నువ్వు నాకు బా..గా నచ్చావ్‌! | TDP Leader Massages to Bank Manager in Srikalahasti Chittoor | Sakshi
Sakshi News home page

నువ్వు నాకు బా..గా నచ్చావ్‌!

Published Sat, Dec 22 2018 8:04 AM | Last Updated on Sat, Dec 22 2018 1:29 PM

TDP Leader Massages to Bank Manager in Srikalahasti Chittoor - Sakshi

అత్తింజేరి బాలాజి

శ్రీకాళహస్తి: ‘నువ్‌ అందంగా ఉంటావ్‌..నువ్వంటే నాకిష్టం..నీ వాయిస్‌ చాలా బాగుంటుంది..నువ్వు నాకు బా..గా నచ్చావ్‌..! ఇదీ ఓ బ్యాంకు మేనేజర్‌కు అర్ధరాత్రి వేళ శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు మాజీ సభ్యుడు, టీడీపీ ముఖ్యనేత పెట్టిన మెసేజ్‌లలో కొన్ని! ఆయనగారిలోని  ‘అపరిచిత కాముడి’ తీరుపై ఆ బ్యాంకు మేనేజర్‌ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఇది కాస్తా చర్చనీయాంశమయ్యేసరికి టీడీపీ నేతలు తలలు పట్టుకున్నారు. పార్టీ పరువుపోతుందని మధ్యస్థాలకు పూనుకున్నారు. సేకరించిన వివరాల మేర కు..స్థానికంగా ఓ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న అధికారిణికి వివాహమై పిల్లలు కూడా ఉన్నారు.

ఆ బ్యాంకులో ఖాతా కలిగి ఉన్న టీడీపీ ముఖ్యనేత గురువారం రాత్రి 11.30 గంటల నుంచి పలు అసభ్యకకరమైన మెసేజ్‌లు బ్యాంకు మేనేజర్‌కు పెట్టారు. శుక్రవారం ఉదయాన్నే వీటిని గమనించిన ఆమె దిగ్భ్రాంతి చెందారు. తన భర్తకు తెలియజేశారు. ఆ తర్వాత తన సిబ్బందితో కలిసి ఆ ‘కాముకుడి’ని చడామడా దులిపేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఆ నోటా ఈ నోటా పడి శ్రీకాళహస్తిలో చర్చనీయాంశమయ్యేసరికి టీడీపీ నేతలు కంగుతిన్నారు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ఇది పార్టీకి నష్టదాయకమని మరో నలుగురు టీడీపీ ముఖ్యనేతలు రంగంలో దిగారు. బ్యాంకు మేనేజర్‌ను, ఆమె భర్తను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఆమెతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం.  అంతేకాకుండా ఆమె భర్తతో సైతం ఓ హోటల్లో సుదీర్ఘంగా మధ్యస్తం చేసినా అది ఫలించలేదని తెలియవచ్చింది.

లైంగిక వేధింపుల కేసు నమోదు
దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు సభ్యుడు, టీడీపీ నాయకుడు అత్తింజేరి బాలాజిపై 354ఏ సెక్షన్‌ కింద లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రామకృష్ణయ్య తెలిపారు. బ్యాంకు మేనేజర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement