డెక్కల రాజుతో అదే గ్రామానికి చెందిన దుర్గకు పన్నెండేళ్ల కిందట పెళ్లయ్యింది. వీరికి రుషి (10), బాలాజీ (8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజు శ్రీకాకుళంలోని ఓ హోటల్లో పని చేస్తున్నాడు. దసరా సందర్భంగా దుర్గ తమ్ముడు హరి తన ఇంటికి రావాలని ఆహ్వానించాడు. ఉదయమే వస్తానని చెప్పిన ఆమె ఎంతకూ రాకపోయే సరికి దుర్గ ఇంటికి వెళ్లిన హరి ఇద్దరు చిన్నారులు విగత జీవులుగా పడి ఉండడాన్ని, అక్కడే కొనప్రాణంతో ఉన్న దుర్గను గమనించి పోలీసులకు సమాచార మిచ్చారు. టెక్కలి రూరల్ సర్కిల్ సీఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. శీతల పానీయంలో విషం కలిపి తాగించడం వల్ల చిన్నారులు చనిపోగా, అది తాగిన తల్లి దుర్గ కొన ప్రాణంతో ఉన్నట్లు పోలీసులు తేల్చారు. చిన్నారుల మృతదేహాలను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. తల్లి దుర్గను కూడా అదే ఆస్పత్రిలో చేర్చారు. భర్త సరిగా చూడకపోవడం వల్ల జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్యాయత్నం చేశానని దుర్గ పోలీసులకు తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బాలాజీ వీర్నాల ప్రత్యేక ఇంటర్వ్యూ
-
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి బయట TBC వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 18 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆదివారం) 84,060 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 34,985 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.01 కోట్లుగా లెక్క తేలింది.తిరుమలలో గోకులాష్టమి వేడుకలు...శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27న గోకులాష్టమి ఆస్థానం, 28న ఉట్లోత్సవం28న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసిన టీటీడీ.అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు04/10/2024 - సాయంత్రం 05:45 నుండి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.05/10/2024 - ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.06/10/2024 - ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం07/10/2024 -ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం08/10/2024 - ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం09/10/2024 ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం10/10/2024 ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం11/10/2024 ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం12/10/2024- ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10:30 వరకు ద్వాజావరోహణం. -
విద్యుత్ షాక్‌తో ముగ్గురు స్నేహితులు సజీవ దహనం
కనిగిరి రూరల్: కరెంట్ షాక్‌తో ముగ్గురు స్నేహితులు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు వద్ద జరిగింది. వివరాలు.. కనిగిరిలోని దేవాంగనగర్‌కు చెందిన వీరమాస గౌతమ్‌కుమార్(16), ఇందిరాకాలనీకి చెందిన దేశబోయి నజీర్(16), కామినేని బాలాజీ (16) పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు.గౌతమ్, నజీర్ పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుండగా.. బాలాజీ చదువు ఆపేశాడు. వీరు ముగ్గురూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పునుగోడు చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు స్కూటీపై బయల్దేరారు. పునుగోడులోని ఎస్టీ కాలనీ సమీపంలో విద్యుత్ తీగ(11 కేవీ) తెగి కిందకు వేలాడుతోంది. వీరు ముగ్గురూ స్కూటీపై వెళ్తూ ఆ విద్యుత్ తీగకు తగిలారు. దీంతో ఒక్కసారిగా షాక్ కొట్టి ముగ్గురూ కిందపడిపోగా.. స్కూటీ నుంచి మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే ఈ విషయాన్ని విద్యుత్, పోలీస్ అధికారులకు తెలియజేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పటికీ.. ముగ్గురూ కాలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రత్నాకరం రామరాజు, సీఐ, ఎస్సై, విద్యుత్, రెవెన్యూ అధికారులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.మృత్యువులోనూ వీరి స్నేహం విడిపోలేదంటూ కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డల ప్రాణాలు తీసిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవి, వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నారాయణ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించి ఆదుకుంటామని మంత్రి చెప్పారు. మా సిబ్బంది నిర్లక్ష్యం లేదు ఈ ఘటనలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యమేమీ లేదని విద్యుత్ శాఖ డీఈఈ స్పష్టం చేశారు. ఈదురు గాలులకు విద్యుత్ తీగ తెగిందన్నారు. అయితే నేలపై పడకుండా చిల్లచెట్లపై ఉండటంతో పునుగోడు ఫీడర్ ట్రిప్ కాలేదని చెప్పారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోలేదన్నారు. అప్పుడే అటుగా వెళ్తున్న విద్యార్థులు విద్యుత్ తీగకు తగలడంతో షాక్‌కు గురై మృతి చెందారని విద్యుత్ శాఖ డీఈఈ, ఏడీఈలు ఒక ప్రకటనలో వెల్లడించారు. -
మహేష్ అన్న ఫ్యామిలీ తో నాకున్న రిలేషన్ ఇదే..
-
మహేష్ పక్కన ఉంటే సూపర్ స్టార్ కృష్ణ గారు మాట్లాడలేరు..
-
విజయ నిర్మల ఆంటీ కోపం ఎలా ఉంటుందంటే...!
-
కృష్ణ అంకుల్ చాలా అదృష్టవంతులు ఎందుకంటే...!
-
అన్నార్తులకు అండగా..
పుత్తూరు: తాను పేద కుటుంబానికి చెందిన వాడే అయినా.. నిర్భాగ్యుల ఆకలి తీరుస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు తిరుపతి జిల్లా పుత్తూరు మండలం తడుకు సచివాలయ వలంటీర్ బాలాజీ. వీఎస్ఎస్ పురం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన వేలాయుధం, లక్ష్మీకాంతమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు బాలాజీ. తల్లిదండ్రులు కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. బాలాజీ ఇంటర్ చదువుతుండగానే తండ్రి వేలాయుధం మరణించాడు. అప్పటినుంచి తల్లి కూలి పనులు చేస్తూ కుమారుడిని డిగ్రీ వరకు చదివించింది. తల్లికి చేయూతగా ఉండాలన్న ఉద్దేశంతో బాలాజీ క్యాటరింగ్ పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఊళ్లోనే వలంటీర్‌గా అతడికి అవకాశం లభించింది. ఓ వైపు గ్రామస్తులకు ‘సచివాలయ’ సేవలు అందిస్తూనే.. మరోవైపు రాత్రి వేళల్లో క్యాటరింగ్ పనులతోపాటు వాటర్ ఫ్యూరిఫైయర్ యంత్రాల మరమ్మతులు, ఎలక్ట్రీషియన్‌గా చిన్నపాటి పనులు చేసుకుంటూ అమ్మకు ఆసరాగా నిలుస్తున్నాడు. ఆకలి బాధలు దూరం చేస్తూ.. యాచకులు.. అనాథలు.. నిరుపేదలను ఆకలి బాధలను గమనించిన బాలాజీ వారికి అందించాలన్న తపనతో ‘సేవామిత్ర రూరల్ ఫౌండేషన్’ పేరుతో గత ఏడాది మార్చిలో సేవా కార్యక్రమాలు ప్రారంభించాడు. వారికి రోజూ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందించాలని నిశ్చయించుకున్నాడు. రోజూ 30 నుంచి 40 మందికి అన్నదానం చేస్తూ వచ్చాడు. అలా ప్రారంభమైన ఈ యజ్ఞం నేటికి 370 రోజులకు పైగా నిరాటంకంగా కొనసాగుతోంది. అలాగే కరోనా కాలంలో గొల్లపల్లె, వీఎస్ఎస్ పురం, టీఆర్ కండ్రిగ, తడుకు ప్రాంతాల్లోని నిరుపేద గిరిజన కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, వంట సామగ్రిని అందించాడు. బాలాజీ ప్రతినెలా తనకు అందే గౌరవ వేతనం రూ.5 వేలను సేవా కార్యక్రమాలకే వెచ్చిస్తున్నాడు. గత ఏడాది ప్రభుత్వం వలంటీర్ల సేవలకు కానుకగా సేవామిత్ర అవార్డుతో పాటు అందించిన రూ.10 వేలను, ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం అందించిన రూ.10 వేలు సైతం సేవా కార్యక్రమాలకే వినియోగించాడు. అతడి సేవలు స్థానికంగా అందరి మన్ననలు అందుకుంటున్నాయి. ఆకలి చావును ప్రత్యక్షంగా చూశా నిరుపేద కుటుంబంలో పుట్టాను. పేదరికం చూశాను. అమ్మ కష్టాన్ని అర్థం చేసుకున్నాను. అన్నం కోసం కల్యాణ మండపాల వద్ద ఎగబడే వారిని చూశాను. తిరుచానూరులో ఆకలి చావు చూశాను. అప్పుడే పదిమందికీ సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. అమ్మను పోషించుకుంటునే రోజూ నా సాయం కోసం ఎదురు చూసే 30 నుంచి 40 మంది యాచకులకు అన్నం పొట్లాలు అందిస్తున్నాను. – బాలాజీ, వలంటీర్, వీఎస్ఎస్ పురం, తడుకు పంచాయతీ -
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ అరెస్ట్
సాక్షి, హిందూపురం: హైటెక్ పద్ధతిలో పేకాట ఆడుతున్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) బాలాజీని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్ర–కర్ణాటక సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం చిక్ బళ్లాపూర్ జిల్లా గౌరీబిదనూరు తాలూకా పరిధిలోని నగిరిగెర బీఎన్ఆర్ రెస్టారెంట్ వద్ద జూద కేంద్రంపై కర్ణాటక స్పెషల్ టాస్క్ఫోర్సు పోలీసులు ఆదివారం దాడి చేశారు. బాలకృష్ణ పీఏ బాలాజీతో పాటు 19 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1,56,750 నగదు, 8 కార్లు, 3 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఉపాధ్యాయులతో పాటు రాజకీయ నాయకులూ ఉన్నారు. వీరిని సోమవారం గౌరీబిదనూరు పోలీసులు గుడిబండే కోర్టుకు హాజరు హాజరుపర్చగా..రిమాండ్‌కు ఆదేశిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. కాగా.. గతంలో బాలకృష్ణ పీఏగా పనిచేసిన శేఖర్ కూడా పంచాయతీ రాజ్ శాఖలో భారీ అవినీతికి పాల్పడి జైలుకెళ్లాడు. ప్రస్తుత పీఏ బాలాజీ సైతం పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడడంతో బాలకృష్ణ పీఏల తీరు ఇలాగే ఉంటుందా అంటూ హిందూపురం ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. చదవండి: (పవన్ కల్యాణ్ రాజకీయ బ్రోకర్: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి) -
నటుడు వడివేలు బాలాజీ కన్నుమూత
చెన్నై : నటుడు వడివేలు బాలాజీ (45) గురువారం చెన్నైలో కన్నుమూశారు. మదురై పూర్వీకం కలిగిన బాలాజి మిమిక్రీ ఆర్టిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించారు. విజయ్ టీవీలో ప్రసారం అవుతున్న కలక్క పోవదు యార్ కార్యక్రమం ద్వారా ప్రాచుర్యం పొందారు. ఈయన న టుడు వడివేలును అనుకరిస్తూ హాస్యాన్ని పండించడంతో వడివేలు బాలాజీగా పాపులర్ అయ్యారు. పలు టీవీ కార్యక్రమాల్లో ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన బాలాజీ కోలమావు కోకిల వంటి కొన్ని చిత్రాల్లోనూ నటించారు. కాగా 15 రోజుల క్రితం గుండెపోటు, పక్షవాతానికి గురైన వడివేలు బాలాజి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన తర్వాత స్థానిక రాజీవ్‌గాంధీ ప్రభుత్వాస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ వడివేలు బాలాజి గురువారం తుదిశ్వాస విడిచారు. ఈయనకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. -
అదే నా లక్ష్యం
‘‘నాది వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి. సినిమాల్లో నటించాలనే ఆసక్తి 2016లో కలిగింది. ఏడు షార్ట్స్ ఫిల్మ్స్‌లో నటించిన తర్వాత ఇక సినిమాలు చేద్దామనుకున్నా. ఆ సమయంలో డైరెక్టర్ రవికిరణ్ కోలాతో ఏర్పడిన పరిచయంతో ‘రాజావారు రాణిగారు’ చిత్రం చేశా’’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ ‘‘నటుడిగా నా మొదటì పుట్టినరోజు ఇది. ఈ సందర్భంగా నా కొత్త సినిమా ‘సెబాస్టియన్’ని ఈరోజు ప్రకటిస్తున్నాం. బాలాజీ అనే కొత్త అతను దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం నేను హీరోగా ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ సినిమా నిర్మిస్తున్న ఎలైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంలోనే ప్రమోద్, రాజుగార్లు ఈ సినిమాని కూడా నిర్మిస్తారు. కల్యాణ మండపం నేపథ్యంలో ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ సినిమా ఉంటుంది. అందుకే ఆ టైటిల్ పెట్టాం. 1975 అని పెట్టడానికి కారణం కల్యాణ మండపం ఆ టైమ్‌లో కట్టిందని చెప్పడానికే. లవ్‌స్టోరీ, తండ్రీ కొడకుల మధ్య బంధం, స్నేహం.. ఇలా అన్ని వాణిజ్య అంశాలున్న చిత్రమిది. ఇందులోని పాత్రలన్నీ కడప జిల్లా యాసలోనే మాట్లాడతాయి. ఈ సినిమా చిత్రీకరణ అంతా కడప జిల్లాలోనే ప్లాన్ చేశాం. నిర్మాతలు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికి 40 శాతం అయ్యింది. లాక్డౌన్ వల్ల ఆగిపోయింది. ఈ సినిమా షూటింగ్లో సాయికుమార్, తనికెళ్ల భరణిగార్ల నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ చిత్రదర్శకుడు శ్రీధర్‌కి ఇది తొలి సినిమా. ముందు ‘1991’ అనే షార్ట్ ఫిల్మ్ తీశాడు. నాలుగేళ్లుగా కలసి ప్రయాణం చేస్తున్నాం. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ నేనే రాశాను. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ చేతన్ భరద్వాజ్‌గారు మా చిత్రానికి 6 మంచి పాటలిచ్చారు. అన్ని పాటలూ భాస్కరభట్లగారు రాశారు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘హీరోలు కృష్ణ, చిరంజీవిగార్లు ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోగలరు. వాళ్లలా మంచి నటుడనిపించుకోవాలనుకుంటున్నాను. ఏ పాత్ర అయినా పోషించగలననే పేరు తెచ్చుకోవడమే నా లక్ష్యం’’ అన్నారు కిరణ్. -
ప్రగతి భవన్‌కు రండి
కెరమెరి (ఆసిఫాబాద్): ఏళ్ల తరబడి పడిన శ్రమకు ఎట్టకేలకు గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్రంలో పండించిన ఆపిల్ రుచిని చూసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామంలో ఆపిల్ సాగు చేస్తున్న కేంద్రె బాలాజీకి ముఖ్యమంత్రి నుంచి ఆహ్వానం అందింది. ప్రగతి భవన్‌కు వచ్చి తనను కలవాలని కోరారు. ఈ నెల 5న ‘ఇదిగో తెలంగాణ ఆపిల్’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం ప్రగతి భవన్లో ఉద్యానశాఖ అధికారులతో జరిగిన సమావేశంలో తెలంగాణ ఆపిల్ సాగు విషయం చర్చకు వచ్చింది. దీంతో ఆపిల్ సాగు చేస్తున్న రైతును ఆహ్వానించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. దీంతో సోమవారం ఉదయం ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ వెంకట్రాంరెడ్డి నుంచి బాలాజీకి ఫోన్ కాల్ వచ్చింది. ‘ఆపిల్ పంట సాగు గురించి సీఎంకు వివరించాం.. మిమ్మల్ని హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు వచ్చి కలవమన్నారు’అని చెప్పారు. కాగా, ఈ నెలాఖరులో సీఎంను కలసి ఆపిల్ రుచి చూపిస్తానని బాలాజీ అంటున్నారు. ఆపిల్ పండ్లను చూపుతున్న రైతు బాలాజీ -
కేజీతండా వాసికి అరుదైన అవకాశం
జఫర్‌గఢ్: జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం రేగడి తండా శివారు ఖాజనగండి (కేజీ తండా)కు చెందిన లకావత్ బాలాజీకి లండన్‌లోని మాన్చెస్టర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసే అరుదైన అవకాశం లభించింది. మిట్యనాయక్, సత్తమ్మ దంపతుల నాలుగో కుమారుడు బాలాజి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్నతనం నుంచే చదువుపై ఆసక్తి పెంచుకున్నాడు. ప్రాథమిక విద్యను జఫర్‌గఢ్‌లో, అలాగే 8, 9, 10వ తరగతులను ఆలేరులోని ఎస్టీ హాస్టల్ ఉండి పూర్తి చేశాడు. పదో తరగతిలో స్కూల్ ఫస్ట్ సాధించి హైదరాబాద్‌లోని అరబిందో జూనియర్ కళాశాలలో ఉచిత ప్రవేశం పొందాడు. ఇంటర్ అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఐదేళ్ల పాటు ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ పూర్తి చేశాడు. తర్వాత లండన్‌లోని కార్డి యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తయిన తర్వాత మాన్చెస్టర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం సాధించాడు. మారుమూల ప్రాంతానికి చెందిన బాలాజీ లండన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం సాధించడంపై కుటుంబ సభ్యులతో పాటు తండావాసులు హర్షం వ్యక్తం చేశారు. -
‘ఊరంతా అనుకుంటున్నారు’ అందరికీ నచ్చుతుంది
‘‘ఊరంతా అనుకుంటున్నారు’ ట్రైలర్ చూస్తే నవీన్ బాగా నటించాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని విజయనిర్మలకు అంకితం ఇస్తున్నారు. సినిమా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. నవీన్ భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాల్లో నటించాలి’’ అని నటుడు కృష్ణ అన్నారు. ‘నందిని నర్సింగ్ హోమ్’ ఫేమ్ నవీన్ విజయ్ కృష్ణ హీరోగా బాలాజి సానల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నవీన్ విజయ్‌కృష్ణ మాట్లాడుతూ– ‘‘బాలాజి చెప్పిన పాయింట్ నచ్చి ఈ సినిమా చేశా. కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రమిది. ఇకపై గ్యాప్ తీసుకోకుండా వెంటవెంటనే సినిమాలు చేస్తాను’’ అన్నారు. ‘‘విజయ నిర్మలగారికి నవీన్ మంచి నటుడు కావాలని ఉండేది. ఆమె అనుకున్నట్లే ‘నందిని నర్సింగ్ హోమ్’తో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఊరంతా అనుకుంటున్నారు’తో నవీన్ కుటుంబ ప్రేక్షుకులకు దగ్గరవుతాడనే నమ్మకం ఉంది’’ అని నటుడు నరేశ్ అన్నారు. ‘‘ఈ సినిమా ట్రైలర్, పాటలు బాగున్నాయి. సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘నా కథకి నవీన్ అయితేనే న్యాయం చేయగలడు అనిపించింది’’ అన్నారు బాలాజి. ‘‘మా సినిమాని ప్రేక్షకులు విజయవంతం చేయాలి’’ అని నిర్మాతల్లో ఒకరైన శ్రీహరి మంగళంపల్లి అన్నారు. -
‘టి మా’ అభివృద్ధికి కృషి చేస్తా
‘‘నా 55ఏళ్ల సినిమా జీవితంలో ఎన్నో కష్టనష్టాలు అనుభవించాను. అయినా, ఏ రోజూ నిరుత్సాహపడలేదు. నటులు ఎప్పుడూ నిరుత్సాహ పడకూడదు’’ అని సీనియర్ నటి, ‘టి మా’ ఉపాధ్యక్షురాలు గీతాంజలి అన్నారు. తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ నూతనంగా ఏర్పాటు చేసిన ‘టి మా’ (తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కార్యవర్గ సభ్యులను హైదరాబాద్‌లో బుధవారం ప్రకటించారు. ‘టి మా’ అధ్యక్షునిగా జేవీఆర్, ఉపాధ్యక్షులుగా గీతాంజలి, నటుడు బాలాజీ, హీరో దిలీప్ రాథోడ్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గీతాంజలి మాట్లాడుతూ– ‘‘సీతారామ కళ్యాణం’ చిత్రంతో ఎన్టీరామారావుగారు సీతగా సినీ పరిశ్రమలో నాకొక మంచి గుర్తింపునిచ్చారు. ఆ పాత్ర దొరకడం నా అదృష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో నటీ నటులకు మంచి వేషాలు రావడంలేదు. అలా కనిపించి ఇలా వెళ్లిపోయే పాత్రలకు ఒకటి, రెండు రోజుల కాల్ షీట్స్ అడుగుతున్నారు. ‘టి మా’ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను’’ అన్నారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్‌లో 85 సినిమాలకు సెన్సార్ పూర్తి చేశాం. ఎన్నో సినిమాల టైటిల్స్‌ను రిజిస్ట్రేషన్ చేయించాం. సభ్యులకు హెల్త్‌కార్డ్స్ అందిస్తున్నాం. తెలంగాణ ఫిలిం చాంబర్ కేవలం తెలంగాణ వారికి చెందినది మాత్రమే కాదు. భారతదేశ వ్యాప్తంగా ఐదువేల మందికి పైగా నటీనటులు, సాంకేతిక నిపుణులు మా చాంబర్లో ఇప్పటికే సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే ‘తెలంగాణ స్టేట్ ఫిలించాంబర్’ ఉంది కదా అనేది కొంత మంది ప్రశ్న. అది నలభై ఏళ్లుగా ఉంది కానీ అందులో పంపిణీదారులే ప్రముఖంగా ఉంటారు. తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలిలో నిర్మాతలే ముఖ్య పాత్ర వహిస్తారు’’ అన్నారు. ‘తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్’ ఉపాధ్యక్షుడు గురురాజ్, సెక్రటరీ కాచం సత్యనారాయణ పాల్గొన్నారు. కాగా ‘టి మా’ జనరల్ సెక్రటరీగా స్నిగ్ధ మద్వాని, జాయింట్ సెక్రటరీలుగా కిరణ్, లత, ఇమ్మడి ధర్మారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా వై.శ్రీనివాస్, ఆదర్శిని, యోగి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా గుండు రవితేజ, ప్రేమ్, శ్రీశైలం, గీతాసింగ్, గాయత్రీ, మహాలక్ష్మి, టి న్యూస్ రాజేష్, ప్రవీణ, మమత, దయ ఎన్నికయ్యారు. -
దాడి బాలాజీపై భార్య ఫిర్యాదు
చెన్నై, పెరంబూరు: నటుడు దాడి బాలాజీపై అతని భార్య నిత్య మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుల్లితెర యాంకర్, హస్యనటుడు దాడి బాలాజి అతని భార్య నిత్య మధ్య కొంత కాలం క్రితమే మనస్పర్థల కారణంగా విడిపోయారు. వీరి వ్యవహారం కేసులు, కోర్టుల వరకూ వెళ్లింది. ఇద్దరు విడివిడిగా నివశిస్తున్నారు. నిత్య తన కూతురితో మాధవరం, శాస్త్రి నగర్లో నివశిస్తోంది. కాగా దాడిబాలాజి, నిత్య ఇద్దరూ ఆ మధ్య జరిగిన బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొన్నారు. ఆ గేమ్ షోలో కూడా వీరిద్దరూ ఘర్షణ పడడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో బుధవారం మాధవరం పోలీస్‌స్టేషన్‌లో దాడి బాలాజీపై ఫిర్యాదు చేసింది. అందులో బాలాజీ మళ్లీ మద్యం తాగి వచ్చి గొడవ చేస్తున్నాడని, గత జనవరి నెల 21న తాగి వచ్చి ఇంటి కిటికీలు పగులగొట్టి రగడ చేయడంతో పాటు ఫోన్లో అసభ్యంగా తిట్టి, హత్యాబెదిరింపులకు పాల్పడ్డాడని పేర్కొంది. అదే విధంగా తమ వివాహ రద్దు కేసు కోర్టులో ఉండగా బాలాజి మద్యం తాగి వచ్చి గొడవ చేయడంతో అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా దాడి బాలాజీకి ఫోన్ చేయగా, అతని తాను షూటింగ్ నిమిత్తం వేరే ఊరికి వచ్చానని, తిరిగి రాగానే విచారణకు హాజరవుతానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. -
నువ్వు నాకు బా..గా నచ్చావ్!
శ్రీకాళహస్తి: ‘నువ్ అందంగా ఉంటావ్..నువ్వంటే నాకిష్టం..నీ వాయిస్ చాలా బాగుంటుంది..నువ్వు నాకు బా..గా నచ్చావ్..! ఇదీ ఓ బ్యాంకు మేనేజర్‌కు అర్ధరాత్రి వేళ శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు మాజీ సభ్యుడు, టీడీపీ ముఖ్యనేత పెట్టిన మెసేజ్‌లలో కొన్ని! ఆయనగారిలోని ‘అపరిచిత కాముడి’ తీరుపై ఆ బ్యాంకు మేనేజర్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఇది కాస్తా చర్చనీయాంశమయ్యేసరికి టీడీపీ నేతలు తలలు పట్టుకున్నారు. పార్టీ పరువుపోతుందని మధ్యస్థాలకు పూనుకున్నారు. సేకరించిన వివరాల మేర కు..స్థానికంగా ఓ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న అధికారిణికి వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. ఆ బ్యాంకులో ఖాతా కలిగి ఉన్న టీడీపీ ముఖ్యనేత గురువారం రాత్రి 11.30 గంటల నుంచి పలు అసభ్యకకరమైన మెసేజ్‌లు బ్యాంకు మేనేజర్‌కు పెట్టారు. శుక్రవారం ఉదయాన్నే వీటిని గమనించిన ఆమె దిగ్భ్రాంతి చెందారు. తన భర్తకు తెలియజేశారు. ఆ తర్వాత తన సిబ్బందితో కలిసి ఆ ‘కాముకుడి’ని చడామడా దులిపేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఆ నోటా ఈ నోటా పడి శ్రీకాళహస్తిలో చర్చనీయాంశమయ్యేసరికి టీడీపీ నేతలు కంగుతిన్నారు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ఇది పార్టీకి నష్టదాయకమని మరో నలుగురు టీడీపీ ముఖ్యనేతలు రంగంలో దిగారు. బ్యాంకు మేనేజర్‌ను, ఆమె భర్తను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఆమెతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఆమె భర్తతో సైతం ఓ హోటల్లో సుదీర్ఘంగా మధ్యస్తం చేసినా అది ఫలించలేదని తెలియవచ్చింది. లైంగిక వేధింపుల కేసు నమోదు దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు, టీడీపీ నాయకుడు అత్తింజేరి బాలాజిపై 354ఏ సెక్షన్ కింద లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రామకృష్ణయ్య తెలిపారు. బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
క్వార్టర్స్‌లో సాకేత్ జంట
న్యూఢిల్లీ: లిజౌ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట 6–1, 3–6, 10–8తో కెచ్‌మానోవిచ్ (సెర్బియా)–జె లీ (చైనా) జోడీపై గెలిచింది. సింగిల్స్ విభాగంలో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ప్రజ్నేశ్ గుణేశ్వరన్ రెండో రౌండ్‌కు చేరగా... సుమీత్ నాగల్, రామ్‌కుమార్ రామనాథన్ తొలి రౌండ్లో ఓడిపోయారు. ప్రజ్నేశ్ 6–4, 7–5తో జొహాన్ టాట్లోట్ (ఫ్రాన్స్)పై నెగ్గగా... సుమీత్ 2–6, 3–6తో తత్సుమైతో (జపాన్) చేతిలో... రామ్‌కుమార్ 6–7 (3/7), 3–6తో డేవిడోవిచ్ (స్పెయిన్) చేతిలో ఓటమి చవిచూశారు. -
మూఢ నమ్మకాలపై సందేశం
నందు, అనురాధా, బాలాజీ, ప్రమీల ముఖ్య తారలుగా ఫణిరామ్ తూఫాన్ దర్శకత్వంలో శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘ఐందవి’. ఎస్ఏ అర్మాన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నటుడు కాదంబరి కిరణ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఫణిరామ్ తూఫాన్ మాట్లాడుతూ– ‘‘కొందరు యువతీ యువకులు సరదాగా గడుపుదామని ఇంటి నుంచి వెళతారు. అనుకోకుండా వారు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నారన్నదే ఈ సినిమా కథాంశం. మంచి సస్పెన్స్ థ్రిల్లర్. మూఢ నమ్మకాలను ఆశ్రయించొద్దనే సందేశాన్ని ఇస్తున్నాం’’ అన్నారు. ‘‘ఓ సక్సెస్ఫుల్ ఫార్ములాను అనుసరించి ఈ సినిమా నిర్మించాం. అతీంద్రియ శక్తులు, హారర్ అంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చుతుంది. త్వరలో రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు శ్రీధర్. ∙బాలాజీ, ప్రమీల -
గ్రామాల్లో ‘నయాగాడీ’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టూవీలరైతే ఓకే!! కానీ ట్రాక్టర్ల వంటి భారీ వాహనాల షోరూమ్‌లు ప్రతి గ్రామంలోనూ ఉండాలంటే కష్టమే. స్థలం... పెట్టుబడి... మార్జిన్లు... ఇలాంటివన్నీ దీనిపై ప్రభావం చూపిస్తాయి. ఇదిగో... ఇలాంటి సమస్యలకు చిత్తూరు జిల్లా నగరి కుర్రాడు బాలాజీ చూపించిన పరిష్కారమే... ‘నయాగాడీ’! కైశెట్టి బాలాజీది రైతు కుటుంబం. వ్యవసాయం కోసం ట్రాక్టర్ కొందామనుకున్నాడు. అడ్వాన్సు పట్టుకుని బయలుదేరాడు. అప్పుడు తెలిసింది.. వాళ్ల ఊళ్లో ట్రాక్టర్ షోరూమ్ లేదని! చిత్తూరుకు వెళ్లి కొనాలి. కంపెనీ రేటొకటైతే స్థానిక డీలర్ చెప్పేది మరొకటి!!. అవసరం మనది కనక చేసేదేమీ ఉండదు. డీలర్లే కాదు! వాహన రుణాలిచ్చే బ్యాంక్‌లు, బీమా కంపెనీలు, నిర్వహణ కేంద్రాలు అన్నింటికీ సమస్యే. దీనికి టెక్నాలజీతో బాలాజీ చెప్పిన సమాధానమే ‘‘నయాగాడీ’’ ఆవిష్కరించింది. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. చిత్తూరులో డిప్లొమా పూర్తయ్యాక.. బెంగళూరులోని ఆటోమొబైల్ డిజైన్, సప్లయి కంపెనీ ఆస్పెక్ట్‌లో చేరా. అక్కడి నుంచి విప్రో, హెచ్‌పీ, ఐబీఎం వంటి కంపెనీల్లోనూ పనిచేశా. బహుళ జాతి ఆటో మొబైల్ కంపెనీల్లో 10 ఏళ్ల అనుభవం ఉంది. దీంతో 2015 సెప్టెంబర్‌లో రూ.25 లక్షల పెట్టుబడితో బెంగళూర్‌లో ‘నయాగాడీ.కామ్’ను ప్రారంభించా. స్థానికంగా ఉండే అన్ని రకాల వాహన డీలర్లతో ఒప్పందం చేసుకొని గ్రామాల్లో నయాగాడీ ఎక్స్పీరియన్స్ కేంద్రాలు, ఏజెంట్లను ఏర్పాటు చేసి వాహనాలను విక్రయించడమే మా ప్రత్యేకత. రూ.4 కోట్లు; 80 వాహనాలు.. నయాగాడీలో బైక్‌లు, ఆటోలు, కార్లు, జీపులు, ట్రాక్టర్ల వంటి అన్ని రకాల వాహనాలతో పాటూ ఎలక్ట్రిక్ వాహనాలనూ కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం బెంగళూరు, ఒడిశా నగరాల్లో సేవలందిస్తున్నాం. 120 మంది వాహన డీలర్లతో ఒప్పందం చేసుకున్నాం. రుణాల కోసం క్యాపిటల్ ఫస్ట్, కొటక్, బీమా కోసం పాలసీబజార్, రెన్యూ, గోడిజిట్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. నయాగాడీ మల్టీ ఎక్స్పీరియన్స్ సెంటర్లలో వాహనాలకు సంబంధించిన బ్రోచర్లు, ఫొటోలు, ధరలు, రుణం, బీమా వంటి అన్ని రకాల సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇప్పటివరకు నయాగాడీ వేదికగా రూ.4 కోట్ల విలువ చేసే 80 వాహనాలను విక్రయించాం. డీలర్ ధర కంటే నయాగాడీలో రూ.1,000–10,000 వరకు ధర తక్కువే ఉంటుంది. పైగా విడిభాగాలు, ఇతరత్రా ఉపకరణాలపై 20% కమీషన్ కూడా ఉంటుంది. నెల రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి... నెల రోజుల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖ, గుంటూరుల్లో నయాగాడీ కేంద్రాలను ప్రారంభించనున్నాం. ఆయా ప్రాంతాల్లో 100 మంది డీలర్లతో డీల్ చేసుకున్నాం. ఏడాదిలో చెన్నై, కోచి, భువనేశ్వర్, కటక్ ప్రాంతాల్లో నయాగాడీ సెంటర్లను ప్రారంభిస్తాం. ఏడాదిన్నరలో దేశంలోని 30 ప్రాంతాలకు విస్తరించాలన్నది మా లక్ష్యం. రూ. 3 కోట్ల ఆర్డర్ బుక్.. ప్రతి వాహనం విక్రయంపై డీలర్ నుంచి 1 శాతం, బ్యాంక్ రుణం పొందితే బ్యాంక్ నుంచి 1–1.50 శాతం, బీమా కంపెనీ నుంచి 10–20 శాతం వరకు కమీషన్ వస్తుంది. ప్రస్తుతం రూ.3 కోట్ల ఆర్డర్ బుక్ చేతిలో ఉంది. 3 నెలల్లో టీవీఎస్, నిస్సాన్, రెనాల్ట్, మహీంద్రా వాహన సంస్థలతో ఒప్పందాలు పూర్తవుతాయి. దీంతో డీలర్లతో పాటూ నేరుగా నయాగాడీలోనూ విక్రయాలుంటాయి. రూ.5 కోట్ల నిధుల సమీకరణ.. గతేడాది కర్నాటక ప్రభుత్వ ఎలైట్ 100 పోటీలో విజేతగా నిలిచాం. దీంతో రూ.10 లక్షలు గ్రాంట్‌గా లభించింది. ప్రస్తుతం మా కంపెనీలో 11 మంది ఉద్యోగులున్నారు. త్వరలో ఈ సంఖ్యను 25కి చేర్చనున్నాం. గతేడాది రూ.2.5 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. వచ్చే ఏడాది కాలంలో రూ.50 కోట్ల టర్నోవర్‌ను చేరుకోవాలి లకి‡్ష్యంచాం. పలువురు హెచ్ఎన్ఐలు, ఏంజిల్ ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే రూ.5 కోట్ల నిధులను సమీకరిస్తాం. -
మరోసారి వివాదాస్పదమైన ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్వాకం
-
సినీ నటుడు బాలాజీని విచారించిన పోలీసులు
సాక్షి, బంజారాహిల్స్: తన భార్యకు కిడ్నీ ఇచ్చిన తనకు ఎలాంటి చికిత్స చేయించకుండా బెదిరిస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్న సినీ నటుడు బాలాజీపై బాధితురాలు భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ నిమిత్తం బా లాజీని స్టేషన్‌కు పిలిపించారు. కిడ్నీ మార్పిడి, బాధితురాలి నుంచి కిడ్నీ సేకరణ తదితర అంశాలపై వివరాలు సేకరించారు. తాము చట్ట ప్రకార మే లక్ష్మి నుంచి కిడ్నీని తీసుకున్నామని అందుకు తగిన డాక్యుమెంట్లను అందజేశారు. మానవతా దృక్ఫథంతోనే ఒప్పందం కుదర్చుకున్నామన్నారు. కిడ్నీ తీసుకునే ముందు ఆరుగురు డాక్టర్ల బృందం సర్టిఫై చేయాల్సి ఉంటుందని ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా చేయించుకున్నట్లు తెలిపారు. తనకు రూ. 20 లక్షలు ఇస్తామని, తన తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తామని, తనకు సిని మాల్లో వేషాలు ఇప్పిస్తానని చెప్పినందునే తాను కిడ్నీ ఇచ్చేందుకు ఒప్పుకున్నానని భాగ్యలక్ష్మి తెలిపింది. తనకు రావాల్సిన డబ్బుల విషయమై ఫోన్ చేస్తే బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని, దీనిపై నటి శ్రీరెడ్డితో కలిసి మానవ హక్కుల కమిషన్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, ‘మా’ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. తనకు న్యాయం జరగకపోతే చావే శరణ్య మని ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరి స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నటుడు బాలాజిపై పోలీసులకు ఫిర్యాదు